Talibans
-
పాకిస్తాన్ ముంగిట తాలిబన్ సవాళ్లు
అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు 2021లో అఫ్గానిస్తాన్‌ను వీడిన తర్వాత ఆ దేశాన్ని రెండోసారి హస్తగతం చేసుకున్న తాలిబన్... ప్రస్తుతం భద్రతా పరంగా పాకిస్తాన్‌కు అత్యంత ముప్పుగా మారింది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్‌లో తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ మిలిటరీ, నిఘా సంస్థలు తాలిబన్లకు శిక్షణ ఇచ్చి వారిని మరింత బలపడేలా చేశాయి. సోవియట్ యూనియన్ దళాల ఉపసంహరణ తర్వాత రాజకీయ అనిశ్చితి మధ్య అఫ్గానిస్తాన్‌ను పాలిస్తున్న బుర్హనుద్దీన్ రబ్బానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి 1996లో తాలిబన్లు ఆ దేశాన్ని హస్తగతం చేసు కున్నారు. అప్పటినుండి 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై దాడి తర్వాత అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని కూలదోసి హమీద్ కర్జాయ్ ప్రభుత్వం ఏర్పడే దాకా, తాలిబన్లతో పాకిస్తాన్ సత్సంబంధాలు నెరిపింది.వివాదాలు కూడా పట్టనంతగా...ఈ కాలంలో తాలిబన్ ప్రభుత్వం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎంతలా పెనవేసుకు పోయాయంటే, రెండు దేశాల మధ్య 1947 నుండి ఉన్న సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేంతగా. ముఖ్యంగా 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిన 2,640 కిలోమీటర్ల పొడవైన డ్యూరాండ్ లైన్ వల్ల దశాబ్దాలుగా ఏర్పడిన సంఘర్షణాత్మక వైఖరులను కూడా మరిచిపోయేంతగా. తాలిబన్‌తో సహా అఫ్గానిస్తాన్‌లో ఏర్పడిన అన్ని ప్రభుత్వాలదీ డ్యూరాండ్ లైన్ మీద ఒకే వైఖరి. వాటి వాదన ప్రకారం, ఇది సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పష్తూ జాతి ప్రజలను వేరుచేయడమే కాకుండా, శతాబ్దాలుగా ఉన్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను దెబ్బతీస్తోంది. పాకిస్తాన్ మాత్రం ఈ లైన్ చట్టబద్ధత కలిగిన అధికారిక సరి హద్దుగా భావిస్తోంది. తాలిబన్ తన మొదటి దశ పాలనలో ఎక్కు వగా అఫ్గానిస్తాన్‌ను ఏకీకృతం చేయడంపై, తన అధికార పరిధిని విస్తరించడంపై దృష్టి కేంద్రీకరించింది. తాలిబన్‌కు కావలసిన కీలక మైన సైనిక, ఆర్థిక, దౌత్య సహాయాలను పాక్ చేస్తుండటంతో సరి హద్దు సమస్యలను లేవనెత్తి పాకిస్తాన్ ఆగ్రహానికి గురికాకూడదనే భయంతో తాలిబన్ కూడా సరిహద్దు విషయాన్ని పక్కన పెట్టింది. సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పష్తూన్లు ఏకమైతే పష్తూన్ జాతీయ వాదం తమను ముక్కలు చేస్తుందన్న భయం పాకిస్తాన్‌ను మొదటి నుండి వెంటాడుతోంది. ఆ విషయం తాలిబన్‌కు తెలిసినప్పటికీ తన కున్న అవసరాల దృష్ట్యా పష్తూన్ల ఐక్యత ఒక రాజకీయ కోణంలా రూపాంతరం చెందకుండా చూసుకుంది.ఎక్కడ చెడింది?ఇంతటి బలమైన సంబంధాలు నెరపిన పాకిస్తాన్, తాలిబన్ మధ్య 2021 తర్వాత దూరం పెరగడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనబడతాయి. ఒకటి, 2001లో అమెరికా చేపట్టిన తీవ్రవాదంపై యుద్ధంలో పాకిస్తాన్ పోషించిన ముఖ్యపాత్ర. 1999లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి జనరల్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దుర్భరస్థితిలో వుంది. ఆ దేశ విదేశీ అప్పులు సుమారు 39 బిలియన్ డాలర్లు ఉంటే, వడ్డీల చెల్లింపులకే బడ్జెట్లో సుమారు 56 శాతం కేటాయించాల్సిన పరిస్థితి! ఆ సమయంలో అమెరికాతో జట్టు కట్టడం వలన, అనేక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం పొందడమే కాకుండా, పారిస్ క్లబ్ రుణదాతల నుండి కొత్త రుణాలు పొందగలిగింది. పాత రుణ బకాయిల చెల్లింపుల్లో సైతం అనేక వెసులుబాట్లు పొందగలిగింది. 1998లో అణు పరీక్షల తర్వాత ఎదుర్కొన్న అనేక ఆర్థిక ఆంక్షల నుండి విముక్తి పొందగలిగింది. వీటన్నిటి ఫలితంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడటమే కాకుండా, 2003 నాటికి పారిశ్రామిక రంగం సుమారు 8 శాతం వృద్ధి నమోదు చేసింది. అదే సమయంలో 2001లో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కూలిపోవడంతో అనేక మంది తాలిబన్ ఫైటర్లు పాకిస్తాన్‌లోని ట్రైబల్ ఏరియాల్లోకి పారిపోయి ప్రజల్లో కలిసి పోయారు. మరి కొంతమంది, 2007లో పాకిస్తాన్లో కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇస్లామిక్ సిద్ధాంతాలను వ్యాపింప జేయ డానికి ‘తెహ్రిక్ ఏ తాలిబన్ పాకిస్తాన్’(టీటీపీ) స్థాపించారు.రెండో కారణానికి వస్తే, పాకిస్తాన్ 2017–2022 మధ్య ఏక పక్షంగా తన, అఫ్గానిస్తాన్ మధ్యన ఉన్న సరిహద్దుల్లో కంచె వేసి సరి హద్దులకిరువైపులా ఉన్న అనేక సంబంధాలను దెబ్బ తీసింది. ఈ కంచె తనకు సరిహద్దులపై పట్టును కల్పించి తీవ్రవాదాన్ని, మాదక ద్రవ్యాల, ఆయుధాల, మానవ, ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు తోడ్పడుతుందని భావించింది. అష్రాఫ్ ఘనీ నేతృత్వంలోని అప్పటి అఫ్గాన్ ప్రభుత్వం ఎంత వ్యతిరేకించినప్పటికీ అత్యాధునిక వసతులతో సరిహద్దు కంచెను పూర్తిచేసింది. ఇది అఫ్గానిసాన్లోని అన్ని వర్గాలను, ముఖ్యంగా తాలిబన్లకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ సరిహద్దు వలన, సుమారు పదిహేను వేలమంది అఫ్గాన్లు తమ ఉపాధి కోల్పోవడమే కాకుండా, పాకిస్తాన్ నుండి వచ్చే సరుకుల్లో సుమారు 40 శాతం వస్తువులపై కోత పడటంతో అవి స్థానిక మార్కెట్లలో లభ్యం కాక అఫ్గాన్ ప్రజలు తీవ్ర అవస్థలు పడటానికీ, వస్తువుల ధరలు పెరగడానికీ దారితీసింది.టీటీపీ డిసెంబర్ 31, 2022న మరింత ముందుకెళ్లి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఏకంగా పాకిస్తాన్ సార్వ భౌమత్వాన్ని సవాలు చేయడమే. అప్పటి నుండి పాకిస్తాన్లో తీవ్ర వాద దాడులు పెరగడం చూడవచ్చు. ఇస్లామాబాద్‌లోని ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్’ ఇటీవల ప్రచురించిన నివేదిక ప్రకారం, పాకిస్తాన్ గతేడాది 1,166 తీవ్రవాద దాడులు ఎదుర్కొంది. అందులో 2,546 మంది చనిపోతే, 2,267 మంది గాయపడ్డారు. ఈ లెక్కలు అంతకుముందు ఏడాది (2023)తో పోలిస్తే 66 శాతం ఎక్కువ. ఒక్క గత నవంబర్లోనే 444 (రోజుకు సుమారు 15) దాడులు జరిగితే అందులో సుమారు 685 మంది చనిపోయారు.అంటే పరిస్థితి ఎంత తీవ్రత సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఒక వైపు టీటీపీ, మరోవైపు బలోచిస్తాన్ ప్రాంత స్వతంత్రం కోసం కొట్లాడుతున్న తీవ్రవాద గ్రూపుల దాడుల మధ్య పాకిస్తాన్ చిక్కుకుంది. అయితే, ఆ రెండు ప్రాంతాల తీవ్రవాద గ్రూపుల మధ్య ఉన్న భావజాల విభేదాల వల్ల వాటికి సన్నిహిత సంబంధాలు ఉండక పోవచ్చు. కానీ సరిహద్దుల్లో తాలిబన్ దాడులు చేస్తోంటే, పాకిస్తాన్ లోపల టీటీపీ రక్తపాతాన్ని సృష్టిస్తోంది.ఇండియాకూ కీలకమే!ఇలాంటి పరిస్థితుల మధ్య గత డిసెంబర్ 30న పాకిస్తాన్ ఐఎస్ఐ అధినేత... తాలిబన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అఫ్గాన్ నేష నల్ ఫ్రంట్‌కు ఆశ్రయమిచ్చిన తజికిస్తాన్ అధ్యక్షుడు ఏమోమాలి రహెమాన్‌ను కలిశారు. అది జరిగిన కొద్ది రోజులకు, జనవరి 8న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టకీని దుబాయ్‌లో కలిశారు. ఇవి కొత్త చర్చలకు దారి తీయడమే కాకుండా, ఈ ప్రాంతంలో మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలను, ఏర్పడుతున్న కొత్త సంబంధాలను, ఆవిష్కృతమవుతున్న నూతన ప్రాంతీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రానున్న రోజులలో వివిధ అవసరాల దృష్ట్యా తాలిబన్లతో సత్సంబంధాలు అటు రష్యాకూ, ఇటు చైనాకూ, వాటితో పాటే భారత్‌కూ అత్యంత కీలకం. గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం, జేఎన్‌యూ, న్యూఢిల్లీ ‘ opgadde2@gmail.com -
మహిళలు పనిచేసే ఎన్జీవోల మూత
కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ పాలకులు మహిళలకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ మహిళలు పనిచేసే జాతీయ, విదేశీ ప్రభుత్వేతర సంస్థలన్నిటినీ మూసివేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం ధరించాల్సిన హిజాబ్‌ను ఆయా సంస్థల్లోని అఫ్గాన్ మహిళలు ధరించకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఆర్థిక శాఖ ఆదివారం రాత్రి ‘ఎక్స్’లో ఈ విషయం వెల్లడించింది. తమ ఉత్తర్వులను బేఖాతరు చేసే సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని, కార్యకలాపాలను నిలిపివేస్తామని కూడా అందులో హెచ్చరించింది. నాన్ గవర్నమెంటల్ సంస్థల రిజిసే్ట్రషన్, సమన్వయం, నిర్వహణ, పర్యవేక్షణ సహా అన్ని కార్యకలాపాల బాధ్యత తమదేనని స్పష్టం చేసింది. తాలిబాన్ నియంత్రణలో లేని సంస్థలు అన్నిటిలోనూ మహిళలు పనిచేయడం ఆపేయాలని మరోసారి హుకుం జారీ చేసింది. అత్యవసరమైన మానవతా సాయం అందించే కార్యక్రమాల్లోనూ మహిళల ప్రాతినిథ్యాన్ని తాలిబన్లు అడ్డుకుంటున్నారని ఇటీవల ఐరాస సైతం ఆరోపించడం గమనార్హం. బాలికలు ఆరో గ్రేడ్ మించి చదువుకోరాదని, బహిరంగంగా కనిపించే విధుల్లో పాల్గొనరాదని ఇప్పటికే తాలిబన్ పాలకులు నిషేధం విధించడం తెలిసిందే. కిటికీల నుంచి మహిళలు కనిపించొద్దు తాలిబన్ నేత హిబతుల్లా అఖుంద్జాదా మరో తాఖీదు జారీ చేశారు. మహిళలు, నిలబడి లేదా కూర్చున్నట్లుగా కనబడేలా భవనాలకు కిటికీలు ఉండరాదన్నారు. కొత్తగా నిర్మించే వాటితోపాటు ఇప్పటికే ఉన్న భవనాలకు సైతం ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. వరండాలు లేదా వంటగదులు కనిపించేలా కిటికీలు ఏర్పాటు చేయవద్దన్నారు. ఒక వేళ కిటికీలుంటే భవన యజమాని ఆ స్థానంలో గోడను నిర్మించడం లేదా ఏదైనా అడ్డుగా ఉంచడం చేయాలన్నారు. నివాస భవనాల్లోపలి భాగం కనిపించేలా కొత్తగా భవన నిర్మాణం చేయరాదని ఆయన మున్సిపల్, ఇతర అధికారులకు సైతం నిర్దేశించడం గమనార్హం. -
పుట్టిన రోజు వేడుకలకూ నోచుకోలేదు
ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తోంది? ఏదో హెయిరాయిల్ ప్రకటనలా ఉంది కదా! కానీ నిజానికి అదో బర్త్‌డే పార్టీ. అత్యంత రహస్యంగా చేసుకున్న పార్టీ. అందులో పాల్గొన్న అమ్మాయిలంతా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ముఖాలు కనబడకుండా జాగ్రత్త పడ్డారు. బర్త్‌డే పార్టీ అంత రహస్యంగా చేసుకోవడమెందుకు? వేరే ఏ దేశంలోనైనా అవసరం లేదు. కానీ ఆఫ్గానిస్తాన్‌లో మాత్రం అది అత్యవసరం! తాలిబన్ల పాలనలో అక్కడి మహిళలు, బాలికల దుస్థితికి అద్దం పడుతున్న ఈ ఫొటోను ఇరాన్–కెనడియన్ ఫొటో జర్నలిస్ట్ కియానా హయేరి తీశారు. ఇలాంటి చిత్రాల సమాహారాన్ని ‘నో విమెన్స్ లాండ్’ పేరిట ఈ నెల పారిస్‌లో ప్రదర్శించనున్నారు.ఏడు ప్రావిన్సులు తిరిగి... ఫ్రెంచ్ పరిశోధకురాలు మెలిస్సా కార్నెట్తో హయేరి 2018 నుంచి కలిసి పని చేస్తున్నారు. వారు కొన్నేళ్లుగా అఫ్గాన్‌లోనే ఉంటున్నారు. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్‌ను వీడటం, దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం వంటి పరిణామాలకు వాళ్లు ప్రత్యక్ష సాక్షులు. నానాటికీ దిగజారుతున్న పరిస్థితులు వారిని భయపెట్టాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని కల్లబొల్లి ప్రతిజ్ఞలు చేసిన తాలిబన్లు చివరికి వాళ్లకు అసలు ప్రజా జీవితమే లేకుండా చేశారు. ప్రాథమిక హక్కులతో సహా సర్వం కాలరాశారు. మహిళల గొంతు వినపడటమే నిషేధం. ముసుగు లేకుండా, మగ తోడు లేకుండా గడప దాటడానికి లేదు! బాలికల చదువుకు పాఠశాల స్థాయితోనే మంగళం పాడారు. బహిరంగ ప్రదేశాల్లో సంగీతం, నృత్యం నిషేధం. అఫ్గాన్ మహిళల దుస్థితిని బయటి ప్రపంచానికి చూపేందుకు హయేరి, కార్నెట్ ఏడు ప్రావిన్సుల్లో పర్యటించారు. ఎంతోమంది మహిళలను కలిశారు.ఆశలకు ప్రతీకలు కూడా... ఎంతసేపు అణచివేత గురించే ఎందుకు చెప్పాలి? అందుకే అఫ్గాన్ బాలికలు, మహిళలకు భవిష్యత్తు మీదున్న ఆశను కూడా హయేరి, కార్నెట్ ఫొటోల్లో బందించారు. తమ చీకటి జీవితాల్లో వెలుగులు నింపే వేడుకలను వాళ్లు జరుపుకొంటున్నారో చెబుతున్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో బాలికలు, స్త్రీలకు సంబంధించి చిన్న వేడుక అయినా అది నేరుగా తాలిబన్ ప్రభుత్వాన్ని ధిక్కరించడమే. అందుకే బాలికలు పుట్టిన రోజులు, పెళ్లిళ్ల వంటి వేడుకల్లో స్నేహితులను కలుస్తున్నారు. వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది ప్రమాదాలు తెచ్చి పెడుతుందని తెలిసీ రిస్క్ చేస్తున్నారు. మహిళలు గుర్తింపుకే నోచుకోని చోట ఇలాంటి చిన్న వేడుకైనా పెద్ద ప్రతిఘటనే! చిరునవ్వులు చిదిమేస్తున్న కాలంలో ఆనందాన్ని ప్రదర్శించడం కూడా తిరుగుబాటే. అందుకే నిరసనను వ్యక్తం చేసే ఏ అవకాశాన్నీ మహిళలు వదులుకోవడం లేదంటున్నారు. హయేరి, కార్నెట్.తాలిబన్లలోనూ విభేదాలు!మహిళలను తీవ్రంగా అణచివేయడంపై తాలిబన్లలోనే వ్యతిరేకత పెరుగుతోంది! అతివాది అయిన దేశాధినేత షేక్ హైబతుల్లా అఖుందా జాదా నిర్ణయాలను తాలిబన్లలోనే ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ వంటివాళ్లు బాలికలు, యువతుల విద్య కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఆరో తరగతి తర్వాత కూడా విద్యను అందించే అండర్ గ్రౌండ్ పాఠశాలలపై తాలిబన్లలోని కొన్ని విభాగాలు దృష్టి సారించినట్టు కార్నెట్ పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అఫ్గాన్‌లో ఆకస్మిక వరదలు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌ను మరోసారి ఆకస్మిక వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో వరదలు, వర్ష సంబంధ ఘటనల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రాథమికంగా అందిన సమాచారం అని మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని తాలిబాన్ అధికారులు శనివారం వెల్లడించారు. గత వారం పోటెత్తిన వరదవిలయం నుంచి తేరుకోకముందే మరో జలఖడ్గం అఫ్గానిస్తాన్‌పై దండెత్తి డజన్లకొద్దీ ప్రాణాలను బలితీసుకుంది. పశి్చమ ప్రావిన్స్ ఘోర్‌లో అత్యధికంగా 50 మంది మరణించారని ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి అబ్దుల్ వహీద్ హమాస్ చెప్పారు. ప్రావిన్స్ రాజధాని ఫెరోజ్ కోహసహా వేలాది ఇళ్లు, వందల హెక్టార్లలో వ్యవసాయభూములు నాశనమయ్యాయి. ఉత్తర ఫరాయాబ్ ప్రావిన్స్‌లో 18 మంది చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లో వరదవిలయం దారుణంగా ఉందని, 300కుపైగా మూగజీవాలు మృతిచెందాయని గవర్నర్ అధికార ప్రతినిధి ఏస్మతుల్లాహ్ మొరాదీ చెప్పారు. ఘోర్ ప్రావిన్స్‌లో 2,500 కుటుంబాలు వరదబారిన పడ్డాయి. -
దేశం విడిచి వెళ్లండి
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ నుంచి పాకిస్థాన్‌కు అక్రమంగా వచ్చిన శరణార్థులు వెంటనే దేశం వీడి వెళ్లాలంటూ పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాలిబన్ల పరిపాలనతో విసిగి వేసారిపోయిన అఫ్గాన్లు లక్షల సంఖ్యలో చట్టవిరుద్ధంగా పాక్‌కు చేరుకున్నారు. అలా వచ్చిన వారు 17 లక్షల మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. వారందరూ నవంబర్‌లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లో ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతున్నాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల కనుసన్న ల్లో ఉన్న ఉగ్రవాదులే దాడులకు పాల్పడుతున్నారని పాక్ ఆరోపి స్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నవంబర్ 1లోగా అక్రమంగా వచ్చిన వారంతా వెళ్లకపోతే భద్రతా బలగాలతో వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. -
దెయ్యాలు వేదాలు వల్లిస్తే.. ఎవరూ ఊహించనిది ఇది!
ఎలన్ మస్క్‌తో పాటు ఎవరూ కూడా ఇలాంటి ఓ పరిణామం జరుగుతుందని ఊహించి ఉండరు. అదేంటో తెలుసా?.. తాలిబన్ల ఆయన్ని ఆరాధించడం. అవును.. ట్విటర్‌ను అద్భుతంగా నడిపిస్తూ తమకెంతో ప్రియపాత్రుడిగా నిలిచిపోయాడంటూ ఎలన్ మస్క్‌ను ఇష్టపడుతున్నారు వాళ్లు. అదే సమయంలో మార్క్ జుకర్‌బర్గ్ పేరు చెబితేనే అసహ్యించుకుంటున్నారు. ఎందుకంటే.. అఫ్గనిస్తాన్‌లో అనధికార ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తాలిబన్లు ట్విటర్‌పై.. దాని ఓనర్ ఎలన్ మస్క్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా.. తాలిబన్ నేత అనాస్ హక్కానీ సైతం మస్క్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. భావ ప్రకటనకు సోషల్ మీడియాల్లో ట్విటర్ మాత్రమే సరైన వేదిక. దానిని సమర్థవంతంగా నడిపిస్తున్న ఎలన్ మస్క్‌కు తాలిబన్ల తరపున అభినందనలు. అందుకే ఆయనంటే మాకు ఎంతో గౌరవం అంటూ పేర్కొన్నారు. ‘‘ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కంటే Twitter ద్వారా రెండు అడ్వాంటేజ్‌లు ఉన్నాయి. మొదటిది వాక్ స్వాతంత్ర్యం హక్కు. రెండోది Twitter స్వభావమైన విశ్వసనీయత. మెటాలాంటి అసహన విధానానికి ట్విటర్ దూరంగా ఉంటుంది. వేరొకటి దానిని భర్తీ చేయలేదు అంటూ మెటా థ్రెడ్స్‌ను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేశారాయన. Twitter has two important advantages over other social media platforms. The first privilege is the freedom of speech. The second privilege is the public nature & credibility of Twitter. Twitter doesn't have an intolerant policy like Meta. Other platforms cannot replace it. pic.twitter.com/oYQTI3hgfI — Anas Haqqani(انس حقاني) (@AnasHaqqani313) July 10, 2023 కారణం ఇదే.. మెటాను(ఒకప్పటి ఫేస్బుక్)ను తాలిబన్లు ద్వేషించడానికి ప్రధాన కారణం .. తాలిబన్ అనే పదాన్ని ఆ ప్లాట్‌ఫారమ్ పరిగణించే విధానం. పక్కా టైర్ 1 ఉగ్రవాద సంస్థగా తాలిబన్‌ను చూపిస్తోంది ఇది. పైగా తాలిబన్‌కు మురికి అనే అర్థం కట్టబెట్టింది. ఈ కారణం వల్లే ఫేస్బుక్(మెటా)లో తాలిబన్ లీడర్లు తమ అభిప్రాయాలను పంచుకోలేకపోతున్నారు.. అసహ్యించుకుంటున్నారు. అదే ట్విటర్లో అయితే యధేచ్ఛగా తమ పోస్టులను పెడుతున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్ అఫ్గ్ పేరిట తాలిబన్ గ్రూప్‌కు ట్విటర్లో ఓ అధికారిక అకౌంట్ కూడా ఉంది. నాటో బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు తిరిగి అఫ్గనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఇకపై ప్రజాస్వామ్య యుతంగా.. పాలన సాగిస్తామని, ఏ వర్గానికి హక్కుల్ని దూరం చేయబోమని ప్రకటించుకుని పాలన మొదలుపెట్టింది. పైగా ఈ ప్రచారంతోనే గ్లోబల్ గుర్తింపు, అటుపై ఆర్థిక సాయం.. ఒప్పందాల కోసం తాలిబన్ ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కానీ, తుపాకీ రాజ్యంలో మహిళలు, పిల్లల హక్కులను కాలరాస్తూనే వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి తాలిబన్లు మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది కదా!. ఇదీ చదవండి: ఒంటి కన్ను దొంగ.. భలే భలే కథ -
Afghan Women: చదువుల్లేక.. ఉద్యోగాల్లేక.. ఉరికొయ్యలే దిక్కై!
‘‘నాకు జీవితంపై ఇక ఎలాంటి ఆశలు లేవు. మమ్మల్ని చదువుకోనివ్వడం లేదు. స్వేచ్ఛగా బతికే అవకాశం లేదు. కుంగుబాటు, ఆందోళన నన్ను వేధిస్తున్నాయి. ఈ జీవితాన్ని ముగించాలన్న ఆలోచనలు తరచుగా వస్తున్నాయి. ఈ బాధలు భరించలేను. నా ఆవేదన ఎవరైనా వింటే బాగుండు. ఇది కేవలం నా ఒక్కరి దుస్థితి కాదు. నాతోపాటు యూనివర్సిటీలో చదువుకున్న యువతులంతా ఇలాగే మదన పడుతున్నారు. ఆత్మహత్య ఆలోచనలతో నిత్యం సతమతం అవుతున్నారు. బతకలేక చావలేక కుమిలిపోతున్నారు’’ – అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లకుపైగా వయసున్న ఓ యువతి కన్నీటి గాథ ఇది. రాక్షస పాలనలో నిత్య నరకం అఫ్గానిస్తాన్‌లో 2021 ఆగస్టు నుంచి తాలిబన్ల పరిపాలన మళ్లీ మొదలైంది. అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్ ముష్కరులు అధికారంలోకి వచ్చారు. తాము పూర్తిగా మారిపోయామని, ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడుకుంటామని తొలుత ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆచరణలో మాత్రం రాక్షస పాలనకు తెరతీశారు. మహిళలపై కఠినమైన ఆంక్షలు విధించారు. వారిపై దారుణమైన వివక్ష కొనసాగుతోంది. చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. ఆర్థిక స్వేచ్ఛ అసలే లేదు. అఫ్గాన్ బాలికలకు కొన్నిచోట్ల ప్రాథమిక విద్య మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ఆరో తరగతి వరకూ పాఠశాలలకు వెళ్లి చదువుకోవచ్చు. ఆ తర్వాత ఇంటికి పరిమితం కావాల్సిందే. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు నిరాకరిస్తున్నారు. కాలేజీ, యూనివర్సిటీ చదువులు యువకులకు మాత్రమే అన్నట్లుగా అనధికార శాసనం అమల్లోకి వచ్చింది. ఈ పరిణామాలన్నీ యువతుల్లో మానసిక సమస్యలను, అనారోగ్యాలను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది అర్ధంతరంగా జీవితాలను చాలించినట్లు తెలుస్తోంది. సైకాలజిస్టులను సంప్రదించే బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని సంగ్చారక్ జిల్లాలో రెండు పాఠశాలల్లో ఇటీవలే దాదాపు 80 మంది విద్యార్థినులపై విష ప్రయోగం జరిగింది. స్కూళ్లకు రాకుండా బాలికలను భయపెట్టడానికే విద్రోహులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. శరీరంలోకి విషం ఎక్కించినట్లుగా.. అఫ్గాన్ యువతుల్లో ఆత్మహత్య ఆలోచనలు ఒక మహమ్మారిలా వ్యాప్తి చెందుతున్నాయని సైకాలజిస్టు డాక్టర్ అమల్ చెప్పారు. పరిస్థితి దిగజారుతోందని, ఇక్కడి వాస్తవాలు ప్రపంచానికి తెలియడం లేదని అన్నారు. ఆకలి చావులు, ఆహార సంక్షోభం గురించి మాత్రమే వార్తా పత్రికల్లో రాస్తున్నారని, మానసిక అనారోగ్య సమస్యల గురించి ఎవరూ రాయడం లేదని, మాట్లాడడం లేదని వెల్లడించారు. శరీరంలోకి నెమ్మదిగా విషం ఎక్కించినట్లుగా యువత ప్రవర్తిస్తున్నారని, జీవితంపై ఆశలు కోల్పోతున్నారని డాక్టర్ అమల్ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో యువతులకు ప్రవేశం లేదంటూ తాలిబన్లు ప్రకటించినప్పుడు మొదటి రెండు రోజుల్లో తనకు 170 ఫోన్‌కాల్స్ వచ్చాయన్నారు. ఇప్పుడు నిత్యం దాదాపు 10 కాల్స్ వస్తున్నాయని తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది బాలికలు, యువతులే ఉంటున్నారని వివరించారు. వారిలో ఆత్మహత్య ఆలోచనలు పోగొట్టి, స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలి అఫ్గానిస్తాన్‌లో పితృస్వామ్య వ్యవస్థ బలంగా పాతుకుపోయింది. మహిళలపై ఆంక్షలు, వివక్ష, వేధింపులు అనేవి సహజంగా మారిపోయాయి. దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు మానసికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. బాధితుల్లో మహిళలే గణనీయంగా ఉంటారని తెలియజేసింది. తాలిబన్ల పెత్తనం మొదలయ్యాక పరిస్థితి మరింత దిగజారిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఆంక్షలు, వివక్షకు ఆర్థిక సంక్షోభం కూడా తోడయ్యిందని, ఇవన్నీ మహిళలను ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్నాయని అంటున్నారు. హెరాత్ ప్రావిన్స్‌లో ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో.. కౌమార వయసులో ఉన్నవారిలో మూడింట రెండొంతుల మందిలో ఆందోళన, కుంగుబాటు లక్షణాలు ఉన్నట్లు వెల్లడయ్యింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సకాలంలో చికిత్స అందించకపోతే వారు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. దేశంలో ఆత్మహత్యల సంఖ్యను తాము రికార్డు చేయడం లేదని తాలిబన్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, తాలిబన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు అధికారికంగా గుర్తించాలని అఫ్గాన్ ప్రజలు కోరుతున్నారు. అలాగైతే తాలిబన్ల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉందని, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దేశం అభివృద్ధి చెందుతుందని, మహిళలపై ఆంక్షలు రద్దవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మహిళా కళాశాలలను తాలిబన్లు మూసేశారు. దాంతో నా ఉద్యోగం పోయింది. ఎక్కడా ఉపాధి దొరకలేదు. ఇంట్లో అందరినీ పోషించాల్సింది నేనే. పని దొరక్క చేతిలో చిల్లిగవ్వ లేకుండాపోయింది. నిర్భయంగా బయట తిరగలేం. ఇంట్లోనే ఉండిపోవాలి. ఎలా బతకాలో తెలియడం లేదు. అందుకే మరోదారి లేక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశా. –మెహర్ అనే అధ్యాపకురాలి ఆవేదన ఇది ఈ ఏడాది మార్చి నెలలో స్కూల్ పునఃప్రారంభం కాగా, తరగతులకు హాజరయ్యేందుకు తన కుమార్తె ఉత్సాహంగా సిద్ధమైందని, తీరా అక్కడికి వెళ్లాక రావొద్దని చెప్పడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని నాదిర్ అనే వ్యక్తి చెప్పాడు. పెద్ద చదువులు చదువుకొని, దేశానికి సేవ చేయాలని తన బిడ్డ కలలు కనేదని తెలిపాడు. తాలిబన్ పాలకులు బాలికల పాఠశాలలను మూసివేశారని వెల్లడించాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. సిరీస్ బహిష్కరణ
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ షాకిచ్చింది. ఈ ఏడాది మార్చిలో యూఏఈ వేదికగా ఆప్ఘనిస్తాన్‌తో జరగాల్సిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నట్లు సీఏ ఇవాళ (జనవరి 12) ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం మహిళలు, అమ్మాయిల ప్రాధమిక హక్కులను కాలరాస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఏ వెల్లడించింది. 2021 సెప్టెంబర్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు, అమ్మాయిలకు విద్య, ఉపాధి దూరం చేయడంతో పాటు క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించిందని, దీన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో పరోక్షంగా కూడా సమర్ధించేది లేదని పేర్కొంది. పురుషులతో సమానంగా మహిళల క్రికెట్ వ్యాప్తికి సీఏ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల క్రికెట్‌పై అంక్షలను సహించేది లేదని తెలిపింది. ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమకు పూర్తి మద్దతు ప్రకటించిందని వివరించింది. తాలిబన్ ప్రభుత్వం మహిళలు, అమ్మాయిలపై అంక్షలు ఎత్తి వేస్తే వారితో సత్సంబంధాలు కొనసాగించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని అంది. కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇలా వ్యవహరించడం ఇది తొలిసారి కాదు. గతంలో హోబర్ట్‌లో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను ఇదే కారణంగా చూపి రద్దు చేసింది. -
ఆఫ్ఘన్ లో తాలిబాన్ దుర్మార్గం
-
అఫ్గాన్‌లో విద్యార్థినుల నిరసన గళం
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఉన్నతవిద్యాసంస్థల్లో మహిళా విద్యార్థులపై నిషేధం విధించి, మహిళా విద్యను ఉక్కుపాదంతో అణిచివేస్తున్న తాలిబన్ ప్రభుత్వానికి విద్యార్థినుల నుంచి నిరసనలు మరింత పెరిగాయి. దయలేని తాలిబాన్లను ఎదిరించి వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగిన విశ్వవిద్యాలయాల విద్యార్థినులు తమ గొంతుకను గట్టిగా వినిపిస్తున్నారు. శనివారం హెరాత్ నగరంలోని రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం ఎదుట ఆందోళన చేసేందుకు దాదాపు 150 మంది వర్సిటీ విద్యార్థినులు బయల్దేరారు. ‘విద్య మా హక్కు’ అంటూ ప్లకార్డులు, బ్యానర్లను చేతబూనిన వారిని తరిమికొట్టేందుకు తాలిబన్ భద్రతా బలగాలు వాటర్ కేనన్లు వినియోగించారు. రహదారి వెంట ఉన్న చెట్ల కొమ్మలతో విద్యార్థినులను కొట్టారు. అయినాసరే నిరసనర్యాలీని ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థినులు ప్రయత్నించారు. సంబంధించిన వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థ విడుదలచేసింది. ‘తారిఖీ పార్క్ నుంచి నిరసన ర్యాలీ మొదలుపెట్టాం. అయితే, నగరంలో ప్రతీ వీధిలో సాయుధ తాలిబన్లు మమ్మల్ని అడ్డుకున్నారు. కొట్టారు. మాపై దాడి దారుణం’ అని మరియం అనే విద్యార్థిని ఆగ్రహంగా మాట్లాడారు. అయితే, ఈ నిరసన ర్యాలీపై రాష్ట్ర గవర్నర్ హమీదుల్లా ముతావకిల్ భిన్నంగా మాట్లాడారు. ‘ఓ నలుగురైదుగురు అమ్మాయిలు వచ్చి ఏదో ఫిల్మ్ షూట్ చేసి వెళ్లిపోయారు. వారికి ఎలాంటి అజెండా లేదు’ అని అన్నారు. వర్సిటీల్లో మహిళా విద్యపై నిషేధం విధించడంతో తాలిబాన్ పాలనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సౌదీ అరేబియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, జీ–7 కూటమి దేశాలు తాలిబన్ సర్కార్‌ను తీవ్రంగా తప్పుబట్టాయి. అఫ్గాన్ విద్యార్థినులకు మద్దతుగా పాక్‌లోని క్వెట్టా సిటీలో కొందరు అఫ్గాన్ శరణార్థి విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఉద్యోగినులను తీసేయండి స్వచ్ఛంద సంస్థలకు తాలిబన్ల అల్టిమేటం మహిళలను చదువులకు దూరం చేసేందుకు కంకణం కట్టుకున్న అఫ్గాన్ తాలిబన్ పాలకులు తాజాగా మహిళలకు శరాఘాతం వంటి మరో చర్యకు పూనుకున్నారు. అఫ్గానిస్తాన్‌లోని విదేశీ, దేశీయ ప్రభుత్వేతర సంస్థలు మహిళా ఉద్యోగాలను తొలగించాలంటూ ఆదేశాలిచ్చారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని ఆర్థిక మంత్రి మహ్మద్ హనీఫ్ పేర్కొన్నారు. వీటిని పాటించని ఎన్జీవోల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ప్రవేశించరాదనే ఆంక్షలు ఇప్పటికే ఉన్నాయి. -
రెక్కలు విరిచేస్తున్నారు..
అఫ్గానిస్తాన్‌లో చదువుకునే అమ్మాయిలు భయపడినంతా జరిగింది. ఏదో ఒక రోజు ఉన్నత విద్యకి తాము దూరమవుతామని మహిళల ఆందోళనలు నిజమయ్యాయి. యూనివర్సిటీల్లో ఇక మహిళలకి ప్రవేశం లేదని తాలిబన్లు హుకుం జారీ చేశారు. అంతర్జాతీయంగా వస్తున్న అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ, అఫ్గాన్ మహిళలు కన్న కలల్ని కల్లలు చేస్తూ వారి హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు. తాలిబన్ల తాజా ఆదేశాలను వ్యతిరేకిస్తూ కాబూల్‌లో అమ్మాయిలు నిరసన ప్రదర్శనలకి దిగితే వాటిని ఉక్కుపాదంతో అణిచివేశారు. యూనివర్సిటీల దగ్గర తాలిబన్ బలగాలు భారీగా మోహరించి అమ్మాయిలు రాకుండా అడ్డుకుంటున్నారు. గత ఏడాది అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోయాక 2021, ఆగస్టు 15న తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు మహిళలకు అండగా ఉంటామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఈ ఏడాదిన్నర కాలంలో మహిళల పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోయింది. ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమైపోతున్నారు. రోజుకో కొత్త నిర్ణయంతో తాలిబన్లు మహిళల్ని తీవ్ర నిరాశ నిస్పృహలకి గురి చేయడంతో ఎందరో కుంగుబాటు సమస్యలతో బాధపడుతున్నారు. ఉన్నత విద్యకు అమ్మాయిల్ని దూరం చేయడంపై అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడింది. అఫ్గాన్‌లో తాలిబన్లు మానవీయ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని విమర్శించింది. కాబూల్ యూనివర్సిటీ బయట అమ్మాయిలు ఏడుస్తూ, ఒకరినొకరు ఓదార్చుకుంటున్న దృశ్యాలు మనసుని పిండేస్తున్నాయి. అఫ్గాన్ మహిళల ఛిద్రమైపోతున్న బతుకు చిత్రం ఎలా ఉందో చూద్దాం. మగతోడు లేకుండా ప్రయాణాలకు నో మగతోడు లేకుండా మహిళలు ఎక్కువ దూరం ప్రయాణాలు చేయకూడదని తాలిబన్లు 2021 డిసెంబర్లో నియంత్రణ విధించారు. మహిళలు ఒంటరిగా 45 మైళ్ల కంటే ఎక్కువ దూరం వెళ్ల కూడదు. అఫ్గాన్ జనాభాలో 10% మందికి ఆస్పత్రికి వెళ్లాలంటే కనీసం రెండు గంటలు ప్రయాణించాలి. అత్యవసర సమయాల్లో కూడా మగవారు లేకపోతే మహిళలకు చికిత్స ఇవ్వడాన్ని కూడా తాలిబన్లు అడ్డుకున్నారు. బురఖా లేకపోతే రాళ్ల దాడులు బురఖా లేకుండా మహిళలు అడుగు బయటకి పెడితే కఠిన శిక్షలు విధించడం మొదలు పెట్టారు. కాబూల్ వంటి నగరాల్లో ఈ నిబంధన గట్టిగా పాటించకపోయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు బురఖా లేకుండా వస్తే వారిని ఈడ్చుకువెళ్లడం, రాళ్లతో దాడి చేయడం వంటి అనాగరిక శిక్షలు విధించారు. 45% బాలికలు డ్రాపవుట్ 2021 సెప్టెంబర్ నుంచి అఫ్గాన్‌లో సెకండరీ స్కూల్స్‌లో అబ్బాయిలకే ప్రవేశం లభిస్తోంది. ఏడో తరగతి నుంచి అమ్మాయిల ప్రవేశాలను నిషేధించారు. పాథమిక, సెకండరీ పాఠశాలల నుంచి 45% మంది అమ్మాయిలు డ్రాపవుట్ అయ్యారు. 26% అమ్మాయిల్లో కుంగుబాటు మహిళల్ని వంటింటికే పరిమితం చేయడానికి తాలిబన్లు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో వారిని తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసింది. తాలిబన్ల రాక ముందున్న స్వేచ్ఛ కోల్పోవడంతో రెక్కలు తెగిన పక్షుల్లా విలవిలలాడుతున్నారు. అమ్మాయిల్లో 26% మంది మానసిక కుంగుబాటుతో బాధపడుతూ ఉంటే అబ్బాయిల్లో 16% మందికి ఆ సమస్య ఉంది. 27% అమ్మాయిలు ఆందోళన ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటే అబ్బాయిల్లో 18శాతంగా ఉంది. – సాక్షి నేషనల్ డెస్క్ -
ఆకలి కేకల పాకిస్థాన్‌ను భారత్ ఆదుకోవాలని చూస్తే.. అమెరికా చేస్తోందేంటి?
పాకిస్థాన్‌లో ఏం జరుగుతోంది? కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కుంభవృష్ఠి వానలు పడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా వరదలు పోటెత్తి కోట్లాది మందిని నిరాశ్రయులను చేసేశాయి. ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో పాలుపోక పాక్ పాలకులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతటి విపత్తు వేళ పాకిస్థాన్ ప్రజల ఆకలి తీర్చడానికి.. అందుకోసం పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు ఇతర ఉత్పత్తులు అందించడానికి భారత ప్రభుత్వం సంసిద్ధమైపోయింది. పాక్ ప్రభుత్వం అడిగితే చాలు మరుక్షణమే వాటిని అందించి పాక్‌ను ఆదుకోవాలని భారత ప్రభుత్వం సమాయత్తమైపోయింది. ఇపుడు ప్రపంచంలోని ఏ దేశమైనా సరే పాకిస్థాన్‌ను ఆదుకోవాలంటే ఏం చేయాలి? వీలైనంతగా ఆహార ఉత్పత్తులను అందించి అక్కడి ప్రజల కడుపులు నింపాలి. ఇంతటి భీకరమైన పరిస్థితులు నెలకొన్న ఉన్న వేళ అగ్రరాజ్యం అమెరికా ఏం చేసిందో తెలుసా? పాకిస్థాన్ కు 450 మిలియన్ డాలర్ల విలువ చేసే యుద్ధ విమానాల ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. ఆకలి కేకల పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలు అవసరమా? ఆహార ధాన్యాల బస్తాలు అవసరమా? అన్నది ఆరేళ్ల కుర్రాడినడిగినా చెప్తాడు. కానీ అమెరికాకి మాత్రం పాకిస్థాన్‌ను మరోలా ఆదుకోవాలని అనిపించింది . అందుకే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకీ ఏంటీ ప్రాజెక్ట్? అమెరికా ఏం చెబుతోందంటే పాకిస్థాన్‌కు తాము గతంలో సరఫరా చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఆధునికీకరించడానికి అవసరమైన స్పేర్ పార్టులను అందించడంతో పాటు ఆధునికీకరించే పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని చెబుతోంది. అది కూడా గతంలో తాము విక్రయించిన యుద్ధ విమానాలు జీవితకాలం పాటు పనిచేసేలా వాటికి సర్వీసింగ్ చేస్తున్నాం అంతే అని చెప్పుకొస్తోంది. ఇంతకు మించిన జోక్ మరోటి ఉంటుందా? ప్రపంచానికి ఉగ్రవాదులను ఎగుమతి చేస్తూ.. యావత్ భూగోళాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టేస్తూ ఉగ్రహింసను విశ్వవ్యాప్తం చేసే అజెండాతో పాకిస్థాన్ తమ దేశాన్నే ఓ ఉగ్రకర్మాగారంగా మార్చేసిందని ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆ విషయం అమెరికాకి తెలీదా? ఇపుడు పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలను నెక్ట్స్ లెవెల్‌కి అప్ గ్రేడ్ చేసి ఇస్తే వాటిని పాకిస్థాన్ ఎవరిపై ప్రయోగిస్తుంది? సింపుల్.. భారత్ పైనే కదా. ఇది అమెరికాకి తెలీకుండా ఉంటుందా? ఈ వ్యాపారం అమెరికాకి కొత్తకాదు. అమెరికా చరిత్ర అంతా ఆయుధాల అమ్మకాలతోనే ముందుకు నడిచింది. యుద్ధాలు తేవడం ఆ తర్వాత ఆయుధాలు అమ్ముకోవడం.. ఇదీ అమెరికా శైలి. 1980లకి ముందు అమెరికా పాకిస్థాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలు అమ్మింది. అప్పట్లో ఆఫ్ఘనిస్థాన్‌ను తన గుప్పెట్లో పెట్టుకున్న సోవియట్ యూనియన్ను దెబ్బతీయడం కోసం పాకిస్థాన్‌కు ఈ యుద్ధ విమానాలు సరఫరా చేసింది. వీరి సాయంతోనే పాకిస్థాన్ ముజాహిదీన్లను చేరదీసి వారిని ఉగ్రవాదులుగా మార్చి పెంచి పోషించింది. సెప్టెంబరు 11 దాడుల తర్వాత అల్ కాయిదాపై యుద్ధానికి అమెరికా కాలుదువ్విన వేళ మళ్లీ పాకిస్థాన్‌కు ఈ యుద్ధ విమానాలను సరఫరా చేసింది అమెరికా. ఆఫ్ఘనిస్థాన్‌లో 20 ఏళ్ల పాటు మకాం వేసిన అమెరికా ప్రజాప్రభుత్వాన్ని స్థాపించినా తాలిబాన్‌ను మాత్రం ఏమీ చేయకుండా వదిలేసింది. చివరకు గత ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్ ప్రజల మాన ప్రాణాలను తాలిబాన్ చేతుల్లో పెట్టేసి తమ సేనలను ఆఫ్ఘన్ నుండి వెనక్కి రప్పించేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ కూడా తాలిబాన్‌తో చేతులు కలిపింది. పాకిస్థాన్, తాలిబాన్ కలిస్తే ఆసియాలో మరింత అగ్గి రాజుకోవడం ఖాయమని మేధావులు ఆందోళన చెందుతున్నారు కూడా. సరిగ్గా ఈ తరుణంలోనే ఇపుడు అమెరికా మరోసారి పాకిస్థాన్‌తో ఎఫ్-16 యుద్ధ విమానాలకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మా గడ్డ మీలాగా కాదు.. పాక్‌కు తాలిబన్ల కౌంటర్
కాబూల్: అఫ్గనిస్థాన్‌లోని అనధికారిక తాలిబన్ల ప్రభుత్వం.. పొరుగు దేశం పాకిస్తాన్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. జైష్ - ఇ - మహ్మద్ చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది అయిన మసూద్ అజర్, అఫ్గనిస్తాలో తలదాచుకున్నాడంటూ పాక్ చేసిన ఆరోపణలను తిప్పి కొట్టింది. అలాంటి ఉగ్రసంస్థలకు పాక్ గడ్డే అడ్డాగా ఉంటుందని, చివరకు అలాంటి సంస్థలను అక్కడి ప్రభుత్వమే పెంచి పోషిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వ(తాత్కాలిక) అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తీవ్రంగా స్పందించారు. అఫ్గన్ నంగార్హర్ ప్రావిన్స్‌లో మౌలానా మసూద్ అజర్ తలదాచుకున్నాడని, అతనిని గుర్తించి.. అరెస్ట్ చేసి ఇస్లామాబాద్‌కు అప్పగించాలని ఇప్పటికే అఫ్గన్‌ను ఓ లేఖ రాసినట్లు పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పాక్ మీడియా హౌజ్‌లు కొన్ని ఆ కథనాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. ‘‘అలాంటి లేఖ ఏం మా ప్రభుత్వానికి అందలేదు. అసలు జైషే చీఫ్ మా దేశంలోనే లేడు. అఫ్గన్ భూభాగాన్ని.. మరే ఇతర దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి మేము ఎవరినీ అనుమతించబోం. అలాంటిది వాళ్లకు(పాక్‌ను ఉద్దేశించి) మాత్రమే సాధ్యం’’ అంటూ జబీహుల్లా ముజాయిద్ పేర్కొన్నారు. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదంటూ అఫ్గన్ విదేశీ వ్యవహారాల శాఖ పాక్‌ను ఉద్దేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పాశ్చాత్య దేశాలకు చెందిన పర్యాటకులను కిడ్నాప్ చేసిన నేరానికి భారత్‌లో శిక్ష అనుభవించాడు అజర్. అయితే.. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఐసీ-814 హైజాక్ వ్యవహారంలో ప్రయాణికుల కోసం భారత్ అతన్ని విడుదల చేయాల్సి వచ్చింది. బయటకు వచ్చాక జైష్ ఈ మొహమద్‌ను నెలకొల్పి.. భారత్‌లో ఎన్నో ఉగ్రవాద దాడులను నిర్వహించాడు. దీంతో పాక్ ఆ సంస్థను నిషేధించింది. మే 2019లో ఐరాస అతన్ని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. పుల్వామా దాడికి ప్రధాన సూత్రధారి కూడా ఈ మసూదే. ఇదీ చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి యాక్సిడెంట్! -
మోదీ జీ ఇది కరెక్ట్ కాదు.. తాలిబన్ల సూక్తులు
జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో మహమ్మద్ ప్రవక్తపై మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా తాలిబన్ల నేతృత్వంలోని ఆప్ఘనిస్ధాన్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. తాజాగా ట్విట్టర్ వేదికగా.. ఇస్లాంను అవమానించి ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా ఉన్మాద చర్యలను భారత్ అనుమతించరాదని తాము కోరుతున్నామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజహిద్ పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్తపై అధికార బీజేపీ పార్టీ నేత వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. ఈ క్రమంలోనే మతోన్మాదంపై భారత్‌కు తాలిబన్లు కీలక సూక్తులు వల్లించారు. అంతకుముందు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ప్రవక్తపై వ్యాఖ్యల విషయంలో భారత్‌పై విరుచుకుపడ్డారు. భారత ప్రధాని మోదీ నాయకత్వంలో ఇండియాలో మతసామరస్యం దెబ్బతింటోందని, ముస్లింలను అణిచివేస్తున్నారని.. దీన్ని ప్రపంచ దేశాలు గమనించాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పాక్ వ్యాఖ్యలు, ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. తాము అన్ని మతాలను గౌరవిస్తామని స్పష్టం చేసింది. The Islamic Emirate of Afghanistan strongly condemns the use of derogatory words against the Prophet of Islam (Peace be upon him)by an official of the ruling party in India. 1/2 — Zabihullah (..ذبـــــیح الله م ) (@Zabehulah_M33) June 6, 2022 ఇది కూడా చదవండి: దేశ ప్రతిష్టకే భంగపాటు.. భవిష్యత్తు ఎలా ఉండనుంది..? -
హోడ ఖామోష్..: అఫ్గాన్ అగ్నితేజం
టైమ్ మ్యాగజైన్ ప్రభావశీలుర జాబితా (100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2022)లో చోటు సంపాదించిన వారిలో అఫ్గానిస్థాన్ అగ్నితేజం హోడ ఖామోష్ ఒకరు. ‘ఖామోష్’ అనేది పేరు కాదు. లక్షల గొంతుల రణనినాదం... ఇరాన్లో జన్మించింది హోడ ఖామోష్. తాను చిన్న వయసులో ఉన్నప్పుడే కుటుంబంతో పాటు అఫ్గానిస్థాన్‌కు వచ్చింది. ఆరోజుల్లో తనకు నిద్ర పట్టాలంటే అమ్మ తప్పనిసరిగా ఏదో ఒక కథ చెప్పాల్సిందే. అలా ఖామోష్ కాల్పనిక ప్రపంచంలోకి ప్రవేశించింది. ఆ ప్రపంచంలో ఎన్నో కథలు చదివింది. ఎన్నో కవిత్వాలు విన్నది. తొలిరోజుల్లో తన కాల్పనిక ప్రపంచంలో వాస్తవాలతో సంబంధం లేని ఊహాకల్పిత సాహిత్యం మాత్రమే ఉండేది. ఆ తరువాత కాలంలో మాత్రం...తన ప్రపంచంలోకి వాస్తవికత నడిచి వచ్చింది. రాజులు, రాణులు, అందమైన కోటలు, అద్భుత దీపాల స్థానంలో... నిజమైన సమాజం దర్శనమిచ్చింది. మనుషులు ఎదుర్కొనే రకరకాల సమస్యలను గురించి లోతుగా తెలుసుకోగలిగింది. తన మనసులోని వేడివేడి భావాలను కవిత్వంగా రాసేది. ‘సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజం తరఫున పనిచేయడానికి ఇది మాత్రమే చాలదు’ అనుకొని జర్నలిస్ట్ కావాలనుకుంది. ఖామోష్ ఆలోచనను హర్షించిన వారు తక్కువ. భయపెట్టిన వారు ఎక్కువ. అయితే అవేమీ తన కలను అడ్డుకోలేకపోయాయి. జర్నలిజంలో శిక్షణ పొందిన ఖామోష్ ఆ తరువాత స్థానిక పత్రికలలో పనిచేసింది. స్త్రీల హక్కులు, ఉద్యమాలపై ప్రత్యేకకథనాలు రాసింది. లోకల్ రేడియో ఛానల్స్ ప్రెజెంటర్‌గా తన గొంతు వినిపించింది. ఇదంతా ఒక ఎత్తయితే పౌరహక్కుల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం మరో ఎత్తు. ఉద్యమంలో భాగంగా ఎందరో మహిళలకు అండగా నిలిచింది. దాడులను ఎదుర్కొంది. బాధితులకు న్యాయం జరిగే వరకు మడమ తిప్పలేదు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలన మళ్లీ మొదలైన తరువాత చాలామంది కలాలు అటకెక్కాయి. గొంతులు మాట మార్చుకున్నాయి. కానీ ఖామోష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అవే అక్షరాలు...అదే గొంతు! తాలిబన్ల పాలన మొదలై అప్పటికే అయిదు నెలల దాటింది. ఆ సమయంలో ‘స్త్రీలపై జరుగుతున్న అణచివేత’ అనే అంశంపై నార్వేలో మాట్లాడే అవకాశం లభించింది. ‘ఈ సమయంలో మాట్లాడితే ప్రాణాలకే ముప్పు’ అని చాలామంది హెచ్చరించినా ఆమె భయపడలేదు. ‘నేను తప్పు చేయడం లేదు. తప్పుల గురించి మాట్లాడబోతున్నాను’ అంటూ నార్వేకి వెళ్లింది ఖామోష్. నీళ్లు నమలకుండా నిజాలు మాట్లాడింది. ఆనాటి ఆమె ప్రసంగంలో కొన్ని మాటలు... ‘నా పేరు హోడ ఖామోష్. అఫ్గానిస్థాన్‌లోని వేలాది మంది మహిళలలో నేను ఒకరిని. నేను ఏ రాజకీయపార్టీకి సానుభూతిపరురాలిని కాదు. సభ్యురాలిని కాదు. పౌరహక్కుల ఉద్యమంలో పనిచేస్తున్నాను. తాలిబన్ల పాలనలో ఉన్నాను. భయంతో గుండె వేగంగా కొట్టుకునే చోట, బుల్లెట్ల చప్పుడు నిరంతరాయంగా వినిపించే చోట ఉన్నాను’ ‘కాబుల్ తాలిబన్ల వశం అయిన తరువాత రాజ్యం పోలీసు రాజ్యం అయింది. స్త్రీలపై వివక్షత పెరిగింది. మీరు ఉండాల్సింది విద్యాలయాల్లో కాదు ఇంట్లో...అంటూ అణచివేత మొదలైంది. ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పాపానికి ముర్తాజ సమది అనే ఫొటోగ్రాఫర్‌ని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. కాబుల్‌లో స్త్రీల నిరసన ప్రదర్శనకు సంబంధించిన వార్తలు రాసినందుకు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. తమ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న 70 మంది పౌరులను అరెస్ట్ చేశారు. వారిలో 40 మంది మహిళలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురిచేశారు’ నార్వే సదస్సులో అఫ్గాన్ కన్నీటి చిత్రాన్ని కళ్లకు కట్టిన ఖామోష్ ‘ఇక అంతా అయిపోయింది’ అని నిరాశ పడడం లేదు. ‘స్త్రీలను గౌరవించే రోజులు, స్త్రీల హక్కులు రక్షించబడే రోజులు తప్పకుండా వస్తాయి’ అంటున్న ఖామోష్లో ‘ఆశ’ అనే జ్వాల ఉజ్వలంగా వెలుగుతూనే ఉంది. -
ఆప్ఘన్లో బాంబు పేలుళ్లు.. తాలిబన్లు అలర్ట్
కాబూల్: అఫ్గానిస్థాన్‌లో ఐఎస్ఐఎస్(ISIS) తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర అఫ్గానిస్థాన్‌లో గురువారం రాత్రి మినీ బస్సుల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ రెండు బాంబు పేలుళ్లలో 9 మంది మృతిచెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్‌లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు పేలుళ్లు జరిపారని తాలిబన్ అధికారులు తెలిపారు. దీంతో తాలిబన్ బలగాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి. గత వారమే మసీదు, మతపరమైన పాఠశాలలో జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించిన విషయం తెలిసిందే. షియాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ముష్కరులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్ఐఎస్(ISIS) తెలిపింది. ఇది కూడా చదవండి: చెప్పినట్లు వింటావా.. లేదంటే మరో 20 మంది మగాళ్లను తీసుకురమ్మంటావా? -
ఇదేం న్యాయం.. మా ఆడబిడ్డల సంగతి ఏంటి?
తాలిబన్ల బుద్ధి.. వంకర బుద్ధి. ఏం జరిగినా.. అది మారదు. ఈ మాట అంటోంది అఫ్గన్ పౌరులే. తాలిబన్ల పాలనలో గతంలో కంటే పరిస్థితి ఇంకా దిగజారుతోందనేది వాళ్ల ఆవేదన. ఇందుకు ఉదాహరణగా బాలికల విద్యను హరిస్తూ.. వాళ్ల హక్కులను కాలరాయడం గురించి ప్రస్తావిస్తున్నారు. ఆఖరికి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నా.. తాలిబన్లు మాత్రం వెనక్కి తగ్గట్లేదు!. ఇస్లామిక్ ఎమిరేట్ అలియాస్ తాలిబన్ సర్కార్.. అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అది దొరికితేనే.. నిలిచిపోయిన నిధులు అఫ్గన్ గడ్డకు చేరేది, సంక్షోభం నుంచి తేరుకునేది. అయితే హేయనీయమైన తాలిబన్ల తీరు వల్లే అది జాప్యం అవుతోంది. మహిళలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యయుతమైన విధానాలతో తమ పాలనలో కొత్త అఫ్గనిస్థాన్‌ను చూస్తారంటూ హామీలు ఇచ్చిన తాలిబన్లు.. నీటి మీద రాతల్లాగే ఉన్నాయి. తీరు మార్చుకోకుండానే ముందుకు పోతున్నట్లు తాలిబన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గనిస్థాన్‌లో అమ్మాయిలు.. విద్యాఉద్యోగాలు, క్రీడారంగానికి క్రమక్రమంగా దూరం అవుతున్నారు. అదే సమయంలో తాలిబన్ నేతలు మాత్రం వాళ్ల పిల్లలను విదేశాల్లో చదివిస్తూ.. స్వేచ్ఛగా బతకనిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాలిబన్ కేబినెట్లో పాతిక మంది దాకా తమ పిల్లలను పొరుగున ఉన్న పాక్‌లోని పెషావర్, కరాచీలో.. ఇంకొందరు దోహాలోని స్కూల్స్‌లో పిల్లలను చదివించుకుంటున్నారు. వాళ్లలో ఆరోగ్య మంత్రి ఖ్వాలందర్ ఎబాద్, విదేశాంగ ఉపముఖ్యమంత్రి షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్, తాలిబన్ అధికార ప్రతినిధి సుహెయిల్ షాహీన్‌లు ఉన్నారు. సుహెయిల్ షాహీన్ పిల్లలు ఏకంగా దోహాలోని ఇస్లామిక్ ఎమిరేట్స్ అధికారిక కార్యాలయంలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆయనగారి పెద్ద కూతురు ఏకంగా ఫుట్‌బాల్ టీంలో సభ్యురాలిగా ఉందట. ఖ్వాలందర్ కూతురు ఇస్లామాబాద్‌లో మెడిసిన్ చదువుతోంది. ఆమె టెన్నిస్ ఛాంపియన్. మరో ఇద్దరు కీలక నేతల కూతుళ్లు సైతం దోహాలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో చదువుతున్నారట. ఈ అంశాలనే ప్రస్తావిస్తూ.. తమకూ స్వేచ్చను ఇవ్వాలని ప్రధాన ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు మహిళలు. అయితే.. ఈ అంశంపై నిర్ణయం తమ చేతుల్లో లేదని, త్వరలో భేటీ అయ్యి తుది నిర్ణయం తీసుకుంటామని తాలిబన్ ప్రతినిధులు చెప్తున్నారు. మార్చిలో బడులు తెరిచారని ఆనంద పడ్డ బాలికలకు.. ప్రవేశం లేదంటూ పిల్లలను వెనక్కి పంపి గట్టి షాకే ఇచ్చారు అక్కడి విద్యాశాఖ అధికారులు. మళ్లీ పెళ్లిళ్లు! ఇదిలా ఉంటే తాలిబన్ నేతలు ఓ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. చదువుకున్న మహిళలను రెండో వివాహం చేసుకుంటున్నారు. అజ్ఞాతంలో ఉన్నంత కాలం తాము నాగరికతలో వెనుకబడిపోయామన్న భావనలో ఉన్న వాళ్లు.. మొదటి భార్యలకూ లోక జ్ఞానం లేదనే నిర్ణయానికి వచ్చేసి.. చదువుకున్నవాళ్లను మళ్లీ పెళ్లి చేసుకుని పట్టణాలు, నగరాల్లో కాపురాలు పెడుతున్నారు. రాజకీయ నాయకులే కాదు.. సివిల్ సర్వెంట్లు, ఇతర అధికారులు కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుత్నున్నారు.. -
ఆ మహిళలకు విమానంలోకి నో ఎంట్రీ
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో మహిళలపై అణచివేత నానాటికీ పెరుగుతోంది. మగ తోడు లేకుండా వారు ఒంటరిగా విమానాల్లో ప్రయాణించడానికి వీల్లేదని తాలిబన్లు తాజాగా హుకుం జారీ చేశారు. శుక్రవారం కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒంటరి మహిళలను విమానమెక్కేందుకు అనుమతించలేదు. బాలికలు ఆరో తరగతి వరకే చదువుకోవాలన్న ఆదేశాలను నిరసిస్తూ రాజధాని కాబూల్‌లో బాలికలు శనివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. చదవండి: (మాట తప్పిన తాలిబన్లు.. షాకింగ్ నిర్ణయంతో ఆవేదనలో బాలికలు) -
మాట తప్పిన తాలిబన్లు.. షాకింగ్ నిర్ణయంతో ఆవేదనలో బాలికలు
కాబూల్: తాలిబన్లు మరోసారి మాట తప్పారు. ప్రపంచ దేశాలు తమ వైపు వేలెత్తి చూపించేలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. బాలికలు హైస్కూల్ విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలో బాలికలను హైస్కూల్ విద్యకు కూడా అనుమతిస్తున్నట్లు తాలిబన్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. తీరా స్కూల్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టు షాకిచ్చారు. అయితే, ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ మళ్లీ మాట మార్చుతూ బాలికలను చదువుకు దూరం చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదని.. ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో బాలికలు ఆవేదనకు గురవుతున్నట్టు సమాచారం. అయితే, ఇందుకు కారణం గ్రామీణ ప్రజలేనని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారు తమ పిల్లలను స్కూల్స్‌కు పంపేందుకు అంగీకరించడంలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి సీనియర్ నేతల మధ్య విబేధాలు భగ్గుమంటున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహిళ స్వేచ్చ పట్ల ఆంక్షలు ఉండాలని, కఠినంగా వ్యవహరించాలని సీనియర్లు కోరుతుండగా.. స్వేచ్చ అవసరమంటూ మరికొందరు పట్టుబడుతున్నట్టు సమాచారం. -
భారత్ భేష్ అంటున్న తాలిబన్లు
-
పాక్ చెత్త.. భారత్ బంగారం!: తాలిబన్లు
అఫ్గనిస్థాన్ పునర్మిర్మాణంలో పలు దేశాలు పాలు పంచుకుటున్న విషయం తెలిసిందే. తాలిబన్లు అఫ్గన్‌ను ఆక్రమించుకున్నాక.. ఆర్థిక ఆంక్షల వల్ల సంక్షోభంలో కూరుకుపోయింది. తాలిబన్ ప్రభుత్వానికి ఇంకా గ్లోబల్ గుర్తింపు దక్కనప్పటికీ.. నానాటికీ పరిస్థితి దిగజారిపోతుండడంతో మానవతా కోణంలో భారీ సాయమే అందుతోంది. ఈ క్రమంలో.. అఫ్గన్ పొరుగున ఉన్న పాక్ గోధుమలను అందించగా.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది అక్కడి ప్రభుత్వం. ‘‘పాక్ నుంచి పంపించిన గోధుమ నాసికరంగా ఉన్నాయి. తినడానికి అస్సలు పనికిరావు. చెత్తలోపారబోయడానికి తప్ప. ఎందుకు పంపారో ఆ దేశ ప్రభుత్వానికే తెలియాలి. బహుశా ఖరాబును జమ చేసుకోవడం ఇష్టం లేక పంపారేమో’’ అంటూ మండిపడ్డారు అక్కడి అధికారులు. అదే సమయంలో భారత్ అందించిన గోధుమలపైనా స్పందించారు. భారత్ మేలిమి రకపు గోధుమలను అందించిందని, అందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని తెలిపారు. తాలిబన్ ప్రతినిధులు పాక్-భారత్ గోధుమ సాయంపై స్పందించిన వీడియో ఒక దానిని అఫ్గన్ జర్నలిస్ట్ అబ్దుల్లా ఒమెరీ ట్వీట్ చేశారు. దీనికి అఫ్గన్ నెటిజనుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. జై హింద్ అంటూ పలువురు అఫ్గన్ పౌరులు ట్వీట్లు చేస్తుండడం విశేషం. #Afghanistan : #Taliban officials allege that wheat sent by @ImranKhanPTI #Pakistan Govt is rotten not fit for consumption while @narendramodi’s Indian Govt’s 50,000 MT of wheat is very good.pic.twitter.com/5NSnQBVEKo — Arun (@arunpudur) March 4, 2022 ఇదిలా ఉండగా.. సంక్షోభ సమయం నుంచే భారత్, అఫ్గనిస్థాన్‌కు సాయం అందిస్తోంది.ఈ క్రమంలో రోడ్డు మార్గం గుండా సరుకులు పంపే సమయంలో పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేసి అడ్డుపడగా.. తమ దేశం గుండా అనుమతించి పెద్ద మనసు చాటుకుంది ఇరాన్. ఇదిలా ఉండగా.. అమృత్సర్ నుంచి మొన్న గురువారం 2వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగామ్లో భాగంగా యాభై వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపాలనే కమిట్మెంట్కు కట్టుబడి.. సాయం అందిస్తూ పోతోంది భారత్. ఈ సందర్భంగా కోలుకుంటున్న అఫ్గన్‌తో భారత్ మంచి సంబంధాలు కోరుకుంటోందని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. -
రష్యా-ఉక్రెయిన్ వార్: తాలిబన్ల స్పందన ఇదే..
కాబూల్: ఉక్రెయిన్‌పై రష్యా అత్యాధునిక బాంబులు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు హై స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు దిగిన రష్యాపై ఐరోపా, అమెరికా సహా పలు ఆసియా పసిఫిక్ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై తాలిబన్లు సైతం స్పందించారు. ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. అలాగే.. హింసాత్మక ఘటనలను ప్రేరేపించే చర్యల నుంచి ఇరు దేశాలు వెనక్కి తగ్గాలని కోరారు. యుద్దం పరిష్కారం కాదని.. ఈ సమస్యను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తాలిబన్లు సూచించారు. అనంతరం ఉక్రెయిన్‌లో ఉన్న ఆప్ఘనిస్తాన్ ప్రజలు సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. Statement concerning crisis in #Ukraine pic.twitter.com/Ck17sMrAWy — Abdul Qahar Balkhi (@QaharBalkhi) February 25, 2022 -
హిజాబ్ కాకున్నా చద్దర్‌తో అయినా కప్పుకోండి!
భారత్‌లో హిజాబ్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో వివాదం చేటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కర్టాటకలో మొదలైన హిజాబ్ వివాదం.. దేశంలోని పలు రాష్ట్రాలకు పాకుతోంది. ఇదిలా ఉండగా మతం పేరుతో మహిళల పట్ల నిరంకుశంగా వ్యవహరించే తాలిబన్లు.. హిజాబ్ విషయంలో తాజాగా కఠిన ఆదేశాలు జారీచేశారు. అఫ్గానిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం.. మహిళలు బుర్ఖా తప్పనిసరిగా ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు ధరించాల్సిందేనని పేర్కొంది. మహిళలు పనిచేసే చోట తప్పనిసరిగా బుర్ఖా ధరించాలని, లేదంటే చద్దర్ అయినా ముఖానికి అడ్డుగా పెట్టుకొవాలని పేర్కొంది. అయితే తాలిబన్ ప్రభుత్వ ఏర్పడిన మొదట్లో దేశ మహిళలు ఉద్యోగాలు చేయడాన్ని నిషేధించింది. కొన్ని రోజుల తర్వాత మహిళలు ఉద్యోగాలు చేయడంపై సానుకూల నిర్ణయం తీసుకొని.. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల్లో.. బుర్ఖా, హిజాబ్ ధరించడం, గైడ్‌లైన్స్‌ను పాటించకపోతే సదరు మహిళలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. -
ఈ రాజ్యం మాకొద్దు
-
మహిళా హక్కులకు పాతర
అట్లాంటా: అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత దేశంలో మహిళల పరిస్థితి ఘోరంగా మారిందని అంతర్జాతీయ హక్కుల సంఘాలు ఆరోపించాయి. ముఖ్యంగా మహిళలు, స్వలింగ సంపర్కులు, హిజ్రాల పరిస్థితి దేశంలో దుర్భరంగా మారుతోందని హ్యూమన్‌రైట్స్ వాచ్ సంస్థ తెలిపింది. తాలిబన్లు గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన హక్కుల హననమే పునరావృతం అవుతోంది. వీరి పాలనలో మహిళలు రెండు రకాలుగా బాధితులవుతున్నారు. లైంగిక పరమైన దాడులు ఒక సమస్య కాగా, అలాంటి బాధితులపై సొంతవారి అకృత్యాలు రెండో సమస్యగా మారాయని హక్కుల కార్యకర్తలు వివరిస్తున్నారు. -
తీరుమారని తాలిబన్లు
న్యూయార్క్: అఫ్గాన్‌లో ప్రభుత్వ మాజీ సభ్యులు, మాజీ భద్రతా దళ సభ్యులు, అంతర్జాతీయ దళాలతో కలిసి పనిచేసిన వారు.. కలిపి దాదాపు 100 మందికి పైగా స్వదేశీయులను తాలిబన్లు చంపినట్లు నమ్మకమైన ఆరోపణలు వచ్చాయని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్ చెప్పారు. హతుల్లో మూడింట రెండొందలమందిని సరైన విచారణ లేకుండానే తాలిబన్లు పొట్టనబెట్టుకున్నారన్నారు. తమ హయాంలో దేశీయులందరికీ క్షమాభిక్ష పెడుతున్నామని, కక్ష సాధింపులుండవని గతంలో తాలిబన్లు ప్రకటించారు. కానీ ఇందుకు విరుద్ధంగా తాలిబన్లు వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అఫ్గాన్‌లో హక్కుల కార్యకర్తలు, మీడియాపై దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని గుట్టెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. అటు తాలిబన్లు, ఇటు ఐఎస్ ఉగ్రవాదులు కలిపి ఇప్పటికి 8 మంది పౌర హక్కుల కార్యకర్తలను చంపారని, 10 మందిని నిర్బంధించారని తెలిసిందన్నారు. గత ఆగస్టులో అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల వశమయ్యాయి. త్వరలో ఎన్నికలు జరుపుతామని తాలిబన్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు అలాంటి ఊసు తీసుకురాలేదు, పైగా మహిళలపై తీవ్ర నిర్భంధం మొదలైంది. దేశంలో మానవహక్కుల పరిరక్షణ జరపకపోతే విదేశీ సాయం అందించమని పలు దేశాలు ప్రకటిస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. అఫ్గాన్‌లో ప్రస్తుతం అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయని, దాదాపు 3 కోట్లమంది సంక్షోభ కోరల్లో చిక్కుకున్నారని ఆంటోనియో చెప్పారు. మరోవైపు తాలిబన్లపై ఎన్ఆర్ఎఫ్, ఐసిస్ దాడులు కూడా పెరిగాయన్నారు. తాలిబన్లలో జాతుల వైరుధ్య తగాదాలు ముదిరాయని చెప్పారు. -
వెయ్యి కోట్ల డాలర్లను విడుదల చేయండి
ఓస్లో: అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు తొలిసారిగా పశ్చిమ దేశాల ప్రతినిధులతో అధికారికంగా సమావేశమై చర్చించారు. నార్వే రాజధాని ఓస్లోలో మూడు రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో పాల్గొన్న తాలిబన్ ప్రతినిధులు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు స్తంభింపజేసిన వెయ్యి కోట్ల అమెరికా డాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అఫ్గానిస్తాన్ మానవ సంక్షోభం అంచులో ఉందని అందుకే ఆ నిధులు విడుదల చేయాలని వారు ఒత్తిడి తీసుకువచ్చారు. తాలిబన్ల తరఫున హాజరైన షఫీవుల్లా అజామ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ అఫ్గానిస్తాన్‌కు చెందిన ఆస్తుల్ని విడుదల చేయాలని, రాజకీయపరమైన విభేదాలతో సాధారణ పౌరుల్ని శిక్షించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆకలి కేకలు, గడ్డ కట్టించే చలి పరిస్థితుల్లో స్తంభింపజేసిన ఆస్తుల్ని విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి ముందు పశ్చిమ దేశాల ప్రతినిధులు అఫ్గాన్ మహిళా హక్కుల కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలతో మాట్లాడి అఫ్గాన్‌లో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. -
తాలిబన్ల పైశాచికం.. వీడియో వైరల్
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దురాగతాలు మరోసారి వైరల్ వీడియోలో బట్టబయలయ్యాయి. దేశంలోని పాక్టియా ప్రావిన్స్‌లో.. ఒక సంగీతకారుడి సంగీత పరికరాన్ని తాలిబానీ పురుషులు తగులబెట్టారు. దీనిని చూస్తూ ఒకవైపు సంగీతకారుడు ఏడుస్తుండగా, మరోవైపు తాలిబన్లు తుపాకులు ధరించి దీనిని చూస్తూ పైశాచిక ఆనందం పోందడం గమనించవచ్చు. ఈ వీడియోను అబ్దుల్ హక్ ఒమేరి అనే జర్నలిస్ట్ ట్విటర్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఆఫ్ఘనిస్తాన్పై తాలిబాన్లు తమ ఆధీనంలోకి వచ్చినప్పటి నుండి, దేశంలో అనేక మార్పులు వచ్చాయి. కార్లలో, వివాహా వేడుకల సమయంలో సంగీతం వినడాన్ని తాలిబాన్ చట్టవిరుద్ధం చేసింది. పురుషులు, స్త్రీలు వేర్వేరు వేదికలలో వివాహాలు జరుపుకోవాలని బలవంతం చేశారు. Video : Taliban burn musician's musical instrument as local musicians weeps. This incident happened in #ZazaiArub District #Paktia Province #Afghanistan . pic.twitter.com/zzCp0POeKl — Abdulhaq Omeri (@AbdulhaqOmeri) January 15, 2022 చదవండి: (అఖిలేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 'వారిని పార్టీలోకి చేర్చుకునేది లేదు') -
అఫ్గన్లకు ఇక మంచిరోజులు!
అఫ్గన్ పౌరులకు మంచిరోజులు మొదలయ్యాయి!. చరిత్రలో మునుపెన్నడూ చూడలేనంత దీనస్థితిని ఒక దేశం ఎదుర్కొనుందన్న విశ్లేషణలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్ నేలకు సాయం అందించేందుకు అగ్ర రాజ్యంతో పాటు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. అంతేకాదు ఆహార, ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడేసేందుకు భారీ విరాళాల కోసం ఐక్యరాజ్య సమితి ప్రణాళిక రచించింది. తాజాగా అమెరికా 308 మిలియన్ డాలర్ల (రెండువేల కోట్ల రూపాయలకు పైనే) తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆశ్రయం, ఆరోగ్య భద్రత, చలికాల పరిస్థితుల నేపథ్యంలో సాయం, అత్యవసర ఆహార సాయం, మంచి నీరు, శానిటేషన్, శుభ్రత సర్వీసులు తదితరాల కోసం ఈ భారీ సాయం వినియోగించనున్నట్లు, ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకోనున్నట్లు వైట్ హౌజ్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో మానవతా ధృక్పథంతో అమెరికా అందించిన సాయం(గత అక్టోబర్ నుంచి) ఇప్పటిదాకా 782 మిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు 27 దేశాలు అఫ్గన్‌కు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి కూడా. గతంలో అఫ్గన్ బడ్జెట్ 80 శాతం విదేశీ నిధుల ద్వారానే సమకూరేది. అయితే తాలిబన్ల రాకతో ఎక్కడిక్కడే నిధులు ఆగిపోయాయి. పైగా అఫ్గన్‌కు చెందిన అకౌంట్లు సైతం నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఐదు నెలల తాలిబన్ల పాలనలో అఫ్గన్ ఆర్థిక వ్యవస్థ గాడితప్పి సంక్షోభం దిశగా అడుగులు పడ్డాయి. ఒకానొక టైంలో కరెన్సీ కొరత కారణంగా వస్తు మార్పిడి విధానం వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఒకవైపు ఆహార కొతర, మరోవైపు ఆహార ఉత్పత్తుల ధరలు 20 శాతం పెరగడంతో ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు. ఈ తరుణంలో ఆదుకోవాలంటూ అమెరికాతో సహా అన్ని దేశాలకు తాలిబన్ ప్రభుత్వం పిలుపు ఇవ్వగా.. అనూహ్యమైన స్పందన లభిస్తోంది. యూఎన్ భారీ ప్రణాళిక సాయం కోసం చూస్తున్న కోట్ల మంది అఫ్గన్ పౌరుల ముఖం తలుపులు వేయొద్దంటూ యూఎన్ ఎయిడ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిథ్స్ ప్రపంచానికి పిలుపు ఇచ్చారు. అఫ్గనిస్థాన్ సంక్షోభం నుంచి బయటపడాలంటే 2022 ఒక్క ఏడాదిలోనే 5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అవసరమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దేశంలో ఉన్న పౌరుల కోసం 4.4 బిలియన్ డాలర్లు, సరిహద్దుల అవతల ఆశ్రయం పొందుతున్న పౌరుల కోసం 623 మిలియన్ డాలర్లు అవసరం పడొచ్చని యూఎన్ భావిస్తోంది. ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితి ఒక దేశం కోసం ఇంత పెద్ద ఎత్తున్న సాయం కోసం ప్రపంచానికి పిలుపు ఇవ్వడం ఇదే మొదటిసారి. పాక్ సహకరించకున్నా.. ఇదిలా ఉంటే అఫ్గనిస్థాన్‌కు సాయం అందించే విషయంలో భారత్ ముందు నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. గత ఆగష్టు నుంచి ఆహార ఉత్పత్తులతో పాటు మందులను సైతం పంపించింది. కిందటి నెలలో ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్లను అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాబూల్‌లోని ఇందిరాగాంధీ ఆస్పత్రికి మందుల్ని సరఫరా చేసింది. మరోవైపు ఆహార కొరత నేపథ్యంలో అక్కడి ప్రజల కోసం యాభై వేల టన్నుల గోధుమల్ని పంపించింది భారత్. ముందుగా పాక్ మార్గం గుండా వెళ్లాల్సి ఉండగా.. అఫ్గన్‌తో సరిహద్దు ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పాక్‌తో భారత్ ప్రభుత్వం సంప్రదింపులు సైతం జరపగా.. లాభం లేకుండా పోయింది. అ తరుణంలో అనూహ్యంగా ఇరాన్ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. తమ గుండా సరుకుల్ని,మందుల్ని అఫ్గన్‌ను పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చదవండి: అఫ్గన్‌పై అమెరికా కొర్రిలు.. తలవంచిన తాలిబన్ ప్రభుత్వం -
అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు
We Beat The Americans: Talibans: అమెరికా సైనిక దళాలపై తాలిబాన్లు విజయాన్ని సూచించే అనధికారిక ప్రదర్శనలు అఫ్గనిస్తాన్‌లోని ఘజ్నీ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్నాయి. అమెరికన్లు ప్రపంచంలోనే తమని తాము గొప్ప శక్తిగా చెప్పుకుంటున్నప్పటికీ, మేము అమెరికన్లను ఓడించగలమని అఫ్గన్లు, ప్రపంచం, భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా మేము దీన్ని చూపిస్తున్నామని తాలిబన్ ప్రావిన్షియల్ కల్చర్ చీఫ్ ముల్లా హబీబుల్లా ముజాహిద్ మీడియాకు తెలిపాడు. చారిత్రకంగా అమెరికా సుదీర్ఘ యుద్ధాల్లో సేవలందించిన సైనిక దళాల పేర్లను, వారు ఆక్రమించిన స్థావరాలను కాంక్రీట్ గోడపై క్రమం తప్పకుండా చెక్కడం పరిపాటి. ఐతే అమెరికా సైన్యానికి, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణల్లో అవి ధ్వంసమయ్యాయి. అఫ్గన్ నుంచి అమెరికా సైన్యం స్వచ్ఛంద నిష్క్రమణ తర్వాత వారికి సంబంధించిన యుద్ధసామగ్రిని రోడ్లపై ప్రదర్శనకు ఉంచి తాలిబన్లు ప్రగల్భాలు పలకడం గమనార్హం. 19వ శతాబ్దంలో బ్రిటిష్ దళాల ఓటమితో పాటు ప్రస్తుతం మూడు విదేశీ సామ్రాజ్యాలపై అఫ్గనిస్తాన్ విజయం సాధించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ విజయం సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నామని తాలిబన్ పోరాట యోధుడు ఓజైర్ (18) తెలిపాడు. ఇక్కడ జన్మించిన అఫ్గన్లు శక్తివంతమైన అమెరికా దేశాన్ని ఓడించగలరని నిరూపించేందుకే వీటిని ప్రదర్శిస్తున్నామన్నాడు. ముల్లా హబీబుల్లా ముజాహిద్ పేలుడు గోడల ముందు నిలబడి యుద్ధాల్లో మరణించిన 20, అంతకంటే ఎక్కువ మంది ముఖ్యమైన కమాండర్లు, జనరల్స్ పేర్లు వీటిమీద ఉన్నాయని ప్రగల్భాలు పలికాడు. మరోవైపు అఫ్గనిస్తాన్ కొత్త పాలకుల సమక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని, అక్కడి జనాభాలో సగానికి పైగా ప్రజలు ఆకలి బాధను ఎదుర్కొంటున్నట్లు యూఎస్ అభిప్రాయపడింది. చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు.. -
ఎన్నికల కమిషన్‌ను రద్దు చేసిన తాలిబన్లు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ ఎన్నికల కమిషన్‌ను తాలిబన్ల ప్రభుత్వం రద్దు చేసింది. స్వతంత్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల ఫిర్యాదుల కమిషన్‌ను రద్దు చేస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి (డిప్యూటీ) బిలాల్ కరీమి ఆదివారం వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో అఫ్గాన్‌లో ఈ వ్యవస్థలు అనవసరం. భవిష్యత్తులో అవసరమైతే వీటిని పునరుద్ధరిస్తాం’ అని తెలిపారు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖను, శాంతి స్థాపన మంత్రిత్వ శాఖలనూ మూసివేస్తున్నట్లు బిలాల్ తెలిపారు. -
కంచె లొల్లి.. పాక్ సైన్యం-తాలిబన్ల మధ్య కాల్పులు
సరిహద్దు వివాదం పరిష్కారం అయ్యిందని ప్రకటించుకున్న కొన్నిరోజులకే పాక్ సైన్యం-తాలిబన్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. 2017 నుంచి పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ ఇరు దేశాల మధ్య వేల కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వివాదం తరచూ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో డ్యూరండ్ లైన్ వెంట పాక్ సైన్యం, తాలిబన్ ఫోర్స్ మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో దాదాపు అర్థగంట పాటు ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా హౌజ్‌లతో పాటు ట్విటర్లోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫెన్సింగ్ వద్ద తాలిబన్ ట్రూప్‌కు చెందిన వ్యక్తి కంచె తొలగిస్తుండగా .. ఇద్దరు పాక్ సైనికులు అడ్డుకున్నారని, వారిని ఆ వ్యక్తి కాల్చి చంపడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం. అయితే ఇరుపక్షాలు మాత్రం నష్టంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, కొన్ని గంటలకే వ్యవహారం సర్దుమణిగిందంటూ అఫ్గన్, పాక్ పక్షాల నుంచి ప్రకటన వెలువడింది. ఇక స్థానిక మీడియాలో కథనాలు మాత్రం విరుద్ధంగా ఉంటున్నాయి. మరోవైపు అఫ్గన్ సరిహద్దు వెంట 26 వేల కిలోమీటర్ల మేర కంచె పనుల్ని దాదాపు పూర్తి చేయగా.. తాలిబన్లు వైర్‌ను తెంచుకెళ్లి ఇనుప సామాన్ల స్టోర్లలో అమ్మేసుకుంటున్నారు. ఈ తీరుపైనా పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. చదవండి: తాలిబన్ల అతి.. అఫ్గనిస్తాన్‌కు పాక్ షాక్ -
ఎట్టకేలకు దిగొచ్చిన తాలిబన్లు!
