helpline
-
డీప్‌ఫేక్స్‌పై పోరు
న్యూఢిల్లీ: డీప్ ఫేక్స్ వంటి కృత్రిమ మేధ ఆధారిత తప్పుడు సమాచార వ్యాప్తిని కట్టడి చేసేందుకు టెక్ దిగ్గజం మెటా, మిస్ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్ (ఎంసీఏ) జట్టు కట్టాయి. వాస్తవాలను చెక్ చేసేందుకు ఉపయోగపడేలా వాట్సాప్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఇది 2024 మార్చి నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన చాట్‌బాట్‌కు ప్రజలు డీప్‌ఫేక్‌ల గురించిన సమాచారాన్ని పంపవచ్చు. ఆ మెసేజీలను విశ్లేíÙంచేందుకు ఎంసీఏ ప్రత్యేక యూనిట్‌ను (డీఏయూ) ఏర్పాటు చేస్తుంది. ఈ వాట్సాప్ చాట్‌బాట్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. పరిశ్రమ కూటమి అయిన ఎంసీఏలో 16 సంస్థలకు సభ్యత్వం ఉంది. -
పామే కదా ! అని పరాగ్గా ఉంటే..స్నేక్ క్యాచర్ అయినా అంతే సంగతి!
పాములను తక్కువ అంచనా వేశారో ఇక అంతే సంగతి అని హెచ్చరిస్తున్నారు స్నేక్ క్యాచర్ 34 ఏళ్ల మురళీధర్ యాదవ్. అతను పాముల నుంచి రక్షించే ఓ హెల్స్‌లైన్‌ను కూడా నడుపుతున్నాడు. ఎవ్వరూ పాము వల్ల ఇబ్బంది పడినా అతనికి సమాచారం అందిస్తే చాలు అతను వచ్చి రక్షిస్తాడు. ఆ పాములను సురక్షిత ప్రాంతాల్లో వదలడం వంటవి చేస్తాడు. అలాగే సోషల్ మీడియా వేదిక పాముల పట్ల ఎలా వ్యవహరించాలి, ఎలా తమను తాము కాపాడుకోవాలో వంటి వాటిపట్ల ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నాడు యాదవ్. ఈ సందర్భంగా ఆ వ్యక్తి తాను ఏవిధంగా స్నాక్ క్యాచర్‌గా మారింది. ఆ క్రమంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గూరించి వెల్లడించాడు. యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లాకు చెందినవాడు. ఆ రాష్ట్రంలో అతని రక్షకుడిగా పిలుస్తారు. ఈ 23 ఏళ్లలో అతను సుమారు 8 వేలకు పైనే పాములను పట్టుకుని ప్రజలను రక్షించాడు. ఇదేమి అంత సులువైన చిన్న పిల్లల ఆట కాదని అంటున్నాడు. తాను ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి గల కారణం వివరిస్తూ..తన చిన్ననాటి రోజుల్లో జాన్‌పూర్‌లో చాలా పాములు ఉండేవని, పాము కాటు కేసులు కూడా ఎక్కువగానే ఉండేవని చెప్పుకొచ్చాడు. తాను పాము కాటు, దాని కారణంగా చనిపోయిన వారి గురించి వింటూ పెరగడంతో..దీని కోసం తనవంతుగా ఏదైనా చేయాలని అనుకునే వాడని పేర్కొన్నాడు యాదవ్. ఆ క్రమంలో మా పొరుగింటి వ్యక్తి ఇంట్లోకి పాము రావడంతో..దాన్ని పట్టడంలో సాయం చేయాల్సిందిగా పిలిచినప్పుడూ..తాన చాలా చాకచక్యంగా ఆ పాముని పట్టుకుని వాళ్లను రక్షించాను. ఇక అప్పటి నుంచి అలా ఎన్నో రెస్కూలు చేస్తూనే ఉన్నాడు యాదవ్. ఓ ఘటన మాత్రం నా జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. రెస్క్యూలో భాగంగా ఒక చోట పామును పట్టుకోవడానికి వెళ్తే..తాను ఎదుర్కొన్న చేదు అనుభం ఓ గొప్ప పాఠాన్ని నేర్పింది. పామే కదా అని పరాగ్గా ఉన్నాం అంతే కాటేసి చంపేందుకు రెడీ అవుతుందని. వాటిపట్ల చాలా జాగురుకతతో ఉండాలని హెచ్చరిస్తున్నాడు. తాను అప్పుడు పొరుగు గ్రామంలో పాము పట్టుకోవడానికి వెళ్లాను ఆ రోజు పామును పట్టుకోవడానికి ఏకంగా రెండు గంటలపైనే పట్టేసింది. ఇక పాముని పట్టుకుని పెట్టేలో పెడుతున్నా.. అంతే ఇంతో ఒక్క ఊదుటన తన చేతిపై గట్టిగా కాటు వేసిందని నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. సమీపంలో ఉన్నవాళ్లు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పుకొచ్చాడు. ఇది ప్రమాదకరమైన సాహసంతో కూడిన వృత్తి. అలాగే ప్రజల్లో పాముల పట్ల, అవి కాటేస్తే ఏం చేయాలి అనే దానిపై చాలా అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాను సాధనంగా ఎంచుకుని యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నట్లు తెలిపాడు. కాగా, యాదవ్‌కి యూటబ్యూబ్కి దాదాపు 85 లక్షల సబ్స్రైబర్లు ఉండగా, ఫేస్బుక్లో సుమారు 46 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. అంతేగాదు తన కొడుకు కూడా ఇదే వృత్తిలోకి రావాలనుకుంటున్నట్లు గర్వంగా చెబుతున్నాడు యాదవ్. (చదవండి: చాక్లెట్ గుట్టులుగా రాసిపోసినట్లు కొండలు..ఎక్కడున్నాయంటే?..) -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మరింత మెరుగ్గా బ్రాడ్‌బ్యాండ్ సేవలు
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ బ్రాడ్‌బ్యాండ్ సేవలు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. భారత్‌ఫైబర్ పేరిట అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన కస్టమర్ల కోసం నిరంతర టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. భారత్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం 1800 4444 నెంబర్‌తో 24/7 నిరంతర హెల్ప్‌లైన్‌ను ప్రారంభించినట్లు ట్విటర్ ద్వారా బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి ఏ సమస్య ఉన్నా కస్టమర్లు ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. కాగా భారత్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా జీ5, డిస్నీప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్ వంటి ఓటీటీ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. #BSNL has launched its 24/7 toll-free no. 1800-4444 for #BharatFibre Broadband customers.#G20India pic.twitter.com/T2yV1jyNpu — BSNL India (@BSNLCorporate) June 15, 2023 -
విద్వేషాలను రెచ్చగొట్టేవారికి చెక్... మినిష్టర్ వినూత్న ఆలోచన
కర్ణాటక : ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టకుండా "పీస్ఫుల్ కర్నాటక" పేరుతో ఒక హెల్ప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి డి పరమేశ్వర, ఐటీ & గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గేలకు విజ్ఞప్తి చేశారు వాణిజ్యం & పరిశ్రమలు, మౌలికసదుపాయాల శాఖల మంత్రి ఎంబి పాటిల్. తేజస్వి యాదవ్ వ్యాఖ్యలు... అంతకుముందు బెంగళూరు సౌత్ ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య పార్టీ కార్యకర్తలపై దాడులు జరగకుండా రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో బీజేపీ ఒక హెల్ప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని, రాష్ట్రంలో ఎక్కడైనా కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తే వెంటనే హెల్ప్ లైన్ ను ఆశ్రయించాలని కోరారు. తేజస్వి చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మినిష్టర్ కూడా అంతే దీటుగా స్పందించారు. మినిష్టర్ పాటిల్ కౌంటర్... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి డి పరమేశ్వర, మంత్రి ప్రియాంక్ ఖర్గే గార్లకు మనవి. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టకుండా చూసేందుకు వీలుగా "పీస్ఫుల్ కర్నాటక" పేరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసే విషయాన్ని పరిగణలోకి తీసుకోగలరు.తద్వారా ఎక్కడైనా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వెంటనే ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి, పురోగతి సాధించి బ్రాండ్ కర్నాటకను రక్షించుకోవడమే మా ఎజెండా అని పాటిల్ ట్వీట్ చేశారు. -
మూడు రైళ్లు...మహా విషాదం!
భువనేశ్వర్/బాలాసోర్/హౌరా/సాక్షి, అమరావతి: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఒకే చోటఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దారుణంలో కనీసం వంద మందికిపైగా దుర్మరణం పాలైనట్టు భావిస్తున్నారు. ఇప్పటిదాకా 70కి పైగా మృతదేహాలను వెలికి తీశారు. 350 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వందలాది మంది బోగీల్లో చిక్కుబడి ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కన్పిస్తోంది. సహాయక చర్యలకు పెను చీకటి అడ్డంకిగా మారింది. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మృతులు, క్షతగాత్రుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఉండొచ్చని చెబుతున్నారు. ఏం జరిగింది...? రాత్రి ఏడింటి ప్రాంతంలో బెంగుళూర్ నుంచి హౌరా వెళ్తున్న 12864 ఎక్స్‌ప్రెస్ బాలాసోర్ సమీపంలోని బహనాగా బజార్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. దాని తాలూకు బోగీలను ఢీకొని షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలు తప్పిందని, దాని బోగీలు మరో ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌పైకి దూసుకెళ్లాయని అంటున్నారు. కానీ వాస్తవానికి తొలుత ప్రమాదానికి గురైంది కోరమండల్ ఎక్స్ప్రెసేనన్నది ప్రత్యక్ష సాక్షుల కథనం. దానికి పొరపాటున లూప్ లైన్లోకి సిగ్నల్ ఇవ్వడంతో ఆ ట్రాక్‌పై నిలిచి ఉన్న గూడ్స్‌ను శరవేగంగా ఢీకొట్టిందన్నది వారు చెబుతున్నారు. ‘‘ప్రమాద ధాటికి కనీసం ఏకంగా 14 బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. పలు బోగీలు గూడ్స్ బోగీల్లోకి దూసుకెళ్లాయి. దాంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగి పరుగులు తీశారు. మరికొన్ని బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. ఆ ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొని పట్టాలు తప్పింది’’ అని వారంటున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై రైల్వే అధికారులు సరైన సమాచరం ఇవ్వకపోవడం, దాంతో సైట్లు, వార్తా సంస్థలు ఒక్కోటీ ఒకోలా రిపోర్టు చేయడం మరింత గందరగోళానికి దారితీసింది. హుటాహుటిన సహాయ చర్యలు ప్రమాద సమాచారం తెలియగా>నే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. కోచ్‌ల కింద చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీస్తున్నారు. చీకటి వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెప్పారు. 132 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు. మిగతా వారిని సొరో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, గోపాల్పూర్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, ఖొంటపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. జాతీయ విపత్తు స్పందన దళం కూడా రంగంలోకి దిగింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శనివారం ఆయన ప్రమాద స్థలానికి వెళ్లనున్నారు. రైలు ప్రమాదంపై పరిస్థితిని తాను వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. రైల్వేస్టేషన్లు.. విజయవాడలో 0866 2576924, రాజమండ్రిలో 0883 2420541, రేణిగుంటలో 9949198414, తిరుపతిలో 7815915571, నెల్లూరులో 0861 2342028, సామర్లకోటలో 7780741268, ఒంగోలులో 7815909489, గూడూరులో 08624250795, ఏలూరులో 08812232267 నంబర్లను అందుబాటులో ఉంచింది. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 040 27788516 నంబర్‌ను ఏర్పాటు చేసింది. రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకోవడానికి ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే హౌరాలో 033 2638227, ఖరగ్‌పూర్‌లో 8972073925, 9332392339, బాలాసోర్‌లో 8249591559, 7978418322, 858 5039521, షాలిమార్‌లో 9903370746, సంత్రాగచ్చిలో 8109289460, 8340649469 నంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీగా ప్రయాణికులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ప్రధాని మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు సాధ్యమైన సహాయం అందించనున్నట్లు c. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. రూ.10 లక్షల పరిహారం.. ప్రమాద బాధితులకు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ పరిహారం ప్రకటించారు. మృతుల కు టుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. మాటలకందని విషాదం: వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఒడిశా రైలు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వెలిబుచ్చారు. ‘‘ఇది మాటలకు అందని విషాదం. మృతుల కుటుంబాలకు దేవుడు ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి అందరూ కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగేలా అందరూ సహకరించాలని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు తోడుగా నిలవాలని ట్వీట్ చేశారు. రద్దయిన రైళ్లు ఇవే... 12837 హౌరా–పూరీ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12863 హౌరా–సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12839 హౌరా–చెన్నై మెయిల్ (02.06.2023); 12895 షాలిమార్–పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 20831 షాలిమార్–సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 02837 సంత్రాగచ్చి–పూరి (02.06.2023); 22201 సీల్దా–పూరీ దురంతో ఎక్స్‌ప్రెస్ 0(2.06.2023); 12074 భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12073 హౌరా–భువనేశ్వర్ జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12278 పూరీ–హౌరా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12277 హౌరా–పూరీ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12822 పూరీ–షాలిమార్ ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 2821 షాలిమార్ – పూరి ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12892 పూరి–బంగిరిపోసి (03.06.2023), 12891 బంగిరిపోసి–పూరి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 02838 పూరీ–సంత్రగచ్చి స్పెషల్ (03.06.2023); 12842 చెన్నై–షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12509 ఎస్ఎంవీటీ బెంగళూరు–గౌహతి (02.06.2023). -
24 గంటలూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు.. మార్గదర్శకాలు జారీ!
సాక్షి, హైదరాబాద్: ఎండల నుంచి ప్రజలను రక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. ఎండ తీవ్రత మార్చి నుంచి జూన్ మధ్య ఉంటుందని, కొన్ని సందర్భాల్లో జూలై వరకు కూడా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈక్రమంలో జిల్లాల్లో 24 గంటలూ పనిచేసేలా హెల్ప్లైన్లను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లా నిఘా అధికారి నోడల్ ఆఫీసర్‌గా ఉంటారన్నారు. వడదెబ్బ తదితర ఆరోగ్య సమస్యలకు ఎవరైనా గురైతే వారిని కాపాడేందుకు జిల్లా, డివిజనల్ స్థాయిల్లో 24 గంటలూ పనిచేసే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు వడదెబ్బ కేసులు/మరణాలు, తీసుకున్న నివారణ చర్యలపై రోజువారీ నివేదికను తనకు పంపాలని కోరారు. ప్రతీ రోజూ నీటి క్లోరినేషన్‌ను పీహెచ్సీ వైద్యాధికారులు తనిఖీ చేయాలని కోరారు. మార్గదర్శకాలివీ... ♦ అన్ని పీహెచ్‌సీలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ♦ ఎండదెబ్బకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ♦ అన్ని ఆసుపత్రుల్లోనూ అత్యవసర ఔషధాలను తగినంత సంఖ్యలో నిల్వ ఉంచాలి. ♦ సీరియస్ కేసులేవైనా వస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించాలి. ♦ శిశువులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆయా వర్గాలకు చెందినవారు ఎండకు దూరంగా ఉండాలి. ♦ ఆరు బయట పనిచేసే కార్మీకులు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండలో పనిచేయకూడదు. పని ప్రదేశంలో వారికి ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించాలి. పని చేసే ప్ర దేశానికి సమీపంలోని కమ్యూనిటీ హాల్స్‌లో అవసరమైన షెల్టర్లను ఏర్పాటు చేయాలి. ♦ పట్టణ ప్రాంతాలు, మునిసిపాలిటీలలో స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతృత్వ సంస్థలు ‘చలివేంద్రం’ ద్వారా సురక్షితమైన మంచినీటి సరఫరా అందజేయాలి. ♦ నీటి పైపులైన్లు లీకేజీ కాకుండా చర్యలు తీసుకోవాలి. ♦ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో ఎండ వేడిమి నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ♦ ఆసుపత్రుల్లో బాధితులకు వడదెబ్బ పాలైన వారికోసం ప్రత్యేకంగా పడకలను సిద్ధం చేయాలి. ♦ ప్రజలు దాహం వేయకపోయినా, వీలైనంత వరకు తగినంత నీరు తాగాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) వాడాలి. నిమ్మరసం, మజ్జిగ లేదా లస్సీ, పండ్ల రసాలు వంటి వాటిని తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు నీటిని తీసుకెళ్లాలి. ♦ పుచ్చకాయ, నారింజ, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ వంటి పండ్లు, కూరగాయలను తినాలి. ♦ సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలను ధరించడం మంచిది ♦ ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని ఉపయోగించాలి. ♦ పగటిపూట కిటికీలు, కర్టెన్లను మూసి ఉంచాలి. ♦ వేసవి ఎక్కువగా ఉండే సమయంలో వంట చేయడం మానుకోండి. వంట ప్రదేశాన్ని తగినంతగా వెంటిలేట్ చేయడానికి తలుపులు, కిటికీలను తెరవండి. ♦ ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను తాగకూడదు. -
మా సోదరులను రక్షిస్తాం!ఎవరైనా బెదిరిస్తే కాల్ చేయండి: స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులను రక్షస్తామని హామి ఇచ్చారు. వలస కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా మిమ్మల్ని బెదరిస్తే హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి అని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం, ప్రజలు, మా వలస సోదరులకు రక్షణా నిలుస్తారని అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తమిళనాడు, బిహార్ అధికారులు వలస కార్మికులపై దాడుల గురించి అనవసరమైన పుకార్లు సృష్టించకుండా హెచ్చరికలు జారీ చేశారు. ఈ పుకార్లే కార్మికులలో భయాందోళనలకు దారితీసిందని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయమే బిహార్ అసెంబ్లీలో వాడివేడి చర్చలకు దారితీసింది. వలస కార్మికులను కలుసుకోవడం తోపాటు స్థానిక అధికారులను కూడా సంప్రదిస్తామని స్టాలిన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. బిహార్ నుంచి వలస వచ్చిన కార్మికులపై దాడులకు సంబంధించిన పుకార్లను తనిఖీ చేయడానికి ఇరు రాష్ట్రాల పోలీసులు సోషల్ మీడియాపై నిఘా పెట్టినట్లు తెలిపారు. అలాగే వలస కార్మికులను భయపడవద్దని తమిళనాడు జిల్లా కలెక్టర్లు హిందీలో విజ్ఞప్తి చేశారు.కాగా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ విషయమై అన్ని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పైగా వారికి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: డ్రైవర్ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్ అయిన ట్రాక్టర్!ఆ తర్వాత..) -
ఈ– కామర్స్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మెరుగుపడాలి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థల ఫిర్యాదుల పరిష్కార విధానం గుర్తించదగిన స్థాయిలో పటిష్టంగా లేదని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్‌లైన్‌కు (ఎన్సీహెచ్) వచ్చిన ఫిర్యాదుల సంఖ్య గత నాలుగేళ్లలో భారీగా పెరిగిందని కూడా చెప్పారు. పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2021 నవంబర్‌నాటికి నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 40,000 ఉంటే, 2022 నవంబర్ నాటికి ఈ సంఖ్య 90,000కు చేరిందని అన్నారు. నాలుగేళ్ల క్రితం మొత్తం ఫిర్యాదుల్లో ఈ– కామర్స్ లావాదేవీలకు సంబంధించినవి 8 శాతం ఉంటే, గత నెల్లో ఇది 48 శాతంగా నమోదయినట్లు వెల్లడించారు. ఈ–కామర్స్ సంస్థల ఫిర్యాదుల పరిష్కార విధానం సరిగా లేదన్న విషయం దీనిని బట్టి అర్థం అవుతోందని అన్నారు. కీలక చర్యలకు శ్రీకారం.. వినియోగదారుల బలహీనపడుతున్న పరిస్థితుల్లో మంత్రిత్వజోక్యం పాత్ర కీలకమవుతోందని అన్నారు. ప్రస్తుతం 10 భాషల్లో ఎన్సీహెచ్ సేవలు అందిస్తోందని, భవిష్యత్తులో ఇవి 22కి పెరుగుతాయని చెప్పారు. వినియోగ హక్కుల పరిరక్షణకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 5.27 లక్షల కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన సింగ్, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం కేసుల్లో 1.8 లక్షలు బీమా రంగానికి సంబంధించినవి కాగా మరో 80,000 కేసులు బ్యాంకింగ్‌కు సంబంధించినవని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ఉత్పత్తుల ప్రకటన విషయాన్ని ప్రస్తావిస్తూ, దీనిపై త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు తెలిపారు. ‘‘మేము ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసాము. అది త్వరలో విడుదలవుతుంది. ఉత్పత్తిని ఆమోదించి, ప్రచారం చేసిన వారు డబ్బు తీసుకున్నారో, లేదో వెల్లడించాలి’’ అని ఆయన అన్నారు. కృత్రిమ మేధస్సు, స్థిర ప్యాకేజింగ్‌పై ప్రమాణాలను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు. -
లైంగిక వేధింపుల నివారణకు వినూత్న కార్యక్రమం
కైకలూరు(పశ్చిమ గోదావరి జిల్లా): పాఠశాల స్థాయి నుంచే బాలికల రక్షణ, లైంగిక వేధింపుల నిరోధానికి వినూత్న కార్యక్రమానికి ఎపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దిశ యాప్‌తో మహిళలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోంది. ఇప్పుడు జువెనైల్ జస్టిస్ కమిటీ– హైకోర్టు, రాష్ట్ర సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గోడపత్రికల ద్వారా లైంగిక వేధింపుల నివారణపై 18 సంవత్సరాలలోపు బాలికలకు అవగాహన కలిగిస్తున్నారు. బాలికలు తాము ఎదుర్కొన్న ఇబ్బందిని స్కూల్లోని ఫిర్యాదుల బాక్సు ద్వారా తెలియజేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కొన్నిసార్లు ఎవరికి చెప్పాలో తెలియక బాలికలు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్‌పై ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి చేపడుతోంది. 18 సంవత్సరాల లోపు పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి పాఠశాల భద్రతా మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. ప్రతి పాఠశాలలోనూ పర్యవేక్షణ చేయడానికి భద్రతా కమిటీలను రూపొందించింది. ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు బాలికలు తాము ఎదుర్కొంటున్న లైంగిక సమస్యలను నిర్భయంగా కాగితంపై రాసి వేసేలా ఫిర్యాదుల పెట్టెను ప్రతీ పాఠశాలలోనూ ఏర్పాటు చేశారు. పాఠశాల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బాక్సును అమర్చుతున్నారు. ఈ బాక్సుకు మూడు తాళం చేవులు ఉంటాయి. ప్రతీ 15 రోజులకు పెట్టెలో వచ్చిన ఫిర్యాదులను ఎంఈఓ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దారు వద్ద తెరిచి పరిష్కారాలను చూపుతారు. పెద్ద సమస్యను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువెళ్తారు. హెచ్ఎంలకు అవగాహన బాలికలపై లైంగిక వేధిపుల నిరోధానికి ప్రభుత్వం పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తోంది. ఇటీవల ఈ అంశంపై మండల స్థాయిలో హెచ్ఎంలకు అవగాహన కలిగించారు. బాలికల శరీర భాగాలను తప్పుడు ఉద్దేశంతో ఎవరైన తాకితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. చైల్డ్ లైన్ – 1098, ఏపీ పోలీసు – 100, దిశ – 112, ఉమెన్ హెల్ప్ లైన్ – 181, ఎమర్జన్సీ – 108, మెడికల్ హెల్ప్ లైన్ – 104కు ఫిర్యాదు చేయాలని పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. బాలికలలో తల్లిదండ్రులు గమనించాల్సినవి ప్రవర్తనలో ఆకస్మిక మార్పు ఇతరుల నుంచి దూరంగా ఉండటం శరీర భాగాలలో అనుమానస్పద మార్పులు భయపడుతూ ఉండటం ఆహారం, నిద్రలో మార్పులు బాలికలకు బోధించాల్సినవి మీ హక్కులకు ఉల్లంఘన జరిగితే గట్టిగా మాట్లాడాలి ఎవరైన హద్దు మీరి ప్రవర్తిస్తే చురుగ్గా ప్రతిఘటించాలి లైంగిక వేధింపును ఎదుర్కొన్న తర్వాత అది వారి తప్పు కాదని గుర్తించేలా, అపరాధ భయాన్ని విడనాడేలా చేయాలి లైంగిక వేధింపులకు గురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులకు చెప్పేలా ప్రోత్సహించాలి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి ప్రభుత్వం మహిళల రక్షణకు అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. దిశ యాప్ ద్వారా ఆపదలో మహిళలకు తక్షణ సాయం అందిస్తున్నారు. పాఠశాల స్థాయిలో లైంగిక వేధింపులకు గురైన బాలికలు ధైర్యంగా తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పాలి. చేతులతో ఎవరైనా తాకడానికి ప్రయత్నిస్తే జాగ్రత్తగా గమనించాలి. ప్రభుత్వం అందిస్తున్న టోల్‌ఫ్రీ నెంబర్లుకు ఫోన్ చేయండి - కెఎల్ఎస్.గాయత్రీ, మహిళా ఎస్సై, కైకలూరు ప్రతి పాఠశాలలోనూ ఫిర్యాదుల పెట్టె ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశాం. బాలికలు భయపడకుండా ఫిర్యాదులు వేసేలా నిర్మానుష్య ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పాం. ప్రతీ ఫిర్యాదును తహసీల్దారు సమక్షంలో విచారణ చేసి తక్షణ న్యాయం చేయనున్నాం. ఇటీవల హెచ్ఎంలకు వీటి నిర్వాహణపై శిక్షణ అందించాం. – డి.రామారావు, మండల విద్యాశాఖాధికారి, కైకలూరు -
దాదాపు రూ. 5 లక్షలు మోసపోయిన ఇన్స్పెక్టర్... 9 ఏళ్లుగా కేసు నమోదుకాక..
సాధారణ వ్యక్తుల పెద్ద మొత్తంలో మోసపోతే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఒక వేళ్ల ఎవరైన కాస్త అధికారుల అండదండ ఉన్నాళ్లు అయితే కేసు ముందుకు వెళ్తుంది లేదంటే అంతే పరిస్థితి. సాక్షాత్తు బోర్డర్లో పనిచేసే ఒక ఇన్స్పెక్టర్ భారీ మొత్తంలో మోసానికి గురయ్యాడు. పాపం ఆయనే ఫిర్యాదు చేసేందుకు తొమ్మిదేళ్లుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు కాలేదు. వివరాల్లోకెళ్తే....బోర్డర్సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు చెందిన ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ గుప్తాని గురుగ్రామ్‌కి చెందిన ఒక ఐటీ సంస్థ దాదాపు రూ. 5.5 లక్షల మేర మోసం చేసినట్లు పోలీస్ అధికారి సంజయ్ శుక్లా తెలిపారు. సదరు ఇన్స్పెక్టర్ ఇండోర్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే ఆయనకి అక్టోబర్7, 2014న గురుగ్రామ్‌లో ఐటీపార్కు నుంచి కాల్ వచ్చిందని, ఆ కంపెనీ ఆయనకు కోట్లలో డబ్బు వస్తుందని ఆశ చూపి సుమారు రూ. 5 లక్షల మేర దోచుకున్నట్లు వెల్లడించారు. దీంతో గుప్తా పలుమార్లు సెబీకి ఫిర్యాదు చేసినట్లు శుక్లా తెలిపారు. రెండేళ్లకు పైగా సెబీతో ఉత్తరప్రత్యుత్తరాలు జరపగా... గుప్తా పేర్కొన్న పేరుతో ఏ కంపెనీ రిజస్టర్ కాలేదని తెలిసినట్లు చెప్పారు. ఆ తర్వాత గుప్తా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేద్దామనకుంటూ అసలు కుదరలేదని, తొమ్మిదేళ్లు పైగా కేసు నమోదు కాలేదని చెప్పారు. చివరికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్ నెంబర్ సాయంతో ఫిర్యాదు చేయగలిగినట్లు శుక్లా వెల్లడించారు. అయితే ఈ కేసు ఆయనకు కంపెనీకి మధ్య జరిగిన ఫోన్, సోషల్ మీడియా చాట్ల సాయంతో దర్యాప్తు చేయనున్నట్లు సంజయ్ శుక్లా పేర్కొన్నారు. (చదవండి: విడాకులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని...కోడలిని హతమార్చిన మామ) -
ఒక్క అంకె తప్పుగా ఇవ్వడంతో ఆ మహిళకు 4,500 మిస్డ్ కాల్స్!
మన ఫోన్‌కి అదే పనిగా కాల్స్ వస్తేనే చాలా చికాకుగా ఉంటుంది. అలాంటిది అదే పనిగా మిస్డ్ కాల్స్ వస్తే అబ్బా ఏంటిది అని విసుగ్గా అనిపిస్తుంది. కానీ యూకేకి చెందిన ఒక మహిళకి ఏకంగా 4500 మిస్డ్ కాల్స్ వచ్చాయంటా తెలుసా!. (చదవండి: ఏకంగా పామునే హెయిర్ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్ వీడియో) అసలు విషయంలోకెళ్లితే....యూకేలోని ఉత్తర ఐర్లాండ్‌లోని బాంగోర్కు చెందిన హెలెన్ ఫోన్ మొత్తం మిస్డ్ కాల్స్‌తో నిండిపోయింది. అయితే ఆమె బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ని హెల్ప్ లైన్ నెంబర్ అని తప్పగా భావించడంతో ఆమెకు తెగ కాల్స్ వచ్చాయి. ఈ మేరకు ఆమె బిజినెస్ కాంటాక్ట్ నెంబర్‌కి డిపార్ట్మెంట్ ఫర్ ది ఎకానమీ డెలివరీ చేసిన స్పెండ్ లోకల్ స్కీమ్ ఫోన్ నెంబర్‌కి ఒక అంకె తేడా ఉండటంతో వారు తప్పుగా హెలెన్ బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ని ఇచ్చారు. దీంతో ఆ లోకల్ స్కీమ్‌కి చెందిన కస్టమర్లంతా తమ కార్డు బ్యాలెన్స్ చెక్ చేయండి అంటూ హెలెన్స్కి రకరకాలు కాల్స్ చేశారు. అయితే వారిలో కొంతమంది వృద్ధుల ఉంటే వారికి తనవంతుగా సాయం చేసింది. మరికొందరికి అసలు విషయాన్ని వివరించింది కూడా. ఏది ఏమైనా ఎన్ని కాల్స్ రిసీవ్ చేసుకోగలరు ఎవరైనా. చివరికి ఆమె ఇక మిగతా ఏ కాల్ని రిసీవ్ చేసుకోవడం మానేసింది. దీంతో ఆమె ఫోన్ మొత్తం మిస్డ్ కాల్స్‌తో నిండిపోయింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఫర్ ది ఎకానమీ సదరు మహిళకు క్షమాపణలు చెప్పింది కూడా. (చదవండి: అవిభక్త కవలలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు!!) -
విడిపోదామనుకున్న దంపతులను ఒక్కటిగా చేస్తూ..
విజయనగరం ఫోర్ట్: చూపులు కలిసి ఒక్కటైనవారే వారంతా...కానీ క్షణికావేశంలో మాటామాటా పెరిగి దూరమయ్యారు. విడపోదామనుకున్న ఆ మనసులను రంజింపచేసి రాజీ బాట పట్టించారు. విరిగిన హృదయాల్లో ప్రేమను మళ్లీ చిగురింపజేసి సరికొత్త జీవితాన్ని చూపించారు. వారే గృహ హింస విభాగ ప్రతినిధులు. విడిపోవడం ఓ క్షణం ... అదే దగ్గరైతే జీవితమే మకరందమంటూ ఎన్నో జంటల్లో మానసిక పరివర్తనను తేగలిగారు ఆ ప్రతినిధులు. ►ఆనందపురం మండలానికి చెందిన మహిళకు పూసపాటిరేగ మండలానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొన్నేళ్లు వారి కాపురం సజావుగానే సాగింది. 2019లో తనను, పిల్లలను సరిగా చూడడం లేదని, మనోవర్తి ఇప్పించాలని కలెక్టరేట్లో ఉన్న గృహహింస విభాగాన్ని ఆ మహిళ ఆశ్రయించింది. దీంతో గృహహింస విభాగం కౌన్సిలర్లు భార్యాభర్తలకు పలు దఫాలుగా కౌన్సిలింగ్ నిర్వహించి ఒక్కటి చేశారు. ►గజపతినగరం మండలానికి చెందిన ఓ మహిళకు అదే మండలానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరి కాపురం కొన్ళేళ్లు సజావుగా సాగింది. వివాహం జరిగిన మూడేళ్లు తర్వాత తన భర్త వేధిస్తున్నాడని, అతని నుంచి విముక్తి కల్పించాలని కలెక్టరేట్లో ఉన్న గృహహింస విభాగాన్ని ఆశ్రయించారు. అక్కడ కౌన్సిలర్లు భార్య,భర్తలకి కౌన్సిలింగ్ నిర్వహించి చేయీ చేయీ కలిపించారు. ►అదో గృహ హింస విభాగం. ఈ విభాగంలో ఒక సోషల్ కౌన్సిలర్, లీగల్ కౌన్సిలర్, ఇద్దరు హోం గార్డులు పనిచేస్తున్నారు. అక్కడకు వచ్చిన వారంతా భర్తతో, అత్తమామలతో హింసలకు గురైనవారే. భర్త వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని కొందరు, భర్తతో కలిసి ఉండేలా చూడాలని మరి కొందరు. వీరంతా తమ గోడును కలెక్టరేట్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గృహహింస విభాగానికి వచ్చి ఆవేశంతో ఊగిపోతున్న బాధితులే. కౌన్సిలింగ్ ద్వారా... గృహహింస విభాగాన్ని ఆశ్రయించిన మహిళలనుతన భర్తతో కలిసి ఉండేలా కౌన్సిలర్లు చర్యలు చేపడతారు. మహిళల నుంచి ఫిర్యాదు తీసుకున్న వెంటనే ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులను పిలిపించి కౌన్సిలర్లు ఇద్దరు కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకసారి కౌన్సిలింగ్లో రాజీపడని వారికి పలు దఫాలుగా పిలిపించి ఒప్పించే ప్రయత్నం చేస్తారు. సాధ్యమైనంత వరకు ఆ దంపతులను కలిపే ప్రయత్నం చేస్తారు. కౌన్సెలింగ్‌లో రాజీ పడని వారికి ఉచితంగా కోర్టులో కేసు వేస్తారు. కోర్టుకు వెళ్లిన తర్వాత కూడా విడాకులకు కాకుండా ఒక్కటయ్యే మార్గాన్నే వారు చూపిస్తారు. విడాకులనేది ఆఖరి అస్త్రంగా ప్రయోగిస్తారు. 130 మందిని మళ్లీ ఒక్కటిగా చేశారు 2006లో గృహహింస విభాగం జిల్లాలో ఏర్పాటయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 767 మంది గృహహింస విభాగాన్ని అశ్రయించారు. వీరిలో కౌన్సిలింగ్ ద్వారా 130 మందిని కలిపారు. 122 మంది కేసులను ఉపసంహరించుకున్నారు. 512 కేసులు కోర్టులో వేయగా 65 మంది కోర్టు సమక్షంలో మళ్లీ చేయీచేయీ కలిపారు. 257 కేసులకు తుది తీర్పు వచ్చాయి. 149 కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. సంతోషంగా ఉంది కుటుంబ కలహాలతో మా దగ్గరకు వచ్చే వారికి ముందుగా కౌన్సిలింగ్ ఇస్తాం. కలిసి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాల కోసం చెబుతాం. చాలా మందికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో కలిశారు. విడిపోదాం అనుకొని వచ్చిన వారిని కలపడం ఎంతో సంతోషంగా ఉంటుంది. – జిల్లెల రజని, సోషల్ కౌన్సిలర్ ఉచిత న్యాయ సహాయాన్నిఅందిస్తాం కౌన్సిలింగ్ ద్వారా రాజీ పడని వారికి ఉచితంగా కోర్టులో కేసు వేస్తాం. వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తాం. కోర్టులో కేసు వేసిన తర్వాత కూడా చాలా మంది రాజీ పడి కలిసిన సందర్భాలున్నాయి. – జి. మాధవి, లీగల్ కౌన్సిలర్ -
ఆస్పత్రుల్లో బెడ్ బ్లాక్ ముఠా అరెస్ట్
బనశంకరి: బెడ్బ్లాకింగ్ కేసులో మరో ఇద్దరు పట్టుబడ్డారు. బీబీఎంపీ దక్షిణ వలయ కోవిడ్ వార్ రూమ్ హెల్ప్‌లైన్‌లో పనిచేసే వరుణ్, అతడి స్నేహితుడు యశ్వంతకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెడ్ అవసరమైన వారి ఫోన్ నంబరును వరుణ్ సేకరించి స్నేహితుడు యశవంత్‌కుమార్ ద్వారా మాట్లాడించేవాడు. ఐసీయూలో ఆక్సిజన్, వెంటిలేటర్ సౌలభ్యం కలిగిన బెడ్ ఇస్తామని చెప్పి తన బ్యాంక్ అకౌంట్‌కు నగదు జమ చేయించుకొని ప్రభుత్వ కోటాలోని బెడ్ కేటాయింపు చేసేవాడు. ఇప్పటి వరకు ఎంతమంది వద్ద డబ్బు తీసుకున్నారనేది విచారిస్తున్నామని సీసీబీ జాయింట్ కమిషనర్ సందీప్‌పాటిల్ తెలిపారు. -
Photo Feature: కరోనా ఇంటింటి సర్వే, టీకా కష్టాలు
హైదరాబాద్‌లో కరోనా ఇంటింటి సర్వే మొదలైంది. వేసవి కాలంలో వచ్చే తాటిముంజలు నోరూరిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయి. కోవిడ్ కట్టడికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్, కర్ఫ్యూలు అమలవుతున్నాయి. -
‘ఆధార్’ కోసం కొత్త హెల్ప్ లైన్ నెంబర్
ముంబై: మీరు ఆధార్ మార్పులు చేస్తున్నారా? మీ ఆధార్ కార్డ్ లో ఏమైనా తప్పులు ఉన్నాయా? ప్రతీ చిన్న పనికి ఆధార్ సెంటర్‌కు వెళ్లలేకపోతున్నారా?. అయితే ఏమి పర్వాలేదు ఇప్పుడు మీరు ఆధార్ హెల్ప్ లైన్ నెంబర్ కీ కాల్ చేసి మీ సందేహాలను తీర్చుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా - UIDAI ఆధార్ సమస్యల పరిష్కారం కోసం కొత్త హెల్ప్ లైన్ నెంబర్ 1947ని లాంఛ్ చేసింది. ఈ ఆధార్ హెల్ప్‌లైన్ వారమంతా అందుబాటులో ఉంటుంది. ఏజెంట్లు, సోమ – శని వారాలలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఆదివారం మాత్రం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్ సేవకులు అందుబాటులో ఉంటారు. ఆధార్ హెల్ప్‌లైన్ 1947 ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ మరియు ఉర్దూ భాషలలో సేవలను అందిస్తుంది. మీకు నచ్చిన భాషలో సంభాషణ కోసం హెల్ప్‌లైన్ కీ కాల్ చేయవచ్చు. (చదవండి: పీవీసీ ఆధార్: మొబైల్ నెంబర్‌తో పనిలేదు) ఆధార్ హెల్ప్‌లైన్ వారమంతా అందుబాటులో ఉంటుంది. ఏజెంట్ తో మాటలాడుటకు, ఇక్కడ తెలుపబడిన సమయంలో 1947 కు కాల్ చేయండి. IVRS ఇప్పుడు 24x7 అందుబాటులో ఉంటుంది. #Dial1947ForAadhaar pic.twitter.com/Lgq0v8QRUo — Aadhaar Office Hyderabad (@UIDAIHyderabad) November 18, 2020 రోజూ లక్షన్నర కాల్స్ స్వీకరించే సామర్ధ్యం యూఐడీఏఐ కాల్ సెంటర్‌కు ఉంది. ఐవీఆర్ఎస్ సిస్టమ్ మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. మీ మొబైల్ లేదా ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేయొచ్చు. మీకు దగ్గర్లోని ఆధార్ సెంటర్ వివరాలు, ఆధార్ ఎన్రోల్మెంట్ స్టేటస్, ఆధార్ కార్డు డెలివరీ స్టేటస్ లాంటి వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యల్ని emailhelp@uidai.gov.in మెయిల్ ఐడీకి మెయిల్ చేసి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. ఇక ఆధార్ కార్డుకు సంబంధించిన మరిన్ని వివరాలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. -
కరోనా : కొత్త యాప్ ప్రారంభించిన ఢిల్లీ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాస్పిటల్ బెడ్స్, ఇతర సమాచారం కోసం ‘‘ఢిల్లీ కరోనా" యాప్ ను మంగళవారం ప్రారంభించారు. కరోనా కంటే నాలుగు అడుగులు తమ ప్రభుత్వం ముందే ఉందని, ఆందోళన అవసరం లేదని మరోసారి పునరుద్ధాటించారు. తాజా వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఢిల్లీ సీఎం ఈ యాప్‌ను లాంచ్ చేశారు. కరోనా బారిన పడిన వారి చికిత్స, ఆసుపత్రిలోకావాల్సిన సౌకర్యాలపై అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే.. ఏయే హాస్పిటల్లో ఎన్నెన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో లాంటి వివరాలు లభిస్తాయని తెలిపారు. కోవిడ్-19 రోగులకు ఆసుపత్రి పడకలు, వెంటిలేటర్లను ట్రాక్ చేయడానికి ఈ మొబైల్ అప్లికేషన్‌ను తీసుకొచ్చామని కేజ్రీవాల్ చెప్పారు. ఇది ఢిల్లీ ప్రజలందరికీ ఆసుపత్రి పడకలు, ఇతర అవసరాల లభ్యతమై సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులు పెరుగుతున్నాయి, కానీ ఆసుపత్రులలో పడకలు, ఐసీయూ, ఆక్సిజన్ సహాయానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి కనుక ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఒకవేళ ఆసుపత్రిలో బెడ్ లభ్యత విషయంలో ఏదైనా సమస్య ఏర్పడితే ప్రజలు హెల్ప్‌లైన్ నెం. 1031కు కాల్ చేయవచ్చని ముఖ్యమంత్రి వెల్లడించారు. వెంటనే వారికి ఒక ఎస్ఎంఎస్ వస్తుందని వివరించారు. అంతేకాదు యాప్ అందుబాటులో లేనివారికోసం ఒక వెబ్సైట్ కూడా తీసుకొచ్చినట్టు తెలిపారు. దీంతోపాటు వాట్సాప్ నెంబరు ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చన్నారు. ఢిల్లీలో మొత్తం 302 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయనీ, వీటిలో 210 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ యాప్‌లో సమాచారాన్ని రోజుకు రెండుసార్లు, ఉదయం 10, సాయంత్రం 6 గంటలకు అప్డేట్ చేస్తామని దీంతో ప్రజలకు తాజా వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. #WATCH If a hospital refuses to provide you bed even when our app shows beds are available in that hospital, then you can call on 1031. Our Special Secretary will take an action immediately and contact the hospital authorities to provide you bed on the spot: Delhi CM. #COVID19 pic.twitter.com/NQebaToCF8 — ANI (@ANI) June 2, 2020 -
సాంత్వననిచ్చే కోవిడ్ సాథీ
కరోనా మహమ్మారి మూలంగా పనులు దొరక్క... అలాగని పస్తులుండలేక స్వగ్రామాలకు ప్రయాణం కడుతున్న వలస కార్మికులకు ఆహారాన్ని అందించే వారున్నారు... ఉపాధి కోల్పోయిన వారికి ఆసరా ఇచ్చేవారున్నారు. నెలవారీ సరుకులు ఇచ్చి ఆదుకునే వితరణ శీలురున్నారు. ఇలా ఎవరికి ఎవరు ఎలాంటి సహాయం చేస్తున్నా ఆందోళన పడుతున్న వారి భుజం మీద చేయి వేసి ‘నీకు ఏం కాదు’ అని భరోసా ఇచ్చి, వారి వెన్ను తడుతూ మరేం పర్లేదు తోడుగా మేమున్నాం అని మానసిక ధైర్యాన్ని ఇచ్చేవాళ్లు ఉండాలి. అవతలి వారి కష్టాన్ని ఓపిగ్గా విని, ఈ కష్టాన్ని తేలిక చేసే మాట సహాయం అందించాలనుకునే వాళ్లు కూడా ఉండాలి. ఇటువంటి వారి కోసం కమ్యూనిటీ రేడియోలు, సమాచారాన్ని అందించే హెల్ప్లైన్లు ఉన్నాయి. వాటితోసాటే సున్నిత మనస్కుల మనో నిబ్బరం దెబ్బతినకుండా వారికి మేము అండగా ఉన్నామనే భరోసా ఇవ్వాలనుకున్నాం. ఊహించని పరిణామాలకు దిగులుతో కుంగిపోకుండా ధైర్యంగా డీల్ చేసుకునేలా కౌన్సెలింగ్ ఇస్తున్నాం’ అంటున్నారు ‘కోవిడ్ సాథీ’ ఫౌండర్ మాలా పరోపకారి. ఆమె మాజీ ఐఆర్ఎస్ అధికారి. మూడు వారాలుగా ఈ హెల్ప్ లైన్ సేవలను అందిస్తోంది... (వదల బొమ్మాళీ..!) ‘దీదీ.. నా పేరు రాణి మిర్ధా. నాతోపాటు ఇంకో ముగ్గురు అమ్మాయిలున్నారు. మాది జార్ఖండ్. ఇక్కడ (హైదరాబాద్) ఓ కంపెనీలో పనిచేసేవాళ్లం. లాక్‌డౌన్‌తో పనిపోయింది. చేతిలో ఉన్న డబ్బయిపోయింది. తిండికి కూడా లేదు. భోజనం పంచే వాళ్లు మీ నంబర్ ఇచ్చారు. మా ఊరెళ్లాలి. ప్లీజ్ హెల్ప్ చేయండి’ అని ఏడుస్తూ ఈ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసింది ఆ అమ్మాయి. వెంటనే స్పందించిన కోవిడ్ సాథీ.. హైదరాబాద్ పోలీసు అధికారుల సహాయంతో ఆ తెల్లవారే మొదలైన రైలులో వాళ్లను జార్ఖండ్‌కు పంపించారు. ఈ నలుగురూ 20 ఏళ్లలోపు వాళ్లే. అందులో ముగ్గురికి పెళ్లయింది. ఒక అమ్మాయికి ఇద్దరు పిల్లలు కూడా. భర్త చెన్నైలో పనిచేస్తున్నాడు. పిల్లలు అత్తామామల దగ్గర జార్ఖండ్‌లో. చెన్నైలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సహాయంతో ఆమె భర్తను కూడా చెన్నై నుంచి జార్ఖండ్‌కు పంపించే ప్రయత్నం చేస్తోంది కోవిడ్ సాథీ. ఒక్క హైదరాబాద్ నుంచే కాదు తెలంగాణ, ఆం«ధ్రప్రదేశ్, కర్ణాటక మొదలు జైపూర్, ముంబై, చండీగఢ్ వంటి నగరాల దాకా దేశం నలుమూలల నుంచీ కోవీడ్ సాథీకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. రోజూ వందకు పైగా కాల్స్‌కు సమాధానం రోజుకి కనీసం 150 ఫోన్‌కాల్స్‌ను రిసీవ్ చేసుకుంటోందీ హెల్ప్‌లైన్. ఇంటి పని, ఇంట్లో ఆఫీస్ పని ఈ రెండింటి ఒత్తడితో సతమవుతూ కొందరు, ఉద్యోగ అభద్రతతో ఇంకొందరు, ఉన్న చిన్న వ్యాపారం భవిష్యత్ ఏం కానున్నదోనన్న బెంగతో మరికొందరు, వయసైపోయిన తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన తాము పెద్దవాళ్ల మీదే ఆధారపడే దైన్యస్థితి వచ్చిందనే ఆందోళనతో పిల్లలు, బెంగతో పెద్దలు, కరోనా లాక్డౌన్ వల్ల కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే గడుపుతూండడంతో తలెత్తుతున్న సమస్యలతో మరికొందరు, గృహహింసను ఎదుర్కోలేక కొందరు... కాల్స్ చేస్తుంటారు. మాలా పరోపకారి, రజని, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమా నాగరాజ్, డాక్టర్ హరిణి, సైకాలజిస్ట్ ప్రతిభా సోము, రేవంత్ సహా ఐఐటీ, ఐఐమ్ పట్టభద్రులు, మాజీ సివిల్ సర్వెంట్స్‌తో కలిపి మొత్తం పాతికమంది వరకూ కోవిడ్ సాథీ ద్వారా కన్సెలింగ్ చేస్తున్నారు. సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్‌లు మినహా మిగిలిన వాళ్లంతా బాధితులతో ఎలా మాట్లాడాలి, వాళ్లకు ఎలా ఓదార్పునివ్వాలో తర్ఫీదు పొందారు. మాట మాత్రమే కాదు అవసరమైతే మానసికంగా సై్థర్యాన్ని కలిగించే కౌన్సెలింగ్ వైద్యాన్నీ, ఉపాధి సాయాన్నీ అందిస్తోంది కోవిడ్ సాథీ. ప్రతి రోజూ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఈ హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుంది. కోవిడ్ సాథీ హెల్ప్ లైన్ నంబర్ 7702500928. -
లాక్డౌన్ టైమ్ : చిన్నారులనూ వేధిస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 24న మూడు వారాల లాక్డౌన్ ప్రకటించిన అనంతరం కేవలం 11 రోజుల్లోనే చైల్డ్‌లైన్ ఇండియా హెల్ప్‌లైన్‌కు 92,000 ఫోన్‌కాల్స్ వచ్చాయి. కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు, హింసను ఎదుర్కొంటున్న చిన్నారులు హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. చైల్డ్‌లైన్ 1098కి మార్చి 20 నుంచి 21 వరకూ మూడు లక్షల కాల్స్ రాగా, అందులో 30 శాతం 92,105 కాల్స్ వేధింపులు, హింసకు సంబంధించినవని చైల్డ్‌లైన్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ హర్లీన్ వాలియా వెల్లడించారు. ప్రధాని మోదీ లాక్డౌన్ ప్రకటన చేసిన అనంతరం తమ హెల్ప్‌లైన్‌కు 50 శాతం మేర కాల్స్ పెరిగాయని తెలిపారు. లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో చిన్నారులపై ఒత్తిడి తగ్గే మార్గాలపై మహిళా శిశుసంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో చర్చించామని అధికారులు తెలిపారు. లాక్డౌన్ సమయంలో వేధింపులతో పాటు ఆరోగ్యం బాగాలేదని 11 శాతం కాల్స్, బాలకార్మికులపై 8 శాతం, అదృశ్యమైన, పారిపోయిన చిన్నారులపై 8 శాతం, అనాధ చిన్నారుల గురించి 5 శాతం కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. కరోనావైరస్పై 1677 కాల్స్ వచ్చాయని, 237 మంది తమకు అస్వస్థతగా ఉందని సాయం చేయాలని హెల్ప్‌లైన్‌ను సంప్రదించారని పేర్కొన్నారు. కాగా లాక్డౌన్ సందర్భంగా ఇళ్లకు పరిమితమైన భర్తలు తమను వేధింపులకు గురిచేస్తున్నారని పలువురు మహిళలు హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ప్రకటించిన అనంతరం గృహహింస ఫిర్యాదులు పెరిగాయని, ఈమెయిల్ ద్వారానే 69 ఫిర్యాదులు అందాయని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. చదవండి : సీఎం సహాయనిధికి విరాళాలు -
గంటలోనే పరిష్కారం
-
విదేశీయుల తరలింపునకు రెడీ!
బీజింగ్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ దేశం నుంచి విదేశీయులను సురక్షితంగా పంపించేందుకు సిద్ధమని చైనా బుధవారం పేర్కొంది. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న వుహాన్ నుంచి భారతీయులను తరలించేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. హ్యుబయి రాష్ట్రంలో దాదాపు 250 మంది భారతీయులున్నారు. వారిలో విద్యార్థులే అత్యధికం. అయితే, భారత్ వచ్చిన తరువాత వారంతా 14 రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. చైనాకు విమాన సర్వీసుల రద్దు చైనాకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రకటించాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఢిల్లీ – షాంఘై సర్వీస్‌ను నిలిపేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించగా, బెంగళూరు– హాంకాంగ్ రూట్లో ఫిబ్రవరి 1 నుంచి, ఢిల్లీ–చెంగ్డూ రూట్లో 14వరకు సర్వీస్‌లను రద్దు చేశామని ఇండిగో పేర్కొంది. ‘కరోనా’కు హోమియోపతి, యునానీ భేష్ శ్వాస సమస్యలు వస్తే ఫోన్ చేయాలని కోరుతూ ఆరోగ్య శాఖ బుధవారం హెల్ప్‌లైన్ నంబర్ 011–23978046ను ప్రకటించింది. కరోనా వైరస్ సోకినవారిని గుర్తించేందుకు విశాఖపట్టణం సహా దేశంలోని 21 విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తిని హోమియోపతి, యునానీ మందులు సమర్ధవంతంగా అడ్డుకోగలవని ఆయుష్ శాఖ ప్రకటించింది. ఈ దిశగా పనిచేసే కొన్ని ఔషధాలను పేర్కొంది. చైనాలోని హ్యుబయి రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి మరో 25 మంది మృతి చెందారు. మొత్తంగా చైనావ్యాప్తంగా మృతుల సంఖ్య 132కి చేరింది. అలాగే, దాదాపు 6 వేల మందికి ఈ వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు. ‘కరోనా’ను తయారు చేసినశాస్త్రవేత్తలు నోవల్ కరోనా రకం వైరస్‌ను ప్రయోగశాలలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు విజయవంతంగా తయారు చేశారు. చైనా బయట వైరస్‌ను తయారు చేయడం ఇదే మొదటిసారని, దీని సాయంతో కరోనా వైరస్‌పై పరిశోధనలు చేయవచ్చని వారు భావిస్తున్నారు. భారత్‌కు కరోనా సోకే ప్రమాదం న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందే అత్యంత అధిక అవకాశాలు ఉన్న 30 దేశాల్లో భారత్ ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చైనాలో కరోనా వైరస్ బారిన పడ్డ నగరాల నుంచి ఎక్కువ సంఖ్యలో విమాన ప్రయాణికులు ఈ 30 దేశాలకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఈ 30 దేశాలకు కరోనా వైరస్ సోకే ప్రమాదం అత్యంత అధికంగా ఉందని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనాన్ని బ్రిటన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. అత్యంత ప్రమాదకర దేశాల్లో తొలి 3స్థానాల్లో థాయిలాండ్, జపాన్, హాంకాంగ్ ఉండగా.. అమెరికా(6), ఆస్ట్రేలియా(7), బ్రిటన్(17), భారత్(23) స్థానాల్లో ఉన్నాయి. -
మహిళల రక్షణకు హెల్ప్ లైన్
సాక్షి,రాజమండ్రి: మహిళల ఫిర్యాదుల స్వీకరణకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తామని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ..ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. మహిళ భద్రతపై కళాశాలలు,సోషల్ మీడియాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. మహిళల రక్షణ కోసం పటిష్ట చర్యలు చేపట్టేందుకు మహిళా కమిషన్ ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీదేవి, ఎస్ఐ అనురాధల విషయంలో ఏం జరిగిందో పోలీసులను వివరణ కోరామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. పోలీసుల వివరణ పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
హలో.. అంగన్వాడీ కేంద్రమా?
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసింది. గురువారం సచివాలయంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హెల్ప్‌లైన్ నంబర్ 155209ను ప్రారంభించారు. అంగన్వాడీల్లో మెరుగైన సేవలను అందించడం కో సం ఈ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించామన్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతీ అధికారి రోజూ అంగన్వాడీ కేంద్రాలకు ఫోన్ చేసి అక్కడి సమస్యలు, పనితీరు తెలుసుకుని సమస్యలను పరిష్కరించాల ని సూచించారు. ‘ఇంటింటికీ అంగన్వాడీ బుక్ పోస్టర్’, ‘అంగన్వాడీ సేవకుల కరదీపిక’లను ఆవిష్కరించారు. హెల్ప్‌లైన్‌తో జిల్లాల వారీగా ఫీడ్ బ్యాక్ తీసుకోవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ చెప్పారు. ఈ హెల్ప్‌లైన్ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. నేను మీ మంత్రిని మాట్లాడుతున్నా.. ‘‘అమ్మా.. నేను మీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును మాట్లాడుతున్నా. చెప్పండి సార్.. మీకు ఏ విధంగా సహాయం చేయగలను కాల్ సెంటర్ నుంచి సమాధానం. ఇదీ సింగరేణి–6 అంగన్వాడీ సెంటరా అమ్మా. అవును సార్. మీ అంగన్వాడీ టీచర్‌కు ఫోన్ కనెక్ట్ చేస్తారామ్మా. ఒకే సార్... అమ్మా మీ సెంటర్లో ఎంత మంది పిల్లలు, ఎంత మంది గర్భిణీలున్నారు.?.. సార్ 26 మంది పిల్లలు, 45 మంది తల్లులు ఉన్నారు సార్.. ఆ వివరాలను మాకు వాట్సాప్ పంపుతారామ్మా’’ ఇదీ అంగన్వాడీ హెల్ప్‌లైన్ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, అంగన్వాడీ టీచర్ మధ్య జరిగిన సంభాషణ. -
మహిళలకు ప్రత్యేకం 181
హైదరాబాద్: తెలంగాణ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ 181 సేవలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. వరకట్నం, గృహహింస వేధింపులతో పాటు పనిచేసే చోట వేధింపులకు సంబంధించిన సమస్యలపై ఈ హెల్ప్ లైన్ పనిచేయనున్నట్లు ఆయన వివరించారు. మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ హెల్స్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
మహిళలకు ప్రత్యేకం 181
ఈ హెల్ప్‌లైన్ మహిళలకు ప్రత్యేకం 181 ⇒ ఫిర్యాదులు, సలహాల స్వీకరణకు ప్రత్యేక నంబర్ ⇒ వారం రోజుల్లో అందుబాటులోకి.. ⇒ ఏర్పాట్లు పూర్తి చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ ⇒ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం సాక్షి, హైదరాబాద్: మహిళలపై దాడులు, లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం త్వరలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనుంది. ఫిర్యాదులను స్వీకరించేందుకు ‘181’అనే నంబర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉమెన్ హెల్ప్‌లైన్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం అత్యవసర సేవల (డయల్ 100) కింద సేవలందిస్తున్న సంస్థతో ఒప్పందం చేసుకుంది. వచ్చే వారంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ హెల్ప్‌లైన్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేయనుంది. ఫిర్యాదులపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపి తక్షణ చర్యలు తీసుకోనుంది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచనుంది.ఫిర్యాదుల స్వీకరణ.. పథకాల విశదీకరణ.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తీసుకొస్తున్న ఉమెన్ హెల్ప్‌లైన్ కేవలం మహిళా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకే పరిమితం కాదు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా అవగాహన కల్పిస్తుంది. ఆ పథకానికి సంబంధించి లబ్ధి జరిగే తీరును విశదీకరిస్తుంది. హెల్ప్‌లైన్‌కు వచ్చే ఫిర్యాదులన్నీ రికార్డ్ చేయడంతోపాటు వాటిని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించే వరకు నిరంతరంగా పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. హెల్ప్‌లైన్ నిరంతరం (24/7) పనిచేస్తుంది. సమస్య లు, సలహాలతోపాటు మహిళల రక్షణకు హెల్ప్‌లైన్ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. అనుకోని సంఘటనలు జరి గితే మహిళలకు అత్యవసర విడిది ఏర్పాటు చేస్తుంది. మహిళల అక్రమ రవాణా తదితర సమాచారాన్ని సేకరించి రక్షణ చర్యల్లో కీలక భూమిక పోషిస్తుంది. -
పట్టాలు తప్పిన హైదరాబాద్ ప్యాసింజర్
బెంగళూరు : ఔరంగాబాద్ - హైదరాబాద్ ప్యాసింజర్ రైలు శుక్రవారం పట్టాలు తప్పింది. కల్గూపూర్-భీల్కీ రైల్వేస్టేషన్ల మధ్య ఈ రోజు ఉదయం రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రైలు ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది. హైదరాబాద్: 040-23200865, పర్లీ: 02446-223540,వికారాబాద్: 08416-252013 , బీదర్: 08482-226329. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నిర్వాహకులూ.. ఇవి గుర్తుంచుకోండి!
సామూహిక నిమజ్జనం, ప్రధాన ఊరేగింపు నేపథ్యంలో గురువారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు నిర్వాహకులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రతి విగ్రహం వద్దా ఉండే సిబ్బంది వీటి అమలును పర్యవేక్షిస్తారు. - నిమజ్జనం కోసం విగ్రహాలను తరలించే వాహనాలు ఎలాంటి మరమ్మతులకు లోను కానివి అయి ఉండాలి. - స్థానిక డీసీపీ ఇచ్చిన సీరియల్ నంబర్‌తో కూడిన స్టిక్కర్‌ను వాహనానికి ముందు వైపు స్పష్టంగా కనిపించేలా విధంగా అతికించాలి. - ఊరేగింపులో వాహనాలను ఎలాంటి లౌడ్ స్పీకర్లు వినియోగించరాదు. - ఈ వాహనాల్లో కర్రలు, కత్తులు, మందు గుండు సామగ్రి సహా ఎలాంటి నిషేధిత వస్తువులు తీసుకెళ్ళరాదు. - ఊరేగింపు సమయంలో మండపాలు, రోడ్లపై బాణాసంచా కాల్చకూడదు. - ర్యాలీల్లో ఉండే అపరిచితుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. - ఆద్యంతం చిత్రీకరించడానికి వీలుగా ప్రతి వాహనానికి ఒక వీడియో కెమెరా సమకూర్చుకోవాలి. - గురువారం అర్థరాత్రి 12 తర్వాత పితృపక్షం వస్తోంది. ఈ లోపుగానే నిమజ్జనం పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించిన విషయం గుర్తుచుకోవాలి. - గత ఏడాది మేం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసినా, సాయంత్రం వరకు ఎలాంటి విగ్రహాలు నిమజ్జనాని రాకపోవటంతో అన్ని క్రేన్‌స ఖాళీగా ఉండాల్సివచ్చింది. ఈసారి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు. - ఆలస్యంగా వచ్చిన విగ్రహాలను నెక్లేస్ రోడ్డుకు పంపిస్తారు. సాధారణ ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకము లేకుండా, ఆ మరునాడు ఏ జంక్షన్లు మూసివేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. జాయింట్ కంట్రోల్ రూమ్స్ ఇక్కడే..: నిమజ్జనం నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. దీనికోసం బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని విభాగాల అధికారులు ఉంటారు. దీంతో పాటు నగర వ్యాప్తంగా 8 జాయింట్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్, ఈస్ట్‌జోన్, నార్త్‌జోన్, వెస్ట్‌జోన్, సౌత్‌జోన్ డీసీపీ కార్యాలయాలతో పాటు సర్దార్ మహల్, ఎన్టీఆర్ మార్గ్, గాంధీనగర్ పోలీసు ఔట్‌పోస్టుల కేంద్రంగా ఇవి పని చేయనున్నాయి. మద్యం విక్రయాలు బంద్... గణేష్ నవరాత్రుల్లో కీలక ఘట్టమైన నిమజ్జం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మద్యం విక్రయాలు నిషేధిస్తూ కొత్వాల్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు కమిషనరేట్ల వ్యాప్తంగా గురు-శుక్రవారాల్లో మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంచాలని, మద్యం విక్రయాలు జరగకూడదని కమిషనర్లు స్పష్టం చేశారు. స్టార్‌హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు వీటి నుంచి మినహాయింపునిచ్చారు. హెల్ప్‌లైన్స్ ఏర్పాటు: ట్రాఫిక్ మళ్ళింపులపై ప్రజలకు అవగాహన కల్పించడం, ఇతర అంశాల్లో సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 040-27852482, 9490598985, 9010203626 నెంబర్లలో సంప్రదించవచ్చని సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి కోరారు. -
అతివల రక్షణకు వాట్సాప్ 94932 06334
షీటీమ్‌లు, వాట్సాప్ నంబర్ ప్రారంభం ∙ త్వరలో 6వేల మంది పోలీసుల రిక్రూట్మెంట్ డీజీపీ జేవీ రాముడు మధురపూడి : మహిళల రక్షణ, వారి సమస్యల పరిష్కారానికి గాను రాజమహేంద్రవరం అర్బన్ పోలీసు అధికారులు రెండు షీ టీమ్‌లు, ఒక హెల్ప్ డెస్క్, వాట్సాప్ నంబర్ 94932 06334ను ఏర్పాటు చేశారు. వీటిని విశాఖపట్నం, కాకినాడ నుంచి మధురపూడి ఎయిర్‌పోర్టుకు వచ్చిన డీజీపీ జేవీ రాముడు బుధవారం ఆవిష్కరించారు. జెంట్ పోలీసులకు తమ సమస్యలు చెప్పుకోలేని మహిళలు షీటీమ్‌ను, వాట్సాప్ నంబర్‌ను ఆశ్రయించవచ్చని డీజీపీ సూచించారు. మహిళల భద్రత నిమిత్తం రెండు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతానికి ఏడుగురు మహిళా పోలీసులతో కూడిన రెండు మహిళా భద్రతాకమిటీలు, ఒక హెల్ప్‌డెస్క్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి టీమ్‌కు ఏఎస్సై బాధ్యురాలు కాగా, మరో ఆరుగురు మహిళా పోలీసులుంటారు. త్వరలో ఆరు వేల మంది పోలీసుల రిక్రూట్మెంట్.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం త్వరలో ఆరువేల మంది పోలీసులను రిక్రూట్మెంట్ చేసుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ జేవీరాముడు తెలిపారు. రాష్ట్రంలో పోలీసు అకాడమీ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రశాంత వాతావరణం గల గోదావరి తీరప్రాంతంలో నేరాల నివారణ, మహిళల గొలుసు దొంగతనాల కమిటీలు అరికడతాయన్నారు. కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, డీఎస్పీలు భరత్‌మాతాజీ, ప్రసన్నకుమార్, త్రినాథ్, ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
'మహిళా రక్షణ బాధ్యత మగవారిదే'
మహిళా రక్షణ బాధ్యత పురుషుల మీదే ఉందని రంగారెడ్డి జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి అన్నారు. గురువారం ఉదయం స్థానిక భృంగీ కళాశాల ఆవరణలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన మహిళా భద్రత ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి వ్యక్తికి విద్య తప్పని సరి అవసరం అని అన్నారు. చాలా మంది విద్యార్థినులు, మహిళలు సమస్యలతో తమలో తామే బాధపడుతున్నారనీ.. ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులకు నిర్భయంగా చెప్పాలని సూచించారు. మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ ఎంతో కృషి చేస్తోందని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చ్చిన సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ మాట్లాడుతూ పురుషులు తప్పు చేస్తున్నాడంటే దానికి తల్లిదండ్రులే కారణమని అన్నారు. మహిళల భద్రత కోసం హెల్ప్‌లైన్(9502403147) నెంబర్‌ను ప్రారంభించారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై నిర్మించిన ఓ లఘు చిత్రాన్ని యూ టూబ్లో ఆప్‌లోడ్ చేశారు. -
హెల్ప్‌లైన్‌కు ఫోన్ల ప్రవాహం
సాక్షి, రాజమండ్రి: పుష్కర యాత్రికుల కోసం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు ఫోన్లు వెల్లువలా వస్తున్నాయి. ప్రారంభమైన రోజు నుంచి వేలాదిమంది సమాచారం కోసం హెల్ప్‌లైన్ నెంబరు 12890కు ఫోన్ చేస్తున్నారు. నిత్యం 1800 నుంచి 2వేల కాల్స్ వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 30 శాతం తప్పిపోయిన వారి గురించిన కాల్స్ ఉంటున్నాయి. పుష్కర, కోటిలింగాల ఘాట్‌కు ప్రతిరోజూ వచ్చే వేల కుటుంబాల్లో చాలామంది తప్పిపోతున్నారు. ఆయా కుటుంబాలకు చెందినవారు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి వారి గురించి అడుగుతున్నారు. హెల్ప్‌లైన్ సెంటర్ పుష్కర ఘాట్ల కంట్రోల్ రూముల నుంచి తప్పిపోయిన వారి వివరాలు సేకరించి తమకు ఫోన్లు చేస్తున్న వారికి వివరాలు అందిస్తోంది. ఘాట్లకు వెళ్లే రూట్లు, వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రికి ఎలా రావాలి, రైళ్లు, బస్సు సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు చాలామంది హెల్ప్‌లైన్‌కు ఫోన్లు చేస్తున్నారు. దొంగతనాలు, క్యూలైన్లలో ఇబ్బందులు, ఘాట్లలో సమస్యల గురించి కాల్స్ వస్తున్నాయి. ఒక్క రోజే హెల్ప్‌లైన్‌కు 2,500 కాల్స్ వరకూ వచ్చాయి. హెల్ప్‌లైన్ నిర్వాహకులు ఫిర్యాదులు, సమస్యలను ఆయా శాఖలకు పంపుతున్నారు. పుష్కరఘాట్ ఎదుట ఉన్న భవనంలోని సెంట్రల్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్‌కు 20 ఫోన్‌లైన్లను అనుసంధానం చేశారు. రాజమండ్రి రైజింగ్స్ పేరుతో కొందరు యువకులు నడిపే స్వచ్ఛంద సంస్థ ఈ హెల్ప్‌లైన్ సెంటర్‌ను నడుపుతోంది. ప్రభుత్వ సాయంతో ఈ సెంటర్‌ను ఈ సంస్థే నిర్వహిస్తోంది. 26 మంది వలంటీర్లు మూడు షిఫ్టులుగా 24 గంటలు పని చేస్తున్నారు. -
సాక్షి హెల్ప్ లైన్ - వేదం నాగయ్య
-
పౌరుడికే తొలి ప్రాధాన్యం: మోదీ
పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని సుపరిపాలనా దినోత్సవ సందేశం న్యూఢిల్లీ: ‘పౌరుడికే తొలి ప్రాధాన్యం’ అన్న పరిపాలనా మంత్రం ప్రాతిపదికగా సామాన్య పౌరుల సంక్షేమం లక్ష్యంగా గత ఏడు నెలలుగా తమ ప్రభుత్వం పనిచేసిందని, పారదర్శకమైన, జవాబుదారీతనంతో పరిపాలనను ప్రజలకు అందించేందుకే తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సామాన్య పౌరుల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 90వ జన్మదినాన్ని ‘సుపరిపాలనా దినం’గా పాటిస్తున్న సందర్భంగా ప్రధాని గురువారం ఒక సందేశం ఇస్తూ, జవాబుదారీతనంతో కూడిన పటిష్టమైన పారదర్శక పాలనను అందిస్తామన్న తమ వాగ్దానాన్ని నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వ పరిపాలనా ప్రక్రియను పునర్వ్యవస్థీకరిస్తున్నామని అన్నారు. ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలకు, విభాగాలకు ఈమేరకు ఆదేశాలు వెళ్లాయని, తమ పరిధిలోకి వచ్చే రంగాలను మరింత సరళీకరించి, హేతుబద్ధంగా విధానాలు అమలుచేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించామని మోదీ తెలిపారు. దేశ ప్రగతికి సుపరిపాలన కీలకమైనదని, ప్రభుత్వ పరిపాలనను పౌరులకు చేరువగా తీసుకెళ్లి, తద్వారా పాలనా ప్రక్రియలో పౌరులను కూడా క్రియాశీలక భాగస్వాములుగా చేయాలన్నదే తన ఆశయమని మోదీ తెలిపారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతోనే mygov.in వంటి వెబ్‌పోర్టల్స్‌ను ప్రారంభించామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వంలో ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు పౌరులకు ఎలక్ట్రానిక్ మార్గంలో అందుబాటులోకి తెచ్చేందుకు డిజిటల్ ఇండియా పథకం దోహదపడుతుం దన్నారు. టూరిస్టుల కోసం హెల్ప్‌లైన్ దేశీయ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా పర్యాటకుల కోసం హెల్ప్‌లైన్ నంబర్(1800-111-363)ను కేంద్రం నేడు ప్రారంభించనుంది. అలాగే ‘వెల్కమ్’ కార్డును ఆవిష్కరించనుంది. వేధింపులు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు పర్యాటకులు ఈ నంబర్‌ను సంప్రదిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారు. త్వరలో దుకాణాల్లోనూ మినీ ఎల్పీజీ వినియోగదారులకు వంటగ్యాస్ (ఎల్పీజీ) సులభంగా లభ్యమయ్యేందుకు 5కేజీల మినీ సిలిండర్లను త్వరలో ఎంపికచేసిన పెట్రోల్ బంకులు, దుకాణాల్లోనూ అందుబాటులోకి తెస్తున్నారు. గురువారం జాతీయ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ఢిల్లీలో పునఃప్రారంభించారు. -
ఈశాన్యవాసుల కోసం హెల్ప్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ/గుర్గావ్: ఈశాన్య రాష్ట్రాల ప్రజలకోసం గుర్గావ్లో త్వరలో హెల్ప్‌లైన్ ను ప్రారంభిస్తామని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు పేర్కొన్నారు. నాగాలాండ్‌కు చెంది న ముగ్గురు యువకులపై బుధవారం దాడి జరిగిన నేపథ్యంలో గుర్గావ్లో శాంతిభ ద్రతల స్థితిగతులపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. దీంతోపాటు ఈశాన్యప్రాంత విద్యార్థుల బృందం ప్రతినిధులను కూడా కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ శివారు ప్రాంతాలతోపాటు గుర్గావ్లోనూ ఈశాన్యవాసులకోసం ప్రత్యేకంగా ఓ హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇందుకు తాను ఆమోదం తెలిపానన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే ఇటువంటి విద్వేషంతో కూడిన నేరాలను ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా బాధాకరమేన న్నారు. దాడి ఘటన తర్వాత గుర్గావ్ పోలీసులు చేపట్టిన చర్యలతో తాను సంతృప్తి చెందినట్లు ఆయన చెప్పారు. నిందితుల అరెస్టుయ్యారని, ఈశాన్య ప్రాంతవాసులపై దాడులు ఎక్కడ జరిగినా నిందితులను అరెస్టు చేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. పోలీసు బలగాల్ని ప్రోత్సహించడం కోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కాగా గుర్గావ్లో నాగాలండ్‌కు చెందిన ఇద్దరు యువకులపై దాడి కేసుకు సంబంధించి పోలీసులు శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేసిన సంగతి విదితమే. అంతకు ముందు బెంగుళూరులో కూడా ఇటువంటి దాడి జరిగింది. కన్నడం మాట్లాడనందుకు మిజోరం యువకుడిపై దాడి చేశారు. దాడులు అమానుషం : ఆప్ ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపై గుర్గావ్తోపాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులు అమానుషమని ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం పేర్కొంది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఆప్‌తోపాటు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించారు. ఆప్ చీఫ్ అధికార ప్రతినిధి యోగేంద్ర యాదవ్ గుర్గావ్లోని సికిందర్‌పూర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విద్యార్థిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా ఉండాలని సికిందర్‌పూర్ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈశాన్యరాష్ట్ర విద్యార్థిపై ఇలాంటి దాడులు జరగడం అవమానకరమని, ఆప్ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి సంకుచిత వైఖరి వల్ల భారతీయ సమాజంలో విపరీత ధోరణులు చోటు చేసుకొంటాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
ఎంసెట్ తొలిదశ కౌన్సెలింగ్ పూర్తి
సాక్షి, విజయవాడ : ఎంసెట్ కౌన్సెలింగ్ తొలి దశ పూర్తయింది. ఇప్పటికే విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ఎంపిక పూర్తయింది. రెండో విడత, మూడో విడతల కౌన్సెలింగ్‌ను కూడా సెప్టెంబర్ 10వ తేదీలోపు పూరిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ-సెట్ కౌన్సెలింగ్‌ను కూడా పూర్తిచేసిన అధికారులు పాలిసెట్ కౌన్సెలింగ్‌పై కసరత్తు చేస్తున్నారు. ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విజయవాడలోని మూడు హెల్ప్‌లైన్ కేంద్రాలకు 7,267 మంది, వెబ్ ఆప్షన్స్ ఎంపికకు 1, 290 మంది విద్యార్థులు హాజరయ్యారు. వెబ్ ఆప్షన్లు ఇచిన విద్యార్థుల మొబైల్ నంబర్లకు శనివారం ఎంసెట్ కన్వీనర్ పాస్‌వర్డ్‌ను పంపారు. దాని సాయంతో వెబ్సైట్లోకి ప్రవేశించి ఆప్షన్ల మేరకు కేటాయించిన కళాశాలను గుర్తించి, దానిని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలి. నగరంలోని హెల్ప్‌లైన్ సెంటర్లో దాన్ని సమర్పిస్తే ఆడ్మిషన్ నంబర్ వేసి మళ్లీ విద్యార్థులకు కాపీ అందజేస్తారు. దాన్ని తీసుకువెళ్లి ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందాల్సి ఉంటుంది.అడ్మిషన్ల నంబర్ల కేటాయింపు కోసం హెల్ప్‌లైన్ సెంటర్లకు వెళ్లాల్సిన వివరాలతో మళ్లీ అధికారులు షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. సోమవారం నుంచే ఈ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. 1 నుంచి సీట్ల కేటాయింపు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సీట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు శనివారం ఎంసెట్ కన్వీనర్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు రోజుకు 50 వేల మందికి హైల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా సీట్లు కేటాయించనున్నారు. నిర్ణయించిన షెడ్యూల్ తేదీల్లో హాజరుకాని విద్యార్థులు సెప్టెంబర్ ఐదో తేదీన ఎలాట్మెంట్ నంబర్లు తీసుకోవచ్చు 2,900 మంది ఈ-సెట్ విద్యార్థులకు ప్రవేశం మరోవైపు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ-సెట్ విద్యార్థుల ప్రవేశానికి ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల అయిన క్రమంలో 26 నుంచి నగరంలోని ఆంధ్ర లయోలా కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలల్లోని హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా సీట్ల ఎలాట్మెంట్ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 2,900 మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపు లెటర్లు కేటాయించారు. పాలిసెట్‌కు నామమాత్రంగా హాజరు ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహిస్తున్న పాలిసెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థులు నామమాత్రంగానే హాజరయ్యారు. వరుస సెలవులు రావడంతో సోమవారం కూడా కొనసాగించనున్నారు. ఇప్పటి వరకు రెండు హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా 2,850 మందికే సీట్ల ఎలాట్మెంట్ ప్రక్రియ పూర్తిచేశారు. స్పెషల్ ఫీజులు ముందే చెల్లించవద్దు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆడ్మిషన్లు పొందే సమయంలోనే స్పెషల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఆంధ్రా లయోలా కళాశాల ఎంసెట్ క్యాంపు ఆఫీసర్ శ్రీరంగం విద్యార్థులకు సూచించారు. ఎంసెట్ మొదటి కౌన్సెలింగ్ మాత్రమే ముగిసిందన్నారు. వారం వ్యవధిలో రెండు, మూడు కౌన్సెలింగ్‌లు కూడా ఉంటాయన్నారు. విద్యార్థులు అడ్మిషన్ల సమయంలోనే ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. -
న్యూఢిల్లీ నచ్చింది
దేశ రాజధానిలో తమ వారిపై దాడులు జరుగుతున్నట్టు తరచూ వార్తలు వస్తున్నా, ఈశాన్యప్రాంతవాసులు ఇక్కడికి రావడం మానడం లేదు. విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆదాయం అధికంగా ఉండడమే ఈ పరిస్థితికి కారణం. ఉన్నత విద్యావంతులు కావడం, అందంగా కనిపించడం, ఇంగ్లిష్ భాషా నైపుణ్యం, కష్టపడే మనస్తత్వం కారణంగా ఈశాన్యవాసులను కీలక ఉద్యోగాలు వరిస్తున్నాయి. న్యూఢిల్లీ: జాతి వివక్ష అధికంగా ఉన్నా, తమకు అన్నం పెడుతున్నఢిల్లీని వదిలిపెట్టేందుకు ఇక్కడి ఈశాన్యరాష్ట్రాల వాసులు సిద్ధంగా లేరు. ఈశాన్య రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువ కాబట్టి అక్కడి యువతలో చాలా మంది దేశరాజధానిని ఆశ్రయించకతప్పడం లేదు. గువాహటి నుంచి ఢిల్లీకి వచ్చి ఉద్యోగం చేసే అభిజిత్ బారువా అనే యువకుడు మాట్లాడుతూ ‘మంచి అవకాశాలు దొరికితే వేరే నగరానికి ఉపాధి కోసం వెళ్లేందుకు అభ్యంతరం లేదు. ఇక్కడ ఉద్యోగాల సంఖ్య ఎక్కువ. అందుకే వేరే ప్రాంతానికి వెళ్లాలన్న ఆలోచన ఇప్పటికీ కలగలేదు’అనిఆయన వివరించారు. అసోంలోని తీన్సుకియా నుంచి వచ్చిన సాగరికా దత్తా కూడా ఇలాగే మాట్లాడింది. ఇది తన కలల నగరమని చెప్పింది. 12వ తరగతి తరువాత గ్రాడ్యుయేషన్ కోర్సులకు తగిన ఈశాన్య రాష్ట్రాల్లో విద్యాసంస్థలు లేకపోవడంతో అక్కడి విద్యార్థులు టీనేజ్లోనే ఢిల్లీకి వస్తున్నారు. తమ బంధువులు కూడా ఇక్కడే చదువుతుండడంతో తాను కూడా ఢిల్లీకే వచ్చానని దత్తా వివరించింది. ఢిల్లీలో నివసించే ప్రతి వంద మంది ఈశాన్యవాసుల్లో 78 శాతం మంది ఏదోరకమైన జాతివివక్షను ఎదుర్కొన్న వాళ్లేనని ఈశాన్య సహాయం కేంద్రం, హెల్ప్‌లైన్ (ఎన్‌ఈఎస్‌సీహెచ్) అధ్యయనం తేల్చింది. ఈశాన్య మహిళలు తరచూ లైంగిక వేధింపుల బారినపడుతున్నారని ఇది ప్రకటించింది. జాతిని హేళన చేస్తూ వ్యాఖ్యలు, ధూషించడం, దాడి చేయడం తరచూ జరుగుతున్నాయని తెలిపింది. తాజాగా కోట్లా ప్రాంతంలో మణిపూర్ యువకుణ్ని దాడి చేసి హతమార్చిన ఘటన ఇక్కడి ఈశాన్యవాసుల్లో భయాన్ని మరింత పెంచింది. ఢిల్లీలో తమకు తరచూ చేదు అనుభవాలు ఎదురవుతున్నా, విద్య, ఉద్యోగాల పరంగా తాము ఎంతగానో అభివృద్ధి చెందుతున్నామన్న సంతోషం వీరిలో కనిపిస్తోంది. తాను ఇప్పటి వరకు జాతివివక్షను ఎదుర్కోలేదని దత్తా చెప్పింది. ‘మనకు ఉన్న స్నేహితులు, నివసించే ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారుతుంటాయి. నేను ఎప్పుడూ నా పురోగతి గురించి ఆలోచిస్తాను. ఈశాన్య రాష్ట్రాల్లో అఅవకాశాలు తక్కువ కాబట్టి ఏదో ఒక ఇతర నగరంలో స్థిరపడకతప్పదు’ అని వివరించింది. ఢిల్లీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం వల్ల యువతను సులువుగా ఆకర్షించగలుగుతోందని బోరా అన్నాడు. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, సిక్కిమ్ రాష్ట్రాల యువత మొదట్లో బీపీఓ ఉద్యోగాల్లో బాగా కనిపించేవారు. ఇప్పుడు వీళ్లు మీడియా, ఆతిథ్యరంగం, వాణిజ్య ప్రకటనల కంపెనీల్లోనూ మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఉన్నత విద్యావంతులు కావడం, ఇంగ్లిష్ భాషా నైపుణ్యం, కష్టపడే మనస్తత్వం కారణంగా ఈశాన్యవాసులను ఉద్యోగాలు వరిస్తున్నాయి. ఈ ఎనిమిది రాష్ట్రాలకు చెందిన దాదాపు రెండు లక్షల మంది యువత ఢిల్లీలో పనిచేస్తున్నట్టు అంచనా. వీరిలో దాదాపు సగం మంది మహిళలు. నాగలాండ్ మహిళ కసర్ మాట్లాడుతూ ‘మా కుటుంబం ఇక్కడే స్థిరపడడంతో ఢిల్లీలో చదవడం సులువయింది. మా కుటుంబం ఇక్కడ లేకపోయినా నేను ఢిల్లీకే వచ్చేదాణ్ని. ఇక్కడ అవకాశాలు చాలా ఎక్కువ. తమ న్యాయవాదులుగా ఈశాన్యవాసులను నియమించుకోవడానికి చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తాయి’ అని వివరించింది. ఢిల్లీలో తమ వారిపై దాడులు జరుగుతున్నట్టు తరచూ వార్తలు వస్తున్నా, ఈశాన్యప్రాంతవాసులు ఇక్కడికి రావడం మానడం లేదు. -
ఇరాక్ లోని తెలంగాణ పౌరుల సమాచారం కోసం హెల్ప్ లైన్!
హైదరాబాద్: ఇరాక్‌లో ఉన్న తెలంగాణవారి సమాచారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రత్యేక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. ఇరాక్ లో ఉన్న తెలంగాణ ప్రాంతవాసుల వివరాల కోసం సెక్రటేరియట్లో అధికారులు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంత వాసుల సమాచారం కోసం 040 -23220603, 94408 54433 ఫోన్ నంబరుపై సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఇరాక్ లో ఉన్న భారతీయులకు సహాయం అందించడంపై భారత ప్రభుత్వం కూడా రాయబార కార్యాలయంతో చర్చలు జరుపుతున్నట్టు అధికారులు వెలడించారు. ఇరాక్ లో ఉన్న ఉద్యోగులు, నర్సులకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ అన్నారు. ఇరాక్ లో సున్ని, షియా తెగలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
హిమాచల్ ప్రదేశ్ ఘటనపై హెల్ప్ లైన్
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో విద్యార్థులు కొట్టుకుపోయిన సంఘటనాస్థలికి అధికారులను పంపామని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. హెల్ప్ లైన్ నంబర్లు: 040-23202813, 9440815887 హిమాచల్ ప్రదేశ్ హెల్ప్ లైన్: 01902224455 హిమాచల్ ప్రదేశ్ డీజీపీ నం: 09418033177 కులు ఎస్పీ నంబర్: 09418484949 -
నల్లధనంపై నిఘా
న్యూఢిల్లీ:ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ పార్టీలు/అభ్యర్థులు అక్రమంగా నగదు/ నల్లధనాన్ని తరలించకుండా నిరోధించడానికి ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. దీనికితోడు అక్రమ నగదు తరలింపుల గురించి అందే ఫిర్యాదులపై విచారణ కోసం ఢిల్లీ ఐటీశాఖ ప్రధాన కార్యాలయంలోనే ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రచారం సందర్భంగా నల్లధనం ప్రవాహాన్ని అరికట్టాలన్న ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాల మేరకే ఈ చర్య తీసుకున్నారు. అక్రమ నగదును అరికట్టడానికి హెల్ప్‌లైన్, కంట్రోల్‌రూమ్ 24 గంటలూ పనిచేస్తాయి. ఐటీశాఖ జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారి వీటిని పర్యవేక్షిస్తారు. నల్లధనాన్ని తరలించే వారిపై చర్యలు తీసుకోవడం, తనిఖీలు నిర్వహించడానికి ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని కూడా నియమించారు. అక్ర మ నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడం, పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు లంచాలు ఇవ్వకుండా చూడడానికి ఈసీ ఢిల్లీలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ విభాగాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఇది వరకు పలుచోట్ల దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు, మద్యం సీసాలను స్వాధీనం చేసుకుంది. ముందుజాగ్రత్తగా పలువురు నేరగాళ్లను అరెస్టు చేయించిం ది. లెసైన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 10న నిర్వహించే పోలింగ్ కోసం శనివారం నోటి ఫికేషన్ వెలువడింది. దీని జారీతో మొదలయ్యే నామినేషన్ల పర్వం ఈ నెల 22 వరకు కొనసాగుతుంది. అదే రోజు నామినేషన్లను పరిశీలిస్తారు. మార్చి 26 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ. ఎన్నికల సంఘం అధికారి ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ ఢిల్లీలోని తొమ్మిదింటిలో రెండు జిల్లాల్లో నామినేషన్ల దాఖలుకు ఏర్పాట్లు చేయలేదని వివరణ ఇచ్చారు. మధ్య ఢిల్లీ, నైరుతి ఢిల్లీ జిల్లా అధికారులను జిల్లా ఎన్నికల అధికారులుగా నియమించలేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ రెండు జిల్లాల్లోని ప్రాంతాలు నాలుగు లోక్‌సభ స్థానాల కిందకు వస్తున్నందున వారికి ఎన్నికల బాధ్యతలు అప్పగించలేదని పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రతిపాదనకు ఓకే లోక్‌సభ ఎన్నికలకు ఓటింగ్ సమయాన్ని పెంచాలన్న ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించింది. ఓటింగ్ ప్రక్రియను ఉదయం ఒక గంటల ముందుగా ఆరంభించి సాయంత్రం ఒక గంట ఆలస్యంగా ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. ఉదయం, సాయంత్రం ఎన్నికల సమయాన్ని ఒక గంట చొప్పున పొడగించడం వల్ల ఏప్రిల్ 10న ఢిల్లీలోని పోలింగ్‌బూత్‌లలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ సమయం సాయంత్రం ఐదు గంటలకు ముగిసిన తరువాత కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రంలో వరుసల్లో నిలబడి ఉండడంతో ఐదు గంటల తరువాత కూడా ఓటింగ్ కొనసాగించవలసి వ చ్చింది. ఓటర్ల సంఖ్య పెరగడంతో పాటు ఓటింగ్ శాతం పెరిగిందని గుర్తించిన ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి విజయ్‌దేవ్ లోక్‌సభ ఎన్నికల కోసం ఓటింగ్ సమయాన్ని రెండు గంటలు పెంచవలసిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. లోక్‌సభ ఎన్నికలు వేసవిలో జరుగుతున్నాయి కాబట్టి ఓటర్లు మధ్యాహ్నాని కన్నా ఉదయం, సాయంత్రం వేళల్లో ఓటు వేయడానికి ఎక్కువగా వస్తారని దేవ్ అన్నారు. తొలిరోజు 8 నామినేషన్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం ఢి ల్లీ నుంచి శనివారం ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు కాగా, మిగతా వాళ్లు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు. చాందినీచౌక్ లోక్‌సభ స్థానానికి రెండు, ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ కోసం నాలుగు, తూర్పు, న్యూఢిల్లీ లోక్‌సభ స్థానాల కోసం ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు అందాయని సంఘం అధికారులు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి ఆశుతోష్ ముద్గిల్, నయాదౌర్ పార్టీ అభ్యర్థి ధన్‌రాజ్ చౌహాన్ చాందినీచౌక్‌లో పోటీకి నామినేషన్లు సమర్పించారు. నేఫ్సింగ్ రాజ్‌పుత్, దినేశ్పాల్ సింగ్, ఎస్‌యూసీఐ అభ్యర్థి నరేంద్ర శర్మ, అగర్ జనపార్టీ అభ్యర్థి ఏకే అగర్వాల్ ఈశాన్య ఢిల్లీ కోసం నామినేషన్లు వేశారు. తూర్పుఢిల్లీలో పోటీ కోసం రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి మంజు చిబ్బర్, స్వతంత్ర అభ్యర్థి మహారాజ్ కుమార్ న్యూఢిల్లీ స్థానం పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. -
ఆపడం సాధ్యమే!
ఎన్ని కౌన్సెలింగ్ సెంటర్లు, హెల్ప్లైన్లు ఉన్నా అవన్నీ... సహాయం కోరిన వాళ్లకు, నా గోడు వినే వాళ్లు కావాలని అడిగిన వాళ్లకు మాత్రమే సేవలందించగలుగుతాయి. కనీసం అలా చెప్పుకునే ప్రయత్నం చేయకుండా ప్రాణాలు తీసుకునే వారిని ఆపగలగాలి. ఆ పని చేయగలిగింది కుటుంబ సభ్యులు, స్నేహితులు, రూమ్మేట్లు మాత్రమే. ఎంత గుంభనమైన వారైనా సరే ‘నేను బతికి ప్రయోజనం ఏముంది! నేను ఎవరికీ అవసరం లేదు’ వంటి ఏదో ఒక సంకేతాన్ని విడుదల చేస్తారు. ఆ సంకేతాన్ని హెచ్చరికగా గుర్తించి జాగ్రత్త పడాలి. ఈ దశలో ఉన్న వారిని ‘నువ్వు చనిపోవాలనుకుంటున్నావా’ అని సూటిగా ప్రశ్నిస్తే చాలు. ‘నీకెలా తెలుసు’ అంటూ మనసులోని బాధనంతా బయటపెట్టేస్తారు. అప్పుడు పొందే ఓదార్పు, ధైర్యంతో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకుంటారు. - సుచరిత, సైకియాట్రిస్ట్, రోష్నీ నిర్వాహకురాలు సాంత్వన కావాలి..! జీవితం బాధాకరంగా అనిపించడం తమను ఎవరూ పట్టించుకోవడం లేదనిపించడం జీవించడం అనవసరం, మరణించడం మేలనిపించడం మనసు విప్పి మాట్లాడడానికి ఎవరూ లేరనిపించడం మనసులోని బాధను చెప్పుకోవడానికి వినేవాళ్లు ఉంటే బావుణ్ను అనిపించడం... ఇలాంటప్పుడు వినే మనిషి కావాలి. ఆ ఆత్మీయతను పంచుతోన్న సంస్థలు అనేకం ఉన్నాయి. న్యూ బోయినపల్లిలోని శ్రీభవానీ మహిళా మండలి, మాదాపూర్‌లోని మాక్రో ఫౌండేషన్, బండ్లగూడలోని గ్రోత్ అకాడమీ, బషీర్‌బాగ్‌లోని అమృతాకంజానీ, సింథీ కాలనీలోని రోష్నీ హెల్ప్‌లైన్ అలాంటివే. శిక్షణ పొందిన వాలంటీర్లు ఇక్కడ ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తారు. ఆత్మీయుల్లా ధైర్యం చెప్తారు. వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఎలాంటి బాధలోనైనా జీవించడానికి ఒకదారి తప్పకుండా ఉంటుంది. ఆ దారి చూపించి ఉత్సాహం నింపుతారు. వీరిని టెలిఫోన్‌లోనూ, స్వయంగానూ సంప్రదించవచ్చు. -
విదేశీయుల కోసం ‘హెల్ప్‌లైన్’
న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో విదేశీయులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో వారి భద్రత కోసం ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా 24 గంటల హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థి హత్య, ఆఫ్రికన్ మహిళలపై దాడి వంటి సంఘటనలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. విదేశీయుల సంరక్షణార్థం ఒక సీనియర్ అధికారి ఆధ్వర్యంలో 24 గంటలూ పనిచేసేలా . +91-8750871111 నంబర్ హెల్ప్‌లైన్ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కాగా, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (న్యూఢిల్లీ పరిధి) ముఖేష్ కుమార్ మీనా ఈ హెల్ప్‌లైన్‌ను పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. ప్రతి మూడు నెలల కొకసారి ఆయన ఆయా విదేశీయులు నివసించే అసోసియేషన్స్ తోనూ, సంబంధిత కమిషన్ అధికారులతోనూ సమావేశాలు నిర్వహిస్తారు. -
నర్సరీ అడ్మిషన్లలో సమస్యలుంటే కాల్ చెయ్యండి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై ఎలాంటి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా హెచ్చరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా తో కలిసి విద్యాశాఖ మంత్రి హెల్ప్‌లైన్ నంబర్‌ను సోమవారం ప్రారంభించారు. ప్రైవేటు పాఠశాల లకు సంబంధించి, ముఖ్యంగా నర్సరీ అడ్మిషన్లలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తల్లిదండ్రులు వెంట నే 27352525 నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని వారు పేర్కొన్నారు. హెల్ప్‌లైన్ నంబర్ ప్రారం భం అనంతరం మొదటి కాల్ కేజ్రీవాల్ చేశారు. అయితే నంబర్ చాలాసార్లు బిజీ రావడం గమనార్హం. నర్సరీలో చిన్నారులను చేర్చుకునేందు కు డొనేషన్లు తీసుకున్నట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను విద్యాశాఖ మంత్రి మనీష్‌సిసోడియా హెచ్చరించారు. నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి అన్ని వార్డులను విధిగా బోర్డుల్లో వెల్లడించాలని ఆయన సూచించారు. నర్సరీ అడ్మిషన్లలో ఎలాంటి ఇబ్బందులున్నా తల్లిదండ్రులు వెంటనే సంబంధిత విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. ఆ అధికారి నుంచి సరైన స్పందన లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ హెల్ప్‌లైన్ నంబర్‌కి ఫోన్ చేయవచ్చన్నారు. హెల్ప్‌లైన్ నంబర్‌కి వచ్చే ఫిర్యాదులకు సం బంధించి రోజువారీగా నివేదికలు సేకరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.‘హెల్ప్‌లైన్ ఎలా పనిచేస్తుందో పరిశీలించేందుకు నేను కూడా రోజుకు కనీ సం పదిమార్లు కాల్చేస్తూ ఉంటా’అని తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు www.edudel.nic.in,వెబ్‌సైట్‌ను సైతం ప్రారంభించారు. కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరి భద్రత ఘజియాబాద్‌లోని కౌశాంబిలోని గిర్నార్ టవర్ వద్ద అపార్ట్మెంట్లో ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరి కింద 14 మంది పోలీసులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిం ది. ‘సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి గల ఇద్దరు వ్యక్తిగత భద్రత అధికారులను నియమించాం. వీరికి ఎనిమి ది మంది భద్రత సిబ్బంది సహకరిస్తారు. హెడ్ కానిస్టేబుల్ నేతృత్వంలోని నలుగురు వ్యక్తిగత సిబ్బందితో ఓ ఎస్కార్ట్ వాహనం ఉంటుంద’ని స్థానిక నిఘా విభాగ సర్కిల్ అధికారి కమ్లేశ్ బహదూర తెలిపారు. ఈ నెల ఎనిమిదిన కౌశాంబిలో ఆప్ కార్యాలయంలో హిందూ రక్ష దళ్ కార్యకర్తలు దాడి చేయడంతో ఐదుగురు పోలీసులను కూడా అక్కడ నియమించిన సంగతి తెలిసిందే. భూషణ్ మీడియా సమావేశానికి అంతరాయం నగరంలోని ఇండియా ఉమెన్ ప్రెస్ కార్ప్స్(ఐడబ్ల్యూపీసీ) వద్ద ఆప్ నాయకుడు ప్రశాంత్ భూషణ్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశానికి అంతరాయం కలిగింది. నర్మదా బచావో ఆందోళన్ సభ్యులతో కలిసి మాట్లాడేందుకు ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తాగా పేరు చెప్పుకొని కాన్ఫరె న్స్ రుమ్లోకి వచ్చి ప్రశాంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశం నుంచే ప్రశాంత్ భూషణ్‌ను కేజ్రీవాల్ తోసెయ్యాలన్నారు. ఆ వెంటనే ఆప్ కార్యకర్తలు అతడిని బయటకు పంపించివేసి ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. అయితే ఆప్ నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. జమ్మూ, కాశ్మీర్‌లోని సాయుధ దళంపై భూషణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
ఇది కాల్ సెంటర్ ప్రభుత్వమా?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం కాల్ సెంటర్, హెల్ప్‌లైన్‌గా మారిందని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముకేశ్ శర్మ విమర్శించారు. శనివారం నగరంలో నిర్వహించిన జనతా దర్బార్‌లో ప్రజల రద్దీ ఎక్కువగా ఉంద న్న సాకుతో మధ్యలోనే బయటకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ సామాన్యుడికి ఏమీ చేయలేరని అన్నారు. విద్యుత్ కోతలు, అవినీతి, నర్సరీ అడ్మిషన్ల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక హెల్ప్లైన్లు ప్రారంభించడంపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వం కాల్ సెంట ర్, హెల్ప్‌లైన్‌గా మారిందన్నారు. ప్రజలకు సేవ చేస్తామని అధికారంలోకి వచ్చిన ఆప్ ఇప్పుడు వారి సమస్యలను గాలికొదిలేస్తుందని ఆరోపించారు. కేజ్రీవాల్ వల్ల తమ సమస్యలు తీరుతాయని భావించిన సామాన్యుడికి చుక్కెదురైందని విమర్శించారు. -
‘హెల్ప్‌లైన్’ ఎఫెక్ట్ చిక్కిన ఖాకీలు
న్యూఢిల్లీ: అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రారంభించి మూడురోజులైనా కాలేదు.. అప్పుడే ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. ఓ వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడి న నేరానికి ఈ ఇద్దరూ కటకటాలపాలయ్యారు. వ్యాపారి నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ వీరి ఆట కట్టించింది. నిందితులను ఈశ్వర్‌సింగ్, సందీప్కుమార్గా గుర్తించారు. వివరాల్లోకెళ్తే... జనక్‌పురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తు న్న ఈశ్వర్, సందీప్ ‘హఫ్తా’(బలవంతపు వసూళ్లు) ఇవ్వాల్సిందిగా ఓ వ్యాపారిని బెదిరించారు. దీంతో సదరు వ్యాపారి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, ఆ వివరాలను అవినీతి నిరోధక విభాగానికి అందజేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఈశ్వర్, సందీప్‌లను అరెస్టు చేశారు. వ్యాపారి నుంచి రూ.3,000 తీసుకున్నట్లుగా తమ దర్యాప్తులో తేలిందని, గత వారం కూడా వీరిద్దరు ఇలాగే వసూళ్లకు పాల్పడినట్లు వెల్లడైందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్ కూడా ధ్రువీకరించారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశామని, స్వెటర్ల వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లుగా వారిపై వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయన్నారు. ఇదిలాఉండగా పార్లమెంట్ స్ట్రీట్‌లోని ఓ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ కూడా లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందిందని, అయితే ప్రస్తుతం సదరు నిందితుడు పరారీలో ఉన్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్టు చేస్తామన్నారు. సులభంగా ఉండే హెల్ప్‌లైన్ నంబర్ 1031ను శుక్రవారం ప్రకటించామని, శనివారం 11,952 ఫిర్యాదులు అందాయని చెప్పారు. అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారని, 20 కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. -
హెల్ప్‌కు ‘లైన్’!
సాక్షి, న్యూఢిల్లీ:అవినీతిపై ఢిల్లీవాసుల పోరు మొదలైంది. కొన్నేళ్లుగా అవినీతి అధికారుల అక్రమాలతో విసిగివేసారి పోయి ఉన్న సామాన్యులు తమ ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మొదటి ఏడుగంటల్లోనే హెల్ప్‌లైన్‌కు సుమారు 3,900 ఫిర్యాదులు అందాయంటే నగరంలో అవినీతి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో మూడోదైన అవినీతి నిరోధానికి తీసుకున్న ఈ చర్యపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పిల్లల చదువులు, పింఛన్లు, విద్యుత్ తదితర శాఖల పనితీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఢిల్లీవాసులకు ఈ ‘హెల్ప్‌లైన్’ ఒక అస్త్రంగా ఉపయోగపడనుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ హెల్ప్‌లైన్ ప్రభావపూరితంగా పనిచేయడం ప్రారంభించిందని చెప్పారు. ఢిల్లీవాసులు ప్రతిఒక్కరూ అవినీతి నిరోధక ఇన్స్పెక్టర్లుగా మారిపోతున్నారని ఆయన అభినందించారు. మొదటి రోజున మొదటి ఏడు గంటల్లో 3900 కాల్స్ వచ్చాయని, ఫోన్‌చేసిన 800 మందితో మాట్లాడిన సలహాదారులు వాటిలో 53 కాల్స్ తీవ్రమైన ఫిర్యాదులని గుర్తించారని కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఈ 53 మందిలో 38 మంది మాత్రమే స్టింగ్ ఆపరేషన్ నిర్వహించడానికి అంగీకరించారని, 15 మంది నిరాకరించారని ఆయన చెప్పారు. స్టింగ్ నిర్వహించడానికి అంగీకరించినవారిలో కొందరు ఇప్పటికే స్టింగ్ నిర్వహించి అవినీతి నిరోధక విభాగానికి ఆడియో టేపులను అప్పగించారని కేజ్రీవాల్ తెలిపారు. ఈ స్టింగ్ ఆపరేషన్ల నాణ్యత కూడా అద్భుతంగా ఉన్నట్లు అధికారులు తనకు చెప్పారని ఆయన వివరించారు. తమకు టేపులందిన కేసులపై అధికారులు చర్యలు ప్రారంభించారని చెప్పారు. లంచగొండులు.. ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. ఢిల్లీవాసులకు సులభంగా గుర్తుండేందుకు నాలుగంకెల హెల్ప్‌లైన్ నంబర్‌ను శుక్రవారం సాయంత్రం వరకు ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ హెల్ప్‌లైన్‌లో 30 లైన్లు ఉంటాయి. అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ నంబర్‌ను కేజ్రీవాల్ బుధవారం సాయంత్రం ప్రకటించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్.దిలీప్‌కుమార్‌ను అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌కు సలహాదారుగా నియమించారు. దిలీప్‌కుమార్ గతంలో అవినీతి నిరోధక విభాగాధిపతిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ప్రభుత్వ సంస్థల అవినీతిని బట్టబయలుచేయడంకోసం 50కి పైగా స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించారు. అవినీతిపరులైన అధికారులను గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చేవారు తమను లంచమడిగిన అధికారిమాటలను రికార్డు చేసుకుని సాక్ష్యంగా తేవాలని ఆయన అప్పట్లోనే చెప్పేవారని తెలుస్తోంది. నర్సరీ అడ్మిషన్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రుల కోసం డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పటికే హెల్ప్‌లైన్ నంబర్ ప్రకటించింది. అడ్మిషన్ ప్రక్రియ గురించి తల్లిదండ్రులడిగే ప్రశ్నలకు ఈ హెల్ప్‌లైన్ సమాధానమిస్తుంది. ఫిర్యాదు చేయదలచినవారు పిర్యాదులను నమోదుచేయవచ్చు. ఈ ఫిర్యాదులను సంబంధిత విద్యాధికారులకు పంపుతారు. 011-27352525 నంబరు కలిగిన ఈ హెల్ప్‌లైన్ జనవరి 13 నుంచి పనిచేయవచ్చని విద్యా విభాగం తెలిపింది. కాల్‌సెంటర్ ఆపరేటర్లు ఈ హెల్ప్‌లైన్ నడుపుతారు. ప్రస్తుతం ఈ ఆపరేటర్లకు శిక్షణ ఇస్తున్నారు. -
అశోక్‌నగర్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించండి
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలోని అశోక్‌నగర్, గోపాల్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ప్రవీణ్ పాటిల్ ఒక ఫ్లెక్సీని తయారు చేసి స్థానిక రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌కు అందజేశారు. ఈ ప్రాంతాల్లో పాఠశాలలు, ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు, ప్యాకింగ్‌కు సంబంధించిన చిన్న గోదాముల వల్ల రోడ్లపై నిత్యం వాహనాలు, ట్రక్కులు నిలుపుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. -
అశోక్‌నగర్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించండి
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలోని అశోక్‌నగర్, గోపాల్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ప్రవీణ్ పాటిల్ ఒక ఫ్లెక్సీని తయారు చేసి స్థానిక రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌కు అందజేశారు. ఈ ప్రాంతాల్లో పాఠశాలలు, ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు, ప్యాకింగ్‌కు సంబంధించిన చిన్న గోదాముల వల్ల రోడ్లపై నిత్యం వాహనాలు, ట్రక్కులు నిలుపుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. -
శశిధర్ కోసం లైఫ్‌లైన్
-
విమలకోసం లైఫ్‌లైన్
-
జ్యోతీశ్వర్ కోసం లైఫ్ లైన్
-
రాము కోసం లైఫ్ లైన్
-
లైఫ్ లైన్ ఫర్ ఎల్లయ్య