tummala nageswararao
-
తుమ్మల హ్యూహం అర్థం కావడంలేదంటున్న అనుచరులు
-
జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతాం
సాక్షి, వేంసూరు: కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ను గెలిపిస్తే జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచుతామని, సత్తుపల్లి నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. టీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మువ్వా విజయ్‌బాబు, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ శుక్రవారం వేంసూరులో ప్రచారం నిర్వహించారు. వేంసూరు నుంచి మర్లపాడు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మర్లపాడులో జరిగిన బహిరంగ సభలో మాజీ మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి నామాను గెలిపించాలని కోరారు. అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్లో పోరాడానని, తనను ఆశీర్వదించి గెలిపించి ఖమ్మం పార్లమెంట్ గెలుపును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా అందించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త నామా నాగేశ్వరరావు గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మర్లపాడు సర్పంచ్ మందపాటి వేణుగోపాల్‌రెడ్డి, వెల్ది జగన్మోహన్రావు, అట్లూరి సత్యనారాయణరెడ్డి, బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు, బండి శ్రీనివాసరెడ్డి, నాగళ్ల లక్ష్మీనారాయణ, గొర్ల ప్రభాకర్‌రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్‌రావు, గాయం రాంబాబు, దొడ్డ చెన్నకేశవరెడ్డి, సర్పంచ్‌లు ఎండీ ఫైజుద్దీన్, పొట్రు అనంతరామయ్య పాల్గొన్నారు. నామాను గెలిపించాలి సత్తుపల్లి: అందరూ కలిసికట్టుగా నామా నాగేశ్వరరావును గెలిపించి సీఎం కేసీఆర్‌కు ఖమ్మం ఎంపీ సీటును కానుకగా ఇద్దామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం రాత్రి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి గంగారం నుంచి సత్తుపల్లి రింగ్ సెంటర్ వరకు మోటారు సైకిల్ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్నారు. అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందాయని.. అభివృద్ధి శరవేగంగా జరిగిందని.. రూ.18వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జిల్లాకు అదృష్టమని పేర్కొన్నారు. రైతు బిడ్డగా తనను పార్టీలకు అతీతంగా ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు. -
నామా గెలుపు చారిత్రక అవసరం
సాక్షి, ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు గెలుపు జిల్లాకు చారిత్రక అవసరమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. సోమవారం టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు సందర్భంగా ఖమ్మంలో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వారు ప్రసంగించారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ను గెలిపించుకొని సీఎం కేసీఆర్ దగ్గర జిల్లా గౌరవాన్ని నిలుపుకోవాలన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి బాటలో నిలిపేందుకు నామా గెలుపు అవసరమని, కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో టీఆర్ఎస్ గెలుపుకై శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ గెలుపుబావుట ఎగురవేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో జిల్లా పెద్దలతో కలిసి నామ గెలుపుకు పని చేస్తానన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లు వచ్చేలా ప్రచారాన్ని ముమ్మరం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పూజలు చేసి, అమరులకు నివాళులర్పించి.. టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తన స్వగృహంలో ప్రత్యేక పూజలు చేసి, నామినేషన్ పత్రం నింపి ప్రదర్శనగా దాఖలుకు బయలుదేరారు. ముందుగా పెవిలియన్ గ్రౌండ్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బైపాస్‌రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకొని విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి సభాస్థలికి చేరుకొని నాయకులతో కలిసి ప్రసంగించారు. సభా స్థలి నుంచి ప్రదర్శనగా నామినేషన్ దాఖలు కేంద్రం వద్దకు చేరుకున్నారు. -
ఎంపీ టికెట్ తేలేది నేడే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంటే.. జిల్లాలో మాత్రం ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరనే ఆతృతే ఇంకా కొనసాగుతోంది. విభిన్న రాజకీయ పరిస్థితులున్న జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై గట్టి కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు కొలిక్కి వచ్చినా.. ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక అంశం ఒక పట్టాన తేలడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలుకు ముహూర్తం ముంచుకొస్తున్నా.. జిల్లాలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఆయా పార్టీల్లో ఉత్కంఠ కొద్దిరోజులుగా కొనసాగుతూనే ఉంది. నామినేషన్ వేసేందుకు రెండు రోజులే గడువు ఉండడంతో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు గురువారం ఖమ్మం నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినా.. ఖమ్మం నుంచి ఎవరిని పోటీ చేయించాలనే అంశంపై ఇక్కడ నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే నేతలు ఎవరో దాదాపు తేటతెల్లమైనా.. ఖమ్మం విషయంలో మాత్రం పడిన చిక్కుముడి మాత్రం వీడని పరిస్థితి. ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు చివరి నిమిషంలోనైనా తమకు టికెట్ వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, కాంట్రాక్టర్ గరికపాటి వెంకటేశ్వరరావు(ఆర్టీసీ) వంటి పేర్లు ప్రచారంలో ఉండగా.. రెండు రోజులుగా టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేరు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ అధినేత ఎవరి వైపు మొగ్గు చూపుతారు.. ఈ స్థానం ఎవరిని వరిస్తుందనే అంశం పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఒకే తరహా గోప్యత.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి ఒకే తరహా గోప్యతను పాటిస్తుండడంతోపాటు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ప్రకటించాకే.. తమ అభ్యర్థిని ప్రకటించాలనే నియమం విధించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రాష్ట్రస్థాయిలో ఖమ్మం నియోజకవర్గం మరోసారి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నట్లయింది. ఇక రెండు రోజులే నామినేషన్ దాఖలుకు గడువు ఉండడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు తుది కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం మధ్యాహ్నం వరకు ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరో అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ ఎవరికి లభిస్తుందనే అంశంపై రోజుకో రీతిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అనేక మంది ముఖ్య నేతలు అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పారిశ్రామికవేత్త వద్దిరా>జు రవిచంద్ర, కాంగ్రెస్ నాయకుడు రాయల నాగేశ్వరరావు తదితరులు దరఖాస్తు చేసుకోగా.. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానం వద్ద పట్టుబట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో తాజాగా రేణుకాచౌదరి, పోట్ల నాగేశ్వరరావు పేర్లు సామాజిక వర్గం నేపథ్యంలో అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను మూడు రోజుల క్రితమే ప్రకటించిన కాంగ్రెస్.. వ్యూహాత్మకంగానే ఖమ్మం అభ్యర్థి ప్రకటన అంశాన్ని వాయిదా వేస్తోందని.. టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారయ్యాక జరిగే పరిణామాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ప్రకటించడం వల్ల ప్రయోజనం ఉంటుందనే భావనలో ఉన్నట్లు ఆయా పార్టీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీదీ అదే వ్యూహం.. ఇక బీజేపీ సైతం ఇదే తరహా వ్యూహంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశస్థాయిలో బీజేపీకి సానుకూల పవనాలున్న దృష్ట్యా వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే వ్యూహంతో ఆ పార్టీ ఉన్నట్లు ప్రచారమవుతోంది. ఇప్పటికే సీపీఎం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు బి.వెంకట్‌ను పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. సీపీఎంకు సీపీఐతోపాటు జనసేన, బీఎస్పీ వంటి పార్టీలు మద్దతు ఇస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే సీపీఐ తన వైఖరిని మాత్రం ఇంకా రాష్ట్రస్థాయిలో స్పష్టం చేయలేదని.. ఒకటి, రెండు రోజుల్లో సీపీఐ తమ పార్టీవిధానాన్ని వెల్లడించే అవకాశం ఉందని రాజ కీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లా లో రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన తెలుగుదేశం పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే సాహ సం చేయలేని పరిస్థితి నెలకొందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ శ్రేణులు లోక్‌సభ ఎన్నికలపై వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఇక ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న నామా నాగేశ్వరరావు జిల్లాలోని టీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఇప్పటికే సమావేశమై.. తనకు సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది. -
‘పెట్టుబడి’ కౌలురైతులకే దక్కాలి
తిరుమలాయపాలెం : రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. వారి ఇబ్బందులను తొలగించేందుకు నేరుగా ఉపయోగపడేలా రూప కల్పన చేసిన పథకం ‘రైతుబంధు’ అని, భూమిని నమ్ముకుని కష్టపడుతున్న కౌలు రైతులకు పెట్టు బడి సహాయం దక్కేలా భూ యజమానులు సహకరించాలని రాష్ట్రరోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని తెట్టెలపాడులో రైతుబంధు చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలు, కరువు కాటకాలతో చితికిపోయిన రైతులను ఆదుకునేందుకే కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని చెప్పారు. ఇప్పటికిప్పుడు కౌలు రైతులను గుర్తించడం కష్టమని, భూ యజమానులు ఎవరికి కౌలుకు ఇస్తారో తెలియదని, అందుకే భూమి ఉన్నవారికే సాయం అందేలా నిర్ణయం తీసుకున్నామని వివరించారు. కౌలు రైతులు సంఘటితంగా ఉంటే భూ యజమానులు దిగిరాక తప్పదన్నారు. గ్రామంలోని కాలనీలకు సీసీరోడ్లు, మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తెట్టెలపాడు నుంచి గోపాలపురం వరకు బీటీ రోడ్డు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నగేష్, ఆర్డీఓ పూర్ణచందర్రావు, ఎంపీపీ కొప్పుల అశోక్, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడిఓ వెంకటపతిరాజు, మండల వ్యవసాయాధికారి శరత్‌బాబు, సర్పంచ్ ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పుసులూరి నరేందర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మద్దినేని మధు, తిరుమలాయపాలెం సొసైటీ చైర్మన్ పుసులూరి పుల్లయ్య, జడ్పీ కోఆప్షన్ సభ్యు డు జియాఉద్దిన్, గ్రామ సర్పంచ్ సోమనబోయిన లింగయ్య, ఎంపీటిసి ఎల్లమ్మ, సొసైటీ డైరెక్టర్ కొండబాల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఎ.ఆంజనేయులు పాల్గొన్నారు. -
హలో.. అంగన్వాడీ కేంద్రమా?
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసింది. గురువారం సచివాలయంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హెల్ప్‌లైన్ నంబర్ 155209ను ప్రారంభించారు. అంగన్వాడీల్లో మెరుగైన సేవలను అందించడం కో సం ఈ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించామన్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతీ అధికారి రోజూ అంగన్వాడీ కేంద్రాలకు ఫోన్ చేసి అక్కడి సమస్యలు, పనితీరు తెలుసుకుని సమస్యలను పరిష్కరించాల ని సూచించారు. ‘ఇంటింటికీ అంగన్వాడీ బుక్ పోస్టర్’, ‘అంగన్వాడీ సేవకుల కరదీపిక’లను ఆవిష్కరించారు. హెల్ప్‌లైన్‌తో జిల్లాల వారీగా ఫీడ్ బ్యాక్ తీసుకోవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ చెప్పారు. ఈ హెల్ప్‌లైన్ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. నేను మీ మంత్రిని మాట్లాడుతున్నా.. ‘‘అమ్మా.. నేను మీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును మాట్లాడుతున్నా. చెప్పండి సార్.. మీకు ఏ విధంగా సహాయం చేయగలను కాల్ సెంటర్ నుంచి సమాధానం. ఇదీ సింగరేణి–6 అంగన్వాడీ సెంటరా అమ్మా. అవును సార్. మీ అంగన్వాడీ టీచర్‌కు ఫోన్ కనెక్ట్ చేస్తారామ్మా. ఒకే సార్... అమ్మా మీ సెంటర్లో ఎంత మంది పిల్లలు, ఎంత మంది గర్భిణీలున్నారు.?.. సార్ 26 మంది పిల్లలు, 45 మంది తల్లులు ఉన్నారు సార్.. ఆ వివరాలను మాకు వాట్సాప్ పంపుతారామ్మా’’ ఇదీ అంగన్వాడీ హెల్ప్‌లైన్ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, అంగన్వాడీ టీచర్ మధ్య జరిగిన సంభాషణ. -
భూసేకరణలో జాప్యం వల్ల కాదు..: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన జాతీయ రహదారుల్లో ఒక్క ప్రాజెక్టు కూడా భూసేకరణలో జాప్యం వల్ల రద్దు కాలేదని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈమేరకు సమాధానమిచ్చారు. జాతీయ రహదారుల విభాగానికి రూ.4,400 కోట్ల విలువైన 21 ప్రాజెక్టులు దక్కగా రూ.3 వేల కోట్లతో 319 కి.మీ. పనులు జరుగుతున్నాయని, ఎన్హెచ్ఏఐకి రూ.8 వేల కోట్ల విలువైన పనులు కేటాయించారని తెలిపారు. ఎన్హెచ్ఏఐ పనులకు 6 నెలల్లో భూసేకరణ పూర్తి చేస్తామన్నారు. 28 నిర్మాణాల సేకరణలో జాప్యంతో చర్లపల్లి రోడ్డును వెడల్పు చేసే పని మూడేళ్లుగా పెండింగ్‌లో ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సభ దృష్టికి తెచ్చారు. -
మురుగు మాయమైంది..: తుమ్మల
ఖమ్మం (అర్బన్) : హైదరాబాద్ ట్యాంక్ బండ్‌ను తలదన్నేలా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ అతి తక్కువ కాలంలో అభివృద్ధి చేయడం అభినందనీయమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఆదివారం ట్యాంక్ బండ్‌ను ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ చెరువుకు ఇవ్వని విధంగా లకారం చెరువుకు నగరంలో రూ.23 కోట్లతో అభివృద్ధి చేశామని అన్నారు. మిషన్ కాకతీయ పథకంలో రూ 17.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఒకప్పుడు మురుగు నీటితో కంపు కొట్టిన చెరువు నేడు కృష్టానది జలాలతో కలకలలాడుతోందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ చెరువు మొత్తం కబ్జాలకు గురైందని అన్నారు. ఎప్పుడైనా ఇంత అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అజయ్‌కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి వెంటబడి నిధులు సమకూర్చుకున్నారని అన్నారు. నగరంలోనే ఉన్న అటవీ భూమి 400 ఎకరాల్లో కూడా పార్కుగా నగర వాసులకు ఆహ్లదం అందించాలనే తలంపుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయించడం జిల్లా ప్రజల ఆదృష్టం అన్నారు. కష్టాల్లో ఉన్న గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేందుకు మంత్రి తుమ్మల ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు. హైదరాబాద్ తలదన్నేలా త్వరలో ఖమ్మంలో కూడా రింగ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. జాతీయ పార్టీలను నమ్ముకుంటే ఢీల్లిలో బానిసలం అవుతమని అన్నారు. గాంధీ భవన్లో కూర్చోని సర్వే చేసుకోవడం కాదని.., ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలన్నారు. జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. రఘునాథపాలెం మండలంలో సాగు నీరు అందించేందుకు ఉపయోగపడే బుగ్గవాగునీటిని అందించడానికి అవసరమైన కాల్వల నిర్మాణానికి భూసేకరణ ఇతర పనులకు అవసరమైన రూ 37 కోట్లును కొద్ది రోజుల్లో మంజూరు చేస్తానని హరీష్‌రావు అన్నారు. ప్రూట్ మార్కెట్ ఏర్పాటుకు కావాల్సిన స్థలం ఉంటే వెంటనే నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. మురుగు మాయమైంది..: తుమ్మల ఒకప్పుడు మురుగు కూపంగా ఉన్న లకారం చెరువును నేడు సుందరీకరణగా తీర్చిదిద్దామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాడు ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తనకు మిగిలిన పనులు చేయడానికి సీఎం కేసీఆర్ మళ్లీ అవకాశం కల్పించడం ఆదృష్టంగా ఉందని అన్నారు. ఖమ్మం నగరంలోని సాగర్ ప్రధాన కాల్వ కట్టలకు ఖాళీ స్థలాల్లో కూడా బ్యూటిపి కేషన్ చేసి నగర వాసులకు అందిస్తామన్నారు. 180 కోట్లుతో రింగ్‌రోడ్డు నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికే నిధులు కేటాయించారని, త్వరలోనే నిర్మాణం చేసి చూపిస్తామన్నారు. కాళేశ్వరం తరహాలనే గోదావరి నీళ్లను జిల్లాలో సస్యశ్యామలం చేసే విధంగా పనులన్ని యుద్ధ ప్రాతిపధికన చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం :పొంగులేటి అభివృద్ధి సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదారాబాద్ కంటే ఖమ్మం అభివృద్ధికి కంకణం కట్టుకుని సాధిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ఒక మోడల్ జిల్లాగా నిలుస్తుందని గుర్తు చేశారు. అందరి సహకారంతోనే..: అజయ్ సీఎం కేసీఆర్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తన్నీరు హరీష్‌రావు, కేటీఆర్‌ల కృషితోనే ఖమ్మం అభివృద్ధి సాధ్యమవుతోందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. లకారం ట్యాంక్ బండ్ నిర్మాణానికి నాడు మంత్రి తుమ్మల గుణపం వేశారని, అదే చెరువులో నేడు బోటులో షికా>రు చేశారని గుర్తు చేశారు. ఇంకా కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో 6 దశాబ్దాలుగా జరిగని అభివృద్ధిని మూడు సంవత్సరాల్లో సాధించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ది సంస్థ చైర్మన్ బేగ్ తదితరులు మాట్లాడారు. ఈ సభలో జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, మేయర్ డాక్టర్ పాపాలాల్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఎమ్మెల్యేలు బానోత్ మధన్‌లాల్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, కమిషనర్ సంధీప్కుమార్ షూ, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, కార్పొరేటర్లు చావా నారాయణరావు, కర్నాటి కృష్ణ, బిక్కసాని ప్రశాంతిలక్ష్మి, కొత్తపల్లి నీరజ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, సీతారామ ప్రాజెక్టు సీఈ సుధాకర్, ఇరిగేషన్ ఎస్ఈ ధర్మ,ఈఈలు నరిసింహరావు, వెంకటేశ్వరరెడ్డి, డీఈ ఆర్జన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ నివాసంలో తేనేటి విందు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు తన్నీరు హరీష్‌రావు, తుమ్మలనాగేశ్వరరావులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఆదివారం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన అల్పాహారం, తేనేటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి ఇటీవల నిర్మించిన నూతన నివాసాన్ని పరిశీలించారు. -
‘సీతారామ’కు అటవీ అనుమతులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన వైల్డ్ లైఫ్ అనుమతుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు తుమ్మల, టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌లు మంగళవారం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్‌ను ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు. ప్రాజెక్టుకు అవసరమైన మొదటి దశ అనుమతులు వచ్చాయని, వైల్డ్ లైఫ్ అనుమతుల మంజూరుకు సంబంధించి వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు తుమ్మల మీడియాకు తెలిపారు. అనంతరం తుమ్మల కేంద్ర మంత్రి గడ్కరీని కలసి తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్రంలోని 3 వేల కి.మీ రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించడంపై గెజిట్ ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. -
మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యమేదీ?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో మహిళల అభివృద్ధి, శిశు సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే స్వల్ప పెరుగుదల ఉన్నా.. పెరిగిన ధరలను పోల్చుకుంటే ఈ బడ్జెట్‌తో పథకాల కొనసాగింపు కష్టమన్నారు. శుక్రవారం సచివాయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కింద రూ.3 వేల కోట్లు కేటాయించారని, ఈ పథకం కింద పౌష్టికాహార పరిమాణం పెంచడంతో నిధులు సరిపోవన్నారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం బాధకరమన్నారు. కేంద్రం నిధులు భారీగా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ మెరుగ్గా అమలు చేస్తోందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు నూతన వేయింగ్ మిషన్లు, స్మార్ట్ఫోన్లు, సూపర్వైజర్లకు ట్యాబ్‌లు సమకూర్చాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి 8 కొత్త సఖి కేంద్రాలను కేంద్రం మంజూరు చేసిందన్నారు. ఇందులో సిద్దిపేట, మంచిర్యాల, నాగర్ కర్నూల్, జనగామ జిల్లాల్లో సొంత భవనాలున్న కేంద్రాలతో పాటు, యాదాద్రి, కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి జిల్లాల్లో అందుబాటులో ఉన్న భవనాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వాటితో కలిపి మొత్తం 17 జిల్లాలకు సఖి కేంద్రాలు మంజూరయ్యాయని తెలిపారు. కొత్తగా ఏర్పడిన 21 జిల్లాల్లో ఐసీడీఎస్ సెల్ ఏర్పాట్లకు అనుమతి లభించిందన్నారు. సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్ విజయేందిర, బాలలు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు. -
న్యాక్‌ను ‘ఎక్సలెన్స్’గా తీర్చిదిద్దాలి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)ను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందులో శిక్షణ పొందిన వారికి దేశవిదేశాల్లో ఉద్యోగాలు పొందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన న్యాక్ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ..యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏజెన్సీగా న్యాక్ ను తీర్చిదిద్దాలన్నారు. జిల్లాల్లో న్యాక్ కేంద్రాలను పటిష్టం చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు 12% పెంపు, ఎన్టీఏ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యం, ఉద్యోగులకు రవాణాభత్యం పెంపు అంశాలను ఆయన ప్రస్తావించారు. సమావేశంలో న్యాక్ కో చైర్మన్ హోదాలో సీఎస్ ఎస్పీ సింగ్, ప్రధాన కార్యదర్శి హోదాలో రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, డీజీ భిక్షపతి, రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ లింగయ్య, సాగునీటి శాఖ ఈఎన్సీ నాగేందర్, బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ సుగుణాకర్‌రావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
వందసార్లు తిరిగితే..
జాతీయ రహదారులకు అనుమతి విషయంలో కేంద్ర ప్రభు త్వం చుట్టూ తిరగాల్సి వస్తోందని, వందసార్లు తిరిగి వినతి పత్రాలిస్తే ఒక్క రోడ్డుకు అనుమతి ఇస్తోందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై టీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నకు తుమ్మల సమాధానమిస్తూ రహదారులకు కేంద్రం అనుమతి ఇస్తోందే తప్ప డీపీఆర్, ఎస్టిమేట్లకు సంబంధించిన అంశాలను పెండింగ్‌లో పెడుతోందన్నారు. ఎన్హెచ్ఏఐ సీఈ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు బదిలీ చేస్తే వేగంగా ఈ ప్రక్రియ నడుస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 2014కు ముందు 2,522 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండగా తెలంగాణ ప్రభుత్వం చొరవతో అవి 3,153 కిలోమీటర్లకు పెరిగాయన్నారు. -
దివ్యాంగుల సంక్షేమానికి రూ.33 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్‌కు అదనంగా రూ.33 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వికలాంగుల కోసం రూ.37 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. దివ్యాంగుల కోసం రూ.7 కోట్లతో ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, కర్రలు, క్యాలిపర్స్, కృత్రిమ అవయవాలు, వాహనాలను అందించనున్నట్లు తెలిపారు. బధిరులకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. దివ్యాంగుల కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, టాయిలెట్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా కేంద్రంలో వయోవృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు ప్రారంభించాలన్నారు. స్వయం ఉపాధి పథకం కింద దివ్యాంగులకు రుణ సదుపాయంలో సబ్సిడీ గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు పెంచుతున్నామని తెలిపారు. వివాహం కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు రూ.50 వేల చొప్పున 2,120 మంది దివ్యాంగులకు బహుమతి అందించాలని నిర్ణయించారు. దివ్యాంగుల ఆటల పోటీలకు ప్రతి జిల్లాకు రూ.లక్ష కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మూడో శనివారం ‘స్వరక్ష’ అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకత పెరగాలని, ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నట్లు చెప్పారు. మహిళలకు రక్షణ మరింత కట్టుదిట్టం చేస్తున్నామని, మహిళల అక్రమరవాణాను శాశ్వతంగా నిరోధించాలనే లక్ష్యంతో ప్రతి మూడో శనివారం రాష్ట్రమంతా ‘స్వరక్ష’డే పేరిట అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పా రు. డిజిటల్ ఇండియాలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు ట్యాబ్‌లు ఇస్తామని చెప్పారు. కేంద్రాల్లో పిల్లల నమోదు, వయసు, భోజన పథకాలు ట్యాబ్‌ల ద్వారానే పర్యవేక్షిస్తామన్నారు. సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్ విజయేందిర, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికుల రుణం తీర్చుకుంటాం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)ను గెలిపించిన కార్మికులకు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో సారథిగా నిలిచిన ఎంపీ కవితకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి వారి రుణం తీర్చుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనంతగా 9 డివిజన్లు టీబీజీకేఎస్ కైవసం చేసుకోవడం ప్రభుత్వ పనితీరుకు కార్మికులిచ్చిన బహుమానం అన్నారు. టీబీజీకేఎస్ ప్రభంజనం ముందు ప్రతిపక్ష కూటమితో కూడిన జాతీయ సంఘాలు తోకముడిచాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని, దీన్ని కార్మికులు సైతం విశ్వసించారని పేర్కొన్నారు. కార్మికుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
‘ఉత్తమ్ మూర్ఖుడా..నాయకుడా?’
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. ఉత్తమ్ నాయకుడా, మూర్ఖుడా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తమ్ మూర్ఖుడయితేనే భూసేకరణకు తొందరేమిటని మాట్లాడతారన్నారు. భూసేకరణకు కచ్చితంగా తొందర ఉంటుందని, అందుకే ఆదివారమైనా అసెంబ్లీ పెడుతున్నామని తుమ్మల అన్నారు. ఎపుడు ఏ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే కనీస రాజకీయ పరిజ్ఞానం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల శ్రీరంగ నీతులు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని, లుచ్చా, లఫంగి పాలనలో ఎపుడైనా ఇప్పుడిస్తున్న ధరలు రైతుల పంటల కిచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ, ఇప్పుడు తమ హయాంలో పంటలకు ఇచ్చిన మద్దతు ధరలపై చర్చకు సిద్ధమా అని సవాల్ తుమ్మల విసిరారు. ఖమ్మం మిర్చి యార్డుపై జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇలాంటి దాడులు సరి కావన్నారు. రైతు సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలన్న తపన ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. అధికారం పోయిందనే దుగ్దతోనే విపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. రైతు బాగుండడం విపక్షాలకు ఇష్టం లేనట్టుందని వ్యాఖ్యానించారు. పిచ్చివాళ్ళు కూడా ప్రతిపక్ష నేతల్లాగా నీచంగా ప్రవర్తించరని అన్నారు. ఖమ్మం మిర్చియార్డులో శుక్రవారం జరిగిన ఘటన ప్రతిపక్షాల పిచ్చికి పరాకాష్ట అని ఎత్తిపొడిచారు. మార్కెట్లో రాళ్లు విసిరింది ముమ్మాటికీ కాంగ్రెస్, టీడీపీ మూఠాలేనని ఆరోపించారు. సీసీ టీవీ ఫుటేజిలో ఎవరు దాడి చేశారో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. రైతులు కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి, పసుపు వంటి వాణిజ్య పంటలకు మద్దతు ధరలు ప్రకటించే విధానం లేదని చెప్పారు. అయినప్పటికీ కేంద్రాన్ని పదే పదే ఈ పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్ రావు కోరుతూనే ఉన్నారని వెల్లడించారు. కేంద్రం ఎందుకో ఈ పంటలపై నిర్లిప్తంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటికీ మిర్చి పంటకు అధికంగా ధర ఇస్తోంది తెలంగాణాయేనని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ లాంటి వారికి వ్యవసాయంపై అవగాహన లేదు, ఆయన మిర్చి ధరలకు కేంద్రానికి సంబంధం లేదంటున్నారని చెప్పారు. మరి మిగతా పంటలన్నిటికీ మద్దతు ధరలు ప్రకటిస్తోంది కేంద్ర ప్రభుత్వమా?పాకిస్తానా ? అని నిలదీశారు. సాగునీటి శాఖ రంగ సలహా దారు విద్యాసాగర్ రావు మరణం తెలంగాణకు తీరని లోటని ఆయన తెలిపారు. ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక నిమిషం మౌనం పాటించారు. ప్రెస్మీట్లో ఆయనతోపాటు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి , విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
తుమ్మల ఖాళీచేసిన ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్
హైదరాబాద్ : రోడ్లు, భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 26 వరకూ నామినేషన్ల స్వీకరిస్తారు. అలాగే నామినేషన్ల స్వీకరణకు తుది గడువు అక్టోబర్ 3వ తేదీ. అక్టోబర్ 17న ఎన్నిక జరిపి అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఫరీదుద్దీన్‌ను ఆపార్టీ ఇప్పటికే ప్రకటించింది. కాగా ఎమ్మెల్సీగా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున రికార్డు మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. -
ఎమ్మెల్సీ పదవికి తుమ్మల రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తుమ్మల తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు పంపగా, ఆయన ఆమోదించారు. ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున తుమ్మల రికార్డు మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గత శాసనసభ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్లో చేరిన తుమ్మలకు ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ, మంత్రి పదవులను కట్టబెట్టారు. ఇటీవల పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల ఆ స్థానం నుంచి అధికార టీఆర్ఎస్ తరపున బరిలో దిగి నియోజకవర్గ మెజార్టీతో విజయం సాధించారు.