free of cost
-
గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్ సర్వీస్ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..!
భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 13 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి. కానీ ఒక రైలు మాత్రం గత 75 ఏళ్లుగా ప్రయాణికులకు ఉచిత సర్వీస్‌ని అందిస్తుంది. టిక్కెట్ లేకుండా ఫ్రీగా ఈ రైలులో ప్రయాణించొచ్చు. ఇలాంటి రైల్వే సర్వీస్ కూడా ఉందా..? ఇంతకీ ఏ ట్రైయిన్ ఈ ఉచిత సర్వీస్‌ని అందిస్తుంది. ఇది నిజమేనా అంటే..ఇలా 75 ఏళ్లుగా ఉచిత సర్వీసులందిస్తున్న ఏకైక రైలు భాక్రా నంగల్ రైలు. ఇది నంగల్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లోని భక్రా మధ్య నడుస్తుంది. చెప్పాలంటే సుందరమైన సట్లెజ్ నది, శివాలిక్ కొండల మీదుగా వెళ్తోంది. ఈ రైలుని భాక్రానంగల్ డ్యామ్ నిర్మించే నిమిత్తం కార్మికులను తరలించడానికి ఉపయోగించేవారు. ఈ రైలు 1948 నుంచి పనిచేస్తుంది. ఇక 1953లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న డీజిల్ ఇంజన్లతో ఈ రైలుని అత్యాధునికంగా మార్చారు అధికారులు. ఈ రైలులోని సీట్లు కూడా నాటి రైళ్లులో ఉండే విధానాన్ని గుర్తుకుతెస్తుంది. ఇది మన సుదీర్ఘ రైల్వే చరిత్రకు ప్రతిబింబంగా నిలిచిన రైలు కావడంతో ఉచిత సర్వీస్‌ను అందించాలని నిర్ణయించారు. నిజానికి ప్రతిగంటకు ఈ రైలుకి సుమారు 18 నుంచి 20 లీటర్ల ఇంధనం ఖర్చు అవ్వుతుంది. అలాగే భక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు(బీబీఎంబీ) నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఛార్జీలు వసూలు చేయాలని భావించినా..మన సుదీర్ఘ రైల్వే వ్యవస్థకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ రైలులో ప్రయాణికులకు ఉచిత సర్వీస్ అందించడమే సముచితమని నిర్ణయించారు అధికారులు. అందువల్లే ఈ రైలు ఎక్కాలంటే టిక్కెట్ తీసుకోవాల్సిన పనిలేదు. ప్రయాణికులందరికీ ఉచితంగానే సర్వీస్ అందిస్తోంది. ప్రతిరోజూ 800 మందికి పైగా ఈ రైలును ఉపయోగిస్తున్నారు. చాలామంది సందర్శకులకు ఇది ఓ అద్భుతమైన రైలు ప్రయాణంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రైలు నడిచే మార్గంలో కనిపించే అద్భుతమైన భాక్రా-నంగల్ డ్యామ్, శివాలిక్ కొండలు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. సర్వీస్:ప్రతి రోజు ఉదయం 7:05 గంటలకు, రైలు నంగల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి 8:20 గంటలకు భాక్రా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నంగల్ నుంచి మధ్యాహ్నం 3:05 గంటలకు మరొక ట్రిప్‌కు బయలుదేరుతుంది. సాయంత్రం 4:20 గంటలకు భాక్రా రైల్వేలో ప్రయాణీకులను దింపుతుంది. (చదవండి: ఈ రాజుల విచిత్రమైన నమ్మకాలు, క్రేజీ ఆలోచనలు వింటే విస్తుపోతారు..!) -
ఆర్టీసీలో ప్రయాణం ఉచితం
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్ నుంచి నగరానికి చేరుకున్న వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తెలంగాణలోని ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసేందుకు తగిన విధంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. -
రూ. 3 వేల న్యుమోనియా వ్యాక్సిన్ ఉచితంగా
సాక్షి, సిటీబ్యూరో: న్యూమోనియాను కట్టడి చేసేందుకు త్వరలో న్యూమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సినేషన్(పీసీవీ)ను హైదరాబాద్ జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన టాస్క్ఫోర్సు సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యుమోనియా తీవ్ర శ్వాసకోశ సంక్రమణ వ్యాధి అని, జ్వరం, చెవినొప్పి, చెవి నుంచి స్రావం, ముక్కు నుంచి నిరంతరం స్రావం, తలనొప్పి, వేగంగా శ్వాసించడం వంటి రుగ్మతలు కలుగుతాయన్నారు. దీని నుంచి పిల్లలను రక్షించడానికి సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో పీసీవీ వ్యాక్సిన్‌ను ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ♦ చిన్న పిల్లలకు మొదటి డోసు ఆరు వారాలకు, రెండో డోసు 14 వారాల వయసుగల వారికి, 9 నెలల వయసులో మూడవ డోసు ఇస్తారని తెలిపారు. ♦ ఇది చాలా ఖరీదైన వ్యాక్సిన్ అని, ప్రైవేటు ఆసుపత్రుల్లో ధర రూ.3 వేల వరకు ఉంటుందన్నారు. ♦ ప్రభుత్వం దీన్ని ఉచితంగా పంపిణీ చేస్తోందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ♦ ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఎఎన్ఎంలు, అంగన్వాడి, ఇతర ఆరోగ్య సిబ్బందికి శిక్షణ త్వర లో పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్య క్రమంలో డాక్టర్ పద్మజ, ఎస్పీహెచ్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్: ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సెక్స్ వర్కర్లకు ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందించనుంది. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్ అందజేయాలని సుప్రీం కోర్టు గత నెలలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్, లీగల్ ఆర్గనైజేషన్లు గుర్తించిన సెక్స్ వర్కర్లకు రేషన్ పంపిణీ చేయడంతోపాటు ఆ వివరాలను తమకు సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గుర్తింపు కార్డుల ఆధారంగా నవంబర్ నెల రేషన్ అందజేయనుంది. (కరోనా: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్) చౌకధరల దుకాణాలు, అంగన్వాడీ సెంటర్ల ద్వారా రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్రంలో 1.22 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టు ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గుర్తించింది. వీరిలో హోమో సెక్సువల్స్‌తోపాటు ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఎంత రేషన్ ఇస్తోందో అంతే మొత్తంలో పంపిణీ చేయనుంది. (ఇంటింటికీ కొళాయి.. ప్రతిరోజూ మంచినీళ్లు) -
ఆన్లైన్ నగదు బదిలీలపై చార్జీల రద్దు
ముంబై : బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ భారీ ఊరట కల్పించింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ల ద్వారా చేపట్టే ఆన్లైన్ ట్రాన్స్ఫర్లపై చార్జీలను తొలగించడంతో ఈ లావాదేవీలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులు ఈ సౌలభ్యాన్ని ఖాతాదారులకు మళ్లించాలని ఆర్బీఐ కోరింది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా గురువారం ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ఆర్టీజీఎస్, నెఫ్ట్‌లపై విధిస్తున్న చార్జీలన్నింటినీ తొలగించాలని నిర్ణయించింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ తెలిపింది. భారీగా నిధుల బదిలీని చేపట్టే ఆర్టీజీఎస్, ఇతర నిధుల బదిలీల కోసం నెఫ్ట్ లావాదేవీలపై ఆర్బీఐ బ్యాంకుల నుంచి కనీస మొత్తాన్ని వసూలు చేస్తోంది. బ్యాంకులు ఈ చార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఆన్లైన్ నగదు ట్రాన్స్ఫర్ చేపట్టే కస్టమర్లకు ఊరట కలగనుంది. కాగా, మరో వారంలో దీనిపై బ్యాంకులకు నిర్ధిష్ట ఉత్తర్వులు జారీ చేస్తామని ఆర్బీఐ తెలిపింది. -
ప్రకాశ్ రాజ్ పారితోషికం తీసుకోలేదు
ముంబై: విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పారితోషికం తీసుకోకుండా ఉచితంగా ఓ సినిమాలో నటించారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా సిలా సమయంగలిల్లో ప్రకాశ్ రాజ్ ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో నటించినందుకు ప్రకాశ్ డబ్బులు తీసుకోలేదని ప్రియదర్శన్ చెప్పారు. ముంబై ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేందుకు ప్రియదర్శన్ వెళ్లారు. ముంబై ఫిలిం ఫెస్టివల్లో సిలా సమయంగలిల్ను ప్రదర్శించనున్నారు. ఇసరి గణేశ్, ప్రభు దేవా, ఏఎల్ విజయ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్‌తో పాటు శ్రియా రెడ్డి, అశోక్ సెల్వన్ నటించారు. ఎయిడ్స్ గురించి ఈ సినిమా తీశారు. -
పైసా ఖర్చులేని రాళ్ల వైద్యం భలే!
బీజింగ్: ప్రకృతి వైద్యమంటే ఆకులను, బెరళ్లను పేస్ట్‌గా చేసి రాసుకోవడం గురించి తెలుసు. కొన్నిసార్లు మట్టిని ఒంటినిండా పూసుకొని కూడా వైద్యం చేస్తారు. మరి ఎండకు వేడెక్కే బండలపై పడుకోబెట్టి చేసే ప్రకృతి వైద్యం గురించి మీకు తెలుసా? చైనాలో చాలామంది మహిళలు ఇప్పుడు ఇలాంటి వైద్యాన్నే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఎండలో.. కాలే రాళ్లపై పడుకుంటే ఎన్నో రకాల రోగాలు నయమవుతాయని అంటున్నారు. ఈ వైద్యం కోసమని ముఖాలపై చిన్నపాటి టవల్‌నో, గుడ్డనో కప్పుకుని ఎండకు వేడెక్కిన పెద్ద పెద్ద రాళ్లను కౌగిలించుకుంటున్నారు. మరీ పెద్దరాయి దొరికితే దానిపై వెల్లకిలా పడుకుంటున్నారు. అక్కడ ఇదో పెద్ద ట్రెండ్‌గా మారిపోయింది. పైసా ఖర్చులేని వైద్యం కదా.. అందుకే పార్కుల్లోనూ, ఎండ తగిలే ఖాళీ ప్రదేశాల్లోనూ ప్రత్యేకంగా పెద్ద పెద్ద రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 3-5 గంటల మధ్య గ్జియాన్ నగరంలో ఎక్కడ చూసినా ఇలా రాళ్లపై పడుకునేవారే కనిపిస్తున్నారు. -
మహిళలకు ఇక ఉచితంగా అల్ట్రా స్కానింగ్
-శాసనమండలిలో మంత్రి కామినేని ప్రకటన - ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ఆపేశామని వెల్లడి హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు ఉచిత అల్ట్రా స్కానింగ్ పరీక్షల సౌకర్యం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రకటించారు. ఒక్క నెల రోజుల వ్యవధిలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించారు. శాసనమండలిలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య పాలసీపై చేపట్టిన స్వల్పకాలిక చర్చకు మంగళవారం మంత్రి సమాధానమిచ్చారు. గ్రామాల్లో సబ్‌సెంటర్లు- అంగన్వాడీ కేంద్రాలు కలిసి పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎక్కువ ప్రసవాలు జరుగుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వైద్య విధాన పరిషత్ ద్వారా రెండు విడతలలో 1400 మంది డాక్టర్ల నియమాకాలు చేపట్టామని, మూడో విడతలో త్వరలో మరో 205 డాక్టర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అపోలో సంస్థకు అప్పగించడాన్ని కొందరు తప్పుపడుతున్నారని.. ఈ ప్రక్రియలో అటు ప్రభుత్వానికీ, అపోలో సంస్థకు ఇద్దరికీ ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలంటే రూ. 300 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. చిత్తూరు ఆసుపత్రిని అపోలో సంస్థకు అప్పగించినప్పటికీ, వారు రోగుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి అనుమతి ఉండదన్నారు. మిగిలిన ప్రభుత్వ ఆసుప్రతులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియను ఆపేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ యూనిట్లను ప్రైవేటీకరించే ఆలోచన లేదని కామినేని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు బయట సొంత ఆసుపత్రులను కూడా నిర్వహిస్తున్నవారిని 600 మందిని గుర్తించి తొలి హెచ్చరికగా వారందరి జీతాల నుంచి మూడు ఇంక్రిమెంట్లు చొప్పున కోత పెట్టినట్టు మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అదనపు మొత్తం వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వైజాగ్‌లోని విమ్స్ కొత్త భవనంలో వచ్చే నెల 11వ తేదీ నుంచి ఒపీ ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నామని, దానిని సూపర్ సెష్పాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. -
ఐదుగురు హీరోలతో ఓ సినిమా!
ఇద్దరు హీరోలు కలిసి నటిస్తేనే మల్టీ స్టారర్ అంటాం. అదికూడా ఒక సీనియర్ హీరో, ఒక కుర్రహీరో కలిసి చేయడం ఇన్నాళ్లూ జరుగుతోంది. కానీ ఒకేసారి ఐదుగురు కుర్ర హీరోలు కలిసి ఓ సినిమా చేయడం సాధ్యమేనా? తమకు సాధ్యమంటున్నారు కోలీవుడ్ హీరోలు. అది కూడా పూర్తి ఉచితంగా చేస్తున్నారు!! విశాల్, ఆర్య, కార్తీ, జీవా, జయం రవి.. వీళ్లు ఐదుగురూ కలిసి ఓ తమిళ సినిమాను ఉచితంగా చేస్తున్నారు. ఈ సినిమాకు వచ్చిన లాభాలను దక్షిణ భారత సినీ కళాకారుల సంఘం (సిఫా).. అదే, నడిగర సంఘం భవన నిర్మాణానికి ఉపయోగిస్తారు. తామంతా కలిసి ఈ సినిమా చేస్తున్నట్లు విశాల్ మీడియాకు తెలిపాడు. వాస్తవానికి కొన్నేళ్ల క్రితమే నడిగర సంఘానికి కొత్త భవనం కట్టించాలనుకున్నా, మద్రాసు హైకోర్టు స్టే ఇవ్వడంతో అది ఆగిపోయింది. సంఘం ప్రాంగణాన్నిఓ మల్టీప్లెక్సుకు అద్దెకు ఇస్తున్నారంటూ ఫిర్యాదులు రావడమే ఇందుకు కారణం. అయితే, నడిగర సంఘానికి శాశ్వత భవనం ఉండాలనే తామంతా భావించామని, ఇటీవలే సర్వసభ్య సమావేశంలో ఈ ఆలోచన గురించి చర్చించామని విశాల్ చెప్పాడు. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. విశాల్ ప్రస్తుతం సుందర్ దర్శకత్వంలో వస్తున్న 'అంబాలా'లో నటిస్తున్నాడు. దీపావళికి అతడు నటించిన 'పూజ' చిత్రం విడుదల కానుంది.