గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్‌ సర్వీస్‌ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..! | The Only Indian Train Which Does Not Require A Ticket Past 75 Years | Sakshi
Sakshi News home page

గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్‌ సర్వీస్‌ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..!

Published Mon, Nov 25 2024 11:48 AM | Last Updated on Mon, Nov 25 2024 1:01 PM

The Only Indian Train Which Does Not Require A Ticket Past 75 Years

భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 13 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి. కానీ ఒక రైలు మాత్రం గత 75 ఏళ్లుగా ప్రయాణికులకు ఉచిత సర్వీస్‌ని అందిస్తుంది. టిక్కెట్‌ లేకుండా ఫ్రీగా ఈ రైలులో ప్రయాణించొచ్చు. ఇలాంటి రైల్వే సర్వీస్‌ కూడా ఉందా..? ఇంతకీ ఏ ట్రైయిన్‌ ఈ ఉచిత సర్వీస్‌ని అందిస్తుంది. ఇది నిజమేనా అంటే..

ఇలా 75 ఏళ్లుగా ఉచిత సర్వీసులందిస్తున్న ఏకైక రైలు భాక్రా నంగల్‌ రైలు. ఇది నంగల్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని భక్రా మధ్య నడుస్తుంది. చెప్పాలంటే సుందరమైన సట్లెజ్‌ నది, శివాలిక్‌​ కొండల మీదుగా వెళ్తోంది. ఈ రైలుని భాక్రానంగల్‌ డ్యామ్‌ నిర్మించే నిమిత్తం కార్మికులను తరలించడానికి ఉపయోగించేవారు. ఈ రైలు 1948 నుంచి పనిచేస్తుంది. ఇక 1953లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న డీజిల్‌ ఇంజన్లతో ఈ రైలుని అత్యాధునికంగా మార్చారు అధికారులు. 

ఈ రైలులోని సీట్లు కూడా నాటి రైళ్లులో ఉండే విధానాన్ని గుర్తుకుతెస్తుంది. ఇది మన సుదీర్ఘ రైల్వే చరిత్రకు ప్రతిబింబంగా నిలిచిన రైలు కావడంతో ఉచిత సర్వీస్‌ను అందించాలని నిర్ణయించారు. నిజానికి ప్రతిగంటకు ఈ రైలుకి సుమారు 18 నుంచి 20 లీటర్ల ఇంధనం ఖర్చు అవ్వుతుంది. అలాగే భక్రా బియాస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(బీబీఎంబీ) నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఛార్జీలు వసూలు చేయాలని భావించినా..మన సుదీర్ఘ రైల్వే వ్యవస్థకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ రైలులో ప్రయాణికులకు ఉచిత సర్వీస్‌ అందించడమే సముచితమని నిర్ణయించారు అధికారులు. 

అందువల్లే ఈ రైలు ఎక్కాలంటే టిక్కెట్‌ తీసుకోవాల్సిన పనిలేదు. ప్రయాణికులందరికీ ఉచితంగానే సర్వీస్‌ అందిస్తోంది. ప్రతిరోజూ 800 మందికి పైగా ఈ రైలును ఉపయోగిస్తున్నారు. చాలామంది సందర్శకులకు ఇది ఓ అద్భుతమైన రైలు ప్రయాణంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రైలు నడిచే మార్గంలో కనిపించే అద్భుతమైన భాక్రా-నంగల్‌ డ్యామ్‌, శివాలిక్‌ కొండలు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. 

సర్వీస్‌:
ప్రతి రోజు ఉదయం 7:05 గంటలకు, రైలు నంగల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి 8:20 గంటలకు భాక్రా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నంగల్ నుంచి మధ్యాహ్నం 3:05 గంటలకు మరొక ట్రిప్‌కు బయలుదేరుతుంది. సాయంత్రం 4:20 గంటలకు భాక్రా రైల్వేలో ప్రయాణీకులను దింపుతుంది.

 

(చదవండి: ఈ రాజుల విచిత్రమైన నమ్మకాలు, క్రేజీ ఆలోచనలు వింటే విస్తుపోతారు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement