జనంలో రూ.2000 నోట్లు.. ఇంకా అన్ని ఉన్నాయా? | Rs 6577 Crore Worth Rs 2000 Notes Still With Public | Sakshi
Sakshi News home page

జనంలో రూ.2000 నోట్లు.. ఇంకా అన్ని ఉన్నాయా?

Published Sun, Mar 2 2025 7:23 AM | Last Updated on Sun, Mar 2 2025 7:27 AM

Rs 6577 Crore Worth Rs 2000 Notes Still With Public

ముంబై: ఉపసంహరించిన రూ.2000 నోట్లలో ఇప్పటి వరకు 98.18 శాతం తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థకు చేరాయి. ప్రజల వద్ద ఇంకా రూ.6,471 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శనివారం తెలిపింది.

2023 మే 19న ఆర్‌బీఐ రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఆనాడు చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. 2025 ఫిబ్రవరి 28 నాటికి ఈ విలువ రూ.6,471 కోట్లకు వచ్చి చేరిందని ఆర్‌బీఐ పేర్కొంది.

ఆర్‌బీఐ కరెన్సీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న 19 ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను డిపాజిట్‌ లేదా మార్చుకునే సదుపాయం ఉంది.  మొత్తం మీద దేశంలో ఇప్పటికీ కొందమంది దగ్గర రూ. 2000 నోట్లు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇవన్నీ పూర్తిగా ఆర్‌బీఐకు ఎప్పుడు చేరుతాయనేది తెలియాల్సిన విషయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement