సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జరిపిన మెరుపు దాడులు అనంతరం దేశంలోకి చొరబాట్లు 43 శాతం తగ్గాయని ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌లో వెల్లడించింది. గత ఏడాది తొలి ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది ప్రధమార్ధంలో జమ్ము కశ్మీర్‌లో భద్రతా పరిస్థితి మెరుగైందని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.
సీమాంతర చొరబాట్లను ప్రభుత్వం ఉపేక్షించకుండా భద్రతా చర్యలను ముమ్మరం చేసిందని తెలిపింది. జమ్ము కశ్మీర్ ప్రభుత్వంతో కలిసి భద్రతా దళాలు దేశ సరిహద్దుల్లో నిరంతర నిఘా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో చొరబాట్లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత వైమానికదళం పీఓకేలోని బాలాకోట్‌లో మెరుపు దాడులు చేపట్టి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment