ఖట్మండ్: నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. గత కొన్ని నెలలుగా సొంత పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదివారం నేపాల్ పార్లమెంట్ రద్దును ప్రతిపాదించారు. ఆయన తీసుకున్న పార్లమెంట్ రద్దు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రతులను కేబినెట్ నేపాల్ ప్రెసిడెంట్‌కు పంపించింది. ప్రధాని నిర్ణయాన్ని అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్‌సీపీ) నేతలు తప్పబడుతున్నారు. ప్రధాని అనూహ్య నిర్ణయం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: నేపాల్ సంక్షోభం..
Comments
Please login to add a commentAdd a comment