పాక్ సద్వినియోగం చేసుకోలేకపోతోంది: పారికర్
Published Sat, Jun 4 2016 5:14 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM
న్యూఢిల్లీ: రక్షణమంత్రి మనోహర్ పారికర్..ఉగ్రవాదంపై పాకిస్థాన్ వైఖరిని తప్పుబట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్ పర్యటించి, ఆ దేశంతో చర్చలకు ద్వారాలు తెరిచినా పాక్ మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. సింగపూర్‌లో జరిగిన అంతర్ ప్రభుత్వాల భద్రతా సదస్సులో పారికర్ మాట్లాడుతూ పాకిస్తాన్...ఉగ్రవాదులను మంచివారు, చెడ్డవారుగా విభజిస్తోందని, దీనిపై అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశం తీరును ఎండగడతామన్నారు.
మోదీ సుహృద్భావంతో చర్చల గవాక్షం తెరిచారని, అది మూసుకోకముందే పాక్ ఉగ్రవాదంపై నిజాయితీగా వ్యవహరించాలన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గుండె ఆపరేషన్ అనంతరం మోదీ షరీఫ్ తో ఫోన్లో మాట్లాడారాని ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారని గుర్తు చేశారు. గత డిసెంబరులో మోదీ అకస్మాత్తుగా లాహోర్‌ను సందర్శించి, పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళిన విషయాన్ని పారికర్ ప్రస్తావించారు. అయితే పాక్ పఠాన్ కోట్ దాడి విషయంలో సహకరించలేదని అన్నారు.
Advertisement
Advertisement