ఇస్లామాబాద్: పెషావర్ ఘటనతో పాక్ సైన్యం దేశంలోని తీవ్రవాదులపై దాడిని మరింత ముమ్మరం చేసింది. ఆ క్రమంలో ఆదివారం తిహర్ వ్యాలీలోని కోకి ఖేల్ ప్రాంతంలో ఆత్మాహుతి దళానికి శిక్షణ ఇచ్చే కేంద్రంపై వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో 31 మంది తీవ్రవాదులు హతమయ్యారని స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల్లో ఆత్మాహుతి దళ సభ్యులతోపాటు తీవ్రవాదులు కూడా ఉన్నారని పేర్కొంది. గతేడాది డిసెంబర్ 16న పెషావర్లో ఆర్మీ పాఠశాలలో తీవ్రవాదులు నరమేధం సృష్టించారు. ఈ ఘటనలో 150 మంది మరణించగా... వారిలో 140 మంది విద్యార్థులు ఉన్న విషయం తెలిసింది. దీంతో తీవ్రవాదులపై పాక్ తన దాడులను ముమ్మరం చేసింది.