శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్ ఒకరు ప్రాణాలు విడిచాడు. ఉదంపూర్‌లోని దాదు ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, సీఆర్‌పీఎఫ్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసుల రాకను గమనించి ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారు. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్‌ఎపీఎఫ్ అధికారి మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.
ఇదిలా ఉండగా.. జమ్మూ ప్రాంతంలో ఇటీవల తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. జూలైలో, దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పోలీసు సిబ్బంది మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ షాడో గ్రూప్ 'కశ్మీర్ టైగర్స్' పేర్కొంది.
జూలై 8న కతువా జిల్లాలోని పర్వత రహదారిపై ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment