సింగరేణి కార్మికుల రుణం తీర్చుకుంటాం | tummala nagwswara rao about Singareni Identity Society Selection | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికుల రుణం తీర్చుకుంటాం

Published Sat, Oct 7 2017 2:23 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

tummala nagwswara rao about Singareni Identity Society Selection - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌)ను గెలిపించిన కార్మికులకు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో సారథిగా నిలిచిన ఎంపీ కవితకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి వారి రుణం తీర్చుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనంతగా 9 డివిజన్లు టీబీజీకేఎస్‌ కైవసం చేసుకోవడం ప్రభుత్వ పనితీరుకు కార్మికులిచ్చిన బహుమానం అన్నారు. టీబీజీకేఎస్‌ ప్రభంజనం ముందు ప్రతిపక్ష కూటమితో కూడిన జాతీయ సంఘాలు తోకముడిచాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు.

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడం కేసీఆర్‌ వల్లే సాధ్యమవుతుందని, దీన్ని కార్మికులు సైతం విశ్వసించారని పేర్కొన్నారు. కార్మికుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement