rs.2000 notes
-
చెలామణీలో రూ.2వేల నోట్లు.. ఆర్బీఐకి చేరాల్సింది ఇంకా ఎంతంటే?
రూ.2వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుండి వాటి చెలామణిలో గణనీయమైన తగ్గుదలని వెల్లడించింది. తాజా డేటా ప్రకారం, చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ మే 19, 2023న రూ.3.56 లక్షల కోట్ల నుండి ఫిబ్రవరి 29, 2024 నాటికి కేవలం రూ.8470 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. తద్వారా మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 97.62శాతం తిరిగి వచ్చాయి అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం /లేదంటే మార్చుకునే సదుపాయం దేశంలోని అన్ని బ్యాంకు శాఖలలో అక్టోబర్ 07, 2023 వరకు అందుబాటులో ఉంది. ఇందుకోసం 19 ఇష్యూ కార్యాలయాల్లో అందుబాటులోకి తెచ్చింది ఆర్బీఐ. అయినప్పటికీ దేశంలో ఉన్న మొత్తం రూ.2వేల నోట్లు ఇంకా వినియోగంలో ఉన్నాయని, పూర్తి స్థాయిలో ఆర్బీఐకి చేరేందుకు మరింత సమయం పట్టొచ్చని ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.2వేల నోట్ల మార్పిడి గడువు ముగిసింది, ఆ రూ.12వేల కోట్లు తిరిగి వచ్చినట్లేనా
దేశంలో రూ.2000 విలువైన నోట్ల మార్పిడి లేదా డిపాజిట్‌కు గడువు ముగిసింది. అయినప్పటికీ మార్కెట్లో రూ.12వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ నోట్ల మార్పిడిపై కీలక ప్రకటన చేశారు. ఎక్ఛేంజ్‌కి డెడ్‌లైన్ ముగిసినా నోట్ల మార్పిడి కొనసాగుతుందని అన్నారు. ఆర్బీఐ తొలుత నోట్ల మార్పిడి గడువు సెప్టెంబర్ 30 వరకూ అవకాశం ఇచ్చింది. తర్వాత గడువు ఈ నెల 7వ తేదీకి పొడిగించింది. మార్పిడి కావాల్సిన నోట్లు ఇంకా ఉండగా.. గడువు ముగియడంపై ఆర్బీఐ స్పందించింది. అక్టోబర్ 7 తర్వాత నోట్లను ఎక్ఛేంజ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. గడువు ముగిసినా నోట్లు మార్చుకోవచ్చు దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2000నోట్లను ఒకేసారి రూ.20 వేల వరకూ డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పోస్టాఫీసుల ద్వారా కూడా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రూ.2000 నోట్లు పంపవచ్చు. అలా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రూ.2000 నోట్లు పంపిన వారి బ్యాంకు ఖాతాలో ఆ నోట్ల విలువ సొమ్ము క్రెడిట్ అవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు బ్యాంకులకు ఎంత వచ్చి చేరాయంటే ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లలో 87 శాతం బ్యాంకు డిపాజిట్లుగా తిరిగి వచ్చాయని, మిగిలినవి మార్చుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అయితే ఇంకా రూ.12,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు తిరిగి రావాల్సి ఉందన్నారు. రూ. 2,000 నోట్ల మొత్తం విలువలో 96 శాతానికి పైగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి. అక్టోబర్‌తో 7తో గడువు ముగిసింది. అక్టోబర్ 7 తర్వాత రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని స్పష్టం చేశారు. -
రూ. 2,000 వేల నోట్ల మార్పిడికి నేడే చివరి రోజు!
రూ.2000 నోట్లను మార్చుకున్నారా? లేదంటే ఇప్పుడే ఆ పని చేయండి. ఎందుకంటే నోట్ల మార్పిడికి ఆర్బీఐ విధించిన గడువు నేటితో (సెప్టెంబర్ 30) ముగియనుంది. ఈ రోజు దాటితే మీ వద్ద ఉన్న 2వేల నోట్లు ఎందుకు పనికి రావు. ఆర్బీఐ సైతం నోట్ల ఎక్ఛేంజ్ గడుపు పెంచడం లేదని స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది మే 19వ తేదీన భారతీయ కరెన్సీలో అతిపెద్ద నోటు 2వేల నోటును రద్దు చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. మే 23వ తేదీ నుండి 2వేల నోట్లను బ్యాంకులలో మార్చుకోవాలని సూచించింది.ఈ నోట్ల మార్పిడికి చివరి గడువు సెప్టెంబర్ 30 వరకు ఇచ్చింది. రూ.2,000 మార్పిడి.. ఆర్బీఐ స్పష్టత ఆ గడువును ఆర్బీఐ మరింత పొడిగిస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ తరుణంలో ఆర్బీఐ రూ.2,000 మార్పిడిపై స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 30, 2023లోగా మార్చుకోవాలని సూచించింది. నోట్ల ఎక్ఛేంజ్ కోసం గడువు పొడిగించే అవకాశం లేదని తెలిపింది. కాబట్టే, మీ వద్ద రూ.2,000 నోట్లు ఉంటే ఈ శనివారం లోగా ఎక్ఛేంజ్ చేసుకోవాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. 93 శాతం వరకు రూ.2,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మే నుంచి గత ఆగస్టు నెల వరకు మొత్తం 93 శాతం నోట్లు బ్యాంకుల్లో జమైనట్లు తెలిపింది. వీటి విలువ రూ.3.32 లక్షల కోట్లు. ఇంకా రూ.24,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వెనక్కి రావాల్సి ఉంది. రూ.2,000 ఎక్కడ మార్చుకోవచ్చు ప్రజలు తమ రూ.2,000 నోట్లను బ్యాంకు శాఖలు, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. బ్యాంకు అకౌంట్ లేని వ్యక్తి ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు రూ. 2000 నోట్లను మార్చుకునే అవకాశం కల్పిచ్చింది. వినియోగంలోకి రూ.2,000 నోట్లు ఆర్బీఐ రూ.2000 నోటును నవంబర్ 2016లో ప్రవేశపెట్టబడింది. ప్రాథమికంగా ఆ సమయంలో చలామణిలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకుంది. -
రూ.2000 నోట్ల ఉపసంహరణ .. ఎంత శాతం వెనక్కి వచ్చాయంటే?
ఈ ఏడాది మేలో రూ.2,000 నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి జూన్ 24 నాటికి బ్యాంకుల్లో 72 శాతం (సుమారు రూ.2.62 లక్షల కోట్లు) రూ.2000 నోట్లను డిపాజిట్ చేయడం లేదంటే మార్చుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆర్బీఐ మే19న రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 30లోగా మార్చుకోవాలని కోరింది. నోట్ల ఉపసంహరణ,డిపాజిట్లను సులభతరం చేసేలా, బ్యాంకుల్లో సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండేలా రూ.2వేల నోట్లను ఏ బ్రాంచ్‌లోనైనా ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చని సెంట్రల్ బ్యాంక్ (ఆర్బీఐ) తెలిపింది. మే 23 ఆర్బీఐ సర్క్యులర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లీన్ నోట్ పాలసీని అనుసరించి రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించబడింది. రూ. 2,000 డినామినేషన్లో ఉన్న నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని పేర్కొంది. చదవండి👉 స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా? -
సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట!
మీ వద్ద రూ.2000 నోట్లున్నాయా? వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకో శుభవార్త. రూ.2000 నోట్ల సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. మీరు ఎక్కడి నుంచైనా సరే అమెజాన్ పే క్యాష్‌లో నెలకు రూ.50,000 వరకు రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న కస్టమర్లు అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్‌ను ఉపయోగించి ఆన్లైన్లో కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ అకౌంట్లకు ఆ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చని తెలిపింది. రూ.2,000 నోట్లను ఎలా డిపాజిట్ చేయాలి? ఈ సందర్భంగా అమెజాన్ పే’లో క్యాష్ ఎలా డిపాజిట్ చేయాలో అమెజాన్ తెలిపింది. ఆర్డర్ పెట్టుకున్న వస్తువు డెలివరీ అయ్యే సమయంలో నగదు చెల్లిస్తుంటాం. ఆ సమయంలో డెలివరీ అసోసియేట్‌కు మన వద్ద ఉన్న రూ.2000 నోట్లను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం అసోసియేట్లు మనం ఎంత విలువైన రూ.2,000 నోట్లను ఇచ్చామో.. ఆ మొత్తాన్ని మన బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రూ.2,000 నోటు ఉపసంహరణ మేలో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ప్రజలు సెప్టెంబర్ 30లోపు కరెన్సీని డిపాజిట్ చేసుకోవచ్చు, లేదంటే మార్చుకోవచ్చని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. అత్యధిక విలువ కలిగిన కరెన్సీని ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల పరిణామాలు ఉండవని హామీ ఇచ్చారు. ప్రతికూల అంశాలు తక్కువగా ఉంటాయని, ఆ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆర్బీఐ తక్షణమే పరిష్కరిస్తుందని పునరుద్ఘాటించారు. చదవండి : ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్.. ఫ్రీగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. ఎలా అంటే? -
బంగారం కొంటాం.. రూ.2 వేల నోట్లు తీసుకుంటారా?
రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన వెంటనే జువెలరీ షాపులకు ఎంక్వైరీలు వెల్లువెత్తాయి. బంగారం కొనుగోలుకు రూ.2 వేల నోట్లు స్వీకరిస్తారా అని కస్టమర్లు దేశవ్యాప్తంగా పలు జువెలరీ దుకాణాల్లో ఆరా తీస్తున్నారు. అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు అయితే 2016లో నోట్ల రద్దు సమయంలో కనిపించిన ఉధృత పరిస్థితి ఇప్పుడు లేదని జువెలర్స్ బాడీ జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) తెలిపింది. వాస్తవానికి రూ.2 వేల నోట్ల మార్పిడి, కఠిన కేవైసీ నిబంధనల నేపథ్యంలో గత రెండు రోజులుగా బంగారం కొనుగోళ్లు మందగించాయి. 10 శాతం వరకు అధిక ధర! రూ.2 వేల నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో కొంతమంది బంగారు వ్యాపారులు కస్టమర్ల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. బంగారం కొనుగోలు కోసం రూ.2 వేలు నోట్లు ఇచ్చే కస్టమర్ల నుంచి 5 నుంచి 10 శాతం అదనంగా తీసుకున్నట్లు తెలిసింది. 10 గ్రాముల గ్రాముల బంగారాన్ని రూ. 66,000 వరకు అమ్మినట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో బంగారం ధర తులం రూ.60,200 మేర ఉంది. కాగా రూ. 2 లక్షల లోపు బంగారం, వెండి ఆభరణాలు, రత్నాల కొనుగోలు కోసం పాన్, ఆధార్ వంటి డాక్యుమెంట్లను కస్టమర్లు సమర్పిచాల్సిన అవసరం లేదు. ‘రూ. 2,000 నోట్లతో బంగారం లేదా వెండిని కొనుగోలు చేసేందుకు కస్టమర్ల నుంచి జువెలరీ షాపులకు అధిక సంఖ్యలో ఎంక్వైరీలు వచ్చాయి. అయితే కఠినమైన కేవైసీ నిబంధనల కారణంగా వాస్తవ కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయి’ అని జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయమ్ మెహ్రా పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న ప్రకటించింది. ఆ నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి, బ్యాంకుల్లో మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. మరోవైపు రూ.2000 నోట్ల చలామణిని తక్షణమే నిలిపివేయాలని బ్యాంకులను కోరింది. ఇదీ చదవండి: RS 2000 Note: ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం.. -
రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన!
రూ.2వేల నోట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపడం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సూచనలూ ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంటులో తెలియజేశారు. ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వార్షిక నివేదికల ప్రకారం.. రూ.500, రూ.2,000 నోట్ల మొత్తం విలువ 2017 మార్చి చివరి నాటికి రూ.9.512 లక్షల కోట్లు. అదే 2022 మార్చి చివరి నాటికి రూ.27.057 లక్షల కోట్లు అని ఆర్థిక మంత్రి లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపకూడదని బ్యాంకులకు ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పారు. తమ కస్టమర్ల అవసరాలు, కాలానుగుణ ధోరణి మొదలైన వాటి ఆధారంగా బ్యాంకులు అంచనా వేసి ఏటీఎంలలో నోట్లను నింపుతాయని వివరించారు. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. కాగా రూ.2 వేల నోట్ల సర్క్యూలేషన్ పూర్తిగా తగ్గిపోయింది. పలు కారణాల చేత ఈ నోట్ల సర్క్యూలేషన్‌ను తగ్గించేసినట్టు తెలిసింది. ఆర్బీఐ గత కొన్నేళ్లుగా కనీసం ఒక్క రూ.2000 కరెన్సీ నోటును కూడా ప్రింట్ చేయలేదు. ఏటీఎంలలో ఈ నోట్లు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2019లోనే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసినట్టు ఆర్బీఐ ఆ మధ్య తెలిపింది. అయితే అప్పటికే చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు ఏమయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. -
నకిలీ నోట్ల ముఠా హల్చల్: గుట్టలుగా రూ.2 వేల నోట్ల కట్టలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో భారీ ఎత్తున నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టు అయింది. ఈ సందర్బంగా థానే క్రైమ్ బ్రాంచ్ భారీ ఎత్తున నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ. 2 వేల నకిలీ నోట్ల 400 కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ సమాధానం) ఇదీ చదవండి: అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా? నిందితులు రామ్ శర్మ, రాజేంద్ర రౌత్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. వీరి నుంచి భారీ మొత్తంలో రూ.2000 నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.8 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులిద్దరూ పాల్ఘర్ నివాసితులని తెలిపారు. ఈ నకిలీ నోట్లను మార్కెట్‌కు తరలించాలని ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. కాసర్వాడవలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెట్వర్క్ ఎంత విస్తరించిందీ దర్యాప్తు చేస్తున్నారు. (ఓలా ఎలక్ట్రిక్ బైక్ కమింగ్ సూన్, సీఈవో ట్వీట్ వైరల్) #WATCH | Maharashtra: Unit 5 of Thane Crime Branch seized fake Indian currency notes in Rs 2000 denomination with face value of Rs 8 Cr. Two people, both of them residents of Palghar, arrested. Search for other accused underway, probe initiated. (Video: Thane Crime Branch) pic.twitter.com/DwkZcmMK7e — ANI (@ANI) November 12, 2022 (హ్యుందాయ్ భారీ ఆఫర్, ఆ కారుపై లక్ష దాకా డిస్కౌంట్) (ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?) -
రూ.2 వేల నోటు : ఆర్థికమంత్రి కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: 2 వేల రూపాయల నోటు కనుమరుగు కానుందన్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. 2 వేల రూపాయల నోట్ల జారీని నిలిపి వేయాల్సిందిగా బ్యాంకులకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. బుధవారం వివిధ ప్రభుత్వ బ్యాంకుల ముఖ్య అధికారులతో జరిగిన ఒక సమావేశంలో నిర్మలా సీతారామన్ ఈ వివరణ ఇచ్చారు. తనకు తెలిసినంతవరకు బ్యాంకులకు అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదంటూ 2 వేల నోట్లకు సంబంధించి జరుగుతున్న పుకార్లను కొట్టి పారేశారు. 2 వేల రూపాయల విలువైన నోట్లు చట్ట బద్ధంగా చలామణిలో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని నిర్మలా సీతారామన్ సూచించారు. దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లను కేంద్రం గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో 2 వేల రూపాయల నోట్లను కూడా ఉపసంహరిస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా బ్యాంకులు ఏటీఎంలలో 2 వేలు రూపాయల నోట్లను ఉంచకపోవడం కూడా ప్రచారానికి బలం చేకూర్చింది. 2 వేల రూపాయల నోట్లకు బదులు 500 రూపాయల నోట్లనే ఎటీఎంలలో ఉంచుతుండటంతో ఇలాంటి వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. -
రూ.2వేల నోటుపై కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ తరువాత ఆర్బీఐ కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2000 నోటుపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసింది. నల్లధనాన్ని నిరోధించే క్రమంలో రూ.500, వెయ్యినోట్లను రద్దు చేసినట్టుగానే 2వేల నోటును కూడా రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆర్థికశాఖ లోక్‌సభలో క్లారిటీ ఇచ్చింది. రూ.2000 నోట్లను రద్దు చేసే ఉద్దేశం లేదని, ఆర్థికశాఖ సహాయమంత్రి రాధాకృష్ణన్ లోక్‌సభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో స్పష్టతనిచ్చారు. మరోవైపు అయిదు నగరాల్లో రూ.10 ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. రూ.10 ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే క్రమంలో క్షేత్రస్థాయిలో కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్లలో ట్రయల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాగా, ప్రస్తుతం ఉన్న రూ.500 నోట్ల సైజు 66 ఎంఎంX150 ఎంఎం ఉండగా, రూ.2000 నోట్ల సైజు 66 ఎంఎంX166 ఎంఎంగా ఉందని చెప్పారు. అలాగే రెండు కరెన్సీ నోట్ల మధ్య వ్యత్యాసాన్ని సులభంగా గుర్తించడానికి వీలుగా 10 మి.మీ తేడా ఉంచినట్టు తెలిపారు. -
టెర్రరిస్టుల వద్ద రూ.2వేల నోట్లు
జమ్మూ-కశ్మీర్: బండిపోరాలో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన టెర్రరిస్టుల వద్దు రూ.2000వేల నోట్లు ఉండటం సంచలనం సృష్టిస్తోంది. కొత్త నోట్లను విడుదల చేసి రెండు వారాలే అవుతున్నా అప్పుడే అవి టెర్రరిస్టులకు ఎలా చేరాయో తెలియడం లేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన ఇద్దరు టెర్రిరిస్టుల వద్ద రూ.15 వేల నగదు ఉన్నట్లు చెప్పారు. వీటిలో రెండు రూ.2వేల నోట్లు కాగా, మిగతావి 100నోట్లని తెలిపారు. బండిపోరా వద్ద కాల్పులకు దిగిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. ఇరువురు ఉగ్రవాదులు పాక్ ఉగ్రసంస్ధ లష్కరే తోయిబాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాదులకు ఆర్ధిక సాయం అందుతోంది అనడానికి ఇంతకంటే ఆధారాలు మరేం కావాలని కొంత మంది అధికారులు అంటున్నారు. వ్యాలీ మొత్తం మీద 200మందికి పైగా మిలిటెంట్లు ఉన్నట్లు సమాచారం. కాగా, ఏడాది కాలంగా ఎన్ కౌంటర్లలో హతమైన టెర్రరిస్టుల వద్ద నుంచి రూ.30వేల కంటే అధికంగా నగదు ఎన్నడూ లభ్యం కాలేదని చెప్పారు. -
రూ.2 వేల నోట్లు ఎందుకు?
చిత్తశుద్ధి ఉంటే అధికారపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల నల్లధనాన్ని వెలికితీయండి సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ గుంతకల్లు టౌన్ : పెద్ద నోట్లు రద్దు చేస్తూనే రూ.2 వేల నోట్లను ఎందుకు ముద్రించారని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ప్రశ్నించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేరులతో మాట్లాడారు. మోదీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొనసాగుతున్న అధికారపార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు దాచుకున్న నల్లధనాన్ని వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు సాహోసపేతమైన నిర్ణయమని బీజేపీ నేతలు ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటికీ ఏడుసార్లు పెద్ద నోట్ల రద్దు జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నారు. మోదీకి అనుకూలమైన ఆదానీ గ్రూప్‌కు విదేశాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు ఓ జాతీయ బ్యాంకు నుంచి రూ.6 వేల కోట్ల రుణం ఇప్పించలేదా అని ఆయన నిలదీశారు. ఓఎ¯Œన్జీసీ, కేజీబేసి¯న్ గ్యాస్‌లను అక్రమంగా అమ్ముకుని కోట్లాది రూపాయలను రిలయ¯Œ్స కంపెనీ దోచేసిందని కాగ్ తన నివేదికలో పేర్కొందన్నారు. ఆ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోని పెద్దమనుషులు అవినీతిని నిర్మూలిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నీతి, నిజాయితీ కలిగిన నేత అయితే గుంటూరులో జరిగిన సమావేశంలో ఆయా పార్టీ ఎమ్మెల్యేలకు షీల్డ్ కవర్లల్లో ఏం ఇచ్చారో చెప్పాలన్నారు. టీడీపీకి అనుకూలమైన పత్రికలే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతిపై వరుస కథనాలు ప్రచురించాడాన్ని బట్టి అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తెలుస్తోందన్నారు. సీపీఎం డివిజ¯ŒS కార్యదర్శి డి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి భజంత్రీ శీనా, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.