ఖాట్మండూ : నేపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. తుఫాను ధాటికి 27 మంది మృతి చెందగా.. 400 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు చేపట్టిన రక్షణా సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బారా, పార్సా జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి పెనుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో ప్రధాని సలహాదారు బిష్ణు రిమాల్ మాట్లాడుతూ.. ‘ ఖాట్మండులోని మిడ్ ఎయిర్‌బేస్‌లో ఉన్న రెండు బెటాలియన్లను ఘటనా స్థలికి పంపించాం. వాతావరణం సహకరించకపోవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మా బలగాలు బాధితులను రక్షిస్తాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తాం’ అని పేర్కొన్నారు.
Nepal: 27 people have died and more than 400 have been injured in rainstorms in Nepal. Over 100 army personnel have been deployed in the affected areas, rescue operations underway. Visuals from hospital in Birgunj (pic 1 & 2) and rainstorms affected Bara (pic 3 & 4). pic.twitter.com/OHGn1G4kDt
— ANI (@ANI) April 1, 2019
Comments
Please login to add a commentAdd a comment