
శ్రీనగర్: పుల్వామాలో ఫిబ్రవరి 14న సీర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతిదాడికి పాల్పడ్డ జైషే ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ 40 మంది జవాన్లను బలికొన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే తరహాలో ఆత్మాహుతి దాడి చేసేందుకు ఓ ఉగ్రవాది సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన రకీబ్ అహ్మద్ భద్రతాబలగాలపై ఆత్మాహుతి దాడి చేయాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. కానీ కుల్గామ్‌లోని తురిగామ్‌లో 24న జరిగిన ఎన్‌కౌంటర్‌లో రకీబ్ సహా ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. ‘మీరు ఈ వీడియోను చూసేలోగా నేను స్వర్గంలో ఉంటాను’ అని రకీబ్ మాట్లాడిన వీడియో శనివారం సోషల్‌మీడియాలో షేరింగ్ అవుతోంది. ఏ రకంగా ఆత్మాహుతిదాడి చేయబోతున్నానో వీడియోలో రకీబ్ చెప్పాడు. ఆదిల్ దార్, రకీబ్‌లకు సంబంధించిన వీడియోల మధ్య సారూప్యత ఉందన్నారు.
భారత్ కాల్పుల్లో నలుగురు దుర్మరణం
ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు చనిపోయారని పాకిస్తాన్ ఆర్మీ ఆరోపించింది. నైకాల్ సెక్టార్‌లో పాక్ ఆర్మీ పోస్టులు లక్ష్యంగా భారత బలగాలు కాల్పులు జరిపాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment