Pulwama Terror Attack
-
‘పుల్వామా’ అమరులకు ప్రధాని మోదీ ఘన నివాళులు
న్యూఢిల్లీ/హల్దా్వనీ: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధాని మోదీ శుక్రవారం నివాళులర్పించారు. దేశం పట్ల వారు అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచారని కొనియాడారు. వారి త్యాగాలను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటాయని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పుల్వామా ఉగ్ర ఘటనలో అసువులు బాసిన జవాన్లకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. వీరి త్యాగాల వల్లే మన దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్నారు. మానవీయతకే అతిపెద్ద శత్రువైన ఉగ్రవాదంపై పోరుకు నేడు ప్రపంచమే ఏకమైందని శుక్రవారం హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో తెలిపారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ని ఆత్మాహుతి దళ బాంబర్ వాహనంతో ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా వైమానికదళం యుద్ధ విమానాలు పీవోకేలోని బాలాకోట్ ఉగ్ర స్థావరాన్ని నేలమట్టం చేశాయి. -
పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (ఫిబ్రవరి 14) నివాళులర్పించారు. ‘పుల్వామాలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తున్నాను’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశం కోసం వారు చేసిన సేవలు, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. I pay homage to the brave heroes who were martyred in Pulwama. Their service and sacrifice for our nation will always be remembered. — Narendra Modi (@narendramodi) February 14, 2024 జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. పుల్వామా ఉగ్రదాడి 2019, ఫిబ్రవరి 14న జరిగింది. భారత్‌పై జరిగిన భారీ తీవ్రవాద దాడుల్లో ఇదొకటి. ఆ చీకటి రోజున ఉగ్రవాదులు 200 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యారు. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. ఆరోజు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లో 78 వాహనాలు ఉండగా, వాటిలో 2500 మందికి పైగా సైనికులు ప్రయాణిస్తున్నారు. -
పుల్వామా దాడికి ఐదేళ్లు... ఆ రోజు ఏం జరిగింది?
2019, ఫిబ్రవరి 14.. సరిగ్గా ఐదేళ్ల క్రితం జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్‌కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ జరగలేదు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్‌పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది. సర్జికల్ స్ట్రైక్ రూపంలో బదులు తీర్చుకుంది. పాకిస్తాన్లోకి ప్రవేశించిన భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇంతకీ ఐదేళ్ల క్రితం ఫిబ్రవరి 14న పాక్ ఎటువంటి దాడికి పాల్పడిందో, దానికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇప్పుడొకసారి గుర్తుచేసుకుందాం. ఐదేళ్ల క్రితం ఇదేరోజున సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది. సైనికులు ఉన్న ఈ కాన్వాయ్‌లో అధికంగా బస్సులు ఉన్నాయి. కాన్వాయ్ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొంది. బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీంతో వెంటనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారత్.. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు కఠిన చర్యలు అవలంబించింది. ఫలితంగా పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. 2019, ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళం జమ్మూ, కాశ్మీర్‌లోకి చొరబడి భారతదేశంపై వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్‌కు చెందిన యుద్ధ విమానం ‘మిగ్-21’ పాకిస్తాన్ సైన్యం దాడికి గురై, అక్కడే పడిపోయింది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ సైనికులు ‘మిగ్-21’ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను పట్టుకున్నారు. 2019, మార్చి ఒకటిన అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్తాన్ సైన్యం అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ అప్పటివరకూ పాక్‌తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. ఫలితంగా పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు మనీలాండరింగ్‌పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)ను కూడా భారత ప్రభుత్వం కోరింది. -
‘త్వరలో మరో పుల్వామా దాడి’ అంటూ పోస్ట్.. రంగంలోకి పోలీసులు
న్యూఢిల్లీ: ‘పుల్వామా దాడి’ మాదిరి మరో దాడి త్వరలో జరగనుందని ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఒక్కసారిగా దుమారం రేపింది. వెంటనే స్పందించిన పోలీసులు ఉత్తర ప్రదేశ్‌లో సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని జార్ఖండ్‌కు చెందిన విద్యార్థిగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. ‘పుల్వామా దాడి... వంటి మరో దాడి తర్వలో జరగనుంది’ అని ఆ విద్యార్థి ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశాడు. మంగళవారం జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు పుల్వామాలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద లభించిన తుపాకాలను స్వధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని ఆర్మీ భద్రతా సిబ్బంది, పోలీసులు సంయూక్తంగా విచారణ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఓ స్టూడెంట్ పెట్టిన షోషల్ మీడియా పోస్ట్ వెలుగు చూడటంతో అప్రమత్తమైన షహరాన్ పూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు మృతి చెందిన విషయం తెలిసిందే. చదవండి: Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం -
పుల్వామాలో మళ్లీ ఉగ్రదాడి.. వలసకూలీపై కాల్పులు
జమ్ము: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రతూటా పేలింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీపై దుండగులు కాల్పులు జరిపారు. పుల్వామాలో ఈ ఘటన జరగగా.. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న ఎన్స్పెక్టర్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి మరుసటి రోజే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. "పుల్వామాలోని తుమ్చి నౌపోరా ప్రాంతంలో యూపీకి చెందిన వలస కూలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మృతున్ని ముఖేష్‌గా గుర్తించాం. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాం." అని పోలీసులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో పుల్వామాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. ఆదివారం ఈద్గా ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న ఇన్స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇదీ చదవండి: శివసేన, ఎన్సీపీ అనర్హత పటిషన్లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది గడువు -
హాని చేయాలని చూస్తే బుద్ధి చెబుతాం
కాంకేర్(ఛత్తీస్‌గఢ్): భారత్‌కు ఎవరైనా హాని కలిగించాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పొరుగుదేశాన్ని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్ట్ ప్రభావిత కాంకేర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు. పుల్వామా, ఉడి ఉగ్రదాడులకు ప్రతిగా 2016, 2019ల్లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్‌లను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం శక్తివంతంగా మారింది, ఇప్పుడు బలహీన దేశం ఎంతమాత్రం కాదని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతో వామపక్ష తీవ్రవాద సంబంధ ఘటనలు ఇప్పుడు కేవలం 10–12 జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యాయన్నారు. -
Pulwama attack 2019: ‘పుల్వామా’పై అనుమానాలెన్నో
న్యూఢిల్లీ: 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న 2019 పుల్వామా ఉగ్ర దాడిపై అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. ఉగ్రదాడి ముప్పుందని తెలిసి కూడా జవాన్లను విమానంలో కాకుండా రోడ్డు మార్గాన ఎందుకు పంపాల్సి వచ్చిందో మోదీ సర్కారు చెప్పి తీరాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘‘పుల్వామా దాడిపై నాటి జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బయట పెట్టిన విషయాలు షాకింగ్‌గా ఉన్నాయి. జైషే ముప్పును, ఏకంగా 11 నిఘా హెచ్చరికలను ఎందుకు విస్మరించారు? ఉగ్రవాదులకు 300 కిలోల ఆర్డీఎక్స్ ఎలా వచ్చింది? ఉగ్ర దాడిపై విచారణ ఎంతదాకా వచ్చింది? బాధ్యులను గుర్తించారా?’’ అని ప్రశ్నించారు. -
ఎన్నికల కోసమే పుల్వామా దాడి.. మోదీపై కాంగ్రెస్ నేత తీవ్ర వ్యాఖ్యలు
జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు రాజస్థాన్ కాంగ్రెస్ ఇంఛార్జ్ సుఖ్జిందర్ సింగ్ రంధావా. ఎన్నికల ప్రయోజనాల కోసం పుల్వామా దాడిని ఆయనే చేయించి ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఈ ఉగ్ర ఘటన ఎలా జరిగిందో ఇప్పటివరకు ఇంకా ఏమీ తెలియకపోవడం ఏంటని ప్రశ్నించారు. జైపూర్‌లో కాంగ్రెస్ ధర్నాలో మాట్లాడుతూ రంధావా ఈ వ్యాఖ్యలు చేశారు. 'పంజాబ్‌లో మాపియాను కాంగ్రెస్ అంతం చేసింది. అకాలీదళ్‌ను శాశ్వతంగా లేకుండా చేశాం. తలచుకుంటే మోదీని గద్దె దించలేమా? మా గ్రామం పాకిస్థాన్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ మేము ఆ దేశానికి ఎప్పుడూ భయపడలేదు. ఇంట్లోకి చొరబడి అంతం చేస్తాం అని మోదీ ప్రగల్భాలు పలుకుతారు. అలాంటప్పుడు పుల్వామాలో దాడి ఎలా జరిగింది. దానిపై విచారణ జరపండి. ఈరోజు వరకు ఆ ఘటన ఎలా జరిగిందో తెలియదు. ఎన్నికల ప్రయోజనాల కోసమే ఇది జరగలేదంటారా? అని రంధావా తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే మోదీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు అందరు కలిసి రావాలని రంధావా పిలుపునిచ్చారు. మోదీ దిగిపోతేనే భారత్‌ను కాపాడగలమన్నారు. ఓకవేళ మోదీనే మళ్లీ అధికారంలో ఉంటే భారత్ పని అయిపోతుందన్నారు. తమకంటే గొప్ప దేశభక్తులు లేరని బీజేపీ నేతలు చెప్పుకుంటారని, అసలు దేశభక్తి అనే పదానికి అర్థం కూడా మోదీకి తెలియదని విమర్శించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవారిలో ఒక్క బీజేపీ నేత అయినా ఉన్నాడా? అని ప్రశ్నించారు. హిండెన్‌బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరపాలని కోరుతూ కాంగ్రెస్ జెపూర్‌లో ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ రంధావా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను నాశనం చేసేందుకు ఈస్ట్ ఇండియా కెంపెనీలాంటి అదానీ సంస్థను మోదీ తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. మోదీ అధికారం నుంచి దిగిపోతే అదానీ కంపెనీ కూడా కనుమరుగు అవుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ కౌంటర్ రంధావా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. పుల్వామా ఘటనలో పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆయన మాట్లాడారని, కాంగ్రెస్ మరోసారి హద్దులు మీరి మాట్లాడిందని ధ్వజమెత్తింది. సైనికుల త్యాగాలను అవమానించిన ఆయనపై చర్యలు తీసుకుని, పదవి నుంచి తప్పిస్తారా లేదా? సమర్థిస్తారా అని హస్తం పాార్టీని ప్రశ్నించింది. చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా? కాంగ్రెస్ అవినీతిలో రోజుకో కొత్త మోడల్ -
పుల్వామా అమర జవాన్ల భార్యల అరెస్ట్
జైపూర్: పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన అమరవీర జవాన్ల భార్యలను రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు డిమాండ్లతో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల భార్యలు జైపూర్‌లోని సచిన్ పైలట్ ఇంటి ఎదుట ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం దీక్షను భగ్నం చేసి.. స్థానిక స్టేషన్‌కు తరలించారు పోలీసులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ నివాసం ఎదుట ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఈ ముగ్గురు మహిళలు నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలో సచిన్ పైలెట్ ఆ ముగ్గురితో మాట్లాడినా కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. దీంతో.. తమ దీక్షను ఆమరణ దీక్షగా మార్చుకున్నారు వాళ్లు. అయితే శుక్రవారం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి స్థానిక పీఎస్‌కు తరలించారు. అరెస్ట్ క్రమంలో పోలీసులు ఆ మహిళలతో దురుసుగా ప్రవర్తించగా.. సచిన్ పైలట్ పోలీసుల తీరును తప్పుబట్టారు. మరోవైపు ఈ ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ మండిపడింది. వితంతువులపై భౌతిక దాడి జరిగిందంటూ రాజస్థాన్ డీజీపీ లేఖ రాసి.. ఘటనపై వివరణ కోరింది. ఇదిలా ఉంటే.. అమర వీరుల కుటుంబ సభ్యులకు సాధారణంగా ప్రభుత్వాలు ఉద్యోగాలను ప్రకటిస్తుంటాయి. అయితే తమ పిల్లలకు బదులుగా బంధువులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఈ మేరకు అవసరమైతే రూల్స్ సవరించాలని ఈ ముగ్గురు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. తమ గ్రామాలకు రోడ్లు వేయించాలని, ఊరి నడిబొడ్డున తమ భర్తల విగ్రహాలు ఏర్పాటు చేయించాలని కోరారు. దీనిపై ట్విటర్ ద్వారా స్పందించిన సీఎం అశోక్ గెహ్లాట్.. ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే రాతపూర్వకంగా స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తామని చెబుతూ.. తమ దీక్షను కొనసాగించారు వాళ్లు. మరోవైపు బీజేపీ ఈ పరిణామాల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అయితే దీనిని రాజకీయం చేయడం సరికాదని అంటున్నారు సీఎం గెహ్లాట్. జమ్ముకశ్మీర్ పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన.. శ్రీనగర్ జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRFP) సిబ్బంది కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులు కాగా, యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. -
పుల్వామా అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు..
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా వారిని స్మరించుకున్నారు. పుల్వామా అమరుల త్యాగాన్ని దేశం ఎన్నిటికీ మరువదని, దేశాభివృద్ధికి వీర సైనికుల శౌర్యమే స్ఫూర్తిదాయకమన్నారు. ఈమేరకు ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. Remembering our valorous heroes who we lost on this day in Pulwama. We will never forget their supreme sacrifice. Their courage motivates us to build a strong and developed India. — Narendra Modi (@narendramodi) February 14, 2023 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్‌లోకి ప్రవేశించి భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉగ్ర శిబిరాలను పేల్చి వేసింది. ఈ ఘటనలో దాదాపు 250 మంది తీవ్రవాదాలు హతమైనట్లు అమిత్ షా ఓ ఎన్నికల ర్యాలీలో తెలిపారు. చదవండి: ‘అదానీ’పై అదే దుమారం -
వాటికీ ప్రూఫ్ ఏంటి?: దిగ్విజయ్ సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పుల్వామా ఉగ్రదాడి, సర్జిక్ స్ట్రైక్‌లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో పుల్వామ ఉగ్రదాడిలో సుమారు 40 మంది భ్రదతా సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. "పుల్వామ ఉగ్రవాదానికి కేంద్రం, పైగా అక్కడ ప్రతి కారుని కూడా తనిఖీ చేస్తారు. అలాంటప్పుడూ రాంగ్‌సైడ్ నుంచి వచ్చిన స్కార్పియో కారుని ఎందుకు తనిఖీ చేయలేదు. అప్పుడే కదా ఈ స్కారిపియో కారు భద్రతా సిబ్బంది కాన్వాయ్‌ని ఢీ కొనడంతో అంతమంది జవాన్లు చనిపోయారు" అంటూ కేంద్రంపై విరుచకుపడ్డారు. ఈ విషయమై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సరైనా సమాధానం ఇవ్వలేదన్నారు. అదీగాక పార్లమెంటులో బహిరంగంగా ప్రధాని మోదీ పదేపదే సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడతారంటూ విమర్శించారు. ఈ సర్జికల్ స్ట్రైక్‌తో ఇంతమందిని చంపాం అని ఏవో ప్రగాల్పాలు చెబుతుంటారని మండిపడ్డారు. వాటికి సంబంధించి ఇప్పటి వరకు సరైనా ఆధారాలను అందించలేకపోయిందంటూ కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ మేరకు దిగ్విజయ్ సింగ్ జమ్మూలోని భారత్ జోడోయాత్రలో రాహుల్‌తో కలసి ఈ విషయాలు గురించి మాట్లాడారు. అంతేగాదు 300 కిలోల ఆర్డిఎక్స్ ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై కూడా పలు ప్రశ్నలను లేవనెత్తారు. అందుకు సంబంధించిన వీడియోని కూడా దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, వాస్తవానికి జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీలోని ఆర్మీ బేస్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో సుమారు18 మంది సైనికులు మరణించారు. దీంతో 2016లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రారంభించింది.అయితే కాంగ్రెస్ పార్టీ పుల్వామా దాడి, వైమానిక దాడుల గురించి బీజేపీ కొంతకాలం వరకు ప్రశ్నలు సంధించింది. ఐతే బీజేపీ మన సైన్యాన్నే అనుమానిస్తున్నారా? అని గట్టి కౌంటర్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యింది. पुलवामा हादसे में आतंकवादी के पास ३०० किलो RDX कहॉं से आई? देवेंद्र सिंह डीएसपी आतंकवादियों के साथ पकड़ा गया लेकिन फिर क्यों छोड़ दिया गया? पाकिस्तान व भारत के प्रधानमंत्री के मैत्री संबंधों पर भी हम जानना चाहते हैं। pic.twitter.com/1wVbJEDPIC — digvijaya singh (@digvijaya_28) January 23, 2023 (చదవండి: వీడియో: అలాంటి వ్యక్తి దొరికితేనే పెళ్లి: మరోసారి స్పష్టం చేసిన రాహుల్ గాంధీ) -
ఎఫ్బీలో ఓవర్ యాక్షన్: బీటెక్ విద్యార్థికి జైలు, భారీ జరిమానా
బెంగళూరు: పుల్వామా ఉగ్రదాడికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గాను బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఫైజ్ రషీద్‌కి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు జడ్జి సిఎం గంగాధర అతనికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు 10వేల రూపాయల జరిమానా విధించారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ప్రశంసిస్తూ, భారత సైన్యాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇంజనీరింగ్ విద్యార్థి రషీద్‌ను 2019 ఫిబ్రవరిలో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి అతనికి బెయిల్ మంజూరు కాలేదు. విచారణలో తాజాగా కోర్టు తీ ర్పునిచ్చింది. రషీద్ నిరక్షరాస్యుడు కాదని, కావాలనే ఫేస్బుక్లో ఈ వ్యాఖ్యలను పోస్ట్ చేశారని న్యాయమూర్తి అన్నారు. ఇది జాతికి వ్యతిరేకమైందనీ, హేయమైందని న్యాయమూర్తి గంగాధరను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. కాగా ఫైజ్ ఫేస్బుక్ పోస్ట్‌లో, భారత సైనికులపై పుల్వామాలో జరిగిన దాడి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు మతాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఉన్నాయని ఆరోపించిన పోలీసులు ఫైజ్‌ను అరెస్ట్ చేసి, అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2019, ఫిబ్రవరి 24న పుల్వామా దాడి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల దాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
ఇండియా@75: పుల్వామా దాడి
జమ్మూ కశ్మీర్లో 2019 ఫిబ్రవరి 14 న పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆ బాంబు దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్మూ– శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం) లో ఆ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి ఘాతానికి పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో 10 మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్.. ఫిబ్రవరి 26న తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి. మరోవైపు.. పుల్వామా దాడికి తామే కారణమంటూ.. ఇది పాక్ ప్రజల విజయమని ఆ దేశ మంత్రి ఫవద్ ఛౌధురీ ఆ తర్వాతి ఏడాది జాతీయ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతో పాక్ కుట్ర తేటతెల్లమయ్యింది. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి. పాకిస్థాన్‌కి పట్టుబడి, విడుదలైన ఫైటర్ పైలట్ అభినందన్ వర్థమాన్. యాంటీ శాటిలైట్ మిస్సైయిల్ కలిగిన నాలుగో దేశంగా భారత్. చంద్రయాన్ 2 ని ప్రయోగించిన భారత్. కోడి రామకృష్ణ, మనోహర్ పారికర్, వింజమూరి అనసూయాదేవి, రాళ్లపల్లి, గిరీశ్ కర్నాడ్, షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రామ్ జఠ్మలానీ, వేణమాధవ్.. కన్నుమూత. (చదవండి: మహోజ్వల భారతి: నంబర్ 1 స్టూడెంట్ ) -
Pakistan PM: థ్యాంక్స్ ‘మోదీ జీ’.. పాక్ కొత్త పీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ నూతన పీఎం షెహబాజ్ షరీఫ్ ఆదివారం లేఖ రాశారు. ఈ లేఖలో భారత్‌తో శాంతియుత సంబంధాలు, కశ్మీర్ సహా అపరిష్క్రత సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అయితే, పాక్‌లో అవిశ్వాస తీర్మానం తర్వాత ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఓ లేఖలో భారత ప్రధాని మోదీ.. షెహబాజ్ షరీఫ్‌కు అభినందనలు తెలిపారు. ఆ లేఖలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. కాగా, ఈ లేఖపై పాక్ ప్రధాని స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. భారత్‌తో పాకిస్తాన్ శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుట్టున్నట్టు తెలిపారు. అలాగే, జమ్ముకశ్మీర్‌తో సహా ఇతర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ త్యాగం అందరికీ తెలిసిందేనని అన్నారు. శాంతి కోసం పాటుపడాలని అన్నారు. సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక, ఆర్థికాభివృద్ధి గురించి ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరముందని షెహబాజ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పుల్వామా ఉగ్రదాడికి ప్రతి స్పందనగా 2019లో పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల తర్వాత భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అనంతరం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్తాన్‌తో భారత్ నిర్మాణాత్మక సంబంధాలను కోరుకుంటోందని ఇటీవలే స్పష్టం చేశారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. -
Pulwama Encounter: జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్
జమ్ముకశ్మీర్‌లో శనివారం ఉదయం హైఅలర్ట్ ప్రకటించారు భద్రతా అధికారులు. శుక్రవారం రాత్రి నుంచి జమ్ములోని వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లలో ముగ్గురు ముష్కరులను మట్టుపెట్టినట్లు అధికారులు ధృవీకరించారు. శుక్రవారం రాత్రి సమయంలో.. పుల్వామా చవల్కాన్‌లో, హంద్వారా నెచమా, గందర్బాల్ ఏరియాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈక్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరపగా, భద్రతా దళాలు ప్రతిదాడికి దిగాయి. శనివారం వేకువ జామున వరకు జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ చెప్పారు. మరొకరికోసం గాలిస్తున్నామన్నారు. పుల్వామాలోని చవల్కాన్ ప్రాంతంలో జైషే మహమ్మద్‌కు చెందిన టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు విజయ్ కుమార్ తెలిపారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నట్లు వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో JeM కమాండర్ కమాల్ భాయ్ తో పాటు ఒక పాకిస్థానీ ఉన్నట్లు వెల్లడించారు. We had launched joint ops at 4-5 locations yesterday night. So far 2 terrorists of JeM including 1 Pakistani killed in Pulwama, 1 terrorist of LeT killed each in Ganderbal & Handwara. Encounters over in Handwara & Pulwama. Also arrested 1 terrorist alive: IGP Kashmir (File pic) pic.twitter.com/BPN25Gx3dz — ANI (@ANI) March 12, 2022 ఇక గందర్బల్ హంద్వారాలో జరిగిన ఎదురుకాల్పులో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, అతడు లష్కరే తొయిబా సంస్థకు చెందిన టెర్రరిస్టుగా గుర్తించామన్నారు. పలుచోట్ల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని చెప్పారు. -
ది పుల్వామా కేస్: కశ్మీర్ గడ్డపై నెత్తుటి మరక
ఉత్తర భారతదేశంలోని... జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా హైవే... సమయం... మద్యాహ్నం 3గంటల 30నిమిషాలు. సీఆర్పీఎఫ్ జవాన్లను తీసుకు వెల్తున్న కాన్వాయ్‌పై ఒక్కసారిగా ఆత్మాహుతి దాడి జరిగింది. బ్లూకలర్ కార్... వేగంగా దూసుకువచ్చి జవాన్లు వెలుతున్న బస్సులోకి దూసుకుపోయింది. అంతలోనే ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది.. పేలుడు ధాటికి జవాన్లు ప్రయాణిస్తున్న బస్సులు తునాతునకలై పోయాయి. అందులో ఉన్న వారి మృతదేహాలు చెల్లాచెదురైపోయాయి. అసలేం జరిగిందో అర్ధం అయ్యేలోపు... జరగాల్సిన దారుణం జరిగిపోయింది. కనీవిని ఎరుగని రీతిలో జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. భద్రతా దళాల మీద జరిగిన భయంకర దాడి తరువాతి కాలంలో దేశభద్రత, రాజకీయ అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. పుల్వామా దాడి ఒక ఆత్మాహుతి దాడి. కారుణలో పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు కూర్చి ఆ కారును భద్రతా దళాల వాహనాలతో ఢీకొట్టడం ఈ మొత్తం దాడిలో కీలకం. ఈ దాడి ఎలా జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఏవిధంగా పేలుడు పదార్ధాలు దేశంలోకి వచ్చాయనేది కూడా విచారణ సంస్థలను విస్మయానికి గురిచేశాయి. ఈ దాడిలో పాల్గొన్నది స్థానిక కశ్మీరీ ఉగ్రవాదులా లేక పాకిస్థాన్ నుంచి వచ్చిన సీమాంతర ఉగ్రవాదులా అనేది ఈ కేసులో చాలాకాలం మిస్టరీగా ఉండింది. 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడి విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ ఎన్ఐఏకు అప్పగించారు. పుల్వామా.. దక్షిణ కాశ్మీర్లో ఉన్న పట్టణం గుండా వెళుతున్న హైవే అటు జమ్మూను ఇటు కాశ్మీర్‌ను కలుపుతుంది. చలికాలంలో ముఖ్యంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంచుక కురవడం వల్ల... హైవేపై రాకపోకలు ఆగిపోతాయి. అటు జమ్మూ నుంచి కాశ్మీర్లో ఉన్న భద్రతా దళాలకు నిత్యావసరాల నుంచి అమ్యునేషన్ ఏది పంపాలన్నా ఈహైవే ద్వారానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 2019లో కూడా జమ్మూలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో ఉన్న జవాన్లను కాశ్మీర్‌కు పంపేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ముఖ్యంగా సెలవుల మీద వెళ్లివచ్చిన జవాన్లు ముందుగా జమ్మూలోని క్యాంప్‌లో రిపోర్ట్ చేస్తారు... ఆ తరువాత వారు ఒకేసారిగా కాశ్మీర్‌లోని క్యాంప్‌లకు భారీ భద్రత మధ్య కాన్వాయ్‌లో వెళతారు. అయితే 2019 జనవరి15 తరువాత కాశ్మీర్లో భారీగా మంచు కురిసింది దీంతో దాదాపు 20రోజుల పాటు జవాన్లను తరలించడం సాధ్యం కాలేదు. ఫిబ్రవరి 5వ తేదీన జవాన్ల కాన్వాయ్ వెళ్లేందుకు ఏర్పాటు చేసినా... మంచు కారణంగా అది ఫిబ్రవరి 14కు వాయిదా పడింది. గతంలో కాశ్మీర్లో వ్యవహారలను చూసే బీఎస్ఎఫ్ స్థానంలో సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ తరువాత సీఆర్పీఎఫ్ జమ్మూ కాశ్మీర్లో భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఫిబ్రవరి 14న తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో జమ్మూ నుంచి భారీగా జవాన్లను తీసుకుని వాహనాలు కాశ్మీర్‌కు బయలుదేరాయి. మొత్తం 78వాహనాల్లో 2547మంది సీఆర్పీఎఫ్ జవాన్లు... జమ్మూ నుంచి కాశ్మీర్లో ఉన్న క్యాంపుకు వెలుతున్నారు. జమ్మూ-కాశ్మీర్‌ను కలిపే టన్నెల్ వద్దకు మద్యాహ్నం సమయానికి జవాన్ల కాన్వాయ్ చేరుకుంది. టన్నెల్ నుంచి పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలలోనే జవాన్ల తరలింపు జరగాలి. ఇది స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. భద్రతా కారణాల దృష్ట్యా కాశ్మీర్లో భద్రతా దళాలు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్‌లోనే ప్రయాణించాలి. అయితే భారీగా జవాన్లు ఉండటంతో... సరిపోయినన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు టన్నెల్ వద్దరు రాలేదు. దీంతో చాలామంది జవాన్లు... సాధారణ బస్సుల్లోనే కూర్చుండి అక్కడి నుంచి ప్రయాణం కొనసాగించారు. 2019ఫిబ్రవరి 14 రోజున మద్యాహ్నం 2గంటల సమయంలో పుల్వామా హైవేపై పోలీసుల హడావిడి ప్రారంభం అయింది. ఏరియా డామినేషన్ పార్టీ పూర్తిగా హైవే తమ ఆధీనంలోకి తీసుకుంది. జవాన్లు ఆ ఏరియా దాటిపోయే వరకు హైవేపై ఇతర వాహనాలను అనుమతించరు. ఇది ఎప్పుడూ ఉండే ప్రొసీజర్. దాదాపు 3గంటల 15నిమిషాల సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సులు పుల్వామా సరిహద్దులోకి చేరుకున్నాయి. 3గంటల 30నిమిషాలకు పుల్వామా పట్టణాన్నిదాటి కాన్వాయ్ ముందుకు కదులుతోంది. అంతలోనే రెండు ఒక బ్లూకలర్ మారుతి కారు సర్వీస్ రోడ్డు నుంచి హైవే మీదకు వెళ్లే మార్గం దగ్గర నుంచి ఒక్కసారిగా కాన్వాయ్‌లోని బస్సుల మీదకు దూసుకుపోయింది. వెంటనే భారీ పేలుడు జరిగింది.. పేలుడు ధాటికి బస్సు పూర్తిగా తునాతునకలైంది. ఒక్కసారిగా ఊహించని విధంగా భారీ పేలుడు జరగడంతో అసలేం జరిగిందో ఎవరికి అర్ధం కాలేదు. వెంటనే ముందు బస్సులో ఉన్న జవాన్లు కన్ఫ్యూజన్లో కాల్పులు జరిపారు. అయితే వెంటనే తేరుకుని ఎవరూ లేరని గ్రహించి క్షతగాత్రుల వద్దకు చేరుకున్నారు. పేలుడు తీవ్రత దాదాపు 10కిలోమీటర్ల వరకు వినిపించింది. బస్సు నామరూపాల్లేకుండా ధ్వంసం అయింది చాలామంది జవాన్ల శరీర భాగాలు ముక్కలు ముక్కలైపోయాయి. హైవే పక్కన ఎలాంటి నివాస జనావాసాలు లేవు. అయితే హైవే కింది భాగంలో నివాస ప్రాంతం ఉంది. పేలుడు తరువాత వెంటనే తేరుకున్న అధికారులు సహాయంకోసం దగ్గరలోనే ఉన్న ఆసుపత్రితో పాటు ఆర్మీ క్యాంపుకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న అధికారులు ఆ భీతావాహ దృష్యాలను చూసి స్థబ్దులైపోయారు. చనిపోయిన జవాన్ల మృతదేహాలు చేసి అధికారుల కళ్లు చెమర్చాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు... చనిపోయిన వారి మృతదేహాల భాగాలను భద్రపరిచారు. దాదాపు 200మీటర్ల వరకు జవాన్ల మృతదేహాలు... చేతివేళ్లు.. కాలి ముక్కలు విసిరివేసినట్లు పడ్డాయి. ఆ భాగాలను బాక్సుల్లో అమర్చి...ఆర్మీ బేస్ క్యాంపుకు తరలించారు. పుల్వామా వార్త టీవీ స్క్రీన్లను తాకగానే .. దేశవ్యాప్తంగా ప్రజలు ఆ దృశ్యాలను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఈ దాడి మీద తీవ్రమైన ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన జరిగిన 15నిమిషాల్లోనే బాంబుదాడి జరిపింది తామేనంటూ జైషే మహమ్మద్ ఒక వీడియో విడుదల చేసింది. మహమ్మద్ దాడికి పాల్పడింది తామే అంటూ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో అదిల్ అహ్మద్ దార్ అని చెప్పుకున్న ఒ ఉగ్రవాది ఎమ్-4 కార్బైన్ గన్ , ఒక పిస్టల్ పట్టుకుని కనిపించాడు. ఆదిల్ వెనకాల జైషే మహమ్మద్ జెండా ఉంది. ఈ దాడికి పాల్పండింది తానేనని చెప్పుకున్న దార్... గతంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిన దాడుల గురించి చెప్పుకొచ్చాడు. ఈ వీడియో విడుదల కాగానే భద్రతాదళాలతో పాటు ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిపెరిగింది. ఆత్మాహుతి దాడి చేసి ఆ వెంటనే వీడియో విడుదల చేయడం ద్వారా ఉగ్రవాద అనుకూల ప్రాపగాండాను విస్తరింపజేయాలనే కుట్ర జరిగింది. దాడిలో ఎంత మంది జవాన్లు చనిపోయారనే వార్తను సీఆర్పీఎఫ్ ధృవీకరించక ముందే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన వెబ్సైట్ అల్ఖలమ్లో 40మంది జవాన్లు చనిపోయారని ఖచ్చితమైన మృతుల సంఖ్యను ప్రకటించింది. దీంతో పేలుడు జరిగిన తరువాత ఎప్పటికప్పుడు సమాచారం పాకిస్థాన్‌కు వెలుతుందనే విషయాన్ని నిఘావర్గాలు గుర్తించాయి. పేలుడు తీవ్రత... భారీగా జవాన్లు చనిపోవడంతో... కేంద్రం వెంటనే ఈ కేసును జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. ఎన్ఐఏ జమ్మూకాశ్మీర్ చీఫ్...రాకేశ్ బల్వాల్ ఈ కేసు విచారణ అధిపతిగా నియమితులయ్యారు. వెంటనే రాకేశ్ సంఘటనా స్థలానిక వెళ్లి పరిశీలించారు. దాదాపు 200మీటర్ల దూరం వరకు పడి ఉన్న వాహన శకలాలు, ఇతర సాక్ష్యాధారాలను సేకరించారు. రెండవ రోజు పేలుడు జరిగిన ప్రాంతానికి సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబరేటరి, నేషనల్ బాంబ్ డాటా సెంటర్, ఎన్ఐఏ బాంబ్ స్క్వాడ్, ఎన్ఎస్జీ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సంఘటనా స్థలం నుంచి పేలుడుకు ఉపయోగించిన కారు ముక్కలను సేకరించారు. కారు ఇంజిన్ కు సంబంధించిన కొన్ని భాగాలను సేకరించి దాని ఛాసిస్ నెంబర్ గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే ఆ కారు తయారీకి సంబంధించిన నెంబర్లను ముందుగానే జాగ్రత్తగా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఫిబ్రవరి 18న మారుతీ కంపెనీకి చెందిన ఇంజనీర్ల టీమ్ విచారణ సంస్థలకు సహకరించడానికి ఢిల్లీ నుంచి కాశ్మీర్‌కు చేరుకుంది. మారుతీ ఇంజనీర్స్ కారు ఇంజన్ పూర్తిగా ఓపెన్ చేసి అందులో ఉన్న కారు ఇంజన్ బ్యాచ్ నెంబర్ గుర్తించగలిగారు. ఆ నెంబర్ సహాయంతో దాడికి వాడిన కారు మారుతి ఈకో మోడల్ గా తేల్చారు. దాని మోడల్ నెంబర్ ద్వారా ఇది 25జనవరి 2011రోజున తయారైనట్లు... ఆరోజు తయారైన 7ఈకో కార్లలో ఒక్కటి మాత్రమే కాశ్మీర్లో అమ్ముడైనట్లు గుర్తించారు. ఈ దాడికి వాడిన మారుతి ఈకో కారు ఛాసిస్ నెంబర్ MA3ERLF1SOO183735... కారు ఇంజిన్ నెంబర్...G12BN164140గా గుర్తించారు. విచారణలో కారు డీటేయిల్స్ తెలియగానే... ఆ కారు యజమాని జలీల్ అహ్మద్ హక్కానీను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు షోరూంలో కొనుగోలు చేసిన తరువాత కొన్నిరోజులకు తాను ఆ కారును ఇతరులకు అమ్మేసినట్లు హక్కాని ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. పోలీసులు విచారణను మరింత లోతుగా జరిపినప్పుడు ఆ కారు తరువాతి కాలంలో దాదాపు 6గురి చేతులు మారిందని... గుర్తించారు. గతంలో కారును కొనుగోలు చేసిన 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణను రహస్యంగా ఉంచేందుకు కొన్నాళ్లపాటు ఆ ఆరుగురిని పోలీసులు తమ అదుపులోనే ఉంచుకున్నారు. ఇక ఈ కారు అమ్మకంలో దానిష్ అహ్మద్ లోన్ అనే బ్రోకర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక అహ్మద్ లోన్‌ను విచారిస్తే ఈ కారును తన బంధువు సజ్జాద్ భట్‌కు అమ్మినట్లు తెలిపాడు. చివరిసారిగా మారుతి ఈకో కారును 2019 జనవరిలో 1.85లక్షలకు సజ్జాద్ భట్‌కు అమ్మినట్లు బ్రోకర్ తెలిపాడు. ఇక సజ్జాద్ భట్ కోసం వెళ్లిన పోలీసులు అప్పటికే అతను పారిపోయినట్లు గుర్తించారు. దీంతో కేసు విచారణ అక్కడే ఆగిపోయింది. ఓ వైపు కేసు విచారణ కొనసాగుతుండగా ... ఈ పేలుడు పెద్ద ఇంటెలిజెన్స్ ఫేయిల్యూర్ అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇంత పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ కాశ్మీర్‌లోకి ఎలా వచ్చిందనే చర్చ ప్రారంభం అయింది. అది ఎన్నికల సమయం కావడంతో కావాల్సినంత రాజకీయం జరిగింది. దీంతో విచారణను వేగవంతం చెయ్యాలనే ఒత్తిడి ఎన్ఐఏపై పెరిగింది. దీంతో ఏదో విధంగా కేస్‌లో బ్రేక్ త్రూ సాధించాలనే పట్టుదలతో... విచారణాధికారి బలవాల్ సంఘటన స్థలంలో 250మీటర్ల వరకు పోలీసులతో క్షుణ్ణంగా వెతికించాలని సంకల్పించారు. ఆ ప్రాతంలో ఉగ్రవాదులకు మద్దతుగా ఉండే అతివాద శక్తులున్నాయని... అక్కడ 250మీటర్లు వెతకాలంటే కుదిరే అవకాశం లేదని జమ్మూకాశ్మీర్ పోలీసులు అభ్యంతరం తెలిపారు. అయినా వెనక్కి తగ్గని బలావల్ పై అధికారులను ఒప్పించి సంఘటన జరిగిన 6రోజులకు ఫిబ్రవరి 20న బ్లాస్ట్ సైట్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు... ఈ సెర్చ్ ఆపరేషన్‌లో 400మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, 100మంది ఎన్ఐఏ అధికారులు పాల్గొన్నారు. ఉదయం నుంచి కొనసాగిన ఈ వెతుకులాటలో చనిపోయిన జవాన్ల చిన్న చిన్న శరీర భాగాలు... పేలిపోయిన వాహనాల ముక్కలు తప్ప ఏమీ లభించలేదు.అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు... పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. మద్యాహ్నం తరువాత పేలుడు జరిగిన ప్రదేశం నుంచి దాదాపు 200మీటర్ల దూరంలో బలావల్‌కు మట్టిలో మెరుస్తూ ఒక తాళంచెవి కనిపించింది. 1026 నెంబర్‌తో ఉన్న కారు కీ ఎన్ఐఏ అధికారి బలావల్ చేతికి చిక్కింది. తాళంచెవి మీద ఉన్న రక్తం మరకలను ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్ ఆహ్మద్ దార్ రక్తం డీఎన్ఏతో పోల్చారు. కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడింది అహ్మద్ దార్ అధికారులు నిర్ధరించారు. ముందుగా ఈ దాడి చేసింది.. కాశ్మీరీయా లేక పాకిస్థాన్ నుంచి వచ్చి న ఉగ్రవాదా అనే విషంయపై పెద్ద చర్చ జరిగింది. గతంలో కాశ్మీరీలు ఆత్మాహుతి దాడులు చేసిన సందర్భాలు చాలా తక్కువ. దీంతో మొదటిసారిగా ఒక కాశ్మీరి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వీడియో విడుదల చేసిన ఆదిల్ అహ్మద్ దార్... స్వయంగా ఈ దాడి జరిపాడని పేలుడులో అతను కూడా మరణించాడని నిర్ధారణ అయింది. దాడికి పాల్పడిన వ్యక్తి కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఆదిల్ దార్గా తేలింది. ఇక కారు పుల్వామాకే చెందిన సజ్జాద్ భట్ కొనుగోలు చేసినట్లు కూడా నిర్దారణ అయింది. దీంతో ఇక కారు ఓనర్ సజ్జాద్ భట్ ఇంటిపై పోలీసులు రేడ్ చేశారు. భట్ అక్కడ లేడని... వారం రోజుల నుంచి ఇంటికి రాలేదని అతని తండ్రి తెలిపాడు. అయితే సూసైడ్ బాంబర్ ఆదిల్ దార్ చదువుకున్న సిరాజ్ ఉల్ ఉలుమ్ మదర్సాలోనే భట్ కూడా చదువుకున్నట్లు పోలీసులు గుర్తించారు. జమాతే ఇస్లామీ జమ్ము-కాశ్మీర్ అనే సంస్థ ఈ మదర్సా నడుపుతోంది. వెంటనే 28ఫిబ్రవరి 2019నాడు ఈ సంస్థను కేంద్రం నిషేధించింది. ఇక ఫిబ్రవరి 25నాడు ఏకే-47పట్టుకుని సజ్జాద్ భట్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు సర్క్యులేట్ అయ్యాయి. దీంతో ఈ కేసులో సజ్జాద్ భట్ కీలకం అని పోలీసులు భావించారు.సజ్జాద్ భట్ కోసం వెతుకులాట ప్రారంభించిన పోలీసులకు ఎలాంటి ఫలితం లభించలేదు. దీంతో అతను పాకిస్థాన్ వెళ్లిపోయినట్లు భావించారు. కేసు మళ్లీ మొదటికొచ్చింది.. ఈ కేసులో విచారణలో పురోగతి లేదు ఇక నెలలు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో... ఎన్ఐఏ అధికారులు పుల్వామా తరువాత జరిగిన ఎన్కౌంటర్లపై దృష్టిసారించారు. ఎన్ఐఏ అధికారి బలావల్ ఓ ఎన్కౌంటర్ సంఘటనపై దృష్టిసారించారు. 2019 మార్చిలో నౌగామ్ పోలిస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో జైషేమహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కామ్రాన్ అనే ఉగ్రవాది హతమయ్యాడు. కామ్రాన్‌తో పాటు మరో ఉగ్రవాది కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయాడు.కామ్రాన్ స్థానికంగా జైష్ కమాండర్‌గా ఉన్నాడు... దీంతో చనిపోయిన రెండో ఉగ్రవాదిపై పోలీసులు పెద్దగా దృష్టిసారించలేదు. అయితే కామ్రాన్‌తో పాటు చనిపోయిన మరో ఉగ్రవాది ఆడిడాస్ జాకెట్ వెసుకుని నీట్‌గా హేయిర్ కట్ చేసుకుని ఉన్నాడు. సాధారణంగా కాశ్మీరీ ఉగ్రవాదులు ఇలా నీట్‌గా హేయిర్ కట్ చేసుకోవడంగాని గడ్డం ట్రిమ్ చేసుకోవడంలాంటివి చేయరు. దీంతో ఈ ఉగ్రవాదిపై ఎన్ఐఏ అధికారి బలావల్‌కు అనుమానం వచ్చింది. చనిపోయిన ఉగ్రవాది పేరు ఇద్రీస్ భాయ్ అని స్థానిక పోలీసులు చెప్పారు... ఇద్రీస్ దగ్గర ఒక ఎమ్-4కార్బన్‌తో పాటు పిస్టర్ రెండు సెల్ఫోన్లు దొరికినట్లు పోలీసులు తెలిపారు. రెండు ఫోన్లలో ఒకటి ఐఫోన్ కాగా మరొకటి సాంసంగ్ ఎస్-9 ప్లస్. అయితే ఈ రెండు ఫోన్లు ఎన్కౌంటర్లో చనిపోకముందు ఇద్రీస్ పూర్తిగా వీటిని ధ్వంసం చేశాడని. ఈ ఫోన్ల నుంచి ఎలాంటి సమాచారం లభించలేదని... పోలీసులు చెప్పారు. అయితే ఈ ఫోన్లను పరిశీలించిన కాశ్మీర్ పోలిస్ సైబర్ సెల్ ఇందులో ఎలాంటి డేటా తీయలేకపోయామని బలావల్‌కు తెలిపారు. ఈ ఫోన్లను ఎలాగైనా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు పంపాలని ఎన్ఐఏ అధికారి బలావల్ ప్రయత్నించాడు. అయితే దీనికి రూల్స్ ఒప్పుకోవని కాశ్మీర్ పోలీసులు కరాఖండీగా చెప్పారు. అయినా పుల్వామా కేసు కొలిక్కి రావాలంటే... ఏదో ఒక బ్రేక్ త్రూ కావాలనే తపనతో ఉన్న ఎన్ఐఏ అధికారి బలవాల్లో అన్ని అవకాశాలను వాడుకున్నాడు. దీంతో తనకు పరిచయమున్న కాశ్మీర్ క్యాడర్ ఐపిఎస్ అధికారిని రిక్వేస్ట్ చేసి ఆ ఫోన్లు స్వాధీన పరుచుకునేందుకు పర్మిషన్ తీసుకున్నాడు. వెంటనే ఆ ఫోన్లు ఢిల్లీలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ చేతికి అందాయి. చాలా కష్టపడి పూర్తి డేటాను వెలికితీసిన ఇంజనీర్ల టీమ్‌కు జాక్‌పాట్ తగిలింది. వెంటనే ఎన్ఐఏ అధికారి రాకేశ్‌కు అందులో ఉన్న డేటాను పరిశీలించడాని ఢిల్లీ వెల్లాడు. ఓ వైపు ఎన్ఐఏ అధికారులు ఫోన్లో దొరికిన సమాచారాన్ని ఫోటోలను పరిశీలిస్తున్న సమయంలో.. మరో సంఘటన జరిగింది. ఒక వాహనం జమ్మూ నుంచి కాశ్మీర్‌లోకి ఎంటర్ అవుతుండగా పోలీసులకు అనుమానం కలిగి చెక్‌పోస్ట్ దగ్గర ఆపారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని నిలదీశారు. దీంతో వారు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు అడవిలోకి పారిపోయారు... వీరిని వెంబడించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఒకరిని సమీర్ దార్ గా గుర్తించారు. సమీర్ దార్‌ను విచారించిన తరువాత పుల్వామా ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆదిల్ దార్ కు ఇతను సోదరుడిగా గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు పుల్వామా దాడి తరువాత వచ్చిన వీడియోను సమీర్దార్కు చూపించారు. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి సూసైడ్ బాంబర్ ఆదిల్ దారేనని... అయితే ఆ గొంతుమాత్రం అతనిది కాదని చెప్పాడు. గతంలోనే ఆ వీడియోను పూర్తిగా పరిశీలించిన ఫొరెన్సిక్ అదికారులు ఇది డబ్బింగ్ చెప్పిన వీడియో అని చెప్పారు. చనిపోయింది సూసైడ్ బాంబర్ ఆదిల్ దార్... డీఎన్ఏ టెస్టులో ఇది నిర్ధరణ అయింది. మరి గొంతు ఎందుకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందో పోలీసులకు గతంలో అర్ధం కాలేదు. ఇప్పుడు విచారణలో సమీర్ ఆ గొంతు మరో ఉగ్రవాది హింజిలా జిహాదిది అని చెప్పాడు. దీంతో ఈ హంజిలా జిహాదీ ఎవరు దానిపై పోలీసులు విచారణ జరిపారు. ఈ హంజిలా జిహాది అనే వ్యక్తి పుల్వామాకే చెందిన ఒక కార్పెంటర్ అని పోలీసుల విచారణలో తేలింది. హంజిలా ఎక్కడున్నాడని పోలీసులు సాగించిన వేటలో... ఆర్టికల్ 370రద్దు సందర్భంగా అతడని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని తేలింది. దీంతో పోలిసు కస్టడీలో ఉన్న హంజిలాను తీసుకువచ్చి ఎన్ఐఏ విచారణ జరిపింది. ఇంతలో ఉగ్రవాది ఇద్రీస్ ఖాన్ ఐఫోన్లో ఉన్న ఫోటోలు కూడా ఎన్ఐఏ అధికారుల చేతికి అందాయి. ఇద్రీస్ఖాన్తో పాటు హంజిలా కూడా ఫోటోల్లో ఉన్నాడు. దీంతో పోలీసులు ఇద్రీస్‌ఖాన్ గురించి అడిగితే హంజిలా అతను ఇద్రీస్ కాదని.. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉమర్ ఫారూఖ్ అని చెప్పాడు. ఈ మొత్తం దాడిలో ఉమర్ ఫారూఖ్ కీలకం అని.. ఉమర్ ఫారూఖ్ సాక్ష్యాత్తూ పాకిస్థాన్‌లో ఉన్న మసూద్ అజ్హర్ అన్న కొడుకు అని హంజిలా చెప్పాడు. తానే స్వయంగా సూసైడ్ బాంబర్‌ను కారులో పుల్వామా హైవే వరకు తీసుకు వెళ్లానని... బాంబు పేలుతున్న సమయంలో అక్కడే ఉన్నానని హంజిలా కథ మొత్తం చెప్పాడు. పుల్వామా బాంబు దాడికోసం పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ దాదాపు రెండేళ్లుగా రెక్కి నిర్వహించింది. దీనికోసం పాకిస్థాన్ నుంచి మౌలానా మసూద్ అజ్హర్ అన్న కొడుకు ఉస్మాన్ హైదర్ 2017లో కాశ్మీర్‌లోకి చొరబడ్డాడు. అయితే అతను ఆపరేషన్ పూర్తి చేయకముందే భద్రతా దళాల ఎన్కౌంటర్లోచనిపోయాడు. దీంతో మళ్లీ అతని సోదరుడు ఉమర్ ఫారూఖ్‌ను ఇద్రీస్ భాయ్ అనే పేరుపెట్టి పాకిస్థాన్ నుంచి కాశ్మీర్‌లోకి చొప్పించారు. ఆప్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థల్లో శిక్షణ పొందిన ఉమర్ ఫారూఖ్... ఐఈడీలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. తాలిబాన్ క్యాంపుల్లో చాలాకాలం పాటు అమెరికా సైనికులతో పోరాడని ఉమర్ ఫారూఖ్... ఇండియాలో పెద్ద పేలుడు చేసే ఉద్దేశంతో కాశ్మీర్ సరిహద్దుల నుంచి ఇండియాలోకి ఎంటరయ్యాడు. వచ్చే సమయంలో తనతో పాటు పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ తెచ్చుకున్నాడు. 50లక్షల రూపాయలు హవాలాద్వారా ఈ ఆపరేషన్‌కు ఉపయోగించినట్లు సమచారం. ఇండియాకు వచ్చిన ఇద్రీస్ పుల్వామాలోని బిలాల్ అహ్మద్ కూచే అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. అక్కడే ఆదిల్ దార్‌ను పూర్తిగా సూసైడ్ బాంబర్‌గా మార్చడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చాడు. ఆదిల్ దార్ ఒక చిన్న దుకాణంలో పనిచేసేవాడు... అతడికి మతమౌఢ్యం ఎక్కించడంతో పాటు ఇండియాపై విషం నింపాడు. ఇక పేలుడుకు కావాల్సిన కారును సజ్జాద్ అహ్మద్ భట్ ద్వారా కొనుగోలు చేయించాడు. ఇక తనతో పాటు తెచ్చుకున్న ఆర్డీఎక్స్‌కు తోడుగా కావాల్సిన ఎలక్ట్రికల్ వస్తువులు, అల్యూమినియం పౌడర్ సైతం అమెజాన్ నుంచి కొనుగోలు చేశారు. అవేజ్ భోలా అనే యువకుడి అమెజాన్ అకౌంట్ ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు. ఇక కూచే అనే వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కూతురు ఇన్షాజాన్తో ఉమర్ ఫారూఖ్ ప్రేమాయణం నడిపాడు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు కూడా తరువాత అతని ఫోన్లో లభ్యమయ్యాయి. ఇక పేలుడుకు నెల రోజుల ముందే బిలాల్ అహ్మద్ కూచే ఇంట్లో ఆదిల్ దార్‌తో దాడి తరువాత విడుదల చేసే వీడియోను చిత్రీకరించారు. అయితే అందులో ఆదిల్ దార్ సరిగా మాట్లాడలేకపోవడంతో... హంజిలా జివాదీతో డబ్బింగ్ చెప్పించారు. ఈ వీడియోను పాకిస్థాన్‌కు పంపి...అక్కడ ఉన్న నాయకులతో దానిని ఓకే చేయించారు. ముందుగా ఫిబ్రవరి 5వ తేదీనే దాడి చేయాలనుకున్నా... ఆరోజు మంచు కారణంగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో బాంబులతో నింపిన కారును దాదాపు పదిరోజుల పాటు కారు కొనుగోలు చేసిన సజ్జాద్ భట్ ఇంటిదగ్గరే ఉంచారు. ఇక చివరిగా 14వ తేదీన పోలీసుల మూవ్మెంట్ చూసి పుల్వామా హైవేపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని సూసైడ్ బ్లాస్ట్ చేశారు. కేవలం గంట ముందు పాకిస్థాన్‌లో ఉన్న మసూద్ అజ్హర్ సోదరుడు తన చిన్నాన్న అమ్మార్ అల్వీకి ఫోన్ చేసి దాడి చేయాలన్న విషయంపై ఉమర్ ఫారూఖ్ పర్మిషన్ తీసుకున్నాడు. చివరి నిమిషంలో ఆదిల్ దార్ పారిపోతాడనే భయంతో...అక్కడికి హంజిలా జిహాదీని తోడుగా పంపించాడు. బయట ఉండి హంజిలా జిహాది బాంబు పేలే వరకు మొత్తం ఆపరేషన్ మానిటర్ చేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న హంజిలా జిహాది... ఈ విషయాలను పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షిటీవీ -
2019 పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి హతం
-
షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాసై భారత సైన్యం లో చేరిన నికిత
-
సైనిక దుస్తుల్లో సగర్వంగా.. మనసుల్ని కదిలించిన ఆ సెల్యూట్
జమ్మూ: చూడముచ్చటైన జంట. పెళ్లయి తొమ్మిది నెలలే అయింది. ఎన్నెన్నో కలలు. భవిష్యత్తుపై కలబోసుకున్న ఊసులు, ఆశలు. అది 2019 ఫిబ్రవరి 14. నితికా కౌల్ కాళ్ల కింద భూమి కంపించింది. భర్త... మేజర్ విభూతి శంకర్ ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడయ్యారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా జీవితం తల్లకిందులైపోతుంది. నిరాశానిస్పృహల్లో కూరుకుపోతారు. కాని నితికా కౌల్ వేరు. మనసులో దృఢ సంకల్పం.. సుస్పష్టమైన లక్ష్యం. దేశసేవలో అమరుడైన భర్త ఆశయాన్ని బతికిస్తూ... తానూ సైన్యంలో చేరాలి. అంతే శ్రమించింది... సాధించింది. దేశం గర్వపడేలా శనివారం లెఫ్టినెంట్ హోదాలో భారత సైన్యం అడుగుపెట్టింది. ఈ ధీశాలి మనోనిబ్బరానికి... అంతకుమించి ఆమె కర్తవ్యదీక్షకు దేశం సలాం కొడుతోంది. స్ఫూర్తిమంతమైన ఆమె విజయానికి ప్రశంసలు కురిపిస్తోంది. విధి నిర్వహణలో భర్త ప్రాణాలు కోల్పోయాక సరిగ్గా 27 నెలల తర్వాత నితికా కౌల్ సైతం భారత సైన్యంలో చేరడం గమనార్హం. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జైషే మొహమ్మద్ ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బలైన సంగతి తెలిసిందే. దేశంలో తీవ్ర ఆగ్రహజ్వాలలు. ఆర్మీ, పోలీసులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. పుల్వామా దాడి స్థలానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఫిబ్రవరి 18న ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా దాడి వెనకున్న ఇద్దరు అగ్రనేతలు ఇందులో ఉన్నారు. ఐదుగురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. వీరిలో 55 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ కూడా ఉన్నారు. డెహ్రాడూన్‌కు చెందిన ఆయనకు అప్పటికి కేవలం 9 నెలల ముందే కశ్మీర్ వాసి నితికా కౌల్‌తో వివాహం జరిగింది. వారిది ప్రేమ వివాహం. మరో మూడు నెలల్లో వివాహ మొదటి వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటుండగా మాతృభూమి సేవలో దౌండియాల్ ప్రాణాలు అర్పించారు. విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన మేజర్ దౌండియాల్‌కు భారత ప్రభుత్వం శౌర్యశక్ర పురస్కారం (మరణానంతరం) ప్రకటించింది. సంకల్ప బలంతో... భర్త దూరమైనప్పటికీ నితికా కౌల్ ధైర్యం కోల్పోలేదు. ఆయన ఆశయాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అందుకు సైన్యంలో చేరడమే మార్గమని నిశ్చయించుకున్నారు. ఢిల్లీలోని ఓ బహుళ జాతి సంస్థలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. పట్టుదలతో కష్టపడి చదివారు. గత ఏడాది షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షలో, అనంతరం ఇంటర్వ్యూలో నెగ్గారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో ఏడాదిపాటు విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు. లెఫ్టినెంట్ హోదాలో శనివారం సగర్వంగా సైన్యంలో అడుగుపెట్టారు. మనసుల్ని కదిలించిన ఆ సెల్యూట్ మేజర్ శంకర్ దౌండియాల్ అంత్యక్రియల సందర్భంగా ఆయన భార్య ప్రదర్శించిన మనోనిబ్బరం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్వస్థలం డెహ్రాడూన్‌లో దౌండియాల్ అంత్యక్రియలు జరిగాయి. సంబంధిత వీడియో దృశ్యాలు అప్పట్లో వైరల్‌గా మారాయి. నితికా తన భర్తకు కన్నీటి వీడ్కోలు పలికారు. గాలిలో ముద్దు (ఫ్లయింగ్ కిస్) ఇచ్చి, ‘లవ్ యూ... విభూ’ అంటూ భర్త పార్థివదేహానికి సెల్యూట్ చేయడం ప్రజల మనస్సులను కదిలించింది. నా భర్తకు మరింత చేరువయ్యా.. ‘‘సైన్యంలో చేరడం ద్వారా నా భర్తకు మరింత చేరువగా ఉన్నట్లు అనుభూతి చెందుతున్నా. సైన్యంలో అడుగుపెట్టడం నా భర్తకు నిజమైన నివాళి అని భావిస్తున్నా. మేజర్ దౌండియాల్ మరణంతో నా జీవితం తొలుత శూన్యంగా మారినట్లు తోచింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. సన్నిహితులు దూరమైతే మనోవేదన కలగడం సహజమే. అయినప్పటికీ వాస్తవ పరిస్థితిని అంగీకరించాలి. సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి. సైనికుడిగా పోరాడుతూ ప్రాణాలు అర్పించిన భర్త ఆశయాలను కొనసాగించాలంటే సైన్యంలో చేరడం మంచిదని నిర్ణయానికొచ్చా. భర్త మరణించాక 15 రోజులకు ఢిల్లీలో మళ్లీ ఉద్యోగంలో చేరా. మళ్లీ నా కాళ్లపై నేను నిలబడడానికి, బాధను మరచిపోవడానికి కొంతకాలం పనిచేసి, రాజీనామా సమర్పించా. షార్ట్ సర్వీసు కమిషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నా. దరఖాస్తును పూర్తి చేయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. భర్త అడుగు జాడల్లోనే నడిచే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది’’ – లెఫ్టినెంట్ నితికా కౌల్ -
భర్తకు నివాళిగా సైన్యంలో అడుగుపెట్టిన భార్య
సాక్షి, చెన్నై: పుల్వామాలో ఉగ్రవాదులతో పోరాడుతూ 2019 ఫిబ్రవరిలో భారత ఆర్మీ అధికారి మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన భార్య నితికా కౌల్ భారత సైన్యంలో లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు. నితికా కౌల్ శనివారం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించారు. ఆమె తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి తన భర్తకు నివాళిగా షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షను క్లియర్ చేసి సైన్యంలో చేరారు. కాగా దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్లో స్పందిస్తూ...నితికా కౌల్‌కు అభినందనలు తెలిపారు. "లెఫ్టినెంట్-నితికా కౌల్, మీరు భారతదేశ నారీ శక్తి స్వరూపం. మీ అంకితభావం, సంకల్పం, భక్తి గొప్పది. మేజర్ విభూతి ధౌండియాల్ ఈ రోజు మీ భుజంపై ఉన్న నక్షత్రాలను చూసి ఆనందం, గర్వంతో నవ్వుతారు.’’ అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: వైరల్ వీడియో: పోలీస్‌పై గ్రామస్థుల విచక్షణ రహిత దాడి) -
బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్: ‘కోతి ఖతమైంది’
న్యూఢిల్లీ: 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం తర్వాత భారతదేశం దాయాది పాకిస్తాన్‌పై చేసిన మొదటి వైమానకి దాడి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బాలకోట్‌లోని ఉగ్ర స్థావరంపై చేసిన దాడికి నేటితో రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం 2019, ఫిబ్రవరి 26న తెల్లవారుజామున 3.30 గంటలకు భారత మిరాజ్ 2000 ఫైటర్ జెట్స్ ఎల్ఓసీని దాటుకుని.. పాకిస్తాన్ బాలకోట్‌లోని జైషే మహ్మమద్ టెర్రర్ క్యాంప్‌పై దాడి చేశాయి. ఉరి, బాలాకోట్‌పై జరిగిన వైమానిక దాడులతో పాక్‌కు భారత సామార్థ్యం మరోసారి తెలిసి వచ్చింది. ఇక రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాటి ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్‌కు పెట్టిన పేరుతో పాటు నాడు ఓ క్షిపణి విఫలమయ్యిందనే వివరాలు వెలుగులోకి వచ్చాయి. నాటి ఆపరేషన్‌లో మన మిరాజ్ ఫైటర్ జెట్స్‌ని ఎదిరించేందుకు.. పాక్ తన ఎఫ్ 16 ఫైటర్ జెట్స్‌ని రంగంలోకి దింపింది. కాని ప్రయోజనం లేకపోయింది. ఈ దాడిలో ఐఏఎఫ్ మిరాజ్ 2000 యోధులు తమ స్పైస్ 2000 పెనెట్రేటర్ బాంబులను విడుదల చేశాయి. ఇవి ఒక్కొక్కటి 90 కిలోల పేలుడు పదార్థాలతో నిండి ఉంటాయి. సరిగ్గా పావుగంట తర్వాత అనగా 3.45 గంటలకు ఎయిర్ చీఫ్ బీఎస్ ధనోవా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందనే సమాచారం ఇచ్చారు. ప్రత్యేక ఆర్ఏఎక్స్ నంబర్ ద్వారా టెలిఫోన్ కాల్ చేసిన ధనోవా హిందీలో బందర్ మారా గయా(కోతి చంపబడింది) అని తెలిపారు. అంటే పాకిస్తాన్, బాలకోట్లో ఉన్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ టెర్రరిస్ట్ శిక్షణా క్యాంప్‌ని సరిహద్దు దాటి సాహసోపేతమైన ముందస్తు ఆపరేషన్‌లో భారత్ నాశనం చేసింది అని అర్థం. ఆర్ఏఎక్స్ అనేది అల్ట్రా-సేఫ్డ్ ఫిక్స్డ్-లైన్ నెట్వర్క్. అజిత్ దోవల్‌తో మాట్లాడిన అనంతరం ధనోవా అప్పటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రా సెక్రటరీ అనిల్ ధస్మానాకు తెలియజేశారు. ఆ తర్వాత దోవల్ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌ను గందరగోళపరిచేందుకు ‘బందర్’ అనే కోడ్ పేరును ఉద్దేశపూర్వకంగా ఎన్నుకున్నట్లు బాలకోట్ దాడిలో పాల్గొన్న ఉన్నతాధికారులు వెల్లడించారు. చదవండి: బాలాకోట్ దాడి: సంచలన విషయాలు వెల్లడి పుల్వామా దాడిపై పాక్ సంచలన ప్రకటన -
ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తాం
కర్నాల్: డిమాండ్లను పరిష్కరించే వరకు రైతులు ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. కర్నాల్ జిల్లా ఇంద్రి ధాన్యం మార్కెట్లో ఆదివారం జరిగిన మహాపంచాయత్‌లో ఆయన ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతు సంఘాలకు చెందిన 40 మంది నేతలు మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తారని వెల్లడించారు. ‘డిమాం డ్లకు అంగీకరించకుండా, రైతు సంఘాలతో చర్చలు జరపకుండా ఉన్నంత కాలం ప్రభుత్వాన్ని ప్రశాంతంగా కూర్చో నివ్వకుండా చేస్తాం’అన్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసం హరించుకోవాల్సిందేననీ, అప్పటి దాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలతో ప్రజా పంపిణీ వ్యవస్థ అంతమ వుతుందన్నారు. రైతులతోపాటు చిన్న వ్యాపా రులు, రోజు కూలీలు తదితరులపైనా ఈ చట్టాలు ప్రభావం చూపుతాయని తికాయత్ చెప్పారు. ఆకలితో వ్యాపారం చేయడాన్ని అనుమతించబో మని తెగేసి చెప్పారు. కొత్త చట్టాలు కార్పొరేట్లకు అనుకూలమనే విషయం రైతులకు తెలియదను కుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింఘు బోర్డర్లో జరుగుతున్న ఆందోళనలే రైతు నిరసనలకు కేంద్ర బిందువుగా ఉంటాయన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేశ్ తికాయత్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఘాజీపూర్ వద్ద రెండు నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
యుద్ధ ట్యాంకర్ల హబ్‌గా తమిళనాడు
సాక్షి, చెన్నై: మోటార్ వాహన ఉత్పత్తిలోనే కాదు, యుద్ధ ట్యాంకర్ల ఉత్పత్తిలోనూ హబ్‌గా తమిళనాడు మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత ఆర్మీని అపార శక్తివంతంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. డీఆర్డీఓ దేశీయంగా తయారు చేసిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంక్(ఎంకే–1ఏ)ను భారతీయ సైన్యానికి అప్పగించారు. చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంలతో కలిసి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. మెట్రో సేవలు.. రూ.3,770 కోట్లతో పూర్తయిన చెన్నై వాషర్మెన్ పేట–విమ్కోనగర్ మధ్య మెట్రో రైలు, రూ.293 కోట్లతో పూర్తి చేసిన చెన్నై బీచ్–అత్తిపట్టు మధ్య 4వ ట్రాక్‌లో, రూ.423 కోట్లతో విద్యుద్దీకరించిన విల్లుపురం–తంజావూరు – తిరువారూర్ మార్గంలో రైలు సేవలకు జెండా ఊపారు. తంజావూరు, పుదుకోట్టైలకు సాగు నీరు అందించడం లక్ష్యంగా రూ. 2,640 కోట్లతో చేపట్టనున్న కళ్లనై కాలువ పునరుద్ధరణ పనులకు, రూ.1000 కోట్లతో చెంగల్పట్టు జిల్లా తయ్యూరు సమీపంలో 163 ఎకరాల్లో నిర్మించనున్న ఐఐటీ డిస్కవరీ క్యాంపస్ పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నై ఆవడిలోని ఆర్మీ ఫ్యాక్టరీలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో 71 సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న అర్జున యుద్ధ ట్యాంకర్‌ను భారత ఆర్మీకి అందించారు. ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలిత చిత్ర పటాలకు మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ దశాబ్దం భారత్‌దేనని, కోవిడ్–19పై పోరు విషయంతో సహా అన్ని విషయాలలో ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని ప్రధాని తెలిపారు. ఏప్రిల్ నెలలో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంలతో కలిసి ప్రధాని మోదీ చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలను తన ప్రసంగంలో ప్రధాని కొనియాడారు. తమిళ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. శ్రీలంక తమిళుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి కోసం అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జాఫ్నాలో పర్యటించిన ఏకైక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తానే కావడం తనకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. శ్రీలంకలోని తమిళుల హక్కుల గురించి ఆ దేశంతో చర్చించామని వెల్లడించారు. దేశీయంగా తయారు చేసిన మార్క్1ఏ ట్యాంక్‌ను ఆర్మీకి అప్పగిస్తున్న సందర్భంగా సైన్యంతో మోదీ ప్రతి నీటి చుక్క కీలకం.. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళంలో వణక్కం చెన్నై.. వణక్కం తమిళనాడు అంటూ తన ప్రసంగాన్ని మొదలెట్టారు. తమిళనాడు రైతులు ఇక్కడి వనరుల్ని సద్వినియోగం చేసుకుని ఆహార ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నారని కొనియాడారు. ప్రతి నీటి చుక్క కీలకం అని, పొదుపు గురిం చి వివరిస్తూ భావితరాల కోసం జల, వనరుల పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తక్కువ జల వినియోగంతో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. చెన్నై మెట్రో ఫేజ్–2కు బడ్జెట్లో రూ. 63 వేల కోట్లను ప్రకటించామని గుర్తుచేశారు. ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తున్నాయని, ఇది 130 కోట్ల మంది శ్రమ ఫలితమని పేర్కొన్నారు. పుల్వామా అమరులకు నివాళి.. రెండేళ్ల క్రితం ఇదే రోజున (ఫిబ్రవరి 14) పుల్వామా దాడి జరిగిందని గుర్తు చేస్తూ, ఆ దాడిలో అమరులైన వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమిళ కవి సుబ్రమణ్య భారతియార్ రాసిన ‘ఆయుధం సెయ్‌వోం...(ఆయుధం తయారు చేద్దాం)’ అన్న కవితను గుర్తు చేస్తూ, డిఫెన్స్ కారిడార్‌కు తమిళనాడు ఎంపికైనట్టు తెలిపారు. మోటారు వాహన ఉత్పత్తిలోనే కాదు, యుద్ధట్యాంకర్ల ఉత్పత్తికి హబ్‌గా తమిళనాడు మారిందని పేర్కొంటూ, తాజాగా ఆర్మీకి అంకితం ఇచ్చిన ఎంకే–1ఏ గురించి వివరించారు. భారత ఆర్మీ శాంతియుతంగా సరిహద్దుల్లో దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నదని కొనియాడారు. ప్రపంచ స్థా యి ప్రమాణాలతో ఐఐటీ డిస్కవరీ రూపుదిద్దుకోబోతున్నదని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానికి బ్రహ్మరథం పట్టే రీతిలో చెన్నైలో ఆహ్వానం లభించింది. ప్రధాని పర్యటన సందర్భం గా చెన్నైలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బీపీసీఎల్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ జాతికి అంకితం కొచ్చి: కేరళలో పలు అభివృద్ధి పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 6 వేల కోట్ల విలువైన బీపీసీఎల్‌కు చెందిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేశారు. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను, మెరైన్ ఇంజినీరింగ్ శిక్షణ కేంద్రం ‘విజ్ఞాన సాగర్’ను ప్రారంభించారు. పెట్రో కెమికల్ ప్రాజెక్టుతో అక్రిలిక్ యాసిడ్, ఆక్సో ఆల్కహాల్, అక్రిలేట్స్ తదితర ఉత్పత్తుల దిగుమతులు తగ్గి గణనీయ మొత్తంలో విదేశీ మారకం ఆదా అవుతుందన్నారు. బోల్గట్టి, విలింగ్డన్ ఐలండ్ మధ్య జల మార్గ రవాణా కోసం రెండు నౌకలను ప్రారంభించారు. కేరళలో పర్యాటక రంగ మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు. కొచ్చిలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు అందులో భాగమేనన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేరళ బీజేపీ నేతలతో మోదీ సమావేశమయ్యారు. ఎన్నికల్లో కేంద్రం అభివృద్ధి పథకాలను ప్రధానంగా ప్రచారం చేయాలన్నారు. -
పుల్వామా తరహా దాడికి ఉగ్రవాదుల కుట్ర
న్యూఢిల్లీ : జమ్మూ,కశ్మీర్ పోలీసులు పుల్వామా తరహా ఉగ్రవాద దాడి కుట్రను భగ్నం చేశారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకోవటంతోపాటు పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలను స్వాధీనం చేస్తున్నారు. పుల్వామా దాడి జరిగి నేటికి రెండేళ్లు అవుతున్న సందర్బంగా అదే తరహా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని మూడు రోజులక్రితం పోలీసులకు సమాచారం అందింది. దీంతో జమ్మూ,కశ్మీర్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పుల్వామా జిల్లాలో సుహాలి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనుంచి ఆరున్నర కేజీల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్‌నుంచి వచ్చిన మెసేజ్‌తో పుల్వామాలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు విచారణ సందర్భంగా సుహాల్ తెలిపాడు. చంఢీఘడ్‌లో ఖాజీ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ( అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ) అంతేకాకుండా సాంబ జిల్లాలో 15 చిన్నచిన్న ఐఈడీలు, ఆరు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను డ్రోన్‌నుంచి పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై జమ్మూ,కశ్మీర్ డీజీపీ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు జైషే ఈ మహ్మద్, లష్కర్లు ‘ది రెసిస్టంట్ ఫ్రంట్, లష్కర్ ఈ ముస్తఫా’ అనే రెండు కొత్త గ్రూపులను తయారు చేశాయి. గతవారం లష్కర్ ఈ ముస్తఫా చీఫ్ హిదయతుల్లాను ఆరెస్ట్ చేశాం. ఇతడు న్యూఢిల్లీలోని ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ ఆఫీసుపై రెక్కీ నిర్వహించాడు’’ అని తెలిపారు. -
బాలాకోట్ దాడి: సంచలన విషయాలు వెల్లడి
ఇస్లామాబాద్: దాయాది దేశం కుట్ర పన్ని చేసిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత్ బాలకోట్ ఉగ్రస్థావారలపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఇక నాటి దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇవ్వన్ని గాలి మాటలే.. అంతమంది చనిపోతే.. రక్తం ఎక్కడ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. (చదవండి: దేశమంతా శోకంలో ఉంటే నీచ రాజకీయాలా?) ఓ ఉర్దు చానెల్ డిబెట్లో పాక్ దౌత్యవేత్త ఆఘా హిలాలీ మాట్లాడుతూ.. ‘భారతదేశం అంతర్జాతీయ సరిహద్దును దాటి.. ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఈ ఘటనలో కనీసం 300 మంది మరణించారు. ఇందుకు మేం బదులు తీర్చుకుంటాం. కానీ మా లక్ష్యం వేరు. మేం వారి హై కమాండ్ని టార్గెట్ చేశాం. అది మా చట్టబద్ధమైన లక్ష్యం. ఇక మేం సర్జికల్ దాడులు జరిగాయి కానీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రకటించాం. వారు ఎంత నష్టం కలిగించారో.. మేం కూడా అంతే నష్టం వారికి కలగజేస్తాం. ఎక్కువ చేయం’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. -
దేశమంతా శోకంలో ఉంటే నీచ రాజకీయాలా?
కేవాడియా: 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన పుల్వామా దాడి ఘటనలో వాస్తవాలను పాకిస్తాన్ పార్లమెంట్లో అక్కడి నేతలు అంగీకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన జవాన్లు వీర మరణం పొందితే దేశమంతా సంతాపం వ్యక్తం చేస్తుండగా, కొందరు మాత్రం స్వప్రయోజనాల కోసం నీచ రాజకీయాలకు తెరతీశారని పరోక్షంగా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. భారత భూభాగాన్ని కాజేయాలని చూస్తున్న శక్తులకు సరిహద్దుల్లో మన సైనికులు సరైన సమాధానం చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా శనివారం గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కేవాడియాలో సర్దార్ ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఇక్కడ నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుల్వామా దాడి ఘటన తర్వాత ఇండియాలో కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలను, వారి నీచ రాజకీయాలను దేశం మరచిపోదని చెప్పారు. పొరుగు దేశం పాకిస్తాన్ పార్లమెంట్లో వాస్తవాలను అంగీకరించిన తర్వాత అలాంటి వ్యక్తుల నిజ స్వరూపం బట్టబయలైందని పేర్కొన్నారు. సైనిక దళాల మనోసై్థర్యాన్ని దెబ్బతీయకండి పుల్వామా దాడి తర్వాత తనపై కొందరు వ్యక్తులు విమర్శలు చేసినా, దారుణమైన పదాలు ఉపయోగించినా మౌనంగానే ఉన్నానని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఏ స్థాయికైనా దిగజారుతారని అన్నారు. సైనిక దళాల మనోస్థై్ౖథర్యాన్ని దెబ్బతీసే రాజకీయాలకు పాల్పడవద్దని రాజకీయ పార్టీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. మీ స్వలాభం కోసం జాతి వ్యతిరేక శక్తుల చేతుల్లో పావులుగా మారకండి అని రాజకీయ నాయకులకు హితవు పలికారు. రామాలయం నిర్మాణానికి ప్రజలే సాక్షులు సోమనాథ్ ఆలయ నిర్మాణం ద్వారా భారత సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు సర్దార్ పటేల్ యజ్ఞానికి శ్రీకారం చుట్టారని, ప్రస్తుతం ఆ యజ్ఞం అయోధ్యలో కొనసాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. భవ్య రామమందిరం నిర్మాణానికి ప్రజలు సాక్షులుగా నిలుస్తున్నారని తెలిపారు. సీప్లేన్ సేవలను ప్రారంభించిన మోదీ కేవాడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకు సీప్లేన్ సేవలను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. నీటిపై, గాలిలో ప్రయాణించే విమానాన్ని సీప్లేన్ అంటారు. ఐక్యతా శిల్పం నుంచి సీప్లేన్‌లో మోదీ ప్రయాణించారు. 40 నిమిషాల్లో సబర్మతి రివర్‌ఫ్రంట్‌కు చేరుకున్నారు. ఈ రెండింటి మధ్య దూరం 200 కిలోమీటర్లు. సీప్లేన్ సర్వీసును స్పైస్‌జెట్ సంస్థకు చెందిన స్పైస్ షటిల్ సంస్థ నిర్వహిస్తోంది. అహ్మదాబాద్–కేవాడియా మధ్య నిత్యం రెండు ప్లేన్లను నడపనుంది. ఒక వైపు ప్రయాణానికి రూ.1,500 రుసుం వసూలు చేస్తారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నీటిపై సీప్లేన్ ల్యాండ్ అవుతుంది. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన అహ్మదాబాద్: నిర్ణయాలు తీసుకునేటప్పు డే దేశ హితాన్ని, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని ప్రొబేషనరీ సివిల్ సర్వీస్ అధికారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన అనే మంత్రాన్ని పాటించాలని ఉద్బోధించారు. నిత్యం వార్తల్లో ఉండేం దుకు ప్రయత్నించకూడదని చెప్పారు. రొటీ న్కు భిన్నంగా పనిచేస్తేనే గుర్తింపు వస్తుం దన్నారు. మోదీ శనివారం కేవాడి యా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొబే షనరీ సివిల్ సర్వీసు అధికారులను ఉద్దేశిం చి మాట్లాడారు. పాలనలో మీలాంటి అధికారుల పాత్ర వల్లే దేశం ప్రగతి సాధిస్తోందని అన్నారు. ప్రజలు సాధికారత సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వారి జీవితాల్లో మితిమీరి జోక్యం చేసుకోవద్దన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. కేవలం విధానాలపైనే(పాలసీలు) ఆధార పడి ప్రభుత్వం నడవకూడదన్నారు. -
‘పాక్ ప్రకటనతో వారి నిజస్వరూపం బయటపడింది’
గాంధీనగర్/కేవాడియా: గతేడాది పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి సమయంలో ప్రతిపక్షాలు దారుణంగా వ్యవహరించాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. దేశం తన బిడ్డలను కోల్పోయిన బాధలో ఉంటే.. కొందరు మాత్రం తమ స్వార్థం చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా దాడి గురించి పాకిస్తాన్ మంత్రి తమ పార్లమెంట్లో చేసిన ప్రకటనతో మన ప్రతిపక్షాల నిజస్వరూపం ఏంటో జనాలకు తెలిసింది అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద మోదీ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఇక్కడ పరేడ్ నిర్వహించిన అధికారులను చూస్తే.. నా మదిలో పుల్వామా దాడి ఘటన మెదిలింది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను ఎన్నటికి మరువం. దేశం బిడ్డలను కోల్పోయి బాధపడుతుంటే.. కొందరు మాత్రం స్వార్థపూరితంగా ప్రవర్తించారు’ అన్నారు. (చదవండి: పాక్‌లో ‘పుల్వామా’ చిచ్చు) ‘పుల్వామా దాడిలో కూడా తమ లాభాన్నే చూసుకున్నారు. ఆనాడు వారు చేసిన వ్యాఖ్యలను దేశం మరవదు. వారి ఆరోపణలను నేను మౌనంగా భరించాను. రాజకీయ లబ్ధి కోసమే వారు ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు. కాన ఇప్పుడు పాకిస్తాన్ తమ పార్లమెంట్లో చేసిన ప్రకటనతో నిజం బయటపడింది. దాంతో ఈ ఘటనపై రాజకీయాలు చేసిన వారి నిజస్వరూపం కూడా బయటపడింది. ఈ సందర్భంగా నేను కోరేది ఒక్కటే.. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి రాజకీయాలు చేయకండి’ అన్నారు మోదీ. ఉగ్రవాదంపై భారత్ నిరంతర పోరు సాగిస్తుందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, హింసతో ఏ ఒక్కరూ ప్రయోజనం పొందలేరని పరోక్షంగా పాక్‌కు చురకలంటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని మోదీ పేర్కొన్నారు -
పాక్‌లో ‘పుల్వామా’ చిచ్చు
పాకిస్తాన్ పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో పాలక, ప్రతిపక్షాలు పరస్పరం చేసుకున్న విమర్శలు, ఆరోపణలు ఆ దేశంలో మాత్రమే కాదు... మన దేశంలో కూడా వాగ్యుద్ధానికి దారితీశాయి. ఇదేమీ కొత్తగాదు. తమ పాలకుల్ని విమర్శించాలంటే రెండు దేశాల్లోనూ విపక్షాలకు దొరికే మొదటి ఆయుధం పొరుగు దేశమే. అవతలి దేశం ముందు మోకరిల్లారని పాలకులపై ఆరోపణ చేస్తే రాజ కీయంగా వారిని దెబ్బతీసినట్టవుతుందని విపక్షాలు అనుకుంటాయి. విపక్షాలను అవతలి దేశానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తే, వారికి రాజకీయంగా పుట్టగతులుండవని పాలకపక్షం విశ్వసి స్తుంది. తాజాగా మొన్న బుధవారం జాతీయ అసెంబ్లీలో విపక్ష పీఎంఎల్(ఎన్) నాయకుడు ఆయాజ్ సాదిక్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆ క్రమంలో ఆయన పాక్ సైన్యానికి బందీగా పట్టుబడిన మన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఉదం తాన్ని కూడా ప్రస్తావించారు. నిరుడు ఫిబ్రవరిలో పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 43మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉదంతం తర్వాత భారత్ విమానాలు చేసిన దాడులతో పాక్ పాలకులు, సైనిక దళాల చీఫ్ వణికారని సాదిక్ విమర్శించారు. అభినందన్ బందీగా చిక్కితే, ఆయన్ను భారత్‌కు అప్పగించేవరకూ పాలకులకు నిద్రపట్టలేదని అన్నారు. ఆరోజు విదేశాంగ మంత్రి షా మెహ్మూద్ ఖురేషీ అఖిలపక్ష సమావేశం పెట్టి అభినందన్‌ను వెంటనే విడుదల చేయకుంటే ఆ రాత్రికి భారత్ మనపై దాడి చేసే ప్రమాదమున్నదని చెప్పారని వెల్లడించారు. ఆ భేటీకి రావాల్సిన ఇమ్రాన్ మొహం చాటేయగా, వచ్చిన విదేశాంగమంత్రి వదిలేద్దామంటూ బేరం పెట్టారని, ఇక ఆర్మీ చీఫ్ కమార్ జావేద్ బజ్వాకైతే కాళ్లు వణుకుతూనే వున్నాయని ఆయాజ్ ఎద్దేవా చేశారు. సాదిక్ చేసిన ఈ దాడితో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ సర్కారు సీనియర్ మంత్రి ఫవాద్ చౌధరిని రంగంలోకి దించింది. ఆయన గురువారం జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఘనత ఎలాంటిదో ఏకరువు పెట్టారు. ‘పుల్వామాలోకి ప్రవేశించి మరీ మనం భారత్‌పై దాడి చేశామ’ని చెప్పారు. పుల్వామా విజయం ఈ దేశ విజయమని ఫవాద్ చెప్పుకొచ్చారు. సహ ఎంపీలే ఇందుకు అభ్యంతరం చెప్పడంతో ఆయన వెంటనే స్వరం మార్చి, పుల్వామా దాడి అనంతరం పాక్ సైన్యం భారత్‌లోకి చొచ్చుకెళ్లి దాడి చేశాయని సవరించుకున్నారు. అయితే పుల్వామాలో విజయం సాధించా మన్న వ్యాఖ్యను వెనక్కి తీసుకోలేదు. పైగా అఖిలపక్ష సమావేశంలో జరిగినదాన్ని వెల్లడించి సాదిక్ జాతిని అవమానించారంటూ చెప్పారు. ఇప్పుడు ఎవరేమి చెప్పుకుంటున్నా పుల్వామా ఉగ్ర దాడి పాక్ పనేనని అప్పట్లోనే మన దేశం స్పష్టంగా ప్రకటించింది. జైషే మొహమ్మద్ పాక్ సైన్యం ప్రాపకంతో పనిచేస్తున్న సంగతి అంతర్జాతీ యంగా అందరికీ తెలుసు. దాని అధిపతి మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి నిరుడు ఉగ్రవాదిగా ప్రకటించింది. కనుక పుల్వామా దాడి తమ పనే అని ఫవాద్ చెప్పడం ద్వారా కొత్తగా ఆయన వెల్లడిం చిందేమీ లేదు. దాన్ని ఆయన అధికారికంగా ధ్రువీకరించారంతే. సాదిక్ మాటలతో జాతికి అవ మానం జరిగిందని ఫవాద్ అనడం సిగ్గు చేటు. అంతకన్నా పొరుగు దేశంపై ఉగ్రవాద దాడి ఘటన తమ ఘనతగా చెప్పడమే జాతికి అవమానకరమైనది. దేశాల మధ్య విభేదాలొచ్చినప్పుడు దౌత్య పరంగా చర్చించుకోవడం ఏ దేశమైనా చేయాల్సిన పని. ఇచ్చిపుచ్చుకునే వైఖరితో వుంటే ఎంతటి క్లిష్ట సమస్య అయినా పరిష్కారమవుతుంది. యుద్ధం సరేసరి. కానీ దొంగచాటుగా ఒక కిరాయి మనిషిని ప్రవేశపెట్టి ఆత్మాహుతి దాడి చేయించి, అదేదో ఘనకార్యంగా చెప్పుకోవడం వల్ల ఒరిగేదే మిటి? నిజంగా అది ఘనకార్యమనుకుంటే అప్పుడే ఆ మాట ప్రపంచానికి ధైర్యంగా వెల్లడించ వలసింది. పర్యవసానాలకు సిద్ధపడవలసింది. పుల్వామా దాడికి తెగించినవారు అఖిలపక్ష సమా వేశం సమయానికి ఎందుకంత నీరుగారి పోయారు? ఎందుకా ముచ్చెమటలు? దేశంలో ఇమ్రాన్ సర్కార్ అన్నివిధాలా విఫలమై, విపక్షాలు బలపడుతున్నాయి. ఉపాధి లేమి, అధిక ధరలు, అవినీతి తదితర అంశాల్లో ప్రభుత్వం విఫలమవుతున్న తీరుతో జనంలో అసంతృప్తి పెరిగింది. ఇటీవల విపక్షాలు పెట్టిన సభ విజయవంతం కావడం ఇందుకు తార్కాణం. వీటికితోడు భారత్ దాడి చేస్తుందని పాలకులు వణికారని పీఎంఎల్(ఎన్) వెల్లడించడంతో ఏదోరకంగా తమ గొప్పతనాన్ని చాటుకునే క్రమంలో పుల్వామా దాడిపై ఫవాద్ నిజం చెప్పివుండొచ్చు. ఉగ్రవాదులకు నిధులందించే అనుమానిత దేశాల జాబితానుంచి పాక్‌ను తొలగించడానికి రెండురోజులక్రితమే 39మంది సభ్యుల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) నిరాకరించింది. ఉగ్రవాదులకు తోడ్పడుతున్నదని నిర్ధారణైతే ఆ సంస్థ పాక్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశం వుంది. అదే జరిగితే ఆర్థికంగా పాకిస్తాన్ మరిన్ని సమస్యలు ఎదుర్కొనవలసివుంటుంది. స్వయంగా మంత్రే పుల్వా మాలో తమ ప్రమేయాన్ని అంగీకరించారు గనుక మున్ముందు ఎఫ్ఏటీఎఫ్ ఏం చేస్తుందో చూడాలి. -
పుల్వామా దాడి; పాక్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: పుల్వామా దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనీ, ఆ ఘటన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విజయమని ఆ దేశ మంత్రి ఒకరు ప్రకటించడం సంచలనం రేపింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవద్ చౌధరి ఈ మేరకు ప్రకటన చేశారు. ‘‘భారత్‌ను వారి దేశంలోనే గట్టి దెబ్బ తీశాం. పుల్వామా విజయం ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో మన జాతి సాధించిన విజయం. ఈ విజయంలో మీరు, మేము, మనందరమూ భాగస్వాములమే’’అని అన్నారు. పుల్వామాలో విజయం అని మంత్రి పేర్కొనడంపై సభలో కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఫావద్ మీడియాతో మాట్లాడుతూ.. పుల్వామా ఘటన అనంతరం పాక్ బలగాలు దాడి చేసేందుకు భారత్ భూభాగంలోకి వెళ్లగలిగాయని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పుల్వామాలో విజయం అన్న వ్యాఖ్యలను మాత్రం వెనక్కు తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. అభినందన్‌ని విడుదల చేయకపోతే భారత్ దాడి చేస్తుందని ఆర్మీ చీఫ్‌కే కాళ్లలో వణుకు పుట్టినట్టుగా పీఎంఎల్–ఎన్ నేత అయాజ్ సాధిక్ ప్రకటన చేసిన నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన చౌధరి ఈ వ్యాఖ్యలు చేశారు. సాధిక్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ‘ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, జాతిని కించపరచడం తగదు’ అని తెలిపారు. గత ఏడాది జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత్ జవాన్లు నేలకొరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రెండు దేశాల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. కాళ్లు వణికాయి.. చెమటలు పట్టాయి మేజర్ అభినందన్ వర్ధమాన్.. ఈ పేరు వింటేనే చాలు భారతీయుల గుండెలు ఉప్పొంగుతాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామా దాడి ఘటన అనంతరం పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రదర్శించిన శౌర్య పరాక్రమాలకు సాక్షాత్తూ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా వెన్నులో వణుకు పుట్టింది. ‘‘బాజ్వా కాళ్లు వణికాయి, నుదుటంతా చెమటలు పట్టాయి, పాక్ చెరలో ఉన్న అభినందన్‌ను విడుదల చేయకపోతే భారత్ ఎక్కడ దాడికి దిగుతుందోనని ఆయన నిలువెల్లా వణికిపోయారు’’అని పాకిస్తాన్ ఎంపీ, పాక్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నాయకుడు సర్దార్ అయాజ్ సాధిక్ బుధవారం పార్లమెంటులో వెల్లడించారు. పుల్వామా దాడి ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ఫిబ్రవరి 26, 2019న భారత్ బాంబులతో దాడి చేసింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య జరిగిన వైమానిక పోరులో పాక్ యుద్ధవిమానం ఎఫ్–16ని అభినందన్ మిగ్–21 విమానంతో వెంబడించారు. పాక్ విమానాన్ని కూల్చేశారు. అదే సమయంలో మిగ్ విమానం పాక్ భూభాగంలో కూలిపోవడంతో అభినందన్‌ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆనాటి సమావేశంలో ఏం జరిగిందంటే..! మేజర్ అభినందన్ వర్ధమాన్‌ను పాక్ చెరలోకి తీసుకున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో పాక్‌లో పార్లమెంటరీ పార్టీ నాయకులతో కూడిన ఉన్నతస్థాయి సమావేశంలో జరిగిన విషయాలను సాధిక్ వెల్లడించారు. ‘‘ఆనాటి సమావేశానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి సమావేశంలో ఉన్నారు. అప్పుడే గదిలోకి వచ్చిన ఆర్మీ చీఫ్ బాజ్వా కాళ్లు వణుకుతున్నాయి. శరీరమంతా చెమటలతో నిండిపోయింది. చర్చలు జరిగిన అనంతరం ఖురేషి అభినందన్‌ను వెంటనే విడుదల చేయనివ్వండి. లేకపోతే భారత్ రాత్రి 9 గంటలకి మన దేశంపై దాడికి దిగుతుందని ఖురేషి అన్నారు’’ అంటూ సాధిక్ ఆనాటి సమావేశ వివరాలను గుర్తు చేసుకున్నారు. భారత్ దాడి చేయడానికి సన్నాహాలు చేయకపోయినా, పాక్ సర్కార్ భారత్ ముందు మోకరిల్లి అభినందన్‌ని అప్పగించిందంటూ సాధిక్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై మాటల తూటాలు విసిరారు. తన మాటల్ని వక్రీకరించారంటూ ఆ తర్వాత సాధిక్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. -
పుల్వామా దాడిపై పాక్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడి వెనుక దాయాది దేశం పాకిస్తాన్ హస్తం ఉందన్న భారత్ అనుమానం నిజమైంది. 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో చోటుచేసుకున్న విధ్వంసం వెనుక తామ దేశ హస్తం ఉందని పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామ ఉగ్రదాడి తమ పనేనని ప్రకటించుకున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలో సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. భారత్‌ను సొంతగడ్డపైనే దెబ్బతీశామని, ఇమ్రాన్ ప్రభుత్వాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. గురువారం ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. పుల్వామా ఉగ్రదాడికి భారత్‌కు చెందిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి పాల్పడినట్టు తొలుత ప్రకటించుకుంది. అయితే అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ దాడి వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందని భారత నిఘా వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. తాజాగా పాక్ మంత్రి ప్రకటనతో.. భారత్ అనుమానం నిజమైంది. ఈ నేపథ్యంలో దాయాది దేశంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ మంత్రి ప్రకటనపై స్పందించిన భారత విదేశాంగ శాఖ పూల్వామా దాడి వెనుక పాక్ ఉందని ప్రపంచానికి తెలుసు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ బహిరంగంగానే సమర్థించుకుంటోంది. పాక్ నిజస్వరూపాన్ని ఇప్పటికైనా ప్రపంచం తెలుసుకోవాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్‌ను క్షమించొద్దు. -
తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!
శ్రీనగర్: పుల్వామా దాడితో భారత సైన్యంపై విరుచుకుపడిన ఉగ్రవాదులు మరోసారి అలాంటి పథకాన్నే రచించారు. అయితే, భద్రతా బలగాల ఉమ్మడి సెర్చ్ ఆపరేష్‌తో వారి కుట్రలు భగ్నమయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల సమయంలో గడీకల్ ప్రాంతంలోని కెవారాలో హైవే పక్కన 52 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించామని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. హైవే పక్కన ఉన్న పండ్లతోటలో భూమిలో పాతిపెట్టిన ప్లాస్టిక్ ట్యాంక్‌లో ఈ మొత్తం బయటపడిందని తెలిపింది. పుల్వామా ఘటన జరిగిన ప్రాంతానికి 9 కిలో మీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉందని వెల్లడించింది. 125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. ఆ ప్రాంతంలోనే మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్‌లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. కాగా, 2019 ఫిబ్రవరి పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ఉగ్రవాదులు 35 కిలోల ఆర్డీఎక్స్ను మరికొన్ని జలెటిన్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్టు వెల్లడైంది. పుల్వామా దాడి వెను జైషే చీష్ మసూద్ అజార్ ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఇక పుల్వామా దాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడులు చేసి జైషే ఉగ్రవాద శిబిరాలను మారూపాల్లేండా చేసిన సంగతి తెలిసిందే. -
పుల్వామా దాడి.. ఎన్ఐఏ చార్జిషీట్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో గత ఏడాది 40 మంది జవాన్లను బలి తీసుకున్న పుల్వామా దాడి వెనుక జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్, అతని సోదరుడు రాఫ్ అస్ఘర్లతో సహా 19 మంది ప్రమేయం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభియోగాలు నమోదు చేసింది. పాకిస్తాన్ ఆదేశాల మేరకు ఈ ఉగ్రవాదులంతా పేలుళ్లకు పాల్పడినట్టుగా ఎన్ఐఏ మంగళవారం జమ్మూలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన 13,500 పేజీల చార్జిషీట్లో పేర్కొంది. అజర్, అతని సోదరుడు, మేనల్లుడు, ఇప్పటికే ఎన్కౌంటర్లో మరణించిన ఉమర్ ఫరూఖ్, అమ్మర్ అల్వీ తదితరుల పేర్లు చార్జిషీట్లో ఉన్నాయి. అభియోగాలు నమోదైన ఉగ్రవాదుల్లో ఆరుగురు ఇప్పటికే ఎన్కౌంటర్లలో మరణించగా, మరోనలుగురు పరారీలో ఉన్నారు. వీరిలో ఇద్దరు కశ్మీర్‌లోనే ఉన్నట్టు సమాచారం. ఐఈడీ పేలుడు పదార్థాల తయారీలో దిట్టయిన ఉమర్ ఫరూఖ్ ఈ దాడిని పర్యవేక్షించడానికి 2018లో భారత్‌లోకి చొరబడ్డాడు. 1999 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఇబ్రహీం అతర్ కుమారుడే ఇతడు. 2019 ఫిబ్రవరిలో ఫరూఖ్ ఈ దాడి చేయించాడు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్కు చెందిన 40 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్కౌంటర్లో ఫరూఖ్ మరణించాడు. ఆత్మాహుతి బాంబర్ చివరి వీడియో చార్జిషీటులో వెల్లడించిన వివరాల ప్రకారం పుల్వామా దాడికి పాల్పడిన ఆత్మాహుతి బాంబర్ అదిల్ అహ్మద్ దార్ 200 కేజీల పేలుడు పదార్థాలతో నింపిన కారుని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణించే వాహనాన్ని ఢీ కొన్నాడు. పుల్వామాలో షేక్ బషీర్ నివాసంలో బిలాల్ అహ్మద్ కుచే అన్న ఉగ్రవాది తెచ్చిన హైటెక్ ఫోన్ ద్వారా దార్ తన చివరి వీడియోని తీశాడు. దాడిలో అహ్మద్ దార్ మరణిస్తే, బషీర్, బిలాల్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏకి ఎన్నో సవాళ్లు పుల్వామా దాడి కుట్రదారులు, దానిని అమలు పరిచిన వారు వివిధ ఎన్కౌంటర్లలో మరణించడంతో దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లడం ఎన్ఐఏకు కత్తి మీద సాము అయింది. కారు యజమాని అహ్మద్ దార్ అని నిరూపించడానికి ఎంతో కష్టపడ్డామని ఓ అధికారి చెప్పారు. పేలుడులో నంబర్ ప్లేట్ సహా కారు పూర్తిగా «నుజ్జునుజ్జయినా ఆ కారు యజమానుల జాబితాను సేకరించామని తెలిపారు. ఆత్మాహుతి బాంబర్ అహ్మద్ దార్ అవశేషాలను సేకరించి, అతని తండ్రి డీఎన్ఏతో సరిపోల్చి ఇదంతా చేసిన వ్యక్తి దార్యేనని కోర్టులో నిరూపించాల్సి వచ్చిందని ఆ అధికారి వివరించారు. -
పుల్వామా దాడులు.. చార్జిషీట్ దాఖలు
న్యూఢిల్లీ: దేశ ప్రజలను తీవ్ర విచారంలోకి నెట్టడమే కాక పాక్, ఇండియా మధ్య యుద్ధ పరిస్థితులకు దారి తీసిన పుల్వామా దాడి కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. జైషే మహ్మద్ చీఫ్, ఉగ్రవాది మసూద్ అజర్‌తో పాటు అతడి సోదరుడు రౌఫ్ అస్గర్ పేరును ఎన్ఐఏ ఈ చార్జిషీట్లో చేర్చింది. పుల్వామా దాడికి వీరిద్దరే ప్రధాన సూత్రధారులని ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. 5,000 పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ను ఎన్ఐఏ జమ్మూ కోర్టులో సమర్పించనుంది. ఈ దారుణమైన ఉగ్రదాడులకు ఎలాంటి ప్రణాళిక రచించారు.. పాక్ నుంచి ఎలా అమలు చేశారనే దాని గురించి అధికారులు చార్జిషీట్లో పూర్తిగా వివరించారు. అంతేకాకుండా జైషే మహ్మద్‌కు చెందిన 20 మంది ఉగ్రవాదులు ఈ దాడికి అవసరమైన ఆయుధాలను సమకూర్చారని ఛార్జిషీట్లో తెలిపారు. వీటన్నింటికీ అవసరమైన పూర్తి ఆధారాలను కూడా ఎన్ఐఏ బృందం కోర్టుకు సమర్పించనుంది. వాట్సాప్ చాటింగ్, ఫొటోలు, ఆర్డీఎక్స్ రవాణాకు సంబంధించిన ఫొటోలు, ఫోన్ కాల్స్ డేటా... ఇలా కీలక ఆధారాలను ఎన్ఐఏ అధికారులు కోర్టుకు నివేదించనున్నారు. (చదవండి: మళ్లీ ‘పూల్వామా’ దాడి జరిగితేనే బీజేపీ గెలుపు!) భారత్ కశ్మీర్‌ను ఆక్రమించుకున్నందనే పాక్ ఈ దాడులకు తెగబడిందని ఎన్ఐఏ తెలిపింది. భారత్‌పై దాడికి పాక్, స్థానికుడు ఆదిల్ అహ్మద్ దార్‌ను ఉపయోగించింది. అతడు సూసైడ్ బాంబర్‌గా మరి సీఆర్పీఎఫ్ దళాలు ప్రయాణిస్తున్న కాన్వాయ్ మీదకు పేలుడు పదార్థాలతో నిండిని కారును దూకించాడని అధికారులు తెలిపారు. ఇక పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన దేశం పాత్రను ఖండించిన సంగతి తెలిసిందే. భారతదేశం సాక్ష్యాలు ఇస్తే నేరస్థులను విచారిస్తామని కూడా తెలిపారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. పైగా అంతర్జాతీయ సమాజం నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నప్పటికి పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ఉగ్రవాది ఖతం.. బాంబులు మిస్సింగ్!
-
ఉగ్రవాది ఖతం.. కానీ, బాంబులు మిస్సింగ్!
శ్రీనగర్: పుల్వామాలో బుధవారం జరిగిన భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో బాంబు తయారీలో నిపుణుడైన ఫౌజీ భాయ్ అలియాస్ అబ్దుల్ రెహమాన్ కూడా ఉన్నట్టు కశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఫౌజీ భాయ్ ఎన్కౌంటర్ భద్రతా బలగాలకు పెద్ద విజయమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, రెహమాన్ తయారు చేసిన మూడు కారు బాంబుల్లో ఒకదానిని భద్రతా బలగాలు పేల్చివేయగా... మరో రెండింటి ఆచూకీ తెలియాల్సి ఉంది. బుడ్గాం, కుల్గాం ప్రాంతాల్లో ఆ బాంబులు ఉండొచ్చని, వాటి జాడ కోసం ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. (చదవండి: పెనుముప్పుగా నిబంధనల ఉల్లంఘన..!) కాగా, పుల్వామా తరహా ఉగ్రదాడి జరగనుందనే ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 20 కిలోల శక్తిమంతమైన ఐఈడీని మోసుకెళ్తున్న శాంట్రో వాహనాన్ని మే 27న సీజ్ చేశాయి. ఐఈడీని తరలిస్తున్న టెర్రరిస్టు సమీర్ అహ్మద్ దార్ తృటిలో తప్పించుకుపోయాడు. ఇక ఐఈడీ వాహనాన్ని తరలించడం ప్రమాదమని భావించిన బాంబు స్క్వాడ్ నిపుణులు దానిని అక్కడే పేల్చివేశారు. గతేడాది పుల్వామా వద్ద భద్రతా బలగాలపై ఆత్మహుతి దాడికి పాల్పడ్డ అదిల్ దార్‌కు సమీర్ అహ్మద్ దార్ బంధువని తేలింది. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. (చదవండి: పుల్వామాలో భారీ ఎన్కౌంటర్) -
పుల్వామా దాడి: అమెజాన్‌లో రసాయనాలు కొని..
శ్రీనగర్: గతేడాది 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. జవాన్ల కాన్వాయ్‌ను పేల్చివేసేందుకు ఉపయోగించిన ఐఈడీ తయారీలో కీలకంగా వ్యవహరించిన వాజ్-ఉల్-ఇస్లాం(19), మహ్మద్ అబ్బాస్(32)లను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. బాంబు తయారీ కోసం వీరిద్దరు అమెజాన్‌లో పలు రసాయనాలు కొనుగోలు చేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. విచారణలో భాగంగా.. జైషే మహ్మద్ ఉగ్రవాదుల సూచనల మేరకు.. తన అమెజాన్ షాపింగ్ అకౌంట్‌ను ఉపయోగించి వివిధ రసాయనాలు, బ్యాటరీలు, ఇతర పదార్థాలు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లు ఇస్లాం అంగీకరించాడని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. పుల్వామా ఉగ్రకుట్రలో భాగంగా ఇస్లామే వీటన్నింటినీ జైషే ఉగ్రవాదులకు వ్యక్తిగతంగా చేరవేశాడని పేర్కొన్నారు. (చదవండి: ఉగ్రవాది ఆదిల్‌కు శిక్షణ ఇచ్చింది అతడే!) అదే విధంగా పుల్వామా దాడికి ఉపయోగించిన ఐఈడీని తయారు చేసిన మహ్మద్ ఉమర్‌కు.. అబ్బాస్ 2018 నుంచి తన ఇంటిలో ఆశ్రయం కల్పించాడని తెలిపారు. కొన్నేళ్లుగా రహస్యంగా జైషే కోసం పనిచేస్తున్న అబ్బాస్... జవాన్ల వాహనశ్రేణిపై ఆత్మాహుతికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ దార్, పాకిస్తాన్ నుంచి వచ్చిన సమీర్ అహ్మద్ దార్, కమ్రాన్‌లకు సహకరించాడని పేర్కొన్నారు. అంతేగాకుండా జైషే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన తారీఖ్ అహ్మద్ షా, అతడి కూతురు ఇన్షా జాన్‌కు కూడా సహకారం అందించాడని వెల్లడించారు. త్వరలోనే ఇస్లాం, అబ్బాస్‌ను ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని తెలిపారు. కాగా పుల్వామాలోని హక్రిపొరాకు చెందిన ట్రక్ డ్రైవర్ తౌఫిక్ అహ్మద్ షా, అతడి కూతురు ఇన్షాజాన్(23)లు 2018-19 కాలంలో ఉగ్రవాదులకు చాలాసార్లు ఆహారం, ఇతర వస్తువులను సమకూర్చారన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు వారిని బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య ఐదుకు చేరింది.(‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్ ) -
పుల్వామా కేసులో తండ్రి, కూతురు అరెస్టు
శ్రీనగర్: గత ఏడాది 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఘటన విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది. నిందితులకు జమ్మూలోని ప్రత్యేక న్యాయస్థానం 10 రోజుల రిమాండ్ విధించింది. పుల్వామాలోని హక్రిపొరాకు చెందిన ట్రక్ డ్రైవర్ తౌఫిక్ అహ్మద్ షా, అతడి కూతురు ఇన్షాజాన్(23)లు 2018–19 కాలంలో ఉగ్రవాదులకు చాలాసార్లు ఆహారం, ఇతర వస్తువులను సమకూర్చారు. పాకిస్తాన్ ఉగ్రవాది, పేలుడు పదార్థాల నిపుణుడు అయిన మొహ్మద్ ఉమర్ ఫరూక్, పాకిస్తాన్‌కే చెందిన కమ్రాన్, ఇస్మాయిల్ అలియాస్ ఇబ్రహీం, అలియాస్ అద్నాన్‌లు తౌఫిక్ ఇంట్లోనే బస చేశారు. ‘మొహ్మద్ ఉమర్‌తో ఇన్షా జాన్ టెలిఫోన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు సాగించింది. అతడు చనిపోయే దాకా ఈ సంబంధాలు కొనసాగాయని మా దర్యాప్తులో తేలింది’అని ఎన్ఐఏ తెలిపింది. -
పుల్వామా ఉగ్రదాడి : తండ్రికూతుళ్ల అరెస్ట్
శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడి విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక ముందడుగు వేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తండ్రికూతుళ్లను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జమ్మూకశ్మీర్‌లోని లెత్‌పొరాకు చెందిన తారిక్ అహ్మద్ షా, ఇన్షా తారిక్‌లు ఉన్నారు. సోమవారం రాత్రి వారి ఇళ్లపై సోదాలు జరిపిన అధికారులు మంగళవారం తెల్లవారుజామున అహ్మద్, ఇన్షాలను అరెస్ట్ చేశారు. పుల్వామా దాడికి కొద్ది రోజుల ముందు వీరు జైషే మొహ్మద్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టుగా తెలుస్తోంది. అహ్మద్, ఇన్షా అరెస్ట్‌లతో ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన వారి సంఖ్య మూడుకు చేరింది. గతవారం పుల్వామా ఉగ్రదాడికి సహకరించిన జైషే మొహ్మద్ సభ్యుడు షకీర్ బషీర్ మాగ్రేను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా దాడిలో పాల్గొన్న ఆత్మా హుతి సభ్యుడు ఆదిల్ అహ్మద్ ధార్‌కు షకీర్ వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాడు. షకీర్‌ను విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులు.. అతడి నుంచి రాబట్టిన సమాచారం మేరకే అహ్మద్, ఇన్షాలను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. (చదవండి : ‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్) -
సరిహద్దు దాటిన రోజు!
-
వాలెంటైన్స్ డే: భజరంగ్‌దళ్ కార్యకర్తల బీభత్సం..!
-
వాలెంటైన్స్ డే: భజరంగ్‌దళ్ కార్యకర్తల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : వాలెంటెన్స్ డే సందర్భంగా మాదాపూర్, ఐటీ కారిడార్ పరిసరాల్లో ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా ఆగ్రహంతో విధ్వంసం సృష్టించిన ఐదుగురు యువకులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నాగోత్ అజయ్ సింగ్, వదిత్య అర్జున్, కొర్ర సంతోష్, గుడుపు పవన్ కుమార్, పొలారి తిరుపతి ఉన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన సుమారు 10 నుంచి 15 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు కే పి హెచ్ బి నుంచి హైటెక్ సిటీ వెళ్లేదారిలో ద్విచక్ర వాహనాలపై వెళ్తూ వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గచ్చిబౌలి, కొత్తగూడా, మాదాపూర్ తదితర ప్రాంతాలలోని వాణిజ్య సముదాయాలపై దాడులకు దిగారు. దారిలో కనపడిన ఓ ఐస్ క్రీమ్ షాప్ లో విధ్వంసం సృష్టించారు. ఇనార్బిట్ మాల్, బికనీర్ వాలా, ఏబీఎన్ శరత్ మాల్ తదితర చోట్ల దాడులకు దిగారు. సమాచారం మేరకు కాగా పోలీసులు ఇనార్బిట్ మాల్ కి చేరుకోగానే వారంతా అక్కడి నుంచి పారిపోయారు. కాగా షాపు యాజమాన్యాల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లలో రెండు కేసులు నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ లు పరిశీలించిన అనంతరం పోలీసులు ఐదుగురు భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు. కాగా మిగిలిన వారైన సుభాష్, కిరణ్, దత్త సాయి, సాయి రెడ్డి, వెంకట్ మరియు తదితరులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి: వాలెంటైన్స్ డే.. ప్రేమికుల అవస్థలు) -
‘పుల్వామా’పై రాజకీయ దాడి
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న దాడి ఘటనకు ఏడాదైన సందర్భంగా భారత్‌లో రాజకీయ చిచ్చు రాజుకుంది. కాంగ్రెస్, వామపక్షాలు దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పిస్తూనే కేంద్రంపై మాటల తూటాలు విసిరాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి సూటిగా మూడు ప్రశ్నలు సంధించారు. 1. ఈ దాడి నుంచి ఎక్కువగా లబ్ధి పొందిందెవరు? 2. ఈ దాడిపై విచారణ ఎంతవరకు వచ్చింది? 3. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి.. భద్రతా వైఫల్యానికి బీజేపీలో ఎవరిది బాధ్యత? ఈ మూడు ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబివ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్‌కు మద్దతుగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గళం విప్పారు. పుల్వామా దాడిలో బతికి బయటపడిన వారికి ఎలాంటి సాయం అందించారని, మృతుల కుటుంబాలకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, బీజేపీ.. జవాన్ల మృతదేహాలతో రాజకీయం చేసి ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. ఉగ్రవాదుల సానుభూతిపరుడు రాహుల్: బీజేపీ జాతి యావత్తూ పుల్వామా దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తుంటే రాహుల్ ఇలా మాట్లాడడం సిగ్గు చేటని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల సానుభూతి పరుడైన రాహుల్ కేంద్రంతో పాటు భద్రతా బలగాలను కూడా టార్గెట్ చేయడం దారుణమని అన్నారు. దోషి అయిన పాక్‌ను రాహుల్ ఎప్పుడూ ప్రశ్నించరెందుకని నిలదీశారు. రాహుల్ తన వ్యాఖ్యల ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ఇరుకున పెట్టడానికి ఒక ఆయుధం ఇస్తున్నారని ట్వీట్ చేశారు. పుల్వామా దాడిపై విచారణ పురోగతి కష్టమే పుల్వామా దాడిపై విచారణ ముందుకు వెళ్లడానికి అన్ని మార్గాలు మూసుకుపోయినట్టే కనిపిస్తోంది. ఈ దాడితో ప్రమేయం ఉన్న అయిదుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాలు చేపట్టిన వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. 2008లో ముంబైపై ఉగ్రవాదుల దాడి తర్వాత ఏర్పాటైన ఉగ్రవాద నిరోధక విచారణ సంస్థ (ఎన్ఐఏ)కు ఈ దాడి వెనుక సూత్రధారి, ఇతర కుట్రదారులెవరు వంటి వివరాలు తెలుసుకోవడానికి కచ్చితమైన సమాచారమేదీ లేదు. ‘‘ఈ కేసులో ఎన్నో అంశాలున్నాయి. కానీ వేటికి ఆధారాలు లేవు. కోర్టుల్లో ఏదైనా సాక్ష్యాధారాలతోనే సమర్పించాలి. అందుకే ఈ కేసులో పురోగతి సాధించలేం’’అని విచారణ బృందంలో ఉన్న అధికారి ఒకరు చెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం కరడు గట్టిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారత్‌పై విద్వేషం వెళ్లగక్కారు. కశ్మీర్లో పుల్వామా సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కారుబాంబుతో దాడి జరిపారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆత్మాహుతి దాడి కోసం వినియోగించిన ఆ కారు యజమాని ఎవరన్నదే ఇప్పటికీ విచారణ బృందానికి సవాల్‌గానే మారింది. మీ బలిదానాన్ని మరువలేం: ప్రధాని ‘పుల్వామా’అమరవీరులకు శుక్రవారం ప్రధాని మోదీ నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసి, చివరికి ప్రాణత్యాగం చేసిన వారికి సాటి, పోటీ ఎవరూ లేరని కొనియాడారు. భారతీయులు ఎన్నటికీ ఆ వీర సైనికుల బలిదానాన్ని మరువలేరని మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ హర్దీప్ పూరీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పుల్వామా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. పుల్వామా స్మారకం ఆవిష్కరణ పుల్వామా దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది స్మృత్యర్థం లెత్పోరా సైనిక శిబిరంలో స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. సీఆర్పీఎఫ్ జవాన్ల సేవ, నిజాయితీలకు గుర్తుగా ఈ స్థూపాన్ని ఆవిష్కరించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్ల ఫోటోలను వారి పేర్లతో సహా ఆ స్థూపంపై చెక్కారు. అమరవీరుల కుటుంబాలకు తాము ఎంతో చేస్తున్నామని సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ తెలిపారు. ఇక మహారాష్ట్రకు చెందిన ఉమేష్ గోపీనాథ్ అనే వ్యక్తి మొత్తం 61 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, అమరవీరుల ఇళ్లకు వెళ్లి అక్కడ మట్టిని తీసుకువచ్చి సీఆర్పీఎఫ్ ఏర్పాటు చేసిన స్మారక స్తూపం వద్ద నివాళిగా ఉంచారు. -
పూల్వామా ఉగ్రదాడితో లాభపడింది ఎవరు?
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడితో లాభపడింది ఎవరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటితో సరిగా ఏడాది పూర్తయిన సందర్భంగా రాహుల్ ట్విటర్ వేదికగా.. ఆ దాడిలో మరణించిన 40 మంది అమర జవాన్లకు నివాళులర్పించారు. అలాగే బీజేపీ ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు.‘పుల్వామా ఉగ్రదాడితో ఎక్కువగా లాభపడింది ఎవరు?. ఈ ఘటనపై జరిపిన విచారణలో ఏం తేలింది?. భద్రతా లోపాల వల్ల జరిగిన ఈ దాడికి బీజేపీ ప్రభుత్వంలోని ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని రాహుల్ గాంధీ ట్విటర్లో పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడిని బీజేపీ రాజకీయ లబ్ధికి వాడుకుందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న సంగతి విదితమే. ఈ దాడిని సాకుగా చూపి భద్రత, జాతీయవాదం పేరిట బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. కాగా, గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 80 కిలోల బరువున్న హై గ్రేడ్ ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు వాడినట్టు అధికారులు తెలిపారు. Today as we remember our 40 CRPF martyrs in the #PulwamaAttack , let us ask: 1. Who benefitted the most from the attack? 2. What is the outcome of the inquiry into the attack? 3. Who in the BJP Govt has yet been held accountable for the security lapses that allowed the attack? pic.twitter.com/KZLbdOkLK5 — Rahul Gandhi (@RahulGandhi) February 14, 2020 -
ఎన్నికలు.. ఆందోళనలు
2019 రాజకీయంగా, సామాజికంగా జరిగిన మార్పులు మామూలువి కావు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారతదేశంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 543 లోక్‌సభ స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగ్గా భారతీయ జనతా పార్టీ 303 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒక రాజకీయ పార్టీ సొంతంగా పూర్తిస్థాయి మెజారిటీ సాధించడం 30 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి కూడా. ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్లు.. విద్యా, ఉపాధి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని 124వ సారి మార్చారు కూడా. ఏడాదికి రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండి... ప్రభుత్వమిచ్చే ఇతర రిజర్వేషన్లు (ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు తదితరాలు) ఉపయోగించుకోని అగ్రవర్ణాల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుంది. ఏడాది మొదట్లో, లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్డీయేపై కొన్ని విమర్శలు వచ్చేందుకూ కారణమైంది. పౌరసత్వ చట్ట సవరణ.... దేశాద్యంతం ఆందోళనలకు, హింసాత్మక ఘటనలకు తావిచ్చిన చట్ట సవరణ ఇది. 1955 నాటి చట్టం ప్రకారం భారతీయ పౌరులయ్యేందుకు ఉన్న ఐదు అవకాశాల్లో కొన్ని సవరణలు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన హిందు, సిక్కు, పార్శీ, క్రైస్తవ, జైన, బౌద్ధ మతాల వారు ఆయా దేశాల్లో మతపరమైన హింస ఎదుర్కొంటే వారికి భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ వెసులుబాటు కల్పించింది. ఈ జాబితాలో ముస్లింల ప్రస్తావన లేకపోవడం, ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చే ముస్లిమేతరుల పరిస్థితీ అగమ్యగోచరంగా మారడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. ఈ ఆందోళనపూరిత వాతావరణం కొనసాగుతుండగానే కేంద్రం జాతీయ జనాభా పట్టిక తయారీకి ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. కాంగ్రెస్‌లో నేతల కరవు సార్వత్రిక ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ కుటుంబానికి చెందని వారినెవరినైనా పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలని రాహుల్ స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ కొన్ని నెలల పాటు అధ్యక్ష ఎన్నికపై తర్జనభర్జనలు కొనసాగాయి. చివరకు సోనియాగాంధీ మరోసారి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతానికి ఇన్చార్జ్గా ప్రియాంక గాంధీ నియమితులవడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగానూ ఆమెకు పదవి దక్కడం ఆ పార్టీలో జరిగిన ముఖ్యపరిణామాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్... జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతోపాటు జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ఈ ఏడాది జరిగిన అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టాల్లో ఒకటి. దశాబ్దాలుగా దేశంలో ఒకరకమైన అసంతృప్తికి కారణమైన ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5న రద్దు చేశారు. ఆ తరువాత అక్కడ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం, 145 రోజుల వరకూ ఇంటర్నెట్పై నిషేధం విధించటం వంటి అంశాలు ప్రపంచదేశాలు దృష్టి పెట్టేలా చేశాయి. పుల్వామా దాడులు... పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాద చర్యలకు తాజా తార్కాణంగా చెప్పుకునే పుల్వామా దాడులు ఈ ఏడాది దాయాది దేశాలు మరోసారి కత్తులు నూరేందుకు కారణమయ్యాయి. ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లో ఓ మిలటరీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయగా అందులో సుమారు 40 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అదే నెల 26న భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి చొరబడి బాలాకోట్ వద్ద ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసింది. ఈ క్రమంలో భారతీయ యుద్ధ విమాన పైలెట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కాడు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ కొన్ని రోజుల వ్యవధిలోనే అభినందన్‌ను సగౌరవంగా భారత్‌కు అప్పగించింది. -
అమర జవాన్ల కోసం 'స్టాండ్ ఫర్ ద నేషన్'
సాక్షి, విజయవాడ: ఆసరా సంస్థ ఆధ్వర్యంలో 'స్టాండ్ ఫర్ ద నేషన్' బ్రోచర్ ఆవిష్కరణ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగింది. విజయవాడ వినియోగదారుల (కన్జ్యూమర్) ఫోరమ్ జడ్జి మాధవరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పుల్వామా దాడిలో అమరులైన 40 మంది సైనికులకోసం ఆసరా సంస్థ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. రాబోయే ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3 గంటల15 నిమిషాలకు అమరులైన జవాన్ల కోసం నివాళిగా స్టాండ్ ఫర్ ద నేషన్ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టనుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఆసరా ద్వారా ఢిల్లీ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వినియోగదారులకు అందించిన సేవలు మరువలేనివని మాధవరావు ప్రశంసించారు. చట్టం గురించి తెలియని వారి కోసం.. ఆసరా సంస్థ సభ్యులు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. -
పుల్వామాలో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రమూక..
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళాల పెట్రోలింగ్ పార్టీపై మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలపై దాడికి పాల్పడిన అనంతరం ఉగ్రవాదులు పరారయ్యారు. పెట్రోలింగ్ పార్టీపై దాడులకు తెగబడిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు ఆ ప్రాంతాన్ని సైన్యం జల్లెడపడుతోంది. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ట్రక్ డ్రైవర్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టిన కొద్దిసేపటికే పుల్వామా ఉగ్ర దాడి చోటుచేసుకోవడం గమనార్హం. అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్బెహరా పట్టణంలో ఉగ్రవాదులు ట్రక్ డ్రైవర్‌ను దారుణంగా హతమార్చారు. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను ఆగస్ట్ 5న రద్దు చేసిన అనంతరం కశ్మీర్లో కశ్మీరీయేతర వ్యక్తిపై ఉగ్రవాదులు ఈ తరహా దాడి జరపడం ఇది నాలుగోసారి. బాధిత ట్రక్ డ్రైవర్‌ను జమ్ముకు చెందిన నారాయణ్ దత్‌గా గుర్తించారు. ఇక జమ్ము కశ్మీర్లో క్షేత్రస్ధాయి పరిస్ధితులను పర్యవేక్షించేందుకు యూరప్ ఎంపీల బృందం కశ్మీర్లో పర్యటిస్తోంది. -
‘వారు సైనిక హీరోల కుమారులు’
న్యూఢిల్లీ: భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీటర్ అకౌంట్లో ఎప్పుడూ యాక్టివ్ ఉంటాడు. అయితే తాజాగా వీరూ చేసిన ట్వీట్‌కు మాత్రం నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ ఏడాది ఆరంభంలో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. వారిలో కొందరి పిల్లలను సెహ్వాగ్ తన అంతర్జాతీయ స్కూల్లోనే చదివిస్తున్నాడు. ఈ సందర్భంగా వారు క్రికెట్లో శిక్షణ పొందుతున్న ఫొటోలను ట్వీట్ చేశాడు. ‘వారంతా సైనిక హీరోల కుమారులు. ముఖ్యంగా ఆ ఇద్దరు ఇక్కడ ఉండడం గౌరవంగా భావిస్తున్నాను. బ్యాటింగ్ చేస్తున్న కుర్రాడు అమర జవాన్ రామ్ వకీల్ కుమారుడు.. బౌలింగ్ చేస్తున్న కుర్రాడు అమర జవాన్ విజయ్ సోరెంగ్ కుమారుడు. వీరికి సేవ చేయడం కన్నా మించిన ఆనందం ఉంటుందా’ అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానులు సెహ్వాగ్‌కు సెల్యూట్ చేస్తున్నారు. అమరులైన జవాన్ల పిల్లల్ని చదివించి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నావ్ అంటూ కొనియాడుతున్నారు. విద్యాదానం కంటే మరేది గొప్పది కాదు అంటూ సెహ్వాగ్‌ను ప్రశంసిస్తున్నారు. -
బాలాకోట్ ఉగ్రశిబిరం మొదలైంది
చెన్నై: బాలాకోట్ ఉగ్రశిబిరాలపై భారతవైమానిక దళాల దాడితో ధ్వంసమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలు తిరిగి ప్రారంభమయ్యాయని భారత సైనికాధిపతి బిపిన్‌రావత్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో వెల్లడించారు. పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో «ధ్వంసమైన బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని ఆయన తెలిపారు. పుల్వామాలో భారత సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడి 40 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న సంగతిని ఆయన గుర్తుచేశారు. ఏడు నెలలక్రితం బాలాకోట్‌పై భారత్ దాడితో ఉగ్రవాదులు అక్కడినుంచి వెళ్ళిపోయారని తెలిపారు. తిరిగి మళ్ళీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బాలాకోట్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించారని ఆయన వెల్లడించారు. గతంలో జరిపిన దాడికి మించి ఈసారి దాడులు చేసే అవకాశముందన్నా రు. మంచుకరుగుతున్న ప్రాం తాల గుండా, మంచు తక్కువగా ఉన్న ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌లోని ఉత్తరభాగంనుంచి భారత్‌లోకి చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు వేచిఉన్నారనీ, ఈ సంఖ్య సమయానుకూలంగా మరవచ్చుననీ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కశ్మీర్ లోయలో ఏదో జరుగుతోందని కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనీ, కానీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నామనీ, ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితి చక్కబడుతోందనీ ఆయన వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన సైన్యం ఉగ్రవాదులను చొరబాట్లను తీవ్రంగా అడ్డుకుంటోందనీ అయితే అంతర్జాతీయ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు బిపిన్ రావత్ ఆరోపించారు. కాగా, కథువా జిల్లాలో 40 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్ జమ్ము: బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల హత్య సహా నాలుగు ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్న ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ముష్కరులను పోలీసులు అరెస్టు చేశారు. కిష్త్వార్ జిల్లాకు చెందిన నిస్సార్ అహ్మద్ షేక్, నిషాద్ అహ్మద్, ఆజాద్ హుస్సేన్‌లు కలిసి బీజేపీ నేత అనిల్ పరిహార్, ఆయన సోదరుడు అజిత్ పరిహార్‌లను గత ఏడాది కాల్చి చంపారు. ఏప్రిల్ 9వ తేదీన ఆర్ఎస్ఎస్ నేత చందర్‌కాంత్ శర్మ, ఆయన అంగరక్షకుడిని కాల్చి చంపారని జమ్మూ జోన్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ముకేశ్ సింగ్ వెల్లడించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన అనంతరం వీరంతా షేక్ హుస్సేన్ ఇంట్లో తలదాచుకునే వారని ముకేశ్ వెల్లడించారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుదారులను అడ్డుకునేందుకు భారత రక్షణ బలగాలకు పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టారు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం భారత్‌లోని కీలకమైన నగరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్మీని బలగాలను అలర్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
మళ్లీ ‘పూల్వామా’ దాడి జరిగితేనే బీజేపీ గెలుపు!
ఔరంగబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్సీపీ అధినేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూల్వామా తరహా ఉగ్రవాద దాడి జరిగితే తప్ప బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో గట్టెక్కలేదని, రాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంపై ప్రజలు ప్రతీకారంతో రగిలిపోతున్నారని అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత ఉన్నాయి. కానీ, పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరగడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’ అని ఆయన విలేకరులతో పేర్కొన్నారు. అదే తరహాలో మరో పూల్వామా దాడి జరిగితే తప్ప బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో గట్టెక్కబోదని పేర్కొన్నారు. బీజేపీ-శివసేన కూటమి నుంచి అధికారాన్ని తాము చేజిక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ సర్కారు గత ఐదేళ్లలో ప్రజలకోసం చేసిందేమీ లేదని అన్నారు. ఎన్సీపీపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతోపాటు బహుజన్ వికాస్ అగాథి, సమాజ్‌వాదీ పార్టీ వంటి చిన్న పార్టీలతో జత కలిసి కాషాయ కూటమిని ఎదుర్కోబోతున్నామని అన్నారు. -
అమర జవాన్లకు బాలీవుడ్ నివాళి
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించేందుకు బాలీవుడ్ తారలు సిద్దమయ్యారు. అందుకోసం వారంతా ఓ వీడియో సాంగ్‌లో కనిపించనున్నారు. ‘తూ దేశ్ మేరా’ అని సాగే ఈ పాటలో అమితాబ్ బచ్చన్, షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, ఐశ్వర్య రాయ్, రణబీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్‌లు కనిపించనున్నారు. ఎంతో బిజీగా ఉండే తారలు.. అమర జవాన్లకు నివాళులర్పించడానికి తమ సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినట్టుగా తెలుస్తోంది. 73వ స్వాతంత్ర్యదినోత్సవానికి ఒక్క రోజు ముందుగా ఈ వీడియో సాంగ్‌కు సంబంధించి కవర్ పోస్టర్‌ను సీఆర్పీఎఫ్ ట్విటర్ ద్వారా విడుదల చేసింది. అలాగే ఇందులో పాలుపంచుకున్న బాలీవుడ్ తారలకు ధన్యవాదాలు తెలిపింది. సీఆర్పీఎఫ్ విడుదల చేసిన ఈ పోస్టర్లో బాలీవుడ్ తారలు జవాన్లకు సెల్యూట్ చేస్తూ కనిపించారు. ఈ పాట కోసం సింగర్లు జావేద్ అలీ, జుబిన్ నౌటియల్, షబాబ్ సబ్రి, కబీర్ సింగ్‌లు తమ గళం విప్పారు. మీట్ బ్రోస్ సంగీతం అందించారు. Official Poster of the Tribute Song for #CRPF Martyrs of Pulwama #TuDeshMera by @HAPPYPRODINDIA Bollywood comes together to pay homage to the Pulwama Martyrs of #CRPF Thanks @SrBachchan @iamsrk @aamir_khan @TheAaryanKartik @iTIGERSHROFF #Ranbirkapoor #AishwaryaRai pic.twitter.com/OPLrNfz8Ia — 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) August 14, 2019 -
పైలట్ అభినందన్‌కు అత్యున్నత పురస్కారం?
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను భారత ప్రభుత్వం ఉన్నత మిలిటరీ పురస్కారంతో సత్కరించే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల అనంతరం గగనతలంలో జరిగిన పోరులో దాయాది పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని తాను నడుపుతున్న మిగ్-21 బిసన్ యుద్ధవిమానం నుంచి అభినందన్ కూల్చేశారు. ఇందుకుగాను ఆయనకు ‘వీరచక్ర’ పురస్కారం దక్కే అవకాశముందని తెలుస్తోంది. పరమవీర చక్ర, మహావీర చక్ర పురస్కారాల తర్వాత అత్యున్నత మిలిటరీ పురస్కారం ‘వీరచక్ర’. బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద శిబిరాలపై బాంబులు జారవిడిచిన ఐదుగురు మిరాజ్ 2000 ఫైటర్ పైలట్లను కూడా కేంద్రం సత్కరించనుంది. వారి సాహసానికి గుర్తింపుగా వాయుసేన మెడల్స్‌ను బహూకరించనుంది. పాక్ యుద్ధవిమానాలతో పోరాడుతూ.. తన మిగ్-21 బిసన్ యుద్ధవిమానం కూలిపోవడంతో అభినందన్ పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. రెండురోజుల పాక్ చెరలో ఉన్న అభినందన్‌ను.. భారత ప్రభుత్వం తెచ్చిన దౌత్య ఒత్తిడిని తలొగ్గి దాయాది రెండు రోజుల అనంతరం మన దేశానికి అప్పగించింది. గత ఫిబ్రవరి 26న పూల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లో భారత సైన్యం వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. -
ఆర్టికల్ 370 రద్దు: మరో పుల్వామా దాడి
ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అంశాలపై దాయాది దేశం పాక్ మరోసారి విషం చిమ్మింది. ఆర్టికల్ 370 రద్దు ప్రభావం త్వరలోనే ఉంటుందని.. రానున్న రోజుల్లో మరో పుల్వామా దాడి జరగవచ్చని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మంగళవారం పాకిస్తాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తూ.. మోదీ నిర్ణయం కశ్మీర్ ప్రజలను అణచి వేయలేదని పేర్కొన్నాడు. బీజేపీది జాత్యాంహకార భావజాలమని.. ముస్లింలను ఆ పార్టీ రెండో తరగతి ప్రజలుగానే పరిగణిస్తుందని వ్యాఖ్యానించాడు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం, మహ్మద్ అలీ జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని బలపరుస్తుందని ఇమ్రాన్ పేర్కొన్నాడు. ‘భారతదేశం కేవలం హిందువులకే అని ఆర్ఎస్ఎస్ అభిప్రాయం. అదెప్పుడూ ముస్లింలను రెండో తరగతి ప్రజలుగానే భావిస్తుంది. ఈ రోజు మొదటి సారి బీజేపీ భావజాలాన్ని ప్రపంచం కూడా చూసింది’ అన్నాడు ఇమ్రాన్. పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించిన కొందరు కశ్మీర్ నాయకులు.. నేడు జిన్నా రెండు దేశాల సిద్ధాంతం నిజమయ్యిందని బాధపడుతున్నారని పేర్కొన్నాడు. భారతదేశం కేవలం హిందువులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం మానవులందరిని సమానంగా చూస్తుందని ఇమ్రాన్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. గతంలో జరిగిన పుల్వామా దాడికి, పాక్‌కు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా ఇమ్రాన్ స్పష్టం చేశాడు. అయితే బీజేపీ తీసుకున్న నిర్ణయం వల్ల త్వరలోనే మరో పుల్వామా దాడి జరగనుందని ఇమ్రాన్ పేర్కొన్నాడు. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. మంగళవారం రాత్రి లోక్‌సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019కు అనుకూలంగా 370 మంది, వ్యతిరేకంగా 70 మంది ఓటు వేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్‌సభ ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 351 మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. ఒకరు గైర్హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) సభ నుంచి వాకౌట్ చేశాయి. -
మోదీలోని మరో కోణాన్ని చూడాలంటే..
న్యూఢిల్లీ: బేర్ గ్రిల్స్.. డిస్కవరి ఛానెల్ చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బేర్ గ్రిల్స్.. సోమవారం చేసిన ఓ ట్వీట్‌తో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ‘180 దేశాలకు చెందిన ప్రజలు.. 2019, ఆగస్టు 12నాటి రాత్రి 9గంటలకు మోదీలోని మరో కోణాన్ని చూడబోతున్నారు’ అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు గ్రిల్స్. 49 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, బేర్ గ్రిల్స్‌తో కలిసి అడవుల్లో సంచరిస్తూ.. నదులను దాటుతూ కనిపించారు. ఈ క్రమంలో గ్రిల్స్, మోదీని ఉద్దేశించి.. ‘భారత్‌కు చెందిన ముఖ్యమైన వ్యక్తి ప్రస్తుతం నాతో ఉన్నారు. మిమ్మల్ని క్షేమంగా తిరిగి తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది’ అంటూ కామెంట్ చేయడం వినవచ్చు. People across 180 countries will get to see the unknown side of PM @narendramodi as he ventures into Indian wilderness to create awareness about animal conservation & environmental change. Catch Man Vs Wild with PM Modi @DiscoveryIN on August 12 @ 9 pm. #PMModionDiscovery pic.twitter.com/MW2E6aMleE — Bear Grylls (@BearGrylls) July 29, 2019 ఈ వీడియోలో గ్రిల్స్ జంతువుల సంరక్షణ, పర్యావరణ మార్పుల వంటి అంశాలపై మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చిత్రీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇందుకు సంబంధించిన షూటింగ్ జరిగినట్లు సమాచారం. అయితే అదే సమయంలో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి చోటు చేసుకున్న సమయంలో నరేంద్ర మోదీ షూటింగ్లో పాల్గొన్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అప్పుడాయన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షూటింగ్లో పాల్గొన్నారనే విషయం ప్రస్తుతం స్పష్టమైంది. ఈ షో గురించి ప్రకటించిన వెంటనే ప్రతిపక్షాలు మరో సారి నరేంద్ర మోదీ తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ‘పుల్వామాలో ఉగ్రవాదులు బరి తెగించి 44 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. దేశం అంతా తీవ్ర విషాదంలో మునిగి ఉన్న సమయంలో మోదీ మాత్రం షూటింగ్లో పాల్గొన్నారు. దారుణం గురించి తెలిసిన తర్వాత కూడా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. జవాన్ల మృతి పట్ల మోదీకి ఎంత బాధ ఉందో ప్రోమోలో ఆయన నవ్వు చూస్తేనే అర్థం అవుతుంద’ని విపక్ష నేతలు మండి పడుతున్నారు. -
ఇమ్రాన్ వ్యాఖ్యలకు ఆర్మీ చీఫ్ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి భారత్ ఇంటి పనేనని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ దీటుగా తిప్పికొట్టారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ పాత్రపై భారత్ పూర్తి ఆధారాలను పాక్‌కు ఇచ్చిందని చెప్పారు. భారత నిఘా సంస్ధలు పుల్వామాలో ఏం జరిగిందనేది ఆధారాలతో సహా అందించాయని..ఇంతకంటే తాను ఏమీ చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఇమ్రాన్ ఖాన్ ఇటీవల తన అమెరికా పర్యటన సందర్భంగా పుల్వామా దాడిలో పాకిస్తాన్ పాత్ర లేదని, భారత భద్రతా దళాల వేధింపులతో విసుగుచెందిన ఓ కశ్మీరీ యువకుడు ఈ ఘాతుకానికి తెగబడగా, అనూహ్యంగా పాకిస్తాన్ పేరును తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ పాకిస్తాన్లో ఉన్నా కశ్మీర్‌లోనూ దాని ఉనికి ఉందని, పుల్వామా దాడి భారత్‌లో జరిగిన దేశీయ దాడిగా ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది మురణించిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో మెరుపు దాడులు చేపట్టి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. -
అందుకే మా దేశం బదనాం అయింది: పాక్ ప్రధాని
వాషింగ్టన్ : భారత్‌లో జరిగిన పుల్వామా ఉగ్రదాడితో పాకిస్తాన్‌కు సంబంధంలేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ దాడి భారత్ అంతర్గత సమస్యతో కశ్మీర్ ప్రజలు చేసిన పనేనన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ వాషింగ్టన్‌లోని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పడిన జైషే ఈ మొహమ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడినట్లు అంగీకరించడంతో తమ దేశం బదనాం అయిందన్నారు. కానీ ఈ దాడితో పాక్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. జైషే మోహమ్మద్ పాక్ చెందినదే అయినప్పటికి అది కశ్మీర్లో కూడా ఉందని, భారత్‌లోని సమస్యలతోనే ఈ ఉగ్రదాడి జరిగిందని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ‘భారత భద్రతా బలగాల వేధింపులకు గురైన ఓ కశ్మీర్ యువకుడే తిరుగుబాటు చేస్తూ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కానీ ఈ దాడి పాకిస్తాన్ చేయించినట్లు ప్రచారం జరిగింది’ అని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఈ ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్‌పై భారత వాయుసేన ప్రతీకారదాడులు చేపట్టడం.. పాక్ కూడా దాడులు చేసే ప్రయత్నం చేయడం.. తదానంతరం చోటుచేసుకున్న పరిణామాలు తెలిసిందే. అమెరికాలో పర్యటన సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సోమవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘రెండు వారాల క్రితం మోదీతో సమావేశమైనప్పుడు.. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఆయన నన్ను కోరారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలని భారత్, పాక్‌లు కోరుకుంటున్నాయి. ఈ విషయంలో ఇరు దేశాలు కోరితే తన వంతుగా మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నాన’ని పేర్కొన్నారు. అక్కడే ఉన్న ఇమ్రాన్ ట్రంప్ ప్రతిపాదనను స్వాగతించారు. ట్రంప్ మధ్యవర్తిత్వం తమకు ఇష్టమేనని ఆయన తెలిపారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు భారత్‌లో పెనుదుమారాన్నే లేపాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మోదీ.. ట్రంప్‌ను కోరలేదని స్పష్టం చేసింది. కశ్మీర్ సమస్య రెండు దేశాలకు సంబంధించిందని, ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. -
‘బాలాకోట్ దాడితో దారికొచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జరిపిన మెరుపు దాడులు అనంతరం దేశంలోకి చొరబాట్లు 43 శాతం తగ్గాయని ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్లో వెల్లడించింది. గత ఏడాది తొలి ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది ప్రధమార్ధంలో జమ్ము కశ్మీర్లో భద్రతా పరిస్థితి మెరుగైందని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. సీమాంతర చొరబాట్లను ప్రభుత్వం ఉపేక్షించకుండా భద్రతా చర్యలను ముమ్మరం చేసిందని తెలిపింది. జమ్ము కశ్మీర్ ప్రభుత్వంతో కలిసి భద్రతా దళాలు దేశ సరిహద్దుల్లో నిరంతర నిఘా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో చొరబాట్లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత వైమానికదళం పీఓకేలోని బాలాకోట్‌లో మెరుపు దాడులు చేపట్టి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. -
పుల్వామా ఉగ్రదాడి.. వారి తప్పేమీ లేదు
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి విషయంలో ఇంటిలిజెన్స్ వైఫల్యం ఏమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు. దేశ భద్రత కోసం ఇంటిలిజెన్స్, భద్రతా సిబ్బంది ఎంతో సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. గడిచిన మూడు దశాబ్ధాల కాలంలో అనేక మంది ఉద్రవాదులను భారత బలగాలు హతమార్చాయని ఆయన గుర్తుచేశారు. పుల్వామా ఉగ్రదాడికి కారణమైన జైషే ఏ మహ్మద్ స్థావరాలపై దాడులు చేసి.. ప్రతీకార చర్యలను కూడా చేపట్టామన్నారు. దేశంలో అశాంతి అనే పదం వినపించకుండా పాలించడమే ప్రభుత్వం లక్ష్యమని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల కుట్ర కారణంగానే ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారని వెల్లడించారు. దానిలో భాగంగా ఫిబ్రవరి 26న పాక్ సరిహద్దులోని బాలాకోట్‌పై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేపట్టినట్లు కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. -
కలవరపెట్టిన పాక్ సబ్‌మెరైన్
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రస్థావరంపై భారత్ ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక సబ్‌మెరైన్ ఒకటి భారత అధికారులను తీవ్రంగా కలవరపెట్టింది. చాలాకాలం నుంచి భారత్ పాక్ నేవీ కదలికలపై నిఘా ఉంచుతోంది. ఈ క్రమంలో బాలాకోట్ దాడుల తర్వాత పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా 60కిపైగా యుద్ధనౌకలు, విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అంతర్జాతీయ సముద్ర జలాల్లో మోహరించింది. ఈ నేపథ్యంలో పాక్ నేవీకి చెందిన అగొస్టా క్లాస్ సబ్‌మెరైన్ ‘పీఎన్ఎస్ సాద్’ కరాచీకి సమీపంలో అదృశ్యమైపోయింది. ‘ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్’ సాంకేతికత ఉన్న ఈ పీఎన్ఎస్ సాద్ మిగతా సబ్మెరైన్ల కంటే ఎక్కువరోజులు సముద్రగర్భంలో ఉండిపోగలదు. దీంతో భారత్‌పై దాడికి పాక్ పీఎన్ఎస్ సాద్ ను పంపిందన్న అనుమానం భారత అధికారుల్లో బలపడింది. పీఎన్ఎస్ సాద్ గుజరాత్ తీరానికి 3 రోజుల్లో, ముంబైకి 4 రోజుల్లో చేరుకోగలదని నేవీ నిపుణులు అంచనా వేశారు. దాన్ని అడ్డుకునేందుకు అణు సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ చక్ర, ఐఎన్ఎస్ కల్వరితో పాటు పీ–8ఐ విమానాలను రంగంలోకి దించారు. వీటితోపాటు ఉపగ్రహాల సాయంతో 21 రోజుల పాటు గాలించారు. భారత జలాల్లో ప్రవేశించి లొంగిపోకుంటే సాద్‌ను పేల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చివరికి 21 రోజుల తర్వాత పాక్‌కు పశ్చిమాన ఉన్న సముద్రజలాల్లో పీఎన్ఎస్ సాద్‌ను భారత నేవీ గుర్తించింది. ఈ విషయమై నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధం తలెత్తితే రహస్యంగా దాడి చేసేందుకు పాక్ సాద్‌ను వ్యూహాత్మకంగా అక్కడ మోహరించిందని తెలిపారు. కానీ భారత దూకుడు, అంతర్జాతీయ ఒత్తిడిలతో పాక్ తోకముడిచిందని వెల్లడించారు. దీంతో మక్రాన్ తీరంలోనే ïసాద్ అగిపోయిందని పేర్కొన్నారు. -
జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్..!
శ్రీనగర్: ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాద దాడులు జరగొచ్చని భారత్, అమెరికాకు పాకిస్థాన్ నిఘా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. అవంతిపురలో శక్తిమంతమైన ఐఈడీ బాంబులతో కూడిన వాహనాలతో ముష్కరులు పేలుళ్లకు పాల్పడవచ్చని పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేసింది. గత నెలలో కశ్మీర్లో ఆర్మీ నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్‌లో ఉగ్రవాది జకీర్ మూసా హతమయ్యాడు. దీనికి ప్రతీకారంగా ఉగ్రదాడులు జరుగొచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. అవంతిపురకు 7 కిలోమీటర్ల దూరంలోనే ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హెచ్చరికలతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల వెంట గస్తీని మరింత పెంచింది. -
మోదీకి పాక్ ప్రధాని లేఖ!
ఇస్లామాబాద్ : ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు, కశ్మీర్ అంశంపై చర్చించుకుందామని ప్రధాని నరేంద్రమోదీకి, పాకిస్తాన్ అధినేత ఇమ్రాన్ ఖాన్ లేఖ రాసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. కిర్జిస్తాన్ రాజధాని బిషక్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు సందర్భంగా నరేంద్రమోదీ, ఇమ్రాన్ ఖాన్ మధ్య సమావేశం ఉండబోదని భారత్ స్పష్టం చేసిన మరుసటి రోజే పాక్ ఈ లేఖ రాయడం గమనార్హం. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి ఇమ్రాన్ ఖాన్ అభినందనలు తెలిపారని, ఇరు దేశాల సత్సంబంధాలు, సమస్యల పరిష్కారం కేవలం చర్చలతోనే సాధ్యమని లేఖలో పేర్కొన్నారని పాక్ మీడియా తెలిపింది. ఇరు దేశాల సత్సంబంధాలు మెరుగుపడితే పేదరికాన్ని అధిగమించవచ్చని, ప్రాంతీయ అభివృద్ధికి కృషి చేయవచ్చని, కశ్మీర్ సమస్య పరిష్కారం కూడా చర్చలతోనే సాధ్యమని ఇమ్రాన్ ఖాన్ అభిలాషించినట్లు పేర్కొంది. అయితే ఈ లేఖపై ఇప్పటి వరకు భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక మోదీ మరోసారి ప్రధానిగా ఎన్నికైన అనంతరం కలిసి పనిచేద్దాం, చర్చించుకుందామని పాక్ కోరడం ఇది రెండోసారి. 2016లో పఠాన్‌కోట్ వైమానిక శిబిరంపై ఉగ్రవాద దాడి అనంతరం భారత్, దాయాది పాకిస్థాన్‌తో అధికారిక చర్చలను నిలిపివేసింది. ఉగ్రవాదం, చర్చలు కలిసిసాగలేవంటూ అప్పటి నుంచి దాయాదితో ద్వైపాక్షిక చర్చలకు ఫుల్స్టాప్ పెట్టింది. ఈ నెల 13, 14 తేదీల్లో బిషక్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. అటు పాక్ ప్రధాని ఇమ్రాన్ కూడా ఈ సదస్సుకు వస్తుండటంతో వీరిద్దరు భేటీ కావొచ్చునని ఊహాగానాలు వినిపించాయి. కానీ భారత్ మాత్రం పాక్ ప్రధాని ఎలాంటి సమావేశం లేదని స్పష్టం చేసింది. తనకు తెలిసినంతవరకు బిషక్‌లో ఎస్సీవో సదస్సు సందర్భంగా మోదీ, ఇమ్రాన్ ఖాన్ భేటీకి ప్లాన్ చేయలేదని, వారిద్దరి మధ్య సమావేశం ఉండే అవకాశం లేదని విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ మీడియాకు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ మాత్రం మోదీ ఘనవిజయంపై ఫోన్‌ద్వారా అభినందనలు తెలిపారని, మోదీ సైతం ఆయనకు ధన్యవాదాలు చెప్పారన్నారు. ఫిబ్రవర్ 14న పుల్వామా ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తతంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులుకాగా.. ప్రతీకారచర్యగా భారత వాయుసేన పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరపడం.. పాక్ వాయుసేన భారత్‌పై దాడికి ప్రయత్నించడంతో యుద్దం ఖాయామనే పరిస్థితి ఏర్పడింది. కానీ పాక్ భూభాగంలో చిక్కుకున్న భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్ క్షేమంగా తిరిగిరావడంతో ఈ ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్ పడింది. ఇక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం భారత్‌లో బీజేపీ ప్రభుత్వమే కొలువుదీరాలని భావించారు. బీజేపీ అయితే కశ్మీర్ అంశం కొలిక్కి వస్తుందని, కాంగ్రెస్ అయితే ఏ నిర్ణయం తీసుకోకుండా సంశయిస్తుందని ఎన్నికల ముందు ఏప్రిల్‌లో అభిప్రాయపడ్డారు. -
గగనతల నిషేధాన్ని పొడిగించిన పాక్
ఇస్లామాబాద్: భారత సరిహద్దుల్లోని గగనతలంపై విధించిన నిషేధాన్ని పాకిస్తాన్ వరుసగా రెండోసారి పొడిగించింది. మరో రెండు వారాల పాటు ఈ మార్గంలో వాణిజ్య విమాన సేవలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడులు నిర్వహించింది. దీంతో పాక్...భారత సరిహద్దుల్లోని తన గగనతలంపై వాణిజ్య విమానాలు వెళ్లకుండా నిషేధం విధించింది. మే 15తో ఇది ముగియడంతో... ఈ నెల 30 వరకు నిషేధాన్ని పొడిగించింది. తాజాగా వచ్చేనెల 14 వరకు తమ గగనతలంపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. నిషేధం కారణంగా యూరోప్, ఆగ్నేయాసియా విమానాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. -
పుల్వామా ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పురోగతి
-
జవాను సమాచారంతోనే.. పుల్వామా దాడి
భోపాల్ : హానీ ట్రాప్‌లో చిక్కిన ఓ భారతసైనికుడు సీఆర్పీఎఫ్ కదలికల సమాచారం అందించి పుల్వామా దాడికి కారణమయ్యాడని మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్), కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తులో తేలింది. సామాజిక మాధ్యమాల్లో పాక్ ఐఎస్ఐ వేసిన ఉచ్చులో భారత సైనికుడు అవినాష్ కుమార్ (25) చిక్కుకున్నాడు. స్నూఫింగ్ యాప్ ద్వారా ఓ అమ్మాయిలా మాట్లాడినట్టు జవానును మభ్యపెట్టి కీలక సమాచారాన్ని తెలుసుకున్నారని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాల దర్యాప్తులో తెలిసింది. సీఆర్పీఎఫ్ బలగాల కదలికల సమాచారం అవినాష్ ఎప్పటికప్పుడు అందజేశాడని, దీనివల్లే పుల్వామాలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేయించి 40మందిని హతమార్చారని వెల్లడైంది. మన సైనిక బలగాల సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసిన అవినాష్ కుమార్‌ను మధ్యప్రదేశ్ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. ఇండోర్ సమీపంలోని మోహో పట్టణంలోని బీహార్ రెజిమెంట్‌లో క్లర్క్‌గా అవినాష్ కుమార్ పనిచేశారు. 2018లో ఇతన్ని అసోంకు బదిలీ చేశారు. అవినాష్ తండ్రి కూడా ఆర్మీ జవానే. అవినాష్ బ్యాంకు ఖాతాలో పాకిస్థాన్ నుంచి రూ.50 వేలు డిపాజిట్ కూడా చేశారని తెలుస్తోంది. అయితే అమ్మాయితో సెక్స్ ఛాట్ చేయడంతో పాటు డబ్బుకు కక్కుర్తి పడి భారత సైనిక రహస్యాలను పాక్ ఐఎస్ఐకు అందించాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అవినాష్ కుమార్‌ను అరెస్టు చేసి భోపాల్‌లోని స్పెషల్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా అతన్ని రిమాండుకు తరలించారు. అవినాష్ ఇంట్లో పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. -
‘ఆ అందమైన మొహం ఇప్పుడు ఎక్కడ’
పట్నా : బిహార్ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మీద విమర్శల వర్షం కురిపించారు. నా మొహం చూసి జనాలు ఓట్లు వేస్తారని ప్రగల్భాలు పలికిన వ్యక్తి.. నేడు మొహం చాటేశాడు ఎందుకు అని నితీశ్ కుమార్‌ని ప్రశ్నించారు తేజస్వీ. సీఎం నితీశ్ కుమార్ నియోజకవర్గమైనా నలందలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు తేజస్వీ యాదవ్. ఈ క్రమంలో ఆయన సీనియర్ రిపోర్టర్ ప్రణయ్ రాయ్‌తో ముచ్చటించారు. నలంద ప్రజలకు నితీశ్ కుమార్ మీద ఉన్న నమ్మకం తగ్గిపోయిందన్నారు. రిజర్వేషన్ల విషయంలో నితీశ్ తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని పేర్కొన్నారు తేజస్వీ. అంతేకాక గతంలో ‘జనాలు నా మొహం చూసి ఓటు వేస్తారని చెప్పిన వ్యక్తి.. ఇప్పుడు పుల్వామా ఉగ్రదాడిని చూపించి ఓట్లు వేయమని కోరుతున్నారు. భారత ఆర్మీని, ఒకప్పుడు తాను ఎంతగానో ద్వేషించిన మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు ఎందుకు. ఇప్పుడు ఆయన అందమైన మొహం ఎక్కడ’ అని తేజస్వీ ప్రశ్నించారు. ఉగ్రవాదుల మీద దాడుల చేయడం మాత్రమే నిజమైన దేశ భక్తి అనిపించుకోదన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి.. వారిని ఆర్థికంగా బలంగా తయారు చేయడం కూడా దేశభక్తే అన్నారు. పేదరికం తొలగించడం.. యువతకు ఉపాధి కల్పించడం వంటి అంశాలన్ని కూడా దేశభక్తి కిందకే వస్తాయన్నారు తేజస్వీ. -
ఔదార్యం చాటుకున్న ‘పుల్వామా’ జవాన్
-
వైరల్ : మానవత్వం చాటుకున్న ‘పుల్వామా’ జవాన్..!
శ్రీనగర్ : పక్షవాతంతో బాదపడుతున్న ఓ బాలుడి పట్ల పుల్వామా ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇక్బాల్ సింగ్ అనే జవాన్ ఔదార్యం చాటాడు. అతనికి తన లంచ్ బాక్స్ ఇవ్వడంతో పాటు స్వయంగా ఆహారం తినిపించాడు. శ్రీనగర్‌లోని నవాకాదల్ ప్రాంతంలో శాంతిభద్రతల పర్యవేక్షణ విధులు నిర్వర్తిస్తున్న ఇక్బాల్‌కు స్థానికంగా నివాసముంటున్న ఓ పిల్లాడు తారసపడ్డాడు. అతను ఆకలితో ఉన్నాడని గ్రహించిన జవాన్ తన లంచ్ బాక్స్ ఇచ్చాడు. అయితే, సదరు బాలుడి రెండు చేతుల్లో చలనం లేదని తెలియడంతో .. తనే దగ్గరుండి తినిపించాడు. 31 సెకన్ల నిడివి గల ఈ వీడియో వైరల్ అయింది. సోల్జర్ మంచితనంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక్బాల్ ఔదార్యం మెచ్చి ‘హ్యూమన్ అండ్ సెల్ఫ్‌లెస్ యాక్ట్’ సర్టిఫికేట్ కూడా అందించామని సీఆర్పీఎఫ్ తెలిపింది. వీరత్వం, కరుణ అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు అని పేర్కొంది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఇదే కాన్వాయ్‌లోని ఓ వాహనానికి ఇక్బాల్ డ్రైవర్‌గా ఉన్నారు. క్షతగాత్రులైన సహచరులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ఆయన వారి ప్రాణాలు కాపాడారు. ఔదార్యం చాటుకున్న ‘పుల్వామా’ జవాన్ -
నాడు 170 మంది ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: బాలాకోట్‌లోని జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన(ఐఏఎఫ్) చేసిన దాడిలో ఎవ్వరూ చనిపోలేదని బుకాయిస్తున్న పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న తెల్లవారుజామున ఐఏఎఫ్ చేపట్టిన వైమానికదాడిలో 130 నుంచి 170 జైషే ఉగ్రవాదులు చనిపోయారని ఇటాలియన్ జర్నలిస్ట్ ఫ్రాన్సెక్సా మారినో తెలిపారు. ఐఏఎఫ్ దాడిలో ఘటనాస్థలిలోనే భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోగా, మరికొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని వెల్లడించారు. ఈ దాడిలో గాయపడ్డ ఉగ్రమూకలకు పాక్ మిలటరీ డాక్టర్లు వైద్యం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ మారినో రాసిన కథనాన్ని ‘స్ట్రింగర్ ఆసియా’ అనే వెబ్సైట్ ప్రచురించింది. మృతుల కుటుంబాలకు పరిహారం.. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున ఐఏఎఫ్ యుద్ధవిమానాలు బాలాకోట్‌లోని ఉగ్రస్థావరంపై బాంబుల వర్షం కురిపించాయని మారినో తెలిపారు. ‘ఈ దాడిలో 11 మంది శిక్షకులు సహా 170 మంది వరకూ చనిపోయారు. దాడి జరిగిన కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న పాక్ ఆర్మీ క్షతగాత్రులను షింకియారీ ప్రాంతంలో ఉన్న హర్కతుల్ ముజాహిదీన్ క్యాంప్‌కు తరలించింది. స్థానికుల సమాచారం ప్రకారం ఇంకా 45 మంది ఉగ్రవాదులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కోలుకున్నవారిని ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఈ మొత్తం విషయం బయటకు పొక్కకుండా జైషే నేతలు మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించారు. ఇప్పుడు జైషే క్యాంపును తాలిమున్ ఖురాన్(మదర్సా)గా మార్చేశారు. ప్రస్తుతం స్థానిక పోలీసులకు కూడా ఇక్కడ అనుమతి లేదు’ అని చెప్పారు. అవసరమైతే బాలాకోట్‌లో భారత జర్నలిస్టులను అనుమతిస్తామని పాక్ ప్రకటించిన నేపథ్యంలో మారినో ఈ కథనం రాయడం గమనార్హం. -
మసూద్ ఆస్తుల ఫ్రీజ్
ఇస్లామాబాద్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపజేయడంతోపాటు ఆయనపై ప్రయాణ నిషేధాన్ని పాక్ విధించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించడంతో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన మసూద్ ఇకపై ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కొనడం, అమ్మడం వంటివి చేయడానికి వీలు లేదు. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్ఈసీపీ) గురువారం పాకిస్తాన్‌లోని అన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఆదేశాలిస్తూ, మసూద్‌కు చెందిన అన్ని పెట్టుబడుల ఖాతాలను స్తంభింపజేయాలంది. పోలీసుల అనుమతి లేకుండా మసూద్ ఎక్కడికీ ప్రయాణిచడానికి కూడా వీలు లేదని పాక్ హోం శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. కాగా, పుల్వామా ఉగ్రవాద దాడ అనంతరమే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. -
ఉగ్రముద్రలో పుల్వామా పాత్ర
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఐరాస: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి చేసిన నోటిఫికేషన్లో పుల్వామా ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడాన్ని భారత్ తేలిగ్గా కొట్టేసింది. అజర్ ఉగ్ర కార్యకలాపాలన్నిటి గురించి ప్రకటనలో వివరంగా ఉందని పేర్కొంది. ఆ నోటిఫికేషన్ అజర్ బయోడేటా కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి రావీశ్ మీడియాతో అన్నారు. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో పుల్వామా పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు. జైషే మొహమ్మద్‌కు సంబంధించిన ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచించడంతో పాటు నిధులందించినందుకు, సహాయం చేసినందుకు గాను అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్టు యూఎన్ నోటిఫికేషన్లో స్పష్టంగా ఉందన్నారు. తమకు తగిలిన దౌత్యపరమైన పెద్ద ఎదురుదెబ్బ నుంచి దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ అర్ధంలేని ప్రకటనలు చేస్తోందని అన్నారు. పుల్వామా దాడితో అజర్‌కు ముడిపెట్టే ప్రయత్నాలతో పాటు కశ్మీర్ సహా అన్ని రాజకీయ ప్రస్తావనలను ప్రతిపాదన నుంచి తొలగించిన తర్వాతే.. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు తాము అంగీకరించామన్న పాక్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వాల నిరంతర కృషి వల్లే: కాంగ్రెస్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ఒక్క మోదీ ప్రభుత్వ ఘనతే అన్నట్టుగా చెప్పుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అది గత ప్రభుత్వాల హయాం నుంచీ జరిగిన నిరంతర కృషితో వచ్చిన ఫలితమని కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ శుక్లా చెప్పారు. పాక్ సైన్యం సరైన నిర్ణయాలు తీసుకోవాలి పాక్ ప్రధాని ‘సరైన విషయాలు’ చెబుతున్నారు కానీ ఆయన సైనిక నాయకత్వమూ సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చే పాక్ విధానాన్ని మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. కమిటీ విశ్వసనీయత పరిరక్షించబడింది అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ద్వారా ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ పవిత్రత, విశ్వసనీయత పరిరక్షించబడ్డాయని కమిటీ చైర్మన్, ఇండోనేసియా రాయబారి డియాన్ ట్రియాన్సా్యహ్ డ్జానీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సహకరించిన సభ్య దేశాలన్నిటికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ తీరును తప్పుపట్టిన బీజేపీ ఈ విషయంలో కాంగ్రెస్ తీరును బీజేపీ తప్పుపట్టింది. దేశం సాధించిన దౌత్య విజయంలో పాలుపంచుకునేందుకు విముఖత ప్రదర్శిస్తోందంటూ ధ్వజమెత్తింది. అలా చేస్తే రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నట్టుగా ఉందని విమర్శించింది. మోదీ ప్రభుత్వ నిరంతర కృషి వల్లే దేశం ఈ అతిపెద్ద దౌత్య విజయం సాధించగలిగిందని బీజేపీ నేతలు జైట్లీ, నిర్మలా సీతారామన్ గురువారం నాడిక్కడ చెప్పారు. జాతి భద్రతలో కాంగ్రెస్, బీజేపీల వైఖరుల మధ్య వైరుధ్యం స్పష్టంగా కన్పిస్తోందని జైట్లీ అన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయమని జైట్లీ అన్నారు. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం బీజేపీకి ఎన్నికల అస్త్రం ఎంతమాత్రం కాదంటూనే.. జాతీయవాదం అనేది తమ పార్టీ కి ఎప్పటికీ ప్రధానాంశమేనని నొక్కిచెప్పారు. -
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఉగ్రవాదిగా ప్రకటన
-
ఫలించిన దౌత్యం.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్
న్యూయార్క్ : దశాబ్ధ కాలంగా భారత్ చేస్తోన్న ప్రయత్నం నేటితో ఫలించింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం మసూద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ పదే పదే ఐక్యరాజ్యసమితిని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను చైనా నాలుగు సార్లు అడ్డుకున్నప్పటికీ చివరికి భారత్‌దే పైచేయి అయింది. మసూద్‌ని బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్లు భారత అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ‘అందరికీ శుభవార్త.. మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ విషయంలో అందరి సహకారం చాలా గొప్పది. అందరికీ ధన్యవాదాలు’ అని అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. Big,small, all join together. Masood Azhar designated as a terrorist in @UN Sanctions list Grateful to all for their support. 🙏🏽#Zerotolerance4Terrorism — Syed Akbaruddin (@AkbaruddinIndia) May 1, 2019 -
‘పుల్వామా దాడితో మసూద్‌కు సంబంధం లేదంటేనే’
ఇస్లామాబాద్ : ఉగ్రవాది మసూద్ అజహర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలంటూ భారత్.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాక కొన్ని రోజుల క్రితం బ్రిటన్ కూడా త్వరలోనే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తామని.. పాక్‌లోని ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో జైషే పాత్ర లేదని భారత్ ఒప్పుకుంటేనే.. మసూద్ అజహర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే అంశంపై చర్చిస్తామంటూ సదరు మంత్రి షరతులు విధించడం గమనార్హం. పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి మహ్మద్ ఫైజల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పుల్వామా ఉగ్రదాడిలో మసూద్ అజహర్ పాత్ర ఉన్నట్లు భారత్ దగ్గర ఏమైనా రుజువులున్నాయా. ఉంటే వాటిని ప్రపంచానికి చూపించాలి. ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకపోతే.. లేవని ఒప్పుకోవాలి. భారత్ అలా చేస్తేనే మసూద్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టే విషయం గురించి చర్చిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక ‘పుల్వామా దాడి అనేది ప్రత్యేక అంశం. దీన్ని.. మసూద్ అజహర్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు. కానీ ఈ విషయంలో భారత్ తీరు ఏం బాగోలేదు. కశ్మీర్లో దేశీయ తిరుగబాటును అణచివేయడానికి భారత్ చేసే ప్రయత్నాల్లో ఈ ప్రచారం ఓ భాగమే. దీని గురించి మేం ఎంత చెప్పినా ఎవరూ నమ్మడం లేద’ని ఫైజల్ పేర్కొన్నాడు. ఓవైపు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెస్తుండగా.. చైనా మాత్రం అందుకు అడ్డుతగులుతున్న సంగతి తెలిసిందే. -
పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చా
పటన్/జైపూర్: పాకిస్తాన్‌కు తాము చేసిన తీవ్ర హెచ్చరికల ఫలితంగానే భారత వైమానిక దళ(ఐఏఎఫ్) పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌ను సురక్షితంగా వెనక్కి పంపించిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో ఉగ్రవాదం అంతం కావాలంటే బీజేపీకే ఓటేయాలని ప్రజలను కోరారు. గుజరాత్‌లోని అన్ని స్థానాల్లోనూ బీజేపీనే గెలిపించాలని, లేకుంటే దేశవ్యాప్తంగా అదే పెద్ద చర్చకు దారి తీస్తుందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని పటన్, రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని ప్రసంగించారు. బాలాకోట్ దాడి అనంతరం పాక్ ప్రతీకార యత్నం, ఆ దేశ ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసే క్రమంలో అభినందన్ పాక్ సైన్యానికి పట్టుబడటం, ఆ తర్వాత విడుదలైన తీరును ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘అభినందన్ శత్రుదేశానికి పట్టుబడటంపై ప్రతిపక్షాలు నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాయి. దీంతో ప్రధాని పదవి ఉన్నా పోయినా ఒకటే. అయితే నేనైనా ఉండాలి లేదా ఉగ్రవాదులైనా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే, మీడియా సమావేశం పెట్టి, మా పైలట్‌కు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని, ఆ తర్వాత మోదీ ఏం చేశాడో మీరు ప్రపంచానికి చెప్పుకోవాల్సి ఉంటుందని పాక్‌ను హెచ్చరించా. ‘పాక్‌పై దాడి చేసేందుకు మోదీ వద్ద 12 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. దాడి జరిగితే పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అంటూ ఆ మరునాడే అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. దీంతో దిగివచ్చిన పాక్, అభినందన్‌ను వెనక్కి పంపుతున్నట్లు ప్రకటించింది. లేకుంటే పాక్‌కు ఆ రాత్రి కాళరాత్రే అయి ఉండేది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘పుల్వామా ఘటన అనంతరం ప్రజలు మోదీ నుంచి ఏం ఆశించారు? ముంబై ఉగ్రదాడుల తర్వాత మన్మోహన్సింగ్ మాదిరిగా వ్యవహరించి ఉంటే దేశం నన్ను క్షమించేదా? అందుకే సైన్యానికి పూర్తి అధికారాలిచ్చా. పాకిస్తాన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ, హనుమాన్ భక్తుల్లాగా మన వాళ్లు బాలాకోట్‌పై విరుచుకుపడి, వాళ్ల అంతు చూశారు’ అని తెలిపారు. బాలాకోట్ దాడి ప్రతిపక్షాలకు అసౌకర్యంగా మారిందన్న ప్రధాని..భారత్ తమపై దాడి చేసిందంటూ పాక్ పదేపదే చెబుతుంటే మన ప్రతిపక్షాలు కూడా బాలాకోట్ భారత్‌లోనే ఉందన్నట్టుగా ఆధారాలు చూపాలంటూ గగ్గోలు పెట్టాయని ఆరోపించారు. ప్రధాని మోదీ ఎప్పుడు ఎలా స్పందిస్తారోనని తనకు భయంగా ఉందన్న ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. ‘రేపు మోదీ ఏం చేస్తాడో శరద్ పవార్‌కే తెలియనప్పుడు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎలా తెలుస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. శరద్‌పవార్ తనకు రాజకీయ గురువు అని గతంలో ప్రధాని మోదీ ప్రకటించారు. కమలంతో ఉగ్రవాదం అంతం ‘కష్ట సమయంలో శ్రీలంక ప్రజలకు తోడుగా ఉంటాం. వారికి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధం’ అని ప్రకటించారు. ‘మీరు పోలింగ్ బూత్‌కు వెళ్లి, కమలం(బీజేపీ ఎన్నికల చిహ్నం) గుర్తు మీట నొక్కేటప్పుడు.. అది ఉగ్రవాదాన్ని అంతం చేసే మీట అని గుర్తుంచుకోండి. మీ వేలికి అంతటి శక్తి ఉంది. మీరు మీట నొక్కడం ద్వారా ఉగ్రవాదంపై పోరాడాలన్న నా సంకల్పం బలపడుతుంది’ అని అన్నారు. అన్ని సీట్లూ నాకే ఇవ్వండి బీజేపీని గెలిపించాలని గుజరాత్ ప్రజలను కోరిన ప్రధాని.. ‘ఈ గడ్డపై పుట్టిన బిడ్డ యోగక్షేమాలు చూసుకోవడం నా సొంత రాష్ట్రం ప్రజల ధర్మం. రాష్ట్రంలోని 26 లోక్‌సభ స్థానాలను నాకు ఇవ్వండి. మీ సహకారంతో నా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది. ఒకవేళ మీరు బీజేపీకి 26 సీట్లు ఇవ్వకుంటే ఎందుకలా జరిగిందంటూ మే 23వ తేదీ(ఎన్నికల ఫలితాల రోజు)న టీవీల్లో చర్చలు మొదలవుతాయి’ అని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో అభిమానులు బహూకరించిన తన చిత్తరువుతో ప్రధాని మోదీ -
తిరిగి విధుల్లోకి అభినందన్!?
న్యూఢిల్లీ : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి భారతావని నీరాజనాలు అందుకున్న భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్ త్వరలోనే తిరిగి విధుల్లో చేరనున్నారు. అయితే గతంలో ఆయన పనిచేసిన శ్రీనగర్ ఎయిర్‌బేస్‌లో కాకుండా మరో చోట పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు... ‘ ధైర్యసాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్‌కు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశాం. పాక్ సరిహద్దులోని ఓ ఎయిర్‌బేస్‌లో తను విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. అయితే అది శ్రీనగర్లోనా.. మరే ఇతర చోటా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే అతడు తన విధుల్లో చేరతాడు’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శత్రు సైన్యం చెర నుంచి విముక్తి పొందిన అభినందన్ మానసిక స్థితిని విశ్లేషించేందుకు డీబ్రీఫింగ్ సెషన్(తీవ్రమైన ఒత్తిడికి గురైన సైనికుడికి నిర్వహించే వైద్య పరీక్షలు) నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన తిరిగి విధుల్లో చేరనున్నారు. -
‘పుల్వామా దాడికి ప్లాన్ చేసింది ఆయనే’
సిహోర్(మధ్యప్రదేశ్): పుల్వామా ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ హస్తం ఉందని మిజోరం మాజీ గవర్నర్, కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషీ సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పుల్వామా దాడికి మోదీ ప్లాన్ చేశారని వ్యాఖ్యానించారు. మోదీ కుట్రకు ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌లో అత్యధిక లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. 27 స్థానాల్లో 20కిపైగా సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్‌పై పోటీకి బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఓటమి ఖాయమన్న భయంతో ఇక్కడ బీజేపీ వెనుకడుగు వేస్తోందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఓటు అడిగే హక్కు కమలనాథులకు లేదన్నారు. బీజేపీ పాలనలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని, దీంతో నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ మధ్య ‘మ్యాచ్ ఫిక్సింగ్’లో భాగంగానే పుల్వామా దాడి జరిగిందని కాంగ్రెస్ నాయకుడు బీకే హరిప్రసాద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లితోపొరా ప్రాంతంలో ఆత్మాహుతి దాడి చేయడంతో 40 మంది సీఆర్ఫీఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే-ఈ-మహ్మద్ ప్రకటించుకుంది. -
తొలిదశ ఎన్నికల వేళ పాక్ అనూహ్య నిర్ణయం
ఇస్లామాబాద్ : పుల్వామాలో భారత్ సీఆర్పీఎఫ్ జవాన్ల మీద జరిగిన దాడికి ప్రతీకారంగా.. బాలాకోట్‌లోని జైషే ఉగ్ర స్థావరాలపై భారత్ వైమనిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని భారత్ ఆరోపిస్తుండగా.. పాక్ మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాక్ తొలిసారి భారత్ వైమానిక దాడులు జరిపిన బాలాకోట్ పరిసర ప్రాంతంలో సందర్శించడానికి అంతర్జాతీయ మీడియాను అనుమతించింది. భారత్ వైమనిక దాడి చేసిన 43 రోజుల తర్వాత.. భారత్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు పాక్ ఈ పర్యటనకు అనుమతించడం పట్లా సర్వత్రా ఉత్కంఠతకు తెర తీసింది. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన వ్యక్తులతో పాటు.. వివిధ దేశాల దౌత్యవేత్తలు.. భద్రతా బలగాలకు చెందిన దాదాపు 24 మంది పర్యటనలో పాల్గొన్నారని సమాచారం. పాక్ అధికారులు వీరందరిని దాడి జరిగినట్లుగా చెప్పబడుతున్న ప్రాంతానికి తీసుకెళ్లారు. భారత వైమానకి దళం దాడి జరపిన ప్రాంతం ఉగ్రవాద శిబిరం కాదని.. అది ఒక మదర్సా అని పాక్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మదర్సాలో దాదాపు 130 దాకా విద్యార్థులున్నట్లు సమాచారం. అంతేకాక ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ అధికారి ఒకరు.. ‘అంతర్జాతీయ మీడియాతో పాటు భారత్‌కు చెందిన జర్నలిస్టులు.. దౌత్యవేత్తలు, భద్రతా సిబ్బంది బాలాకోట్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం ఇక్కడ దాడులకు పాల్పడింది. భారత్ చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఎలాంటి ఉగ్ర సంస్థలు లేవు. భారత్ నియమాలను ఉల్లఘించి వైమానిక దాడి జరిపింది ఓ మదర్సా మీద. వాస్తవ పరిస్థితులను తెలుసుకొండి. భారత్ చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి’ అంటూ ట్వీట్ చేశారు. A group of international media journalists mostly India based and Ambassadors & Defence Attachés of various countries in Pakistan visited impact site of 26 February Indian air violation near Jabba, Balakot. Saw the ground realities anti to Indian claims for themselves. pic.twitter.com/XsONflGGVP — Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) April 10, 2019 -
మోదీ గెలిస్తేనే మంచిది : పాక్ ప్రధాని
ఇస్లామాబాద్ : కశ్మీర్ అంశంపై శాంతి చర్చలు జరగాలంటే మళ్లీ నరేంద్రమోదీనే ప్రధాని కావాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే శాంతి చర్చలకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ గెలిస్తే శాంతి చర్చలు నిర్వహించడానికి భయపడుతుందని విదేశీ జర్నలిస్టులతో వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ చానెల్ పేర్కొంది. బీజేపీ గెలిస్తే కశ్మీర్ అంశం కొలిక్కి వస్తుందని, కొన్ని సెటిల్మెంట్లు జరుగుతాయన్నారు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న పరిణామాలను తానెప్పుడు ఊహించలేదన్నారు. తనకు భారత్‌లోని చాలా మంది ముస్లింలు తెలుసని, వారి ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నారని, కానీ ప్రస్తుతం వారు హిందుత్వ జాతీయవాదంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ను తలపిస్తున్నారని, ఆయన తరహాలో భయం, జాతీయవాదం అన్న సిద్ధాంతంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ఓ రాజకీయ అంశమని, దానికి మిలిటరీ పరిష్కారం లేదన్నారు. పాక్ మిలిటెంట్లు దాడి చేసినప్పుడుల్లా కశ్మీరీలు నష్టపోయారని, తోటివారితో శాంతి సంబంధాలు కలిగి ఉండడం పాక్‌కు అవసరమన్నారు. ఇప్పటికే పాక్‌లోని ఉగ్రవాదులను పాక్ సైన్యం ఏరివేసిందని, ఈ విషయంలో ప్రభుత్వం వారికి పూర్తి మద్దతిస్తుందన్నారు. మోదీపై వ్యతిరేకత వ్యక్తమైతే.. భారత సైన్యం చేత పాక్‌పై దాడి చేయించే అవకాశం ఉందన్నారు. ఇక పుల్వామా ఉగ్రదాడితో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీనికి ప్రతీకారంగా భారత వాయుసేన పాక్ భూభాగంపై దాడి చేయడం.. పాక్ వైమానిక దళం భారత్‌పై దాడులు చేసే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. -
మీ ఓటు వీర జవాన్లకే!
ఔసా(మహారాష్ట్ర)/చిత్రదుర్గ: పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్రవాదుల పని పట్టిన వీర జవాన్లకు తమ ఓటుహక్కును అంకితం చేయాలని తొలిసారి ఓటేయబోతున్న యువజనులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘మీ తొలి ఓటును వీర జవాన్లకు అంకితమిస్తారా? పుల్వామాలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు అంకితమిస్తారా? ఏ ఎన్నికల్లో ఎవరికి తొలి ఓటు వేశారో ఎన్నటికీ మరచిపోరు’ అని అన్నారు. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఔసాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. స్వాతంత్య్రం రావడానికి ముందు కాంగ్రెస్ నేతలు తెలివిగా వ్యవహరిస్తే అసలు పాకిస్తాన్ అనే దేశమే పుట్టేది కాదని అన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని ఉండాలని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ మద్దతు పలకడం ఎంత వరకు సబబమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పాక్ పల్లవి.. కాంగ్రెస్ మేనిఫెస్టో పాకిస్తాన్ భాషలో మాట్లాడుతోందని అన్నారు. ఉగ్రవాదుల సొంత గడ్డకు చొచ్చుకెళ్లి వారిని మట్టుపెట్టడమే బీజేపీ ప్రతిపాదించిన నవ భారత్ విధానమని చెప్పారు. సాయుధ బలగాల అధికారాల్లో కోత విధించాలని కాంగ్రెస్ భావిస్తోందని, పాక్ కూడా ఇదే కావాలని అన్నారు. అలా అయితే భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతిని మాత్రమే నిజాయతీతో చేసిందని చురకలంటించారు. ఇటీవల జరిగిన వరస ఐటీ దాడుల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ముఖ్యుల ఇళ్ల నుంచే పెట్టెల కొద్దీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయని గుర్తుచేశారు. గత ఆరు నెలలుగా చౌకీదారునే దొంగ అంటున్నారని, కానీ ఈ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు దొంగ ఎవరు? అని ప్రశ్నించారు. చాన్నాళ్ల తరువాత తనతో వేదిక పంచుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తనకు తమ్ముడు లాంటి వారని అన్నారు. భారత్ వ్యవహారాల్లో పాకిస్తాన్ మళ్లీ తలదూర్చకుండా గట్టిగా దెబ్బకొట్టాలని మోదీని ఉద్ధవ్ కోరారు. ఉగ్రవాదుల్లో భయం పుట్టించాం.. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన మరో ర్యాలీలో మోదీ మాట్లాడారు. బాలాకోట్ దాడి తరువాత ఉగ్రవాదుల్లో భయం పుట్టిందని, పాకిస్తాన్లో అధికారంలో ఉన్న వారిని పీడకలలు వెంటాడాయన్నారు. వైమానిక దాడుల తరువాత ప్రపంచం మొత్తం భారత్‌కు మద్దతుగా నిలిస్తే కాంగ్రెస్–జేడీఎస్‌లు దుఃఖంలో మునిగాయన్నారు. అధికారం, స్వప్రయోజనాల కోసమే ఈ పార్టీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. పటిష్ట ప్రభుత్వం రావాలంటే ఆలోచించి ఓటేయాలని యువతను కోరారు. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో కూడిన ప్రభుత్వం ఏర్పాటైతేనే శక్తిమంతమైన భారత్ సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. -
‘పుల్వామా దాడి గురించి ముందే తెలుసు’
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని దేశం ఎన్నటికి మర్చిపోదు. ఈ దారుణ సంఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి గురించి తనకు ముందే తెలుసు అంటున్నాడు జైషే మహ్మద్ కమాండర్ నిసర్ అహ్మద్ తంత్రి. ఈ దాడికి సంబంధించి విచారణ నిమిత్తం నిసర్ను రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి ఇండియాకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిసర్ అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సూచనలతోనే ఈ దాడి జరిగిందని నిసర్ తెలిపాడు. ఈ దాడిలో ప్రధాన కుట్రదారైన ముదాసిర్ ఖాన్ దాడి చేయడానికి ముందు తనకు ఫోన్ చేశాడని.. త్వరలో తాము జరపబోయే బ్రహ్మాండమైన దాడిలో భాగం కావాల్సిందిగా తనను కోరాడని వెల్లడించాడు. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సూచనల మేరకే ఈ దాడి చేయబోతున్నట్లు ముదాసిర్ తనకు చెప్పాడని నిసర్ పేర్కొన్నాడు. జైషే సంస్థకు చెందిన ఒక కమాండర్ పుల్వామా దాడిలో జైషే పాత్ర ఉన్నట్లు ధ్రువీకరించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈ విషయంలో భారత్ ఇప్పటివరకూ ఇంటెలిజెన్స్ సమాచారంపై ఆధారపడుతూ వచ్చింది. అయితే ఈ విషయాల గురించి విచారణతో సంబంధం ఉన్న ఓ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. -
మోదీ, రాహుల్ కోసం నా తండ్రి చావలేదు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘మోదీ కోసమో, రాహుల్ కోసమో నా తండ్రి చనిపోలేదు. భారత్ కోసం చనిపోయారు. మన సైనికులను లాగకుండా మీరు ఎన్నికల్లో పోటీ చేయలేరా? ఎన్నికలైతే మీరు కచ్చితంగా మమ్మల్ని మరచిపోతారు. అది మాకు తెలుసు’ సూటిగ గుండెల్లో గుచ్చుకునే ఈ మాటలు అన్నది ఎవరో కాదు, పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లలో ఒకరైన కౌశల్ కుమార్ రావత్ కూతురు అపూర్వ రావత్. ‘భారత్ సైన్యానికి చెందిన ఎవరిని మీరు రాజకీయాల్లోకి లాగినా మీరు వారిని అవమానించినట్లే. సైనికులేమి ప్రధానికి చెందిన వారు కాదు’ అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. భారత సైన్యాన్ని ‘మోదీకీ సేన’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని అపూర్య అలా మాట్లాడి ఉండవచ్చు. ‘భారత సైన్యం ఏ రాజకీయ పార్టీకే, ఏ రాజకీయ నాయకుడికో చెందినది కాదు. దేశంలోని ప్రతి ఒక్కరిది. నా తండ్రి చనిపోయారని వార్త తెల్సిన తర్వాత రాజకీయ నాయకులు తండోపతండాలుగా మా ఇంటికి వచ్చి కుటుంబం పట్ల ఎనలేని సానుభూతి కురిపించారు. మమ్మల్ని విసిగించారు. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి పోయారు. ఆ తర్వాత ఫోన్లు చేస్తే ఒక్కరంటే ఒక్కరి నుంచి కూడా సమాధానం లేదు’ అని ‘తిరంగ టీవీ’ షోకు తన తల్లి మమతా రావత్‌తో హాజరైన అపూర్వ రావత్, రాజకీయ నేతలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆమె వ్యాఖ్యలను సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్ ట్వీట్ చేశారు.