dissolved
-
బంగ్లా సంక్షోభం: పార్లమెంట్ రద్దు
ఢాకా: బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశ పార్లమెంట్ రద్దు అయింది. ఈ మేరకు అధ్యక్షుడు మహ్మద్ షాహబుద్దీన్ ఓ ప్రకటన విడుదల చేశారు. రిజర్వేషన్ల కోటా నిరసనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. అనంతరం ఆర్మీ నియంత్రణలోకి వెళ్లిన బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా చర్చలు జరుపుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. చదవండి: బంగ్లాదేశ్ పరిస్థితులను గమనిస్తున్నాం: కేంద్ర మంత్రి జైశంకర్నూతన ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా మహ్మమద్ యూనస్‌ను నియమించాలంటూ నిరసనలు చేస్తున్న విద్యార్థి సంఘాల ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ నిరసన విద్యార్థి నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన వెంటనే నిన్న భారత్‌కు చేరుకున్నారు షేక్ హసీనా. ఘజియాబాద్ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు సైనిక విమానంలో వచ్చిన షేక్ హసీనా లండన్ వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. హసీనా వెంట ఆమె సోదరి హసీనా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి రహస్య ప్రదేశంలో ఉన్న హసీనా బ్రిటన్ సర్కార్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే బ్రిటన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆదేశం నుంచి అనుమతి రాగానే లండన్ బయలు దేరి వెళ్లే అవకాశం ఉంది. -
Aung San Suu Kyi: ఎన్ఎల్డీ పార్టీ గుర్తింపు రద్దు
మయన్మార్ జుంటా గవర్నమెంట్ (మిలిటరీ ప్రభుత్వం) మంగళవారం సంచలన ప్రకటన చేసింది. మిలిటరీ ప్రభుత్వ పర్యవేక్షణలోని ఎన్నిక సంఘం ప్రతిపక్ష నేత ఆంగ్ సాన్ సూకీకి భారీ షాక్ ఇచ్చింది. సూకీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ‘నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ’(NLD) పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది మయన్మార్ ఈసీ. కొత్త సైనిక-ముసాయిదా ఎన్నికల చట్టానికి అనుగుణంగా.. ఎన్ఎల్డీ పార్టీ తన రిజిస్ట్రేషన్‌ను తిరిగి నమోదు చేసుకోవడంలో విఫలమైందని, అందుకే గుర్తింపు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మయన్మార్‌లో కఠిన ఎన్నికల చట్టం తీసుకొచ్చింది జుంటా మిలిటరీ ప్రభుత్వం. దాని ప్రకారం.. కేసులు ఎదుర్కొంటున్న వాళ్లు, అజ్ఞాతంలో ఉన్నవాళ్లు, ఇంకా పలు నిబంధంనల కింద.. రాజకీయ పార్టీలను అధికారికంగా నమోదు చేయడానికి వీల్లేదు. తద్వారా ప్రత్యర్థి పార్టీల అడ్డుతొలగించుకునేందుకు మిలిటరీ ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఈ క్రమంలో.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నప్పటికీ, విపక్షాల నుంచి విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఈ ఏడాది జనవరి నుంచి పార్టీల రీ రిజిస్ట్రేషన్లకు రెండు నెలల గడువు ఇచ్చింది. ఆ దేశంలోని మొత్తం 90 పార్టీలకుగానూ 50 పార్టీలు మాత్రమే రీ రిజిస్ట్రేషన్ ద్వారా అర్హత సాధించుకున్నాయి. ఇక మిగతా పార్టీల గుర్తింపు(సూకీ ఎన్ఎల్డీ సహా) బుధవారం(నేటి) నుంచి రద్దు కానున్నాయి. మయన్మార్ ఉద్యమ నేత అయిన ఆంగ్ సాన్ సూకీ 1988లో ఎన్‌ఎల్‌డీని స్థాపించారు. 1990 ఎన్నికలలో ఘనవిజయం సాధించగా.. అప్పటి జుంటా(మిలిటరీ) ఆ ఎన్నికను రద్దు చేసింది. అయినప్పటికీ ఆమె ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే వస్తున్నారు. ఈ క్రమంలో 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమె మిలిటరీ భాగస్వామ్య పార్టీలను మట్టికరిపించి కూటమి పార్టీల సాయంతో ఘన విజయం సాధించారు. ఇదిలా ఉంటే.. 2020లో జరిగిన ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఘన విజయం సాధించింది. కానీ, ఎన్నికల్లో మోసం జరిగిందంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ.. కిందటి ఏడాది ఫిబ్రవరిలో జుంటా మిలిటరీ నేతలు తిరుగుబాటుకి దిగారు. ఆపై సూకీని జైలు పాలు చేయడంతో పాటు పలు నేరాల కింద ఆమెకు శిక్షలు విధిస్తూ వెళ్తున్నారు. వివిధ కేసుల్లో పడిన జైలుశిక్ష ఇప్పటిదాకా మొత్తం 33 ఏళ్లకు చేరుకుంది. ఒకవైపు ఆమెపై కేసులు, వాటి విచారణ పరంపర కొనసాగుతోంది. అందులో అవినీతి, రహస్య సమాచార లీకేజీ తదితర ఆరోపణలు ఉండడం గమనార్హం. మరోవైపు మిలిటరీ నేతల పాలనలో మయన్మార్ గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇంకోవైపు సూకీని రిలీజ్ చేయాలని ఇటీవల యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్ ఓ ప్రకటనలో కోరింది. -
దర్జాగా పడుకోండి.. ఫోన్ చూస్తూ, పేపర్ చదువుతూ బరువు తగ్గండి! ఎలాగంటారా?
‘ఏ కష్టం లేకుండా వచ్చిపడిన ఊబకాయాన్ని తగ్గించాలంటే మాత్రం కచ్చితంగా కష్టపడాలి’ అనేది ఒకప్పటి మాట. ఎంత సులభంగా పెరిగారో అంతే సౌఖ్యంగా తగ్గొచ్చంటోంది ఇప్పటి టెక్నాలజీ. సౌఖ్యమంటే అట్టాంటి ఇట్టాంటి సౌఖ్యం కాదు. దర్జాగా పడుకుని, ఫోన్ లేదా పేపర్ చూస్తూ హ్యాపీగా బరువు తగ్గొచ్చన్న మాట. ఈ స్టీమింగ్ బాడీ బ్లాంకెట్.. ఫార్ ఇన్ఫ్రారెడ్ డిజిటల్ హీట్ థెరపీతో బాడీలోని కొవ్వుని ఇట్టే కరిగించేస్తుంది. అదనంగా శరీరానికి సరికొత్త నిగారింపునూ అందిస్తుంది. దీన్ని ఒకవైపు నుంచి ఓపెన్ చేసి, చిత్రంలో ఉన్న విధంగా ఉపయోగించాలి. చేతులు బయటికి తీసుకునేందుకు ఇరువైపులా రెండు జిప్పులు ఉంటాయి. చదవండి: వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులు... ముప్ఫై నిమిషాలు ఈ బ్లాంకెట్‌లో రెస్ట్ తీసుకుంటే.. ఒక గంట స్విమ్మింగ్‌కు, ఒక గంట రన్నింగ్‌కు.. ఒక గంట సైకిల్ రైడ్‌కు.. వంద సిటప్స్కు.. లేదా 30 నిమిషాల యోగాకు సమానమట. ఈ బ్లాంకెట్ ఇన్ఫ్రారెడ్ లేయర్, వాటర్ ప్రూఫ్ లేయర్, షీల్డ్ లేయర్, థర్మల్ లేయర్, టెంపరేచర్ కంట్రోల్ లేయర్, హీట్ లేయర్, ఇన్సులేషన్ లేయర్ వంటి 7 సమర్థవంతమైన లేయర్స్‌తో రూపొందింది. దీన్ని వినియోగించే సమయంలో.. ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుందని గుర్తించిన వెంటనే.. ఒక నిమిషం పాటు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఈ థెరపీని క్రమం తప్పకుండా తీసుకుంటే.. కొవ్వు తగ్గి.. చర్మకణాలు పునరుత్తేజం చెంది, రోగనిరోధక శక్తి, జీవక్రియ మెరుగుపడతాయి. అలసట తగ్గుతుంది. చిత్రంలోని బ్లాంకెట్‌తో పాటు ఇంటెలిజెంట్ కంట్రోల్ బాక్స్, ఒక రిమోట్ లభిస్తాయి. బాక్స్ మీద టైమ్ డిస్ప్లే, స్టార్ట్ బటన్, టెంపరేచర్ కంట్రోల్, టెంపరేచర్ డిస్ప్లే, సేఫ్టీ స్విచ్.. ఇలా సెట్టింగ్స్ ఉంటాయి. ఈ డివైజ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇదొక హోమ్ స్పా లాంటిది. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు.. తీరిక దొరికినప్పుడు ఆన్ చేసుకుని ఓ వైపు సేదతీరుతూనే ఇంకో వైపు కొవ్వు కరిగించుకోవచ్చు. అందంతో పాటు ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు. -
టీఎంసీ కార్యవర్గం రద్దు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌లో నానాటికీ పెరిగిపోతున్న అసమ్మతిని, యువ–సీనియర్ విభేదాలను కట్టడి చేయడంపై పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టి సారించారు. అందులో భాగంగా పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో 20 మందితో నూతన జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్న మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు యువ, సీనియర్ నేతలకు స్థానం కల్పించారు. కొత్త కార్యవర్గాన్ని మమత త్వరలో ప్రకటిస్తారని సీనియర్ నాయకుడు పార్థ బెనర్జీ మీడియాకు తెలిపారు. భేటీలో అభిషేక్ కూడా పాల్గొన్నారు. తృణమూల్‌లో వృద్ధ, యువతరం నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. అభిషేక్ నాయకత్వంలో యువ నేతలు ‘ఒక వ్యక్తికి ఒకే పోస్టు’ నినాదాన్ని తెరపైకి తేవడం తెలిసిందే. జోడు పదవుల్లో ఉన్న పలువురు సీనియర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
ఎన్నికల కమిషన్‌ను రద్దు చేసిన తాలిబన్లు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ ఎన్నికల కమిషన్‌ను తాలిబన్ల ప్రభుత్వం రద్దు చేసింది. స్వతంత్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల ఫిర్యాదుల కమిషన్‌ను రద్దు చేస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి (డిప్యూటీ) బిలాల్ కరీమి ఆదివారం వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో అఫ్గాన్‌లో ఈ వ్యవస్థలు అనవసరం. భవిష్యత్తులో అవసరమైతే వీటిని పునరుద్ధరిస్తాం’ అని తెలిపారు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖను, శాంతి స్థాపన మంత్రిత్వ శాఖలనూ మూసివేస్తున్నట్లు బిలాల్ తెలిపారు. -
నో మోర్ పాలిటిక్స్: కుండబద్దలు కొట్టిన రజనీ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులతో తిరిగి సమావేశం అవుతున్న నేపథ్యంలో రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తాడంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ స్పందించాడు. రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. అంతేకాదు రాజకీయ పార్టీగా చెప్తున్న రజినీ మక్కల్ మండ్రంను రద్దు చేస్తున్నట్లు రజనీకాంత్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు సోమవారం అభిమానులతో సమావేశమైన తలైవా.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. అంతేకాదు రజనీ మక్కల్ మండ్రంను ఫ్యాన్స్ క్లబ్‌గా కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. ఇక అనారోగ్యం రీత్యా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్.. తాజాగా మరోసారి చర్చల నేపథ్యంలో ఊహాగానాలు రావడంతో ఇలా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ‘అన్నాతే’ సినిమాలో నటిస్తున్న రజనీ.. అరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ మధ్యే అమెరికాకు వెళ్లి వచ్చాడు. కరోనా, తమిళనాడు ఎన్నికలు, అమెరికా చెకప్ నేపథ్యంలో అభిమానులకు ఇంతకాలం దూరంగా ఉన్నానని, ఈ నేపథ్యంలోనే సమావేశం అయ్యానని ఆయన సమావేశం ముందు మీడియాకు స్పష్టం చేశాడు. అయితే రాజకీయ భవిష్యత్త్ పైనా ఈ చర్చల తర్వాత స్పష్టం చేస్తానని చెప్పిన రజినీ.. ఊహాగానాలకు తెరదించుతూ ఇక రాజకీయాలు లేనట్లేనని స్పష్టం చేశాడు. -
హెచ్‌సీఏలో కొత్త ట్విస్ట్; అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేసిన అంబుడ్స్‌మన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్నట్లు అంబుడ్స్‌మన్ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్ కౌన్సిల్ రద్దు చేస్తున్నట్లుగా అంబుడ్స్‌మన్ తెలిపింది. కాగా ఇటీవలే హెచ్‌సీఏలోని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అజహర్ ఫిర్యాదును పరిశీలించిన అంబుడ్స్‌మన్ అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే దీనిపై అపెక్స్ కౌన్సిల్ స్పందిస్తూ అసలు అంబుడ్స్‌మన్ నియామకం చెల్లదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబుడ్స్‌మన్‌గా దీపక్ వర్మను అజార్ ఏకపక్షంగా నియమించాడని.. ఆ వ్యక్తి అజహర్ చెప్పినట్టే వ్యవహరిస్తాడని పేర్కొంది. కాగా రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. -
ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు
గత రెండేళ్లుగా... ప్రత్యేకించి మొన్న ఫిబ్రవరి మొదలుకొని రాజకీయంగా వరస సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చివరికి మరోసారి జనం తీర్పు కోరడానికి సిద్ధపడ్డారు. బడ్జెట్ ఆమోదంపై రాజకీయ పక్షాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఇజ్రాయెల్ పార్లమెంట్ కెన్సెట్ ఆ దేశ రాజ్యాంగ నిబంధన ప్రకారం రద్దయింది. నాలుగేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు కాస్తా మొదటి రెండేళ్ల వ్యవధిలోనే నాలుగో దఫా నిర్వహించక తప్పడంలేదు. కొత్త సంవత్సరం మార్చిలో జరిగే ఈ ఎన్నికలు ఆయనకు అన్నివిధాలా అగ్నిపరీక్షే. నెతన్యాహూ సాధారణ రాజకీయవేత్త కాదు. వ్యూహరచనా నిపుణుడు. ఎత్తుగడల్లో ఆరితేరినవాడు. మొన్న మార్చిలో పార్లమెంటుకు మూడోసారి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. 120 మంది సభ్యులుండే పార్లమెంటులో నెతన్యాహూ నేతృత్వంలోని మితవాద లికుడ్ పార్టీకి కేవలం 36 స్థానాలు మాత్రమే వచ్చాయి. మధ్యేవాద పక్షమైన బ్లూ అండ్ వైట్ పార్టీకి 33 స్థానాలు లభించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన కనీస మెజారిటీ 61. ఇతర పార్టీలకు చెప్పుకోదగ్గ రీతిలో సీట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో చివరికి తాను గట్టిగా వ్యతిరేకించే బ్లూ అండ్ వైట్ పార్టీతో చేతులు కలిపి నెతన్యాహూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో బ్లూ అండ్ వైట్ పార్టీ నేత బెన్నీ గాంట్జ్కూ, నెతన్యాహూకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 18 నెలలు నెతన్యాహూ, మిగిలిన నెలలు గాంట్జ్ పాలించాలి. కానీ దాన్ని కాస్తా నెతన్యాహూ బేఖాతరు చేయదల్చుకున్నారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన తాను ప్రధాని స్థానంలో వుండి ఆ కేసుల్ని ఎదుర్కొనాలి తప్ప మాజీగా మిగలకూడదని ఆయన గట్టిగా కోరుకున్నారు. అందుకే బడ్జెట్ ఆమోదానికి ప్రయత్నించి, ప్రధాని కావాలని ఆరాటపడిన గాంట్జ్ ఆశలకు ఆయన గండికొట్టారు. కెన్సెట్ రద్దుకు పరోక్షంగా కారకులయ్యారు. అయితే ఇద్దరికీ రెండు పార్టీల్లోనూ ప్రత్యర్థుల బెడద ఎక్కువే. నెతన్యాహూకు ఒకప్పుడు శిష్యుడిగా వుండి పార్టీలో గట్టి ప్రత్యర్థిగా ఎదిగిన గిడియన్ జార్ ఇటీవలే ఆ పార్టీనుంచి నిష్క్రమించి న్యూహోప్ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. జార్ వెళ్లిపోయినా నెతన్యాహూకు పార్టీలో ప్రత్యర్థులు తక్కువేమీ లేరు. గాంట్జ్ పరిస్థితి కూడా అంతే. నెతన్యాహూతో చేరొద్దని, దానికి బదులు పార్లమెంటుకు మరోసారి ఎన్నికలు రావడమే మేలని నచ్చజెప్పారు. కానీ ఆయన వినలేదు. చివరకు ఈ చెలిమివల్ల రెండూ తీవ్రంగానే నష్టపోయాయి. అయితే నెతన్యాహూ పార్టీయే ఈసారి ఎన్నికల్లో కూడా అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని మీడియా సర్వేలు చెబుతున్నాయి. దానికి 27 సీట్లు రావొచ్చునని సర్వేలు చెబుతున్న మాట. గత ఎన్నికల్లో 33 స్థానాలు గెల్చుకున్న బ్లూ అండ్ వైట్ పార్టీ మాత్రం ఈసారి ఆరు స్థానాలకు పరిమితమవుతుందని అంటున్నాయి. ఏడు దశాబ్దాల ఇజ్రాయెల్ చరిత్రంతా అరబ్ వ్యతిరేకతతో, ముఖ్యంగా పాలస్తీనాపై కత్తులు నూరడంతో ముడిపడి వుంటుంది. అందుకే ప్రతి ఎన్నికలకూ ముందు పాలస్తీనాపై నిప్పులు కక్కడం లేదా దానిపై దాడులు చేయడం ఇజ్రాయెల్‌లో ఎవరు అధికారంలో వున్నా రివాజు. గత ఎన్నికల సమయంలో అయితే నెతన్యాహూ పాలస్తీనా అధీనంలో వున్న వెస్ట్‌బ్యాంకు ప్రాంతాలన్నిటినీ స్వాధీనం చేసుకుంటానని వాగ్దానం చేశారు. దేశంలో అరబ్ పార్టీల కూటమి జాయింట్ లిస్టును ఎలాగైనా అధికారంలోకి రానీకుండా చేయాలని ఇజ్రాయెల్ పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తుంటాయి. వాస్తవానికి 2019 ఎన్నికల్లో జాయింట్ లిస్టు కింగ్ మేకర్‌గా ఆవిర్భవించింది. తమతో చేతులు కలిపితే ప్రధాని పదవి దక్కుతుందని, అవినీతిపరుడైన నెతన్యాహూను అధికారానికి దూరం పెట్టొచ్చునని జాయింట్ లిస్టు గాంట్జ్‌కు ప్రతిపాదన పంపినా అంగీకరించలేదు. జాయింట్ లిస్టుతో కలవొద్దన్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే నెతన్యాహూను కూడా అంగీకరించొద్దని అనుచరులు సూచించినా గాంట్జ్ వినలేదు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు ముందు ఎప్పుడూ రాజకీయాలు వ్యక్తి కేంద్రంగా లేవు. తీవ్ర అరబ్ వ్యతిరేకతే అన్ని పార్టీలకూ ఊపిరి. అదే సమయంలో అరబ్ పార్టీల కూటమి చెప్పుకోదగ్గ స్థానాలు గెల్చుకుంటూ వుంటుంది. కానీ నెతన్యాహూ నాయకత్వ స్థానంలోకొచ్చాక అది మారింది. ఆయనకు వ్యతిరేకంగా కొత్త పార్టీలు పుట్టుకురావడం, ఆయన్ను వ్యతిరేకించడం మినహా వాటికి మరో రాజకీయ కార్యక్రమం లేకపోవడం రివాజైంది. ఇజ్రాయెల్‌కు లిఖితపూర్వక రాజ్యాంగం లేదు. అక్కడి పార్టీలకు నిర్దిష్టమైన రాజకీయ సిద్ధాంతం లేదు. పాలస్తీనా వ్యతిరేకత, యూదు జాత్యహంకారం, రాజకీయ నాయకుల స్వప్రయోజనాలు మాత్రమే మిగిలాయి. వీటికి గత రెండేళ్లుగా దేశాన్ని పీడిస్తున్న రాజకీయ అనిశ్చితి తోడైంది. దీనికి మూలాలు ఇజ్రాయెల్ ఆవిర్భావంలోనే వున్నాయి. వెస్ట్‌బ్యాంకు ప్రాంతంలోని యూదు కాలనీలను క్రమేపీ పెంచుకుంటూ పోవడం, అలా పెంచుతామని హామీ ఇవ్వడమే అన్ని పార్టీలకూ రివాజైంది. ఇదంతా క్రమేపీ దేశంలో మితవాద పక్షం బలపడటానికి దారితీసింది. అంతవరకూ పెద్దగా ప్రజాభిమానంలేని మితవాద పక్షం లికుడ్ పార్టీ 1977లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికొచ్చింది. వామపక్ష ప్రాభవం అంతరించడం మొదలైంది. 1995లో లేబర్ పార్టీ నేత ఇట్జాక్ రాబిన్‌ను మితవాద తీవ్రవాద పక్షం హత్య చేయడంతో దేశ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అన్ని పరిణామాల్లోనూ నెతన్యాహూ కీలక భూమిక పోషించి, లికుడ్ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు తగిన ఆధారాలున్నాయని ఇప్పటికీ ఇజ్రాయెల్ సమాజం విశ్వసిస్తోంది. అదే సమయంలో ఆయన తప్ప గత్యంతరం లేదనుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే మార్చిలో జరగబోయే ఎన్నికల అనంతరం మళ్లీ నెతన్యాహూయే అధికారానికొస్తారా లేక ఈ అనిశ్చితి మరింత తీవ్రమవుతుందా అన్నది చూడాల్సివుంది. -
నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం
ఖట్మండ్: నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. గత కొన్ని నెలలుగా సొంత పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదివారం నేపాల్ పార్లమెంట్ రద్దును ప్రతిపాదించారు. ఆయన తీసుకున్న పార్లమెంట్ రద్దు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రతులను కేబినెట్ నేపాల్ ప్రెసిడెంట్‌కు పంపించింది. ప్రధాని నిర్ణయాన్ని అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్సీపీ) నేతలు తప్పబడుతున్నారు. ప్రధాని అనూహ్య నిర్ణయం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: నేపాల్ సంక్షోభం.. -
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే వెళ్లిపోయారు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరంలోని ద్వారకానగర్‌లో అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆచూకీ తెలిసింది. తమను వెతకవద్దంటూ మెసేజ్ పెట్టి ముగ్గురు యువతులు ఈ నెల 18వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారి ఆచూకీ కనిపెట్టేందుకు ఉన్నతాధికారులు మూడు ప్రత్యేక పోలీసులు బృందాలను ఏర్పాటు చేశారు. అదృశ్యమైన తర్వాత రోజు ముగ్గురు యువతులు తాము చైన్నైలో ఉన్నట్లు తండ్రికి మెసేజ్ పంపారు. పోలీసులు రంగంలోకి దిగి, ఫోన్ లోకేషన్ ఆధారంగా వారు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి, పట్టుకున్నారు. ద్వారకానగర్ బుదిల్‌పార్క్ సమీపంలో నివసిస్తున్న మింది అనూరాధ(22), తులసీ(20), కోమలి(17) సొంత అక్కాచెల్లెళ్లు. సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ‘అమ్మా.. మేం చనిపోతున్నాం. మమ్మల్ని వెతకొద్దు’ అని తమ తల్లి మొబైల్ ఫోన్‌కు మెసేజ్ పంపారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. మంగళవారం ముగ్గురు అక్కాచెల్లెళ్లు మళ్లీ తల్లి మొబైల్ ఫోన్‌కి తాము చెన్నైలో క్షేమంగా ఉన్నామని మెసేజ్ పెట్టారు. వారు చెన్నైకి ఎందుకు వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు విశాఖపట్నం నుంచి చెన్నైకి ఓ ప్రైవేట్ బస్సులో వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ ఒకరోజు ఉండి, బెంగళూరుకు వెళ్లినట్లు తేల్చారు. వారిని బెంగళూరులో పట్టుకుని, విశాఖపట్నానికి తీసుకొస్తున్నారు. ఇష్టం లేని వివాహం చేస్తున్నారన్న కారణంతోనే అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. (‘మేం చనిపోతున్నాం.. మా కోసం వెతకద్దు’) -
హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ యూనిట్ రద్దు
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ తన పార్టీకి సంబంధించిన యూనిట్‌ను రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనీయర్ నాయకుడు కె.సి. వేణుగోపాల్ బుధవారం పేర్కొన్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కుల్దీప్ సింగ్ రాథోర్ మాత్రం పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. 'హిమాచల్‌ప్రదేశ్‌లో పీసీసీ ,డీసీసీ, బీసీసీ ఎగ్జిక్యూటివ్ పదవులతో పాటు ఆఫీస్ బేరర్లను తొలగిస్తున్నాం. అయితే హెచ్‌సీసీ పదవి మాత్రం యధాతథంగా కొనసాగుతుందని' వేణుగోపాల్ పేర్కొన్నారు. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్ర అధ్యక్ష పదవికి కుల్దీప్ సింగ్ రాథోర్ జనవరిలో నియమితులయ్యారు. గతంలో కూడా గుజరాత్, కర్నాటకలోనూ ఇదే తరహాలో కాంగ్రెస్ తన యూనిట్లను రద్దు చేసి పీసీసీ పదవుల్ని మాత్రం అలాగే కొనసాగించింది. -
‘కర్ణాటక కాంగ్రెస్’ రద్దు
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, సంకీర్ణ ప్రభుత్వంతో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తుల వల్ల కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ)ని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రద్దు చేసింది. కేవలం అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు తప్ప మిగిలిన వారిని తొలగిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 చోట్ల పోటీ చేస్తే కేవలం ఒక్క సీటును మాత్రమే గెలవడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేపీసీసీ చీఫ్ దినేశ్ గుండూ రావు అన్నారు. పార్టీ చీఫ్‌గా తాను, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈశ్వర్ ఖండ్రే కలసి పార్టీని పునర్వ్యవస్థీకరించి, బలపరచాల్సి ఉందన్నారు. నిజాయితీతో పని చేసేవారికే... పార్టీలో నూతన కార్యవర్గానికి అవకాశం కల్పిస్తామని, నిజాయితీగా పనిచేస్తూ పార్టీకి విధేయులుగా ఉండే వారికే అవకాశం ఇస్తామని దినేశ్ స్పష్టం చేశారు. 280 మందిని తొలగించి అదే స్థాయిలో నాయకులను నియమించే అవకాశం ఉంది. నిజం చెబితే తొలగిస్తారా ? లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయానికి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ దినేశ్ వంటి కొందరు నేతలే కారణమంటూ కాంగ్రెస్ మైనార్టీ నేత రోషన్ బేగ్ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపధ్యంలో ఏఐసీసీ ఆయనను కాంగ్రెస్ నుంచి తొలగించింది. నిజాలు మాట్లాడితే తొలగిస్తారా ? నాపై చర్యలు తీసుకున్నారు సరే.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వాళ్లపై చర్యలు లేవా అంటూ మండిపడ్డారు. -
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
-
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఆమోదం తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలని సిఫారసు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ మంగళవారం ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. దాంతో ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రపతి ఆమోదం లాంఛనమైంది. ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో చర్చించిన అనంతరం మూడు పార్టీలు విముఖత వ్యక్తం చేయటంతో అసెంబ్లీని రద్దు చేయాలని నజీబ్‌జంగ్ సిఫారసు చేశారు. మైనార్టీ సర్కారు ఏర్పాటుపై విముఖంగా ఉన్న కమలనాథులు ఎన్నికలను ఎదుర్కొనేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో నజీబ్ జంగ్ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక సమర్పించారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ రద్దుతో మూడు స్థానాల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ ఉపసంహరించుకుంది. -
ఢిల్లీ అసెంబ్లీ రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన రాజకీయాలపై ఎనిమిది నెలల నిరీక్షణకు తెరపడింది. ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలని సిఫారసు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ మంగళవారం ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకు ఇక లాంఛనంగా రాష్ట్రపతి ఆమోదించటమే మిగిలింది. నివేదికను కేంద్రానికి పంపిన రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో సోమవారం చర్చించిన అనంతరం మూడు పార్టీలు విముఖత వ్యక్తం చేయటంతో అసెంబ్లీని రద్దు చేయాలని నజీబ్‌జంగ్ సిఫారసు చేశారు. మైనార్టీ సర్కారు ఏర్పాటుపై విముఖంగా ఉన్న కమలనాథులు ఎన్నికలను ఎదుర్కొనేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో నజీబ్ జంగ్ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక సమర్పించారు. తగినంత సంఖ్యా బలం లేనందువల్ల ప్రభుతాన్ని ఏర్పాటు చేయలేమని మూడు పార్టీలు తెలిపాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను రాష్ట్రపతి వెంటనే కేంద్రానికి పంపారు. దీని ఆధారంగా ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలనే ప్రతిపాదనను హోంశాఖ కేబినెట్ ముందుంచింది. సాధారణంగా బుధవారం సమావేశమయ్యే కేబినెట్ తాజా పరిణామాలతో మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశమై అసెంబ్లీ రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సంపూర్ణ మెజార్టీ సాధిస్తాం: కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు తలొగ్గి బీజేపీ ముందుగానే ఓడిపోయిందని ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నాలుగు నెలల నుంచి అవినీతి, అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో బీజేపీ దిగి వచ్చిందన్నారు. 49 రోజుల తమ పాలనలో ఢిల్లీలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రపంచంలో ఉత్తమ నగరంగా తీర్చిదిద్దడం, అవినీతి నుంచి విముక్తి కల్పించడం ప్రచార అంశాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళతామన్నారు. తాను న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పిన కేజ్రీవాల్ తుది నిర్ణయం పార్టీదేనన్నారు. ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆప్‌కు సంపూర్ణ మెజార్టీ కట్టబెడతారని విశ్వాసం వెలిబుచ్చారు. కాగా, అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకున్నారని కాంగ్రెస్ పేర్కొంది. డిసెంబర్లోనా వచ్చే ఏడాదా? ఢిల్లీలో తిరిగి ఎప్పుడు ఎన్నికలు జరిపించాలన్న విషయంపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఢిల్లీలో మూడు అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను కూడా రద్దు చేయనున్నారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున డిసెంబర్ నెలాఖరులో ఆఖరి దశలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని కొందరు అంటుండగా, జనవరిలో లేదా ఫిబ్రవరిలో హస్తిన ఎన్నికలు ఉంటాయని మరికొందరు భావిస్తున్నారు. ఢిల్లీలో గత ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. 49 రోజుల పాలన తరువాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేయటంతో రాష్ట్రపతి పాలన విధించి అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచారు.