ప్రధాని మోదీతో నేపాల్‌ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు | KP Sharma oli talks with PM Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో నేపాల్‌ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు

Published Mon, Sep 23 2024 7:17 AM | Last Updated on Mon, Sep 23 2024 7:28 AM

KP Sharma oli talks with PM Modi

న్యూయార్క్: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ న్యూయార్క్‌లో భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఆయన నుంచి ఒక ప్రకటన వెలువడింది. ద్వైపాక్షిక చర్చలు విజయవంతమయ్యాయని ఓలీ దానిలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు ప్రాంతీయ అంశాలు, పరస్పర సహకారం తదితర విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. నేపాల్ ప్రధానిగా మరోమారు ఎన్నికైన  కెపి శర్మ ఓలీ భారత ప్రధానితో సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇరువురు నేతల భేటీ అనంతరం భారత్-నేపాల్ సంబంధాలు మరింతగా బలోపేతం చేసే దిశగా అడుగులు పడవచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
 

అయితే గతంలో ఓలీ చైనా ఆదేశాల మేరకు భారత్‌తో సంబంధాలను చెడగొట్టుకున్నారు.  భారతదేశంలోని కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్ ప్రాంతాలు నేపాల్‌కు చెందినవి అంటూ ప్రకటన చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ప్రకటన చేసిన కొంతకాలం తర్వాత ఆయన ప్రధాని పదవిని కోల్పోయారు. ఆ తర్వాత పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రధాని అయ్యారు. అప్పటి నుంచి భారత్-నేపాల్ సంబంధాలు స్థిరంగా మారాయి. అయితే ఓలీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత  ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 

 

ఇది కూడా చదవండి: మహారాష్ట్ర భావి ముఖ్యమంత్రి రష్మీ ఠాక్రే?

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement