ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా(CBI) తాజాగా అరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో.. డైమండ్ జూబ్లీ వేడుకలను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
సీబీఐ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించడంతో పాటు షిల్లాంగ్, పూణే, నాగ్‌పూర్‌లలో కొత్తగా ఏర్పాటు చేసిన సీబీఐ కాంప్లెక్స్‌లను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్‌తో పాటు ఉత్తమ దర్యాప్తు అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు. అలాగే.. డైమండ్ జూబ్లీ ఉత్సవాల స్మారకార్ధం పోస్టల్ స్టాంపు, నాణెం విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలోనే సీబీఐ కొత్త ట్విటర్ హ్యాండిల్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘సీబీఐ పరిధి పెరిగింది. చాలా నగరాల్లో సీబీఐ ఆఫీసులు నెలకొల్పుతున్నాం. అవినీతి సాధారణ నేరం కాదు. దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన శత్రువు. అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారు. 2014లో మేము అవినీతిపై యుద్ధం ప్రారంభించాము. 2014 తర్వాత సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది. అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలకపాత్ర. ఇప్పుడు అవినీతిపరులు భయపడుతున్నారు. గత ప్రభుత్వాలు అవినీతిని వ్యవస్థీకృతం చేశాయి. ఒక కుంభకోణానికి మించి మరో కుంభకోణం చేశాయి. 2జీ స్కామ్ అతిపెద్ద కుంభకోణం. ఆర్థిక నేరగాళ్లు వేలకోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయారు. బీజేపీ ప్రభుత్వం అవినీతిపై యుద్ధం చేస్తోంది’ అని స్పష్టం చేశారు.
ఇక, నాటి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీర్మానం మేరకు.. 1963, ఏప్రిల్ 1వ తేదీన సీబీఐ ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ పర్యవేక్షణలో.. సీబీఐ పని చేస్తుంది. దేశంలో ఇప్పటిదాకా ఎన్నో హైప్రొఫైల్‌తో పాటు సంక్లిష్టమైన కేసుల్ని పరిష్కరించిన కేంద్రం అత్యున్నత దర్యాప్తు సంస్థగా సీబీఐకంటూ ఓ పేరు ఉండిపోయింది.
#WATCH | 10 years ago, there was a competition to do more and more corruption. Big scams took place during that time but the accused were not scared because the system stood by them… After 2014, we worked on a mission mode against corruption, black money: PM Narendra Modi pic.twitter.com/LOqxd6mCbz
— ANI (@ANI) April 3, 2023
ఇదీ చదవండి: ఆలయంలోకి బుల్డోజర్లు.. అక్రమ కట్టడం కూల్చివేత
Comments
Please login to add a commentAdd a comment