ఉత్తరప్రదేశ్‌లో వడదెబ్బకు 15 మంది పోలింగ్ సిబ్బంది మృతి చెందారు. శుక్రవారం నాడు ఏర్పడిన అత్యధిక ఉష్ణోగ్రతలకు తాళలేక జనం విలవిలలాడిపోయారు. ఈ నేపధ్యంలో ఎన్నికల విధుల్లో నిమగ్నమైన 15 మంది పోలింగ్ సిబ్బంది కన్నుమూశారు. ఈ వివరాలను ఎన్నికల అధికారులు తెలిపారు.
యూపీలోని మిర్జాపూర్ జిల్లాలో 13 మంది ఎన్నికల సిబ్బంది ఎండి వేడిమి కారణంగా తీవ్ర జ్వరం, అధిక రక్తపోటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 23 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోన్‌భద్ర జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు ఈరోజు (శనివారం) పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఓటర్లు ఎండవేడిమికి గురికాకుండా ఉండేందుకు పలు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద పారామెడికల్ సిబ్బందిని, ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచారు. ఓటర్లతో పాటు పోలింగ్ సిబ్బంది తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలని, వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవాలని అధికారుల సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment