militants killed
-
పాక్‌లో హోటల్‌పై దాడి
కరాచీ: పాకిస్తాన్‌లోని తీరప్రాంత నగరం గ్వదర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రఘటనలో హోటల్ సెక్యూరిటీ గార్డు, ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. శనివారం సాయంత్రం పెర్ల్ కాంటినెంటల్ ఫైవ్‌స్టార్ హోటల్ వద్ద ముగ్గురు సాయుధ దుండగులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ హోటల్ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డగించిన హోటల్ సెక్యూరిటీ గార్డును కాల్చి చంపారు. వెంటనే స్పందించిన ప్రత్యేక బలగాలు ఉగ్రవాదులతో హోరాహోరీ తలపడ్డాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో హోటల్లోని కొందరు సందర్శకులు, సిబ్బంది గాయాలపాలయ్యారు. ఈ ఉగ్రదాడి ఘటనకు తమదే బాధ్యతంటూ నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ శనివారం ప్రకటించుకుంది. దాడి నేపథ్యంలో వెంటనే హోటల్లో ఉన్న విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న గ్వదర్..పాక్‌లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతం. వేలాది కోట్ల రూపాయల చైనా నిధులతో ఇక్కడ పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తాజాగా ఇటీవల ఏప్రిల్ 18వ తేదీన ఇక్కడ జరిగిన ఉగ్రదాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఒక్క రోజులో మూడు ఎన్కౌంటర్లు
సాక్షి, కుప్వారా: కశ్మీర్ లోయలో మళ్లీ రక్తపాతం జరిగింది. బుడ్గం జిల్లాలో శుక్రవారం భారత ఆర్మీ జరిపిన వివిధ ఎన్కౌంటర్లలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు, నలుగురు మిలిటెంట్లు హతమయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో సైనికులు మూడు ఎన్కౌంటర్లు జరపడం విశేషం. బాలాకోట్ దాడుల తర్వాత కూడా తన బుద్ధి మార్చుకోకుండా సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతూ కవ్విస్తున్న దాయాది పాక్‌కు, ఈ ఎన్కౌంటర్లతో భారత్ గట్టిసమాధానమిచ్చినట్లైంది. బుడ్గాం జిల్లాలోని పారిగ్రామ్ ప్రాంతంలో భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్లు కలసి శుక్రవారం నిర్వహించన ఎన్కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయిన ఉగ్రవాదుల నుంచి ఎమ్16 రైఫిళ్లను ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గురువారం షోపియాన్ జిల్లాలోని యార్వాన్ అడవి, కుప్వారా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మన సైనికులు చేసిన ఎన్కౌంటర్లలో నలుగురు మిలిటెంట్లు చనిపోయారు. ఈ దాడులలో పలువురు జవాన్లకూ గాయాలైనట్టు సమాచారం. -
పుల్వామా జిల్లా పింగాన్లో భారీ ఎన్కౌంటర్
-
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్ర కలకలం
-
కశ్మీర్ ఎన్కౌంటర్ : నలుగురు మిలిటెంట్లు హతం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ సైనికుడితో పాటు నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ చేపట్టగా మిలిటెంట్లు భద్రతా దళాలపై కాల్పులకు దిగారు. భద్రతా దళాలు జరిపిన ప్రతికాల్పుల్లో ముగ్గురు నలుగురు మిలిటెంట్లు మరణించారని కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. కాగా పోలీసులకు తమ సమాచారం చేరవేస్తున్నారనే అనుమానంతో మిలిటెంట్లు ఇటీవల ఇద్దరు టీనేజర్లను అపహరించి దారుణంగా హతమార్చిన ఘటన నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు పూంచ్ జిల్లాలో పాకిస్తాన్ దళాలు కాల్పుల విరమణను ఉల్లంఘించి భారత పోస్టులను టార్గెట్ చేస్తూ కాల్పులకు దిగాయి. భారత దళాలు పాక్ కాల్పులకు దీటుగా బదులిచ్చాయి. -
కశ్మీర్లో ఐదుగురు మిలిటెంట్ల హతం
శ్రీగనర్: కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం చెలరేగిన ఘర్షణల్లో ఒక పౌరుడు మరణించాడు. కిలూరా అనే గ్రామంలో శుక్రవారం రాత్రి నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఒక టెర్రరిస్టు శుక్రవారం మరణించగా, మరో నలుగురిని శనివారం ఉదయం హతమార్చినట్లు సైన్యం వెల్లడించింది. ఈ ఉగ్రవాదులంతా స్థానిక యువతే. ఎన్కౌంటర్ ముగిశాక ఘటనాస్థలంలో భారీగా గుమిగూడిన స్థానికులు భద్రతా దళాలపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. కాల్పుల్లో చనిపోయిన ఓ ఉగ్రవాది మృతదేహానికి గానోపురాలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా పోలీసు కాల్పుల్లో ఒక పౌరుడు బలయ్యాడు. -
కానిస్టేబుల్‌ను చంపేసిన ఉగ్రవాదులు ఖతం!
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఆదివారం ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాద మూకనే ఓ జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్‌ను ట్రాప్ చేసి హతమర్చారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆదివారం ఉదయం కుల్గామ్ జిల్లాలోని ఖుద్వానీ గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ గాలింపుల్లో ఉగ్రవాదులు ఎదురుపడటంతో వారికి, భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు హతమయ్యారు. ఇంకా ఆ ప్రాంతంలో భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది. కానిస్టేబుల్ మహమ్మద్ సలీంను ట్రాప్ చేసి.. చితహింసలు పెట్టి హతమార్చిన ఉగ్రవాదులను ఎరివేసే ఆపరేషన్ కొనసాగుతోందని, జమ్మూకశ్మీర్ పోలీసులు, ఆర్మీ, భద్రతా దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ ట్విటర్లో తెలిపారు. -
ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు ఆదివారం లష్కరే తోయిబా కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. మరొకరిని ప్రాణాలతో పట్టుకున్నాయి. ఈ విషయమై ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(కశ్మీర్ రేంజ్) స్వయంప్రకాశ్ పానీ మాట్లాడుతూ.. కుల్గామ్ జిల్లాలోని చద్దర్బన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారని నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందిందన్నారు. దీంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం అక్కడకు చేరుకుని ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని చుట్టుముట్టిందని వెల్లడించారు. భద్రతాబలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారని పేర్కొన్నారు. దీంతో బలగాలు సైతం ఎదురుకాల్పులు జరిపాయన్నారు. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన డివిజినల్ కమాండర్ షకూర్ అహ్మద్ దార్ సహా ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ఘటనలో మరో ఉగ్రవాది భద్రతాబలగాలకు లొంగిపోయినట్లు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి భారీఎత్తున ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నామన్నారు. చనిపోయిన షకూర్ అహ్మద్‌తో పాటు బలగాలకు లొంగిపోయిన ఉగ్రవాది స్థానికుడేనన్నారు. ఈ కాల్పుల్లో చనిపోయిన మరో ఉగ్రవాది హైదర్ పాకిస్తాన్‌కు చెందినవాడని పేర్కొన్నారు. మరోవైపు కుల్గామ్ జిల్లాలోని గోబల్ గ్రామంలో ఆర్మీ వాహనంపై అల్లరిమూకలు రాళ్లదాడికి పాల్పడ్డాయి. ఈ దాడి తీవ్రతరం కావడంతో ఆర్మీ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు(23) ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి పెల్లెట్ గాయాలయ్యాయి. జూన్ 20న త్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని, 22న ఐసిస్ కశ్మీర్ చీఫ్ సహా నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతుండటం గమనార్హం. -
ఉగ్రవేట: ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం
-
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: కశ్మీర్లో భద్రతా బలగాలు భారీ ఎన్కౌంటర్ చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున అనంత్‌నాగ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరిపిన ఎన్కౌంటర్లో జమ్మూ కశ్మీర్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌జేకే) చీఫ్ దావూద్ అహ్మద్ సోఫీ సహా నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ పోలీసు, మరో పౌరుడు మృతిచెందారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పలు హత్య కేసు లు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన ఘటనల్లో సోఫీ కీలక నిందితుడని తెలిపారు. వచ్చే వారం (జూన్ 28 నుంచి) అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ భద్రతాబలగాలకు నైతిక బలాన్నిచ్చింది. మరోవైపు, పుల్వామా జిల్లాలోని త్రాల్ మార్కెట్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. ఈ ఘటనలో తొమ్మిది మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. తెల్లారేసరికి ఆపరేషన్ పూర్తి శుక్రవారం తెల్లవారుజామునే ఈ ఆపరేషన్ మొదలుపెట్టిన భద్రతా బలగాలు.. తెల్లారేసరికి పనిపూర్తి చేశాయి. ఉగ్రవాదులు దాక్కున్నారన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా అర్థరాత్రే బలగాలు చేరుకున్నాయి. అయితే.. తెల్లవారాకే మృతుల్లో దావూద్ సోఫీ ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన ముగ్గురిని ఐఎస్‌జేకే సభ్యులైన ఆదిల్ రెహమాన్ భట్, మహ్మద్ అష్రఫ్ ఇటూ, మాజిద్ మంజూర్ దార్లుగా గుర్తించినట్లు కశ్మీర్ రేంజ్ ఐజీ స్వయం ప్రకాశ్ పాణి వెల్లడించారు. ‘ఈ ఆపరేషన్ విజయవంతమైంది. రాష్ట్ర పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సమన్వయంతో పని పూర్తిచేశారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో ఖిరం గ్రామానికి వెళ్లిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ ఓ ఇంట్లో దాక్కున్నారు. ఇంటిని చుట్టుముట్టిన బలగాలు ఆపరేషన్ పూర్తి చేశాయి’ అని ఆయన వెల్లడించారు. భారత్‌కు ఐఎస్ ముప్పు! ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఐఎస్ ప్రభావం భారత్‌లో పెద్దగా లేదని.. మన ప్రభుత్వం మొదట్నుంచీ చెబుతోంది. కశ్మీర్‌లోనూ మిగిలిన ఉగ్రవాద సంస్థలతో పోలిస్తే.. ఐఎస్ ప్రభావం అసలేమాత్రం లేదని చెప్పుకొస్తోంది. కానీ కొంతకాలంగా కశ్మీర్లో ఐఎస్ జెండాలు కనబడుతున్నాయి. రాళ్లు రువ్విన ఘటనల చిత్రాల్లో యువకుల చేతిలో ఐఎస్ జెండాలు కనిపిస్తూనే ఉన్నాయి. అనంత్‌నాగ్‌లో శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌తో ఐఎస్ లోయలో ఐఎస్ ప్రభావం ఉన్నట్లు సుస్పష్టమైంది. జమ్మూకశ్మీర్ కోసం ఐఎస్ ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటుచేసుకున్నట్లు తేలింది. ఏ++ కేటగిరీ (ఉగ్రవాదుల స్థాయిని బట్టి భద్రతా బలగాలు ఇచ్చే రేటింగ్) ఉన్న జేకేఐఎస్ చీఫ్ దావూద్ సోఫీని హతమార్చటం ద్వారా.. లోయలో విస్తరించేందుకు ఐఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తుందనేది సుస్పష్టమైంది. హిట్ లిస్ట్‌తో ఆర్మీ ఆపరేషన్ కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భద్రతా బలగాలు ‘ఆపరేషన్ ఆలౌట్’ను ప్రారంభించాయి. బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటుచేసుకుని.. ఒక్కో ఉగ్రవాద సంస్థను, అందులోని ముఖ్యనేతలను పక్కాగా టార్గెట్ చేస్తూ 22మందితో జాబితాను సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ (11 మంది), లష్కరే తోయిబా (7), జైషే మహ్మద్ (2), అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్, జేకేఐఎస్ల నుంచి ఒక్కొక్కరు ఈ జాబితాలో ఉన్నారు. జేకేఐఎస్ చీఫ్ హతంతో ఈ జాబితా 21కి చేరింది. భద్రతను సమీక్షించిన విజయ్ జమ్మూకశ్మీర్ గవర్నర్ సలహాదారుగా నియమితుడైన రిటైర్డు ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్ కశ్మీర్ లోయలోని భద్రతా పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం ఉదయమే ఆయన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. అటు, గవర్నర్ రూల్ అమల్లోకి రావడంతో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ భేటీలో నేషనల్ కాన్ఫరెన్స్ తరపున ఒమర్ అబ్దుల్లా, పీడీపీ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిలావర్ మిర్ సహా.. వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ గవర్నర్‌ను కలిసి.. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. జూన్ 28 నుంచి 60 రోజుల పాటు జరిగే అమర్నాథ్ యాత్రలో యాత్రికుల వాహనాలకు ట్రాకింగ్ చిప్స్‌ను అమర్చనున్నట్లు జమ్మూ రేంజ్ ఐజీ ఎస్డీ సింగ్ పేర్కొన్నారు. ఈ సాంకేతికతతో యాత్రికులు, వారి వాహనాల భద్రతను నిరంతరం పర్యవేక్షించవచ్చు. ఉగ్రవాదుల్ని సత్యాగ్రహంతో ఎదుర్కోవాలా?: జైట్లీ న్యూఢిల్లీ: సామాన్య పౌరుల మానవహక్కుల్ని పరిరక్షించేందుకు ఉగ్రవాదుల పట్ల కఠిన వైఖరిని అవలంబించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. చంపడానికి, చావడానికి సిద్ధమై వస్తున్న ఉగ్రవాదుల్ని సత్యాగ్రహంతో ఎదుర్కోవాలా? అని ప్రశ్నించారు. కశ్మీర్లో సైనిక ఆపరేషన్లలో ఉగ్రవాదుల కంటే అమాయక ప్రజలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ వ్యాఖ్యానించడంపై జైట్లీ మండిపడ్డారు. ‘ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు చావడానికి సిద్ధంగా ఉంటాడు. అతను ఇతరుల్ని చంపడానికీ వెనుకాడడు. అలాంటివాళ్లు ఎదురుపడినప్పడు వారిని సత్యాగ్రహంతో ఎదుర్కోమంటారా? ఉగ్రవాది చంపడానికి ముందుకొస్తుంటే భద్రతాబలగాలు అతడిని చర్చలు జరిపేందుకు ఆహ్వానించాలా?’ అని ప్రశ్నించారు. మావోయిస్టుల మద్దతున్న మానవహక్కుల సంఘాలు వేర్పాటువాదం, హింసను ప్రోత్సహిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇలాంటి గ్రూపుల్ని కాంగ్రెస్ గతంలో వ్యతిరేకించినా జేఎన్‌యూ, హెచ్‌సీయూలో దేశవ్యతిరేక నినాదాలు ఇచ్చినవారితో చేతులు కలిపేందుకు రాహుల్ గాంధీకి ఎలాంటి ఇబ్బంది లేదని విమర్శించారు. కశ్మీరీల తొలి ప్రాధాన్యం స్వాతంత్య్రమే కాంగ్రెస్ నేత సోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలకు ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే అవకాశమిస్తే వారు స్వతంత్రంగా ఉండేందుకే మొగ్గుచూపుతారని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమనీ, పార్టీకి దానితో సంబంధం లేదని వివరణ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో సోజ్ మాట్లాడుతూ.. ‘కశ్మీరీలు పాకిస్తాన్లో విలీనం కావాలనుకోవడం లేదని ముషార్రఫ్ చెప్పారు. ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే అధికారం కశ్మీరీలకు ఇస్తే వారు స్వతంత్ర కశ్మీర్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తారన్నారు. ఆయన చెప్పింది అప్పటికీ, ఇప్పటికీ నిజమే. నేను కూడా అదే చెప్పాను. కానీ కశ్మీర్‌కు స్వాతంత్య్రం రావడం అన్నది అసాధ్యమని నాకూ తెలుసు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అన్నివర్గాల నుంచి తీవ్రనిరసన వ్యక్తమైంది. దీంతో సోజ్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఖండించారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉందనీ, భవిష్యత్‌లోనూ ఉంటుందనీ స్పష్టం చేశారు. త్వరలో మార్కెట్లోకి రానున్న తన పుస్తకం అమ్మకాలను పెంచుకునేందుకే సోజ్ ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేశారని సూర్జేవాలా విమర్శించారు. కాగా సోజ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ కాంగ్రెస్‌ను డిమాండ్ చేసింది. -
ఆరుగంటల్లో.. 5గురు ఉగ్రవాదులు హతం
షోఫియాన్: జమ్మూ-కశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లా బడిగాం వద్ద ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఐదుమంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బడిగాంలోని ఇమాన్ సాహిబ్ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ‘ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కుని వారిపై కాల్పులు జరిపారు. దీనికి భారతసైన్యం ధీటుగా సమాధానమిచ్చింది. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. హతులను హిజ్యుల్ ముజాహిద్దీన్ ముఠాకు చెందిన వారిగా గుర్తించారు. కశ్మీర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కూడా ఈ కాల్పుల్లో మరణించారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ఐదుగురు పౌరులు కూడా మరణించారు.’ అని ఓ అధికారి తెలిపారు. ఈ ఆపరేషన్ విజవంతం చేసిన దళాలను అభినందిస్తూ జమ్మూ-కశ్మీరు డీజీపీ శేష్ పాల్ వైద్ ట్వీట్ చేశారు. ‘ షోఫియాన్ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను అంతం చేశాం. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ-కశ్మీరు పోలీసులు చేసిన కృషికి అభినందనలు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కానీ, ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందడంతో దక్షిణ కశ్మీర్లో పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. ముఖ్యంగా షోఫియాన్, పుల్వామా, తదితర దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో పౌరులు ఆందోళన చేపట్టారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. భద్రతా దళాలను నిరోధించేందుకు స్థానికులు రాళ్ళదాడికి పాల్పడ్డారు. దీంతో అదనపు సీఆర్పీఎఫ్ బలగాలను ఈ ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడి
-
సరిహద్దులో అలజడి; వరుస ఎన్కౌంటర్లు..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడి. పాక్ సరిహద్దు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున వరుస ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సోఫియాన్ జిల్లాలో రెండు చోట్ల, అనంతనాగ్ జిల్లాలో ఒకచోట ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. సోఫియాన్ జిల్లా కచ్చాదోరా ఏరియా, ద్రాగాడ్ గ్రామాల్లోకి సాయుధులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకోగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అటు అనంతనాగ్ జిల్లాలోని దైల్‌గావ్ ఏరియాలో.. ఉగ్రవాదులు, జమ్ముకశ్మీర్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మిలిటెంట్ హతం కాగా, ఇంకొకడు ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఈ వార్తలకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
కాల్పుల్లో ఉగ్రవాది మృతి
శ్రీనగర్ : భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. ఈ సంఘటన ఆదివారం జమ్మూ కశ్మీర్ రాష్ర్టం షోపియాన్ జిల్లాలోని పాహ్నూలో జరిగింది. కాపలా నిర్వహిస్తోన్న మొబైల్ చెక్ పోస్టు వాహనంపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరపటంతో ప్రతిగా భద్రతాబలగాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించినట్లు రక్షణా శాఖ అధికార ప్రతినిథి కల్నల్ రాజేష్ కలియా ధృవీకరించారు. ఉగ్రవాదుల వేట కొనసాగుతోందని వెల్లడించారు. -
ఐదుగురు మిలిటెంట్ల హతం
శ్రీనగర్: కశ్మీర్లో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయి. బుద్గాం, బారాముల్లా జిల్లాల్లో ఈ ఎన్కౌంటర్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఫుత్లిపొరాలోని పకేపొరా ప్రాంతంలో మిలిటెంట్లు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మిలిటెంట్లు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడటంతో ఎదురుకాల్పులు జరిపినట్లు ఓ ఆర్మీ అధికారి తెలిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు మృతి చెందారని చెప్పారు. వీరు జైషే మొహమ్మద్‌తోపాటు పాకిస్తాన్‌కు చెందిన మరో ఉగ్ర సంస్థ మిలిటెంట్లని చెప్పారు. బారాముల్లా జిల్లాలోని బోమైలో జరిగిన మరో ఎన్కౌంటర్లో లష్కరే మిలిటెంట్ ముజామిల్‌ను హతమార్చారు. ఈ ఏడాది 200 మంది హతం: డీజీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జమ్మూ కశ్మీర్లో 200 మందికిపైగా మిలిటెంట్లను హతమార్చినట్లు జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ ట్వీటర్లో పేర్కొన్నారు. దేశం, జమ్మూ కశ్మీర్లో శాంతి స్థాపనకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. -
ఆర్మీ కాల్పుల్లో 33 మంది మిలిటెంట్లు హతం
కాబూల్: ఆప్ఘనిస్తాన్ భద్రతా బలగాల కాల్పుల్లో సుమారు 33 మంది మిలిటెంట్లు మృతిచెందారు. నంగర్హర్ ప్రావిన్స్‌లో మిలిటెంట్ల కదలికలపై సమాచారం అందుకున్న బలగాలు అక్కడికి చేరుకుని వారిని మట్టుపెట్టినట్లు ఓ ఆర్మీ అధికారి శుక్రవారం వెల్లడించారు. చాపరహర్, పాచిరాగమ్ జిల్లాల్లో భద్రతా బలగాలు జరిపిన ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. బలగాల తనిఖీని గుర్తించిన మిలిటెంట్లు ఆర్మీ సిబ్బందిపై కాల్పులు ప్రారంభించాయి. వెంటనే స్పందించిన ఆర్మీ జరిపిన ఎదురు కాల్పుల్లో 33 మంది ఉగ్రవాడులు మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ తనిఖిలలో భాగంగా 22 మంది మిలిటెంట్లని అదుపులోకి తీసుకున్నారు. -
నెత్తురోడిన పాక్
ఇరుగుపొరుగుకు ఉగ్రవాదం ఎగుమతి చేస్తున్న దేశంగా తరచు విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ వారమంతా వరస పేలుళ్లతో హోరెత్తింది. కేవలం అయి దురోజుల వ్యవధిలో లాహోర్ మొదలుకొని బలూచిస్తాన్‌లోని ఆవారన్ వరకూ పలు నగరాలు, పట్టణాల్లో పది ఉగ్రవాద దాడులు జరిగి దాదాపు 50మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటికీ పరాకాష్ట అనదగ్గ ఘటన గురువారం సింద్ రాష్ట్రంలోని సెహ్వాన్‌లో సూఫీ మత గురువు లాల్ షాబాజ్ ఖలందర్ ప్రార్థనా మందిరంలో చోటు చేసుకుంది. మానవ బాంబు జొరబడి చేసిన ఈ దాడిలో 80 మంది మరణించారు. మరో 250మంది తీవ్రంగా గాయపడ్డారు. సైన్యం చర్యలు తీసుకోవడం లేదని అనడానికి లేదు. ఏదో ఒక మూల ఉగ్రవాద స్థావరంపై దాడి చేశామని అది చెప్పని రోజంటూ లేదు. ఆ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మరణిస్తున్నారు కూడా. అయినా ఉగ్రవాద ఉదంతాలు దేశంలోఎక్కడా తగ్గలేదు సరిగదా అవి మరింత జోరందుకున్నాయి. ఇటు సైన్యం ‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’ ఆగలేదు. సెహ్వాన్ ఉదంతం తర్వాత వివిధ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామంటూ శుక్రవారం ఒక్కరోజే 100 మందిని హతమార్చింది. ఏదైనా జరిగినప్పుడల్లా తాము చేతులు ముడుచుకుని కూర్చోలేదని చెప్పడానికి ఆ పేరిట సైన్యం వెనకా ముందూ చూడకుండా దాడులు చేస్తున్నదన్న విమర్శలున్నాయి. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు దాన్ని ఎలా అరి కట్టాలో, దాని మూలాలు ఎక్కడున్నాయో తోచక నానా యాతనలూ పడుతున్నదని ఈ దాడులు–ప్రతి దాడుల వ్యవహారాన్ని చూస్తే అర్ధమవుతుంది. సైన్యం తన దారిన తాను దాడులు చేస్తుంటే దాని శక్తిసామర్ధ్యాలను హేళన చేసేలా ఉగ్రవా దులు మరింత క్రౌర్యానికి తెగిస్తున్నారు. ఈ వారం జరిగిన ఉదంతాల తీరును గమనిస్తే అవి అవకాశం దొరికినచోట చేసిన దాడుల్లా కనబడవు. వాటన్నిటికీ ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ఉన్నదని, ఎంచుకున్న ప్రాంతాల్లో లక్ష్యాలను నిర్ణయించు కుని ఉగ్రవాదులు తమ పని కానిస్తున్నారని తెలుస్తుంది. సిం«ద్ రాష్ట్రానికి సూఫీ మతగురువులతో, సూఫీయిజంతో ఆత్మీయ అను బంధం ఉంది. శతాబ్దాల నుంచి అది తరం నుంచి తరానికి కొనసాగుతూ వస్తోంది. వాస్తవానికి సిం«ద్‌లోనే కాదు... ఉపఖండంపైనే సూఫీయిజం చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు దాడి జరిగిన లాల్ షాబాజ్ ఖలందర్ సూఫీ మందిరంతోపాటు కరాచీలోని అబ్దుల్లా షా ఘాజీ సూఫీ మందిరం, భిత్షాలోని షా అబ్దుల్ లతీఫ్ భితాయ్ సూఫీ మందిరం ఈ సంప్రదాయ పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటికి సిం«ద్ రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలలనుంచీ ప్రతి గురువారం వేలా దిగా తరలివస్తారు. తమ కాలపు అసమానతలపైన, వాటిని పెంచి పోషిస్తున్న పాలకులపైనా తిరగబడిన చరిత్ర సూఫీ మత గురువులది. ఇందుకోసం ప్రజలపై బలమైన ప్రభావం చూపే మత తాత్వికతనే వారు ఆలంబన చేసుకున్నారు. మహిళా సూఫీ మత గురువులైతే కట్టుబాట్ల పేరిట కుటుంబాల్లో మహిళలను అణచి వేసే ధోరణులపై కూడా పోరాడారు. సంగీతానికి, కవిత్వానికి సూఫీయిజం ఎన్నో సొబగులు అద్దింది. శతాబ్దాలుగా మనుషుల్లో మంచితనాన్ని, మానవీయతను ప్రబోధిస్తూ కొనసాగుతున్న ఇంతటి సమున్నత స్రవంతిపై ఉన్మాదం తప్ప మరేమీ తెలియని ఉగ్రవాదులు దాడి చేయడంలో వింతేమీ లేదు. సామరస్యాన్ని ప్రబో ధించే, బహుళత్వాన్ని ప్రేమించే సూఫీయిజంపై పాకిస్తాన్లో తరచూ దాడులు జరు గుతున్నాయి. 2005 నుంచి సూఫీ మందిరాల్లో 29 ఉగ్రవాద దాడులు చోటుచేసు కోగా వీటిలో 200మందికిపైగా మరణించారని ఇస్లామాబాద్‌లోని ఇస్లామిక్ పరిశో ధన, అధ్యయన సంస్థ చెబుతోంది. సామాన్య పౌరుల్లో ఉండే మత విశ్వాసాలపై సూఫీయిజం ప్రభావం అధికంగా ఉండటం ఉగ్రవాదులకు కంటగింపుగా ఉంది. తాజా దాడి వెనక సూత్రధారి ఐఎస్ ఉగ్రవాద సంస్థ అని, పాకిస్తాన్ తాలి బన్(టీటీపీ) సంస్థతో కలిసి వారు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని అంటున్నారు. ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడల్లా పొరుగు దేశం అఫ్ఘానిస్తాన్‌పై ఆరోపణలు చేయడం పాకిస్తాన్‌కు అలవాటుగా మారింది. పాక్–అఫ్ఘాన్ సరిహద్దులు ఉగ్రవా దుల అడ్డాగా మారిన సంగతి నిజమే అయినా... అక్కడి గిరిజన ప్రాంతాల్లో పలు తెగలను చేరదీసి వారికి ఆయుధ శిక్షణనిచ్చి దాడులకు పురిగొల్పిన తన నిర్వాకాన్ని పాకిస్తాన్ మరిచిపోకూడదు. అలాంటి చర్యల కారణంగానే ఉగ్రవాదం ఇప్పుడు ఊడలుదిగింది. ఇప్పటికీ భారత్‌పై కన్నేసిన ఉగ్రవాద సంస్థలకు అక్కడి సైన్యం అండదండలున్నాయి. ఉగ్రవాదులతో అంటకాగిన ఇలాంటి చరిత్రే ఇవాళ దాన్ని అదుపు చేయడంలో పాకిస్తాన్‌కు పెను ఆటంకంగా, తలకు మించిన భారంగా మారింది. అది చీకట్లో తడుములాటగా తయారైంది. స్వాత్ లోయను ఉగ్రవాద రహితంగా మార్చామని, ఇక దక్షిణ వజిరిస్తాన్, ఉత్తర వజిరిస్తాన్ల సంగతి చూస్తా మని సైన్యం ఆమధ్య చెప్పింది. వాటి సంగతలా ఉంచి ఉగ్రవాదులు దేశం లోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నారని తాజా ఉదంతం వెల్లడిస్తోంది. ఉగ్రవాద సంస్థలకు నిధులందకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా మని గత నెలలో అంతర్జాతీయ ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్‌కు పాకిస్తాన్ హామీ ఇచ్చింది. ఉగ్రవాద ముఠాల నిధులకు కళ్లెం వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునే ఆ బృందం అయిదు రోజుల సమావేశాలు ఆదివారం పారిస్‌లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల్లాళ్లలో తాను సాధించినదేమిటో చెప్పేందుకు పాకిస్తాన్ తయారవుతుండగా ఈ వారమంతా జరిగిన ఉగ్రవాద ఘటనలు దాని పరువును బజారున పడేశాయి. వివిధ రాజకీయ సంస్థల, ధార్మిక సంస్థల ముసుగులో లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌లాంటి ఉగ్ర సంస్థలు పాక్‌లో నిధులు దండుకుంటున్న వైనంపై మన దేశం పారిస్ సదస్సులో సవివరమైన నివేదిక సమర్పించబోతోంది. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరిని వదులు కోకపోతే అది తమను ముంచేస్తుందని ఇప్పటికైనా పాక్ గుర్తించడం అవసరం. ఈ వారమంతా కొనసాగిన వరస ఉదంతాలు దీన్నే చెబుతున్నాయి. -
సైన్యం కాల్పుల్లో 15 మంది ఉగ్రవాదులు హతం
కాబుల్: సైన్యం జరిపిన కాల్పుల్లో కనీసం 15 మంది తాలిబన్ గ్రూప్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ అఫ్ఘానిస్తాన్ లోని బఘ్లాన్ ప్రాంతంలో రెండు రోజులుగా జరుగుతోంది. సైన్యం జరిపిన కాల్పుల్లో 15 మంది మృత్యువాత పడగా, మరో 13 మంది గాయపడ్డారని అధికారులు భావిస్తున్నారు. బఘ్లాన్-ఈ-మర్కాజీ జిల్లాలో శుక్రవారం, శనివారం పలు ప్రాంతాల్లో సైన్యం కాల్పులు జరిపింది. రాజధాని కాబుల్ ఉత్తరాన ఈ ప్రాంతం 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో తాలిబన్ ఉగ్రవాదులు ఎక్కువగా సంచరిస్తున్నారన్న సమాచారంతో ఈ కాల్పులు జరిగాయి. పది గ్రామాలను ఉగ్రవాదులు వారి ఆధీనంలోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. తాలిబన్లు ఈ ఘటనపై ఇప్పటివరకూ స్పందించలేదు. సైనికులకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. -
హోరాహోరీగా కాల్పులు.. 12 మంది హతం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ పోలీసులు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 12 మంది హతమయ్యారని కరాచీ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని, వారికి ప్రస్తుతం చికిత్స అందజేస్తున్నట్లు చెప్పారు. కరాచీలో మిలిటెంట్లు దాగిఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారి కదలికలపై నిఘా ఉంచారు. ఎదురుకాల్పుల్లో 8 మంది, పారిపోయే యత్రం చేస్తున్న సమయంలో జరిపిన కాల్పుల్లో మరో నలుగురు హతమయ్యారని సీనియర్ పోలీస్ వివరించారు. మిలిటెంట్లు లష్కర్ ఈ ఝాంగ్వీ, తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ గ్రూపు వ్యక్తులని అధికారులు భావిస్తున్నారు. మిలిటెంట్ల వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
ప్రత్యేక పోలీసు అధికారులై ఉండి ఉగ్రవాదంలోకి..
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో గురువారం ఉదయం చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు గత నెల రోజుల వరకు భారత బలగాల్లో ప్రత్యేక పోలీసు అధికారులుగా(ఎస్పీవో) పనిచేసినట్లు డిఫెన్స్ పీఆర్వో ఎస్ఎన్ ఆచార్య తెలిపారు. వీరిద్దరు దోడా జిల్లాలో గత సెప్టెంబర్ 6, 7న పోలీసు విధుల నుంచి ఆయుధాలతో సహా తప్పించుకుని వెళ్లి ఉగ్రవాదులతో చేతులు కలిపి అందులో చేరినట్లు వెల్లడించారు. గతంలోనూ వీరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి అప్రూవర్‌గా మారడంతో ఆర్మీకి సహాయం చేసే ప్రత్యేక పోలీసు అధికారుల బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. గురువారం ఉదయం దోడి జిల్లాలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుని ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్ కౌంటర్ లేకుండా దోడా జిల్లా గత నాలుగేళ్లుగా ప్రశాంతంగా ఉండగా గురువారంనాటిదే తొలి సంఘటన. కాల్పుల అనంతరం మృతదేహాలను గులాం నబీ మాంగ్ నూ అలియా మౌల్వీ అలియాస్ గుల్లా టైలర్, మరొకరు రియాజ్‌గా గుర్తించారు. వీరిలో మౌల్వీ లష్కరే తోయిబా జిల్లా కమాండర్‌గా ఉన్న సమయంలో 2010లో పోలీసులకు లొంగిపోయి ఎస్పీవోగా మారాడు. ఇక రియాజ్ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ టెర్రరిస్టుగా ఉండి 2010లో ఆర్మీకి లొంగిపోయి ఎస్పీవోగా చేరాడు. లష్కరేతోయిబాలో 2003లో మౌల్వీ చేరగా, హిజ్బుల్ సంస్థలో రియాజ్ 1999 చేరాడు. గత నెలలోనే తిరిగి వారు ఎస్పీవో బాధ్యతల నుంచి తప్పించుకుని ఆయుధాలతో సహా వెళ్లి మళ్లీ ఉగ్రవాద సంస్థలో చేరిపోయినట్లు సైన్యం గుర్తించింది. ఈ క్రమంలో వారి అలికిడి దోడా జిల్లాలో ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్లో వారిద్దరు హతమయ్యారు. ఏకే 47, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్‌ను, ఇతర మందుగుండు సామాగ్రిని పోలీసులు, సైన్యం స్వాధీనం చేసుకుంది. -
ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్ చోటుచేసుకుని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దోడా జిల్లాలో ఈ ఘటన గురువారం వేకువ జామున చోటుచేసుకున్నట్లు మిలటరీ అధికార ప్రతినిధి తెలిపారు. దోడా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందడంతో స్థానిక పోలీసుల సహాయంతో సైన్యం ఉగ్రవాదులను వేటాడే కార్యక్రమం ప్రారంభించింది. వారిని వెతికే క్రమంలో కొందరు ఉగ్రవాదులు తారసపడగా ఎన్ కౌంటర్ చోటుచేసుకుని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. -
వైమానిక దాడుల్లో 30 మంది తీవ్రవాదులు హతం
పెషావర్: పాకిస్థాన్ వాయువ్య ప్రాంతమైన ఖైబర్ ప్రావెన్స్లో తీవ్రవాద స్థావరాలపై బుధవారం ఆ దేశ సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో దాదాపు 30 మంది తీవ్రవాదులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మృతి చెందిన తీవ్రవాదుల్లో కీలక కమాండర్లతోపాటు విదేశీ ఉగ్రవాదులు కూడా ఉన్నారని ఇంటర్ సర్వీసెస్స్ పబ్లిక్ రిలేషన్స్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే శనివారం ఖైబర్ జిల్లాలో భద్రత దళాలు,తీవ్రవాదుల మధ్య జరిగిన పోరులో 80 మంది తీవ్రవాదులు హతం కాగా, ఏడుగురు సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. -
ఇద్దరు ఉగ్రవాదులు హతం
కశ్మీర్‌లోని షాపియాన్ జిల్లాలో మంగళవారం నుంచి జరుగుతున్న ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయినట్లు భద్రతా బలగాలు బుధవారం గుర్తించారు. మరికొందరి కోసం బలగాల గాలింపుల చర్యలు కొనసాగుతున్నాయి. షాపియాన్లోని షెర్మల్ ప్రాంతంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొచ్చుకొచ్చారన్న సమాచారం అందుకున్న భద్రత బలగాలు వారికోసం మంగళవారం సాయంత్రం నుంచి గాలింపులు కొనసాగిస్తున్నాయి. రాత్రిపూట గాలింపు చర్యలు నిలిపివేసి తిరిగి ఈ రోజు ఉదయం ప్రారంభించారు. -
వైమానిక దాడుల్లో 31 మంది తీవ్రవాదులు హతం
ఇస్లామాబాద్: పెషావర్ ఘటనతో పాక్ సైన్యం దేశంలోని తీవ్రవాదులపై దాడిని మరింత ముమ్మరం చేసింది. ఆ క్రమంలో ఆదివారం తిహర్ వ్యాలీలోని కోకి ఖేల్ ప్రాంతంలో ఆత్మాహుతి దళానికి శిక్షణ ఇచ్చే కేంద్రంపై వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో 31 మంది తీవ్రవాదులు హతమయ్యారని స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల్లో ఆత్మాహుతి దళ సభ్యులతోపాటు తీవ్రవాదులు కూడా ఉన్నారని పేర్కొంది. గతేడాది డిసెంబర్ 16న పెషావర్‌లో ఆర్మీ పాఠశాలలో తీవ్రవాదులు నరమేధం సృష్టించారు. ఈ ఘటనలో 150 మంది మరణించగా... వారిలో 140 మంది విద్యార్థులు ఉన్న విషయం తెలిసింది. దీంతో తీవ్రవాదులపై పాక్ తన దాడులను ముమ్మరం చేసింది. -
ఆర్మీ దాడులు: 50 మంది తాలిబన్లు మృతి
పాకిస్థాన్: పెషావర్‌లో ఆర్మీ స్కూల్‌పై తీవ్రవాదులు సృష్టించిన నరమేధంతో పాక్ ప్రభుత్వం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందులోభాగంగా పాకిస్థాన్‌లోని గిరిజన ప్రాంతమైన ఖైబర్‌లోని తాలిబన్ స్థావరాలపై సైన్యం గురువారం ముకుమ్మడి దాడులు చేసింది. ఆ దాడుల్లో దాదాపు 50 మంది తాలిబన్ తీవ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాక్ సైనిక అధికారులు వెల్లడించారు. తాలిబన్ తీవ్రవాదుల ఆత్మాహుతి దళం సైనిక దుస్తుల్లో మంగళవారం పెషావర్ ఆర్మీ స్కూల్లో ప్రవేశించారు. పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 148 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దారుణంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లను ఏరివేసేందుకు పాక్ ప్రభుత్వం నడుం బిగించింది.