జాతీయ రహదారులకు అనుమతి విషయంలో కేంద్ర ప్రభు త్వం చుట్టూ తిరగాల్సి వస్తోందని, వందసార్లు తిరిగి వినతి పత్రాలిస్తే ఒక్క రోడ్డుకు అనుమతి ఇస్తోందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై టీఆర్‌ఎస్ సభ్యుల ప్రశ్నకు తుమ్మల సమాధానమిస్తూ రహదారులకు కేంద్రం అనుమతి ఇస్తోందే తప్ప డీపీఆర్, ఎస్టిమేట్లకు సంబంధించిన అంశాలను పెండింగ్‌లో పెడుతోందన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ సీఈ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు బదిలీ చేస్తే వేగంగా ఈ ప్రక్రియ నడుస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 2014కు ముందు 2,522 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండగా తెలంగాణ ప్రభుత్వం చొరవతో అవి 3,153 కిలోమీటర్లకు పెరిగాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment