air strikes
-
లెబనాన్‌లో 52కు చేరిన మృతులు
బీరుట్: లెబనాన్‌లోని బెకా లోయపై ఇజ్రాయెల్ ఆర్మీ శుక్రవారం జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 52కు చేరింది. మరో 72 మంది గాయపడ్డారు. బాల్బెక్ నగరం సహా కనీసం 25 పట్టణాలు, గ్రామా ల్లోని లక్ష్యాలపై దాడులు జరిగాయి. భవనా లు శిథిలాల దిబ్బలుగా మారాయని, ఇంకా చాలా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని స హాయక సిబ్బంది అంటున్నారు. పర్వత శ్రే ణుల మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలోని కుగ్రా మాల్లో వ్యవసాయమే ప్రధానవృత్తి. ఆలివ్, ద్రాక్ష తోటలు, మద్యం తయారీ యూనిట్లకు ప్రసిద్ధి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఆర్మీ ఈ ప్రాంతం జోలికి వెళ్లలేదు. ఒక్కసారిగా జరిగిన భీకర వైమానిక దాడులతో భీతిల్లిన జనం ఇళ్లు విడిచి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. Smoke seen rising from several high-rise buildings in the Al-Hosh area of Tyre, Lebanon, following Israeli airstrikes. Footage captured the aftermath, with planes still circling overhead pic.twitter.com/saPah5YiZG— RT (@RT_com) November 2, 202424 గంటల్లో 84 మంది గాజా ఉత్తరప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 24 గంటల వ్యవధిలో 50 మంది చిన్నారులు సహా 84 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది వరకు గాయాలపాలయ్యారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. ఖాన్‌యూనిస్‌లో జరిపిన దాడిలో హమాస్ సీనియర్ అధికారి ఇజ్ అల్– దిన్ కస్సబ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. దీనిపై హమాస్ స్పందించలేదు. -
భయానక వీడియో.. ఇజ్రాయెల్ భీకర దాడులు
బీరుట్: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడులకు సంబంధించిన భీకర వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. భయానక బాంబు దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. హిజ్బుల్లా టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇక, తాజాగా ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. భూగర్భంలో ఉన్న హిజ్బుల్లా నేతలను టార్గెట్ చేసి దాడులు చేసింది. బాంబు దాడిలో అక్కడున్న నివాసాలు అన్ని ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఆహారం మరియు కమ్యూనికేషన్ పరికరాల ఉన్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. గాజా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అక్టోబరు 1న తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ నేరుగా విరుచుకుపడింది. దాదాపు 100 యుద్ధ విమానాలు, డ్రోన్లు.. జోర్డాన్, సిరియా, ఇరాక్ గగనతలాల మీదుగా దాదాపు 2,000 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై బాంబుల, క్షిపణుల వర్షం కురిపించాయి. It's mind-boggling how obsessed the Zionists are with destruction and death. Israel's Channel 12 publishes the massive explosion in south Lebanon that triggered an earthquake alert in the north yesterday morning pic.twitter.com/zmOfZcx2Ec— Abier (@abierkhatib) October 27, 2024 -
ఇరాన్‌పై దాడి.. మూడు దేశాల గగనతలం మూసివేత
టెహ్రాన్:తమపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇవాళ(శనివారం) తెల్లవారుజామున పెద్దఎత్తున దాడులు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలే టార్గెట్‌గా క్షిపణుల దాడి జరిపింది. దీంతో ఒక్కసారిగా పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్స్ కారణంగా విమాన సర్వీసులు నిలిపివేశారు. ఫ్లైట్ రాడార్ 24, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం.. మూడు దేశాలు( ఇరాన్, ఇరాక్, సిరియా) మీదుగా ఏ విమానమూ ప్రయాణించడం లేదు.ఈ మూడు దేశాల మధ్య విమనాలు ప్రయాణించే గగనతలం మూసివేశారు. అయితే.. దాడులు ముగిసిన అనంతరం గగనతలంలో విమాన సర్వీసుల ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా కొన్ని గంటల పాటు జోర్డాన్, ఇజ్రాయెల్ గగనతలం మూసివేయబడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.The airspace of #Iran, #Iraq, #Jordan, #Syria and #Israel is closed as Israeli war planes attack various locations in Iran for the last few hours. pic.twitter.com/5MEcNGaiNk— Hamdan News (@HamdanWahe57839) October 26, 2024అక్టోబర్ 1న హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్‌పై 200కుపైగా రాకెట్లు, క్షిపణుల ప్రయోగించింది. ఇరాన్ వైమానిక దాడులకు ప్రతీకంగా ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసింది. ఇజ్రాయల్ చేసిన దాడులపై ఇరాన్ స్పందించింది. ‘‘శనివారం తెల్లవారుజాము నుంచి ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇలామ్, ఖుజెస్తాన్, టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలను ఐడీఎఫ్ లక్ష్యంగా దాడులు జరిపింది. అయితే ఈ దాడులు పరిమిత నష్టాన్ని మాత్రమే కలిగించాయి" అని ఓ ప్రకటనలో పేర్కొంది. -
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 33 మంది మృతి
గాజాలో హమాస్ అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసింది. శుక్రవారం సాయంత్రం జబాలియా క్యాంప్‌లోని అనేక ఇళ్లపై జరిగిన బాంబు దాడుల్లో సుమారు 33 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మృతిచెందిన వారిలో 21 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. శిథిలాలు, భవనాల కింద చిక్కుకున్న అనేక మంది బాధితు ఉన్నారని పేర్కొంది. మొత్తం మరణాలు సంఖ్యల కూడా 50కి పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. బాంబుల దాడిలో 85 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. అయితే.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా స్పందించకపోవటం గమనార్హం.IT DOESN’T STOP #SaveNorthGaza At least 33 Palestinians were killed and 50 wounded in an Israeli strike on Jabalia refugee camp in north Gaza.Numbers expected to rise— Dr. Renee Levant (@ReneeLevant) October 19, 2024 అక్టోబర్ 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్ సరిహద్దు గుండా హమాస్ విధ్వంసానికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌లో హమాస్‌ను అంతం చేయటమే టార్గెట్‌గా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ కొనసాగుతున్న దాడుల్లో ఇప్పటివరకు 42,500 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.చదవండి: సిన్వర్ మృతి వీడియోతో పాలస్తీనా కట్టలు తెగిన ఆగ్రహం -
మిస్టరీగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ జాడ!
ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ కీలక నేతలను అంతం చేయాటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులను జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 7 దాడుల రూపకర్త, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ జాడ మిస్టరీగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఆయన బతికే ఉన్నారా? లేరా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే యాహ్యా సిన్వార్‌కు సంబంధించి.. ఖతార్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం మొదటి నుంచి ఖతార్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. గత వారం రోజులుగా సిన్వార్ తమకు టచ్‌లో లేరని ఖతార్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం.. తమతో ఆయన కమ్యూనికేషన్‌కు సంబంధించి కీలక విషయాలను వింటారనే భయంతో సిన్వార్ ప్రస్తుతం పెన్, పేపర్లతో మాత్రమే కమ్యూనికేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనతో మధ్యవర్తిత్వ చర్చలకు జరపడానికి తమకు సవాల్‌గా మారిందని తెలిపారు. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు హమాస్ స్పందించలేదు.ఇక.. సిన్వార్ తన చుట్టూ ఇజ్రాయెల్ బందీలను రక్షణగా పెట్టుకొని ఉన్నారని ఇజ్రాయెల్ స్థానిక మీడియా ఓ నివేదిక ప్రచురించింది దీంతో హమాస్ చీఫ్ వైమానిక దాడిలో మరణించి ఉండవచ్చనే ఊహాగానాలకు తెరపడినట్లైంది. మరోవైపు.. కాల్పుల ఒప్పందానికి విరుద్ధంగా ఇజ్రాయెల్ దాడులతో హత్యల విధానాన్ని కొనసాగిస్తోందని ఖతార్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మాజీ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ అంతం చేసింది. ప్రస్తుతం హమాస్‌కు కీలకమైకన నేతగా ఖలీద్ మషాల్ ఉన్నారు. ఆయన హనియే కంటే చాలా బలవంతుడని ఖతార్ అధికారులు తెలిపారు.చదవండి: మీరెన్ని చెప్పినా.. ఇరాన్‌పై మా యుద్ధం ఆగదు : ఇజ్రాయెల్ ప్రధాని -
బీరూట్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. ఆరుగురి మృతి
ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని బీరూట్‌లో మరోసారి దాడులతో విరుచుకుపడింది. తాజాగా గురువారం తెల్లవారుజామున బచౌరా జిల్లాలోని హెజ్బొల్లా రెస్క్యూ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. బీరూట్‌లోని దాహియాలో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను హతమార్చిన ప్రదేశంలోనే ఇజ్రాయెల్ సైన్యం మూడు మిసైల్స్‌తో దాడి జరిపింది.#WATCH | A plume of smoke billows into the sky in Beirut, Lebanon.Reuters reports that Israel bombed central Beirut in the early hours of 3rd Oct, killing at least six people, after its forces suffered their deadliest day on the Lebanese front in a year of clashes against… pic.twitter.com/UiHcoe0AFr— ANI (@ANI) October 3, 2024వారం రోజుల్లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన రెండో దాడి ఇది. హెజ్బొల్లాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఉత్తర సరిహద్దును కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులతో బీరూట్ ప్రాంతంలో పొగలు తీవ్రమైన పొగలు కమ్ముకున్నాయి.మరోవైపు.. లెబనాన్‌లో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తమ దేశానికి చెందిన ఓ పౌరుడు మృతి చెందినట్లు అమెరికా ఓ ప్రకటన విడుదల చేసింది. మృతి చెందిన అమెరికా పౌరుడు కామెల్ అహ్మద్ జావెద్‌కు సంతాపం ప్రకటించినట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.చదవండి: ‘హత్యకు ముందే కాల్పుల విరమణకు నస్రల్లా అంగీకారం’ -
ఇజ్రాయెల్ దాడిలో 105 మంది మృతి
బీరూట్ : లెబనాన్ తీవ్రవాద గ్రూప్ హెజ్బొల్లాను కూకటి వేళ్లతో పెకిలించి వేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వడివడిగా అడుగులు వేస్తోంది భూతల,వైమానిక దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా, లెబనాన్ రాజధాని బీరూట్‌లో తొలిసారి జనావాసాల్లో హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఆదివారం జరిపిన దాడుల్లో సుమారు 105 మంది మరణించారు. 359 మందికిపైగా గాయపడ్డారు.లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన దక్షిణ నగరం సిడాన్ సమీపంలో ఘోరమైన వైమానిక దాడులు జరిగాయని తెలిపారు. తూర్పు, దక్షిణ, బీరుట్ చుట్టుపక్కల ప్రాంతాలలో డజన్ల కొద్దీ మంది మరణించారని చెప్పారు. సోమవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు.రెండు వారాల క్రితం ఇజ్రాయెల్..హెజ్బొల్లా సభ్యులపై దాడుల ముమ్మరం చేసిన నాటి నుండి 1,000 మందికి పైగా మరణించారని, 6,000 మంది గాయపడ్డారని లెబనాన్ పేర్కొంది.రాయిటర్స్ ప్రకారం, బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగిన ప్రాంతంలో హెజ్బొల్లా సంస్థ అధినేత హసన్ నస్రల్లాను మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్.. 20 మంది హెజ్బొల్లా అగ్రనేతల్ని హత మార్చింది. వారిలో నస్రల్లా,నబిల్ కౌక్‌తో పాటు ఇతర నేతలు ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లెబనాన్‌పై దాడిని కొనసాగించాలని ఆదేశించారు. హెజ్బొల్లాపై చేస్తున్న దాడుల కారణంగా సామాన్యులు నష్టపోకూడదని, వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. -
టార్గెట్ ఐసిస్..సిరియాపై అమెరికా దాడులు
వాషింగ్టన్:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఓ పక్క లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తుండగానే సిరియాలో ఉగ్రవాద స్థావరాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అగ్రదేశం ప్రకటించింది.మరణించిన ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐసిస్),అల్‌ఖైదాతో లింకున్న సంస్థలకు చెందినవారని అమెరికా వెల్లడించింది.హతమైన వారిలో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలిపింది.అల్‌ఖైదాతో లింకున్న హుర్రాస్ అల్దీన్ గ్రూపునకు చెందిన ఉగ్రవాదులు టార్గెట్‌గా వాయువ్య సిరియాపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇదీ చదవండి: హెజ్బొల్లాకు మళ్లీ షాక్..మరో ముఖ్యనేత హతం -
హెజ్బొల్లా వారసుడు హషీం?
ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల ధాటికి లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా కకావికలవుతోంది. ముఖ్యంగా అగ్ర నాయకత్వమంతా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది ముందు సంస్థ ఆపరేషన్స్ చీఫ్ ఇబ్రహీం అకీల్, తర్వాత టాప్ కమాండర్ ఫౌద్ షుక్ర్. ఇప్పుడు తాజాగా ఏకంగా సంస్థ అధినేత నస్రల్లా. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా అగ్ర నేతలందరినీ రోజుల వ్యవధిలోనే మట్టుపెట్టింది ఇజ్రాయెల్. శుక్రవారం నాటి దాడుల్లో నస్రల్లాతో పాటు కనీసం మరో ఇద్దరు అగ్ర నేతలు కూడా మరణించారు. దాంతో హెజ్బొల్లాలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. మూడు దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాది. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న పెను దాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లో ఇప్పటికే ఈ మేరకు కథనం కూడా వెలువడింది. హషీం ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాల చీఫ్‌గా ఉన్నాడు. శుక్రవారం నాటి హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ లక్షిత దాడుల్లో అతను కూడా మరణించినట్టు తొలుత వార్తలొచి్చనా అదేమీ లేదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తదితర వార్తా సంస్థలు తేల్చాయి. హషీం ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాలు చూడటమే గాక సంస్థ జిహాద్ కౌన్సిల్లో కీలక సభ్యుడు కూడా. 2017 లోనే అమెరికా అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. పైగా హెజ్బొల్లాకు కొమ్ముకాసే ఇరాన్‌తో అతనికి అతి సన్నిహిత సంబంధాలున్నాయి. 2020లో అమెరికా మట్టుపెట్టిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీ కూతురు జైనబ్‌కు హషీం మామ అవుతాడు. నస్రల్లా మాదిరిగానే ఇతను కూడా మతాధికారే. తలపాగతో అచ్చం నస్రల్లాను తలపిస్తాడు. 1964లో దక్షిణ లెబనాన్‌లో పుట్టాడు. 1990ల్లో ఇరాన్ లో ఉన్నత చదువులు చదువుతుండగానే హెజ్బొల్లా అతన్ని వెనక్కు పిలిపించింది. తర్వాత ఏడాదికే నస్రల్లా హెజ్‌బొల్లా్ల చీఫ్ అయ్యాడు. రెండేళ్లకే హషీం సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సార థి అయ్యాడు. నాటినుంచే నస్రల్లా వారసునిగానూ గుర్తింపు పొందుతూ వస్తున్నాడు. విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలు తదితరాలు చూసుకుంటున్నాడు. మారిన పరిస్థితుల్లో హెజ్బొల్లాకు సారథి కావాలంటే సంస్థ ఇతర అగ్ర నేతలతో పాటు ఇరాన్ మద్దతునూ హషీం కూడగట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ హతం
బీరూట్ : హిజ్బుల్లాను ఇజ్రాయెల్ ఆర్మీ చావుదెబ్బ తీసింది. ఇప్పటికే సోమవారం హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హత మార్చగా.. మంగళవారం హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ ప్రాణాలు తీసినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) లెబనాన్ రాజధాని బీరూట్‌లో దక్షిణ శివారు ప్రాంతమైన దహియే జిల్లాలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇబ్రహీం ఖుబైసీ మరణించారని తెలుస్తోంది. ఆయన మరణంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.హిజ్బుల్లా రాకెట్,క్షిపణి విభాగానికి కమాండర్ ఇబ్రహీం ఖుబైసీపై దాడి జరిగిన సమయంలో ఆయనతో పాటు మరో ఐదుమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా,లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సోమవారం మరణించిన వారి సంఖ్య 558కి పెరిగింది. అదే సమయంలో, 1835 మంది తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ తెలిపారు.🔴LEBANON 🇱🇧-ISRAEL 🇮🇱| Several sources claim that one of the Hezbollah Commander, Ibrahim #Qubaisi, was killed during an Israeli airstrike on Tuesday 09/24 in Dahiya, #Beirut. Ibrahim Qubaisi was until then the commander of #Hezbollah's rocket division. #MiddleEastTensions pic.twitter.com/iKJpGaNZ6c— Nanana365 (@nanana365media) September 24, 2024చదవండి : వ్యతిరేకిస్తే అంతే.. న్యూస్ లైవ్ టెలీకాస్ట్‌లో జర్నలిస్ట్‌పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి -
అవును.. తప్పు చేశాం: ఇజ్రాయెల్ ప్రధాని
టెల్ అవీవ్: రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన మారణహోమం.. అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటన చేశారు.‘‘సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈ విషాదకర ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తు చేస్తాం’’ అని పేర్కొన్నారు. అలాగని అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతిమ విజయం సాధించేవరకు యుద్ధం ఆపబోమని తెలిపారు.మరోవైపు హమాస్ కమాండర్లు ఉన్నారన్న సమాచారంతోనే దాడి చేశామని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని ఒకవైపు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలిచ్చినా, మరోవైపు అమెరికా సహా ప్రపంచమంతా కోరుకుంటున్నా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో.. సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో దాడులు జరిపింది. అప్పటికే అక్కడ గుడారాలు వేసుకుని ఉన్న పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. ఆదివారం రాత్రి రఫాపై జరిగిన ఈ భీకర వైమానిక దాడిలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే. ఇప్పటివరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ దాడికి సంబంధించి హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.మిత్రదేశాల ఖండనఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ సహా స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్, తుర్కీయేలు తీవ్ర స్వరంతో ఖండించాయి. ‘‘ఈ ఆపరేషన్లను ఆపాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. తక్షణం కాల్పుల విరమణ పాటించాలి’’ అని ‘ఎక్స్’ వేదికగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ పేర్కొన్నారు. Outraged by the Israeli strikes that have killed many displaced persons in Rafah.These operations must stop. There are no safe areas in Rafah for Palestinian civilians.I call for full respect for international law and an immediate ceasefire.— Emmanuel Macron (@EmmanuelMacron) May 27, 2024 మరోవైపు.. ‘‘భూమి మీద ఉన్న నరకం గాజా, గత రాత్రి జరిగిన దాడి ఇందుకు మరో సాక్ష్యం’’ అని పాలస్తీనా శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్ఆర్డబ్ల్యూఏ పేర్కొంది. -
రఫాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. అర్ధరాత్రి ఆర్తనాదాలు..
ఇజ్రాయెల్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ తాజాగా దాడుల్లో దాదాపు 35 మంది పాలస్తీనియన్లు మృతిచెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.కాగా, ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం రఫా నగరంపై బాంబు దాడులకు తెగబడింది. నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుసగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో దాదాపు 35 మంది చనిపోయినట్టు గాజా వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొంది. ఇక, అధిక సంఖ్యలో ప్రజలు నివాసం ఉన్న ప్రాంతంపై బాంబు దాడుల జరగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.మరోవైపు.. రఫాపై తాము దాడులు చేయలేదని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడులతో తమకు సంబంధంలేదని స్పష్టం చేసింది. రఫాలో ఏం జరుగుతుందో తమకు తెలియదని చెప్పుకొచ్చింది. మరోవైపు.. అంతకుముందు ఇజ్రాయెల్ రాజధాని టెలీ అవీవ్‌పై హమాస్ రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో రాజధానిలో సైరన్లు మోగాయి. కాగా, గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల కారణంగానే తాము ప్రతిదాడులు చేసినట్టు హమాస్ తెలిపింది. قطعت رؤوس الأطفال وحرقت الأجساد 😭😭جنون اسرائيل لن ينتهي الا باقتلاعه من الجذورونهايتهم قريب باذن الله#رفح_الان #Rafah #ابو_عبيدة pic.twitter.com/BjbNdA9aRF— حماة الأقصى في بلاد الحرمين (@aqsa_saudi3n) May 27, 2024 ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేసింది. రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. దాడులను ఆపకుంటే అక్కడ భౌతిక వినాశనానికి దారితీసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఐసీజే ఆదేశాలను పట్టించుకోకుండా తాజాగా మరోసారి బాంబు దాడులకు తెగబడింది. Israel commits a massacre in #Rafah this evening, dropping several 2,000 pound bombs on civilian tents and #UN compounds, murdering dozens of civilians seeking shelter. This was Israel’s response to the @CIJ_ICJ ruling Friday that it must halt its offensive on Rafah. pic.twitter.com/vS1ouUU8Oj— Husam Zomlot (@hzomlot) May 26, 2024 ఇక, గాజాలో కాల్పుల విరమణ కోసం హమాస్, ఇజ్రాయెల్ మధ్య చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ వారాంతంలో ఇజ్రాయెల్, యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు, ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ మధ్య జరిగే సమావేశాల తర్వాత కాల్పుల విరమణ చర్చపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
సిరియాలో ఇరాన్ ఎంబసీపై దాడి.. 11 మంది మృతి
గాజా సంక్షోభ నేపథ్యంలో.. ఇజ్రాయెల్ వైమానిక దాడుల ఉధృతిని పెంచింది. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడి జరపగా.. 11 మంది మృతి చెందారు. గాజా యుద్ధంలో ఇరాన్ మిత్రదేశాల్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలోనే.. తాజా దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్, సిరియా దౌత్య విభాగాలు ఇది ఇజ్రాయెల్ దాడేనని ధృవీకరించాయి. ఆరు మిస్సైల్స్ ఎంబసీ భవనంపైకి దూసుకొచ్చాయని.. ఎఫ్-35 ఫైటర్ జెట్స్ ద్వారా ఇజ్రాయెల్ రక్షణ దళం ఈ దాడికి తెగబడిందని ప్రకటించాయి. మరోవైపు బ్రిటన్ తరఫున సిరియాలో పని చేస్తున్న మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఒకటి ఈ క్షిపణి దాడిపై ప్రకటన చేసింది. దాడిలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని.. ఎనిమిది మంది ఇరాన్, ఇద్దరు సిరియా, ఒక లెబనీస్ సైనికులు ఉన్నట్లు తెలిపింది. వారం వ్యవధిలోనే సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ జరిపిన ఐదో దాడి ఇది.సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు ఇరాన్ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తోంది. పైగా ఇరాన్ తరఫున పలు గ్రూపులు ఇక్కడ స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. అందుకే ఇజ్రాయెల్ సిరియాను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అయితే.. గాజా సంక్షోభం తర్వాత ఈ దాడుల ఉధృతిని పెంచింది. మిస్ టార్గెట్?సిరియాలో ఇరాన్ ఎంబసీ దాడిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ దాడి ఇరాన్ దౌత్య కార్యాలయం లక్ష్యంగా జరగలేదని.. దానిని ఆనుకుని ఉన్న భవనం టార్గెట్‌గా జరిగి ఉండొచ్చని ఇజ్రాయెల్ మీడియా కథనాలు ఇస్తున్నారు. భవనానికి ఖాసీం సోలెయిమానీ భారీ కటౌట్ ఉండడంతో అందులో ఉన్న సభ్యుల్ని టార్గెట్ చేసుకుని దాడులు జరిపి ఉంటుందని సదరు కథనాల సారాంశం. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ మిలిటరీ ఆపరేషన్స్‌కి సోలెయిమానీని ఆద్యుడిగా పేర్కొంటారు. అయితే.. 2020లో సిరియా భూభాగంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో సోలెయిమానీ చనిపోయాడు. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదుసిరియా రాజధానిలో ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణుల దాడిని లెబనాన్ రెబల్ గ్రూప్ హిజ్బుల్లా ఖండిచింది. ఐఆర్జీసీ సభ్యుల మరణానికి కారణం అయినందుకు ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది. గాజా యుద్ధంలో హమాస్‌కు ఇటు హిజ్బుల్లా, అటు ఐఆర్‌జీసీలు మిత్రపక్షంగా ఉన్నాయి. -
Russia: ఉక్రెయిన్ దాడుల్లో భారత యువకుడి మృతి
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయ యువకుడు ఒకరు మరణించాడు. రష్యా ఆర్మీ వద్దసెక్యూరిటీ హెల్పర్‌గా పనిచేస్తున్న గుజరాత్‌కు చెందిన హేమిల్ అశ్విన్‌భాయ్(23) ఈ నెల 21న ఉక్రెయిన్ జరిపిన వైమానిక దాడుల్లో మృతి చెందాడు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులోని డొనెస్క్ ప్రాంతంలో హేమిల్ పనిచేస్తున్నప్పుడు ఉక్రెయిన్ దాడులు జరిగాయని భారత్‌కు చెందిన మరో సెక్యూరిటీ హెల్పర్ సమీర్ అహ్మద్ తెలిపారు. అయితే హేమిల్ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని భారత విదేశీ వ్యవహరాల శాఖ స్పష్టం చేసింది. సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేస్తున్న భారత యువకులను ఉక్రెయిన్‌తో యుద్ధంలో చురుగ్గా పాల్గొనాలని రష్యా బలవంతం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన మరుసటి రోజే హేమిల్ ఉక్రెయిన్ దాడుల్లో మరణించాడు. గతేడాది రష్యా ఆర్మీ 100 మంది భారతీయులను సెక్యూరిటీ హెల్పర్లుగా నియమించింది. అయితే వీరందరూ యుద్ధం నుంచి దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక అడ్వైజరీ కూడా చేసింది. ఏజెంట్ల మోసం వల్లే భారత యువకులు రష్యాలో సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేయాల్సి వస్తోందని ఇటీవల ఎంఐఎం చీఫ్, అసదుద్దీనన్ ఒవైసీ ఆరోపించిన విషయం తెలిసిందే. వీరి విషయంలో భారత విదేశాంగ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. . ఇదీ చదవండి.. అమెరికా నౌకపై హౌతీల మిసైల్ దాడి -
ఇరాన్‌పై ప్రతీకారదాడి.. పాక్ అమెరికాను సంప్రదించిందా?
పాకిస్తాన్‌లోని జైష అల్ అదిల్ మిలిటెంట్లు లక్ష్యంగా ఇరాన్ జరిపిన మెరుపు వైమానిక దాడులకు గురువారం పాకిస్తాన్ కూడా ప్రతికార దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే పాక్ ప్రతీకార వైమానిక దాడులకు ముందు అగ్రరాజ్యాన్ని సంప్రదించిందా? అని మీడియో అడిగిన ప్రశ్నను అమెరికా దాటవేసింది. మీడియా ప్రశ్నకు అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సమాదానాన్ని నిరాకరించారు. ఈ వ్యవహారంలో ఏం జరగవచ్చో లేదా జరగకపోవచ్చో అనేదానిపై తాను ప్రస్తుతానికి ఏం మాట్లాడలేనని స్పష్టం చేశారు. అమెరికా ఎల్లప్పుడూ మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి, భద్రతతో కూడిన పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసమే అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య దౌత్యపరమైన శాంతి కోసం యత్నిస్తున్నామని తెలిపారు. ఇక.. అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్-గాజా దాడులు కోనసాగుతున్నాయి. అప్పటి నుంచి యెమెన్‌లో పనిచేసే హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలోని ఇజ్రాయెల్, ఇతర దేశాలకు సంబంధించిన పలు వాణిజ్య నౌకలపై దాడులకు తెగపడినట్లు తెలిపారు. దీంతో అమెరికా, బ్రిటన్ బలగాలు.. హౌతీ రెబల్స్‌పై ఎదురుదాడి చేశాయని అన్నారు. అనంతరం ఇరాన్, పాకిస్తాన్ పరస్పరం దాడులు చేసుకున్నాయని తెలిపారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగటంపై తాము ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఈ ఉద్రిక్తతలపై తాము దృష్టి సారించామని పేర్కొన్నారు. అక్టోబర్ 7నుంచి ఉధృతం అవువతున్న దాడుల పట్ల ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఇరాన్-పాక్తిస్తాన్ ఉద్రిత్తలపై మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలో తీవ్రవాదానికి నిధలు సమకూర్చటం వంటి సుదీర్ఘ చరిత్ర ఇరాన్‌కు కలిగి ఉన్నట్లు తెలిపారు. చదవండి: మైనారిటీ నేతకు మద్దతు.. రష్యాలో పెద్ద ఎత్తున ఆందోళనలు -
Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు!
దెయిర్ అల్‌బలాహ్ (గాజా): గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఆస్పత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం దెబ్బకు కనీస సౌకర్యాలన్నీ నిలిచిపోవడంతో గాజాలో 20 ఆస్పత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆస్పత్రులూ అదే బాటన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. కరెంటు సరఫరా లేక ప్రధాన ఆస్పత్రి అల్ షిఫాలో తశనివారం వైద్య పరికరాలన్నీ మూగవోయాయి. దాంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అల్ ఖుద్స్ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆ ఆస్పత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచి్చందని తెలుస్తోంది! దాంతో అందులోని 14 వేల మంది రోగులు, శరణార్థుల ప్రాణాల్లో గాల్లో దీపంగా మారాయి. విరామం లేకుండా దూసుకొస్తున్న తూటాలు, బాంబు వర్షం కారణంగా అల్ షిఫా ఆస్పత్రిలోని వేలాది మంది కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అందులో 1,500 మందికి పైగా రోగులు, అంతే సంఖ్యలో వైద్య సిబ్బంది, 15 వేలకు పైగా శరణార్థులున్నట్టు చెబుతున్నారు. వైద్య సేవలతో పాటు కరెంటు, ఆక్సిజన్ సరఫరాలు పూర్తిగా నిలిచిపోవడంతో పలు ఆస్పత్రుల్లో ఐసీయూల్లోని రోగులు, ఇంక్యుబేటర్లలోని చిన్నారులు నిస్సహాయంగా మృత్యుముఖానికి చేరువవుతున్నారు. ఇలా ఇప్పటికే 200 మందికి పైగా మరణించారని, మరికొన్ని వందల మంది మృత్యువుతో పోరాడుతున్నారని హమాస్ ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది! ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెడుతున్నా ఇజ్రాయెల్ మాత్రం దాడులాపేందుకు ససేమిరా అంటోంది. కనీసం వాటికి విరామమిచ్చేందుకు కూడా ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరోసారి నిరాకరించారు. షిఫా.. శిథిల చిత్రం అల్ షిఫా ఆస్పత్రిలో తాగునీటితో పాటు ఆహార పదార్థాలు కూడా పూర్తిగా నిండుకున్నాయి. దాంతో వైద్యంతో సహా ఏ సేవలూ అందక రోగులు నిస్సహాయంగా మృత్యువాత పడుతున్నారు. శనివారమే 100 మందికి దుర్మరణం పాలైనట్టు హమాస్ పేర్కొంది. వీటికి తోడు ఐసీయూ విభాగంపై బాంబు దాడి జరిగింది. ఆస్పత్రిని ఇజ్రాయెల్ సైన్యం అన్నివైపుల నుంచీ దిగ్బంధించింది. అక్కడ హమాస్ ఉగ్రవాదులతో భీకరంగా పోరాడుతున్నట్టు ప్రకటించింది. ఆస్పత్రి ప్రాంగణంతో పాటు పరిసరాలన్నీ బాంబు మోతలతో దద్దరిల్లుతున్నాయి. బాంబు దాడుల్లో రెండు అంబులెన్సులు తునాతునకలయ్యాయి. కనీసం రోగులు, క్షతగాత్రులను ఆస్పత్రి నుంచి మరో చోటికి తరలించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అడుగు కదిపినా స్నైపర్ల తూటాలు దూసుకొస్తున్నట్టు ఆస్పత్రి సిబ్బంది వాపోతున్నారు. ఈ ఆస్పత్రి కిందే ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రధాన కార్యాలయముందని ఇజ్రాయెల్ మొదటినుంచీ ఆరోపిస్తుండటం తెలిసిందే. అయితే అంతర్జాతీయ ఖండనల నేపథ్యంలో శనివారం సాయంత్రానికల్లా ఇజ్రాయెల్ మాట మార్చింది. అల్ షిఫా ఆస్పత్రిపై దాడులు జరపడం లేదని, అక్కణ్నుంచి వెళ్లిపోవాలనుకున్న వారికోసం కారిడార్ తెరిచే ఉంచామని చెప్పుకొచ్చింది. దాడుల్లో గాయపడుతున్న రెండు రోజులుగా ప్రధానంగా అల్ అహిల్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ అక్కడ కూడా మౌలిక సదుపాయాలేవీ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. కారిడార్లతో పాటు ఎక్కడ పడితే అక్కడ రోగులను నిస్సహాయంగా వదిలేసిన దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. పడకేసిన వైద్యం గాజా అంతటా వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టేనని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐరాస సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ‘‘గాజాలోని మొత్తం 35 ఆస్పత్రులూ చేతులెత్తేసినట్టే. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది’’ అని అవి చెబుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర గాజాలోని అల్ నస్ర్, అల్ రంటిసి సహా చాలా ఆస్పత్రులు సైనిక దిగ్బంధంలో ఉన్నాయి. దీనికి తోడు గాజావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికం ఎప్పుడో మూతబడ్డాయి. -
సిరియాలో అమెరికా దాడులు.. 9 మంది మృతి
వాషింగ్టన్: సిరియాలో ఇరాన్ మద్దతునిస్తున్న దళాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఆయుధ నిల్వ కేంద్రంపై యుఎస్ యుద్ధ విమానాలు దాడి చేశాయని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ చీఫ్ రమీ అబ్దెల్ రెహమాన్ తెలిపారు. ఇరాన్ మద్దతిస్తున్న కొన్ని సాయుధ దళాలు ఇరాక్, సిరియాల్లోని అమెరికా స్థావరాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ సంక్షోభం పశ్చిమాసియా ప్రాంతీయ యుద్ధంగా మారకుండా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గాజా యుద్ధానికి ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పశ్చిమాసియాలో అమెరికా దళాలపై దాడులు మాత్రం సహించబోమని తెలిపేందుకే ఈ చర్యకు దిగినట్లు చెప్పారు. అమెరికా దళాలపై జరుగుతున్న దాడుల వెనుక ఇరాన్ ఉందని, వాటిని ఏమాత్రం సహించబోమన్నారు. ఇస్లామిక్ రాజ్యాల వర్గాలను నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా ఇరాక్‌లో దాదాపు 2,500 మంది, సిరియాలో 900 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇక్కడి సైనికులపై దాడులకు ప్రతిస్పందనగా అమెరికా గత వారంలోనే రెండోసారి దాడికి పాల్పడింది. ఈ పరస్పర దాడులు ఇరాన్-అమెరికా మధ్య పశ్చిమాసియాలో మరో అలజడి చెలరేగేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో గాజా-ఇజ్రాయెల్ యుద్ధం సంక్షోభాన్ని సృష్టిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగుతోంది. ఇప్పటికే గాజాలో 10,500 మంది మరణించారు. ఇదీ చదవండి: Israel-Hamas War: నెల రోజులుగా నెత్తురోడుతోంది -
Israeli-Palestinian Conflict: శరణార్థి శిబిరాలపై భీకర దాడులు
గాజాసిటీ/ఖాన్ యూనిస్/జెరూసలేం: గాజాలోని శరణార్థి శిబిరాలు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దద్దరిల్లుతున్నాయి. సాధారణ పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న శిబిరాలపై ఇజ్రాయెల్ సైన్యం నిప్పుల వర్షం కురిపిస్తోంది. హమాస్ మిలిటెంట్లపై ప్రారంభించిన యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. సెంట్రల్ గాజాలో శనివారం అర్ధరాత్రి నుంచి కనీసం మూడు శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు జరిగాయి. అల్–మఘాజీ రెఫ్యూజీ క్యాంపుపై జరిగిన దాడిలో ఏకంగా 47 మంది మరణించారు. 34 మంది గాయపడ్డారు. జబాలియా క్యాంపులో ఆరుగురు మృతిచెందారు. ఆదివారం బురీజ్ క్యాంప్‌లోని నివాస భవనాలపై జరిగిన వైమానిక దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 73 మంది సామాన్య ప్రజలు మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మూడు ఘటనల్లో 60 మందికిపైగా జనం క్షతగాత్రులుగా మారారు. వారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్చినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవలే జబాలియా, బురీజ్ క్యాంపులపై జరిగిన దాడుల్లో 200 మందికిపైగా జనం మరణించారు. హమాస్‌తో సంబంధం లేని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుండడాన్ని అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అల్–ఖుద్స్ ఆసుపత్రి సమీపంలో పేలుడు గాజాలో ఆదివారం ఉదయం అల్–ఖుద్స్ హాస్పిటల్ సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లు పాలస్తీనా రెడ్ క్రిసెంట్ సొసైటీ వెల్లడించింది. ఆసుపత్రికి కేవలం 50 మీటర్ల దూరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసిందని పేర్కొంది. భవనం చాలావరకు ధ్వంసమైందని, చాలామంది మృతి చెందారని తెలియజేసింది. దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. హమాస్ మిలిటెంట్లు సామాన్య ప్రజల ముసుగులో ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలోని మకాం వేస్తున్నారని వివరించింది. ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైన ఘర్షణ దాదాపు నెల రోజులకు చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,700 మందికిపైగా మరణించారు. వీరిలో 4,800 మందికిపైగా చిన్నపిల్లలు ఉన్నారు. గాజాపై భూతల దాడుల్లో తమ సైనికులు 29 మంది మృతిచెందారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాపై అణుబాంబు ప్రయోగిస్తామన్న మంత్రిపై సస్పెన్షన్ వేటు హమాస్ మిలిటెంట్లను అంతం చేయడానికి గాజాపై అణుబాంబు ప్రయోగించే అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ మంత్రిపై సస్పెన్షన్ వేటు పడింది. జెరూసలేం వ్యవహారాల మంత్రి అమిచాయ్ ఎలియాహూ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో గాజాలో సాధారణ ప్రజలెవరూ లేరని, అందరూ మిలిటెంట్లే ఉన్నారని అర్థం వచ్చేలా మాట్లాడారు. గాజాపై అణుబాంబు ప్రయోగించే ఐచి్ఛకం కూడా ఉందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. మంత్రి వ్యవహారంపై ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. మంత్రిని ప్రభుత్వ సమావేశాల నుంచి నిరవధికంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యం అంతర్జాతీయ చట్టాల ప్రమాణాల ప్రకారమే నడుచుకుంటున్నాయని నెతన్యాహూ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై మంత్రి అమిచాయ్ ఎలియాహూ వివరణ ఇచ్చారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అబ్బాస్‌తో ఆంటోనీ బ్లింకెన్ భేటీ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. అక్టోబర్ 7 తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 150 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. జర్నలిస్టుకు తీరని దుఃఖం అల్–మఘాజీ క్యాంపుపై జరిగిన దాడి జర్నలిస్టు మొహమ్మద్ అలలౌల్కు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఆయన నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులను కోల్పోయారు. టర్కీష్ వార్తా సంస్థ అనడోలులో ఆయన ఫ్రీలాన్స్ ఫొటోజర్నలిస్టుగా పని చేస్తున్నారు. తన కుటుంబంతో కలిసి అల్–మఘాజీ క్యాంపులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల్లో మొహమ్మద్ కుటుంబం ఉంటున్న ఇళ్లు ధ్వంసమయ్యింది. నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులు చనిపోయారు. ఆయన భార్య, తల్లి, తండ్రి, మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. -
Israel-Hamas war: గాజాలో నరకయాతన
రఫా/టెల్ అవీవ్: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. ప్రధానంగా గాజా సిటీ శివారు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి భూతల యుద్ధం త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, అది సుదీర్ఘకాలం, సంక్లిష్టంగా ఉండబోతోందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ చెప్పారు. గాజాలో హమాస్ మిలిటెంట్లు నిర్మించుకున్న సొరంగాల వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. గల్లాంట్ శుక్రవారం విదేశీ జర్నలిస్టులతో మాట్లాడారు. భారీ స్థాయిలో సైనిక బలగాలతో భూతల యుద్ధం ప్రారంభిస్తామని అన్నారు. వారికి వెన్నుదన్నుగా వైమానిక దళం కూడా ఉంటుందని చెప్పారు. తమ జవాన్లు గురువారం ఉత్తర గాజాపై భూతల దాడి చేసి, క్షేమంగా తిరిగి వచ్చారని వెల్లడించారు. శుక్రవారం కూడా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యిందన్నారు. 9 వేలు దాటిన మృతుల సంఖ్య మూడు వారాల క్రితం ప్రారంభమైన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 9 వేలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 7,300 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 3,000 మంది మైనర్లు, 1,500 మందికిపైగా మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య గతంలో జరిగిన నాలుగు యుద్ధాల్లో దాదాపు 4,000 మంది మృతిచెందారు. ఈ నెల 7న మొదలైన యుద్ధంలో మృతుల సంఖ్య ఇప్పటికే 7,300 దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లో మృతిచెందినవారి సంఖ్య 110కు చేరుకుంది. హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్ భూభాగంలో 1,400 మందికిపైగా మృత్యువాతపడ్డారు. హమాస్ వద్ద 229 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా నలుగురు బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటిదకా 200కిపైగా పాఠశాలలు ధ్వంసమయ్యాయని ‘యునెస్కో’ ప్రకటించింది. అంటే గాజాలోని మొత్తం స్కూళ్లలో 40 శాతం స్కూళ్లు ధ్వంసమైనట్లు తెలియజేసింది. ఇంధనాన్ని అనుమతించేది లేదు సరిపడా ఆహారం, నీరు, నిత్యావసరాలు, ఔషధాలు లేక గాజాలో ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం నరకయాతన అనుభవిస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగులు, క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంక్యుబేటర్లు పనిచేయక శిశువులు కన్నుమూస్తున్నారు. ఈజిప్టు ప్రభుత్వం పరిమితంగా ఆహారం, నిత్యావసరాలను ఈజిప్టు నుంచి గాజాలోకి అనుమతిస్తోంది. మరోవైపు గాజాకు పెట్రోల్, డీజిల్ సరఫరాను అనుమతించబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్ మరోసారి తేలి్చచెప్పారు. ఇంధనం మిలిటెంట్ల చేతుల్లోకి చేరితే దురి్వనియోగమయ్యే అవకాశం ఉందన్నారు. మిలిటెంట్లు జనరేటర్లతో సొరంగాల్లోకి గాలిని పంపిస్తుంటారని, ఇందుకోసం ఇంధనం వాడాల్సి ఉంటుందన్నారు. ‘‘హమాస్ మిలిటెంట్లకు గాలి కావాలంటే ఇంధనం కావాలి, ఇంధనం కావాలంటే మేము కావాలి’’ అని గల్లాంట్ వ్యాఖ్యానించారు. బందీల్లో 30 మంది పిల్లలు! ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు దొరికినవారిని దొరికినట్లు ఊచకోత కోశారు. చాలామందిని నిలబెట్టి కాల్చేశారు. వెనక్కి వెళ్లిపోతూ 229 మందిని బందీలుగా బలవంతంగా లాక్కెళ్లారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. బందీలను గాజాలోని గుర్తుతెలియని ప్రాంతంలో దాచినట్లు తెలుస్తోంది. బందీల్లో 30 మంది చిన్నపిల్లలు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ధారణకు వచి్చంది. తమ పిల్లలను విడిపించాలంటూ వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మూడేళ్లు, నాలుగేళ్ల వయసున్న చిన్నారులను కూడా మిలిటెంట్లు అపహరించడం గమనార్హం. వారి క్షేమ సమాచారాలు తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. జెనీవా తీర్మానం ప్రకారం.. సాధారణ పౌరులను బందీలుగా మార్చడం ముమ్మాటికీ యుద్ధ నేరమే అవుతుంది. సిరియాలో అమెరికా దాడులు వాషింగ్టన్: తూర్పు సిరియాలో ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్ సేనల స్థావరాలే లక్ష్యంగా అమెరికా ఫైటర్ జెట్లు శుక్రవారం ఉదయం నిప్పుల వర్షం కురిపించాయి. రెండు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. గతవారం సిరియాలోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్ అనుకూల మిలిటెంట్లు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారని, వాటికి ప్రతిస్పందనగానే తాము వైమానిక దాడులు చేసినట్లు వెల్లడించింది. ఒకవైపు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా సైన్యం సిరియాలో ఇరాన్ అనుకూల శక్తులపై విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, సిరియాలో దాడికి ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణతో ఏమాత్రం సంబంధం లేదని అమెరికా తేలి్చచెప్పింది. తమ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతోనే తూర్పు సిరియాలో ఇరాన్ సాయుధ దళాలపై దాడి చేశామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ పేర్కొన్నారు. అమెరికా దళాలపై దాడులను సహించబోమని పేర్కొన్నారు. అక్టోబర్ 17 నుంచి ఇరాక్, సిరియాలోని తమ సైనిక స్థావరాలపై, జవాన్లపై కనీసం 19 దాడులు జరిగాయని పెంటగాన్ ఆరోపించింది. ఈ దాడులకు బాధ్యులైనవారిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ పశ్చిమాసియాలో భారీ సంఖ్యలో సైనిక బలగాలను మోహరిస్తోంది. -
సిరియాలో ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు!
సిరియాలో ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. దీనిని అమెరికా రక్షణ విభాగం ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ బలగాలపై దాడులకు ప్రతిగానే ఈ దాడులు చేపట్టామని, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దాని అనుబంధ విభాగాలు ఈ స్థావరాల్ని ఉపయోగించుకుంటున్నాయని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇరాక్, సిరియాలో ఉన్న అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ 17 నుంచి ఇరాన్ ప్రోత్సాహక ఉగ్ర సంస్థలు వరుస దాడులకు పాల్పడుతున్నాయి. ఈ దాడులు హమాస్, ఇస్లామిక్ జిహాద్, హిజ్బుల్లా పనేనని అమెరికా అనుమానిస్తోంది. ప్రతిదాడుల్లో భాగంగానే తాజా దాడులు జరిపినట్లు ప్రకటించింది అమెరికా. అయితే ఇజ్రాయెల్-హమాస్ సంక్షోభానికి, ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని ఆస్టిన్ స్పష్టం చేశారు. అమెరికా ట్రూప్లపై దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధ్యక్షుడు జో బైడెన్.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీకి గురువారం నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రకటన వెలువడి రోజు గడవక ముందే సిరియాలోని ఇరాన్ స్థావరాల్ని అమెరికా లక్ష్యంగా చేసుకోవడం విశేషం. -
ఇజ్రాయెల్ దాడుల్లో బందీల మృతి
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో తమ ఆధీనంలో ఉన్న బందీలు మరణించినట్లు హమాస్ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో గాజా స్ట్రిప్ ఉత్తర భాగంలో ఈ దాడులు జరగ్గా వేర్వేరు ప్రాంతాల్లోని మొత్తం 13 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. హమాస్ గత శనివారం ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసి సుమారు 150 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బందీల్లో సాధారణ పౌరులు, విదేశాలకు చెందిన వారూ ఉన్నారు. బందీలను హమాస్ చెర నుంచి తప్పించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైనికులు కృషి చేస్తూనే హమాస్ బలగాలను మట్టుబెట్టేందుకూ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గాజా మొత్తంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజా స్ట్రిప్ జనాభా దాదాపు 24 లక్షలు. ఇజ్రాయెల్ బాంబు, క్షిపణి దాడులు విపరీతమైన ఆస్తినష్టాన్ని మిగులుస్తున్నాయి. భవనాలు నేలమట్టం అవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకూ గాజాపై జరిపిన దాడుల్లో 1500 మంది మృతి చెందారు. అందులో 500 మంది చిన్నారులే ఉన్నట్లు హమాస్ మీడియా కార్యాలయం ప్రకటించింది. మరోవైపు గాజా పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులకు.. ప్రతిగా బందీలను హతమారుస్తామంటూ హమాస్ ప్రకటించినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో.. నీటి, కరెంట్ సరఫరాను నిలిపివేసింది. తాజాగా గాజాను ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఐక్యరాజ్య సమితి మాత్రం ఇజ్రాయెల్ రక్షణ దళం ఆదేశాలు ఆచరణ సాధ్యం కాదని.. అది కల్లోలానికి దారి తీస్తుందని చెబుతోంది. -
గాజాలో ఇస్లామిక్ జిహాద్ అగ్రనేత హతం
గాజా సిటీ: ఇజ్రాయెల్–ఇస్లామిక్ జిహాద్ మధ్య ఘర్షణ నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. ఇస్లామిక్ జిహాద్ ఉద్యమానికి అడ్డాగా మారిన గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆదివారం మూడో రోజుకు చేరాయి. శుక్రవారం దాడులు మొదలైన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడంతో తాజాగా ఇస్లామిక్ జిహాద్ ఉద్యమ అగ్రనేత ఖలీద్ మన్సూర్ హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు, ఐదుగురు సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత మూడు రోజుల్లో ఇజ్రాయెల్ ప్రకోపానికి బలైన వారి సంఖ్య 31కు చేరింది. ఖలీద్ మన్సూర్ దక్షిణ గాజాలో రఫా శరణార్థుల శిబిరంలోని ఓ అపార్టుమెంట్‌పై నివసిస్తున్నాడు. అదే అపార్టుమెంట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడికి దిగింది. మరోవైపు ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్న ఇస్లామిక్ జిహాద్ సంస్థ కూడా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇజ్రాయెల్ భూభాగంలోకి వందలాది రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్–ఇస్లామిక్ జిహాద్ నడుమ ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిపుణులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా, గాజాలో అధికారం చెలాయిస్తున్న ఉగ్రవాద సంస్థ హమాస్ మాత్రం ప్రస్తుతానికి మౌనం పాటిస్తోంది. -
Russia-Ukraine war: ముట్టడిలో నగరాలు
పోక్రోవ్స్క్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్‌లో రష్యా పెను విధ్వంసం సృష్టిస్తోంది. తూర్పున డోన్బాస్లో పలు నగరాలపై బాంబు దాడులతో విరుచుకుపడింది. తయరీ పరిశ్రమకు కేంద్రమైన సెవెరోడోనెట్స్క్ నగరం బాంబులు, క్షిపణుల మోతతో దద్దరిల్లింది. సమీపంలోని లిసిచాన్స్క్ తదితర నగరాలపైనా దాడులు తీవ్రతరమయ్యాయి. డోన్బాస్లో కీలక కేంద్రాలైన ఈ రెండు నగరాలను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా బలగాలు ముందుకు కదులుతున్నాయి. అయితే ఉక్రెయిన్ దళాలు పలుచోట్ల వాటితో హోరాహోరీ తలపడుతున్నాయి. డోన్బాస్ చాలావరకు రష్యా అనుకూల వేర్పాటువాదుల చేతుల్లో ఉండగా ఈ రెండు నగరాలూ ఉక్రెయిన్ అధీనంలో ఉన్నాయి. అక్కడి సైనిక లక్ష్యాలపై జరిగిన దాడుల్లో పలువురు పౌరులు కూడా బలయ్యారు. పౌర సేవలన్నీ స్తంభించిపోయాయి. సెవెరోలో ఇప్పటికే కనీసం 1500 మందికి పైగా మరణించినట్టు ఉక్రెయిన్ చెబుతోంది. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని బాబ్రోవ్ గ్రామం వద్ద జరిగిన పోరులో రష్యా దళాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు సమాచారం. చాలామంది సైనికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు అవుతున్నట్టు చెబుతున్నారు. లుహాన్స్క్ ప్రాంతంలోని బక్ముట్ నగరంపైనా శనివారం రాత్రి నుంచి దాడులు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్నాయి. మరోవైపు ఉత్తరాన రెండో అతి పెద్ద నగరమైన ఖర్కీవ్‌తో పాటు , సమీ తదితర ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అక్కడి సరిహద్దు ప్రాంతాలపై క్షిపణి దాడుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు ఉక్రెయిన్ చెబుతోంది. ఈయూ ఆంక్షలను బేఖాతరు చేస్తూ రష్యాతో సెర్బియా మూడేళ్ల గ్యాస్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ దేశం ఇంధన అవసరాల కోసం దాదాపుగా రష్యా మీదే ఆధారపడింది. -
యెమెన్ జైలుపై సౌదీ వైమానిక దాడి
దుబాయ్: యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహించే ఒక జైలుపై సౌదీ ఆధ్వర్యంలో శుక్రవారం వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో వందమందికి పైగా గాయపడడం, చనిపోవడం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు యెమెన్‌లోని హోడైడా నగరంలో ఉన్న కమ్యూనికేషన్ సెంటర్‌పై వైమానిక దాడి జరగడంతో దేశమంతా ఇంటర్నెట్ సౌకర్యం నిలిచిపోయింది. ఇటీవలి కాలంలో సౌదీ, యూఏఈపై హౌతీ రెబల్స్ డ్రౌన్ దాడులు పెరిగాయి. వీటికి ప్రతీకారంగా అరబ్ దేశాల కూటమి ఈ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. సదా నగరంలోని జైలుపై జరిగిన దాడిలో గాయపడిన వారిని రక్షించే కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు రెడ్‌క్రాస్ సంస్థ ప్రకటించింది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయమై హౌతీ వర్గాలు ఇంకా స్పందించలేదు. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ దాడులు బాగ్దాద్: ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణాలకు తెగబడ్డారు. సిరియాలోని అతిపెద్ద జైలుపై దాదాపు 100మందికిపైగా ఐసిస్ ఉగ్రవాదులు గురువారం రాత్రి దాడి జరిపగా, ఇరాక్‌లో ఆర్మీ బ్యారక్‌పై శుక్రవారం విరుచుకుపడ్డారు. ఇరాక్‌లో జరిగిన దాడిలో 11మంది ఇరాకీ సైనికులు చనిపోగా, సిరియా జైలు దాడిలో ఏడుగురు కుర్దిష్ సైనికులు, 23 మంది ఐసిస్ ఉగ్రవాదులు మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. ఇటీవల కాలంలో రెండు దేశాల్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ చురుగ్గా పనిచేయడం ఆరంభించి పలువురు ఇరాకీ, సిరియన్ల మృతికి కారణమవుతున్నాయి. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ దగ్గరలోని సైనిక శిబిరంపై ఐసిస్‌లు తుపాకులతో విరుచుకుపడ్డారు. దీంతో శిబిరంలో నిద్రిస్తున్న ఒక లెఫ్టినెంట్ సహా 10మంది సైనికులు చనిపోయారు. మరోవైపు సిరియాలో ఇటీవల ఐసిస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇందుకు ప్రతీకారంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా గ్వేరియన్ జైలుపై దాడికి దిగారు. ఆ సమయంలో జైల్లో 3వేలమంది ఐసిస్ మిలిటెంట్లున్నారని కుర్దిష్ డెమొక్రాటిక్ బలగాల ప్రతినిధి ఫర్హాద్ షామి చెప్పారు. దాడికి ముందు జైల్లో ఉగ్రవాదులు తిరుగుబాటు చేసి పారిపోయేందుకు యత్నించారని, ఇదే సమయంలో జైలు బయట ఒక కారుబాంబు పేలిందని జైలు వర్గాలు తెలిపాయి. దాడికి దిగిన ఉగ్రవాదుల్లో సిరియన్లు లేరని, వీరంతా విదేశీయులని తెలిపారు. దాడి అనంతరం తప్పించుకున్న 89 మంది ఉగ్రవాదులను తిరిగి పట్టుకున్నారు. 2017లో ఇరాక్, 2019లో సిరియాల్లో ఐసిస్ ఓడిపోయింది. అప్పటినుంచి ఇలా మెరుపుదాడులకు దిగడం ఆరంభించింది. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాక్ మిలటరీ ప్రతిజ్ఞ చేసింది. -
Gaza: నువ్వొక్కడివే బతికావు నాన్నా.. మనం కూడా
గాజా సిటీ: అమ్మ ఒడిలో ఉండాల్సిన ఐదు నెలల చిన్నారి ఒమర్ ఆస్పత్రి బెడ్‌పై పడుకుని ఉన్నాడు. మంచం అంచునే కూర్చున్న అతడి తండ్రి మహ్మద్ అల్- హదీద్ చెమర్చిన కళ్లతో పదే పదే కొడుకును చూసుకుంటూ ఉన్నాడు. బోసి నవ్వులతో వెలగాల్సిన ఆ పసివాడి ముఖం కుట్లతో నిండి ఉండటం, ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న కాలికి కట్లు కట్టి ఉండటం చూస్తుంటే ఆ తండ్రి మనస్సు తరుక్కుపోతోంది. ‘‘కనీసం నువ్వైనా మిగిలావు. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్న తోడు నువ్వొక్కడివే నాన్నా’’ అంటూ మౌనంగానే రోదిస్తున్నాడు మహ్మద్. కొడుకు ఎక్కడ ఉలిక్కిపడి నిద్రలేస్తాడోనన్న భయంతో. బాంబు దాడులకు బలైపోయి.. నిర్జీవంగా పడి ఉన్న భార్య చేతుల్లో నుంచి రక్షణ బృందాలు బిడ్డను వేరు చేసి.. ఆస్పత్రికి తీసుకువచ్చిన దృశ్యాలు ఇంకా తన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. తాను కూడా చనిపోతే బాగుండు అనే ఆలోచన వస్తోంది మహ్మద్‌కు. కానీ నలుగురు కొడుకుల్లో చిన్నవాడు, పసివాడు అయిన ఒమర్ కోసమైనా బతకాల్సిన పరిస్థితి. ఇజ్రాయెల్- హమాస్ మిలటరీ గ్రూపు మధ్య జరుగుతున్న పరస్పర క్షిపణి దాడుల కారణంగా అల్లకల్లోలమవుతున్న గాజాలోని అనేకానేక బాధిత కుటుంబాల్లో మహ్మద్ ఫ్యామిలీ ఒకటి. నలుగురు పిల్లలు.. ముచ్చటైన సంసారం మహ్మద్ అల్- హదీది(37)- మహా అబు హతాబ్(36) దంపతులు. వీరికి సుహబ్(13), అబర్రహమాన్(8), ఒసామా(6), ఒమర్(5 నెలలు) సంతానం. రంజాన్ పండుగ సందర్భంగా పిల్లలందరికీ కొత్త బట్టలు వేయించి, వారిని తీసుకుని బంధువుల ఇంటికి బయల్దేరింది మహా. గాజా సిటీకి కాస్త దూరంలో ఉన్న షతీ శరణార్థి శిబిరంలో తన వాళ్లను కలుసుకుని సంతోషించింది. చాలా కాలం తర్వాత వచ్చాను కదా.. ఈరోజు ఇక్కడే ఉంటాం అని భర్తను ఒప్పించింది. అందుకు సరేనన్నాడు మహ్మద్. భార్యాపిల్లలు ఇక్కడ.. అతడొక్కడే అక్కడ తమ ఇంట్లో. ఎందుకో మహ్మద్‌కు ఆ రాత్రి అస్సలు నిద్రపట్టలేదు. తెల్లవారుజామునే బాంబుల మోతతో ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. మరో ఆలోచన లేకుండా బయటకు పరుగులు తీశాడు. భార్యా, పిల్లలు ఉన్న చోటుకు వెళ్లి చూడగా.. అంతా శిథిలమై ఉంది. నిశ్చేష్టుడైపోయాడు మహ్మద్. భవన శిథిలాల కింద నుంచి ఒక్కొక్క శవాన్ని బయటకు తీస్తున్నాయి రక్షణ బృందాలు. తొలుత భార్య మహా, ఆ తర్వాత ముగ్గురు కొడుకుల మృతదేహాలు. ప్రపంచమంతా చీకటైపోయినట్లు అనిపించింది అతడికి. అంతలోనే ఒమర్ ఏడుపు సన్నగా వినబడింది. అతడికి ప్రాణం లేచివచ్చినట్లయింది. సహాయక బృందాల చేతిలో ఉన్న బిడ్డను లాక్కొని ఒక్కసారిగా గుండెకు హత్తుకున్నాడు మహ్మద్. మృదువుగా కొడుకు తలనిమిరి మరింత దగ్గరికి చేర్చుకున్నాడు. వెంటనే తనని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కనీసం తనకంటూ ఈ ప్రపంచంలో ఒక్కడైనా సజీవంగా మిగిలి ఉన్నాడన్న ఆశతో. ఇలాంటి మహ్మద్‌లు ఎందరెందరో గాజాలో. కానీ హమాస్ దాడులు, అందుకు ప్రతిగా అన్నట్లు ఇజ్రాయెల్ వేసే బాంబుల మోత అక్కడ నిత్యకృత్యమే. ఈ ఆధిపత్య పోరుకు ఎప్పుడు తెరపడుతుందో ఊహించడం కష్టం. హమాస్ మిలటరీనే టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ చెబుతున్నా.. ఆ దాడుల కారణంగా ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. ఈ విషయం గురించి మానవ హక్కుల సంఘాలు ఎంతగా మొత్తుకున్నా ఎవరికీ పట్టడం లేదు. ఏదేమైనా.. ఓవైపు వ్యవసాయం, మరోవైపు చేపల వేటపై ఆంక్షలు విధించడం సహా బాంబు దాడుల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకోలేక గాజా ప్రజలు ఆకలికి అలమటిస్తూ బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఆ దేవుడికి ముందే తెలుసునేమో.. ‘‘ఆరోజు నా పిల్లలు ఈద్ సంబరంలో కొత్త బట్టలు వేసుకున్నారు. బొమ్మలు తీసుకుని వాళ్ల అంకుల్ వాళ్లింటికి బయల్దేరారు. నా భార్య ఆరోజు అక్కడే ఉంటామని పట్టుబట్టింది. అందుకు నేను అనుమతించకపోయి ఉండే బాగుండేది. ఆరోజు నా జీవితంలో ఇంతటి విషాదాన్ని నింపుతుందని అస్సలు ఊహించలేకపోయాను. ఒమర్ ఒక్కడే ఇప్పుడు నాకంటూ ఉన్న తోడు. మీకు తెలుసా.. నా ముగ్గురు కొడుకులు తల్లిపాలు తాగి పెరిగారు. కానీ చిన్నవాడికి మొదటి నుంచీ ఆ అలవాటు లేదు. పుట్టిన నాటి నుంచే వాడు అమ్మ దగ్గర పాలు తాగలేదు. బహుశా.. ఆ దేవుడికి ముందే తెలుసునేమో. తల్లి వాడికి శాశ్వతంగా దూరమవుతుందని. అందుకే మమ్మల్ని ఇలా సన్నద్ధం చేశాడేమో. నేను వాడిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అయినా మేం కూడా తొందర్లోనే మా వాళ్లను కలుస్తామేమో. ఇక్కడ ఎక్కువ రోజులు బతుకుతామనే నమ్మకం నాకు లేదు’’ అంటూ మహ్మద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మేమేం పాపం చేశాం ఇజ్రాయెల్ దాడుల గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘వాళ్లు కావాలనే చిన్నారుల ప్రాణాలు తీస్తున్నారని అనిపిస్తోంది. ఒక్కసారి హెచ్చరిక జారీ చేయకుండా.. ఇంటిని ఖాళీ చేయమని చెప్పకుండా ఇలా బాంబులు కురిపించడం న్యాయమా. మేమేం పాపం చేశాం. నా బిడ్డ తల్లిలేని వాడయ్యాడు. నేను నా కుటుంబాన్నే కోల్పోయాను’’ అంటూ అంతర్జాతీయ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. కాగా గత సోమవారం నుంచి జరుగుతున్న పరస్పర దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని 200 మంది చనిపోగా, అందులో 59 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇక పాలస్తీనియన్ వైపు నుంచి కురుస్తున్న బాంబు ధాటికి ఇజ్రాయెల్‌లో 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. చదవండి: ఆ బాలిక కన్నీటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారెవరు?!