talks
-
ట్రంప్‌తో చర్చలకు పుతిన్ రెడీ: రష్యా
మాస్కో: డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అయితే ఈ విషయమై అమెరికా నుంచి స్పందన కోసం వేచి చేస్తున్నట్లు తెలిపింది. ఇరు దేశాల అధినేతల మధ్య భేటీ త్వరలో ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం రష్యా స్పష్టత ఇవ్వలేదు.దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ట్రంప్ వర్చువల్‌గా మాట్లాడారు. అణ్వాయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రష్యా,చైనాలు కూడా వారి అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఉక్రెయిన్ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలుకుతానన్న ఆయన చమురు ధరలు దిగివస్తే ఈ యుద్ధం మరింత వేగంగా ముగిసిపోతుందని చెప్పారు. అయితే ట్రంప్ చేస్తున్న ఈ వాదనతో రష్యా మాత్రం ఏకీభవించలేదు. చమురు ధరలకు తాము యుద్ధం ఆపడానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.అమెరికా-రష్యా సంబంధాలు ఉక్రెయిన్ యుద్ధంతో అత్యంత దారుణంగా క్షీణించాయి. రష్యాతో పోరాడుతున్న జెలెన్స్కీ సైన్యానికి మాజీ అధ్యక్షుడు బైడెన్ హయాంలో అమెరికా భారీ స్థాయిలో ఆయుధ సాయంతో పాటు ఆర్థికంగానూ ఆదుకుంటోంది. -
మస్క్‌తో ఇజ్రాయెల్ అధ్యక్షుడి కీలక చర్చలు
వాషింగ్టన్: హమాస్ చెరలోని బందీలకు త్వరలోనే స్వేచ్ఛ లభించనుందా? ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా?. ఈ రెండు ప్రశ్నలకూ సమాధానం అవును! ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, టెస్లా కార్ల కంపెనీ అధిపతి ఇలాన్ మస్క్ ఈ దిశగా చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవికి ఎన్నికైన తరువాత మస్క్‌ను పరిపాలన సమర్థతను పెంచే మంత్రిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ ప్రారంభంలో హెర్జోగ్ చర్చల కోసం మస్క్‌కు ఫోన్ చేసినట్లు సమాచారం. గాజాలోని హమాస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిపించేందుకు ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు చెబుతున్నారు.బందీల విషయంలో డీల్ కుదిరేలా అన్ని పక్షాలపై ఒత్తిడి తీసుకురావాలని మస్క్‌కు హెర్జోగ్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. తాను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేలోపు బందీలను విడుదల చేయకపోతే నరకం చూపిస్తానని హమాస్‌కు ఇటీవల ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బందీల కుటుంబాల్లో తమవారి విడుదలపై ఆశలు చిగురించాయి. బందీల కుటుంబ సభ్యులంతా కలిసి తమవారి విడుదల కోసం అధ్యక్షుడు హెర్జోగ్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ట్రంప్‌కు సన్నిహితుడిగా ఉన్న మస్క్ ద్వారా ఈ విషయమై ప్రయత్నించాలని వారు కోరడంతో హెర్జోగ్ టెస్లా అధినేతతో చర్చలు జరిపారని సమాచారం. ఇదీ చదవండి: నన్ను క్షమించండి: సౌత్‌కొరియా అధ్యక్షుడు -
నదీ జలాల భాగస్వామ్యంపై భారత్‌తో బంగ్లా చర్చలు
ఢాకా: సరిహద్దు నదుల నీటి భాగస్వామ్యంపై బంగ్లాదేశ్ త్వరలో భారత్‌తో చర్చించనుంది. ఈ విషయాన్ని తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మీడియాకు తెలిపారు. 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఢాకా పర్యటన సందర్భంగా, తీస్తా నీటి భాగస్వామ్యంపై భారత్- బంగ్లాదేశ్ ఒక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంది. అయితే నాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో నీటి కొరత కారణంగా ఈ ఒప్పందానికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు.బంగ్లాదేశ్ జలవనరుల సలహాదారు సైదా రిజ్వానా హసన్ మీడియాతో మాట్లాడుతూ సరిహద్దు నదుల నీటి భాగస్వామ్యంపై బంగ్లాదేశ్ త్వరలో భారత్‌తో చర్చలు జరుపుతుందన్నారు. అయితే ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని పరిశీలించిన తర్వాతే చర్చలు జరుపుతామన్నారు. అంతర్జాతీయ నదుల నీటిని పంచుకోవడం సంక్లిష్టమైన సమస్య అని, అయితే దీనిలో రాజకీయాలకు తావు ఉండకూడదని రిజ్వానా పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలపై ఏ దేశం కూడా ఏకపక్షంగా అంతర్జాతీయ కోర్టుకు వెళ్లదని, బదులుగా రెండు దేశాలూ వెళ్లాలని అన్నారు.భారత్‌తో వర్షపాతం డేటాను పంచుకోవడం మానవతా చర్య అని రిజ్వానా పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు ఈ డేటా ఉపకరిస్తుందన్నారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ వాదనలు స్పష్టంగా, బలంగా ఉన్నాయన్నారు. దేశంలోని అంతర్గత నదులను సమిష్టిగా రక్షించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాగా ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తీస్తా నీటి భాగస్వామ్య ఒప్పందంపై భారత్‌తో విభేదాలను పరిష్కరించడానికి తాత్కాలిక ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: చెరువులో మునిగి ఎనిమిది మంది చిన్నారులు మృతి -
ప్రధాని మోదీతో నేపాల్ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు
న్యూయార్క్: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ న్యూయార్క్‌లో భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఆయన నుంచి ఒక ప్రకటన వెలువడింది. ద్వైపాక్షిక చర్చలు విజయవంతమయ్యాయని ఓలీ దానిలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు ప్రాంతీయ అంశాలు, పరస్పర సహకారం తదితర విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. నేపాల్ ప్రధానిగా మరోమారు ఎన్నికైన కెపి శర్మ ఓలీ భారత ప్రధానితో సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇరువురు నేతల భేటీ అనంతరం భారత్-నేపాల్ సంబంధాలు మరింతగా బలోపేతం చేసే దిశగా అడుగులు పడవచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. #WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने अमेरिका के न्यूयॉर्क में लोट्टे न्यूयॉर्क पैलेस होटल में नेपाल के प्रधानमंत्री केपी शर्मा ओली के साथ द्विपक्षीय बैठक की। (सोर्स: ANI/DD न्यूज) pic.twitter.com/7SVCH08sNH— ANI_HindiNews (@AHindinews) September 22, 2024అయితే గతంలో ఓలీ చైనా ఆదేశాల మేరకు భారత్‌తో సంబంధాలను చెడగొట్టుకున్నారు. భారతదేశంలోని కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్ ప్రాంతాలు నేపాల్‌కు చెందినవి అంటూ ప్రకటన చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ప్రకటన చేసిన కొంతకాలం తర్వాత ఆయన ప్రధాని పదవిని కోల్పోయారు. ఆ తర్వాత పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రధాని అయ్యారు. అప్పటి నుంచి భారత్-నేపాల్ సంబంధాలు స్థిరంగా మారాయి. అయితే ఓలీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. #WATCH न्यूयॉर्क, अमेरिका: प्रधानमंत्री नरेंद्र मोदी के साथ लोट्टे न्यूयॉर्क पैलेस होटल में अपनी द्विपक्षीय बैठक पर नेपाल के प्रधानमंत्री केपी शर्मा ओली ने कहा, "बैठक बहुत अच्छी रही।" https://t.co/HiMNIBHWpd pic.twitter.com/8vVWXkM5Jg— ANI_HindiNews (@AHindinews) September 22, 2024ఇది కూడా చదవండి: మహారాష్ట్ర భావి ముఖ్యమంత్రి రష్మీ ఠాక్రే? -
ఇదే చివరిసారి.. వైద్యులను చర్చలకు ఆహ్వానించిన సీఎం మమత
కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఉదంతంలో బెంగాల్ ప్రభుత్వం, వైద్యలు మధ్య చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై నిరసన చేస్తున్న వైద్యులను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి చర్చలకు ఆహ్వానించించారు. కోల్‌కతాలోని సీఎం నివాసంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు అయిదోసారి/చివరి అవకాశంగా ఆందోళన చేస్తున్న వైద్యులను చర్చలకు పిలుస్తున్నట్లు బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వైద్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.‘పశ్చిమ బెంగాల్ ఎం మమతా బెనర్జీతో, వైద్య ప్రతినిధుల సమావేశం కోసం అయిదోసారి. అలాగే చివరిసారి సంప్రదిస్తున్నాం. ముందు రోజు చర్చల్లో నిర్ణయించుకున్నట్లుగా సోమవారం సాయంత్రం 5 గంటలకు కాళీఘాట్‌లోని సీఎం నివాసంలో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరపడానికి మిమ్మల్ని(నిరసనకారులను) మరోసారి ఆహ్వానిస్తున్నాము. చివరిసారి చర్చలకు వచ్చిన వైద్యుల బృందమే నేడు సాయంత్రం 4.45 నిమిషాలకు వేదిక వద్దకు రావాలని అభ్యర్థిస్తున్నాం.ఈ కేసు సుప్రీంకోర్టులో పరిధిలో ఉన్నందును.. మీరు డిమాండ్ చేస్తున్నట్లు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం కానీ వీడియో గ్రఫీ కానీ ఉండదు. దానికి బదులు సమావేశాన్ని రెండు వర్గాలు రికార్డ్ చేసి సంతకాలు చేస్తాయి’ అంటూ మనోజ్ పంత్ పేరిట లేఖలో తెలిపారు.అదే విధంగా సుప్రీకోర్టు ఆదేశాలను వైద్యులు పాటించాలని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరులగా, కోర్టు ఆదేశాలకు కట్టుబడి వైద్యలు విధుల్లోచేరాలని కోరుతున్నట్లు తెలిపారు. వైద్యుల నుంచి సానుకూల స్పందన వస్తుందని, ఫలప్రదమైన చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.కాగా వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ.. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ వైద్యులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు నాలుగు సార్లు వైద్యులను చర్చించేందుకు ఆహ్వానించగా.. లైవ్ టెలికాస్ట్ చేయాలనే డిమాండ్‌తో నిరసనకారులు చర్చలను తిరస్కరించారు. ఇక శనివారం ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం ‘స్వస్థ్ భవన్’ ఎదుట ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులనిరసన శిబిరానికి సీఎం మమతా బెనర్జీ వెళ్లారు. ఆమెను చూడగానే ‘న్యాయం కావాలి’ అంటూ జూనియర్ వైద్యులు నినాదాలు చేశారు. తమ డిమాండ్లపై చర్చ జరిగేవరకు రాజీకొచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చిచెప్పడంతో సీఎం అక్కడినుంచి వెళ్లిపోయారు. -
హమాస్‌తో చర్చలపై నెతన్యాహూ కీలక ప్రకటన
జెరూసలెం: గాజాలో కాల్పుల విరమణపై హమాస్‌తో చర్చలకు ఓకే అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. అయితే నెతన్యాహూ ప్రకటనపై హమాస్ ఇంకా స్పందించలేదు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆగస్టు 15న దోహా లేదా కైరోలో చర్చలుండే అవకాశముందని మధ్యవర్తిత్వం వహిస్తున్న మూడు దేశాలు అమెరికా, ఈజిప్టు, కైరో తెలిపాయి. సమయం వృథా కాకుండా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసే దిశగా చర్చలు జరపాలని ఇజ్రాయెల్, హమాస్లకు మూడు దేశాలు పిలుపునిచ్చాయి. హమాస్ చీఫ్ హానియే హత్యకు ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థే కారణమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో చర్చలకు హమాస్ ఓకే అంటుందా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని గాజా కేంద్రంగా పనిచేసే తీవ్రవాద సంస్థ హమాస్ మెరుపు దాడి చేసి వందల మందిని బలిగొన్నది. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడులతో గాజా ఇప్పటికే చిధ్రమైపోయింది. ఇక్కడ కాల్పుల విరమణ పాటించడానికి తమ దేశం నుంచి బంధీలుగా తీసుకెళ్లిన వారిని హమాస్ విడుదల చేయాలని ఇజ్రాయెల్ షరతు విధించింది. -
‘నీట్’పై చర్చకు రెడీ: రాహుల్ గాంధీ
ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి వీడియో విడుదల చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై మోదీ ప్రభుత్వంతో చర్చలు జరపడమే ఇండియా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. శుక్రవారం(జూన్28) లోక్‌సభలో నీట్ అంశం మాట్లాడుతుండగా తన మైక్ కట్ చేశారని మండిపడ్డారు.The INDIA Opposition bloc wants to have a constructive debate with the Government on the NEET exam and the prevailing paper leak issue. It is unfortunate that we weren’t allowed to do so in Parliament today. This is a serious concern that is causing anxiety to lakhs of families… pic.twitter.com/zKdHwOe2LM— Rahul Gandhi (@RahulGandhi) June 28, 2024 నీట్ పేపర్ లీక్ గురించి అందరికీ తెలుసన్నారు. విద్యార్థులకు నష్టం కలిగించి, కొందరు మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా చదువుతుంటారని గుర్తు చేశారు. పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టడం వారి కల అని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాల సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు తెలిపారు. విద్యార్థుల తరఫున పోరాడాలని నిర్ణయించామన్నారు. ఏడేళ్లలో 70సార్లు పలు పరీక్షల ప్రశ్న పేపర్లు లీక్ అయ్యాయని, లీకుల కారణంగా రెండు కోట్ల మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారని రాహుల్ విమర్శించారు. దీనికి పరిష్కారం చూపాలని విద్యార్థులు ప్రధాని మోదీని కోరుతున్నా ఆయన మౌనం వీడట్లేదన్నారు. -
G7 Summit 2024: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో చర్చలు
జీ7 సమావేశం కోసం విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తోనూ మోదీ చర్చలు జరిపారు. ‘మా ఇద్దరి మధ్య ఏడాదికాలంలో జరిగిన నాలుగో భేటీ ఇది. అద్భుతంగా జరిగింది. ఇండో–పసిఫిక్ రోడ్‌మ్యాప్, హారిజాన్ 2047 సహా రక్షణ, అణు, అంతరిక్షం, సముద్రమార్గంలో వాణిజ్యం, విద్య, వాతావరణ మార్పులు, డిజిటల్ మౌలిక వసతులు, కనెక్టివిటీ, కృత్రిమ మేథ రంగాల్లో పరస్పర తోడ్పాటుపై చర్చలు జరిపాం. యువతలో ఆవిష్కరణలు, పరిశోధనలపై మరింత మక్కువ పెంచేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేదీ మాట్లాడుకున్నాం’ అని మోదీ చెప్పారు. శుక్రవారం ఇటలీకి చేరుకున్నాక మోదీ తొలుత మేక్రాన్‌ను కలిశారు. మూడోసారి ప్రధాని అయ్యాక ఒక అంతర్జాతీయ నేతతో మోదీ సమావేశంకావడం ఇదే తొలిసారి. జూలై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సమ్మర్ ఒలంపిక్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మేక్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
యువత కబుర్లు కాస్త సీరియస్ విషయాలుగా మారితే...!
కబుర్లు అంటే... ఏ సినిమా చూశావు? ఓటీటీలో ఆ షో నచ్చిందా? ఆ గాసిప్ గురించి విన్నావా? ఇన్‌స్టాగ్రామ్‌లో నా లేటెస్ట్ ఇమేజ్‌లు చూశావా?... ఇలాంటి కబుర్లేనా? యువతరం తాజా ధోరణి ‘కానే కాదు’ అంటుంది. ‘స్మాల్ టాక్’ కంటే.. ‘బిగ్ టాక్’కు ప్రాధాన్యత ఇస్తోంది. యువతరంలో నలుగురు ఒక దగ్గర కూడితే ఏం జరుగుతుంది? సరదా సరదా మాటలు, జోక్స్, సినిమా కబుర్లు, సోషల్ మీడియా సంగతులూ వినిపిస్తాయి. అయితే యువతరంలో కాలక్షేపం కబుర్లు కాకుండా కాస్త సీరియస్ విషయాల గురించి చర్చించే ధోరణి పెరుగుతోంది. ఈ సరికొత్త ధోరణిని ‘బిగ్ టాక్’ ట్రెండ్ అంటున్నారు. ‘బిగ్ టాక్’ అనేది ‘టాప్ ట్రెండ్స్ ఫర్ 2024’ ఒకటిగా నిలిచించి. ఇది‘స్మాల్ టాక్’కు అపోజిట్ ట్రెండ్. ‘స్మాల్ టాక్’ అంటే కాలక్షేపం కబుర్లలాంటివి. ‘బిగ్ టాక్ ట్రెండ్ గురించి విన్నప్పుడు ఆసక్తిగా అనిపించింది. డిగ్రీ ఫ్రెండ్స్‌లో కొందరం వారానికి ఒకసారి కలుసుకొని కబుర్లు చెప్పుకుంటాం. ఎప్పుడూ కాలక్షేప కబుర్లేనా? సీరియస్ టాపిక్స్‌పై కూడా మాట్లాడుకుందాం అనే ప్రపోజ్‌కు వెంటనే కాకపోయినా కాస్త లేటుగా అయినా ఫ్రెండ్స్ ఒకే అన్నారు. అయితే బిగ్ టాక్ అనేది అంత తేలిక కాదు. ఎప్పుడూ సరదాగా మాట్లాడే ఫ్రెండ్స్‌తో ఉన్నట్టుండి పర్యావరణ విషయాలు, రాజకీయ పరిణామాలు... మొదలైన విషయాల గురించి మాట్లాడడం అంతా ఈజీ కాదు. వినే వాళ్లు లెక్చర్ విన్నట్లుగా ఫీలవుతారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఒకసారి ట్రై చేసి చూద్దాం అని మొదలు పెట్టాం. వారం వారం ఒక్కొక్కరు ఒక్కో టాపిక్‌పై మాట్లాడాలనికి నిర్ణయించుకున్నాం’ అంటుంది ముంబైకి చెందిన ప్రణతి. ఇక యువ ఉద్యోగుల విషయానికి వస్తే...‘బిక్ టాక్’లో భాగంగా ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుంటున్నారు. ‘నా కొలీగ్ చిన్న విషయాలకు భయపడుతుంటాడు. ఏఐ టెక్నాలజి వల్ల మన ఉద్యోగాలు ఉండవేమో అన్నట్లుగా మాట్లాడేవాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం బిగ్ టాక్‌లో కూర్చుందాం అన్నాను. అతడికి ఏమీ అర్థం కాలేదు. ఒక ఆదివారం కేఫ్ కాఫీ కార్నర్లో బిగ్ టాక్ కోసం కూర్చున్నాం’ అంటున్నాడు నాగ్‌పూర్‌కు చెందిన నిఖిల్ మిత్ర. బిగ్ టాక్‌లో భాగంగా.. జాబ్ మార్కెట్‌పై ఏఐ చూపించే ప్రభావం? ప్రపంచవ్యాప్తంగా ఫుల్–టైమ్ జాబ్స్‌పై ‘చాట్‌జీపీటి’లాంటి జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ చూపించే ప్రభావం, మోస్ట్ హైలీ క్వాలిఫైడ్ వర్కర్స్ ఎలాంటి అడ్జెస్ట్‌మెంట్స్‌కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, సీనియర్లతో పోల్చితే జెన్ జెడ్ ఏఐ గురించి ఎందుకు ఎక్కువగా భయపడుతున్నారు? ఏఐని ఫేస్ చేయడానికి ఎలా సన్నద్ధం కావాలి?... మొదలైన ఎన్నో టాపిక్లపై కొలీగ్‌తో మాట్లాడాడు నిఖిల్ మిత్ర. మిత్రుడిలోని అకారణ భయాలను దూరం చేయడంలో సక్సెస్ అయ్యాడు. ‘బిగ్ టాక్’ అయినంత మాత్రాన సమావేశం మొత్తం ముఖం సీరియస్‌గా పెట్టుకొని, అత్యంత గంభీరంగా మాట్లాడాలని కాదు. కాలహరణ కబుర్లకు తక్కువ ప్రాముఖ్యం ఇచ్చి, మనకు ఉపయోగపడే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడమే ‘బిగ్ టాక్’ ట్రెండ్ సారాశం. పారదర్శక సంభాషణ స్నేహానికి సంభాషణే ప్రధాన ద్వారం. యంగ్ ప్రొఫెషనల్స్‌కు కొలీగ్స్‌తో ఉండే స్నేహం ఆఫీస్ టైమింగ్స్ వరకు మాత్రమే పరిమితమా? గత జెనరేషన్ ఉద్యోగులలో చాలామంది పాటించిన సెల్ఫ్–సెన్సర్ విధానం వీరిలోనూ ఉందా? అనే ప్రశ్నలకు ‘లేదు’ అనే సమాధానం వినిపిస్తుంది. ముఖ్యమైనవి అనుకునే అంశాలపై మాట్లాడడానికి, తమ అభిప్రాయాన్ని వినిపించడానికి యంగ్ ప్రొఫెషనల్స్‌లో ఎలాంటి సంకోచాలు లేవు. ఎడోబ్ సర్వే ప్రకారం సెన్సిటివ్ టాపిక్స్ గురించి కొలీగ్స్‌తో మాట్లాడటాన్ని సౌకర్యంగా ఫీలవుతున్నారు. ఇవి చదవండి: పర్పుల్ కలర్ ఎందుకు? -
నిరసనకు రైతుల బ్రేక్! అసలేం జరిగిందంటే..
కనీస మద్ధతు ధరతో సహా 23 డిమాండ్లతో మళ్లీ ఆందోళన ప్రారంభించిన రైతన్నల్ని పోలీసులు అడ్డుకునే క్రమంలో బుధవారం ఢిల్లీ సరిహద్దు అట్టుడికి పోయింది. భాష్పవాయివు ప్రయోగంతో పాటు ఓ యువరైతు మరణించాడన్న ప్రచారంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ తరుణంలో తమది రైతుపక్ష ప్రభుత్వమని, మరోసారి చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటించుకోగా.. ఆందోళనలకు రెండ్రోజులు విరామం ప్రకటించాయి రైతు సంఘాలు. తమ తదుపరి కార్యచరణ రూపకల్పన కోసమే రెండ్రోజులు విరామం ప్రకటించినట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ జనరల్ సెక్రటరీ శర్వాన్ సింగ్ పంథేర్ ప్రకటించారు. ఈలోగా కేంద్రం నుంచి ఏదైనా పురోగతి కనిపించకపోతే.. శుక్రవారం సాయంత్రం తర్వాయి ప్రకటన చేస్తామని చెప్పారాయన. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకువచ్చేందుకు కేంద్రం ఒకరోజు పార్లమెంట్‌ను సమావేశపర్చాలని ఆయన తొలి నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి అదే డిమాండ్ వినిపించారాయన. బుధవారం ఉదయం ఢిల్లీ వైపు వెళ్లేందుకు శంభు వద్ద 14వేల మంది రైతులు, 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సుల్లో కదిలారు. శంభూ-కనౌరీ సరిహద్దు వద్ద బుధవారం ఉదయం రైతులు బారికేడ్లను దాటే యత్నం చేశారు. వారిని నిలువరించేందుకు హర్యానా పోలీసులు మూడు రౌండ్ల టియర్ గ్యాస్ ప్రయోగం జరిపారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొనగా.. శుభ్‌కరణ్ సింగ్(22) అనే యువకుడు మృతి చెందినట్లు, పలువురు రైతులకు గాయాలు అయినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. యువరైతు మృతి ఘటనపై పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. శుభ్‌కరణ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం తర్వాత కేసు నమోదు చేస్తామని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ చెబుతున్నారు. ఘటనపై కఠిన చర్యలు తప్పవని చెబుతూనే.. బాధిత కుటుంబాన్ని పంజాబ్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో బుధవారం రైతులు భారీ ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన రైతులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతని పేరు బ్రిజ్‌పాల్ అని.. అతనూ ఓ రైతేనని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. బ్రిజ్‌కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు. అయితే హర్యానా పోలీసులు మాత్రం శుభ్‌కరణ్ సింగ్ ఘర్షణలోనే మరణించారన్న వాదనను తోసిపుచ్చారు. దాన్నొక రూమర్‌గా కొట్టిపారేశారు. ఈ విషయంలో పంజాబ్ ప్రభుత్వం మొదటి నుంచి తమకు సహకరించడం లేదని హర్యానా సర్కార్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. బారికేడ్లను ధ్వంసం చేసే పరికరాలను వారు తమ వెంట తీసుకెళ్తున్నారని.. వాటిని స్వాధీనం చేసుకోవాలని పంజాబ్ బలగాలను అభ్యర్థించినా ఆ పని చేయలేదని హర్యానా పోలీసులు చెబుతున్నారు. కేంద్ర హోం శాఖ సైతం ముందుగా పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్నీ ఈ సందర్భంగా హర్యానా ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ‘మేం చేసిన నేరం ఏమిటి..? మిమ్మల్ని ప్రధానిని చేశాం. మమ్మల్ని అణచివేసేందుకు ఈ విధంగా బలగాలను ఉపయోగిస్తారని అనుకోలేదు. మేము అసలు డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేలా కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడు ఏం జరిగినా దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పంజాబ్ కిసాన్ మజ్దూర్ జనరల్ సెక్రటరీ శర్వాన్ సింగ్ పంథేర్ అన్నారు. డిమాండ్ల సాధనకు రైతులు మళ్లీ ఆందోళనకు దిగడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా బుధవారం స్పందించారు. రైతు నేతలతో ఐదో విడత చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నాలుగో విడత చర్చల తర్వాత.. నాలుగు ప్రధాన డిమాండ్లపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ మేరకు రైతు సంఘాల నేతలకు ఆహ్వానం పంపాం. శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం అందరికీ ఉంది’’ అని ట్వీట్ చేశారాయన. మరోవైపు నిన్న జరిగిన కేబినెట్ భేటీలో చెరుకు రైతులకు శుభవార్త చెప్పింది కేంద్రం. 2024-25 సీజన్లో చక్కెర ఎఫ్ఆర్పి(గిట్టుబాటు) ధర క్వింటాల్ కు రూ.340 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది. భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. తాము రైతుపక్ష ప్రభుత్వమని అన్నారు. ఇంకోవైపు తమ నిరసనలపై ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరిపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. రైతులను ఢిల్లీకి వెళ్లనివ్వకపోతే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను గ్రామాల్లోని రానివ్వబోమని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మీరట్‌లో రైతులు బుధవారం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో.. కలెక్టరేట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. పంజాబ్‌లోని రైతులు తమ ఢిల్లీ చలో మార్చ్‌ను పునఃప్రారంభించడం.. సరిహద్దులో బలగాల మోహరింపుతో ఢిల్లీకి వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షల్ని ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, NH-9లో వాహనాల రద్దీ కనిపించింది. ఇంకోపక్క.. హర్యానాతో సింగు-టిక్రీ సరిహద్దులు మూసివేత గురువారం కూడా అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు. రైతుల నిరసన-బలగాల మోహరింపుతో తీవ్ర ఉద్రిక్తతల నడము.. హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఈ నెల 23వ తేదీ వరకు ఇంటర్నెట్ సర్వీసులను రద్దును హర్యానా ప్రభుత్వం పొడిగించింది. అలాగే.. రైతులు విరామం ప్రకటించినా.. ముందు జాగ్రత్తగా సరిహద్దులో బలగాల మోహరింపును కొనసాగించనున్నట్లు వెల్లడించింది. -
రాజకీయ ప్రలోభాలకు లోనుకావొద్దు: రైతు సంఘాలకు కేంద్రం హితవు
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ఛలో పేరిట ఆందోళనలను తీవ్రతరం చేయాలని రైతు సంఘాలు భావిస్తున్న తరుణంలో కేంద్రం స్పందించింది. మరోసారి చర్చలకు రావాలని రైతు సంఘాల్ని ఆహ్వానించింది. తమతో కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా.. ఈ నెల 16వ తేదీన భారత్ బంద్‌కు కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్ బంద్ ప్రకటించిన కాసేపటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మీడియాతో మాట్లాడారు. ‘‘చర్చల ద్వారా రైతు సంఘాలు సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలి. అంతేగానీ.. రాజకీయ పార్టీల ప్రలోభాలకు రైతు సంఘాలు గురి కావొద్దు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని గుర్తించాలి’’ అని కోరారాయన. అలాగే.. రైతుల మార్చ్ నేపథ్యంలో దేశ రాజధాని ప్రాంతంలో.. శివారుల్లో భారీగా ట్రాఫిక్ ఝామ్ ఏర్పడుతోంది. ఈ పరిణామంపైనా మంత్రి అర్జున్ ముండా స్పందించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని రైతుల్ని కోరారాయన. మరోవైపు చర్చల పిలుపుపై రైతు సంఘాలు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచే పంజాబ్, హర్యానా, యూపీ నుంచి ఢిల్లీ వెళ్లే సరిహద్దులోనే ఉండిపోయారు. మంగళవారం ఉదయం నుంచే ఢిల్లీ వైపు వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఢిల్లీకి రెండు వంద కిలోమీటర్ల పరిధిలోనే వాళ్లను నిలువరించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సరిహద్దులో బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. #WATCH | Farmers' protest | Tear gas shells fired to disperse the agitating farmers who were approaching the Police barricade. Visuals from Shambhu Border. pic.twitter.com/AnROqRZfTQ — ANI (@ANI) February 14, 2024 -
మానవతా దృక్పథంతో సమ్మె విరమించండి
సాక్షి, అమరావతి: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రతిపాదించిన అనేక అంశాల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మానవతా దృక్పథంతో సమ్మెను విరమించాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్లు పలు డిమాండ్లపై సమ్మెచేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె విరమణ కోసం ప్రభుత్వం శుక్రవారం మరోదఫా సానుకూలంగా చర్చలు జరిపింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కె.వి.ఉషశ్రీ చరణ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి, మహిళా శిశుసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలతో చర్చలు జరిపారు. యూనియన్ నేతలు ప్రస్తావించిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రులు వివరించారు. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు కూడా గరిష్ట వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించిందన్నారు. కార్యకర్తలకు తమ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్‌ను ఇప్పుడున్న రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. హెల్పర్లకూ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణయించిందన్నారు. సహాయకులకు అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్ కోసం గరిష్ట వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు అంగీకరించిందని తెలిపారు. కార్యకర్తలకు టీఏ, డీఏలను రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించిందని తెలిపారు. గ్రాట్యుటీ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కావడంతో లేఖరాశామని, దానిపైన కూడా కేంద్రం ఆమోదంతో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మేలు గతంతో పోల్చుకుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు మేలు జరిగిందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక వేతనాన్ని అంగన్వాడీ కార్యకర్తలకు రూ.11,500, సహాయకులకు రూ.7 వేలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. మంచి పనితీరు కనబర్చిన వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ఇస్తున్నామని, ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. 2013 నుంచి అంగన్వాడీలకు ప్రమోషన్లు ఇవ్వలేదని, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఈ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చిందని చెప్పారు. 560 గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులను భర్తీచేసిందన్నారు. సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 సంవత్సరాలకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి రూ.1,313 కోట్లు అందించిందని, నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతుభరోసా, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వర్తింపజేసిందని వివరించారు. రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్ ఫోన్లు అందించిందని, డేటా చార్జీల కోసం ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తోందని తెలిపారు. ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు రూ.2 లక్షల జీవిత బీమాను వర్తింపజేస్తోందని, రూ.16 కోట్ల విలువైన యూనిఫాం శారీలు అందించిందని చెప్పారు. అంగన్వాడీల్లో కూడా మంచి వసతులు, సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం నాడు–నేడు ద్వారా అనేక చర్యలు చేపట్టిందన్నారు. గతంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలతో అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశతోపాటు వర్కర్లు, హెల్పర్లకు ఎంతో మేలు జరిగిందనే విషయాన్ని గుర్తించాలని కోరారు. తాజాగా ప్రతిపాదించిన అనేక అంశాలపైనా సానుకూలంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. అత్యంత అణగారిన వర్గాలకు చెందిన వారికి పౌష్టికాహార పంపిణీ సమ్మె కారణంగా నిలిచిపోయే ప్రమాదం ఉందని అర్థం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. మానవతా దృక్పథంతో సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. అన్నీ అంగీకరించినప్పటికీ ఒక్క వేతనం పెంపు విషయంలోనే అంగన్వాడీ యూనియన్ నేతలు పట్టువీడకపోవడం గమనార్హం. -
లెఫ్ట్‌కు 4 సీట్లు.. ఒక ఎమ్మెల్సీ?
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. లెఫ్ట్ పార్టిలు పట్టుబట్టినట్లు కాకుండా మధ్యేమార్గంగా చెరో రెండు స్థానాలను కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు, కొత్తగూడెం, మిర్యాలగూడ, భద్రాచలం, హుస్నాబాద్ స్థానాల్లో ఏవైనా నాలుగు స్థానాలను ఉభయ కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కమ్యూనిస్టులతో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం, హుస్నాబాద్‌లలో రెండు స్థానాలు, సీపీఎంకు మిర్యాలగూడ, భద్రాచలం సీట్లు కేటాయించే అంశాన్ని పరిశీలించారు. అయితే భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నందున దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఉభయ కమ్యూనిస్టులు సూచించిన వారికి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ చెప్పినట్లు సమాచారం. పొత్తుపై వేణుగోపాల్ నేరుగా కమ్యూనిస్టు పార్టిల పెద్దలతో ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్నారు. అవసరాన్ని బట్టి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర నేతలు ఆదివారం హైదరాబాద్‌లో లెఫ్ట్ పార్టిల నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాతే తుది నిర్ణయం చేసే అవకాశం ఉంది. ఖమ్మం నుంచి తుమ్మల..పాలేరు నుంచి పొంగులేటి! ఖమ్మం జిల్లా నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాందీతో భేటీ అయ్యారు. సుమారు పది నిమిషాల పాటు జరిగిన సమావేశంలో కమ్యూనిస్టులతో పొత్తు వల్ల కలిసొచ్చే అంశాలపై చర్చించారు. కాగా పీలేరు నుంచి పోటీ చేయాలని తుమ్మల భావించినప్పటికీ రాహుల్ సూచన మేరకు ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. -
రిషి సునాక్- ప్రధాని మోదీ భేటీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులపై లోతుగా చర్చించినట్లు పేర్కొన్నారు. జీ20 సమ్మిట్ మొదటి సెషన్ అనంతరం ఇరు దేశాల నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ప్రధాని మోదీని రిషి సునాక్ భారతీయ సాంప్రదాయంలో నమస్తేతో పలకరించారు. 🇬🇧🇮🇳 Two nations, one ambition. An ambition rooted in our shared values, the connection between our people and – of course – our passion for cricket. pic.twitter.com/1W4wkiYCjY — Rishi Sunak (@RishiSunak) September 9, 2023 'రెండు దేశాలు.. ఒకే ఆశయం. ఇరు దేశాల మధ్య పరస్పర విలువలు, ప్రజల మధ్య అనుబంధం ప్రత్యేకమైనవి' అని రిషి సునాక్ ట్విట్టర్(ఎక్స్) పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల వంటి ఒప్పందాల్లో మరింత పరస్పర సహకారం దిశగా అడుగులు వేయాలని చర్చించినట్లు రిషి సునాక్ తెలిపారు. ఇండియా, యూకేలు సుస్థిరాభివృద్ధి దిశగా ప్రయత్నాలు చేస్తాయని చెప్పారు. జీ20 సదస్సుకు హాజరవడానికి రిషి సునాక్ ఢిల్లీకి చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు జీ20 సమ్మిట్‌లో మొదటిరోజు ఢిల్లీ డిక్లరేషన్‌పై అన్ని దేశాల నేతలు ఏకాభిప్రాయానికి ఆమోదం తెలిపారు. అనంతరం ఇద్దరు నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇదీ చదవండి: G20 Summit: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్.. -
'పార్టీ మారడం లేదు.. ఇలాంటి పుకార్లలో టీడీపీ దిట్ట..'
హైదరాబాద్: తాను పార్టీ మారడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా తాను పార్టీ మారతానని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని చెప్పారు. ఏడాదిగా ఈ దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇంత శాడిజం ఎంటో తనకు అర్థం కావట్లేదని అన్నారు. బీఆర్ఎస్తో కొట్లాడి గెలిచానని చెప్పారు. తాను పార్టీ మారతానని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా కల్చర్ టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ అయిందని పేర్కొన్నారు. దీన్ని వాడటంలో టీడీపీ దిట్ట అని ఆరోపించారు. టీడీపీ కల్చర్ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించిందని అన్నారు. ఇదీ చదవండి: Bholakpur Scrap Godown Blast: బోలక్‌పూర్‌లో పేలుడు.. -
రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం.. ఈసారి..
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసన చేస్తున్న తెలిసిందే. ఇటీవలే ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు కూడా. ఆయనతో చర్చల అనంతరం రెజ్లర్లు తమ విధుల్లోకి చేరారు. ఐతే ఆందోళన మాత్రం విరమించడం లేదని రెజ్లర్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రెజ్లర్ల సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, దానికోసం రెజ్లర్లను మరోసారి ఆహ్వానించానని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. ఈ ఆహ్వానాన్ని రెజ్లర్లు కూడా మన్నించినట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ని అరెస్టు చేయడం, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఎన్నికలు నిర్వహించి కొత్త చీఫ్ ఎన్నుకోవాలని డిమాండ్ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. అలాగే క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా తాము ఎవర్నీ రక్షించాలనుకోవడం లేదని రెజ్లర్లకు ఈ సందర్భంగా తెలిపారు. The government is willing to have a discussion with the wrestlers on their issues. I have once again invited the wrestlers for the same. — Anurag Thakur (@ianuragthakur) June 6, 2023 ఇదిలా ఉండగా గత శనివారం అమిత్ షాతో రెజ్లర్ల సమావేశం అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ అమిత్ షాతో సమావేశం అనంతరం తిరిగి విధుల్లో చేరడం కాస్త చర్చనీయాంశంగా మారింది. కానీ రెజ్లర్లు మాత్రం న్యాయం కోసం జరిగే పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదని కరాఖండీగా చెప్పారు. ఈ మేరకు ఒలింపిక్స్ పతక విజేత రెజ్లర్ బజరంగ్ పునియా అమిత్ షాతో జరిగిన భేటీ గురించి మాట్లాడుతూ..ఆయనతో జరిగిన సమావేశం గురించి మాట్లాడవద్దని ప్రభుత్వం కోరినట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని అమిత్‌షా తెలిపారు. ఐతే నిరసన ఉద్యమం మాత్రం ఆగిపోలేదని, అది కొనసాగడమే గాక ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై వ్యూహ రచన చేస్తున్నామని పునియా చెప్పారు. ప్రభుత్వ ప్రతిస్పందనతో తాము సంతృప్తి చెందలేదని తేల్చి చెప్పారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదని తెలిపారు. కాగా, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఒక మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. అతడిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి సత్వర చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. VIDEO | Wrestler Sakshi Malik arrives at Union Minister Anurag Thakur's residence in Delhi. pic.twitter.com/htPQYKWjOR — Press Trust of India (@PTI_News) June 7, 2023 (చదవండి: అమిత్ షా ఇంటి వద్ద మణిపూర్ మహిళలు నిరసన) -
‘డోక్లాం’పై భూటాన్‌తో టచ్‌లో ఉన్నాం
న్యూఢిల్లీ: డోక్లాం అంశానికి సంబంధించి భూటాన్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా తెలిపారు. రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగెల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు ద్వైపాక్షిక అంశాలపై లోతుగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధం బలోపేతానికి ఐదుసూత్రాల రోడ్‌మ్యాప్‌ను వాంగ్‌చుక్ ఈ సందర్భంగా ప్రతిపాదించారు. భేటీ వివరాలను క్వాట్రా మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డోక్లాంపై ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు. భద్రతకు సంబందించిన అన్ని అంశాల్లోనూ ఇరు దేశాలు పరస్పరం సహకారం ఇచ్చి పుచ్చుకుంటున్నట్టు చెప్పారు. దీన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు భూటాన్ రాజు పర్యటన దోహదపడుతోందన్నారు. అసోంలోని కోక్రాఝార్ నుంచి భూటాన్‌లోని గెలెపు వరకు రైల్ లింక్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. ఇటీవలి కాలంలో భూటాన్ క్రమంగా చైనాకు దగ్గరవుతోందన్న అభిప్రాయాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వాంగ్‌చుక్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయంటూ మోదీ ట్వీట్ చేశారు. ఆయన గౌరవార్థం విందు ఇచ్చారు. డోక్లాం.. అతి కీలకం వ్యూహాత్మకంగా డోక్లాం భారత్‌కు అత్యంత కీలకం. 2017లో అక్కడ భారత, చైనా సైనికులు ఏకంగా 73 రోజుల పాటు ఎదురెదురుగా మోహరించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడం తెలిసిందే. భూటాన్‌లో తమదిగా చెప్పుకుంటున్న ప్రాంతంలో రోడ్డు వేసేందుకు చైనా ప్రయత్నించడం ఘర్షణకు కారణమైంది. దాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భూటాన్‌కు చైనాతో 400 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. విపత్తుల స్పందనకు సమగ్ర వ్యవస్థ: మోదీ ప్రాకృతిక విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమగ్రమైన సన్నద్ధత వ్యవస్థ అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక ప్రాంతంలో తలెత్తే విపత్తులు దానికి సుదూరంలో ఉన్న ప్రాంతాలపై కూడా భారీ ప్రభావం చూపించే ఆస్కారముందని గుర్తు చేశారు. విపత్తుల నిర్వహణ సన్నద్ధత వ్యవస్థపై జరిగిన ఐదో అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోవలిషన్ ఫర్ డిజాస్టర్ రెజీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)లో ఇప్పటికే 40 దేశాలు భాగస్వాములు కావడం హర్షనీయమన్నారు. ఈ విషయమై ఒక్క తాటిపైకి వచ్చేందుకు అభివృద్ధి చెందుతున్న చిన్న, పెద్ద దేశాలకు ఈ సదస్సు చక్కని వేదికగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. విపత్తు బాధితుల్లో ప్రతి ఒక్కరినీ పూర్తిస్థాయిలో ఆదుకునేలా వ్యవస్థను అభివృద్ధి చేసుకునే దిశగా కృషి జరగాలని ప్రధాని పిలుపునిచ్చారు. విపత్తుల వేళ తక్షణ ఉపశమనంతో పాటు సాధ్యమైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొనేలా చూడటంపై దృష్టి సారించాలన్నారు. ఇందుకు రవాణా సదుపాయాలతో పాటు సామాజిక, డిజిటల్ సదుపాయాలు కూడా చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
బిస్లెరీతో చర్చలకు ‘టాటా’: అసలేమైంది?
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో చేపట్టిన చర్చలకు చెక్ పడినట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) తాజాగా వెల్లడించింది. ఇటీవల కొద్ది రోజులుగా బిస్లెరీ బ్రాండును టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు అంచనాలు పెరిగిన నేపథ్యంలో చర్చలు నిలిపివేసినట్లు నియంత్రణ సంస్థలకు టాటా కన్జూమర్ తెలియజేసింది. ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో ఎలాంటి తప్పనిసరి ఒప్పందాలు కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?! ఇందుకు ఎలాంటి కట్టుబాట్లనూ ఏర్పాటు చేసుకోలేదని తెలియజేసింది. అయితే వ్యాపార విస్తరణ, వృద్ధి అవకాశాలకున్న వ్యూహాత్మక అంశాలపై దృష్టి కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇకపైనా బిస్లెరీ ఇంటర్నేషనల్ సహా వివిధ సంస్థలతో చర్చలు నిర్వహించే వీలున్నట్లు వెల్లడించింది. కాగా.. బిస్లెరీ ఇంటర్నేషనల్ విక్రయానికి టీసీపీఎల్తోపాటు పలు కొనుగోలుదారులతో చర్చలు నిర్వహిస్తున్నట్లు ప్రమోటర్, వెనుకటితరం పారిశ్రామిక వేత్త రమేష్ చౌహాన్ గతేడాది పేర్కొన్నారు. మరోవైపు మరిన్ని మార్కెట్లలో విస్తరించేందుకు అనువుగా టీసీపీఎల్ పలు కంపెనీలను కొనుగోలు చేస్తూ వస్తోంది. టీసీపీఎల్ కు ఇప్పటికే హిమాలయన్ బ్రాండుతో బాటిల్డ్ వాటర్ విభాగంలో కార్యకలాపాలు ఉన్నాయి. -
భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలపై చైనా కీలక వ్యాఖ్యలు..
అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ అనంతరం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చైనా తొలిసారి స్పందించింది. సరిహద్దులో స్థిరత్వం నెలకొల్పి ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము సిద్ధమని చెప్పింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలని ఆకాక్షించింది. ఈమేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వాస్ అధికారిక ప్రకటనలో తెలిపారు. భారత్‌తో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, దౌత్యపరంగా, సైనిక పరంగా రెండు దేశాలు టచ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. సరిహద్దులో స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. సరిహద్దులో శాంతి స్థాపనకు డిసెంబర్ 20న చైనాతో 17వసారి కమాండర్ స్థాయి చర్చలు జరిపింది భారత్. పశ్ఛిమ సెక్టార్లో శాంతియుత వాతావరణానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలోనే చైనా ప్రకటన విడుదల చేసింది. చదవండి: Covid-19: కోట్లలో కోవిడ్ కేసులు.. చైనా దిక్కుమాలిన చర్య.. -
Ukraine-Russia War: యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం
మాస్కో/కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా పర్యటనపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఘాటుగా స్పందించారు. ‘‘ఉక్రెయిన్‌కు పేట్రియాట్ క్షిపణులు ఇస్తామని అమెరికా చెబుతోంది. మంచిదే. అలాగే కానివ్వండి. ఆ క్షిపణులను సైతం మేము కచ్చితంగా కూల్చేస్తాం’’ అని స్పష్టం చేశారు. యుద్ధాన్ని మరింత ప్రజ్వరిల్లజేయడానికే అమెరికా ఆయుధాలు ఇస్తోందని ఆరోపించారు. సంఘర్షణను ఇంకా పొడిగించాలన్నదే అమెరికా ఆలోచన అని దుయ్యబట్టారు. పుతిన్ తాజాగా మాస్కోలో మీడియాతో మాట్లాడారు. త్వరగా, మెరుగ్గా యుద్ధాన్ని ముగించాలని తాము కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌తో చర్చలకు తాము ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని పునరుద్ఘాటించారు. గతంలో సైనిక చర్యలన్నీ సంప్రదింపులతోనే ముగిశాయని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లోని ఘర్షణను ప్రస్తావిస్తూ ‘యుద్ధం’ అనే మాటను పుతిన్ ఉపయోగించారు. ఉక్రెయిన్‌లో ‘ప్రత్యేక మిలటరీ ఆపరేషన్’ జరుగుతోంది అని ఇన్నాళ్లూ ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. తొలిసారి బహిరంగంగా ‘యుద్ధం’ అని పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగాలని జెలెన్స్కీ, అమెరికా అధికారులు కోరుకుంటున్నారని అమెరికాలో రష్యా రాయబారి అనతొలీ అంటోనోవ్ విమర్శించారు. స్వదేశంలో జెలెన్స్కీపై ప్రశంసలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేపట్టిన అమెరికా పర్యటనపై స్వదేశంలో ప్రశంసల వర్షం కురుస్తుండగా, శత్రుదేశం రష్యాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జెలెన్స్కీ పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతమైందని, అమెరికా నుంచి సాయం రాబట్టడంలో ఆయన ప్రతిభ చాటుకున్నారని ఉక్రెయిన్ పౌరులు చెబుతున్నారు. కానీ, ఘర్షణను మరింత రాజేయడానికే జెలెన్స్కీ అమెరికా వెళ్లారని రష్యా అధికారులు మండిపడుతున్నారు. చక్కటి ఫలితాలతో తాను అమెరికా నుంచి తిరిగి వెళ్తున్నానని సంతోషం వ్యక్తం చేస్తూ జెలెన్స్కీ గురువారం రాత్రి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. అమెరికా సాయం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రష్యాపై పోరాటం సాగిస్తున్న తమకు మద్దతుగా నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు, అమెరికా పార్లమెంట్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే, జెలెన్స్కీ ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై ఉక్రెయిన్ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన అమెరికా నుంచి పోలాండ్‌కు చేరుకున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు వస్తారని సమాచారం. తాను, పోలాండ్ అధ్యక్షుడు అండ్రెజ్ డుడా ఆలింగనం చేసుకుంటున్న ఫొటోను జెలెన్స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
విస్తారాపై టాటా గ్రూపు కన్ను, విలీన చర్చలు
న్యూఢిల్లీ: విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేయడంపై టాటా గ్రూపుతో రహస్య చర్చలు నిర్వహిస్తున్నట్టు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. విస్తారాలో టాటాలకు 51 శాతం వాటా ఉంటే, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటా ఉంది. టాటాలతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా కచ్చితమైన నిబంధనలపై అంగీకారానికి రాలేదని సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్కుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సమాచారం ఇచ్చింది. టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ప్రస్తుత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ చర్చలు నడుస్తున్నట్టు తెలిపింది. ఎయిర్ ఇండియాను టాటాలు కొనుగోలు చేసిన తర్వాత.. అప్పటికే తమ నిర్వహణలోని విస్తారా, ఎయిరేషియా ఇండియా కార్యకలాపాలను ఒకే గొడుగు కింద కు తీసుకురావాలన్న ప్రణాళికలతో ఉన్న విషయం తెలిసిందే. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్ర శేఖరన్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఎయిర్ ఇండియా-విస్తారా విలీనంపై చర్చలు నడుస్తున్నట్టు అధికారికంగా ప్రకటన రావడం ఇదే మొదటిసారి. ఎయిరేషియా ఇండియాలో టాటాలకు 83.67 శాతం వాటా ఉంది. -
బిలియనీర్ గౌతమ్ అదానీ విదేశీ నిధులపై కన్ను: భారీ కసరత్తు
సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు పెట్టుబడుల విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. క్లీన్ ఎనర్జీ, పోర్ట్‌లు, ఎఫ్ఎంసీజీ, సిమెంట్ వ్యాపార విస్తరణలో ఇప్పటికే దూకుడుగా ఉన్న సంస్థ తన విస్తరణ ప్రణాళికపై మరింత వేగం పెంచింది. దాదాపు 10 బిలియన్ల డాలర్ల మేర విదేశీ నిధులు సమకీరించనుంది. ముఖ్యంగా సింగపూర్ పెట్టుబడి సంస్థలైన టెమాసెక్ , సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీతోతో సహా పలు పెట్టుబడిదారులతో ముందస్తు చర్చలు జరుపుతున్నట్లు మింట్ వార్తాపత్రిక సోమవారం నివేదించింది. అదానీ గ్రూపుకుటుంబ సభ్యులు, టాప్ గ్రూప్ పలువురు ఎగ్జిక్యూటివ్‌లు ఈ పెట్టుబడిదారులతో చర్చలు జరిపినట్టు నివేదించింది. పలు దఫాలుగా గ్రూపు సంస్థలు, ప్రమోటర్ గ్రూప్-అనుబంధ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా భారీ ఎత్తున నిధులను సమీకరించనుంది. అయితే జీఐసీ అదానీ గ్రూప్ ఈ వార్తలపై స్పందించలేదు. అలాగే మార్కెట్ ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు టెమాసెక్ తిరస్కరించింది. ఓడరేవులు, విమానాశ్రయాలు, గ్రీన్ ఎనర్జీ, సిమెంట్, డాటా సెంటర్లు తదితర వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూప్ రాబోయే దశాబ్దంలో 100 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడి పెట్టనున్నామని, ఇందులో ఎక్కువ భాగం న్యూ ఎనర్జీ, డాటా సెంటర్ల వంటి డిజిటల్ విభాగంలో ఈ పెట్టుబడులుంటాయిన అదానీ గ్రూపు ఛైర్మన్ అదానీ గత నెలలో ప్రకటించారు. వచ్చే దశాబ్ద కాలంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నామని ఇటీవలి ఫోర్బ్స్ గ్లోబల్ సీఈవోల సదస్సులో గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపిన సంగతి తెలిసిందే. కాగా 143 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు అదానీ. -
పాక్‌తో చర్చలు! అమిత్ షా ఏమన్నారంటే..
బారాముల్లా: పాకిస్తాన్‌తో చర్చలు జరిపే అంశం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. కశ్మీర్ ప్రాంతీయ పార్టీలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం కశ్మీర్లో శాంతి నెలకొనాలంటే పాక్‌తో చర్చలు జరపాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ దరిమిలా.. జమ్ము కశ్మీర్ బారాముల్లాలో బుధవారం ర్యాలీలో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా చర్చలు ససేమిరా అని స్పష్టం చేశారు. ఉగ్రవాదం అనేది 1990 నుంచి జమ్ము కశ్మీర్లో 42వేల మంది ప్రాణాలను బలిగొంది. అలాంటిదానితో ఎవరికైనా ఉపయోగం ఉంటుందా?. అబ్దుల్లాలు, ముఫ్తీలు, నెహ్రూ కుటుంబం.. భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కశ్మీర్ అభివృద్ధి అడ్డుకుంటూనే ఉంటున్నారు. పైగా కొంతమంది పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని మాకు సూచిస్తున్నారు. అసలు పాక్‌తో ఎందుకు మాట్లాడాలి?. ఉగ్రవాదాన్ని ఎందుకు సహించాలి? మేం చర్చలు జరపం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్ని గ్రామాలకు కరెంట్ ఉందో వాళ్లకు తెలుసా?. కానీ.. కశ్మీర్లో ఈ మూడేళ్లలోనే అన్ని గ్రామాలకు కరెంట్ వచ్చింది. కావాలంటే మేం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం. కశ్మీర్ ప్రజలతో మాట్లాడతాం.. వాళ్ల సమస్యలు తెలుసుకుని తీరుస్తాం అని చర్చల ఊసే ఉండబోదనే స్పష్టత ఇచ్చారు అమిత్ షా. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. టెర్రరిజాన్ని ఎట్టపరిస్థితుల్లో ఉపేక్షించబోదు. దానిని తుడిచిపెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. దేశంలోనే కశ్మీర్‌ను శాంతివనంగా తీర్చిదిద్దుతాం అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీలో ‘ఉచిత విద్యుత్’పై దర్యాప్తు -
టాటా గ్రూప్ సరికొత్త ప్లాన్స్, ఇక ఆ రంగంలోకి కూడా
ముంబై: వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీ బిస్లరీ ఇంటర్నేషనల్‌లో వాటాలు దక్కించు కోవడంపై దృష్టి సారించింది. ముందుగా కొంత కొనుగోలు చేసి, క్రమంగా వాటాలు పెంచుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి బిస్లరీ యాజమాన్యానికి టాటా గ్రూప్ సంస్థ టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) ఇప్పటికే ఆఫర్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీల్ కుదిరే విషయం ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నాయి. ఈ డీల్ కుదిరితే, వేగంగా విస్తరిస్తున్న బాటిల్ వాటర్ మార్కెట్లో పోటీ పడేందుకు టాటా గ్రూప్‌నకు చెందిన ఎఫ్ఎంసిజి విభాగానికి ప్రీమియం సెగ్మెంట్లో పట్టు లభించినట్టేనని పరిశీలకులు పేర్కొన్నారు. కాగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇప్పటికే హిమాలయన్ బ్రాండ్‌తో ప్యాకేజ్ చేయబడిన మినరల్ వాటర్‌ను, హైడ్రేషన్ విభాగంలో టాటా కాపర్ ప్లస్ వాటర్,టాటా గ్లూకో+ వంటి బ్రాండ్లతో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
మరో బంపర్ ఫీచర్‌ను లాంచ్ చేయనున్న యూట్యూబ్
ముంబై: ప్రముఖ వీడియోషేరింగ్ ప్లాట్‌ఫామ్, ఎంటర్టైన్మెంట్ కింగ్ యూట్యూబ్ మరో సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. ఎప్పటికపుడు కీలక అప్డేట్స్తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న యూట్యూబ్ త్వరలోనే YouTube స్ట్రీమింగ్ వీడియో సర్వీస్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోందట. దీనికి సంబంధించి పలు ఎంటర్టైన్మెంట్ కంపెనీలతో కంపెనీ చర్చలను మళ్లీ ప్రారంభించిందని సమాచారం. చదవండి: వీఎల్సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం, వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ బ్లాక్ స్ట్రీమింగ్ వీడియో సేవల కోసం ఆల్ఫాబెట్కుచెందిన యూట్యూబ్ ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించాలని యోచిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ శుక్రవారం నివేదించింది. గత 18 నెలలుగా పనిలో ఉన్న సంస్థ పలు సంస్థలతో చర్చలను పునరుద్ధరించిందని పేర్కొంది. "ఛానల్ స్టోర్" తో పేరుతో పిలుస్తున్న ఈ చర్చలు పూర్తైన తరువాత ఈ సర్వీసు అందుబాటులోకి రావచ్చని తెలిపింది. కాగా ఈ వారం ప్రారంభంలో, వాల్‌మార్ట్ తన సభ్యత్వ సేవలో స్ట్రీమింగ్ ఎంటర్టైన్మెంట్ను చేర్చడం గురించి మీడియా కంపెనీలతో చర్చలు జరిపిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.కే బుల్, శాటిలైట్ టీవీ యూజర్లు సబ్స్క్రిప్షన్-ఆధారిత స్ట్రీమింగ్ సేవలకు మారుతున్న తరుణంలో యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. తద్వారా రోకు, ఆపిల్ లాంటి కంపెనీల సరసన చేరనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై యూట్యూబ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. చదవండి: వేధించకండి! రుణ రికవరీ ఏజెంట్లపై ఆర్బీఐ ఉక్కుపాదం! -
తైవాన్ టెన్షన్ల నడుమ భారత్‌తో చర్చలు జరిపేందుకు వచ్చిన చైనా
న్యూఢిల్లీ: లడఖ్ ప్రాంతంలోని భారత వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారులు చైనాతో సైనిక చర్చల్లో పాల్గొన్నారు. భారత్ గగనతలంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండేందుకై అధికారులు చైనాతో చర్చలు సాగిస్తోంది. ఐతే గత కొన్ని కొన్ని రోజుల్లో ఎలాంటి ఘటన జరగలేదు గానీ ఇటీవల ఒక చైనా మిలటరీ విమానం నియంత్రరేఖకు సమీపంలో సుమారు 10 కి.మీ దూరంలో ఎగిరినట్లు అధికారుల గుర్తించారు. దీంతో భారత వైమానికదళ అధికారులు ఈ విషయమైన స్పందించాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు భారత్ చైనాతో చర్చల సాగిస్తోంది. అదీగాక టిబెట్ ప్రాంతంలో చైనా సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది. వాటిలో అతి ముఖ్యమైన వైమానిక దళ విభాగం ఉంది. అంతేకాదు టిబెట్ సమీపంలోనే ఎయిర్‌బేస్‌కి సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా చైనా నిర్మిస్తోంది. నియంత్రణ రేఖకు సంబంధించి ఇరు దేశాల మధ్య భిన్నమైన వాదన కూడా ఉంది. వాస్తవానికి నియంత్రణ రేఖకు సంబంధించిన నిబంధనలు ప్రకారం ఏ మిలటరీ విమానం వాస్తవ నియంత్రణ రేఖకు 10 కి.మీ లోపు ప్రయాణించ కూడదు. ఈ మేరకు జూన్25న చైనాకు సంబంధించిన జే11 విమానం తూర్పు లడఖ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖకు సమీపంగా వచ్చినట్లు భారత్ గుర్తించింది. దీంతో భారత వైమానిక దళ అధికారులు అప్రమత్తమవ్వడమే కాకుండా ఇరు దేశాల సైనికలు వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. చైనా గత కొంతకాలంగా వాస్తవ నియంత్రణరేఖకు సమీపంలో విమానాలను ఎగరవేస్తూ గగనతల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. చైనా ఒక వైపు తైవాన్ విషయమై తీవ్ర సంఘర్షణకు లోనవుతూ కూడా భారత్‌తో చర్చలు సాగించడానికి ముందుకు రావడం గమనార్హం. (చదవండి: తప్పులు సరిదిద్దకోండి!... కెనడాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైన) -
మళ్లీ ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ చర్చలు... ఈసారి ఈయూ నాయకుల ఎంట్రీ
Talks between Ukraine and Russia resumed: ఉక్రెయిన్ పై రష్యా పోరు సాగిస్తూనే ఉంది. వైమానికి క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌ని రూపు రేకలు తుడుచు పెట్టుకు పోయేలా రష్యా దురాక్రమణకు యత్నిస్తోంది. ఆ దిశగా ఒక్కోక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ పౌరులు, ఆసుపత్రుల పైన నిర్థాక్షిణ్యంగా దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో కాల్పలు విరమణ, బలగాలు వెనక్కు మళ్లించే దిశగా రష్యా ఉక్రెయిన్ల మధ్య మళ్లీ చర్చలు పునః ప్రారంభమయ్యాయని ఉక్రెయిన్ ప్రతినిధి మైఖైలో పోడోల్యాక్ చెప్పారు. అంతేకాదు మూడు యూరోపియన్ యూనియన్ దేశాల నాయకులు ఉన్నత అధికారులను కలవడానికి కైవ్‌కు వెళ్తున్నారు. దీంతో కాల్పులు విరమణ నిమిత్తం ఉక్రెయిన్ రాజధానిలో 36 గంటల కర్ఫ్యూ విధించిందని తెలిపారు. ఉక్రెయిన్ స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం యూరోపియన్ యూనియన్ నిస్సందేహమైన మద్దతును వ్యక్తపరచడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం అని చెక్ ప్రధాన మంత్రి పీటర్ ఫియాలా ట్విట్టర్లో తెలిపారు. ఈ పర్యటనలో స్లోవేనియాకు చెందిన జానెజ్ జాన్సా, పోలాండ్‌కు చెందిన మాటెస్జ్ మోరావికీ, పోలాండ్ యొక్క వాస్తవాధీన నాయకుడైన జరోస్లావ్ కాజిన్స్కీతో కలిసి ఉక్రెయిన్ పర్యటనకు వచ్చారు. ఈ భీకరమైన యుద్ధం ఐరోపాలో అత్యంత ఘోరమైన శరణార్థుల సంక్షోభాన్ని సృష్టించి, వందలాది మందిని పొట్టనబెట్టుకుంది. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమన దాడి నేటికి 20 రోజుకి చేరుకుంది. (చదవండి: యుద్ధానికి రష్యా గుడ్ బై చెప్పనుందా?.. అదే కారణమా?) -
చర్చలు జరిగేందుకైన దాడి చేయడం ఆపండి!
legally binding security guarantees if NATO shut the Door: రష్య ఉక్రెయిన్‌పై తన దాడిని ఏడో రోజు కూడా కొససాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రజా ఆవాసాలపై కూడా దాడి చేసి రాజధాని కైవ్లోకి చొరబడేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే పలు నగరాలలోకి బలగాలు చొరబడ్డాయి. దీంతో ఉక్రెయిన్ అద్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అర్థవంతమైన చర్చలు జరిగేందుకైన ముందు ఉక్రెయిన్‌లోని నగరాలపై దాడి చేయడం ఆపేయాలని అన్నారు. కనీసం ప్రజలపై బాంబు దాడి చేయడం ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఉక్రెయిన్ను నాటోలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేకున్నా.. రష్యా ఉక్రెయిన్ నాటోలో ఉండకూడదనుకుంటే గనుక కనీసం ఉక్రెయిన్‌కు చట్టబద్ధంగా కట్టుబడి ఉండే భద్రతా హామీలను రూపొందించాలి అని భాగస్వామ్య దేశాలను జెలెన్ స్కీ కోరారు. ఉక్రెయిన్ పతనమైతే ఈ రష్యన్ దళాలన్నీ మీ నాటో సభ్య దేశాల సరిహద్దుల్లో ఉంటాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. అంతేకాదు అక్కడ కూడా మీకు ఇదే ప్రశ్న తలెత్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ గత వారం రష్యన్ దళాల దండయాత్రను తట్టుకోవడంలో సహాయపడటానికి నాటో సభ్యుల నుంచి ఆయుధాల రవాణాను పొందింది. అంతేగాక రష్యాను కట్టడి చేసి దిశగా పశ్చిమ దేశాలు రష్యా ఆర్థిక వ్యవస్థపై ఆంక్షలను కూడా ప్రవేశపెట్టాయి. అయితే జెలన్ స్కీ నో ఫ్లై జోన్ విధించడంతో పాటు మరిన్ని చేయాలని జెలెన్స్కీ అంతర్జాతీయ సమాఖ్యను కోరారు. రష్యా సైనిక చర్యతో త్వరితగతిన లాభలు పొందలేదని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధ భూమిలో ఒంటరిగా నిలబడి ఉందని, పైగా దాని స్వంత భద్రత పశ్చిమ దేశాలతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. అంతేకాదు తమకు ప్రతి రోజు యుద్ధం ఉందని, తమకు సహాయం కావాలని చెప్పారు. "నేను నా దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నా, మేము మా భూమిని, మా ప్రజలను రక్షించుకునేందకు చివరి వరకు నిలబడి పోరాడుతాం. మా పిల్లల భవిష్యత్తు కోసం నిలబడతాం ". అని జెలెన్ స్కీ చెప్పారు. (చదవండి: పుతిన్ ఆంక్షలు... రష్యన్లు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి!) -
తాలిబన్లతో సంప్రదింపులు చాలా అవసరం: యూకే
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయిన బ్రిటిష్ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడం వంటి కారణాల దృష్ట్యా తాలిబన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం చాలా అవసరమని యూకే విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ పేర్కొన్నారు. అయితే, అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించే అంశంలో ఇప్పుడే మాట్లాడటం అపరిపక్వతే అవుతుందని వ్యాఖ్యానించారు. చదవండి: Afghanistan Crisis: వాళ్లుంటే నరకమే! శుక్రవారం ఆయన ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషితో కలిసి మీడియాతో మాట్లాడారు. తాలిబన్ల నుంచి ఏవిధమైన సహకారం లేకుండా కాబూల్ నుంచి 15 వేల మందిని వెనక్కి తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. ‘తాలిబన్లలోని కొందరు నేతలు కొన్ని అంశాలపై సానుకూలంగా మాట్లాడారు. వాటిని కార్యరూపంలోకి తేవాలంటే వారితో చర్చలు కొనసాగాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. చదవండి : Taliban-Kashmir: కశ్మీర్‌పై తాలిబన్ల సంచలన వ్యాఖ్యలు Elephant Water Pumping Video: ఈ ఏనుగు చాలా స్మార్ట్! -
China-US: అమెరికా, చైనా మధ్య తొలిసారి సైనిక చర్చలు
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా అమెరికా, చైనా మధ్య సైనిక చర్చలు జరిగాయి. అఫ్గాన్‌లో పరిస్థితులపై ఇరు దేశాల మిలటరీ ప్రతినిధుల మధ్య చర్చ జరిగినట్టుగా శనివారం చైనా మీడియా వెల్లడించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫీస్ ఫర్ ఇంటర్నేషనల్ మిలటరీ కో–ఆపరేషన్ మేజర్ జనరల్ హాంగ్ జూపింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెరికా మిలటరీ జనరల్ మైఖేల్ చేజ్‌తో చర్చించారు. చదవండి: విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు అఫ్గాన్‌లో జరుగుతున్న పరిణామాలు అన్ని దేశాలపై ప్రభావం చూపిస్తాయని చర్చల సందర్భంగా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అమెరికా, చైనా విదేశాంగ మంత్రుల మధ్య అఫ్గాన్ ప్రస్తావన వచ్చినప్పటికీ అమెరికా దానిని నిర్లక్ష్యం చేసిందని చైనా ఆరోపిస్తోంది. అమెరికా, చైనా కలసికట్టుగా అఫ్గాన్ సమస్యపై దృష్టి సారిస్తే ఇరు దేశాలకు పెద్ద ప్రమాదమే తప్పిపోతుందని చైనా మిలటరీ భావిస్తోంది. ఈస్ట్ టర్కెస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ తిరిగి బలాన్ని పుంజుకొని విస్తరిస్తే చైనా సహా ఎన్నో దేశాలకు ప్రమాదమని, దీనిని అన్ని దేశాలు కలసికట్టుగా ఎదుర్కోవాలని అమెరికాను చైనా కోరినట్టుగా ఆ కథనాలు వెల్లడించాయి. చదవండి: అమెరికా స్థావరాల్లో అఫ్గాన్ శరణార్థులు -
మేం రెడీ.. డేట్ ఫిక్స్ చేయండి: అన్నదాతలు
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో దాదాపు 70 రోజులుగా ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో రైతుల ప్రధాన డిమాండ్ అయిన కనీస మద్దతు ధర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మద్దతు ధర ఎప్పటికి కొనసాగుతుందని.. రైతులు ఉద్యమం విరమించి చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో రైతు సంఘాల నాయకులు ప్రధాని వ్యాఖ్యలపై స్పందించారు. చర్చలకు తాము సిద్ధమని.. డేట్, టైం ఫిక్స్ చేయాల్సిందిగా తెలిపారు. రైతు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సామ్యుక్తా కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు, రైతు నాయకుడు శివ కుమార్ కక్కా మాట్లాడుతూ.. ‘‘ప్రధాని వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. చర్చలకు మేం వ్యతిరేకం కాదు.. అలానే ఎన్నడు వెనకడుగు వేయలేదు. కేంద్ర మంత్రులతో మాట్లాడటానికి మేం సిద్ధంగా ఉన్నాం. సరైన పద్దతిలో వారు మమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తే.. వెళ్లడానికి తయారుగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఓ డేట్, టైం ఫిక్స్ చేసి మమ్మల్ని ఆహ్వానిస్తే.. వారితో చర్చిస్తాం’’ అన్నారు. ఇక మోదీ చేసిన ‘ఆందోళన్ జీవి’ వ్యాఖ్యలపై కక్కా మండిపడ్డారు. సాధారణ రైతుల చేస్తోన్న ఉద్యమం గురించి ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. రైతులు కేంద్రం మధ్య ఇప్పటికి 11 సార్లు చర్చలు జరిగాయి. రైతుల కనీస మద్దతు ధరకు సంబంధించి ఖచ్చితమైన హామీని కోరుతున్నారు. ఇక ప్రభుత్వం ఈ నూతన చట్టాలను 12-18 నెలల పాటు అమలు నిలిపివేసేందుకు ముందుకు వచ్చినప్పటికి అన్నదాతలు ఒప్పుకోలేదు. ఇక తాజాగా సాగు చట్టాలు రద్దయ్యేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని.. అప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసన కొనసాగిస్తామని. ఇళ్లకు వెళ్లబోమని రైతులు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: కనీస మద్దతు ధరపై మోదీ కీలక ప్రకటన సచిన్ ట్వీట్: మహారాష్ట్ర సంచలన నిర్ణయం -
వీడని ప్రతిష్టంభన.. అసంపూర్తిగా చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను నిరశిస్తూ రైతులు చేపట్టిన దీక్షలు మరికొన్నాళ్ల పాటు సాగేలా కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాలు, పంటకు గిట్టుబాటు ధరపై ప్రతిష్టంభన ఎంతకీ వీడటంలేదు. రైతుల సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం సోమవారం జరిపిన ఏడో విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న రైతుల డిమాండ్స్‌ను ఏమాత్రం తలొగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దీక్షలు విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న మరోసారి చర్చలకు రావాలని కేంద్రం పిలుపునిచ్చింది. (చలికి తోడు వాన) రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో సాగుతున్న రైతు దీక్షలు 40 రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సింఘు, టిక్రీ, ఘాజీపూర్, చిల్లా, పల్వాల్ సరిహద్దుల వద్ద రైతుల నిరసన శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. కాగా చర్చల్లో పురోగతి లేకపోతే ఆందోళనలు ఉధృతం చేయాలని ఇదివరకే రైతు సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈనెల 6న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. -
టాటా సూపర్ యాప్ : వాల్‌మార్ట్ భారీ డీల్
సాక్షి, ముంబై: సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ దాకా వ్యాపారరంగంలో ప్రత్యేకతను చాటుకున్నటాటా గ్రూపు ఈ కామర్స్ రంగంలోకి దూసుకొస్తోంది. దేశంలోనే అతి భారీ ఒప్పందానికి సిద్ధమవుతోంది. టాటా ‘సూపర్ యాప్’ లో భారీ పెట్టుబడులకు అమెరికా రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ టాటా గ్రూపుతో చర్చలు జరుపుతున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. రీటైల్ ఆధిపత్యం కోసం దేశీయంగా వ్యాపార దిగ్గజాలు పోటీపడుతోంటే.. ఆయా కంపెనీల్లో భారీ విదేశీ పెట్టుబడులు విశేషంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే టాటా సూపర్ యాప్ ప్లాట్‌ఫామ్ వ్యాపారంలో వ్యూహాత్మక పెట్టుబడులకు వాల్‌మార్ట్ చర్చలు జరుపుతోంది. అదే జరిగితే దేశంలోనే అతిపెద్ద డీల్ గా నిలుస్తుందని అంచనా. టాటా-వాల్‌మార్ట్ జాయింట్ వెంచర్‌గా ఈ యాప్‌ను ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. ఇందులో పలు విదేశీ సంస్థలు కూడా భారీ పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిపాదిత లావాదేవీ ఖరారు కోసం గోల్డ్‌మన్ సాచ్స్‌ను వాల్‌మార్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా నియమించినట్టు సమాచారం. టాటాతో ఒప్పందం ద్వారా ఫ్లిప్ కార్ట్ లో కూడా విక్రయాలకు అదనపు బలం వస్తుందని కంపెనీ భావిస్తోంది. దీంతో ఇప్పటికే ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు ప్రత్యర్థిగా అవతరించినుందని భావిస్తున్నారు. ఒక కొత్త సూపర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కామర్స్ లో సూపర్ యాప్ ద్వారా అతిపెద్ద రిటైల్ సంస్థగా అవతరించాలని భావిస్తోంది. సుమారు 50-60 బిలియన్ డాలర్లతో ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో దేశంలో ప్రారంభించబోయే సూపర్ యాప్ కింద వివిధ వ్యాపారాలను ఒకే ఛానల్ కిందకి తీసుకురానుంది. హెల్త్ కేర్, ఆహారం, కిరాణా సేవలు, భీమా, ఆర్థిక సేవలు, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఎలక్ట్రానిక్స్, ఎడ్యుకేషన్, బిల్ పేమెంట్స్ ఇలా అన్ని రకాలు సేవలను అందించాలనేది లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న వాల్‌మార్ట్ చర్చల్లో ఉంది. మరోవైపు టాటా , వాల్‌మార్ట్, గోల్డ్‌మన్ సాచే ఈ అంచనాలపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
రిలయన్స్ జియో చేతికి పబ్జీ
సాక్షి, న్యూఢిల్లీ : నిషేధిత పాపులర్ మొబైల్ గేమ్ పబ్‌జీనిభారతీయ వినియోగదారులకు తిరిగిఅందుబాటులోకి తీసుకొచ్చేందుకు పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ టెలికాం విభాగం జియోతో పబ్జీ కార్పొరేషన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయని, ఇరు సంస్థలు కొనుగోలు ఒప్పందంపై తీవ్ర కసరత్తుచేస్తున్నాయి. దీనికి సంబంధిన ఒప్పంద సాధ్యాసాధ్యాలను లీగల్ టీం పరిశీలిస్తోంది. ప్రధానంగా రెండు అంశాలపై దృష్టినట్టు సమాచారం. మొదటిది 50:50 వాటాలు, రెండవది నెలవారీ యూజర్ల ఆధారంగా కార్పొరేషన్ కు ఆదాయాన్ని చెల్లించడం. రిలయన్స్ గేమింగ్ మార్కెట్లోకి రావాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. పబ్జీని దక్షిణ కొరియాకు చెందిన బ్లూ హోల్ స్టూడియోస్ సంస్థ రూపొందించింది. ఇండియాలో దీనిపై నిషేధం విధించడంతో చైనాకంపెనీనుంచి బ్లూహోల్ ఫ్రాంచైజీని ఉపసంహరించుకుంది. చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్ నుంచి తాను విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో పబ్జీపై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు జియో రంగంలోకి దిగింది. అయితే దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఇటీవల కరోనా వైరస్ సంక్షోభం, చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, భద్రతా పరమైన కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఏ ప్రకారం పలు చైనా యాప్‌లను నిషేధించింది. అందులో భాగంగానే పబ్జీని కూడా నిషేధించిన సంగతి తెలిసిందే. -
చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్-చైనాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆరవ రౌండ్ కార్పస్ కమాండర్-స్థాయి చర్చలు చైనా భూభాగంలోని మోల్డోలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదలై రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చల్లో భారత్ ప్రధానంగా ఘర్షణాత్మక ప్రాంతాల్లో నుంచి చైనా బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలు లక్ష్యంగా చర్చలు జరిగాయి. చైనా మొదట తన దళాలను వెనక్కి రప్పించాలని భారత్ కోరినట్లు సమాచారం. చైనానే మొదట చొరబాటుకు ప్రయత్నించింది కనుక.. ముందు అదే వెనక్కి తగ్గాలని భారత్ ఆశిస్తున్నట్లు తెలిసింది. (చదవండి:అంతర్జాతీయ సంకేతాలే కీలకం...) ప్యాంగ్యాంగ్ త్సో, హాట్‌స్ప్రింగ్స్, డెప్సాంగ్, ఫింగర్ ఏరియాలో తక్షణమే చైనా దళాలు ఉపసంహరించుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఒకవేళ చైనా యథాతథ స్థితిని పునరుద్ధరించకపోతే.. భాతర దళాలు సుదీర్ఘకాలం మోహరిస్తాయని హెచ్చరించింది. ఇప్పటి వరకు జరిగిన ఐదు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ లేకుండానే ముగిసిన విషయం తెలిసిందే. ఇక నిన్నటి చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి లేహ్ ఆధారిత 14 కార్పస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నాయకత్వం వహించగా.. చైనా వైపు సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ నేతృత్వం వహించినట్లు తెలిసింది. -
రిలయన్స్ చేతికి టిక్‌టాక్?
సాక్షి, ముంబై: నిషేధిత చైనా సోషల్ మీడియా దిగ్గజం టిక్‌టాక్ కు సంబంధించి సంచలన విషయం మార్కెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆసియా అపరకుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) టిక్‌టాక్‌ను కోనుగోలు చేయనుందన్న అంచనా ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు టిక్ టాక్ యజమాన్య సంస్థ బైట్ డాన్స్ తో ప్రారంభ దశ చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. మొత్తం ఇండియా వ్యాపారాన్ని రిలయన్స్ కు విక్రయించేందుకు బైట్‌డాన్స్ సంసిద్ధతను వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ మేయర్, ఆర్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించినట్లు తెలిసింది. రెండు కంపెనీల మధ్య జూలైలో చర్చలు ప్రారంభమైనాయనీ, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని టెక్ క్రంచ్ నివేదించింది. అయితే, ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించడానికి రిలయన్స్ నిరాకరించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించిన సెప్టెంబర్ 15 గడువుకు ముందే చైనీస్ షార్ట్-వీడియో టిక్‌టాక్‌లోవాటా కొనుగోలుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చల నేపథ్యంలో తాజా అంచనాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కాగా కరోనా మహమ్మారి, ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య జాతీయ భద్రత, డేటా గోప్యతా సమస్యలపై టిక్ టిక్ సహా చైనాకు చెందిన 58 యాప్ లను జూన్ 29 న కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. -
సరిహద్దు వివాదం : చర్చలు అసంపూర్ణం
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు వివాదం పరిష్కారం దిశగా భారత్, చైనాల మధ్య మంగళవారం జరిగిన సైనికాధికారుల మూడో విడత సమావేశం అసంపూర్తిగా ముగిసిందని, వివాదం సమసిపోయేందుకు మరిన్ని భేటీలు అవసరమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్-చైనా సరిహద్దు వెంట వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ భూభాగంలోని చుసుల్‌లో ఇండో-చైనా సైనికాధికారులుమూడో విడత సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని, సరైన పరిష్కారం కోసం రానున్న రోజుల్లో సైనిక..దౌత్యాధికారుల స్ధాయిలో మరిన్ని సమావేశాలు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. శాంతియుత పరిష్కారానికి, వాస్తవాధీన రేఖ వెంబడి సాధారణ పరిస్థితి నెలకొనేనాల ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్ ప్రకారం చర్చలు ముందుకు సాగుతాయని వెల్లడించాయి. సత్వరమే దశలవారీగా ఇరు దేశాల సైనికులు సరిహద్దుల నుంచి వెనక్కిమళ్లడం అవసరమని భారత్-చైనాలు గుర్తించాయని తెలిపారు. కాగా జూన్ 22న జరిగిన భేటీ సందర్భంగా చర్చలు సామరస్యనపూర్వకంగా సుహృద్భావ వాతావరణంలో జరిగాయని ఇరు పక్షాలు ప్రకటించిన క్రమంలో తాజా చర్చలు అసంపూర్తిగా ముగిశాయని పేర్కొనడం గమనార్హం. మరోవైపు చర్చలు సాగుతుండగానే డ్రాగన్ సేనలు సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో మోహరించడంతో భారత సేనలు సర్వసన్నద్ధమయ్యాయి. చదవండి : చైనాకు భారత్ మరో షాక్ -
భారత్-చైనా మధ్య కీలక చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదంలో చెలరేగిన నేపథ్యంలో ఇరు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకునేందుకు ముందడుగా వేశాయి. గడిచిన మూడు రోజులుగా లద్దాఖ్ రీజియన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఇరు దేశాల మేజర్ జనరల్స్ గురువారం చర్చలకు సిద్ధమయ్యారు. గాల్వన్‌లో ఉద్రిక్త పరిస్థితులపై ఉన్నతస్థాయి చర్చలు జరుపుతున్నట్లు సైనిక వర్గాలు ప్రకటించాయి. సరిహద్దులో శాంతిని నెలకొల్పే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తమైన పరిస్థితులు సద్దుమణిగే వరకు వివాదాస్పద ప్రాంతాల్లో ఎలాంటి సైనిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండే విధంగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. అలాగే ఈనెల 15, 16 తేదీల్లో గాల్వన్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణ కూడా చర్చకు వచ్చినట్లు సైనిక వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. (భారత్‌ను దెబ్బతీసేందుకు త్రిముఖ వ్యూహం) కాగా గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికలు మధ్య ఘర్ణణ చెలరేగడంతో 20 మంది భారత సైనికులు అసువులు బాయగా, కొందరు చైనా సైనికులు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దుల మధ్య మరోసారి యుద్ధ వాతావరణం తలపించింది. చైనాపై ప్రతీకారం తీసుకోవాల్సిందేనని యావత్ భారత్ ముక్తకంఠంతో నినదిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దు దేశాల నడుమ యుద్ధం చోటుచేసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో చర్చలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. (సరిహద్దు ఘర్షణలో సరికొత్త సవాళ్లు) సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఈనెల 23న భారత్, రష్యా, చైనా విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీకానున్న విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు. ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
‘సరిహద్దు ఉద్రిక్తతలకు చెక్’
సాక్షి, న్యూఢిల్లీ : లడఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు ఈనెల 6న ఇరు దేశాల సీనియర్ కమాండర్ స్ధాయి సైనిక సంప్రదింపులు జరగనున్నాయి. భారత్-చైనాల సీనియర్ సైనికాధికారుల సమావేశం ఈనెల 6న జరుగుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధ్రువీకరించారు. లడఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి చైనా తన సైన్యాన్ని గణనీయంగా మోహరించిందని భారత్ అప్రమత్తమై తగు చర్యలు చేపట్టింని ఆయన చెప్పారు. సరిహద్దు వివాదం నేపథ్యంలో పెరిగిన ఉద్రిక్తతలను నిరోధించేందుకు ఇరు దేశాలకు చెందిన సీనియర్ సైనికాధికారుల సంప్రదింపులు జరుపుతారని చెప్పారు. కాగా మే 5న తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ తీరంలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణతో నెలరోజులుగా ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తత నెలకొంది. లడఖ్ ఘర్షణల అనంతరం మే 9న ఇండో-చైనా సరిహద్దు ప్రాంతంలోని సిక్కిం సెక్టార్ నకులా పాస్ వద్ద ఇరు దేశాల సైనికులు ముఖాముఖి తలపడటంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభవన మొదలైన తర్వాత ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు పక్షాలకు చెందిన బెటాలియన్, బ్రిగేడ్ స్ధాయిలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల సైన్యం మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు సైతం ఊపందుకున్నాయి. చదవండి : బాయ్‌కాట్ చైనా -
ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడాను అన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. లదాఖ్ ప్రతిష్టంభనపై ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టత నిచ్చాయి. కరోనావైరస్ చికిత్సకు మెరుగైన ఔషధంగా ట్రంప్ భావిస్తున్న యాంటి మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపాలని అమెరికా కోరినపుడు మాత్రమే మోదీ చివరిసారిగా మాట్లాడారని వివరణ ఇచ్చాయి. (మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్) భారత్, చైనా సరిహద్దు వివాదంలో ఇరు దేశాలు అంగీకరిస్తే మధ్య వర్తిత్వానికి తాను సిద్ధమనీ, దీనిపై మోదీ తో మాట్లాడినపుడు ఆయన మంచి మూడ్ లో లేరని ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం ఉదయం ప్రభుత్వం స్పందించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ అంశానికి సంబంధించి భారత ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఆఖరి సంభాషణ ఏప్రిల్ 4 జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇద్దరు నాయకుల మధ్య ఇటీవలి కాలంలో ఎటువంటి పరస్పర చర్చలు జరగలేదని స్పష్టం చేశాయి. -
భారత్‌తో చర్చలకు సిద్ధం : ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్ : భారత వైమానిక దళం మెరుపుదాడుల నేపథ్యంలో భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌తో చర్చలకు సిద్ధమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం పాక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కలిసి కూర్చుని మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందాం. శాంతియుత వాతావరణంలో చర్చించుకుంటే మంచిది. సహనం కోల్పోతే పరిస్థితులు మరోలా ఉంటాయి. యుద్ధం మొదలైతే.. అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. అప్పుడు ఇక పరిస్థితులు మోదీ అదుపులోగాని.. నా అదుపులోగాని ఉండవు. యుద్ధం వస్తే రెండు దేశాలకు మంచిది కాద’న్నారు. అంతేకాక ‘మీ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో.. మా దగ్గర కూడా అవే ఆయుధాలు ఉన్నాయి. ఉగ్రవాదం నిర్మూలనకు ఏం చేయాలో చెప్పండి. చర్చల ద్వారా మాత్రమే పరిస్థితులను అదుపు చేయగలం. పుల్వామా దాడి వల్ల మీకు దుఃఖం కల్గింది.. దానికి మేము బాధపడ్తున్నాము. ఇందుకు యుద్ధం పరిష్కారం కాదు. చర్చలతో మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది ’ అని తెలిపారు. అంతేకాక రెండు భారత యుద్ధ విమనాలను కూల్చేశామని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. -
జెట్ డీల్‌కు రంగం సిద్ధం
సాక్షి, ముంబై: గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచిన టాటాసన్స్, జెట్‌డీల్‌కు రంగం సిద్ధమైంది. ఈ వార్తలను ధృవీకరించిన టాటా సన్స్ ఈ కొనుగోలు సంబంధించిన ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్టు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన టాటా సన్స్‌బోర్డు ఆమోదం తెలిపిందనీ అయితే ఇంతరవరకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు సమావేశం అనంతరం టాటా సన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే బోర్డు సభ్యులందరూ సమావేశ ముగింపు తర్వాత విలేఖరులతో మాట్లాడడానికి నిరాకరించారు. తాజా పరిణామంతో జెట్ ఎయిర్వేస్ కొనుగోలు ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు టాటా సన్స్ కసరత్తును వేగవంతం చేసిందనే వార్తలు ఇటీవల మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. విస్తారా బ్రాండు విమానయాన సేవల సంస్థను నిర్వహిస్తున్న టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ షేర్ల విలీనం ద్వారా జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోవడానికి సిద్ధమైందని మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఇరుక్కున్న జెట్ ఎయిర్వేస్ను కాపావాలని టాటా సన్స్‌ను ప్రభుత్వం కోరిందని బ్లూమ్‌బెర్గ్ వ్యాఖ్యానించింది. కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టాటా సన్స్ సీఎఫ్ఓ సౌరభ్ అగర్వాల్, జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేష్ గోయల్‌లు సంప్రదింపులు జరుపుతున్నట్టు మింట్ వార్తాపత్రిక వెల్లడించింది. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు ప్రస్తుత టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖర్ సుముఖంగా ఉన్నప్పటికీ, సంస్థ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మాత్రం కొన్ని అభ్యంతరాలను వెలిబుచ్చినట్లు మరో కథనం. కంపెనీని పూర్తిగా కొనడం కాకుండా, జెట్‌కి చెందిన విమానాలు, పైలట్లు, స్లాట్లు మొదలైనవి మాత్రమే తీసుకునే విధంగా టాటా సన్స్ ఒక ప్రతిపాదన చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు నిర్వహించిన టాటా సన్స్ బోర్డు సమావేశం టాటా-జెట్ డీల్ పై అంచనాలను మరింత పెంచింది. మరోవైపు ఇవి పూర్తిగా ఊహాజనిత వార్తలని నిన్న (గురువారం) జెట్ ఎయిర్వేస్ కొట్టిపారేసింది. దీనిపై ఎలాంటి చర్చలూ,నిర్ణయాలు లేవని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా జెట్ ఎయిర్‌వెస్‌లో అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ 24శాతం వాటా ఉండగా ఉండగా, వ్యవస్థాపకుడు గోయల్‌కు 51 శాతం వాటా ఉంది. -
జెట్ ఎయిర్వేస్కు ఊరట: ట్రూజెట్ చేతికి జెట్ విమానాలు
సాక్షి,ముంబై: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్ వేస్ కష్టాలనుంచి గట్టెక్కేందుకు మల్ల గుల్లాలుపడుతోంది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్కు భారీ ఊరట లభించనుంది. హైదరాబాద్ ఆధారిత సంస్థ ట్రూజెట్ జెట్ ఎయిర్‌వేస్‌తో మంతనాలు జరుపుతోంది. ఈమేరకు చర్చలు కూడా ప్రారంభించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్భారీస్థాయిలో విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మార్చి 2019 నాటికి 7 కొత్త విమానాలతో 20 ప్రాంతాలకు ట్రూజెట్ బ్రాండ్ విమానాలను నడపాలని యాజమాన్యం భావిస్తోంది. ఈ నెలలోనే ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఖర్చులు తగ్గించుకుని అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలని జెట్ ఎయిర్వేస్ భావిస్తోంది. 7 ఏటీఆర్ విమానాలతో పాటు సిబ్బంది, నిర్వహణ, ఇన్సూరెన్స్ లను కూడా స్వల్ప కాల సబ్ లీజుకి తీసుకొనే ఉద్దేశంలో ఉన్నామని ట్రూజెట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ 7 విమానాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తే ట్రూజెట్ జెట్ ఎయిర్ వేస్ నుంచి మరిన్ని విమానాలను సబ్ లీజుకి తీసుకొనే అవకాశం ఉందని అంచనా. మరోవైపు తన అన్ని విమానాల వాడకానికి సంబంధించిన అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని జెట్ ఎయిర్వేస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. జెట్ ఎయిర్ వేస్ తో ఒప్పందం కుదిరితే 7 ఏటీఆర్ విమానాలు ట్రూజెట్ ఫ్లీట్ లో చేరతాయి. ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు అమలులో ఉంటుందని సమాచారం. కాగా జూలై 2015న ట్రూజెట్ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం 5 ఏటీఆర్-72 విమానాలతో 14 ప్రాంతాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. టైర్ 2, టైర్ 3 నగరాలను కలుపుతూ చౌకగా విమానయానం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కింద ట్రూజెట్ తన కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విస్తరణ అనంతరం పశ్చిమ మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు విమానాలు నడిపే యోచనలో ఉంది ట్రూజెట్. -
పరిష్కరించుకుందాం రండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని లారీల యజమానుల సమస్యల పరిష్కారంపై చర్చలు జరిపేందుకు కేసీఆర్ సర్కారు ముందుకొచ్చింది. లారీల యజమానులను చర్చలకు ఆహ్వానించింది. యజమానుల సంఘం ప్రతినిధులతో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సోమవారం చర్చలు జరపనున్నారు. దీంతో దాదాపు రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సింగిల్ పర్మిట్ విధానానికి ఈ సమావేశంతో మోక్షం కలగనుందని సమాచారం. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న లారీలకు ఒకసారికి రూ. 1,600 చొప్పున పర్మిట్ ఫీజు వసూలు చేస్తండటంతో లారీ యజమానులపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ఏపీని ఒప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొ చ్చిందని తెలియవచ్చింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం, రవాణాశాఖ ఉన్నతాధికారులు సైతం సింగిల్ పర్మిట్ ఒప్పందం అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలంగాణ లారీ యజమానుల సంఘం తెలిపింది. అలాగే ఈ ఏడాది లారీ యజమానులు చెల్లించాల్సిన పన్ను రెండో త్రైమాసికం గడువు ఇప్పటికే ముగిసింది. కానీ సమ్మె కారణంగా లారీలు నడవలేదు కాబట్టి... చెల్లింపు గడువును ప్రభుత్వం ఆగస్టు 15 వరకు పెంచిందని సంఘం పేర్కొంది. సమ్మె విరమణకు ముందు హైడ్రామా? కేంద్రం హామీతో దేశవ్యాప్తంగా సమ్మె విరమిస్తున్నట్లు ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ప్రకటించినా తెలంగాణలో మాత్రం సమ్మె విరమణపై అర్ధరాత్రి దాకా హైడ్రామా నడిచింది. తమ పరిధిలోని అంశాలను పరిష్కరిస్తామని కేంద్రం ప్రకటించగా తెలంగాణ పరిధిలోని అంశాలపై సరైన హామీ రాలేదన్న కారణంగా రాష్ట్ర లారీ యజమానుల సంఘం సమ్మెను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ప్రకటనతో రవాణా మంత్రి లారీ యజమానుల సంఘం నేతలతో మాట్లాడారు. రాష్ట్ర పరిధిలోని డిమాండ్లపై చర్చలు జరిపేందుకు సోమవారం వారిని చర్చలకు ఆహ్వనించారు. దీనికి సీఎం కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో లారీల యజమానుల సంఘం సమ్మె విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర పరిధిలో లారీల యజమానుల డిమాండ్లు ♦ రాష్ట్రవ్యాప్తంగా తైబజారు రుసుములను శాశ్వతంగా రద్దు చేయాలి. ♦ లారీ పరిశ్రమలో స్థిరపడేందుకు ముందుకొస్తున్న పేద, మధ్యతరగతి యువతకు ప్రభుత్వమే ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి. ♦ ఓవర్‌లోడ్ తీసుకెళ్తున్నందుకు లేదా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు న్యాయ విచారణ పూర్తయ్యేదాకా డ్రైవర్ల లైసెన్స్ రద్దు విషయంలో చర్యలు తీసుకోవద్దు. ♦ రాష్ట్రంలో టోల్గేట్ల మధ్య ప్రయాణించే దూరం ఆధారంగానే రుసుములు వసూలు చేయాలి. ♦ ఇద్దరు డ్రైవర్ల విధానం నుంచి మినహాయింపు కల్పించాలి. -
సీట్ల పంపకంపై అమిత్ షా, నితీశ్ భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీట్ల పంపకం విషయంలో బీజేపీ చీఫ్ అమిత్ షా, జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. గతవారం ఇరువురు నేతల మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగాయని.. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. విపక్షాలు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతుండగానే.. షా, నితీశ్‌లు సీట్ల సర్దుబాటు కోసం భేటీ అవడం చర్చనీయాంశమైంది. 40 ఎంపీ స్థానాలున్న బిహార్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ 15 సీట్లను వదులుకోకూడదని జేడీయూ పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే బిహార్‌లో ఇతర ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కలుపుకుంటే.. జేడీయూకు 15 సీట్లు ఇవ్వడం కష్టమని బీజేపీ అంటోంది. -
ఇక సినిమాలు ప్రదర్శించుకోవచ్చు
‘‘ఈ బిజినెస్ విధానంలోనే స్టార్టింగ్ నుంచి లోపాలు ఉన్నాయి. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరం చిన్న చిన్న తప్పులు చేశాం. ఈ చిన్న తప్పులే పెద్దవయ్యాయి. ఇనిషియల్ స్టేజెస్‌లో జరిగిన ఒప్పందాలు సరిగ్గా అమలు కాలేదు. ప్రాబ్లమ్ పెద్దది కావడం వల్లే థియేటర్స్‌ను క్లోజ్ చేయాలనే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మాకెవ్వరికీ షూటింగ్స్ ఆపాలని, థియేటర్స్‌ను క్లోజ్ చేయాలని లేదు. మాకు ప్రతిరోజు ప్రేక్షకులను ఎలా థియేటర్స్‌కు రప్పించాలని, ఎక్కువ సినిమాల షూటింగ్ ఎలా చేయాలి? అని మాత్రమే ఉంటుంది’’ అన్నారు నిర్మాత సురేష్‌బాబు. విజువల్ ప్రింటింగ్ ఫీజు విషయమై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు, సౌత్ ఇండస్ట్రీ జాయింట్ యాక్షన్ కమిటీకి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్చలు కొంతమేర సఫలం అయ్యాయి. ఈ నెల 9 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ప్రదర్శన కొనసాగనుంది. ఈ విషయమై ఫిల్మ్ చాంబర్లో బుధవారం రాత్రి జరిగిన పాత్రికేయుల సమావేశంలో సురేష్‌బాబు మాట్లాడుతూ– ‘‘వీలున్నవాళ్లు గురువారమే సినిమాలను ప్రదర్శించుకోవచ్చు. 7–10డేస్‌లో ఫైనల్ రేట్కార్డ్స్ని ఫైనలైజ్ చేస్తాం. క్యూబ్, యూఎఫ్‌ఓకి సెపరేట్ రేట్స్ ఉండేవి.ఇప్పుడు ఓ రేట్ కార్డ్ సెట్ చేశాం. ఇవన్నీ ఏప్రిల్ మొదటి వారం నుంచి అమలులోకి వస్తాయి. ఆల్ ఇండస్ట్రీ మెంబర్స్ ప్రపోజల్స్‌ను పరిశీలించాం. కొందరికి మరికొన్ని కోరికలు ఉన్నాయి. వాటిని కూడా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కి పంపించాం. ప్రస్తుతం యూఎఫ్ఓ, క్యూబ్ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో ప్రపోజల్స్ చేశాం. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఒప్పందాల మేరకు సైన్ చేశాయి. మిగతా రాష్ట్రం వాళ్లు కూడా చర్చలు జరుపుతున్నారు. వాళ్ల పోరాటాలు కంటిన్యూ అవుతున్నాయి. కర్ణాటక వాళ్లు 9 నుంచి సినిమాలు బంద్ చేస్తున్నాం అన్నారు. తమిళ వాళ్లు కంటెంట్ ఇవ్వటం ఆపేస్తాం అన్నారు. ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. మేం ఇప్పుడు చేసింది కరెక్ట్ అని అనుకుంటున్నాం. ఈ వారం రోజుల లాభనష్టాల బేరీజు పక్కన పెడితే అందరికీ ఒక అవగాహన వచ్చింది. ప్రతి ఒక్క ఎగ్జిబిటర్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌కు మళ్లీ ఆలోచించడానికి అవకాశం వచ్చింది.డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్వారితో చర్చలు జరిపిన తర్వాత వారు కొన్ని విషయాలు చెప్పారు. మేం అర్థం చేసుకున్నాం. మేం చెప్పిన విషయాలను వాళ్లు అర్థం చేసుకున్నారు. మా డిమాండ్స్ తీర్చాలంటే కంపెనీలు మూసుకోవాలని వాళ్లు చెబుతున్నారు. ఇంతవరకు చేయగలిగాం. వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా చేయగలం. ఫైనల్‌గా అందరికీ మంచి జరిగేలా చూస్తాం’’ అన్నారు. -
కిమ్‌తో దక్షిణ కొరియా అధికారుల భేటీ
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన అత్యంత సీనియర్ అధికారుల బృందం ఉత్తర కొరియాకు వెళ్లి ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను సోమవారం కలిసింది. గత దశాబ్ద కాలంలో దక్షిణ కొరియా అధికారులు ఉత్తర కొరియాకు రావడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తరఫున ప్రతినిధులుగా వచ్చిన ఈ బృంద సభ్యులు, అమెరికాతో చర్చలకు కిమ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఉభయ కొరియాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని పక్కనబెట్టి ఇటీవలే దక్షిణ కొరియాలో జరిగిన శీతాకాల ఒలింపిక్స్‌కు కిమ్ సోదరి హాజరవడం తెలిసిందే. ఉత్తర కొరియాలో పర్యటించాల్సిందిగా మూన్‌ను ఆమె కిమ్ తరఫున అప్పట్లో ఆహ్వానించారు. -
అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు
న్యూయార్క్: భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం జపాన్, అమెరికా దేశాల విదేశాంగ మంత్రులతో త్రైపాక్షిక చర్చలు జరిపారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వసభ్య సమా వేశం కోసం న్యూయార్క్ చేరుకున్న సుష్మ వారంపాటు అక్కడే ఉండనున్నారు. అమెరికా, జపాన్‌లతో సమావేశం గురించి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వివరిస్తూ ‘అంతర్జాతీయ చట్టాలను గౌరవించడంతోపాటు వివాదాలను శాంతంగా పరిష్కరించుకోవాలని మూడు దేశాల మంత్రులు తీర్మానించారు’ అని చెప్పారు. తీరప్రాంత భద్రత, అనుసంధానత విషయాలపై కూడా వీరు చర్చించారన్నారు. డోక్లాంతోపాటు దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రాలపై చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ త్రైపాక్షిక భేటీ జరగడం గమనార్హం. అలాగే ఐరాసలో సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నిర్వహించే సమావేశానికి సుష్మ హాజరవుతారు. అనంతరం ట్యునీషియా, నెదర్లాండ్స్, లత్వియా, బొలీవియా దేశాల విదేశాంగ మంత్రులు, భూటాన్ ప్రధానితో సుష్మ భేటీ అవుతారు. రానున్న రోజుల్లో మరిన్ని దేశాల ప్రధానులు, విదేశాంగ మంత్రులతో ఆమె ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. -
ఎయిర్టెల్ 4జీ ఫోన్ ధర, ఫీచర్లు లీక్!
సాక్షి, ముంబై: రిలయన్స్ జియోకు పోటీగా దేశీ ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ అందుబాటులోకి తేనున్న 4జీ స్మార్ట్‌ఫోన్‌పై కసరత్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జియో తన 4 జీ ఫీచర్ ఫోన్‌ను దసరాకి బరిలోకి దింపుతుండగా,ఎయిర్టెల్ దీపావళి నాటికి మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ముఖ్యంగా జియో 4జీ ఫీచర్ ఫోన్‌కు పోటీగా ఎయిర్టెల్ కూడా బడ్జెట్ ధరలో4జీఫోన్‌ను ప్రకటించింది. దీన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌గా విడుదల చేయాలని భావిస్తోందట. తాజా అంచనాల ప్రకారం రూ. 2,500-2,700 మధ్యలో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు వేగవంతం చేసింది. దీపావళికి దీనికి కస్టమర్లకు అందించాలని బావిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఎయిర్టెల్ సిమ్‌ను ఉచితం. దీంతోపాటు ఆకర్షణీయైన డేటా ఆఫర్లను కూడా ప్రవేశపెట్టనుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే .. డ్యుయల్ సిమ్ 4 అంగుళాల డిస్ప్లే 1 జీబీ ర్యామ్ డబుల్ కెమెరాలు 4జీ వోల్ట్ కాలింగ్ సదుపాయం భారీ బ్యాటరీ ఇవి ప్రధాన ఫీచర్లుగా అందించనుందని విశ్వనీయ వర్గాలు సమాచారం. అయితే ఎప్పటినుంచి బుకింగ్‌లను ప్రారంభించనుందనే విషయాలను ఇంకా వెల్లడించలేదు. కాగా ఆగస్టు 24నుంచి జియో ఫోన్ కోసం అధికారిక బుకింగ్స్ ప్రారంభించిన రిలయన్స్ జియో దీన్ని దసరాకు (సెప్టెంబర్‌లో) కస్టమర్లకు పలకరించనుంది. అన్లిమిటెడ్కాలింగ్, ఎస్ఎంఎస్లతో అందిస్తున్న జియో ఫోన్ కోసం 60లక్షల (ఆరు మిలియన్ల) బుకింగ్లులు నమోదైన సంగతి తెలిసిందే. -
లైంగిక దాడులు సహించం
రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి రాజమహేంద్రవరం రూరల్ : జిల్లాలో గిరిజన విద్యార్థినులకు అన్యాయం చేస్తే సహించమని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి హెచ్చరించారు. బొమ్మూరులోని గిరిజన ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను సోమవారం సాయంత్రం ఆమె సందర్శించారు. ఇటీవల పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపులపై ఆరా తీశారు. లైంగిక వేధింపులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టంచేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరుగుదొడ్లకు డోర్లు, బోల్టులను వేయించాలని విద్యార్థినులకు రక్షణ ఉండాలంటే ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. విద్యార్థినులకు పెట్టే అన్నంలో ఒడ్లు, పోపు లేని చారు, నూనె లేకుండా కూర చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం బొబ్బర్లకు బదులు బిస్కట్లు పెట్టడమేమిటని అధికారులను ప్రశ్నించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తనకు ఫోన్ చేస్తే సమస్యను కలెక్టరు, ఐటీడీఏ పీడీ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు. పాఠశాలకు వెంటనే ఏఎన్ఎంను నియమించాలని, వార్డెన్, హెచ్ఎం, వాచ్మెన్లు మహిళలే ఉండాలన్నారు.గిరిజన విద్యార్ధినుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వీరి సమస్యలపై వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. ఇప్పటికే గిరిజన విద్యార్థినుల సమస్యలపై శాసనసభలో ప్రస్తావించానని గుర్తు చేశారు. అనంతరం ఆమె గిరిజన శిక్షణా కేంద్రానికి కూడా పరిశీలించారు. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, రంపచోడవరం జెడ్పీఈసీ పత్తిగోళ్ల భారతి, వైస్ ఎంపీపీ స్వామిదొర, ఎంపీటీసీలు లింగారెడ్డి, కామరోడి పూజ, నండూరి గంగాధరరావు, బొల్లోజి కాంతం, హెచ్ఎం ఉదయకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేకహోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం
-
రైలు ప్రమాదంపై చంద్రలేఖ ముకర్జీ ఆరా
-
టెలినార్ ఇండియాపై ఎయిర్టెల్ కన్ను
డీల్ విలువ 350 మిలియన్ డాలర్లు! న్యూఢిల్లీ: నార్వే టెలికం సంస్థ టెలినార్‌కి భారత్‌లో ఉన్న వ్యాపార కార్యకలాపాలను కొనుగోలు చేయాలని భారతీ ఎయిర్టెల్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి టెలినార్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ దాదాపు 350 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. టెలినార్ ఇండియా రుణభారంలో సగం తాము, మిగతాది ఆ కంపెనీ మాతృ సంస్థ భరించేలా ఎయిర్టెల్ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. జనవరి ఆఖరు నాటికి ఒప్పందం పూర్తి కావొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డేటా స్పెక్ట్రం ఎక్కువగా లేకపోవడం, భారీ నష్టాలు, ప్రత్యర్థి సంస్థల నుంచి తీవ్రమైన పోటీ తదితర అంశాల కారణంగా భారత్ మార్కెట్ నుంచి వైదొలగాలని టెలినార్ కొన్నాళ్లుగా యోచిస్తోంది. భారత కార్యకలాపాలను విక్రయించేందుకు ఐడియాతోనూ టెలినార్ చర్చలు జరిపినట్లు సమాచారం. టెలినార్ ఇండియాకు 7 సర్కిళ్లలో 4జీ స్పెక్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర తదితర 6 సర్కిల్స్‌లో కంపెనీ 2జీ సేవలు అందిస్తోంది. స్పెక్ట్రం వేలం చెల్లింపులకు సంబంధించి టెలినార్ ఇండియా .. ప్రభుత్వానికి రూ.1900 కోట్ల దాకా, రుణం రూపంలో ఆర్థిక సంస్థలకు రూ. 1,800 కోట్లు బకాయిపడింది. కంపెనీకి దాదాపు 5.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. -
వంశధార నిర్వాసితులతో చర్చలు విఫలం
శ్రీకాకుళం: హిర మండలం పాడలి గ్రామంలో వంశధార నిర్వాసితులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నాలుగు రోజుల క్రితం ఆందోళన నిర్వహించిన నిర్వాసితులు నిర్మాణ పనులు ఆపించారు. పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్య, తహశిల్దార్ కాళీప్రసాద్, డీఎస్పీ ఆదినారాయణలు వంశధార పనులకు సహకరించాలని కోరుతూ నిర్వాసితులతో ఆదివారం చర్చించారు. అయితే అధికారుల సమాధానంతో నిర్వాసితులు సంతృప్తి చెందలేదు. -
తోడ్పాటు అందిస్తాం
భారత్‌కు ఎన్ఎస్జీ సభ్యత్వంపై న్యూజిలాండ్ ప్రధాని - మోదీతో జాన్కీ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ - ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిర్ణయం - పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్యా ఒప్పందాలు న్యూఢిల్లీ: అణు సరఫరా దేశాల బృందం(ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం కల్పించే అంశంపై తమ దేశం నిర్మాణాత్మక తోడ్పాటు అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి న్యూజిలాండ్ ప్రధానమంత్రి జాన్ కీ హామీ ఇచ్చారు. అయితే ఎన్ఎస్జీలో భారత్‌కు చోటుపై న్యూజిలాండ్ స్పష్టమైన మద్దతు ప్రకటించలేదు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి సంబంధించి పూర్తిస్థాయి చర్చ జరగలేదని, ఎన్ఎస్జీలోని 48 సభ్య దేశాలు సాధ్యమైనంత త్వరగా ఈ అంశంపై నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకుంటామని జాన్ కీ తెలిపారు. బుధవారం ఢిల్లీలో జాన్ కీ.. ప్రధాని మోదీతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని నిర్ణయించాయి. అనంతరం మోదీ, జాన్ కీ సమక్షంలో సైబర్ సెక్యూరిటీ, డబుల్ ట్యాక్సేషన్, పన్ను ఎగవేతకు సంబంధించి మూడు ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. అలాగే పలు కీలకాంశాలపై విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అనంతరం ప్రధాని మోదీ, జాన్కీ సంయుక్త సమావేశంలో మాట్లాడారు. ద్వైపాక్షిక, బహుపాక్షికంగా అన్ని రంగాల్లో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినట్టు మోదీ చెప్పారు. కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు మద్దతు ఇవ్వడంపై జాన్ కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా భద్రత, నిఘా అంశాల్లో ఇరు దేశాల మధ్యా సహకారాన్ని పటిష్టపరిచేందుకు నిర్ణయించినట్టు మోదీ చెప్పారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని, టై నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయాలని, వారికి నిధులు అందే మార్గాలను నిలుపుదల చేయాలని నిర్ణయించామన్నారు. వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలపై కూడా చర్చలు జరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా ఆర్థిక సంబంధాలను విస్తరించాల్సిన అవసరం ఏర్పడిందని మోదీ పేర్కొన్నారు. ఎన్ఎస్జీ అంశంపై చర్చలు ప్రోత్సాహకరంగా సాగాయని, భారతదేశ క్లీన్ ఎనర్జీ అవసరాలను న్యూజిలాండ్ అర్థం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈపీఎఫ్ దరఖాస్తులను పరిష్కరించండి: మోదీ న్యూఢిల్లీ: కార్మికులు, ఈపీఎఫ్ లబ్ధిదారుల దరఖాస్తులు భారీసంఖ్యలో పెండింగ్‌లో ఉండటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలను ఖరారుచేసే విధానాన్ని ఒక సంవత్సరం ముందుగానే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బుధవారం జరిగిన నెలవారీ సమీక్షలో భాగంగా మోదీ కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులతో మాట్లాడారు. దేశ ప్రగతిలో రేయింబగలు కష్టపడి పనిచేసే కార్మికుల భాగస్వామ్యం చాలా ఉందని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. ఈపీఎఫ్ దరఖాస్తుల పరిష్కారానికి టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. విన్నపాల పరిష్కారానికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఎలక్ట్రానిక్ చలాన్, ఎస్ఎంఎస్లు, యూఏఎన్‌ను ఆధార్‌కు అనుసంధానించడం, టెలిమెడిసిన్‌ను ప్రవేశపెట్టడంలాంటి వాటిని అందుబాటులోకి తేవాలన్నారు. హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులపైనా మోదీ సమీక్ష నిర్వహించారు. కాగా, పథకాల అమలును మరింత వేగవంతం చేసేందుకే కేంద్ర బడ్జెట్‌ను నెల ముందుకు జరిపామని, దీన్ని దృష్టిలోపెట్టుకొని అన్ని రాష్ట్రాలు తమ ప్రణాళికలను చూసుకోవాలని మోదీ చెప్పారు. -
జాతీయాలు
గండభేరుండం గండభేరుండం అనేది అతి పెద్ద, అతి బలమైన పక్షి. ఇది ఎంత బలమైన పక్షి అంటే... ఏనుగును సైతం కాళ్లతో తన్నుకొని పోగలదట. ‘గండభేరుండం’ నిజానికి ఉందో లేదో తెలియదుగానీ... కాల్పనిక సాహిత్యంలో దీని గురించి ఎన్నో వర్ణనలు కనిపిస్తాయి. ఈ పక్షి నుంచే ‘గండర గండడు’ ‘గండభేరుండ’ అనే మాటలు పుట్టుకువచ్చాయి. బలవంతులను, సాహసాలు చేసేవారిని ‘గండర గండడు’ అంటుంటారు. కంచి మేక! ‘ఎంత ఆస్తి ఉండి మాత్రం ఏంలాభం? కంచి మేకలాంటోడు...ఎవరికీ ఉపయోగపడడు’ ‘చెప్పుకోవడానికేగాని ఆ స్థలం వల్ల ఏ ఉపయోగమూ లేదు. కంచి మేకలాంటిది’ ఇలాంటి మాటలు వింటుంటాం. కంచి మేకలకు ఇతర ప్రాంతాల మేకల కంటే పొదుగు పెద్దదిగా ఉంటుందని, ఎక్కువగా పాలు ఇస్తాయని అంటారు. కానీ గేదె పాలు, ఆవు పాలతో పోల్చితే... మేక పాలు తాగేవారు అతి తక్కువగా ఉంటారు. అందువల్ల... కంచి మేక ఎక్కువ పాలు ఇచ్చినా...దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. దీన్ని దృష్టిలో పెటుకునే అన్నీ ఉండీ కూడా పెద్దగా ఎవరికీ ఉపయోగపడని వ్యక్తులను కంచి మేకతో పోల్చుతారు. కహ కహ నవ్వు! కోపం కోపమే... నవ్వు నవ్వే! నవ్వినప్పుడు...కోపం రాదు. కోపం వచ్చినప్పుడు...నవ్వు రాదు. మరి కోపంతో నవ్వితే? అదే...కహ కహ నవ్వు! కొన్ని సందర్భాలలో విపరీతమైన కోపం వస్తుంది. అయితే ఆ కోపం కప్పిపుచ్చుకునే క్రమంలో....నవ్వును అడ్డుతెరగా తెచ్చుకుంటారు. అయినప్పటికీ ఆ తెర నుంచి కూడా కోపం కనిపిస్తుంది. నిజమైన కోపం, కృత్రిమ నవ్వుతో విచిత్రమైన దృశ్యం కనబడుతుంది. ఎవరైనా నవ్వలేక నవ్వుతున్నప్పుడు, కోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నవ్వుతున్నప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. ఎల్లయ్య మల్లయ్య చదువు! ‘అందరూ అనుకున్నట్లు అతడేమీ పండితుడు కాదు. ఏదో ఎల్లయ్య మలయ్య చదువుతో నెట్టుకొస్తున్నాడు. ‘ఎల్లయ్య మల్లయ్య చదివిన వాళ్లు కూడా పాఠాలు చెప్పడానికి సిద్ధమైతే ఎలా?’ ఇలాంటి మాటలు వింటుంటాం. కొందరికి చదువు వస్తుంది. అంతమాత్రాన పూర్తిగా చదువు వచ్చినట్లు కాదు. వారి అక్షర జ్ఞానం పేర్లు రాయడానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. దీన్నే చదువు వచ్చినట్లు అనుకుంటారు. ఏ విషయంలోనైనా చాలా పరిమితమైన జ్ఞానం ఉన్నవారిని ఎల్లయ్య మల్లయ్య చదువుతో పోల్చుతారు. -
వ్యవసాయంపై అసెంబ్లీలో రాజన్నమాట
-
రాష్ట్రా అభివృద్ధి పై రాజన్నమాట
-
తదుపరి ఆర్బీఐ గవర్నర్ సుబీర్ గోకర్న్?
న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా నూతన గవర్నర్ గా ఎవర్ని ఎంపిక చేయనున్నారనే వార్త మరోసారి ప్రముఖంగా నిలిచింది. రఘురాం రాజన్ తర్వాత ఎవరిని నియమిస్తారనే విషయంపై తాజాగా ఊహాగానాలు మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. ఆర్బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్న రాజన్‌తో శుక్రవారం సమావేశం కావాల్సి ఉందని ఎకనామిక్ టైమ్స్ ప్రచురించింది. ఆర్బిఐ కదలిక చర్చకు దారితీసింది. దేశంలోని అగ్రశ్రేణి ఆర్థిక సంస్థ, దేశ కేంద్ర బ్యాంక్ గవర్నర్ ఆయనే అనే అంచనాలు హాట్ టాపిక్ గా మారాయి. కాగా రాజన్ పదవీకాలం పూర్తి కాకముందే ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేసేది వెల్లడిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఎలాంటి వూహాగానాలకు తావులేదని ఇప్పటికే ఎంపిక ప్రక్రియ మొదలయ్యిందని వెల్లడించాయి. అలాగే నూతన గవర్నర్ ఎంపికకు ఎలాంటి ప్యానెల్‌ను ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశాయి. అటు సెప్టెంబరు 4వ తేదీతో రాజన్ పదవీ కాలం ముగియనున్న సంగతి తెలిసిందే. -
కొలిక్కి వచ్చిన ‘సకల’ వేతనం చర్చలు
సెప్టెంబర్ 10, 11 తేదీల్లో డ్యూటీలో ఉండి, 12న సెలవులో ఉన్న, గైర్హాజరైన 3,741 మందికీ వర్తింపు 17వ తేదీన రూ.14కోట్ల చెల్లింపునకు నిర్ణయం గోదావరిఖని(కరీంనగర్) : గని కార్మికులకు సకల జనుల సమ్మె కాలపు వేతనం చెల్లింపు విషయమై బుధ, గురువారాలలో గుర్తింపు సంఘం(టీబీజీకేఎస్) యాజమాన్యం తో చర్చలు జరపడంతో సమస్య కొలిక్కి వచ్చింది. 2011 సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు సకల జనుల సమ్మె జరగగా 13న విధులకు హాజరైన 33,541 మంది కార్మికులకు మాత్రమే సమ్మె కాలపు వేతనం చెల్లిం చనున్నట్లు సంస్థ సర్క్యులర్ విడుదల చేసింది. అదే సమయంలో 12వ తేదీ నుంచి సెలవులో ఉన్న, విధులకు గైర్హాజరైన కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని అందులో పేర్కొంది. దీంతో గుర్తింపు సంఘంతో పాటు మిగతా కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యం లో గుర్తింపు సంఘం అధ్యక్షుడు ఎ.కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఇతర నాయకులు సింగరేణి సీఎండీ, ఇతర అధికారులతో హైదరాబాద్‌లో చర్చలు జరిపారు. ఫలితంగా సర్క్యులర్‌లో ఉన్న నిబంధనను తొలగించి 2011 సెప్టెంబర్ 10, 11 తేదీల్లో డ్యూటీలో ఉండి 12 తేదీ సెలవులో ఉన్న, విధులకు గైర్హాజరైన 3,741 మంది కార్మికులకు సైతం ‘సకల’ వేతనం చెల్లించడానికి యాజమాన్యం ముందుకు వచ్చింది. వీరికి ఈనెల 17న రూ.14 కోట్లు బ్యాంకు ఖాతాలలో జమచేయనున్న ది. ఇదిలా ఉండగా సమ్మె సమయంలో అత్యవసర విధు లు నిర్వహించిన ఆస్పత్రి సిబ్బంది, ఎస్అండ్పీసీ గార్డు లు, గనులలో పంప్డ్రైవర్లు, ఎలక్రీ్టషియన్లు, ఫిట్టర్లతో పాటు ధీర్ఘకాలిక సెలవులో, యాక్సిడెంట్ రిపోర్టులో, మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకుని విధులకు దూరంగా ఉన్నవారు, సిక్ అయి విధులు నిర్వహించని వారికి సమ్మె వేతనం అందలేదు. వీరికి ప్రత్యేక గుర్తింపు గా జ్ఞాపికను అందజేయాలని కార్మిక సంఘాలు యాజ మాన్యాన్ని కోరుతున్నాయి. -
పాక్ సద్వినియోగం చేసుకోలేకపోతోంది: పారికర్
న్యూఢిల్లీ: రక్షణమంత్రి మనోహర్ పారికర్..ఉగ్రవాదంపై పాకిస్థాన్ వైఖరిని తప్పుబట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్ పర్యటించి, ఆ దేశంతో చర్చలకు ద్వారాలు తెరిచినా పాక్ మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. సింగపూర్‌లో జరిగిన అంతర్ ప్రభుత్వాల భద్రతా సదస్సులో పారికర్ మాట్లాడుతూ పాకిస్తాన్...ఉగ్రవాదులను మంచివారు, చెడ్డవారుగా విభజిస్తోందని, దీనిపై అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశం తీరును ఎండగడతామన్నారు. మోదీ సుహృద్భావంతో చర్చల గవాక్షం తెరిచారని, అది మూసుకోకముందే పాక్ ఉగ్రవాదంపై నిజాయితీగా వ్యవహరించాలన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గుండె ఆపరేషన్ అనంతరం మోదీ షరీఫ్ తో ఫోన్లో మాట్లాడారాని ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారని గుర్తు చేశారు. గత డిసెంబరులో మోదీ అకస్మాత్తుగా లాహోర్‌ను సందర్శించి, పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళిన విషయాన్ని పారికర్ ప్రస్తావించారు. అయితే పాక్ పఠాన్ కోట్ దాడి విషయంలో సహకరించలేదని అన్నారు. -
ముద్రగడతో చర్చలకు సీఎం విముఖత!
విజయవాడ: కాపుల రిజర్వేషన్ పోరాటం ఉధృత రూపం దాల్చిన నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరపాలని పలువురు మంత్రులు సూచించగా.. ముఖ్యమంత్రి వారి వాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ముద్రగడ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పిన చంద్రబాబు.. మిగిలిన కాపు నేతలతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికేలా చూడాలని కోరినట్లు సమాచారం. కాగా, తుని ఘటనకు సంబంధించి ముద్రగడను బాధ్యునిగా చేస్తూ ఎదురు దాడి చేయాలని, అలాగే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులను రెచ్చగొట్టే ధోరణి వల్లే కాపు ఉద్యమం హింసాత్మకమైందని ఆరోపిస్తూ విమర్శలు చేయాలని పార్టీ ముఖ్యనేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. -
డైలమాలో భారత్-పాక్ చర్చలు
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో భరత్ చర్చల కార్యక్రమం ముందుకెళ్లడం అనుమానంగానే మారింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం భారత్- పాక్ విదేశీ కార్యదర్శుల స్థాయి సమావేశం జనవరి 14,15 తేదీలలో జరగాల్సి ఉంది. అయితే పఠాన్‌కోట్‌లో దాడి జరిపిన ఉగ్రవాదుల మూలాలు పాక్‌లోనే ఉన్నాయని ఇప్పటికే భారత నిఘావర్గాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో చర్చలు డైలమాలో పడ్డాయి. పాక్ అధికార వర్గాలు ఉగ్రవాదంపై స్పష్టమైన వైఖరి పాటించకుండా ఓ వైపు చర్చలు అంటూ స్నేహహస్తం అందిస్తూనే.. మరో వైపు ఉగ్రమూకలకు సహకరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌తో చర్చలు సజావుగా సాగడం సందేహమే అని భారత అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
నైరోబీలో ‘అగ్ర’ పెత్తనం
ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) వేదికగా సంపన్న దేశాలు దాదాపు పదిహేనేళ్లుగా వర్ధమాన దేశాలపై తెస్తున్న ఒత్తిళ్లు ఫలించాయి. కెన్యా రాజధాని నైరోబీలో అయిదురోజులపాటు కొనసాగి శనివారం ముగిసిన సంస్థ మంత్రుల స్థాయి సమావేశంలో తమ వాదననే నెగ్గించుకోగలిగాయి. ప్రస్తుతం 162 దేశాలకు సభ్యత్వం ఉన్న డబ్ల్యూటీఓలో వ్యవసాయ సంబంధ అంశాల్లో తొలిసారి కీలకమైన ఒప్పందం కుదిరిందని, ఇది అసాధారణమైనదని సంస్థ చీఫ్ రాబర్టో అజ్వేడో ఘనంగా ప్రకటించారు. ఇలాంటి కబుర్లకేమిగానీ సదస్సు తీసుకున్న నిర్ణయాలనూ, వాటి పర్యవసానాలనూ గమనించినవారికి వర్ధమాన, నిరుపేద దేశాలు దగాపడ్డ వైనం స్పష్టంగా గోచరిస్తుంది. వాటిని దోవకు తెచ్చుకోవడంలో సంపన్న దేశాలు విజయం సాధించడం కనిపిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికుండే అవరోదాలను తొలగించడం... ధనిక, బీద తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ జీవన ప్రమాణాలను పెంచడం, సంపూర్ణ ఉపాధి, ఆహార భద్రత, సాంకేతిక పురోగతి, సుస్థిర అభివృద్ధి సాధన ధ్యేయమని చెబుతూ సంపన్న దేశాల చొరవతో 1995లో ఈ సంస్థ ఆవిర్భవించింది. ధనిక దేశాలు తమ మార్కెట్లను విస్తృతం చేసుకోవడంలో భాగంగానే ఇది ఉనికిలోకొచ్చిందని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు, పార్టీలు సాగించిన ఉద్యమాల ఫలితంగా డబ్ల్యూటీ ఓలో వర్ధమాన, నిరుపేద దేశాలు ఎంతో కొంత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాయి. సంపన్న దేశాల ఒత్తిళ్లను ఏదో మేరకు అధిగమించాయి. కానీ అది ఏ మాత్రం సరిపోదని తాజాగా నైరోబీ సదస్సు రుజువు చేసింది. మన దేశంతోసహా వర్ధమాన దేశాల్లో అమలవుతున్న ఆహార భద్రత కార్యక్ర మాలనూ...రైతులకూ, ఇతర వర్గాలకూ ఇస్తున్న సబ్సిడీలనూ సంపన్న దేశాలు ఆదినుంచీ గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సబ్సిడీలు మొత్తం ఉత్పాదకతలో పది శాతం మించడానికి వీల్లేదంటూ ప్రతిపాదిస్తున్నాయి. 2001లో మొదలై ఇంకా కొనసాగుతున్న దోహా రౌండ్ చర్చల్లో ఇవి కీలకమైనవి. ఇందులో విజయం సాధించడం సాధ్యపడకపోవడంతో సంపన్న దేశాలు తమ పలుకుబడితో ‘డబ్ల్యూటీఓ ప్లస్’ పేరిట ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్షిప్(టీపీపీ)వంటి పలు ప్రాంతీయ ఒప్పందాలకు తెరలేపాయి. ఆ పని చేస్తూనే డబ్ల్యూటీఓ సరైన ఫలితాలివ్వలేకపోయింది గనుక ఇతరేతర ఒప్పందాల అవసరం ఏర్పడిందన్న ప్రచారానికీ పూనుకున్నాయి. నైరోబీ మంత్రుల స్థాయి సదస్సులో తాము అనుకున్నది సాధించలేకపోతే అది ‘ముగిసిన అధ్యాయం’గా ప్రకటించడానికి కూడా సంపన్న దేశాలు సిద్ధపడ్డాయి. నైరోబీ సదస్సు ఇప్పుడు సాధించిందంటున్న అసాధారణమైన, చరిత్రాత్మ కమైన ఒప్పందం నిజానికి వర్ధమాన, నిరుపేద దేశాలకు శరాఘాతం వంటివి. డబ్ల్యూటీఓ సభ్య దేశాలన్నీ తమ తమ దేశాల్లో రైతులకిస్తున్న ఎగుమతి సబ్సిడీలను గణనీయంగా తగ్గించాలని ఆ ఒప్పందం నిర్దేశిస్తున్నది. సంపన్న దేశాలు ఈ సబ్సిడీల కోతను తక్షణం ప్రారంభించాల్సి ఉండగా వర్ధమాన దేశాలు 2018నుంచి ఆ పని మొదలుపెట్టాల్సి ఉంటుంది. దిగుమతులు వచ్చిపడుతున్నప్పుడుగానీ, ధరలు పడిపోయినప్పుడుగానీ ప్రత్యేక రక్షణ చర్యలకింద దిగుమతులపై ఉండే టారిఫ్‌లను తాత్కాలికంగా పెంచుకోవడానికి వర్ధమాన దేశాలకు వెసులుబాటు నిచ్చారు. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ఆహార ధాన్యాల సేకరణ విషయమై కూడా అనంతర కాలంలో చర్చించడానికి అంగీకారం కుదిరింది. నిజానికి ఇవన్నీ కొత్తగా నైరోబీ సదస్సులో సాధించినవేమీ కాదు. రెండేళ్లక్రితంలో బాలిలో జరిగిన డబ్ల్యూటీఓ సదస్సులోనే ఇందుకు సంబంధించిన అవగాహన కుదిరింది. ఇప్పుడు మంత్రుల స్థాయి సమావేశం దాన్ని పునరుద్ఘాటించడం మినహా కొత్తగా చేసిందేమీ లేదు. వీటితోపాటు పత్తి పండించే దేశాలకిచ్చిన కొన్ని వెసులుబాట్లు, అత్యంత వెనకబడిన దేశాలకు ఐటీ సేవలు అందించడానికి అంగీకరించడంలాంటి చిన్న చిన్న రాయితీలు చేకూరాయి. సంపన్న దేశాల ఒత్తిళ్లకు ఇంతగా లొంగిన వర్ధమాన దేశాలు దోహా రౌండ్కింద సాధించుకున్న ప్రయోజనాలు భవిష్యత్తులో కొనసాగుతాయన్న హామీని మాత్రం వాటినుంచి పొందలేకపోయాయి. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంలో మన దేశం ఎంతో అసంతృప్తిగా ఉన్నదని ప్రకటించడం బాగానే ఉన్నా అందుకోసం నైరోబీలో ఎందుకు పట్టుబట్టలేదో అనూహ్యం. డబ్ల్యూటీఓలో అంగీకరించిన విధానం ప్రకారం ఏ సమస్యపైన అయినా మెజారిటీ, మైనారిటీ ఓటింగ్ ద్వారా కాక... ఏకాభిప్రాయంతో మాత్రమే అమలు చేసే సంప్రదాయం ఉంది. దాన్ననుసరించి రైతులకిస్తున్న సబ్సిడీలపైనా, ఆహార ధాన్యాలు నిల్వ చేసుకునే హక్కుపైనా గట్టిగా నిలబడవలసింది. ఆ పని చేయకపోవడంవల్ల మరో మూడేళ్లలో సబ్సిడీలను కత్తిరించే పనిని ప్రారంభించాల్సి ఉంటుంది. దోహా రౌండ్లో వర్ధమాన దేశాలు సాధించుకున్న ప్రయోజనాలతో ముడిపెట్టి సబ్సిడీల విషయంలో పట్టుదలతో పోరాడి ఉంటే సంపన్న దేశాలు దారికొచ్చేవేమో! అసలు ఆ దేశాలు తామూ సబ్సిడీలు తగ్గించుకోబోతున్నామని చేస్తున్న వాదనలు పెద్దగా నిలబడేవి కాదు. మన రైతుకూ, అమెరికాలోని రైతుకూ పోలికే లేదు. వేల ఎకరాల కమతాలుండే అక్కడి రైతుల వార్షికాదాయంతో పోలిస్తే మన రైతు చేతికొచ్చేది ఏ మూలకూ ఉండదు. సబ్సిడీలు తొలగిస్తే అమెరికా రైతు ఆదాయం స్వల్పంగా తగ్గుతుంది. వారు నష్టపోయేదేమీ ఉండదు. మన దేశంలో పరిస్థితి అందుకు విరుద్ధం. ఇప్పుడున్న అరకొర సబ్సిడీలు సరిపోక రోజురోజుకూ రుణాల ఊబిలో కూరుకుపోతూ ఆత్మహత్యలు తప్ప గత్యంతరం లేదనుకుంటున్న రైతులు...వాటిని సైతం తొలగిస్తే ఏ స్థితికి చేరుకుంటారో ఊహించాల్సిందే. మొత్తానికి వర్ధమాన దేశాల్లో చీలిక తీసుకురావడం ద్వారా నైరోబీలో ధనిక దేశాలు తాము అనుకున్నది సాధించుకోగలిగాయి. -
'తప్పదు.. భారత్‌కు వేరే మార్గం లేదు'
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో చర్చలు తప్ప మరొక మార్గం లేదని, చర్చల నుంచి భారత్ తప్పించుకోలేదని జమ్మూకాశ్మీర్ లో బీజేపీ భాగస్వామి పీడీపీ పేర్కొంది. ప్రపంచం మొత్తాన్ని ఉగ్రవాదం వణికిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్ మాటామంతి జరుపుకోవాల్సిందేనని పీడీపీ అధ్యక్షుడు మహబూబా మఫ్తీ అన్నారు. ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ స్టేట్, అల్ కాయిదా, తాలిబన్ వంటి సంస్థలు ఉగ్రవాదంతో కలవరపెడుతున్నాయని, దానినుంచి బయటపడాలంటే ఇప్పటికైనా భారత్ పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో చేతులు కలపాల్సిందేనని చెప్పారు. గత నవంబర్ 7న శ్రీనగర్ లో ప్రధాని నరేంద్రమోదీ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా కాశ్మీర్ విషయంలో ఎవరి సలహాను తీసుకోకపోవడంపై ఆమెను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ప్రజలకు అనుభవం ద్వారా కొన్ని విషయాలు తెలిసి వస్తాయని, జమ్ముకాశ్మీర్ విషయం మిగితా రాష్ట్రాల మాదిరిగా కాదనేది అందరికీ తెలిసిందేనని అన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాల సరిగా లేకుంటే, సరైన చర్చలు జరపకుంటే ఆ ప్రభావం నేరుగా దేశంపై పడుతుందని చెప్పారు. సుష్మా స్వరాజ్ పాక్ పర్యటనకు వెళ్లి మంచి సందర్బానికి తెరతీశారని అన్నారు. -
'ఆ దేశాలకు ఇప్పుడు తెలిసొచ్చింది'
భోపాల్: చర్చల ద్వారా భద్రతా బలగాల ద్వారా ఉగ్రవాద సమస్యను పరిష్కరించడం సాధ్యంకాదని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ఈ చర్యలకు బదులుగా ప్రతి ఒక్కరికి ఈ భూమిపై జీవించే హక్కు ఉందని ఉగ్రవాదులు అర్థం చేసుకునేలా చేయడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. 'ఉగ్రవాదులను తప్పకుండా చర్చలకు ఆహ్వానించాలి. అయితే, ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉందని వారు అర్థం చేసుకోనంతవరకు ఇలాంటి పని వ్యర్థమవుతుంది. అందుకే వారిని నియంత్రించేందుకు భద్రతా బలగాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఇది మాత్రం శాశ్వత పరిష్కారం కాదు' అని రవిశంకర్ అన్నారు. కుంచిత మనస్తత్వం వల్లే ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని చెప్పారు. అన్ని మతాలమీద చిన్నతనం నుంచే అవగాహన కల్పించినా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకోవడం లేదని చెప్పారు. చాలా కాలం నుంచి భారత్ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటుందని తొలుత చెప్పినప్పుడు ఏ ఒక్క పాశ్చాత్య దేశం ఆమోదించలేదని, పైగా దాడులకు ప్రతి దాడులు ఉంటాయే తప్ప ఎవరూ కావాలని దాడులు చేయరని వ్యాఖ్యానించాయని, ఇప్పుడు తాజాగా పారిస్ దాడులతో ఆ దేశాలకు అసలు విషయం బోధపడిందని అన్నారు. భారత్ సమస్య ఇప్పుడు ప్రపంచ దేశాలకు తెలిసివచ్చిందని, పారిస్ ఘటనతో యూరప్ దేశాలన్నీ ఒక తాటిపైకి వచ్చి భారత్ ముందు నుంచి చేస్తున్న హెచ్చరికలను నేటికి అర్థం చేసుకున్నాయని అన్నారు. ఇక, దేశంలో అసహన పరిస్థితులు ఉన్నట్లు తనకు ఎక్కడా కనిపించలేదని అన్నారు. ఇలాంటి పుకార్లన్నీ ఎన్నికల సమయంలోనే షికార్లు చేస్తాయని చెప్పారు. -
గోవధకిస్తున్న ప్రాధాన్యత మహిళలకివ్వడం లేదు
-
ఛైర్మన్‌గా ఆయనే కొనసాగుతారు
న్యూఢిల్లీ: ఎఫ్ టీఐఐ చైర్మన్ గజేంద్ర చౌహాన్ నియాకమంలో చివరకు కేంద్ర ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. దాదాపు మూడు నెలల పాటు విద్యార్థుల నిరసనను ఎదుర్కొన్న గజేంద్ర చౌహాన్‌ను పదవిలో కొనసాగింవచడంలో విజయం సాధించింది. విద్యార్ధి సంఘాల నాయకులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో దీనిపై ఒక అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సమస్యపై చర్చిస్తామన్న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హామీతో దీక్ష విరమించిన విద్యార్థులు కేంద్రం ప్రతిపాదించిన మధ్యే మార్గానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సుదీర్ఘ ఆందోళనకు కారణమైన సంస్థ ఛైర్మన్ గజేంద్ర చౌహాన్ మాత్రం యథావిధిగా ఆ పదవిలో కొనసాగుతారు. చౌహాన్‌తో పాటుగా ఒక కో చైర్మన్ ను నియమించేలా కేంద్రం ప్రతిపాదించింది. విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నఐదుగురు సభ్యులను కమిటీ నుంచి తొలగించేందుకు అంగీకరించింది. కేంద్రం చేసిన ఈ ప్రతిపాదనకు విద్యార్థి సంఘ నాయకులు కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఛైర్మన్ గా చౌహాన్ కొనసాగుతారని పేరుచెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి మీడియాకు వివరించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమ ప్రతిపాదనకు విద్యార్థిసంఘ నాయకులు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. గత జూన్ లో ఎఫ్ టీఐఐ చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ ను నియమించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ప్రతిష్ఠాత్మక ఫిలిం ఇనిస్టిట్యూట్ లో రాజకీయాలకు చోటు లేదని.. బీజేపీకి చెందిన గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేశారు. వీరి ఆందోళనకు పలువురు సినీ ప్రమఖులు, రాజకీయ నాయకులు తమ మద్దుతును తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న చర్చలకు రావాలని విద్యార్ధి సంఘాల నాయకులను కేంద్రం ఆహ్వానించడంతో దీక్ష విరమించిన సంగతి తెలిసిందే. -
ఛైర్మన్‌గా ఆయనే కొనసాగుతారు...
న్యూఢిల్లీ: ఎఫ్టీఐఐ చైర్మన్ గజేంద్ర చౌహాన్ నియాకమంలో చివరకు కేంద్ర ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. దాదాపు మూడు నెలల పాటు విద్యార్థుల నిరసనను ఎదుర్కొన్న గజేంద్ర చౌహాన్‌ను పదవిలో కొనసాగింవచడంలో విజయం సాధించింది. విద్యార్ధి సంఘాల నాయకులకు కేంద్ర ప్రభుత్వం మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో దీనికి సంబంధించి ఒక అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సమస్యపై చర్చిస్తామన్న కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ హామీతో దీక్ష విరమించిన విద్యార్థులు కేంద్రం ప్రతిపాదించిన మధ్యే మార్గానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సుదీర్ఘ ఆందోళనకు కారణమైన సంస్థ ఛైర్మన్ గజేంద్ర చౌహాన్ మాత్రం యధావిధిగా కొనసాగుతారు. అయితే చౌహాన్‌తో పాటుగా ఒక కో చైర్మన్‌ను నియమించేలా కేంద్రం ప్రతిపాదించింది. అలాగే విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అయిదుగురు సభ్యులను కమిటీన నుంచి తొలగించేందుకు అంగీకరించింది. కేంద్రం చేసిన ఈ ప్రతిపాదనకు విద్యార్థి సంఘ నాయకులు కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఛైర్మన్ గా చౌహాన్ కొనసాగుతారని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి మీడియాకు వివరించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమ ప్రతిపాదనకు విద్యార్థి సంఘ నాయకులు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. కాగా గత జూన్‌లో ఎఫ్టీఐఐ చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ నియమించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో రాజకీయాలకు చోటు లేదని..బీజేపీకి చెందిన గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనచేశారు. వీరి ఆందోళనకు పలువురు సినీ ప్రమఖులు, రాజకీయనాయకులు తమ మద్దుతును తెలియజేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న చర్చలకు రావాల్సిందిగా విద్యార్ధి సంఘాల నాయకులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో దీక్ష విరమించిన సంగతి తెలిసిందే.. -
ఉగ్రవాదంపై చర్చే ఎజెండా కావాలి: సుష్మా
న్యూఢిల్లీ: పాకిస్థాన్ తీరు వల్లే ఇరు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. పాకిస్థాన్‌తో చర్చలను స్వాగతిస్తున్నామని, అయితే ఉగ్రవాదంపై చర్చ మాత్రమే ఎజెండాగా ఉండాలని సుష్మా చెప్పారు. గతంలో భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ సమావేశమైనపుడు ఉగ్రవాదంపై చర్చలు జరపాలని నిర్ణయించారని వెల్లడించారు. ఈ సమావేశం తర్వాత పాకిస్థాన్ 91 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని సుష్మా చెప్పారు. నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు నిర్ణయించిన శాంతిచర్చల ఎజెండాకు తాము కట్టుబడి ఉన్నామని సుష్మా చెప్పారు. అప్పట్లో అనుకున్న ఎజెండాలో అసలు కాశ్మీర్ అంశం లేదని.. పాక్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని తెలిపారు. అంతేగాక ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు ముందు.. కాశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద నేతలతో చర్చలకు పాక్ సిద్ధపడటాన్ని సుష్మా అభ్యంతరం వ్యక్తం చేశారు. -
భారత్‌తో చర్చలకు సిద్ధం: పాక్
న్యూఢిల్లీ: ఎలాంటి ముందస్తు షరతు లేకుండా భారత్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ జాతీయ భద్రత సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. ఇరు దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశాన్ని రద్దు చేసినట్టు భారత్ అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. ఇదిలావుండగా, భారత్, పాక్‌ల మధ్య శాంతి చర్చల్లో మూడోపక్షం ప్రమేయం ఉండరాదని భారత్ మొదట్నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. పాక్ ఈ చర్చలకు జమ్ముకశ్మీర్ వేర్పాటు వాద నాయకులను ఆహ్వానించడంపై భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. గతంలో భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు నిర్ణయించిన శాంతిచర్చల ఎజెండాకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అప్పట్లో అనుకున్న ఎజెండాలో అసలు కాశ్మీర్ అంశం లేదు. కానీ ఆ తర్వాత నవాజ్ షరీఫ్‌పై పాక్ సైన్యం తీవ్రమైన ఒత్తిడి తేవడంతో చర్చల్లో కాశ్మీర్ సమస్య గురించి కూడా ఉండాలని అన్నారు. పైగా, ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు ముందు.. కాశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద నేతలతో చర్చలకు పాక్ సై అంది. దీంతో ఇరు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. పాక్ జాతీయ భద్రత సలహాదారును కలిసేందుకోసం వెళ్తున్న కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబీర్ షాను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సర్తాజ్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌తో అన్ని సమస్యల గురించి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కశ్మీర్ అంశానికి తాము అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. భారత్ హురియత్ నేతలను అరెస్ట్ చేయడం తమను నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. పాక్ ముందస్తు షరతు లేకుండా భారత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమని ఓ వైపు చెబుతూనే.. మరోవైపు భారత్ అభీష్టానికి భిన్నంగా హురియత్ నేతలను చర్చలకు ఆహ్వానించడం గమనార్హం. -
భారత్- పాక్ చర్చల్లో తీవ్ర ప్రతిష్ఠంభన
-
పాక్‌తో చర్చలు అనుమానమే!
భారత్ - పాక్‌ల ఎన్ఎస్ఏ చర్చలపై ‘హురియత్’ నీలినీడలు కశ్మీర్ వేర్పాటు నేతలతో పాక్ ఎన్ఎస్ఏ భేటీ కావాలనుకోవడంపై భారత్ ఆగ్రహం అది సరికాదని, ఆ ఆలోచన విరమించుకోవాలని పాక్‌కు సూచన * భారత్ సలహాను తోసిపుచ్చిన పాకిస్తాన్; హురియత్ నేతలను కలుస్తామని స్పష్టీకరణ * సంయమనం పాటించాలని ఇరుదేశాలకు ఐరాస చీఫ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్ఎస్ఏ) స్థాయి చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాక్ మొండి పట్టుదలతో చర్చలకు పురిట్లోనే సంధి కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. చర్చల కోసం రేపు ఢిల్లీ వస్తున్న పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ కశ్మీర్ వేర్పాటు నేతలతో భేటీ కావాలనుకోవడంపై ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం చర్చల ప్రక్రియ నిలిపివేతకు దారితీసేలా కనిపిస్తోంది. వేర్పాటువాద నేతలతో భేటీ సరికాదని భారత్ సున్నితంగా ఇచ్చిన సూచనను పాక్ పెడచెవిన పెట్టింది. ఎన్ఎస్ఏ చర్చల కోసం భారత్ వస్తున్న పాక్ అధికారి.. కశ్మీర్ వేర్పాటు నేతలను కలుసుకోవడం తమకు ఆమోదయోగ్యం కాదన్న భారత్ సలహాను పాక్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. భారత్ వెళ్లే తమ నేతలు, అధికారులు వేర్పాటువాదులతో భేటీ కావడం సాధారణమేనని, ఆ సంప్రదాయాన్ని కాలదన్నే ఆలోచన తమకు లేదని అధికారికంగానే తేల్చిచెప్పింది. కశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని, హురియత్ నేతలే ‘భారత్ ఆక్రమిత కశ్మీరీ’ల నిజమైన ప్రతినిధులంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేసింది. చర్చల బంతి భారత్ కోర్టులో ఉందని, చర్చల్లో పాల్గొంటారా? లేక బంతిని తీసుకుని పారిపోతారా? చూడాల్సి ఉందంటూ పాక్ సమాచార మంత్రి పర్వేయిజ్ రషీద్ అన్నారు. పాక్ తీరును భారత్ తీవ్రంగా గర్హించింది. నిర్మాణాత్మక చర్చలు జరపాలంటూ రష్యాలోని ఉఫాలో ఇరు దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, నవాజ్ షరీఫ్‌లు తీసుకున్న నిర్ణయం నుంచి పాక్ తప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించింది. ‘హురియత్ నేతలతో భేటీ కావాలనుకునే పాక్ పట్టుదల ఉఫా ఒడంబడికకు సంపూర్ణ ఉల్లంఘనే కాకుండా ఆమోదిత ఎజెండానుంచి తప్పుకోవడమే’ అని స్పష్టం చేసింది. ‘ద్వైపాక్షిక సంబంధాల్లో ఇద్ద రు ప్రతినిధులు మాత్రమే ఉంటారు. ముగ్గురు కాదనే విషయంలో భారత్ స్పష్టతతో ఉంది. ఆ విధానానికే కట్టుబడి ఉంది. ఏకపక్షంగా షరతులు, ఆమోదిత ఎజెండాను ఉల్లంఘించడం చర్చలకు ప్రాతిపదిక కాబోవు’ అని తేల్చిచెప్పింది. భారత్ ఆగ్రహాన్ని పట్టించుకోని పాక్.. సోమవారం ఉదయం 9.30 గంటలకు పాక్ ఎన్ఎస్ఏ అజీజ్ కశ్మీర్ అతివాద వేర్పాటు నేత సయ్యద్ అలీ షా గిలానీతో భేటీ అవుతారని ప్రకటించింది. అంటే, భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌తో భేటీకి ముందే గిలానీతో అజీజ్ సమావేశమవుతారు. కాగా, పాక్‌తో జరిగే చర్చల్లో ఉగ్రవాదం మాత్రమే ఎజెండా అని భారత హోంమంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. చర్చలకు కట్టుబడి ఉన్నామని, అయితే, పాక్ విధిస్తున్న ఏకపక్ష షరతులు చర్చల కొనసాగింపునకు ప్రాతిపదిక కాబోవని భారత్ పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. ఉఫాలో రెండు దేశాల ప్రధానులు అంగీకరించిన ఎజెండాపై పాక్ వెనక్కి వెళ్తోందని, అది చర్చలను పాక్ సీరియస్ తీసుకున్నట్లు కనిపించడం లేదంది. అది మా సంప్రదాయం: పాక్ అర్థంలేని కారణాలు చూపుతూ భారత్ ముందస్తు షరతులు విధించడం తమకు నిరుత్సాహం కలిగిస్తోందని పాక్ పేర్కొంది. ముందు అంగీకరించిన నిర్ణయాలపై భారత్ వెనక్కు వెళ్తోందంటూ పాక్ విదేశాంగ శాఖ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. హురియత్ నేతలతో తమ చర్చలుంటాయని స్పష్టం చేసింది. భారత్ ఆజ్ఞలను పాటించబోమని, భారత్-పాక్ చర్చలు షరతులతో కూడిన దౌత్యంపై ఆధారపడిలేవని పేర్కొంది. చర్చల నుంచి పారిపోయేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, ఇప్పటికీ చర్చల ఎజెండాను భారత్ తమకు పంపించనేలేదని ఆరోపించింది. చర్చలకు ముందస్తు షరతులు విధించడం తమకు ఆమోదయోగ్యం కాదంది. పాక్ సైన్య, పౌర నాయకత్వంతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక సమాలోచనలు జరిపిన అనంతరం ఈ స్పందన వెలువడింది. ‘అమలు చేయని ఐరాస భద్రతామండలి తీర్మానం ప్రకారం.. కశ్మీర్ వివాదాస్పద ప్రాంతం. భారత్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల వాస్తవ ప్రతినిధులు హురియత్ నేతలే. కశ్మీర్ సమస్య పరిష్కార యత్నాల్లో వారిదే వాస్తవ ప్రాతినిధ్యం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఉఫా ప్రకటన మేరకు కశ్మీర్ సహా అన్ని అపరిష్కృత అంశాలతో ఎజెండాను ఈ చర్చల నిమిత్తం భారత్‌కు ప్రతిపాదించాం’ అని తెలిపారు. హురియత్ నేతలతో భేటీ కావడమనే సంప్రదాయం నుంచి తప్పుకోదల్చుకోలేదని పాక్‌లోని భారత హై కమిషనర్ టీసీఏ రాఘవన్‌కు పాక్ విదేశాంగ కార్యదర్శి ఇజాజ్ అహ్మద్ చౌధరి శుక్రవారం సందేశం పంపించారు. దౌత్యంలో షరతులుండవు: హురియత్ న్యూఢిల్లీ/శ్రీనగర్: దౌత్య వ్యవహారాల్లో హద్దులు, షరతులు ఉండకూడదని జమ్మూ కశ్మీర్ మితవాద వేర్పాటువాది, హురియత్ నేత మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ అన్నారు. భారత్, పాక్‌లు చిత్తశుద్ధితో చర్చల ప్రక్రియ కొనసాగించగలిగితే, ఆ చర్చల్లో ఎప్పుడు పాలు పంచుకోవాలనే విషయంలో తమకు పట్టింపు లేదన్నారు. కశ్మీర్ సహా అన్ని అపరిష్కృత సమస్యలు పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమన్నారు. కశ్మీర్ సమస్యను పక్కనపెట్టడమో, పట్టించుకోకపోవడమో చేస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. ‘కశ్మీర్ సరిహద్దు సమస్య కానే కాదు. అది 1.25 కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది. కశ్మీరీలు తృతీయ స్థాయి ప్రతినిధులు కాదు. వారే మౌలికప్రతినిధులు’ అని ఆయన స్పష్టం చేశారు. చర్చలు జరపండి.. కాగా, సంయమనం పాటించాలని ఇరు దేశాలకు ఐక్యరాజ్య సమితి చీఫ్ బాన్‌కి మూన్ విజ్ఞప్తి చేశారు. రెండు దేశాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్చలను జరపాలన్నారు. పాక్, ఐఎస్ఐఎస్ జెండాల ప్రదర్శన శ్రీనగర్: శ్రీనగర్‌లో శుక్రవారం కొంతమంది యువకులు భారత జాతీయ పతాకాన్ని తగులబెట్టి, పాక్, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగరేశారు. వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. నౌహట్టా ప్రాంతంలోని జామియా మసీదులో ప్రార్థనలు ముగిశాక ఆందోళనకారులు అక్కడి దగ్గర్లో నిరసన తెలిపారు. త్రివర్ణ పతాకంతోపాటు పీడీపీ పార్టీ జెండాలనూ దగ్ధం చేశారు. వారిలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. వేర్పాటువాద నేత అహ్మద్ షాకు గృహనిర్బంధం కశ్మీర్ వేర్పాటువాద నేత, డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ చీఫ్ షాబిర్ అహ్మద్ షాను శుక్రవారం ప్రార్థన నేపథ్యంలో పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసులు ఆయనకు ప్రార్థనల కోసం బయటకెళ్లేందుకు అనుమతించలేదని పార్టీ ప్రతినిధి తెలిపారు. మరోపక్క.. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ గృహనిర్బంధం కొనసాగుతోంది. హురియత్ చైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్, జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్ తదితర వేర్పాటు నేతలను గురువారం పోలీసులు కొన్నిగంటల పాటు గృహనిర్బంధంలో ఉంచి తర్వాత విడుదల చేశారు. ఉఫా స్ఫూర్తిని కాలదన్నడమే: భారత్ పాక్ తీరు ‘ఉఫా’ స్ఫూర్తిని కాలదన్నేలా ఉందని భారత్ పేర్కొంది. ‘అన్ని ఉగ్రవాద అంశాలపై చర్చించాలని ఉఫాలో ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతికి చర్యలు తీసుకోవాలని అంగీకరించారు. కానీ జరుగుతున్నదేంటి? సరిహద్దులో కాల్పుల ఉల్లంఘనలు పెరిగాయి. భారత్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరిగాయి. ఓ పాక్ ఉగ్రవాదిని పట్టుకున్నాం. ఇవన్నీ చర్చల సందర్భంగా పాక్‌కు ఇబ్బంది కలిగించేవే. అందుకే చర్చల నుంచి తప్పుకునేందుకు పాక్ ఈ ఎత్తులు వేస్తోంది’ అని విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ జైపూర్‌లో అన్నారు. చర్చల ఎజెండాను పాక్‌కు పంపామని, దానికి విరుద్ధమైన ఎజెండాను పాక్ పంపిందని వెల్లడించారు. -
చర్చలు ఇంకా ఖరారు కాలేదు
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలకు ఇంకా తేదీలు ఖరారు కాలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఈ విషయంలో పాకిస్థాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదని, ఆ దేశం తన అభిప్రాయం తెలిపాకే భారత్ నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల భారత్-పాక్ మధ్య పలు అంశాలకు సంబంధించి చర్చ జరగాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండటంతోపాటు పాక్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలిసిందే. అయితే, ఇటీవల పాక్ ఉగ్రవాదులు బీఎస్ఎఫ్ బలగాలపై కాల్పులకు పాల్పడటంతోపాటు, సరిహద్దు వెంబడి చొరబాట్లు జరగడం, సైనిక స్థావరాలపై గ్రనేడ్లు విసరడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పలుమార్లు ఉల్లంఘించడంవంటి చర్యలకారణంగా ఈ చర్చలు విషయంలో కొంత ప్రతిష్ఠంభన నెలకొంది. పాక్ కూడా ఇలాంటి సంఘటనలను అధికారికంగా ఖండించకపోవడం కూడా చర్చలు జరిపే విషయంలో కొంత అనుమానం నెలకొంది. అయితే, చర్చలే అన్ని సమస్యలకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న నేపథ్యంలో పాక్ నుంచి అధికారిక ప్రకటనకోసం కేంద్రం ఎదురుచూస్తుంది. -
తెలంగాణ సర్కార్‌తో మున్సిపల్ ఉద్యోగులచర్చలు విఫలం
-
రోజంతా భేటీలే భేటీలు.. చర్చలే చర్చలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకోవడం.. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ సమన్లు జారీ చేస్తుందనే వార్తలు రావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం భేటీలు జోరందుకున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు రోజంతా చర్చలు జరుపుతూ తీరికలేకుండా గడిపగా.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఏపీ కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలసి నోటుకు ఓటు వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ భోంస్లే గవర్నర్‌ను కలిశారు. మరోవైపు ఉన్నతాధికారులతో సమావేశమైన తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇక ఏపీ మంత్రులు మీడియా సమావేశాల్లో పాల్గొని తెలంగాణ పోలీసుల భద్రత తమకు అవసరం లేదని తామే ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. వరుస భేటీలతో ఏదో జరగబోతోందనే ఊహాగానాలు ఏర్పడ్డాయి. మొత్తానికి ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలాగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగాయి. ఈ రోజు ఎవరు ఎవరితో సమావేశమయ్యారంటే.. ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో చంద్రబాబు సుధీర్ఘ సమావేశం. యనమల, సీఎం రమేష్, సుజనా చౌదనరి, డీజీపీ రాముడు, ఇంటలిజెన్స్ చీఫ్ అనూరాధ గవర్నర్‌తో తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి భేటీ ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం చినరాజప్ప సమావేశం మంత్రులు, ఉన్నతాధికారులతో చంద్రబాబు భేటీ ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఛాంబర్లో మంత్రుల భేటీ తెలంగాణ ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష గవర్నర్‌తో ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి బృందం సమావేశం సాయంత్రం గవర్నర్‌తో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు సమావేశం గవర్నర్ నరసింహన్‌తో హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోంస్లే భేటీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ చంద్రబాబుతో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు సమావేశం -
భారత్ చేతిలోనే చర్చల పునరుద్ధరణ: షరీఫ్
కఠ్మాండు: భారత్-పాకిస్తాన్ల మధ్య చర్చల పునరుద్ధరణ అంశం భారత్ చేతిలోనే ఉందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం గురించి విలేకరులు షరీఫ్‌ను ప్రశ్నించ గా గతంలో భారత ప్రభుత్వమే విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలను ఏకపక్షంగా రద్దు చేసిందని...దీనిపై భారత ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. -
నేడు చర్చలు
సాక్షి, చెన్నై: తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. శ్రీలంక - భారత సరిహద్దుల్లో ఎంపిక చేసిన ప్రదేశంలో పారంపర్యంగా వస్తున్న చేపల వేటను కొనసాగించలేని పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నా, శ్రీలంక నావికాదళం మాత్రం తన పనితనాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారింది. ఎట్టకేలకు రెండు దేశాల జాలర్లను ఓ చోట కూర్చోబెట్టి సామరస్య పూర్వక నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా తేదీ వాయిదా పడటంతో ఈ చర్చలు సాగేనా? అన్న సందిగ్ధత నెలకొంది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం డీఎంఎస్ ఆవరణలోని సమావేశ మందిరంలో చర్చలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం పది గంటలకు చర్చలు ఆరంభం కానున్నాయి. ఇందులో రెండు దేశాల జాలర్లు పారంపర్యంగా చేపలను వేటాడుతున్న ప్రదేశాలపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రధానంగా కచ్చ దీవులపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తమ మీద జరుగుతున్న దాడుల అడ్డుకట్ట లక్ష్యంగా, చేపల వేటలో ఉపయోగించాల్సిన వలలు తదితర అంశాలతో పాటుగా రెండు దేశాల మధ్య సత్సంబంధాల మెరుగుకు దారితీసే రీతిలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. శ్రీలంక నుంచి జాలర్ల ప్రతినిధి బృందం చెన్నైకు ఆదివారం చేరుకుంది. ఆదేశానికి చెందిన అంతోని ముత్తు నేతృత్వంలో 15 మంది ఉదయం మీనంబాక్కం విమానాశ్రయం చేరుకున్నారు. వీరిని గట్టి భద్రత నడుమ నగరంలోని ఓ హోటల్‌కు తరలించారు. రామేశ్వరం, నాగపట్నం, పుదుకోట్టై, రామనాథపురం నుంచి రాష్ట్ర జాలర్ల బృందాలు ఇక్కడికి చేరుకున్నారుు. చర్చల్లో శ్రీలంకకు చెందిన పదిమంది ప్రతినిధులు, రాష్ట్రానికి చెందిన పది మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొంటారు. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి జయపాల్, అధికారులు విజయకుమార్, మునియనాథన్, రంగరాజన్ భేటీకి నేతృత్వం వహించనున్నారు.దాడి: రెండు దే శాల జాలర్లు చర్చలకు సిద్ధమవుతోంటే, శ్రీలంక నావికాదళం ఆదివారం మండపం జాలర్లపై విరుచుకు పడింది. శనివారం రాత్రి మండపం నుంచి చేపల వేటకు వెళ్లిన ఐదు పడవలను చుట్టుముట్టి చితకబాది పంపించింది. ఉదయాన్నే ఒడ్డుకు చేరుకున్న బాధితులు తమపై జరిగిన దాడిని మీడియా, అధికారుల దృష్టికి తెచ్చారు. చర్చల్లో ఈ దాడి కలకలం ఎలాంటి ప్రకంపన సృష్టించబోతుందో వేచి చూడాల్సిందే. -
ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు విఫలం
-
ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాల చర్చలు విఫలం
హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల నాయకులు ఆదివారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రేపు ఉదయం నుంచి ఆర్టీసీ సమ్మె యథాతథంగా ఉంటుందని చెప్పారు. ఉద్యోగులకు 22 శాతం ఐఆర్ ఇవ్వడానికి ఆర్టీసీ యాజమాన్యం ముందుకొచ్చింది. అయితే కార్మిక సంఘాలు 32 శాతం ఇవ్వాలని పట్టుబట్టాయి. ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య ఓ అవగాహన కుదరకపోవడంతో సమావేశం మధ్యలోనే ఈయూ, టీఎమ్‌యూ నేతలు బయటకు వచ్చారు. కాగా రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కార్మిక సంఘం నేతల్ని చర్చలకు ఆహ్వానించారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు చర్చలు జరగనున్నాయి.