యూపీలోని అజంగఢ్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలో రాజకీయంగా చాలా ముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది. బహుజన్ సమాజ్ పార్టీ తాజాగా ఈ స్థానం నుంచి తన అభ్యర్థిని నిలబెట్టింది. బీఎస్పీ మహిళా అభ్యర్థి సబిగా అన్సారీ అజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఈ సీటుపై ముక్కోణపు పోరు నెలకొంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 45 ఏళ్ల తర్వాత అజంగఢ్ నియోజకవర్గం నుంచి ఓ మహిళా అభ్యర్థి బరిలో నిలిచారు.
అజంగఢ్ నుంచి మహిళా అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీఎస్పీ.. ఈ సీటుకు జరుగుతున్న పోరును మరింత ఆసక్తికరంగా మార్చింది. 1978లో మొహసినా కిద్వాయ్ ఇక్కడ నుండి కాంగ్రెస్ టిక్కెట్‌పై నాటి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా అజంగఢ్ స్థానం నుండి మహిళా అభ్యర్థిని నిలబెట్టలేదు. మహిళా రాజకీయ చైతన్యం ఇక్కడ తక్కువే అనే మాట వినిపిస్తుంటుంది.
ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చి, కాంగ్రెస్ నుంచి బీఎస్పీలో చేరిన సబీహా అన్సారీని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి మాయావతి అజంగఢ్‌లో నూతన రాజకీయాలకు తెరలేపారు. ఈ ప్రాంతానికి చెందిన మీరా దేవి మాట్లాడుతూ తమ కష్టాలను అర్థం చేసుకోగల మహిళా అభ్యర్థి ఎన్నికల బరిలో దిగడం సంతోషదాయకమన్నారు. ఇది మహిళలకు గర్వకారణమని మరో మహిళ ఆర్తి అన్నారు. జలంధరి ప్రాంతానికి చెందిన షబీనా కూడా బీఎస్పీ చీఫ్ మాయావతి నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment