
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ ఎన్నికల కమిషన్‌ను తాలిబన్ల ప్రభుత్వం రద్దు చేసింది. స్వతంత్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల ఫిర్యాదుల కమిషన్‌ను రద్దు చేస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి (డిప్యూటీ) బిలాల్ కరీమి ఆదివారం వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో అఫ్గాన్‌లో ఈ వ్యవస్థలు అనవసరం. భవిష్యత్తులో అవసరమైతే వీటిని పునరుద్ధరిస్తాం’ అని తెలిపారు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖను, శాంతి స్థాపన మంత్రిత్వ శాఖలనూ మూసివేస్తున్నట్లు బిలాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment