
కశ్మీర్ : భారత జవాన్లు రిలీఫ్ అయ్యేందుకు 30 ఏళ్ల క్రితం మూతబడిన హెవెన్ థియేటర్ తెరచుకుంది. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ థియేటర్ ఉంది. పుల్వామా ఘటన తర్వాత అక్కడ బందోబస్తు పెరిగిపోవడంతో సైనికులు సేద తీరేందుకు ఈ థియేటర్‌ని ఉపయోగంలోకి తెచ్చారని స్థానికంగా నివాసముండే హవల్దార్ రామ్‌జీ చెప్పారు. రేయింబళ్లు డ్యూటీలో మునిగిపోయే జవాన్లు హెవెన్‌లో కాసేపు సినిమా చూసి రిఫ్రెష్ అవుతున్నారని తెలిపారు.
యుద్ధం నేపథ్యంలో సాగే ‘పల్టాన్’ లాంటి సినిమాలు మరింత ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. కన్నవారిని, భార్యబిడ్డలకు దూరంగా ఉంటున్న జవాన్లకు బాలీవుడ్ సినిమాలు, ముఖ్యంగా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కే జేపీ దత్తా సినిమాలు కాస్త ఉత్సాహాన్నిస్తాయన్నారు. స్థానికులతో పాటు సినిమా చూడడం కొత్త అనుభూతినిస్తోందని సీఆర్పీఎఫ్ 40 బెటాలియన్ కమాండెంట్ అశు శుక్లా చెప్పారు. అమితాబ్ బచ్చన్ నటించిన కాళియా 1991లో హెవెన్‌లో ఆడిన చివరి సినిమా.
Comments
Please login to add a commentAdd a comment