సైన్యం కాల్పుల్లో 15 మంది ఉగ్రవాదులు హతం | 15 militants killed in Afghan military operation | Sakshi
Sakshi News home page

సైన్యం కాల్పుల్లో 15 మంది ఉగ్రవాదులు హతం

Published Sat, May 28 2016 7:49 PM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

15 militants killed in Afghan military operation

కాబుల్: సైన్యం జరిపిన కాల్పుల్లో కనీసం 15 మంది తాలిబన్ గ్రూప్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ అఫ్ఘానిస్తాన్ లోని బఘ్లాన్ ప్రాంతంలో రెండు రోజులుగా జరుగుతోంది. సైన్యం జరిపిన కాల్పుల్లో 15 మంది మృత్యువాత పడగా, మరో 13 మంది గాయపడ్డారని అధికారులు భావిస్తున్నారు. బఘ్లాన్-ఈ-మర్కాజీ జిల్లాలో శుక్రవారం, శనివారం పలు ప్రాంతాల్లో సైన్యం కాల్పులు జరిపింది. రాజధాని కాబుల్ ఉత్తరాన ఈ ప్రాంతం 160 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ ప్రాంతంలో తాలిబన్ ఉగ్రవాదులు ఎక్కువగా సంచరిస్తున్నారన్న సమాచారంతో ఈ కాల్పులు జరిగాయి. పది గ్రామాలను ఉగ్రవాదులు వారి ఆధీనంలోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. తాలిబన్లు ఈ ఘటనపై ఇప్పటివరకూ స్పందించలేదు. సైనికులకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement