టెర్రరిస్టుల వద్ద రూ.2వేల నోట్లు
టెర్రరిస్టుల వద్ద రూ.2వేల నోట్లు
Published Wed, Nov 23 2016 7:52 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
జమ్మూ-కశ్మీర్: బండిపోరాలో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన టెర్రరిస్టుల వద్దు రూ.2000వేల నోట్లు ఉండటం సంచలనం సృష్టిస్తోంది. కొత్త నోట్లను విడుదల చేసి రెండు వారాలే అవుతున్నా అప్పుడే అవి టెర్రరిస్టులకు ఎలా చేరాయో తెలియడం లేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన ఇద్దరు టెర్రిరిస్టుల వద్ద రూ.15 వేల నగదు ఉన్నట్లు చెప్పారు. వీటిలో రెండు రూ.2వేల నోట్లు కాగా, మిగతావి 100నోట్లని తెలిపారు. బండిపోరా వద్ద కాల్పులకు దిగిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే.
ఇరువురు ఉగ్రవాదులు పాక్ ఉగ్రసంస్ధ లష్కరే తోయిబాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాదులకు ఆర్ధిక సాయం అందుతోంది అనడానికి ఇంతకంటే ఆధారాలు మరేం కావాలని కొంత మంది అధికారులు అంటున్నారు. వ్యాలీ మొత్తం మీద 200మందికి పైగా మిలిటెంట్లు ఉన్నట్లు సమాచారం. కాగా, ఏడాది కాలంగా ఎన్ కౌంటర్లలో హతమైన టెర్రరిస్టుల వద్ద నుంచి రూ.30వేల కంటే అధికంగా నగదు ఎన్నడూ లభ్యం కాలేదని చెప్పారు.
Advertisement
Advertisement