![Bank Customers In For A Treat As RBI Makes Online Transfers Free - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/6/note.jpg.webp?itok=28XwAKR-)
ముంబై : బ్యాంకు ఖాతాదారులకు ఆర్‌బీఐ భారీ ఊరట కల్పించింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్‌ల ద్వారా చేపట్టే ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్‌లపై చార్జీలను తొలగించడంతో ఈ లావాదేవీలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులు ఈ సౌలభ్యాన్ని ఖాతాదారులకు మళ్లించాలని ఆర్‌బీఐ కోరింది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా గురువారం ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ ఆర్టీజీఎస్, నెఫ్ట్‌లపై విధిస్తున్న చార్జీలన్నింటినీ తొలగించాలని నిర్ణయించింది.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. భారీగా నిధుల బదిలీని చేపట్టే ఆర్టీజీఎస్, ఇతర నిధుల బదిలీల కోసం నెఫ్ట్ లావాదేవీలపై ఆర్‌బీఐ బ్యాంకుల నుంచి కనీస మొత్తాన్ని వసూలు చేస్తోంది. బ్యాంకులు ఈ చార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఆన్‌లైన్ నగదు ట్రాన్స్‌ఫర్ చేపట్టే కస్టమర్లకు ఊరట కలగనుంది. కాగా, మరో వారంలో దీనిపై బ్యాంకులకు నిర్ధిష్ట ఉత్తర్వులు జారీ చేస్తామని ఆర్‌బీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment