సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన జాతీయ రహదారుల్లో ఒక్క ప్రాజెక్టు కూడా భూసేకరణలో జాప్యం వల్ల రద్దు కాలేదని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈమేరకు సమాధానమిచ్చారు.
జాతీయ రహదారుల విభాగానికి రూ.4,400 కోట్ల విలువైన 21 ప్రాజెక్టులు దక్కగా రూ.3 వేల కోట్లతో 319 కి.మీ. పనులు జరుగుతున్నాయని, ఎన్‌హెచ్‌ఏఐకి రూ.8 వేల కోట్ల విలువైన పనులు కేటాయించారని తెలిపారు. ఎన్‌హెచ్‌ఏఐ పనులకు 6 నెలల్లో భూసేకరణ పూర్తి చేస్తామన్నారు. 28 నిర్మాణాల సేకరణలో జాప్యంతో చర్లపల్లి రోడ్డును వెడల్పు చేసే పని మూడేళ్లుగా పెండింగ్‌లో ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ సభ దృష్టికి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment