
మీ టికెట్ యాప్‌ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
‘మీ టికెట్’ యాప్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. టెక్నాలజీ సాయంతో నిపుణులను భాగస్వాములను చేస్తూ పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామన్నారు. తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ (ఈఎస్డీ) రూపొందించిన ‘మీ టికెట్’యాప్‌ను గురువారం సచివాలయంలో శ్రీధర్‌బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ని రకాల టికెట్ బుకింగ్స్‌ను ఒకే ప్లాట్ ఫాం పైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించామన్నారు.
భవిష్యత్తులో ఇదే తరహాలో మరిన్ని యాప్‌లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ‘ఈ యాప్‌లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లను బుక్ చేసుకోవచ్చు.
పర్యాటకులు ఎంచుకున్న లొకేషన్‌కు సమీప ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా యాప్‌లో ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఈ యాప్ ను చాలా సులువుగా వినియోగించుకోవడంతో పాటు యూపీఐ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు. ఇతర ప్లాట్‌ఫాంల మాదిరిగా ఈ యాప్ లో అదనంగా ఎలాంటి చార్జీలను వసూలు చేయం’అని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మీ సేవ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ డా.జి.మల్సూర్, జూపార్క్స్ డైరెక్టర్ డా.సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment