
శ్రీనగర్: అసెంబ్లీ ఎన్నికల ముందు జమ్ముకశ్మీర్‌లో బాంబు మోత మోగుతోంది. ఇప్పటికే కథువా, కిష్త్వార్ జిల్లాలో ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా.. తాజాగా బారాముల్లా జిల్లాలోనూ భద్రతా బలగాలు.. ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఈ ఎన్‌కౌంటర్ ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్ పట్టాన్ ప్రాంతంలోని చక్ తాపర్ క్రీలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. స్కూల్ బిల్డింగ్‌లో దాక్కున్న మిలిటెంట్లతో ఎదురుకాల్పులకు దిగారు. శుక్రవారం రాత్రి ఒక మిలిటెంట్ చనిపోగా, శనివారం ఉదయం మరో ఇద్దరు హతమయ్యారు.
చదవండి: మోదీ పర్యటన ముందు జమ్ముకశ్మీర్‌లో కాల్పుల మోత.. ఇద్దరు జవాన్ల మృతి
ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు చనిపోయినట్లు కశ్మీర్ ఐజీ వీకే బిర్డి వెల్లడించారు. ఆ మిలిటెంట్లను గుర్తించే ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు. మరోవైపు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ దోడా జిల్లాలో ప్రధాని మోదీ ప్రచారం చేపట్టనున్నారు.
Joint operation with @JmuKmrPolice in progress at #Baramulla. https://t.co/YZY7MLjYeo pic.twitter.com/GkvBlwRJ2k
— NORTHERN COMMAND - INDIAN ARMY (@NorthernComd_IA) September 14, 2024