CRPF forces
-
‘పుల్వామా’ అమరులకు ప్రధాని మోదీ ఘన నివాళులు
న్యూఢిల్లీ/హల్దా్వనీ: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధాని మోదీ శుక్రవారం నివాళులర్పించారు. దేశం పట్ల వారు అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచారని కొనియాడారు. వారి త్యాగాలను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటాయని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పుల్వామా ఉగ్ర ఘటనలో అసువులు బాసిన జవాన్లకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. వీరి త్యాగాల వల్లే మన దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్నారు. మానవీయతకే అతిపెద్ద శత్రువైన ఉగ్రవాదంపై పోరుకు నేడు ప్రపంచమే ఏకమైందని శుక్రవారం హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో తెలిపారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ని ఆత్మాహుతి దళ బాంబర్ వాహనంతో ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా వైమానికదళం యుద్ధ విమానాలు పీవోకేలోని బాలాకోట్ ఉగ్ర స్థావరాన్ని నేలమట్టం చేశాయి. -
సీఆర్పీఎఫ్ బలగాలు వెళ్లాయి.. తిరిగి వచ్చాయి!
నాగార్జునసాగర్: గత సంవత్సర కాలంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతను పర్యవేక్షిస్తూ విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు శనివారం ఉదయం విధుల నుంచి తప్పుకుని వెళ్లిపోయి.. తిరిగి సాయంత్రం విధుల్లో చేరాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2013 నవంబర్ 29న నాగార్జునసాగర్ డ్యాంపై ఆంధ్రా పోలీస్ బలగాలు సగం ప్రాజెక్టును స్వా«దీనంలోకి తీసుకున్నాయి. దీంతో కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశాల మేరకు అదే సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ నుంచి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ ప్రాజెక్టును తమ అ«దీనంలోకి తీసుకొని భద్రతా విధులు నిర్వహిస్తున్నాయి. సాగర్‌డ్యాంపై తెలంగాణ వైపు, ఆంధ్రా ప్రాంతంవైపు రెండు పక్కలా సీఆర్పీఎఫ్ దళాలు విధులు నిర్వహిస్తూ వచ్చాయి.అయితే, అకస్మాత్తుగా శనివారం తెల్లవారుజామున తెలంగాణ వైపు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు తమ విధులను ఉపసంహరించుకొని హిల్‌కాలనీలోని బాలవిహార్లోగల తమ క్యాంపులను ఖాళీ చేసి వెళ్లి పోయాయి. ఆంధ్రా వైపు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు యథావిధిగానే ఉన్నాయి. దీంతో తెలంగాణవైపు ప్రధాన డ్యాంపై స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) బలగాలు డ్యాంను తమ అ«దీనంలోకి తీసుకొని విధులు నిర్వహించాయి. శనివారం తెల్లవారుజామున వెళ్లిపోయిన సీఆర్పీఎఫ్ బలగాలు తిరిగి సాయంత్రానికి సాగర్‌లోని తమ క్యాంపులకు చేరుకొని నాగార్జునసాగర్ డ్యాం భద్రతా విధులలో చేరాయి.ఆంధ్రా వైపు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు అదేవిధంగా ఉండటంతో.. తెలంగాణ వైపు సీఆర్పీఎఫ్ బలగాలు తిరిగి సాగర్ ప్రాజెక్టు విధి నిర్వహణకు వచి్చనట్లుగా తెలుస్తోంది. సాగర్ ప్రాజెక్టు ఉన్నతాధికారులు ఎవరూ దీనిపై సమాధానం చెప్పడం లేదు. సాయంత్రం తిరిగి చార్జ్ తీసుకున్న సీఆర్పీఎఫ్ దళాల అసిస్టెంట్ కమాండర్ షహేర్ మాట్లాడుతూ శనివారం తెల్లవారుజామున విధులను ఉపసంహరించుకొని వెళ్లిపోయామని, తిరిగి ఉన్నతాధికారుల ఆదేశాలతో తెలంగాణ వైపు చార్జి తీసుకున్నట్లుగా తెలిపారు. సరైన ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందన్నారు. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరు ప్రాణాలు విడిచాడు. ఉదంపూర్‌లోని దాదు ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, సీఆర్పీఎఫ్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసుల రాకను గమనించి ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారు. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్ఎపీఎఫ్ అధికారి మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.ఇదిలా ఉండగా.. జమ్మూ ప్రాంతంలో ఇటీవల తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. జూలైలో, దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పోలీసు సిబ్బంది మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ షాడో గ్రూప్ 'కశ్మీర్ టైగర్స్' పేర్కొంది. జూలై 8న కతువా జిల్లాలోని పర్వత రహదారిపై ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. -
దేశ భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు
-
స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల భద్రత
-
కృష్ణా బోర్డుకు సాగర్
-
కృష్ణా బోర్డుకు ‘సాగర్’
సాక్షి, అమరావతి/మాచర్ల/విజయపురిసౌత్: ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించింది. కేంద్ర హోంశాఖ, జల్ శక్తి శాఖల కార్యదర్శులు అజయ్ బల్లా, దేబశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు తెలంగాణ భూభాగంలోని నాగార్జునసాగర్ సగం స్పిల్ వే, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను సీఆర్పీఎఫ్ బలగాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని స్పిల్‌వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను కూడా అప్పగించాలన్న కేంద్ర జల్ శక్తి శాఖ విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ క్రమంలో ఏపీ భూభాగంలోని స్పిల్‌వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్ర పోలీసులు ఆదివారం సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించి నీటి విడుదలను నిలిపివేశారు. 13వ క్రస్ట్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన కంచెను తొలగించారు. ఇకపై నాగార్జున సాగర్‌ను సీఆర్పీఎఫ్ బలగాల పహారాలో కృష్ణా బోర్డు నిర్వహించనుంది. ఉమ్మడి ప్రాజెక్టుల బాధ్యత బోర్డుకే.. కృష్ణాలో వరద ప్రారంభం కాకుండానే తెలంగాణ సర్కార్ 2021 జూలైలో బోర్డు అనుమతి తీసుకోకుండా అక్రమంగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి నీటిని దిగువకు వదిలేసి శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హక్కులను పరిరక్షించేలా కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. ఈ కేసు విచారణలో ఉండగానే కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించాలని ఆదేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఆరు అవుట్లెట్లను ఏపీ ప్రభుత్వం, తొమ్మిది అవుట్లెట్లను తెలంగాణ సర్కార్‌కు అప్పగించేందుకు కృష్ణా బోర్డు 15వ సర్వ సభ్య సమావేశంలో అంగీకారం తెలిపాయి. తెలంగాణ సర్కార్ తన భూభాగంలోని అవుట్ లెట్లను అప్పగిస్తే తమ భూ భాగంలోని ఆరు అవుట్లెట్లను అప్పగించడానికి సమ్మతి తెలుపుతూ 2021 అక్టోబర్ 14న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తన భూభాగంలోని 9 అవుట్లెట్లను అప్పగించకుండా తెలంగాణ సర్కార్ అడ్డం తిరగడంతో అప్పట్లో గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రాలేదు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న దుందుడుకు వైఖరితో ప్రజల్లో అసంతృప్తి పెల్లుబికి శాంతి భద్రతల సమస్యగా మారుతుండటంతో ఏపీ హక్కుల పరిరక్షణకు సాగర్ స్పిల్‌వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి రంగంలోకి దిగిన కేంద్రం నాగార్జునసాగర్‌ను కృష్ణా బోర్డుకు అప్పగించడం ద్వారా నోటిఫికేషన్ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈనెల 6న ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి నిర్వహించే సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా శ్రీశైలాన్ని బోర్డుకు అప్పగించే అవకాశం ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చరమగీతం పాడాలని కేంద్రం నిర్ణయించింది. నీటిపై నేడు త్రిసభ్య కమిటీ భేటీ నాగార్జునసాగర్ కుడి కాలువకు 5 టీఎంసీలు విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం కృష్ణా బోర్డుకు ప్రతిపాదన పంపింది. దీనిపై త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని బోర్డును కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సోమవారం సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. -
నాగార్జున సాగర్ డ్యాంపై మోహరించిన సీఆర్ పీఎఫ్ బలగాలు
-
నాగార్జున సాగర్ దగ్గర టెన్షన్.. టెన్షన్.. మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాలు
సాక్షి, పల్నాడు జిల్లా: నాగార్జునసాగర్ డ్యాంపైన యథాస్థితి కొనసాగుతోంది. 14వ గేట్ నుంచి 26 గేట్ వరకు ప్రాజెక్టుపై ఆంధ్ర భూభాగంపై ఏపీ పోలీసుల పహారా కాస్తున్నారు.1వ గేటు నుంచి 13వ గేటు వరకు ప్రాజెక్టు తెలంగాణ పోలీసుల ఆధీనంలో ఉంది. ఇరువైపులా భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించారు. కేంద్ర బలగాలు నాగార్జున సాగర్‌కు చేరుకున్నాయి. ఇంకా ఇరు రాష్ట్రాల పోలీసుల బలగాల ఆధీనంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉంది. మరి కొద్ది సేపట్లో నాగార్జునసాగర్ డ్యాం పైకి సీఆర్పిఎఫ్ బలగాలు వచ్చే అవకాశం ఉంది. -
Rajouri: హిందువులపై దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం
శ్రీనగర్: రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్రదాడులు.. ఆరుగురి దుర్మరణం.. ఇందులో ఇద్దరు చిన్నారులు.. పదుల సంఖ్యలో గాయపడడంతో సరిహద్దు జిల్లా రాజౌరిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. హిందూ కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చెలరేగిపోతుండడంతో.. భద్రతాపరంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాజౌరి జిల్లాలో భారీగా పారామిలిటరీ ట్రూప్స్‌ను మోహరిస్తోంది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ఇప్పటికే సీఆర్పీఎఫ్ తరపున 18వేల సిబ్బంది రంగంలోకి దిగారు. గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బలగాలు రాజౌరీలో మోహరించగా.. మరికొన్ని కంపెనీలు జమ్ముకి బయల్దేరాయి. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ఎరివేతే లక్ష్యంగా సైన్యం, స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్తో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. జమ్ము కశ్మీర్లో ఇప్పటికే సీఆర్ఎఫ్ బలగాలు ఉనికి భారీగా ఉంది. డెబ్భైకి పైగా బెటాలియన్లు(మొత్తం సీఆర్ఎఫ్ బలగాల సామర్థ్యంలో 3వ వంతు) జమ్ము కశ్మీర్‌లోనే భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఇక రాజౌరి జిల్లా ఉప్పర్ డాంగ్రీ గ్రామంలో.. ఆదివారం సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఆ మరుసటి రోజే ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు పాతిన ఐఈడీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులను చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నెల వ్యవధిలో ఇది మూడో ఉగ్రదాడి ఘటన. గత నెలలో ఆర్మీ క్యాంప్ సమీపంలోనే ఇద్దరిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. హిందూ కుటుంబాల నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండడంతో.. చాలా మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికారులు భద్రతకు తమది హామీ అని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. -
అయ్యన్న పాత్రుడి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
-
ఛత్తీస్‌గఢ్‌లో జవాను కాల్పుల కలకలం
న్యూఢిల్లీ/దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) జవాను జరిపిన కాల్పుల్లో నలుగురు తోటి జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మారాయిగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని లింగన్‌పల్లి గ్రామంలోని సీఆర్పీఎఫ్ 50వ బెటాలియన్ సీ–కంపెనీ వద్ద సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. కాగా, కాల్పులు జరిపిన జవాను రీతేశ్ రంజన్(25) తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడని, మానసిక సమతౌల్యం దెబ్బతినడంతో నిద్రిస్తున్న తోటి జవాన్లపై కాల్పులకు తెగబడ్డాడని సీఆర్పీఎఫ్ సోమవారం స్పష్టంచేసింది. అతను 13వ తేదీ నుంచి సెలవుపై వెళ్లాల్సి ఉందని, ఆ తర్వాత బదిలీపై జమ్మూకశ్మీర్‌లోని మరో బెటాలియన్‌లో చేరాల్సి ఉందని తెలిపింది. అయితే, కాల్పుల ఘటనపై మరో వాదన వినిపిస్తోంది. ఈ బెటాలియన్‌లో బిహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన జవాన్లు ఉన్నారు. బిహార్ రాష్ట్రానికి చెందిన జవాన్ల మధ్య దీపావళి సెలవుల విషయమై వాగ్వాదం కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజామున జవాన్ల మధ్య మరోసారి గొడవ జరిగింది. వెంటనే బిహార్‌కు చెందిన జవాను రీతేశ్ రంజన్ తన ఏకే–47 సర్వీస్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. దీంతో బిహార్‌కు చెందిన రాజ్ మణి కుమార్ యాదవ్, ధాంజీ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజీవ్ మోండల్, ధర్మేంద్ర కుమార్ మృతి చెందారు. కాల్పులు జరిపినపుడు అదే బ్యారక్‌లో దాదాపు 45 మంది జవాన్లు నిద్రిస్తున్నారు. కాల్పుల్లో మరో ముగ్గురికి బుల్లెట్ల గాయాలయ్యాయి. వీరిని తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో వెంటనే సీఆర్పీఎఫ్ ప్రత్యేక హెలికాప్టర్లో వారిని రాయ్‌పూర్ తరలించారు. కాల్పులకు పాల్పడిన రంజన్‌ను సీఆర్పీఎఫ్ అదుపులోకి తీసుకుంది. ఘటనపై మారాయిగూడెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి సీఆర్పీఎఫ్ ఆదేశించింది. ఘటనపై సీఎం భగేల్ విచారం వ్యక్తంచేశారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు.. ప్రశ్నల వర్షం
ముంబై: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంబానీ ఇల్లు ఎంటిలియా ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో ఇవాళ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు చేపట్టి.. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. అంధేరీలోని ప్రదీప్ శర్మ ఇంట్లో గురువారం ఉదయం ఎన్‌ఐఎతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది తనీఖీలు చేపట్టారు. ఉదయం ఐదుగంటల నుంచి సుమారు ఆరుగంటలపాటు ఈ సోదాలు కొనసాగినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రదీప్‌పై పశ్నల వర్షం కురిపించింది ఎన్ఐఏ. ఇక ఈ కేసులో షీలర్ అనే అనుమానితుడితో శర్మ గతంలో దిగిన ఫోటోలు బయటకు రావడంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభించారు. షీలర్ గతంలో పోలీసు ఇన్ఫార్మర్గా పని చేశాడని, అయినా రోజూ తనతో ఎంతో మంది ఫొటోలు దిగుతారని ప్రదీప్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో శర్మను ఏప్రిల్‌లోనే ఓసారి ప్రశ్నించారు కూడా. వాజే గురువు ఇక మన్సుక్ హిరేన్ మృతి కేసులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయన్న ఉద్దేశంతోనే శర్మ ఇంట్లో సోదాలు చేపట్టినట్లు ఓ అధికారి చెప్పారు. ఇక ఈ కేసులో ఎన్ఐఎ కస్టడీలో ఉన్న మాజీ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేకు, శర్మ గురువులాంటోడు. ముకేశ్ అంబానీ ఇంటి ముందు వాహనంలో దొరికిన 20 జెలిటిన్ స్టిక్స్‌ను ప్రదీప్ శర్మ ద్వారనే తెప్పించినట్లు వాజే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ కేసుతో పాటు వ్యాపారవేత్త మన్సుక్ హిరేన్ మృతి కేసులోనూ వాజే అనుమానితుడిగా ఉన్నారు. కాగా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న ప్రదీప్ శర్మపై 2006లో లఖన్ భయ్యా ఎన్కౌంటర్, అందులో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో వేటు పడింది. 2017లో తిరిగి విధుల్లోకి వచ్చిన ఆయన.. 2019లో ప్రదీప్ శర్మ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. శివసేనలో చేరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తన పేరుమీద ఓ ఎన్జీవో నడుపుతున్నారు 59 ఏళ్ల ప్రదీప్. చదవండి: రియల్ అబ్ తక్ చప్పన్: పాతికేళ్ల సర్వీస్. 100 ఎన్కౌంటర్లు -
కేంద్ర బలగాలతో జాగ్రత్త: మమత
బాలాగర్/డోంజూర్: ఎన్నికల బందోబస్తుకు వచ్చిన కేంద్ర బలగాల్లోని కొందరు గ్రామాల్లోకి ప్రవేశించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. హుగ్లీ జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ.. హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర బలగాలు పనిచేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. పోలింగ్ రోజుకు ముందు వారు గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. మహిళలను సైతం వేధిస్తున్నారు. బీజేపీకే ఓటేయాలని ఓటర్లను అడుగుతున్నారు. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు భయపడవద్దు’అని మమత ప్రజలను కోరారు. ‘కేంద్ర బలగాలు అతిగా ప్రవర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరిస్తే నాకు సమాచారం ఇవ్వండి’అని కోరారు. సెక్షన్ 144 విధిస్తామని బెదిరిస్తూ ఓటర్లను పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా బీజేపీ భయపెడుతోందని ఆరోపించారు. మరో గుజరాత్‌లా బెంగాల్ మారకూడదంటే బీజేపీకి ఓటేయవద్దని కోరారు. హిందు, ముస్లిం ఓటు బ్యాంకు గురించి మాట్లాడిన ప్రధాని మోదీపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ఎన్నికల సంఘం (ఈసీ)ని ఆమె ప్రశ్నించారు. -
మావోయిస్టులు పునరాలోచించరా?
హింసను ప్రేరేపించడంలో మావోయిస్టులు కూడా రాజ్య యంత్రాంగానికి ప్రతిబింబంలా మారిపోయారు. రాజ్యవ్యవస్థ తనకు తానుగా ఒక హింసాత్మక సాధనం. దాన్ని హింసతోనే ఎదుర్కోవడం అనేది మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టదు. తుపాకులు లేకుండానే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మరింత కష్టతరమైన పోరాటాలను చేస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, రైతులు, కార్యకర్తలు అందరూ.. వేగంగా నియంతృత్వం వైపు సాగుతున్న ఈ రాజ్యవ్యవస్థతో ప్రతి నిత్యం పోరాడుతున్నారు. కానీ మావోయిస్టులకు ఈ తరహా పోరాటాల పట్ల ఆసక్తి లేకపోవడమే విషాదకరం. ఈ వ్యాసం నేను రాస్తున్న సమయంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ తమ అధీనంలోనే ఉన్నాడని, అతనికి ఏ హానీ తలపెట్టబోమని మావోయిస్టులు భారత భద్రతా బలగానికి హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్ నివాసి అయిన రాకేశ్వర్ సింగ్ ఏప్రిల్ 3న భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ తర్వాత తప్పిపోయారు. ఈ ఘటనలో కనీసం 23 మంది భద్రతా బలగాలు చనిపోయారు. రాకేశ్వర్ తమ అధీనంలోనే ఉన్నట్లు మావోయిస్టు నాయకత్వం నుంచి వార్త అందుకున్నామని, అతడిని క్షేమంగా విడిపించడానికి ప్రయత్నిస్తున్నామని, అతడికి ఏ హానీ తలపెట్టబోమని మావోయిస్టులు హామీ ఇచ్చారని హోంశాఖ ఉన్నతాధికారి పేర్కొన్నారు. (గురువారం రాకేశ్వర్‌ని విడిచిపెట్టారు కూడా). అంటే, భద్రతా బలగాల అధికారులు మావోయిస్టులతో మాట్లాడుతున్నారనీ, ఇరువురి మధ్య చర్చ సాధ్యమేనని స్పష్టం. అంటే ఇరువర్గాలూ పరస్పరం నష్టపోయినప్పటికీ, ఒకరు మరొకరిని హంతకులు అని ఆరోపిస్తున్నప్పటికీ, అదే సమయంలో తాము చేస్తున్న హత్యలను సమర్థించుకుంటున్నప్పటికీ ఇరువురి మధ్య చర్చ అనేది సాధ్యమే. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు వ్యూహాత్మక ఎదురుదాడి కేంపెయిన్‌ను నిర్వహిస్తున్నారని, అడవుల్లోపల తమ కేడర్లకు ఆయుధాలిచ్చి మరీ శిక్షణ ఇస్తున్నారనీ, భద్రతా బలగాలకు గరిష్టంగా నష్టం కలిగించే ఉద్దేశంతో ఉన్నారని, అందుకే ముందస్తుగా భద్రతా బలగాలు లక్ష్య ఛేదనకోసం మావోయిస్టులపై దాడికి దిగగా తమపై ఎదురుదాడి చేసి దెబ్బతీశారని సీఆర్పీఎఫ్ అధికారి చెప్పారు. అయితే ఆ దాడి ఘటన తర్వాత మావోయిస్టు ప్రతినిధి కూడా ఎలా మాట్లాడి ఉండేవాడో కాస్త ఊహించుకుందాం. బహుశా అతడు కూడా సరిగ్గా ఇలాగే మాట్లాడి ఉండేవాడు. ఇంతజరిగాక కూడా అనివార్యంగా ఇరుపక్షాలూ సంప్రదింపులు జరుపుతున్నాయి. దీన్ని అందరూ ఆహ్వానించాలి. శత్రువు బలంగా ఉన్నప్పుడు, ఆధిక్యతా స్థానంలో ఉన్నప్పుడు మీరు మీ శత్రువుతో అయినా సరే మాట్లాడాల్సి ఉంది. ఈ తరుణంలో మావోయిస్టులు పైచేయి సాధించారు. వారు కూడా ఈ దాడిలో దెబ్బతిని ఉంటారు. కానీ ఎంతమందనేది మనకు తెలీదు. మావోయిస్టులూ, రాజ్యవ్యవస్థా.. అయితే ఎప్పటికైనా రాజ్యవ్యవస్థదే పైచేయి అని మావోయిస్టులు తెలుసుకోవాలి. ఇంతమంది బలగాలు మరణించిన తర్వాత కూడా భద్రతా బలగాల సంఖ్య తగ్గదు. గతంలో భద్రతా బలగాలు ఇదేవిధంగా ఎదురు దెబ్బతిని వెనుకంజ వేసినప్పటికీ వారి సంఖ్యాబలం కానీ ఆయుధ శక్తి కానీ క్షీణించలేదు. భారత భద్రతా బలగాల సాధన సంపత్తి ఎప్పటిలాగే ఉంటుంది. అది ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. పైగా దానికి ఇతర అనుకూలతలూ ఉన్నాయి. అది బహిరంగంగానే ముందుకు నడుస్తుంది. దానికి సహాయంగా నిర్విరామంగా సరఫరాలు అందుతుంటాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టకుండానే భారత భద్రతా బలగాలు చాలాకాలం మనగలుగుతాయి. కానీ మావోయిస్టుల విషయంలో అలా చెప్పలేం. కొత్తవారిని చేర్చుకోవడం వారికి చాలా కష్టమైన పని. వారు గణనీయంగా బలహీనపడతారు, వారి ఉనికి కూడా ఎప్పుడూ అనిశ్చితంగానే ఉంటుంది. వారి అధీనంలో ఉన్న ప్రాంతం వేగంగా కుదించుకుపోతోంది. వారు పోరాడుతున్న ప్రజలు కూడా పలు కారణాలతో దూరం జరుగుతున్నారు. మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణలో లేరు. మహారాష్ట్రలోనూ లేరు. ఇక బిహార్, జార్ఖండ్‌లలో వారు అదృశ్యమైపోయారు. మావోయిస్టు చర్యల లక్ష్యం ఏమిటి? వారు చేసే ఒక దాడికి, మరో దాడికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ చర్యల వెనక ఉన్న హేతుబద్ధత విషయమై వారి మద్దతుదారులకు కూడా స్పష్టత లేదు. తమ తరపున పోరాడమని ఆదివాసీలేమైనా వారికి చెప్పారా? లేదా ఆదివాసీ ప్రయోజనాల పరిరక్షణకు మావోయిస్టులు స్వయం ప్రకటిత సంరక్షకులుగా ఉంటున్నారా? ఈ ప్రజలను విముక్తి చేయడానికే తాము వచ్చామని మావోయిస్టులు చెబుతుంటారు. కానీ ప్రజలపై తనదే యాజమాన్యమని రాజ్యం ప్రకటిస్తుంది. దీనికి మించి ఇది ఒక భూభాగం, ఒక భూమి, వనరులకు సంబంధించినది. రాజ్య వ్యవస్థ నుంచి తమను కాపాడాల్సిందిగా ఆదివాసీలు వారిని ఆహ్వానించలేదు. ప్రజలు, అడవులు వారికి రక్షణ ఛత్రంగా మాత్రమే ఉంటున్నాయి. పైగా, ఆదివాసుల పట్ల సానుభూతి కూడా వీరికి ఉండదు. అందుకనే తమకు విధేయంగా లేరనిపించినప్పుడు ఆదివాసీలను పట్టపగలే చంపడానికి కూడా మావోయిస్టులు వెనుకాడటం లేదు. పీయూసీఎల్ (పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ రైట్స్) ఇటీవలి ప్రకటన కూడా సరిగ్గా దీన్నే చక్కగా వివరించింది. ‘నిత్యం తీవ్రవాదం, తీవ్రవాద నిరోధక కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. బస్తర్‌లో మళ్లీ హింస పెరుగుతున్న సమయంలో ఈ ఎన్ కౌంటర్ సంభవించింది. ఒకవైపు పారామిలటరీ బలగాల ద్వారా సామాన్యులు నిత్యం వేధింపులకు గురవుతున్న క్రమంలో ఈ ప్రాంతం మొత్తం సైనికీకరణకు గురవుతోంది. అడవుల్లో కూడా తక్కువ దూరాల్లో సైనిక క్యాంపులు నెలకొనడంతో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య స్థానిక ఆదివాసీలు పరాయీకరణకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఇన్ఫార్మర్ల పేరిట చాలామంది పౌరులను మావోయిస్టులు చంపేశారు. రాజ్యవ్యవస్థ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని తనను ప్రశ్నించిన, నిలదీసిన వ్యక్తులపై, బృందాలపై హింసకు పాల్పడుతుండటాన్ని మేం ఎంత తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నామో.. మావోయిస్టులతో సహా ప్రభుత్వేతర శక్తులు, కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని మేం కోరుతూ వస్తున్నాం. మావోయిస్టులూ రాజ్యవ్యవస్థకు ప్రతిబింబంగానే ఉంటున్నారు కానీ ఒకే ఒక తేడా ఉంది. రాజ్యవ్యవస్థ అవసరమైతే తన పనితీరును సవరించుకోవడానికి కూడా సిద్ధమవుతుంది. కానీ మావోయిస్టులు మాత్రం ఆరెస్సెస్–బీజేపీలాగే ఒకే స్వరంతో మాట్లాడుతుంటారు. ప్రజలపై యాజమాన్యం ఎవరిది అనే అంశంపై జరుగుతున్న ఈ పోరాటంలో రాజ్యానిదే ఎప్పటికీ పైచేయిగా ఉంటుంది. మావోయిస్టులు ఎప్పటికీ ప్రభుత్వేతర శక్తులుగా, చట్టవిరుద్ధ శక్తులుగా ఉంటారు. ముఖ్యంగా మావోయిస్టులు అర్థం చేసుకోవలసింది ఇదే. హింస పట్ల ఈ మతిలేని ఆకర్షణ వల్ల కొన్ని తరాలు ఇప్పటికే నాశనమైపోయాయి. రాజ్యవ్యవస్థ తనకు తానుగా ఒక హింసాత్మక సాధనం. దాన్ని మీ సొంత తార్కికతతో హింసతోనే ఎదుర్కోవడం అనేది మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టదు. తీవ్రవాదం అనే పదం ఒక సుందరమైన నగను ధరిస్తుంటుంది కానీ అది రాజ్యానికే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మావోయిస్టులు, రాజ్యవ్యవస్థ తమను విభేదించేవారిని పరస్పరం వధిస్తున్నాయన్నదే వాస్తవం. తాజా ఎన్కౌంటర్ రాజ్యవ్యవస్థ పాశవిక హింసను మరింత చట్టబద్ధం చేస్తుందనడంలో సందేహమే లేదు. మానవ హక్కుల కోసం నిలబడే ఎవరినైనా, మానవ హక్కులు అనే భావనపై విశ్వాసం లేని మావోయిస్టుల హక్కుల కోసం నిలబడే వారిపై కూడా రాజ్య అణిచివేత పెరుగుతుంది. వీరిని మావోయిస్టుల తుపాకులు, రాకెట్ లాంచర్స్ కాపాడలేవు. మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉంది. తమ పార్టీలోపల ప్రజాస్వామిక హక్కులు ఉన్నాయా అని వారు ప్రశ్నించుకోవాలి. నాయకత్వంతో విభేదిస్తూ కూడా గౌరవప్రదంగా మావోయిస్టులు మనగలుగుతున్నారా? తుపాకులు లేకుండానే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మరింత కష్టతరమైన పోరాటాలను చేస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, రైతులు, కార్యకర్తలు అందరూ... వేగంగా నియంతృత్వం వైపు సాగుతున్న ఈ రాజ్యవ్యవస్థతో ప్రతి నిత్యం పోరాడుతున్నారు. కానీ మావోయిస్టులకు ఈ తరహా పోరాటాల పట్ల ఆసక్తి లేదు. హింసాత్మక శక్తి పీడితులైన వీరు మానవ జీవితాలను, మానవ ప్రాణాలను వృథా చేస్తున్నారు. వ్యాసకర్త:అపూర్వానంద్ హిందీ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ (ది వైర్ సౌజన్యంతో) -
అది బీజేపీ సీఆర్పీఎఫ్
బనేశ్వర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలపై సీఆర్పీఎఫ్ దళాలు పశ్చిమబెంగాల్లో అరాచకం సృష్టిస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. సీఆర్పీఎఫ్ బీజేపీ సంస్థలా వ్యవహరిస్తోందన్నారు. ఓటర్లను భయపెడ్తున్నాయని, మహిళలను వేధిస్తున్నాయని, పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా ఓటర్లను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. సీఆర్పీఎఫ్ అంటే తనకు గౌరవమని, అయితే, అందులోని కొందరు అమిత్ షా ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మమత బుధవారం కూచ్‌బిహార్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడి నుంచి, పుల్వామాలో ఉగ్రవాదుల దాడి నుంచి భద్రతా బలగాలను కాపాడలేకపోయిన అమిత్ షా.. ఓట్ల కోసం కేంద్ర బలగాలను వాడుకుంటున్నారని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్‌కు 200కి పైగా సీట్లు రావాలని, లేదంటే పార్టీలోని ద్రోహులను బీజేపీ ప్రలోభాలకు గురిచేసి, వారి పార్టీలోకి తీసుకువెళ్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని, కేంద్ర బలగాలు ఓటర్లను బెదిరించకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మహిళలు, బాలికలపై కేంద్ర బలగాల వేధింపులను అడ్డుకోవాలని ఈసీని అభ్యర్థించారు. తారకేశ్వర్‌లో సోమవారం ఒక పాఠశాల విద్యార్థినిని కేంద్ర బలగాలకు చెందిన ఒక జవాను వేధించడంతో, ఆ జవానును ఈసీ విధుల నుంచి తొలగించింది. ఆరామ్‌బాఘ్‌లో టీఎంసీ అభ్యర్థిని సుజాత మొండల్‌పై బీజేపీ శ్రేణుల దాడిని ప్రస్తావిస్తూ. రాష్ట్రంలోని కొందరు పోలీస్ అధికారులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
ఇరువైపులా బడుగుజీవులే బలి
సుమారు యాభై ఏళ్లుగా తెలుగునేలపై నక్సలిజం వేళ్లూనుకొని, దాని ఉనికిని ప్రదర్శిస్తూ, సరిహద్దు రాష్ట్రాలకు కూడా విస్తరించింది. గ్రామాల్లో భూస్వాముల ఆగడాలు, వెట్టి చాకిరీలు, స్త్రీలపై అత్యాచారాలు, నిమ్నకులాలపై దౌర్జన్యం, వారి ఎదుగుదలపై కన్నెర్ర... తరాలుగా సాగిన ఉదంతాలు ఉన్నాయి. గ్రామాలకు నక్సల్స్ రాకతో ఎండుటాకులు భగ్గున మండినట్లు బాధిత వర్గాలు వారికి తోడు నిలిచాయి. అన్నం పెట్టాయి, ఆశ్రయమిచ్చాయి. వీరు ముందే వస్తే ఎంత బాగుండేది అనుకున్నాయి కానీ నక్సలిజం పార్లమెంటరీ వ్యవస్థకు విరుద్ధమని, దానికి మద్దతుగా నిలవడం నేరమని తెలీని పరిస్థితి ఉండేది. చూస్తుండగానే గ్రామాలను పోలీసులు, ఇతర భద్రతా దళాలు చుట్టుముట్టి నక్సలైట్లు ఏర్పరచిన సంఘాల్లో ఉన్నవారిని, వారి జెండా పట్టినవారిని, వారి పాటలు పాడినవారిని పట్టుకొని నానా యాతనలకు గురిచేశారు. నక్సలైట్ల రాకతో భూస్వాముల గుండెల్లో కొంత భయం పుట్టిన మాట వాస్తవమే కానీ గ్రామస్తులు ఊహించని ఇబ్బందుల్లో పడ్డారు. యువత బతుకు చిన్నాభిన్నమైంది. ధైర్యమున్నవాడు నక్సల్స్ వెంట వెళ్ళాడు. తప్పించుకోవాలనుకున్నవాడు ముంబై, దుబాయ్ బాట పట్టాడు. పోలీసులు పిల్లల ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులను వేధించి, వేధించి వేపుకుతిన్నారు. నక్సలైట్లు ఆత్మరక్షణలో పడి అడవిబాట పట్టారు. ఇక ఎన్కౌంటర్లు మొదలయ్యాయి. తమ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో పోలీసులు ఒంటరిగా కనబడితే వారిని నక్సల్స్ పట్టపగలు చంపిన ఘట నలున్నాయి. వీటికి ప్రతీకారంగా నక్సల్స్‌కి మద్దతుగా నిలిచిన విద్యార్థులను, డాక్టర్లను, అడ్వొకేట్లను, లెక్చరర్లను, ఇతర ఉద్యోగులను పోలీసులు ఆధారాలు దొరకని రీతిలో చంపేసినట్లు వార్తలున్నాయి. దీనితో భయోత్పాతంతో ఆయా పీడిత వర్గాలు నక్సల్స్‌కి దూరమయ్యాయి. ఇక యుద్ధం పోలీసులు, నక్సలైట్ల మధ్యకు మారింది. నక్సలైట్ల ఏరివేతలో పోలీసులు ఏ హద్దులు దాటినా ప్రభుత్వం వారికి అడ్డు చెప్పలేదనవచ్చు. ఎన్నో ఎన్‌కౌటర్లు బూటకమనే ఆరోపణలున్నాయి. అటు నక్సలైట్ల పట్టపగలు హత్యలు కోర్టులో రుజువుకానట్లే పోలీసుల చిత్రహింసలకు,కాల్చివేతలకు ఆధారాల్లేవు.పోలీసులు, కేసులు, శారీరక హింస, చావులకు వెరిసి పీడిత వర్గాలు కూడా సర్దుకొని బతకడమే మేలనుకున్నాయి. నక్సల్స్ శక్తి కన్నా పోలీసు బలం, బలగం ఎంతో పెద్దది. ఎంతటి సాయుధ తిరుగుబాటునైనా అణచివేసే సామర్థ్యం దాని కుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా నక్సలైట్ల సంఖ్యనే లెక్కించి వ్యూహరచన చేస్తోంది. అదే నిష్పత్తితో బలగాల మోహరింపు, నిధుల కేటాయింపు జరుగుతోంది. ఈ క్రమంలో ఇరువైపులా జరుగుతున్న దాడుల్లో ఓసారి నక్సలైట్లయితే, మరోసారి పోలీసు జవాన్లు చనిపోతున్నారు. అంతా పక్కకుపోయి ఈ తూటాలకు బడుగువర్గాల కుటుంబ సభ్యులే సమిధలవుతున్నారు. నక్సలైటుది సింహంపై స్వారీ. అడవిలో ఎంత కాలం తిరిగినా ఏదో ఓ రోజు చివరకు పోలీసు బలగాలకు చిక్కక తప్పదు. ఇంకా విప్లవం, ఉద్యమ నిర్మాణం, ప్రజల మద్దతు కూడగట్టడం ఈ రోజుల్లో సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. ఉన్నదల్లా ఏరివేత, కాల్చివేతలే. దీనివల్ల వాస్తవ పీడిత వర్గాలకు లాభించేది శూన్యం. పోలీసు, సీఆర్పీఎఫ్ జవాన్లు చాలావరకు కింది తరగతులలో ఆర్థిక బలహీనులే. వేరే గతిలేక ప్రాణాలను గాలిలో దీపంలా పెట్టి నాలుగు డబ్బుల కోసం, కుటుంబ పోషణ కోసం ఈ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎదురెదురైనప్పుడు నక్సల్స్ వారిని కాల్చకపోతే, జవాన్లు నక్సల్స్‌ని కాల్చుతారు. ఇలా ఇరువైపులా చావులు తథ్యం, అనివార్యం అవుతున్నాయి. ఏప్రిల్ 3న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో సీఆర్పీఎఫ్ తదితర విభాగాల జవాన్లు 23 మంది నక్సల్స్ చేతిలో హతమయ్యారు. విధి నిర్వహణలో జవానుకు మిగిలింది చంపడమో, చావడమో.. జవాన్లు చనిపోతే బాధపడేవారున్నట్లే, నక్సల్స్ ప్రాణాలు కోల్పోతే దుఃఖపడేవారు ఉంటారు. ఎందుకంటే అన్నీ ప్రాణాలే.. అందరికీ కుటుంబాలు, బంధుమిత్రులు ఉన్నారు. ఇలా జవాన్లను ఘోరంగా చంపి ఏమి సాధించారు అని ప్రజలు, పత్రికలు నక్సల్స్‌ని గుండెభారంతో ప్రశ్నిస్తున్నాయి. నిజంగా అది హృదయవిదారక సంఘటన. ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్క జవాను వయసు, కుటుంబం గురించి చదువుతుంటే కళ్ళు చెమర్చుతాయి. అయితే చేటలో తవుడు పోసి కాట్లాట పెట్టిందెవరు అనేది ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యవాదులను అర్బన్ నక్సలైట్లని ముద్రవేసి సోదాలతో బెదరగొడుతోంది. పౌర హక్కుల నేతలను, సామాజిక కార్యకర్తలను, ప్రజా రచయితలను జైళ్లలో కుక్కి హింసిస్తోంది. ఈ విషయంలో ఆలోచనాపరులు ప్రభుత్వాలను ప్రశ్నిం చాలి. విప్లవ సానుభూతిపరులని ఇబ్బందులు పెట్టినంత కాలం నక్సల్స్ చెలరేగిపోయే అవకాశముంది. పేద కుటుంబాల పిల్లలు పోలీసు ఉద్యోగాలు చేసి ఈ ప్రభుత్వాలకు రక్షణగా నిలవవద్దని నక్సల్స్ వాదన. కానీ బ్రిటిష్ సైన్యంలోనూ భారతీయులు పనిచేశారు. అది బతుకుదెరువు సమస్య. మరోవైపు ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని హోంమంత్రి అమిత్ షా శపథం చేశారు. మరో నాలుగు రోజుల్లో నలభై మంది నక్సల్స్ పోలీసు కాల్పుల్లో మరణించినట్లు వార్తల్లో రావచ్చు. నేటి జవాన్ల కోసం కన్నీరు కార్చినవారు రాబోయే కాలంలో నక్సల్స్ పోతే ఊరట చెందవచ్చు, కాని రెండు చావులు దిక్కు లేనివే. వీటిని చర్చలతో అరికట్టే బాధ్యత ప్రభుత్వాలదే. ఇరువైపులా చస్తున్న బడుగు ప్రాణాలపై ప్రేముంటే శాంతి వైపు అడుగులేయాలి. వ్యాసకర్త:బి. నర్సన్ కవి రచయిత 94401 28169 -
ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు: అమిత్ షా
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: బీజాపూర్ ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షేత్రస్థాయికి వెళ్లి మావోయిస్టులను హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 23 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. బలగాల్లో ఆత్మ స్థైర్యం పెంచేందుకు అమిత్‌షా సోమవారం జగదల్పూర్, బీజాపూర్ జిల్లాల్లో పర్యటించారు. ఉదయం 10 గంటలకు జగదల్పూర్ వచ్చిన అమిత్‌షా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి 10.45 గంటలకు అమర జవాన్లకు నివాళులర్పించారు. 11.20 గంటలకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్, సీఆర్పీఎఫ్ డీజీ, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో కలసి ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బీజాపూర్ జిల్లా బాసగూడ సీఆర్పీఎఫ్ క్యాంపునకు వెళ్లి సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులతో మాట్లాడారు. రాయ్‌పూర్‌లో చికిత్స పొందుతున్న జవాన్లను సాయంత్రం 3.30 గంటలకు పరామర్శించారు. అనంతరం నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఘటనపై జగదల్పూర్లో కేంద్రహోంమంత్రి అమిత్ షాతో మాట్లాడుతూ మావోయిస్టులపై పోరులో జవాన్లు చూపిన ధైర్యసాహసాలు మరువలేనివని, వారి అమరత్వాన్ని దేశం ఎన్నటికీ మరవదని కొనియాడారు. ‘ఆపరేషన్ ప్రహార్–3’చేపట్టి మావోయిస్టులను సమూలంగా ఏరివేస్తామన్నారు. బలగాలను, బెటాలియన్లను మరింత పెంచి, పోరును ఉధృతం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మావోలపై ప్రతీకారం తీర్చుకుంటామని, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దండకారణ్య బెటాలియన్ కమాండర్ మడివి హిడ్మాతోపాటు మరో ఎనిమిది మంది మావో యిస్టు పార్టీ అగ్రనేతలను మట్టుబెడతామన్నా రు. హోంమంత్రి ఏకంగా క్షేత్రస్థాయికి వచ్చి హెచ్చరిక చేయడంతో కేంద్రం ఈ ఘటనను ఎంత సీరియస్‌గా తీసుకుందో తెలుస్తోంది. సరిహద్దు తెలంగాణలో మరింత కూంబింగ్.. గోదావరి పరీవాహక తెలంగాణ జిల్లాల్లో ప్రస్తు తం అలజడి నెలకొంది. బీజాపూర్ ఘటన నేపథ్యంలో తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు, యాక్షన్ టీముల కదలికలపై పోలీసులు మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో గత జూలైలో కమిటీలు వేసుకున్న మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్లు కూడా చేస్తోంది. మరోవైపు సింగరేణి కార్మిక సమాఖ్యను, రైతు విభాగాన్ని, జననాట్య మండలిని పునరుద్ధరించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. వెనక్కి వెళ్లకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు బీజాపూర్, జగదల్పూర్ జిల్లాల్లో ఒకవైపు అమిత్‌షా పర్యటన సాగుతుండగానే మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో పేరిట లేఖ విడుదల చేసింది. భారతదేశ దోపిడీ వర్గం రక్షణలో పనిచేసే భద్రతాదళాల్లో ఉద్యోగాలు చేయడం మానేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 2020 నుంచి దోపిడీదారుల దాడులు తీవ్రమయ్యాయని, ఈ క్రమంలో దండకారణ్యంలో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తుండటంతోపాటు అనేక త్యాగాలు చేస్తున్నారని అన్నారు. పీఎల్జీఏ నిరంతర పోరాటం చేస్తోందన్నారు. పోలీసులు నకిలీ ఎన్కౌంటర్లు చేస్తుండడంతోపాటు ప్రజలను, మహిళలను హింసిస్తున్నారని ఆరోపించారు. కిసాన్ ఆందోళనలో 300 మంది రైతులు త్యాగాలు చేశారన్నారు. జై జవాన్–జై కిసాన్ అంటూ పాలకవర్గాలు ఇచ్చే నినాదం మోసపూరితమైనదని, గత 75 ఏళ్లలో ఇది నిరూపితమైందని పేర్కొన్నారు. విద్యార్థులు, రైతులు, కూలీలు, గిరిజనులు, నిరుద్యోగులు ఉద్యమించాలని లేఖలో కోరారు. ఈ నెల 26న భారత్‌బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. చదవండి: మా అధీనంలోనే కోబ్రా కమాండో -
పెళ్లింట చావు డప్పులు
సత్తెనపల్లి: పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట చావు డప్పులు మోగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ వద్ద మావోయిస్టుల దురాగతానికి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్పీఎఫ్ జవాను శాఖమూరి మురళీకృష్ణ (32) బలవటంతో ఆ గ్రామం శోకసంద్రమైంది. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన శాఖమూరి రవీంద్రబాబు, విజయకుమారి దంపతుల చిన్నకుమారుడైన మురళీకృష్ణ ఆరేళ్ల క్రితం సీఆర్పీఎఫ్ జవానుగా ఉద్యోగంలో చేరి భరతమాత సేవకు అంకితమయ్యాడు. కోబ్రా–210 విభాగానికి చెందిన మురళీకృష్ణ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మురళీకృష్ణకు గత ఏడాది ఆగస్ట్ 13న వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ దగ్గరి బంధువు చనిపోవటంతో వాయిదా పడింది. ఈ ఏడాది మే 22న వివాహం జరుప తలపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీన మురళీకృష్ణ తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. సెలవు మంజూరైందని, మే 15న ఇంటికి వస్తానని చెప్పాడు. అలా చెప్పిన మూడో రోజే శాశ్వతంగా సెలవు తీసుకుని ఎవరికీ అందని లోకాలకు వెళ్లిపోయాడని ఆ తల్లి చేస్తోన్న రోదన వర్ణనాతీతం. -
దేశ చరిత్రలో అది చీకటి రోజు: మోదీ
చెన్నై: రెండేళ్ల క్రితం ఉగ్రమూకలు దొంగలాగా దాడిచేసి 40 మంది భారత జవానులను పొట్టన పెట్టుకున్న రోజు దేశ చరిత్రలో చీకటి రోజుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం 2019 ఫిబ్రవరి 14 న దాదాపు 2500 మంది సీఆర్పీఎఫ్ దళాలు 78 బస్సుల్లో జమ్ముకశ్మీర్ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరారు. జైషే మహమ్మద్ కు చెందిన ఆత్మహుతి దళాలు సీఆర్పీఎఫ్ బస్సుపై దాడిచేశారు. ఆ ఘటనలో 40 మంది అసువులు బాశారు. తమిళనాడులో పర్యటనలో భాగంగా మోదీ.. ఆరోజు ఘటనను గుర్తుచేసుకొని వారికి ఘననివాళుర్పించారు. ఈ దేశం వారి త్యాగాలను ఎప్పటికీ మరవదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనేక ప్రభుత్వ పథకాలకు శంకుస్థాపనలు చేశారు మోదీ. ఈ క్రమంలోనే స్వదేశీ పరిజ్జానంతో అభివృద్ధి చెందిన అర్జున్ మెయిన్ బాటిల్ ట్యాంక్ (మార్క్1ఎ)ను చెన్నైఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణేకు అందజేశారు. భారత్ ఉన్న రెండు రక్షణ కారిడర్లలో ఒకటి తమిళనాడులో ఉంది. దీనికి 8,100 కోట్లను ప్రాథమికంగా నిర్ణయించారు.వీటితోపాటు 9 కిలోమీటర్ల పొడవుగల చెన్నై మెట్రోతోపాటు, రెండు రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపను చేశారు. మద్రాస్‌లో ఐఐటీ క్యాంపస్ నిర్మాణానికి వెయ్యికోట్లవుతొందని కూడా అంచనావేశారు. దీనితోపాటు అనైకట్ కెనాల్ పునర్నిర్మాణ పనులకు కూడా ప్రారంభించారు. -
గోవధ ఆపాలంటూ హైకోర్టులో వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: గోసంరక్షణ చట్టం, గోవధ నిషేధ చట్టం–2011కు వ్యతిరేకంగా దాఖలైన కేసుల్లో గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని సైతం అమలు కావడం లేదని, ఆవులను వధించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ తిరుమల, తిరుపతి దేవస్థానాల బోర్డు మెంబర్, యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. బక్రీద్ పేరుతో వేలాదిగా ఆవుల్ని, కోడె దూడల్ని సైతం వధిస్తారని, తక్షణమే తమ పిల్‌ను విచారణకు చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ చేసిన విజ్ఙప్తిని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆమోదించింది. మంగళవారం పిల్‌ను విచారణ చేస్తామని సోమవారం బెంచ్ హామీ ఇచ్చింది. పాడి,సాగులకు యోగ్యమైన వాటిని వధించకూడదని, వాహనాల్లో ఆవులు,ఎద్దుల్ని కుక్కేసి రవాణా చేయకూడదని ఇటీవల కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను, వేటిని వధించవచ్చునో పశువైద్యుడు నిర్ధారించిన తర్వాతే నిర్ధిష్ట వధశాల్లో పశువైద్యుడి సమక్షంలోనే చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని రాష్ట్రంలో అమలు కావడం లేదని పిల్లో పేర్కొన్నారు. ఆవులను అక్రమ రవాణా అవుతుంటే రాష్ట్ర పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, చెక్‌పోస్ట్‌ల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేసి హైకోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చేయాలని కోరారు. ఆవులు, కోడెదూడల అక్రమ రవాణా అవుతుంటే గోవు పూజ్యనీయమని భావించే వాళ్లు అడ్డుకుంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని పోలీసులు ఉల్టా కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల్ని పోలీసులు అమలు చేయనందుకే సీఆర్పీఎఫ్ బలగాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆవుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని శివకుమార్ దాఖలు చేసిన పిల్లో కోరారు. -
శ్రీనగర్‌లో ఎన్కౌంటర్; ఉగ్రవాది హతం
శ్రీ నగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్‌లోని నవకాడల్ ఏరియాలో హిజ్బుల్ మొజాహిద్దీన్ ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు సోమవారం రాత్రి స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కాగా మంగళవారం తెల్లవారుజామున నవకాడల్ ఏరియాలో ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో జవాన్లు ఎదురుకాల్సులకు దిగారు. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఒక ఉగ్రవాది హతమయ్యాడని, ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. -
లష్కరే తొయిబా ఉగ్రవాదులు అరెస్ట్
శ్రీనగర్: సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను శనివారం అరెస్ట్ చేశారు. అదే విధంగా బుద్గాం జిల్లాలో ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించనట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. కశ్మీర్‌లోని ఖాన్సాయిబ్ పోలీసుస్టేషన్ పరిధిలోని అరిజల్ గ్రామంలో సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు, బుద్గాం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో టాప్ టెర్రరిస్ట్ జహూర్ వాని అతను ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాద స్థావరంలో భద్రతా దళాలు అరెస్ట్ చేశారు. One hideout busted in Arizal Khansaib,Budgam & a top Over Groud Wirker of LeT, namely Zahoor Wani was arrested. Arms and ammunition recovered from his possession. More arrests and recoveries are expected. Case registered. pic.twitter.com/sFMfVft7Dh — J&K Police (@JmuKmrPolice) May 16, 2020 అతని రహస్య ఉగ్రస్థావరంలో ఉన్న మారణాయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మరో నలుగురు ఉగ్రవాదులు.. యునిస్ మిర్, అసలాం షేక్, పవైజ్ షేక్, రెహమాన్ లోన్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఖాన్సాయిబ్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా వీరు లష్కరే తోయిబా ఉగ్గవాదులకు సాయం అందిస్తూ.. ఆశ్రయం కల్పిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. వీరిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘పుల్వామా’పై రాజకీయ దాడి
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న దాడి ఘటనకు ఏడాదైన సందర్భంగా భారత్‌లో రాజకీయ చిచ్చు రాజుకుంది. కాంగ్రెస్, వామపక్షాలు దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పిస్తూనే కేంద్రంపై మాటల తూటాలు విసిరాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి సూటిగా మూడు ప్రశ్నలు సంధించారు. 1. ఈ దాడి నుంచి ఎక్కువగా లబ్ధి పొందిందెవరు? 2. ఈ దాడిపై విచారణ ఎంతవరకు వచ్చింది? 3. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి.. భద్రతా వైఫల్యానికి బీజేపీలో ఎవరిది బాధ్యత? ఈ మూడు ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబివ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్‌కు మద్దతుగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గళం విప్పారు. పుల్వామా దాడిలో బతికి బయటపడిన వారికి ఎలాంటి సాయం అందించారని, మృతుల కుటుంబాలకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, బీజేపీ.. జవాన్ల మృతదేహాలతో రాజకీయం చేసి ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. ఉగ్రవాదుల సానుభూతిపరుడు రాహుల్: బీజేపీ జాతి యావత్తూ పుల్వామా దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తుంటే రాహుల్ ఇలా మాట్లాడడం సిగ్గు చేటని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల సానుభూతి పరుడైన రాహుల్ కేంద్రంతో పాటు భద్రతా బలగాలను కూడా టార్గెట్ చేయడం దారుణమని అన్నారు. దోషి అయిన పాక్‌ను రాహుల్ ఎప్పుడూ ప్రశ్నించరెందుకని నిలదీశారు. రాహుల్ తన వ్యాఖ్యల ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ఇరుకున పెట్టడానికి ఒక ఆయుధం ఇస్తున్నారని ట్వీట్ చేశారు. పుల్వామా దాడిపై విచారణ పురోగతి కష్టమే పుల్వామా దాడిపై విచారణ ముందుకు వెళ్లడానికి అన్ని మార్గాలు మూసుకుపోయినట్టే కనిపిస్తోంది. ఈ దాడితో ప్రమేయం ఉన్న అయిదుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాలు చేపట్టిన వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. 2008లో ముంబైపై ఉగ్రవాదుల దాడి తర్వాత ఏర్పాటైన ఉగ్రవాద నిరోధక విచారణ సంస్థ (ఎన్ఐఏ)కు ఈ దాడి వెనుక సూత్రధారి, ఇతర కుట్రదారులెవరు వంటి వివరాలు తెలుసుకోవడానికి కచ్చితమైన సమాచారమేదీ లేదు. ‘‘ఈ కేసులో ఎన్నో అంశాలున్నాయి. కానీ వేటికి ఆధారాలు లేవు. కోర్టుల్లో ఏదైనా సాక్ష్యాధారాలతోనే సమర్పించాలి. అందుకే ఈ కేసులో పురోగతి సాధించలేం’’అని విచారణ బృందంలో ఉన్న అధికారి ఒకరు చెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం కరడు గట్టిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారత్‌పై విద్వేషం వెళ్లగక్కారు. కశ్మీర్లో పుల్వామా సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కారుబాంబుతో దాడి జరిపారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆత్మాహుతి దాడి కోసం వినియోగించిన ఆ కారు యజమాని ఎవరన్నదే ఇప్పటికీ విచారణ బృందానికి సవాల్‌గానే మారింది. మీ బలిదానాన్ని మరువలేం: ప్రధాని ‘పుల్వామా’అమరవీరులకు శుక్రవారం ప్రధాని మోదీ నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసి, చివరికి ప్రాణత్యాగం చేసిన వారికి సాటి, పోటీ ఎవరూ లేరని కొనియాడారు. భారతీయులు ఎన్నటికీ ఆ వీర సైనికుల బలిదానాన్ని మరువలేరని మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ హర్దీప్ పూరీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పుల్వామా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. పుల్వామా స్మారకం ఆవిష్కరణ పుల్వామా దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది స్మృత్యర్థం లెత్పోరా సైనిక శిబిరంలో స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. సీఆర్పీఎఫ్ జవాన్ల సేవ, నిజాయితీలకు గుర్తుగా ఈ స్థూపాన్ని ఆవిష్కరించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్ల ఫోటోలను వారి పేర్లతో సహా ఆ స్థూపంపై చెక్కారు. అమరవీరుల కుటుంబాలకు తాము ఎంతో చేస్తున్నామని సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ తెలిపారు. ఇక మహారాష్ట్రకు చెందిన ఉమేష్ గోపీనాథ్ అనే వ్యక్తి మొత్తం 61 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, అమరవీరుల ఇళ్లకు వెళ్లి అక్కడ మట్టిని తీసుకువచ్చి సీఆర్పీఎఫ్ ఏర్పాటు చేసిన స్మారక స్తూపం వద్ద నివాళిగా ఉంచారు. -
పోలీసులతో ఘర్షణ; అలాంటిదేం లేదు..!
శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఈ నేపథ్యంలో దాదాపు 40 వేల మంది భద్రతా సిబ్బందిని అక్కడ బందోబస్తుకు వినియోగించుకుంటోంది. అయితే, జమ్మూకశ్మీర్ పోలీసులకు, సీఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య ఘర్షణలు తలెత్తాయని వార్తలు బయటికొచ్చాయి. కర్ఫ్యూ పాస్ లేదని ఓ గర్భిణీని అడ్డుకోవడంతో రాష్ట్ర పోలీసు సిబ్బంది, సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుందనీ.. రాష్ట్ర పోలీస్ సిబ్బంది ఒకరు కాల్పులు జరపడంతో ఐదురుగు జవాన్లు చనిపోయారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వాజ్ ఎస్ ఖాన్ పేరుతో ఓ పాకిస్తానీ ఈ ప్రచారానికి పూనుకున్నాడు. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదని సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసు దళం కొట్టిపారేశాయి. పుకార్లను నమ్మొద్దని స్పష్టం చేశాయి. రక్షణ దళాలేవైనా దేశం కోసం.. సుహృద్భావం వాతావరణంలో పనిచేస్తాయని చెప్పాయి. కోట్లాది భారతీయుల రక్షణ కోసం త్రివర్ణ పతాకం నీడలో తామంతా దేశ సేవకు అంకితమవుతామని.. తమ మధ్య ఎలాంటి భేదాలుండవని వెల్లడించాయి. యూనిఫారమ్‌లు వేరైనా మా లక్ష్యం దేశ రక్షణే అని సీఆర్పీఎఫ్ ట్వీట్ చేసింది. కొందరు నకీలీ కశ్మీరీలు ఉన్నతాధికారుల పేర్లతో ఫేక్ అకౌంట్లు సృష్టించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని కశ్మీర్ పోలీస్ అధికారి ఇంతియాజ్ హస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొనడంతో కొన్ని దుష్ట శక్తులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కల్పనలో ఉండకుండా వాస్తవంలోకి రావాలని హితవు పలికారు. The malicious content of this tweet is absolutely baseless and untrue. As always, all the security forces of India are working with coordination and bonhomie. Patriotism and our tricolour lie at the core of our hearts and existence, even when the color of our uniforms may differ. pic.twitter.com/1Rhrm09dPN — 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) 12 August 2019 -
నివురుగప్పిన నిప్పులా కశ్మీర్
శ్రీనగర్‌లో ప్రస్తుతం ఎటుచూసినా సాయుధ బలగాలే ఉన్నాయి. బయటివారి సంగతి పక్కనపెడితే స్థానికులు కూడా ఇంట్లోంచి అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా సీఆర్పీఎఫ్ బలగాలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాయి. ఎక్కడకు, ఎందుకు వెళుతున్నారు? అనే సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తేనే ముందుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు. శ్రీనగర్–జమ్మూ మధ్య 260 కి.మీ దూరాన్ని సాధారణ పరిస్థితుల్లో 6–7 గంటల్లో దాటేయొచ్చు. కానీ ప్రస్తుతం ప్రతీ కిలోమీటర్‌కు ఓ సీఆర్పీఎఫ్ పోస్ట్(మొత్తం 260 పోస్టుల)ను ఏర్పాటుచేశారు. ప్రతీ వాహనానికి వారు ఓ ప్రత్యేక నంబర్ కేటాయిస్తున్నారు. అదుంటేనే బండి ముందుకు కదులుతుంది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు గురించి చాలామంది కశ్మీరీలకు తెలియదు. ఇందుకు కమ్యూనికేషన్ల వ్యవస్థ మొత్తం స్తంభించిపోవడమే కారణం. అయితే ఆర్టికల్ 370 రద్దు గురించి తెలిసిన కొందరు కశ్మీరీలు మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పెదవి విరిచారు. తమ జీవితాలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే సందర్భంగా తమకు కనీస సమాచారం ఇవ్వలేదనీ, విశ్వాసంలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీరీల్లో భయాందోళన.. ఆర్టికల్ 370తో తమ జీవితాలు మారిపోతాయనే వాదనను స్థానిక కశ్మీరీలు తిరస్కరిస్తున్నారు. ‘సగటు కశ్మీరీ కుటుంబం ఉన్నంతలో హుందాగా బతికేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లడాన్ని, కూలిపని చేయడాన్ని కశ్మీరీలు నామోషీగా భావిస్తారు. సుగంధ ద్రవ్యాలు, యాపిల్ సాగు, కళాత్మక పనులు, చేతివృత్తుల విషయంలో కశ్మీరీలకు మంచి నైపుణ్యముంది. దీంతో సొంతంగా నిలదొక్కుకోవాలన్న తపన వీరిలో చాలా అధికం. అయితే కేంద్రం ఆర్టికల్ 370ని రద్దుచేయడంతో తమ పరిస్థితి తలకిందులవుతుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. స్థానికేతరులు కశ్మీర్లో స్థిరపడ్డా, లేదంటే కేంద్రం నిర్ణయంతో ఉగ్రవాదం తిరిగి పుంజుకున్నా తాము ఉపాధిని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ పండిట్లు మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఏళ్లుగా తాముపడిన కష్టాలకు ఇక ఓ ముగింపు దొరికిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో తెలుగు వారు కశ్మీర్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో పలువురు తెలుగువాళ్లు పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాలవారిని కశ్మీరీలు గౌరవిస్తారనీ, ఆతిథ్యం విషయంలో ఎవరైనా వారి తర్వాతేనని తెలుగువాళ్లు చెప్పారు. మరోవైపు వచ్చే సోమవారం బక్రీద్, అనంతరం ఆగస్టు 15 వస్తుండటంతో అప్పటివరకూ ఆంక్షలు కొనసాగే అవకాశముందని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. -(జమ్మూకశ్మీర్ నుంచి సాక్షి ఇన్ పుట్ ఎడిటర్ ఇస్మాయిలుద్దిన్) -
ఘోర బస్సు ప్రమాదం; ఆరుగురు మృతి
రాంచి : చత్తీస్‌ఘఢ్‌లోని అంబికాపూర్ నుంచి జార్ఖండ్ వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లా సమీపంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 43 మంది గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్ బృందాలు మృతదేహాలను వెలికితీసి, గాయాలపాలైన వారిని బస్సులోని కిటికీల ద్వారా ప్రవేశించి రక్షించారు. క్షతగాత్రుల్లో ముగ్గురిని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్‌కు, మిగతా వారిని స్థానిక హస్పిటల్‌కు తరలించారు. ఇదిలా ఉండగా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఎస్పీ శివానీ తివారీ తెలిపారు. కాగా ఇటీవలే జార్ఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 10 న హజారిబాగ్ జిల్లాలోని చౌపరన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పట్నాకు బయలుదేరిన బస్సు ఇనుముతో ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన ఘటనలో 11 మంది మరణించారు. -
పుల్వామాలో ఇద్దరు టెర్రరిస్టులు హతం
కశ్మీర్: జమ్ము- కశ్మీర్లో మారోసారి కాల్పుల మోత మోగింది. పుల్వామా జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ జరిపిన భద్రతా బలగాలు.. ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టారు. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు దక్షిణ కశ్మీర్‌లోని అవంతీపురా జిల్లాలో భద్రతా బలగాలు కార్డన్‌సర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడటంతో.. ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారి వద్ద లభించిన మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే వీరు ఏ సంస్థకు చెందినవారో గుర్తించేందుకు విచారణ చేపట్టామన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అవంతీపురా జిల్లా పరిధిలోని రైలు, ఇంటర్నెట్ సర్వీస్‌లను నిలిపివేసినట్లు వెల్లడించారు. -
కశ్మీర్లో ఉగ్ర దుశ్చర్య
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా దళాలపై జరిపిన దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రదాడిని తిప్పికొట్టడానికి భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని అధికారులు వెల్లడించారు. ‘116వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు, రాష్ట్ర పోలీసులు ఇక్కడి కేపీ రోడ్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఒక్కసారిగా తమ వద్ద ఉన్న రైఫిళ్లతో జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. అలాగే వారి వాహనంపై గ్రెనేడ్లను విసిరారు. దీంతో జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా గాయపడిన మరో ముగ్గురుని ఆస్పత్రికి తరలించాం’అని తెలిపారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన అనంతనాగ్ పోలీస్ స్టేషన్ అధికారి అర్షద్ అహ్మద్‌ను చికిత్స కోసం శ్రీనగర్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ ఉగ్రవాదులను జైషే మొహ్మద్ ఉగ్రవాద గ్రూపునకు చెందిన వారుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
స్టాంగ్ రూంల వద్ద ఆర్మీతో భద్రత కల్పించాలి: గూడూరు
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద ఆర్మీ లేదా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కౌంటింగ్‌కు మరో 42 రోజుల గడువున్న నేపథ్యంలో ఈవీఎంలు ఎలాంటి ట్యాంపరింగ్‌కు గురికాకుండా భద్రంగా ఉండేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి గురువారం ఓ ప్రకటనలో కోరారు. స్ట్రాంగ్ రూంలలోకి స్థానిక పోలీసులకు ప్రవేశం కల్పించవద్దని, భద్రతను సమన్వయం చేసే బాధ్యత మాత్రమే వారికి అప్పగించాలన్నారు. హైసెక్యూరిటీ జామర్లను స్ట్రాంగ్‌రూంల వద్ద ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన అన్ని పోలింగ్ బూత్‌లు, స్ట్రాంగ్ రూంల సీసీటీవీ ఫుటేజీని భద్రపర్చాలన్నారు. ఈ ఎన్నికల్లో ఉపయోగించని ఈవీఎంలను ఇతర రాష్ట్రాలకు తరలించాలని, లేదంటే సీజ్ చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరు, ట్యాంపరింగ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చినందున ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ కేడర్‌తో స్ట్రాంగ్‌రూంల వద్ద విజిలెన్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ కేడర్ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే టీపీసీసీ నాయకత్వానికి తెలియపర్చాలని కోరారు. -
మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్
సాక్షి, కొత్తగూడెం: ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేసి విప్లవ సాహిత్యంతో పాటు పలు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మార్చి 31న దుమ్ముగూడెం ఎస్సై ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, 141 సీఆర్పీఎఫ్ బెటాలియన్, స్పెషల్ పార్టీ పోలీసులతో గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో లక్ష్మీనగరంలోని యాసిన్ ఫుట్‌వేర్, హార్డ్‌వేర్ దుకాణం వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వీరిలో ఒకరు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా జొన్నగుడా గ్రామానికి చెందిన సవలం సోమా, మరొకరు సుకుమా జిల్లా పాలొడీ గ్రామానికి చెందిన మడివి ఉంగా అని గుర్తించినట్లు చెప్పారు. కాగా సోమా మావోయిస్టు పార్టీకి సంబంధించిన మొదటి బెటాలియన్ కమాండర్ ఇడుమా వద్ద హెడ్‌క్వార్టర్ ప్లాటూన్‌లో సెక్షన్ డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్నాడని, ఇడుమాకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ గన్‌మెన్‌గా, కొరియర్‌గా పనిచేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా మడివి ఉంగా మూడేళ్లుగా మా వోయిస్టు బెటాలియన్ కమాండర్ ఇడుమా పార్టీకి సానుభూతిపరుడిగా పనిచేస్తూ అవసరమైన సామాన్లు, మందుగుండు సామగ్రి, యూనిఫామ్, క్లాత్, చెప్పులు, బూట్లు సరఫరా చేస్తూ ఉండేవారని తెలిపారు. అరెస్టుచేసిన వారిలో మూ డవ వ్యక్తి దుమ్ముగూడెం మండలం లక్ష్మీపురం లో ని యాసిన్ ఫుట్‌వేర్, హార్డ్‌వేర్ యజమాని ఎండీ. ఖాదర్ యాసిన్బేగ్గా చెప్పారు. యాసిన్‌బేగ్ మావోయిస్టు పార్టీకి కావాల్సిన వస్తువులను భద్రాచలం, విజయవాడ వెళ్లి కొనుగోలు చేసి సోమా, ఉంగాల ద్వారా మావోయిస్టు పార్టీకి చేరవేసేవాడు. సోమా, ఉంగాల నుంచి డబ్బులు తీసుకుని, వారు అడిగిన పేలుడు పదార్థాలు, మందుపాతరలు, గ్రనేడ్ లాంచర్లు ఇతర పరికరాలు, జనరేటర్, వెల్డింగ్ మిషన్, ఐరన్ రాడ్స్ తెప్పించేవా డని వివరించారు. ఆదివారం యాసిన్ తెప్పించిన సామగ్రిని తీసుకువెళ్లేందుకు సోమా, ఉంగా వచ్చి పట్టుబడినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి పేలుడు పదార్థాలు, క్లేమోర్ పైపులు, ఇతర పరికరాలతో పాటు భద్రాచలంలోని ప్రజా సంఘాల నాయకులకు అందజేసేందుకు తీసుకొచ్చిన విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పలు విధ్వంస ఘటనల్లో పాల్గొన్న సోమా సోమా ఐదేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పలు విధ్వంసకర సంఘటనలతో పాటు సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ పోలీస్ సిబ్బందిపై దాడిచేసి హతమార్చిన ఘటనల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ వివరిం చారు. 2014లో సుకుమా జిల్లాలోని చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని కసళ్లపాడు వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో దాడి చేయగా 14మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారని, ఈ ఘటనలో సీఆర్పీఎఫ్కు సంబంధించిన పలు ఆయుధాలను లూటీ చేసినట్లు తెలిపారు. 2015లో సుకుమా జిల్లాలో పిడమేలు వద్ద బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్ చేసి కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై దాడిచేయగా ఏడుగురు ఎస్టీఎఫ్ సిబ్బంది చనిపోయారని, ఈ దాడిలో ఎస్టీఎఫ్ కు సంబంధించిన పలు ఆయుధాలను లూటీ చేసిన ఘటనలో సోమా పాల్గొన్నాడు. 2017లో సుకుమా జిల్లా కొత్తచెరువు వద్ద బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్ చేసి, రోడ్డు తనిఖీ చేస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై దాడి చేయగా 22 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారని, ఈ దాడిలోనూ ఆయుధాలను లూటీ చేయడం జరిగిందన్నారు. 2017లో సుకు మా జిల్లాలోని బుర్కాపాల్ వద్ద బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్ చేసి రోడ్ తనిఖీ చేస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై దాడిచేయగా 24 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందగా, 20 తుపాకులు, ఇతర ఆయుధాలను మావోయిస్టులు లూటీ చేసిన ఘటనలో సోమా పాలుపంచుకున్నారన్నారు. 2018 డిసెంబర్లో జారపల్లి వద్ద పామేడు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో కూడా సోమా నిందితుడిగా ఉన్నట్లు ఎస్పీ సునీల్‌దత్ వివరించారు. అరెస్టు చేసిన సోమా, ఉంగా, యాసిన్‌లను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
ఒక్క రోజులో మూడు ఎన్కౌంటర్లు
సాక్షి, కుప్వారా: కశ్మీర్ లోయలో మళ్లీ రక్తపాతం జరిగింది. బుడ్గం జిల్లాలో శుక్రవారం భారత ఆర్మీ జరిపిన వివిధ ఎన్కౌంటర్లలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు, నలుగురు మిలిటెంట్లు హతమయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో సైనికులు మూడు ఎన్కౌంటర్లు జరపడం విశేషం. బాలాకోట్ దాడుల తర్వాత కూడా తన బుద్ధి మార్చుకోకుండా సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతూ కవ్విస్తున్న దాయాది పాక్‌కు, ఈ ఎన్కౌంటర్లతో భారత్ గట్టిసమాధానమిచ్చినట్లైంది. బుడ్గాం జిల్లాలోని పారిగ్రామ్ ప్రాంతంలో భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్లు కలసి శుక్రవారం నిర్వహించన ఎన్కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయిన ఉగ్రవాదుల నుంచి ఎమ్16 రైఫిళ్లను ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గురువారం షోపియాన్ జిల్లాలోని యార్వాన్ అడవి, కుప్వారా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మన సైనికులు చేసిన ఎన్కౌంటర్లలో నలుగురు మిలిటెంట్లు చనిపోయారు. ఈ దాడులలో పలువురు జవాన్లకూ గాయాలైనట్టు సమాచారం. -
పుల్వామా దాడి : హోలీకి కేంద్ర బలగాలు దూరం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన క్రమంలో సీఆర్పీఎఫ్కు బాసటగా పది లక్షల మందికి పైగా సైనికులతో కూడిన కేంద్ర సాయుధ దళాలు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. సరిహద్దు భద్రతా దళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, సస్త్ర సీమా బల్లు ఈ ఏడాది హోలీని జరుపుకోరాదని నిర్ణయించాయి. కాగా, చత్తీస్‌గఢ్‌లోని సుక్మా దాడి ఘటన నేపథ్యంలో 2017లోనూ హోలీ వేడుకలను కేంద్ర బలగాలు రద్దు చేసుకున్నాయి. అదే ఏడాది ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై మావోయిస్టులు జరిపిన దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. మరోవైపు పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళిగా హోలీ వేడుకలు జరుపుకోవడం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. -
‘పుల్వామా దాడిని మర్చిపోయేది లేదు’
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని ఎన్నటికి మర్చిపోమని.. మరిన్ని చర్యలు తీసుకుంటామని జాతీయా భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాక్‌ను హచ్చరించారు. 80 సీఆర్పీఎఫ్ రైజింగ్ డే కార్యక్రమానికి హాజరైన దోవల్ ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోనే శక్తి, సామర్థ్యాలు దేశ నాయకత్వానికి ఉన్నాయన్నారు. పుల్వామా ఉగ్రదాడిని భారతీయులు ఎప్పటికీ మరచిపోరని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి దాడులను తిప్పికొట్టడంలో నాయకులు దీటుగా స్పందిస్తారని తెలిపారు. శత్రుమూకలకు ఎప్పుడు.. ఎలా.. సమాధానం చెప్పాలో నిర్ణయించడానికి మన నాయకుల ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశాలకు సైతం దీటుగా సమాధానం చెప్పే సత్తా మన దేశానికి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక ‘క్లిష్ట పరిస్థితుల్లో ఏ బలగాలను పంపాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు మాకు టక్కున గుర్తుకు వచ్చేది సీఆర్పీఎఫ్ పేరే. ఈ బలగాల పట్ల మాకు చాలా విశ్వాసం ఉంది. ఏళ్లుగా ఆ విశ్వాసాన్ని అలా నిలుపుకుంటున్నాయ’ని తెలిపారు. అంతేకాక దేశ భద్రతకు జవాన్లు అహర్నిశలు శ్రమిస్తున్నారని.. ప్రాణ త్యాగానికి సైతం సిద్దపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ఆయన నివాళులర్పించారు. -
దండకారణ్యంలో యుద్ధ మేఘాలు
సాక్షి, చర్ల: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోగల దండకారణ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మూడు రోజుల నుంచి సరిహద్దుల్లోకి ప్రత్యేక పోలీసు బలగాలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నాయి. మావోయిస్టుల కోసం అణువణువునా గాలిస్తున్నాయి. మహిళాదినోత్సవాన్ని ఘనంగా జరపాలంటూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే, సరిహద్దు గ్రామాల్లో ఆ పార్టీ మహిళాప్రతినిధులు ప్రచారం నిర్వహించారన్న సమాచారంతో పోలీసు బలగాలు వచ్చాయి. మహిళాదినోత్సవ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారన్న అనుమానంతో కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు, సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, మూడు రోజుల నుంచి సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ పోలీసు బలగాలు దండకారణ్యంలోకి చేరుకుంటున్నాయి. దండకారణ్యానికి దగ్గరలోగల భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, తూర్పుగోదావరి, బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల సరిహద్దుల్లో ఈ బలగాలు కూంబింగ్ సాగిస్తున్నాయి. దీంతో, ఆయా ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇటు ప్రత్యేక పోలీసు బలగాలు, అటు మావోయిస్టుల మధ్యన ఆదివాసీలు నలుగుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని వారు తీవ్ర భయాందోళనతో ఉన్నారు. మావోయిస్టుల కదలికలపై పోలీసు బలగాలు గట్టి నిఘా వేశాయని, ఎప్పటికప్పుడు అందుతున్న సమాచారం ఆధారంగా దండకారణ్యం వైపు కదులుతున్నాయని తెలిసింది. తెలంగాణ నుంచి సరిహద్దుకు చేరుకున్న పోలీసు బలగాలు, ఛత్తీస్‌గఢ్ పోలీసు బలగాలతో సమన్వయపర్చుకుంటూ ముందుకు సాగుతున్నట్టు సమాచారం. బలగాల కూంబింగ్ మరో వారం రోజులపాటు నిరంతరాయంగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. -
జవాన్ల కోసం తెరుచుకున్న ‘హెవెన్’..!
కశ్మీర్ : భారత జవాన్లు రిలీఫ్ అయ్యేందుకు 30 ఏళ్ల క్రితం మూతబడిన హెవెన్ థియేటర్ తెరచుకుంది. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ థియేటర్ ఉంది. పుల్వామా ఘటన తర్వాత అక్కడ బందోబస్తు పెరిగిపోవడంతో సైనికులు సేద తీరేందుకు ఈ థియేటర్ని ఉపయోగంలోకి తెచ్చారని స్థానికంగా నివాసముండే హవల్దార్ రామ్‌జీ చెప్పారు. రేయింబళ్లు డ్యూటీలో మునిగిపోయే జవాన్లు హెవెన్‌లో కాసేపు సినిమా చూసి రిఫ్రెష్ అవుతున్నారని తెలిపారు. యుద్ధం నేపథ్యంలో సాగే ‘పల్టాన్’ లాంటి సినిమాలు మరింత ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. కన్నవారిని, భార్యబిడ్డలకు దూరంగా ఉంటున్న జవాన్లకు బాలీవుడ్ సినిమాలు, ముఖ్యంగా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కే జేపీ దత్తా సినిమాలు కాస్త ఉత్సాహాన్నిస్తాయన్నారు. స్థానికులతో పాటు సినిమా చూడడం కొత్త అనుభూతినిస్తోందని సీఆర్పీఎఫ్ 40 బెటాలియన్ కమాండెంట్ అశు శుక్లా చెప్పారు. అమితాబ్ బచ్చన్ నటించిన కాళియా 1991లో హెవెన్‌లో ఆడిన చివరి సినిమా. -
మరో ‘పుల్వామా’ తప్పింది!
శ్రీనగర్: పుల్వామాలో ఫిబ్రవరి 14న సీర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతిదాడికి పాల్పడ్డ జైషే ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ 40 మంది జవాన్లను బలికొన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే తరహాలో ఆత్మాహుతి దాడి చేసేందుకు ఓ ఉగ్రవాది సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన రకీబ్ అహ్మద్ భద్రతాబలగాలపై ఆత్మాహుతి దాడి చేయాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. కానీ కుల్గామ్‌లోని తురిగామ్‌లో 24న జరిగిన ఎన్కౌంటర్లో రకీబ్ సహా ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. ‘మీరు ఈ వీడియోను చూసేలోగా నేను స్వర్గంలో ఉంటాను’ అని రకీబ్ మాట్లాడిన వీడియో శనివారం సోషల్‌మీడియాలో షేరింగ్ అవుతోంది. ఏ రకంగా ఆత్మాహుతిదాడి చేయబోతున్నానో వీడియోలో రకీబ్ చెప్పాడు. ఆదిల్ దార్, రకీబ్‌లకు సంబంధించిన వీడియోల మధ్య సారూప్యత ఉందన్నారు. భారత్ కాల్పుల్లో నలుగురు దుర్మరణం ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు చనిపోయారని పాకిస్తాన్ ఆర్మీ ఆరోపించింది. నైకాల్ సెక్టార్లో పాక్ ఆర్మీ పోస్టులు లక్ష్యంగా భారత బలగాలు కాల్పులు జరిపాయని తెలిపింది. -
మాకు ఆ చీర కావాలి..!
గాంధీనగర్ : గత వారం జరిగిన పుల్వామా ఉగ్ర దాడి నుంచి భారతావని ఇంకా కోలుకోలేదు. దేశమంతా ఓ వైపు తమ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళుర్పిస్తూనే.. మరో పక్క దాయాది దేశం పట్ల తీసుకోబోయే ప్రతీకార చర్యల గురించి చర్చించుకుంటుంది. ఈ నేపథ్యంలో అమర జవాన్లకు నివాళులర్పించేందుకు వినూత్న మార్గాన్ని ఎన్నుకున్నారు గుజరాత్ వస్త్ర వ్యాపారులు. భారతీయ సంప్రదాయానికి చిహ్నమైన చీర మీద.. సరిహద్దుల్లో పహరా కాస్తూ మాతృభూమి కోసం ప్రాణాలర్పించే సైనికుల ఫోటోలను చిత్రించారు. ప్రస్తుతం ఈ చీరకు విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకోవడమే కాక మాకు కూడా కావాలంటూ క్యూ కడుతున్న వారి సంఖ్య భారీగా ఉందంటున్నారు చీరను తయారు చేసిన వ్యాపారి. సూరత్‌కు చెందిన అన్నపూర్ణ బట్టల మిల్లు ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. ఈ విషయం గురించి మిల్లు యజమాని మాట్లాడుతూ.. ‘పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. వీరి త్యాగం వెలకట్టలేనిది. తమ కుటుంబాల గురించి ఆలోచించకుండా దేశం కోసం మనం కోసం ప్రాణాలర్పించారు. వారి త్యాగాలకు చిహ్నంగా జవాన్ల ఫోటోలతో ఈ చీరలను రూపొందించాము. వీటిని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు అందిస్తాము. ఈ చీరల మీద మన సైన్యం శక్తిని, యుద్ధ ట్యాంకులను, తేజోస్ విమానాల బొమ్మలను ముద్రించామ’ని తెలిపారు. ప్రస్తుతం ఈ చీరలకు ఫుల్ డిమాండ్ ఉందని.. దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు మిల్లు యజమాని. ఇదిలా ఉండగా పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కమాండర్ ఆదిల్... సీఆర్పీఎఫ్ బలగాల వాహన శ్రేణిని ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ క్రమంలో పుల్వామా దాడిలో కీలక సూత్రధారిని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. -
రెండు రోజుల్లో మరిన్ని ఆత్మాహుతి దాడులు!
-
పాక్ ఖైదీని రాళ్లతో కొట్టి చంపారు..!
జైపూర్ : రాజస్థాన్‌లోని జైపూర్ సెంట్రల్ జైలులో ఘోరం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన ఓ ఖైదీని తోటి ఖైదీలు రాళ్లతో కొట్టి చంపారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాక్ ఖైదీ షకీరుల్లా హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గూఢచర్యం కేసులో షకీరుల్లా శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు ఖైదీల ప్రమేయమున్నట్లు పోలీసులు తేల్చారు. పాక్ ఖైదీ మృతిని జైళ్ల శాఖ ఐజీ ధృవీకరించారు. భారత్ జైళ్లలో 347 మంది పాకిస్తాన్ ఖైదీలు శిక్షను అనుభవిస్తుండగా.. పాక్ జైళ్లలో 537 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు. (మరణించి కూడా ఊరిలో వెలుగులు నింపిన జవాను) -
ఫేస్బుక్లో ‘క్లీన్ ది నేషన్’ గ్రూపులు
సాక్షి, న్యూఢిల్లీ : ‘మన సైనికులను ఎవరు అపహాస్యం చేస్తున్నారో, వారి పట్ల ఎవరు అవమానకరంగా మాట్లాడుతున్నారో వెతికి పట్టుకోండి! వారి పనిచేస్తున్న ఆఫీసులకు, కంపెనీలకు, వారు చదువుతున్న యూనివర్శిటీలకు ఫోన్లు చేయండి, ఈ మెయిల్స్ పంపండి. సదరు ఉద్యోగులను తొలగించేలా, విద్యార్థులను సస్పెండ్ చేసేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకురండి. వారిపై కేసులు నమోదు చేసేలా పోలీసులపైనా ఒత్తిడి తీసుకరండి! స్క్రూ... దెమ్. దేశంలో ఉంటూ, భారతీయులమని చెప్పుకుంటూ మన సంస్కృతిని, మన ప్రజలను మన సైన్యాన్ని అవమానిస్తున్న వారిని ఏరిపారేయడం కోసం ఈ గ్రూపు ఆవిర్భవించింది. మన ప్రతిష్టాత్మకమైన సైన్యం పొరుగునున్న శత్రువులపై సర్జికల్ దాడులు జరుపుతుంది. మనం దేశంలో ఉన్న శత్రువులను తరిమి కొడదాం’ అన్న సందేశంతో ‘క్లీన్ ది నేషన్’ పేరిట్ శనివారం నాడు ఓ ఫేస్బుక్ గ్రూప్ అవతరించింది. మధుర్ జక్ సింగ్ ఏర్పాటు చేసిన ఈ గ్రూపులో 42 మంది వ్యవస్థాపక సభ్యులు ఉన్నారు. వీరిలో ఆరెస్సెస్ కార్యకర్తలు ఉన్నారు. ట్విట్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నాయకులను ఫాలో అవుతున్న అంకిత్ జైన్ లాంటి వారు పేజీ అడ్మినిస్ట్రేటర్లుగా ఉన్నారు. సోమవారం సాయంత్రానికి ఈ గ్రూపు సభ్యుల సంఖ్య 5,400కి చేరుకుంది. తమ కారణంగా యాభై మందిపై కంపెనీల యజమానులు, యూనివర్శిటీలు చర్యలు తీసుకున్నాయని ఈ గ్రూపు గర్వంగా ప్రకటించుకుంది. 50 మంది వేధింపులకు, ఉద్వాసనలకు, గురవడమే కాకుండా పోలీసు కేసులను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. అది ‘క్లీన్ ది నేషన్’ ఒక్క గ్రూపు కారణంగానే జరగలేదు. అలాంటి పలు సోషల్ గ్రూపుల కారణంగా జరిగింది. జరుగుతోంది. గ్రూపు అవతరించిన సందర్భంగా వ్యవస్థాపకుడు మధుర్ జక్ సింగ్ ‘ఇండియన్ ఆర్మీ’ అంటూ ముద్రించిన పసుపురంగు టీ షర్టును ధరించిన వీడియోను విడుదల చేయగా, ఇతర వ్యవస్థాపక సభ్యులు తాము ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలతో దిగిన ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రొఫెసర్‌కు ఉద్వాసన, అదశ్యం ‘క్లీన్ ది నేషన్’ గ్రూపునకు గువాహటి కళాశాలలో గత ఏడేళ్లుగా అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పాప్రి బెనర్జీ తొలి టార్గెట్ అయ్యారు. ‘ఈ ప్రభుత్వం ఊదరగొడుతున్న జాతీయ వాదానికి సైనికులు తమ ప్రాణాలను మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చింది’ అని ఆమె పెట్టిన పోస్టింగ్ ఈ గ్రూపునకు కోపం తెప్పించింది. అత్యాచారం చేసి, హత్య చేస్తామంటూ హెచ్చరికలే కాకుండా రాళ్లతో కొట్టి చంపాలనే సందేశాలను ఈ గ్రూపు సభ్యులు పంపించారు. వీరి ఒత్తిడికి లొంగి గువాహటి పోలీసులు ఆమెపై ఐపీసీలోని 505 సెక్షన్ కింద, ఐటీలోని 66వ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. గువాహటికి 300 కిలోమీటర్ల దూరంలోఉన్న సిల్చర్ పోలీసులు కూడా ఆమెపై ఐపీసీ 294, 506, ఐటీ 66 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాము ఈ కేసును గువాహటి పోలీసులకు బదిలీ చేస్తామని సిల్చర్ పోలీసు అధికారి నితుమోని గోస్వామి తెలిపారు. ప్రొఫెసర్ బెనర్జీని అదుపులోకి తీసుకొని ప్రాథమికంగా విచారించిన పోలీసులు, తిరిగి సోమవారం ఉదయం పోలీసు స్టేషన్‌కు రావాల్సిందిగా ఆమెను ఆదేశించి ఇంటికి పంపించారు. అదే రోజు ఆమె వివరణను కోరిన కాలేజీ యజమాన్యం ‘మీ వివరణ సమంజసంగా లేదు’ అంటూ ఆమెను సస్పెండ్ చేసింది. శనివారం రాత్రిలోగా ఈ పరిణామాలన్నీ చకా చకా జరిగాయి. ఆ మరుసటి రోజు, ఆదివారం ఉదయం బెనర్జీ ఇంటి నుంచి అదశ్యమయ్యారు. ‘నేను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాను. నా గురించి బెంగపడవద్దు’ అంటూ తండ్రి, సోదరుడి పేరిట లేఖ రాసి ఆమె ఇంటి నుంచి నిష్క్రమించారు. అత్యాచారం చేసి, హత్య చేస్తామంటూ బెదిరించినందుకు అమ్మాయి పారిపోయి ఉంటుందని తండ్రి రోదిస్తున్నారు. మణిపూర్ ఎడిటర్‌పై టార్గెట్ ‘నన్ను క్షమించండి, సైనికుల మృతికి నేను కన్నీళ్లు కార్చలేక పోతున్నందుకు, ఇలాంటి సైనికులే మణిపూర్‌లో మా అమ్మాయిలపై అత్యాచారాలు జరిపి ఎలాంటి శిక్షలు లేకుండా తిరుగుతున్నారు’ అంటూ ఫేస్బుక్లో కామెంట్ చేసిన ‘ప్రొవోక్ లైఫ్ స్టైల్ మాగజైన్’ ఎడిటర్ ఇన్ చీఫ్ రోమల్ లైస్రామ్కు ఉద్వాసన చెప్పాల్సిందిగా యాజమాన్యంపై గ్రూప్ ఒత్తిడి తీసుకొచ్చింది. ‘ఆయన భావ ప్రకనటనా స్వేచ్ఛను మేమే గౌరవిస్తాం. అందుకనే ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేం’ అంటూ యజమాన్యం బదులిచ్చింది. అభ్యంతర పోస్టులు పెట్టారంటూ పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి పట్టణంలో ఆదివారం నాడు ఓ విద్యార్థిని దేబి బిశ్వాస్, హబ్రాకు చెందిన మరో విద్యార్థిని అర్పణ్ రక్షిత ఇళ్లపై మూక దాడులు జరిగాయి. రాజస్థాన్‌లో నలుగురు విద్యార్థులు యూనివర్శిటీల నుంచి సస్పెండయ్యారు. బీహార్, కర్ణాటక, డెహ్రాడూన్లలో కూడా ఫేస్బుక్ పోస్టింగ్‌ల కారణంగా మూక దాడులు జరిగాయి. ఇలాంటి సంఘటనలపై ఆలస్యంగానైనా స్పందించిన జాతీయ ప్రధాన మీడియా దాడులను ప్రోత్సహిస్తున్న ‘క్లీన్ ది నేషన్’ లాంటి గ్రూపులపై ఎందుకు చర్య తీసుకోవడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఫేస్బుక్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ‘క్లీన్ ది నేషన్’ గ్రూపు సోమవారం రాత్రి మాయమయింది. గ్రూపే తప్పుకుందా ? ఆ గ్రూపును ఫేస్బుక్ యాజమాన్యం తొలగించిందా ? అన్నది స్పష్టం కావడం లేదు. -
పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు పంపిన ప్రధాని మోదీ
-
‘పుల్వామా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం వనస్థలిపురంలోని సీనియర్ సిటిజన్ ఫోరంలో వివిధ సంఘాల సభ్యులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ పూల్వామా ఘటనకు కారకులైన వారికి మరిచిపోలేని గుణపాఠం చెప్పాలని, రానున్న కాలంలో ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భారత్ సత్తాను ప్రపంచానికి తెలియజేసేలా పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎం. మోహన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్.నర్సరాజు, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు హన్మంతరావు, కార్యదర్శి బసవయ్య, సచివాలయనగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇ.చంద్రశేఖర్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు. -
పాక్ డీఎన్ఏలో శాంతి అనేది లేదు
హైదరాబాద్: పాకిస్తాన్ డీఎన్ఏలో శాంతి అనే పదం లేదని కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ ‘రా’ మాజీ అధిపతి విక్రమ్‌సూద్ వ్యాఖ్యానించారు. ఆ దేశంతో శాంతి వచనాలు జరపడం వల్ల ప్రయోజనం లేదని తేల్చిచెప్పారు. కశ్మీర్, పాకిస్తాన్ అంశాలపై భారత్ ఒక జాతీయ విధానం రూపొందించుకోవాలని సూచించారు. ఆదివారం సోమాజిగూడలోని ఆస్కీలో సోషల్‌కాజ్ ఆధ్వర్యంలో ‘జాతీయ భద్రతకు బాహ్య నిఘా’అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్రమ్‌సూద్ మాట్లాడుతూ.. పాకిస్తాన్లో ఎన్ని ప్రభుత్వాలు మారినా భారత్‌తో ప్రచ్ఛన్న యుద్ధం సాగించాలని అక్కడి పాలకులు, రాజకీయ పక్షాలు అన్ని ఒకే విధానంతో ఉన్నారని, కానీ భారత్‌లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ సంప్రదాయ యుద్ధంలో గెలవలేమనే, ఇలా పరోక్ష యుద్ధానికి కాలుదువ్వుతోందని ఆరోపించారు. దీన్ని ఎదుర్కొనేందుకు భారత నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఒకే అభిప్రాయానికి రావాలని.. పాక్ పట్ల దృఢ వైఖరి అవలంభించాలని సూచించారు. ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య మాట్లాడుతూ.. మన నిఘా వ్యవస్థలు అనేక పరిమితుల మధ్య పనిచేస్తున్నాయని, వాటికి అవసరమైన వనరులు కూడా సరిగా అందుబాటులో లేవని, కేవలం నివేదికలు సమర్పించడానికే పరిమితం అవుతున్నాయని ఆరోపించారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ తరహా వ్యవస్థలను తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం విదేశీ నిఘాపై విక్రమ్‌సూద్ రచించిన ‘ది అన్ఎండింగ్ గేమ్’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ కె.రామచంద్రారావు, సోషల్‌కాజ్ అధ్యక్షురాలు డాక్టర్ సోమరాజు సుశీల తదితరులు పాల్గొన్నారు. -
కశ్మీర్లో అబిద్ ?
కర్ణాటక, కృష్ణరాజపురం: కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడిపై హర్షం వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో సందేశం పోస్ట్ చేసిన కశ్మీర్‌కు చెందిన అబిద్ మాలిక్ అనే యువకుని కోసం సీసీబీ పోలీసులు వేట తీవ్రతరం చేశారు. అబిద్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాలతో పాటు ప్రజల్లో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సీసీబీ అదనపు కమిషనర్ అలోక్ కుమార్ ఆధ్వర్యంలో గాలింపు జరుగుతోంది. కశ్మీర్‌కు చెందిన ఇతడు నగరంలోనే చదువుకుని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మాహుతి దాడిని అసలైన సర్జికల్ స్ట్రైక్‌గా ఫేస్బుక్లో వర్ణించడం తెలిసిందే. అతని జాడ కోసం అన్ని రాష్ట్రాల పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్న బెంగళూరు సీసీబీ పోలీసులు అతడు కశ్మీర్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఎన్ఐఏకు సమాచారం అందించారు. అబిద్‌పై కన్నడ పోరాట సంఘాల నేత నాగేశ్గౌడ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అబిద్ మాలిక్‌తో పాటు అతని ఫేస్బుక్ గ్రూప్‌లో ఉన్న అబ్దుల్ హనీఫ్, సుల్తాన్ అహ్మద్, అమీన్ షరీఫ్, ఉమర్ ఫార్జీ, సల్మాన్ అనే వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు. -
జవాన్ల కుటుంబాలకు కేటీఆర్ విరాళం
సాక్షి, హైదరాబాద్: పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి అర్పించారు. జవాన్ల మరణం తనను ఎంతో కలచివేసిందని, ప్రజలను కాపాడే కర్తవ్యంలో మరణించిన వారికి తమ రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున నివాళి అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతికి వ్యక్తం చేస్తూ.. తన వ్యక్తిగతంగా రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బంజారాహీల్స్‌లోని సీఆర్పీఎఫ్ సధరన్ హెడ్ క్వార్టర్స్‌లో ఐజీపీ రాజుకు చెక్కును అందచేశారు. తన స్నేహితులు మరో 25 లక్షలు ఇచ్చారని, మొత్తం 50 లక్షల రూపాయలను అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా కేటీఆర్ చెల్లించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా తాను ఇక్కడికి రాలేదని సాధారణ భారత పౌరుడిగా మాత్రమే వచ్చినట్లు తెలిపారు. భద్రతా బలగాల సేవల వల్లనే దేశ ప్రజలంతా క్షేమంగా ఉంటున్నారని, వారి త్యాగాలను ఎన్నటికీ మరువలేవని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో అసువులుబాసిన జవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. దాడిలో గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
భారత్‌కి అమెరికా నుంచి పెరుగుతున్న మద్దతు
-
భోపాల్‌లో సీఆర్పీఎఫ్ భారీ కొవ్వొత్తుల ప్రదర్శన
-
తండ్రి మృతదేహనికి కడసారి సెల్యూట్..
-
అమరవీరులకు కన్నీటి వీడ్కోలు
-
ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం
-
నీరజ్ దేవి (ఒక వీర జవాన్ భార్య)-రాయని డైరీ
దుఃఖ పడటానికి దేవుడు సమయం ఇవ్వలేదు. సైనికుడి భార్యకు దుఃఖమేమిటి అనుకున్నాడేమో! ప్రదీప్ కూడా అనేవాడు.. ‘సైనికుడి భార్యకు కన్నీళ్లేమిటి’ అని. కళ్లయినా తుడిచేవాడా! ‘తుడుచుకో’ అని నవ్వేసి రైలు ఎక్కేసేవాడు. పిల్లల్ని తీసుకుని చీకట్లోనే అత్తగారి ఊరికి చేరుకున్నాను. దారి మధ్యలో.. ‘‘ఎ..క్క..డి..కీ..’’ అని అడిగింది సోనా వచ్చీరాని మాటల్తో. రెండేళ్లు దానికి. ‘‘నాన్న దగ్గరికి’’ అని చెప్పాను. మేము వచ్చేటప్పటికి ప్రదీప్ ఇంకా అమ్మగారింటికి ‘చేరుకోలేదు’. ‘‘నాన్నేరీ’’ అంటోంది సోనా నిద్రకు సోలుతూ. సుప్రియకు అర్థమైపోయింది. ‘‘రారు కదమ్మా నాన్న ఇక ఎప్పటికీ’’ అంది చెల్లికి వినిపించకుండా. దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నాను. పదేళ్ల పిల్ల సుప్రియ! కొన్ని గంటల క్రితం వరకూ తనూ రెండేళ్ల పిల్లలానే ఉండేది. నాన్న ఫోన్ చేస్తే.. ‘ఎప్పుడొస్తావ్ నాన్నా’ అని అడిగేది. ‘నాన్నా.. మనం కట్టుకుంటున్న ఇంట్లో చెల్లికి, నాకు కలిపి.. మా ఇద్దరికే ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది కదా’ అనేది. ‘ఉంటుంది తల్లీ. మరి నేను, అమ్మ.. ఎప్పుడైనా మీ గదిలోకి రావచ్చా’ అని అడిగేవాడు ప్రదీప్. ‘రావచ్చు నాన్నా. అయితే మా గదిలో ఉన్నప్పుడు కశ్మీర్ నుంచి ఫోన్ వస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చెయ్యకూడదు. ఎప్పుడు నీకు ఫోన్ వచ్చినా, వెంటనే రమ్మనే కదా వస్తుంది’ అనేది.. మూతి అదోలా ముడిచి. అమ్మవాళ్ల ఊళ్లో ఉన్నప్పుడు గురువారం తెల్లవారు జామున ప్రదీప్ నుంచి ఫోన్ వచ్చింది. చాలాసేపు మాట్లాడాడు. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. పది నిముషాలు సోనా గురించే మాట్లాడాడు. ‘జమ్మూ నుంచి శ్రీనగర్ వెళుతున్నాం’ అన్నాడు. ‘ఇంత రాత్రేమిటి?’ అన్నాను. నవ్వాడు. ‘‘నాకొక్కడికే కాదు రాత్రి. ఇంకా రెండువేల ఐదొందల మందికి కూడా. డెబ్భై ఎనిమిది వాహనాల్లో వరుసగా వెళుతున్నాం. వాహనాలు నడిపించడం లేదు మమ్మల్ని. దేశ సమగ్రతను కాపాడవలసిన బాధ్యత నడిపిస్తోంది’’ అన్నాడు! సుప్రియ గురించి, సోనా గురించి తప్ప ప్రదీప్ నాతో ఏం మాట్లాడినా సాటి జవానుతో మాట్లాడినట్లే ఉంటుంది. ‘‘సుప్రియ అడుగుతోంది.. ‘నాన్న మళ్లీ ఎప్పుడొస్తారని’. పని పూర్తవగానే వచ్చేస్తారని చెప్పాను’’ అన్నాను. నవ్వాడు. ‘‘సుప్రియ అడుగుతోంది. నేను అడగలేకపోతున్నాను’’ అన్నాను బెంగగా. ‘‘సైనికుడి భార్యవేనా నువ్వు?’’ అన్నాడు. పెద్ద శబ్దం. నా చేతిలోని ఫోనే పేలిపోయినంతగా శబ్దం! ‘ప్రదీప్.. ప్రదీప్..’ ప్రదీప్ పలకట్లేదు. సుప్రియ లేచింది. ‘ఏంటమ్మా..’ అని. మళ్లీ ఫోన్!! ‘‘ప్రదీప్’’ అన్నాను. నిశ్శబ్దం! ‘‘ప్రదీప్ భార్యేనా మీరు?’’ కంట్రోల్ రూమ్ నుంచి! నాకేదో అర్థమౌతోంది. ప్రదీప్ భార్యనని చెప్పుకోవాలంటే ఏడ్వకూడదు. ‘ఊ’ అన్నాను. పిల్లల్ని దగ్గరికి లాక్కున్నాను. ఊరింకా మేల్కోలేదు. బరసిరోహీ నుంచి సుఖ్సేన్పూర్ వచ్చేశాం. పిల్లలిద్దరూ.. నాన్న రావడం కోసం ఎదురు చూస్తున్నారు. అమరవీరుడైన ఒక జవాన్ రావడం కోసం సుఖ్సేన్పూర్ ఎదురు చూస్తోంది. సుప్రియ నా చెయ్యి పట్టుకుని మెల్లిగా ‘‘అమ్మా..’’ అని పిలిచింది. ‘‘నాన్న.. అక్కడ చెయ్యవలసిన పని పూర్తయి ఉండదు కదమ్మా..’’ అంది. నాన్నపై ఉన్న ప్రేమంతా కన్నీళ్లుగా కరిగి, దాని చెంపల్ని తడిపేస్తోంది. తన కళ్లు కదా తుడుచుకుని చెప్పాల్సింది.. నా కళ్లు తుడుస్తూ చెప్పింది.. ‘‘నాన్న మిగిల్చిపోయిన పని నేను పూర్తి చేస్తానమ్మా..’’ అని చెప్పింది! ఒడిలోకి తీసుకున్నాను. సైనికుడి కూతురు అది. -మాధవ్ శింగరాజు -
సమర్థ దౌత్యమే సరైన ఆయుధం
కశ్మీర్‌లోయలో పాకిస్తాన్ ఉగ్రపంజా విసిరి విశేషంగా ప్రాణనష్టం సంభవించిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందన ఒకే విధంగా ఉంటుంది. ప్రదానమంత్రి ఆగ్రహం వెలిబుచ్చుతారు. పాకిస్తాన్‌కి తగినవిధంగా జవాబు చెబుతామంటూ తీవ్రంగా హెచ్చరిస్తారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఒంటరి చేయడానికి అవసరమైన సకల చర్యలూ తీసుకుంటామని హామీ ఇస్తారు. పాకిస్తాన్‌ను ఉగ్ర దేశంగా అభివర్ణిస్తారు. కొన్ని వారాలపాటు ప్రతీకార దాడుల గురించీ, ‘ముహ్ తోడ్ జవాబ్’ (మొహం పగిలే జవాబు) గురించీ ప్రధాని నరేంద్రమోదీ హెచ్చ రిస్తారు. టెలివి జన్ చానళ్ళు హడావిడి చేస్తాయి. వార్తాపత్రికలలో ప్రధాన శీర్షికలుగా వస్తాయి. 2008లో ముంబయ్‌పైన పాకిస్తాన్ ముష్కరులు దాడి చేసినప్పటి నుంచీ మొన్న పుల్వామాలో కేంద్ర రిజర్వ్ పోలీసు దళాల (సీఆర్ పీఎఫ్)పైన దాడి వరకూ ఇదే వరుస. గురువారంనాడు అదిల్ మహమ్మద్ దార్ అనే కశ్మీరీ యువకుడు పేలుడు పదార్థాలను స్కార్పియో కారునిండా పెట్టుకొని సీఆర్పీఎఫ్ జవాన్లను తీసుకొని వెడుతున్న ట్రక్కుల శ్రేణిని ఢీకొట్టి పేలిపో యాడు. ఫలితంగా 40 మంది జవాన్లు మరణించారు. అనేకమంది గాయప డ్డారు. లోగడ ఎన్నడూ ఇంతటి తీవ్రమైన దాడి జరగలేదు. జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ భవనంపైన 2001లో పేలుడు పదార్థాలు కలిగిన ట్రక్కుతో దాడి జరిపిందీ, పఠాన్‌కోట, నాగ్రోతా, ఉడిలోని సైనిక స్థావరాలపైన దాడులు చేసిందీ కశ్మీర్‌కు చెందిన పౌరులు కాదు. వారు పాకిస్తానీయులు. అక్కడ ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులు. 2000 ఏప్రిల్‌లో కశ్మీర్లో తొలి మానవబాంబు పేలింది. బాదామీబాగ్‌లోని సైనిక ప్రధాన కార్యాలయంపైన దాడి చేసి ఇద్దరు సైనికులను హత్యచేశారు. ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తి కశ్మీర్‌కు చెందిన యువ కుడు. కశ్మీర్‌కు చెందిన యువకులను ఆకర్షించి పాక్ తీసుకువెళ్ళి వారికి ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చి కశ్మీర్‌పైన ప్రయోగించడం పాకిస్తాన్ సైన్యం పోషి స్తున్న ఉగ్రవాదసంస్థల నిరంతర కార్యక్రమం. శనివారం దేశీయాంగ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు ప్రభు త్వానికి అండగా నిలబడతామని ప్రకటించాయి. పుల్వామా దాడిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని సైతం అఖిలపక్ష సభ ఈ సందర్భంగా ఆమోదించింది. కశ్మీర్లో పాకిస్తాన్ చిచ్చు కశ్మీర్‌లోయలో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చిచ్చుపెట్టే శక్తి పాకిస్తాన్‌కు ఉన్నది. పాకిస్తాన్‌కు ఇండియా ఎటువంటి జవాబు ఇవ్వగలదు? 2016 సెప్టెం బర్లో ఉగ్రదాడులకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రయిక్ చేసినట్టు ప్రభుత్వం ప్రక టించింది. దేశంలోనూ, విదేశాలలోనూ సర్జికల్ స్ట్రయిక్ గురించి నరేంద్ర మోదీ పలు సందర్భాలలో చెప్పారు. అంతా బూటకమేనని పాకిస్తాన్ ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలనీ, ప్రతీకారం తీర్చుకోవాలనీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. సర్జికల్ స్ట్రయిక్ కంటే నేరుగా పాకిస్తాన్ భూభా గంలోకి యుద్ధవిమానాలు వెళ్ళి బాంబింగ్ జరిపితే పాకిస్తాన్ ఇకపైన జాగ్రత్తగా వ్యవహరిస్తుందని కొందరు సూచిస్తున్నారు. అయితే మన యుద్ధవిమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశిస్తే పాక్ సైనికులు చేతులు ముడుచుకొని కూర్చుంటారా? వారికి మనకిలాగే రాడార్ వ్యవస్థ ఉండదా? అయినా సరే, ఆవేశం, ఆక్రోశం ఉన్న సమయంలో ఇటువంటి ఆలోచనలు వస్తాయి. నాయ కులు ఇటువంటి ప్రకటనలు సైతం చేస్తారు. ఎన్నికలు సమీపంలో ఉన్నాయి కనుకనే అసాధారణ రీతిలో ప్రభుత్వ స్పందన ఉంటుంది. ఈ కారణంగానే ప్రతిపక్షాలు సైతం ఇంటెలిజెన్స్ వైఫల్యాల గురించి ఏ మాత్రం మాట్లాడకుండా ఏకతాటిపై నిలబడి ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. ఈ పరిస్థితిలో కశ్మీర్‌ను రావణ కాష్టంగా మార్చిన భారత ప్రభుత్వ విధానాలనూ, వైఫల్యాలనూ ప్రస్తా వించడం సముచితం కాదు. ఇది సంతాప సమయం. విశ్లేషణలకూ, విమర్శ లకూ తగిన సందర్భం కాదు. సైనికంగా స్పందిస్తామంటూ, పాకిస్తాన్‌కి గుణపాఠం చెబుతామంటూ ప్రధాని గంభీరంగా ప్రకటిస్తుంటే ఆయన వైఖరిని ప్రశ్నించడం అవివేకం. అందుకే అఖిలపక్షం ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో నిర్ణయించే బాధ్యత పూర్తిగా సైన్యానికి వదిలినట్టు నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎప్పుడో ఏదో ప్రకటన వస్తుంది. ఇలా అధీనరేఖ దాటి కొందరు శత్రు సైనికులను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకోవడం కొత్త కాదు. ప్రతీకారం చేసినట్టు పదేపదే చెప్పుకునే సంప్ర దాయానికి మోదీ శ్రీకారం చుట్టారు. కశ్మీర్‌పైన జరుగుతున్న దాడుల పట్ల కోపంతో కుతకుతలాడుతున్న దేశప్రజలను శాంతింపజేయడానికి ఉద్దేశించిన ప్రక్రియ ఇది. సర్జికల్ స్ట్రయిక్‌లు నిర్వహించామని ప్రకటించడమే కాకుండా వాటి తాలూకు దృశ్యాలను కూడా ప్రభుత్వం గతంలోనే విడుదల చేసింది. ఎన్నికలు చాలా దూరంగా ఉన్న దశలోనే సర్జికల్ స్ట్రయిక్‌కు అత్యంత ప్రచారం ఇచ్చినవారు ఎన్నికలు సమీపించిన తరుణంలో చేయబోయే ప్రతీకారానికి ప్రచారం ఇవ్వకుండా ఉంటారా? ఏదో ఒక ప్రతీకార చర్య తీసుకున్నట్టూ, పాకిస్తాన్ మదం అణచినట్టూ త్వరలోనే ప్రభుత్వం ప్రక టిస్తుంది. ఏ విధంగా చూసినా ఇది అనివార్యం. కొన్ని మాసాల తర్వాత ప్రజలు ఈ అంశాన్ని మర చిపోతారు. ఇది తాత్కాలిక ఉపశమనమే కానీ కశ్మీర్ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కాదు. సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ ప్రభుత్వం ఒక అంగుళమైనా వెనుకంజ వేశాయా? కశ్మీర్లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయా? ఉగ్రవాదంవైపు మొగ్గుతున్న యువత ఉగ్రవాదుల దాడులు తగ్గినట్టు ప్రభుత్వం చెబుతున్నది. కానీ కొన్నేళ్ళుగా కశ్మీర్లో యువకులు తీవ్రవాదంవైపు మొగ్గుతున్నారు. తుపాకీ నీడన పుట్టి పెరిగిన యువకులకు సైనికులతో కానీ ప్రభుత్వాధికారులతో కానీ చేదు అనుభవం ఎదురైతే వారు ఉగ్రవాద సంస్థలలో చేరిపోతున్నారు. ఫేస్బుక్, ట్వీటర్, వాట్సాప్ వంటి అధునాతన సాంకేతికత ఉగ్రవాదం ప్రచారానికి కూడా దోహదం చేస్తోంది. ప్రపంచం పూర్తిగా తెలియని యువకులను ఆకర్షించడానికి రకరకాల వీడియోలు తయారు చేసి వదులుతున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు దార్‌ను చితకబాదడంతో అతడు ఉగ్రవాదాన్ని ఆశ్రయించాడంటూ దార్ తల్లి దండ్రులు చెప్పారు. ఆత్మాహుతి దాడిలో మరణించిన జవాన్ల తల్లిదండుల వలెనే తాము కూడా కొడుకు చనిపోయాడని కుమిలిపోతున్నామని అన్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా దార్ తల్లిదండ్రుల పుత్రశోకానికి కారణాలు కనుగొని తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం కశ్మీర్‌లోయలో అస్థిరతకూ, అనిశ్చితికీ, శాంతభద్రతల వైఫల్యానికీ, పరిపాలన దెబ్బతినడానికీ దారితీసింది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితులలోనే ఉగ్రవాదం పైచేయి సాధిస్తుంది. ఇటువంటి వాతా వరణమే 1989లోనూ, 2010లోనూ కశ్మీర్‌లోయలో ప్రబలింది. ఈ పరిస్థితిని ఎప్పటికైనా చక్కదిద్దుకోవలసిందే. కశ్మీరీల మద్దతునూ, విధేయతనూ భారత ప్రభుత్వం, ప్రజ సంపాదించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రథమ కర్తవ్యం. ముఖ్యమైన అంశం పాకిస్తాన్‌కు సంబంధించింది. ఆ దేశంలో ఉగ్రవాద సంస్థలకు ఊతం లభించినంత కాలం కశ్మీర్లో శాంతిభద్రతలు రక్షించడం అసాధ్యం. పాకిస్తాన్‌ను బలప్రయోగంతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించడం వృధా ప్రయాస. అది కూడా అణుశక్తి కలిగిన రాజ్యం. పైగా పాకిస్తాన్‌కు కొండంత అండగా చైనా ఉన్నది. ఆత్మాహుతి దాడి తమ పనే అని చాటుకున్న జైషే మహమ్మద్ నాయకుడు మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలన్న భారత ప్రతిపాదనకు చైనా పదేపదే మోకాలడ్డుతున్నది. సీఆర్పీఎఫ్ జవాన్ల మృతిపట్ల సంతాపం తెలిపే ప్రకటనలో సైతం చైనా పాకి స్తాన్ ప్రస్తావన చేయలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుభూతి ప్రకటిస్తూ మోదీకి సందేశం పంపించారు కానీ అమెరికా మరోవైపు పాకిస్తాన్‌కు గొప్ప ఉపకారం చేస్తున్నది. వ్యూహాత్మకంగా బలమైన స్థితిలో పాకి స్తాన్ ఉండ బోతోంది. మరోవైపున అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైనికులు పూర్తిగా నిష్క్రమించబోతున్నారు. ప్రపంచంలో ఎదురులేని శక్తిగా అమెరికాను అభివృద్ధి చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ క్రమంగా అమెరికా సైనికులను సంక్షుభిత ప్రాంతాల నుంచి ఉపసంహరించుకుంటున్నారు. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వైదొలగడం అంటే అఫ్ఘానిస్తాన్ భద్రతాదళాలపైన దాడులు చేస్తున్న తాలిబాన్‌కు అఫ్ఘానిస్తాన్‌ను అప్పగించడమే. పరోక్షంగా పాకిస్తాన్ చేతు లలో అఫ్ఘానిస్తాన్‌ను పెట్టడమే. దౌత్యరంగంలో పాకిస్తాన్ ప్రభుత్వాలు మన ప్రభుత్వాల కంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయనడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. అఫ్ఘానిస్తాన్ వ్యవహారంలో భారత్ ఒంటరి అఫ్ఘానిస్తాన్ సమస్య పరిష్కారానికి మాస్కోలో రష్యా, చైనా, పాకిస్తాన్ ప్రతి నిధుల మధ్య చర్చలు జరిగాయి. ఇందులో భారత్ ప్రస్తావన కానీ ప్రమేయం కానీ లేదు. మన్మోహన్సింగ్. నరేంద్రమోదీ అఫ్ఘానిస్తాన్‌ను సందర్శించి, అఫ్ఘాన్ సైనికులకు ఇండియాలో శిక్షణ ఇచ్చి, ఆర్థిక సహాయం చేసి, కాబూల్‌లో పార్ల మెంటు భవన నిర్మాణంలో తోడ్పడినప్పటికీ అఫ్ఘాన్ సంక్షోభం పరిష్కరించ డంలో భారత్ ప్రమేయం ఉండాలని అమెరికా కానీ చైనా కానీ అఫ్ఘానిస్తాన్ కానీ భావించడం లేదు. అంతే కాదు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ అనుకూల ప్రభు త్వమో, తాలిబాన్ నడిపించే ప్రభుత్వమో ఏర్పడితే ఇంతకాలం ఆఫ్ఘాన్ భద్రతా దళాలతో పోరాడిన తాలిబాన్‌ను పాకిస్తాన్ కశ్మీర్‌వైపు మళ్ళిస్తుంది. 1989లో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థ (సీఐఏ) సహకారంతో పాకి స్తాన్ ప్రోత్సాహంతో తాలిబాన్ అఫ్ఘానిస్తాన్‌పై పోరాటం చేసి ఆ దేశం నుంచి సోవియెట్ సైన్యాన్ని జయప్రదంగా పంపించివేసింది. అంతవరకూ సోవియెట్ సైన్యంతో పోరాడిన తాలిబాన్‌ను కశ్మీర్‌పైకి పంపించింది పాకిస్తాన్. దాని ఫలితంగా ఉగ్రవాదుల దాడులతో కశ్మీర్ కొన్ని సంవత్సరాలు అతలాకుతలమై పోయింది. ఇప్పుడు కూడా తాలిబాన్‌ను ప్రయోగిస్తే కశ్మీర్ మరోసారి అగ్ని గుండంగా మారిపోతుంది. జైషే మహమ్మద్, లష్కరే తొయిబాలు రెండు అఫ్ఘాన్ సంక్షోభం సృష్టించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే. ఇటువంటి సంస్థల సహకారంతో కశ్మీర్లో చిచ్చుపెట్టడం ద్వారా ఇండియాను నిరంతరంగా వేధిస్తూ ఉండటం పాకిస్తాన్ విధానం. సైనిక చర్య తీసుకోవాలంటే ఇజ్రేల్ ఎంటెబేలో చేసిన సాహసం ఇండియా చేయాలి. ఇస్లామాబాద్ పరిసరాలలో తలదాచుకున్న లాడెన్‌ను ఒబామా పంపిన సైనికులు మట్టుబెట్టినట్టే సయీద్ హఫీజ్, అజహర్ మసూద్ తదితర ఉగ్రవాదులను హతమర్చాలి. అంతటి తెగింపు, సాహసం, శక్తి ఇండియాకు ఉన్నాయా? దూరపు లక్ష్యాలను పేల్చేందుకు స్నైపర్స్ ఉపయోగించే ఆధునిక ఆయుధాలు భారత సైనికుల చేతుల్లో లేవు. పాత తరం రష్యా ఆయుధాలు భారత సైనికుల దగ్గర ఉంటే కొత్తతరం చైనా ఆయుధాలు పాకిస్తాన్ స్నైపర్స్ చేతుల్లో ఉన్నాయి. చైనా ఆయుధాల శక్తి, విస్తృతి అధికం. ఇదీ మనం గుర్తించాల్సిన క్షేత్ర వాస్తవికత. పాకిస్తాన్‌తో పూర్తి స్థాయి యుద్ధం అనూహ్యం. యుద్ధం ఆరంభించడం తేలికే. ముగించడం కష్టం. సర్జికల్ స్ట్రయిక్స్ వంటివి నిష్ప్రయోజనం. యుద్ధ విమానాల ప్రయోగం సైతం అంతే. దేశవాసుల ఆగ్రహం తగ్గించడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ను తాలిబాన్ సహకారంతో పారదోలినా రష్యాతో పాకి స్తాన్ సంబంధాలు పూర్తిగా చెడిపోలేదు. న్యూయార్క్‌లో జంటశిఖరాలపైన దాడులు చేయించి విధ్వంసం సృష్టిం చిన బిన్లాడెన్కు ఆశ్రయం ఇచ్చినా, అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా సైనికులను పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న తాలిబాన్ మట్టుపెడుతున్నా అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలు బాగానే ఉన్నాయి. చైనా–పాకిస్తాన్ మైత్రి ప్రగాఢమైనది. పాకి స్తాన్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పోషిస్తున్నందుకు పాకిస్తాన్ మూల్యం చెల్లిస్తున్నది. దౌత్యరంగంలో మాత్రం వీగిపోకుండా నిలిచింది. ఎప్ప టికప్పుడు ఎత్తుగడలతో నెట్టుకొస్తున్నది. అటువంటి కపట రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్న పాకిస్తాన్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చాటవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దేశం ఉగ్ర వాదానికి స్థావరంగా ఉన్నదనే సందేశం ప్రపంచ దేశాలన్నిటికీ చేర్చాలి. ఆ దిశగా భారత విదేశాంగ యంత్రాంగం యావత్తూ కృషి చేయడానికి పుల్వామా దాడిని ఒక బలమైన సందర్భంగా వినియోగించుకోవాలి. -కె. రామచంద్రమూర్తి -
పాక్‌కు ఆ స్టేటస్‌ను కొనసాగించండి.. కానీ
న్యూఢిల్లీ : ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు గతంలో ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ (ఎమ్‌ఎఫ్‌ఎన్)ను భారత ప్రభుత్వం ఉపసంహరించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టేటస్‌ను కొనసాగించాలని, కానీ ఎమ్ఎఫ్ఎన్లోని ‘ఎఫ్’ అర్థాన్ని మాత్రం భారత పౌరులు నిర్ణయిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సెటైరిక్‌గా ట్వీట్ చేశాడు. I have some news for Pakistan. We should continue their ‘MFN’ status. Only thing is, that this time we the civilians will decide what ‘F’ stands for. https://t.co/5SsC6BlDvT — Gautam Gambhir (@GautamGambhir) February 16, 2019 ‘పాకిస్తాన్ గురించి ఓ వార్త విన్నాను. మనం ఆ దేశానికిచ్చిన ఎమ్‌ఎఫ్‌ఎన్ స్టేటస్‌ను కొనసాగిద్దాం. కానీ ఇందులోని ఎఫ్ అర్థాన్ని మాత్రం భారత పౌరులు నిర్ణయిస్తారు’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై భారత నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తుండగా పాక్ నెటిజన్లు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత నెటిజన్లు ఎఫ్‌కు తమ తోచిన అర్థాన్ని ఇస్తూ కామెంట్ చేస్తుండగా.. పాక్ నెటిజన్లు మాత్రం.. ఈ దాడిలో తమ దేశ ప్రమేయమే లేదని సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారు. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి అనంతరం తీవ్ర భావోద్వేగంతో ట్వీట్ చేసిన గంభీర్.. ఇప్పటి వరకు జరిగింది చాలని.. వెంటనే పాకిస్తాన్‌తో యుద్దం చేయాలని డిమాండ్ చేశాడు. ఈ ఉగ్రదాడిని ఖండించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఎమ్‌ఎఫ్‌ఎన్ స్టేటస్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిని చేస్తామని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌కు సహకరించేవారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరించారు. (చదవండి: ఇక మాటల్లేవ్.. యుద్ధమే : గంభీర్) -
‘ఆ శబ్దాన్ని నేను కూడా విన్నాను’
లక్నో : ఆర్మీ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన మెసేజ్ చూడగానే షాక్ అయ్యింది నీర్జా. ఇదేలా సాధ్యం.. రెండు నిమిషాల ముందు వరకూ తనతో మాట్లాడిన మనిషి ఇప్పుడు చనిపోవడం ఏంటని ఆలోచిస్తుంది. ఇదంతా అబద్ధమైతే బాగుండని కోరుకుంటుంది. కానీ ఆమె కోరిక నెరవేరలేదు. ముష్కరులు దాడిలో ఆమె భర్త మరణించాడు. దాంతో గుండెలవిసేలా విలపిస్తోంది నీర్జా. గురువారం పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లలో నీర్జ భర్త ప్రదీప్ కుమార్ కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన ప్రదీప్(30) సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. గురువారం దాడి జరగడానికి ముందు వరకూ కూడా ప్రదీప్ తన భార్య నీర్జాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. తన గారల పట్టి మాన్య ఏం చేస్తుందని అడిగాడు ప్రదీప్. సమాధానం చెప్పేలోపే అవతలి వైపు నుంచి ఏదో పెద్ద శబ్దం వినిపించింది నీర్జాకు. రెండు సెకన్లలో ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యింది. ఏదైనా సమస్య వచ్చిందేమో.. తర్వాత తనే కాల్ చేస్తాడు అనుకుంది నీర్జా. కానీ మరో రెండు నిమిషాల్లో ఆర్మీ కంట్రోల్ రూమ్ నుంచి ఆమెకు ఓ సందేశం వచ్చింది. ‘సీఆర్పీఎఫ్ జవాన్ ప్రదీప్ వీర మరణం పొందార’నేది దానిది సారాంశం. ఇది వినగానే ఒక్కాసారిగా షాక్ అయ్యింది నీర్జా. ఇదేలా సాధ్యం.. ఇప్పటివరకూ నాతో ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి కేవలం రెండు నిమిషాల్లో మరణించడం ఏంటనుకుంది నీర్జా. కాసేపట్లో న్యూస్ చానెల్స్‌లో ఎక్కడ చూసిన ఈ వార్తలే. దాంతో తాను విన్నది నిజమే అని గ్రహించిన నీర్జా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన భర్త ఇక రాడని తెలిసి కన్నీరుమున్నిరుగా విలపిస్తుంది నీర్జా. ‘ప్రదీప్‌కు చిన్న కూతరు మాన్య అంటే చాలా ఇష్టం. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మాన్య గురించే అడిగాడు. నేను సమాధానం చెప్పేలోపే ఫోన్ కట్టయ్యింది. ఇంత దారుణం జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదం’టూ ఏడుస్తోంది నీర్జా. 2004లో సీఆర్పీఎఫ్లో చేరిన ప్రదీప్ 115వ బెటాలియన్‌లో విధులు నిర్వహించేవాడు. -
ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ
-
అమర జవాన్లకు నివాళులు అర్పించిన ప్రముఖులు
-
జమ్మూ సహా పరిసర ప్రాంతాల్లో 144సెక్షన్ విధింపు
-
ఉగ్రదాడిపై తీవ్రస్థాయిలో స్పందించిన కేంద్రం
-
దాడి పిరికిపందల చర్య
సాక్షి, హైదరాబాద్: సీఆర్పీఎఫ్ జవాన్లపై పుల్వామాలో జరిగిన దాడి పిరికిపందల చర్య అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్లో స్పందించారు. ‘సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన దాడి పిరికి పందల చర్య. వీరులైన జవాన్లకు సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. శోకంలో ఉన్న అమరవీరుల జవాన్ల కుటుంబాల పరిస్థితికి నా హృదయం ద్రవిస్తోంది. వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఈ ఘటనలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. -
దాడిలో 80 కిలోల హైగ్రేడ్ ఆర్డీఎక్స్
న్యూఢిల్లీ: పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడిలో జైషే మొహమ్మద్ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ దాదాపు 80 కిలోల హైగ్రేడ్ ఆర్డీఎక్స్ను వినియోగించినట్లు దర్యాప్తులో తేలిందని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఐఈడీని ఈ దాడి కోసం వాడుంటే ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదన్నారు. కశ్మీర్లో ఇప్పటివరకూ కాన్వాయ్‌ల రాకపోకల విషయంలో పాటిస్తున్న ప్రామాణిక విధాన ప్రక్రియ(ఎస్వోపీ)ను తాజా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై 272వ మైలురాయి వద్ద ఆదిల్ తన కారుతో సీఆర్పీఎఫ్ బస్సు ఎడమవైపు ఢీకొట్టించి తనను తాను పేల్చేసుకున్నాడని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో సీఆర్పీఎఫ్కు చెందిన హెచ్ఆర్ 49 ఎఫ్ 0637 బస్సు తునాతునకలు అయ్యిందన్నారు. కాన్వాయ్ వరుసలో ఐదో బస్సును ఉగ్రవాది ఆదిల్ లక్ష్యంగా చేసుకున్నాడన్నారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లో ప్రమాద సమయంలో మొత్తం 16 బుల్లెట్ ప్రూఫ్ బంకర్ వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 4న 2,871 మంది జవాన్లు 91 వాహనాల్లో ఇదే రోడ్డుపై శ్రీనగర్ నుంచి జమ్మూకు వచ్చారనీ, అప్పుడు ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో యూపీకి చెందిన 12 మంది జవాన్లు అమరులు కాగా, రాజస్తాన్(5), పంజాబ్(4), పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఒడిశా, తమిళనాడు, బిహార్ నుంచి ఇద్దరు చొప్పున, అస్సాం, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రాలకు చెందిన ఒక్కో జవాన్ ప్రాణాలు కోల్పోయారు. -
ఉగ్రదాడి తెస్తున్న పెను ప్రమాదం
జమ్మూ–కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి స్థానిక ఘర్షణల ఫలితం కాదు. ఐఎస్ఐ ప్రేరేపిత జైషే అహ్మద్ వ్యూహంలో భాగంగా ఆ దాడి జరిగింది. ఉగ్రదాడులు జరిగిన ప్రతి సందర్భంలోనూ పాక్ ప్రమాదకరమైన వ్యూహాన్ని అమలు చేస్తూంటుంది. నేను కోరిందల్లా ఇవ్వు. లేకపోతే నా తలను నేనే పేల్చుకుంటాను అంటూ తనతలపై తానే ట్రిగ్గర్ గురిపెట్టుకునే తరహాలో పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. పైగా ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగినప్పుడు చల్చార్చడానికి అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ముందుకొచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ క్రమంలో యుద్ధ ప్రకటన ఎవరు చేసినా దాని ఫలితం ప్రమాదకరంగానే ముగుస్తుంది. పాకిస్తాన్ వ్యూహచింతనపై దక్షిణాసియా వ్యవహారాల్లో అమెరికన్ నిపుణుడు స్టీఫెన్ పి. కోహెన్ తెలివిగా వర్ణించారు. పాకిస్తాన్ తన తలపై తుపాకీ గురిపెట్టుకుని ఇతర ప్రపంచంతో చర్చలు సాగిస్తూం టుందని వ్యాఖ్యానించారు. దాని సారాంశం ఏమిటంటే, నేను కోరిం దల్లా ఇవ్వు. లేకపోతే నా తలను నేనే పేల్చుకుంటాను. ఆ తర్వాత ఏర్పడే గందరగోళంతో మీరు తలపట్టుకోవలసి వస్తుంది. సరిగ్గా అలాంటి ట్రిగ్గర్నే పాకిస్తాన్ ఇప్పుడు పుల్వామాలో లాగిందా? (ఉగ్ర మారణహోమం) మొదటగా పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై జరిగిన దాడి పూర్తిగా దేశీయంగా జరిగిన ఉగ్రదాడి అని చెప్పడానికి చాలా తక్కువ అవకాశాలున్నాయి. ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది తిరుగుబాటుతత్వం జీర్ణించుకుపోయిన భారతీయ కశ్మీర్ వాసి. కానీ అతడు పూర్తిగా భారతీయ వ్యూహరచనతో అమలుచేసిన ఉగ్రచర్యలో భాగం కాదని చెప్పడానికి తగిన కారణాలున్నాయి.1. జైషే మహమ్మద్ ఈ దాడికి తానే కారణమని ప్రకటించింది. ఇది పూర్తిగా పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూ ఐఎస్ఐ నియంత్రణలో ఉండే సంస్థ. 2. ఈ ఉగ్రచర్యకు దారితీసిన తిరుగుబాటుతత్వం, ప్రేరణ స్థానికపరమైనదే కావచ్చు, కానీ ఔత్సాహిక స్థానిక బృందాల వద్ద ఇంతటి అధునాతనమైన పేలుడు పదార్థాలు (చాలావరకు ఆర్డీఎక్స్ లేక ఆర్డీక్స్ కలిపినవి) లభ్యమవుతాయని, గురిచూసి కొట్టే యంత్రాంగంతో కూడిన నైపుణ్యాలు వీరికి ఉంటాయని చెప్పడానికి కనీస సాక్ష్యాధారాలు కూడా లేవు. 3. ఆత్మాహుతి బాంబర్ రికార్డు చేసిన చివరి వీడియోను చూడండి. అతడు వాడిన భాష కశ్మీరీల బాధలకు ప్రతీకారం కోరుతున్నట్లు లేదు. పైగా భారత్‌లో ఇతర ప్రాంతాల్లోని ముస్లింలను రెచ్చగొడుతున్నట్లుగా కూడా ఆ ప్రకటనలో లేదు. పైగా బాబ్రీ మసీదు, గుజరాత్ ఘటనలు ప్రస్తావించాడు. ‘ఆవు మూత్రం తాగే వారికి’ వ్యతిరేకంగా తిరుగుబాటుకు ‘మన ముస్లింలు అందరూ’ సిద్ధపడాలని పిలుపునిచ్చాడు. ఇలాంటి భాష లష్కరే తోయిబా కంటే మించి జైషే ఉగ్రసంస్థ నుంచి పుట్టుకొచ్చిందే తప్ప స్థానికులది కాదు. (ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ: ప్రధాని) పుల్వామాలో జరిగిన దాడి గతంలో జైషే నిర్వహించిన దాడులకు అచ్చుగుద్దినట్లుంది. 2001లో శ్రీనగర్‌లో రాష్ట్ర అసెంబ్లీపై ఆత్మాహుతి దాడి, అదే సంవత్సరం పార్లమెంటుపై జరిగిన దాడి, ఇటీవల పఠాన్ కోట్, గుర్దాస్పూర్లపై దాడులు మొత్తంగా ఒకే లక్ష్యాన్ని ప్రకటించాయి. కశ్మీర్ వెలుపల ఏదో ఒక స్థాయిలో బీభత్సం సృష్టించాలి. ముంబైలో 2008లో లష్కర్ ఇలాగే చేసింది. కానీ దాని శక్తియుక్తులను చాలావరకు కశ్మీర్లో జరుగుతున్న పోరాటంలోనే ఇప్పటికీ ఉపయోగిస్తోంది. అయితే జైషే దానికంటే చిన్న సంస్థ అయినప్పటికీ, మరింత దుష్టత్వంతో, అపార వనరులతో ఐఎస్ఐ మద్ధతుతో ఇలాంటి ప్రభావశీలమైన దాడులను ఎంచుకుని మరీ సాగిస్తోంది. జైషే ఎంత శక్తిసంపన్నంగా తయారైందో మనకు ఐసీ–814 విమానం హైజాక్ కాలం నుంచే తెలుసు. అది 90ల చివర్లోనే భారతీయ విమానాన్ని కఠ్మాండులో హైజాక్ చేసి సురక్షితంగా కాందహార్‌లో దించి, ప్రయాణికులను వదిలిపెట్టాలంటే భారత్ జైళ్లలో ఉండే దాని కీలక నేతలను విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టి మరీ సాధించుకుంది. జైషే చీఫ్ మసూద్ అజర్ విడుదల ప్రక్రియ వరకు పూర్తిగా అది ఐఎస్ఐ కనుసన్నల్లో నడిచిందని పదే పదే రుజువవుతూ వస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వ యంత్రాంగం, ఐఎస్ఐ అయితే.. లష్కర్, హఫీజ్ సయీద్‌ల కంటే జైషేనే తమ అతిపెద్ద ఆస్తిగా భావిస్తున్నాయి. జైషే వీరి అతి ప్రధాన శక్తిగా తయారైంది. చైనా ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించింది కాబట్టే మసూద్ అజర్‌ని కాపాడే విషయంలో సిగ్గులేకుండా పాక్‌తో పోటీపడుతోంది. అందుకే ఉగ్రవాది స్థానిక కశ్మీరీ కావడంలో ఆశ్చర్యపడాల్సింది లేదు. విమాన హైజాక్, పార్లమెంట్ తదితర చోట్ల జరిపిన దాడులతో సహా జైషే సాగించిన ప్రతి ఉగ్రచర్యలోనూ భారతీయ కశ్మీరీలను కీలక భాగస్వాములుగా చేస్తూ వస్తోంది. కాబట్టే ఉగ్రవాదానికి స్థానిక మూలాలను వెదుకుతూ ఉగ్రచర్చల్లో పాకిస్తాన్‌కు నేరుగా పాత్ర లేదనిపించేలా జరుగుతున్న సూత్రబద్ధ చర్చల్లో సమయం వృ«థా చేయడం మానడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ ప్రశ్నను ఎందుకు లేవనెత్తుతున్నాం. పాకిస్తాన్ చివరికి తన తలపైకే ట్రిగ్గర్ గురిపెట్టుకుందా? జైషే, లష్కరే గతంలో ఎలాంటి ప్రతీకార ప్రకటనలకు దిగకుండానే దాడులకు పాల్పడేవి. అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి మన్మోహన్ సింగ్ హయాం మధ్య కాలంలో భారత్ ఆగ్రహావేశాల ప్రదర్శననుంచి బయటపడి పాక్‌పై అంతర్జాతీయ ఒత్తిడిని తీసుకొచ్చే విధానాలవైపునకు మళ్లింది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం కంటే మౌలికంగా యుద్ధ వ్యతిరేక వ్యూహతత్వం వైపు మొగ్గుచూపింది. మోదీ ప్రభుత్వం ఇలాంటి నటనను సాగించడం లేదు. మన్మో హన్, వాజ్‌పేయి తదితర ప్రభుత్వాలు గతంలో వ్యవహరించిన తీరుని మోదీ ప్రభుత్వం పిరికి చేష్టగా భావిస్తోంది. ప్రత్యేకించి ఉడీ సర్జికల్ దాడుల అనంతరం ఉగ్రదాడులకు వ్యతిరేకంగా దాడిని నిలి పివేయడం, లేక చాలా కాలం తనకు తాను నిబ్బరంగా ఉండటం మోదీ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అలాగే పాక్ కూడా యుద్ధానికి సమీపంలోకి వచ్చింది. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా ఎక్కడ అనేది ఎవరికీ తెలీదు కానీ ఆ తరుణం సంభవించడానికి ఎక్కువ కాలం పట్టేట్టు లేదు. ప్రతీకారాత్మక ప్రతిస్పందన త్వరలో సంభవించవచ్చు. ప్రత్యర్థిపై తాము వీరోచిత విజయం అందుకున్నామంటూ పెద్దగా ప్రకటించుకునే రూపంలో అది ఉండవచ్చు. అదేసమయంలో భారత్ ఇంతవరకు కనీ వినీ ఎరుగని ఎన్నికల ప్రచారం ప్రారంభ దినాల్లోకి అడుగిడుతోంది. పుల్వామా కళంకాన్ని భరిస్తూ నరేంద్రమోదీ రెండో టర్మ్ అధికారంకోసం ప్రయత్నం చేయకపోవచ్చు. ఇక ఈ దాడుల వ్యూహాన్ని ఇంతటితో వదిలిపెట్టాలని నిర్ణయించుకోవడం పాకిస్తాన్ వంతు కావచ్చు. లేదా భారత్ ప్రతిచర్యకు ప్రతీకారం తీసుకోవలసిందేనంటూ తన సొంత ప్రజల ఒత్తిళ్లకు అనుగుణంగా అది స్పందించవచ్చు. సైనికపరంగా ఏం జరిగినప్పటికీ అది ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పాలనకు ముగింపు పలుకుతుంది. భారత్‌తో ఎంత చిన్న లేక పెద్ద యుద్ధానికి దిగిన పాక్ పాలకుడు పదవిని కాపాడుకున్న ఘటన లేదని చరిత్ర మనకు తెలుపుతోంది. అయూబ్ ఖాన్(1965), యాహ్యా ఖాన్ (1971), నవాజ్ షరీఫ్(1999)ల పతనం ఇదే చెబుతోంది. తర్వాతేం జరుగుతుందో చెప్పే నిర్ణాయక శక్తి ఇమ్రాన్‌కు ఉండకపోవచ్చు. కార్గిల్ ఉదంతం తర్వాత నవాజ్‌లాగే తను కూడా ఆర్మీ లేక ఐఎస్ఐ తలబిరుసుతనానికి ఇమ్రాన్ కూడా ఫలితం అనుభవించవచ్చు. ఆరకంగా బలిపశువు కాకూడదంటే ఇమ్రాన్‌కు అపార నైపుణ్యంతోపాటు కాస్త అదృష్టం కూడా తోడు రావాల్సి ఉంది. ఇలాంటి అంశాల్లో ఎన్నికైన ఏ పాక్ ప్రధాని మాట కూడా ఇంతవరకు చెల్లుబాటు కాలేదు. పైగా ఇమ్రాన్ అందరికంటే బలహీనుడు. ఎలా స్పందించాలి అనేది ఆర్మీ చేతుల్లోనే ఉంది. ప్రతీకార చర్యకు పాల్పడొద్దని సైన్యానికి సలహా ఇచ్చే శక్తి ఇమ్రాన్‌కు ఉంటుందనీ చెప్పలేం. తమ తలలను పేల్చుకోవాలా వద్దా అనేది సైన్యమే నిర్ణయించుకోగలదు. వీటిలో ఏది జరిగినా నష్టపోయేది మాత్రం ఇమ్రానే మరి. మోదీకి ఆయన వారసులకు మధ్య తేఢాను పక్కనబెట్టి చూస్తే, రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. 2008లో ముంబైలో లేక 2001–02లో జమ్మూ–కశ్మీర్, భారత పార్లమెంటుపై ఉగ్రదాడులు జరిగినప్పుడు అమెరికన్, యూరోపియన్ నేతలు పరుగున వచ్చి భారత్‌ను బుజ్జగించారు. రష్యా, చైనా కూడా తమ వంతు పాత్ర పోషించాయి. పాక్‌ను ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం ప్రకటించడం ద్వారా వారు భారతీయుల ఆగ్రహాన్ని చల్లార్చారు. కానీ అలాంటి ప్రపంచం ఇప్పుడు లేదు. అమెరికాలో ట్రంప్ గెలిచి అమెరికాను ఉన్నత స్థితిలో నిలుపుతానంటూ చేసిన బాసను నెరవేర్చుకునే దిశగా ప్రయాణిస్తూ ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేశాడు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా తక్షణం ట్వీట్ చేయడానికి కూడా ట్రంప్ పూనుకోకపోవచ్చు. ఆధునిక ప్రపంచపు చిరకాల ప్రత్యర్థులు తమ ప్రాంతంలో ఘర్షణల పరిష్కారంలోనే కొట్టుమిట్టులాడుతున్నారు. మనగురించి పట్టించుకునే తీరిక, శక్తి వారికి ఉండకపోవచ్చు. భారతీయ ఉపఖండం ప్రపంచానికి గతంనుంచి హెచ్చరిక చేస్తూ వచ్చేది. ‘మా మధ్యకు వచ్చి ఘర్షణలను నిలిపివేయడానికి ప్రయత్నించండి లేకుంటే మేం పరస్పరం అణ్వాయుధాలు ప్రయోగించుకుంటాం.’ తమవద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ప్రకటించుకుంటూ ఉపఖండం ప్రపంచాన్ని ఒకరకంగా బ్లాక్మెయిల్ చేసేది. ఇప్పుడు ఇలా బెదిరించినా ప్రపంచం పట్టించుకునే స్థితి కనిపించడం లేదు. పైగా అణ్వాయుధాలు బలహీనమైన ఓటమికి దగ్గరగా ఉన్న దేశాలకు ప్రాధాన్యతా ఆయుధాలుగా మారాయి. 1990లో వీపీ సింగ్ అసమర్థత కారణంగా పాకిస్తాన్ తన అణ్వాయుధ బూచిని పూర్తిగా తనకు ప్రయోజనం కలిగేలా ఉపయోగించుకుంది. ఆ క్రమంలో భారత్‌నుంచి ఎలాంటి చిన్న ప్రతిఘటన కూడా జరగకుండా పాక్ జాగ్రత్తపడింది. ఇక వ్యూహాత్మక అణ్వాయుధాల విషయానికి వస్తే పాకిస్తాన్ ఇంతవరకు వాటిని పరీ క్షించలేదు. ఇప్పుడు వారు విధ్వంసకరమైన దిగ్భ్రాంతిని కలిగించవచ్చు. పైగా భారత ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు అణ్వాయుధాలు ఏక పక్షంగా ప్రభావం చూపుతాయని ఎంతమాత్రం భావించడం లేదు. ఒకవేళ ఈ ఎన్నికల వారాల్లో అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకోవాలని భారత్ చూస్తున్నట్లయితే ముందుగా ట్రిగ్గర్ మనమే నొక్కవచ్చు కూడా. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మాటలకందని విషాదం
మూడు దశాబ్దాలుగా నెత్తురోడని రోజంటూలేని జమ్మూ–కశ్మీర్లో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి దేశ ప్రజానీకాన్ని మాత్రమే కాదు... ప్రపంచాన్నే నిశ్చేష్టుల్ని చేసింది. జవాన్ల వాహనశ్రేణిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది ఒకడు ఆత్మాహుతి దాడికి పూనుకొని 43 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఉదంతం ఆ రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనిది. భద్రతా బలగాలు ఒక దాడిలో ఇంతమంది సహచరులను కోల్పోవడం కశ్మీర్లో ఇదే తొలిసారి. ఈ ఆత్మాహుతి దాడి జరిగిన కాసేపటికే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ దానికి తామే కారణమని ప్రకటించడంతోపాటు ఆ ఉగ్రవాది పేరు ఆదిల్ అహమ్మద్ దార్ అని వెల్లడించింది. (ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ: ప్రధాని) దాడికి ముందు ఉగ్రవాది ఆదిల్ మాట్లాడిన వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ‘కశ్మీర్ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధమ’ని గతంలో పాకిస్తాన్ పాలకులు చెప్పడాన్ని గుర్తుం చుకుంటే ఈ ఉగ్రవాద విషసర్పానికి అక్కడ ఏ స్థాయిలో అండదండలున్నాయో అర్ధమవుతుంది. అలాంటి మద్దతే లేకపోతే దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన జైషే మొహమ్మద్ సంస్థపై పాకి స్తాన్ చర్యలకు ఉపక్రమించేది. 24 గంటలు గడిచినా ఆ విషయంలో మౌనంగానే ఉండిపోయింది. కనుకనే ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించవలసి వచ్చింది. (ఉగ్ర మారణహోమం) సైనికంగా తనకంటే అనేక రెట్లు శక్తిమంతమైన భారత్ వంటి పొరుగుదేశాన్ని ఇలాంటి ఉన్మాద దాడులతో పాదాక్రాంతం చేసుకోగలమని, కనీసం అస్థిరత్వంలోకి నెట్టగలమని పాకిస్తాన్ భ్రమిం చడం దాని తెలివితక్కువ నైజాన్ని, మూర్ఖత్వాన్ని బయటపెడుతోంది. గతంలో అది తన మను షుల్ని సమీకరించి, వారికి అవసరమైన శిక్షణనిచ్చి, దాడి చేయాల్సిన ప్రాంతాల వివరాలను అంద జేసి సరిహద్దులు దాటించేది. కానీ అక్కడ భద్రత పటిష్టపడటం వల్ల కావొచ్చు... అంతర్జాతీ యంగా చీవాట్లు పడుతుండటంవల్ల కావొచ్చు దానికి స్వస్తి పలికి కశ్మీరీ పౌరులపై దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. చదువుసంధ్యల్లేని యువతను ఎంచుకుని వారికి ఉగ్రవాదం నూరిపోసి, ఆయుధా లిచ్చి పంపి తన ప్రయోజనాన్ని నెరవేర్చుకునే పన్నాగానికి పూనుకుంది. తాజా ఉదంతానికి కారకు డైన ఆదిల్ నేపథ్యం ఈ సంగతిని వెల్లడిస్తోంది. నిజానికి ఈ యువతలో ఎందరు ఇష్టప్రకారం ఆ ముఠాలోకి వెళ్తున్నారో చెప్పలేం. చావడానికి పోతూ ఉగ్రవాది ఆదిల్ ఇచ్చిన ‘సందేశం’ స్వచ్ఛం దంగా ఇచ్చిందో, చుట్టూ తుపాకులతో నిలబడి చెప్పించిందో ఎవరూ నిర్ధారించలేరు. ఇరాక్, సిరి యాల్లో ఉగ్రవాద సంస్థ ఐఎస్ నడిపిన శిబిరాల్లో ఆత్మాహుతి బాంబర్లుగా శిక్షణ పొంది మధ్యలోనే దొరికిపోయిన కొందరు పిల్లలు వెల్లడించిన కథనాలు గతంలో వెలువడ్డాయి. జైషే మొహమ్మద్ స్వతంత్ర ఉగ్రవాద సంస్థ కాదు. దానికి పాకిస్తాన్ సైన్యం కనుసన్నల్లో పనిచేసే గూఢచార సంస్థ ఐఎస్ఐతో ఉన్న సాన్నిహిత్యంలో దాపరికమేమీ లేదు. ఉగ్రవాదంపై పోరాటం బహుముఖంగా ఉండాలి. దాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం కోసం నిరంతరాయంగా ప్రయత్నించడంతోపాటు చుట్టూ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఆ విషయంలో మనం విఫలమయ్యామని తాజా ఉదంతం తేట తెల్లం చేస్తోంది. ఫలితంగా ఆత్మాహుతి దాడుల సంస్కృతి కశ్మీర్ లోయకు సైతం జొప్పించడంలో జైషే సంస్థ విజయం సాధించినట్టు కనబడుతోంది. ఆత్మాహుతి దాడి 2000 సంవత్సరంలోనూ జరిగింది. కానీ 29మంది ప్రాణాలు తీసిన ఆ ఉదంతంతో పోలిస్తే తాజా ఉదంతం తీవ్రత అన్ని విధాలా అధికం. అప్పట్లో ఉగ్రవాది ప్రభుత్వ వాహనాన్ని హైజాక్ చేసి ఆ పని చేశాడు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఒక పల్లెలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఉగ్రవాది సిద్ధం చేసుకున్నాడు. జమ్మూ–కశ్మీర్ భద్రతా విషయాల్లో తలమునకలై ఉండే యంత్రాంగానికి సహ జంగానే ఇటీవల అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలేమిటో తెలియకపోవు. ఆ స్థాయిలోనే నిఘా ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది కాలంగా ఆత్మాహుతి దాడులు జరగొచ్చునన్న సమాచారం ఇంటెలిజెన్స్ సంస్థలకు అందుతూనే ఉన్నదని ఆ వర్గాల కథనం. అటువంటప్పుడు అందుకనువైన విధానాలను రూపొందించుకోవడం భద్రతా బలగాల బాధ్యత. జవాన్ల వాహనశ్రేణి వెళ్లే దారిలో ముందుగా ప్రత్యేక బృందం వెళ్లి ఆ మార్గం సురక్షితంగా ఉన్నదో లేదో మదింపు వేయడం రివాజు. అది సక్రమంగానే జరిగిందా? ఆత్మాహుతి దాడికి గురైన వాహనశ్రేణిలో 78 వాహనాలుంటే, అందులో 2,547మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. అసా« దారణమైన, అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే భారీ కాన్వాయ్‌లు తరలిస్తారు. మామూలు పరిస్థితుల్లో వేయిమందికి మించని జవాన్లతో ఉండే వాహనశ్రేణిని అనుమతిస్తారని చెబుతారు. అలాంటి పద్ధతులను ఎందుకు పాటించలేదు? జమ్మూ నుంచి తెల్లారుజామున 3.30కు బయ ల్దేరిన జవాన్ల వాహనశ్రేణి గురించిన సమాచారం అక్కడికి 241 కిలోమీటర్ల దూరంలోని అవం తిపొరా పట్టణం సమీపంలో పొంచివున్న ఉగ్రవాదులకు ఎలా చేరింది? అలాగే అడుగడుగునా రాత్రింబగళ్లు తనిఖీలు సాగుతుండే రాష్ట్రంలో ఒక పల్లెకు 350 కిలోల అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) ఎలా చేరిందనుకోవాలి? వీటన్నిటిపైనా లోతైన సమీక్ష జరగాలి. ఏళ్ల తరబడి అనుసరించే మూస విధానాలు కూడా లొసుగులకు తావిస్తాయి. ఆ విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. పాక్‌పై తక్షణ చర్య అవసరమని కొందరంటున్నారు. కానీ ఆచితూచి అడుగేయడం శ్రేయస్కరం. ఇప్పటికే పాక్‌పై దౌత్యపరమైన దాడిని మన దేశం ప్రారంభించింది. దాన్ని పక డ్బందీగా కొనసాగించి, అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకి చేయడానికి గల అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలి. ఇప్పుడు సైతం జైషే చీఫ్ మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా గుర్తించ నిరా కరిస్తున్న చైనా నైతికతను కూడా ఎండగట్టాలి. -
దెబ్బకు దెబ్బ..!
భరతమాత కన్నీరు పెడుతోంది. కోట్లాది భారతీయుల గుండెలకు లోతైన గాయమైంది. మనల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేని కొందరు పిరికిపందలు చాటుమాటున నక్కి చేసిన దాడితో దేశానికి రక్షణగా నిలిచే వీరాధివీరులే నిర్జీవంగా నేలకొరిగిన దృశ్యాలు చూసి మనసు చలించిపోతోంది. కుట్ర కుతంత్రాలతో తన నీచ బుద్ధిని ఎప్పటికప్పుడు బయటపెట్టుకునే జిత్తులమారి దాయాది దేశానికి బుద్ధి చెప్పాలనే ఆరాటం, పగ , ప్రతీకారంతో భారతీయుల గుండెలు రగిలిపోతున్నాయి. ఇలాంటి సమయాల్లోనే కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతమే సరైనదే అనిపిస్తుంది.. అలాగంటే అదేదో యుద్ధోన్మాదం కాదు. అమరులైన వీర జవాన్లకు న్యాయం జరగాలి. భారతీయులు ఇప్పుడు కోరుకుంటున్నదదే. ఇక మీదట త్యాగాలకు విలువ లేదు. వాటికెప్పుడో కాలం చెల్లిపోయింది. మన దేశ సైనిక సత్తా, ఆర్థిక బలానికి కూడా కాలం చెల్లిపోయిందా ? పచ్చటి పచ్చికలపై పారే ఎర్రటి నెత్తురు మరకలు చూస్తుంటే మరిగిపోయిన రక్తం చప్పున చల్లారిపోతుందా? ఇంత నరకయాతనని కొద్ది రోజుల్లోనే మనం మర్చిపోతామా? కొన్ని వారాల్లోనే మళ్లీ సాధారణ మనుషులమైపోతామా? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో గెలిచి, ప్రజాప్రతినిధుల వేషాల్లో ఉన్నవారే ఉగ్రవాదులకు కొమ్ము కాస్తూ, బయటకి కల్లబొల్లి ఏడ్పులు ఏడుస్తూ ఉంటే, శాంతి నెలకొనాలన్న భారత్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఉంటే, కేంద్రం అడుగులు ఎటువైపు వేయాలి? ఇప్పుడు కశ్మీర్ భూతల స్వర్గం కాదు. మండుతున్న మంచుగోళం. శవాల దిబ్బల్ని చూసే ఓపిక లేదు. ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే సహించే పరిస్థితి లేదు. దాడి చూసాకైనా కేంద్రం సత్వర చర్యలు చేపట్టాలి. జాతి యావత్తూ అందుకోసమే ఎదురుచూస్తోంది. న్యూఢిల్లీ: ‘భారతీయుల రక్తం మరుగుతోంది. రోజూ వారీ ఖర్చులు వెళ్లదీయడానికి ఇతర దేశాల ముందు బిచ్చమెత్తుకుంటూ మన పొరుగుదేశం ఎంతో దిగజారింది. ఆ నిరాశ, నిస్పృహల ఫలితంగానే పుల్వామాలో దాడికి తెగబడింది. ఉగ్రవాదులపై ఎప్పుడు, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ఇదొక కొత్త సంప్రదాయం’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఉగ్రచర్యలతో భారత్‌ను పాకిస్తాన్ బలహీనపరచలేదని, పుల్వామా దాడికి బాధ్యులైన వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. మరోవైపు, పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యంత అనుకూల దేశం(మోస్ట్ ఫేవర్డ్ నేషన్–ఎంఎఫ్ఎన్) హోదాను భారత్ వెనక్కి తీసుకుంది. భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ సొహైల్ మహమూద్‌ను పిలిపించుకుని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే నిరసన వ్యక్తం చేశారు. పెద్ద తప్పు చేశారు..మూల్యం తప్పదు ఢిల్లీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపాక మోదీ మాట్లాడారు.‘ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులకు మద్దతునిస్తూ, వారిని ప్రేరేపిస్తున్న వారికి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా. వారు చాలా పెద్ద తప్పు చేశారు. ఈ దుశ్చర్యకు వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. పుల్వామా దాడికి పాల్పడిన, ఈ కుట్ర వెనక ఉన్న వారందరినీ కఠినంగా శిక్షిస్తామని దేశానికి హామీ ఇస్తున్నా. ఇప్పటికే అంతర్జాతీయంగా ఏకాకి అయిన మన పొరుగుదేశం ఉగ్రదాడులతో మన దేశంలో అస్థిరత సృష్టించాలని కుట్రలు పన్నుతోంది. కానీ వాళ్ల ప్రణాళికలు సఫలం కావు. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడానికి మన బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం’ అని అన్నారు. అనంతరం ఝాన్సీలో జరిగిన మరో సభలో ప్రసంగిస్తూ..పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వృథాగా పోదని పేర్కొన్నారు. ‘ ఉగ్రమూకల ఆటకట్టించేందుకు ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి వ్యూహం రచించాలో ఆ బాధ్యతను సైన్యానికే వదిలిపెట్టాం. ఇదే మన దేశ కొత్త విధానం, సంప్రదాయం’ అని పేర్కొన్నారు. అమరులకు మోదీ, రాహుల్ నివాళి పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల మృతదేహాలను వైమానిక దళ విమానం శుక్రవారం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది. హోం మంత్రి రాజ్‌నాథ్ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో అమరవీరుల భౌతికకాయాలను స్వీకరించారు. 40 శవపేటికలను పక్కపక్కన ఉంచారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు. ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాం: రాహుల్ భద్రతా బలగాలపై జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ఆత్మపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి తమ పూర్తి స్థాయి మద్దతునిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ‘దేశాన్ని రెండు ముక్కలుగా చేయాలన్న టెర్రరిస్టుల ఆశయం ఎన్నటికీ నెరవేరదు. మరో రెండు రోజులపాటు ఇతర విషయాలేవీ మాట్లాడదలచుకోలేదు’ అని తర్వాత మీడియా సమావేశంలో అన్నారు. ‘జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడమే మన మొదటి కర్తవ్యం. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదు. టెర్రరిజంపై ఐక్యంగా పోరాడాలి’ అని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. అత్యంత అనుకూల దేశం హోదా రద్దు దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఇచ్చిన ‘అత్యంత అనుకూల దేశం’(ఎంఎఫ్ఎన్) హోదాను భారత్ రద్దుచేసింది. ప్రధాని నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ భద్రతా కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై భారత్ కస్టమ్స్ సుంకాలు పెంచే చాన్సుంది. సుమారు 49కోట్ల డాలర్ల పాక్ ఉత్పత్తులపై ప్రభావం పడొచ్చు. పాక్‌కు అత్యంత అనుకూల దేశం హోదాను భారత్ 1996లో ఇవ్వగా, ఇంకా భారత్‌కు పాక్ ఆ హోదాను ఇవ్వలేదు. పాక్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో ప్రధానంగా ముడిపత్తి, నూలు, రసాయనాలు, ప్లాస్టిక్, రంగులు తదితరాలున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) సభ్యదేశాలు తమలో తాము వివక్షాపూరిత వాణిజ్య విధానాలు అవలంబించకుండా ఉండేందుకు ఎంఎఫ్ఎన్ హోదాను ఇచ్చిపుచ్చుకుంటాయి. ఈ హోదా కలిగిన దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులు, ఉత్పత్తులపై పన్నులు తక్కువగా ఉంటాయి. నివాళి కార్యక్రమంలో రాజ్‌నాథ్, నిర్మల, కేజ్రీవాల్, రాహుల్, సైన్యాధికారులు జమ్మూలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ప్రజలు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ -
అమరుల కుటుంబాలకు పరిహారం ప్రకటన..!
సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అమరుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున ప్రకటించగా, ఒడిశా 12 లక్షలు పరిహారం ప్రకటించింది. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ.21 లక్షల పరిహారం ఇస్తున్నట్లు త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ ప్రకటించగా, రూ.12 లక్షల పరిహారం ఇస్తున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ తెలిపారు. (పాలం ఎయిర్‌బేస్‌లో అమర జవాన్లకు నివాళి) హిమాచల్ ప్రదేశ్ రూ.21 లక్షలు పరిహారం ప్రకటించగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.25 ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి అమరుల కుటుంబాలకు అండగా నిలిచింది. ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని పలు ప్రభుత్వాలు ప్రకటించాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో శనివారం ఉదయం రెండు నిమిషాలు మౌనం పాటించి అమరులైన జవాన్లకు నివాళి అర్పించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు. కాగా మృతిచెందిన వారిలో అత్యధికంగా 12 మంది జవాన్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, నలుగురు పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇక అమర జవాన్ల అంత్యక్రియాల్లో పాల్గొనాలని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, పార్టీ నేతలకు ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు. (ఉగ్రదాడిని ఖండించిన యావత్ భారతావని) -
పాలం ఎయిర్‌బేస్‌లో అమర జవాన్లకు నివాళి
-
పాక్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు..!
-
ఉగ్రదాడిని ఖండించిన యావత్ భారతావని
సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడిలో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలను యావత్ భారతావని స్మరించుకుంది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరలని దేశ వ్యాప్తంగా ప్రార్థించారు. ‘జై జవాన్.. అమర జవాన్’ నినాదాలతో భారతదేశం హోరెత్తింది. అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేశ వ్యాప్తంగా పలు పట్టణాల్లో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధంచేసి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమరులకు నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జవాన్లపై దాడికి పాల్పడిన వారికి ఖచ్చితంగా బదులిచ్చి తీరాలని యావత్ దేశం డిమాండ్ చేసింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఢిల్లీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పాఠశాల చిన్నారులు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో కూడా అమరులకు ఘన నివాళి అందించారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా హైదరాబాద్‌లో క్రైమ్ జర్నలిస్టులు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని పిరికిపంద చర్యగా వర్ణించారు. అమరవీరుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుందని పలువురు జర్నలిస్టులు తెలిపారు. ఏపీలో పట్టణాల్లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉగ్రవాదులు దాడికి సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. -
అఖిలపక్ష సమావేశానికి మోదీ పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడికి బదులుచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడికి ఏవిధంగా బదులివ్వాలన్న అంశంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలిపునిచ్చారు. దేశంలోని ప్రధాన పార్టీల నేతలతో ప్రధాని నేతృత్వంలోని కీలక కమిటీ శనివారం ఉదయం పార్లమెంట్ లైబ్రరీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయాలను కేంద్రం తీసుకోనుంది. జవాన్ల దాడి హేయమైన చర్య అని.. దానిని అందరం ముక్తకంఠంతో ఖండించాలని మోదీ కోరే అవకాశం ఉంది. కాగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఇదివరకు 2016 ఓసారి సమావేశం జరిగినప్పటికీ.. మెరపు దాడుల గురించి వివరించేందుకు మాత్రమే సమావేశమయ్యారు. విపక్షాల అభిప్రాయం కోసం తొలిసారి మోదీ పిలుపునిచ్చారు. పుల్వామా ఉగ్రదాడిని దేశంలో అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంలో ఖండించిన విషయం తెలిసిందే. దాడికి ఖచ్చింతంగా సమాధానం ఇవ్వాల్సిందేనని పలు పార్టీలు ఇదివరకే డిమాండ్ చేశాయి. కాగా ప్రధాని అఖిలపక్ష సమావేశ పిలుపును కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వాగతించారు. ఈ విషయంలో కేంద్రానికి అన్ని విధాలా సహకరిస్తామని ఆయన తెలిపారు. ఇదిలావుండగా ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ హైకమిషనర్‌కు భారత్ ఇదివరకే సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలో జరిగిన కేబినేట్ సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. పాకిస్థాన్‌ను అత్యంత ప్రాధాన్యత దేశాల జాబితా నుంచి తొలగించినట్లు ప్రకటించారు. -
విషాదం..కూతురుని చూడకుండానే..
జైపూర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. వీరిలో ఓ జవాను తన రెండు నెలల కూతురిని పుట్టినప్పటి నుంచి కనీసం ఒక్కసారి కూడా చూడకుండానే ఉగ్రదాడిలో వీరమరణం పొందారు. రాజస్తాన్‌లోని జైపూర్ సమీపంలోని అమర్‌సర్‌లోని గోవింద్‌పురా గ్రామానికి చెందిన రోహితేష్ లంబా(27) సీఆర్పీఎఫ్ జవాన్‌గా సేవలందిస్తున్నారు. రోహితేష్ లంబా 25 ఏళ్లకే సీఆర్పీఎఫ్లో ఉద్యోగం రాగా, మరుసటి సంవత్సరం వివాహం చేసుకున్నారు. అయితే గతేడాది డిసెంబర్లో రోహితేష్ లంబా దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఉద్యోగరీత్యా చిన్నారిని చూడడానికి వీలు దొరక్కపోవడంతో కన్నకూతరును చూడలేకపోయారు. బిడ్డను చూసేందుకు సెలవుపెట్టి గోవింద్‌పురాకు త్వరలోనే వెళ్లాలనుకున్నారు. కన్న కూతరును చూడడానికి వస్తాడనుకున్న భర్త ఉగ్రవాదుల దాడిలో మరణించాడన్న వార్తను భార్య వినాల్సి వచ్చింది. రోహితేష్ లంబా వీరమరణంతో గోవింద్‌పురాలో విషాదఛాయలు అలుముకున్నాయి. జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాన్వాయ్‌లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి. పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. -
ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే..!
సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల వివరాలను భారత ప్రభుత్వం విడుదల చేశారు. జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. వారిలో 36 మృతదేహాలను గుర్తించి వారి వివరాలను శుక్రవారం విడుదల చేశారు. మరికొంతమంది వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా మృతిచెందిన వారిలో అత్యధికంగా 12 మంది జవాన్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, నలుగురు పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఉగ్రదాడిలో మృతిచెందిన ఇద్దరు తమిళనాడు జవాన్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఇరవై లక్షల చెప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అమరులైన జవాన్లు వీరే.. 1. రాథోడ్ నితిన్ శివాజీ, మహారాష్ట్ర 2. వీరేంద్ర సింగ్, ఉత్తరాఖండ్ 3. అవదేశ్ కుమార్ యాదవ్, ఉత్తరప్రదేశ్ 4. రతన్ కుమార్ ఠాకూర్, బిహార్ 5. పంకజ్ కుమార్ త్రిపాఠి, ఉత్తర ప్రదేశ్ 6. జెట్ రామ్, రాజస్తాన్ 7. అమిత్ కుమార్, ఉత్తరప్రదేశ్ 8. విజయ్ మౌర్యా, ఉత్తరప్రదేశ్ 9. కుల్విందర్ సింగ్, పంజాబ్ 10, మనేశ్వర్ బసుమంతరాయ్, అస్సాం. 11. మోహన్ లాల్, ఉత్తరాఖండ్ 12. సంజయ్ కుమార్ సిన్హా 13. రామ్ వకీల్, ఉత్తరప్రదేశ్ 14. నాసీర్ ఆహ్మద్, జమ్మూ కశ్మీర్ 15. జైమాల్ సింగ్, పంజాబ్ 16. కుఖేందర్ సింగ్, పంజాబ్ 17. తిలక్ రాజ్, హిమాచల్ ప్రదేశ్ 18. రోహితేష్ లంబా, రాజస్తాన్ 19. విజయ్ సోరింగ్, జార్ఖండ్ 20. వసంత్ కుమార్, కేరళ 21. సుబ్రహ్మణ్యం , తమిళనాడు 22. గురు, కర్ణాటక 23. మనోజ్ కేఆర్ బెహరా 24. నారాయణ్ లాల్‌గుర్జార్, రాజస్తాన్ 25. ప్రదీప్ కుమార్, ఉత్తర ప్రదేశ్ 26. హమ్రాజ్ మీనా, రాజస్తాన్ 27. రమేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్ 28. సంజయ్ రాజ్‌పుత్, ఉత్తరప్రదేశ్ 29. కౌశల్ కుమార్ రాజ్‌పుత్, ఉత్తరప్రదేశ్ 30. ప్రదీప్ సింగ్, ఉత్తర ప్రదేశ్ 31. శ్యామ్ బాబు, ఉత్తరప్రదేశ్ 32. అజిత్ కుమార్, ఉత్తరప్రదేశ్ 33. మహేందర్ సింగ్ అట్టారి, పంజాబ్ 34. అశ్విన్ కుమార్, మధ్యప్రదేశ్, 35. సుదీప్ బిస్వాస్, బెంగాల్ 36. శివచంద్రన్, తమిళనాడు -
పాకిస్తాన్‌కు భారత్ సమన్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలపై చర్యలను తీసుకోవల్సిందిగా పాకిస్తాన్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు జారీ చేసింది. భారత జవాన్లపై ఆత్మహుతి దాడికి పాల్పడిన పాకిస్తాన్‌కు చెందిన జేషే ఏ మహ్మద్ ఉగ్రసంస్థపై చర్యలు తీసుకుకోని, వాటిని వెంటనే నిషేధించాలని భారత్ అదేశించింది. ఈమేరకు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే శుక్రవారం పాకిస్తాన్ హైకమిషనర్‌కు సమన్లు జారీచేశారు. పుల్వామాలో జరిగిన దాడికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని, ఉగ్రవాద మూలాలున్న గ్రూపులను, వ్యక్తులను నిలువరించాలని పాక్‌ను భారత్ ఆదేశించింది. భారత్ సైనికులపై దాడికి పాల్పడ్డ సంస్థలను నిషేధించకుంటే చర్యలు తప్పవని భారత్ హెచ్చరించింది. పుల్వామా దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. -
‘ద్వేషమెన్నటికి సమాధానం కాదు’
జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)తో ఆత్మాహుతి దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 43 మంది ప్రాణాలు కోల్పోగా కొందరు గాయపడ్డారు. ఈ దాడిని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించారు. బాలీవుడ్ కూడా ఈ దారుణాన్ని ఖండిస్తోంది మనలని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్లు ఉగ్రదాడిలో మరణించడం మనసుని కలచి వేసింది. ప్రాణాలు విడిచిన జవాన్ల కుటుంబాలకి అండగా నిలబడడం మన బాధ్యత. - సల్మాన్ ఖాన్ పుల్వామా ఘటనతో ఒక్కసారిగా షాక్ అయ్యాను. ద్వేషం ఎన్నటికి సమాధానం కాలేదు. ఉగ్ర దాడిలో గాయపడ్డ జవాన్ల ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబాలకి ధైర్యం అందించాలని దేవుడిని కోరుకుంటున్నాను. - ప్రియాంక చోప్రా పుల్వామా దాడి అమానుషం, అమానవీయం. కోపాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. - అజయ్ దేవగణ్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ సైనికులపై జరిగిన దాడిని ఇంకా నమ్మలేకపోతున్నాను. ఈ ఘటనని ఎప్పటికి మరచిపోలేము. దాడిలో గాయపడ్డ వారు త్వరగా కొలుకోవాలని దేవుడిని వేడుకుంటున్నాను. మరణించిన వారి ఆత్మలకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. - అక్షయ్ కుమార్ పుల్వామా ఘటనకి సంబంధించిన వార్త నన్ను ఎంతగానో కలచి వేసింది. దాడిలో మరణించిన వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి దేవుడు కొండంత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. - అనుష్క శర్మ -
‘ఈ తరహా దాడులను నివారించడం కష్టమే’
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్, పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 43 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉగ్రవాది ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకుని భద్రతాబలగాల కాన్వాయ్‌లో ప్రవేశించాడు. అనంతరం తన కారును కాన్వాయ్‌లోని ఓ బస్సుకు ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ విషయం గురించి ఇంటిలిజెన్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘కొన్ని రోజుల ముందే ఈ తరహా దాడుల గురించి చర్చించాము. ఇలాంటి దాడులు ఎక్కువగా సిరియాలో జరుగుతుంటాయి. ముష్కరులు కూడా ఏదో ఒక రోజు మన దగ్గర ఇదే ప్రయోగాన్ని అమలు చేస్తారని భావించాం. కానీ అది ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఈ తరహా దాడులను ముందుగా గుర్తించడం, నివారించడం కాస్తా కష్టమైన పనే. ఎందుకంటే సాధరణంగా దాడులకు తెగబడే వారు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాన్ని ఎంచుకుని విధ్వంసం సృష్టిస్తారు. ఇలాంటప్పుడు రోడ్డు మీద ఉన్న అన్ని వాహనాలను పూర్తిగా పరిశీలించడం కుదరదు. ఫలితంగా దాడులను నియంత్రించడం సాధ్యమయ్యే పని కాదు’ అన్నారు. అయితే ‘ఈ సమస్య పరిష్కారానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి.. జవాన్ల కాన్వాయ్‌లను ట్రాఫిక్ లేని సమయంలో అంటే రాత్రి పూట లేదా తెల్లవారుజామున తరలించాలి. అప్పుడు తక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అన్ని వాహనాలను జాగ్రత్తగా పరీక్షించవచ్చు. లేదా.. భద్రతాబలగాల కాన్వాయ్‌ల తరలింపు పూర్తయ్యవరకే ఆయా మార్గాల్లో వాహనాలు తిరగకుండా రోడ్డును బ్లాక్ చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిష్కారాలు ఇవే. వీటి గురించి మరింత లోతుగా చర్చించాలని భావిస్తోన్న నేపథ్యంలో ఈ దాడి జరగడం విచారకరమ’ని తెలిపారు. అంతేకాక గతంలో సాయుధుడు ఆర్మీ శిబిరంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటం, లేదంటే బాంబులు విసరడం లాంటివి చేసేవారన్నారు. మిలిటరీ శిబిరంలోకి చొరబడి సైనికులు తేరుకునే లోపే చేయాల్సినంత నష్టం చేయడమే లక్ష్యంగా వారు తెగబడుతారని తెలిపారు. కానీ ముష్కరులు కూడా కొత్త వ్యూహాలు పన్నుతున్నారని.. ప్రస్తుత దాడి జరిగిన తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. -
పుల్వామా ఉగ్రదాడి : పాక్‌ను హెచ్చరించిన అమెరికా
వాషింగ్టన్ : జమ్మూకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముష్కరుల విషయంలో పాక్ తీరు మారాల్సిందేనంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. పాక్ ఉగ్రవాదులకు మద్దతివ్వడం.. వారిని కాపాడేందుకు ప్రయత్నించడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. తక్షణమే ముష్కరులకు మద్దతివ్వడాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని పాక్‌ను హెచ్చరించింది. పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందంటూ అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాల్లో గందగోళాన్ని, హింసను వ్యాప్తి చేయడమే ఉగ్రవాదుల లక్ష్యమని అమెరికా మండి పడింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో అమెరికా భారత్‌కు పూర్తి మద్దతిస్తుందని తెలిపింది. రెండు దేశాలు కలిసి ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేస్తాయని పేర్కొంది. పుల్వామా ఉగ్రదాడిని అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడిని అమానవీయ చర్యగా పేర్కొన్న రష్యా ముష్కరుల అంతానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఫ్రాన్స్, జర్మనీలు ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి. -
పుట్టినరోజు వేడుకలు వద్దన్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్ర దాడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కశ్మీర్లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని.. తాను కూడా తీవ్ర మనస్థాపానికి గురయ్యానన్నారు కేసీఆర్. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని సీఎం కేసీఆర్ అభ్యర్థించారు. పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని, ఉగ్రవాదులు జరిపిన పేలుడులో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
ఇక మాటల్లేవ్.. యుద్ధమే : గంభీర్
న్యూఢిల్లీ : ఇప్పటి వరకు జరిగింది చాలని, వెంటనే వేర్పాటు వాదులు, పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిందేనని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై తీవ్రంగా కలత చెందిన గంభీర్.. ఆవేశంగా ఇక మాటల్లేవని, యుద్ధమే ఈ సమస్యకు పరిష్కారమని ట్విటర్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. (చదవండి: ఉగ్ర మారణహోమం) అయితే ఈ దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. భూగోళంపై ఉగ్రవాదానికి చోటు లేదని, ముక్తకంఠంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఈ దాడిని ఖండిస్తూ అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక టీమిండియా క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, సురేశ్ రైనాలు ఈ దాడిని ఖండిస్తూ ట్విటర్ వైదికగా వీర జవాన్లకు నివాళులర్పించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.(చదవండి: వైరల్ వీడియో : ‘అక్కడ శవాలు పడున్నాయి’) భారత క్రికెటర్ల ట్వీట్స్.. ఇక జరిగింది చాలు. వెంటనే వేర్పాటువాదులు, పాకిస్తాన్‌తో మాట్లాడనివ్వండి. కానీ ఈ సంభాషణ అనేది గదుల్లో కాకుండా.. యుద్ధ మైదానంలో ఉండాలి. - గౌతం గంభీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరగడం, వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇదో విచారకరమైన వార్త. ఈ దాడిలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. - వీవీఎస్ లక్ష్మణ్ ఈ ఉగ్రదాడి వార్త తీవ్రంగా కలచి వేసింది. పుల్వామా జిల్లాలో జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నాను. ఈ దాడిలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను - శిఖర్ ధావన్ జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరగడం.. అనేక మంది జవాన్లు ప్రాణాలుకోల్పోవడం వినడానికి చాలా బాధగా ఉంది. ఈ దాడిచేసిన పిరికి పందలకు త్వరలోనే గుణపాఠం కలగాలని ప్రార్థిస్తున్నాను. - మహ్మద్ కైఫ్ ఉగ్రదాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు నా ఆలోచన, ప్రార్థన అంతా వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాల గురించే. -సురేశ్ రైనా సీఆర్పీఎఫ్ జవాన్లపై పిరికిపందలు జరిపిన దాడిలో మన వీర జవాన్లు వీరమరణం పొందడం బాధను కలిగిస్తోంది. ఈ బాధను వర్ణించడానికి పదాలు రావడం లేదు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలి. - వీరేంద్ర సెహ్వాగ్ -
‘మరో కుమారుడ్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను’
పట్నా : పాకిస్తాన్‌కు తగిన సమాధానం చెప్పడం కోసం మరో కుమారున్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను అంటున్నారు ఓ వీరజవాను తండ్రి. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా మరణించిన వారిలో బిహార్ భాగల్పూర్కు చెందిన రతన్ ఠాకూర్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో రతన్ ఠాకూర్ తండ్రి ఏఎన్ఐతో మాట్లాడారు. ‘నా కొడుకు దేశం కోసం ప్రాణాలర్పించాడు. భరతమాత కోసం ప్రాణాలర్పించి చరిత్రలో నిలిచిపోయాడు. ఓ తండ్రిగా ఇందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ప్రస్తుతం నేను బాధను, గర్వాన్ని అనుభవిస్తున్నాను. నా కొడుకు లాంటి మరి కొందరు వీర జవాన్లను చంపి.. వారి తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిల్చిన పాకిస్తాన్‌కు బుద్ది చెప్పాలి. పాక్‌కు తగిన గుణపాఠం చెప్పడం కోసం మరో కుమారున్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను. తనను కూడా భరతమాత సేవకే అర్పిస్తాను’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. -
‘అక్కడ శవాలు పడున్నాయి’
-
వైరల్ వీడియో : ‘అక్కడ శవాలు పడున్నాయి’
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరుగుతుండగా తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సెల్ఫోన్లో రికార్డు చేసిన ఈ వీడియో దాడి జరిగిన ప్రాంతంలోని భయానక పరిస్థితులను, నష్టాన్ని కళ్లకు కడుతుంది. వీడియోలో ‘చంపేశాడు, చంపేశాడు.. అక్కడ శవాలు పడి ఉన్నాయనే’ మాటలు వినిపిస్తున్నాయి. బహుశా వీడియో తీసిన వ్యక్తి దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నాడని.. ప్రత్యక్షంగా చూసి ఉండవచ్చని భావిస్తున్నారు నెటిజన్లు. సెల్ఫోన్లో తీసిన ఈ వీడియోలో పేలుడు జరిగిన ప్రాంతం, చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలు, తుక్కుతుక్కయిన వాహనాలు దాడి తీవ్రతను తెలియజేస్తున్నాయి. కాగా, ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉగ్రదాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది
-
సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. 43మంది మృతి
-
12 కి.మీ వరకూ పేలుడు శబ్దం
శ్రీనగర్: పుల్వామా జిల్లాలో గురువారం జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడితో స్థానికులు వణికిపోయారు. లెత్‌పొరా మార్కెట్‌కు 300 మీటర్ల దూరంలోనే ఈ దాడి చోటుచేసుకోవడంతో దుకాణదారులు షట్టర్లు మూసేసి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఆత్మాహుతి దాడి సందర్భంగా ఏర్పడ్డ పేలుడు శబ్దం 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని స్థానికులు తెలిపారు. జిల్లా సరిహద్దులో ఉన్న శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సైతం పేలుడు శబ్దం వినిపించదన్నారు. పేలుడు తీవ్రతకు ఉగ్రవాది ఆదిల్‌తో పాటు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతదేహాలు ఛిద్రం అయ్యాయని జమ్మూకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరిని గుర్తించేందుకు మరికొంత సమయం పడుతుందని వెల్లడించారు. ఈ ఘటనలో జవాన్ల బస్సుతో పాటు స్కార్పియో వాహనం నామరూపాలు లేకుండా పోయాయన్నారు. 2001, అక్టోబర్ 1న జమ్మూకశ్మీర్ అసెంబ్లీపై జైషే ఉగ్రవాదులు చేసిన దాడిలో 38 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. తాజాగా ఉగ్రవాదుల దాడిలో ఏకంగా 43 మంది జవాన్లను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కశ్మీర్లో ఉగ్రదాడులు 1999 నుంచి ఇప్పటివరకు భద్రతా దళాలపై జరిపిన ప్రధాన దాడులు.. ► 2017 ఆగస్ట్ 26: పుల్వామా జిల్లా పోలీస్ లైన్స్‌పై ఉగ్రదాడి. ఎనిమిది మంది భద్రత సిబ్బంది మృతి. ► 2016 నవంబర్ 29: నాగ్రోటా వద్ద గల సైనిక ఆయుధాగారంపై దాడి. ఏడుగురు సైనికులు మరణించారు. ► 2016 సెప్టెంబర్ 18: బారాముల్లా జిల్లాలోని ఉరిలో ఆర్మీ శిబిరంపై నలుగురు పాక్ తీవ్రవాదులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ దాడి చేసింది. ► 2016 జూన్ 25: శ్రీనగర్–జమ్మూ హైవేపై పాంపోర్ వద్ద సీఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్రకాల్పులు. ఎనిమిది మంది జవాన్ల మృతి. ► 2016 జూన్ 3: పాంపోర్‌లో సీఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్రదాడి. దాడి తర్వాత ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు. రెండ్రోజులు కొనసాగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులంతా హతమయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు చనిపోయారు. ► 2014 డిసెంబర్ 5: మొహ్రాలో ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడి. పది మంది సైనికులు ప్రాణాలు వదిలారు. ► 2013 జూన్ 24: హైదర్పోరా వద్ద సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుపై దాడి. ఎనిమిది మంది సైనికుల మృతి. ► 2008 జూలై 19: శ్రీనగర్–బారాముల్లా రహదారిపై నరబల్ వద్ద రోడ్డు పక్కన ఐఈడీ అమర్చి పేల్చడంతో పది మంది సైనికులు చనిపోయారు. ► 2005 నవంబర్ 2: నౌగమ్‌లో నాటి సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ ఇంటి దగ్గర్లో కారుతో ఆత్మాహుతి దాడి. ముగ్గురు పోలీసులు, ఆరుగురు పౌరుల మరణం. ► 2005 జూలై 20: భద్రతా దళాల కాన్వాయ్‌పై కారుతో ఆత్మాహుతి దాడి. ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరుల దుర్మరణం. ► 2005 జూన్ 24: శ్రీనగర్ శివార్లలో కారు బాంబును పేల్చిన ఉగ్రవాదులు. తొమ్మిది మంది సైనికుల మృతి. ► 2004 ఏప్రిల్ 8: బారాముల్లా జిల్లాలోని ఉరి వద్ద పీడీపీ ర్యాలీపై గ్రెనేడ్లతో దాడి. 11 మంది చనిపోయారు. ► 2003 జులై 22: అక్నూర్లో సైనిక శిబిరంపై దాడి. బ్రిగేడియర్సహా ఎనిమిది మంది సైనికుల మరణం. ► 2003 జూన్ 28: సన్జాన్ ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి. 12 మంది సైనికుల దుర్మరణం. ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదుల హతం. ► 2002 మే 14: కలుచాక్ ఆర్మీ కంటోన్మెంట్‌పై దాడిలో 36 మంది సైనికులు నేలకొరిగారు. ► 2001 నవంబర్ 17: రాంబన్‌లోని భద్రతా దళ స్థావరంపై ఉగ్రదాడి. 10 మంది సైనికులు మరణించారు. నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ► 2001 అక్టోబర్ 1: శ్రీనగర్‌లోని పాత శాసనసభ కాంప్లెక్స్ వెలుపల కారు బాంబు పేలుడు. 38 మంది దుర్మరణం. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ► 2000 ఆగస్ట్ 10: శ్రీనగర్‌లోని రెసిడెన్సీ రోడ్లో భద్రతా సిబ్బందిపై గ్రెనేడ్ దాడి, కారు బాంబు పేలుడు. 11 మంది సైనికులు, ఓ జర్నలిస్టు మరణించారు. ► 2000 ఏప్రిల్ 19: శ్రీనగర్‌లోని బాదామిబాగ్‌లో ఆర్మీ ప్రధాన కార్యాలయం వద్ద తొలిసారిగా కారుతో ఆత్మాహుతి దాడి. ఇద్దరు సైనికులు మరణించారు. ► 1999 నవంబర్ 3: బాదామిబాగ్ ఆర్మీ హెడ్‌క్వార్టర్ వద్ద దాడి చేసి 10 మంది సైనికులను చంపేశారు. -
ఉగ్ర మారణహోమం
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను శ్రీనగర్‌లోని 92 బేస్ బదామీగఢ్ ఆర్మీ కంటోన్మెంట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లలో చాలామంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. విధుల్లో మళ్లీ చేరేందుకు వెళుతుండగా.. మళ్లీ విధుల్లో చేరేందుకు 2,547 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దాదాపు 78 వాహనాల్లో గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరారు. వీరి వాహనాలు సూర్యాస్తమయంలోగా 266 కిలోమీటర్ల దూరంలోని శ్రీనగర్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఉండే శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై భద్రతాబలగాల వాహనాలు ఒకదానివెంట మరొకటి వెళుతున్నాయి. రెప్పపాటులో ఉగ్రవాది కారుతో బస్సును ఢీకొట్టాడు. భద్రతాబలగాలు తేరుకునేలోపే తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో కాన్వాయ్‌లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి. పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలానికి ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు, ఎన్ఎస్జీకి చెందిన పేలుడు పదార్థాల నిపుణులు ఘటనాస్థలికి చేరుకుని సాక్ష్యాలు, పేలుడు అవశేషాలను సేకరించారు. ఉగ్రదాడి జరగడంతో శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిహార్ పర్యటను రద్దుచేసుకుని వెనుదిరగగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబా భూటాన్ పర్యటన నుంచి అర్ధంతరంగా తిరుగుప్రయాణమయ్యారు. 2016, సెప్టెంబర్ 18న కశ్మీర్లో ఉడీ ఆర్మీ బేస్‌పై ఉగ్రదాడి తర్వాత భద్రతాబలగాలు భారీస్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. ఉడీ ఘటనలో 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు మూసేయడంతో భారీ కాన్వాయ్ ప్రమాద విషయమై సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఆర్.ఆర్. భట్నాగర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో వాతావరణం బాగోలేకపోవడంతో గత రెండ్రోజులగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ఉగ్రవాదుల ఆత్మాహుతిదాడికి గురైన బస్సులో 39 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. వీరంతా సీఆర్పీఎఫ్ 76వ బెటాలియన్‌కు చెందినవారని పేర్కొన్నారు. దాడి సందర్భంగా జవాన్ల వాహనాలపై కాల్పులు జరిగాయన్నారు. సాధారణంగా సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లో వెయ్యి మంది జవాన్లు మాత్రమే ఉంటారనీ, కానీ గత రెండ్రోజులుగా రహదారి మూతపడటంతో ఒకేసారి భారీ సంఖ్యలో 2,547 మంది జవాన్లు శ్రీనగర్‌కు బయలుదేరారని తెలిపారు. ఈ ఘటనపైకశ్మీర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఉగ్రదాడి తీవ్రత దృష్ట్యా కశ్మీర్ పోలీసులతోపాటు ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు ఈ విచారణలో పాలుపంచుకుంటారని భట్నాగర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్లో శాంతిభద్రతలను సమీక్షించేందుకు శుక్రవారం కేంద్ర భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఖండించిన అంతర్జాతీయ సమాజం పుల్వామాలో భద్రతా బలగాలపై జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి, అమెరికా, రష్యాతోపాటు, ఫ్రాన్సు, జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ, చెక్ రిపబ్లిక్, పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు ఖండించాయి. పుల్వామా దాడిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి కారకులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలతోపాటు భారత ప్రభుత్వం, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్యాగాలు వృథా కావు జమ్మూకశ్మీర్‌లో జవాన్లపై జరిగిన దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. మన భద్రతా బలగాల త్యాగాలు వృథా కావని ఆయన అన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ దాడిలో వీరమరణం పొందినవారి కుటుంబాలకు జాతి మొత్తం మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన అనంతర పరిస్థితిపై హోం మంత్రి రాజ్‌నాథ్‌తోపాటు అధికారులతో చర్చించానన్నారు. ‘పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి అత్యంత హేయం. పిరికిపందలు పాల్పడిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. సాహసవంతులైన మన భద్రతా బలగాలు చేసిన త్యాగాలు వృథా కావు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉగ్రదాడి తరువాత మంటల్లో చిక్కుకున్న ఆర్మీ వాహనాలు. సైనికుడి మృతదేహాన్ని తరలిస్తున్న తోటి సైనికులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది ఎవరేమన్నారంటే.. ప్రతీకారం తీర్చుకుంటాం పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని హోం మంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. హింసాత్మక చర్యల ద్వారా శాంతికి భగ్నం కలిగించాలనుకునే శక్తుల ఆటలను కట్టించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ‘సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి జైషే మొహమ్మద్ సంస్థే కారణం. ఇందుకు తగినవిధంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నా. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క జవానుకూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని అన్నారు. - హోం మంత్రి రాజ్‌నాథ్ ‘కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఉగ్ర మూకలపై జరిగే పోరాటంలో జాతి మొత్తం ఐక్యంగా నిలబడుతుంది. అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. క్షతగాత్రులైన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. దుష్ట, ఉగ్ర మూకలపై జరిగే పోరులో జాతి మొత్తం ఒక్కటిగా నిలబడుతుంది. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘బలగాలపై ఉగ్రదాడిపై తీవ్ర వేదనకు గురయ్యా. పిరికిపందల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. అమర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. దేశ భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజీ ధోరణి అవలంభిస్తోంది. – రాహుల్ గాంధీ ‘కశ్మీర్లో భారత్ బలగాలపై జరిగిన దాడిని అమెరికా దౌత్య కార్యాలయం ఖండిస్తోంది. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఉగ్రవాదాన్ని ఓడించడంలో భారత్ చేసే పోరాటానికి అమెరికా వెన్నంటి ఉంటుంది’ –అమెరికా రాయబారి కెన్నెత్ జెస్టర్ ‘అవంతిపొరాలో 30 మంది జవాన్లు అమరులయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ తీవ్రమైన ఉగ్రవాద చర్యను ఖండించడానికి ఏ పదాలూ సరిపోవు. ఈ మూర్ఖత్వపు చర్యలు ఆగిపోయేలోపు ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి?’ –జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ‘కశ్మీర్లో బలగాలపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నా. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేసింది. ఇది యావత్ దేశానికే విషాద దుర్ఘటన. జవాన్ల కుటుంబాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం చర్యలు తీసుకోవాలి ‘పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాల వేదన తీరనిది. ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. వీరుల కుటుంబాలకు కాంగ్రెస్‌తోపాటు దేశం యావత్తూ అండగా నిలుస్తుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి’ అని ట్విట్టర్లో ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గురువారం లక్నోలో తన మొట్ట మొదటి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆమె అమర జవాన్ల మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. - ప్రియాంకా గాంధీ -
జమ్మూలో హింస.. ఆరుగురు మృతి
శ్రీనగర్ : జమ్మూలో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. పూల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు కశ్మీరీ పౌరులు మృతిచెందారు. మరికొంత మందికి తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా అమాయక పౌరులపై ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించారు. దీంతో పూల్వామా లో ప్రాంతంలో పరిస్థితి హింసాత్మకంగా మారటంతో భారీగా బలగాలను మోహరించి, ఇంటర్నెట్ సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదుల హతం.. అంతకుముందు జమ్మూ కశ్మీర్ జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా భద్రతా బలగాలు వారి దాడులను తిప్పికొట్టాయి. జమ్మూ పోలీసులు, కేంద్ర రిజర్వు పోలీస్ బలగాలు (సీఆర్పీఎఫ్) ఉమ్మడిగా జరిపిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా, ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాది జహోర్ అహ్మద్ ఠాకూర్ గతంలో ఇండియన్ ఆర్మీలో జవాన్‌గా సేవలందించాడు. ఈ ఏడాది జూలైలో ఏకే-47 ఆయుధంతో ఆర్మీ క్యాంపు నుంచి పరారైన అహ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో చేరినట్లు అధికారులు వెల్లడించారు. -
మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది హతం
శ్రీనగర్: కశ్మీర్లో లష్కరేతోయిబా కార్యకలాపాలకు సూత్రధారిగా ఉన్న మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది మెహ్రాజుద్దీన్ బంగ్రూ సహా ముగ్గురిని భద్రతాబలగాలు బుధవారం మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త బృందం బుధవారం తెల్లవారుజామున శ్రీనగర్‌లోని ఫతేహ్‌కదల్ ప్రాంతంలో ఉగ్రమూకలు నక్కిన ఇంటిని చుట్టుముట్టింది. అనంతరం ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఉగ్రమూకల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ కమల్ కిశోర్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక ఎన్కౌంటర్లో మెహ్రాజుద్దీన్ బంగ్రూతో పాటు ఫహద్ వజా, రయీస్ అబ్దుల్లాలను బలగాలు మట్టుబెట్టాయి. ఈ విషయమై కశ్మీర్ పోలీస్‌శాఖ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) స్వయం ప్రకాశ్ పానీ మాట్లాడుతూ.. శ్రీనగర్‌లో జరిగిన పలు ఉగ్రదాడులు, ఆయుధాల దొంగతనం, బ్యాంకుల లూటీతో పాటు లష్కరేకు దాడులకు బంగ్రూ కీలక సూత్రధారిగా వ్యవహరించాడని తెలిపారు. -
మూడేళ్లలో నక్సలిజం అంతం
లక్నో: రాబోయే మూడేళ్లలో దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులను ఎదుర్కోవడంలో సీఆర్పీఎఫ్ బలగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. సీఆర్పీఎఫ్ అనుబంధ విభాగమైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) 26వ వార్షికోత్సవ వేడుకల్లో రాజ్‌నాథ్ మాట్లాడుతూ..‘ఆ రోజు ఎంతో దూరంలో లేదు. రాబోయే 2–3 ఏళ్లలో దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. గతంలో దేశవ్యాప్తంగా 126 జిల్లాల్లో తీవ్రవాదుల ప్రాబల్యముంటే.. ఈ సంఖ్య ప్రస్తుతం 10 నుంచి 12 జిల్లాలకు పడిపోయింది. మీ (సీఆర్పీఎఫ్ జవాన్ల) అంకితభావం, ధైర్యం, కృషి కారణంగానే ఇది సాధ్యమైంది. ఆర్ఏఎఫ్ బలగాలు స్పందించడంలో వేగంగా ఉండాలే తప్ప ప్రజలతో దురుసుగా వ్యవహరించకూడదు’ అని తెలిపారు. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ విశేష కృషి చేస్తోందని ప్రశంసిం చారు. భద్రతాబలగాలు 2018లో ఇప్పటివరకూ 131 మంది ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులను మట్టుబెట్టాయని రాజ్‌నాథ్ తెలిపారు. దీంతోపాటు 1,278 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో 58 మంది లొంగిపోయారని వెల్లడించారు. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. కశ్మీరీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారనీ, అయినా రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ బలగాలు శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నాయని కితాబిచ్చారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో యాపిల్ కంపెనీ మేనేజర్‌ను పోలీసులు కాల్చిచంపడంపై పరోక్షంగా స్పందిస్తూ.. ‘ఆందోళనలు, అల్లర్ల సందర్భంగా ఆర్ఏఎఫ్ బలగాలు సత్వరం స్పందించాలే తప్ప ప్రజలతో దురుసుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. సుశిక్షితులైన భద్రతాబలగాలు ప్రజలతో దురుసుగా ప్రవర్తించి కూర్రులుగా గుర్తింపు తెచ్చుకోకూడదు. విధి నిర్వహణ సందర్భంగా ప్రజలతో ఎప్పుడు, ఎంతమేరకు, ఎలా వ్యవహరించాలన్న అంశంపై జవాన్లకు అవగాహన ఉండాలి’ అని రాజ్‌నాథ్ వెల్లడించారు. దేశంలో అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 1991లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, అలహాబాద్, ముంబై, అలీగఢ్, కోయంబత్తూర్, జంషెడ్పూర్, భోపాల్, మీరట్‌లో ఆర్ఏఎఫ్ బెటాలియన్లను మోహరించారు. -
మావోయిస్టులపై ‘డ్రోన్’ వెపన్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టుల కదలికల నియం త్రణకు కేంద్ర హోంశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే కేంద్రం నూతన డ్రోన్ పాలసీని ప్రక టించింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పాలసీ ద్వారా మావోయిస్టుల నియం త్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని భావిస్తోంది. రెండ్రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సెక్యూరిటీ ఎక్స్పో లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్య లు ఇప్పుడు మావోయిస్టు పార్టీలో కలవరం సృష్టిస్తు న్నాయి. కొత్త డ్రోన్ పాలసీ ద్వారా దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడంతోపాటు మావోయిస్టులు, తీవ్రవాద సమస్యను తుడిచివేస్తామన్నారు. త్వరలోనే కార్యాచరణ ఉంటుందని, దేశ అంతర్గత భద్రతాబలగాలకు డ్రోన్లను అందుబాటులోకి తెచ్చేం దుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. రంగంలోకి ఐదు రకాల డ్రోన్లు... డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకా ల ప్రకారం ఐదు రకాల డ్రోన్లను అందుబాటులోకి తేబోతున్నారు. ఇందులో నానో డ్రోన్ 250 గ్రాముల బరువు మాత్రమే ఉంది. మైక్రోడ్రోన్ 250 గ్రాముల నుంచి 2 కిలోల బరువు వరకు ఉంటుంది. స్మాల్ డ్రోన్ 2 కిలోల నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. మీడియం డ్రోన్ 25 కిలోల నుంచి 150 కిలోల బరువు, లార్జ్‌డ్రోన్ 150 కిలోలకు పైబడి బరువుం టుంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడవులకే పరిమితమైన మావోయిస్టుల కార్యకలాపాలను మరింత నియంత్రించి, మావోయి స్టు కదలికలను పూర్తిస్థాయిలో అదుపు చేసేందుకు ఈ డ్రోన్లను ఉపయోగించాలని సీఆర్పీఎఫ్కు కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు జారీ అయినట్టు తెలిసిం ది. గతంలో రోబోల ద్వారా మావోయిస్టులను ఎదు ర్కొనేందుకు కొంత ప్రయత్నించినా ఆశించిన çఫలితా లు రాలేదు. దీనితో ఈసారి గగనతలం నుంచి మావోయిస్టు కార్యకలాపాలను గుర్తించి, ఎన్కౌంట ర్ వ్యవహారాలను డ్రోన్ ద్వారా బలగాల ఆపరేటిం గ్‌కు ఉపయోగించుకునేందుకు ఈ వ్యవస్థను అంది పుచ్చుకోవాలని హోంశాఖ ఆదేశాల్లో స్పష్టం చేసింది. సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్... కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), కోబ్రా దళాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న గ్రేహౌండ్స్ బలగాలకు ఈ డ్రోన్లను అందించాలని భావిస్తున్నారు. ఇందుకుగాను ప్రతీ సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో రెండు నుంచి 4 డ్రోన్లను ఏర్పాటు చేయడం, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఆయా బేస్ క్యాంపుల నుంచి ఢిల్లీ వరకు అనుసంధానం చేసేందుకు సీఆర్పీఎఫ్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఐదు డ్రోన్లలో తక్కువ బరువున్న నానో, మైక్రో డ్రోన్లను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. 350 అడుగుల నుంచి 450 అడుగుల వరకు ఈ రెండు డ్రోన్లకు ఎగిరేశక్తి ఉంటుంది. వీటి ద్వారా డే టైమ్‌లో హెడ్టీ క్వాలిటీ వీడియో, ఫొటోలు చిత్రీకరించడం సులభమని నిఘావర్గాలు భావిస్తున్నాయి. వీటికన్నా బరువున్న వాటిని ఉపయోగించడం వల్ల శత్రువు అప్రమత్తమవుతాడని, ఇవి చేసే శబ్దం వల్ల టార్గెట్ మిస్‌ఫైర్ అయ్యే ప్రమాదముంటుందని నిఘా అధికారులు భావిస్తున్నారు. సమాచార మార్పిడి తప్పనిసరి డ్రోన్ల ద్వారా మావోయిస్టుల కదలికల ను ఎప్పటికప్పుడు గుర్తించడమే కాకుండా ఆయా ప్రభావిత రాష్ట్రాల ప్రత్యేక విభాగా లకు సమాచారమివ్వాలని కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్తోపాటు కోబ్రా తదితర విభాగా లకు సూచించింది. రాష్ట్రాల్లో ఉన్న మావోయి స్టుల కార్యకలాపాలు స్థానిక పరిస్థితులను çప్రభావితం చేస్తాయని, ఇందులో భాగంగా అక్కడి రాష్ట్రాల స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరోల పని కూడా కీలకమని సూచించింది. -
ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో గురువారం భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు హతమార్చాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 12 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఉగ్రవాదులు కఠువా జిల్లా నుంచి అంతర్జాతీయ సరిహద్దు గుండా దేశంలోకి ప్రవేశించి.. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఓ ట్రక్కులోకి ఎక్కారని జమ్మూ ఐజీ ఎస్డీ సింగ్ జమ్వాల్ తెలిపారు. డొమైల్ అనే గ్రామ సమీపంలో సీఆర్పీఎఫ్ బలగాలు తనిఖీలు చేపట్టడం చూసి వారిపై కాల్పులు జరుపుతూ పరారయ్యారని వెల్లడించారు. సమీపంలోని అటవీప్రాంతంలో దాక్కున్న వీరిని పట్టుకునేందుకు ఆపరేషన్ మొదలుపెట్టామన్నారు. ఉగ్రవాదులను చూసినట్లు ఓ స్థానికుడు ఇచ్చిన సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త బృందాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. గాయపడ్డ 12 మంది భద్రతా సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. -
‘సైన్యాన్ని వీడుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : పారామిలటరీ బలగాల నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా 2017లో స్వచ్ఛంద పదవీవిరమణ, రాజీనామాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో వెల్లడించింది. ముఖ్యంగా సరిహద్దు భద్రతా దళం, కేంద్ర రిజర్వు పోలీస్ బలగాల్లో ఎక్కువ మంది సిబ్బంది వైదొలిగారని పేర్కొంది. 2015లో 909 మంది బీఎస్ఎఫ్ నుంచి నిష్ర్కమించగా, 2017లో ఈ సంఖ్య ఏడు రెట్లు అధికంగా 6415కు పెరిగిందని తెలిపింది. సీఆర్పీఎఫ్లో 2015లో 1376 మంది వైదొలగా, 2017లో అత్యధికంగా 5123 మంది వైదొలిగారని వెల్లడించింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సహస్త్ర సీమా బల్లోనూ ఇదే ధోరణి కనిపించిందని పేర్కొంది. ఇక అస్సాం రైఫిల్స్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలోనూ పెద్దసంఖ్యలో సిబ్బంది వైదొలిగారని తెలిపింది. వ్యక్తిగత, కుటుంబ, ఆరోగ్య కారణాలతో పాటు 20 ఏళ్ల సర్వీస్ అనంతరం పెన్షన్ ప్రయోజనాలు పెరగడంతో సిబ్బంది పెద్దసంఖ్యలో స్వచ్ఛంద పదవీవిరమణ లేదా రాజీనామా చేయడానికి మొగ్గుచూపుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌పై మావోల దాడి
దుమ్ముగూడెం(ఖమ్మం): తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్ పరిధిలోని ఎలకన గూడెం సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపుపై మావోయిస్టులు మంగళవారం సాయంత్రం దాడి చేసినట్లు సమాచారం. అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ బలగాలు ఎదురు దాడికి దిగడంతో ఇరువురు మధ్య కాల్పులు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే, రాత్రి వరకు కాల్పులు జరిగినా.. ఎవరికీ గాయాలు కానట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ధర్మపేట బేస్ క్యాంపు ఏర్పాటైనప్పటీ నుంచి క్యాంపును అక్కడి నుంచి తొలగించాలని మావోయిస్టులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వివిధ రూపాలలో దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ, పోలీసులు కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బేస్‌క్యాంపులు ఏర్పాటు చేశారు. దీంతో మావోయిస్టులు బేస్ క్యాంపులను అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. కానీ, కిష్టారం, ఎలకన గూడాలలో బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. దీంతో బేస్‌క్యాంపులకు నిత్యావసర సరుకులు అందకుండా చేయాలనే ఉద్దేశంతో సంతలను నిలిపివేశారు. అప్పటి నుంచి క్యాంపులపై దాడులు చేస్తారని పోలీసు నిఘా వర్గాలు పసికట్టి క్యాంపులకు అధిక బలగాలను తరలించారు. అయినప్పటికీ మావోలు ఎలకన బేస్ క్యాంపు పై దాడికి పాల్పడ్డారు. -
దంతెవాడలో మావోయిస్టుల దాడి
మావోయిస్టులు పంజా విసిరారు. ఎన్ఎండీసీ గనిపై దాడికి తెగబడ్డారు. గని వద్ద ఉన్న పొక్లెయిన్‌ను మావోయిస్టులు తగులబెట్టారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బైలదిల్లా గనుల్లో గురువారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు హుటాహుటిన తరలివెళ్లాయి. మావోయిస్టులకు, సీఆర్పీఎఫ్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.