KP Sharma Oli
-
ప్రధాని మోదీతో నేపాల్ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు
న్యూయార్క్: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ న్యూయార్క్‌లో భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఆయన నుంచి ఒక ప్రకటన వెలువడింది. ద్వైపాక్షిక చర్చలు విజయవంతమయ్యాయని ఓలీ దానిలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు ప్రాంతీయ అంశాలు, పరస్పర సహకారం తదితర విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. నేపాల్ ప్రధానిగా మరోమారు ఎన్నికైన కెపి శర్మ ఓలీ భారత ప్రధానితో సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇరువురు నేతల భేటీ అనంతరం భారత్-నేపాల్ సంబంధాలు మరింతగా బలోపేతం చేసే దిశగా అడుగులు పడవచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. #WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने अमेरिका के न्यूयॉर्क में लोट्टे न्यूयॉर्क पैलेस होटल में नेपाल के प्रधानमंत्री केपी शर्मा ओली के साथ द्विपक्षीय बैठक की। (सोर्स: ANI/DD न्यूज) pic.twitter.com/7SVCH08sNH— ANI_HindiNews (@AHindinews) September 22, 2024అయితే గతంలో ఓలీ చైనా ఆదేశాల మేరకు భారత్‌తో సంబంధాలను చెడగొట్టుకున్నారు. భారతదేశంలోని కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్ ప్రాంతాలు నేపాల్‌కు చెందినవి అంటూ ప్రకటన చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ప్రకటన చేసిన కొంతకాలం తర్వాత ఆయన ప్రధాని పదవిని కోల్పోయారు. ఆ తర్వాత పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రధాని అయ్యారు. అప్పటి నుంచి భారత్-నేపాల్ సంబంధాలు స్థిరంగా మారాయి. అయితే ఓలీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. #WATCH न्यूयॉर्क, अमेरिका: प्रधानमंत्री नरेंद्र मोदी के साथ लोट्टे न्यूयॉर्क पैलेस होटल में अपनी द्विपक्षीय बैठक पर नेपाल के प्रधानमंत्री केपी शर्मा ओली ने कहा, "बैठक बहुत अच्छी रही।" https://t.co/HiMNIBHWpd pic.twitter.com/8vVWXkM5Jg— ANI_HindiNews (@AHindinews) September 22, 2024ఇది కూడా చదవండి: మహారాష్ట్ర భావి ముఖ్యమంత్రి రష్మీ ఠాక్రే? -
భారత్, నేపాల్ సంబంధాలకు పరీక్ష
కేపీ శర్మ ఓలీ నాలుగోసారి నేపాల్ ప్రధాని అయ్యారు. తన తొలి పదవీకాలంలో ఓలీ భారత్‌ను చికాకుపెట్టారు. ఉదాహరణకు, బీర్గంజ్ సమీపంలోని థోరి నిజమైన అయోధ్య అని పేర్కొన్నారు. భారత్‌తో నేపాల్ సరిహద్దును విస్తరిస్తూ నేపాల్ మ్యాప్‌ను, రాజ్యాంగాన్ని మార్చారు. అయితే ఆయన చైనా అనుకూలుడనే సాధారణ అభిప్రాయం సరికాదు. ఆయన జాతీయవాద నాయకుడు. నేపాల్ స్థిరత్వాన్ని, అభివృద్ధిని కోరుకుంటారు. అందుకు భారత్‌తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండటం తప్పనిసరి. చైనాతో నేపాల్ సత్సంబంధాలను కొనసాగించడంలో భారత్‌కు ఎలాంటి సమస్య లేదు. కానీ భౌగోళికం, చరిత్ర, సంస్కృతితో పాటు ఇరు దేశాల మధ్య బహిరంగ సరిహద్దు భారత్–నేపాల్ సంబంధాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.నేపాల్‌లో కొత్త ప్రధానమంత్రి అధికారంలోకి రావడంతో, రాజ్యాంగ రాచరికాన్ని స్థాపించిన 1990 నాటి జన ఆందోళన్ నుండి ప్రభుత్వ అధిపతికి సంబంధించి 30వ మార్పును నేపాల్ చూసినట్లయింది. పైగా 2006లో అదే రాచరికాన్ని రద్దు చేసి పార్లమెంటరీ గణతంత్రాన్ని స్థాపించిన లోక్తంత్ర ఆందోళన తర్వాత ఆ దేశంలో ప్రభుత్వాధిపతి మారడం 15వ సారి. గత తొమ్మిదేళ్లలో నేపాల్‌లో ప్రభుత్వం 8 సార్లు మారింది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్–లెని నిస్ట్)కి చెందిన కేపీ శర్మ ఓలీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్)కు చెందిన పుష్ప కమల్ దహల్, నేపాలీ కాంగ్రెస్‌కి చెందిన షేర్ బహదూర్ దేవుబా వరుసగా ప్రధానమంత్రులు అవుతున్నారు. అయితే నేపాల్‌లో జరుగుతున్న రాజకీయ మార్పులతో భావజాలానికి సంబంధం లేదు.ఓలీ స్పష్టమైన మెజారిటీతో నాలుగోసారి ప్రధాని అయ్యారు. 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఆదివారం (జూలై 21) ఆయన ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 188 ఓట్లు రావడంతో, మూడింట రెండు వంతుల మెజారిటీతో విజయం సాధించారు. భారత్‌లో నేపాల్ మాజీ రాయబారి, ఖాట్మండు యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ లోక్ రాజ్ బరాల్ ఇటీవల నేపాలీ రాజకీయాలు ‘అసంబద్ధతలతో నిండి ఉన్నాయి’ అని అభివర్ణించారు. తన తొలి పదవీకాలంలో ఓలీ భారత్‌ను చికాకుపెట్టారు. అనేక భారత్ వ్యతిరేక ఎత్తుగడలు వేశారు. ఉదాహరణకు, బీర్గంజ్ సమీపంలోని థోరి నిజమైన అయోధ్య అని పేర్కొన్నారు. నేపాల్ పురావస్తు శాఖ ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపడం గురించి పరిశీలిస్తోందని కొన్ని వార్తా సంస్థలు నివేదించాయి. ‘సత్యమేవ జయతే’ కాదు, ‘సింహదేవ జయతే’ అనేది భారతదేశ జాతీయ నినాదంగా కనిపిస్తోందని అన్నారు. భారత్‌తో నేపాల్ సరిహద్దును ఉత్తరం వైపు కాకుండా, వాయువ్యంగా విస్తరిస్తూ నేపాల్ మ్యాప్‌ను, రాజ్యాంగాన్ని మార్చారు. తద్వారా వివాదాస్పద ప్రాంతాన్ని అనేక రెట్లు పెంచి, పరిష్కారాన్ని కష్టతరం చేశారు.ఓలీ చైనా అనుకూలుడనే సాధారణ అభిప్రాయం సరికాదు. ఆయన జాతీయవాద రాజకీయ నాయకుడు. నేపాల్ స్థిరత్వాన్ని, అభి వృద్ధిని కోరుకుంటారు. అందుకు భారత్‌తో సన్నిహిత సంబంధాలు తప్పనిసరి. చైనాతో నేపాల్ సత్సంబంధాలను కొనసాగించడంలో భారత్‌కు ఎలాంటి సమస్య లేనప్పటికీ... ఇరు దేశాల మధ్య బహిరంగ సరిహద్దు, భౌగోళికం, చరిత్ర, సంస్కృతి భారత్–నేపాల్ సంబంధాన్ని ప్రత్యేకంగా మారుస్తున్నాయి.ఇప్పటికే అంగీకరించిన విద్యుత్ వాణిజ్యం, వాతావరణ మార్పుల సహకారం, అనుసంధానంపై చొరవతో కూడిన కార్య క్రమాల ద్వారా దీనిని మరింతగా మార్చవచ్చు. గత రెండేళ్లుగా, నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కాళీగండకి, త్రిశూలి, దేవిఘాట్లోని తన జలవిద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి చేసిన మిగులు విద్యుత్తును ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ద్వారా భారత్‌కు యూనిట్‌కు రూ. 6 కంటే ఎక్కువ లాభదాయకమైన ధరకు విక్రయిస్తోంది. ఏప్రిల్ 2022లో ఆమోదించిన విద్యుత్ రంగ సహకారంపై భారత్–నేపాల్ ఉమ్మడి దార్శనికతా ప్రకటన మూడు కార్యకలాపాలను అంచనా వేసింది. నేపాల్‌లోని విద్యుత్ రంగ ప్రాజెక్టుల ఉమ్మడి అభివృద్ధి, సీమాంతర సరఫరా మౌలిక వ్యవస్థ, ద్వి–దిశాత్మక విద్యుత్ వాణిజ్యం. అయితే నేపాల్‌లోని కొన్ని ప్రతికూల శక్తులు వీటిని వ్యతిరేకిస్తున్నాయి.నేపాల్‌కు అత్యంత అనుకూలంగా వ్యవహరించిన భారత ప్రధాని చంద్రశేఖర్ 1991 ఫిబ్రవరిలో ఖాట్మండును సందర్శించిన ప్పుడు, ఒక విలేఖరుల సమావేశంలో జలవిద్యుత్ రంగంలో భారత్– నేపాల్ సహకార అవకాశాల గురించి విస్తృతంగా మాట్లాడారని గుర్తుచేసుకోవడం ఆసక్తికరం. ఆ సమావేశం తర్వాత నేపాలీ యువ జర్నలిస్ట్ విజయ్ కుమార్‌ను తనతో కలిసి టీ తాగడానికి భారత ప్రధాని ఆహ్వానించారు. అప్పుడు చంద్రశేఖర్ చెప్పిన మొదటి విషయం, ‘‘జనాల మేత కోసం నేను చెప్పిన మాటలను నమ్మవద్దు’’ అని. విజయ్ కలవరపడటం చూసి, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా గ్రామంలో కరెంటు లేని ఒక గుడిసెలో తన పెంపకం గురించి వివరించారు. భారత్ త్వరలో విముక్తి పొందుతుందని తండ్రి ఆయనతో అన్నారు: ‘‘అభివృద్ధి పథంలో మన మిత్రదేశం నేపాల్ నడిచినప్పుడు మనకు కరెంట్ ఇస్తుంది. ఇప్పుడు మన జుట్టు నెరి సిందిగానీ నేపాల్ నుంచి మన ఇంటికి కరెంట్ రాలేదు. నేపాల్ తనను చీకట్లో ఉంచుకుంటుంది, మనల్నీ చీకట్లోనే ఉంచుతుంది.’’పరిస్థితులు ఎలా మారిపోయాయో ఈ ఉదంతం వివరిస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా నేపాల్‌కు భారత్ విద్యుత్తును సరఫరా చేస్తుండగా, ఇప్పుడు అది మారింది. అయితే నేపాల్ మిగులు విద్యుత్తును మాత్రమే భారత్ కొనుగోలు చేస్తోంది. ఇది నేపాల్ వాణిజ్య సంతు లనాన్ని సరిదిద్దుతుంది. నేపాల్ తన వాణిజ్యాన్ని సమతుల్యం చేసుకోవడానికి మరొక మార్గం ఏమిటంటే, భారత్ నుంచి పెట్రో లియం ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం ఆపేసి, వాటిని మరో చోటునుంచి దిగుమతి చేసుకోవడం.నేపాల్‌కు భారత్ ఏకైక చమురు సరఫరాదారు. 2019 సెప్టెంబరులో భారత్‌లోని మోతీహారి (బిహార్) నుండి నేపాల్‌లోని అమ లేఖ్గంజ్ వరకు దక్షిణాసియాలో మొట్టమొదటి సీమాంతర పెట్రో లియం ఉత్పత్తుల పైప్‌లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, ఓలీ సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్‌కు క్రమం తప్పకుండా సరసమైన పెట్రోలియం సరఫరాలను నిర్ధారించడానికి ఇండియన్ ఆయిల్ కార్పొ రేషన్ షెడ్యూల్ కంటే ముందే దీన్ని నిర్మించింది. నేపాల్ విద్యుత్‌ను భారత్ దిగుమతి చేసుకోవడమే కాకుండా, బంగ్లాదేశ్‌కు నేపాల్ విద్యు త్ను సరఫరా చేయడానికి అంగీకరించే యోచనలో ఉంది. ఇది దక్షిణా సియాలోని ఏదైనా మూడు దేశాలలో మొదటి త్రైపాక్షిక ఏర్పాటు.నేపాల్‌తో రవాణా, కనెక్టివిటీ కోసం భారత్ ఇతర దేశాల కంటే ఎక్కువ చేయగలదు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద, ట్రాన్స్ –హిమాలయన్ మల్టీ–డైమెన్షనల్ కనెక్టివిటీ నెట్‌వర్క్‌ను నిర్మిస్తామని చైనా హామీ ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో దానికి ఎలాంటి ఆధా రాలు లేవు. ఖాట్మండుకు రైలు మార్గాన్ని నిర్మించడం ద్వారా, జల మార్గాల గుండా బంగాళాఖాతంలోకి నేపాల్‌కు యాక్సెస్‌ను అందించడం ద్వారా నేపాల్ భూపరివేష్టిత పరిస్థితిని సమర్థవంతంగా ముగించేలా భారత్ ప్రతిపాదించింది. బిహార్‌లోని రక్సోల్–ఖాట్మండు రైలు లింక్ తుది స్థాన సర్వే నివేదిక గతేడాది జూన్ నుండి నేపాల్ ప్రభుత్వం వద్ద ఉంది.నేపాల్‌తో చైనా కుదుర్చుకున్న 2016 ట్రాన్సిట్ అండ్ ట్రాన్ ్సపోర్ట్ ఒప్పందం అనేక చైనీస్ ఓడరేవుల లోకి నేపాల్‌కు ప్రాప్యతను ఇస్తుంది. కానీ గత ఎనిమిదేళ్లలో, సుదీర్ఘమైన, ఆర్థికంగా లాభసాటి కాని దూరాల కారణంగా ఈ మార్గాలు ఉపయోగించలేదు. నేపాల్‌కు సంబంధించి మూడవ దేశ వాణిజ్యం కోల్‌కతా, విశాఖపట్నంలోని భారతీయ ఓడరేవుల ద్వారా కొనసాగుతోంది. గల్ఫ్, పశ్చిమాసియా, ఆఫ్రికా లేదా యూరప్‌కు ఎగుమతి చేయడానికి నేపాల్‌కు భారత పశ్చిమ తీరప్రాంతంలోని కాండ్లా వంటి ఓడరేవులు అవసరమైతే, భారత్ దాన్ని సులభతరం చేస్తుంది. నేపాల్‌లో తరచూ జరిగే నాయకత్వ మార్పు స్థానిక రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. తమ సాంస్కృతిక సాన్నిహిత్యం వల్ల భారతీయులు, నేపాలీలు ఒకరి పట్ల మరొకరు కొంత ఉదాసీనంగా ఉన్నారు. బదులుగా, వారు పరస్పరం ఎక్కువగా పట్టించుకోవాలి. జయంత్ ప్రసాద్ వ్యాసకర్త నేపాల్‌లో భారత మాజీ రాయబారి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ప్రధానిగా ఓలి రెండేళ్లు.. దేవ్బా ఒకటిన్నరేళ్లు
కఠ్మాండు: నేపాల్‌లో కొత్తగా ప్రధాని కేపీ శర్మ ఓలి సారథ్యంలో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాన పార్టీల మధ్య అధికార పంపిణీ ఒప్పందం ఖరారైంది. దీని ప్రకారం కేపీ శర్మ ఓలి ప్రధానిగా రెండేళ్లు కొనసాగుతారు, ఆ తర్వాత మిగతా ఏడాదిన్నర కాలంలో నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ) చీఫ్ షేర్ బహదూర్ దేవ్బా ప్రధానిగా పగ్గాలు చేపడతారు. ఈ మేరకు తమ మధ్య కీలకమైన ఏడు అంశాలపై అంగీకారం కుదిరినట్లు నేపాల్– యూనిఫైడ్ మార్క్సిస్ట్–లెనినిస్ట్(సీపీఎన్–యూఎంఎల్) చీఫ్, ప్రధాని ఓలి ఆదివారం పార్లమెంట్లో వెల్లడించారు. దీంతో, సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక భాగస్వామ్యపక్షాలైన ఎన్సీ, సీపీఎన్–యూఎంఎల్ల మధ్య కుదిరిన రహస్య ఒప్పందంపై వస్తున్న అనేక ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టినట్లయింది. పార్లమెంట్లో బల నిరూపణలో విఫలమైన ప్రచండ స్థానంలో గత వారం ఓలి ప్రధానిగా ప్రమాణం చేయడం తెల్సిందే. దీంతో, ఆదివారం ఓలి పార్లమెంట్ దిగువ సభలో ప్రవేశపెట్టిన విశ్వాసతీర్మానానికి అనుకూలంగా 188 ఓట్లు, వ్యతిరేకంగా 74 ఓట్లు పడ్డాయి. దీంతో, ఓలి ప్రభుత్వం సభ విశ్వాసాన్ని పొందినట్లు స్పీకర్ దేవ్ రాజ్ ఘిమిరే ప్రకటించారు. -
అంతులేని అనిశ్చితి!
అయిదేళ్ళలో అయిదో ప్రధానమంత్రి వచ్చారు. పొరుగున నేపాల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఇదే దర్పణం. అనుభవజ్ఞుడైన కమ్యూనిస్టు రాజకీయ నేత ఖడ్గ ప్రసాద్ (కె.పి) శర్మ ఓలీ నూతన ప్రధానిగా సోమవారం ప్రమాణస్వీకారం చేయడంతో... కష్టాల్లో ఉన్న తమ దేశానికి మంచి రోజులు రావచ్చేమో అని నేపాలీయులు ఆశగా చూస్తున్నారు. దేశంలోకి పెట్టుబడులు, దరిమిలా కొత్తగా ఉద్యోగాలొస్తాయని నిరీక్షిస్తున్నారు. అయితే ఓలీకి ఇది కత్తి మీద సామే. 2018లో లాగా ఆయనేమీ శక్తిమంతమైన కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి సారథ్యం వహించట్లేదు. ఇప్పుడాయన సంకీర్ణ ప్రభుత్వ సారథి. పైగా, సంకీర్ణంలో ఆయన పార్టీ మైనారిటీ. అది మరో బలహీనత. సైద్ధాంతికంగా పరస్పర విరుద్ధ భావాలున్న నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్–యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్–యూఎంఎల్)లు రెండూ 2027లో ఎన్నికల వరకు ప్రధాని పదవిని సమాన కాలం పంచుకోవాలన్న అవగాహనతో అనైతికంగా జట్టు కట్టాయి. ఇది ఏ మేరకు ఫలిస్తుందో తెలీదు. అది నేపాల్ సమస్యనుకున్నా, చైనా అనుకూల ఓలీ గద్దెనెక్కడం భారత్‌కు ఇబ్బందికరమే! నేపాల్‌లో 239 ఏళ్ళ రాచరికాన్ని 2008లో రద్దు చేశారు. అదేమి శాపమో రాజరిక వ్యవస్థ రద్దయి రిపబ్లిక్‌గా మారినప్పటి నుంచి దేశం రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పటికి 13 ప్రభుత్వాలు మారాయి. ఏణ్ణర్ధ కాలంలో నాలుగుసార్లు సభలో బలపరీక్షను తట్టుకొని బయట పడ్డ ప్రధాని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ – మావోయిస్ట్ సెంటర్ (సీపీఎన్–ఎంసీ) నేత పుష్ప కమల్ దహల్ ప్రచండ శుక్రవారం జూలై 12న మాత్రం ఓడిపోయారు. అధికార సంకీర్ణ భాగస్వామి అయిన మితవాద సీపీఎన్– యూఎంఎల్ మద్దతు ఉపసంహరణతో ఆయనకు ఓటమి తప్పలేదు. 72 ఏళ్ళ ఓలీ నాయకత్వంలో కొత్త సంకీర్ణ సర్కార్ గద్దెనెక్కింది. ఇప్పుడొచ్చింది 14వ ప్రభుత్వం. ప్రధాని పదవి ఓలీకి కొత్త కాదు. ఆయన పగ్గాలు పట్టడం ఇది నాలుగోసారి. ఏ ప్రభుత్వం వచ్చినా నేపాల్‌లో వెంటాడే పాత సమస్యలు ఓలీకీ తప్పవు. మరో రెండు నెలల్లో పార్లమెంట్లో మెజారిటీ నిరూపించుకోవాల్సిన ఆయన పరస్పర విరుద్ధ సిద్ధాంతాలతో నిండిన కూటమితో ప్రభుత్వాన్ని ఎలా నడపగలరో చూడాలి. ప్రచండ ప్రభుత్వాన్ని కూల్చి, కొత్త కూటమి కట్టి దేశంలోని రెండు పెద్ద పార్టీలు ఎన్సీ, యూఎంఎల్ సాహసమే చేశాయి. సుపరిపాలన, రాజకీయ సుస్థిరతలో ఈ సంకీర్ణం విఫలమైతే అది మొత్తం రాజ్యాంగం, వ్యవస్థల వైఫల్యమేనని ప్రజలు భావించే ప్రమాదం ఉంది. నిజానికి, ప్రపంచంలోని అత్యంత నిరుపేద దేశాల్లో నేపాల్ ఒకటి. రాజకీయ అనిశ్చితి కారణంగా అక్కడ పెట్టుబడులు పెట్టేవారు కరవయ్యారు. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. లక్షలాది యువకులు ఉద్యోగం, ఉపాధి నిమిత్తం మలేసియా, దక్షిణ కొరియా, మధ్యప్రాచ్యం దారి పట్టారు. పరిస్థితి ఎంతదాకా వెళ్ళిందంటే, గద్దెనెక్కిన ప్రభుత్వాలేవీ దేశాభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదు గనక మళ్ళీ రాచరికాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జనం అడపాదడపా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. భారత్‌తో పాటు పొరుగున ఉన్న మరో పెద్ద దేశం చైనా సైతం నేపాల్ లోని రాజకీయ పరిణామాలను ఆది నుంచి ఆసక్తిగా గమనిస్తూ వస్తున్నాయి. ఈ హిమాలయ దేశాభి వృద్ధికి ఆర్థిక సాయం అందించి, ప్రాథమిక వసతి సౌకర్యాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ప్రాంత భౌగోళిక రాజకీయాల్లో ప్రాబల్యం సంపాదించాలని సహజంగానే ఢిల్లీ, బీజింగ్‌ల యత్నం. భౌగోళికంగా భారత, చైనాల మధ్య చిక్కుకుపోయిన నేపాల్‌కు మొదటి నుంచి మనతో స్నేహ సంబంధాలు ఎక్కువే. కానీ గత దశాబ్ద కాలంలో ఆ పరిస్థితి మారుతూ వచ్చింది. కమ్యూనిస్ట్ నేత ఓలీ తొలివిడత నేపాల్ ప్రధానిగా వ్యవహరించినప్పుడు 2015–16లో చైనాతో ప్రయాణ, సరుకు రవాణామార్గ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫలితంగా, నేపాల్ విదేశీ వాణిజ్యంపై అప్పటి దాకా భారత్‌కు ఉన్న ఆధిపత్యానికి తెర పడింది. తాజాగా పడిపోయిన ప్రచండ సర్కార్ సైతం చైనా వైపు మొగ్గింది. నిన్న గాక మొన్న పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే ముందు ఆయన నేపాల్‌తో చైనాను కలిపే రైలు మార్గానికి పచ్చజెండా ఊపడం గమనార్హం. ఇది అనేక వందల కోట్ల డాలర్లతో డ్రాగన్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్ట్స్ కింద కొస్తుంది. దీంతో నేపాల్ – చైనా సరిహద్దు వెంట వసతులు పెరుగుతాయని పైకి అంటున్న మాట. నిజానికి సరిహద్దులో చైనాకు పట్టు పెంచే ఈ చర్య భారత్‌కు తలనొప్పి!అసలు బీఆర్ఐ ప్రాజెక్టుల వెనక చైనా వ్యూహం వేరు. చిన్న చిన్న దేశాలకు పెద్దయెత్తున అప్పులిస్తూ, ఋణ దౌత్యం ద్వారా ఆ యా ప్రాంతాల్లో భౌగోళిక రాజకీయాల్లో పైచేయి సాధించడం డ్రాగన్ ఎత్తుగడ. అందుకే, ప్రపంచ దేశాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీర్ఘకాలంలో ఈ ప్రాజెక్ట్‌లు సంబంధిత చిన్నదేశాలకు భరించలేని భారమవుతాయి. చివరకు ఆ దేశాలు చైనా మాటకు తలూపాల్సి వస్తుంది. గతంలో చైనా ఇలాగే శ్రీలంకలో హంబన్‌తోట పోర్ట్‌కు ఋణమిచ్చింది. బాకీలు తీర్చడంలో విఫలమైన సింహళం చివరకు బాకీకి బదులు ఈక్విటీలిచ్చి, 2017లో ఆ పోర్ట్‌ను 99 ఏళ్ళ లీజుకు చైనాకు అప్పగించింది. ఇలాంటి కారణాల వల్లే బీఆర్ఐ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలున్నాయి. అలాగే బీఆర్ఐ కింద చైనా–పాక్ ఆర్థిక నడవా ప్రాజెక్ట్ అంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా దాన్ని చేపట్టడాన్ని భారత్ నిరసించింది. ఇప్పుడు భారత్ కన్నా చైనాకు మరింత సన్నిహితుడైన ఓలీ వల్ల నేపాల్ కూడా చైనా గుప్పిట్లోకి జారిపోవచ్చు. మనం తక్షణమే అప్రమత్తం కావాలి. మనతో సన్నిహిత సంబంధాలు కీలకమని ఓలీ గుర్తించేలా చేయాలి. ఓలీ సంకీర్ణంలో అధిక సంఖ్యాబలమున్న ఎన్సీ చిరకాలంగా భారత అనుకూల పార్టీ కావడం ఉన్నంతలో కొంత ఊరట. -
నేపాల్ ప్రధానిగా ఓలీ ప్రమాణం
కఠ్మాండు: నెలల వ్యవధిలో ప్రభుత్వాలు కూలి కొత్త ప్రభుత్వాలు కొలువుతీరే హిమాలయాల దేశం నేపాల్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్–యూనిఫైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్–యూఎంఎల్) అధినేత కేపీ శర్మ ఓలీ ప్రధానిగా సోమవారం ప్రమాణం చేశారు. ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్‌పార్టీ ఆఫ్ నేపాల్ ప్రభుత్వానికి ఓలీ, షేర్ బహదూర్ దేవ్బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో ఆయన విశ్వాసపరీక్షలో ఓడిపోవడం, ప్రధానిగా రాజీనామా చేయడం తెల్సిందే. దీంతో ఓలీ, దేవ్బా ఏడు అంశాలపై ఏకాభిప్రాయంతో కూటమిగా ఏర్పడి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. నేపాలీ రాజ్యాంగంలోని ఆరి్టకల్76–2 ప్రకారం ఓలీని నూతన ప్రధానిగా దేశాధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ ఆదివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఓలీ ప్రధానిగా ప్రమాణంచేశారు. ఓలీ ప్రధాని పదవి చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. సోమవారం కాఠ్మాండూలోని రాష్ట్రపతిభవన్(శీతల్ నివాస్)లో దేశాధ్యక్షుడు పౌడెల్ ఈయన చేత ప్రధానిగా ప్రమాణంచేయించారు. సుస్థిర సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ఆశించారు. కూటమిలోని నేపాలీ కాంగ్రెస్ నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోని తీసుకోవాలన్న విషయంలో భేదాభిప్రాయాలు పొడచూపడంతో ప్రమాణస్వీకార కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో నూతన ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయని ప్రపంచ పార్టీ విమర్శలు సంధించింది. కూటమిలో కీలక పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ భార్య అర్జో రాణా దేవ్‌బాకు విదేశాంగ మంత్రి పదవి కట్టబెట్టారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన 30 రోజుల్లోపు ఓలీ పార్లమెంట్లో బలపరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. -
నేపాల్ కొత్త ప్రధానిగా కె.పి శర్మ ఓలి
కఠ్మాండు: నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి ఆదివారం(జులై 14) నియమితులయ్యారు. మాజీ పీఎం పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలిన విషయం తెలిసిందే.పార్లమెంటులోని ప్రతినిధుల సభలో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయారు. ఈ క్రమంలోనే కె.పి.శర్మ ఓలి (72) నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్, మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ)ల కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 165 మంది సభ్యుల (సీపీఎన్-యూఎంఎల్- 77, ఎన్సీ- 88) సంతకాలను ఓలి సమర్పించారు. దీంతో కొత్త ప్రధానిగా ఓలిని దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నియమించారు. ఓలితో పాటు మంత్రివర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇప్పటికే ఓలి, దేవ్బాల మధ్య అధికారాన్ని పంచుకోవడంపై ఒప్పందం కుదిరింది. తొలి 18 నెలలు ఓలి ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసేవరకూ దేవ్బా ప్రధానిగా కొనసాగుతారు.ఓలికి దేశ ప్రధానిగా రెండుసార్లు పనిచేసిన అనుభవం ఉంది. -
నేపాల్‌లో అధికార క్రీడ
ఏడాదిన్నర కూడా కాకముందే నేపాల్‌లో మూడో ప్రభుత్వం ఏర్పాటైంది. విచిత్రమైన కూటములు జట్టుకట్టాయి, విడిపోయాయి, మళ్లీ ఒక్కటయ్యాయి. ఇందులో భారత్ అనుకూల, అననుకూల పార్టీలూ ఉన్నాయి. మూడు ప్రభుత్వాలకూ సారథిగా ప్రచండ ఉండటం విశేషం. కోవిడ్ –19 మహమ్మారి తర్వాత నేపాలీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. తిరిగి పుంజుకునే సంకేతాలు ఎంతమాత్రమూ కనబడటం లేదు. ఇది ప్రజల్లో నిరుత్సాహానికి దారి తీస్తోంది. గతంలో ఉన్న రాచరికమే మంచిదని కొందరు భావిస్తున్నారు. కొన్ని వారాల క్రితం, ఖాట్మండులో రాచరికం అనుకూల ప్రదర్శన కూడా జరిగింది. ప్రస్తుత కూటమి అమరిక వల్ల, ఇంకా మూడేళ్ల వ్యవధి ఉన్నప్పటికీ తిరిగి సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధం అయినట్టుగా కనబడుతోంది. నేపాల్‌లో కేవలం 15 నెలల్లోనే మూడవ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆసక్తికరంగా, ఈ మూడు ప్రభుత్వాలకూ పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ సారథ్యం వహించారు. 2022 నవంబర్‌లో జరిగిన సార్వత్రిక ఎన్ని కల్లో ఆయన పార్టీ మావోయిస్ట్ సెంటర్ 30 స్థానాలతో ప్రతినిధుల సభలో మూడవ స్థానంలో నిలిచింది. 275 మంది సభ్యుల సభలో 88 స్థానాలతో నేపాలీ కాంగ్రెస్ మొదటి స్థానంలో, 78 స్థానాలతో కమ్యూ నిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్– లెనినిస్ట్) లేదా సీపీ ఎన్–యూఎమ్ఎల్ రెండవ స్థానంలో నిలిచాయి. చీలిపోయిన ప్రజా తీర్పు ముఖ్యమైన స్థానాన్ని ప్రచండ పొందేలా అనుమతించింది. మొదటిదే అయినప్పటికీ స్వల్పకాలంలోనే ముగిసిన కూటమి సీపీఎన్–యూఎమ్ఎల్, మావోయిస్టులకూ మధ్య ఏర్పడినది.ప్రచండకు ప్రధానమంత్రి పదవిని అందించిన తర్వాత, ఆయన నేపాలీ కాంగ్రెస్ వైపునకు మళ్లడంతో ఒక నెలలోనే ఆ కూటమి విచ్ఛి న్నమైంది. చిత్రంగా, అదే ప్రచండనీ, అదే సీపీఎన్–యూఎమ్ఎల్నీ మళ్లీ ఒకచోట చేర్చిన ప్రస్తుత కూటమిలో, మరో రెండు వామపక్ష అనుకూల పార్టీలు కూడా ఉన్నాయి. ఉపేంద్ర యాదవ్ నేతృత్వంలోని సమాజ్బాదీలు (సోషలిస్టులు), మాజీ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మాజీ సీపీఎన్–యూఎమ్ఎల్ సభ్యుల పార్టీ ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాయి.ఈ కూటమిలోనే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) ఉండటం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పార్టీకి 21 సీట్లున్నాయి. యువత ఆకాంక్షలను సమర్థించే, పశ్చిమ దేశాలకు అనుకూలంగా ఉండే ఒక వేదికగా ఈ పార్టీని చెప్పుకోవచ్చు. ఈ పార్టీ గతంలో మొదటి మావో యిస్టు... సీపీఎన్–యూఎమ్ఎల్ కూటమిలో భాగంగా ఉండేది. అంతకుముందు అమెరికన్ జాతీయుడైన రవీ లామిఛానే దాని నాయ కుడు. ప్రస్తుత సంకీర్ణంలోని నలుగురు ఉప ప్రధాన మంత్రులలో ఆయన ఒకరుగా ఉన్నారు.కోవిడ్ –19 మహమ్మారి కాలంలో నేపాలీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కానీ ఇతర దేశాల మాదిరిగా, తిరిగి పుంజుకునే సంకే తాలు ఎంతమాత్రమూ కనబడటం లేదు. ఇది ప్రజల్లో నిరుత్సాహా నికి దారి తీస్తోంది. రాజకీయ వర్గం ఫలితాలు చూపని కారణంగా కొంతమంది గతంలో ఉన్న రాచరికమే మంచిదని కూడా భావిస్తు న్నారు. కొన్ని వారాల క్రితం, రాజధాని నగరం ఖాట్మండులో రాచ రికం అనుకూల ప్రదర్శన కూడా జరిగింది. ఆర్థిక సమస్యలపై నేపాలీ కాంగ్రెస్ చాలా మొండితనంతో ఉందని ప్రచండ ఆరోపించారు. ఆ కారణంగా రాజకీయంగా తన మార్పును సమర్థించుకున్నారు. అయితే, ఐదుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నేపాలీ కాంగ్రెస్ నాయకుడు షేర్ బహదూర్ దేవుబా నిరంతరం వేచివున్న ప్రధానమంత్రి స్థానంలో పరిభ్రమించడం ప్రచండ నిజంగానే భరించలేకపోయి ఉంటారు. కానీ సాంప్రదాయకంగా నేపాలీ కాంగ్రెస్‌తో వ్యవహరించడం సులభతరమని భారతదేశం గ్రహించింది. నేపాల్‌ను హిందూ రాజ్యంగా పునఃస్థాపించాలనే నేపాలీ కాంగ్రెస్ నాయకత్వానికి మావో యిస్టు–నేపాలీ కాంగ్రెస్ కూటమి కొంత ఓదార్పునిచ్చింది. 2015 రాజ్యాంగం నేపాల్‌ను లౌకిక దేశంగా ప్రకటించింది. అయితే, సీపీఎన్–యూఎమ్ఎల్ నాయకుడు అయిన కేపీ శర్మ ఓలి గతంలో కూడా హిందూ రాజ్యం పట్ల గానీ, నేపాల్‌లో ‘సాంస్కృతిక’ రాచరికం పట్ల గానీ విముఖంగా లేరని గమనించాలి. అయోధ్యలో రామ మందిర శంకుస్థాపనను నేపాల్ ఉత్సాహంతో స్వీకరించింది. ఇది హిందూ రాజ్యానికి మద్దతును పెంచుతుంది. ప్రచండ కూడా సానుకూల పాత్రను పోషిస్తున్నట్లు కనిపిస్తు న్నారు. సంవత్సరాల తరబడి తాను విడిచిపెట్టేసినటువంటి, హిందూ రాచరికంతో గుర్తింపు పొందిన నేపాలీ అధికారిక జాతీయ దుస్తులైన దౌడా సురూవాల్ను ధరించారు. ఏమైనప్పటికీ, ప్రచండ పెంపకం వామపక్షంతో కూడుకున్నది. అది రాచరికానికి వ్యతిరేకమైనది. ఆయ నకు ఇప్పుడు తనను తాను వెనక్కి తిప్పుకొనే, నేపాల్ గుర్తింపు రాజకీయాలను తిరిగి అక్కున చేర్చుకునే అవకాశం వచ్చింది. అంటే ప్రాథమికంగా భారతదేశం నుండి తనను తాను భిన్నంగా చూపు కోవడం. అందుకే ఆయన నేపాలీ కాంగ్రెస్‌తో విడిపోయినప్పుడు దానిని ‘ప్రతీఘాత శక్తి’ అని పేర్కొన్నారు. నేపాల్‌లోని రాజకీయ చర్చల్లో దక్షిణ (భారతదేశానికి సూక్ష్మ నామం), ఉత్తర (చైనా సూక్ష్మ నామం) పాత్రలకు సంబంధించిన సూచనలు సర్వ సాధారణం. సుమారు గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ దేశాలనూ (అమెరికా, యూరోపియన్ యూనియన్ మొద లైనవి), చర్చ్తో కూడుకున్న వారి ఎన్జీఓ భాగస్వాముల పాత్రనూ కూడా కొట్టిపారేయలేము. ఇవి మానవ హక్కులు, లౌకిక వాద ఆలోచనలను కలిగి ఉండి, తమవైన డైనమిక్స్‌ను కలిగి ఉన్నాయి. కొందరికి వామపక్ష కూటమిలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చేరిక ఉత్తరాది– పాశ్చాత్య కూటమి మధ్య సఖ్యతలా కనిపిస్తుంది. చాలా మంది పరిశీలకు లకు, తాజా అమరిక నేపా ల్లో తదుపరి సాధారణ ఎన్ని కలకు రంగం సిద్ధం చేసిన ట్టుగా కనబడుతోంది. కాక పోతే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉంది. అంత కాలం అవస రమైన ఓపికను ఓలీ ప్రదర్శిస్తారా అని చాలామంది అనుమానిస్తు న్నారు. 2020లో, అధికార భాగస్వామ్య ఒప్పందం ఉన్నప్పటికీ ప్రచండకు ప్రధానమంత్రి పదవిని వదులుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రచండ ఇప్పటికే ప్రజల్లో తన పట్టును కోల్పోయినందున, తన పాత కమ్యూనిస్ట్ సహచరులతో చేతులు కలపడమే ఏకైక మార్గం. సీపీఎన్ –యూఎమ్ఎల్ మద్దతుదారుల నుండి మావోయిస్టులకు ఓటు బదిలీ అంత సులభం కానప్పటికీ, నేపాలీ కాంగ్రెస్ నుండి మావోయిస్టులకు బదిలీ చేయడం ఇంకా కఠినమైనది. కొత్త అమరిక చైనీయులు సంతో షించడానికి ఒక కారణాన్నిస్తుంది. అంతర్గత నేపాలీ రాజకీయ కోణం కూడా ఉన్నప్పటికీ, దాన్ని తీసుకురావడంలో వారి పాత్ర ఉంది. భారతదేశం ఇప్పటివరకూ నేపాల్‌కు అతిపెద్ద వాణిజ్య, ఆర్థిక భాగస్వామి. పైగా దేశంలో ఆర్థిక తేజస్సుకు గేట్‌వే. నేపాల్‌కు దాని పెరుగుతున్న జలవిద్యుత్ ఉత్పత్తి అవసరాల నుండి ప్రయోజనాలను పొందేందుకు ఇది ఏకైక అర్థవంతమైన మార్గం. ఇటీవలి సంవ త్సరాలలో సమీకృత చెక్ పోస్టుల నిర్మాణం, రైల్వే కనెక్టివిటీ అభివృద్ధి, విద్యుత్ సరఫరా లైన్లు, యూపీఐ లావాదేవీలకు వెళ్లడం వంటి వాటితో నేపాల్ కనెక్టివిటీకి భారత్ ఊతమిచ్చింది. వాస్తవానికి, నేపాల్‌కు చమురు సరఫరా చేయడానికి ఏర్పాటయ్యే పైప్‌లైన్, 900 మెగావాట్ల అరుణ్–3 ప్రాజెక్ట్ నిర్మాణంతో సహా చాలా ప్రాజెక్టులు ఓలీ 2018–19లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు.నేపాల్‌లో, ఇండియా కార్డ్‌ను ప్లే చేయడం వల్ల అది ప్రజల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్య మైనది. అనారోగ్యకరమైన ఆర్థిక స్థితి ఏ ప్రస్తుత ప్రధానమంత్రికీ మంచిది కాదు. సులభతరమైన వ్యాపారాన్ని మెరుగుపరచడం కోసం తీసుకునే చర్యలు భారతదేశం, నేపాల్ రెండింటి ప్రయోజనాలకు ఉపయోగపడుతాయి. మంజీవ్ సింగ్ పురీ వ్యాసకర్త నేపాల్‌లో భారత మాజీ రాయబారి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అనిశ్చితికి తెర పడేదెప్పుడు?
పొరుగున ఉన్న నేపాల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఇప్పుడప్పుడే తెర పడేలా లేదు. దురదృష్టవశాత్తూ – అనిశ్చితి, నేపాల్ ప్రభుత్వం – ఈ రెండూ కొద్దికాలంగా పర్యాయపదాలైపోయాయి. ఎప్పటికప్పుడు ఓ కొత్త ప్రధాని, ఓ కొత్త ప్రభుత్వం. ఎవరొచ్చినా మూణ్ణాళ్ళ ముచ్చట వ్యవహారం. మావోయిస్టుల హింసాకాండ, నేపాల్ రాజరిక వ్యవస్థల నుంచి దశాబ్దం పైచిలుకు క్రితం బయటపడ్డ నేపాల్ ఇప్పటికీ సుస్థిరత కోసం చీకటిలో గుడ్డిగా తడుముకుంటూనే ఉండడం ఒక విషాదం. ఆరేళ్ళ క్రితం 2015లోనే నేపాల్‌లో కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయినా ఇప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వివిధ పార్టీల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో రాజకీయ నేతలు అక్కడ కలసి పనిచేసే పరిస్థితులే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే నేపాల్‌లో రాజకీయం ఎప్పటికప్పుడు మారుతోంది. ప్రభుత్వాలు పడిపోతున్నాయి. పాలకులు తరచూ మారిపోతున్నారు. ఒక దశలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందా అన్న అనుమానం కలిగేలా పరిణామాలు సాగుతున్నాయి. పార్టీల అంతర్గత కుమ్ములాటల మధ్య గద్దెనెక్కిన తాజా దేవ్బా సర్కార్ బలమూ పార్లమెంట్లో అంతంత మాత్రమే కావడంతో సుస్థిర ప్రభుతపై అనుమానాలు అలాగే ఉన్నాయి. కాస్తంత వెనక్కి వెళితే, మొన్నామధ్య దాకా కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం సాగింది. దేశాధ్యక్షురాలు విద్యాదేవి అండతో ఓలీ గద్దెనెక్కారు. అస్తుబిస్తుగా ఉన్న అధికారాన్ని చేతిలో ఉంచుకుంటూనే, ప్రతినిధుల సభను రద్దు చేయించారు. ప్రధానిగా పదవిలో కొనసాగుతూ, ఎన్నికలకు వెళ్ళేందుకు సన్నద్ధమయ్యారు. ఇంతలో, నేపాల్ సుప్రీమ్‌కోర్టు రంగంలోకి దిగడంతో కథ మారింది. రద్దయిన ప్రజాప్రతినిధుల సభను అయిదు నెలల్లో రెండోసారి పునరుద్ధరిస్తూ, అయిదుగురు సభ్యుల నేపాల్ సుప్రీమ్ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. ప్రధాని ఓలీ రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, ప్రతినిధుల సభను రద్దు చేశారని పేర్కొంది. ఆ సుప్రీమ్ తీర్పుతో ఓలీ గద్దె దిగాల్సి వచ్చింది. మిగిలిన పార్టీలకు మరో మార్గం లేకపో వడంతో నేపాలీ కాంగ్రెస్ పార్టీ అధినేత షేర్ బహదూర్ దేవ్బా ఈ జూలై 13న ప్రధానమంత్రి అయ్యారు. అలా ఏడున్నర పదుల వయసున్న దేవ్బా అచ్చంగా అయిదోసారి ప్రధాని పీఠమెక్కారు. ఆ మధ్య ఓలీ పాలనలో దెబ్బతిన్న నేపాల్ – భారత సంబంధాలు దేవ్బా వల్ల సర్దుకుంటాయని ఆశ. కానీ, అసలు ఆయన ఆ పదవిలో ఎంత కాలం ఉంటారన్నదీ అనిశ్చితంగానే ఉంది. ఓలీలో అంతకంతకూ పెరిగిన నియంతృత్వ పోకడలతో పోలిస్తే దేవ్బా మధ్యేవాద రాజకీయ వైఖరి చాలామందికి నచ్చవచ్చు. అయితే విశ్వాసపరీక్షలో నెగ్గి పదవిలో కొనసాగగలిగినా, దేవ్‌బాకు అది ముళ్ళకిరీటమే. ఇప్పటికిప్పుడు ఆయనకు బోలెడు తలనొప్పులున్నాయి. కరోనా మహమ్మారితో నేపాల్ అతలాకుతలమైంది. పొరుగు దేశాలైన భారత, చైనాలతో ఆయన ఒకప్పటి కన్నా మరింత సమర్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గతంలో కన్నా ఇప్పుడు నేపాల్‌పై చైనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మరోపక్క చిరకాల మిత్రదేశమైన భారత్‌తో సత్సంబంధాల పునరుద్ధరణకు శ్రమించాల్సి ఉంటుంది. అందుకే, పరిపాలన ఆయనకు నల్లేరుపై బండి నడకేమీ కాదు. నిజానికి, ప్రధానిగా దేవ్బా కొనసాగాలంటే, నెలరోజుల్లో సభలో బలం నిరూపించుకోవాలి. ఆయన మాత్రం పదవి చేపట్టిన ఆరో రోజైన ఆదివారమే సభలో విశ్వాస తీర్మానానికి సిద్ధపడ్డారు. తుది సమాచారం అందే సమయానికి నేపాల్ పార్లమెంట్లో విశ్వాస పరీక్ష పర్యవసానాలు వెల్లడి కాలేదు. మొత్తం 275 మంది సభలో ఇప్పుడున్నది 271 మందే. బలపరీక్షలో నెగ్గాలంటే అందులో సగానికి పైగా, అంటే కనీసం 136 ఓట్లు దేవ్‌బాకు అవసరం. ఆయన సొంత పార్టీ ‘నేపాలీ కాంగ్రెస్’కున్నవి 61 స్థానాలే. ఆ పార్టీ సంకీర్ణ భాగస్వామి ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్)’కు ఉన్నవి 49 స్థానాలు. ఆయనకు మద్దతునిచ్చే మిగతా పార్టీలవన్నీ కలిపినా సరే అవసరమైన 136 ఓట్ల సంఖ్యకు చేరుకోవడం లేదు. మరోపక్క, ఓలీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షానికి 121 మంది సభ్యులున్నారు. ఈ పరిస్థితుల్లో ఓలీని వ్యతిరేకిస్తున్న వివిధ పార్టీ వర్గాల మద్దతు దేవ్‌బాకు కీలకం. అది లభిస్తే తప్ప, దేవ్బా ఈ పరీక్ష నెగ్గడం కష్టం. నెగ్గినా బొటాబొటీ మద్దతుతో ఎంతకాలం నెగ్గుకొస్తారో చెప్పలేం. ఒకవేళ పరీక్షలో ఆయన ఓడిపోతే, కథ మళ్ళీ మొదటికొస్తుంది. దిగువ సభ రద్దవుతుంది. ఆరునెలల్లో మళ్ళీ నేపాల్ పార్లమెంట్ ఎన్నికల ప్రహసనం. నిజానికి, అటు సుప్రీమ్ తీర్పుకు ముందు దిగువ సభను రద్దు చేసిన ఓలీకి కానీ, ఇటు న్యాయ స్థానం అండతో గద్దెనెక్కిన దేవ్‌బాకు కానీ ఎవరికీ ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడిపేంత మెజారిటీ లేదు అన్నది చేదు నిజం. కాబట్టి, ఎప్పటికైనా మళ్ళీ బంతి ప్రజాతీర్పు కోసం ఓటర్ల ముందుకు రావాల్సిందే. ఇలా తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుందన్నది ఆసక్తికరం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఓటింగే అధికారానికి రాచబాట. కానీ, ప్రజలు స్పష్టమైన తీర్పునిస్తేనే ఎక్కడైనా సుస్థిరమైన పాలన సాధ్యమవుతుంది. వాళ్ళ తీర్పు అస్పష్టంగా ఉంటే, మైనారిటీ ప్రభుత్వాలు, అనిశ్చిత పరిపాలన తప్పవు. దినదిన గండం లాంటి ప్రభుత్వాల వల్ల పరిపాలనా సాగదు. ప్రజలకు మేలూ ఒనగూరదు. ఈసారి ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేపాల్ ప్రజానీకం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొంటే, ఈ అయోమయ పరిస్థితి కొంత మారవచ్చు. అప్పటి దాకా మూణ్ణాళ్ళ ముచ్చట ప్రభుత్వాలు, పార్లమెంట్ సాక్షిగా రాజకీయ ప్రహసనాలు తప్పవు. -
దేవ్‌బాను ప్రధానిగా నియమించండి
ఖాట్మాండూ: నేపాల్ రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్‌బాను ప్రధానిగా నియమించా లంటూ నేపాల్ సుప్రీంకోర్టు ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి సూచించింది. చీఫ్ జస్టిస్ చోళేంద్ర షంషేర్ రాణా ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును సోమవారం వెలువరిం చింది. మంగళవారంలోగా దేవ్‌బాను ప్రధానిగా నియమించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూలై 18 సాయంత్రం 5 గంటలకు సభ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 (5) ప్రకారం ప్రధానిని ఎన్నుకొనే ఓటింగ్‌లో పార్టీ విప్ ఏ మాత్రం పని చేయబోదని సీజే జస్టిస్‌రాణా తెలిపారు. రాజ్యాంగ విరుద్ధం నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ ప్రతిపాదన మేరకు పార్లమెంట్‌దిగువ సభను అధ్యక్షురాలు రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్న ఓలీ నిర్ణయం దీంతో బెడిసికొట్టింది. నవంబర్ 12, 19లో ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దేవ్‌బాకు మద్దతు దిగువ సభను రద్దు చేయడంపై సుప్రీంకోర్టులో మొత్తం 30 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో 146 మంది ప్రతిపక్ష పార్టీ నేతలు కలసి వేసిన పిటిషన్ కూడా ఉంది. మెజారిటీకి అవసరమైన మద్దతు తమ సంకీర్ణ కూటమిలో ఉన్నందున అవకాశం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టులో వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కూటమిలో సభ్యుడైన నేపాల్ కమ్యూనిస్ట్‌పార్టీ–యూఎంఎల్ నేత మాధవ్ కుమార్ మాట్లాడుతూ.. చేయాల్సి ందంతా సుప్రీంకోర్టు చేయడంతో ఇక తామేమీ మాట్లాడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దేవ్బా గతంలో నాలుగు సార్లు ప్రధానిగా పని చేశారు. 1995–97, 2001–02, 2004–05, 2017–18 మధ్య ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. తాజా తీర్పుతో అయిదోసారి ప్రధాని కానున్నారు. మరోవైపు ఓలీ మద్దతుదా రులు సుప్రీంకోర్టు తీర్పుపై నిరసనలు చేపట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నింటిని మేము పాటించాల్సిన అవసరం లేదు అని నినాదాలున్న కార్డులను పట్టుకొని వీధుల్లో నిరసనలు తెలిపారు. ఓలీ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం పార్లమెంటు విశ్వాసం కోల్పోవడంతో గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. -
Nepal: కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
ఖాట్మాండూ: నేపాల్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రస్తుత ప్రధాని కేపీ ఓలి, ప్రతిపక్ష పార్టీల సంకీర్ణ కూటమి నేతలు వేర్వేరుగా దేశాధ్యక్షురాలు బిద్యా దేవి భండారి తలుపుతట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలంటూ ఓ వైపు ఓలి, మరో వైపు ప్రతిపక్షాలు తమ లేఖలను బిద్యా దేవికి పంపారు. ఇందులో ఓలి తనకు 121 మంది తన పార్టీ సభ్యులతో పాటు, జేఎస్‌పీఎన్‌కు చెందిన మరో 32 మంది సభ్యుల మద్దతు ఉందని సంతకాలు చేసి అధ్యక్షురాలికి పంపారు. మరోవైపు ప్రతిపక్ష సంకీర్ణ కూటమి తమకు 149 మంది చట్ట సభ్యుల మద్దతు ఉందంటూ సంతకాలు చేసి దేశ అధ్యక్షురాలు భండారీకి లేఖ పంపింది. దీనికి ముందు శుక్రవారం సాయంత్రంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ప్రతిపక్షాలకు బిద్యాదేవి సూచించారు. దీంతో ప్రతిపక్షాలు తమ మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. ఓలి తిరస్కరించడంతో.. ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలి తన బలాన్ని సభలో రుజువు చేసుకోలేకపోవడంతో ఈ సంక్షోభం ప్రారంభమైంది. బలాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం ఏర్పా టు చేయాల్సిందిగా అధ్యక్షురాలు పిలుపునిచ్చారు. అయితే ప్రతిపక్షాలు సంకీర్ణ కూటమి ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో నేపాల్ రాజ్యాం గం ప్రకారం ఓలి తిరిగి ప్రధాని అయ్యారు. ఆయన నెల రోజుల్లోగా తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే తాను బలం నిరూపించుకోవడానికి సిద్ధంగా లేనంటూ ఓలి ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చివర్లో ఉన్నట్టుండి ఓలి ట్విస్ట్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఏకమైన ప్రతిపక్షాలు.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మరో అవకాశం రావడంతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. మాజీ ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దుబాను ప్రధానిగా అంగీకరిస్తూ పలు పార్టీలు సంయుక్త సంతకాల పత్రాన్ని అధ్యక్షురాలికి పంపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన పార్టీల్లో నేపాలీ కాంగ్రెస్ (61 మంది సభ్యులు), సీపీఎన్ (48), జేఎస్పీ (13) ఉన్నాయి. షేర్ బహదూర్ గతంలో ప్రధానిగా పని చేశారు. ఇప్పుడు ఎవరిచేత ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న వ్యవహారం అధ్యక్షురాలి చేతిలో ఉంది. ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా, నెల రోజుల్లోగా తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మొత్తం 275 సీట్లు ఉన్న ప్రతినిధుల సభలో 136 సీట్లు పొందిన వారికే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లభిస్తుంది. చదవండి: Israel: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే -
నేపాల్ పీఎంగా మళ్లీ ఓలి
కఠ్మాండూ: నేపాల్ ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలి శుక్రవారం మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయి, విశ్వాసపరీక్షలో విఫలమవడంతో నాలుగు రోజుల కిందటే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే, విపక్ష పార్టీలు మెజారిటీ సాధించే విషయంలో విఫలం కావడంతో గురువారం రాష్ట్రపతి విద్యాదేవి భండారీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేపీ శర్మ ఓలీని కోరారు. దాంతో, రాష్ట్రపతి భవనంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఓలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెల రోజుల్లోగా ఆయన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే, రాష్ట్రపతి పాలన విధించి, 6 నెలల్లోగా ఎన్నిక లు నిర్వహించే అవకాశముంటుంది. ఓలి గత మంత్రి వర్గాన్నే కొనసాగించనున్నారు. ప్రచండ యూ టర్న్: సీపీఎన్–మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ మద్దతుతో మెజారిటీ సాధించి ప్రధాని పదవి చేపడ్తానన్న ఆశతో గురువారం వరకు నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూ దేవ్బా ఉన్నారు. అయితే, చివరి నిమిషంలో ప్రచండ కేపీ శర్మ ఓలీతో సమావేశమై దేవ్‌బాకు మద్దతిచ్చే విషయంలో యూ టర్న్ తీసుకున్నారు. 271 మంది సభ్యుల ప్రతినిధుల సభలో ఓలి పార్టీ సీపీఎన్–యూఎంఎల్‌కు 121 మంది సభ్యులున్నారు. మెజారిటీకి 136 మంది సభ్యుల మద్దతు అవసరం. -
నేపాల్: తదుపరి ప్రధాని షేర్ బహదూర్ దుబా?
ఖాట్మండూ: ఓలి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా నేపాలీ కాంగ్రెస్ పార్టీ మంతనాలు జరుపుతోంది. దీనికోసం మంగళవారం నేపాలీ కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు భేటీ అయ్యారు. గురువారంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని దేశాధ్యక్షుడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎన్సీ అధ్యక్షుడు షేర్‌బహదూర్ దుబాను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి పుష్ప కమల్ ప్రంచండ నేతృత్వంలోని సీపీఎన్ మావోయిస్టు సెంటర్ మద్దతు తెలపగా, సమాజ్‌వాదీ పార్టీలో ఓ వర్గం వ్యతిరేకించింది. గతంలో ప్రధానిగా చేయని కొత్త వ్యక్తిని ప్రధానిగా చేయాలని ఆ వర్గం పట్టుబడుతోంది. ఈ మూడు పార్టీల్లో దేనికీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో సందిగ్దత కొనసాగుతోంది. ఒకవేళ ఈ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే నేపాల్ రాజ్యాంగం ప్రకారం.. అతిపెద్ద పార్టీకి చెందిన నాయకున్ని మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఆయన 30 రోజుల్లోగా తన మెజారిటీని నిరూపించుకోవాలి. అదే జరిగితే ఓలి తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. (చదవండి: KP Sharma Oli: విశ్వాస పరీక్షలో ఓడిన ఓలి) (చదవండి: సీఎం అవుతానని 30 ఏళ్ల క్రితమే చెప్పాడు : సీఎం భార్య) -
KP Sharma Oli: విశ్వాస పరీక్షలో ఓడిన ఓలి
ఖాట్మండూ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రతినిధుల సభ విశ్వాసాన్ని కోల్పోయారు. పుష్పకమాల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్) పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన మెజారిటీ కోల్పోయారు. నేపాల్ ప్రతినిధుల సభలో మొత్తం 275 మంది సభ్యులు ఉండగా సోమవారం విశ్వాసపరీక్ష కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి 232 మంది హాజరయ్యారు. వారిలో 93 ఓట్లు ప్రధాని ఓలికి మద్దతుగా రాగా, 124 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. మరో 15 మంది సభ్యులు తటస్థంగా ఉన్నారని స్పీకర్ అగ్ని సప్కోట తెలిపారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మొత్తం 136 ఓట్లు కావాల్సి ఉండగా, ఆ మార్కును ఓలి అందుకోలేకపోయారు. మెజారిటీ సాధించలేకపోయిన ఓలి నేపాల్ రాజ్యాంగంలోని 100 (3) ప్రకరణ ప్రకారం ఆటోమేటిగ్గా పదవిని కోల్పోతారు. ఇదిలా ఉండగా నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేబ, సీపీఎన్ చైర్మన్ ప్రచండ, జనతా సమాజ్‌వాదీ పార్టీ చైర్మన్ ఉపేంద్ర యాదవ్‌లు కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించాలని దేశ అధ్యక్షుడు భండారిని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. -
కుప్పకూలిన ప్రభుత్వం: విశ్వాసం కోల్పోయిన ఓలి
ఖాట్మాండు: నేపాల్ ప్రధానమంత్రి కేటీ శర్మ ఓలి పార్లమెంట్ విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రచండ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ కేపీ శర్మ ఓలి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలి సోమవారం పార్లమెంట్లో విశ్వాస పరీక్ష కోల్పోయింది. అనుకూలంగా 96 ఓట్లు పడగా.. వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. 15 మంది ఎంపీలు ఎటువైపు లేరు. ప్రభుత్వానికి కావాల్సిన 136 మంది ఎంపీల మద్దతు లేకపోవడంతో ఓలీ ప్రభుత్వం పడిపోయింది. నేపాల్ పార్లమెంట్లో ప్రస్తుతం 271 మంది ఎంపీలు ఉన్నారు. ఓలి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కాలంటే కనీసం136 మంది ఎంపీల మద్దతు అవసర కాగా సీపీఎన్-యూఎంఎల్‌కు 121 మంది సభ్యులు ఉన్నారు. అయితే పుష్పకమల్ దహల్ (ప్రచండ) నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ మద్దతు ఉపసంహరించుకుంది. ఓలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరో 15 మంది మద్దతు అవసరం ఉండగా మద్దతు కూడగట్టుకోవడంలో ఓలి విఫలమయ్యారు. దీంతో పార్లమెంట్ విశ్వాసాన్ని కోల్పోయారు. సోమవారం సాయంత్రం జరిగిన చర్చలో ఓలి తాను ప్రధానిగా చేసిన పనులు, సాధించిన విజయాలు.. లక్ష్యాలు తదితర అంశాలు పార్లమెంట్లో వివరించారు. అనంతరం ప్రతిపక్ష పార్టీ నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ చైర్పర్సన్ పుష్పకమల్ దహల్ విశ్వాస పరీక్షపై మాట్లాడారు. ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగించారు. మిగతా జనతా సమాద్‌వాది పార్టీ నాయకులు మహతో ఠాకూర్, ఉపేంద్రయాదవ్ విశ్వాస తీర్మానంపై మాట్లాడారు. విశ్వాసం కోల్పోవడంతో నేపాల్‌లో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ చదవండి: రాజకీయాల్లో చిచ్చురేపిన అల్లుడి పెళ్లి బరాత్ -
మెజారిటీ కోల్పోయిన ఓలి ప్రభుత్వం
ఖాట్మాండూ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలికి షాక్ తగిలింది. ఆయన ప్రభుత్వానికి మద్దతిస్తున్న సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్) పార్టీ తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఓలి ప్రతినిధుల సభలో మెజారిటీ కోల్పోయారు. తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు సీపీఎన్ నేత పుష్ఫ కమల్ దహల్ ప్రచండ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్లమెంటు సెక్రటేరియట్‌కు సీపీఎన్ పార్టీ లేఖను పంపింది. ఓలి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని, ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దేశ సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని, అందుకే మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో 275 మంది సభ్యులున్న సభలో ఓలికి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకొనేందుకు మరో 15 మంది సభ్యుల అవసరం ఉంటుంది. -
నేపాల్ ప్రధానికి సుప్రీం షాక్
కఠ్మాండు: నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలి ప్రయత్నాలకు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. మధ్యంతర ఎన్నికల ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పునిచ్చింది. ఆ నిర్ణయం చెల్లుబాటుకాదని తెలిపింది. పునరుద్ధరించిన పార్లమెంట్ దిగువ సభను 13 రోజుల్లోగా తిరిగి సమావేశపర్చాలంటూ ఆదేశించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చోళేంద్ర షంషేర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు మంగళవారం సంచలన తీర్పు వెలువ రించింది. అధికార పార్టీకి, ప్రధాని కేపీ ఓలికి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో దేశంలో రాజకీయ సంక్షోభం ప్రారంభమైంది. గతేడాది డిసెంబర్ 20వ తేదీన దిగువ సభ రద్దు, ఏప్రిల్‌లో ఎన్నికల నిర్వహణకు తేదీలను ప్రకటిస్తూ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఉత్తర్వులు జారీ చేశారు. -
భారత్‌కు ధన్యవాదాలు: నేపాల్ ప్రధాని
ఖాట్మండు: నేపాల్ ప్రధాని(ఆపద్ధర్మ) కేపీ శర్మ ఓలి భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమ దేశానికి కరోనా నిరోధక వ్యాక్సిన్‌ను సరఫరా చేసినందుకు గానూ కృతజ్ఞతా భావం చాటుకున్నారు. ఈ మేరకు.. ‘‘కోవిడ్-19 వ్యాక్సిన్ ద్వారా మహమ్మారిని కట్టడి మరింతగా కట్టడి చేసే అవకాశం లభించింది. ఇందుకుగానూ మా పొరుగు దేశం భారత్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభమైన వారం రోజుల్లోనే మాకు కూడా వ్యాక్సిన్ పంపించారు’’ అని ఓలి ప్రకటన విడుదల చేశారు. కాగా కోవిడ్ బారి నుంచి భారత్ తనను తాను కాపాడుకుంటూనే పొరుగు దేశాలకు కూడా సాయం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు) ఈ క్రమంలో జనవరి 20 నుంచి పొరుగు దేశాలకు వ్యాక్సిన్ పంపించే ప్రక్రియను భారత్ ప్రారంభించింది. తొలి రోజు భూటాన్, మాల్దీవులకు వ్యాక్సిన్ డోసులను సరఫరా చేశారు. రెండో రోజు బాంగ్లాదేశ్, నేపాల్‌లకు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని పంపించారు. ఈ నేపథ్యంలో నేపాల్‌కు మిలియన్ కోవిషీల్డ్ టీకా డోసులు పంపినందుకు ఓలి ఈ మేరకు స్పందించారు. ఈ దేశాలతో పాటు బ్రెజిల్, మయన్మార్, సీషెల్లెన్స్‌లకు భారత్ వ్యాక్సిన్‌ను సరఫరా చేసింది. కాగా కరోనా వ్యాపించిన తొలినాళ్లలో భారత్ నుంచే తమ దేశానికి మహమ్మారి వ్యాపించిందని ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్ విషయంలో ఓలి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇరు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో దౌత్యపరమైన చర్చలకై నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యవాలి ఇటీవల భారత పర్యటనకు వచ్చారు. -
నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఖాట్మండు: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి తెరతీశారు. భారత్- నేపాల్ మధ్య విభేదాలకు కారణమైన కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్‌లను ఎలాగైనా తమ దేశంలో కలుపుకొంటామని పేర్కొన్నారు. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో జనవరి 14న హిమాలయ దేశపు విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యవాలి భారత పర్యటనకు రానున్న తరుణంలో ఈ మేరకు ఓలి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘‘సుగౌలి ఒప్పందం ప్రకారం.. మహాకాళీ నదీ పరివాహక తూర్పు ప్రాంతంలో ఉన్న కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్ నేపాల్‌కు చెందుతాయి. భారత్‌తో దౌత్యపరమైన చర్చలు జరిపి వాటిని సొంతం చేసుకుంటాం. మా విదేశాంగ మంత్రి గురువారం అక్కడికి వెళ్తున్నారు. ఈ అంశంపైనే ఆయన చర్చిస్తారు. ఈ మూడు ప్రాంతాలను మా దేశంలో కలుపుతూ వెలువరించిన మ్యాపుల గురించి కూడా మాట్లాడతారు’’ అని తెలిపారు. అదే విధంగా.. పొరుగు దేశాలైన భారత్, చైనాతో ద్వైపాక్షిక బంధం దృఢపరచుకునేందుకు తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. సార్వభౌమత్వం కాపాడుకుంటూనే, సమానత్వ భావనతో స్నేహపూర్వక బంధాలు పెంపొందించుకుంటామని ఓలి పేర్కొన్నారు. కాగా ఇటీవలి కాలంలో చైనాకు బాగా దగ్గరైన నేపాల్ ప్రధాని కేపీ ఓలి శర్మ.. గత కొన్నినెలలుగా భారత్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీరాముడి జన్మస్థలం దక్షిణ నేపాల్‌లోని అయోధ్యాపురి అని, యూపీలోని అయోధ్య కాదనడం, అంతేగాక ఆ మూడు ప్రాంతాలకు సంబంధించి అధికారిక మ్యాపులు విడుదల చేయడంతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. అయితే భారత సైనిక దళాల ప్రధానాధికారి ఎంఎం నరవాణే నేపాల్ నవంబరులో పర్యటించిన నాటి నుంచి విభేదాలు కాస్త సద్దుమణిగాయి. ఏడు దశాబ్దాలుగా భారత్- నేపాల్ సైనిక చీఫ్‌లనూ పరస్పరం గౌరవించుకోవడమనే సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్లారు. (చదవండి: నేపాల్‌లో చైనా ఓవరాక్షన్) 200 ఏళ్ల నాటి వివాదం భారత్-నేపాల్-చైనా సరిహద్దులో గల లిపులేఖ్ భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది. ఈ సరిహద్దు వివాదం 200 ఏళ్ల క్రితమే మొదలైంది. ఇరు దేశాల మధ్య 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగౌలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్ పాలకులు భారత్ తరఫున సంతకాలు చేయగా... ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. ఆ నదుల గమనం ఈ రెండు శతాబ్దాల్లో అనేకసార్లు మారడం వల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. తాజాగా నేపాల్ కొత్త మ్యాపులు విడుదల చేయడంతో వివాదం తారస్థాయికి చేరింది. -
నేపాల్ పార్లమెంటు రద్దు
కఠ్మాండు: అధికార పక్షంలోని ప్రత్యర్థులకు నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి ఊహించని షాక్ ఇచ్చారు. పార్లమెంటును రద్దు చేయాలని అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి సిఫారసు చేశారు. వెంటనే విద్యాదేవి భండారి పార్లమెంటును రద్దు చేయడంతో పాటు మధ్యంతర సాధారణ ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏప్రిల్– మే నెలల్లో జరుగుతాయని ప్రకటించారు. అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపీ)లో ప్రధాని కేపీ శర్మ ఓలి, మాజీ ప్రధాని పుష్పకుమార్ దహల్(ప్రచండ)ల మధ్య కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో విబేధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఆదివారం ఉదయం ప్రధాని ఓలి అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన మంత్రి మండలి.. తక్షణమే పార్లమెంటును రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షురాలు విద్యాదేవి భండారికి సిఫారసు చేసింది. ఈ సిఫారసుకు వెంటనే అధ్యక్షురాలు భండారీ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన ప్రతిపక్షమైన నేపాలి కాంగ్రెస్‌తో పాటు అధికార పక్షంలోని అసమ్మతి వాదులు విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓలి మంత్రివర్గంలోని, ప్రచండ వర్గానికి చెందిన ఏడుగురు మంత్రులు రాజీనామా చేశారు. 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభకు తొలి దశ మధ్యంతర ఎన్నికలు ఏప్రిల్ 30న, తుది దశ ఎన్నికలు మే 10న జరుగుతాయని రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. నేపాల్ పార్లమెంట్లో దిగువ సభను ప్రతినిధుల సభగా వ్యవహరిస్తారు. ఎగువ సభను నేషనల్ అసెంబ్లీగా పిలుస్తారు. ప్రతినిధుల సభకు 2017లో ఎన్నికలు జరిగాయి. ప్రధాని ఓలి నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని, నియంతృత్వ ఆలోచనతో తీసుకున్న నిర్ణయమని ఎన్సీపీ అధికార ప్రతినిధి నారాయణ్‌కాజీ శ్రేష్ట విమర్శించారు. పార్టీ స్టాండింగ్ కమిటీ ఓలి నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఓలిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వానికి సిఫారసు చేసింది. 2018లో ఓలి నాయకత్వంలోని సీపీఎన్ –యూఎంఎల్, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్(మావోయిస్ట్ సెంటర్) విలీనమై ఎన్సీపీగా ఏర్పడ్డాయి. పార్టీలోని అత్యున్నత విభాగం సెక్రటేరియట్లో ప్రచండదే పైచేయి కావడం గమనార్హం. -
రెండు దశల్లో నేపాల్‌లో ఎన్నికలు
ఖాట్మాండ్: నేపాల్ పార్లమెంట్‌ను రద్దు చేయాలన్న కేబినెట్ సిఫార్సుకు రాష్ట్రపతి విద్యాదేవి భండారి ఆదివారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్ష కార్యాలయం పార్లమెంట్ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం రెండు దశల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 30, మే 10న ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, గత కొన్ని నెలలుగా సొంత పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇవాళ (ఆదివారం) నేపాల్ పార్లమెంట్ రద్దును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. అనంతరం ప్రధాని ఓలి రాష్ట్రపతితో పాటు నేపాల్ ఎన్నికల కమిషనర్, ఇతర అధికారులను కలిశారు. జాతీయ ఎన్నికల నిర్వహణపై వారితో చర్చలు జరిపారు. ( భారత్‌తో మాకు ప్రత్యేక అనుబంధం: నేపాల్ ) అయితే కీలకమైన నియామకాలకు తనకు పూర్తి అధికారం కట్టబెట్టుకుంటూ ప్రధాని ఓలి గత మంగళవారం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వివాదాస్పదమైంది. స్వపక్షం నుంచే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేయగా, పార్టీ నేతలను బుజ్జగించేందుకు ప్రధాని ఓలి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఆయన అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో నేపాల్‌లో ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం
ఖట్మండ్: నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. గత కొన్ని నెలలుగా సొంత పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదివారం నేపాల్ పార్లమెంట్ రద్దును ప్రతిపాదించారు. ఆయన తీసుకున్న పార్లమెంట్ రద్దు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రతులను కేబినెట్ నేపాల్ ప్రెసిడెంట్‌కు పంపించింది. ప్రధాని నిర్ణయాన్ని అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్సీపీ) నేతలు తప్పబడుతున్నారు. ప్రధాని అనూహ్య నిర్ణయం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: నేపాల్ సంక్షోభం.. -
భారత్‌తో మాకు ప్రత్యేక అనుబంధం: నేపాల్
ఖాట్మండు: భారత్‌తో తమకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలు త్వరలోనే సమసిపోతాయని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి అన్నారు. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనగలమని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌లోని ఉత్తరాఖండ్‌లో భాగంగా వున్న లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనంటూ కొన్ని నెలల క్రితం నేపాల్ మ్యాపులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. అయితే గత కొన్నిరోజులుగా ఈ చిటపటలు కాస్త సద్దు మణిగాయి. (చదవండి: ‘నేపాల్ భూభాగం ఆక్రమణ’; చైనా స్పందన) గత ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాల సైనిక చీఫ్‌లనూ పరస్పరం గౌరవించుకోవడమనే సంప్రదాయాన్ని కొనసాగించాలని నేపాల్ భావించగా, అందుకు భారత్ కూడా సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో భారత సైనిక దళాల ప్రధానాధికారి ఎంఎం నరవాణే నేపాల్‌కు బయల్దేరారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి, జనరల్ నరవాణేకు నేపాల్ సైనిక గౌరవ జనరల్‌గా గౌరవ పురస్కారం ప్రదానం చేశారు. ఖడ్గాన్ని కూడా బహూకరించారు. ఖాట్మండూలోని అధ్యక్ష భవనం శీతల్ నివాస్‌లో ప్రధాని ఓలి, భారత రాయబారి వినయ్ ఎం. క్వాత్రా సహా ఇరు దేశాల ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. (చదవండి: నేపాల్‌తో మళ్లీ చెట్టపట్టాలు) ఇక నేపాల్ పర్యటనలో భాగంగా జనరల్ నరవాణే శుక్రవారం ప్రధాని, రక్షణ మంత్రి కేపీ శర్మ ఓలితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రధానమంత్రి అధికారిక భవనంలో జరిగిన ఈ సమావేశంలో సుదీర్ఘకాలంగా భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక బంధం గురించి ఓలీ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు నేపాల్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాగా కాగా నవంబరు 4న సతీమణి వీణా నరవాణేతో కలిసి జనరల్ నరవాణే నేపాల్ చేరుకున్నారు. పుణ్యక్షేత్రాల సందర్భంతో పర్యటన ఆరంభించిన ఆయన తొలుత, రాజధానిలో గల కుమారి ఘర్కు వెళ్లి దేవీ కుమారి ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు. ఆ తర్వాత బసంతాపూర్ దర్బార్ స్వ్కేర్ను సందర్శించారు. పర్యటన సందర్భంగా.. ఎక్స్‌రే మెషీన్లు, రేడియోగ్రఫీ సిస్టంలు, ఐసీయూ వెంటిలేటర్లు, వీడియో ఎండోస్కోపీ యూనిట్లు తదితర వైద్య పరికరాలను నేపాల్ ఆర్మీ ఫీల్డ్ ఆస్పత్రులకు బహుమతిగా అందించారు. -
ప్రధాని మోదీకి కేపీ శర్మ ఓలి ఫోన్
న్యూఢిల్లీ/ఖాట్మండూ: నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాడాల్సిన తీరుపై ఇరు దేశాధినేతలు చర్చించారు. నేపాల్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్నేహ హస్తం అందించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాల గురించి మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. (ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ) అయితే గత కొన్ని రోజులుగా సరిహద్దుల విషయంలో నెలకొన్న వివాదం గురించి మాత్రం ఏవిధమైన చర్చ జరగలేదు. ఈ మేరకు విదేశాంగ శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా సుదీర్ఘ కాలంగా మిత్ర దేశంగా కొనసాగుతున్న భారత్ పట్ల నేపాల్ అనుచిత వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. భారత భూభాగంలోని లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను నేపాల్‌లో కలుపుతూ కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కొత్త మ్యాపులు విడుదల చేసింది. అంతేగాక దీనిని ఐరాసకు పంపించేందుకు సిద్ధమైంది. ఇక చైనాతో చైనాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఆ దేశ ప్రధాని ఓలి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత తొలిసారిగా ఆయన ప్రధాని మోదీకి ఫోన్ చేయడం గమనార్హం.(చైనా పేరెత్తడానికి భయమెందుకు?) భారత ప్రజలకు శుభాకాంక్షలు: చైనా భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్‌లో చైనా రాయబారి సన్ వెడాంగ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు.. ‘‘భారత ప్రభుత్వం, ప్రజలకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ప్రాచీన నాగరికత గల రెండు గొప్ప దేశాలైన చైనా, భారత్ పరస్పరం సంబంధాలు మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతూ శాంతి, అభివృద్ధి సాధించాలి’’అని ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. కాగా గల్వాన్ ఘటనలో చైనా ఎంతమాత్రం బాధ్యత వహించబోదని సన్ వెడాంగ్ ఇటీవలి తన ఆర్టికల్‌లో పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. Congratulations to the Indian government & people on #IndependenceDay2020. Wish #China & #India, two great nations with ancient civilization prosper together in peace and develop with closer partnership. — Sun Weidong (@China_Amb_India) August 15, 2020 -
ఐక్యరాజ్యసమితికి నేపాల్ కొత్త మ్యాప్
ఖాట్మాండు: గత కొద్ది రోజులుగా భారత్‌కు వ్యతిరేకంగా దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న నేపాల్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ రూపొందించిన నూతన మ్యాప్‌ను.. ఐక్యరాజ్యసమితి, గూగుల్‌కు పంపించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ దేశ మీడియా శనివారం తెలిపింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం మ్యాప్‌ను ఆంగ్లంలో ప్రచురించడంతో పాటు.. ఐక్యరాజ్యసమితి, గూగుల్‌తో సహా అంతర్జాతీయ సమాజానికి పంపడానికి అవసరమైన సన్నాహాలు చేస్తోందని సమాచారం. (నేపాల్ కొత్త మ్యాప్‌కు చట్టబద్ధత) ఈ సందర్భంగా ‘మేము త్వరలో లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలతో ఉన్న మ్యాప్‌ను అంతర్జాతీయ సమాజానికి పంపిస్తాము’ అని నేపాల్ మంత్రి పద్మ ఆర్యాల్ తెలిపారు. అంతేకాక ‘ఆక్రమిత భూభాగాలతో’ అనే పేరుతో ఈ మూడు భూభాగాలకు సంబంధించి ఒక పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా నేపాల్ ప్రభుత్వం సన్నద్ధమవుతోందని పద్మ ఆర్యాల్ తెలిపారు. అయితే, ఈ నూతన మ్యాప్‌ను అంతర్జాతీయ సమాజానికి పంపడమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను తమ దేశ అంతర్భాగంలో చేర్చిన మ్యాప్‌ను జూన్ 13న నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మూడు ప్రాంతాలు తమకు చెందినవేనని భారత్ స్పష్టం చేసింది. -
అధికార పార్టీ భేటీ వాయిదా.. రంగంలోకి ఆమె!
ఖాట్మండూ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తీరుపై అధికార కమ్యూనిస్టు పార్టీలో అసంతృప్తి చెలరేగుతున్న నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. పార్టీ కో చైర్మన్ పుష్ప కమల్ దహల్(ప్రచండ), ఓలి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో బుధవారం జరగాల్సిన భేటీని జూలై 28 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రధాని, పార్టీ పదవి నుంచి వైదొలిగేందుకు ఓలి సుముఖంగా లేరని, ఈ క్రమంలో పార్టీలో చీలిక వచ్చే పరిస్థితులు తలెత్తినట్లు సమాచారం. మరోవైపు.. పార్టీ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రచండ రాజకీయంగా మరింత బలపడేందుకు కేబినెట్లో తన వర్గానికి స్థానం కల్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి నాటికి ఓలి కేబినెట్లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. (మేడిన్ చైనా రామాయణం) కాగా సుదీర్ఘ కాలంగా మిత్రదేశంగా కొనసాగుతున్న భారత్ పట్ల ఓలి వైఖరిని నిరసిస్తూ సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్సిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఓలి ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సమావేశం అనేకమార్లు వాయిదా పడింది. మరోవైపు చైనాతో సత్సంబంధాలు పెంచుకుంటున్న ఓలి తాను పదవి నుంచి దిగిపోయేది లేదని స్పష్టం చేయడంతో రాజకీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఇలాంటి తరుణంలో, భారత్‌తో సరిహద్దు వివాదాలు నెలకొన్న వేళ నేపాల్‌ను అడ్డుపెట్టుకుని భారత్‌పై అక్కసు వెళ్లగక్కాలని చూస్తున్న చైనా అధికార పార్టీలో చీలిక వస్తే మొదటికే మోసం వస్తుందనే భావనతో సంక్షోభాన్ని చల్లార్చేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నేపాల్‌లోని చైనా రాయబారి హు యోంకి ఇప్పటికే ఎన్సీపీ నేతలతో సమావేశమై.. సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఓలిని ప్రధానిగా కొనసాగిస్తూనే.. పార్టీలో చీలిక రాకుండా వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. -
గుండు కొట్టించి.. జై శ్రీరాం నినాదాలు
-
వైరల్: గుండు కొట్టించి.. జై శ్రీరాం నినాదాలు
లక్నో: శ్రీరాముడు తమవాడేనని, అసలైన అయోధ్య నేపాల్‌లో ఉందని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. హిందూ మతతత్వ గ్రూప్‌నకు చెందిన అరుణ్ పాఠక్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి నేపాల్ పౌరుడిపై దౌర్జన్యం చేశాడు. అతనికి బలవంతంగా గుండు కొట్టించాడు. అంతటితో ఆగకుండా గుండుపై ‘జై శ్రీరాం’అని స్కెచ్ పెన్నులతో రాయించాడు. నేపాల్ పౌరున్ని బెదిరించి జై శ్రీరాం అని నినాదాలు చేయించాడు. వారణాసిలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేపాల్ ప్రభుత్వం స్పందించింది. దాంతో భారత్‌లోని నేపాల్ రాయబాని నీలాంబర్ ఆచార్య ఈ ఉదంతాన్ని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యోగి హామినిచ్చారు. నిందితుల్లో నలుగురిని అరెస్టు చేశామని, మిగతా వారికోసం గాలిస్తున్నామని వారణాసి పోలీస్ చీఫ్ అమిత్ పాఠక్ తెలిపారు. (చైనా మద్దతుతోనే ఓలీ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు) -
ఓలీ ప్రధానిగా పనికిరాడు
కఠ్మాండు, నేపాల్: శ్రీరాముడు నేపాల్‌కు చెందినవాడేనంటూ ప్రధాని కేపీ శర్మ ఓలీ చేసిన వివాదాస్పద కామెంట్లను నేపాలీ కాంగ్రెస్ ఖండించింది. నీతినియమాలను, రాజకీయ స్థిరత్వాన్ని కోల్పోయిన ఆయన దేశానికి ప్రధానిగా పనికిరాడంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అయోధ్య నేపాల్‌లోని బిర్గంజ్లో ఉందని, శ్రీరాముడి జన్మస్థలం నేపాలేనని ఓలి చేసిన కామెంట్లపై అధికార కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని కోరింది. (కరోనా వ్యాక్సిన్‌పై ‘ఆక్స్ఫర్డ్’ ముందడుగు!) ‘ప్రధాని పని తీరు అసలు బాలేదు. ఆయన మాటలు ఒకలా, చేతలు మరోలా ఉంటున్నాయి. ఆయన్ను ప్రధానిగా కొనసాగించడంపై కమ్యూనిస్టు పార్టీ పునరాలోచించుకోవాలి లేదా ఆయన్ను తీరు మార్చుకోమని సూచించాలి’ అని నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బిశ్వో ప్రకాశ్ శర్మ పేర్కొన్నారు. (శ్రీరాముడు నేపాలీ.. అయోధ్య ఇక్కడే ఉంది!) -
ఓలీ వ్యాఖ్యలపై నేపాల్‌లో ఆగ్రహం
ఖాట్మండు : శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్, నేపాల్ మధ్య పరిస్థితి ఉద్రిక్తతంగా ఉన్న సమయంలో ఓలీ తన వ్యాఖ్యలతో పరిస్థితులను మరింత క్షీణింపచేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓలీ చేసిన వ్యాఖ్యల పట్ల భారత్, విదేశాల్లోనే కాక స్వదేశంలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓలీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేత కమల్ థాపా ప్రధాని కేపీ ఓలీ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.(ఒక్క రాముడేంటి, అన్ని గ్రహాలు నేపాల్‌వే..) ‘ఒక ప్రధాని ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం తగదు. చూస్తుంటే, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి బదులు, ప్రధాని ఓలీ భారత్-నేపాల్ సంబంధాలను నాశనం చేయాలని చూస్తున్నట్టు ఉందని’ అన్నారు. నేపాల్‌లో భారత వ్యతిరేక భావాలు పెంచడం కోసమే ఓలీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేపాల్ ప్రధాన వార్తాపత్రిక ఖాట్మండు పోస్ట్ కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఓలీ వ్యాఖ్యలు నేపాల్-ఇండియా సంబంధాలను, రెండు దేశాల ప్రజలు, నాయకుల మధ్య సంబంధాలను చెదిరిపోయేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారని రాసుకొచ్చింది. ఓలీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నేపాల్ విదేశాంగ శాఖ వివరణ జారీ చేసింది. నేపాలీ భాషలో రామాయణాన్ని రచించిన ఆదికవి భాను భక్త ఆచార్య 207వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కేపీ శర్మ ఓలీ ఈ విధంగా మాట్లాడారని.. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఏ రాజకీయ దురుద్దేశం లేదని తెలిపింది. రాముడి కాలానికి సంబంధించిన ప్రాంతాలపైన చాలా అపోహలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో రాముడు, రామాయణం కాలానికి సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు మరిన్ని అధ్యయనాలు జరగాలన్న అంశాన్ని ఆయన ప్రముఖంగా చెప్పారని వివరించింది. (చైనా మెప్పు కోసమే ఆ వ్యాఖ్యలు..) కాగా, భారత్, నేపాల్ మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మే 20న నేపాల్ తన కొత్త మ్యాప్ జారీ చేసింది. అందులో లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలను తమ ప్రాంతాలుగా చూపించింది. ఈ మూడు ప్రాంతాలు ప్రస్తుతం భారత్‌లో ఉన్నాయి. కానీ అది తమ ప్రాంతం అని నేపాల్ చెబుతోంది. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. దీని గురించి నేపాల్‌తో చర్చించేది లేదని తేల్చిచెప్పింది. ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలకై కృషి చేస్తామని పేర్కొన్నది. గత కొద్ది కాలంగా ఓలీ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. చైనా అండ చూసుకునే ఓలీ భారత వ్యతిరేక వ్యాఖ్యలు, చర్యలకు దిగుతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఒక్క రాముడేంటి, అన్ని గ్రహాలు నేపాల్‌వే..
న్యూఢిల్లీ: హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు నేపాల్ దేశస్థుడంటూ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి చేసిన సంచలన వ్యాఖ్యలపై భారతీయులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. 'అయ్యో.. రాముడేం ఖర్మ, విశ్వంలో ఉన్న అన్ని గ్రహాలు మీవే'నంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా సోమవారం నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి "సాంస్కృతికంగా మేం అణచివేతకు గురయ్యాం. రాముని జన్మస్థానంగా చెప్పుకుంటున్న అయోధ్య ఉత్తరప్రదేశ్‌లో లేదు, అది నేపాల్‌లోని బిర్గుంజ్ దగ్గర్లో గ్రామం. ఇప్పుడు భారత్‌లో ఉన్న అయోధ్య కల్పితం" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారతీయ ప్రజలు ట్విటర్లో ఓలిని విమర్శిస్తూ తమదైన శైలిలో చురకలంటిస్తున్నారు. "ప్రస్తుతమున్న నేపాల్ 2025కల్లా ప్రపంచ దేశాలను ఆక్రమించుకుంటుంది. ఆ తర్వాత 2030 కల్లా అంతరిక్షంలోని గ్రహాలను, అనంతరం అంతరిక్షాన్ని, మొత్తం అనంత విశ్వాన్నే ఆక్రమించుకుంటుంద"ని ఓ నెటిజన్ పేర్కొన్నారు. (శ్రీరాముడు నేపాలీ.. అయోధ్య ఇక్కడే ఉంది!) Brace yourself @realDonaldTrump 😷 The most powerful country with its dynamic and vibrant leader will conquer the entire universe very soon! World domination ka baap😎💪#Nepal #Ayodhya pic.twitter.com/xFhr2gXoL5 — Aditya (@adi_aithal) July 13, 2020 "రానున్న రోజుల్లో నేపాల్ ప్రధాని ఇలా అంటారు.. న్యూయార్క్ అమెరికాలో లేదు, నేపాల్‌లో ఉంది. అంతెందుకు ఆస్ట్రేలియా కూడా నేపాల్‌దే. టోక్యో, పారిస్ లండన్, బెర్లిన్, సూడాన్, బ్యాంకాక్, లాస్ వెగాస్, ఇస్లామాబాద్ అన్నీ నేపాల్‌వే. నేపాల్‌వాసినైనందుకు నాకు గర్వంగా ఉంది", "ఆయన్ను అలాగే వదిలేస్తే రావణుడు చైనా, గౌతమ్ బుద్ధుడు రష్యా, మహవీర్ నార్త్ పోల్ నుంచి వచ్చాడంటారు" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. "రాముడు నేపాల్ వాస్తవ్యులా.. ఇదెప్పుడు జరిగింది?" అంటూ మీమ్స్‌రాయుళ్లు ఫన్నీ క్యాప్షన్లతో చెలరేగిపోతున్నారు. కాగా ఓలి.. వాల్మీకి ఆశ్రమం కూడా నేపాల్‌లోనే ఉందని, దశరథుడు తమ దేశాన్ని పాలించేవాడని, అతని కొడుకు రాముడు కూడా ఇక్కడే పుట్టాడని వాదించగా వాటిని భారతీయులు కొట్టిపారేశారు. (ఓలి కోసం రంగంలోకి దిగిన చైనా) #Ayodhya Everyones reaction on hearing the news of Shree Ram being nepali#Ayodhya pic.twitter.com/wCS6OqpWgr — Akshay Pratap singh (@ak6official) July 13, 2020 I just want to say this to #kpsharmaoli#kpoli#Ayodhya pic.twitter.com/UTPpmHLtnm — Piyush Pramod Mittal (@PiyushPramod) July 13, 2020 -
చైనా మెప్పు కోసమే ఆ వ్యాఖ్యలు..
సాక్షి, హైదరాబాద్: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అయోధ్య రామునిపై మాట్లాడే హక్కు నేపాల్ ప్రధానికి లేదన్నారు. రాముని జన్మస్థలం ముమ్మాటికీ అయోధ్యేనని ఆయన అన్నారు. చైనా మెప్పుకోసం నేపాల్ ప్రధాని లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ‘‘దమ్ముంటే నేపాల్ లో ఉన్న అనేక హిందూ దేవాలయాలను పునరుద్ధరించాలి. భారత్‌లో అనేక మంది నేపాల్ దేశస్తులు జీవిస్తున్నారు. ఇప్పటి వరకు నేపాల్‌కు భారత్ అండగా ఉంది కాబట్టే.. చైనా మిమ్మల్ని ఆక్రమించలేదు. లేదంటే ఎప్పుడో నేపాల్‌పై చైనా నిజ స్వరుపాన్ని చూపేదని’’ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. -
శ్రీరాముడు నేపాలీ.. అయోధ్య ఇక్కడే ఉంది!
కఠ్మాండు: భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ వివాదం రేపిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అసలైన అయోధ్య నేపాల్‌లో ఉంది. శ్రీరాముడు నేపాల్ దేశస్తుడు’ అని ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘సాంస్కృతికంగా మేం అణచివేతకు గురయ్యాం. వాస్తవాలు మరుగునపడ్డాయి. మా సీతకు భారతీయ యువరాజు రాముడితో వివాహం అయిందని మేం నమ్ముతున్నాం. అయితే, అప్పటి అయోధ్య భారత్‌లో లేదు. అది నేపాల్‌లోని బిర్గుంజ్ దగ్గర్లో గ్రామం. భారత్‌లో ఇప్పుడున్న అయోధ్య కల్పితం’అని పేర్కొన్నారు. నేపాల్ కొత్త రాజకీయ మ్యాప్‌ను ప్రచురించడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న సమయంలో ఓలి ఈ విషయం తెరపైకి తేవడం గమనార్హం. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు భారత్ ప్రోద్బలంతో ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఇటీవల ఆరోపణలు చేశారు. ప్రధాని ఓలి తాజా వ్యాఖ్యలపై అధికార పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని ప్రచండ స్పందించారు. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు రాజకీయంగా గానీ, దౌత్యపరంగా గానీ సరికావన్నారు. -
చీలిక దిశగా నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ
కఠ్మాండు: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’ మధ్య సయోధ్య కుదరక పోవడంతో అధికార పార్టీలో చీలిక దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చైనా అనుకూలుడిగా పేరున్న ఓలి తరఫున నేపాల్‌లో చైనా రాయబారి హౌ యాంకుయి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తుండటం గమనార్హం. చైనా రాయబారి గురువారం ప్రచండను ఆయన నివాసంలో కలిసి చర్చలు జరిపారు. ప్రధాని ఓలి రాజకీయ భవితవ్యం శుక్రవారం జరగనున్న పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తేలిపోనుంది. కాగా, కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీ ఇప్పటి వరకు 4 పర్యాయాలు భేటీ అయినా ఇద్దరు నేతల వివాద పరిష్కారం కోసం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేకపోయింది. (భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు.. నేపాల్ ప్రధానికి షాక్) -
ఓలి కోసం రంగంలోకి దిగిన చైనా
ఖాట్మండూ: నేపాల్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామాపై అస్పష్టత కొనసాగుతూనే ఉంది. ప్రధాని రాజీనామా చేయాలని సొంత పార్టీ నాయకులే డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓలి తన ప్రధాన ప్రత్యర్థి, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండతో వరుసగా సమావేశం అయినా లాభం లేకుండా పోయింది. అసంతృప్తి నేతలెవ్వరూ దారికి రావడం లేదు. మరోవైపు ఓలి ప్రభుత్వాన్ని కాపాడటానికి చైనా కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో చైనా రాయబారి హౌ యాంకి తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏప్రిల్ నుంచి ఎన్సీపీలో అంతర్గతంగా రగులుతున్న వివాదాన్ని చల్లర్చడం కోసం చైనా రాయబారి హౌ యాంకి పలువురు నేపాలీ రాజకీయ నాయకులతో సమావేశమై చర్చలు జరిపారు. గత వారం రోజుల వ్యవధిలో కూడా చైనా రాయబారి హౌ యాంకి పలువురు నేపాల్ నేతలతో చర్చలు జరిపారు. జూలై 3న నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారిని కలిశారు. అయితే అది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని చెప్పారు. హౌ యాంకి, ప్రచండల మధ్య సమావేశం గురించి ఇంకా స్పష్టత రాలేదు. పీఎం ఓలికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న ప్రచండ, హౌ యాంకి కలవడానికి ఇష్టపడరని సమాచారం. ఇదిలా ఉండగా చైనా రాయబార కార్యాలయం హౌ యాంకి సమావేశాలను సమర్థించింది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొవడం చైనాకు ఇష్టం లేదని తెలిపింది. నేపాల్ నాయకులు తమ విభేదాలను పరిష్కరించుకుని ఐక్యంగా ఉండాలని చైనా కోరుకుంటున్నట్లు ఆ దేశ ఎంబసీ ప్రతినిధి ఒకరు మీడియాతో చెప్పారు.(భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు.. నేపాల్ ప్రధానికి షాక్) నేపాల్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలి పరిపాలన సరిగా లేదని, ఆయన తక్షణమే పదవి నుంచి వైదొలగాలని ఎన్సీపీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రచండ నేతృత్వంలో అసమ్మతి వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలాఖరు నుంచి అంతర్గతంగా కొనసాగుతున్న ఈ వివాదం గురించి హౌ యాంకికి పూర్తిగా తెలుసు. ఈ నేపథ్యంలో నేపాల్‌లోని కమ్యూనిస్టు నాయకులనంతా ఏకతాటిపైకి తేవడంలో చైనా కీలకపాత్ర పోషించి ఉంటుందని.. అందుకే ఇప్పుడు అధికార పార్టీలో అసమ్మతిని తగ్గించేందకు ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.(భారత్-నేపాల్ వివాదం.. కీలక పరిణామం) -
నేపాల్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన
కఠ్మాండు: అధికారాన్ని పంచుకునే విషయంలో రాజీ కుదరకపోవడంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రచండల మధ్య చర్చలు ఆదివారం అసంపూర్తిగా ముగిశాయి. మళ్లీ సోమవారం చర్చలు కొనసాగించాలని రెండు వర్గాలు నిర్ణయించాయి. కీలక పార్టీ స్టాండంగ్ కమిటీ సమావేశానికి ముందే ఒక ఒప్పందానికి రావాలని వారు భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా కేపీ శర్మ ఓలి దిగిపోవాలని ప్రచండ వర్గం కోరుతోంది. ప్రచండకు సీనియర్ నేతలు మద్దతిస్తున్నారు. మరోవైపు, విపక్ష నేపాలీ కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాతో ప్రధాని ఓలి భేటీ అయ్యారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విపక్ష మద్దతును కోరేందుకే ఓలి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. ఓలి ప్రధానిగా కొనసాగేందుకు అవసరమైతే.. అధికార పార్టీని చీల్చే అవకాశాలు కూడా ఉన్నాయని కథనాలు వెలువడుతున్నాయి. -
నేపాల్ సంక్షోభం : కీలక భేటీ
ఖట్మండు : నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామాకు నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్సీపీ)లో పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత పుష్ప కమల్ దహల్ ప్రధాని ఓలీతో ఆదివారం సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమావేశానికి ముందు దహల్ నేపాల్ అధ్యక్షులు బిద్యా దేవి భండారితో సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వెలువడ్డాయి. నేపాల్ ప్రధాని నియంత పోకడలు, భారత్ వ్యతిరేక ప్రకటనల నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించేందుకు నేపాల్ పాలక కమ్యూనిస్టు పార్టీ ఈ నెల 6న కీలక భేటీ జరపనుంది. ఓలీ రాజీనామాకు పట్టుబడుతున్న నేతలు ఈ దిశగా పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. 45 మంది సభ్యులతో కూడిన ఎన్సీపీ స్టాండింగ్ కమిటీ ఈనెల 4న భేటీ కావాల్సి ఉండగా చివరినిమిషంలో సమావేశం వాయిదాపడింది. ప్రధానమంత్రి పదవితో పాటు పార్టీ సహ అధ్యక్ష పదవికీ ఓలీ రాజీనామా చేయాలని ఆయన వ్యతిరేకులు పట్టుబడుతుండగా, పదవుల నుంచి వైదొలగేందుకు ఆయన సుముఖంగా లేరని హిమాయలన్ టైమ్స్ పేర్కొంది. ఒప్పందానికి భిన్నంగా పూర్తికాలం పదవిలో కొనసాగేందుకు తాను ఓలీకి అవకాశం ఇచ్చినా దేశాన్ని సమర్ధంగా ముందుకుతీసుకెళ్లడంలో ఆయన విఫలమయ్యారని ఎన్సీపీ సీనియర్ నేత దహల్ ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ఎన్సీపీలో చిచ్చురేపుతోందని పార్టీ స్టాండింగ్ కమిటీ సభ్యులు హరిబోల్ గజురెల్ పేర్కొన్నారు. ఓలీ, దహల్‌లు తమ మంకుపట్టు వీడకపోవడంతో పార్టీలో ప్రతిష్టంభన కొనసాగుతోందని చెప్పారు. మరోవైపు నేపాల్ ప్రధాని ఓలీని తప్పించేందుకు దహల్ వర్గీయులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తే పార్టీ నిట్టనిలువునా చీలిపోతుందని ఎన్సీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కాగా, తనను పదవి నుంచి తొలగించేందుకు భారత్ కుట్ర చేస్తోందని, కొంతమంది నేపాల్ నాయకులు సైతం ఈ కుట్రలో భాగస్వామ్యలు అయ్యారని ప్రధాని ఓలీ ఆరోపిస్తున్నారు. ఇక ఓలీ వ్యవహారశైలిపై భగ్గుమంటున్న పుష్ప కమల్ దహల్, మాధవ్ కుమార్ నేపాల్, జలనాథ్ ఖనల్ వంటి ముఖ్యనేతలు ప్రధాని చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని లేకుంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
నేపాల్ ప్రభుత్వంలో ముసలం
-
భారత్‌కు వ్యతిరేకంగా చైనా, పాక్ భారీ కుట్ర!
న్యూఢిల్లీ: నేపాల్ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను చైనా, పాకిస్తాన్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు సమాచారం. హిమాలయ దేశంలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు భారీ కుట్రకు తెరతీసినట్లు తెలుస్తోంది. నేపాల్‌కు సుదీర్ఘ కాలంగా మిత్ర దేశంగా ఉన్న భారత్‌కు వ్యతిరేకంగా.. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం సహా.. పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలే ఆయనను విమర్శిస్తూ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందిగా పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలి గురువారం అధికార కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యనేత, మాజీ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహల్), దేశ అధ్యక్షురాలు విద్యా దేవీ భండారీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే విధంగా బలూవాటర్‌లోని ప్రధాని నివాసంలో కేబినెట్ కూడా సమావేశమైందని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను నిలిపివేసి, పార్లమెంటును ప్రొరోగ్ చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. (నేపాల్ ప్రధానికి అండగా ఇమ్రాన్ ఖాన్!?) వైద్య సహాయం పేరిట నేపాల్‌లో తిష్ట! మరోవైపు... తాజా పరిణామాలపై చర్చించేందుకు కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్ కమిటీ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తే పరిస్థితులు నెలకొనడంతో.. చైనా తన గూఢాచారులను అక్కడ మోహరించినట్లు భారత భద్రతా సంస్థలు వెల్లడించాయి. ఓలికి మద్దతుగా నిలిచే క్రమంలో కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వైద్య సహాయం పేరిట డ్రాగన్ ఇప్పటికే తన వేగులను నేపాల్‌కు పంపించినట్లు పేర్కొన్నాయి. ఇక జీ న్యూస్ కథనం ప్రకారం.. చైనా ఇంటలెజిన్స్ ఏజెన్సీ మిలిటరీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ(ఎంఎస్ఎస్) నేపాల్‌లో తన ఉనికిని పెంచుకుంటోంది. నేపాల్‌కు సంబంధించిన కీలక వ్యవహారాల గురించి ఇప్పటికే రహస్యాలు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచంలోనే అత్యంత రహస్యంగా విదేశీ సమాచారాన్ని రాబట్టడంలో ఎంఎస్ఎస్ దిట్ట అంటూ పలువరు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. చైనా మిత్రదేశం పాకిస్తాన్ సైతం ఓలికి మద్దతు ప్రకటించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈరోజు ఓలితో ఫోన్లో మాట్లాడేందుకు అధికార వర్గాలు షెడ్యూల్ ఫిక్స్ చేసినట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి. (ఆ నిర్ణయాన్ని సరిచేసుకోవాలి: చైనా) -
భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు.. నేపాల్ ప్రధానికి షాక్
ఖాట్మాండు: భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధానమంత్రి రాజీనామా చేయాలని సొంత పార్టీ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని నేపాల్‌లోని అధికార పక్షమైన కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తోంది. పార్టీ చైర్మన్ పుష్ప కమల్ దహల్ కూడా ప్రధాని తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేయడం నేపాల్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. తనను పదవి నుంచి తొలగించేందుకు భారత్ కుట్ర చేస్తోందని, కొంతమంది నేపాల్ నాయకులు సైతం ఈ కుట్రలో భాగస్వామ్యలు అయ్యారని ఆదివారం ప్రధాని ఓలీ ఆరోపించారు. (నన్ను గద్దె దింపేందుకు కుట్ర: నేపాల్ ప్రధాని) నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశం మంగళవారం బలువతార్‌లోని ప్రధానమంత్రి నివాసంలో జరిగింది. దీనికి అధికార పార్టీ సభ్యులతో పాటు మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను పదవి నుంచి తప్పించడానికి భారత్ కుట్రలు పన్నుతోందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, దౌత్యపరంగా సరైనవి కావన్నారు. అనవసరంగా చిరకాల మిత్ర దేశమైన భారత్‌తో విరోధం ప్రధాని వైఫల్యమే అని అసహనం వ్యక్తం చేశారు. అలాగే సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేయడం తగదన్నారు. ప్రధాని వ్యాఖ్యలు పొరుగు దేశాలతో నేపాల్ సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయని హెచ్చరించారు. (చైనాపై మరింత కోపంగా ఉన్నాను: ట్రంప్) పుష్ప కమల్ దహల్, మాధవ్ కుమార్ నేపాల్, జలనాథ్ ఖనల్ వంటి ముఖ్యనేతలు కూడా ప్రధాని చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని లేకుంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమర్థవంతమైన నాయకత్వం అందించడంలో ప్రధాని ఓలీ విఫలమయ్యారని.. పార్టీ పగ్గాలను కూడా సరైన నేతలకు అప్పగించాలని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మొత్తం 18 మంది నాయకులు హాజరవగా 17 మంది రాజీనామాకు పట్టుబట్టినట్టు సమాచారం. అయితే ఈ సమావేశంలో ప్రధాని ఏ విధంగానూ స్పందించకపోవడం గమనార్హం. -
భారత్‌పై నేపాల్ ప్రధాని తీవ్ర ఆరోపణలు
ఖాట్మండూ: భారత్‌కు చెందిన మూడు వ్యూహాత్మక భూభాగాలను నేపాల్‌లో కలిపిస్తూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన తర్వాత తనను పదవి నుంచి తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలీ ఆరోపించారు. అయితే, తనను గద్దె దించడం అసాధ్యమని ఆదివారం తేల్చిచెప్పారు. ఖాట్మాండూలోని ఓ హోటల్లో తనపై కుట్రలకు కార్యాచరణ జరుగుతోందని, ఇందులో ఓ దేశ రాయబార కార్యాలయం చురుగ్గా పాల్గొంటోందని పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. భారత భూభాగాలైన లిపూలేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను నేపాల్‌కు చెందినవంటూ మ్యాప్ రూపొందించి.. దానిపై రాజ్యాంగ సవరణ చేసిన ఓలీ.. ఈ మ్యాప్ రూపకల్పన వల్లే భారత్ తన ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటోందని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని ఆస్థిరపర్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.(చదవండి : చైనా ప్రాజెక్టులకు కరోనా సెగ) -
మ్యాపుల వివాదం.. నేపాల్ ప్రధానికి షరతులు!
ఖాట్మండూ: కొత్త మ్యాపుల ప్రచురణకై పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన నేపాల్ కమ్యూనిస్టు పార్టీకి బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. సభలో తగినంత బలం లేకపోవడం(మూడింట రెండు వంతుల సభ్యుల ఆమోదం)తో అధికార పార్టీకి నిరాశ ఎదురైంది. బిల్లు నెగ్గించుకునేందుకు తొమ్మిది మంది సభ్యుల అవసరం ఉండగా.. నేపాలీ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షానికి షాకిచ్చింది. దీంతో చర్చ జరుగకుండానే సభ వాయిదా పడింది. ఈ క్రమంలో భారత్‌తో వివాదానికి కారణమైన లిపులేఖ్, లింపియధుర, కాలాపానీ ప్రాంతాలను నేపాల్ భూభాగంలో ఉన్నట్లుగా రూపొందించిన మ్యాపుల ప్రచురణ మరింత ఆలస్యం కానుంది. నమ్మకం ఉంది.. ఇక ఈ విషయంపై స్పందించిన నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలీ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. తాము ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు త్వరలోనే ఆమోదం పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘రేపు బడ్జెట్ ఉంది. కాబట్టి శుక్రవారం మరోసారి ఈ బిల్లు సభ ముందుకు వస్తుంది. ఎందుకంటే పార్లమెంటు ఎజెండాలో ఈ అంశాన్ని పొందుపరిచాం. కాబట్టి త్వరలోనే రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకుంటాం. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మాతో కలిసి వస్తాయని నాకు నమ్మకం ఉంది’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. (కొత్త మ్యాపులు: వెనక్కి తగ్గిన నేపాల్?!) ప్రధానికి షరతులు..! కాగా ఇటీవల భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి.. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ బిల్లుకు ఆమోదం తెలపాలంటే తమ డిమాండ్లను నెరవేర్చాలని 33 మంది సభ్యులు కలిగిన మధేశీ(పూర్వకాలంలోనే నేపాల్‌కు వెళ్లి స్థిరపడిన భారతమూలాలున్న ప్రజలు) పార్టీలు షరతు విధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2015-16లో నేపాల్ వ్యాప్తంగా నిరసనలకు కారణమైన పౌరసత్వ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా సదరు పార్టీలు కోరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.(అవసరమైతే యుద్ధానికి సిద్ధం.. కానీ: నేపాల్ మంత్రి) అదే విధంగా నేపాలీ కాంగ్రెస్ పార్టీ సైతం సెంట్రల్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మీదే తమ విధానం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. అంతవరకు ప్రస్తుత బిల్లును హోల్డ్‌లో పెట్టాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇక నేపాల్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘సరిహద్దు వివాదాలు సహజంగానే ఎంతో సున్నితమైనవి. పరస్పర నమ్మకం, పూర్తి విశ్వాసం ఉన్నపుడే ఇరు వర్గాల మధ్య సఖ్యత చేకూరుతుంది’’అని పేర్కొన్నాయి. -
కొత్త మ్యాపులు: వెనక్కి తగ్గిన నేపాల్?!
ఖాట్మండూ: గత కొన్ని రోజులుగా భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త మ్యాపుల రూపకల్పనను తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. భారత్- నేపాల్ సరిహద్దులో గల లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు నేపాల్ భూభాగంలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్‌కు ఆ దేశ కేబినెట్ ఆమోదం తెలపడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి..... కొత్త మ్యాపు ప్రచురణకు వీలుగా రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. (నేపాల్ దూకుడుకు భారత్ గట్టి కౌంటర్) ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ పార్టీ.. సెంట్రల్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వెలువడిన తర్వాతే ఈ విషయంలో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని కుండబద్దలు కొట్టింది. దీంతో ప్రధాని ఓలికి చట్టసభలో నిరాశే ఎదురైంది. అయితే ప్రతిపక్షం తమ నిర్ణయంతో విభేదించిందే తప్ప.. బిల్లు రద్దు కాలేదని.. మరో పదిరోజుల్లో ఇదే బిల్లును తిరిగి సభలో ప్రవేశపెడతామని ఓలి ప్రగల్భాలు పలికారు. కాగా గడిచిన రెండు నెలలుగా ఓలికి ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం ఇది రెండోసారి. ఇక లిపులేఖ్, లింపియధుర, కాలాపానీ విషయంలో భారత్‌కు కౌంటర్ ఇవ్వాల్సిందిగా.. నేపాల్ ఆర్మీ చీఫ్ పూర్ణచంద్ర థాపాకు ఓలి సూచించగా.. ఇది పూర్తిగా రాజకీయ పరమైన అంశం కాబట్టి.. అందులో తాను తల దూర్చలేనని ఆయన స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. (భారత్‌పై నేపాల్ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు) కాగా లిపులేఖ్‌లో భారత్ చేపట్టిన రహదారి నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపాల్.. ఈ విషయమై భారత రాయబారికి నోటీసులు జారీ చేసింది. అంతేగాక సరిహద్దుల్లోని ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ కొత్త మ్యాపులు రూపొందించింది. ఈ క్రమంలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన నేపాల్ ప్రధాని ఓలి... తమ దేశ ప్రజల సెంటిమెంట్లకు భారత్ తూట్లు పొడిచిందని మండిపడ్డారు. అంతేగాక ప్రాణాంతక కరోనా వైరస్ భారత్ వల్లే తమ దేశంలో ప్రవేశించిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే ఓలి ఈ విధంగా భారత్‌కు వ్యతిరేకంగా నేపాలీలను సంఘటితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అదే విధంగా నేపాల్ రూపొందించిన మ్యాప్‌కు చారిత్రక ఆధారాలు లేవని.. కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులు చెల్లవని భారత్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.(చిచ్చురేపుతున్న నేపాల్!) -
భారత్‌పై నేపాల్ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు
ఖాట్మండూ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి భారత్‌పై విరుచుకుపడ్డారు. భారత సరిహద్దుల వద్ద నిబంధనలు ఉల్లంఘించి పౌరులు తమ దేశంలో ప్రవేశించి ప్రాణాంతక కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను తుంగలో తొక్కి అంటువ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నారంటూ మండిపడ్డారు. ఇతర దేశాల వల్లే నేపాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ పరోక్షంగా భారత్‌పై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఓలి... దక్షిణాసియాలో అన్ని దేశాల కంటే నేపాల్‌లోనే కరోనా మరణాల సంఖ్య అతి తక్కువగా ఉందన్నారు. ఈ క్రమంలో నేపాలీ వైద్య నిపుణుల సూచనల ప్రకారం దేశ జనాభాలోని రెండు శాతం ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా లక్షణాలతో బాధ పడుతున్న వారికి క్వారంటైన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. (యుద్ధానికి మా ఆర్మీ సిద్ధం: నేపాల్ మంత్రి ) అదే విధంగా... కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అనుసరించాల్సిన వ్యూహాలపై తాను పలు రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలతో మాట్లాడినట్లు ఓలి తెలిపారు. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన నేపాలీలను సురక్షిత పద్ధతిలో స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కాగా లిపులేఖ్, కాలాపానీ అంశంలో భారత్- నేపాల్‌ల మధ్య వివాదం ముదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత వారం భారత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన కేపీ శర్మ ఓలి.. చైనా, ఇటలీ కంటే భారత్ నుంచి వ్యాపించే వైరస్ మరింత ప్రమాదకరమైనదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి వచ్చే వాళ్ల వల్లే తమ దేశంలో మహమ్మారి ప్రబలుతోందని ఆరోపించారు. (భారత్‌పై నేపాల్ ప్రధాని షాకింగ్ కామెంట్లు!) -
చిచ్చురేపుతున్న నేపాల్!
మిత్ర దేశాల మధ్య చిచ్చు రేగింది. భారత్, నేపాల్ సరిహద్దు వివాదం... సరికొత్త మలుపులు తిరుగుతోంది. నేపాల్ కొత్త మ్యాపుతో మంట రేగుతోంది. ఏమిటీ వివాదం ? ఎందుకు ముదురుతోంది ? వివాదం మొదలైంది ఇలా ... జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చూపిస్తూ గత ఏడాది నవంబర్‌లో భారత్ ఒక మ్యాప్ విడుదల చేసింది. అందులో కాలాపానీ ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ భూభాగంలో ఉన్నట్టుగానే చూపించింది. అప్పట్లోనే నేపాల్‌లో అక్కడక్కడా నిరసన స్వరాలు వినిపించాయి. ఆ తర్వాత మానససరోవర్‌కు వెళ్లే యాత్రికుల ప్రయాణ దూరాన్ని తగ్గించడానికి లిఫులేఖ్ ప్రాంతంలో నిర్మించిన 80.కి.మీ. రహదారిని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల 8న ప్రారంభించారు. దీంతో నేపాల్ ఒక్కసారిగా కస్సుమంది. లిఫులేఖ్, కాలాపానీ, లింపియాథురా ప్రాంతాలను తమ దేశ భూభాగంగా చూపిస్తూ కొత్త దేశ పటాన్ని విడుదల చేసింది. దానికి రాజ్యాంగబద్ధతను తీసుకురావడానికి పార్లమెంటులో తీర్మానం కూడా చేసింది. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతాలు తమవేనని నేపాల్‌కు స్పష్టం చేసింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నేపాల్ బుసల వెనుక డ్రాగన్ ? నేపాల్‌కు ఏ చిన్న కష్టమొచ్చినా నేనున్నానంటూ భారత్ ఆదుకుంటుంది. ఎన్నో అంశాల్లో నేపాల్ భారత్‌పైనే ఆధారపడి ఉంది. కానీ ఈ మధ్య కాలంలో నేపాల్ చీటికీ మాటికీ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్ నుంచి వచ్చిన వారితో విస్తరించిన కరోనా వైరస్ చైనా కంటే డేంజర్ అంటూ నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పడు సరిహద్దు వివాదానికి తెరతీశారు. దీని వెనుక చైనా హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి. నేపాల్ ప్రధానమంత్రి ఓలి ఏకపక్ష నిర్ణయాలతో అక్కడ రాజకీయ సంక్షోభం తీవ్రతరమైంది.. ఓలి రాజీనామా చేయాలని ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) డిమాండ్ చేసింది. ఆ సమయంలో చైనా ఓలికి అండగా నిలబడింది. నేపాల్‌లో చైనా రాయబారి ఆ పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించినట్టుగా కథనాలు వచ్చాయి. ప్రతిఫలంగా ఓలి చైనాకు కొమ్ముకాస్తూ భారత్ రక్షణని ప్రమాదంలో పడేసే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కోవిడ్–19ని అరికట్టడంలో వైఫల్యం, పార్టీలోనూ, ప్రజల్లోనూ పట్టు కోల్పోతున్న ఓలి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి కాలాపానీ అంశాన్ని పెద్దది చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాలాపానీ చరిత్రలోకి వెళితే ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లాలో నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతమే కాలాపానీ. సముద్రమట్టానికి 3,600 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. 35 చదరపు కిలో మీటర్లు ఉండే ఈ ప్రాంతం మహాకాలీ నది జన్మస్థావరం. ఎప్పట్నుంచో ఇది భారత్‌లో అంతర్భాగంగానే ఉంది. ఈ మార్గం ద్వారానే భారతీయ యాత్రికులు అత్యంత సాహసోపేతమైన మానస సరోవర్ యాత్రకి వెళతారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో భారత్ అక్కడ 18 సైనిక శిబిరాల్ని ఏర్పాటు చేసింది. 1969లో నేపాల్‌తో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంతో కాలాపానీలో మినహా మిగిలిన సైనిక శిబిరాలన్నీ తొలగించింది. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలపై నిఘా పెట్టాలంటే కాలాపానీ ప్రాంతంలో సైనిక శిబిరం అత్యంత ముఖ్యం. అయితే కాలాపానీ ప్రాంతం తమదేనని నేపాల్ వాదిస్తోంది. నేపాల్‌కు, ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య 1816లో జరిగిన సుగౌలీ ఒప్పందం ప్రకారం కాలీ నది నేపాల్‌లో ప్రవహిస్తోందని చెప్పారని, ఆ నది పుట్టిన భూభాగం తమదేనన్నది ఆ దేశం వాదన. దేశ పటాన్ని మార్చడంలో నేపాల్ ఏకపక్ష నిర్ణయానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. సరిహద్దు వివాదాలు దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కారమవుతాయన్న భావనకు వ్యతిరేకంగా ఓలి సర్కార్ వ్యవహరిస్తోంది. సరిహద్దు రేఖల్ని తమ ఇష్టారాజ్యంగా మార్చేస్తామంటే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి -
నేపాల్ దూకుడుకు భారత్ గట్టి కౌంటర్
న్యూఢిల్లీ: లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ మూడు ప్రాంతాలను తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్ చేస్తూ.. అందుకు సంబంధించిన తీర్మానాన్ని నేపాల్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ భూభాగాలను తమ దేశంలోని ప్రాంతాలుగా పేర్కొంటూ కొత్త మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. కాగా నేపాల్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. ఆ దేశం నిర్ణయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. నేపాల్ రూపొందించిన మ్యాప్‌కు చారిత్రక ఆధారాలు లేవని.. కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులు చెల్లవని తేల్చిచెప్పింది. (కాలాపానీ మాదే.. భారత్ నుంచి తీసుకుంటాం) ఈ విషయం గురించి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. నేపాల్ ప్రభుత్వ ఏకపక్ష చర్యను అంగీకరించబోమన్నారు. ‘‘ఈ విషయంలో భారత్ వైఖరి ఏమిటో నేపాల్‌కు స్సష్టమైన అవగాహన ఉంది. ఇకనైనా ఇలాంటి అన్యాయపూరితమైన పటాలు విడుదల చేయడం ఆపేయాలని నేపాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కోరుతున్నాం. నేపాలీ అధినాయకత్వం సానుకూల వాతావరణంలో ద్వైపాక్షిక చర్చల ద్వారా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు సహకరిస్తుందని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.(భారత్‌పై నేపాల్ ప్రధాని షాకింగ్ కామెంట్లు!) కాగా మే 11న భారత రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ మీదుగా లిపులేఖ్ వరకూ మానస సరోవర్ యాత్రకెళ్లేవారి సౌకర్యార్థం నిర్మించిన రహదారికి శంకుస్థాపన చేసిన నాటి నుంచి నేపాల్ భారత్‌పై అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపాల్.. భారత రాయబారికి నోటీసులు పంపడం సహా ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత రాజముద్రలో ఉండే మూడు సింహాల ముందు ‘సత్యమేవ జయతే’ అని ఉంటుందని, ఆ దేశం దానికి కట్టుబడి ఉంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (నేపాల్ కన్నెర్ర) 200 ఏళ్ల నాటి వివాదం భారత్-నేపాల్-చైనా సరిహద్దులో గల లిపులేఖ్ భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది. ఈ సరిహద్దు వివాదం 200 ఏళ్ల క్రితమే మొదలైంది. ఇరు దేశాల మధ్య 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగౌలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్ పాలకులు భారత్ తరఫున సంతకాలు చేయగా... ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. ఆ నదుల గమనం ఈ రెండు శతాబ్దాల్లో అనేకసార్లు మారడం వల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. తాజాగా నేపాల్ కొత్త మ్యాపులు విడుదల చేయడంతో వివాదం తారస్థాయికి చేరింది. -
నేపాల్ కన్నెర్ర
మన దేశానికి సంబంధించినంతవరకూ ఇది సరిహద్దు వివాదాల సీజన్‌లా కనబడుతోంది. ఈనెల 5న సిక్కింలోవున్న నుకా లా ప్రాంతంలో భారత–చైనా సరిహద్దుల వద్ద గస్తీలో వున్న మన సైని కులతో చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. అందులో భారత జవాన్లు నలుగురు, చైనా సైనికులు ఏడుగురు గాయపడ్డారు. చివరకు ఇరుపక్షాల సైనికాధికారులు చర్చించుకోవడంతో వివాదం సమసిపోయింది. తాజాగా ఇప్పుడు నేపాల్ పేచీ మొదలుపెట్టింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు తన భూభాగంలోనివేనంటూ అది కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. అంతేకాదు... ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి బుధవారం కటువైన వ్యాఖ్యలు కూడా చేశారు. భారత్ రాజముద్రలో వుండే మూడు సింహాల ముందు ‘సత్యమేవ జయతే’ అని వుంటుందని, ఆ దేశం దానికి కట్టుబడి వుంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కరోనా వైరస్‌ను గుర్తుకు తెచ్చేలా ‘చైనా వైరస్ కంటే, ఇటలీ వైరస్ కంటే ఇండియా వైరస్ ప్రమాదకరమైనదంటూ పరుషంగా మాట్లాడారు. ఈ పేచీ వెనక ‘ఎవరో’ వున్నారంటూ మన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఎంఎం నరవానె మొన్న శుక్రవారం చేసిన ప్రకటన నేపాల్‌కు తగ లవలసిన చోటే తగిలింది. త మను పరోక్షంగా చైనా కీలుబొమ్మగా అభివర్ణించడం అది తట్టు కోలేకపోయింది. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా మన దేశాన్ని ఈ స్థాయిలో విమర్శించ డానికి పూనుకొంది. సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నా మని నేపాల్ విదేశాంగమంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి అనడం, ఆ తర్వాత లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను వెనక్కివ్వాలంటూ పార్లమెంటులో అధికార పక్షం తీర్మానం ప్రవేశ పెట్టడం గమనిస్తే అది లోగడ కంటే దూకుడు పెంచిందని సులభంగానే తెలుస్తుంది. ముఖ్యంగా ఈనెల 11న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ మీదుగా లిపులేఖ్ వరకూ మానస సరోవర్ యాత్రకెళ్లేవారి సౌకర్యార్థం నిర్మించిన రహదారిని ప్రారంభించాక నేపాల్‌లో అసహనం కట్టలు తెంచుకుంది. లిపులేఖ్ సమీపంలోనే చైనా సరిహద్దు కూడా వుంటుంది. కనుక కొత్తగా నిర్మించిన ఈ రహదారి వ్యూహాత్మకంగా కూడా మన దేశానికి కీలకమైనది. అందుకే నేపాల్ పేచీ వెనక ‘ఎవరో’ వున్నారని జనరల్ నరవానె అన్నారు. ఈ రహదారి వల్ల నేపాల్‌కొచ్చే ఇబ్బంది మాటెలావున్నా యుద్ధ సమయాల్లో మన సైన్యాన్ని సులభంగా తరలించడానికి ఉపయోగపడుతుంది గనుక చైనాకు మాత్రం సమస్యాత్మకమే. భారత్–నేపాల్ సరిహద్దు వివాదానికి 200 ఏళ్ల చరిత్ర వుంది. రెండు దేశాల మధ్యా 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగౌలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్ పాలకులు భారత్ తరఫున సంతకాలు చేశారు. ఆ ప్రాంతంలో పారుతున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. ఆ నదుల గమనం ఈ రెండు శతాబ్దాల్లో అనేకసార్లు మారడం వల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో అయోమయం ఏర్పడింది. ఇది చాలదన్నట్టు రెండు దేశాల వద్దా అప్పటి మ్యాప్‌లు కూడా లేవు. మన పారా మిలిటరీ దళమైన సశస్త్ర సీమాబల్ జవాన్లు అక్కడి సరిహద్దుల్ని పహారా కాస్తారు. నేపాల్ వైపు నుంచి మొదటినుంచీ అలాంటి పహారా లేదు. దీన్ని ఉపయోగించుకుని భారత్ తమ 60,000 హెక్టార్ల భూమిని ఆక్రమించిందన్నది నేపాల్ ఆరోపణ. ఈ విషయంలో నేపాల్ జాతీయవాదులు చాన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. అయితే రెండు దేశాల ప్రభుత్వాల మధ్యా ఎప్పుడూ సత్సంబంధాలే వుండేవి గనుక ఇరు పక్షాలూ ఈ సమస్యపై బాహాబాహీకి దిగలేదు. అయితే సరిహద్దుల్ని ఖరారు చేయడానికి ఉమ్మడిగా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా అదింకా ఎటూ తేలకుండానే వుంది. నేపాల్‌లో భారత్‌పై అంతకుముందునుంచీ వున్న అసంతృప్తి 2006లో అక్కడ హిందూ రాజరిక పాలన అంతమైనప్పటినుంచీ బలపడుతూ వచ్చింది. తమకు భారత్ సమాన స్థాయి ఇచ్చి గౌరవించడం లేదని నేపాల్ జాతీయవాదుల అభిప్రాయం. వాటిని పోగొట్టడానికి మనవైపుగా ఎప్పుడూ సరైన ప్రయత్నాలు జరగలేదనే చెప్పాలి. మనకు అత్యంత సన్నిహిత దేశంగా, మన కనుసన్నల్లో నడిచే దేశంగా వుండే నేపాల్ క్రమేపీ దూరమవుతున్న సంగతిని మన పాలకులు సకాలంలో పట్టించుకోలేదు. 1997లో అప్పటి ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ ఆ దేశంలో పర్యటించాక 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేవరకూ మన ప్రధానులెవరూ ఆ దేశం వెళ్లలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1987లో ఆ దేశంతో ఒక ఒప్పందం కుదిరింది. ఇండో–నేపాల్ కమిషన్ ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి రెండేళ్లకూ అది సమావేశమవుతూ పరస్పర ప్రయోజనాలకు తోడ్పడేవిధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆ ఒప్పందం సారాంశం. కానీ 2014 వరకూ మన దేశం దాని జోలికే పోలేదు. నరేంద్ర మోదీ వచ్చాకైనా ఆ దేశంతో సంబంధాలు పెద్దగా మెరుగుపడలేదు. రెండేళ్లక్రితం శర్మ ఓలి ప్రధాని అయ్యాక తొలి విదేశీ పర్యటన కోసం మన దేశాన్నే ఎంచుకున్నారు. వివిధ రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అది చిన్న దేశమే కావొచ్చు...దానితో కుదుర్చుకోదగ్గ భారీ వాణిజ్య ఒప్పందాలు వుండకపోవచ్చు. కానీ దానికీ, మనకీ పొరుగునున్న చైనాతో మనకు అనేకానేక సమస్యలున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేపాల్ విషయంలో మన దేశం చొరవ ప్రదర్శించివుంటే బాగుండేది. తాజా వివాదంలో నేపాల్ వాదన సరికాదని మన దేశం ఇప్పటికే జవాబిచ్చింది. ఈ వివాదం ముదర కుండా చూడటం, సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించడానికి ప్రయత్నించడం అన్నివిధాలా శ్రేయస్కరం. -
భారత్‌పై నేపాల్ ప్రధాని షాకింగ్ కామెంట్లు!
ఖాట్మండూ: లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య వివాదం నెలకొన్న తరుణంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి వచ్చే వాళ్ల వల్లే తమ దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ప్రబలుతోందని ఆరోపించారు. భారత్ నుంచి వచ్చే వైరస్ చైనీస్, ఇటాలియన్ వైరస్ కంటే మరింత ప్రాణాంతకమైనదని షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్లో ప్రసంగించిన కేపీ శర్మ.. ‘‘భారత్ నుంచి అక్రమ మార్గాల ద్వారా ఇక్కడి వచ్చిన వారు దేశంలో వైరస్‌ను వ్యాప్తి చెందిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కొంతమంది రాజకీయ నాయకుల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి పరీక్షలు నిర్వహించకుండానే వారిని లోపలికి తీసుకువస్తున్నారు. ఇలా బయటి ప్రాంతాల నుంచి రాకపోకలు ఉన్న నేపథ్యంలో కోవిడ్-19ను కట్టడి చేయడం కష్టంతో కూడుకున్న పని. చైనా, ఇటలీ వైరస్ కంటే ఇండియా వైరస్ మరింత ప్రాణాంతకంగా పరిణమించింది. దాని కారణంగా ఎంతో మంది ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు’’అని భారత్‌పై అసహనం వ్యక్తం చేశారు. కాగా ఉత్తరాఖండ్‌లోని ధర్చులా ప్రాంతాన్ని లిపులేఖ్ కనుమతో కలుపుతూ భారత్ రోడ్డు నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపాల్.. ఇందుకు నిరసనగా తమ దేశంలోని భారత రాయబారికి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.(కాలాపానీ మాదే.. భారత్ నుంచి తీసుకుంటాం) ఈ క్రమంలో లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్ చేస్తూ ఆ దేశ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ మూడు ప్రాంతాల విషయంలో గత పాలకుల మాదిరి తాము వెనుకంజ వేయబోమని, వాటిని దక్కించుకుని తీరతామని ప్రధాని కేపీ శర్మ ఓలి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా తమ దేశంలో కరోనా వ్యాప్తికి భారత్ కారణమంటూ మరోసారి వివాదానికి తెరతీశారు.(భారత్‌పై నేపాల్ అభ్యంతరం.. చైనా ప్రమేయం!) భారత్‌పై నేపాల్ అభ్యంతరం.. చైనా ప్రమేయం! -
కాలాపానీ మాదే.. భారత్ నుంచి తీసుకుంటాం
కఠ్మాండు: లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఈ మూడు ప్రాంతాలూ తమవేననీ, రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వాటిని భారత్ నుంచి తిరిగి పొందుతామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తెలిపారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను నేపాల్ భూభాగంలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్‌కు ఆ దేశ కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ.. ‘నేపాల్‌కు చెందిన ఈ మూడు ప్రాంతాల్లోనూ సైన్యాన్ని మోహరించి భారత్ వివాదాస్పదంగా మార్చింది. నేపాలీలు అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంది. కాలాపానీలో 1962 నుంచి భారత సైన్యం ఉంది. గత పాలకులు ఈ అంశాన్ని లేవనెత్తడానికి వెనుకంజ వేశారు. వాటిని మేం తిరిగి పొందుతాం’అని తెలిపారు. ఈ మూడు ప్రాంతాలను తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్ చేస్తూ అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్లో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టింది. ఉత్తరాఖండ్‌లోని ధర్చులా ప్రాంతాన్ని లిపులేఖ్ కనుమతో కలుపుతూ భారత్ రోడ్డు నిర్మించడంపై గత వారం నేపాల్‌లో భారత రాయబారికి నిరసన తెలిపింది. కాలాపానీ, లిపులేఖ్‌లు తమవేనంటూ గత ఏడాది అక్టోబర్‌లో భారత్ మ్యాప్ విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. చర్చల ద్వారా ఇరుదేశాలు దీన్ని పరిష్కరించుకోవాలని చైనా పేర్కొంది. -
నేపాల్– భారత్ మధ్య కొత్త చెక్‌పోస్ట్
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్– నేపాల్ సరిహద్దుల్లో భారత్ సాయంతో నేపాల్ నిర్మించిన ‘జోగ్బని–బిరాట్‌నగర్’ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను వీడియో లింక్ ద్వారా మంగళవారం ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, కేపీ శర్మ ఓలి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ చెక్‌పోస్ట్ నిర్మాణం కోసం భారత్ రూ. 140 కోట్ల ఆర్థిక సాయాన్ని నేపాల్‌కు అందించింది. ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధి, ఇరుదేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలు లక్ష్యంగా ఈ చెక్‌పోస్ట్‌ను రూపొందించారు. 260 ఎకరాల్లో ఈ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. చెక్‌పోస్ట్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్నేహపూర్వక పొరుగు దేశాలతో సత్సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఆ దేశాలతో వాణిజ్య, సాంస్కృతిక, విద్యావిషయక సంబంధాలు మెరుగుపడే దిశగా భారత్ చర్యలు తీసుకోవడం కొనసాగిస్తుందన్నారు. భారత ప్రధానికి నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలి కృతజ్ఞతలు తెలిపారు. మోదీని నేపాల్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. -
తుఫాను బీభత్సం.. 27 మంది మృతి
ఖాట్మండూ : నేపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. తుఫాను ధాటికి 27 మంది మృతి చెందగా.. 400 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు చేపట్టిన రక్షణా సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బారా, పార్సా జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి పెనుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో ప్రధాని సలహాదారు బిష్ణు రిమాల్ మాట్లాడుతూ.. ‘ ఖాట్మండులోని మిడ్ ఎయిర్‌బేస్‌లో ఉన్న రెండు బెటాలియన్లను ఘటనా స్థలికి పంపించాం. వాతావరణం సహకరించకపోవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మా బలగాలు బాధితులను రక్షిస్తాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తాం’ అని పేర్కొన్నారు. Nepal: 27 people have died and more than 400 have been injured in rainstorms in Nepal. Over 100 army personnel have been deployed in the affected areas, rescue operations underway. Visuals from hospital in Birgunj (pic 1 & 2) and rainstorms affected Bara (pic 3 & 4). pic.twitter.com/OHGn1G4kDt — ANI (@ANI) April 1, 2019 -
‘మీరు లేనిదే భారత చరిత్ర అసంపూర్ణం’
జనక్‌పూర్, నేపాల్ : కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లారు. రెండు రోజుల నేపాల్ పర్యటనలో ఆయన అక్కడి మూడు హిందూ తీర్థాలయాలను సందర్శించనున్నారు. కాగా భారత ప్రధాని హోదాలో మోదీ నేపాల్ పర్యటనకు వెళ్లడం ఇది మూడోసారి. రామాయణ్ సర్క్యూట్ ప్రారంభం.. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో కలిసి మోదీ జెండా ఊపి నేపాల్- ఉత్తరప్రదేశ్‌ల మధ్య బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఎన్నో శతాబ్దాలుగా జనక్‌పూర్-అయోధ్యల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, ఈ బస్సు సర్వీసు ద్వారా ఆ బంధం మరింత బలపడనుందని వ్యాఖ్యానించారు. నేపాల్- భారత్‌ల మధ్య మతపరమైన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వీసును ప్రారంభించినట్టు సమాచారం. రామాయణ్ సర్క్యూట్ థీమ్‌లో భాగంగా భారత్‌లోని అయోధ్య, నందిగాం, హంపి, నాగ్‌పూర్‌తో సహా 15 ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించనున్నారు.నేపాల్ రాజధాని ఖట్మాండూ నుంచి 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనక్‌పూర్ సీతమ్మ వారి జన్మస్థానంగా ప్రసిద్ధికెక్కింది. కాగా అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(రామ జన్మభూమిగా ప్రసిద్ధి) వరకు రామాయణ్ సర్క్యూట్ పేరిట బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయి. నేపాల్ లేకుండా భారత చరిత్ర అసంపూర్ణం.. బస్సు సర్వీసు ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ పొరుగు దేశం నేపాల్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నేపాల్ లేకుండా భారత్ విశ్వాసం, చరిత్ర అసంపూర్ణమంటూ వ్యాఖ్యానించారు. నేపాల్ లేనిదే భారత ఆలయాలు, మా రాముడు కూడా అసంపూర్ణమేనంటూ మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. మోదీ నేపాల్ పర్యటన విశేషాలు... 1. మోదీ పర్యటన సందర్భంగా.. ఇరుదేశాలకు చెందిన సుమారు 11 వేల మంది భద్రతా సిబ్బంది తమ సేవల్ని అందిస్తున్నారు. 2. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలితో మోదీ శుక్రవారం భేటీ కానున్నారు. అనంతరం నేపాల్ అధ్యక్షుడు, ఇతర ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై చర్చలు జరపనున్నారు. తర్వాత ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. 3. శనివారం రోజున థరంగ్ లా కొండ పాదాల చెంతనున్న ముక్తినాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం.. ఆ ఆలయ అభివృద్దికి భారత్ అందించనున్న సాయంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. 4. తూర్పు నేపాల్‌లోని శంకువసభ జిల్లాలో జలవిద్యుత్ ప్రాజెక్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వానికి చెందిన సట్లేజ్ జల్ విద్యుత్ నిగమ్ నిర్మించనుంది. -
పాత బాణీ విడనాడాలి
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌లో మూడురోజులు పర్యటించి వెళ్లారు. నాలుగేళ్లుగా ఇరు దేశాల సంబంధాలు ఒడిదుడుకుల్లో ఉన్న నేపథ్యంలో మాత్రమే కాదు... తన తొలి విదేశీ పర్యటనకు ఓలి మన దేశాన్ని ఎంచుకోవడంవల్ల కూడా దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో వ్యవసాయరంగంలో భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్యా ఉన్న రైల్వే లైన్లను విస్తరించుకోవడం, జలమార్గాలను ఏర్పాటు చేసుకోవడం, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారం, వాణి జ్యాన్ని పెంపొందించుకోవడం వగైరా అంశాల్లో అవగాహన కుదిరింది. ఒకప్పుడు నేపాల్ మనకు అత్యంత సన్నిహిత దేశం. తన అవసరాలన్నిటికీ మనపైనే ఆధా రపడే దేశం. మన కనుసన్నల్లో నడిచే దేశం. ఆ దేశ రాజకీయాలను శాసించగలిగే స్థితిలో భారత్ ఉండేది. కానీ అక్కడ రాచరిక పాలన అంతమయ్యాక వరసబెట్టి జరుగుతున్న పరిణామాలు మనకు ఇబ్బందికరంగానే పరిణమిస్తూ వచ్చాయి. దాంతో సంబంధం లేకుండానే మన దేశం నేపాల్‌ను నిర్లక్ష్యం చేయడం అంత క్రితమే మొదలైంది. 1997లో అప్పటి ప్రధాని ఇందర్‌కుమార్ గుజ్రాల్ తర్వాత 2014లో నరేంద్ర మోదీ వచ్చేవరకూ మన ప్రధాని ఎవరూ ఆ దేశం పర్యటించలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంతకన్నా ఆశ్చర్యకరమేమంటే... ఇండో-నేపాల్ జాయింట్ కమిషన్ 1987లో ఏర్పాటైనప్పుడు రెండేళ్లకోసారి ఆ కమిషన్ సమావేశం కావాలని నిర్ణయించగా 2014 వరకూ ఏ ప్రభుత్వమూ ఆ ఊసెత్తలేదు. ఇరు దేశాలూ ఎప్పటికప్పుడు సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకోవడమే రివా జైంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఈ సంబంధాలు 2015లో మరింత దిగ జారాయి. అప్పట్లో తెరై ప్రాంతంలోని తారూ, మాధేసి వంటి మైనారిటీ జాతులు రాజ్యాంగంలో తమ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోలేదన్న ఆగ్రహంతో రహ దార్లను దిగ్బంధించాయి. దాంతో మన దేశం నుంచి అక్కడకు వెళ్లాల్సిన వంట గ్యాస్, నిత్యావసరాలు రోజుల తరబడి నిలిచిపోయాయి. అంతక్రితమే వచ్చిన భూకంపంతో సర్వం కోల్పోయిన నేపాల్ ఈ దిగ్బంధంతో ఊపిరాడని స్థితికి చేరుకుంది. మాధేసీలకు మద్దతిస్తున్న మన దేశం ఈ దిగ్బంధనానికి పరోక్షంగా సహకరించిందని, కష్టకాలంలో తమను లొంగదీసుకునేందుకు ప్రయత్నించిందని నేపాలీ పౌరుల్లో అసంతృప్తి ఏర్పడింది. ఆ సమయంలో నేపాల్ రిపబ్లిక్ తొలి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన విద్యాదేవి భండారీ చైనాతో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నారు. మాధేసీల హక్కుల పరిరక్షణకు సంబం« దించిన సమస్యతోపాటు... తాము వద్దని అనధికారికంగా చెప్పినా రాజ్యాంగంలో నేపాల్‌ను లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా పేర్కొనడంపై కూడా మన దేశానికి అభ్యంతరం ఉందని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే నేపాల్ ఆంతరంగిక అంశాల విషయంలో ఎలాంటి అభ్యంతరాలున్నా అవి అత్యవసర సరఫరాలు నిలిచిపోయే స్థితికి వెళ్లకుండా చూసి ఉంటే అది మన ప్రయోజనాలకే తోడ్పడేది. భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నదని, తన అభిప్రాయాలు రుద్దే ప్రయత్నం చేస్తున్నదని అక్కడి పౌరుల్లో అభిప్రాయం ఏర్పడటం మంచిది కాదని గుర్తిస్తే బాగుండేది. నేపాల్ జనాభా 2.9 కోట్లు. భౌగోళికంగా కూడా చిన్న దేశం. కానీ ఆ దేశంతో మనకు 1,850 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దుల్లో అరడజను ప్రాంతాల్లో రెండు దేశాల మధ్యా పేచీలున్నాయి. కాలా పానీ నదీ జలాల వివాదం ఉంది. ఇరు దేశాల మధ్యా రాకపోకలకు వీసా నిబంధన లేకపోవడం వల్ల మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం బెడద సమస్యలు ఏర్పడుతున్నాయి. సరిహద్దు భద్రతలో రెండు దేశాలమధ్యా సహకారం చాలా అవసరం. సఖ్యత ముఖ్యం. అయితే నేపాల్‌లో జరిగిన పరిణామాలన్నీ మన ప్రభుత్వానికి అసంతృప్తి కలిగి స్తూనే వచ్చాయి. మూడు నెలలక్రితం అక్కడ జరిగిన ఎన్నికల్లో ఓలి నాయ కత్వంలోని వామపక్ష సీపీఎన్(యుఎంఎల్)–సీపీఎన్(మావోయిస్టు) కూటమి ఘన విజయం సాధించింది. ఓలి, ఆయన నాయకత్వంలోని సీపీఎన్(యూఎంఎల్) చైనాతో సఖ్యంగా ఉండాలని ఆదినుంచీ వాదించేవారు. 2015నాటి దిగ్బంధం సమయంలో కూడా యూఎంఎల్ భారత వ్యతిరేక వైఖరి తీసుకుంది. అందువల్లే ఓలి రాకతో భారత్–నేపాల్ సంబంధాలు దెబ్బతినొచ్చునన్న ఊహాగానాలు వెలు వడ్డాయి. దీనికితోడు గత నెలలో ఓలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాకిస్తాన్ ప్రధాని అబ్బాసీ నేపాల్ పర్యటించారు. భారత్–పాక్‌ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో ఈ పర్యటన మంచి సంకే తాలు పంపదని అక్కడి మీడియా ఓలిని హెచ్చరించింది. లోగడ ఆయన ప్రధానిగా పనిచేసినప్పుడు చైనాతో బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓలిపై భారత వ్యతిరేకి అన్న ముద్ర ఉన్నప్పటికీ ఆయన గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తొలి విదేశీ పర్యటనకు మన దేశాన్నే ఎంచుకున్నారు. అంతేగాక భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకుపోవాలన్న కృత నిశ్చయంతో ఈ పర్యటన జరుపుతున్నానని చెప్పారు. కనుక గతాన్ని మరిచి నేపాల్‌తో పటిష్టమైన సంబంధాలు నెలకొల్పుకోవడానికి మన దేశం కూడా గట్టిగా ప్రయత్నించాలి. మూడు నెలలనాటి ఎన్నికల తర్వాత అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. నేపాల్ ఆంతరంగిక పరిస్థితులు బాగా మారాయని గుర్తించడంతో పాటు మన నిర్లక్ష్యం పర్యవసానంగా ఇప్పటికే అక్కడ చైనా ప్రభావం పెరిగిందన్న సంగతిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నేపాల్ ఆర్థికాభివృద్ధికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన ఈ తరుణంలో మన నుంచి అందే సహకారం చైనాతో పోలిస్తే మెరుగ్గా ఉన్నదన్న అభిప్రాయం కలిగించగలగాలి. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అన్నిటికీ మించి నేపాల్ ఒక సార్వభౌమాధికార దేశమని, దానితో ఆ విధంగానే వ్యవహరించాలని మన దౌత్య వ్యవహర్తలు గుర్తిస్తే మంచిది. -
రూ.950 కోట్ల రద్దైన నోట్లు, వెనక్కి తీసుకోరా..
కాఠ్మాండు : రద్దయిన పెద్ద నోట్లు నేపాల్‌లో ఇంకా భారీగా ఉన్నట్టు తెలిసింది. ఈ వారంలో భారత్‌లో పర్యటించనున్న నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, తమ వద్దనున్న లక్షల కొద్దీ రద్దయిన భారత నోట్ల ఎక్స్చేంజ్ విషయంలో మన దేశ అధికారులతో చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2016లో పెద్ద నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించిన తర్వాత, నేపాల్ ప్రజల వద్ద, అధికారిక రంగాల్లో సుమారు రూ.950 కోట్ల రద్దయిన భారత బ్యాంకు నోట్లు ఉన్నట్టు అంచనాలు వెలువడ్డాయి. ఈ నోట్లను ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలనే విషయంలో నేపాల్, భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో నేపాల్ ప్రజల వద్ద భారీగా రద్దయిన పెద్ద నోట్లు ఉన్నట్టు తెలిసింది. అవినీతికి వ్యతిరేకంగా, నకిలీ కరెన్సీ నోట్లకు, ఉగ్రవాదానికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఈ డిమానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే భారత్ కరెన్సీని ఎక్కువగా వాడుతున్న నేపాల్, భూటాన్ దేశాలు ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది. భారత డిమానిటైజేషన్ నిర్ణయం నేపాలీ దేశస్తులను తీవ్రంగా బాధించిందని, ఇప్పటికే పలుమార్లు భారతీయ నేతలతో ఈ విషయంపై చర్చించామని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరామని పీఎం ఓలీ నేపాల్ పార్లమెంట్‌కు తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభం కాబోయే భారత పర్యటనలో నేపాల్ ప్రధాని ఓలీ, మన ప్రధాని నరేంద్రమోదీని, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను, ఇతర అధికారులను కలువనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల భాగస్వామ్య చర్చల్లో భాగంగా రద్దయిన నోట్ల విషయం గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. నోట్ల ఎక్స్చేంజ్ చేసుకుంటామని ఆర్బీఐ మాటిచ్చినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక చర్చలు జరుగలేదని సెంట్రల్ నేపాల్ రాష్ట్ర బ్యాంకు గవర్నర్ చింతా మనీ శివకోటి చెప్పారు. ఆర్బీఐ, నేపాల్ లేదా మరే ఇతర దేశాల నుంచి పాత కరెన్సీ నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోలేదని మన దేశ సీనియర్ అధికారులు చెబుతున్నారు. డిమానిటైజేషన్ సమయంలో దీనిపై ఎలాంటి ప్రొవిజన్లను రూపొందించలేదని పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని, భారత ప్రధానితో భేటీ అయి, ఈ విషయంపై చర్చించబోతున్నారు. నేపాల్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్. భారత కరెన్సీని నేపాలీ ప్రజలు, వ్యాపారస్తులు అధికంగా వాడతారు. అయితే ఒక్కసారిగా మోదీ డిమానిటైజేషన్ ప్రకటించడంతో, భారత కరెన్సీ నోట్లను ఇళ్లలో పొదుపు చేసుకున్న నేపాలీ ప్రజలపై ఈ ప్రభావం అధికంగా పడింది. -
నేపాలీ నేతలతో మోదీ సంభాషణ
న్యూఢిల్లీ: నేపాల్‌కు కాబోయే ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి సహా ఆ దేశ ప్రముఖ నాయకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఫోన్లో మాట్లాడారు. ఈ హిమాలయ దేశంలో సాధారణ ఎన్నికల అనంతరం ఇరు దేశాల నాయకత్వాల మధ్య ఇవే తొలి అత్యున్నత స్థాయి చర్చలని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(సీపీఎన్–యూఎంఎల్) చైర్మన్ ఓలి, సీపీఎన్(ఎంసీ) చైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ కూటమి కొద్ది రోజుల కిందట నేపాల్ ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ నేపాల్ ప్రస్తుత ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, ఓలి, ప్రచండలతో చర్చలు జరిపారు. ‘ఇరు దేశాల నాయకుల మధ్య చర్చలు జరిగినట్లు నాకు ఇప్పుడే సమాచారం అందింది. అయితే ఏయే అంశాలపై చర్చించారనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ పేర్కొన్నారు. నేపాల్‌లో కమ్యూనిస్ట్ కూటమి విజయం ఆ దేశంలోని చైనా అనుకూల వర్గీయుల గెలుపుగా భావిస్తున్న తరుణంలో మోదీ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
నేపాల్‌లో రాజకీయ సంక్షోభం: ప్రధాని రాజీనామా
కఠ్మాండు: హిమాలయ దేశం నేపాల్ లో రాజకీయ సంక్షభం తలెత్తింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరకముందే ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదివారం సాయంత్రం పదవికి రాజీనామా చేశారు. ఓలీ నేతృత్వంలోని సీపీఎన్(యూఎంఎల్) ప్రభుత్వంలో భాగస్వాములైన మావోయిస్టు పార్టీ రెండు వారాల కిందటే మద్దతు ఉపసంహరించుకోగా, రాష్ట్రీయ ప్రజాతంత్ర, మాదేసి జనాధికార ఫోరంతోపాటు మరో రెండు చిన్నపార్టీలు సైతం పక్కకు తప్పుకున్నాయి. దీంతో మైనారిటీలో పడ్డ ఓలీ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొవాల్సి వచ్చింది. అవిశ్వాస తీర్మానానినికి ప్రతిపక్ష నేపాల్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే మద్దతు తెలిపింది. అలా అన్ని పార్టీలు ఏకమై ప్రధానిపై తిరుగుబావుటా ఎగరేశాయి. ఎలాగూ ఓటమి తప్పని పరిస్థితుల్లో ఓలీ రాజీనామా చేశారు. అయితే పార్టీల మధ్య నెలకొన్న సైద్ధాంతిక, రాజకీయ విబేధాల మధ్య కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా? అన్నది సంశయమే! పార్లమెంట్ ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారనే వార్తలు వినవస్తున్నాయి. ఎందుకీ అనిశ్చితి? 601 సభ్యుల లెజిస్లేచర్ పార్లమెంట్ ఆఫ్ నేపాల్ (నేపాల్ పార్లమెంట్) లో ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునిఫైడ్ మాక్సిస్ట్, లెనినిస్ట్)కు 175 మంది సభ్యులున్నారు. అధికారం చేపట్టడానికి కావాల్సిన కనీస బలం 299. దీంతో సీపీఎన్.. మావోయిస్టు పార్టీ(80 మంది సభ్యులు), ఆర్పీపీ(24), మాదేసిల ఫోరం (14 మంది సభ్యుల) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కేపీ శర్మ ఓలి ప్రధానిగా ఎన్నికయ్యారు. 196 మంది సభ్యులున్న నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ఓలి తుంగలోతొక్కారని మద్దతు ఉపసంహరించుకున్న పార్టీలు ఆరోపిస్తున్నాయి. 'ఆయన తనగురించి మాత్రమే ఆలోచించే స్వార్థపరుడు. అహంకారి. మనుగడ కోసం మా పార్టీని వాడుకుని లబ్దిపొందాలనుకుంటున్నాడు' అంటూ మావోయిస్టు పార్టీ నేత ప్రచండ.. ప్రధాని ఓలీపై నిప్పులు చెరిగారు. ఓలీ మోనార్కిజం! 'నేపాల్ ను సమాఖ్య రాజ్యం(ఫెడరల్ స్టేట్) గా తీర్చిదిద్దాలనుకుంటున్న నాపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు' అని ప్రధాని ఓలీ శర్మ శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో ఆవేదన చెందారు. నూతన రాజ్యాంగం అమలులోకి తెచ్చిన సమయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ మాదేసీలు చేసిన ఉద్యమాన్ని ప్రధాని ఓలి తీవ్రంగా అణిచివేశారు. నాటి ఆందోళనల్లో 50 మంది మాదేసీలను పోలీసులు కాల్చిచంపారు. భారత్ తో సత్సంబంధాలను తెంచుకుని చైనాకు దగ్గరవుదామనుకున్న ఓలీని స్వపక్షం వారే వ్యతిరేకించారు. కానీ ఆయన 'ఏకపక్షంగా' చైనా అంటకాగారు.