
ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎమ్‌డీగా ఉదయ్ కోటక్ నియామాకానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది.
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎమ్‌డీగా ఉదయ్ కోటక్ నియామాకానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. మరో మూడేళ్ల పాటు ఉదయ్ కోటక్ ఈ పదవిలో కొనసాగుతారు. కోటక్ ఇప్పటికే గత 17 సంవత్సరాలుగా కోటక్ మహీంద్రా బ్యాంక్ అధిపతిగా పనిచేశారు. ప్రకాష్ ఆప్టేను పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా, దీపక్ గుప్తాను జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి నియమించడానికి ఆర్‌బీఐ అనుమతి ఇచ్చిందని కోటక్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. 2021 జనవరి నుంచి ఈ నియామకాలు అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. (జియోకు వ్యతిరేకంగా విష ప్రచారం!)
(చదవండి : స్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్)