Afghan Taliban Govt Needs US Help: దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతూ.. జనజీవనం ఆకలి కేకల దుస్థితికి చేరుకున్న తరుణంలో తాలిబన్ ప్రభుత్వం దిగొచ్చింది. అమెరికా విధించిన ఆంక్షల కొర్రిల నుంచి విముక్తి కలిగించాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజంతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ప్రకటించి సాయం కోసం చేతులు చాచింది. అఫ్గన్ నేలపై ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. వరుసగా అమెరికా, పొరుగు దేశాల ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తున్నారు తాలిబన్లు. అయితే ప్రతీ చర్చలో తమ ఆధిపత్యమే ప్రదర్శిస్తూ.. ఫలితంపై ఎటూ తేల్చకుండా వస్తున్నారు. దీంతో దేశంలో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టాఖి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాయం కావాలి ఆడపిల్లలకు విద్యను అందించడం, ఉద్యోగ-ఉపాధి కల్పన ద్వారా మహిళా సాధికారికతకు తమ ప్రభుత్వం కట్టబడి ఉందని విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టాఖి స్పష్టం చేశారు. అయితే ఇందుకు ప్రపంచ దేశాల సాయం తమకు అవసరం ఉందని ఆదివారం ది అసోషియేట్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఫారిన్ ఎయిడ్ (విదేశీ సాయం) అఫ్గన్ జీడీపీని తీవ్రంగా ప్రభావితం చేసే అంశం. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75 శాతం ఖర్చు చేస్తుంటారు. కానీ, మేం అధికారం చేపట్టేనాటికే అఫ్గన్ ఆర్థికం ఘోరంగా ఉంది. గత ప్రభుత్వ ప్రతినిధులు నిధులతో పారిపోయారు. పైగా అఫ్గన్‌కు చెందిన బిలియన్ల డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేశారు. అమెరికాతో మాకెలాంటి సమస్యలు లేవు. ఒక్క అమెరికాతోనే కాదు అన్ని దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం. ..అఫ్గన్‌కు సంబంధించి 10 బిలియన్ డాలర్ల ఫండ్ నిలిచిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. అది విడుదలయ్యేందుకు అన్నీ దేశాలు మాకు సహకరిస్తాయని భావిస్తున్నాం. అఫ్గన్‌పై ఆంక్షలు ఎవరికీ ఎలాంటి ప్రయోజనాలు కలిగించవు. అఫ్గన్ అస్థిరత, ఒక దేశ ప్రభుత్వాన్ని బలహీనపర్చడం ఏదో ఒక దేశం ఆసక్తి మీద ఆధారపడి ఉండదని గమనించాలి. అఫ్గన్ కోలుకోవడానికి సాయం అందించాలి’’ అని అంతర్జాతీయ సమాజానికి ముట్టాఖి విజ్ఞప్తి చేశాడు. ఇక తాలిబన్ల పాలనలో ఆడపిల్లలు, మహిళల అణచివేత కొనసాగుతోందన్న కథనాలను కొట్టిపారేసిన ముట్టాఖీ.. మత చట్టంలో కొన్ని సవరణలకు, వాటిని అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. గతంలోనూ తాము సవరణలు చేపట్టిన అంశాన్ని ప్రస్తావించారాయన. ‘‘ముందు ప్రపంచం మాతో కలవాలి. మేం వాళ్లతో కలవాలి. అప్పుడే కదా మాకు బయటి ప్రపంచం గురించి తెలిసేది. ఎలాంటి సడలింపులు ఇవ్వాలో తెలిసేది’’ అని వ్యాఖ్యానించారాయన. చదవండి: ఏం మిగల్లేదు! అఫ్గన్ ఆర్తనాదాలు తప్పులు ఒప్పుకుంటున్నాం అధికారంలోకి వచ్చాక కొన్ని నెలలపాటు తమ(తాలిబన్) ప్రభుత్వం తప్పులు చేసిందని ముట్టాఖీ అంగీకరించారు. అయితే వాటి గురించి చర్చించకుండా.. సంస్కరణల గురించి, సంక్షోభం నుంచి గట్టెక్కడం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారాయన. అమెరికా దళాల ఉపసంహరణ ప్రకటన నేపథ్యంలో.. మేం మాట నిలబెట్టుకున్నాం. నాటో, అమెరికా దళాలపై ఎటువంటి దాడులు చేయలేదు. దురదృష్టవశాత్తూ ఐసిస్ చేసిన దాడుల్ని మేం చేసినట్లుగా అనుమానించారు. ఆపై మా నిజాయితీ నిరూపించుకున్నాం. ప్రతీకార దాడుల కథనాలు కూడా ఊహాగానాలే!. ఏదిఏమైనా శాంతి భద్రతల స్థాపనకు, మానవ హక్కుల పరిరక్షణ ప్రకటనకు కట్టుబడి ఉంటాం. ముందు ముందు కూడా అదే ఆచరిస్తాం. అందుకు అఫ్గన్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత అమెరికా లాంటి అగ్రరాజ్యం పై ఉందని ఆయన పేర్కొన్నారాయన. ‘‘అమెరికా సంయుక్త బలగాల ఉపసంహరణ తర్వాత అప్గన్.. దారుణంగా దెబ్బతింది. అది కోలుకోవాలంటే తిరిగి అమెరికా చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే అమెరికా గొప్ప దేశం కాబట్టి. పొరపచ్చాలను పక్కనపెట్టి అమెరికాతో మా ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తేనే అప్గన్నిస్థాన్ బాగుపడేది అని ఆశాబావం వ్యక్తం చేశారాయన. అయితే ఐసిస్ వ్యతిరేక పోరాటంలో అమెరికాకు మద్ధతుగా నిలుస్తారా? అనే ప్రశ్నకు మాత్రం అమిర్ ఖాన్ దాటవేత ధోరణి ప్రదర్శించడం కొసమెరుపు. చదవండి: పెళ్లిళ్లపై తాలిబన్ల సంచలన నిర్ణయం.. -
అఫ్గాన్‌లో పాకిస్తాన్ విధ్వంసకర పాత్ర
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్ వ్యవహారాల్లో పొరుగు దేశం పాకిస్తాన్ చాలా ఏళ్లుగా చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు అమెరికాలో కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్ఎస్) తన నివేదికలో వెల్లడించింది. స్వతంత్ర విషయ నిపుణులు ఈ నివేదికను రూపొందించారు. అఫ్గాన్‌లో పాక్ విధ్వంసకర, అస్థిరతకు కారణమయ్యే పాత్ర పోషిస్తున్నట్లు సీఆర్ఎస్ రిపోర్టు తేల్చిచెప్పింది. తాలిబన్ ముష్కరులకు పాక్ పాలకుల అండదండలు బహిరంగ రహస్యమేనని పేర్కొంది. పాకిస్తాన్, రష్యా, చైనా, ఖతార్ వంటి దేశాలు తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించి, సంబంధాలు పెంచుకొనే అవకాశం ఉందని తెలిపింది. అదే జరిగితే అమెరికా ఒంటరి కాక తప్పదని పేర్కొంది. అఫ్గాన్‌పై అమెరికా పట్టు సడలిపోతుందని పేర్కొంది. ఫలితంగా తాలిబన్ పాలకులు అమెరికా ఒత్తిళ్లను ఎదిరించే పరిస్థితి ఉత్నన్నమవుతుందని సీఆర్ఎస్ రిపోర్టు వివరించింది. ‘‘అఫ్గాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడాన్ని కొందరు పాక్ విజయంగా భావిస్తున్నారు. దీంత్లో అక్కడ పాక్ పెత్తనం పెరిగిపోతుంది. అఫ్గాన్‌పై భారత్ ప్రభావాన్ని తగ్గించాలన్న పాక్ యత్నాలు తీవ్రమవుతాయి’’ అని పేర్కొంది. ఢిల్లీ సదస్సును స్వాగతించిన తాలిబన్ కాబూల్: అఫ్గానిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘ఢిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్’ను తాలిబన్ ప్రభుత్వం స్వాగతించింది. భారత్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా సలహాదారుల సదస్సులో మొత్తం 8 దేశాలు పాల్గొన్న విషయం తెలిసిందే. సదస్సు నేపథ్యంలో భారత్ చేసిన డిమాండ్లన్నిటినీ తాము నెరవేర్చామని తాలిబన్ ప్రభుత్వం తెలిపిందని టోలో వార్తా సంస్థ తెలిపింది. ‘ఇస్లామిక్ ఎమిరేట్(తాలిబన్) భారత్ సదస్సును స్వాగతిస్తోంది. పాలన విషయంలో గట్టి చర్యలు తీసుకుంటున్నాం. అఫ్గాన్ భూభాగాన్ని తమకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉందని ఏ ఒక్క దేశం కూడా ఆందోళన చెందవద్దు’అని అఫ్గాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇనాముల్లా సమాంగని తెలిపారని టోలో న్యూస్ పేర్కొంది. అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులను, ఎదుర్కొంటున్న సవాళ్లను అంచనా వేయడంలో ఢిల్లీ భేటీ అసాధారణ చొరవ చూపిందని పేర్కొంది. ‘అఫ్గానిస్తాన్‌కు సాయం అందిస్తున్న దేశాల్లో ఒకటైన భారత్.. ఢిల్లీ సదస్సును ప్రభావవంతంగా నిర్వహించిందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు సయద్ హకీమ్ కమాల్ చెప్పారు. ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు పాల్గొన్నాయి. -
అఫ్గాన్ ఉగ్రవాదుల అడ్డా కాకూడదు
న్యూఢిల్లీ: తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అఫ్గానిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకాలాపాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని భారత్ ఆ«ధ్వర్యంలో బుధవారం జరిగిన భద్రతా సదస్సులో పాల్గొన్న ఎనిమిది ఆసియన్ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అఫ్గాన్ సంక్షోభం విసిరే సవాళ్లపై ఏర్పాటైన ‘ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ ఆన్ అఫ్గానిస్తాన్’ సదస్సు అంతర్జాతీయ ఉగ్రవాదానికి అఫ్గాన్ అడ్డాగా మారకుండా నిరోధించడానికి కలసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించింది. సదస్సులో రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. అఫ్గానిస్తాన్‌లో భద్రతా పరిస్థితులపై ఈ సదస్సులో చర్చ జరిగింది. శాంతియుత, భద్రతాయుత, సుస్థిరమైన అఫ్గానిస్తాన్‌ని చూడటమే తమ లక్ష్యమని సదస్సుకి హాజరైన ప్రతినిధులు పేర్కొన్నారు. కాబూల్, కాందహార్, కుందుజ్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్ని సమావేశం ఖండించింది. పాకిస్తాన్, చైనా ఏవో సాకులు చెప్పి సదస్సుకి దూరంగా ఉన్నాయి. నాలుగు అంశాలపై దృష్టి పెట్టాలి: మోదీ అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సదస్సు ముగిసిన తర్వాత భద్రతా ప్రతినిధులందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మోదీ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అఫ్గానిస్తాన్ అభివృద్ధి కోసం నాలుగు సూత్రాలను ప్రతిపాదించారు. సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. అఫ్గాన్ భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని చెప్పారు. ఇందుకోసం అక్కడ ఉగ్రవాద సంస్థలకు స్థానం లేకుండా చేయాలన్నారు. అఫ్గాన్ నుంచి మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి వ్యూహ రచన చేయాలన్నారు. అఫ్గాన్‌లో జనం ఆకలితో అలమటించిపోతున్నారని, ముష్కరులు వారిపై అకృత్యాలకు పాల్పడుతున్నారని, సంక్షోభం నానాటికీ ముదురుతోందని, ఈ సమస్య పరిష్కారానికి ఇరుగు పొరుగు దేశాలు మానవతాదృక్పథంతో నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకి నేతృత్వం వహించి ప్రారంభోపన్యాసం చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అఫ్గానిస్తాన్‌లో ఇటీవల జరిగిన పరిణామాలు ప్రాంతీయంగానూ సవాళ్లు విసురుతున్నాయని అన్నారు. తాలిబన్లతో చర్చల ద్వారానే అఫ్గాన్ సమస్యని పరిష్కరించగలమని రష్యా ప్రతినిధి నికోలాయ్æ అన్నారు. సదస్సు ఒక డిక్లరేషన్ని ఆమోదించింది. మళ్లీ వచ్చే ఏడాది సమావేశం కావాలని అంగీకారానికి వచ్చారు. డిక్లరేషన్‌లో ఏముందంటే ? ► అఫ్గానిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యాకలాపాలు జరగకూడదు. అక్కడ ప్రభుత్వం ఉగ్రవాదులకు శిక్షణ, ఆశ్రయం, ఆర్థిక సహకారం అందించకూడదు. ► అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాం. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరి జోక్యం ఉండకూడదంటూ పాకిస్తాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ. ► సామాజికంగా, ఆర్థికంగా కునారిల్లుపోతున్న అఫ్గానిస్తాన్ పరిస్థితిపై సదస్సు ఆందోళన. అఫ్గాన్ ప్రజలకు మానవత్వంతో అత్య వసరంగా సాయం చెయ్యాలని నిర్ణయం. ► అఫ్గాన్‌లో అన్ని వర్గాల ప్రజలకు నిరాటంకంగా సాయం అందేలా చర్యలు చేపట్టాలి. మానవతా దృక్పథంతో చేసే ఈ సాయంలో ఎలాంటి వివక్షలకు తావు ఉండకూడదు ► మహిళలు పిల్లలు, మైనారిటీల హక్కుల్ని ఎవరూ ఉల్లంఘించకూడదు. ► అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభించేలా ప్రభుత్వం ఏర్పాటుకావాలి. ► కోవిడ్‌పై పోరాటానికి అఫ్గానిస్తాన్‌కు కావల్సిన సాయం అందించడానికి కట్టుబడి ఉన్నాం. భవిష్యత్‌లో కూడా అన్ని దేశాలు పరస్పర సహకారాన్ని అందించుకుంటాయి. ► ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు అఫ్గాన్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షించాలి. -
నలుగురు మహిళల దారుణ హత్య.. ప్రకటించిన తాలిబన్లు
కాబూల్: తాలిబన్లు ఆక్రమించిన నాటి నుంచి అఫ్గనిస్తాన్‌లో అరాచకాలు.. ముఖ్యంగా మహిళలపై దారుణాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అఫ్గన్ ఉత్తర నగరమైన మజర్ ఈ షరిఫ్లో నలుగురు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ వార్తను అఫ్గన్ తాలిబన్ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఆ వివరాలు.. తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన నాటి నుంచి ఆ దేశ ప్రజలు.. ముఖ్యంగా మహిళలు విదేశాలకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన నలుగురు మహిళలు కూడా ఈ ప్రయత్నంలోనే ఉన్నారు. వీరు నలుగురు స్నేహితులే కాక.. కోలిగ్స్ కూడా. వీరు దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఏజెంట్ ద్వారా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. (చదవండి: తాలిబన్ల దుశ్చర్య.. 13 మంది ఊచకోత) ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం వీరికి ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఏజెంట్ అని భావించిన మహిళలు అతడితో మాట్లాడారు. ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించడంతో అతడితో పాటు కారులో వెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి వారిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. చనిపోయిన నలుగురు కూడా హక్కుల కార్యకర్తలని సమాచారం. అయితే దీని గురించి మాట్లాడటానికి వారి కుటుంబ సభ్యులు నిరాకరించారు. చదవండి: తెరపైకి తాలిబన్ల సరికొత్త రూల్.. ఈ సారి ఏకంగా.. -
తాలిబన్ల దుశ్చర్య.. 13 మంది ఊచకోత
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. ఓవైపు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.. దేశంలో మాంద్యం పెరిగితోంది. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా.. చాంధస పాలన కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తాలిబన్లు ఓ మహిళా క్రీడాకారిణి తల నరికిన ఘటన గురించి చదివాం. తాజాగా తాలిబన్లు మరో దుశ్చర్యకు పూనుకున్నారు. పెళిల్లో మ్యూజిక్ బంద్ చేయించడం కోసం ఏకంగా 13 మందిని చంపేశారు. ఈ విషయాన్ని అఫ్గన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ శనివారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. అమ్రుల్లా చెప్పిన దాని ప్రకారం నంగర్హార్ ప్రావిన్స్ ప్రాంతంలో ఓ చోట వివాహం జరుగుతుంది. ఇక పెళ్లి అంటే సందడి ఉంటుంది కదా. అలానే ఆ వివాహ వేడుక వద్ద మ్యూజిక్ ఏర్పాటు చేశారు. అది తాలిబన్లకు నచ్చలేదు. మ్యూజిక్ ఆపమని చెప్పడానికి వారు అక్కడున్న జనాల్లో ఓ 13 మందిని ఊచకోత కోశారు. (చదవండి: తోబుట్టువుల కడుపు నింపడం కోసం పసికందు అమ్మకం ) ఈ సందర్భంగా అమ్రుల్లా ‘‘తాలిబన్ మిలిటెంట్లు నంగర్హార్ ప్రావిన్స్ ప్రాంతంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో సంగీతాన్ని ఆపడం కోసం 13 మందిని ఊచకోత కోశారు. మనం కేవలం ఖండించడం ద్వారా మాత్రమే ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేం. మన సంస్కృతిని చంపేయడం కోసం పాకిస్తాన్ వీరికి దాదాపు 25 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చింది. మన సంస్కృతి స్థానంలో ఐఎస్ఐ కల్చర్‌ని తీసుకువచ్చి.. మన ఆత్మలను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రాక్షస పాలన ఎంతో కాలం కొనసాగదు. కానీ ఉన్నన్ని రోజులు అఫ్గన్లు మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అంటూ ట్వీట్ చేశారు. Taliban militiamen have massacred 13 persons to silence music in a wedding party in Nengarhar. We can't express our rage only by condemnation. For 25 years Pak trained them to kill Afg culture & replace it with ISI tailored fanaticism to control our soil. It is now in works. 1/2— Amrullah Saleh (@AmrullahSaleh2) October 30, 2021 (చదవండి: అఫ్గాన్ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు?) అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న నాటి నుంచి తాలిబన్లు దేశంలో కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో మ్యూజిక్, టీవీల్లో ఆడవారి గొంతు వినిపించకూడదంటూ నిషేధం విధించారు. అఫ్గనిస్తాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ కాలేజీని కూడా మూసేశారు. చదవండి: ఆ డబ్బులు అఫ్గనిస్తాన్‌వి.. మాకు తిరిగివ్వండి: తాలిబన్లు -
మహిళలపై తాలిబన్ పాలకుల ఉక్కుపాదం
-
తోబుట్టువుల కడుపు నింపడం కోసం పసికందు అమ్మకం
కాబూల్: ఆ తల్లికి నలుగురు సంతానం. నాలుగో బిడ్డ నెలల పసికందు చిన్న పాప. కొన్ని నెలల క్రితం వరకు వారి జీవితాలు బాగానే ఉండేవి. కానీ దేశం తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన నాటి నుంచి గడ్డు పరిస్థితులు. కడుపునిండా తిని ఎన్ని రోజులవుతుందో. తాము సరే.. కానీ పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. పసిదానికి పాలు కూడా కరువయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో.. ఆ మహిళ తన అమ్మ మనసును చంపుకుంది. మిగతా పిల్లల ఆకలి తీర్చడం కోసం నెలల పసిగుడ్డును అమ్మకానికి పెట్టింది. అది కూడా కేవలం 500 డాలర్లకు. ఇక భవిష్యత్తులో ఆ పాపను తన కుమారుడికి ఇచ్చి వివాహం చేయడం కోసం ఈ చిన్నారిని కొన్నాడు సదరు వ్యక్తి. అఫ్గన్‌లో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో.. ఈ ఒక్క సంఘటన చూస్తే అర్థం అవుతుంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు ఇలాంటి చిన్నారులను బలి పశువులను చేస్తున్నారు. ఆవివరాలు.. (చదవండి: ఆకలితో అల్లాడుతున్న అఫ్గన్ చిన్నారులు.. తిండి దొరక్క) అఫ్గనిస్తాన్‌లోని ఓ కుగ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. చిన్నారి తండ్రి కొంతకాలం వరకు చెత్త ఏరుకుని అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత కష్టాలు ప్రారంభం అయ్యాయి. అతడికి నలుగురు సంతానం. భార్యాబిడ్డల ఆకలి తీర్చడం చిన్నారి తండ్రికి తలకు మించిన భారమయ్యింది. ఈ క్రమంలో ఆఖరి సంతానం అయిన నెలల పాపను 500 డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. (చదవండి: తాలిబన్ల అతి.. అఫ్గనిస్తాన్‌కు పాక్ షాక్) మిగతా బిడ్డల ఆకలి తీర్చడం కోసం ఈ పసికందును అమ్మేశాడు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. పసిదాన్ని భవిష్యత్తులో తన కుమారుడికిచ్చి వివాహం చేయడం కోసం ఈ పాపను కొన్నాడట సదరు వ్యక్తి. ఈ సందర్భంగా చిన్నారి తల్లి మాట్లాడుతూ.. ‘‘పాపతో సహా ఇంట్లో అందరం ఆకలితో బాధపడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఈ దారుణానికి ఒడగట్టాను. పాప చాలా చిన్నది.. ఇప్పుడు నేను చేసిన పని గురించి దానికేం తెలియదు. మిగతా పిల్లలు పెద్దవాళ్లు. వారికి పరిస్థితి అర్థం అవుతుంది. బిడ్డను అమ్ముకునేంత కసాయి దాన్ని కాదు. కానీ మిగతా పిల్లల ఆకలి నన్ను ఈ పాపానికి పురిగొల్పింది’’ అంటూ కన్నీరుపెట్టుకుంది. చదవండి: తాలిబన్లతో డీల్.. మెలిక పెట్టిన అమెరికా -
తాలిబన్ల అతి.. అఫ్గనిస్తాన్‌కు పాక్ షాక్
ఆఫ్ఘనిస్తాన్ మిత్రరాజ్యంగా ఉన్న పాకిస్థాన్.. ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చింది. తాలిబన్ల అతిజోక్యంతో విసుగొచ్చి.. అఫ్గన్‌కు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ధరల్ని తగ్గించే ప్రసక్తే లేదని పేర్కొంటూ.. ఈ మేరకు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. దీంతో అఫ్గన్‌కు ప్రస్తుతం నడుస్తున్న ఏకైక విదేశీ విమాన సర్వీస్ కూడా నిలిచిపోయినట్లు అయ్యింది. కారణం.. తాలిబన్ల దురాక్రమణకు ముందు(ఆగస్టు 15 వరకు) కాబూల్-ఇస్లామాబాద్ మధ్య విమాన ఛార్జీ టికెట్ ధర 120-150 డాలర్ల మధ్య ఉండేది. కానీ ఇప్పుడది 2500 డాలర్లకు చేరుకుని మంటపుట్టిస్తోంది. ఈ తరుణంలో టికెట్ ధరల్ని తగ్గించాలని, లేదంటే విమాన సర్వీసులను నిలిపివేస్తామని తాలిబన్ ప్రభుత్వం పాక్‌ను హెచ్చరించింది. ఇందుకు కౌంటర్‌గానే పాక్ తన సర్వీసులు నిలిపివేసి తాలిబన్లకు ధీటుగా బదులిచ్చింది. తమ సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నా.. తాలిబన్లను ఇంతకాలం ఓపికగా భరిస్తూ వస్తున్నామని చెబుతోంది పీఐఏ. అయితే ఇప్పుడు మునుపటి ధరలతో విమాన సర్వీసులు నడపాలన్నది తాలిబన్ల తాజా ఆదేశం. కానీ, బీమా సంస్థలు కాబూల్‌ను యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నందున బీమా ప్రీమియం ధరలు భారీగా పెరిగాయని, అందుకనే టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని పాక్ చెబుతోంది. ఇంతకాలం తాము మానవతా దృక్పత కోణంలోనే విమాన సర్వీసులు నడిపామని, కానీ, ఇక మీదట టికెట్ ధరలను తగ్గించలేమని పేర్కొంటూ అఫ్గనిస్తాన్‌కు విమాన సర్వీసులను రద్దు చేసింది పీఐఏ. చదవండి: పాక్ జిమ్మిక్కు.. తాలిబన్లకే టోకరా! -
పాక్ జిమ్మిక్కు.. తాలిబన్లకే టోకరా!
‘రండి అన్న రండి.. మేడిన్ అమెరికా గన్లు ఉన్నాయి. బుల్లెట్ల దగ్గరి నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల దాకా అన్నీ సరసమైన ధరలకే అమ్ముతున్నాం’ (తెలుగీకరించాం) అంటూ పాకిస్థాన్ మార్కెట్లలో ఇప్పుడు కోలాహలం కనిపిస్తోంది. ఈ అత్యాధునిక ఆయుధాలన్నీ అమెరికా అఫ్గనిస్తాన్ నుంచి పోతూ పోతూ వదిలేసి పోయినవే కావడం విశేషం!. కరాచీ, లాహోర్, పెషావర్, గుజ్రన్‌వాలా.. పాకిస్థాన్ గన్మార్కెట్లలో అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ వెపన్స్ కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ ప్రముఖ మీడియాహౌజ్ కథనం ప్రకారం.. అక్కడి మార్కెట్లలో వీటి అమ్మకాలు తారాస్థాయిలో నడుస్తున్నాయి. ‘‘తాలిబన్లు మేమూ భాయి భాయిలం. వాళ్ల దగ్గరి నుంచి వీటిని కొనుగోలు చేయడాన్ని, మా దేశంలో పౌరులకు అమ్ముకోవడాన్ని మేం గర్వంగా భావిస్తున్నాం’’ అంటూ అక్కడి అమ్మకందారులు చెప్తున్నారు. అడ్వాన్స్డ్ పిస్టోల్స్, రైఫిల్స్, గ్రెనేడ్స్, నైట్ విజన్ గగూల్స్, బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లు, స్పై కెమెరాలు, నార్మల టేజర్ గన్స్, టేజర్ స్టిక్స్, ఇతరత్ర మారణాయుధాలు పాక్ గన్ మార్కెట్లలో జోరుగా అమ్ముడుపోతున్నాయి. ప్రతీకాత్మక చిత్రం తాలిబన్ల ఖండన.. అయితే ఈ కథనాలను తాలిబన్లు ఖండిస్తున్నారు. తాలిబన్(Islamic Emirate of Afghanistan) ప్రతినిధి బిలాల్ కరిమి పేరిట న్యూయార్క్ టైమ్స్‌లో తాజాగా ఓ కథనం ప్రచురితమైంది. ‘‘ఆ కథనాల్ని మేం ఖండిస్తున్నాం. ఆయుధాల విషయంలో మేమేం అంత నిర్లక్క్ష్యంగా లేము. అక్రమ రవాణా కాదుకదా.. కనీసం సింగిల్ బుల్లెట్‌ను మేం బయటవాళ్లకు అమ్ముకోలేదు’’ అని కరిమి తెలిపాడు. అమెరికన్లు వదిలేసిన వెళ్లిన ప్రతీ ఆయుధాన్ని, వస్తువుల్ని సీజ్ చేసి భద్రపరిచామని, ఆ ఆయుధాల్ని భవిష్యత్తులో తమ(తాలిబన్ల) సైన్యం అవసరాల కోసమే ఉపయోగిస్తామని కరిమి పేర్కొన్నాడు. అయినప్పటికీ అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపడతామని తాలిబన్ సంస్థ ప్రకటించింది. ప్రతీకాత్మక చిత్రం లూట్ కా మాల్! అయితే పాక్ వీధుల్లో అమ్ముడుపోతున్న ఆయుధాలు.. అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలే అని నిర్ధారణ అయ్యింది. అమెరికా భద్రతా బలగాల పహారా సాగినంత కాలం.. తాలిబన్లు-పాక్ సాయంతో కలిసి అమెరికా-నాటో బృందాలపై దాడులకు తెగపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ ఆయుధాల్ని ఎత్తుకెళ్లిపోయేవాళ్లు. ఈ తరుణంలో ఇప్పుడు వదిలేసి వెళ్లిన ఆయుధాల్ని అక్రమంగా తరలించడమో లేదంటే ఆదాయం కోసం అమ్ముకోవడమో తాలిబన్లు చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాలిబన్లు మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తుండగా.. పాక్ వ్యాపారులు మాత్రం అంతా పద్దతిగానే జరిగిందని చెప్తుండడం విశేషం. దీంతో దొడ్డిదారిన ఆ ఆయుధాలు తరలిపోయి ఉంటాయన్న కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సైన్యం ఉపసంహరణలో భాగంగా.. అఫ్గనిస్తాన్ బాగ్రమ్ ఎయిర్‌బేస్‌కు పవర్‌కట్ చేసి గప్‌చుప్‌గా వెళ్లిపోయాయి అమెరికా దళాలు. వెళ్తూ వెళ్తూ అఫ్గన్ గడ్డపై 83 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సంపత్తిని వదిలేశాయి. చదవండి: అలా చేయకండి.. అమెరికాకు తాలిబన్లు వార్నింగ్ -
అమెరికా సాయం అక్కర్లేదు!
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో పెట్రేగుతున్న ఐసిస్ సహా ఇతర ఉగ్ర గ్రూపుల అణచివేతకు అమెరికా సాయం కోరేదిలేదని తాలిబన్లు శనివారం స్పష్టం చేశారు. ఆగస్టులో అమెరికా అఫ్గాన్ నుంచి వైదొలిగిన అనంతరం తొలిసారి తాలిబన్లతో యూఎస్ శని, ఆదివారాల్లో దోహాలో చర్చలు జరపనుంది. ఈ సమయంలో తాలిబన్లు కీలక అంశంపై తమ వైఖరిని స్పష్టం చేశారు. అఫ్గాన్‌లో తిష్టవేసుకున్న ఉగ్రతండాలను కట్టడి చేయడం, ఆదేశంలో ఉండిపోయిన విదేశీయులను వారివారి దేశాలకు పంపడంపై చర్చలు ఉంటాయని ఇరువర్గాలు తెలిపాయి. వీటిలో విదేశీయుల తరలింపుపై తాలిబన్లు సానుకూలంగా ఉన్నారు. కానీ ఐసిస్ కట్టడికి అమెరికా సాయం కోరమని తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ చెప్పారు. తాజాగా అఫ్గాన్ మసీదులో ఐసిస్ జరిపిన ఆత్మాహుతిదాడిలో పలువురు మరణించిన సంగతి తెలిసిందే! అయితే వీరిని తాము స్వతంత్య్రంగా ఎదుర్కోగలమని సుహైల్ చెప్పారు. యూఎస్ సేనలు అమెరికాలో ఉన్నప్పడు కూడా అఫ్గాన్ షియా మైనారీ్టలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ దాడులు జరిపింది. తాలిబన్లు, అమెరికన్లకు ఐసిస్ వల్ల ప్రమాదం ఉన్నందున కలసికట్టుగా దీనిపై పోరాటం చేస్తారని విశ్లేషకులు భావించారు. గుర్తింపు కోసం కాదు తాలిబన్లతో జరిపే చర్చలు, వారు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించేందుకు ముందస్తు సన్నాహాలు కాదని అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు ఈచర్చలకు ముందు పాక్ మిలటరీ అధికారులతో అమెరికా డిప్యుటీ స్టేట్ సెక్రటరీ వెండీ షెర్మన్ ఇస్లామాబాద్‌లో సమావేశమయ్యారు. ఇందులో కూడా అఫ్గాన్ పరిణామాలనే చర్చించినట్లు తెలిసింది. అఫ్గాన్ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించాలని, అమెరికాలో నిలిపివేసిన అఫ్గాన్ నిధులను విడుదల చేయాలని పాక్ యూఎస్‌ను అరి్ధంచిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లేదంటే అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే తాలిబన్లు తమ ప్రభుత్వంలో మరిన్ని వర్గాలకు చోటివ్వాలని, మానవహక్కులు, మైనార్టీ హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పాక్ కోరింది. దేశంలో తమకు రక్షణ కరువైందని అఫ్గాన్ షియా పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా నుంచి అఫ్గాన్‌కు... తాలిబన్ల దాడికి వెరిచి భారత్‌కు పారిపోయివచి్చన అఫ్గాన్ పౌరుల్లో వందమందికి పైగా స్వదేశానికి పయనమయ్యారని అఫ్గాన్ ఎంబసీ వర్గాలు తెలిపాయి. కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది మంది అఫ్గాన్లు విదేశాలకు పారిపోయారు. ఇలా ఇండియా వచి్చనవారిలో పలువురు ప్రస్తుతం అఫ్గాన్ వెళ్లేందుకు ఇండియా నుంచి టెహ్రాన్ చేరుకున్నారని అధికారులు చెప్పారు. త్వరలో మరింతమంది అఫ్గాన్లు స్వదేశానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అఫ్గాన్ మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిని అమెరికా ఖండించింది. -
తాలిబన్లతో డీల్.. మెలిక పెట్టిన అమెరికా
US Talibans Face To Face Meeting: అమెరికా సైనిక దళాల ఉపసంహరణ వల్లే తాలిబన్ల దురాక్రమణకు మార్గం సుగమం అయ్యిందనే విమర్శ ఉంది. అంతేకాదు అఫ్గనిస్తాన్ నుంచి చాలా దేశాలకు వర్తకవాణిజ్యాలు నిలిచిపోవడంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే ప్రతికూల ప్రభావం పడింది. ఈ తరుణంలో తాలిబన్లతో చర్చలకు అమెరికా సిద్ధపడడం ఆసక్తికరంగా మారింది. ఆగష్టు 31తో ఆఫ్గన్ నుంచి బలగాల్ని ఉపసంహరించుకున్న అగ్రరాజ్యం.. ఆ తర్వాత అక్కడి పరిణామాల్లో తలదూర్చలేదు. కానీ, అక్కడి పౌర హక్కుల ఉల్లంఘనపై మాత్రం తాలిబన్లను నిలదీస్తూ వస్తోంది. మరోవైపు తాలిబన్ల చేష్టల్ని ఓ కంటకనిపెడుతున్న అమెరికా.. ఇప్పుడు ప్రత్యక్ష చర్చలకు సిద్ధపడుతుండడం విశేషం. ప్రపంచంతో వర్తకవాణిజ్యాల పునరుద్దరణ ప్రధాన ఎజెండాగా ముఖాముఖి చర్చలకు రెడీ అయ్యింది. ఈ చర్చల్లోనే తాలిబన్లకు పలు షరతులు విధించాలని భావిస్తోంది. ఆ ఒక్కటి తప్ప.. అయితే ఆశ్చర్యకరరీతిలో చర్చలకు సిద్ధపడిన బైడెన్ ప్రభుత్వం.. తాలిబన్లకు మాత్రం గట్టి ఝలకే ఇచ్చింది. ఇలా చర్చలు జరిపినంత మాత్రానా తాలిబన్లను అఫ్గనిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధులుగా గుర్తించబోమని (తాలిబన్ ప్రభుత్వంగా గుర్తించమని పరోక్షంగా) ప్రకటన విడుదల చేసింది. ‘‘తాలిబన్లు ఇప్పటికీ ఉగ్రవాద అనుబంధ సంస్థగానే ఉన్నారు. అమెరికాతో పాటు మిగిలిన అంతర్జాతీయ సమాజం నుంచి వాళ్లు(తాలిబన్లు) మారారనే నమ్మకం కలిగినప్పుడే ప్రభుత్వ గుర్తింపు అంశం పరిశీలిస్తాం’ అని అమెరికా తరపు ప్రతినిధి ఒకరు శుక్రవారం తెలిపారు. అమెరికా తరపున ప్రతినిధులు శనివారం నేరుగా తాలిబన్లతో సమావేశమై చర్చలు జరపబోతున్నారు. వాణిజ్య అంశాలతో పాటు ఎగుమతులు-దిగుమతుల కొనసాగింపు, సుంకాల విధింపు-సడలింపులు తదితర విషయాలపై చర్చించనున్నారు. వీటితో పాటే మానవ హక్కులు.. ముఖ్యంగా మహిళలు, పిల్లల హక్కుల్ని పరిరక్షించాలనే డిమాండ్‌ను సైతం తాలిబన్ల ముందు ఉంచాలని అమెరికా భావిస్తోందట. అంతేకాదు ఈ సంక్షోభ-విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దేశాలను, సహాయక బృందాలను అఫ్గనిస్తాన్‌లోకి అనుమతించాలని సైతం కోరనుంది. చదవండి: ప్రపంచ దేశాల ఆందోళన.. అఫ్గాన్‌పై మాస్కోలో సదస్సు -
మసీదులో మారణకాండ
కాబూల్: పశ్చిమ అఫ్గానిస్తాన్ కుందుజ్ ప్రావిన్సులోని గోజార్ ఇ సయీద్ అబాద్ మసీదులో శుక్రవారం సంభవించిన పేలుడులో 60మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు ప్రముఖ మీడియా సంస్థ అల్‌జజీరా వెల్లడించింది. అయితే కుందుజ్ ఆస్పత్రి అధికారి ఒకరు పేలుడులో 25మంది మరణించారని, 51మంది గాయపడ్డారని చెప్పారు. మరోవైపు అధికారిక బఖ్తార్ న్యూస్ ఏజెన్సీ ఈ పేలుళ్లలో 46మంది మరణించారని, 140మంది గాయపడ్డారని తెలిపింది. ఇవన్నీ ప్రాథమిక గణాంకాలేనని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. దేశ పాలనపగ్గాలు తాజాగా చేపట్టిన తాలిబన్లకు ఈ పేలుడు సవాలుగా మారింది. పేలుడులో మొత్తం 100 మంది మరణించడం లేదా గాయపడడం జరిగిందని కుందుజ్ ప్రావిన్స్ తాలిబన్ పోలీసు అధికారి ఒబైదా ప్రకటించారు. గాయపడినవారి కన్నా మరణించినవారే ఎక్కువగా ఉండొచ్చన్నారు. షియాల రక్షణకు తాలిబన్లు కట్టుబడిఉన్నారని భరోసా ఇచ్చారు. అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల చేతికి వచ్చాక జరిగిన పెద్దదాడిగా దీన్ని భావిస్తున్నారు. దాడిని షియాల మతపెద్ద అలిమి బల్ఖి ఖండించారు. తాలిబన్లు షియాలకు రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రార్ధనాస్థలాల రక్షణకు ఉంచిన ఆయుధాలను తాలిబన్లు తీసుకుపోయినందున, వీటిని రక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్లదేనన్నారు. ఐసిస్ హస్తం మసీదులో జరిగిన ఘోర పేలుడుకు కారకులెవరో తొలుత తెలియరాలేదు. అయితే పేలుడు జరిగింది షియా ముస్లింలకు చెందిన మసీదు కావడంతో ఐసిస్‌పైనే అందరికీ తొలుత అనుమానం వచ్చింది. ఇందుకు తగ్గట్లే తామే ఈ పేలుళ్లు జరిపామని ఐసిస్ అనుబంధ సంస్థ ఐసిస్– కే వారి మీడియా ఏజెన్సీ అమాక్ న్యూస్‌లో ప్రకటించింది. ఇదే అంశాన్ని ఎస్ఐటీఈ ఇంటిలిజెన్స్ గ్రూపు నిర్ధారించింది. షియా హజారాలను లక్ష్యంగా చేసుకొనే ఆత్మాహుతి దాడి చేసినట్లు ఐసిస్–కే టెలిగ్రామ్ ఛానెల్లో ప్రకటించుకుంది. గతంలో పలుమార్లు షియా మైనారీ్టలపై ఐసిస్ దాడులు చేసిన చరిత్ర ఉంది. అమెరికా సైన్యాలు వైదొలిగిన అనంతరం ఐసిస్ ఉగ్రవాదులు అఫ్గాన్‌లో దాడులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా షియాలపై ఐసిస్–కే యుద్ధాన్నే ప్రకటించింది. తాజాదాడులను ఐరాస ఖండించింది. పేలుడుపై తమ పత్య్రేక దళాలు దర్యాప్తు జరుపుతున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా చెప్పారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ ఆధారాలను సేకరిస్తున్నారు. ఒకప్పుడు కొన్నిప్రాంతాలకే పరిమితమైన ఐసిస్ దాడులు ఇప్పుడు పలు చోట్ల జరగడం తాలిబన్లతో పాటు అఫ్గాన్ పొరుగుదేశాలను కూడా కలవరపరుస్తోంది. -
ప్రపంచ దేశాల ఆందోళన.. అఫ్గాన్‌పై మాస్కోలో సదస్సు
మాస్కో: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ భూభాగం నుంచి ఉగ్రవాదం పెరిగిపోతుందని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ పరిణామాలపై చర్చించడానికి రష్యా ఈ నెల 20న ఒక అంతర్జాతీయ సదస్సుని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సదస్సుకి తాలిబన్లను కూడా ఆహ్వానిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రత్యేక ప్రతినిధి జమీర్ కబులోవ్ చెప్పినట్టుగా రష్యన్ న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి. తమ భూభాగంలోకి ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎక్కడ చొరబడతారోనన్న ఆందోళనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమాలి రఖ్‌మాన్‌తో ఫోన్లో మాట్లాడారు. మధ్య ఆసియాలో భద్రతా పరిస్థితులపై చర్చించారు. తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
తాలిబన్లను చర్చలకు ఆహ్వానించిన రష్యా
మాస్కో: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకుని.. పాలన ఆరంభించిన తాలిబన్లను చర్చలకు ఆహ్వానించింది రష్యా. అక్టోబర్ 20న మాస్కోలో తాలిబన్లతో చర్చలు జరపనున్నట్లు అఫ్గనిస్తాన్ రష్యా ప్రతినిధి ఒకరు గురువారం వెల్లడించారు. ప్రతినిధి జమీర్ కాబులోవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అక్టోబర్ 20 న రష్యా రాజధానిలో అఫ్గన్ అంశంపై చర్చించేందుకుగాను తాలిబాన్ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించాము’’ అని ప్రభుత్వ ఆధీనంలోని ఆర్ఐఏ నోవోస్టి వార్తా సంస్థకు తెలిపారు అయితే ఈ మాస్కో ఫార్మట్ చర్చలకు హాజరవుతున్న తాలిబన్ ప్రతినిధులు ఎవరనేదాని గురించి సమాచారం లేదు. తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆ దేశంలో తలెత్తిన మానవతా విపత్తును నివారించడానికి ఈ చర్చలు సాయం చేస్తాయని.. రష్యా ఈ విషయంలో అఫ్గన్‌కు సాయం చేస్తుందని కాబులోవ్ తెలిపారు. ప్రస్తుతం దీని గురించి చర్చిస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. (చదవండి: అఫ్గాన్ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు?) ఇటీవల సంవత్సరాలలో అఫ్గన్ ప్రభుత్వంతో శాంతికి మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తున్న వరుస చర్చల కోసం మాస్కో.. తాలిబాన్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చింది. అఫ్గన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఒక నెల ముందు అనగా జూలైలో కూడా తాలిబన్లు మాస్కోలో పర్యటించారు. అఫ్గనిస్తాన్‌లో తమ సైనికులను చంపడానికిగాను రష్యా తాలిబన్లకు బహుమతులను అందిస్తుందని అమెరికా ఆరోపించింది. అయితే మాస్కో వీటిని ఖండించింది. చదవండి: ఐరాసలో మాకూ చోటివ్వండి: తాలిబన్లు -
13 మంది హజారాలను తాలిబన్లు అన్యాయంగా చంపేశారు
కైరో: అఫ్గాన్‌లోని హజారా వర్గానికి చెందిన 13 మందిని తాలిబన్లు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. వీరిలో ఎక్కువమంది తాలిబన్లకు లొంగిపోయిన అఫ్గాన్ సైనికులని వెల్లడించింది. డేకుండి ప్రావిన్స్‌లోని కహోర్ గ్రామంలో ఆగస్ట్ 30వ తేదీన ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొంది. మృతుల్లో 11 మంది అఫ్గాన్ భద్రతా సిబ్బంది కాగా 17 ఏళ్ల బాలిక సహా ఇద్దరు పౌరులున్నట్లు తెలిపింది. ఈ వార్తలపై వివరణ కోరేందుకు అసోసియేటెడ్ ప్రెస్ ప్రతినిధి ఫోన్ ద్వారా యత్నించగా తాలిబన్లు స్పందించలేదు. ‘ఆగస్ట్ 14వ తేదీన డేకుండి ప్రావిన్స్ తాలిబన్ల హస్తగతమైంది. ఖిదిర్ జిల్లాలో 34 మంది సైనికులు తమ ఆయుధాలతో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆగస్ట్ 30న 300 మందితో కూడిన తాలిబన్ కాన్వాయ్ సైనికులున్న గ్రామానికి చేరుకుంది. కుటుంబాలతో పాటు కొందరు సైనికులు అక్కడి నుంచి వెళ్లిపో యేందుకు యత్నించగా తాలిబన్లు విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించారు. కాల్పుల్లో ఇద్దరు సైనికులతోపాటు, మసుమా అనే బాలిక, మరో వ్యక్తి చనిపోయారు. మాజీ సైనికుడొకరు జరిపిన కాల్పుల్లో ఒక తాలిబన్ ఫైటర్ చనిపోగా మరొకరు గాయపడ్డారు. అనంతరం, లొంగిపోయిన సైనికుల్లో 9 మందిని తాలిబన్లు సమీపంలోని నది వద్దకు తీసుకెళ్లి కాల్చి చంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధా రాలు మా వద్ద ఉన్నాయి’ అని ఆమ్నెస్టీ తెలిపింది. ఆమ్నెస్టీ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ మాట్లాడుతూ.. ‘హజారాలను దారుణంగా చంపడం తాలిబన్లు మారలేదనడానికి నిదర్శనం. అఫ్గాన్‌లో గతంలో అధికారంలో ఉండగా పాల్పడిన అకృత్యాలను తిరిగి సాగిస్తున్నారు’ అని పేర్కొన్నారు. -
అఫ్గాన్ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు?
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాంతం మొత్తంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. గతేడాది యూఎస్‌కు తాలిబన్లకు మధ్య దోహాలో జరిగిన డీల్‌లోని పలు అంశాల్లో భారత్‌ను పరిగణనలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావడం, అఫ్గాన్ గడ్డపై ఎలాంటి ఉగ్రమూకలు నివాసం ఏర్పరుచుకోకుండా జాగ్రత్త వహించడమే ప్రస్తుతానికి ఇండియాకు కావాల్సిన అంశాలన్నారు. ఇండో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ సమావేశంలో ఆయన ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. అఫ్గాన్‌లోని కొత్త ప్రభుత్వాన్ని గుర్తించడంలో ఇండియాకు ఎలాంటి తొందర లేదన్నారు. యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్‌తో ఏర్పాటైన క్వాడ్ గ్రూప్ ఏదేశానికి వ్యతిరేకం కాదని, దురుద్దేశాలతో ఏర్పాటైన కూటమి కాదని స్పష్టం చేశారు. అఫ్గాన్ గడ్డను ఉగ్ర అడ్డాగా మార్చకూడదన్న అంశంతో పాటు పలు అంశాల్లో ఇండియా, అమెరికాకు సామ్యాలున్నాయని చెప్పారు. అయితే దోహా డీల్ సందర్భంగా తమను అనేక అంశాల్లో పరిగణనలోకి తీసుకోలేదని ఎత్తిపొడిచారు. అలాంటి ఒప్పందాలు విసృతమైనవిగా ఉండాలని, కానీ ఏం జరుగుతుందో అంతా చూస్తున్నారని పరోక్షంగా అమెరికాను దెప్పిపొడిచారు. అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడుతుందా? మైనార్టీల హక్కులకు రక్షణ కలుగుతుందా? అని ప్రశ్నించారు. అంత రహస్యమెందుకు? దోహాలో యూఎస్, తాలిబన్లకు మధ్య అఫ్గాన్‌పై ఒప్పందం కుదరింది. దీని ప్రకారం యూఎస్ దళాలు అఫ్గాన్ నుంచి వైదొలుగుతాయి, తాలిబన్లు హింసను వీడతారు. కానీ పాలన చేతికొచ్చాక తాలిబన్ల ప్రవర్తన ప్రశ్నార్ధకంగా మారింది. దీన్నే జైశంకర్ ప్రస్తావించారు. కీలకమైన అంశాలపై నిర్ణయాలకు ముందు ఆచితూచి వ్యవహరించాలని, కానీ సదరు డీల్‌లో ఏముందో పూర్తిగా అంతర్జాతీయ సమాజంలో ఎవరికీ తెలియదని చెప్పారు. అఫ్గాన్‌లో ఉగ్ర తండాలకు అభయం చిక్కకూడదన్న అంశాన్ని జోబైడెన్‌తో ప్రధాని ప్రస్తావించారని తెలిపారు. అఫ్గాన్‌లో పరిణామాల ప్రభావం దగ్గరగా ఉన్నందున తమపై ముందుగా, అధికంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే సరిహద్దు తీవ్రవాదానికి తాము బాధితులమని గుర్తు చేశారు. పాక్‌కు సంయుక్త వార్నింగ్ ఇవ్వడంపై అమెరికానే తేల్చుకోవాలన్నారు. క్వాడ్‌ను నెగిటివ్ ఉద్దేశంతో ఏర్పరచలేదని, చైనాతో తమ దేశాలన్నింటికీ స్థిరమైన సంబంధాలే ఉన్నాయని గుర్తు చేశారు. చైనా ఎదుగుదల ప్రపంచ నియతిపై మౌలిక ప్రభావం చూపగలదని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఏదేశానికాదేశం తమ స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా చైనాతో వ్యవహరిస్తుందన్నారు. -
తాలిబన్ల అరాచకం
-
భారత్‌కు లేఖ రాసిన తాలిబన్లు
-
Anand Mahindra: తాలిబన్ల ఇలాకాలో ఆ ఛాన్స్ వస్తేనా..
కఠిన ఆంక్షలు, నిషేధాజ్క్షలతో ఒకప్పుడు తాలిబన్లు అఫ్గన్లకు ప్రత్యక్ష నరకం చూపించారు. మళ్లీ వాళ్ల పాలనలో భయంభయంగానే గడపాల్సి వస్తోంది అక్కడి ప్రజలు. పైకి అంతర్జాతీయ సమాజానికి మాత్రం ఒకలా సందేశం ఇస్తూ.. అంతర్గతంగా అసలు రంగును బయటపెట్టుకుంటున్నారు తాలిబన్లు ఇప్పుడు. మాట కాదన్నా.. ఎదురు తిరిగినా ఉరి తీసి వేలాడేస్తున్నారు. తాజాగా మగాళ్లు గడ్డం గీసుకోవడం నేరమంటూ ఫత్వా జారీ చేసిన తాలిబన్లు, బార్బర్లు, సెలూన్ నిర్వాహకుల జీవనోపాధిపై పెద్దదెబ్బే వేశారు. ఈ నేపథ్యంలో కొందరు దుకాణాలు మూసేసుకుంటుండగా.. తెగిస్తున్న కొందరికి చావు బెదిరింపులు అందుతున్నాయట. అయితే సమకాలీన అంశాలపై నిత్యం స్పందించే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. ఈ సీరియస్ పరిణామంపై తనదైన శైలిలో ఓ ట్విటర్ పోల్ నిర్వహించారు. ఒకవేళ మీరు గనుక అఫ్గనిస్తాన్‌లో ఓ షేవింగ్ రేజర్ కంపెనీ సేల్స్ పర్సన్ అయ్యి ఉంటే.. ప్రస్తుత పరిణామాలలో ఏం చేస్తారు? అంటూ నాలుగు ఆఫ్షన్లు ఇచ్చారాయన. ఒకటి.. బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఎయిర్‌పోర్ట్‌కు తిరుగు టపా కట్టడం, రెండు.. ఆ ఆదేశాల్ని మార్చేలా లాబీయింగ్ చేయడం, మూడు.. గడ్డం సంరక్షణ కోసం కొత్త ప్రొడక్ట్‌ను కనుగొనడం, నాలుగు.. మీ ముందు ఇంకేమైనా మార్గం ఉందా? అని అడిగారు. అఫ్కోర్స్.. దానికి నెటిజన్స్ కూడా అంతే ఫన్నీగా రిప్లైలు ఇస్తున్నారనుకోండి. Imagine you’re a salesperson in Afghanistan for a Shaving Razor company, which of the following options would you pursue? 1) Pack your bags, head for the Airport 2) Lobby for a modification in this order 3) Invent a disruptive new product for beard-care 4) Other? https://t.co/MVIO9wUShu — anand mahindra (@anandmahindra) September 27, 2021 I will introduce new range of Beard care and essential… like Gillett did from sword to razor 🪒 — Saurabh Jain (@mrsaurabhj) September 27, 2021 Color for Beard -- time for Godrej to put up Hair Dye color factory :-) — Equiideas (@Equiideas09) September 27, 2021 Will take over and start manufacturer of gun 😃 — InduKalpa (ইন্দুকল্প) (@indukalp) September 27, 2021 Here we have options to choose But their they don't have any option They only have rules to follow 😜 — Sumit Koushik (@sumitkoushik1) September 27, 2021 ‘Others’ option includes hand cutting, limbs cutting & death by hanging from crane. So choose your option carefully if opting for OTHERS. — Devesh Dhingra (@Dev_Dh14) September 27, 2021 ఇదిలా ఉంటే అఫ్గన్ హెల్మండ్ ప్రావిన్స్‌లో మగవాళ్లు స్టైల్‌గా క్రాఫ్ చేయించుకోవడం, గడ్డం తీసేయడాన్ని నిషేధిస్తూ ఫత్వా జారీ చేసింది తాలిబన్ సంస్థ. అంతేకాదు ఇస్లామిక్ ఓరియెంటేషన్ మంత్రిత్వ శాఖ సెలూన్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి.. కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు ఆ ఆదేశాల్ని ఎదురు ప్రశ్నించడానికి వీల్లేదని కూడా పేర్కొంది. ఇక ఆ ఆదేశాల్లో సెలూన్లలో పాటల్ని ప్లే చేయకూడదనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: మరో బాంబు పేల్చిన తాలిబన్లు -
ఆఫ్గనిస్థాన్ లో మళ్లీ అరాచక పాలన
-
ఐరాసలో మాకూ చోటివ్వండి: తాలిబన్లు
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ దేశాల అంతర్జాతీయ కూటమి అయిన ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో తామకూ భాగస్వామ్య పాత్ర పోషించే అవకాశమివ్వాలని తాలిబన్లు విన్నవించుకున్నారు. తమ శాశ్వత ప్రతినిధి, దోహాకు చెందిన సుహైల్ షాహీన్ ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించేందుకు అనుమతినివ్వాలని తాలిబన్లు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌కు తాలిబన్లు లేఖ రాశారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ నేతృత్వంలోని గత సర్కార్ కూలిపోయిందని, ఇక మీదట ఐరాసలో అఫ్గాన్ శాశ్వత ప్రతినిధిగా సుహైల్‌ను కొనసాగించాలని ఆ దేశ విదేశాంగ శాఖ నుంచి 20న లేఖ వచ్చిందని ఐరాసలో ఉన్నతాధికారి ఫర్హాన్ హక్ వెల్లడించారు. తమ ప్రతినిధి బృందం ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు, అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్‌కు మాట్లాడే అవకాశమివ్వాలని తాలిబన్లు కోరినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఘనీ ప్రభుత్వ హయాంలో ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా నియమించబడిన గ్రామ్ ఇసాక్జాయ్ ఇంకా ఐరాసలో కొనసాగుతున్న నేపథ్యంలో తాలిబన్ల ప్రతిపాదన కొత్త సమస్య తెచ్చిపెట్టేలా ఉంది. సర్వ సభ్య సమావేశంలో 193 సభ్య దేశాలకు ఈ విషయం తెలియజేశామని, 27న ‘అఫ్గాన్’ సీటు వద్ద ఎవరిని ప్రతినిధిగా సమావేశాల్లో కూర్చోబెట్టాలో ఇంకా నిర్ణయించలేదని ఐరాస ఉన్నతాధికారి ఫర్హాన్ చెప్పారు. తాలిబన్లను బహిష్కరించకండి: ఖతార్ అఫ్గాన్ సంక్షోభంలో మధ్యవర్తి పాత్ర పోషించిన ఖతార్ ఈ విషయంలో స్పందించింది. ‘ అఫ్గాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగాలంటే తాలిబన్ల ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి. వారిని బహిష్కరించకూడదు. అఫ్గాన్ తాత్కాలిక ప్రభుత్వం తరఫున శాశ్వత ప్రతినిధిని ఈ సమావేశాల్లో అనుమతించాలి’ అని న్యూయార్క్‌లో సర్వ సభ్య సమావేశంలో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన టర్కీ అధ్యక్షుడు 74 ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న కశ్మీర్ అంశాన్ని భారత్–పాక్‌లు శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐరాస వేదికగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగన్ బుధవారం మరోసారి లేవనెత్తారు. అయితే, గతంలోనూ ఎర్డోగన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. -
తాలిబన్ ప్రభుత్వ పెద్దలతో... చైనా, రష్యా, పాక్ మంతనాలు
బీజింగ్: చైనా, రష్యా, పాకిస్తాన్‌కు చెందిన ప్రత్యేక రాయబారులు అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వ అత్యున్నత ప్రతినిధులతో సమావేశమయ్యారు. అఫ్గాన్ రాజకీయ ప్రముఖులు హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లాతోనూ వారు భేటీ అయ్యారు. రాజధాని కాబూల్‌లో ఈ సమావేశాలు జరిగినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, ఉగ్రవాదంపై పోరాటం, ప్రజల పరిస్థితిపై చర్చ జరిగిందని తెలిపారు. మూడు దేశాల ప్రత్యేక రాయబారులు ఈ నెల 21, 22న అఫ్గాన్‌లో పర్యటించారని, ప్రధానమంత్రి మొహమ్మద్ హసన్ అఖుంద్‌తోపాటు పలువురు మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో చర్చలు జరిపారని పేర్కొన్నారు. ‘అఫ్గాన్‌లోని తాజా పరిణామాలపై మూడు దేశాల ప్రత్యేక రాయబారులతో మా అభిప్రాయాలను పంచుకున్నాం. మా దేశంలో శాంతి, స్థిరత్వం, సమ్మిళిత ప్రభుత్వం కోసం ఇరుగుపొరుగు దేశాలు పొషిస్తున్న పాత్రను స్వాగతిస్తున్నాం’’అని అఫ్గాన్ నాయకుడు అబ్దుల్లా అబ్దుల్లా ట్వీట్ చేశారు. అఫ్గాన్‌ను గత నెలలో తాలిబన్లు మళ్లీ ఆక్రమించిన తర్వాత హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లాను విదేశీ రాయబారులు కలవడం ఇదే మొదటిసారి. -
మూడే రోజులు... ఎన్నో అంశాలు
కీలక సందర్భంలో జరుగుతున్న కీలకమైన సమావేశాలు. అత్యంత కీలకమైన పర్యటన. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటన సందర్భాన్ని ఒక్క ముక్కలో వర్ణించాలంటే – అంతే. రానున్న మూడు రోజుల్లో అమెరికా అనేక ప్రధానమైన ఘట్టాలకు వేదికగా నిలవనుంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల సదస్సు, ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వప్రతినిధి సభ సమావేశం, వివిధ దేశాల అంతర్జాతీయ నాయకులతో మోదీ సంభాషణలు, చర్చలతో అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షించనుంది. కోవిడ్ మహ మ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టాక పెద్దయెత్తున అంతర్జాతీయ నేతలు భౌతికంగా ఒకచోట చేరి, సంభాషించడం ఇదే తొలిసారి. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యం లాంటి తాజా పరిణామాలతో పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు లాంటివి ఈ మూడు రోజుల పర్యటనను భారత్‌కు ప్రధానమైనవిగా మార్చాయి. ఇటు బైడెన్‌తో వ్యక్తిగత భేటీలో, అటు ఐరాస సమావేశంలో దేశ ప్రయోజనాలను సమున్నతంగా నిలబెట్టడానికి మోదీ బృందం కసరత్తు చేసుకొని మరీ వెళుతోంది. గడచిన కొన్ని నెలలుగా వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ ప్రాధాన్యమున్న సమావేశాలు అనేకం వర్చ్యువల్‌గా సాగుతూనే ఉన్నాయి. ఇదే ‘క్వాడ్’ దేశాల సమావేశం ఈ మార్చిలో ఆన్లైన్ లోనూ సాగింది. ఈ నెల 17న షాంఘై సహకార మండలి సమావేశమూ జరిగింది. అంతకంతకూ పెద్దదవుతున్న ఉగ్రవాద భూతం గురించి అందులోనూ భారత్ లేవనెత్తింది. అయితే, ఈసారి భౌతిక సమావేశంలో దాన్ని మరింత బలంగా అందరి ముందుకూ తీసుకురానుంది. గత క్వాడ్ సమావేశంలో ప్రస్తావించిన అంశాలను ముందుకు తీసుకెళ్ళే చొరవ ఇప్పుడు మనదే. పేద దేశాలను కోవిడ్ టీకాలతో ఆదుకొనే అంశానికి నిర్దిష్టమైన చర్యల అజెండా ఖరారు కానుంది. ఈ క్రమంలో ఇండో–పసిఫిక్, అఫ్గాన్ సమస్యలను పరిశీలిస్తూనే, చైనాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయవచ్చు. మరోపక్క యాపిల్ సహా అమెరికాలోని ప్రసిద్ధ సంస్థల సీఈఓలతోనూ మోదీ సమావేశ మవుతున్నారు. భారత, అమెరికాల మధ్య బంధాన్ని పటిష్ఠం చేయడం ఆయన ముందున్న సవాలు. నిజానికి, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలసి ‘హౌడీ మోడీ’ సభలో పాల్గొని, మోదీ ప్రసంగించారు. మోదీ ప్రాచుర్యం ఎన్నికల్లో తనకు కలిసొస్తుందని ట్రంప్ ఆశ పడ్డారు కూడా! తీరా ట్రంప్‌పై బైడెన్ విజయం సాధించారు. ఆ తరువాత అమెరికాలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. భారత–అమెరికా ద్వైపాక్షిక సంబం ధాలపై బైడెన్‌తో మోదీ లోతుగా చర్చించనున్నారు. డెబ్భై రెండేళ్ళ క్రితం 1949లోనే రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య మొదలైన ద్వైపాక్షిక సంబంధాలకు ఇది కీలకమైన కొనసాగింపు కావాల న్నది భారత ఆకాంక్ష. అమెరికా తొలి మహిళా వైస్–ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌ను మోదీ కలుసు కోనున్నారు. ఇక, ఐరాస సర్వప్రతినిధి సభ 76వ సమావేశం సోమవారమే న్యూయార్క్‌లో ఆరం భమైంది. ఇది కూడా కరోనా అనంతర ప్రపంచంలో ఐరాస ప్రతినిధులందరూ పాల్గొంటున్న తొలి సమావేశాలు. రానున్న నవంబర్‌లో గ్లాస్గోలో కీలకమైన ‘ఐరాస వాతావరణ మార్పు సదస్సు’ (సీఓపీ 26) జరగాల్సి ఉంది. దానికి ముందస్తు సన్నాహంగా ఈ తాజా సమావేశం వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి అంశాలపై దృష్టి పెడుతోంది. ఇందులోనూ భారత్‌ది ప్రధాన భూమికే. అలాగే, మానవీయ సంక్షోభాన్ని నివారించడం కోసం అఫ్గాన్‌లోని కొత్త తాలిబన్ ప్రభు త్వంతో వ్యవహరించాల్సిన తీరుపై ఐరాస ఇచ్చిన పిలుపునకు వివిధ దేశాలు స్పందించనున్నాయి. తాలిబన్ల ద్వారా తన పబ్బం గడుపుకోవాలనుకుంటున్న పాకిస్తాన్ దురాలోచనకు అంతర్జాతీయ మద్దతుతో గండి కొట్టడం ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. అమెరికాను మంచి చేసుకుంటూనే, అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకోవడం అవసరమైన ఈ పర్యటన ప్రాధాన్యం మన సర్కారుకు తెలుసు. అందుకే మోదీ సర్కారు టెలికమ్ రంగంలో అంతర్జాతీయ సంస్థలకు ఎదురైన ఇక్కట్ల అంశంపై అర్జెంటుగా దృష్టిపెట్టింది. మూడు ప్రైవేటు టెలికమ్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా సుమారు రూ. 2 లక్షల కోట్ల మేర ఇటీవల కేంద్రం భారీ రాయితీలివ్వడం ఈ అమెరికా పర్యటనలో మార్కుల కోసమేనని పరిశీలకుల వాదన. అంతర్జాతీయ కోవిడ్ నివారణ చర్యలూ చర్చకు రానున్న నేపథ్యంలో పర్యటనకు రెండు రోజుల ముందు భారత్ మళ్ళీ టీకాల ఎగుమతిని ప్రకటించడం గమనార్హం. ప్రపంచ దేశాలతో ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా ఈ అక్టోబర్ నుంచి టీకాల ఎగుమతిని పునఃప్రారంభిస్తున్నట్టు భారత్ తెలిపింది. 2019 సెప్టెంబర్ అమెరికా పర్యటనలో ‘అబ్కీ బార్... ట్రంప్ సర్కార్’ అంటూ ట్రంప్‌ను గెలిపించాలంటూ ప్రవాసు లకు మోదీ పిలుపునిచ్చారు. సహజంగానే ఆ మాట డెమోక్రటిక్ పార్టీ యంత్రాంగానికి రుచించ లేదు. బైడెన్ సారథ్యంలోని డెమోక్రటిక్ ప్రభుత్వం మన జమ్మూకశ్మీర్‌లోని మానవహక్కుల లాంటి అంశాలపై గట్టిగానే గొంతు విప్పుతూ వస్తోంది. ఇప్పుడు డెమోక్రాట్ సర్కారుకు దగ్గరవడానికి మనం గట్టి ప్రయత్నమే చేస్తున్నాం. ఈ మూడు రోజుల పర్యటన అందుకు బలమైన పునాది వేసే సూచనలున్నాయి. అమెరికాతో దోస్తీతో ఉపఖండంలో చైనాకు చెక్ పెడుతూనే, అమెరికన్ మూసలో ఇరుక్కుపోకుండా భారత ప్రయోజనాలను కాపాడుకోవడమే ఇప్పుడు కీలకం. ఈ సమన్వయ, సమ తూక దౌత్యవిన్యాసమే ఇప్పుడు మోదీ బృందానికి ఉన్న పెనుసవాలు. -
Afghanistan: అఖుండ్జాదా హతం.. బందీగా బరాదర్?!
రెండు దశాబ్దాల నిరీక్షణ అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే ఎవరైనా ప్రజల ముందు ప్రత్యక్షమవుతారు. కానీ అఫ్గాన్‌లో తాలిబన్ల అగ్రనాయకత్వం మాత్రం దేశం స్వాధీనమైనా బయటకు కనిపించకుండా రహస్యంగానే ఉంటోంది. ఇది వారి ప్రణాళికలో భాగమా? లేక దేశం వశమయ్యాక పరోక్ష శక్తులు తాలిబన్లను దెబ్బతీశాయా? అదే నిజమైతే తాలిబన్ అధినేతలు ఇకపై కనిపించరా? హక్కానీ నెట్వర్క్ చేతుల మీదుగా అఫ్గాన్‌ను పాక్ పాలిస్తుందా? అనే అంతుచిక్కని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వీటికి సమాధానాల కోసం అన్వేషిస్తున్న పాశ్చాత్య మీడియా తాజాగా విడుదల చేస్తున్న కథనాలపై అనుమానాలు నిజమవుతున్నాయనే చెబుతున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడం, తాలిబన్లు అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. దేశం స్వాధీనం కాగానే తాలిబన్లు తమ అగ్రనేతలతో కూడిన ప్రభుత్వాన్ని ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అఫ్గాన్‌లో పాగా వేసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రకటనకు తాలిబన్లు చాలా సమయం తీసుకున్నారు. చివరకు మల్లగుల్లాల అనంతరం ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించారు. అయితే ఇందులో తాలిబన్లకు కాకుండా హక్కానీ నెట్వర్క్ నేతలకు పెద్దపీట వేయడం జరిగింది. దీంతో అఫ్గాన్ అంతర్గత పరిణామాలపై ప్రపంచ దేశాలు మరింత శ్రద్ధ పెట్టాయి. సదరు తాత్కాలిక ప్రభుత్వాన్ని అనేక దేశాలు గుర్తించలేదు. ఒకపక్క ఇంత హడావుడి జరుగుతున్నా, తాలిబన్ అధినాయకుడు హైబతుల్లా అఖుండ్జాదా మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. నిజానికి ఆయన నాయకత్వంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనుకున్నారు. కానిపక్షంలో యూఎస్‌తో శాంతి చర్చల్లో కీలకపాత్ర పోషించిన బరాదర్ ప్రధాని అవుతాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పెద్దగా గుర్తింపులేని ముల్లా హసన్‌ను ప్రధానిగా ప్రకటించారు. దీంతో అసలు తాలిబన్ నేతలకు ఏమైందన్న ప్రశ్నలు ఉదయించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ద స్పెక్టేటర్ అనే పాశ్చాత్య మీడియాలో వెలువడిన కథనాలు కలకలం సృష్టిస్తున్నాయి. బరాదర్‌ను బందీ చేసి ఉంటారని, అఖుండ్జాదా చనిపోయి ఉంటారని ఈ కథనం పేర్కొంది. గతంలో గార్డియన్ సైతం ఇలాంటి అనుమానాలనే వ్యక్తం చేసింది. కాబూల్ గొడవే కారణమా? ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కాబూల్ అధ్యక్ష భవనంలో హక్కానీలకు, తాలిబన్లకు మధ్య గొడవ జరిగిందని, ఈ గొడవలో బరాదర్ తీవ్రంగా గాయపడ్డాడని కథనాలు వచ్చాయి. కానీ తాను బాగానే ఉన్నానంటూ బరాదర్ ఒక ఆడియో మెసేజ్ విడుదల చేశాడు. అనంతరం కొందరితో కలిసి ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. అయితే ఈ వీడియో చూస్తే అందులో బరాదర్‌ను బందీగా ఉంచినట్లు కనిపిస్తోందని మీడియా వర్గాలు అనుమానిస్తున్నాయి. సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు కోసం యత్నించడం, పంజ్‌షీర్‌పై శాంతియుత పరిష్కారాన్ని కోరడం వంటి బరాదర్ చర్యలు నచ్చని హక్కానీ నెట్వర్క్ ఆయనపై దాడి చేసి అనంతరం బంధించిందని కథనాలు వచ్చాయి. అదేవిధంగా తాలిబన్ అగ్రనేత అఖుండ్‌జాదాను హతమార్చిఉండొచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. లేదంటే వీరిద్దరూ ఈపాటికి బయటి ప్రపంచానికి కనిపించేవారని, హక్కానీ నెట్వర్క్ వీరిని మాయం చేసిందని చాలామంది భావిస్తున్నట్లు స్పెక్టేటర్ కథనం పేర్కొంది. గతంలో ముల్లా ఒమర్ 2013లో మరణిస్తే 2015వరకు బయటకు చెప్పని వైనాన్ని గుర్తు చేసింది. ఇదంతా పాక్ పరోక్షంగా ఆడిస్తున్న నాటకంగా విశ్లేషకులు భావిస్తున్నట్లు తెలిపింది. తాలిబన్ల కన్నా తమకు అనుకూల హక్కానీ నెట్వర్క్ నేతల చేతిలో అఫ్గాన్ ప్రభుత్వం ఉండడం పాక్‌కు కావాలని, అందుకే ప్రభుత్వ ఏర్పాటు ప్రకటనకు ముందు ఐఎస్ఐ చీఫ్ అఫ్గాన్‌కు వచ్చారని గుర్తు చేసింది. పాక్ కుయుక్తులు అర్థం చేసుకోకుండా తాలిబన్లు గుడ్డిగా నమ్మారని గత ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అమ్రుల్లా చాలాసార్లు విమర్శించారు. తాజా కథనాలు చూస్తే అదే నిజమైందని, పాక్ చేతికి అఫ్గాన్ పాలనా పగ్గాలు పరోక్షంగా వచ్చాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
Afghanistan: మహిళా సిబ్బంది ఇళ్ల వద్దే ఉండాలి
కాబూల్: అఫ్గనిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు మునుపటి నిరంకుశ విధానాలను ఒక్కటొక్కటిగా తెరపైకి తెస్తున్నారు. రెండు రోజుల క్రితం మహిళా వ్యవహారాల శాఖను మూసేసిన తాలిబన్లు.. తాజాగా రాజధాని కాబూల్ పాలక సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఇళ్ల వద్దనే ఉండిపోవాలని హుకుం జారీ చేశారు. తాత్కాలిక మేయర్ హమ్దుల్లా నమోనీ ఆదివారం తన మొట్టమొదటి మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘మహిళా సిబ్బందిని ప్రస్తుతానికి ఇళ్ల వద్దే ఉండిపోవాలని కోరాము. మరో ప్రత్యామ్నాయం లేనందున డిజైన్, ఇంజినీరింగ్ వంటి విభాగాలతోపాటు మహిళల టాయిలెట్ల వద్ద పనిచేసే వారిని మాత్రం విధులకు హాజరు కావాలని కోరాం’ అని అన్నారు. అయితే, మొత్తం సిబ్బందిలో ఎందరిని ఇళ్లకు పరిమితం చేసిందీ ఆయన వెల్లడించలేదు. కాబూల్ నగర పాలక సంస్థలో సుమారు 3 వేల మంది పనిచేస్తుండగా అందులో వెయ్యి మంది వరకు మహిళలున్నట్లు అంచనా. కాగా, తాలిబన్ల నిర్ణయంపై ఉద్యోగినులు కాబూల్‌లో ఆదివారం నిరసన తెలిపారు. తమ హక్కులను తాలిబన్లు లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు స్వేచ్ఛ లేని సమాజం మృత సమాజంతో సమానమన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాయబార కార్యాలయాలు, నేతల ప్రైవేట్ నివాసాల వద్ద ఉన్న భద్రతా వలయాలను తొలగిస్తున్నట్లు మేయర్ హమ్దుల్లా తెలిపారు. కాబూల్‌లో పౌరుల రక్షణకు తమదే బాధ్యతని చెప్పుకునేందుకు, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, మద్దతు చూరగొనేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. చదవండి: కాబూల్ ఆత్మాహుతి బాంబర్ భారత్ అప్పగించిన వ్యక్తి అఫ్గన్ నిజమైన సంస్కృతి ఇదే.. ‘నా దుస్తుల జోలికి రావొద్దు’ -
తాలిబన్లతో చర్చిస్తున్నా: పాక్ ప్రధాని ఇమ్రాన్
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రభుత్వం ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఇందుకోసం తాలిబన్లతో చర్చలు ప్రారంభించానని తెలిపారు. తజకీలు, హజారాలు, ఉజ్బెక్‌లకు ప్రభుత్వంలో వాటా ఇవ్వాలన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. అయితే, చర్చల వివరాలను ఆయన బయటపెట్టలేదు. చదవండి: లాటరీ ద్వారానే హెచ్–1బీ వీసాలు ప్రజల హక్కులను గౌరవం లభించేలా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని తాలిబన్లకు ఇమ్రాన్ హితవు పలికారు. అఫ్గాన్ గడ్డ మరోసారి ఉగ్రవాదులకు అడ్డాగా మారొద్దని చెప్పారు. అఫ్గానిస్తాన్‌లోని కొత్త ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా పాకిస్తాన్ చొరవ చూపాలంటూ షాంఘై కో–అపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సభ్య దేశాలు కోరిన మరుసటి రోజే ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రకటన చేయడం విశేషం. తాలిబన్ల ప్రభుత్వ మంత్రివర్గంలోని 33 మందిలో తజకీలు, మహిళలకు ప్రాతినిథ్యం దక్కకపోవటం గమనార్హం. చదవండి: అమెరికాపై ఫ్రాన్స్ ఆగ్రహం -
అఫ్గాన్ లో ఆకలి కేకలు
-
తాలిబన్ల తలపట్లు
ఇల్లు అలకగానే పండుగ కాదు, ముందుంది మొసళ్ల పండుగ... ఇలాంటి సామెతలన్నీ తాలిబన్లకు వర్తించేలా పరిస్థితులు మారుతున్నాయి. అఫ్గాన్‌ను స్వా«దీనం చేసుకున్న ఆనందం ఆవిరవడానికి తాలిబన్లకు ఎక్కువ సమయం పట్టడం లేదు. తాత్కాలిక ప్రభుత్వంలో వివిధవర్గాలకు ప్రాతినిధ్యం వహించే నేతల మధ్య సయోధ్య కరువవడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అఫ్గాన్‌ను అమెరికా సైన్యాలు వదిలిపోవడంతో అలవోకగా స్వాదీనం చేసుకున్న తాలిబన్లు.. అది తమ ఘనవిజయంగా భావించారు. కానీ దేశానికి ఆధిపత్యం వహించే విషయంలో అగ్రనేతల మధ్య ఆరంభమైన కుమ్ములాటలు అఫ్గాన్ స్వాధీన విజయాన్ని ఆవిరి చేస్తున్నాయి. నిజానికి బయటనుంచి చూసేవారికి తాలిబన్లంతా ఒకటేనని, వారి సిద్ధాంతాల్లో తేడాలుండవని అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. అన్ని పారీ్టల్లాగానే తాలిబన్లలో కూడా వర్గాలు, గ్రూపులు, అభిప్రాయభేదాలు, కుమ్ములాటలు బోలెడున్నాయని తాలిబన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు అజ్ఞాతంలో బతుకుతూ అమెరికాతో యుద్దం చేయాల్సిరావడం వల్ల ఈ వర్గాలు, భేదాభిప్రాయాలు బయటపడలేదు. కానీ ఎప్పుడైతే దేశం స్వాదీనమై పాలనా పగ్గాలు చేతికి వచ్చాయో వీరిలో విభేదాలు ముదురుతున్నాయి. ఉమ్మడి శత్రువు మొఖం చాటేయగానే తాలిబన్లలో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. ఈ మంటలు ముదిరి సోమవారం రెండువర్గాల మధ్య అధ్యక్ష భవనంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో తాలిబన్ అగ్రనేత, సహవ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ మరణించాడని పుకార్లు షికారు చేశాయి. కానీ తాను బతికే ఉన్నానని బరాదర్ ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అయినా సరే తన పరిస్థితిపై అయోమయం నెలకొంది. (చదవండి: ప్రభుత్వ ఏర్పాటుతో వేర్పాటు బీజాలు అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనగానే బరాదర్ నాయకుడిగా ఉంటారని ఎక్కువమంది భావించారు. అమెరికాతో చర్చలు జరిపి, వారి సేనలు వెనక్కుమరలిపోయేలా చేయడంలో బరాదర్ కీలకపాత్ర పోషించాడు. దీనికితోడు అతను ముల్లాఒమర్కు సన్నిహితుడు. ఖతార్‌తో తనకు సత్సంబంధాలున్నాయి. అందుకే సహజంగా బరాదరే ప్రధాని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అఖుండ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయని అఫ్గాన్ పరిణామాల విశ్లేషకుడు నైమతుల్లా ఇబ్రహిమి అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వంలో కాందహార్‌కు చెందిన పాతతరం తాలిబన్లతో పాటు అల్‌కాయిదా, పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలున్న హక్కానీలకు పెద్దపీట దక్కింది. ఇరాన్ అండ ఉన్న పశ్చిమ తాలిబన్ గ్రూపునకు అసలు ప్రాధాన్యమే దక్కలేదు. గతంలో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాందహార్ గ్రూపుదే ప్రభుత్వంలో ఆధిపత్యం ఉండేది. కానీ తాజా ప్రభుత్వంలో హక్కానీలకు ప్రాధాన్యత పెరిగింది. ఐఎస్ఐ అండదండలే హక్కానీల బలం పెరిగేందుకు కారణమయ్యాయని నైమతుల్లా చెప్పారు. హక్కానీల నేత సిరాజుద్దీన్ తలపై అమెరికా కోటి డాలర్ల బహుమతి ప్రకటించింది. కానీ ప్రస్తుతం సిరాజుద్దీన్ అఫ్గాన్ ప్రభుత్వంలో కీలకమంత్రి అయ్యారు. ఇది పాశ్చాత్య దేశాలకు మింగుడుపడని అంశం. (చదవండి: తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు) ఉమ్మడి ప్రభుత్వమే శరణ్యం? హక్కానీల ప్రాధాన్యత పెరగడం వల్లనే అఫ్గాన్ ప్రభుత్వాన్ని యూఎస్, మిత్రపక్షాలు గుర్తించడంలో జాప్యం చేయడం, అమెరికాలోని అఫ్గాన్ బ్యాంకు నిధులు విడుదల చేయకుండా తొక్కిపట్టడం చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే దీన్ని బరాదర్ వైఫల్యంగా హక్కానీలు ఎత్తిచూపుతున్నారు. అయితే ప్రాధాన్యం లేని పోస్టు ఇచ్చినందుకు ఈ విషయంలో తామెందుకు జోక్యం చేసుకోవాలని బరాదర్ వర్గం భావిస్తోంది. పాశ్చాత్య ప్రపంచం గుర్తించకపోతే అఫ్గాన్‌కు ఆర్థిక సాయం అందదు. దీంతో దేశం తీవ్ర సంక్షోభంలో మునిగే ప్రమాదం ఉంది. దీన్ని పట్టించుకోకుండా తాలిబన్– హక్కానీలు సిగపట్లు పడుతున్నారు. ఇది కేవలం అఫ్గాన్‌కే కాకుండా పొరుగుదేశాలకు కూడా ప్రమాదం తెస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అఫ్గాన్‌లోని పలు వర్గాలను ప్రభుత్వంలో చేర్చుకోకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతోందని, దీనివల్ల తిరిగి దేశంలో అంతర్యుద్ధం ఆరంభం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్యుద్ధమే ఆరంభమైతే మరలా రష్యా, ఇరాన్, ఇతర దేశాలు తమ అనుకూల గ్రూపులకు సాయం చేయడం మొదలుపెడతాయి. దీంతో మరోమారు అఫ్గాన్‌లో హింసాత్మక పోరు పెచ్చరిల్లుతుందని నైమతుల్లా అభిప్రాయపడ్డారు. మరి ఇప్పటికైనా తాలిబన్లు, హక్కానీలు భేదాభిప్రాయాలు మరిచి ఇతర గ్రూపులకు కూడా ప్రభుత్వంలో స్థానం కల్పిస్తాయా? లేక గ్రూపు రాజకీయాలను పెంచుతాయా? అని అన్ని దేశాలు ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
‘ఔకస్’ ప్రమాద ఘంటికలు
ఇప్పటికే అనేకానేక కూటములతో కిక్కిరిసివున్న ప్రపంచంలోకి మరో సైనిక కూటమి అడుగు పెట్టింది. గత కొన్నేళ్లుగా చైనా పోకడలతో స్థిమితం లేకుండా పోయిన అమెరికాయే ఈ కొత్త కూటమి పుట్టుకకు కూడా కారణం. ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలున్న ఈ త్రైపాక్షిక కూటమిని ఆ దేశాల పేర్లు గుదిగుచ్చి ‘ఔకస్’గా వ్యవహరించబోతున్నారు. అఫ్గానిస్తాన్‌లో రెండు దశాబ్దాలపాటు తిష్టవేసి సాగించిన యుద్ధం ఆశించిన ఫలితం ఇవ్వకపోగా, తాలిబన్ల ధాటికి కకావికలై అవమానకర రీతిలో నిష్క్రమించాల్సివచ్చిన అమెరికాకు ఈ కొత్త కూటమి ఓదార్పునిచ్చే మాట వాస్తవమే. కానీ మూడు దేశాల అధినేతలూ కూటమి ఏర్పాటు గురించి ప్రకటించిన కాసేపటికే చైనా సంగతలావుంచి... మిత్ర పక్షాలైన ఫ్రాన్స్, యూరొపియన్ యూనియన్(ఈయూ)లనుంచి వినబడిన అపస్వరాలు రాగల రోజుల్లో ఆసక్తికర పరిణామాలు సంభవించబోతున్నాయన్న అభిప్రాయం కలిగిస్తున్నాయి. ఏడు దశాబ్దాలపాటు పూర్వపు సోవియెట్ యూనియన్, అమెరికాల మధ్య సాగిన ప్రచ్ఛన్న యుద్ధం బెడద 90వ దశకం నుంచి తొలగిందని అందరూ అనుకుంటుండగా ఈ ఏడాది మార్చిలో చతుర్భుజ కూటమి(క్వాడ్) దేశాల తొలి శిఖరాగ్రం జరిగింది. దానిపై కొంత ‘నాగరికంగా’ స్పందించిన చైనా... ఈసారి మాత్రం అన్ని మొహమాటాలనూ, దౌత్య మర్యాదలను వదిలి ఆస్ట్రేలియానుద్దేశించి బెదిరింపులకు దిగింది. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక అయిన ‘గ్లోబల్ టైమ్స్’ సంపాదకీయం ద్వారా గట్టి హెచ్చరికలే పంపింది. భౌగోళికంగా చూస్తే చైనా, ఆస్ట్రేలియాల మధ్య ఏ రకమైన పొర పొచ్చాలూ లేవని, కానీ ఆస్ట్రేలియా తనంత తానుగా చైనా–అమెరికాల వైరంలో తలదూర్చి కొరివితో తలగోక్కుంటున్నదని దాని సారాంశం. అమెరికా అండ చూసుకుని సైనిక దుస్సాహసానికి పాల్పడితే చైనా ‘నిర్దాక్షిణ్యం’గా బదులుతీర్చుకోవడం ఖాయమని బెదిరించింది. బహుశా దక్షిణ చైనా సముద్రంలో తమ ప్రాణాలను వృథా చేసుకునే పాశ్చాత్య సైనిక పటాలంలో తొలి వంతు ఆస్ట్రేలియాదే కావొచ్చని కూడా విస్పష్టంగా సంకేతాలు పంపింది. చైనా ఆగ్రహావేశాల మాట అటుంచి ఆస్ట్రేలియా ఈ కూటమికి సై అనడం ప్రపంచ దేశాలన్నిటికీ ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి అమెరికా ప్రమేయం ఉన్న కూటముల్లో ఆస్ట్రేలియాకు సభ్యత్వం ఉండటం కొత్తేమీ కాదు. 1941లో అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్‌లతో పాటు ‘ఫైవ్ ఐస్’(అయిదు నేత్రాల) కూటమిలో అది కూడా భాగస్వామి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఏర్ప డిన‘అంజుస్’లోనూ అది కొనసాగుతోంది. క్వాడ్‌లో సరేసరి. అందులో అమెరికా, భారత్, జపాన్ లతోపాటు అది కూడా ఉంది. అయితే ఈ మూడు కూటముల తీరుతెన్నులూ వేరు. ఫైవ్ ఐస్ అప్పటి సోవియెట్ యూనియన్‌పై నిఘా పెట్టి ఆ సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. అంజుస్ రెండో ప్రపంచ యుద్ధకాలంలో జపాన్‌కు వ్యతిరేంగా అమెరికా, బ్రిటన్ల కోసం ఏర్పడింది. క్వాడ్ చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన కూటమి. కానీ కొత్తగా అడుగుపెట్టిన ‘ఔకస్’ ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే జలాంతర్గాములను సమకూర్చాలని నిర్ణయించింది. అదే చైనాకు ఆగ్రహం కలిగిస్తున్న అంశం. ఇది కేవలం దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించిందేనని ఆ దేశం రగిలిపోతోంది. కారణాలు వేరైనా ఫ్రాన్స్‌కు సైతం అమెరికా, ఆస్ట్రేలియాల పోకడలు ఏమాత్రం నచ్చడం లేదు. తనతో డీజిల్–విద్యుత్‌లతో నడిచే జలాంతర్గాముల కొనుగోలుకు ఆస్ట్రేలియా 4,300 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుని...ఆ ప్రాజెక్టుపై దాదాపు 1,800 కోట్ల డాలర్లు వ్యయం చేశాక ఏకపక్షంగా దాన్నుంచి తప్పుకోవటం ఫ్రాన్స్ ఆగ్రహావేశాలకు కారణం. అవసరమైన ఆహారం, మంచినీరు ఉన్నంతకాలం సముద్ర జలాల్లో గుట్టుచప్పుడు కాకుండా సంచరించడానికి వెసులుబాటుండే అణు శక్తి జలాంతర్గాముల ముందు... ఆక్సిజెన్ కోసం పదే పదే ఉపరితలానికి రాకతప్పని స్థితిలో ఉండే డీజిల్–విద్యుత్ జలాంతర్గాములు సురక్షితమైనవి కాదని ఆస్ట్రేలియా అభిప్రాయపడుతోంది. అటు వేల కోట్ల డాలర్ల కాంట్రాక్టును మిత్ర దేశమన్న మర్యాద కూడా లేకుండా అమెరికా సొంతం చేసుకుందన్న బాధ ఫ్రాన్స్‌ను పీడిస్తోంది. ఈయూ అభ్యంతరం వేరు. ఇన్ని దశాబ్దాలుగా నాటో కూటమి ద్వారా తమ వల్ల ప్రయోజనం పొందిన అమెరికా మాట మాత్రమైనా చెప్పకుండా భిన్నమైన బాట పట్టడం ఈయూ సహించలేకపోతోంది. ఈయూ నుంచి బయటికొచ్చాక బ్రిటన్ తీసుకున్న అతిపెద్ద వ్యూహా త్మక నిర్ణయం ఈ ‘ఔకస్’. అమెరికా సాంకేతికతతో తమ దేశంలోనే ఈ జలాంతర్గాముల నిర్మాణం జరుగుతుంది గనుక దానికిది లాభసాటి బేరం కూడా. అయితే ఒకటి మాత్రం నిజం. పోఖ్రాన్లో మనం అణుపరీక్ష జరిపినప్పుడు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించామని ఆరోపిస్తూ తమ రక్షణ రంగ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న భారత శాస్త్రవేత్తలను గంటల్లో దేశం వదిలిపోవాలని గెంటేసిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఆ ‘చాదస్తం’ ఎందుకు వదిలిపెట్టాల్సివచ్చిందో సంజాయిషీ ఇవ్వాల్సివుంది. డోనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణ యాలు ఈయూ దేశాలను క్రమేపీ అమెరికాకు దూరం చేశాయి. అమెరికాను కాదని అవి రష్యాతో గ్యాస్ పైప్‌లైన్‌పై ఒప్పందానికొచ్చాయి. ఇప్పుడు బైడెన్ ఆవిష్కరించిన ‘ఔకస్’ వాటిని మరింత దూరం చేయడం ఖాయం. ఈ పరిణామంతో మున్ముందు పునరేకీకరణలు ఎలా ఉంటాయో, ఎవరు ఏ శిబిరంలో చేరతారో... వాటి పర్యవసానాలేమిటో చూడాల్సి వుంది. అయితే ‘ఔకస్’ పూర్తి స్థాయిలో అమలైతే రాజుకునే ఘర్షణలు ఆసియా ఖండ దేశాలన్నిటినీ చుట్టుముట్టడం ఖాయం. -
తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు
ఇస్లామాబాద్: అఫ్ఘానిస్తాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు సురక్షితంగా పాకిస్తాన్ చేరుకుంది. తాలిబన్ ప్రభుత్వం నుంచి మహిళా ఫుట్‌బాలర్లకు ముప్పు ఉండటంతో 32 మంది తమ కుటుంబసభ్యులతో సహా పొరుగుదేశం పాక్‌లో అడుగుపెట్టారు. నిజానికి ఈ జట్టు ఖతర్‌కు బయల్దేరాలనుకుంది. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడికి వెళ్లే అవకాశం లేకపోయింది. దీంతో తాలిబన్ల కళ్లుగప్పి పాక్‌కు చేరుకుంది. తాలిబన్ సర్కారు పురుషుల క్రీడలకు అనుమతించినప్పటికీ మహిళలు షరియా చట్టాల ప్రకారం ఆటలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. దీనిపై మహిళా ఫుట్‌బాలర్లు విమర్శలకు దిగడంతో తాలిబన్లు వారిని నిర్బంధించాలనుంది. బ్రిటన్‌కు చెందిన ఎన్జీవో సహకారంతో ఫుట్‌బాలర్లకు పాక్ అత్యవసర వీసాలు జారీ చేసింది. వీరికి పెషావర్ లేదంటే లాహోర్‌లో బస ఏర్పాటు చేసే అవకాశముంది. -
పాక్ చేతిలో... అగ్ర రాజ్యాలు చిత్తు!
పంజ్‌షీర్‌ను తాలిబన్లు ఆక్రమించిన ఘటన... ప్రపంచ ఏకైక అగ్రరాజ్యం అమెరికా సమాధిమీద చివరి రాతను రాసేసింది. పాక్ సైన్యం, పాక్ ప్రభుత్వం చేతిలో తాము చిత్తయిపోయామని రష్యా, అమెరికాకు ఆలస్యంగానైనా అర్థమైపోయింది. ఒక్క ఫ్రాన్స్ మినహా మిగతా నాటో కూటమి మొత్తంగా కాగితపు పులేనని అఫ్గాన్ పరిణామాలతో తేలిపోయింది. చైనా కూడా అఫ్గాన్ నూతన ప్రభుత్వం ఐఎస్ఐకి విస్తృతరూపమే అని గ్రహించేసింది. అఫ్గాన్ వ్యవహారాల్లో తలదూర్చడమంటే పాక్, అఫ్గాన్ రెండు దేశాల కరువు తీర్చడానికి తన వనరులన్నీ ఖర్చుపెట్టాల్సి ఉందని చైనాకూ అర్థమవుతున్నట్లుంది. నాటో బలగాలు తిరోగమించడం, చైనా–పాక్ కూటమి ముందు రష్యా కూడా తలవంచాక ప్రజాస్వామ్యం కోసం పోరాడే ఒకే ఒక్క దేశంగా భారత్ మిగిలింది. అఫ్గాన్ పరిణామాలు అగ్రరాజ్యానికీ, ప్రపంచ ఆధిపత్య శక్తులకూ అంతిమ పరాజయం. అఫ్గానిస్తాన్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన నేపథ్యంలో బహుశా భారతదేశం ఇప్పుడు తక్కిన ప్రపంచం కోసం సారథ్య స్థానాన్ని కైవసం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అదేసమయంలో పాకిస్తాన్ సైన్యం, ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని సంకర పౌర ప్రభుత్వం చేతిలో మూర్ఖులుగా మిగిలిపోయామని రష్యా, అమెరికా రెండూ ఇప్పుడు గ్రహిస్తూ మథనపడుతున్నాయి. మరోవైపున చైనా నాయకత్వానికి మెల్లగా తత్వం బోధపడుతున్నట్లుంది. తాలిబన్–పాక్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) పోషకురాలిగా తాను నిలబడటం అంటే, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ రెండు దేశాలకు సహాయం అందించడానికి తన వనరులన్నింటినీ ఖర్చుపెట్టాల్సి ఉండటమేనని చైనా నాయకత్వానికి కూడా అర్థమవుతున్నట్లు కనిపిస్తోంది. అంతకుముందు పంజ్‌షీర్ లోయలోని తాలిబన్ తిరుగుబాటు దళాలపై పాక్ బాంబుదాడులు చేయడానికి కజకిస్తాన్‌లోని తన సైనిక స్థావరాలను ఉపయోగించుకోవచ్చని రష్యా అనుమతించింది. మరోవైపున చైనా నిఘా ఉపగ్రహాలు.. అత్యంత కచ్చితత్వంతో అఫ్గాన్ తిరుగుబాటు బలగాలకు చెందిన లక్ష్యాలను దెబ్బతీయడానికి పాకిస్తాన్ బాంబర్లకు, డ్రోన్లకు సహాయం చేశాయి. కాగా, పంజ్‌షీర్‌ను తాలి బన్లు ఆక్రమించిన ఘటన జోబైడెన్ నేతృత్వంలోని ప్రపంచ ఏకైక అగ్రరాజ్యం అమెరికా సమాధిమీద చివరి రాతను రాసేసింది. అంతి మంగా, న్యూఢిల్లీ సందర్శించి అమెరికా పరువును నిలబెట్టడమే కాకుండా, తన వ్యక్తిగత ప్రతిష్టను కూడా తిరిగి సాధించే అవకాశాన్ని అన్వేషించాలంటూ సీఐఏ చీఫ్ బర్న్స్‌ని జో బైడెన్ కోరాల్సి వచ్చింది. అఫ్గాన్ ప్రజలను తాలిబన్లకు వదిలేసిన తన పిరికిపంద చర్యను కప్పిపెట్టుకోవడంతోపాటు తన పరువు నిలబెట్టుకునేందుకు కూడా భారత్ సహాయం చేస్తుందని బైడెన్ ఆశిస్తున్నట్లుంది. తాలిబన్లను అడ్డుకోవడంలో అఫ్గాన్ సైనికబలగాలు విఫలమయ్యాయని బైడెన్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అసలు నిజం తెలిసిపోయింది. తాలిబన్ శక్తులు కాబూల్‌ని ఆక్రమించే పనిలో సులభ విజయం సాధించడానికి అమెరికన్లు పాకిస్తాన్ సైన్యాధికారులను తప్పు పద్ధతిలో ప్రోత్సహిం చినట్లు ఇప్పుడు ప్రపంచానికే తెలిసిపోయింది. అలాగే తాలిబన్ దురాక్రమణ బలగాలను ప్రతిఘటించవద్దని అఫ్గాన్ కమాండర్లకు కూడా పనిలోపనిగా కబురందించారు. చివరిదశలో అఫ్గాన్‌లో ఏం జరిగిందనే విషయమై అమెరికా కథనాలపై అమెరికన్ మీడియా ప్రస్తుతం ప్రతిరోజూ కొత్త వార్తలను వండిపెడుతూనే ఉంది. అఫ్గాన్ మహిళలు తాలిబన్లను సాహసోపేతంగా ఎదుర్కొంటున్నప్పుడు పాక్ సైన్యం, దాని నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుతో విర్రవీగుతున్న తాలిబన్ మూకలు అఫ్గాన్ మహిళల వక్షోజాలకు ఆటోమేటిక్ రైఫిల్స్‌ని గురిపెట్టిన దృశ్యాలను ప్రపంచం తిలకించినప్పుడు అమెరికా పరువు మొత్తంగా పోయింది. పంజ్‌షీర్ లోయపై పాక్ సైన్యం బాంబులు కురిపించడానికి నిరసనగా అఫ్గాన్‌లో ఆందోళనకారులు పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు. వారు ప్రదర్శించిన అసాధారణ సాహసాన్ని మొత్తం ప్రపంచం చూసింది. బైడెన్ వల్లించిన అబద్ధాలను ఇక నమ్మేవారు చాలా తక్కువ అని తేలిపోయింది. అయితే ఇస్లామాబాద్‌లోని తమ మార్గదర్శకులకు భంగపాటు కలిగిస్తూ తాలిబన్ సాయుధులు... నిరాయుధులైన మహిళ లను చంపడానికి సాహసించలేకపోయారు. రావల్పిండిలోని ఐఎస్ఐ జనరల్ హెడ్ క్వార్టర్స్ ప్రత్యక్ష ఆదేశాలతో పనిచేసే పాక్ ప్రచ్ఛన్న సంస్థ హక్కాని నెట్వర్క్... ఆందోళనకారులను అణచేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, ఆందోళనకారులు భీతిల్లలేదు. అప్పుడు కూడా తాలిబన్ సాయుధులు నిరాయుధ మహిళలపై కాల్పులకు ప్రయత్నించలేదు. ఆందోళనకారులను భయపెట్టి వారిపై పాశవిక బలాన్ని ప్రయోగించాలని తలచిన హక్కాని నెట్వర్క్... 1989 ఏప్రిల్‌లో తియనాన్మెన్ స్క్వేర్‌లో చైనా ప్రభుత్వం తలపెట్టిన మారణకాండను పోలినదాన్ని మరోసారి సృష్టించాలని స్పష్టంగా భావించింది. ఈలోగా చైనా కూడా అఫ్గాన్ నూతన ప్రభుత్వం ఐఎస్ఐకి విస్తృత రూపమే అని గ్రహించేసింది. అఫ్గాన్‌లో తిరుగుబాటు దళాలకు సహకరించవద్దని భారత్‌కు తానిచ్చిన సలహా పెద్ద తప్పిదమని రష్యా కూడా ఎట్టకేలకు గ్రహించింది. కజకిస్తాన్‌లోని తన వైమానిక స్థావరం నుంచి జెట్ ఫైటర్లను పంపే వీలున్నప్పటికీ రష్యా అందుకు పూనుకోలేకపోయింది. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి ఇప్పటికీ అస్పష్టంగానే కనిపిస్తోంది. మయన్మార్‌లో తాను ప్రారంభించి అమలు చేసిన ప్రయోగాన్ని పునరావృతం చేయడానికి చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్‌కి కూడా కష్టమయ్యేది. అంగ్ సాన్ సూకీ, తదితర ప్రజాస్వామిక నేతలను జైల్లో పెట్టి మార్షల్ లా విధించాలంటూ మయన్మార్ సైనికాధిపతి మిన్ అంగ్ హ్లాయింగ్ని ప్రభావితం చేయడంలో చైనా అప్పట్లో విజయం సాధిం చింది. మయన్మార్ ఓడరేవుల వద్దకు రోడ్ లింక్ ఏర్పర్చాలనే తన ప్రయత్నంలో భాగంగా చైనా ఆ దేశంలో తనకు విధేయంగా ఉండే ప్రభుత్వం ఉండాలని కోరుకుంది. చివరకు తన లక్ష్యాన్ని సాధించింది కూడా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం ఉంటే అంతంలేని తన డిమాండ్లను సాధించుకోవడం చైనాకు కష్టమయ్యేది మరి. అందుకే సూకీని తిరిగి అధికారంలోకి రాకుండా చైనా అడ్డుకుంది. వాస్తవానికి చైనాతో సూకీ అనేక వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేశారు. అయినా సరే తనకు విధేయంగా ఉండే ప్రభుత్వమే ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ బలంగా కోరుకున్నారు. దాంట్లో భాగంగానే మయన్మార్ నుంచి అపార లాభాలను దండుకోవడానికి చైనా అక్కడ సైనిక పాలనను తీసుకొచ్చింది. తనవద్ద పోగుపడిన అదనపు డాలర్లను ప్రతిపాదిస్తూ ఇరాన్, రష్యా, పాకిస్తాన్ దేశాల విషయంలో కూడా ఇదే వ్యూహాన్ని చైనా అమలు పరిచింది. రష్యా పట్ల భ్రమలు తొలగిపోయాక, ఇప్పుడు అఫ్గాన్ విషయంలో ఏర్పడిన కొత్త కూటమి ద్వారా ఈ ప్రాంతంలోని ప్రజల్ని బానిసలుగా చేసుకునే ప్రయత్నాలు విజయవంతమయ్యేందుకు చైనాకు కొన్ని అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అఫ్గాన్‌లో ఇటీవల జరిగిన ఘటనలతో, ఒక్క ఫ్రాన్స్ మినహా మిగతా నాటో కూటమి మొత్తంగా కాగితపు పులేనని తేలిపోయింది. ఆంగ్లో–అమెరికన్ కూటమి చెప్పే ప్రజాస్వామ్యం సారం లేని గుజ్జు అని తేలిపోయింది. ఈలోపు, పాశ్చాత్య దేశాల సమర్థకులు, అమెరికా కేంద్రంగా పనిచేసే జర్నలిస్టులు, ప్రత్యేకించి ఫరీద్ జకారియా వంటి వారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పెంటగాన్‌లకు బలహీన స్వరంతో మద్దతు పలుకుతున్నారు. అసాధారణమైన రాజకీయ ఒత్తిడి వల్లే అమెరికన్ నేతృత్వంలోని నాటో శక్తులు అఫ్గానిస్తాన్‌ను వదిలిపెట్టాల్సి వచ్చిం దని, వందల కోట్ల డాలర్ల విలువైన సైనిక సామగ్రిని అక్కడే వదలిపెట్టాల్సి వచ్చిందని వీరు వంతపలికారు. కానీ స్వాతంత్య్ర ప్రేమికులైన ప్రజలతో కూడిన దేశాన్ని తాలిబన్ నిరంకుశ వ్యవస్థకు లొంగిపోయేలా ఎలా చేశారన్న దానిపై ఈ సమర్థకులెవ్వరూ జవాబివ్వరు. పాకిస్తాన్, చైనా దేశాల సైనిక, రాజకీయ మద్దతుతో తాలిబన్ అధికారంలోకి వచ్చిన పరిణామాలను కూడా వీరు పెద్దగా ప్రస్తావించరు. అఫ్గానిస్తాన్‌లో రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ గొప్ప క్రీడ ఇప్పుడు భారతదేశాన్ని దెబ్బతీయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతం నుంచి అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు తిరోగమించడం, చైనా–పాక్ కూటమి ముందు రష్యా కూడా తలవంచాక మానవహక్కులు, ప్రజాస్వామ్యం కోసం పోరాడే ఒకే ఒక్క దేశంగా భారత్ మిగిలి ఉంది. మరోవైపున ఎనభై ఏళ్లు దాటిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా ముందు ఓడిపోకపోవచ్చు కానీ అఫ్గానిస్తాన్‌లో అమెరికా సంపూర్ణ తిరోగమనాన్ని మాత్రం ఎట్టకేలకు అంగీకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అఫ్గాన్ పరిణామాలు అగ్రరాజ్యానికీ, ప్రపంచ ఆధిపత్య శక్తులకూ అంతిమ పరాజయం మాత్రమే. గోపాల్ మిశ్రా, ఫ్రీలాన్స్ జర్నలిస్టు (ఫస్ట్ ఇండియా సౌజన్యంతో) -
అఫ్గాన్‌కు భారీ స్థాయిలో ఆర్థికసాయం!
ఐక్యరాజ్య సమితి/జెనీవా: తాలిబన్లు చెరబట్టిన అఫ్గాన్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు భారీ స్థాయిలో ఆర్థికసాయం చేస్తామని ప్రకటించాయి. కరువు, పేదరికం, వలసలతో సతమతమవుతున్న అఫ్గాన్ ప్రజల ఆకలి, వసతుల కష్టాలు తీర్చేందుకు 1.2 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.8,836 కోట్లు) ఆర్థిక సాయం చేస్తామని పలు దేశాలు హామీ ఇచ్చాయని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు. ఉగ్రవాదం పెచ్చరిల్లకుండా చూడడం, మానహక్కుల పరిరక్షణ తదితర సమస్యలపైనా ప్రపంచ దేశాలు తమ వంతు కృషిచేయాలని గుటెర్రస్ సూచించారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్‌కు సత్వర ఆర్థిక సాయం కోరుతూ ఐరాస సోమవారం జెనీవాలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం తెల్సిందే. ఈ ఏడాది అవసరాలు తీర్చేందుకు కనీసం 60.6 కోట్ల డాలర్ల సాయం చేయాలని గుటెర్రస్ కోరడం విదితమే. ‘ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సమాజం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల సాయం చేస్తామని ‘ముఖ్యమైన’ దేశాలు ప్రకటించాయి. నా అంచానాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో విరాళాలు వస్తున్నాయి. అఫ్గాన్‌కు అంతర్జాతీయ సమాజం ఎంతటి భారీ స్థాయిలో ఆర్థిక తోడ్పాటు ఇస్తుందనడానికి ఈ ఘటనే తార్కాణం’ అని స్విట్జర్లాండ్ నగరం జెనీవాలో పత్రికా సమావేశంలో గుటెర్రస్ చెప్పారు. ‘తాలిబన్ల అనుమతి లేకుండా మానవతా కార్యక్రమాల అమలు అసాధ్యం. మానవ హక్కులు, మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదం.. అంశమేదైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు సాయం అందాలంటే తాలిబన్ ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు కొనసాగించాల్సిందే’ అని ఆయన స్పష్టంచేశారు. ‘ తాలిబన్ల దురాక్రమణ, కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద వేలాది మంది అఫ్గాన్ అభాగ్యుల పడిగాపులు, బాంబు పేలుళ్లు వంటి విషాదకర ఘటనలతో స్థానికుల భవిష్యత్ అగమ్యగోచరమైన నేపథ్యంలో ఐరాస అక్కడ సహాయ కార్యక్రమాలను కొనసాగించడం తప్పనిసరి’ అని గుటెర్రస్ వ్యాఖ్యానించారు. -
Afghanistan: తాలిబన్ల పంట పండింది
ఆర్థికంగా ముప్పావు భాగం మునిగిన అఫ్గన్ నావను నడిపేందుకు తాలిబన్లకు ఇప్పుడు ఆసరా అవసరం. ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి(ఐరాస) సైతం అఫ్గనిస్తాన్‌కు ఆపన్నహస్తం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఈలోపు తమ వనరులను సమీకరించుకునే పనిలో పడ్డారు తాలిబన్లు. ఈ క్రమంలోనే పాత ప్రభుత్వంలోని మంత్రులు, కీలక అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అమ్రుల్లా సలేహ్.. అఫ్గనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు. మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన తర్వాత.. సలేహ్ తనను తాను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఆపై తాలిబన్ల ఆక్రమణ తర్వాత అజ్ఞాతంలో ఉంటూ.. తాలిబన్లతో పోరాటం కొనసాగుతుందని ప్రకటించాడు కూడా. అయితే ఆయన ఇంట్లో తాలిబన్లు తాజాగా సోదాలు నిర్వహించారు. సుమారు 6 మిలియన్ల విలువ చేసే డాలర్లు(మన కరెన్సీలో 45 కోట్ల రూ. దాకా), 18 పెద్ద బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్ మల్టీమీడియా బ్రాంచ్ చీఫ్ అహ్మదుల్లా ముట్టాఖీ తన ట్విటర్లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. د امر الله صالې په کور کې شپږنیم میلیونه ډالر د سرو زرو له اتلس خښتو سره يوځای د اسلامي امارت د ځواکونو لاسته ولوېدل. pic.twitter.com/E5YinxvTe0 — Ahmadullah Muttaqi (@Ahmadmuttaqi01) September 13, 2021 ఇక సలేహ్‌తో పాటు ఆయనకు అనుకూలంగా పని చేసిన మంత్రులు, అధికారులు, గత పాలనలో అవినీతికి పాల్పడ్డవాళ్ల ఇళ్లలోనూ తాలిబన్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా సోమ్ము సేకరించినట్లు తెలుస్తోంది. ఇక పరారీలో ఉన్న మరికొందరి దగ్గర సొమ్ము ఉండొచ్చని భావిస్తున్న తాలిబన్లు.. ఓ లిస్ట్ తయారు చేసుకుని వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే అఫ్గనిస్తాన్‌ను తాలిబనిస్తాన్‌గా మారడం తనకు ఇష్టం లేదని ప్రకటించుకున్న సలేహ్.. తాలిబన్ల ఆక్రమణ తర్వాత పంజ్‌షీర్‌కు పారిపోయాడు. అక్కడ ప్రతిఘటన దళాల నేత అహ్మద్ మస్సౌద్‌తో కలిసి పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో సలేమ్ సోదరుడు రుల్లాహ్‌ను బంధించి, చిత్రహింసలు పెట్టి మరీ చంపారు తాలిబన్లు. చదవండి: అఫ్గన్ థియేటర్ల మూత, బాలీవుడ్‌కు ఆర్థిక ముప్పు ఇక సెప్టెంబర్ 3న చివరిసారిగా పోరు కొనసాగుతుందని ప్రకటించిన సలేహ్.. సెప్టెంబర్ 6న పంజ్‌షీర్ తాలిబన్ల వశం అయ్యిందన్న ప్రకటన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఆయన ప్రాణాలతోనే ఉన్నాడా? లేదా పరారీలో ఉన్నాడా? అనేది నిర్దారణ కావాల్సి ఉంది. చదవండి: తాలిబన్ ఎఫెక్ట్.. భారత్‌లో అలర్ట్ -
మహిళలపై ఆర్ఎస్ఎస్, తాలిబన్ అభిప్రాయం ఒక్కటే!
భోపాల్: ఉద్యోగాలు చేసే మహిళల విషయంలో మన దేశంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ల అభిప్రాయం ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, తాలిబన్లు వారి ఆలోచనా విధానాన్ని మార్చుకోనంత వరకూ ఇదే నిజమని భావించాల్సి వస్తుందని చెప్పారు. 2013లో మోహన్ భగవత్ మాట్లాడినట్లు చెబుతున్న ఓ వీడియోను దిగ్విజయ్ ప్రస్తావించారు. పెళ్లి అనేది ఒక కాంట్రాక్టు, పెళ్లయిన మహిళలు ఇళ్లల్లోనే ఉండాలి, ఇంటి పనులు చూసుకోవాలి అని మోహన్ భగవత్ అన్నారని గుర్తుచేశారు. అఫ్గాన్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదని తాలిబన్లు తేల్చిచెబుతున్నారని వెల్లడించారు. దిగ్విజయ్ ట్వీట్‌ను మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వి.డి.శర్మ తప్పుపట్టారు. దిగ్విజయ్‌తోపాటు కాంగ్రెస్ నాయకత్వం తాలిబన్ల మద్దతుదారులని ఆరోపించారు. -
ప్రమాణ స్వీకారోత్సవం రద్దు చేసిన తాలిబన్లు
కాబూల్: కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని తాలిబన్లు రద్దు చేశారు. వనరులు, నిధుల వృ«థా నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అమెరికాపై దాడులు జరిగిన 11 సెప్టెంబర్ నాడే అట్టహాసంగా తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించాలని తొలుత తాలిబన్లు భావించారు. ఇందుకోసం రష్యా, చైనా, ఖతార్, పాకిస్తాన్, ఇరాన్‌కు ఆహ్వానాలు కూడా పంపారు. కానీ అకస్మాత్తుగా ప్రమాణస్వీకారోత్సవ రద్దు నిర్ణయం ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవం లేకపోయినా ప్రభుత్వం ఏర్పడి పనిచేయడం ప్రారంభమైందని తాలిబన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగని ప్రకటించారు. అయితే నిధుల వృథా నివారణ అనేది అసలు కారణం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్ మిత్రుల ఒత్తిడి వల్లనే ఈ ఉత్సవాన్ని రద్దు చేశారని రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది. 11న ప్రమాణ స్వీకారోత్సవం జరపడం అమానవీయమని, దాన్ని నిలిపివేయమని తాలిబన్లకు సలహా ఇవ్వాలని యూఎస్, నాటో దేశాలు ఖతార్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని పేర్కొంది. దీనివల్ల అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనను ప్రపంచ దేశాలు గుర్తించడం మరింత కఠినతరమవుతుందని హెచ్చరించినట్లు తెలిసింది. -
తిరిగి రండి.. మీకు పూర్తి రక్షణ కల్పిస్తాం: అఫ్గన్ ప్రధాని
కాబూల్: అఫ్గనిస్తాన్ ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్లు అఫ్గన్‌ను ఆక్రమించిన నాటి నుంచి ఆ దేశంలో పరిస్థితులు తారుమారయ్యాయి. గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులు ఎవరు విధులకు హాజరవ్వడం లేదు.. చాలా మంది దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ప్రస్తుత అఫ్గన్ ప్రధాని ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ ప్రభుత్వ అధికారులకు పూర్తి రక్షణ కల్పిస్తామని.. తిరిగి దేశానికి రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు అఖుంద్ బుధవారం ఓ ప్రకటన చేశారు. (చదవండి: కొత్త కోణం: అఫ్గాన్ సింహాలు తలవంచేనా!) అఖుంద్ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్‌లో అధికారంలోకి రావడానికి మేం భారీ మూల్యం చెల్లించాం. దేశ పునర్నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదుర్కొబోతున్నాం. ఈ సందర్భంగా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. దేశం విడిచిపోయిన అధికారులు తిరిగి వచ్చేయండి. మీకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాం. యుద్ధంలో ధ్వంసమైన అఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో అనేక సవాళ్లను చవి చూడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మీ అవసరం చాలా ఉంది. మీ రక్షణ బాధ్యత మాదే.. తిరిగి దేశానికి వచ్చేయండి’’ అని పిలుపునిచ్చాడు. (చదవండి: Afghanistan: అఫ్గాన్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం) తాజాగా అఫ్గనిస్తాన్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో ఎక్కువగా అంతర్జాతీయ ఉగ్రవాదులు, వారి తలపై రివార్డులు ఉన్న వారు గ్వాంటనామా జైళ్లలో మగ్గి వచ్చిన వారే ఉండటం గమనార్హం. ఈ ప్రభుత్వ ఏర్పాటులో పాక్ కీలక పాత్ర పోషించింది. అఫ్గన్ కేబినెట్ మంత్రులు సెప్టెంబర్ 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9/11 దాడులకు ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో అఫ్గన్ కేబినెట్ మంత్రులు ఆ రోజే తమ ప్రమాణ స్వీకారానికి ఎన్నుకోవడం గమనార్హం. -
తాలిబన్ల అరాచకం: జర్నలిస్టులకు చిత్రహింసలు
కాబూల్: తాలిబన్లు రెచ్చిపోయారు. వారికి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న మహిళల నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులను చితకబదారు. రక్తమొచ్చేలా దాడి చేశారు. వారిని దాడి చేసి బంధించిన చిత్రాలను తాలిబన్లు విడుదల చేశారు. అఫ్గానిస్తాన్‌లో మీడియాకు స్వేచ్ఛ లేకుండాపోయింది. వెస్ట్రన్ కాబూల్‌లోని కార్ట్-ఈ-చార్ ప్రాంతంలో బుధవారం మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులను తాలిబన్లు ఎత్తుకెళ్లిపోయారు. చదవండి: లోకేశ్‌కి ఎలా అల్లరి చేయాలో చంద్రబాబు శిక్షణ అనంతరం ఓ గదిలో బంధించి చితకబాదారు. వారి దుస్తులు విప్పేసి రక్తమొచ్చేలా తీవ్రంగా దాడి చేశారు. తాలిబన్లు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులు తఖి దర్యాబీ, నిమతుల్లా నక్తీ. జర్నలిస్టు వృత్తిని ఎగతాళి చేస్తూ దారుణంగా హింసించారని బాధిత జర్నలిస్టులు తెలిపారు. తమ పాలనలో మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లదని తాలిబన్లు ప్రకటించారు. అయినా జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారిద్దరితో పాటు మరికొందరు జర్నలిస్టులను ఎత్తుకెళ్లి అనంతరం విడిచి పెట్టారని చెప్పారు. దర్యాబీ, నక్దీ ఓ ఛానల్లో వీడియో ఎడిటర్లుగా పని చేస్తున్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారి చెర నుంచి విడుదలైన అనంతరం బాధితుడు నక్దీ మీడియాతో మాట్లాడారు. ‘ఒక తాలిబన్ నా తలపై కాలు పెట్టి నలిపేశాడు. మొఖాన్ని కూడా చిదిమేశాడు. తర్వాత తలపై తన్నాడు. నన్ను చంపేస్తారని అనుకున్నా’ అని వాపోయాడు. ‘నువ్వు వీడియోలు చిత్రీకరించవద్దు’ అని హెచ్చరించినట్లు తెలిపాడు. ఈ ఘటనపై జర్నలిస్టు లోకం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. వీరిపై దాడిని జర్నలిస్ట్ లోకం ఖండిస్తోంది. Send our journalists to hospital. pic.twitter.com/W3GQ34BPtl — Zaki Daryabi (@ZDaryabi) September 8, 2021 -
పాక్ కనుసన్నల్లో...
పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టుగా అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు, హక్కానీలు ఒక అవగాహనకు రాలేక కొట్టుకు చస్తుంటే పాకిస్తాన్ తలదూర్చి అన్నీ తనకి అనుకూలంగా మార్చేసుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాదులు, వారి తలపై రివార్డులు ఉన్న వారు గ్వాంటనామా జైళ్లలో మగ్గి వచ్చిన వారితో ప్రభుత్వాన్ని నింపేసింది. కొత్త సర్కార్ భారత్‌కు ఎలా ఎదురు దెబ్బగా మారింది ? అఫ్గానిస్తాన్‌లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని చూస్తే అడుగడుగునా పాకిస్తాన్ ముద్ర స్ఫష్టంగా కనిపిస్తుంది. తాలిబన్లు, హక్కానీల మధ్య నెలకొన్న విభేదాల్ని పరిష్కరించడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఫయీజ్ హమీద్ స్వయంగా కాబూల్‌కి తరలివచ్చి మూడు రోజులు మకాం వేశారు. పక్కా స్క్రీన్‌ప్లేతో రాత్రికి రాత్రి అధికార రేసులో ఉన్నవారి పేర్లన్నీ మార్చేశారు. దోహాలో భారత్‌తో సహా అంతర్జాతీయ దేశాలతో శాంతి చర్చలు జరిపిన వారిని తెలివిగా పక్కకు తప్పించారు. ప్రధానిగా ఉగ్రవాది ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్‌ను నియమించడంలోనూ, తమ నియంత్రణలో ఉండే హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన పలువురు నాయకులకు పదవులు ఇప్పించడంలోనూ పాక్ విజయం సాధించింది. భారత్‌పై దాడులు చేసిన హక్కానీలకు కీలక పదవులు అఫ్గాన్ కొత్త ప్రభుత్వంతో తమ పంతం నెగ్గించుకొని కీలక పదవులు సాధించింది మాత్రం హక్కానీ గ్రూపే. ఈ సంస్థ అధినేత సిరాజుద్దీన్ హక్కానీ అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమించారంటేనే అక్కడ ఉన్నది ఐఎస్ఐ ప్రభుత్వమేనని అవగతమవుతుంది. పాకిస్తాన్‌లోని నార్త్ వజరిస్తాన్లో అల్‌కాయిదాతో ఉగ్రవాద సంస్థతో సిరాజుద్దీన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. 2008లో కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడుల వెనుక హక్కానీల హస్తం ఉంది. ఈ దాడుల్లో 58 మంది మరణించారు. భారతీయులపైనా, భారత దేశ ప్రయోజనాలపైనా 2009, 2010లో కూడా ఈ సంస్థకు చెందిన వారు దాడులకు తెగబడుతూనే ఉన్నారు. అలాంటి సంస్థను నడిపిస్తున్న సిరాజుద్దీన్ హక్కానీ చేతిలో శాంతి భద్రతలతో పాటుగా ప్రావిన్స్‌లకు గవర్నర్లను నియమించే అధికారాలు కూడా ఉన్నాయి. సిరాజుద్దీన్ హక్కానీపై అమెరికా ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాది అని ముద్రవేయడంతో పాటు అతని తలపై కోటి డాలర్ల అవార్డు కూడా ప్రకటించింది. శరణార్థుల మంత్రి ఖలీల్ హక్కానీ కూడా ఉగ్రవాదే. అల్‌కాయిదా సంస్థ తరఫునే అతను పని చేస్తుంటాడు. భారత్ రాయబారితో చర్చించాడని.. అమెరికాతో దోహాలో శాంతి చర్చలు జరిపి, అందరి దృష్టిలో పడిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రాధాన్యాన్ని తగ్గించారు. వాస్తవానికే ఆయనే ప్రభుత్వాధినేత అవుతారని అనుకున్నారు. ఆఖరి నిమిషంలో ఆయనకు బదులుగా హసన్ వచ్చి చేరారు. ఇక దోహా చర్చల్లో బరాదర్‌తో పాటు పాల్గొన్న షేర్ మొహ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ విదేశాంగ మంత్రి రేసులో ఉండేవారు. కానీ ఖతర్‌లో భారత రాయబారి దీపక్ మిట్టల్‌ను ఆయన ఆగస్టు 31న కలుసుకున్న విషయం బయటకు వచ్చింది. భారత ప్రతినిధితో చర్చించడమే మహా పాపమైనట్టుగా అతనిని కూడా ప్రభుత్వం నుంచి తప్పించారు. సమ్మిళిత సర్కార్ ఎక్కడ? అమెరికా నుంచి సంకీర్ణ బలగాలు వెనక్కి వెళ్లడానికి ముందు సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పోతూ సమ్మిళిత సర్కార్‌ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పాక్ ప్రమేయంతో ఆ హామీని తుంగలో తొక్కేశారు. ముందే ఊహించినట్టుగా అఫ్గాన్ ప్రభుత్వంలో మహిళలకి చోటు దక్కలేదు. ఇక 33 మంది మంత్రుల్లో పాస్తూన్ తెగకు చెందిన వారు ముగ్గురు మాత్రమే ఉన్నారు. పాక్ తన అడుగులకి మడుగులొత్తే వారినే ప్రభుత్వంలో చేర్చింది. అమెరికాలోని గ్వాంటనామా జైళ్లలో మగ్గిన వారికీ ప్రభుత్వంలో చోటు లభించింది. సమాచార సాంస్కృతిక మంత్రి ఖైరుల్లా ఖైర్ఖ్వా, ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్దుల్ హక్ వసీక్, సరిహద్దు వ్యవహారాల మంత్రి ముల్లా నూరుల్లా నూరీలు ఒకప్పుడు గ్వాంటనామా జైళ్లలో మగ్గి వచ్చిన వారే. ఇలా ఉగ్రవాదులతో నిండిపోయిన ఈ ప్రభుత్వంతో భారత్ ఎలాంటి తలనొప్పులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
అఫ్గన్‌లో తాలిబన్ల పాలన.. యూఎన్ కీలక సూచన
న్యూయార్క్: మహిళలు, యువత భాగస్వామ్యంతోనే అఫ్గనిస్తాన్‌లో సమగ్ర పరిపాలన సాధ్యమని ఐక్యరాజ్యసమితి అసిస్టెన్స్ మిషన్ (యూనైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ (యూఎన్ఏఎంఏ)) స్పష్టం చేసింది. అఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న దాదాపు మూడు వారాల అనంతరం తాలిబన్లు కొత్త ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో పరిపాలన విధానంలో యువత, మహిళలకు అవకాశం ఇవ్వకూడదనే తాలిబన్ల ఆలోచన తీరును యూఎన్ తీవ్రంగా ఖండించింది. అంతేకాదు వారి భాగస్వామ్యం లేని పరిపాలన విధానం అర్థరహితమైనదని పేర్కొంది. (చదవండి: Afghanistan: అఫ్గాన్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం ) తాలిబన్లు హింసా ప్రవృత్తి మానుకోవాలి.. దేశంలో శాంతి, సుస్థిర సౌభ్రాతత్వం అనేవి సమగ్ర పాలన పైనే ఆధారపడి ఉంటాయని యూఎన్ఏఎంఏ నొక్కి చెప్పింది. భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత జీవన విధానం అనేవి అఫ్గాన్ ప్రజల ప్రాథమిక హక్కులని గుర్తు చేసింది. తిరుగుబాటుదారులు, పాత్రికేయుల పట్ల హింసా ప్రవృత్తిని ప్రదర్శంచకూడదంటూ హితవు పలికింది. ఆఫ్గాన్‌లోని బాలికలు, మహిళలకు అండగ ఉంటామని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వారికి పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు యూఎన్ఏఎంఏ ప్రకటించింది. -
మ్యాగజైన్ స్టోరీ 7th September 2021
-
Afghanistan: అఫ్గాన్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న దాదాపు మూడు వారాల అనంతరం తాలిబన్లు కొత్త ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించారు. ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మంగళవారం విలేకరులకు తెలిపారు. రెండుదశాబ్దాల పాటు అమెరికాతో పోరాడిన అగ్రనేతలు తాజా ప్రభుత్వంలో ప్రాధాన్యమైన పదవులు పొందారు. అమెరికాతో చర్చల్లో అత్యంత కీలకపాత్ర పోషించిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో పాటు మౌల్వీ హనాఫీలు అఖుంద్‌కు డిప్యూటీలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఏర్పాటైంది తాత్కాలిక ప్రభుత్వమేనని, శాశ్వత ప్రభుత్వం కాదని జబీహుల్లా చెప్పారు. దేశంలో ఇతర ప్రాంతాలవారిని కూడా ప్రభుత్వంలో కలుపుకునేందుకు యత్నిస్తామన్నారు. అయితే ఎంతకాలం ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందో, ప్రభుత్వంలో మార్పులు ఎలా వస్తాయో వెల్లడించలేదు. ప్రభుత్వంలో ప్రతి మంత్రికి ఇద్దరు డిప్యూటీలుంటారని తెలిపారు. ప్రభుత్వంలో తాలిబనేతర వర్గాలకు స్థానం దక్కినట్లు కనిపించలేదు. అఫ్గాన్‌లో స్థిరత్వం కోసం దేశంలోని అన్ని తెగలను, వర్గాలను కలుపుకొని సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావాలని అంతర్జా తీయ సమాజం ఆశిస్తోంది. ప్రభుత్వ కూర్పు, అధికార పంపిణీల విషయంలో తాలిబన్లు, హకాన్నీ నెట్‌వర్క్‌కు మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వాధినేతగా ఉండటాన్ని హక్కానీ నెట్వర్క్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో పాక్ ఐఎస్ఐ చీఫ్ మధ్యవ ర్తిత్వానికి వచ్చారు. చర్చల అనంతరం అందరికీ ఆమోదయోగ్యుడైన హసన్ అఖుంద్‌కు తాత్కాలికంగా పాలనాపగ్గాలు అప్పగించినట్లు కనపడుతోంది. మంత్రివర్గంలో అందరూ ఊహించినట్లే మహిళలకు స్థానం కల్పించలేదు. ఖారీ ఫసిహుద్దీన్ బంద్క్షనిని ఆర్మీ చీఫ్‌గా నియమించారు. తాలిబన్ అధినేత హెబతుల్లా అఖుంద్జాదా సుప్రీం లీడర్‌గా ఇరాన్ నమూనా ప్రభుత్వం ఏర్పడుతుందని చాలామంది భావించారు. కానీ తాజా ప్రభుత్వంలో హెబతుల్లా ఎలాంటి పాత్ర పోషించేది స్పష్టం కాలేదు. ఇరాన్లో అధ్యక్షుడి కన్నా ఉన్నతస్థానంలో సుప్రీంలీడర్ ఉంటాడు. అంతిమాధికారాలన్నీ అతని చేతిలోనే ఉంటాయి. ఇతర ప్రముఖులు డిప్యూటీగా నియమితులైన ముల్లా బరాదర్, తాలిబన్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2001లో తాలిబన్ల ప్రభుత్వం పడిపోయిన తర్వాత అప్పటి అఫ్గాన్ అధినేత హమీద్ కర్జాయ్‌తో సహకరిస్తామని సంప్రదింపులు జరిపినట్లు వార్తలున్నాయి. 2010లో పాక్‌లో అరెస్టయి అమెరికా ఒత్తిడితో 2018లో విడుదలయ్యారు. అప్పటినుంచి ఖతార్‌లో ఉంటున్నారు. యూఎస్ దళాల ఉపసంహరణ ఒప్పందంలో కీలకపాత్ర పోషించారు. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించాక దేశంలోకి అడుగుపెట్టారు. హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ కీలకమైన హక్కానీ నెట్వర్క్ అధిపతి. సూసైడ్ బాంబర్ల వినియోగం హుక్కానీ నెట్వర్క్ ప్రాముఖ్యత. తాలిబన్ల మిలటరీ ప్రధానబలం. తాలిబన్లతో అంతగా ఈ నెట్‌వర్క్‌కు పొసగదని, పాక్ కారణంగా కలిసి ఉంటున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రిగా నియమితులైన ముల్లా యాకూబ్, తాలిబన్ స్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు. తాలిబన్ల ఫీల్డ్ కమాండర్లను పర్యవేక్షించే మిలటరీ కమిషన్‌కు అధిపతిగా వ్యవహరించారు. ఎవరీ అఖుంద్? ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్(65), తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌కు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదారు. గత తాలిబన్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, కాందహార్ గవర్నర్‌గా పనిచేశారు. అనంతరం ఐరాస ఆంక్షల జాబితాకెక్కారు. తాలిబన్ కమాండర్లలో అత్యంత ప్రభావశాలి అని ఐరాస పేర్కొంది. అఖుంద్ పేరును స్వయంగా తాలిబన్ అగ్రనేత ముల్లా హెబతుల్లా అఖుంద్జాదా ప్రతిపాదిం చారని పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరవైఏళ్లుగా తాలిబన్ల నాయకత్వ మండలి ‘రెహబరి షురా’కు అఖుంద్ అధిపతిగా ఉన్నారు. ఈ కూటమి అగ్రనేత అఖుంద్జాదా ఆదేశాల మేరకు అన్ని రకాల మిలీషియా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. కీలక మంత్రులు– శాఖలు ► అమీర్ ఖాన్ ముత్తఖీ: విదేశాంగ మంత్రి ►షేర్ మొహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్: విదేశాంగ సహాయ మంత్రి ► సిరాజ్ హక్కానీ: హోంశాఖ మంత్రి ► ముల్లా యాకూబ్: రక్షణ మంత్రి ► అబ్దుల్లా హకీం షరే: న్యాయ మంత్రి ► హిదాయతుల్లా బద్రి: ఆర్థిక మంత్రి ► షేక్ మవ్లావీ నూరుల్లా: విద్యా మంత్రి ► నూర్ మొహ్మద్ సాకిబ్: మత వ్యవహారాలు (చదవండి: తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి!) చదవండి: క్రికెట్ మ్యాచ్‌లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..? -
పాక్ వ్యతిరేక నినాదాలు.. కాల్పులు జరిపిన తాలిబన్లు
కాబూల్: తాలిబన్ల ఆక్రమణ నాటి నుంచి అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో హై టెన్షన్ నెలకొంది. తాలిబన్లకు పాకిస్తాన్ సహకరిస్తోందని అఫ్గనిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ తీరుకు నిరసనగా పలువురు అఫ్గన్ వాసులు పాక్ ఎంబసీ వద్ద ఆందోళనలకు దిగారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. వీరంతా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. అఫ్గన్ వాసుల చర్యల పట్ల తాలిబన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందకు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (చదవండి: పాక్ సహా ఏ దేశ జోక్యాన్ని సహించం: తాలిబన్లు) కాబూల్‌లోని పాకిస్తాన్ ఎంబసీ ఎదురుగా స్థానికుల ఆందోళనకు దిగారు. అఫ్గనిస్తాన్ వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యంపై ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో ఎంబసీ ప్రాంతం హోరెత్తిపోయింది. అయితే నిరసనలను జీర్ణించుకోలేక పోయిన తాలిబన్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. నిరసనకారులు పరుగులు పెట్టారు. తాలిబన్ల తాజా చర్యలతో వారి వైఖరి ఏ మాత్రం మారలేదని.. హింసే వారి ఆయుధమని.. శాంతి మంత్రం వారికి రుచించదని మరోసారి రుజువుయ్యింది. చదవండి: తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి! Kabul Protest started from Pakistani embassy and continued till the presidential palace. The Taliban was seen shooting after that to disperse the crowd. pic.twitter.com/yJuwYWT9vl — Sidhant Sibal (@sidhant) September 7, 2021 -
పాక్ జోక్యాన్ని సహించం
కాబూల్: అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో పాకిస్తాన్ జోక్యాన్ని నిరసిస్తూ మంగళవారం వందలాది మంది కాబూల్ రోడ్లెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ సహాయ సహకారాలు అందించిందని, పాక్ వైమానిక దాడులు జరిపి పంజ్‌షీర్ తాలిబన్ల పరం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాకిస్తాన్ లీవ్ అఫ్గానిస్తాన్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. పాక్ ఆడించినట్టు ఆడే ప్రభుత్వం తమకు వద్దని, సమ్మిళిత ప్రభుత్వమే కావాలని డిమాండ్లు చేశారు. మరోవైపు నిరసనకారులను చెదరగొట్టడానికి తాలిబన్ కమాండర్లు గాల్లో కాల్పులు జరిపారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. నిరసన ప్రదర్శనల కవరేజ్ చేస్తున్న జర్నలిస్టుల్ని తాలిబన్లు అరెస్ట్ చేసినట్టుగా అఫ్గాన్‌లో టోలో న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. హెరాత్‌లో పాక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శలపై తాలిబన్లు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఇద్దరి మృతదేహాలను నగర కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పంజ్‌షీర్‌లో విదేశీ జెట్లు దాడులు జరపడంపై ఇరాన్ కూడా తాలిబన్లను నిలదీసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. చదవండి: చమన్ బోర్డర్‌ను మూసేసిన పాక్ -
తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!
తాలిబన్ల హస్తగతమైన అఫ్గానిస్తాన్ నుంచి ఇతర దేశాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, విదేశాలకు వెళ్తున్న వారిని తాలిబన్లు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌లోని పెద్ద నగరాల్లో ఒకటైన మజర్–ఏ–షరీఫ్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన దాదాపు నాలుగు చార్టర్డ్ విమానాలను తాలిబన్లు కొన్ని రోజులుగా నిలిపివేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఆయా విమానాల్లో ప్రయాణించేందుకు సన్నద్ధమైన వందలాది మంది ప్రయాణికులు ప్రస్తుతం తాలిబన్ల వద్దే బందీలుగా ఉన్నట్లు అమెరికా రిపబ్లికన్ పార్టీ నాయకుడు, విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైఖేల్ మెక్‌కౌల్ చెప్పారు. అయితే, నాలుగు విమానాలను తాలిబన్లు ఎందుకు కదలనివ్వడం లేదన్నది ఇంకా తెలియరాలేదు. మజర్–ఏ–షరీఫ్ ఎయిర్‌పోర్టు వద్ద అఫ్గాన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నాలుగు విమానాల్లో ఉన్న ప్రయాణికులంతా అఫ్గాన్ పౌరులేనని, వారిలో చాలా మందికి పాస్‌పోర్టులు, వీసాలు, ఇతర ధ్రువపత్రాలు లేవని తెలిపారు. అందుకే దేశం విడిచి వెళ్లలేకపోతున్నారని వెల్లడించారు. అమెరికా వాదన మరోలా ఉంది. ప్రయాణికుల్లో తమ దేశ పౌరులు కూడా ఉన్నారని రిపబ్లికన్ నాయకుడు మైఖేల్ మెక్‌కౌల్ స్పష్టం చేశారు. వారు విమానాల్లోనే కూర్చొని, తాలిబన్ల చెరలో బందీలుగా ఉన్నారని చెప్పారు. బందీలను విడిచిపెట్టడానికి డిమాండ్లు చేయాలని తాలిబన్లు యోచిస్తున్నారని ఆరోపించారు. డబ్బు లేదా తాలిబన్ కొత్త ప్రభుత్వానికి చట్టబద్ధత అనేవే ఈ డిమాండ్లు కావొచ్చని చెప్పారు. సమస్యను పరిష్కరించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. నిజానికి ప్రయాణికులెవరూ తాలిబన్ల వద్ద బందీలుగా లేరని స్థానికులు తెలియజేశారు. -
‘జావేద్ అక్తర్ కుట్రపూరిత వ్యాఖలు చేస్తున్నారు’
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను తాలిబన్లతో పోల్చూతు ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దేశంలో వివాదాన్ని రాజేశాయి. జావేద్ వ్యాఖ్యలను విశ్వ హిందూ పరిషిత్ ఖండించింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారంటూ జావేద్‌పై వీహెచ్‌పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లు.. మహిళల పట్ల వ్యతిరేక ధోరణి గలిగినవారు, హింసను ప్రేరింపించే ఒక ఉగ్రవాద సంస్థ. అటువంటి సంస్థలతో ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, వీహెచ్‌పీలకు పోలికేమిటీ అంటూ దుయ్యబట్టారు. సమాజంలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్నవాళ్లు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. జావేద్ అక్తర్‌పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా వీహెచ్‌పీ నేతలు కోరారు. (చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక) జావేద్ అక్తర్ ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్ఎస్ఎస్ పని చేస్తోంది’ అని జావేద్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జావేద్ అక్తర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే. చదవండి: బీజేపీ, ఆరెస్సెస్‌లతో భారత్‌కు ప్రమాదం -
Panjshir: తాలిబన్ల పైచేయి.. పంజ్‌షీర్ కైవసం
అఫ్గనిస్తాన్‌లో హోరాహోరీగా సాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు ముగిసింది!. పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. మొత్తం ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. అఫ్గనిస్తాన్‌లో చిట్టచివరి ప్రాంతాన్ని కైవసం చేసుకోవడంలో తాలిబన్లు సఫలమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపాడు. మరోపక్క పంజ్‌షీర్ ప్రావిన్సియల్ గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడులకు సంబంధించిన పూర్తి స్థాయి నష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే తాలిబన్లను భారీ సంఖ్యలో మట్టుపెట్టామని పంజ్‌షీర్ యోధులు ప్రకటించిన రోజు వ్యవధిలోనే.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. చదవండి: పోరాటాల గడ్డ.. పంజ్‌షీర్ మరోవైపు పంజ్‌షీర్ సాయుధ దళాల నేత అహ్మద్ మసూద్ పోరాటం పక్కనపెట్టి, చర్చల కోసం హస్తం చాస్తున్నట్లు ఆదివారం సాయంత్రం ప్రకటించాడు. అయితే ఆయుధం పక్కనపెట్టే ప్రసక్లే లేదని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల తాజా ‘పంజ్‌షీర్ కైవసం’ ప్రకటన కథనాలపై స్పందించేందుకు అహ్మద్ అందుబాటులో లేకుండా పోయాడు. ఆయన పరారీలో ఉన్నట్లు లోకల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. #FahimDashty was not a fighter, he was a journalist. And killing a journalist is a war crime. One of many, alas, committed by the Taliban. He was brave and sweet. He was with #AhmadShahMassoud on Sept 9, 2001; but he did not survive the assault on #Panjshir ... #PrayForPanjshir pic.twitter.com/nOOumkhsZN — Bernard-Henri Lévy (@BHL) September 5, 2021 అఫ్గన్ జాతీయ ప్రతిఘటన దళాల ప్రతినిధి, అఫ్గన్ జర్నలిస్టుల సమాఖ్య సభ్యుడు ఫహిమ్ దాష్టీని తాలిబన్లు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. అయితే పాక్ దళాలు జరిపిన డ్రోన్ బాంబు దాడుల్లో ఆయన మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. పాక్ సహకారంతో తాలిబన్లు పంజ్‌షీర్‌ను కైవసం చేసుకుందని అంతర్జాతీయ మీడియా జర్నలిస్టులు కొందరు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో పంజ్‌షీర్‌లో మారణహోమం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. చదవండి: భారీ నష్టం తాలిబన్లకేనా? -
Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్ గురించి తెలుసా?
పంజ్‌షీర్.. కొద్ది రోజులుగా ఈ పేరు అంతర్జాతీయంగా మారు మోగుతోంది. చుట్టూ పర్వతాలే కోట గోడలా రక్షణనిస్తున్న ఆ లోయవైపు ఇన్నాళ్లూ ఎవరూ కన్నెత్తి కూడా చూడలేకపోయారు. ఇప్పుడు తాలిబన్లు ఆ లోయపై పట్టు బిగించాలని చూస్తూ ఉంటే మరోవైపు తాలిబన్ వ్యతిరేక శక్తులు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఎందుకీ లోయపై తాలిబన్లకు అంత మక్కువ? అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌కు ఈశాన్యంగా 150 కి.మీ. దూరంలో హిందుకుష్ పర్వత సానువుల్లో పంజ్‌షీర్ లోయ ఉంది. దీనిని అయిదు సింహాల లోయ అని కూడా పిలుస్తారు. ఈ లోయకి ఆ పర్వతాలే రక్షణ కవచాల్లా నిలుస్తాయి. ఈ లోయలోకి వెళ్లాలంటే పంజ్‌షీర్ నది వల్ల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక ఇరుకైన రహదారి మాత్రమే మార్గం. అందుకే అక్కడి స్థానికులకు ఈ లోయను కాపాడుకోవడం అత్యంత సులభంగా మారింది. భౌగోళికంగా చూస్తే అఫ్గాన్‌తో సంబంధం లేనట్టుగానే ఉంటుంది కానీ దేశంలో ఉన్న 34 ప్రావిన్స్‌లలో పంజ్‌షీర్ కూడా ఒకటి. చారిత్రకంగా చూస్తే పలుమార్లు నిర్ణయాత్మక పాత్రని పోషించింది. మొదట్నుంచి ఎవరికీ తలవంచకుండా సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఈ లోయపై ఆధిపత్యం సాధించడానికి తాలిబన్లు ఈసారి తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. పోరాటాల గడ్డ పంజ్‌షీర్ అంటే అహ్మద్ షా మసూద్ గురించి చెప్పుకోవాలి. 1953 సంవత్సరంలో ఈ లోయలో జన్మించిన మసూద్ తనకంటూ ఒక గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇస్లాం మత శక్తులతో తనలో చివరి ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతూ వచ్చారు. పంజ్‌షీర్ లోయ స్వతంత్రతని కాపాడారు. 1980 దశకంలో అఫ్గాన్‌ను సోవియెట్ యూనియన్ దురాక్రమణ చేసినప్పుడు, 1990 నాటి అంతర్యుద్ధం సమయంలో, తాలిబన్లు దేశాన్ని పాలించిన 1996–2001 మధ్య కాలంలో కానీ ఈ లోయ ఎప్పుడూ ఎవరి వశం కాలేదంటే మసూద్ పోరాట పటిమే కారణం. ఆ లోయలో లక్షా 50 వేల మంది వరకు నివసిస్తారు. వారంతా తాజిక్ తెగకు చెందిన వారు. మరోవైపు పాస్తూన్ తెగ వారు ఎక్కువగా తాలిబన్ ముఠాలో చేరారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మçసూద్ శక్తియుక్తులతో వారు ఆ లోయవైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. పంజ్‌షీర్ లోయతో పాటు చైనా, తజికిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య పాకిస్తాన్ వరకు ఆయన ప్రభావమే ఉండేది. మసూద్‌కి సంప్రదాయ ఇస్లామ్ భావాలు ఉన్నప్పటికీ సమాజంలో మహిళలకు సమాన స్థానం ఇవ్వాలని ఆరాటపడేవారు. అయితే మసూద్ గ్రూప్ సభ్యులే ఎక్కువగా మానహక్కుల్ని హరించారన్న విమర్శలు ఉన్నాయి. 2001లో మసూద్‌ని అల్‌ఖాయిదా ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు అహ్మద్ మసూద్ తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ లోయను నడిపిస్తున్నారు. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా మొహమ్మద్‌లు కూడా ఆయనకు సహకరిస్తూ లోయను కాపాడుతున్నారు. పచ్చల లోయ ఈ లోయలో ఎక్కువగా ఎమరాల్డ్ (పచ్చలు) లభిస్తాయి. ఇప్పటివరకు ఇంకా తవ్వకం చేపట్టని ఎన్నో పచ్చల గనులు ఉన్నాయి. అవే ఈ ప్రాంతానికి ప్రధాన ఆదాయ వనరు. అమెరికా నాటో దళాలు స్వాదీనంలో అఫ్గాన్ ఉన్నప్పుడు ఈ లోయలో కూడా ఎంతో అభివృద్ధి జరిగింది. అఫ్గాన్‌లో ఇంధనానికి ఒక హబ్‌గా మారింది. ఎన్నో జలవిద్యుత్ ఆనకట్టల్ని ఈ లోయలో నిర్మించారు. విద్యుత్‌లో స్వయంసమృద్ధిని సాధించిన ప్రాంతం ఇదొక్కటే. పచ్చల గనులతో ఆర్థికంగా పటిష్టంగా ఉండడంతో తాలిబన్లు ఈ లోయని ఆక్రమించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. పంజ్‌షీర్‌కు ఎదురయ్యే సవాళ్లేంటి ? పంజ్‌షీర్‌లో పచ్చలు, వెండి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆహారం, వైద్యం అవసరాల కోసం అఫ్గాన్‌లో ఇతర ప్రాంతాలపై ఆధారపడక తప్పదు. ప్రస్తుతం ఈ లోయ చుట్టూ తాలిబన్లు తమ కమాండర్లను మోహరించారు. ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల సరఫరా నిలిపివేశారు. అయితే ఆ లోయలో వచ్చే చలికాలం వరకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరించే ఆ లోయ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేలా కనిపిస్తోంది. పంజ్‌షీర్‌పై పూటకొక రకమైన వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అంతిమ విజయం ఎవరిదో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Afghanistan- Panjshir: పంజ్‌షీర్‌లో హోరాహోరీ
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తమ స్వాదీనంలో లేని ఒకే ఒక్క ప్రావిన్స్ పంజ్‌షీర్‌ను ఎలాగైనా తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలతో ఆ లోయలో హోరాహోరీ పోరాటం జరుగుతోంది. తాలిబన్లు, వారిని గట్టిగా ప్రతిఘటిస్తున్న నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ (ఎన్ఆర్ఎఫ్ఏ) ఎవరికి వారే తమదే పై చేయిగా ఉందని చెప్పుకుంటున్నారు. ఖవాక్ మార్గం వద్ద వందలాది మంది తాలిబన్లతో జరిగిన పోరులో 700 మందికిపైగా తాలిబన్లు మరణించారని, మరో 600 మందిని నిర్బంధించి జైళ్లలో ఉంచామని ఎన్ఆర్ఎఫ్ఏ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మరోవైపు తాలిబన్లు పంజ్‌షీర్ ప్రావిన్స్ బజారక్‌లోకి ప్రవేశించి గవర్నర్ కార్యాలయాన్ని చుట్టుముట్టినట్టుగా వార్తలు వచ్చినప్పటికీ అదంతా ఉత్తదేనని తేలింది. పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో ఉన్న ఏడు జిల్లాలకు గాను నాలుగు జిల్లాలైన షూతల్, అనాబా, ఖింజ్, ఉనాబాలపై పట్టు సాధించామని తాలిబన్ అధికార ప్రతినిధి బిలాల్ కరిమి వెల్లడించినట్టుగా అస్వాకా న్యూస్ ఏజెన్సీ కథనాన్ని ప్రచురించింది. మానవీయ సంక్షోభాన్ని నివారించండి: యూఎన్‌కు సలేహ్ లేఖ పంజ్‌షీర్ లోయపై తాలిబన్లు భీకరంగా దాడి చేస్తున్నారని, ఈ లోయలో మానవీయ సంక్షోభం ముంచుకొస్తుందని అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్ల దాడుల్ని అడ్డుకొని మానవీయ సంక్షోభం నుంచి లోయని కాపాడాలంటూ ఆయన ఐక్యరాజ్యసమితి(యూఎన్)కి ఒక లేఖ రాశారు. తమ లోయకి తాలిబన్లు కమ్యూనికేషన్లని కట్ చేశారని, ఆర్థికంగా కూడా దిగ్బంధిస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం తాలిబన్ల దాడిని అడ్డుకొని చర్చల ద్వారా ఒక రాజకీయ పరిష్కారానికి కృషి చెయ్యాల్సిన అవసరం ఉందని సలేహ్ ఆ లేఖలో పేర్కొన్నారు. చర్చలకు సిద్ధం: మసూద్ తాలిబన్లు పంజ్‌షీర్, అంద్రాబ్‌ల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటే వారితో చర్చలకు సిద్ధమని ఎన్ఆర్ఎఫ్ఏ నాయకుడు అహ్మద్ మసూద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘శాంతియుతంగా తాలిబన్లతో విభేదాలను పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నాం. వివిధ గ్రూపులు, తెగలతో సమ్మిళిత అధికార వ్యవస్థ నెలకొంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు. దేశీయ విమానాలు షురూ... కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం నుంచి పరిమిత సంఖ్యలో దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. జాతీయ విమానసంస్థ అరియానా అఫ్గాన్ ఎయిర్‌లైన్స్‌హెరాత్, కాందహార్, బాల్ఖ్‌లకు విమానాలను నడిపింది. రాడార్ వ్యవస్థ లేనందువల్ల పగటి పూట మాత్రమే విమానాలు నడుస్తున్నాయి. కాబూల్ విమానాశ్రయం పునరుద్ధరణకు ఖతార్, టర్కీ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవల పునరుద్ధరణ మానవతా సాయానికి వీలుకలి్పస్తుందని యూఎన్ పేర్కొంది.