ఇరాక్ లోని తెలంగాణ పౌరుల సమాచారం కోసం హెల్ప్ లైన్!
హైదరాబాద్: ఇరాక్‌లో ఉన్న తెలంగాణవారి సమాచారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రత్యేక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. ఇరాక్ లో ఉన్న తెలంగాణ ప్రాంతవాసుల వివరాల కోసం సెక్రటేరియట్‌లో అధికారులు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంత వాసుల సమాచారం కోసం 040 -23220603, 94408 54433 ఫోన్ నంబరుపై సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
ఇరాక్ లో ఉన్న భారతీయులకు సహాయం అందించడంపై భారత ప్రభుత్వం కూడా రాయబార కార్యాలయంతో చర్చలు జరుపుతున్నట్టు అధికారులు వెలడించారు. ఇరాక్ లో ఉన్న ఉద్యోగులు, నర్సులకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ అన్నారు. ఇరాక్ లో సున్ని, షియా తెగలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.