దేశంలో రూ.2000 విలువైన నోట్ల మార్పిడి లేదా డిపాజిట్‌కు గడువు ముగిసింది. అయినప్పటికీ మార్కెట్లో రూ.12వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ నోట్ల మార్పిడిపై కీలక ప్రకటన చేశారు. ఎక్ఛేంజ్‌కి డెడ్‌లైన్ ముగిసినా నోట్ల మార్పిడి కొనసాగుతుందని అన్నారు.
ఆర్‌బీఐ తొలుత నోట్ల మార్పిడి గడువు సెప్టెంబర్ 30 వరకూ అవకాశం ఇచ్చింది. తర్వాత గడువు ఈ నెల 7వ తేదీకి పొడిగించింది. మార్పిడి కావాల్సిన నోట్లు ఇంకా ఉండగా.. గడువు ముగియడంపై ఆర్‌బీఐ స్పందించింది. అక్టోబర్ 7 తర్వాత నోట్లను ఎక్ఛేంజ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.
గడువు ముగిసినా నోట్లు మార్చుకోవచ్చు
దేశవ్యాప్తంగా 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2000నోట్లను ఒకేసారి రూ.20 వేల వరకూ డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పోస్టాఫీసుల ద్వారా కూడా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రూ.2000 నోట్లు పంపవచ్చు. అలా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రూ.2000 నోట్లు పంపిన వారి బ్యాంకు ఖాతాలో ఆ నోట్ల విలువ సొమ్ము క్రెడిట్ అవుతుందని తెలిపారు.
ఇప్పటి వరకు బ్యాంకులకు ఎంత వచ్చి చేరాయంటే
ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లలో 87 శాతం బ్యాంకు డిపాజిట్లుగా తిరిగి వచ్చాయని, మిగిలినవి మార్చుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అయితే ఇంకా రూ.12,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు తిరిగి రావాల్సి ఉందన్నారు. రూ. 2,000 నోట్ల మొత్తం విలువలో 96 శాతానికి పైగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి. అక్టోబర్‌తో 7తో గడువు ముగిసింది. అక్టోబర్ 7 తర్వాత రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment