భూమి తీసుకుంటే సరైన పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: పౌరులు ఆస్తిని కలిగి ఉండే హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ప్రజల నుంచి భూమిని సేకరిస్తే చట్టప్రకారం వారికి సరైన పరిహారం చెల్లించాలని ఆదేశించింది. తగిన పరిహారం చెల్లించకుండా వారికి ఆస్తిని దూరం చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది.
బెంగళూరు–మైసూరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ విషయంలో 2022 నవంబర్‌లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
తీర్పు వెలువరించింది. రాజ్యాంగ(44 సవరణ) చట్టం–1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారని ధర్మాసనం వెల్లడించింది. అయినప్పటికీ సంక్షేమ రాజ్యంలో అది మానవీయ హక్కు అని ఉద్ఘాటించింది. ఆస్తి హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఏ కింద రాజ్యాంగ హక్కేనని వెల్లడించింది. ఆర్టికల్ 300ఏ ప్రకారం.. ప్రజలను వారి ఆస్తి నుంచి దూరం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాలను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment