ticket
-
ప్రజల ముంగిటకు పౌరసేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. టెక్నాలజీ సాయంతో నిపుణులను భాగస్వాములను చేస్తూ పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామన్నారు. తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ (ఈఎస్డీ) రూపొందించిన ‘మీ టికెట్’యాప్‌ను గురువారం సచివాలయంలో శ్రీధర్‌బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ని రకాల టికెట్ బుకింగ్స్‌ను ఒకే ప్లాట్ ఫాం పైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించామన్నారు.భవిష్యత్తులో ఇదే తరహాలో మరిన్ని యాప్‌లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ‘ఈ యాప్‌లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లను బుక్ చేసుకోవచ్చు.పర్యాటకులు ఎంచుకున్న లొకేషన్‌కు సమీప ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా యాప్‌లో ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఈ యాప్ ను చాలా సులువుగా వినియోగించుకోవడంతో పాటు యూపీఐ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు. ఇతర ప్లాట్‌ఫాంల మాదిరిగా ఈ యాప్ లో అదనంగా ఎలాంటి చార్జీలను వసూలు చేయం’అని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మీ సేవ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ డా.జి.మల్సూర్, జూపార్క్స్ డైరెక్టర్ డా.సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
‘చిల్లర’ పొరపాట్లు.. పెద్ద శిక్షలు!
టికెట్ జారీ యంత్రం (టిమ్) ద్వారా కండక్టర్ విధులను కూడా నిర్వహించే డ్రైవర్ అతను. బస్సు నడుపుతుండగా రిజర్వేషన్ చేయించుకొని తదుపరి స్టాప్‌లో ఎక్కాల్సిన ప్రయాణికుడు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ మాట్లాడుతుండగా ఫొటో తీసిన ఓ ప్రయాణికుడు దాన్ని సోషల్ మీడియాలో ఉంచడంతో డ్రైవర్‌ను ఉన్నతాధికారులు తొలుత సస్పెండ్ చేసి ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఇంటి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ సస్పెండ్ అయిన చరిత్ర ఆయనకు ఉందని.. అందుకే తొలగించాల్సి వచ్చిందనేది అధికారుల మాట.ఒకేసారి నలుగురు ప్రయాణికులు ఎక్కారు. ఆ తొందరలో పొరపాటున పురుష ప్రయాణికుడికి కండక్టర్ జీరో టికెట్ (మహాలక్ష్మి పథకంలో మహిళలకు జారీ చేయాల్సిన టికెట్) జారీ చేశాడు. తదుపరి స్టాప్‌లో చెకింగ్ సిబ్బంది తనిఖీ చేసి కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దాని ఆధారంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కావాలనే జీరో టికెట్ జారీ చేసి టికెట్ చార్జీ రుసుము తీసుకున్నాడన్నది తనిఖీ సిబ్బంది ఆరోపణ.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ‘చిల్లర’కారణాలతో గత మూడేళ్లలో వందలాది మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఎన్నిసార్లు వేడుకున్నా (అప్పీళ్లు) కుదరదని సంస్థ తేలి్చచెప్పడంతో వారంతా తాజాగా మూకుమ్మడిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పరిణామం ఆర్టీసీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తీవ్రంగా పరిగణిస్తూ..: ఆర్టీసీలో ‘చిల్లర’వివాదాలు కొత్తకాదు. టికెట్ల జారీలో జరిగే పొరపాట్లను సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. రూ. 10 తేడా వచి్చనా విధుల నుంచి తప్పిస్తోంది. ఇక డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని సైతం తొలగిస్తోంది. మూడేళ్లుగా వివిధ కారణాలతో ఏకంగా 600 మందికి ఉద్వాసన పలికింది. అయితే వారంతా డిపో మేనేజర్ మొదలు ఎండీ వరకు అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో గత నెలలో అప్పీళ్ల మేళా నిర్వహించింది. వివిధ కోణాల్లో వారి కేసులను సమీక్షించి 180 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. మిగతా 420 మందిని మాత్రం పక్కనపెట్టేసింది.దీంతో వారంతా సంస్థ తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. వేతన సవరణ, పాత బకాయిలు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లింపు సహా వివిధ డిమాండ్లపై నిత్యం కారి్మకులు గొంతెత్తుతున్న వేళ 420 మంది రోడ్డెక్కడం ఆర్టీసీకి తలనొప్పిగా మారింది. ఉద్వాసనకు గురైన వారి వాదన ఓ రకంగా ఉంటే అధికారుల మాట మరోరకంగా ఉంటోంది. వారిలో ఎవరి వాదన సరైందో తేలాల్సి ఉంది.వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ‘టిమ్’లో టికెట్ ప్రింట్ కాకపోవడం వల్ల పెన్నుతో టికెట్ నంబర్ రాసే క్రమంలో చేసిన పొరపాటుకు ఓ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. టిమ్ యంత్రం వాడకంలో చిన్న పొరపాట్లు చేసిన మరికొందరిని తప్పించారు. చిన్నచిన్న సమస్యలు, చిల్లర విషయాలపై ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా ఉద్యోగాలు తీసేస్తే ఎలా? ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు కూలీలుగా మారుతున్నారు. అలా వారం క్రితం ఓ మాజీ కండక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. – ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ సిబ్బంది బృందం ప్రతినిధి రాజేందర్ ఊరికే ఉద్యోగాలు తొలగించం.. ఆర్టీసీ కారి్మకులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వారి సంక్షేమానికే ప్రయతి్నస్తాం తప్ప వారి ఉద్యోగాలు తొలగించాలని చూడం. ఓ తప్పు చేసినట్లు తేలితే వివిధ కోణాల్లో సమీక్షించడంతోపాటు ఆ ఉద్యోగి గత చరిత్రను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఒకట్రెండు సార్లు తప్పు చేస్తే హెచ్చరించి వదిలేస్తాం. తప్పును పునరావృతం చేస్తే వేటు వేస్తాం. మద్యం సేవించి విధులకు వచ్చే డ్రైవర్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటాం. – ఓ ఆర్టీసీ అధికారి మాట -
గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్ సర్వీస్ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..!
భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 13 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి. కానీ ఒక రైలు మాత్రం గత 75 ఏళ్లుగా ప్రయాణికులకు ఉచిత సర్వీస్‌ని అందిస్తుంది. టిక్కెట్ లేకుండా ఫ్రీగా ఈ రైలులో ప్రయాణించొచ్చు. ఇలాంటి రైల్వే సర్వీస్ కూడా ఉందా..? ఇంతకీ ఏ ట్రైయిన్ ఈ ఉచిత సర్వీస్‌ని అందిస్తుంది. ఇది నిజమేనా అంటే..ఇలా 75 ఏళ్లుగా ఉచిత సర్వీసులందిస్తున్న ఏకైక రైలు భాక్రా నంగల్ రైలు. ఇది నంగల్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లోని భక్రా మధ్య నడుస్తుంది. చెప్పాలంటే సుందరమైన సట్లెజ్ నది, శివాలిక్ కొండల మీదుగా వెళ్తోంది. ఈ రైలుని భాక్రానంగల్ డ్యామ్ నిర్మించే నిమిత్తం కార్మికులను తరలించడానికి ఉపయోగించేవారు. ఈ రైలు 1948 నుంచి పనిచేస్తుంది. ఇక 1953లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న డీజిల్ ఇంజన్లతో ఈ రైలుని అత్యాధునికంగా మార్చారు అధికారులు. ఈ రైలులోని సీట్లు కూడా నాటి రైళ్లులో ఉండే విధానాన్ని గుర్తుకుతెస్తుంది. ఇది మన సుదీర్ఘ రైల్వే చరిత్రకు ప్రతిబింబంగా నిలిచిన రైలు కావడంతో ఉచిత సర్వీస్‌ను అందించాలని నిర్ణయించారు. నిజానికి ప్రతిగంటకు ఈ రైలుకి సుమారు 18 నుంచి 20 లీటర్ల ఇంధనం ఖర్చు అవ్వుతుంది. అలాగే భక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు(బీబీఎంబీ) నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఛార్జీలు వసూలు చేయాలని భావించినా..మన సుదీర్ఘ రైల్వే వ్యవస్థకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ రైలులో ప్రయాణికులకు ఉచిత సర్వీస్ అందించడమే సముచితమని నిర్ణయించారు అధికారులు. అందువల్లే ఈ రైలు ఎక్కాలంటే టిక్కెట్ తీసుకోవాల్సిన పనిలేదు. ప్రయాణికులందరికీ ఉచితంగానే సర్వీస్ అందిస్తోంది. ప్రతిరోజూ 800 మందికి పైగా ఈ రైలును ఉపయోగిస్తున్నారు. చాలామంది సందర్శకులకు ఇది ఓ అద్భుతమైన రైలు ప్రయాణంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రైలు నడిచే మార్గంలో కనిపించే అద్భుతమైన భాక్రా-నంగల్ డ్యామ్, శివాలిక్ కొండలు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. సర్వీస్:ప్రతి రోజు ఉదయం 7:05 గంటలకు, రైలు నంగల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి 8:20 గంటలకు భాక్రా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నంగల్ నుంచి మధ్యాహ్నం 3:05 గంటలకు మరొక ట్రిప్‌కు బయలుదేరుతుంది. సాయంత్రం 4:20 గంటలకు భాక్రా రైల్వేలో ప్రయాణీకులను దింపుతుంది. (చదవండి: ఈ రాజుల విచిత్రమైన నమ్మకాలు, క్రేజీ ఆలోచనలు వింటే విస్తుపోతారు..!) -
బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ సందడి
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఉపాధ్యాయ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు, పట్టభద్రుల కోటాలో ఒక ఎమ్మెల్సీ ఆరేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఖాళీ అయ్యే స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బరిలో నిలించేందుకు బీఆర్ఎస్ నుంచి ఔత్సాహికులు ఇప్పటి నుంచే సందడి చేస్తున్నారు. ఎన్నికలు జరిగే స్థానాల్లో ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో.. ఆశావహులు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల పేరిట జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటూ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పట్టణాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల వెంట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు పేరిట ప్రచారం చేసుకుంటున్నారు. తద్వారా తాము పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంకేతాలు పంపుతున్నారు. ఉపాధ్యాయ కోటాపై అనాసక్తి వచ్చే ఏడాది మార్చిలో ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి(పీఆర్టీయూ)తోపాటు ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి(యూటీఎఫ్) పదవీకాలం ముగుస్తుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థులను బరిలోకి దించలేదు. పీఆర్టీయూకు పరోక్షంగా మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం బీఆర్ఎస్తో పీఆర్టీయూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అందరి దృష్టి పట్టభద్రుల స్థానంపైనే ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. 13 జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉంది. ఓటర్లను చేరుకునేందుకు ఇప్పటి నుంచే ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కరీంనగర్ నుంచి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి రాజారాంయాదవ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ మద్దతుదారులను రంగంలోకి దించి ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ గతంలోనే తనకు హామీ ఇచి్చనట్టు రవీందర్ సింగ్ చెబుతున్నారు. గతంలో.. బలమున్నా బరికి దూరం మండలి పట్టభద్రుల కోటా 2019 ఎన్నికల సందర్భంలో ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్– నిజామాబాద్’నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు (మంథని), జగ్గారెడ్డి (సంగారెడ్డి) మాత్రమే ఉన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్యను కలుపుకొని 40 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసిన చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన టి.జీవన్‌రెడ్డి పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు.. కీలక నేతలందరూ ఇక్కడే ప్రస్తుతం ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 42 మంది ఎమ్మెల్యేలకుగాను కాంగ్రెస్‌కు 19, బీఆర్ఎస్కు 16, బీజేపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి.మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు), సంజయ్ (జగిత్యాల), పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ) కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కీలక నేతలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో సానుకూల వాతావరణం ఉందని, పార్టీ అవకాశమిస్తే గెలుపు సాధిస్తామనే ధీమా ఆశావహుల్లో కనిపిస్తోంది. -
మోసం చేస్తున్న మల్టీప్లెక్స్‌లు.. తెలుగు ప్రేక్షకులంటే ఎందుకంత చిన్నచూపు
-
మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. అయితే ఆ ఒక్క రోజే!
మూవీ లవర్స్‌కు ఓ గుడ్ న్యూస్. తాజాగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ ప్రియులకు అదిరిపోయే వార్త చెప్పింది. ఈనెల 20న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినిమా టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోని మల్టీప్లెక్స్‌లో ఎక్కడైనా సరే రూ.99 రూపాయలకే సినిమా చూడవచ్చని ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4వేలకు పైగా స్క్రీన్స్‌పై ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఐమ్యాక్స్, 4డీఎక్స్, రిక్లైనర్స్ వంటి ప్రీమియర్ కేటగిరీలకు ఇది వర్తించదని పేర్కొంది.ఇంకేందుకు ఆలస్యం.. మీకు నచ్చిన సినిమాను కేవలం రూ.99కే మల్టీప్లెక్స్ థియేటర్లలో చూసేయండి. అయితే ఈ ఆఫర్ కేవలం పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, మూవీటైమ్, డిలైట్ మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్ ఆ రోజు అన్ని సినిమాలతో పాటు అన్ని షోలకు వర్తిస్తుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. కాగా.. ఈ రోజుల్లో థియేటర్లలో ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూడాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ బంపరాఫర్ పట్ల సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
దేవర మూవీ క్రేజ్.. రిలీజ్‌కు ముందే రికార్డులు!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దేవర టీమ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఓవర్సీస్లో టికెట్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.రిలీజ్‌కు ఇంకా 13 రోజులు ఉండగానే ప్రీ బుకింగ్స్‌లో దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యూఎస్‌లో ప్రీమియర్ ప్రీసేల్స్‌లో దేవర మరో మైలురాయిని చేరుకుంది. దాదాపు 40 వేలకు పైగా టికెట్స్ బుకింగ్స్ అయినట్లు దేవర టీమ్ ట్వీట్ చేసింది. రెండువారాల ముందే ఈ స్థాయిలో టికెట్స్ ప్రీసేల్స్‌తో దేవర దూసుకెళ్తోంది. యూఎస్‌లో సెప్టెంబర్ 26 తేదీనే దేవర ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.(ఇది చదవండి: నిడివి గురించి అడిగిన సందీప్ రెడ్డి.. దేవర టీమ్ కౌంటర్)ఇప్పటికే అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్‌లోనూ దేవర మానియా కొనసాగుతోంది. ఈ దేశాల్లోనూ రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. కాగా.. అనిరుధ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. What do we call his mayhem? #Devara 🔥 pic.twitter.com/0rxdYD1JPJ— Devara (@DevaraMovie) September 14, 2024 -
కన్ఫర్మ్ కాని టికెట్‌తో రైలెక్కితే దించేస్తారు
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్‌తో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణిస్తే టీసీలు ఇక రైలు నుంచి దింపేస్తారు. వారు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్‌లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సిందే. ఈమేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు.. రిజర్వేషన్ క్లాస్‌కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో అదే క్లాసులో పెనాల్టీ చెల్లించి ప్రయాణించేందుకు కొనసాగుతున్న ’అనధికార’ వెసులుబాటుకు అవకాశం లేకుండా రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.ఇక ఆ టికెట్‌తో వెళ్లడం కుదరదు..రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణం చేసేందుకు ఆన్లైన్లో టికెట్ కొన్నప్పుడు.. కన్ఫర్మ్ అయితే సంబంధిత కోచ్‌లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. కానీ, ప్రయాణ సమయం నాటికి కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రద్దయి, టికెట్ రుసుము మొత్తం సంబంధీకుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. టికెటే రద్దయినందున, ఆ టికెట్ ప్రయాణానికి వీలుండదు.కానీ, రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లో కొనుగోలు చేసిన రిజర్వ్డ్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రుసుము కోసం మళ్లీ స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి రద్దు ఫామ్ పూరించి టికెట్‌తో కలిపి అందజేస్తే గానీ ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కానీ, చాలామంది ఆ కన్ఫర్మ్ కాని టికెట్‌ను రద్దు చేసుకోకుండా, సంబంధిత కోచ్ లో ప్రయాణిస్తారు. టీసీ వచ్చినప్పుడు ఫైన్ చెల్లించటం లేదా, ఎంతో కొంత ము ట్టచెప్పటం ద్వారానో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని టికెట్లు కన్ఫర్మ్ అయి, కొన్ని వెయిటింగ్ జాబితాలోనే ఉండిపోతే, అలాగే సర్దుకుని వెళ్తుంటారు. కానీ, ఇక నుంచి అలాంటి అవకాశం లేకుండా రైల్వే బోర్డు కఠినతరం చేసింది.అలా పట్టుబడితే పెనాల్టీనేటికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో దాన్ని రద్దు చే సుకోవాల్సిందే. ఒక వేళ ఆ టికెట్‌తో రిజర్వ్ డ్ కోచ్‌లో ప్రయాణిస్తూ పట్టుబడితే, వారి నుంచి రూ.250 నుంచి రూ.440 వరకు పెనాల్టీ వ సూలు చేసి, వారిని తదు పరి స్టేషన్లో దింపి, జనర ల్ క్లాస్ టికెట్ రుసుము తీ సుకుని అందులోకి మార్పి స్తారు. జనరల్ క్లాస్‌లో అవకాశం లేనప్పుడు స్టేషన్లో దించేస్తారు. ఈమేరకు జోన్లకు రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.వేలల్లో ఫిర్యాదులు.. అలా చేస్తే టీసీలపైనా చర్యలుకన్ఫర్మ్ కాని టికెట్‌తో ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా వాటితో రిజర్వ్డ్ కోచ్‌లలో.. టీసీల సహకారంతో ప్రయాణించే పద్ధతి అనధికారికంగా అమలులో ఉంది. ఇలా క్రమంగా రిజర్వ్డ్ కోచ్‌లలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూండటంతో.. రిజర్వేషన్ టికెట్‌తో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొంతమంది వారిని దబాయించి మరీ సీటులో జాగా కల్పించుకుని ప్రయాణిస్తున్నారు. మరికొందరు సీట్లలో ఏదో ఓ వైపు కూర్చుని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇలాంటి వాటిపై ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రైల్వే బోర్డుకు 8 వేల వరకు ఫిర్యాదులందినట్టు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని, రిజర్వ్డ్ కన్ఫర్మ్ టికెట్ లేని వారు ఎట్టి పరిస్థితిలో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించకుండా చూడాలని, ఒకవేళ టీసీలు వారికి వీలు కల్పించినట్టు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా, కన్ఫర్మ్ కాని టికెట్ ఉన్న వారిని జనరల్ కోచ్‌లకు తరలిస్తే, వాటిపై మరింత భారం పెరుగుతుందనీ,. ఈ నేపథ్యంలో రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
‘మహాలక్ష్మి’ దెబ్బకు కొత్త కేటగిరీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కొత్తగా రెండు కేటగిరీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. ప్రధాన పట్టణాల మధ్య సెమీ డీలక్స్ బస్సులు, నగరంలో మెట్రో డీలక్స్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు డిపోలకు చేరాయి. త్వరలో వాటిని ప్రభుత్వం ప్రారంభించనుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడంతో ఆర్టీసీకి టికెట్ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది.ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రభుత్వం.. పూర్తి మొత్తాన్ని ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేయలేకపోతోంది. ఇప్పటివరకు రీయింబర్స్ చేయాల్సిన మొత్తంలో దాదాపు రూ. 610 కోట్లు బకాయిపడింది. ఇది ఆర్టీసీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆదాయాన్ని పెంచుకొనేందుకు రెండు కొత్త కేటగిరీ బస్సులను ఆర్టీసీ రోడ్డెక్కించనుంది.ఎక్స్‌ప్రెస్ కన్నా కాస్త ఎక్కువ టికెట్ ధరతో.. ప్రస్తుతం ఆర్టీసీలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీకి బాగా ఆదాయాన్ని తెచి్చపెట్టేవి ఎక్స్‌ప్రెస్ బస్సులే. అందుకే వాటి సంఖ్య మిగతావాటి కంటే చాలా ఎక్కువ. కానీ మహిళలకు పల్లెవెలుగుతోపాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణాలను అమలు చేస్తుండటంతో సంస్థ ఆదాయం సగానికి సగం పడిపోయింది. డీలక్స్ కేటగిరీ బస్సులున్నా వాటికి ఆదరణ తక్కువే. అందుకే వాటి సంఖ్య కూడా నామమాత్రంగానే ఉంది.ఇప్పుడు ఈ రెండు కేటగిరీల మధ్య సెమీ డీలక్స్ కేటగిరీని ఆర్టీసీ ప్రవేశపెడుతోంది. ఎక్స్‌ప్రెస్ కంటే వాటిల్లో టికెట్ ధర 5–6 శాతం ఎక్కువగా, డీలక్స్ కంటే 4 శాతం తక్కువగా ఉండనుంది. ఎక్స్‌ప్రెస్ బస్సులతో పోలిస్తే సీట్లు కూడా మెరుగ్గా ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులకు డిమాండ్ ఉన్న రూట్లలో వాటిని తిప్పాలని నిర్ణయించారు. ఉచిత ప్రయాణ వసతితో బస్సుల్లో మహిళల సంఖ్య బాగా పెరిగి పురుషులకు సీట్లు దొరకటం కష్టంగా మారింది.దీంతో పురుషుల్లో దాదాపు 20 శాతం మంది ప్రత్యామ్నాయ వాహనాలకు మళ్లుతున్నారని ఇటీవల ఆర్టీసీ గుర్తించింది. ఇప్పుడు అలాంటి వారు ఈ బస్సులెక్కుతారని భావిస్తోంది. ఇక ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం ఎదురుచూసే మహిళా ప్రయాణికుల్లో 10–15 శాతం మంది ఈ బస్సులెక్కే సూచనలున్నాయని భావిస్తోంది. ఎక్స్‌ప్రెస్ కంటే తక్కువ స్టాపులు ఉండటంతో ప్రత్యామ్నాయ వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు కొందరు సెమీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంది.ఆ సర్వీసు మళ్లీ పునరుద్ధరణగతంలో సిటీలో మెట్రో డీలక్స్ కేటగిరీ బస్సులు తిరిగేవి. బస్సులు పాతబడిపోవటంతో వాటిని తొలగించారు. తర్వాత ప్రారంభించలేదు. ఇప్పుడు మళ్లీ వాటిని పునరుద్ధరించబోతున్నారు. నగరంలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉంది. దీంతో టికెట్ ఆదాయం బాగా పడిపోయింది. ఇప్పుడు మెట్రో డీలక్స్ బస్సుల్లో మహిళలు కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రద్దీ పెరిగి నిలబడేందుకు కూడా వీలు లేని సమయాల్లో కొందరు మహిళలు కూడా ఆటోలను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారు ఈ కొత్త కేటగిరీ బస్సులెక్కే వీలుంటుంది. వెరసి వీటి వల్ల ఆదాయం ఎక్కువే ఉంటుందని భావిస్తున్న సిటీ అధికారులు.. 300 బస్సులను రోడ్డెక్కించాలని భావిస్తున్నారు. -
తగ్గనున్న ప్లాట్ఫారం టిక్కెట్ ధర
భారతీయ రైల్వేలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. త్వరలో రైల్వేశాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పనుంది. ఇది ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది.ప్లాట్ఫారం టిక్కెట్ ధరను తగ్గించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్లాట్ఫారం టిక్కెట్ ధర రూ. 10గా ఉంది. దీని ధర రూపాయి తగ్గి రూ. 9 కానుంది. ఇది ప్రయాణికులకు ఊరట కలిగించనుంది. రైల్వే స్టేషన్ లోనికి వెళ్లాలంటే ఎవరైనా సరే ప్లాట్ ఫారం టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రైలు ప్రయాణానికి వెళ్లేవారు టిక్కెట్ తీసుకుంటారు కాబట్టి వారు ప్రత్యేకంగా ప్లాట్ఫారం టిక్కెట్ తీసుకోనవసరం లేదు. అయితే ఎవరినైనా రైలు నుంచి రిసీవ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్ లోనికి వెళ్లేవారు తప్పనిసరిగా ప్లాట్ఫారం టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది.ప్లాట్ఫారం టిక్కెట్ లేకుండా ఎవరైనా స్టేషన్‌లోనికి ప్రవేశిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్లాట్ఫారం టిక్కెట్ కూడా రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చే మార్గాలలో ఒకటి. ప్రస్తుతం ప్లాట్ఫారం టికెట్ ధర రూ.10. అయితే జూన్ 22న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్లాట్ఫారం టిక్కెట్లపై జీఎస్టీని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.ప్లాట్ఫారం టికెట్‌తో పాటు రిటైరింగ్ రూమ్, బ్యాటరీతో నడిచే కారు తదితర సేవల రుసుము నుంచి కూడా జీఎస్టీని తొలగించారు. దీంతో ఇప్పటి వరకూ ఉన్న 5శాతం ఉన్న జీఎస్టీ భారం ప్రయాణికులకు తగ్గనుంది. ఫలితంగా ప్లాట్ఫారం టిక్కెట్ ధర రూ. 10 నుంచి రూ. 9కి చేరనుంది. -
అజంగఢ్ పోటీని ఆసక్తికరంగా మార్చిన మాయావతి!
యూపీలోని అజంగఢ్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలో రాజకీయంగా చాలా ముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది. బహుజన్ సమాజ్ పార్టీ తాజాగా ఈ స్థానం నుంచి తన అభ్యర్థిని నిలబెట్టింది. బీఎస్పీ మహిళా అభ్యర్థి సబిగా అన్సారీ అజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఈ సీటుపై ముక్కోణపు పోరు నెలకొంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 45 ఏళ్ల తర్వాత అజంగఢ్ నియోజకవర్గం నుంచి ఓ మహిళా అభ్యర్థి బరిలో నిలిచారు.అజంగఢ్ నుంచి మహిళా అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీఎస్పీ.. ఈ సీటుకు జరుగుతున్న పోరును మరింత ఆసక్తికరంగా మార్చింది. 1978లో మొహసినా కిద్వాయ్ ఇక్కడ నుండి కాంగ్రెస్ టిక్కెట్‌పై నాటి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా అజంగఢ్ స్థానం నుండి మహిళా అభ్యర్థిని నిలబెట్టలేదు. మహిళా రాజకీయ చైతన్యం ఇక్కడ తక్కువే అనే మాట వినిపిస్తుంటుంది.ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చి, కాంగ్రెస్ నుంచి బీఎస్పీలో చేరిన సబీహా అన్సారీని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి మాయావతి అజంగఢ్‌లో నూతన రాజకీయాలకు తెరలేపారు. ఈ ప్రాంతానికి చెందిన మీరా దేవి మాట్లాడుతూ తమ కష్టాలను అర్థం చేసుకోగల మహిళా అభ్యర్థి ఎన్నికల బరిలో దిగడం సంతోషదాయకమన్నారు. ఇది మహిళలకు గర్వకారణమని మరో మహిళ ఆర్తి అన్నారు. జలంధరి ప్రాంతానికి చెందిన షబీనా కూడా బీఎస్పీ చీఫ్ మాయావతి నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. -
అమేథీలో కాంగ్రెస్ 1981 ఫార్ములా?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయమై నోరు మెదపలేదు. అయితే పార్టీ 1981 నాటి ఉప ఎన్నికల ఫార్ములాను ఇప్పుడు అనుసరించనున్నదనే మాట వినిపిస్తోంది.1981లో కాంగ్రెస్ నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాతనే అభ్యర్థులను రంగంలోకి దించింది. రాజీవ్ గాంధీని యూపీలోని అమేథీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రోజునే రాజీవ్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ అనుసరించనున్నదని కొందరు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.మరోవైపు అమేథీలో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో అభ్యర్థి ఎవరనేదానిపై బీఎస్పీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేసమయంలో బీఎస్పీ అభ్యర్థి ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తాను అమేథీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. అమేథీ నుంచి బీజేపీ తరుపున స్మృతి ఇరానీ ఎన్నికల రంగంలోకి దిగారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ ప్రకటించారు. -
ఆ తాను ముక్కలే..
(కల్వల మల్లికార్జున్‌రెడ్డి) : మరో నెలరోజుల్లో రాష్ట్రంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలు ఇప్పటికే ఖరారు చేశాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పటికే 17 నియోజకవర్గాలకూ అభ్యర్థులను ప్రకటించగా, అధికార కాంగ్రెస్ మాత్రం మరో మూడుచోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే అభ్యర్థుల ఎంపికలో ఈసారి అన్ని పార్టీలు విచిత్ర పద్ధతులను అనుసరించగా, అభ్యర్థులు కూడా టికెట్ దక్కించుకునేందుకు విచిత్ర విన్యాసాలు చేశారు. దీంతో ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరి పోటీ చేస్తున్నారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. పార్టీ సిద్ధాంతాలు, విధానాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులుగా పేర్కొంటూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ల కేటాయింపులో పెద్దపీట వేశాయి. పార్టీలో సీనియారిటీ, విధేయత వంటి వాటిని పక్కనపెట్టి వలస నేతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాయి. సొంత పార్టీలో సమర్థులైన అభ్యర్థులు లేరనే సాకుతో ఆర్థిక బలం, కుటుంబ నేపథ్యం, సామాజికవర్గాల లెక్కలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేశాయి. మరోవైపు ఇన్నాళ్లూ కొనసాగుతున్న పార్టీలో పోటీ అవకాశం దక్కినా కాలదన్ని మరీ ప్రత్యర్థి పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న ఘటనలూ ఉన్నాయి. దీంతో పార్టీలు, అభ్యర్థులు ఎవరైనా ఒకరిద్దరు మినహా మిగతా వారందరూ ఏదో ఒక సందర్భంలో బీఆర్ఎస్లోనో.. కాంగ్రెస్‌లోనో కొనసాగిన వారే కావడం ఆసక్తికరం. అన్ని పార్టీల్లోనూ ‘గులాబీ’ గుబాళింపు రాష్ట్రంలోని 17 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 మంది ఏదో ఒక సందర్భంలో బీఆర్ఎస్లో పనిచేసిన వారే ఉన్నారు. బీజేపీలో 12 మంది, కాంగ్రెస్‌లో ఆరుగురు లేదా వారి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్లో కొనసాగిన వారే. బీఆర్ఎస్ ప్రకటించిన 17 మంది అభ్యర్థుల్లోనూ ఆరుగురు కాంగ్రెస్ జీన్స్ కలిగిన వారున్నారు. పెద్దపల్లి, వరంగల్, చేవెళ్ల, మల్కాజిగిరి, మెదక్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన వారే కావడం గమనార్హం. నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్ (బీజేపీ), పెద్దపల్లిలో గడ్డం వంశీ (కాంగ్రెస్), వరంగల్‌లో కడియం కావ్య (కాంగ్రెస్), నాగర్‌కర్నూలులో పి.భరత్ (బీజేపీ) బరిలో ఉన్నారు. వీరి తండ్రులు గతంలో బీఆర్ఎస్లో కీలక పదవులు అనుభవించిన వారు కావడం గమనార్హం. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ తండ్రి, చెన్నూరు ఎమ్మెల్యే వినోద్‌కు మూడు పార్టీల్లోనూ పనిచేసిన అనుభవం ఉంది. ♦ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో గోడెం నగేశ్ (ఆదిలాబాద్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి), ఆరూరు రమేశ్ (వరంగల్), సీతారాం నాయక్ (మహబూబాబాద్), బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి), శానంపూడి సైదిరెడ్డి (నల్లగొండ), పి.భరత్ (నాగర్‌కర్నూలు), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), ఎం.రఘునందన్‌రావు (మెదక్), బీబీ పాటిల్ (జహీరాబాద్) గతంలో బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన వారే. ♦ కాంగ్రెస్ తరపున టికెట్లు దక్కిన గడ్డం వంశీ (పెద్దపల్లి), కడియం కావ్య (వరంగల్), పి.రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), నీలం మధు (మెదక్), దానం నాగేందర్ (సికింద్రాబాద్), పట్నం సునీత మహేందర్‌రెడ్డి (మల్కాజిగిరి) గతంలో బీఆర్ఎస్తో సంబంధాలు కలిగిన వారే. ♦ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్), మాలోత్ కవిత (మహబూబాబాద్), క్యామ మల్లేశ్ (భువనగిరి), రాగిడి లక్ష్మారెడ్డి (మల్కాజిగిరి), గాలి అనిల్ కుమార్ (జహీరాబాద్) కూడా ఎంతో కొంత కాంగ్రెస్ వాసన కలిగిన వారే. సిట్టింగుల్లో 9 మందే తిరిగి బరిలోకి.. 17 మంది సిట్టింగ్ ఎంపీల్లో 9 మంది మాత్రమే తిరిగి బరిలోకి దిగుతున్నారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి 9 మందికిగాను ముగ్గురు, బీజేపీలో నలుగురికిగాను ముగ్గు రు తిరిగి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌లో మాత్రం ముగ్గురు సిట్టింగుల్లో ఒక్కరూ తిరిగి పోటీ చేయడం లేదు. బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), బండి సంజ య్ (కరీంనగర్), బీబీ పాటిల్ (జహీరాబాద్), కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత (మహ బూబాబాద్), నామా నాగేశ్వర్రావు (ఖమ్మం), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), కాంగ్రెస్ నుంచి రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం– హైదరా బాద్) తిరిగి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు సోయం బాపూరావు (ఆదిలాబాద్), వెంకటేశ్ నేత (పెద్దపల్లి) పసునూరు దయాకర్ (వరంగల్), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (భువనగిరి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ), పి.రా ములు (నాగర్‌కర్నూలు), రేవంత్‌రెడ్డి (మల్కాజి గిరి), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్) పోటీకి దూరంగా ఉన్నారు. వెంకటేశ్ నేత, దయాకర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినా టికెట్ దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన రేవంత్‌రెడ్డి సీఎంగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి మంత్రులు గా ఉండగా, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా రు. నాగర్‌కర్నూలు ఎంపీ పి.రాములు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి తన కుమారుడు పి.భరత్ కు టికెట్ ఇప్పించుకున్నారు. -
యూపీఎస్సీ ఇంటర్వ్యూకు వెళ్లి.. ఎంపీ టిక్కెట్‌తో తిరిగొచ్చి..
ఎన్నికల సమయంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటుంటాయి. వీటిని విన్నప్పుడు ఒకపట్టాన నమ్మాలని అనిపించదు. ఒకప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు హాజరుకాబోతున్న యువకునికి కాంగ్రెస్ ఎన్నికల టిక్కెట్టు ఇచ్చింది. ఈ ఉదంతం బీహార్ కాంగ్రెస్ నేత రామ్ భగత్ పాశ్వాన్ విషయంలో జరిగింది. 1970లో బీహార్‌లోని దర్బంగాకు చెందిన రామ్‌భగత్ పాశ్వాన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అనంతరం ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు మాజీ మంత్రులు లలిత్ నారాయణ్ మిశ్రా, వినోదానంద్ ఝా, నాగేంద్ర ఝాలను కలుసుకున్నారు. ఆ సమయంలో వారంతా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేయాలని పాశ్వాన్‌ను కోరారు. దీనికి ఎంటనే ఆయన అంగీకరించారు. గతంలో రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ, పాశ్వాన్ ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి చూపారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని రోస్రా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పాశ్వాన్ బరిలోకి దిగారు. సైకిల్‌పై ప్రచారం సాగించారు. నాటి ఎన్నికల్లో ఆయన సంయుక్త సోషలిస్టు పార్టీ అభ్యర్థి రామ్‌సేవక్ హజారీని ఓడించారు. రోస్రా ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరకాలంలో కాంగ్రెస్ అతనిని రాజ్యసభకు పంపింది. దాదాపు 17 ఏళ్ల పాటు రామ్‌భగత్ పాశ్వాన్ ఎంపీగా ఉన్నారు. నాడు రామ్‌భగత్ పాశ్వాన్ పోస్ట్‌మాస్టర్‌గా ఉంటూనే సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన పోస్ట్‌మాస్టర్ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పట్లో అతని జీతం నెలకు రూ.150. ఉద్యోగం మానేయడంతో భార్య జీతం రూ.75పైనే ఆయన ఆధారపడాల్సి వచ్చింది. భర్త ఎంపీ అయిన తర్వాత కూడా రామ్‌భగత్ పాశ్వాన్ భార్య విమలాదేవి ఉద్యోగం వదల్లేదు. ఆమె ప్రధానోపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేసి, ప్రస్తుతం లాహెరియాసరాయ్లో ఉంటున్నారు. రామ్‌భగత్ పాశ్వాన్ దంపతులకు ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. -
కూటమిలో కత్తులు
సాక్షి నెట్వర్క్ : ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసుకుంటామని ఇన్నాళ్లూ చెబుతూ వచి్చన టీడీపీ, జనసేన మధ్య ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి. ఇక్కడ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజును మార్చాలని టీడీపీ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై రెండురోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బస చేసిన చంద్రబాబు క్యాంప్ వద్దకు వెళ్లి మరీ బొరగం వర్గీయులు ధర్నా చేశారు. పేరుకే రిజర్వుడు నియోజకవర్గమైనా ఇక్కడ పెత్తనమంతా బాబు, పవన్ సామాజికవర్గాలదే. దీంతో బాబు వర్గం బొరగం వర్గీయుల్లో అసమ్మతిని రాజేసింది. ప్రతిపనికీ పవన్ సామాజిక వర్గం వద్దకు వెళ్లి అడగలేమని, ఇక్కడ అభ్యర్థిని మార్చి టీడీపీకి ఇవ్వాలని బాబు సామాజికవర్గం డిమాండ్ చేస్తోంది. ముందు సీటు ఎవరికి ఇచ్చినా ఓకే అన్న బొరగం భీమవరంలో అంజిబాబు తరహాలో తనను జనసేనలో చేర్చుకుని టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే అనూహ్యంగా జనసేన నేతకు ఇవ్వడంతో బొరగంతోపాటు బాబు సామాజికవర్గ నేతలు కంగుతిన్నారు. ► ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యమా అని పలువురు సీనియర్ నాయకులు రాజకీయ నైరాశ్యంలో మునిగిపోయారు. టికెట్ ఆశ చూపి చివరకు రూ.కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులకు పెద్దపీట వేయడంతో దశాబ్దాల తరబడి పార్టీ కోసం రెక్కలుముక్కలు చేసుకున్న నేతలు లబోదిబోమంటున్నారు. కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వరనాయుడికి బాబు మొండిచేయి చూపారు.ఉమామహేశ్వరనాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. హనుమంతరాయచౌదరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గుంతకల్లులో గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ కోలుకోలేని దెబ్బతిన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ నేత ప్రభాకర్ చౌదరికి రాజకీయ సన్యాసం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎంపీగా చేసిన బీసీ నేత నిమ్మల కిష్టప్పనూ బాబు నట్టేటముంచారు. ► అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిని మార్చకుంటే ఘోర పరాజయం తప్పదని మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి తేల్చి చెప్పింది. ఆదివారం కలికిరిలోని పార్టీ కార్యాలయంలో శంకర్ వర్గీయులు కిరణ్‌తో సమావేశమయ్యారు. శంకర్‌కి టికెట్ ఇవ్వకుంటే సహకరించబోమని స్పష్టం చేశారు. ► తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల క్రితం పశి్చమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం చైర్మన్, సినీ నిర్మాత బన్నీ వాసుకు ఘోర అవమానం జరిగింది. వేదిక ఎక్కుతున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. జనసేన ఇన్చార్జి అని చెప్పినా వినిపించుకోలేదు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులూ దీనిని పట్టించుకోలేదు. అవమానంగా భావించిన బన్నీ వాసు అక్కడి నుంచి ని్రష్కమించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బన్నీ వాసుకు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు (మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బావమరిది)ని రాజీకి పంపారు. ఆయన వాసు దగ్గరకు వెళ్లి బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. వాసుకు జరిగిన అవమానంపై జనసైనికులు మండిపడుతున్నారు. ► ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అశోక్‌రెడ్డికి సీటు కేటాయించడంపై జనసేన నేత ఆమంచి స్వాములు కారాలుమిరియాలు నూరుతున్నారు. తాను ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. గిద్దలూరు జనసేన ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబుతోనూ ఆయనకు పొసగడం లేదు. కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న స్వాములు వెంటే ఆ సామాజికవర్గం ఉండడంతో టీడీపీ అభ్యర్థి అశోక్‌రెడ్డి ఆందోళన చేస్తున్నారు. ► కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ పార్థసారథికి సహకరించేది లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రకా‹Ùజైన్ తేలి్చచెప్పారు. కూటమిలో ఆ ఆరు ఓసీలకే.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సామాజిక న్యాయానికి పాతరేసింది. విజయవాడ తూర్పు, సెంట్రల్, వెస్ట్, మైలవరం, పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓసీలకే సీట్లు కేటాయించింది. ఈ ఆరు నియోజకవర్గాల్లో ఐదు టీడీపీ అధినేత సొంత సామాజికవర్గానికే కేటాయించారు. ఒకటి పవన్ కళ్యాణ్ సామాజికవర్గానికి ఇచ్చారు. దీంతో బలహీనవర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వాస్తవానికి విజయవాడ పశి్చమ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువ. చంద్రబాబు తొలుత మైనార్టీలకు సీటు ఇస్తామని చెప్పి, పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. ఆ పార్టీ తన సామాజికవర్గానికి చెందిన సుజనా చౌదరికే టిక్కెట్టు ఇచ్చేలా చక్రం తిప్పారు. ఈ సీటు తొలుత జనసేనకు కేటాయించారు. ఇక్కడ పదేళ్లుగా బీసీ అయిన పోతిన మహేష్ డబ్బులు ఖర్చుపెట్టి పార్టీ జెండా మోశారు. తీరా చివరకు బీజేపీకి సీటు ఇవ్వడంతో పోతిన నైరాశ్యంలో కూరుకుపోయారు. సామాజిక న్యాయం పాటించిన వైఎస్సార్ సీపీ సామాజిక న్యాయం అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ల కేటాయింపులో చేసి చూపారు. విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్ (కమ్మ), సెంట్రల్లో వెలంపల్లి శ్రీనివాస్ (వైశ్య), విజయవాడ వెస్ట్‌లో షేక్ ఆసిఫ్ (ముస్లిం మైనార్టీ), పెనమలూరులో జోగి రమేష్ (గౌడ–బీసీ), మైలవరంలో సర్నాల తిరుపతిరావు (యాదవ బీసీ), గన్నవరంలో వల్లభనేని వంశీ (కమ్మ)కి టికెట్లు ఇచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో వైఎస్ జగన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. పిఠాపురంలో జనసేనానికి అసమ్మతిసెగ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీలో అసమ్మతి సెగ రేగింది. స్థానికేతరులు పిఠాపురంలో పెత్తనం చెలాయిస్తున్నారంటూ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీ గొల్లప్రోలు మండల నేత అరవ వెంకటాద్రి నాయుడు (భారతీయుడు) ఆదివారం లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇక్కడి నుంచి పోటీకి దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్థానికేతరుడే కావడంతో లేఖ పార్టీలో కలకలం రేపింది. -
బీజేపీకి పురందేశ్వరి వెన్నుపోటు!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మిత్రపక్షమైన బీజేపీపట్ల తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న తీరు.. ఇందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యవహారశైలితో కమలనాథులు తీవ్రంగా రగిలిపోతున్నారు. చంద్రబాబు తమ పార్టీని ఇష్టానుసారం ఆడిస్తున్నా ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా లోలోపల టీడీపీకి వత్తాసు పలికేలా ప్రేక్షకపాత్ర వహిస్తూ బీజేపీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. 2014లోనూ టీడీపీ అధినేత పొత్తు ధర్మాన్ని విస్మరించి తమ పార్టీ పోటీచేసిన పలు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి దొంగదెబ్బ తీశారని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తన వదినతో కలిసి ఇలాంటి డ్రామానే ఆడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా వారు అనపర్తి నియోజకవర్గాన్ని ఉదహరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినప్పటికీ అక్కడ బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్నారు. పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆ స్థానంలో చంద్రబాబు రాజకీయ డ్రామాలు అడుతుంటే, ఆ నియోజకవర్గం ఉన్న రాజమండ్రి లోకసభ స్థానం నుంచి బీజేపీ తరఫున పురందేశ్వరి పోటీచేస్తూ కూడా అక్కడి పరిణామాలపై కిమ్మనకుండా ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇది బీజేపీని వెన్నుపోటు పొడవడమేనని వారు స్పష్టంచేస్తున్నారు. పురందేశ్వరి ప్రేక్షకపాత్ర.. ఇక ఈ సీట్ల విషయంలో చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను బీజేపీ రాష్ట్ర పార్టీ అ«ధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఏమాత్రం పట్టించుకోవడంలేదని కమలనాథుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నిజానికి.. పురందేశ్వరి రాజమండ్రి లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి కన్నా చంద్రబాబు తొలుత ప్రకటించిన టీడీపీ అభ్యర్ధి పోటీలో ఉంటే పురందేశ్వరికి అక్కడ ఎక్కువ ఓట్లు పడతాయని చెప్పి టీడీపీ నాయకత్వం ఆమెను ఒప్పించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో బీజేపీకి, పారీ్టనే నమ్ముకున్న నాయకులకు టీడీపీవల్ల అన్యాయం జరుగుతున్నా ఆమె మౌనంగా ఉంటున్నారని వారంటున్నారు. అవసరమైతే, బీజేపీ ఆ స్థానాన్ని వదులుకునేందుకు కూడా పురందేశ్వరి సిద్ధంగా ఉన్నట్లు ఆ పారీ్టలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అప్పట్లో మోదీపై బాబు విమర్శలను ఖండించడంవల్లే.. వాస్తవానికి.. 2019 ఎన్నికలకు ముందు బీజేపీని, ప్రధాని మోదీని చంద్రబాబు టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేశారు. వీటిని అప్పట్లో ప్రస్తుత అనపర్తి బీజేపీ అభ్యర్థి ఎం. శివరామకృష్ణంరాజు ఖండించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడీయన అభ్యర్థిగా కొనసాగితే టీడీపీ ఓట్లు బదలాయించడం కష్టమని కొత్త ప్రచారం మొదలుపెట్టినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలను వదిలేసి వాటిని ఖండించినందుకు శివరామకృష్ణంరాజును బలిపశువును చేయాలని టీడీపీ ప్రయతి్నస్తోందని.. కానీ, పురందేశ్వరి టీడీపీ కుట్రను ఏమాత్రం అడ్డుకోకపోవడం ద్వారా బీజేపీకి వెన్నుపోటు పొడవడాన్ని కమలం శ్రేణులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. 2014లో మాదిరిగానే ఇప్పుడూ వెన్నుపోటు మరోవైపు.. చంద్రబాబు–పురందేశ్వరి తమ రాజకీయ డ్రామాను రక్తికట్టించేందుకు శివరామకృష్ణంరాజు బలమైన అభ్యర్థి కాదని ఇంకో కొత్త ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇలాంటి ప్రచారాలే చేసి చంద్రబాబు బీజేపీకి వెన్నుపోటు పోడిచారని.. ఇప్పుడు పురందేశ్వరి ఆయనకు తోడైందని వారంటున్నారు. అప్పట్లో బీజేపీకి ఐదు లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ముందు చెప్పి ఆ తర్వాత నాలుగు లోక్‌సభ 14 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేశారు. ఆ అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వారు బలమైన వారు కాదంటూ సంతనూతలపాడు, గుంతకల్లు, కడప అసెంబ్లీ స్థానాల్లో చంద్రబాబు పోటీగా టీడీపీ వారికి సైతం బి–ఫారాలిచ్చారు. ఆ తరహాలోనే చంద్రబాబు ఇప్పుడు కూడా బీజేపీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నంలో పురందేశ్వరి భాగస్వామ్యం కావడంపట్ల కమల దళంలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు–పురందేశ్వరి కలిసి నాటకం బీజేపీతో పొత్తు కుదరక ముందే గత ఫిబ్రవరి 24న చంద్రబాబు 94 అసెంబ్లీ స్థానాలకు ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించారు. ఆ తర్వాత మార్చిలో పొత్తులు ఖరారయ్యాక టీడీపీ ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఎం. శివరామకృష్ణంరాజు పేరును ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు. రెండ్రోజుల క్రితం చంద్రబాబు నిర్వహించిన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ప్రధాన నాయకుల సమావేశానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కూడా పిలిచారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశం తర్వాత కూడా అనపర్తి టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీచేస్తున్నట్లు టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తుండడంపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. పురందేశ్వరి ఈ పరిణామాలను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో చంద్రబాబు–పురందేశ్వరి ఇద్దరూ కలిసే ఈ డ్రామాను ఆడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. -
కంటోన్మెంట్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ టికెట్ మళ్లీ ఆ ఫ్యామిలీకే ?
సాక్షి,హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆదివారం(ఏప్రిల్ 7) ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ సమావేశమై కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేత హరీశ్‌రావు, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే బీఆర్ఎస్ టికెట్ మళ్లీ దక్కడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల సాయన్న కూతురు సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం మృతి చెందడంతో ఈ సీటు ఖాళీ అయి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరపున లాస్యనందిత సోదరి నివేదితను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే అభ్యర్థిని అధికారికంగా మంగళవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ ఆశించిన బీఆర్ఎస్ నేతలు పలువురు ఈ ఉప ఎన్నికలోనూ టికెట్ కోసం పార్టీని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. వీరందరి అభ్యర్థిత్వంపై చర్చించిన తర్వాత టికెట్ సాయన్న కుటుంబానికే ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన గణేష్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా పార్టీ ఆయనను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు మరో షాక్ -
కూటమికి బీటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతిపక్ష కూటమి బీటలు వారుతోంది. నేతలు తలోదారి అన్నట్లుగా ఉండడంతో గెలుపు అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. ఇంతలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లా పర్యటన మరింత చిచ్చు రాజేసింది. ఏలూరు ఎంపీ సీటు విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ బీజేపీ నేత తపన చౌదరి హడావుడి చేస్తుండగా.. ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు చంద్రబాబు షాక్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. కూటమిలో కీలక నేతలుగా ఉన్నవారు రాజీనామాల బాట పట్టి అధికార వైఎస్సార్సీపీలో చేరుతుండటంతో కూటమి రాజకీయాల్లో తీవ్ర గందరగోళం రేగింది. ఉండిలో రామరాజుకు షాక్ పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం నర్సాపురం, పాలకొల్లులో పర్యటించి రఘురామకృష్ణరాజును టీడీపీలో చేర్చుకున్నారు. శనివారం ఉదయం పాలకొల్లులో పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ అభ్యర్థులతో పాటు, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్ధులతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఉండి సీటును రఘురామకృష్ణరాజుకు ఖరారు చేసి రామరాజుకు హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తొలి జాబితాలో అభ్యర్థిగా ఖరారు చేయగా రామరాజు, ఆయన సతీమణి ఇద్దరూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రఘురామరాజుకు సీటు అనడంతో టీడీపీ కేడర్ పాలకొల్లులో చంద్రబాబు క్యాంపు వద్దకు చేరుకుని పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డగించి ఘెరావ్ చేశారు. రామరాజుకే సీటు ఇవ్వాలని, రఘురామకృష్ణరాజుకు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నినాదాలు చేశారు. దీంతో నియోజకవర్గమంతా టిక్కెట్ మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రామరాజు వర్గానికి సర్ధిచెప్పే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పశ్చిమ టీడీపీ కూటమి రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. ఇంతవరకు ఎక్కడా లేని విధంగా జనసేనకు కేటాయించిన నర్సాపురం అసెంబ్లీ సీటులో చంద్రబాబునాయుడు సభ నిర్వహించడంపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. ఏలూరు పార్లమెంట్లో వరుస షాక్‌లు ఏలూరు పార్లమెంట్లో కూటమి పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. దెందులూరు నియోజకవర్గ టీడీపీ సీటు ఆశించి భంగపడిన అశోక్‌గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వైఎస్సార్సీపీలో చేరనున్నారు. దెందులూరు నియోజకవర్గంలో అశోక్‌గౌడ్‌కు బలమైన సామాజిక వర్గం మద్దతు ఉండటంతో పాటు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. తపన చౌదరి బల ప్రదర్శన ఏలూరు పార్లమెంట్ బీజేపీ నేత తపన చౌదరి బలప్రదర్శనకు దిగారు. పోలవరం నుంచి కై కలూరు వరకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీకి వెనక్కి తగ్గేది లేదని టీడీపీ కుట్ర రాజకీయాలకు బీజేపీని బలి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ నుంచి పోటీ తప్పనిసరిగా చేస్తానని, అవసరమైతే స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలుస్తానని కేడర్‌కు సంకేతాలు ఇచ్చారు. -
కూటమి.. నిప్పుల కొలిమి
అహర్నిశం ప్రజాహితం కోరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘పొత్తు’గట్టిన దుష్టగ్రహ కూటమి నిప్పుల కొలిమై రగులుతోంది. మండుతున్న ఎండలకు దీటుగా అసమ్మతి జ్వాలతో ఎగసిపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల ప్రకోపానికి గడగడలాడుతోంది. ఫలితంగా ఏం చేయాలో పాలుపోక టీడీపీ, బీజేపీ, జనసేన త్రయం తలలు పట్టుకుంటోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ/అవనిగడ్డ/ఎంవీపీకాలనీ (విశాఖజిల్లా): తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుకు సొంత పార్టీలోనే నిరసన ఎదురవుతోంది. ఆది నుంచి ఆయన వివాదాస్పద తీరు పార్టీ కార్యకర్తలకు, ఆయనకు మధ్య అంతరం పెంచుతోంది. ఆయన ఏకపక్ష ధోరణి ఇప్పుడు సీటుకే ఎసరు తెచ్చేలా ఉంది. అసలు ఈ నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని కొలికపూడి అమరావతి జేఏసీ కన్వీనర్ ముసుగులో పచ్చ పార్టీకి అనుకూలంగా పని చేయడంతో పారాచ్యూట్ నేతగా ఊడిపడ్డారు. స్థానిక ముఖ్యనేతలకూ సమాచారం ఇవ్వకుండానే ఆయనను అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడం స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. టీడీపీ అధినేత సొంత సామాజికవర్గ నేతలే కొలికపూడి తీరుపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మరో అభ్యర్థిని పరిశీలించాలని విన్నవించారు. లేకుంటే ఓటమి తప్పదని కరాఖండిగా చెప్పారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతలూ మాజీ మంత్రి జవహర్‌కు టికెట్ ఇవ్వాలని విన్నవించారు. దీంతో అభ్యర్థి«త్వం మార్పుపై అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రజల నుంచీ కొలికపూడికి నిరసన వ్యక్తమవుతోంది. ఇటీవల గంపలగూడెం మండలం మంచిరాలపాడులో ప్రచారానికి వెళ్లిన ఆయన సైకిల్ రావాలి..సైతాన్ పోవాలి అని అనడంతో మహిళలు గట్టిగా ప్రతిస్పందించారు.ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటూ చేతులూపుతూ కౌంటర్ ఇచ్చారు. ♦ అవనిగడ్డ నియోజకవర్గంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పార్టీలో చేరడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు సీటిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. జనసేన నేత విక్కుర్తి శ్రీను ఇంటి నుంచి బయలుదేరిన ర్యాలీ మండలి కార్యాలయం ముందు నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ పార్టీ కోసం తొలి నుంచీ కష్టపడి పనిచేసిన వారికి టికెట్ ఇవ్వాలని కోరారు. డబ్బులే పరమావధిగా సాగుతున్న ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని చెప్పిన బుద్ధప్రసాద్ వారంలోనే రూ.50 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారని విక్కుర్తి శ్రీను ప్రశ్నించారు. మండలి స్వగ్రామమైన భావదేవరపల్లికి చెందిన జనసేన నాయకుడు భోగాది భానుప్రకాష్ మాట్లాడుతూ ఆయనకు సీటిస్తే 150 కుటుంబాలు వైఎస్సార్ సీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. బచ్చు వెంకటనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విక్కుర్తి శ్రీనుకు టికెటిస్తే గెలిపించుకుంటామని నాయకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కండువాలు మార్చే బుద్ధి తనకు లేదంటూ మండలి గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను జనసేన నేతలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. సీటు కోసం రాత్రికి రాత్రే ఆయన పార్టీ మారడంపై నెటిజన్లూ మండిపడుతున్నారు. ♦ విశాఖపట్నం ఎంపీ సీటును టీడీపీకి కేటాయించడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. ఈమేరకు మంగళవారం విశాఖ లాసన్స్ బే కాలనీలోని ఆ పార్టీ నగర కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. విశాఖలో తొలి నుంచి బీజేపీకి పట్టుందని, సీటును టీడీపీకి కేటాయించడం తగదని పేర్కొన్నారు. అనంతరం విలేకరులతో బీజేపీ గాజువాక సమన్వయకర్త కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ అభివృద్ధికి కృషి చేశారని, ఆయనకు ఎంపీ సీటు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రకు అందించారు. ఈ పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పంపిస్తున్నట్లు వివరించారు. వీలులేకుంటే బీజేపీ విడిగా స్నేహపూర్వక వాతావరణంలో పోటీ చేసేలా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కోరారు. పలువురు నేతలు మాట్లాడుతూ పురంధేశ్వరి బీజేపీని టీడీపీకి అమ్మేశారని దుయ్యబట్టారు. యనమల కోటలో నిట్టనిలువునా చీలిపోయిన టీడీపీ సాక్షి ప్రతినిధి, కాకినాడ: యనమల రామకృష్ణుడు, కృష్ణుడు ఇద్దరూ అన్నదమ్ముల బిడ్డలు. అయినా ఒక తల్లి కన్న బిడ్డల కంటే ఎక్కువగానే కలసిమెలిసి ఉన్నారు. ఏకంగా 40 ఏళ్లు పాటు కలసి నడిచారు. రాష్ట్రమంతా వారిద్దరూ సొంత అన్నదమ్ములనే అనుకునేంతగా పేరుపొందారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ చంద్రబాబు తరువాత పెద్దన్న పాత్ర పోషించిన రామకృష్ణుడు రాష్ట్రంలో.. తునిలో కృష్ణుడు చక్రం తిప్పారు. అటువంటి వారిద్దరి మధ్య ఇన్నేళ్ల తరువాత తొలిసారి తలెత్తిన ఆధిపత్య పోరు వల్ల తునిలో టీడీపీ తునాతునకలైంది. తునిలో ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక రామకృష్ణుడు స్వచ్ఛందంగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. ఆయన స్థానంలో కృష్ణుడు పదేళ్లుగా పోటీ చేస్తున్నా.. వైఎస్సార్ సీపీ హవా ముందు నిలబడలేకపోయారు. ఈ నేపథ్యంలో ఉనికి కోసం పాకులాడుతున్న రామకృష్ణుడు ఈసారి తన కుమార్తె దివ్యను బరిలోకి దింపారు. దశాబ్ద కాలంగా తునిలో టీడీపీని నడిపించిన కృష్ణుడిని దూరం పెట్టారు. టీడీపీ అభ్యర్థి దివ్య ప్రచారంలోనూ పాల్గొనవద్దని కృష్ణుడికి తెగేసి చెప్పేశారనే చర్చ జరుగుతోంది. తునిలో టీడీపీ అంటే కృష్ణుడు అని భావించిన ఆ పార్టీ శ్రేణులు ఈ పరిణామాలతో కంగుతిన్నాయి. దీంతో పార్టీ రెండువర్గాలుగా నిట్టనిలువునా చీలిపోయింది. ఫలితంగా ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు చెల్లాచెదురైపోతున్నారు. కొందరు ఎవరిపక్షాన నిలవాలో అర్థంకాక స్తబ్దుగా ఉండిపోతున్నారు. రామకృష్ణుడి ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశానని, ఇప్పుడు తననే ఆయన దూరం పెట్టారని కృష్ణుడు సన్నిహితుల వద్ద మధనపడుతున్నట్టు సమాచారం. ఇంత అవమానం భరిస్తూ టీడీపీలో కొనసాగలేమనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు చెబుతున్నారు. ప్రత్యామ్నాయం చూసుకుందామని అనుచరుల నుంచి కృష్ణుడిపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. అన్నదమ్ముల తగవు చంద్రబాబు దృష్టికి వెళ్లినా ఆయన కిమ్మనకుండా ఉండడంపైనా కార్యకర్తలు పెదవివిరుస్తున్నారు. -
కూటమిలో కుతకుత
సాక్షి నెట్వర్క్: క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటలు చల్లారడం లేదు. టికెట్ ఆశించి భంగపడినవారు అక్కడి అభ్యర్థులకు సహకరించడానికి ససేమిరా అంటున్నారు. టికెట్ దక్కించుకున్నవారితో నేరుగా వాదులాటకు దిగుతున్నారు. కొందరు నాయకులు అభ్యర్థిత్వాల ఎంపికకు నిరసనగా రాజీనామా చేస్తుండగా... మరికొందరు ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. తమకు నచ్చని వ్యక్తులకు అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో వారిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు. జరుగుతున్న పరిణామాలు కూటమి నేతలకు శిరోభారంగా మారుతున్నాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఆయా అభ్యర్థులకు ఎదురుగాలి తప్పదని శ్రేణులు ఖరాకండీగా చెబుతున్నాయి. జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. అక్కడ గత ఎన్నికల్లో ఓడిపోయిన శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)కు టికెట్ ఇవ్వడాన్ని మాజీమంత్రి నెట్టెం రఘురాం, బీఆర్కే చానల్ యజమాని, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గంలో సుమారు 40 వేల ఓటుబ్యాంకు కలిగిన కమ్మ సామాజికవర్గానికి గడచిన నాలుగు పర్యాయాల నుంచి టికెట్ కేటాయించకుండా అవమానిస్తోందని ఆ సామాజికవర్గ నేతలు మండిపడుతున్నారు. పాడేరు అసెంబ్లీ టికెట్‌పై కొనసాగుతున్న టీడీపీ నిరసన పాడేరు అసెంబ్లీ టీడీపీ టికెట్ కిల్లు రమేష్‌నాయుడుకు కేటాయించడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసన కొనసాగిస్తున్నారు. జీసీసీ మాజీ చైర్మన్ ఎం.వి.ఎస్.ప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొయ్యూరులో ఆదివారం ఆ పార్టీ నేతలు పార్టీ జెండాలతో నిరసన తెలిపారు. రెండు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న ప్రసాద్‌కు అన్యాయం చేయడం తగదని అధిష్టానం నిర్ణయంపై మండిపడ్డారు. రమేష్ నాయుడు ఎవరో కనీసం కార్యకర్తలకు కూడా తెలియదని, అలాంటి వ్యక్తికి సీటు ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు ప్రభాకర్ చౌదరి నిర్ణయం అనంతపురం అర్బన్ నుంచి అభిమానులు కోరితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి వెల్లడించారు. ఆదివారం ఆయన అనంతపురంలోని కమ్మభవన్‌లో పార్టీ కార్యకర్తలు, తన వర్గీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్కడ టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ను ఎంపిక చేయడం సరికాదన్నారు. ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి ఆస్తులు కోల్పోయానని, కేసుల్లో ఇరుక్కున్నానని, అయినా అధిష్టానం తన శ్రమను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని మిరియాల శిరీషా దేవిని తక్షణమే మార్చాలని రాజవొమ్మంగి మండలంలోని 19 పంచాయతీలకు చెందిన టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం రాజవొమ్మంగిలో వారు సమావేశమై అభ్యర్థిని మార్చకుంటే రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ♦ ఎన్టీఆర్ జిల్లా నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో ఆదివారం రాత్రి ‘మన పల్లెకు మన సౌమ్య’ కార్యక్రమం ముగించుకుని వస్తుండగా కార్యకర్తలు అడ్డగించారు. గ్రామంలో నిర్వహించే కార్యక్రమాలకు పార్టీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకపోవడంపై మహిళలు మండిపడ్డారు. ♦ అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ టీడీపీ టికెట్ గుమ్మనూరు జయరామ్‌కు కేటాయించడాన్ని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్.జితేంద్రగౌడ్ తప్పు పట్టారు. ♦ గుంతకల్లులోని తన కార్యాలయంలో పార్టీ క్లస్టర్, బూత్ ఇన్చార్జులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో అధినేత పునరాలోచన చేయకపోతే దేనికైనా సిద్ధంగా ఉండాలని తన వర్గీయులకు పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ మధ్య ఫ్లెక్సీల రగడ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం నిర్వహించిన చంద్రబాబు ప్రజాగళం యాత్ర సభ టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చుపెట్టింది. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటో లేకపోవడంపై ఆ పార్టీ బీజేవైఎం రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ జి.వి.రెడ్డి, టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా కిసాన్‌మోర్చా ఇన్చార్జి కె.వి.రమణారావు కూడా టీడీపీ నేతల తీరును ఎండగట్టారు. పేరుకే కూటమిలో ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం టీడీపీ నాయకులు విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ♦ అరకు ఎంపీ టిక్కెట్ ఆర్థిక నేరస్తురాలైన కొత్తపల్లి గీతకు ఎలా ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఆ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు నిమ్మక జయరాజ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గీత నిజమైన ఎస్టీ కాదని కూడా చెప్పారు. ♦ అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ జనసేన కార్యకర్తలను విస్మరిస్తున్నారని పార్టీ అద్దంకి మండల కార్యదర్శి సాధు వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సంతమాగులూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉద్దేశ పూర్వకంగానే జనసైనికులను దూరం పెడుతున్నారని ఆరోపించారు. -
టీడీపీ, జనసేనకు వరుస షాక్‌లు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేనలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆయా పార్టీల అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకు మనస్తాపం చెందిన నాయకులంతా వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. ఆయా పార్టీల్లో ఎన్నాళ్లుగానో ఉంటూ కోట్లు ఖర్చుచేసి పార్టీ పటిష్టత కోసం పనిచేసినా టిక్కెట్ దక్కకపోవడం, అవమానాలకు గురికావడంతో కూటమిని వీడుతున్నారు. జనసేన, టీడీపీలో డబ్బులే ప్రామాణికంగా తీసుకుని టిక్కెట్లు కేటాయించడంపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు(నాని)కు తెలుగుదేశం పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, పైగా ఆయన్ను అవమానించేలా వ్యవహరించడంతో ఆయన ఆ పార్టీని వీడారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగిన మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య టికెట్ విషయంలో తనకు అన్యాయం చేయడంతో ఆయన కూడా టీడీపీనుంచి బయటకు వచ్చారు. అవసరానికి తనను వాడుకుని కోట్లాదిరూపాయల ఆస్తులు పార్టీకోసం వెచ్చించిన తనకు చివరి నిమిషంలో ఎంపీ టికెట్ నిరాకరించడంతో ఎన్ఆర్ఐ గొరుముచ్చు గోపాల్‌యాదవ్ టీడీపీని వీడారు. ఇక జనసేన పార్టీకోసం అహర్నిశలు కృషి చేసి... పార్టీ పురోభివృద్ధికి కృషి చేసినప్పటికీ తమను పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలు అవలంబిస్తుండటంతో చేగొండి సూర్యప్రకాశ్, నౌడు వెంకటరమణ ఆ పార్టీకి రాంరాం చెప్పారు. కాంగ్రెస్ విధానాలు నచ్చకపోవడంతో శెట్టి గురునాథం ఆ పార్టీని వీడారు. తాజాగా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన జనసేన నేత పితాని బాలకృష్ణ కూడా శెట్టిబలిజలకు ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీనుంచి బయటకు వచ్చారు. వారంతా వైఎస్సార్సీపీలో చేరేందుకు క్యూ కట్టారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం, ఆచంట, ఉంగుటూరు, నూజివీడు, చింతలపూడి, పోలవరంలో ముఖ్య నేతలు ఇవే కారణాలతో నేరుగా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో అయితే నిత్యం పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతున్నారు. బీసీలకు పట్టం కట్టడం, గడచిన ఐదేళ్లలో సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరడంతో పార్టీకి ఆకర్షితులై పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఈలి నానితో మొదలై.. తాడేపల్లిగూడెం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు(నాని) ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. నియోజకవర్గంలో ఈలి కుటుంబానికి మంచి పేరుంది. ఆయన తండ్రి ఈలి ఆంజనేయులు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఆయన భార్య వరలక్ష్మి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆంజనేయులు ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. నాని 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక పర్యాయం పనిచేశారు. రాజకీయంగా నియోజకవర్గంలో మంచి పేరుంది. 2019లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సుదీర్ఘ నేపథ్యం ఉన్నప్పటికీ పార్టీ అవమానకర రీతిలో వ్యవహరించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ♦ నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య 2009లో ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఆ పార్టీ టికెట్ విషయంలో పరాభవం చెందడంతో వైఎస్సార్సీపీలో చేరారు. ♦ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్ జనసేన పార్టీలో ఆచంట ఇన్చార్జిగా పనిచేశారు. పార్టీలో ప్రాధాన్యం లేకపోవడం, ఇతర కారణాలతో జనసేనను వీడి ఫ్యాన్ గూటికి చేరారు. ♦ ఉంగుటూరులో జెడ్పీటీసీగా రాజకీయం ప్రస్థానం ప్రారంభించిన నౌడు వెంకటరమణ 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత రాజకీయంగా అక్కడ ప్రాధాన్యమివ్వకపోవడంతో ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. ♦ జంగారెడ్డిగూడెంలో బలమైన కాంగ్రెస్ నేతగా గుర్తింపు ఉన్న జెట్టి గురునాథం పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించారు. ఆయన కూడా కాంగ్రెస్ విధానాలు నచ్చక వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. టీడీపీలో అవమానాలు ఎదుర్కొన్న గోపాల్ టీడీపీ ఎంపీ టిక్కెట్ ఆశావహి, ఎన్ఆర్ఐ గొరుముచ్చు గోపాల్యాదవ్కు టీడీపీలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. సింగపూర్‌లో వ్యాపారం చేసుకుంటున్న ఆయన్ను పిలిచి మరీ టిక్కెట్ నీదే, ఖర్చుకు వెనుకాడకుండా పనిచేయమని చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ చెప్పడంతో ఏడాది నుంచి ఏలూరు పార్లమెంట్ సీటు లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా పనిచేశారు. యువగళం మొదలుకొని, చంద్రబాబు బహిరంగ సభల వరకు అనేక కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఖర్చుచేశారు. చివరికి హ్యాండ్ ఇచ్చి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కు టిక్కెట్ ఇచ్చారు. మనస్తాపానికి గురైన గోపాల్ యాదవ్ వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల వేళ కీలక నేతల రాకతో వైఎస్సార్సీపీ కేడర్‌లో కొత్త జోష్ నెలకొంది. టికెట్లు అమ్ముకున్న పవన్: పితాని ముమ్మిడివరం: జనసేన పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ కలసి టికెట్లు అమ్ముకున్నారని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి పితాని బాలకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో సానబోయిన మల్లికార్జునరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీకోసం కోట్లాదిరూపాయల ఆస్తిని అమ్ముకున్న తనకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం పార్టీని ఏర్పాటు చేశానని చెప్పి, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరికీ టికెట్ ఇవ్వకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని వాపోయారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో శనివారం చేరనున్నట్టు ప్రకటించారు. కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నాదెండ్ల మనోహర్ వల్లే జనసేన పార్టీ సర్వనాశనం అయిందన్నారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ముమ్మిడివరంలో పొన్నాడ సతీ‹Ùకుమార్‌తో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీచేస్తున్న బీసీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని పితాని తెలిపారు. జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించడమే తన ధ్యేయమని చెప్పారు. కాకినాడ మాజీ మేయర్ సరోజ కూడా నాదెండ్ల తీరుపై మండిపడ్డారు. -
తొలిసారి ఆ రెండు వర్గాలకు కాంగ్రెస్ టిక్కెట్లు నిల్!
రాజస్థాన్‌లో లోక్‌సభ టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ తొలిసారిగా ప్రత్యేక వైఖరి అవలంబించింది. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో ఎక్కడా కూడా బ్రాహ్మణ, ముస్లిం అభ్యర్థులకు అవకాశం కల్పించలేదు. అయితే కుల, మతాల ప్రాతిపదికన కాకుండా సర్వే ఆధారంగానే టిక్కెట్లు కేటాయించామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ గతంలో చాలాసార్లు బ్రాహ్మణ కార్డును ప్లే చేసింది. ఇప్పడు పార్టీ తన వైఖరిని మార్చుకోవడం పలువురు నేతలకు ఆగ్రహం తెప్పించింది. రాజస్థాన్ చరిత్రలో ముస్లిం, బ్రాహ్మణ అభ్యర్థికి కూడా కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడం ఇదే తొలిసారి. సర్వ బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు సురేశ్ మిశ్రా మాట్లాడుతూ కాంగ్రెస్‌కు బ్రాహ్మణుల ఓట్లు అక్కర్లేదని తెలుస్తోంది. జైపూర్ నుంచి బ్రాహ్మణ నేతకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు కోటి మంది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారున్నారని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత వరుణ్ పురోహిత్ మాట్లాడుతూ బ్రాహ్మణ వర్గానికి కాంగ్రెస్ గౌరవం ఇవ్వనప్పుడు ఓటమిని చవిచూసిందన్నారు. అయితే రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్‌రూమ్ అధ్యక్షుడు జస్వంత్ సింగ్ గుర్జార్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సర్వే, ఫీడ్‌బ్యాక్, డిమాండ్ మేరకు టిక్కెట్లు ఇచ్చామన్నారు. కులం, సంఘం లేదా తరగతి ఆధారంగా టిక్కెట్లు ఇవ్వలేదన్నారు. -
వరుణ్‌కు కాంగ్రెస్ ‘ఆఫర్’? బీజేపీకి గట్టిపోరు?
గాంధీ కుటుంబంలో దశాబ్దాల నాటి రాజకీయ శత్రుత్వం ముగియనుందా? రాహుల్, వరుణ్ కలిసి నడుస్తారా? వరుణ్‌గాంధీకి కాంగ్రెస్ పార్టీ ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పటి నుంచి ఈ ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వరుణ్ గాంధీపైనే నిలిచింది. యూపీలోని పిలిభిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్‌గాంధీకి బీజేపీ టిక్కెట్ కేటాయించకపోవడంతో ఈ చర్చ మరింత వేడందుకుంది. పిలిభిత్ సీటు గాంధీ కుటుంబీకుల సంప్రదాయ సీటు. వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ ఈ స్థానం నుండి ఆరు సార్లు, వరుణ్ గాంధీ ఈ స్థానం నుండి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీకి పిలిభిత్ టికెట్ ఇవ్వలేదు. జతిన్ ప్రసాద్‌ను ఇక్కడి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ వరుణ్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు వరుణ్ గాంధీ తదుపరి స్టెప్ ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ వరుణ్‌గాంధీ కాంగ్రెస్ ఆఫర్‌ను అంగీకరిస్తే గాంధీ కుటుంబం మధ్య కొనసాగుతున్న రాజకీయ శత్రుత్వానికి తెరపడుతుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అప్పుడు అన్నదమ్ములైన రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ మరోసారి రాజకీయంగా ఏకమవుతారని అంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి వరుణ్ గాంధీని కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. వరుణ్ గాంధీ చాలా కాలంగా సొంత పార్టీని పలు అంశాలలో విమర్శిస్తూ వస్తున్నారు. వరుణ్ వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, అగ్నివీర్ యోజన, కేంద్ర ఉచిత రేషన్ స్కీమ్ మొదలైనవాటిపై వరుణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ వరుణ్‌కు టిక్కెట్ కేటాయించలేని తెలుస్తోంది. అయితే అతని తల్లి మేనకాగాంధీకి మాత్రం బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో వరుణ్ కాంగ్రెస్ ఆఫర్‌ను అందుకుంటారా? సోదరుడు రాహుల్‌తో కలిసి ముందుకు అడుగులు వేస్తారా? అనేది త్వరలో తేలిపోనుంది. -
తమ్ముళ్ల తిరుగుబాటు
అవనిగడ్డ/పెందుర్తి/పెద్దతిప్పసముద్రం/ఒంగోలు: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ నాయకులనుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఎన్నో ఏళ్లుగా సీటుపై ఆశలు పెంచుకుని పార్టీ కార్యక్రమాలకోసం డబ్బు తగలేసుకుని, కష్టకాలంలో జెండా మోస్తే తీరా ఎన్నికలు వచ్చేసరికి పొత్తులో భాగంగా వేరొకరికి ఇస్తామంటే ఎందుకు సహకరించాలని వారు నిలదీస్తున్నారు. అక్కడ టికెట్ దక్కించుకున్నవారికి సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలోనైతే ఒక అడుగు ముందుకేసి 30మంది నాయకులు తమ పార్టీ పదవులకు ఏకంగా రాజీనామా చేస్తూ ఆ లేఖలను పార్టీ అధిష్టానానికి పంపించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. శాసన సభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు అక్కడి టికెట్ కేటాయించక పోవడాన్ని నిరసిస్తూ 30 మంది పార్టీ నాయకులు తమ పదవులకు మంగళవారం రాజీనామా చేసి, ఆ లేఖలను మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. నియోజకవర్గంలో గెలిచే సత్తా బుద్ధప్రసాద్‌కే ఉందని, పొత్తుని పక్కన పెట్టి ఆయనకే ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారనీ, కనీసం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆయనకు కనీసం టికెట్ గురించి సమాచారం కూడా ఇవ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు. రాజీనామా చేసిన వారిలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి కర్రా సుధాకర్, అశ్వరావుపాలెం సర్పంచ్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు బండే కనకదుర్గ, క్లస్టర్ ఇన్చార్జి బండే రాఘవ, మాజీ ఉపసర్పంచ్లు ఘంటసాల కన్నయ్య, అడపా శ్రీనివాసరావు తదితరులున్నారు.కాగా పొత్తు ధర్మం పాటిస్తామంటూనే టీడీపీ నాయకులు రాజీనామాలు చేస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడటంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండారుకు అన్యాయంపై రగులుతున్న కేడర్ 40 ఏళ్లుగా టీడీపీ జెండాను మోస్తూ పార్టీ మనుగడకోసం పాటుపడిన బండారు సత్యనారాయణమూర్తిని కాదని ఎక్కడి నుంచో పార్టీలు మారుతూ వచ్చిన వ్యక్తికి పెందుర్తి టికెట్ ఇస్తారా అంటూ అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ కేడర్ మండిపడుతోంది. టీడీపీ నుంచి జనసేనకు ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అక్కడి జనసేన అభ్యర్థి పంచకర్ల తలకిందులుగా తపస్సు చేయాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దానికి ప్రతిగా జనసేన నాయకులు పొత్తు ధర్మం ప్రకారం జనసేనకు సహకరించడం న్యాయమని భావిస్తున్నాం. తామేమీ టీడీపీ నాయకుల ఓట్ల మీద ఆధారపడి పోటీ చేయడం లేదని సమాధానమిస్తున్నారు. మొత్తమ్మీద పెందుర్తిలో కూటమి వికటిస్తున్నట్టే కనిపిస్తోంది. రాజకీయంగా చిరకాల ప్రత్యర్థులైన బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్‌బాబు కలసి పనిచేయడం ఇక కల్లే అని అక్కడి నాయకులు అభిప్రాయపడుతున్నారు. పొత్తు ధర్మంలో జనసేనకే టికెట్ ఇవ్వవలసి వస్తే టి.శివశంకర్‌కు టికెట్ ఇవ్వాలని, పంచకర్లకు వద్దని మొదటినుంచీ చెబుతున్నారు. కానీ వారి డిమాండ్‌ను జనసేన అధినేత పట్టించుకోకపోవడాన్ని వారు అవమానంగా భావిస్తున్నారు. తంబళ్ళపల్లిలో జయచంద్రారెడ్డికి చుక్కెదురు అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గ జనసేన, టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డికి ఎన్నికల ప్రచారంలో చుక్కెదురైంది. సోమవారం రాత్రి ఆయన మండలంలోని బూర్లపల్లి పంచాయతీ కొత్తపల్లిలో ఇంటింటా తిరిగి ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంలో ఇదే గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు జయచంద్రారెడ్డిని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌కు మద్దతుగా జై శంకర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో జయచంద్రరెడ్డి తీవ్ర అసహనానికి లోనై వెను తిరిగారు. గిద్దలూరు జనసేనకుఇవ్వాల్సిందే ఒంగోలు జిల్లా గిద్దలూరు సీటు జనసేనకు కేటాయించాల్సిందేనని ఆ పార్టీ నాయకుడు, కాపు సంఘం జిల్లా అ«ధ్యక్షుడు ఆమంచి స్వాములు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కాపు కల్యాణమండపంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 శాతం కాపు జనాభా ఉన్నారని, వైఎస్సార్సీపీ 31 సీట్లు ఇస్తే కనీసం అన్ని సీట్లు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రకటించకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. తెనాలిలో జనసేనకు కేటాయించినా అది కాపు సామాజిక వర్గం కాదన్నారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కాపులకు కూటమి టికెట్ కేటాయించలేదని, ఈ నేపథ్యంలో గిద్దలూరు సీటును జనసేనకు కేటాయించాల్సిందేనన్నారు. ఈ విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాల్సిందే అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ కాపు సంఘం నాయకులు కొండపల్లి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ కూటమి మనసు మార్చుకుని గిద్దలూరు టికెట్‌ను జనసేనకు కేటాయించకపోతే కాపులు బలంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో జి.వెంకటేశ్వర్లు(కొండపి), బి.బ్రహ్మయ్య(అద్దంకి), ఆర్.శ్రీనివాసరావు(పర్చూరు) తదితరులు పాల్గొన్నారు. -
దిక్కుతోచని ‘కూటమి’!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మల్లగుల్లాలు పడుతోంది. పొత్తులో భాగంగా ఈ స్థానం తెలుగుదేశం పార్టీకి దక్కింది. రోజులు గడుస్తున్నా అభ్యర్థి ఎవరో తేల్చకుండా నాన్చుతోంది. ప్రస్తుతం మాగుంట కుటుంబానికి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ కుటుంబం పాత్ర ఉండటంతో ఏం చేయాలో తెలియక సందిగ్ధ పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. ఈ ఎన్నికల్లో తప్పకుండా బీసీ నేతకు ఎంపీగా టికెట్ ఇస్తానని ఇచ్చిన హామీని బాబు గాలికొదిలేశారు. ఎన్నికలు వేడెక్కుతున్నా అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో మూడు పార్టీల నేతలు, కేడర్ అయోమయంలో పడ్డారు. వాస్తవంగా రెండు నెలల ముందు వరకూ ఈ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థి కరువయ్యారు. పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు ముందుంచారు. అయితే ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తానని యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు హామీ ఇచ్చారు. తీరా ఎన్నికల వేడి మొదలయ్యే నాటికి బాలాజీ పేరు మరుగున పడిపోయింది. బీసీలకు ఎప్పటిలాగే మొండిచేయి చూపారు. తొలుత రాఘవరెడ్డి పేరు.. టీడీపీలో చేరిన మాగుంట ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా తన కుమారుడు రాఘవరెడ్డిని నిలబెట్టాలని జోరుగా ప్రచారం చేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అడ్డం పడింది. దాంతో రాఘవరెడ్డి స్థానంలో ఎంపీ శ్రీనివాసులు రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో తన తండ్రి శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారని రాఘవరెడ్డి ఒక ప్రకటన కూడా విడుదలచేశారు. అయితే ఇప్పటివరకు చంద్రబాబు మాత్రం ఏ ఒక్కరి పేరూ ప్రకటించకపోవటం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు. మాగుంట రాఘవరెడ్డిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో అరెస్ట్ చేయగా తీహార్ జైలులో కొంతకాలం రిమాండ్‌లో ఉండి ప్రస్తుతం బెయిల్‌పై వచ్చారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేశారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కూడా తిహార్ జైలుకు పంపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు.. మాగుంట కుటుంబం విషయంలో డోలాయమానంలో పడ్డాడన్న ప్రచారం సాగుతోంది. మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి ఇరువురూ ఈడీ ముందు అప్రూవర్లుగా మారిన సంగతి తెలిసిందే. మాగుంట కుటుంబాన్ని వెంటాడుతున్న లిక్కర్ స్కాం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థికంగా దన్ను ఉన్న వ్యక్తి కోసం టీడీపీ గాలింపు మొదలెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పేరు బయటకు రావడంతో అప్పటినుంచే వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వారిని పక్కనపెట్టిన విషయం విధితమే. ఒంగోలు ఎంపీ సీటు ఆ కుటుంబానికి ఇచ్చేదిలేదని కూడా ముఖ్యమంత్రి తెగేసి చెప్పారు. దీంతో మాగుంట టీడీపీ తీర్థం పుచ్చుకున్నా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిత్వంపై నేటికీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న మాగుంట కుటుంబానికి టికెట్ ఇస్తే ప్రధాని మోదీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనన్న సందిగ్ధంలో బాబు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రచారంలో దూసుకుపోతున్నచెవిరెడ్డి భాస్కరరెడ్డి టీడీపీ, ఎన్డీఏ కూటమి పరిస్థితి కుడితో పడిన ఎలుకల చందంగా ఉంటే వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను సీఎం జగన్ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో కలిసి గ్రామ గ్రామాన ఆయన ప్రచారం చేసుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు.