సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీల్లో మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసింది. గురువారం సచివాలయంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హెల్ప్‌లైన్ నంబర్ 155209ను ప్రారంభించారు. అంగన్‌వాడీల్లో మెరుగైన సేవలను అందించడం కో సం ఈ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించామన్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రతీ అధికారి రోజూ అంగన్‌వాడీ కేంద్రాలకు ఫోన్ చేసి అక్కడి సమస్యలు, పనితీరు తెలుసుకుని సమస్యలను పరిష్కరించాల ని సూచించారు. ‘ఇంటింటికీ అంగన్‌వాడీ బుక్ పోస్టర్’, ‘అంగన్‌వాడీ సేవకుల కరదీపిక’లను ఆవిష్కరించారు. హెల్ప్‌లైన్‌తో జిల్లాల వారీగా ఫీడ్ బ్యాక్ తీసుకోవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ చెప్పారు. ఈ హెల్ప్‌లైన్ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు.
నేను మీ మంత్రిని మాట్లాడుతున్నా..
‘‘అమ్మా.. నేను మీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును మాట్లాడుతున్నా. చెప్పండి సార్.. మీకు ఏ విధంగా సహాయం చేయగలను కాల్ సెంటర్ నుంచి సమాధానం. ఇదీ సింగరేణి–6 అంగన్‌వాడీ సెంటరా అమ్మా. అవును సార్. మీ అంగన్‌వాడీ టీచర్‌కు ఫోన్ కనెక్ట్ చేస్తారామ్మా.
ఒకే సార్... అమ్మా మీ సెంటర్‌లో ఎంత మంది పిల్లలు, ఎంత మంది గర్భిణీలున్నారు.?.. సార్ 26 మంది పిల్లలు, 45 మంది తల్లులు ఉన్నారు సార్.. ఆ వివరాలను మాకు వాట్సాప్ పంపుతారామ్మా’’ ఇదీ అంగన్‌వాడీ హెల్ప్‌లైన్ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, అంగన్‌వాడీ టీచర్ మధ్య జరిగిన సంభాషణ.
Comments
Please login to add a commentAdd a comment