
మోదీ నేతృత్వంలో సమావేశమైన కమిటీ
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నూతన డైరెక్టర్ నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అపాయింట్‌మెంట్ కమిటీ సోమవారం సమావేశమైంది. విపక్ష నేత రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ భేటీలో పాల్గొన్నారు. సీబీఐ ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం ఈ నెల 25న ముగినుంది.
ఆయన 2023 మే 25న సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కొత్త డైరెక్టర్‌గా పలువురు సీనియర్ అధికారుల పేర్లను అపాయింట్‌మెంట్ కమిటీ పరిశీలించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం... ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు సీబీఐ నూతన డైరెక్టర్‌ను కేంద్రం నియమిస్తుంది.