
‘జెమ్’ సీఈవోగా అజయ్ భదూ
న్యూఢిల్లీ: వాణిజ్యయ శాఖ అదనపు సెక్రటరీగా ఉన్న అజయ్ భదూని ప్రభుత్వ కొనుగోళ్ల ప్లాట్‌ఫామ్ (గవర్నమెంట్ ఈ–మార్కెట్/జెమ్) సీఈవోగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుత బాధ్యతలకు అదనంగా కొత్త బాధ్యతలు చేపడతారని తెలిపింది. జెమ్ పోర్టల్‌ను ప్రభుత్వం 2016 ఆగస్ట్ 9న ప్రారంభించడం గమనార్హం. అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు తమకు కావాల్సిన వస్తువుల కొనుగోళ్లకు వీలుగా దీన్ని అభివృద్ధి చేసింది. 1999 గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన భదూ విభిన్న రంగాల్లో విధానాల రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారు.
ఇదీ చదవండి: టాటా డిస్‌ప్లే చిప్స్ వస్తున్నాయ్..
ఆర్‌బీఐ ఈడీగా అజిత్ రత్నాకర్
ముంబై: గణాంకాలు, సమాచార నిర్వహణ, ఆరి్థక సుస్థితర శాఖలో ప్రధాన సలహాదారుగా సేవలందిస్తున్న అజిత్ రత్నాకర్ జోషి ఇకపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ శాఖతోపాటు సైబర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన జోషీకి ఆర్‌బీఐ తాజాగా పదవోన్నతి కలి్పంచింది. జోషీ హైదరాబాద్‌లోని బ్యాంకింగ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీ సభ్యులుగా సైతం పనిచేశారు.అంతేకాకుండా స్థూల ఆరి్థక గణాంకాలు, విధాన సవాళ్లకు సంబంధించిన సంకలనాలపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్‌లు, కమిటీలలోనూ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. నాగ్‌పూర్ యూనివర్శిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఐఐటీ మద్రాస్ నుంచి మానిటరీ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు.