manohar parrikar
-
ఇక బీజేపీకి గుడ్ బై: మాజీ సీఎం తనయుడు
పనాజీ(గోవా): తాను ఆశించిన పనాజీ అసెంబ్లీ స్థానంలో బీజేపీ సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక తాను బీజేపీలో కొనసాగలేనంటూ శుక్రవారం తన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. అదే సమయంలో పనాజీ స్థానం నుంచే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీగా దిగుతానని ప్రకటించారు. కాగా, గత కొన్ని రోజులుగా పనాజీ స్థానాన్ని ఆశిస్తున్న ఉత్పల్ పారికర్‌కు బీజేపీ గురువారమే షాక్ ఇచ్చింది. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇవ్వడంతో ఉత్పల్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. అయితే పనాజీ కాకుండా బీజేపీ అధిష్టానం సూచించిన రెండు స్థానాల నుంచి పోటీ చేయడానికి ఉత్పల్ నిరాకరించారు. అదే సమయంలో ఇక ఎంతో ముచ్చటపడుతున్న పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా దిగాలనే యోచనలోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఉత్పల్ వెల్లడించారు. ఇక్కడ చదవండి: ‘ఆ సీటు వేరే వాళ్లకి ఇచ్చాం.. మరో ప్లేస్ ఎన్నుకోండి’ -
‘ఆ సీటు వేరే వాళ్లకి ఇచ్చాం.. మరో ప్లేస్ ఎన్నుకోండి’
పనాజీ: గోవా మాజీ సీఎం దివంగత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్‌కు నిరాశ తప్పలేదు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి పాత నియోజకవర్గం పనాజీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పదే పదే అభ్యర్థించినప్పటికీ ఉత్పల్ పారికర్‌కు ఆ సీటు దక్కలేదు. ఈరోజు(గురువారం)బీజేపీ విడుదల చేసిన గోవా అసెంబ్లీ తొలి దశ జాబితాలో పనాజీ స్థానం కూడా ఉంది. అయితే ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్‌సెర్రెట్‌కు కట్టబెట్టారు. 34 మందితో విడుదల చేసిన తొలి లిస్టులో పనాజీ స్థానాన్ని అటానాసియోకు ఇవ్వడంతో ఉత్పల్ పారికర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. కాగా, ఉత్పల్ పారికర్‌కు పనాజీ స్థానాన్ని ఇవ్వడం కుదరలేదని గోవా ఎలక్షన్ ఇన్చార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఆ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సి వచ్చిందని, అలాగనే పారికర్ ఫ్యామిలీని వదులుకోబోమని పేర్కొన్నారు. ‘మనోహర్ పారికర్ కుటుంబం.. తమతో చాలా సాన్నిహిత్యంగా ఉంటుంది. దాంతోనే పనాజీ స్థానం కాకుండా రెండు ఆప్షన్లు ఇచ్చాం. అందులో ఒక స్థానాన్ని ఉత్పల్ నిరాకరించారు. ఇంకో ఆప్షన్ మాత్రమే ఉంది. ఈ విషయంపై మేము ఆయనతో చర్చిస్తున్నాం. అందుకు ఉత్పల్ ఒప్పుకుంటాడనే అనుకుంటున్నాం’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. చదవండి: బీజేపీ ఇవ్వనంటోంది! పారికర్ కొడుక్కి ఇతర పార్టీల నుంచి ఆఫర్లు.. -
బీజేపీ ఇవ్వనంటోంది! ఇతర పార్టీల నుంచి ఆఫర్లు..
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గోవా దివంగత సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. అయితే పనాజీ అసెంబ్లీ స్థానం ఆయనకు కేటాయించే విషయంపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉత్పల్ పారికర్‌కు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఉత్పల్ పారికర్ పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే (కాంగ్రెస్, ఆప్, తృణమూళ్)తో పాటు ప్రాంతీయ పార్టీ గోవా ఫార్వార్డ్ సైతం ఆయనకు మద్దతు ఇస్తాయని తెలిపారు. ఆయనకు పోటీగా అభ్యర్థిని కూడా నిలబెట్టవని పేర్కొన్నారు. ఇలా చేయడం మాజీ సీఎం మనోహర్ పారికర్‌కు నిజమైన నివాళి ఇవ్వడం అవుతుందని తెలిపారు. మరోవైపు ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఉత్పల్ ఆప్‌లో చేరుతానంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అందరి చూపు పానాజీ అసెంబ్లీ స్థానంపై పడింది. అయితే దివంగత సీఎం కుమారుడికి బీజేపీ.. పనాజీ టికెట్ కేటాయిస్తుందా? లేదా? అని ఇప్పటికే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం మాజీ సీఎం తనయుడు లేదా మరో ఇతర నేతకు చెందిన వారైతే బీజేపీ టికెట్ ఇవ్వదని గోవా అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ అధిష్టానం సైతం టికెట్ ఇవ్వలేమని సంకేతాలు పంపించింది. If #UtpalParrikar contests Independent frm Panaji seat,I propose all non-BJP parties including @AamAadmiParty @INCIndia @AITCofficial @Goaforwardparty shd support his candidature & not field a candidate against him. This will be a true tribute to ManoharBhai!#Goa pic.twitter.com/q0w96MxZk9 — Sanjay Raut (@rautsanjay61) January 17, 2022 -
‘ఇంకా కోలుకోలేదు.. తర్వాత చూద్దాం’
పణజి : పదవిలో ఉన్న రాజకీయనాయకుడు చనిపోతే.. ఆ స్థానంలో నిర్వహించే బై ఎలక్షన్లో సదరు నాయకుడి వారసులు పోటీ చేయడం సాధరణంగా జరిగే విషయం. కానీ దివంగత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ పెద్ద కుమారుడు ఉత్పల్ పరీకర్ మాత్రం పోటీ చేసేందుకు తాను సిద్ధంగా లేనంటున్నాడు. పరీకర్ మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఉత్పల్ ‘మా నాన్న చనిపోయిన బాధ నుంచి ఇంకా కోలుకోలేదు. రాజకీయాల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సమయం వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతానికైతే దీనీ ప్రస్తుతం దీని గురించి నా మనసులో ఎలాంటి ఆలోచన లేద’ని తెలిపారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం పరీకర్ మరణించిన తర్వాత ఆయన కుమారులిద్దరిని పార్టీలో చేరమని కోరిందట. దేశరాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావి, బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్(63) ఈ నెల 17న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్న పరీకర్ ఆదివారం పణజిలోని డౌనాపౌలాలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. -
పరీక్షలో నెగ్గిన సావంత్
పణజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 15 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మొత్తం సభ్యుల సంఖ్య 40 మంది కాగా.. ప్రస్తుతం అసెంబ్లీలో 36 మంది ఉన్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించగా, మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం సావంత్ మాట్లాడుతూ.. పాజిటివ్‌గా ఉండాలి అనే పారికర్ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరు మనసులో ఉంచుకోవాలని కోరారు. విశ్వాస పరీక్ష కోసం గవర్నర్‌మృదులా సిన్హా ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. 11 మంది బీజేపీ, ముగ్గురు చొప్పున గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. 14 మంది కాంగ్రెస్, ఒక ఎన్సీపీ ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఓటేశారు. -
చితి బూడిద చల్లారే వరకు కూడా ఆగలేదు..
ముంబై : గోవాలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ఆడిన రాజకీయ క్రీడ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేసిందని ఆ పార్టీ మిత్రపక్షం శివసేన విమర్శించింది. అధికారం కోసం సిగ్గుమాలిన చర్యకు పాల్పడిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు శివసేన అధికార పత్రిక సామ్నాలో కథనం ప్రచురించింది. ‘ మనోహర్ పరీకర్ భౌతికకాయంపై ఉంచిన పువ్వులు వాడనే లేదు. ఆయన చితాభస్మం చల్లారనూ లేదు. కానీ అదే సమయంలో బీజేపీ నీచ రాజకీయ క్రీడకు తెరతీసింది. అధికార వ్యామోహంతో అర్ధరాత్రి కొత్త సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించింది. మరో నాలుగు గంటలు ఆగితే ఏం పోయేది. బీజేపీ వ్యవహరించిన విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ప్రమాదకరం’ అని బీజేపీ తీరును ఎండగట్టింది. చదవండి : రాత్రి 2గంటలకు సీఎంగా ప్రమాణమా? బీజేపీ మాట తప్పింది.. డిప్యూటీ సీఎంల నియామకం గురించి ప్రస్తావిస్తూ... ‘నాలుగేళ్ల క్రితం బీజేపీ ఉప ముఖ్యమంత్రులుగా పదవులు ఇవ్వమని చెప్పిన బీజేపీ.. అధికారం కోసం మాట తప్పింది. కేవలం 19 ఎమ్మెల్యేలలో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా నియమించింది. నేటికీ మనోహర్ పరీకర్ మరణాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి సంతాప సూచకంగా జాతీయ జెండాను హాఫ్ మాస్ట్ చేసే ఉంచారు. కనీసం అలా ఎందుకు చేస్తారోనన్న విషయం గురించి బీజేపీ వాళ్లకు కాస్తైనా అవగాహన ఉందో లేదో’ అంటూ సామ్నాలో శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా కేంద్రం, రాష్ట్రంలో తమతో అధికారం పంచుకున్న శివసేన ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి బీజేపీ నిరాకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మిత్రపక్షంపై విమర్శలు సంధిస్తున్న శివసేన...సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆ పార్టీతో జట్టు కట్టడం విశేషం. ఇక పదవిలో ఉండగానే గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగుతుండగానే మరోపక్క బీజేపీ అధిష్టానం గోవా ముఖ్యమంత్రి ఎంపిక, అందుకు కావాల్సిన మద్దతును మిత్రపక్షాల నుంచి కూడగట్టేందుకు జోరుగా మంతనాలు జరిపింది. తమ పార్టీ నేత, అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి.. సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) ఎమ్మెల్యే సుదిన్ దివాలికర్, గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్‌లకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశమిచ్చింది. దీంతో అధికార పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రాత్రి 2గంటలకు సీఎంగా ప్రమాణమా?
సాక్షి, న్యూఢిల్లీ : గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగుతుండగానే మరోపక్క బీజేపీ అధిష్టానం గోవా ముఖ్యమంత్రి ఎంపిక, అందుకు కావాల్సిన మద్దతును మిత్రపక్షాల నుంచి కూడగట్టేందుకు జోరుగా మంతనాలు జరపుతూ వచ్చింది. బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ గత రాత్రి 9 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని, అందుకు ఆయనకు మెజారిటీ సభ్యుల బలం ఉందని ప్రకటన వెలువడింది. ఇంతలో తమకు ముఖ్యమంత్రి పదవి కావాలంటే తమకే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ ఇంతకాలం బీజేపీ సీఎం మనోహర్ పర్రీకర్‌కు మద్దతిస్తూ వచ్చిన గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యేలు, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతో గోవా ప్రభుత్వంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోపక్క రాష్ట్ర అసెంబ్లీలో అత్యధిక సీట్లు కలిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు గవర్నర్‌ను కలుసుకొని ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇంతలో మహారాష్ట్ర గోమంతక్ పార్టీ నుంచి ఇద్దరు సభ్యులు వచ్చి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి, ఆ ఇద్దరితో బీజేపీ శాసన సభ్యుల సంఖ్య 12 నుంచి 14 చేరుకుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్యతో సమానం అవుతుంది. దాంతో మళ్లీ రాత్రి ఒంటి గంట వరకు మంతనాలు కొనసాగాయి. గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లకుగాను మనోహర్ పర్రీకర్, అంతకుముందు ఓ బీజేపీ సభ్యుడి మృతి, అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు బీజేపీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో సభ్యుల సంఖ్య 36కు పడిపోయింది. కాంగ్రెస్‌కు 14, బీజేపీకి 12, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి మూడు, గోవా ఫార్వర్డ్ బ్లాక్‌కు మూడు, ముగ్గురు స్వతంత్ర సభ్యులు, ఒక్క ఎన్సీపీ సభ్యుడు ఉన్నారు. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ బీజేపీ త్వరగా పావులు కదిపి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్‌తోపాటు ముగ్గురు స్వతంత్య్ర సభ్యుల మద్దతును సేకరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్‌ను బీజేపీ సొంత రాష్ట్రానికి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది. మారిన పరిస్థితుల్లో తమకే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ బీజేపీ రెండు మిత్రపక్షాలు డిమాండ్ చేయడంతో గోవాలో అనిశ్చితి పరిస్థితి ఏర్పడుతుందని, ఖాళీగా ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే వరకు అసెంబ్లీని సుషుప్త చేతనావస్థలో ఉంచాల్సి వస్తుందని ఊహాగానాలు చెలరేగాయి. చివరకు ఆ రెండు పార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులకు అంగీకరించడంతో సంధి కుదిరింది. దాంతో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ సీఎంగా ప్రమాణం చేయగా, ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు, 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. అతి చిన్న రాష్ట్రమైన గోవాకు ఇద్దరు డిప్యూటి ముఖ్యమంత్రులు ఉండడం విశేషం. తుది లెక్కల ప్రకారం మిత్రపక్షాలను కలుపుకొని అసెంబ్లీలో బీజేపీ బలం 21కి చేరుకోగా, ఎన్సీపీ సభ్యుడిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలం15 వద్ద స్థిరంగా ఉంది. -
ముగిసిన మనోహర్ పారికర్ అంత్యక్రియలు
-
పరీకర్‌కు తుది వీడ్కోలు
పణజి: క్లోమగ్రంథి కేన్సర్‌తో మృతిచెందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ అంత్యక్రియలు సోమవారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు, పణాజి వచ్చిన ప్రధాని మోదీ పరీకర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆ తరువాత ఆయన కుటుంబ సభ్యుల్ని కలుసుకుని పరామర్శించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పరీకర్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. నూతన ముఖ్యమంత్రి ఎంపిక కోసం ఆదివారం రాత్రే గోవా చేరుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కూడా పరీకర్‌కు చివరిసారి నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. పరీకర్ పెద్ద కొడుకు ఉత్పల్ ఆయన చితికి నిప్పంటించారు. తరలివచ్చిన అభిమానులు పణజిలోని కళా అకాడమీ నుంచి దహనసంస్కారాలు నిర్వహించిన మీరామర్ బీచ్ వరకు సాగిన అంతిమయాత్రలో వేలాది మంది పరీకర్ మద్దతుదారులు, అభిమానులు పాల్గొన్నారు. అంతకుముందు, బీజేపీ కార్యాలయంలో ఉంచిన ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు సామాన్య ప్రజలు, బీజేపీ కార్యకర్తలు అశేష సంఖ్యలో తరలివచ్చారు. త్రివర్ణ పతాకంలో చుట్టిన పరీకర్ పార్థివ దేహాన్ని చూడగానే ఆయన అభిమానలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంతిమయాత్రకు ముందు బీజేపీ కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాలు జనంతో రద్దీగా మారాయి. కళా అకాడమీ ముందు కూడా ప్రజలు మత విశ్వాసాలకు అతీతంగా బారులు తీరి పరీకర్‌కు నివాళులర్పించారు. ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పరీకర్ మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. అంత్యక్రియలు నిర్వహిస్తున్న పరీకర్ కొడుకు గోవా కొత్త సీఎంపై ఉత్కంఠ! రాత్రి 11 గంటలకు సీఎంగా ప్రమోద్ ప్రమాణం చేస్తారన్న బీజేపీ అంతలోనే ఆ నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటన మిత్రపక్షాలతో ఇంకా చర్చలు సాగుతున్నాయని వెల్లడి పణజి: గోవాకు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులు కానున్నారనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్త సీఎంగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ సోమవారం రాత్రే 11 గంటలకు ప్రమాణంచేస్తారని బీజేపీ ప్రకటించింది. కొద్దిసేపటికే ప్రమాణస్వీకారాన్ని విరమించుకుంటున్నామని తెలిపింది. సోమవారం తెల్లవారుజామున నుంచి కేంద్రమంత్రి గడ్కరీ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు సంకీర్ణ ప్రభుత్వంలోని గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)లతో చర్చలు జరిపారు. సీఎం ఎవరనే దానిపై ఏకాభిప్రాయం కుదరలేదని గడ్కరీ చెప్పారు. సోమవారం సాయంత్రం తర్వాత కొద్దిసేపటికే తదుపరి సీఎంగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ఎంపికయ్యారనీ, జీఎఫ్‌పీ చీఫ్ విజయ్ సర్దేశాయ్, ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్ ధవలికర్‌లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తున్నామని బీజేపీ వెల్లడించింది. ఈ ఒప్పందానికి కూటమి పార్టీలు ఒప్పుకున్నందున రాత్రి 11 గంటలకు ప్రమోద్ చేత గవర్నర్ మృదులా సిన్హా కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారంది. మళ్లీ ఏమైందోగానీ, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. మిత్రపక్షాలతో ఇంకా చర్చలు జరుగుతున్నందున రాత్రి 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండదని డిప్యూటీ స్పీకర్ మైఖేల్ ప్రకటించారు. అంతకుముందు సోమవారం తెల్లవారుజామున గోవాకు చేరుకున్న నితిన్ గడ్కరీ, కొత్త సీఎం ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు, ఎంజీపీ, జీఎఫ్‌పీ నేతలతోనూ చర్చించారు. గోవా అసెంబ్లీలో మొత్తం సీట్లు 40 కాగా, 14 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవాకు నూతన ముఖ్యమంత్రిని బీజేపీ ప్రకటించగా, మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం గోవా అసెంబ్లీలో తమదే అతిపెద్ద పార్టీ అయినందున ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్ మృదులా సిన్హాను సోమవారం కోరారు. ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కావెల్కర్ నేతృత్వంలోని 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యల బృందం సోమవారం గవర్నర్‌ను కలిసింది. ఈ విషయంపై తర్వాత సంప్రదిస్తానని గవర్నర్ తమతో చెప్పారని చంద్రకాంత్ చెప్పారు. -
విలక్షణ వ్యక్తిత్వం
ఎన్నికల మహా సంగ్రామానికి బీజేపీ సన్నద్ధమవుతున్న వేళ ఆ పార్టీ నాయకశ్రేణిలో ముఖ్యుడ నదగ్గ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆదివారం కన్నుమూశారు. ఆయన్ను కేన్సర్ మహ మ్మారి కొంచెం కొంచెంగా ఎలా కబళిస్తున్నదో మీడియా ద్వారా అప్పుడప్పుడు ఆయన్ను చూస్తున్న వారందరికీ అర్థమవుతూనే ఉంది. పరీకర్‌కు తీవ్ర అనారోగ్యంగా ఉన్నా, దానివల్ల ఆయనకు ఎంతో అసౌకర్యంగా ఉంటుందని తెలిసినా బీజేపీ అధినాయకత్వం ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేయకపోవడం... ఆయన మరణించిన 24 గంటల తర్వాత కూడా కొత్త నాయకుణ్ణి నిర్ణయించలేక పోవడం గమనిస్తే పరీకర్ ప్రాముఖ్యత తెలుస్తుంది. గర్వాతిశయాలు లేకపోవడం, అధికార దర్పం ఎన్నడూ ప్రదర్శించకపోవడం, సామాన్యులతో సైతం ఆదరణగా మాట్లాడటం పరీకర్ ప్రత్యేక తలు. ఆయన తరచుగా స్కూటర్‌పై రివ్వుమంటూ వెళ్లడం గోవా వాసులకు పరిచిత దృశ్యం. తాను రక్షణమంత్రిగా ఉన్న సమయంలోఒక వేడుకకు హాజరయ్యే పాత్రికేయులు బూట్లు ధరించి రావా లని తన మంత్రిత్వ శాఖ అధికారులు షరతు విధించినట్టు తెలుసుకుని, తానే ఆవేడుకకు చెప్పులు ధరించి వచ్చిన తీరు పరీకర్ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. పాఠశాలలో చదువుకుంటున్నప్పుడే ఆరె స్సెస్ భావాలు ఒంటబట్టించుకున్న పరీకర్ చివరివరకూ ఆ భావాలతోనే ప్రయాణించినా రాజ కీయాల్లో అందరివాడిగా, అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇది అసా ధారణమనే చెప్పాలి. తొలిసారి గోవా ముఖ్యమంత్రిగా 2000 సంవత్సరంలో బాధ్యతలు స్వీక రించి, వరసగా నాలుగు దఫాలు ఆ పదవిలో కొనసాగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించాక ఆయన 2017 వరకూ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే గోవా రాజకీయాల్లో ఆయన లేకపోవడం బీజేపీని ఎంత నష్టపరిచిందో ఆ తర్వాత పార్టీ అధినాయ కత్వానికి అర్థమైంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాలతో మెజారిటీ పక్షంగా అవతరించగా, బీజేపీ 13 స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఆ వెంటనే ఆగమేఘా లమీద పరీకర్‌ను కేంద్ర నాయకత్వం గోవాకు పంపింది. పరీకర్ వచ్చీ రావడంతోనే రాష్ట్రంలోని చిన్న చిన్న పార్టీలతో సమావేశమై వాటిని బీజేపీ ఛత్రఛాయలోకి తీసుకొచ్చి అక్కడ కూటమి ప్రభు త్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే మెజారిటీ స్థానాలు లభించిన కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పా టుచేసే అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు ఎదురయ్యాయి. సీఎంగా ఆయన పనితీరు విలక్షణ మైనది. ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖ చూస్తున్నప్పుడు విమాన ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిం చడం దీనికి ఉదాహరణ. అలా తగ్గించడం వల్ల ఆదాయం పడిపోతుందని, అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అధికారులు వారించినా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ ఇంధనం కోసం గోవాకు రాత్రి వేళల్లో భారీగా విమానాలు రావడం మొదలై ప్రభుత్వ ఆదాయం మూడు రెట్లు పెరిగింది. గోవాలో బహుళ మతాలు, తెగలు ఉన్నాయి. అక్కడి జనాభాలో 27 శాతంమంది క్రైస్తవులు, 9 శాతం ముస్లింలు. పైగా మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)వంటి బలమైన ప్రాంతీయ పార్టీ లున్నాయి. అలాంటిచోట ఆరెస్సెస్ భావాలను వ్యాప్తి చేయడం, ఆ సంస్థను పటిష్టపరచడం సులభం కాదు. కానీ పరీకర్ ఎంతో చాకచక్యంతో, నైపుణ్యంతో ఆ పని చేయగలిగారు. రాజకీ యాల్లోకి ప్రవేశించాక బీజేపీని సైతం ఆ విధంగానే తిరుగులేని రాజకీయ శక్తిగా రూపొందించారు. దాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అంతేకాదు... బహుళ మతాలవారున్న నియోజకవర్గం నుంచి 1994 మొదలుకొని ప్రతి ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధిస్తూ వచ్చారు. ఈ కారణాలన్నిటి వల్లా జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. 2014లో జరిగే సార్వత్రిక ఎన్ని కలకు బీజేపీ ప్రచార సారథ్యం ఎవరు స్వీకరించాలన్న ప్రశ్న తలెత్తినప్పుడు నరేంద్రమోదీ పేరును ప్రతిపాదించింది పరీకరే. బీజేపీ జాతీయ ఎన్నికల ప్రచార సంఘం చైర్మన్‌గా తనకొచ్చిన ఈ అవ కాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుని ఎన్నికల తర్వాత మోదీ ప్రధాని పీఠం ఎక్కారు. గోవా వంటి ఒక చిన్న రాష్ట్రం నుంచి వచ్చిన నాయకుడు కేంద్రంలో కీలకమైన రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించడం మాటలు కాదు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులతో ముడిపడి ఉండే రక్షణ కొనుగోళ్ల కారణంగా ఆ శాఖను నిర్వహించడం కత్తి మీద సాము. ఆ శాఖ బాధ్యతలు తీసుకోవడానికి ఎంతటి ఉద్దండులైనా జంకుతారు. ఒకవేళ ఎవరైనా ఉత్సాహం చూపినా ప్రధానిగా ఉన్నవారు ఎన్నో విధాల ఆలోచించిగానీ వారికి ఆ శాఖ అప్పగించరు. కానీ నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టాక రక్షణ శాఖ వ్యవహారాలు చూడటానికి మనోహర్ పరీకర్ తగినవారని నిర్ణయించారంటేనే ఆయన సచ్చీలత, నిజాయితీ వెల్లడవుతాయి. ఇప్పుడు ఎంతో వివాదా స్పదంగా మారిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో కూడా పరీకర్ భిన్నంగా ఆలో చించారని చెబుతారు. సుఖోయ్–30 యుద్ధ విమానాలైతే మన వైమానిక దళ తక్షణావసరాలు తీరుస్తాయని, త్వరగా సమకూర్చుకోవడం వీలవుతుందని, రఫేల్‌తో పోలిస్తే ఆర్థికంగా కూడా అవి మెరుగని ఆయన భావించారంటారు. రక్షణమంత్రిగా ఆయన సైనిక దళాల సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడ్డారు. మన ఆయుధ సంపత్తి ఆధునీకరణకు కృషి చేశారు. సైనిక దళాలు ఎప్పటినుంచో కోరుకుంటున్న ‘వన్ ర్యాంక్–వన్ పెన్షన్’ విధానం ఆయన హయాంలోనే అమల్లోకొచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో పరీకర్‌ను మైనింగ్ స్కాం వంటి వివాదాలు కూడా చుట్టుముట్టకపోలేదు. కానీ విభిన్నంగా ఆలోచించడం, వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడం, స్వతంత్రంగా వ్యవహరించడం, ప్రత్యర్థులతో సైతం అరమరికల్లేకుండా మాట్లాడటం ఆయన విశిష్టత. కనుకనే మనోహర్ పరీకర్ స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ అంత సులభం కాదు. -
మనోహర ‘ప్యారి’కర్
ఉక్కునరాలు... ఉక్కుకండరాలు... అతడే ఓ సైన్యం. పాలనలో అతడో చైతన్యం. నిత్యనూతన స్రవంతి. ప్రజల్లో మని షిగా ప్రజల్లో తిరుగుతూ... అతి సామా న్యుడు అసామాన్యుడిగా నిలిచాడు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడు. అస్థిరతకు చిరునామాగా నిలిచిన గోవా రాజకీ యాల్లో సుస్థిర నినాదాన్ని మార్మోగించాడు. ప్రజలకు సరికొత్త పాలనను అందించి బీజేపీ ప్రభుత్వాల్లో నవశకం పూరించాడు. ఆయనే పరీకర్. మనోహర్ పరీకర్ డిసెంబర్ 13, 1955 గోవాలోని ముపాసలో జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరి అంచలంచెలుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ప్రమోషన్ పొందారు. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే తిరిగి ఆర్ఎస్ఎస్లో సంఘ్ చాలక్‌గా వ్యవహరించారు. 26 ఏళ్లకే ఆర్ఎస్ఎస్లో కీలకనేతగా ఎదిగారు. గోవాలో రామజన్మభూమి ఉద్యమాన్ని ఉధృ తం చేశారు. అద్వానీ రథయాత్రకు గోవాలో నీరాజనం పలికారు. బీజేపీకి జవజీవాలు నింపారు. విభిన్న సంస్కృతుల సంగమమైన గోవాలో కాషా యం జెండా రెపరెపలాడేలా చేయడంలో పరీకర్ది ముఖ్యభూమిక. నాలుగుసార్లు గోవా సీఎంగా వ్యవహరించిన పరీకర్ 2000 సంవత్సరంలో తొలిసారి, 2017లో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గోవాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క యువతి లక్ష రూపాయలు పొందేలా పథకాన్ని ప్రారంభించి... అక్కడి మహిళా లోకానికి పెద్దన్నగా నిలిచాడు. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ పరీ కర్. ఎన్నో హంగులు, ఆర్భాటాలతో ఊదరగొడుతున్న నాయకాగణానికి భిన్నంగా పారికర్ కన్పిస్తారు. హాఫ్ హ్యాండ్ షర్ట్ ధరించి, సాధారణ దుస్తులతో సగటు భారతీయుడిని ప్రతిబింబిస్తారు. మనోహర్ పరీకర్ ముఖ్యమంత్రి అయినా, తన సొంత నివా సంలోనే ఉండేవారు. అత్యాధునిక వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ... ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వినియోగించే ఇన్నోవా కారునే వినియోగించేవారు. విమాన ప్రయాణాలు చేసేటప్పుడు సాధారణ ప్రయాణీకుల మాదిరిగానే ట్రావెల్ చేసేవారు. 63 ఏళ్ల వయసులో సైతం రోజుకు 16 నుంచి 18 గంటలకు పనిచేసేవారు. గోవా మిస్టర్ క్లీన్‌గా ఆయనను అక్కడి ప్రజలు పిలుస్తారు. అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపారు. ప్రధానిగా నరేంద్రమోదీని సమర్థించి... దేశానికి బలమైన నాయకత్వం అవసరమని నినదించారు. పారికర్ సింప్లిసిటీ గురించి చెప్పడానికి ఇక్కడో ఉదంతాన్ని చెప్పాల్సి ఉంటుంది. అది గోవా పనాజీ ప్రాంతం... ఒక యాభై ఏళ్ల వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హెల్మెట్ పెట్టుకొని స్కూట ర్‌పై గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో వెనుక నుంచి 25 ఏళ్ల యువకుడు ఆపకుండా హారన్ కొడుతున్నాడు. డీఎస్పీ కొడుకునని.. ఎందుకు నాకు దారివ్వరంటూ ప్రశ్నించాడు. అయితే ఇంతలో హెల్మెట్ తీసి ఆ వ్యక్తి ముందుకొచ్చాడు. నువ్వు డీఎస్పీ కొడుకువైతే... ఈ రాష్ట్రానికి నేను సీఎంనంటూ చెప్పడంతో తెల్లబోయాడు ఆ కుర్రాడు. గోవా ముఖ్యమంత్రి, దేశ రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఆ వ్యక్తి. అసెంబ్లీకి స్కూటర్ మీద వెళతారు. ప్రోటోకాల్ ఉండదు. పోలీస్ కేస్లలో జోక్యం ఉండదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంటే... యావత్ గోవా కంట కన్నీరుపెట్టింది. గోవా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన మనోహర్ పరీకర్... దేశ రక్షణ మంత్రిగా కూడా చరిత్ర సృష్టించారు. భారత రక్షణ దళాలకు ప్రత్యే కంగా వినియోగించే... ఒక్కో జత షూను ఇజ్రా యెల్ నుంచి 25,000కు దిగుమతి చేసుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పరీకర్... కొనుగోలు వెనుక వాస్తవాలను నిర్ధారణ చేసుకొని... ఆ తర్వాత భారత కంపెనీ నుంచి నేరుగా రూ‘‘ 2,200కు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వ పెద్దలు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. తన కేబినెట్లో ఉన్న అరుదైన మంత్రి పరీకర్ అని, వజ్రసమానుడంటూ ప్రధాని మోడీ నుంచి కితాబు అందుకున్నారు. అందుకే తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరీకర్‌కు రక్షణ మంత్రి బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ తాను గోవాపైనే ప్రేమ చూపించారు. గోవా ప్రజలంటే అమితమైన ప్రేమ. గోవా ప్రజల సేవ లోనే ప్రాణాలు అర్పించారు. పురిఘళ్ల రఘురామ్ వ్యాసకర్త బీజేపీ సీనియర్ నాయకుడు ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com -
గోవా కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్
-
ముగిసిన పరీకర్ అంత్యక్రియలు
-
గోవా కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్!
పనజి : బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్(63) అంత్యక్రియలు ముగిశాయి. గోవాలోని మిరామిర్ బీచ్‌లో అధికారిక లాంఛనాలతో వేలాది మంది ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు పరీకర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్ దేశ రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరొందిన పరీకర్ మరణంతో గోవాలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిగా కాంగ్రెస్ నేతలు గవర్నర్ మృదులా సిన్హాకు విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అమిత్ షా, నితిన్ గడ్కరీ బీజేపీ సహా మిత్ర పక్షాల ఎమ్మెల్యేలతో సమావేశమైనట్లు సమాచారం. ఈ క్రమంలో గోవా కొత్త సీఎంగా శాసన సభాపతి ప్రమోద్ సావంత్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) ఎమ్మెల్యే సుదిన్ దివాలికర్, గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్‌లకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి గవర్నర్ మృదులా సిన్హా వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం. -
గోవా కొత్త సీఎం.. ఎమ్మెల్యే కాని వ్యక్తేనా?
పనాజీ: గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ కన్నుమూయడంతో రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సంకీర్ణ కూటమికి చెందిన 12మంది ఎమ్మెల్యేలు ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఎమ్మెల్యే కాని వ్యక్తినే కొత్త సీఎంగా ఎన్నుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ 12 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన వారు కాగా, మరో ముగ్గురు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), ఇంకో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇతర ముగ్గురు బీజేపీకి చెందిన వారు ఉన్నారు. ఎమ్మెల్యే కాని వ్యక్తి సీఎం అయితే.. ఆరు నెలల్లోపు శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఆరు నెలల్లోపు అంటే అప్పటికీ లోక్‌సభ ఎన్నికలు ముగుస్తాయి. మరోవైపు గోవా సీఎం రేసులో పలువురు ముఖ్య నేతల పేర్లు వినిపిస్తున్నాయి. నార్త్ గోవా ఎంపీ శ్రీపాద నాయక్, రాజ్యసభ సభ్యుడు వినయ్ టెండుల్కర్, గోవా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్, ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే తదితరులు తదుపరి సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. పరీకర్ మృతితో గోవాలో ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా రాజకీయ పార్టీల మంతనాలు ముమ్మరమయ్యాయి. ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యేలు, మిత్రపక్ష ఎమ్మెల్యేలతో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ హోటల్లో సమావేశమవ్వగా.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం కల్పించాలని, బీజేపీకి మిత్రపక్షాల మద్దతు లేకపోవడంతో.. ఆ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం లేదని గవర్నర్‌ను కోరింది. -
‘ఆ చెప్పులు ధరించడం ఇబ్బందే’
పణజి : నిరాడంబర సీఎంగా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడంబరాలకు దూరంగా ఉండే పరీకర్ గురించి పలు ఆసక్తికర అంశాలు ప్రచారంలో ఉన్నాయి. పరీకర్ ఇతర మంత్రుల లాగా సూటు బూటు ధరించేవారు కారు. కొల్హాపూర్ చెప్పులు, సాధరణ వస్త్రధారణనే ఇష్టపడేవారు. సీఎం పదవిలో ఉండి కూడా స్కూటర్ మీదనే తిరిగేవారు. రక్షణశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాజ్‌దీప్ సర్దేశాయ్కిచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాల గురించి మాట్లాడుతూ.. ‘పాశ్చత్య వస్త్ర ధారణ నాకు అంతగా నప్పదు. కానీ గత రక్షణశాఖ మంత్రలు కంటే నా వస్త్రధారణ బాగానే ఉంటుంది. ఇకపోతే డిఫెన్స్ మినిస్టర్‌గా ఉంటూ కొల్హాపూర్ చెప్పులు ధరించడమే కాస్తా ఇబ్బందికరంగా ఉంద’ని తెలిపారు. అంతేకాక గోవా సీఎంగా ఉన్నప్పుడు స్కూటర్ మీదనే తిరుగుతుండేవారు పరీకర్. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘మీరు ఎప్పుడూ స్కూటర్ మీదనే తిరుగుతారా’ అని జనాలు నన్ను అడుగుతారు. కానీ ఎల్లకాలం ఇలానే తిరగలేను. ఎందకంటే నా మైండ్‌లో ఎప్పడు పని గురించిన ఆలోచనలే ఉంటాయి. నేను స్కూటర్ నడిపేటప్పుడు నా మైండ్ మరో చోట ఉంటుందనుకొండి.. అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా. అందుకే స్కూటర్ నడపాలంటే నాకు భయం’ అని తెలిపారు పరీకర్. మనోహర్ పరీకర్ అంత్యక్రియలను పణజిలోని మిరమార్ బీచ్‌లో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు నిర్వహిస్తారని సీఎంఓ ప్రతినిధి ఒకరు తెలిపారు. పరీకర్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా హాజరయ్యే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం పరీకర్ మృత దేహాన్ని ప్రజల సందర్శనార్థం బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి పణజీ కళా అకాడమీకి తరలించారు. -
‘మానవ మేధస్సు ఏ వ్యాధినైనా జయిస్తుంది’
పణజి : నిరాండబరతకు, వృత్తిపట్ల అంకితభావానికి పెట్టింది పేరుగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, గోవా సీఎం మనోహర్ పరీకర్ ఆదివారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ లాంటి మహమ్మారి తన మీద దాడి చేసినప్పుడు కూడా పరీకర్ ఏ మాత్రం కుంగిపోలేదు. పైపెచ్చు చికిత్స తీసుకుంటూనే సీఏంగా రాష్ట్రానికి సేవలందించారు. బలమైన సంకల్పం ఉంటే వ్యాధి మనిషిని ఏమి చేయలేదని నిరూపించారు పరీకర్. మనిషి మేధస్సు ఏ రోగాన్నైనా జయిస్తుందంటూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన పరీకర్ అందుకు తానే ఉదాహరణగా నిలిచారు. ఓ వైపు క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటూనే.. మరోవైపు తన విధులను సమర్థవంతంగా నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచారు పరీకర్. (నిరాడంబర సీఎం ఇకలేరు) Human mind can overcome any disease. #WorldCancerDay — Manohar Parrikar (@manoharparrikar) February 4, 2019 2018, ఏప్రిల్‌లో పరీకర్ ఆరోగ్యం తొలిసారి క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయనకు ప్యాంక్రియాటిక్ కేన్సర్ బాగా ముదిరినట్లు నిర్ధారణ అయింది. దీంతో అమెరికాకు వెళ్లిన పరీకర్ అక్కడే చికిత్స తీసుకున్నారు. అనంతరం 2018, జూన్‌లో జరిగిన గోవా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరి 30న గోవా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు పరీకర్. ఈ సందర్భంగా ‘గోవా ముఖ్యమంత్రిగా నా విధులను నిజాయతీగా, నిబద్దతో నిర్వహిస్తానని ఈ రోజు మరో సారి ప్రమాణం చేస్తున్నానం’టూ బడ్జెట్ స్పీచ్ సందర్భంగా పేర్కొన్నారు పరీకర్. -
పరీకర్ మృతి పట్ల ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: గోవా సీఎం మనోహర్ పరీకర్ మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక నిజాయితీ గల నాయకుడిని కోల్పోయిందని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన తన సందేశాన్ని పోస్ట్ చేశారు. కాగా, గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్న పరీకర్ ఆదివారం పణజిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దేశ రాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావిగా పేరున్న పరీకర్ మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస చీఫ్ రాహుల్ గాంధీతో సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. మరోవైపు పరీకర్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు(సోమవారం) జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. Deeply saddened to hear about the demise of Sri Manohar Parrikar garu. We have lost a true leader. My heartfelt condolences to the bereaved family. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 18, 2019 -
పారీకర్ ఇకలేరు
-
నిరాడంబర సీఎం ఇకలేరు
పణజి/న్యూఢిల్లీ: దేశరాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావి, బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్(63) కన్నుమూశారు. గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్న పరీకర్ ఆదివారం పణజిలోని డౌనాపౌలాలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. బీజేపీలో అందరివాడుగా గుర్తింపు పొందిన పరీకర్ నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, భారత రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. పరీకర్ ఆదివారం సాయంత్రం 6.40 గంటలకు కన్నుమూశారని గోవా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. పరీకర్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సహా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు పరీకర్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడుజాతీయ సంతాప దినంగా ప్రకటించింది. కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానున్న కేంద్ర కేబినెట్ పరీకర్ మృతిపై సంతాపం తెలపనుంది. అందరివాడుగా గుర్తింపు.. గోవా ముఖ్యమంత్రిగా 2000లో బాధ్యతలు చేపట్టిన పరీకర్ రాష్ట్రాన్ని బీజేపీకి కంచుకోటగా మార్చారు. ఆరెస్సెస్ నేపథ్యం ఉన్నప్పటికీ ఆధునికవాదిగా, అందరినీ కలుపుకుని ముందుకెళ్లే నేతగా ఆయన గుర్తింపు పొందారు. ప్రధాని మోదీ కేబినెట్లో రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ హవాయి చెప్పులు, నలిగిన చొక్కాతో సామాన్యుడిలా డీ–బ్లాక్‌కు రావడం ఆయనకే చెల్లింది. పరీకర్ సీఎంగా ఉంటేనే బీజేపీకి మద్దతు ఇస్తామని మహారాష్టవాదీ గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీతో పాటు స్వతంత్రులు చెప్పడం పరీకర్ పనీతీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అధికార ఆర్భాటం లేకుండా విమానాశ్రయానికి ఆటోలో రావడం, తన లగేజ్ తానే తీసుకురావడం వంటి నిరాడంబర జీవనశైలితో పరీకర్ ఆదర్శంగా నిలిచారు. 2013లో గోవాలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సదస్సుకు ముందు పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోదీ పేరును పరీకరే ప్రతిపాదించారు. గతేడాది బయటపడ్డ కేన్సర్ 2018, ఏప్రిల్‌లో పరీకర్ ఆరోగ్యం తొలిసారి క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయనకు ప్యాంక్రియాటిక్ కేన్సర్ బాగా ముదిరినట్లు నిర్ధారణ అయింది. దీంతో అమెరికాకు వెళ్లిన పరీకర్ అక్కడే చికిత్స తీసుకున్నారు. అనంతరం 2018, జూన్‌లో జరిగిన గోవా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే గతేడాది సెప్టెంబర్‌లో ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న అనంతరం పరీకర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో గోవా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పరీకర్, అనారోగ్యం కారణంగా చాలావరకూ తన ప్రైవేటు నివాసానికే పరిమితమయ్యారు. గత రెండ్రోజులుగా పరీకర్ ఆరోగ్యం విషమించడంతో వైద్యులు లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ను ఆయనకు అమర్చి చికిత్స అందజేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ‘రఫేల్’తో మసకబారిన ప్రతిష్ట.. 2016లో పరీకర్ రక్షణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం ఫ్రాన్స్‌తో రూ.58 వేల కోట్లతో 36 రఫేల్ ఫైటర్జెట్ల కొనుగోలుకు కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతకుముందు యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేసింది. దీంతో కాంగ్రెస్ కేంద్రంపై విమర్శల దాడిని పెంచింది. రక్షణశాఖతో పాటు ప్రధాని కార్యాలయం కూడా రఫేల్ ఒప్పందం విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వంతో సమాంతరంగా చర్చలు జరిపిందనీ, దీన్ని రక్షణశాఖ వ్యతిరేకించిందన్న ఓ నోట్‌ను ఉటంకిస్తూ ‘హిందూ’ పత్రికలో కథనం రావడంతో కలకలం చెలరేగింది. పరీకర్ బెడ్రూమ్లో రఫేల్ ఫైళ్లు ఉన్నాయని గోవా మంత్రి విశ్వజిత్ రాణే మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపులను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ విడుదల చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. దీంతో పరీకర్ స్పందిస్తూ.. నిజాలకు మసిపూసి మారేడుకాయ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోందని మండిపడ్డారు. నేడు పణజిలో అంత్యక్రియలు: మనోహర్ పరీకర్ అంత్యక్రియలను పణజిలోని మిరమార్ బీచ్‌లో సోమవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పరీకర్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా హాజరయ్యే అవకాశముందని భావిస్తున్నారు. నిజమైన దేశ భక్తుడు: పరీకర్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో నిబద్ధత, అంకితభావానికి పరీకర్ ప్రతీక అని కోవింద్ కొనియాడారు. పరీకర్ నిజమైన దేశభక్తుడని, గొప్ప పరిపాలకుడని మోదీ పేర్కొన్నారు. అసమాన నాయకుడైన పరీకర్‌ను పార్టీలకు అతీతంగా గౌరవిస్తారని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ గోవా ముద్దు బిడ్డల్లో ఒకరైన పరీకర్ తీవ్ర అనారోగ్యం తో ధైర్యంగా పోరాడారని అన్నారు. దేశం ఒక గొప్ప ప్రజాసేవకుడిని కోల్పోయిందని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు అన్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విచారం ప్రకటించారు. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ప్రస్తుతం గోవాలో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ), స్వతంత్రుల సాయంతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. తాజాగా పరీకర్ మరణం నేపథ్యంలో బీజేపీ కొత్త ముఖ్యమంత్రి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని శాసనసభా పక్షనేతగా ఎన్నుకుని గవర్నర్‌కు ఆ తీర్మానాన్ని అందజేయాలి. ఇందుకు గవర్నర్ మృదులా సిన్హా అంగీకరిస్తే కొత్త ముఖ్యమంత్రి చేత ఆమె ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఒప్పుకోకుంటే అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. రాత్రి బీజేపీ, ఎంజీపీ, జీఎఫ్‌పీ నేతలు అత్యవసరంగా సమావేశమై సీఎం ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. దీనికోసం కేంద్రమంత్రి గడ్కారీ పణజికి చేరుకున్నారు. 40 సీట్లున్న గోవా అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ 14 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా ఉండగా, బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంజీపీ, జీఎఫ్‌పీకి చెరో ముగ్గురు సభ్యులతోపాటు ముగ్గురు స్వతంత్రులు, ఓ ఎన్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు. తొలి ఐఐటీ సీఎం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) వ్యక్తిగా ముద్రపడ్డ పరీకర్(63) పోర్చుగీసు గోవాలోని మపుసా పట్టణంలో 1955, డిసెంబర్ 13న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పాఠశాల స్థాయిలోనే ఆరెస్సెస్ సిద్ధాంతాల పట్ట ఆకర్షితులై సంఘ్‌లో చేరారు. బాంబే ఐఐటీ నుంచి 1978లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. ఓవైపు సొంతవ్యాపారం చేసుకుంటూనే ఉత్తరగోవాలో ఆరెస్సెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1990ల్లో రామజన్మభూమి ఉద్యమంపై పరీకర్ గోవాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీకర్ సమర్థత, చురుకుదనం గమనించిన ఆరెస్సెస్, బీజేపీ పెద్దలు గోవాలో వేళ్లూనుకుంటున్న మహా రాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి చెక్ పెట్టే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఐఐటీలో చదువుకున్న తొలిసీఎంగా పరీకర్ ఖ్యాతి గడించారు. బీజేపీకి కంచుకోటగా గోవా..: పరీకర్ రాజకీయ అరంగేట్రం అంత గొప్పగా ఏమీ జరగలేదు. లోక్‌సభ ఎన్నికల్లో 1991లో తొలిసారి పోటీచేసిన పరీకర్ ఓటమి చవిచూశారు. అనంతరం 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పణజి నుంచి విజయం సాధించారు. పరీకర్ నాయకత్వంలో బీజేపీ గోవాలో బలీయమైన శక్తిగా ఎదిగింది. 2000లో గోవా పీపుల్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతును ఉపసంహరించుకోవడంతో పరీకర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. లీటర్ పెట్రోల్ ధరను రూ.11కు తగ్గించడం, మహిళలకు ఆదాయాన్ని కల్పించడం సహా పలు సంక్షేమ పథకాలతో పరీకర్ ఇమేజ్ గోవాలో అమాంతం పెరిగిపోయింది. దీంతో 2012 గోవా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఢిల్లీ నుంచి పిలుపు..: 2014లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న ’వన్ ర్యాంక్–వన్ పెన్షన్’ విధానం పరీకర్ హయాంలోనే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు రాగా, బీజేపీకి కేవలం 13 సీట్లు మాత్రమే దక్కాయి. వెంటనే రంగంలోకి దిగిన పరీకర్ ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులతో చర్చలు జరిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. పరీకర్ భార్య మేధా కేన్సర్‌తో 2000లో కన్నుమూశారు. పరీకర్ దంపతులకు ఉత్పల్, అభిజిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. -
గోవా సీఎం పారికర్ కన్నుమూత
-
గోవా సీఎం పారికర్ కన్నుమూత
సాక్షి, పణాజీ : దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నగోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (63) కన్నుమూశారు. ఆదివారం రాత్రి ఆయన మరణించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఇవాళ సాయంత్రం పారికర్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, డాక్టర్లు తమ శాయశక్తులా ఆయనకు వైద్యం అందిస్తున్నారని గోవా సీఎంవో ట్వీట్ చేసింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే పారికర్ మరణవార్త వినాల్సి వచ్చింది. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ ఢిల్లీలోని ఎయిమ్స్, గోవా, ముంబైలోనూ చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికాలో సుదీర్ఘ చికిత్స తీసుకున్నా అయినా ఫలితం లేకపోయింది. కొంత కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. అలాంటి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జనవరి 30న అసెంబ్లీలో పారికర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ మృతి చెందారు. 1955 డిసెంబర్ 13న గోవాలో జన్మించిన పారికర్ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఆయన 1994లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999లో గోవా అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్నారు. 2000లో తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన పారికర్.... ప్రధాని మోదీ కేబినెట్లో రక్షణమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పారికర్ హయాంలోనే ఫ్రాన్స్‌తో రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం జరిగింది. ప్రముఖుల సంతాపం మరోవైపు పారికర్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్‌తో పాటు, బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ఇక పారికర్ మరణంతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పారికర్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. దేశం ఒక గొప్ప ప్రజా సేవకుడిని కోల్పోయిందని సీఎం అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పారికర్ ఆకస్మిక మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశం ప్రజ్ఞాశాలి అయిన ఒక ప్రజా నాయకుడుని కోల్పోయిందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పరీకర్ నుంచే మొదలెట్టండి
జైపూర్(ఒడిశా): రఫేల్ ఒప్పంద పత్రాల మాయంపై విచారణ గోవా సీఎం మనోహర్ పరీకర్ నుంచే ప్రారంభం కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. శుక్రవారం పణజిలో జరిగిన పార్టీ బూత్ కార్యకర్తల సమావేశంలో రాహుల్∙మాట్లాడారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం ఉనికిలో లేకుండా పోయినట్టే రఫేల్ పత్రాలు కూడా మాయమయ్యానని ఎద్దేవా చేశారు. ‘ఆ పత్రాలు తన వద్దే ఉన్నాయంటూ గతంలో పరీకరే చెప్పారు. అందుకే వాటి కోసం సాగే దర్యాప్తు పరికర్ నుంచే ప్రారంభం కావాలి’ అని రాహుల్ అన్నారు. కాగా, పరీకర్ రక్షణ మంత్రిగా ఉన్నపుడే ప్రభుత్వం రఫేల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతోపాటు ఈ ఒప్పంద పత్రాలు కొన్ని కనిపించడం లేదంటూ ఇటీవల కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ‘రఫేల్’ డీల్ ద్వారా అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారుల స్థాయి చర్చలను పట్టించుకోకుండానే ఒప్పందం సిద్ధం చేశారని రాహుల్ ఆరోపించారు. కొరాపుట్ జిల్లా జైపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసి, రూ.30వేల కోట్ల మేర అంబానీకి లాభం చేకూర్చేందుకు మోదీ కాంట్రాక్టు సిద్ధం చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చిందన్నారు. బీజేపీకి దోచిపెడుతున్నారు: మమత కోల్‌కతా: ప్రభుత్వ ధనాన్ని ప్రధాని మోదీ బీజేపీకి దోచి పెడుతున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రఫేల్ ఒప్పంద పత్రాలనే పరిరక్షించలేని ఈ ప్రభుత్వం దేశాన్ని ఎలా కాపాడగలుగుతుందని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఆమె శుక్రవారం కోల్‌కతాలో ప్రారంభించారు. ‘ఇంతకుముందు బీజేపీ వాళ్లకు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. రఫేల్ డీల్, నోట్ల రద్దు ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు బైక్‌లు కొంటున్నారు’ అంటూ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో కశ్మీర్లో హింసాత్మక ఘటనలు 210 శాతం పెరిగాయంటూ ఆమె.. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే అక్కడ ప్రశాంతత ఏర్పడుతుందని చెప్పారు. -
మనోహర్ పరీకర్ కుమారుడికి నోటీసులు
పనజి : ఓ రిసార్టు నిర్మాణం విషయమై బాంబే హైకోర్టు- పనాజి ధర్మాసనం గోవా సీఎం మనోహర్ పరీకర్ కుమారుడు అభిజాత్ పరీకర్‌కు నోటీసులు జారీ చేసింది. దక్షిణ గోవాలోని నేత్రావలి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సమీపంలో అభిజాత్ నిర్మిస్తున్న రిసార్టు నిర్మాణంపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలైంది. నేత్రావలి పంచాయతీ ఉప సర్పంచి అభిజీత్ దేశాయి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ మహేష్ సోనక్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ క్రమంలో వచ్చే నెల 11నాటికి అభిజాత్ పరీకర్‌తో పాటు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి, అటవీ పరిరక్షణ ముఖ్య కార్యదర్శి ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. కాగా హైడ్‌అవే హాస్పిటాలిటీ ప్రమోటర్‌గా ఉన్న అభిజాత్ నిర్మిస్తున్న రిసార్టు కారణంగా అడవి ధ్వంసం అవుతుందని పేర్కొన్న పిటిషనర్.. ఈ నిర్మాణం అనేక చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. కాగా సీఎం కుమారుడికి నోటీసులు రావడం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బంధుప్రీతితో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో... ‘ ఈ ప్రాజెక్టులో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేదు. అభిజాత్ పరీకర్ ఆ భూమిని కొనుగోలు చేశారు. మనోహర్ పరీకర్, ఆయన కుమారుడిపై మాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని గోవా బీజేపీ అధ్యక్షుడు వినయ్ టెండుల్కర్ వ్యాఖ్యానించారు. -
పారదర్శకత సర్కారు బాధ్యత
నాలుగేళ్లక్రితం రఫేల్ ఒప్పందంపై సంతకాలు అయింది మొదలు దాని చుట్టూ అల్లుకుంటున్న అనేకానేక ఆరోపణలకూ, సందేహాలకూ ఇప్పట్లో ముగింపు ఉండకపోవచ్చునని తాజాగా వెల్లడైన మరో అంశం నిరూపిస్తోంది. మన దేశం, ఫ్రాన్స్ మధ్య ఈ ఒప్పందంపై చర్చలు సాగుతున్న సమ యంలో ప్రధాని కార్యాలయం అధికారుల తీరుపై రక్షణ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఒక ఆంగ్ల దినపత్రిక వెల్లడించడంతో ఈ వ్యవహారంలో మళ్లీ కొత్త సందేహాలు పుట్టుకొ చ్చాయి. రఫేల్ ఒప్పందంపై ఏడుగురు సభ్యులున్న రక్షణ శాఖ అధికారుల బృందం ఫ్రాన్స్‌తో చర్చిస్తుండగా, దానికి సమాంతరంగా అదే అంశంపై ప్రధాని కార్యాలయం (పీఎంఓ) అధికారులు కూడా ఫ్రాన్స్‌తో మంతనాలు జరపడాన్ని అప్పట్లో ఆ శాఖను చూస్తున్న మంత్రి మనోహర్ పారికర్ దృష్టికి రక్షణ అధికారులు దృష్టికి తీసుకొచ్చారని ఆ కథనం చెబుతోంది. ఇది సరికాదని పీఎంఓకు చెప్పమన్నా పారికర్ ఈ విషయంలో చొరవ తీసుకోలేదు. ప్రస్తుత రక్షణ మంత్రి నిర్మలా సీతారా మన్ ఏం చెప్పినా, ఎలా సమర్థించుకున్నా ఆ విషయంలో రేగిన అనుమానాలు రూపుమాసిపోవు. ఒక వ్యవహారంలో ఆరోపణలొచ్చినప్పుడు, సందేహాలు వ్యక్తమైనప్పుడు దానికి సంబంధిం చిన సమస్త అంశాలను తేటతెల్లం చేయడం పాలకుల కనీస కర్తవ్యం. ప్రభుత్వం ఆ పని చేయనంత మాత్రాన వాస్తవాలు మరుగునపడి ఉండిపోతాయనుకోవడం సరికాదు. మీడియా చురుగ్గా పని చేసేచోట ఎప్పుడో ఒకప్పుడు అవి వెల్లడవుతాయి. ప్రభుత్వ తీరును ప్రశ్నార్థకం చేస్తాయి. అప్పుడు ఆ అనుమానాలు మరింత చిక్కబడతాయి. ఒప్పందంలో ఇంతవరకూ డబ్బులు చేతులు మారింది లేదు.. రఫేల్ విమానాలు మన దేశానికి వచ్చింది లేదని బీజేపీ నేతల వాదన. కాబట్టి స్కాం కాదం టున్నారు. అలాగే ఈ విమానాల ఉత్పత్తికి భారత్‌లో ఏ సంస్థను భాగస్వామిగా చేర్చుకోవాలో నిర్ణ యించుకునే స్వేచ్ఛ ఒప్పందం ప్రకారం రఫేల్ విమానాలు ఉత్పత్తి చేసే డస్సాల్ట్ సంస్థకే ఉంద న్నదీ నిజమే కావొచ్చు. కానీ ఎప్పటికప్పుడు సంజాయిషీ ఇవ్వడం తప్ప సమగ్రంగా అన్నిటినీ ప్రజల ముందు ఎందుకు ఉంచరు? రఫేల్ ఒప్పందంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచా రణ సమయంలో కేంద్రం నివేదించిన వివరాల్లో పీఎంఓ పాత్ర గురించిన ప్రస్తావన ఎందుకు లేదు? ఒక్కసారి వెనక్కి వెళ్లి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి దారితీసిన పూర్వాప రాలు తెలుసుకుంటే ఇదిలా ఎడతెగకుండా సాగడం వల్ల జరిగే నష్టమేమిటో అర్ధమవుతుంది. 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇదే డస్సాల్ట్‌తో యుద్ధ విమానాల గురించి చర్చలు సాగాయి. దాదాపు ఒప్పందం కుదిరే దశలో అదంతా నిలిచిపోయింది. చర్చల సందర్భంగా ఆ సంస్థ 126 యుద్ధ విమానాలు మనకు సమకూర్చేందుకు...అందులో 18 విమానాలను 2015 కల్లా అందించేందుకు అవగాహన కుదిరింది. మిగిలిన 108 విమానాలనూ అవసరమైన సాంకేతిక పరి జ్ఞానాన్ని అందించడం ద్వారా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో ఉత్పత్తి చేసేం దుకు ఏడేళ్లపాటు సహకరిస్తామని చెప్పింది. అయితే డస్సాల్ట్–హెచ్ఏఎల్ మధ్య జరిగిన తదుపరి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈలోగా రఫేల్ యుద్ధ విమానాల సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతూ మీడియాలో కథనాలు రావడంతో ఆ ఒప్పందం సాకారం కాలేదు. రక్షణ కొనుగోళ్లకు ఒప్పందాలు ఖరారు కావడానికి ముందో, తర్వాతో ఆరోపణలు ముసురుకోవడం మన దేశంలో రివాజుగా మారింది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రక్షణ శాఖను తానే చూస్తూ, తనకు అత్యంత సన్నిహితుడైన అరుణ్‌సింగ్‌ను ఆ శాఖలో సహాయమంత్రిగా నియమించారు. 1987లో బోఫోర్స్ శతఘ్నుల ఒప్పందంపై ముసురుకున్న వివాదం ఎన్ని మలుపులు తీసుకుందో, అత్యంత భారీ మెజారిటీ సాధించి అధికారంలోకొచ్చిన రాజీవ్ దాని పర్యవసానంగా రాజకీయంగా ఎంత దెబ్బతిన్నారో అందరికీ తెలుసు. దానికి విరుగుడుగా నిజాయితీపరులని పేరున్న నేతలను ఎంచు కుని వారికి రక్షణ శాఖ కట్టబెట్టడం ఆనవాయితీగా మారింది. వాజపేయి హయాంలో జార్జి ఫెర్నాండెజ్, యూపీఏ ఏలుబడిలో ఏకే ఆంటోనీ, మోదీ ప్రభుత్వం మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ అందుకే అప్పగించారు. కానీ వీరు కూడా ఆరోపణల భారాన్ని మోయక తప్పలేదు. కొనుగోళ్లకు సంబంధించి, వాటి పారదర్శకతకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందు తున్నాయి. దళా రుల ప్రమేయం లేకుండా చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబు తున్నారు. కానీ చివరాఖరికి ఆరోపణలు మాత్రం తప్పడం లేదు. వీటి తక్షణ ఫలితమేమంటే... మన రక్షణ దళాలకు అవసరమైన యుద్ధ విమానాలు, శతఘ్నులు, ఇతర పరికరాలు సకాలంలో సమకూరడం లేదు. రఫేల్ ఒప్పందంలో లొసుగులున్నాయంటున్న విపక్షాలు దాన్ని బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయి. విపక్షాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మినహా మరెవరూ ఈ విషయాన్ని పెద్దగా మాట్లాడటం లేదు. ఆయన శక్తి అంత సరిపోతున్నట్టు లేదు. ఇతర నేతలకు రఫేల్ వ్యవహారంపై ఆసక్తి లేదో... వారికి అసలు అవగాహనే కొరవడిందో చెప్పలేం. ఈమధ్యే కోల్‌కతాలో జరిగిన విపక్ష ర్యాలీలో ఈ స్కాంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు విపక్షాల బలహీనతను పట్టిచూపుతుంది. బాబు గారికి రఫేల్ ఫైటర్ జెట్ విమానాలకూ, జెట్ ఎయిర్వేస్ విమానాలకూ తేడా తెలియదు. విపక్షాలు ఇలాంటి దైన్యస్థితిలో ఉండటం ప్రభుత్వానికి వరమే కావచ్చుగానీ... దాపరికం అంతిమంగా తమకే చేటు తెస్తుందని అది గుర్తించడం అవసరం. రక్షణ శాఖ బృందం చర్చిస్తుండగా ఈ ఒప్పందంలో పీఎంఓ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందో, రక్షణ శాఖ కార్యదర్శి అభిప్రాయాన్ని ఎందుకు బేఖాతరు చేశారో వివరించడం దాని బాధ్యత. మీడియాలో వచ్చినప్పుడల్లా సంజాయిషీ ఇస్తూ, ఎదురుదాడులు చేస్తూ పోయే వ్యూహాన్ని విడిచి అన్నిటినీ పారదర్శకంగా ప్రజల ముందుంచాలి. -
‘పరీకర్ ఆరోగ్యం అస్సలు బాగోలేదు’
పణజి: క్యాన్సర్‌తో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆరోగ్యంపై డిప్యూటీ స్పీకర్, బీజేపీ సీనియర్ లీడర్ మైఖేల్ లోబో సోమవారం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పరీకర్ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఆయన వ్యాధి ఇంకా నయం కాలేదు. దేవుని ఆశిస్సులతోనే ఆయన ఇంకా సీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు.’ అని వ్యాఖ్యానించారు. ఆయన పదవిలో నుంచి దిగిపోయినా లేదా కాలం చేసినా గోవాలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలనకు దూరంగా ఉన్న పరీకర్ పదవి నుంచి దిగిపోవాలని లోబో గతంలో కూడా డిమాండ్ లేవనెత్తారు. 63 ఏళ్ల పరీకర్ గతేడాది ఫిబ్రవరిలో పాంక్రియాటిక్ క్యాన్సర్ బారినపడ్డారు. తొలుత అమెరికాలో చికిత్స చేయించుకుని ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. (రాహుల్‌కు పరీకర్ ఘాటు లేఖ) కాగా, డిల్లీ ఎయిమ్స్ వైద్యులు సీఎం ఆరోగ్యంపై శనివారం బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. వరల్డ్ క్యాన్సర్ డే (ఫిబ్రవరి 4) సందర్భంగా.. ‘మనిషి బుద్ధి బలం చాలా గొప్పది. ఎటువంటి వ్యాధులనైనా తట్టుకొని నిలబడగలిగేలా నడిపిస్తుంది’ అని పరీకర్ ఒక మెసేజ్‌లో పేర్కొన్నారు. కాగా, అనారోగ్యం కారణంగా బాగా చిక్కిపోయిన పరీకర్ గతవారం అసెంబ్లీకి వచ్చారు. ఇదిలాఉండగా బీజేపీ సీనియర్ నేత సుదీన్ ధవాలికర్‌ను సీఎంగా నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బీజీపీ సీనియర్ ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇటీవల పరీకర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే. జీఎఫ్‌పీ, ఎంజీపీ, మరో ముగ్గురు స్వతంత్ర్య ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. -
‘మనోభావాలు దెబ్బతింటే క్షమించండి’
పనజి : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్‌ను జీసస్‌తో పోల్చి.. క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతీసారంటూ తనపై కాంగ్రెస్ పార్టీ తనపై చేస్తున్న విమర్శలపై గోవా మంత్రి విజయ్ సర్దేశాయి స్పందించారు. ‘ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి. అయితే నాదొక విన్నపం. దయచేసి కాంగ్రెస్ పార్టీ పన్నిన వలలో చిక్కుకోకండి. మనుషుల మధ్య సఖ్యతకు బంధాలే వారధులని.. పరీకర్ ఆ విషయంలో విజయవంతమయ్యారని తాను అంటే.. కొందరేమో కాంక్రీటు బ్రిడ్జిల గురించి మాట్లాడి రాజకీయం చేస్తున్నారు’ అని శనివారం ఆయన వివరణ ఇచ్చారు. కాగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్ సర్దేశాయి మాట్లాడుతూ.. ‘ మనుషులు నిర్మించాల్సింది బ్రిడ్జీలు. గోడలు కాదు అని బైబిల్లో ఉంటుంది. ఆ జీసస్ వారధులు నిర్మించారు. పరీకర్ కూడా అలాగే చేస్తున్నారు. అంతకు ముందు మేము బ్రిడ్జికి ఆవలివైపు(యాంటీ బీజేపీ క్యాంపులో) ఉన్నాము. అయితే పరీకర్ నిర్మించిన బ్రిడ్జీల కారణంగా ప్రస్తుతం బీజేపీతో కలిసి నడుస్తున్నాం’ అంటూ గోవా సీఎంపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రోహిత్ బ్రాస్ డేసా మాట్లాడుతూ.. పరీకర్‌ను దేవుడితో పోల్చి విజయ్ క్రిస్టియన్లను అవమానించారంటూ విమర్శించారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందినప్పటికీ.. గోవా ఫార్వర్డ్ పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో బీజేపీని తీవ్రంగా విమర్శించిన విజయ్ సర్దేశాయి(గోవా ఫార్వర్డ్ పార్టీ)ఆ పార్టీతో చేతులు కలపడంతో.. సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదుర్కొన్నారు. -
ఇలాంటి రాజకీయాలు చేస్తారా?
పణజి: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తనను పరామర్శించటానికి వచ్చారని ఆరోపించారు. ఈమేరకు బుధవారం రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాశారు. రఫేల్ ఒప్పందం గురించి తమ మధ్య ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ప్రాణాంతక అనారోగ్యంతో బాధ పడుతున్న తనతో ఇలాంటి రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. ‘ఐదు నిమిషాల పాటు జరిగిన మన భేటీలో రఫేల్ ఒప్పందం గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. మన సమావేశంపై ఈ రోజు మీడియాలో వచ్చిన వార్తలు నన్ను తీవ్ర అసంతృప్తికి గురి చేశాయి. మర్యాదపూర్వక భేటీ పేరుతో వచ్చి దిగజారుడు రాజకీయాలు చేయడం సబబు కాదు. మీ పర్యటన లక్ష్యంపై అనుమానాలు కలుగుతున్నాయి. మీ నిజాయితీపై నా మదిలో ఎన్నో ప్రశ్నలు రేగుతున్నాయ’ని రాహుల్‌కు రాసిన లేఖలో పరీకర్ పేర్కొన్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎటువంటి అక్రమాలు జరగలేదని, దేశ భద్రతకే పెద్దపీట వేశామని ఆయన స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీ అబద్దాలకోరు అంటూ బీజేపీ నాయకులు, గోవా మంత్రులు ధ్వజమెత్తారు. వ్యక్తిగత పర్యటనలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. (గోవా సీఎంతో రాహుల్ గాంధీ భేటీ) -
దమ్ముంటే చర్చకు రండి
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందం సహా ఏ వ్యూహాత్మక అంశంపై అయినా దమ్ముంటే తనతో 20 నిమిషాలు ముఖాముఖి చర్చకు రావాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాలు విసిరారు. రాహుల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రధాని మోదీతో ముఖాముఖి చర్చ కోసం నాకు కేవలం 20 నిమిషాలు ఇవ్వండి. ఆ తర్వాత వాస్తవమేంటో మీరే నిర్ణయించుకోండి. కానీ ప్రధాని మోదీకి మీ(మీడియా) ముందు కూర్చుని మాట్లాడే దమ్ము లేదు. మీరంతా మంగళవారం ప్రధాని ఇంటర్వ్యూ చూశారా? ఆయనేమో అక్కడ నవ్వుతున్నారు. ఎదురుగా ఉన్న జర్నలిస్ట్ మాత్రం ప్రశ్నలతో పాటు ప్రధాని ఇవ్వాల్సిన జవాబులను చెప్పేస్తున్నారు’ అని విమర్శించారు. రఫేల్ ఆడియో టేపు విషయమై మాట్లాడుతూ..‘రఫేల్‌కు సంబంధించిన ఫైలు మొత్తం తన దగ్గర ఉందని గోవా సీఎం పరీకర్ చెప్పినట్లు ఆయన కేబినెట్ సభ్యుడు రాణే బయటపెట్టారు. తనను ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించకుండా ఉండేందుకు పరీకర్ దీన్ని వాడుకుంటున్నారు. ఇలాంటి ఆడియో టేపులు ఇంకా చాలా ఉండొచ్చు. పరీకర్ ప్రధానిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం.. రఫేల్ ఒప్పందంపై తనకు ఎలాంటి ప్రశ్నలు ఎదురుకాలేదని మోదీ చెప్పడంపై స్పందిస్తూ..‘ఆయన ఏ లోకంలో జీవిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మోదీజీ.. మీకు వ్యతిరేకంగా ప్రశ్నలు వస్తున్నాయి. మీరు అనిల్ అంబానీ(ఏఏ)కు రూ.30,000 కోట్లు ఎందుకు ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రఫేల్ ఒప్పందంపై విచారణకు ఆదేశిస్తామన్నారు. -
పరీకర్.. మోదీని బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏంటి?!
పనాజి : తాను పదవిలో కొనసాగడం కోసం గోవా సీఎం మనోహర్ పరీకర్ ప్రధాని నరేంద్ర మోదీ బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో అంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పరీకర్ అనారోగ్యం కారణంగా గోవా అభివృద్ధి కుంటుపడిందని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ‘జన్‌ఆక్రోష్’ పేరిట ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నాటి ర్యాలీలో జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నైతికత గురించి మాట్లాడే మనోహర్ పరీకర్ స్వప్రయోజనాల కోసం సీఎం కుర్చీని జలగలా పట్టుకున్నారని విమర్శించారు. ‘ నాకు తెలిసి ఆయన తన సీటు కోసం ప్రధాని మోదీని బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో? ఇందుకోసం రఫేల్ డీల్ అంశాన్ని ఉపయోగించుకుంటున్నారేమో’ అంటూ జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందిన పరీకర్ అక్టోబర్‌లో డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఆయన ఆదివారం తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టింది. రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన పరీకర్ ఆ సమయంలో తాను తెలుసుకున్న విషయాల ఆధారంగా మోదీజీని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. -
‘మరి ఇంత పదవి వ్యామోహమా..?!’
పణాజి : ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి బాధ్యతలు నిర్వహిస్తోన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ని సొంత పార్టీ నాయకులు అభినందిస్తోండగా.. విపక్షాలు మాత్రం అంత పదవి వ్యామోహం అవసరమా అంటూ విమర్శిస్తున్నాయి. వివరాలు.. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న పారికర్ అక్టోబర్‌లో డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న పారికర్ ఆదివారం తొలిసారి ప్రజల మధ్యకు వచ్చారు. అధికారులతో కలిసి పణాజీలోని మండోవి నదిపై నిర్మిస్తోన్న వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా సీనియర్ నాయకురాలు ప్రీతి గాంధీ.. ‘నిబద్ధతకు, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం’ అంటూ పారికర్ని ప్రశంసించారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం బీజేపీ అధికార దాహానికి నిలువెత్తు నిదర్శనమంటూ ఆరోపణలు చేస్తున్నాయి. ‘ఎంత అమానుషం.. పూర్తిగా కోలుకొని మనిషిని బాధ్యతలు నిర్వహించమని, ఫోటోలకు ఫోజులివ్వమని ఒత్తిడి చేయడం దారుణమం’టూ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా విమర్శించారు. He has a tube inserted through his nose into his digestive tract. How inhuman to force him to continue working & doing photo ops. Why can’t he be allowed to deal with his illness without all this pressure & tamasha? https://t.co/iq0dwXCHmE — Omar Abdullah (@OmarAbdullah) December 16, 2018 కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కూడా ‘సీఎం ముక్కులో ట్యూబ్ ఉందా? పదవి దాహంతో ఉన్న పార్టీ(బీజేపీ) ఓ వ్యక్తి అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా బాధ్యతలు నిర్వహించమని కోరుతుందా? కానీ అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఏమైనా చేయగలదు. సీఎం సాబ్ జాగ్రత్త.. ఇక మీ పార్టీ గిమ్మిక్కులు కొనసాగవు’ అంటూ ట్వీట్ చేశారు. Is that a tube that is inserted in his nose? Can a party be so power hungry to make a man work despite his illness? With BJP impossible is nothing....to grab power, latch on to power. Take care CM Saab, because clearly, your party won’t. https://t.co/xBwv5qXvtb — Priyanka Chaturvedi (@priyankac19) December 16, 2018 -
అయ్యో పాపం.. పరీకర్!
సాక్షి, న్యూఢిల్లీ : గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పరీకర్ తన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పడానికి ఆయన అధికారులతో సమావేశమైన ఫొటోలను బీజేపీ పార్టీ నాయకత్వం విడుదల చేయడాన్ని సోషల్ మీడియా తప్పు పట్టడమే కాకుండా తీవ్రంగా దుయ్య పడుతోంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన్ని విశ్రాంతి తీసుకోనీయకుండా ఇంకా విధులు నిర్వర్తింప చేయడమేమిటని ప్రశ్నిస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ సంపూర్ణ ఆరోగ్యంగా కనిపించే మనోహర్ పరీకర్ బీజేపీ నాయకత్వం విడుదల చేసిన ఫొటోల్లో చిక్కి శల్యమై కనిపించడం సోషల్ మీడియాను తీవ్రంగా కదిలించింది.. కలచివేసింది. అక్టోబర్ 30, అక్టోబర్ 31వ తేదీల్లో ముఖ్యమంత్రి పరీకర్ తన నివాసంలో తోటి మంత్రులు, అధికారులతో సమావేశమైన దశ్యాలకు సంబంధించిన ఫొటోలను బీజేపీ నాయకత్వం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. నానాటికి ఆరోగ్యం క్షీణిస్తున్న మనోహర్ పరీకర్ ముఖ్యమంత్రిగా తన విధులను సంక్రమంగా నిర్వర్తించలేక పోతున్నారని తెలిస్తే ఎక్కడ ప్రభుత్వం పడిపోతుందోనన్నది అటు రాష్ట్ర, ఇటు కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన్ని కలవర పెడుతోంది. అందుకు కారణం గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకన్నా నాలుగు సీట్లు తక్కువ సీట్లను సాధించినప్పటికీ ఎన్నికల అనంతర పొత్తుల ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. (సీఎంకు ఓ న్యాయం.. మంత్రులకో న్యాయమా!?) ‘భయం గొలిపే ఇలాంటి ఫొటోను విడుదల చేయడం నిజంగా నీచం. దయచేసి ఆ ఫొటోను వైరల్ కానివ్వకండి. వారం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. వారిని క్షమించండి. ఓ ముఖ్యమంత్రిని గౌరవప్రదంగా సాగనంపాలనే సంస్కతిని కూడా పార్టీ మరచిపోయినట్టుంది’ అని పరీకర్ ఫొటో పట్ల మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభాకర్ టింబ్లే వ్యాఖ్యానించారు. ‘సీఎం చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. ఆయనపై దయవుంచి గౌరవప్రదంగా రాజీనామా చేయనీయండి. (సీఎం పదవి నుంచి నన్ను తప్పించండి!) ఆయన జీవితం కన్నా బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించుకోవడమే కావాలనుకుంటా ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు’ అని సోషల్ మీడియాలో నిక్సన్ ఫెర్నాండేజ్ వ్యాఖ్యానించారు. ‘ఆ ఫొటోలో కనిపిస్తున్నది నిస్సందేహంగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్గారే, కాదనడం లేం, ఆయన్ని ఆ స్థితిలో చూస్తుంటే ఆయనింకేమాత్రం విధులు నిర్వర్తించేలా కనిపించడం లేదు’ అని ‘గోవన్ డెయిలీ’ పత్రిక వ్యాఖ్యానించింది. గత ఫిబ్రవరి నెల నుంచే మనోహర్ పరీకర్ గత ఫిబ్రవరి నెల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆయన వారసుడి కోసం ఇటు పార్టీలోనూ, అటు సంకీర్ణ భాగస్వామ్య పక్షాల్లోనూ పోటీ పెరగడంతో ఇంతవరకు రాజీ కుదరలేదు. ఏ రెండు మిత్రపక్షాలు జారుకున్నా ప్రభుత్వం పడిపోతుంది. అందుకని ప్రభుత్వం పడి పోకుండా ఉండేందుకు బీజేపీ అధిష్టానం పరీకర్నే కొనసాగిస్తూ వస్తోంది. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరగుపడుతోందని ఇప్పటికి రెండు సార్లు ప్రకటించిన పార్టీ, ఆయన మాటలను తెలియజేసే వీడియో రికార్డులను విడుదల చేయలేదు. తాజాగా ఫొటోలను విడుదల చేసింది. ఆ ఫొటోలను చూస్తుంటే మాత్రం ఆయన కోలుకుంటున్న లక్షణాలు కనిపించడం లేదు. -
గోవాకు తిరిగొచ్చిన పరీకర్
పనజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆదివారం మధ్యాహ్నం స్వరాష్ట్రానికి తిరిగొచ్చారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గోవా చేరిన పరీకర్.. అక్కడ నుంచి అంబులెన్స్‌లో డోనా పౌలాలో ఉన్న నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు గోవా మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. పరీకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం అని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ విలేకరులకు తెలిపారు. గోవా అసెంబ్లీ రద్దు వార్తలను ఆయన ఖండించారు. ఫిబ్రవరిలో అనారోగ్యానికి గురైన పరీకర్ గోవా, ముంబై, అమెరికాలో చికిత్స పొందారు. చివరికి సెప్టెంబర్ 15న ఎయిమ్స్‌లో చేరారు. -
సీఎంకు ఓ న్యాయం.. మంత్రులకో న్యాయమా!?
పనజి : కాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త మంత్రులను నియమించేందుకు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా, విద్యుత్ శాఖ మంత్రి పాండురంగ్ మద్కైకర్లను కాబినెట్ నుంచి తొలగించారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వీరి స్థానంలో మిలింద్ నాయక్, నీలేశ్ కార్బాల్ గవర్నర్ మృదులా సిన్హా సమక్షంలో సోమవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకో రూల్.. మంత్రులకో రూల్!! గత జూన్‌లో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన మద్కైకర్.. ఇప్పటికీ అక్కడ చికిత్స పొందుతున్నారు. మరో మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా కూడా పలు అనారోగ్య కారణాల వల్ల అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే వీరి గైర్హాజరీతో ఆయా శాఖల అభివృద్ధి కుంటుపడుతుందని భావించిన పరీకర్ వారిద్దరిని కాబినెట్ నుంచి తొలగించారు. దీంతో సీనియర్లను తప్పించడం కంటే కూడా దాని వెనుక ఉన్న కారణం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. ఎందుకంటే గత ఏడు నెలలుగా ప్రాంకియాటైటిస్‌తో బాధపడుతున్న మనోహర్ పరీకర్ ముంబై, అమెరికాల్లో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా పరీకర్ అనారోగ్యాన్ని కారణంగా చూపి, రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ పట్టుపడుతోంది. అయితే గోవా సీఎంగా పరికర్ కొనసాగుతారని బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులకో న్యాయం, సీఎంకి ఓ న్యాయం అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. -
‘ఆస్పత్రి నుంచే సీఎం బెదిరిస్తున్నారు’
పనాజి : గోవా సీఎం మనోహర్ పారికర్ ఆసుపత్రి నుంచే ప్రజలను బెదిరిస్తున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు చెల్లకుమార్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉండిఉంటారని.. నేరుగా పాలన చేయలేకపోయినా ఆసుపత్రి గది నుంచే పోన్లు చేసి ప్రజలను భయపెడుతున్నారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారికర్ అమెరికా, ముంబై, ఢిల్లీలో చికిత్స తీసుకున్నారని ఆయన ఆరోగ్య పరిస్థితి బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పారికర్ ఆసుపత్రిలో చేరిన దగ్గరనుంచి ఆయనను కాంగ్రెస్ తొలిసారిగా విమర్శించింది. గోవా ఫార్వార్డ్ బ్లాక్ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ సీఎంతో ఫోన్లో మాట్లాడిన మరుసటి రోజే కాంగ్రెస్ ఆరోపణలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌లో పారికర్‌కు కూడా వాటా ఉందని, దీనిపై లోకయుక్తాతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పారికర్ త్వరలో కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా పారికర్ ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన వైద్యం కోసం వెళ్లిన దగ్గర నుంచి గోవాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వం సుప్తచేతనావస్థలో ఉందని.. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగిన బలం ఉన్నందును తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ఇటీవల గవర్నర్‌ను కోరిన విషయం తెలిసిందే. -
ఆస్పత్రిలో సీఎం.. పావులు కదుపుతున్న ప్రతిపక్షం
పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరడంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సీఎల్పీ నేత బాబు కవేల్కార్ నేతృత్వంలో 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ మృదుల్ సిన్హాను కలిసి అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరేందుకు సంసిద్ధమయ్యారు. అయితే అమె అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఆమెతో భేటీ అవుతామని కవేల్కార్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం తమకు ఉన్నందున అసెంబ్లీని రద్దు చేయవద్దని తాము గవర్నర్‌ను కోరతామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పనిచేయలేని పరిస్థితి నెలకొంటే తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో 16 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు కాంగ్రెస్‌కు మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరోవైపు సీఎం పారికర్ అస్వస్థతతో పాలనను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలు, భాగస్వామ్య పక్షాలతో చర్చించేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం గోవాకు ముగ్గురు పార్టీ సీనియర్ నేతలతో కూడిన బృందాన్ని పంపింది. పారికర్ కోలుకునే వరకూ సీనియర్ మంత్రిని సీఎంగా నియమించాలనే డిమాండ్ ఊపందుకుంది. -
గోవాకు త్వరలో కొత్త సీఎం?
పణజి: ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను సమీక్షించేందుకు అధికార బీజేపీ కేంద్ర పరిశీలక బృందం ఆదివారం మధ్యాహ్నం గోవా చేరుకుంది. సీఎం పారికర్ తీవ్ర అనారోగ్యంతో శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు సీఎంగా మరొకరిని ఎంపికచేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బృందం రాష్ట్రానికి రావడం గమనార్హం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎస్ సంతోష్, రామ్ లాల్, రాష్ట్ర ఇన్చార్జి విజయ్ పురాణిక్‌లతో కూడిన ఈ బృందం ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పరిస్థితులపై పార్టీ నేతలతోపాటు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో పాటు, స్వతం త్ర అభ్యర్థుల మనో గతం తెలుసుకుంటుం దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ తెలిపారు. 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో బీజేపీ 14, సంకీర్ణంలోని జీఎఫ్‌పీ, ఎంజీపీలకు ముగ్గురు సభ్యుల బలం ఉండగా ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు.కాంగ్రెస్‌కు 16, ఎన్సీపీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది.‘మా ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు. అధికార పార్టీలో అంతర్గత కుమ్ము లాట మొదలైంది. అయితే, అధికారం చేపట్టాలనే ఆదుర్దా మాకు లేదు’ అని గోవా కాంగ్రెస్ కార్యదర్శి చెల్లకుమార్ తెలిపారు. -
సీఎం పదవి నుంచి నన్ను తప్పించండి!
పనాజీ : గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుసుస్తోంది. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో చికిత్స కోసం మళ్లీ అమెరికా వెళ్లాలని పర్రీకర్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చెప్పి సీఎం పదవి నుంచి తనను తప్పించమని కోరినట్లు సమాచారం. ‘వినాయక చవితి సందర్భంగా అమిత్ షాకు పర్రీకర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే తన అనారోగ్య సమస్యల గురించి చెప్పి పదవి నుంచి తప్పించాలని కోరారు. దీనికి సానుకులంగా స్పందించిన అమిత్ షా కొద్ది రోజుల వరకూ పదవిలో కొనసాగాలని కోరారు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా పార్టీ కేంద్రం ఆలోచిస్తోంద’ని బీజేపీ నాయకుడొకరు మీడియాకు తెలిపారు. కాగా, ప్రత్యామ్నాయంపై కేంద్ర బీజేపీ దృష్టి సారించింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి ఒక బృందాన్ని సోమవారం గోవా పంపనుంది. ప్రస్తుత పరిణామాలు, ప్రభుత్వ పని తీరుపై పార్టీ నాయకులతో ఈ బృందం చర్చించనుంది. మంత్రి వర్గంలోనూ మార్పులు చేయనున్నట్లు సమాచారం. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రులు పాండురంగ్ మద్కాకర్, ఫ్రాన్సిస్ డి సౌజాలను కూడా మంత్రి వర్గం నుంచి తొలగించాలని భావిస్తున్నారు. సీఎంగా పర్రీకర్‌ను కొనసాగమని కోరడమా, వేరే వ్యక్తిని నియమించడమా అనే అంశంపై పార్టీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంకియాటైటిస్‌తో బాధపడుతున్న పర్రీకర్ చికిత్స కోసం ఈ ఏడాది మార్చిలో అమెరికా వెళ్లారు. దాదాపు ఏడు నెలల తర్వాత సెప్టెంబరు 7న పరీకర్ భారత్‌కు తిరిగి వచ్చారు. కాగా మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో గోవాలోని కేండోలిమ్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స కోసం ఆయన ఇప్పటివరకూ మూడుసార్లు అమెరికా వెళ్లివచ్చారు. తాజాగా ఆయన తిరిగి చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పర్రీకర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి లేకపోవడంతో రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, అభివృద్ది ఆగిపోయిందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని మార్చడమా లేదా పర్రీకర్‌ను కొనసాగిస్తూ బాధ్యతలను తగ్గిస్తారా అనేది కొద్ది రోజుల్లో తెలియనుంది. -
‘లోఫర్లే అలా చేస్తారు’
పనాజి : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరుపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోదీని కౌగిలించుకోవడం, అనంతరం తన సీట్లో కూర్చుని కన్నుగీటడం వంటి చర్యల ద్వారా రాహుల్ సభా మర్యాదను మంటగలిపారని బీజేపీ నేతలు విరుచుకు పడిన విషయం తెలిసిందే. తాజాగా గోవా బీజేపీ అధికార ప్రతినిధి దత్తప్రసాద్ నాయక్ రాహుల్ గాంధీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. భారత ప్రజల సమస్యలను, కష్టాలను అర్థం చేసుకోలేని వ్యక్తే ఇలా ప్రవర్తిస్తారంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కొలువుదీరిన పవిత్రమైన ఆలయం(పార్లమెంటు)లో రాహుల్ చేసిన పనులు చాలా అవమానకర రీతిలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీల్లో, రోడ్లపై అమ్మాయిలను ఏడిపించే లోఫర్లే ఇలా కన్నుగీటుతారని, రాహుల్ కూడా సభలో ఓ లోఫర్ లాగే వ్యవహరించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీ కుటుంబం చేతుల్లో తోలుబొమ్మల్లా మారిన కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్లు చెప్పినట్టల్లా ఆడుతున్నారని విమర్శించారు. కాగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్.. బీజేపీ, మిత్ర పక్షాల చేతిలో తోలుబొమ్మగా మారడం వల్లే రాష్ట్రంలో ఫిష్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయంటూ కాంగ్రెస్ నేత చోదంకర్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే దత్తప్రసాద్ నాయక్ రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. -
స్త్రీలోక సంచారం
గోవా గవర్నర్ మృదుల సిన్హా.. గోవా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పట్టభద్రులైన యువతీయువకులందరి చేతా.. ‘ఎన్ని సమస్యలు ఎదురైనా వివాహాబంధాన్ని గట్టిగా నిలుపుకుంటాం’ అని.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సమక్షంలో ప్రతిజ్ఞ చేయించారు. నిరుడు ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా మృదుల ఇదే విధమైన ప్రతిజ్ఞ చేయిస్తూ, ‘‘చిన్న చిన్న విషయాలకు గొడవపడి, దాంపత్య బంధం నుంచి బయటికి వచ్చేయకండి. చివరి వరకు కలిసి మెలిసి ఆనందంగా జీవించండి. పెళ్లికి ముందు మ్యారేజీ కౌన్సిలింగ్ తీసుకుంటే, పెళ్లి తర్వాత కౌన్సెలింగ్ తీసుకునే అవసరం రాదు’’ అని హితవు చెప్పారు ::: హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రెండో వర్ధంతి సందర్భంగా కశ్మీర్లో అల్లర్లు చెలరేగి, రాళ్లు విసురుతున్న మూకలను అదుపుచేయడం కోసం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక టీనేజ్ బాలికతో పాటు ముగ్గురు పౌరులు మరణించారు. సున్నితమైన ప్రాంతాలలో సైనికులు ‘ఏరియా డామినేషన్ పెట్రోలింగ్’ జరుపుతున్నప్పుడు భవనాలపైకి ఎక్కి సైన్యంపై రాళ్లు రువ్వుతున్న వారిని నియంత్రించడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపినప్పుడు అద్లీబ్ జాన్ అనే 16 ఏళ్ల బాలిక మరణించిన మాట నిజమేనని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు అంగీకరించారు ::: త్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన సామాజిక హక్కుల కార్యకర్త షయార బానో భారతీయ జనతా పార్టీలో చేరారు. మూడుసార్లు తలాక్ చెబితే చాలు, వివాహబంధం నుంచి తప్పుకోవచ్చనే వెసులుబాటును రద్దు చేయాలని 2016లో కోర్టును ఆశ్రయించి తొలిసారిగా దేశప్రజల దృష్టిలో పడిన ఉథమ్సింగ్నగర్ జిల్లా (ఉత్తరాఖండ్) కాశీపూర్ నివాసి షయార.. త్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమైనదని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ముస్లిం మహిళాహక్కుల పోరాటయోధురాలిగా గుర్తింపు పొందారు ::: తెలంగాణలో ‘షీ టీమ్’లు ఈవారంలో రెండు బాల్య వివాహాలను అడ్డుకుని, బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించాయి. భువనగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల బాలికకు 22 ఏళ్ల యువకుడితో, చౌటుప్పల్ పరిధిలో 15 ఏళ్ల బాలికకు 26 ఏళ్ల పురుషుడితో జరగబోతున్న వివాహాలను షీ టీమ్‌లు సమర్థంగా నివారించి, బాలికలను రక్షించాయి ::: ఈ ఏడాది మే 21న తొమ్మిదేళ్ల బాలికపై లైంగికదాడి జరిపిన వ్యక్తికి మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. పన్నెండేళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడినవారికి మరణశిక్ష విధించాలని గత ఏడాది డిసెంబరులో మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన ప్రతిపాదన అసెంబ్లీ ఏకగ్రీవ సమ్మతిని పొంది, రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 21న అమలులోకి వచ్చాక, ఆ చట్టం కింద న్యాయస్థానం విధించిన తొలి మరణశిక్ష ఇదేనని అంటూ, ఈ మరణశిక్ష నేరస్తులకు ఒక బలమైన భయ సంకేతం అవుతుందని ఆ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ అన్నారు. రాజకీయ చర్చల్లో ట్విట్టర్ ఒక శక్తిమంతమైన వేదికగా అవతరించాక, ఆ చర్చల్లోకి మహిళా జర్నలిస్టులను రానివ్వకుండా పురుష జర్నలిస్టులు తమకు తామే ప్రత్యేక గ్రూపులుగా ఏర్పడుతున్నారని ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్రెస్/పాలిటిక్’లో వచ్చిన ఒక అధ్యయన ఫలితం వెల్లడించింది. ఒకవేళ మహిళా జర్నలిస్టులు ఎవరైనా పురుష జర్నలిస్టుల చర్చలకు రీ ట్వీట్ చేసినా, పురుషులు స్పందించడం లేదని, ఆ కారణంగా.. ట్విట్టర్లో రాజకీయ వేదికలపై మహిళా జర్నలిస్టులు తీవ్రమైన వివక్షకు గురవుతున్నారని, ఇది ఆరోగ్యవంతమైన పరిణామం కాబోదని.. అధ్యయ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది ::: స్త్రీవాదిగా ప్రసిద్ధుడైన కెనడా యువ ప్రధాని జస్టిన్ ట్రూడో రాజకీయాలలోకి రాకముందు రెండు దశాబ్దాల క్రితం ఒక మహిళా జర్నలిస్టు ఒంటిపై ఒకట్రెండు చోట్ల ఉద్దేశపూర్వకంగా చేతులతో తాకినట్లు (గ్రోపింగ్) అప్పటి ఒక పత్రిక తన సంపాదకీయంలో రాసిన విషయం.. మళ్లీ ఇప్పుడు కాలగర్భంలోంచి పైకి లేచిన నేపథ్యంలో ‘ఆ మహిళా రిపోర్టర్‌ను నేనే’ అంటూ రోజ్ నైట్ అనే జర్నలిస్టు ఒక ప్రకటన ఇచ్చారు. ‘‘నేనెందుకు ఆమెను తాకానో తెలియదు కానీ, మీరు అనుకుంటున్న ఉద్దేశంతోనైతే మాత్రం తాకి ఉండను’ అని జస్టిన్ ట్రూడో స్టేట్మెంట్ ఇచ్చిన మర్నాడే రోజ్ నైట్ ఇలా బహిర్గతం అయ్యారు ::: ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె.. పదిహేనేళ్ల గాయత్రి.. అండర్–19 గర్ల్స్ సింగిల్ టైటిల్ గెలుచుకుని ఏషియన్ గేమ్స్‌కి ఎంపిక అయింది. కొచ్చిలో జరిగిన ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ ఫైనల్ పోటీలలో ‘అన్ సీడెడ్’ అయిన గాయత్రి తన ప్రత్యర్థి, నాలుగో సీడ్ ప్లేయర్ అశ్వినీభట్పై విజయం సాధించింది ::: -
సీఎంకు సమస్యల సవాళ్లు
పనాజి: మూడు నెలల విరామం తరువాత విధి నిర్వహణకు హాజరైన గోవా సీఎం మనోహర్ పారికర్‌కు సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. అనారోగ్యం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి అమెరికాలో చికిత్స తీసుకున్నారు. కోలుకోవటంతో ఇటీవల రాష్ట్రానికి తిరిగి వచ్చిన విషయం విదితమే. అయితే పారికర్ స్థానంలో రాష్ట్ర పరిపాలన.. వ్యవహారాలను పర్యవేక్షించిన ముగ్గురు మంత్రుల కమిటీ అన్ని రకాలుగా విఫలమైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో మైనింగ్ పరిశ్రమపై పెద్ద ఎత్తున్న ప్రభావం పడింది. 88 మైనింగ్ లీజులపై సుప్రీంకోర్టు స్టే విధించటంతో మైనింగ్ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతోపాటు పలు సమస్యలు పరిష్కరించటంలో మంత్రుల కమిటీ విఫలమైంది. ఇదే అదనుగా ప్రతిపక్ష కాంగ్రెస్.. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడింది. కర్ణాటక పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో పెద్ద పార్టీగా ఉన్న తమకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ గవర్నర్‌ను డిమాండ్ చేస్తోంది. మొత్తానికి మూడు నెలలపాటు అధికారానికి దూరంగా ఉన్న పారికర్‌కు, సమస్యలు స్వాగతం పలకటం.. వాటిని పరిష్కరించే పనిలో ఆయన తలమునకలయ్యారు. -
అమెరికా నుంచి జర్నలిస్టులకు సీఎం ఫోన్
పనాజీ: అనారోగ్యం కారణంగా గత నాలుగు నెలలుగా అమెరికాలో చికిత్స పొందుతోన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ రాష్ట్ర పరిస్థితులపై ఆరాతీశారు. తనకు సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులకు ఫోన్ చేసి రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. కాగా గత కొద్దికాలంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీకర్ విలేకరులతో మాట్లాడి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థిల గురించి అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని కొద్ది రోజుల్లో రాష్ట్రానికి తిరిగి రానున్నట్లు ముఖ్య మంత్రి పేర్కొన్నారు. సీఎంతో ఫోన్లో మాట్లాడిన ఓ సీనియర్ జర్నలిస్టు మీడియాతో మాట్లాడుతూ... కొద్దిరోజుల్లో గోవాకు వస్తున్నట్లు పరీకర్ చెప్పారన్నారు. ‘ప్రతిరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నాను. ప్రొటోకాల్ ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నాం. ప్రభుత్వ ఫైళ్లు స్కాన్ చేసి నాకు మెయిల్ చేస్తున్నారు. టెక్నాలజీ యంత్రాల ద్వారా ప్రతీది ఇక్కడే నుంచే తెలుసుకుంటున్నాను. డాక్టర్స్‌ని సంప్రదించి కొద్ది రోజుల్లో రాష్ట్రానికి తిరిగి వస్తా’ అని ముఖ్యమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా, గతవారం ముఖ్యమంత్రి ఖాతాలోని డబ్బును దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పాలన కుంటుపడింది. రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రాంకియాటైటిస్‌తో బాధపడుతున్న పరీకర్ మార్చి 7 నుంచి అమెరికాలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను ముగ్గురు మంత్రుల బృందం పర్యవేక్షిస్తోంది. -
‘త్వరలోనే రాష్ట్రానికి సీఎం’
పనాజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ జూన్ చివరిలోపు రాష్ట్రానికి తిరిగి వస్తారని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సుధీన్ దవలీకర్ తెలిపారు. అనారోగ్య కారణంగా మార్చి 7 నుంచి పారికర్ అమెరికాలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను ముగ్గురు మంత్రుల బృందం పర్యవేక్షిస్తోంది. జాన్‌తో పారికర్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటారని దవిలీకర్ తెలిపారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తనకు సీఎం పదవిపై అశాలేదని, పనితీరు బాగుంటే భవిషత్తులో ప్రజలే ఆ పదవి కట్టబెడతారని వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించండని ప్రతిపక్ష కాంగ్రెస్ గతకొంత కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. -
‘త్వరలోనే తిరిగి వస్తా’
పనాజి: తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించాలంటూ గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్వహించిన ధర్నాకు అధికార బీజేపీ స్పందించింది. ధర్నాకు వివరణగా అమెరికాలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వీడియోను ఆదివారం విడుదల చేసింది. వీడియోలో పారికర్ మాట్లాడుతూ.. తాను పూర్తిగా కోలుకున్నానని, కొన్ని వారాల్లో రాష్ట్రానికి తిరిగి వస్తానని పారికర్ పేర్కొన్నారు. ఈ వీడియోను బీజేపీ కార్యకర్తల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రదర్శించారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న అమిత్‌షాకు వ్యతిరేకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించాలని శనివారం పనాజిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం పారికర్ అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముగ్గురు మంత్రుల బృందం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. -
‘మా రాష్ట్రానికి సీఎం కావాలి’
పనాజి: గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాష్ట్రానికి శాశ్వత సీఎంను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం మనోహర్ పారికర్ అనారోగ్యం కారణంగా గత రెండు నెలలుగా అమెరికాలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను ముగ్గురు మంత్రుల బృందం పరిశీలిస్తోంది. దీనిని నిరసిస్తూ శనివారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పనాజిలోని మాజీ సీఎం దయానంద్ బందోద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీష్ చోదన్కర్ మాట్లాడుతూ... మూడు నెలలుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేరని, ముగ్గురు మంత్రుల బృందాన్ని వెంటనే తొలగించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా రాష్ట్ర పరిస్థితిని గవర్నర్‌కి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా ఏలాంటి స్పందన లేదని విమర్శించారు. త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తన పోరాటాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తోంది. దయానంద్ బందోద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ధర్నా నిర్వహించడం గమనార్హం. బందోద్కర్ స్థాపించిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. -
వదంతులు నమ్మకండి : పరీకర్
పనాజి : మాజీ రక్షణ శాఖ మంత్రి, గోవా సీఎం మనోహర్ పరీకర్ తన ఆరోగ్యం బాగానే ఉందని.. వదంతులను నమ్మవద్దని గోవా ప్రజలకు విఙ్ఞప్తి చేశారని స్పీకర్ ప్రమోద్ సావంత్ తెలిపారు. చికిత్స కోసం అమెరికా వెళ్లిన.. పరికర్ తనతో ఫోన్లో మాట్లాడారని, రెండవ దశ చికిత్స ప్రారంభమైందని చెప్పారని సావంత్ పేర్కొన్నారు. పాలనా అంశాల గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. పరీకర్ ఆరోగ్యంపై ఆందోళన వద్దని కోరారు. ప్రాంకియాటైటిస్‌తో బాధ పడుతున్న పరీకర్ మొదట ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. గత నెల 17న బడ్జెట్ సమావేశం ఉన్నందున గోవాకు వెళ్లిన పరీకర్ ఆరోగ్యం మళ్లీ దెబ్బతినడంతో ముంబైకి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో అధునాతన చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లారు. -
ఆయన కోలుకుంటున్నారు: కేంద్రమంత్రి ట్వీట్
పనాజి : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహార్ పారికర్ ప్రస్తుతం కోలుకుంటున్నారని కేంద్రమంత్రి సురేష్ ప్రభు ట్విట్ చేశారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో గతకొంత కాలంగా ఇబ్బంది పడుతున్న పారికర్ అమెరికాలో వైద్యం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పారికర్ ఆరోగ్యంపై వాకాబు చేసిన సురేష్ ప్రభు.. ‘ప్రస్తుతం పారికర్ వైద్యానికి స్పందిస్తున్నారు, వేగంగా కోలుకుని, త్వరలోనే రాష్ట్రానికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను’ అని తన ట్వీటర్లో పేర్కొన్నారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో పారికర్ ఫిబ్రవరి 14న ముంబాయిలోని లీలావతి హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజునే ఆయన రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన అనంతరం సమస్య తీవ్రం కావడంతో పారికర్ పనాజీలోని గోవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చేరారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మార్చి మొదటి వారంలో ఆయనను అమెరికా తీసుకెళ్లారు. కాగా సీఎం రాష్ట్రంలో లేని కారణంగా ముగ్గురు మంత్రుల బృందం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. -
అమెరికా నుంచే పరీకర్ పాలన
సాక్షి, న్యూఢిల్లీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అయితే ఆయన ఎలాంటి జబ్బుతో బాధ పడుతున్నారో వెల్లడించలేదు. వైద్య చికిత్స కోసం ఆయన ఆరు వారాలపాటు అమెరికాలో ఉంటారని అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు బీజేపీ వర్గాలు ప్రకటించాయి. ఆయన గైర్హాజరీలో ఆయన తరఫున సీఎం బాధ్యతలను మనోహర్ పరీకర్ ఎవరికీ అప్పగించలేదు. ఆయన ముఖ్యమంత్రి సహా దాదాపు 20 కేబినెట్ శాఖలను ఆయనే నిర్వహిస్తున్నారు. తన ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా తానే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలను నిర్వహిస్తానంటూ మనోహర్ పరీకర్ అమెరికా వెళ్లే ముందు రాష్ట్ర గవర్నర్ మధుల సిన్హాకు ఓ లేఖను అందజేసి వెళ్లారు. తాను నిర్వహిస్తున్న హోం, ఆర్థిక, సాధారణ పరిపాలన వ్యవహారాలు తదితర శాఖల సమావేశాలను ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నిర్వహిస్తానని, అది సాధ్యంకాని సందర్భాల్లో తాను ప్రతిపాదించిన వ్యక్తి సమావేశాలను నిర్వహిస్తారని ఆ లేఖలో పరీకర్ స్పష్టం చేశారు. ఆయన అమెరికా బయల్దేరి వెళ్లే ముందు ఓ ముగ్గురు సభ్యులతో కలిసి ఓ కేబినెట్ సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారు. కీలక సమయాల్లో మాత్రం ముఖ్యమంత్రినే తుది నిర్ణయం తీసుకుంటారు. గోవాలో సంకీర్ణ ప్రభుత్వం ఉండటం వల్ల భారతీయ జనతా పార్టీ నుంచి ఫ్రాన్సిస్ డిసౌజా, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నుంచి రామకష్ణ సుధీన్, గోవా ఫార్వర్డ్ పార్టీ నుంచి విజయ్ సర్దేశాయ్లను సలహా సంఘంలోకి తీసుకున్నారు. అయితే రాజ్యాంగం నిబంధనల ప్రకారం కే బినెట్కు సలహా సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కులే దని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. పరీకర్ తన కేబినెట్ మంత్రులపై నమ్మకం లేకపోవడం వల్లనా లేదా సమర్థులైన వ్యక్తులు లేనందున సీఎం బాధ్యతలు ఇతరులకు అప్పగించడం లేదని ప్రశ్నించగా, సమర్థులైన నాయకులు లేకనే అని సమాధానం వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లకుగాను కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు రాగా, బీజేపీకి 13 సీట్లు వచ్చాయి. ఇతర పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు జరుగకుండా ఉండేందుకు పరీకర్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్న పరీకర్
పనాజీ: కొంతకాలంగా క్లోమ గ్రంధి సమస్యతో బాధపడుతోన్న గోవా సీఎం మనోహర్ పరీకర్ ముంబైలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విదేశాలకు వెళ్లనున్నట్లు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చికిత్స నిమిత్తం ఆయన అమెరికా వెళ్లనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం రాష్ట్రంలో లేని సమయంలో పాలనాపరమైన సూచనలిచ్చేందుకు ‘కేబినేట్ సలహా కమిటీ’ఏర్పాటైంది.పరీకర్ నేతృత్వంలో సోమవారం ఇక్కడ జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. బీజేపీకి చెందిన సీనియర్ మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా, గోవా ఫార్వార్డ్ పార్టీ(జీఎఫ్‌పీ)కి చెందిన విజయ్ సర్దేశాయ్, మహారాష్ట్రవాదీ గోమంత్రక్ పార్టీ(ఎమ్జీపీ)కి చెందిన పలువురు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సీఎం పలువురు పోలీసు ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు. -
'పారికర్‌కు కూడా ఆ విషయం తెలియదు'
సౌందట్టి (కర్ణాటక) : రాఫెల్ ఒప్పందంలో మార్పు చేస్తున్న విషయం అప్పుడు రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌కు కూడా తెలియదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పారికర్‌కు తెలియకుండానే ప్రధాని నరేంద్రమోదీ ఈ పనిచేశారని చెప్పారు. ఆ సమయంలో గోవాలో పారికర్ చేపలు కొనుగోలు చేస్తున్నారంటూ చమత్కరించారు. 'మాజీ రక్షణ శాఖమంత్రి గోవాలోని ఫిష్ మార్కెట్లో చేపలు కొనుగోలు చేస్తున్నారు. ప్రధాని మోదీ రాఫెల్ కాంట్రాక్టును పూర్తిగా మార్చేసిన విషయం ఆయనకు తెలియదు' అని రాహుల్ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మూడు ప్రశ్నలు ప్రధాని మోదీకి మీడియా ప్రతినిధులు సంధించాలని విజ్ఞప్తి చేశారు. అసలు రాఫెల్ జెట్ల ఖరీదు ఎంత? ఆ కాంట్రాక్టును ఎందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నుంచి తొలగించారు? ఎందుకు ఓ వ్యాపార వేత్తకు ఆ కాంట్రాక్టు అప్పగించారు? ఈ ప్రశ్నలు నేను గతంలో కూడా ప్రధానికి వేశాను. కానీ, ఒక్క సమాధానం లభించలేదు. మీకు దొరుకుతుందేమో ప్రశ్నించండి?' అని రాహుల్ అన్నారు. కర్ణాటకలో ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ ప్రచార వేడిని పెంచారు. అందులో భాగంగా జరిగిన బహిరంగ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి!
పనాజీ : కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. డీహైడ్రేషన్, రక్తపోటు (బీపీ) పడిపోవడంతో ఆయన ఆదివారం రాత్రి గోవా మెడికల్ కాలేజీలో చేరారు. కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న పారీకర్ (62)ను అమెరికా తరలించి చికిత్స అందించే అవకాశముందని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథనాలను పారీకర్‌ను చికిత్స అందిస్తున్న ఆస్పత్రి తోసిపుచ్చింది. ప్రస్తుతం సీఎం కోలుకుంటున్నారని తెలిపింది. ‘డీహైడ్రేషన్ కారణంగా సీఎం వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరారు. ఆయన త్వరితగతిన కోలుకుంటున్నారు’ అని గోవా సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. స్పెషలిస్ట్ డాక్టర్లు సీఎం ఆరోగ్యపరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే మీడియాకు తెలిపారు. వీల్‌చైర్ మీద సీఎం పారీకర్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఆయన వెంట కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఫిబ్రవరి 15న అనారోగ్యం కారణంగా ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో పారీకర్ చేరిన సంగతి తెలిసిందే. పాన్‌క్రియాటిస్ (క్లోమ సంబంధ) అస్వస్థతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 22న ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయి.. గోవా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. -
క్షేమంగా ఇంటికి వెళ్లిన సీఎం..
సాక్షి, పనాజీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన చికిత్స పొందుతున్నలీలావతి ఆస్పత్రి నుంచి గురువారం ఇంటికి పంపించారు. దీంతో ఆయన అక్కడ నుంచి నేరుగా గోవాకు చేరుకున్నారు. ఈ విషయాన్ని గోవా డిప్యూటీ స్పీకర్ మైఖెల్ లాబో స్పష్టం చేశారు. ఈ నెల (ఫిబ్రవరి) 15 నుంచి ప్యాంక్రియాటిస్ సమస్య కారణంగా లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై దుష్ప్రచారం కూడా జోరుగా సాగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే, పారికర్ చనిపోతే మరొకరు ముఖ్యమంత్రి అవుతారు అందులో అనుకోవడానికి ఏముందంటూ పెట్టి కలకలం రేపారు. ఈ వార్తలతో అసలు పారికర్‌కు ఏమైందంటూ పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. అయితే, అవన్నీ కూడా ఊహాగానాలే అని పారికర్ డిశ్చార్జి కావడంతో స్పష్టమైంది. 'పారికర్ గోవా చేరుకున్నారు. ఆయన ఆస్పత్రి నుంచి విడుదల కావడం మంచి శుభవార్త. అయితే, ఆయన ఎప్పుడు బడ్జెట్‌ను ప్రవేశ పెడతారనే విషయం ఇప్పుడే తెలియదు' అని మైఖెల్ చెప్పారు. పారికర్‌కు ఉన్న పట్టుదల సామర్థ్యమే ఆయనను కోలుకునేలా చేసిందని, ఆయనే బడ్జెట్ బిల్లు ప్రవేశ పెట్టాలని అనుకుంటే కచ్చితంగా త్వరలోనే పెడతారని స్పష్టం చేశారు. ప్రస్తుతం పారికర్ పనాజీలోని తన నివాసానికి వెళ్లారు. -
'పారికర్‌ను అమెరికాకైనా తరలిస్తాం..'
సాక్షి, పనాజీ : అవసరం అయితే మెరుగైన వైద్యం కోసం గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను అమెరికా తరలిస్తామని బీజేపీ నేత, గోవా డిప్యూటీ స్పీకర్ మైఖెల్ లాబో చెప్పారు. క్లోమం (ప్యాంక్రియాస్) సంబంధించిన సమస్య ఏర్పడిన కారణంగా కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన పారికర్ ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ప్రధాని మోదీ కూడా ఆయనను పరామర్శించి రావడంతో అంతలా పారికర్‌కు ఏమైందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అయితే, వాటన్నింటిని ఆస్పత్రి వర్గాలు కొట్టి పారేశాయి. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మైకెల్ కూడా సోమవారం ఓ ప్రకటన చేశారు. 'ఆయన మాకు కావాలి. మేం చేయగలిగిందంతా చేస్తాం. అవసరం అయితే, ఆయనను అమెరికాకు కూడా తరలిస్తాం' అని మీడియా ప్రతినిధులతో అసెంబ్లీ ప్రాంగణంలో చెప్పారు. ప్యాంక్రియాస్‌కు సంబంధించిన సమస్య కారణంగా పారికర్ ఈ నెల (ఫిబ్రవరి) 15న లీలావతి ఆస్పత్రిలో చేరి వైద్యంసేవలు పొందుతున్నారు. ఆయనకు ఓ సర్జరీ కూడా చేయగా ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు ఇప్పటికే చెప్పాయి. -
సీఎం ఆరోగ్యంపై వదంతులు.. ఖండన!
సాక్షి, ముంబై : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఆయనకు చికిత్స అందిస్తున్న ముంబైలోని ప్రఖ్యాత లీలావతి ఆస్పత్రి ఖండించింది. పారికర్ ఆరోగ్యం విషయమై మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, రూమర్లు అన్ని అవాస్తవమేనని, ఆయన చక్కగా చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం పారికర్ ఆరోగ్యం గురించి దురుద్దేశంతోనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఆయన ఆరోగ్యం విషయంలో వస్తున్న కథనాలు బూటకమని ఆస్పత్రి తీవ్రంగా పేర్కొంది. ‘మాగ్నెటిక్ మహారాష్ట్ర’ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొనేందుకు ముంబై వచ్చిన ప్రధాని మోదీ ఆదివారం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పారికర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంబారిన పడటంతో ఈ నెల 15న పారికర్ లీలావతి ఆస్పత్రిలో చేరారు. త్వరలోనే ఆయన కోలుకుంటారని, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారని గోవా సీఎంవో ఇప్పటికే ప్రకటించింది. -
గోవా సీఎం వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్ : అమ్మాయిలు కూడా బీర్లు తాగడం మొదలుపెట్టేశారని.. వారిని చూస్తుంటే తనకి భయమేస్తోందని గోవా సీఎం మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలువురు 'గర్ల్స్ హూ డ్రింక్ బీర్' హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ, పారికర్ వ్యాఖ్యలకు నిరసనగా బీరు తాగే ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. అమ్మాయిలు బీరు తాగడాన్ని మాత్రమే చూశానని పారికర్ చెబుతున్నారని, మహిళలు పోర్న్ చూస్తారని, సిగరెట్లు తాగుతారని ఆయనకు తెలిస్తే నెలల తరబడి నిద్రపోరేమోనని ఒకరు, ప్రధాని మహిళను చూసి నవ్వుతారు, పారికర్ అమ్మాయిలను చూసి భయపడతారు, యోగి మహిళలను ఇంటికే పరిమితం చేయాలంటారు... వీరా మన పాలకులు అని ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు. పారికర్ కు ఎనిమిది నెలల పాటు అత్యాచారనికి గురైన అమ్మాయి విషయం తెలియదా? పరువు హత్యలు కనిపించడం లేదా? పట్టపగలు బస్సుల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తెలియవా అని నిలిదీస్తున్నారు. ఇవన్నీ పారికర్ ను భయపెట్టలేదా అని ట్రోల్ చేస్తున్నారు. ఓ అమ్మాయిగా బీరు తాగడం నాకిష్టం అంటూ పలువురు అమ్మాయిలు బీరు తాగుతున్న ఫొటోలను పోస్టు చేస్తున్నారు. ఇంకొందరు యువతులైతే తండ్రితో బీరు తాగిన ఫొటోలను పోస్ట్ చేయండని సూచిస్తున్నారు. To Sir, With Love. Cheers from Goa, Mr Parrikar! #GirlsWhoDrinkBeer C’mon good ladies, let’s make this weekend worth it. Use the hashtag and share your beer 🍻 pics on my timeline. The one with the best pic, your beer is on me. pic.twitter.com/6AX3jejIIV — Nishtha Gautam (@TedhiLakeer) 10 February 2018 -
‘అలాంటి అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది’
సాక్షి, పనాజీ : భారత్‌లో మద్యం సేవించే యువతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని సర్వేలో స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్‌పారికర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు కూడా బీర్లు తాగటం మొదలుపెట్టేశారని.. వారిని చూస్తుంటే తనకి భయమేస్తోందని ఆయన అంటున్నారు. ‘‘అమ్మాయిల్లో ఆల్కహాల్ సేవించే అలవాటు పెరిగిపోయింది. అది పరిమితి ఎప్పుడో దాటి పోయింది. బీర్లు ఎగబడి తాగేస్తున్నారు. ఇది నాకు ఎంతో భయాన్ని కలగజేస్తోంది’ అని పారికర్ పేర్కొన్నారు. గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్ కు హాజరైన యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ మాట అమ్మాయిలందరినీ ఉద్దేశించి నేను అనటం లేదు. ఇక్కడున్న వాళ్లలో ఆ అలవాటు లేకపోలేదు. కానీ, గోవాలో గత రెండేళ్లలో మద్యం సేవిస్తున్న అమ్మాయిల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని పారికర్ అభిప్రాయపడ్డారు. ఇక గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై ఆయన మాట్లాడుతూ.. డ్రగ్ నెట్ వర్క్ ను అంతమొందించే ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. కాలేజీలో డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా ఉందని తాను భావించడం లేదని.. కానీ, మొత్తానికి లేదన్న వాదనతో మాత్రం తాను ఏకీభవించబోవని చెప్పారు. ఇప్పటి వరకు 170 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. చట్టంలోని లోపాలతో నిందితులు త్వరగతిన బయటపడుతున్నారని.. అందుకే శిక్షాస్మృతిని సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక నిరోద్యోగ సమస్యపై స్పందిస్తూ... గోవా యువత కష్టపడి పని చేయడానికి ఇష్టపడటం లేదని... సింపుల్ వర్క్ వైపే మొగ్గుచూపుతున్నారని చెప్పారు. గవర్నమెంట్ జాబ్ అంటే పని ఉండదనే భావంతో ఉన్నారని పారికర్ అసహనం వ్యక్తం చేశారు. -
గోవాలో అలా మద్యం సేవిస్తే జైలుకే!
పణజి : భారత్‌లో అత్యధికులు సందర్శించే ప్రాంతంగా.. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తలసరి ఆదాయంలో అగ్రగామిగా ఉన్న గోవాకు పర్యాటకమే ప్రాణవాయువన్న సంగతి తెలిసిందే. అందమైన బీచ్‌లు, నైట్‌లైఫ్‌తోపాటు మద్యసేవనానికి కూడా చాలా మంది పర్యాటకులు ఓటేస్తారు. అయితే ఇక నుంచి గోవాలో.. ఎక్కడపడితేఅక్కడ మందు తాగడం కుదరదు. ఎందుకంటే బహిరంగ మద్యసేవనాన్ని నేరంగా పరిగణించాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నది, ఆ మేరకు రూపొందించిన చట్టాన్ని అతిత్వరలోనే అమలుచేయనుంది. రెండు కఠిన చట్టాలు : గురువారం పణాజిలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘గోవాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధించబోతున్నాం. దానికి సంబంధించిన చట్టానికి ఫిబ్రవరి చివర్లో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆమోదిస్తాం. దీనితోపాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని కూడా నేరంగా పరిగణించేలా చట్టాల్లో మార్పులు చేస్తాం. ఈ రెండూ కఠినంగా అమలైతే గోవా పరిశుభ్రంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు’ అని చెప్పారు. మందుబాబులకు షాకిచ్చిన కేరళ సర్కార్ : రాష్ట్రంలో తయారయ్యే విదేశీ మద్యంపై పన్నులు భారీగా పెంచుతూ కేరళ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తద్వారా మందుబాబులకు షాకిచ్చింది. రూ.400లోపు విదేశీ మద్యంపై 200 శాతం, బీర్లపై 100 శాతం ట్యాక్స్ విధిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. -
బీజేపీలో వింత పరిస్థితి
లక్నో: కేంద్రంలోనూ, 19 రాష్ట్రాల్లోనూ అధికారాన్ని చెలాయిస్తున్న కమలం పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీటును దక్కించుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాజీ రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ రాజీనామాతో ఖాళీ అయిన పెద్దలసభ సీటును బీజేపీలో ఎవరూ ఆశించకపోవడం వెనుక మరో కారణం ఉంది. పరీకర్ రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయనను యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేశారు. మళ్లీ తన సేవలు అవసరం పడటంతో ఆయన తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఆశావహుల నిరాసక్తత పార్టీలో ఏదైనా పదవి ఖాళీగా ఉందంటే ఆశావహులు భారీగా పైరవీలకు దిగుతుంటారు. కానీ పరీకర్ వదిలివెళ్లిన రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు ఎవరూ ముందుకురావడం విస్తుగొల్పుతుంది. ఈ సీటుకు గడువు 2020, నవంబర్ వరకు ఉంది. రెండున్నరేళ్లలో గడువు ముగియనుండటంతో దీనిపై బీజేపీ నేతలెవరూ ఆసక్తి చూపడం లేదు. పూర్తికాలం కొనసాగే పదవులు చేపట్టే అవకాశముండగా స్వల్పకాలిక పోస్ట్ ఎందుకున్న భావనతో ఆశావహులు ఉన్నట్టు కనబడుతోంది. ఎనిమిది సీట్లపైనే గురి ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 403 సీట్లున్న శాసనసభలో కమలదళం బలం 325కు పెరగడంతో రాష్ట్రంలో 8 రాజ్యసభ సీట్లు ఈ పార్టీకి దక్కనున్నాయి. మరో ఆరు నెలల్లో ఈ సీట్లను భర్తీ చేస్తారు. ఈ ఆరు మాసాలు ఓపిక పడితే ఆరేళ్ల పదవి సొంతమవుతుందన్న భావనతో పరీకర్ సీటును ఎవరూ ఆశించడం లేదు. ‘రెండేళ్ల రాజ్యసభ సీటు పట్ల ఆశావహులు ఆసక్తి చూపడం లేదు. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న యూపీలోని పది రాజ్యసభ సీట్ల కోసమే పైరవీలు చేస్తున్నార’ని బీజేపీ అంతర్గత వర్గాలు వెల్లడించాయి. అల్ఫోన్స్‌కు ఛాన్స్ అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ్ బహదూర్ పాఠక్ తోసిపుచ్చారు. ఖాళీ అయిన సీటును ఎవరికి కేటాయించాలనేది తమ పార్టీ పార్లమెంటరీ సెంట్రల్ బోర్డు నిర్ణయిస్తుందని చెప్పారు. త్వరలోనే అభ్యర్థిని ఎంపిక చేస్తుందని తెలిపారు. పరీకర్ సీటు కోసం తమ పార్టీ నేతలు ఎందుకు పైరవీలు చేయడం లేదనే దానికి కారణం లేదన్నారు. ఈ సీటును కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి కె. అల్ఫోన్స్‌కు కేటాయించే అవకాశముందని లక్నో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో ఎన్నిక జరగనున్న ఈ స్థానంలో అభ్యర్థిని నిలిపేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది. పదో సీటు ఎవరిదో..? యూపీలో వచ్చే ఏడాది ఖాళీ కానున్న 10 రాజ్యసభ సీట్లలో బీజేపీ సొంత బలంతో కనీసం ఎనిమిదింటిని దక్కించుకుంటుంది. 47 మంది ఎమ్మెల్యేలు కలిగిన సమాజ్‌వాదీ పార్టీ ఒక సీటు గెలిచే అవకాశముంది. పదో సీటును ప్రతిపక్షాలు దక్కించుకోవాలంటే సమాజ్‌వాదీ పార్టీకి బీఎస్పీ(19), కాంగ్రెస్(7), ఆర్ఎల్డీ(1) మద్దతు అవసరమవుతుంది. యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 37 ప్రథమ ప్రాధాన్య ఓట్లు అవసరం. -
ముందు చరిత్ర చదవండి!
పనాజీ: బీజేపీ ప్రభుత్వాన్ని నాజీ పాలనతో పోల్చే వారు ముందుగా యూరోప్ చరిత్ర చదవాలని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ హితవు పలికారు. పోర్చుగీసు హయాంనాటి భారత వ్యతిరేక భావజాలం మళ్లీ గోవాలో తలెత్తుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన గోవా లిబరేషన్ డే వేడుకల్లో పారికర్ పాల్గొని ప్రసంగించారు. కొంతమంది కావాలనే తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ పాలనను నాజీ పాలనతో పోల్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల చరిత్రను చదివి అప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించాలని సూచించారు. అలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మనం ఇతరుల తప్పులను ఒక వేలుతో సూచిస్తే మిగతా నాలుగు వేళ్లు మన వైపు సూచిస్తాయన్నారు. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ వెలువరించే ఒక మేగజైన్లో బీజేపీ పాలనను నాజీ పాలనతో పోలుస్తూ వ్యాసం వచ్చింది. ఆ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. దుష్ప్రచారం చేస్తున్న వారిని పట్టించుకునే సమయం ప్రభుత్వానికి లేదన్నారు. గోవా అభివృద్ధే తమ ధ్యేయం అని తెలిపారు. పోర్చుగీసు వారి ఆధీనంలో ఉన్న గోవాను భారత సాయుధ బలగాలు 19 డిసెంబర్ 1961న స్వాధీనం చేసుకొన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు.. విమర్శలు!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాహుల్‌గాంధీ ఎదురైన తొలి ఫలితాల్లో నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత వెలువడిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలైంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఊహించినదే అయినా.. మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో హస్తం ఓడినప్పటికీ.. గట్టిపోటీ ఇచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిపోటీ ఇవ్వడం.. అసెంబ్లీ సీట్లపరంగా కూడా మెరుగవ్వడం సానుకూల పరిణామమని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీకి ఇది శుభారంభమేనని చెప్తున్నారు. అయితే, బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు మాత్రం రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు సంధిస్తున్నారు. ఆదిలోనే హంసపాదు అన్న తరహాలో రాహుల్‌కు ఆరంభంలోనే పరాజయాలు పలుకరించాయని ఎద్దేవా చేశారు. రాహుల్ అధ్యక్షుడు కాగానే దురదృష్టం వెంటాడినట్టు ఆయనను ఈ ఫలితాలు పలుకరించాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాత్ సింగ్ విమర్శించారు. రాహుల్ తన ఓపెనింగ్ ఇన్నింగ్స్ జీరో కొట్టారని గోవా సీఎం మనోహర్ పారికర్ ఎద్దేవా చేశారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే.. తమ పని సులువు అవుతుందని తాను చెప్పానని, అదే ఈ ఫలితాల్లో రుజువైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. -
మందు కొడితే.. అత్తారిల్లే..!?
సాక్షి, పనాజీ: రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధిస్తున్నట్లు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ ఆదివారం ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లోనూ, రహదారులమీద మద్యం సేవించిన వ్యక్తులు సృష్టించే ఆగడాలకు అంతు ఉండడంలేదని చెప్పారు. ఇలా కొంతమంది తాగుబోతులు చేసే వికృతచేష్టల వల్ల ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఇదోక తాగుబోతుల రాష్ట్రంగా భావించే అవకాశం ఉందన్నారు. బహిరంగ మద్యపాన నిషేధానికి సంబంధించిన ఎక్సైజ్ చట్టానికి సవరణలు చేసి అమలు చేస్తామని ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యనిషేధానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను వచ్చే నెల్లో విడుదల చేస్తామని పారేకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లఘించిన వారిని ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెప్పారు. -
రాజీనామా చేసి, ఇంట్లో కూర్చుంటా: సీఎం
సాక్షి, పనాజీ : ‘నాది రాజకీయ నేపథ్య కుటుంబం కాదు. ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 10 ఏళ్ల కాలానికే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని భావించాను. ఒకవేళ నేను రాజకీయాలకు తగిన వాడిని కాదని ఆలోచన వస్తే మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా నా పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చునేవాడినని’ కేంద్ర మాజీ మంత్రి, గోవా సీఎం మనోహర్ పారికర్ అన్నారు. ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ అయిన తాను తనకు ఇష్టం లేకున్నా రాజకీయ జీవితం ప్రారంభించాల్సి వచ్చిందని ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ’గతంలో కేంద్రం సూచన మేరకు సీఎం పదవికి రాజీనామా చేసి అక్కడ మంత్రి పదవి చేపట్టాను. అయితే గోవా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ మీ కోసం తిరిగొచ్చేశాను. ఈసారి ఏం జరిగినా సరే.. ఎలాంటి ఆపద వచ్చినా తట్టుకుని నిలబడతాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో విడిచి వెళ్లిపోను. సీఎంగా పూర్తికాలం పదవిలో కొనసాగుతాను. మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదు. నాది రాజకీయ నేపథ్య కుటుంబం కాదు. ఒకవేళ పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టినవాడినైతే ఢిల్లీ రాజకీయాలకు అనుగుణంగా మారేవాడినని’ ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల గోవాలోని పనాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన సీఎం పారికర్ ఘన విజయం సాధించారు. -
సైనికులకు ఇక ఏసీ జాకెట్స్
న్యూఢిల్లీ: ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో సేవలందించే స్పెషల్ ఫోర్స్ సైనికులకు ఎయిర్ కండిషన్ (ఏసీ) జాకెట్లను సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ జాకెట్లను ఏ మెటీరియల్, టెక్నాలజీతో రూపొందిస్తారనే వివరాలు వెల్లడికాకపోయినా ఈ తరహా జాకెట్లను సైనికులకు సమకూర్చే ప్రతిపాదనను రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ నిర్ధారించారు. ప్రత్యేక బలగాల ఆపరేషన్ సుదీర్ఘంగా సాగే ప్రక్రియ కావడంతో సైనికుల శరీరం వేడెక్కే అవకాశం ఉండటంతో వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఆ సమయంలో సైనికులు ఏసీ జాకెట్ ధరిస్తే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని పారికర్ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రస్తుత గోవా సీఎంగా ఉన్న పారికర్ ఆదివారం పనాజీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. అమెరికన్ సైనికులు ఇప్పటికే ఇలాంటి జాకెట్స్ వాడుతున్నారు. దుస్తుల్లో చిన్న బ్యాటరీని అమర్చడం ద్వారా సైనికుల శరీరం వేడెక్కకుండా ఈ జాకెట్లను అమెరికా రక్షణ శాఖ సైనికులకు సమకూర్చింది. -
ఓడిపోయినా తిరిగి మంత్రిని అవుతా!
ముంబై: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పై బీజేపీ మిత్రపక్షం శివసేన మండిపడింది. తాను పనాజీ ఎన్నికలో ఓడిపోయినా ఫర్వాలేదని, కేంద్ర రక్షణ మంత్రి పదవి తన కోసం తిరిగి ఎదురు చూస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో ఈ మధ్య వైరల్ అవుతోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా, శివసేన తన పత్రిక సామ్న సంపాదకీయంలో పారికర్‌ను ఏకీపడేసింది. "పారికర్ రాజకీయ ధురంధరుడు, నిజాయితీ పరుడు అన్న మాట ఈ ప్రకటనతో అబద్ధమని తేలింది. ఓ ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆయన చేయాల్సిన వ్యాఖ్యలు కావు. దేశ అత్యున్నత పదవిని కూడా హేళన చేస్తూ ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో రక్షణ మంత్రి బాధ్యతలు అప్పజెప్పిన ప్రధాని మోదీని కూడా ఆయన అవమానించారు" అని సామ్న వ్యాసంలో పేర్కొంది. ఇలాంటివి ప్రజల్లో నేతలపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తాయని తెలిపింది. అంతేకాదు సరిహద్దులో ఓ పక్క ఉద్రిక్తత పరిస్థితి ఉన్న సమయంలో, పారికర్ సెలవుపై గోవాకు వెళ్లి చేపల కూర వండుకుని తిన్న ఉదంతంను కూడా సామ్న ప్రస్తావించింది. అయితే బీజేపీ మాత్రం పారికర్ వ్యాఖ్యలతో కూడిన టేప్‌ను ఓ అబద్ధంగా తేల్చేసింది. ఈ విషయంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన పార్టీ అబద్ధపు ప్రచారంతో ఎన్నికల కోడ్ ను ఉల్లఘిస్తున్నారంటూ పేర్కొంది. రక్షణ మంత్రిగా రాజీనామా చేసిన పారికర్, గోవాలో తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తిరిగి ప్రత్యక్ష ఎన్నిక సమరానికి సిద్ధమైపోతున్న విషయం తెలిసిందే. ఆగష్టు 23న పనాజీ, వల్పోయి నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనున్నాయి. నేనేం ఢిల్లీ వెళ్లట్లేదు... ఫడ్నవిస్ మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు కోసం బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తుందన్న వార్తలపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఆ వార్తలో నిజం లేదని ఆయన తేల్చేశారు. కేంద్ర మంత్రి పదవిపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని, అధిష్ఠానం నుంచి అలాంటి సంకేతాలు కూడా అందలేదని ఆయన తెలిపారు. 2019 వరకు తాను ముఖ్యమంత్రిగా, రావ్ సాహెబ్ దన్వే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతారని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. -
సర్జికల్ స్ట్రైక్స్ పై ‘ఆయన’కు నో ఐడియా
సాక్షి, పనాజీ: యూరీ దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి ముష్కరులను మట్టుపెట్టింది భారత సైన్యం. ఆ సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ నేతృత్వంలోనే ఈ మెరుపు దాడి జరిగిందన్న విషయం విదితమే. అయితే దీనిపై గొప్పలు చెప్పుకున్న పారికర్‌కు, సర్జికల్ స్ట్రైక్స్‌పై కనీస అవగాహన కూడా లేదంటోంది కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన గోవా ముఖ్యమంత్రిగా తిరిగి పగ్గాలు చేపట్టి, త్వరలో జరగబోయే పనాజీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీచేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు శాంతారామ్ నాయక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పారికర్‌పై మాటల తూటాలు పేల్చారు. ‘సర్జికల్ దాడుల గురించి పారికర్‌కు ఏం తెలీదు. జాతీయ భద్రతా విభాగం, ప్రధాని కార్యాలయ సిబ్బంది మాత్రమే అందులో పాల్గొన్నారు. తర్వాతే పారికర్‌కు ఆ విషయం తెలిసింది. అయినప్పటికీ ఆ గొప్పతనం అంతా తనది, మోదీది, వాళ్లను తీర్చిదిద్దిన ఆర్ఎస్ఎస్దంటూ పారికర్ చెప్పుకుని తిరిగాడు. ఇక్కడి రాజకీయాలకు భయపడే కేంద్రానికి వెళ్లాడు. అక్కడా రక్షణ మంత్రిగా విఫలం కావటంతో తిరిగి రాష్ట్రానికి పంపించేశారు. కానీ, అసలు ఆయన గమనించాల్సిన విషయం ఏంటంటే రాజకీయాలకే పారికర్ అనర్హుడు’ అని నాయక్ పేర్కొన్నారు. గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పారికర్ ఆగస్టు 23న జరగబోయే పనాజీ ఉప ఎన్నిక బరిలో దిగుతున్నారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి గిరీశ్ చోదంకర్, గోవా సురక్ష మోర్చా పార్టీ తరపున ఆనంద్ శిరోద్కర్ పోటీ చేస్తున్నారు. -
రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే యోగి రాజీనామా
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గోవా సీఎం మనోహర్ పరీకర్‌లు రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమైనది కావడంతో ఎన్నికల తర్వాతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే లోక్‌సభకు రాజీనామా చేయనున్నారు. ఆదిత్యానాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య లోక్‌సభ ఎంపీలు కాగా, మనోహర్ పరీకర్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గోవా ముఖ్యమంత్రిగా మార్చి 14న పరీకర్ ప్రమాణస్వీకారం చేశారు. మార్చి 19న యోగి, మౌర్య ప్రమాణం చేశారు. ఆరు నెలల్లో వీరు ముగ్గురు తమ రాష్ట్రాల లెజిస్లేటర్ సభ్యులుగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే వీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. -
వీఐపీ కల్చరనేది మంచిది కాదు: పారికర్
పనాజీ: వీఐపీ సంస్కృతి అంత మంచిది కాదని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. దేశంలో ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రపతి, ప్రధానికి తప్ప దేశంలో వీఐపీ భద్రత కల్పించాల్సిన అవసరం పెద్దగా లేదని చెప్పారు. ఎర్రబుగ్గలను తొలగించిన అంశంపై మీడియా ప్రతినిధులు పారికర్‌ను ప్రశ్నించగా ఆ విషయం తెలియదని, ఒక వేళ కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే తన కారుకు ఉన్న ఎర్రబుగ్గను తీసి ఇప్పుడే మీకు ఇస్తానంటూ సరదాగా అన్నారు. ‘వీఐపీ కల్చర్ తగ్గించాలని నేను అనుకుంటాను. వాస్తవానికి నేనొకటి క్లియర్‌గా చెప్పాలని అనుకుంటున్నాను. వీఐపీ సంస్కృతి అంతమంచిది కాదు. కానీ, ఇదే మన దేశంలో పెరుగుతోంది. భద్రత అనేది కేవలం మానసిక భావన. ఇద్దరు, లేదా ముగ్గురు లేదా నలుగురు నుంచి భద్రతను పొందవచ్చు. రాష్ట్రపతి, ప్రధానిని మినహాయిస్తే వీఐపీ భద్రత పేరిట మనం ఎక్కువ సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను’ అని పారికర్ చెప్పారు. -
‘భారత్‌తో పాక్ డేంజర్ గేమ్.. తట్టుకోలేదు’
గోవా: భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ విషయంలో పాకిస్థాన్ చాలా ఆపాయకరమైన ఆట ఆడుతోందని రక్షణశాఖ మాజీ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఒక్కసారి భారత్ యాక్షన్‌కు దిగితే ఎలా ఉంటుందో పాకిస్థాన్ అర్థం చేసుకుంటే మంచిదని సూచించారు. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ సరైన ఆధారాలు చూపించకుండానే కులభూషణ్‌కు పాక్ ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పారికర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘కులభూషణ్ యాదవ్ పేరిట భారత్‌తో పాక్ చాలా డేంజర్ గేమ్ ఆడుతోంది. భారత్ తిరుగుబాటుకు దిగితే తిరిగి పోరాడే శక్తి పాక్‌కు లేదు. వారిని వారు ఏ విధంగా రక్షించుకోలేరు. కానీ, మేం శాంతిని కోరుకుంటున్నాం. రెచ్చగొట్టాలని అనుకోవడం లేదు. ఈ విషయం అర్ధం చేసుకొని జాదవ్‌ను తిరిగి పంపిస్తే ఆ దేశానికే మంచిది. ముందుగా ఒక విషయం చెప్పాలి. పాకిస్థానే ఇరాన్లో ఉన్న జాదవ్‌ను ఎత్తుకెళ్లింది. అరెస్టు సమయంలో పాక్‌లో లేడు. ఓ తాలిబన్ జాదవ్‌ను కిడ్నాప్ చేసి పాక్ తీసుకెళ్లినట్లు మాకు ఇరాన్ స్పష్టం చేసింది. ఇలాంటి దుశ్చర్యలు చేస్తుండటం పాక్‌కు అలవాటు. అవసరం అయితే ఆ దేశం ఇంకోలాగ కూడా చేస్తుంది. ఏదేమైనా జాదవ్‌ను ఉరి తీస్తే చూస్తూ ఊరుకోం. బదులిచ్చి తీరుతాం. ఈ విషయాన్ని ఇప్పటికే విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు కూడా’ అని పారికర్ అన్నారు. -
దిగ్విజయ్ వల్లే సీఎం అయ్యా: పారికర్
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా.. తనకు అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కు గోవా సీఎం, రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ కృతజ్ఞతలు తెలిపారు. మార్చి మొదటి వారంలో రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన పారికర్.. శుక్రవారం నాడు జీరో అవర్ సందర్భంగా రాజ్యసభకు వెళ్లారు. అక్కడి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అందరినీ గోవాకు స్వాగతించారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సభ్యులు అందరూ తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు తనకు ఎంతగానో సహకరించారని, వాళ్లంతా ఎప్పుడు గోవా రావాలనుకున్నా అందరికీ స్వాగతమని అన్నారు. ఆ తర్వాత.. గోవాలోనే ఉన్నా, ఏమీ చేయకుండా కూర్చున్నందుకు దిగ్విజయ్ సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానని, ఆయన వల్లే తాను ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగానని వ్యాఖ్యానించారు. దాంతో కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా సీట్లలోంచి లేచి పోడియం వద్దకు వచ్చి తీవ్రస్థాయిలో నిరసన, అభ్యంతరం తెలియజేశారు. మార్చి 11వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో గోవాలో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 17, బీజేపీకి 13 రాగా.. ఇతర చిన్న పార్టీలు మిగిలిన స్థానాలను పంచుకున్నాయి. కాంగ్రెస్ ముందుగా స్పందించకపోవడంతో బీజేపీ పావులు కదిపి, చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మనోహర్ పారికర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్ తరఫున పరిశీలకుడిగా సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గోవాలోనే మకాం వేశారు. అయినా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోగా.. సీనియర్ నాయకుడు విశ్వజిత్ రాణే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీలో బల నిరూపణకు కొద్ది సేపటి ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం దిగ్విజయ్‌కు షాకిచ్చింది. తర్వాత మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేశారు. దిగ్విజయ్ సింగ్ వల్లే గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాలేదని వాళ్లిద్దరూ వ్యాఖ్యానించారు. -
రాజ్యసభలో కలకలం రేపిన సీఎం
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ శుక్రవారం రాజ్యసభలో అడుగు పెట్టడంతో గందరగోళం రేగింది. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభలో వెల్ లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. గోవా ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పరీకర్ జీరో అవర్ లో సభలోకి అడుగుపెట్టారు. పరీకర్ రాకను గమనించిన కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్ సింగ్, బీఏ హరిప్రసాద్ తదితరులు తమ స్థానాల్లో నిలబడి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరీకర్ కు మద్దతుగా బీజేపీ సభ్యులు కూడా నిలబడి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం రేగింది. సభ్యులకు డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో రాజీవ్ గౌడ, హుస్సేన్ దాల్వాయ్ తదితర కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి పరీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి ముఖ్తాస్ అబ్బాస్ నఖ్వి చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు విపక్ష సభ్యులకు మరింత ఆగ్రహం కలిగించాయి. గోవా కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పేందుకు పరీకర్ సభకు వచ్చారని నఖ్వి వ్యంగ్యంగా అనడంతో బీజేపీ బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. రక్షణ మంత్రి పదవికి పరీకర్ రాజీనామా చేసిన గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాగా, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ్యకు పరీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రధానితో పారికర్ భేటీ
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీలోకి అడుగుపెట్టి తొలిసారి ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి బాధ్యతలతోపాటు ఆర్థికశాఖను కూడా తన వద్దే ఉంచుకున్న పారికర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) కౌన్సిల్ సమావేశానికి కూడా హాజరుకానున్నట్లు గోవా ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. ‘గోవా ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్రమోదీని ఈ రోజు కలిశారు’ అని వారు వెల్లడించారు. గోవా ఎన్నికల తర్వాత అంతకుముందు రక్షణశాఖ బాధ్యతలు నిర్వహించిన మనోహర్ పారికర్ ఆ బాధ్యతలు వదిలేసి గోవా పరిపాలన పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే. -
బల పరీక్ష నెగ్గిన పరీకర్
-
మోదీ వేవ్
-
బల పరీక్ష నెగ్గిన పరీకర్
⇒ గోవాలో 22–16 ఓట్ల తేడాతో విజయం ⇒ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా పణజి: గోవాలో మనోహర్ పరీకర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గురు వారం బల నిరూపణ పరీక్షలో నెగ్గింది. 22 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 40 మంది సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీలో బీజేపీ బలం నిరూపించు కుంది. బీజేపీ నుంచి 12 మంది, గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), ఎంజీపీల నుంచి ముగ్గురు చొప్పున, ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఎన్సీపీ సభ్యుడు కలిపి మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. బీజేపీ ఎమ్మెల్యే సిద్ధార్థ్ ప్రొటెమ్ స్పీకర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె గైర్హాజరీతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 16 ఓట్లు పడ్డాయి. దీంతో 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం కోసం చివరి వరకు ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదు. బీజేపీ బల పరీక్ష నెగ్గిన కొద్దిసేపటికే విశ్వజిత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ గోవా ప్రజలకు ద్రోహం చేసిందని విమర్శించారు. బల పరీక్ష నెగ్గిన అనంతరం పరీకర్ మాట్లాడుతూ.. మొదటి నుంచీ కాంగ్రెస్‌కు సరిపడా మెజారిటీ లేక పోయినా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ హడావిడి చేసిందని విమర్శిం చారు. గోవాలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్లు వస్తుండటంతోనే ఈ హడావిడి జరిగిందని పేర్కొన్నారు. -
'దేశ ప్రజల ముందు మేం నిరూపించుకున్నాం'
-
'దేశ ప్రజల ముందు మేం నిరూపించుకున్నాం'
పణజి: 'మాకు 23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అసెంబ్లీ సాక్షిగా జరిగిన బలపరీక్షలో ఇదే విషయాన్ని మేం దేశ ప్రజలకు చాటాం' అని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. గురువారం గోవా అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తమకు మెజారిటీ ఉందని చెప్తున్నారు. కానీ అది ఉత్తిమాటేనని తేలిపోయింది. మొదటినుంచి వారి వద్ద ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ లేదు' అని పారికర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా దిగ్విజయ్ సింగ్ దిగిపోవాలన్న డిమాండ్ ఊపందుకోవడం వల్లే ఆయన తమ వద్ద సంఖ్యాబలముందనే ఊహాగానాలను తెరపైకి తెచ్చిఉంటారని విమర్శించారు. తమది సంకీర్ణ ప్రభుత్వమని, కాబట్టి సంకీర్ణ పక్షాలతో చర్చించి.. ఉప ముఖ్యమంత్రి నియమాకంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని, పచ్చకామర్లు వచ్చినవాడికి లోకమంత పచ్చగా కనిపించినట్టు ప్రత్యర్థులు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలపై తాము ఎటువంటి ఒత్తిడి పెట్టలేదని, ప్రతిపక్షాల తరహాలో వారిని హోటళ్లలో ఉంచడం, గుర్తుతెలియని ప్రదేశాలకు తీసుకెళ్లడంలాంటివి చేయలేదని, ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేశారని పారికర్ పేర్కొన్నారు. -
బలపరీక్షలో నెగ్గిన పారికర్!
-
బలపరీక్షలో నెగ్గిన పారికర్!
గోవాలో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించింది. గురువారం గోవా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించిన బలపరీక్షలో మెజారిటీని నిరూపించుకుంది. మనోహర్ ప్రభుత్వానికి అనుకూలంగా 22 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 16 ఓట్లు పడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 21. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో బీజేపీ గెలిచింది 13 స్థానాలే. ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు పలుకడంతో మెజారిటీతో బలపరీక్ష గండాన్ని బీజేపీ అధిగమించింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఇతరులు పది స్థానాలు గెలుపొందారు. ఇందులో గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలుకడంతో బీజేపీకి 22 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కన్నా తక్కువ స్థానాలు గెలుపొందినప్పటికీ, కేంద్ర రక్షణమంత్రిగా ఉన్న పారికర్‌ను ముఖ్యమంత్రిగా బరిలో నిలిపి.. వ్యూహాత్మకంగా పావులు కదిపిన బీజేపీ ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతును కూడగట్టింది. దీంతో బిత్తరపోయిన కాంగ్రెస్ పార్టీ సీఎంగా పారికర్ ప్రమాణాన్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పారికర్ ప్రమాణంపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. గురువారమే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలంటూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఎట్టిపరిస్థితుల్లో ఈ బలపరీక్షలో పారికర్ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతామని గురువారం కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. -
ఆ సీఎం ప్రధాని అవుతారని అద్వానీ భావించారు!
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొందరు నేతలు కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగి వస్తుండగా, మరికొందరు కేంద్రంలో చోటు దక్కించుకునే పనిలో ఉన్నారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో బీజేపీ భారీ విజయం సాధించడం, ఆపై మెజార్టీ పార్టీగా అవతరించకున్నా.. గోవా, మణిపూర్లలో చక్రం తప్పి అధికారాన్ని హస్తగతం చేసుకుంటోంది బీజేపీ. ఈ క్రమంలో మనోహర్ పారికర్ రక్షణమంత్రి పదవికి రాజీనామా చేసి, తన సొంత రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. గోవా సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే తరహాలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కేంద్రం నుంచి పిలుపొచ్చిందని, ఆయనకు రక్షణశాఖ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. ఆ వదంతులను సీఎం శివరాజ్ ఖండించక పోవడంతో అది నిజమై ఉండొచ్చునని భావిస్తున్నారు. ఒకానొక దశలో బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ.. శివరాజ్ చౌహన్ ప్రధాని అవుతారని, ఆ పదవికి ఆయన సమర్ధుడని భావించారట. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలతో కన్నా అద్వానీతో శివరాజ్‌కు సత్సంబంధాలు ఉండేవి. 2005 నవంబర్ 28న తొలిసారిగా శివరాజ్ చౌహాన్ మధ్యప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. వ్యాపమ్ కుంభకోణం, అక్రమ మైనింగ్, డంపర్ స్కామ్ లాంటి సమస్యలను ఆయన ఎదుర్కొని నిలబడ్డారు. ప్రస్తుతం రక్షణశాఖ అదనపు బాధ్యతలను అరుణ్ జైట్లీకి అప్పగించారు. బీజేపీ సీనియర్ నేత హితేష్ బాజ్‌పాయ్ మాత్రం ఈ వదంతలును కొట్టిపారేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ శివరాజ్ నేతృత్వంలోనే బీజేపీ బరిలోకి దిగుతుందని చెబుతున్నారు. శివరాజ్ కేంద్రానికి వెళ్లాలనుకుంటే ఇదే సరైన సమయమని, లేని పక్షంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని అందించయినా కేంద్రానికి షిఫ్ట్ అవుతారని పార్టీ సీనియర్ నేతలు విశ్వసిస్తున్నారు. -
గోవా సీఎంగా పరీకర్ ప్రమాణం
మరో 9 మంది మంత్రులుగా ప్రమాణం ⇒ రేపు అసెంబ్లీలో బలపరీక్షకు సుప్రీంకోర్టు ఆదేశం పణజి: గోవా పాలనా పగ్గాలు చేపట్టేందుకు రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన మనోహర్ పరీకర్ మంగళవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణంచేశారు. సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించనున్న ఆయనతో రాజ్‌భవన్‌లో గవర్నర్ మృదులా సిన్హా ప్రమాణం చేయించారు. పరీకర్తోపాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో బీజేపీ నుంచి ఇద్దరు, గోవా ఫార్వర్డ్ బ్లాక్(జీఎఫ్‌పీ) నుంచి ముగ్గురు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ) నుంచి ఇద్దరు, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. బాంబే ఐఐటీలో చదివిన 61 ఏళ్ల పరీకర్ గోవా సీఎం కావడం ఇది నాలుగోసారి. పరీకర్ ప్రమాణంపై స్టే విధించాలన్న కాంగ్రెస్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం కొట్టేసి, గురువారం బలపరీక్షకు ఆదేశించడం, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలసినా ఫలితం లేకపోవడంతో పరీకర్ సీఎంకావడానికి మార్గం సుగమమైంది. ప్రమాణ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, వెంకయ్య తదితరలు, ప్రముఖులు హాజరయ్యారు. మెజారిటీ నిరూపించుకుంటా: పరీకర్ బలపరీక్షలో మెజారిటీ నిరూపించుకుంటానని, తమవైపు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పరీకర్ తర్వాత విలేకర్లతో చెప్పారు. గోవాతనాన్ని నిలుపుకోవడం నా ప్రాధాన్యం. నెలలోపు ప్రభుత్వ కనీస ఉమ్మడి కార్యక్రమంపై ప్రకటన చేస్తాం’ అని చెప్పారు. కాంగ్రెస్ చివరి యత్నం.. పరీకర్ ప్రమాణానికి ముందు.. అధికారం కోసం చివరిక్షణంలోనూ కాంగ్రెస్ విఫలయత్నం చేసింది. పెద్ద పార్టీ అయిన తమకు ప్రభుత్వ ఏర్పాటు కోసం అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎల్పీ నేత కవ్లేకర్ సహా 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. తమకు మెజారిటీ ఉందన్నారు. తన విచక్షణ ప్రకారం నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారని పార్టీ నేత లుయిజిన్హో ఫలేరియో విలేకర్లతో చెప్పారు. మీకు మెజారిటీ ఉందా అని ప్రశ్నించగా.. బలపరీక్షలో తేలుతుందని చెప్పారు. 40 స్థానాల గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా, 13 సీట్లతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలవడం తెలిసిందే. మనోహర్ పరీకర్ ప్రస్థానం.. ఉత్తర గోవాలోని మపుసాలో మధ్యతరగతి వర్గానికి చెందిన వ్యాపార కుటుంబంలో పరీకర్ జన్మించారు. పరీకర్ 1994లో తొలిసారి గోవా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయంతోమోదీ ఏరికోరి పరీకర్‌ను మంత్రివర్గంలో చేర్చుకుని రక్షణ మంత్రి పదవిని అప్పగించారు. పరీకర్ ఆధ్వర్యంలోనే గోవా బాగా అభివృద్ధి చెందిందని..రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత ఏర్పడిందని రాష్ట్ర ప్రజలకు నమ్మకం కుదిరింది. బలపరీక్షే పరిష్కారం న్యూఢిల్లీ: పరీకర్ ప్రమాణ స్వీకారంపై స్టే విధించాలని కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. గురువారం అసెంబ్లీలో బలపరీక్ష జరపాలని గవర్నర్‌ను కోరింది. పరీక్షతో కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికి పరిష్కారం లభిస్తుందని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మంగళవారం హోలీ సెలవు దినమైనా కోర్టు ప్రత్యేకంగా సమావేశమై గోవా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ వేసిన పిటిషన్‌ను విచారించింది. ఈ విషయంలో కాంగ్రెస్ తీరు సరిగ్గాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్యపై గవర్నర్‌కు చెప్పని కాంగ్రెస్‌దే తప్పు. ప్రాంతీయ పార్టీల, స్వతంత్రుల మద్దతు అఫిడవిట్లను ఆ పార్టీ కోర్టుకు తీసుకురాలేదు.. ఇదంతా 30 సెకన్ల పని. రెండు రోజులుగా ఏం జరుగుతోందో తెలిసినా కాంగ్రెస్ పరీకర్‌ను కేసులో ఇంప్లీడ్ చేయలేదు. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడమనేది సంఖ్యాబలానికి సంబంధించిన విషయం’ అని పేర్కొంది. పరీకర్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ నిర్ణయంపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తమకు 21 మంది సభ్యుల మద్దతుందన్న బీజేపీ వాదనను పరిగణనలోకి తీసుకుంటూ గవర్నర్.. పరీకర్‌కు రాసిన లేఖను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నెల 16(గురువారం) ఉదయం 11 గంటలకు బలపరీక్ష నిర్వహించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని, సభ్యుల ప్రమాణం తర్వాత బలపరీక్ష జరపాలని గవర్నర్‌ను కోరింది. అత్యంత సీనియర్ సభ్యుణ్ని ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించాలని సూచించింది. అంతకుముందు కవ్లేకర్ తరపున సీనియన్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ను కాకుండా పరీకర్‌ను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అత్యంత వివాదాస్పదం, వాస్తవ విరుద్ధమని ఆక్షేపించారు.ఆమె రాజ్యాంగ సంప్రదాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలన్న కాంగ్రెస్ లేఖకు కనీస మర్యాద ఇవ్వలేదని ఆరోపించారు. -
పారికర్ రెండురోజుల ముఖ్యమంత్రే!
గోవా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత సంఖ్యాబలం తమకు ఉందని, ఈ నేపథ్యంలో పారికర్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. అయితే, ఆ పార్టీ అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. మంగళవారం యథాతథంగా పారికర్ ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పింది. గురువారం గోవా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి ఎవరికీ మెజారిటీ ఉందో తేల్చాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ తరఫున వాదనలు వినిపించిన ఆ పార్టీ నేత, సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రిగా పారికర్ మురిపెం రెండురోజులేనని ఆయన తేల్చేశారు. బలపరీక్షలో బీజేపీ విజయం సాధించలేదని, అప్పుడు కమలనాథుల సర్కారు దిగిపోకతప్పదని అన్నారు. సీఎం పారికర్ రెండురోజులే కొనసాగుతారని ఆయన జోస్యం చెప్పారు. -
ఎవరి బలమెంతో ఎల్లుండి తేల్చండి!
గురువారం గోవాలో బలపరీక్షకు ఆదేశించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: గోవాలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. గోవా అసెంబ్లీలో గురువారం బలపరీక్ష నిర్వహించి.. ఎవరి బలమెంతో తేల్చాలని ఆదేశించింది. ఈలోపు గవర్నర్ నిర్ణయించిన ప్రకారం మంగళవారం (ఈరోజు) సాయంత్రం ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణం చేయడానికి అంగీకరించింది. దీంతో ఈ రోజు సీఎంగా ప్రమాణం చేయబోతున్న పారికర్ ఎల్లుండి లోపు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. 40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఇతరులు పది స్థానాలు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. వ్యూహాత్మకంగా పావులు కదిపిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. కేంద్ర రక్షణమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌తో రాజీనామా చేయించి.. గోవా ముఖ్యమంత్రిగా బరిలోకి దింపి.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతును కూడగట్టింది. అయితే, రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ వేసింది. మెజారిటీ ఫిగర్‌ను సాధించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగిందని, రాజ్యాంగ ప్రమాణాలను దిగజార్చిందని కాంగ్రెస్ తరఫు లాయర్ అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే దీటుగా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో మంగళవారమే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి.. ఎవరికీ మెజారిటీ ఉందో తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. (చదవండి: సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌కు షాక్!) -
ఎవరి బలమెంతో ఈరోజే తేల్చండి!
-
సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌కు షాక్!
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం మీకుందా? ఉంటే గవర్నర్‌ను ఎందుకు కలువలేదు? కాంగ్రెస్ తీరుపై కోర్టు ఆగ్రహం న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్‌ను గవర్నర్ ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీకి షాక్ ఎదురైంది. గోవాలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గోవాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్‌పై వాదనలు విన్న సుప్రీంకోర్టు..గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత బలముంటే.. మీరు ఎందుకు గవర్నర్ ను కలువలేదని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. అసలు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఫిగర్ మీ వద్ద ఉందా? అని అడిగింది. సుప్రీంకోర్టు ప్రశ్నల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్ ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. 40 స్థానాలు ఉన్న గోవాలో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఇతరులు పది స్థానాలు గెలుపొందారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. మెజారిటీకి దూరంగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా పావులు కదిపిన బీజేపీ.. కేంద్ర రక్షణమంత్రిగా ఉన్న పారికర్‌తో రాజీనామా చేయించి.. గోవా ముఖ్యమంత్రిగా బరిలోకి దింపింది. దీంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, స్వతంత్రులు బీజేపీకి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రే గోవా సీఎంగా పారికర్‌ను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు. మంగళవారం సాయంత్రంగా సీఎంగా పారికర్ ప్రమాణం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై ఇంకా వాదనలు కొనసాగనున్నాయి. -
పారికర్‌కు సవాల్.. సుప్రీంలో పిటిషన్
-
అంతా గవర్నర్ల విచక్షణేనా?
‘‘రెండో స్థానంలోని పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేసే హక్కులేదు’’ అంటూ గోవా పరిణామాలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ లాయర్ పి.చిదంబరం ట్విటర్లో నిరసన తెలిపారు. శనివారం ఫలితాలు ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లో ఒకటైన గోవాలో ఏ పార్టీకి మెజారిటీ రాకున్నా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ పర్రీకర్‌ను గవర్నర్ మృదులా సిన్హా నియమించి, ప్రమాణంచేయడానికి ఆహ్వానించడంతో వివాదం తలెత్తింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షానికి మెజారిటీ రాకుంటే సభలో మిగిలిన పార్టీల కన్నా ఎక్కువ సీట్లొచ్చిన పెద్ద పార్టీని(సింగల్ లార్జెస్ట్ పార్టీ) ఆహ్వానించాలనేది కొన్ని దశాబ్దాలుగా పలు సందర్భాల్లో సంప్రదాయంగా మారింది. మరి గోవాలో ప్రస్తుత పాలకపక్షం బీజేపీ(17) కన్నా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు(21) నాలుగు సీట్లు ఎక్కువొచ్చాయి. మణిపూర్‌లో ఇంకా బీజేపీ నేత ఎవరినీ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఇంకా పిలవలేదుగాని అక్కడ కూడా ‘గోవా’ పునరావృతం చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో కొందరు గవర్నర్లు ఏం చేశారో చరిత్రలోకి తొంగిచేస్తే మంచిది. 1982 మే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షానికి మెజారిటీ రానప్పుడు గవర్నర్ జీడీ తపాసే నిర్వహించిన పాత్ర అత్యంత వివాదాస్పదమైంది. ఈ ఎన్నికల్లో 90 సీట్ల అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన 46 సీట్లు పాలక కాంగ్రెస్(36), ప్రతిపక్షం లోక్‌దళ్(31)లో దేనికీ రాలేదు. అయితే, ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకున్న లోక్‌దళ్, బీజేపీ(6) కూటమికి వచ్చిన సీట్లు 37. అంటే కాంగ్రెస్ కన్నా ప్రతిపక్ష కూటమికి ఒక సీటు వచ్చినట్టు లెక్క. మే 22న తనను కలిసిన కూటమి నేత, మాజీ సీఎం దేవీలాల్(లోక్‌దళ్)ను– 24 ఉదయం పది గంటలకు కూటమి తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌కు రావాలి–అని గవర్నర్ కోరారు. కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న ఈ సమయంలో ఏంజరిగిందోగాని, కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా మరోసారి ఎన్నికైన సీఎం భజన్‌లాల్‌తో మరుసటి రోజు(మే 23) సాయంత్రం ముఖ్యమంత్రిగా తపాసే ప్రమాణం చేయించారు. గవర్నర్‌పై ‘చేయిచేసుకున్న’ దేవీలాల్ భజన్ ప్రమాణం ముగిసిన వెంటనే లోక్‌దళ్–బీజేపీ కూటమి నేత దేవీలాల్ రాజ్‌భవన్‌కు వెళ్లి తపాసేను కలిసి, భజన్ సర్కారును బర్తరఫ్ చేసి, తనతో సీఎంగా ప్రమాణం చేయించాలని డిమాండ్ చేశారు. మెజారిటీ రాకున్నా అత్యధిక సీట్లు గెలిచిన కాంగ్రెస్ నేత భజన్‌తో ప్రమాణం ఇప్పటి వరకూ అనుసరిస్తున్న సంప్రదాయాలకు అనుగుణంగానే చేశానని, గవర్నర్‌కు ఇలాంటి విచక్షణాధికాధికారాలున్నాయని తపాసే వాదించారు. దీంతో ఆగ్రహించిన దేవీలాల్ తనపై అనుచితంగా ప్రవర్తించి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. వాస్తవానికి భజన్‌ను సమర్థిస్తున్న ఎమ్మెల్యేలు ఎంతమందని అడిగితే, 42–44 అని తపాసే జవాబిచ్చారు. మైనారిటీని మెజారిటీగా మార్చడంలో అప్పటికే ఆరితేరిన భజన్ సీఎంగా ప్రమాణం చేసిన రెండు రోజులకే మెజారిటీ కూడగట్టారు. దేవీలాల్ గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేసినా కోర్టులు భజన్‌కు అనుకూలంగా తీర్పులిచ్చాయి. హంగ్ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీకే చాన్స్ ఇవ్వాలన్న నిబంధనను అన్నిసార్లూ పాటించలేదు! ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన పార్టీలకొచ్చిన సీట్లను కలిపి అవి ఒక పార్టీకి దక్కిన స్థానాలుగా పరిగణించిన సందర్భాలూ గతంలో ఉన్నాయి. 1982 మేలోనే హరియాణాతోపాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కేరళలో రెండు రాజకీయ కూటముల్లో(కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్) కాంగ్రెస్ కూటమికి మెజారిటీ వచ్చింది.( కేరళ చరిత్రలో ఎప్పుడూ ఏ పార్టీకీ సొంత మెజారిటీ ఇంత వరకూ రాలేదు.) విడిగా చూస్తే కూటముల ‘కెప్టెన్లయిన’ కాంగ్రెస్‌కు 20 , సీపీఎంకు 26 సీట్లు వచ్చాయి. పెద్ద పార్టీనే ఆహ్వానించాలనే సంప్రదాయం పాటించాల్సివస్తే సీపీఎం నేతను సీఎంగా గవర్నర్ నియమించి, ప్రమాణం చేయించాలి. అయితే, అప్పుడు కాంగ్రెస్ నేతనే(సీఎల్పీ) గవర్నర్ పిలిచి ముఖ్యమంత్రిని చేశారు. కూటములుగా పరిగణించి చూస్తే 140 మంది సభ్యులున్న అసెంబ్లీలో యూడీఎఫ్‌కే మెజారిటీ ఉంది. 1983లో మేఘలయలోనూ ‘పెద్ద పార్టీ’ సంప్రదాయం గాలికొదిలిన గవర్నర్! 1983 ఫిబ్రవరిలో 60 మంది సభ్యుల మేఘలయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పక్షానికీ మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ 25 సీట్లతో అతి పెద్ద పార్టీగా అసెంబ్లీలో అవతరించింది. ప్రతిపక్షాలు ఆల్‌పార్టీ హిల్‌లీడర్స్ కాన్ఫరెన్స్(ఎపీహెచ్చెల్సీ)కు 15, హిల్‌స్టేట్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(హెచ్చెస్పీడీపీ)కి 15, పబ్లిక్డిమాండ్స్ ఇంప్లిమెంటేషన్ కన్వెన్షెన్(పీడీఐసీ)కి రెండు సీట్లు వచ్చాయి. పెద్ద పార్టీ నేతగా తననే సర్కారు ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కెప్టెన్ విలియంసన్ సంగ్మా గవర్నర్‌ను కోరారు. మరోపక్క మెజారిటీకి అవసరమైన 32 మంది(15, 15, 2 కలిపితే 32) సభ్యుల మద్దతు ఉందంటూ ఎపీహెచ్చెల్సీ, హెచ్చెస్పీడీపీ, పీడీఐసీ కూటమి నేతగా ఎన్నికైన బి.బి.లింగ్డో గవర్నర్‌ను ఫిబ్రవరి 23న కలిసి తనను సమర్ధించే ఎమ్మెల్యేల జాబితా సమర్పించారు. ఈ మూడు ప్రాంతీయపక్షాలూ యునైటెడ్ మేఘాలయా పార్లమెంటరీపార్టీ(యూఎంపీపీ) పేరుతో కొత్త కూటమి ఏర్పాటుచేశాయి. అంతా ఆలోచించాక, ప్రభుత్వం ఏర్పాటుకు లింగ్డోను గవర్నర్ మార్చి ఒకటిన ఆహ్వానించారు. అంటే ఇక్కడ అతి పెద్ద పార్టీని సర్కారు ఏర్పాటుకు ఆహ్వానించాలన్న సంప్రదాయం పాటించలేదు. అంటే సందర్భాన్ని బట్టి పెద్ద పార్టీని పిలవాలా? మెజారిటీ శాసనసభ్యుల మద్దతున్న కూటమి నేతను సీఎంగా నియమిస్తూ ఉత్తర్వు జారీచేసి, సీఎంగా ప్రమాణం చేయించాలా? అనే విషయంలో గవర్నర్‌కు ‘విచక్షణాధికారాలు’ ఉన్నాయని, సందర్భాన్ని బట్టి రాజ్యపాల్ ఆ పనిచేస్తారని 1952 నుంచీ జరిగిన ఎన్నికల చరిత్ర, సర్కార్ల ఏర్పాటు వివరాలు పరిశీలిస్తే అర్ధమౌతుంది. 1990 ఫిబ్రవరిలో మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు కూడా సింగల్లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం గవర్నర్ ఇవ్వలేదు. అప్పుడు వీపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉంది. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి ప్రభావం, గవర్నర్ల వ్యక్తిత్వం వివిధ సందర్భాల్లో విభిన్న సంప్రదాయాలు అనుసరించడానికి కారణాలవుతున్నాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
పారికర్‌కు సవాల్.. సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్‌ను నియమించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న పారికర్‌కు ఊహించని చట్టపరమైన అవాంతరాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. 40 స్థానాలు ఉన్న గోవాలో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఇతరులు పది స్థానాలు గెలుపొందారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. మెజారిటీకి దూరంగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా పావులు కదిపిన బీజేపీ.. కేంద్ర రక్షణమంత్రిగా ఉన్న పారికర్‌తో రాజీనామా చేయించి.. గోవా ముఖ్యమంత్రిగా బరిలోకి దింపింది. దీంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, స్వతంత్రులు బీజేపీకి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రే గోవా సీఎంగా పారికర్‌ను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు. అయితే, ఈ హడావిడి రాజకీయ పరిణామాలతో బిత్తరపోయిన కాంగ్రెస్.. మంగళవారం సీఎంగా ప్రమాణం చేయబోతున్న పారికర్ నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పెద్దగా సమయం లేకపోవడంతో కాంగ్రెస్ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు సుప్రీంకోర్టు సైతం అంగీకరించింది. -
పరికర్తో పాటు 8 మంది మంత్రులు
దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ గోవా ముఖ్యమంత్రిగా వస్తున్న మనోహర్ పారికర్ మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని గోవా బీజేపీ అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ మీడియాకు తెలిపారు. ఎనిమిది నుంచి తొమ్మిది మంది వరకు మంత్రులు కేబినెట్లో ఉంటారని, వాళ్లలో గోవా ఫార్వర్డ్ పార్టీ నుంచి ఇద్దరు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ నుంచి ఇద్దరు, ఇద్దరు స్వతంత్రులు కూడా ఉంటారని ఆయన వివరించారు. బీజేపీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజాతో పాటు మరొకరు కూడా ప్రమాణం చేస్తారని, వాళ్ల పేర్లను మంగళవారం ఉదయం ప్రకటిస్తామని వినయ్ టెండూల్కర్ చెప్పారు. ఆ తర్వాత కొంతకాలం ఆగి చేపట్టే మంత్రివర్గ విస్తరణలో మరో ముగ్గురు లేదా నలుగురికి చాన్స్ రావచ్చన్నారు. 21 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని, అందువల్ల ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు మనోహర్ పారికర్ లేఖ రాయడంతో.. గవర్నర్ మృదులా సిన్హా ఆయనను సీఎంగా నియమిస్తూ ఆదివారం రాత్రే ఉత్తర్వులిచ్చారు. గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లేటప్పుడు పారికర్ వెంట జీఎఫ్‌పీ నాయకుడు విజయ్ సర్దేశాయ్, ఎంజీపీ నాయకుడు సుదిన్ ధావలికర్ కూడా ఉన్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు హాజరవుతారు. -
కొత్త రక్షణ మంత్రి ఎవరో తెలుసా?
రక్షణ శాఖ మంత్రిత్వ పదవికి మనోహర్ పారికర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. రక్షణ శాఖ బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు కూడా మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అరుణ్ జైట్లీయే రక్షణ మంత్రిగా ఉండేవారు. ఆ తర్వాత తనకు పనిభారం ఎక్కువైందని, ఏదో ఒక శాఖ తీసేయాలని జైట్లీ కోరడంతో.. పారికర్‌ను గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి మరీ తీసుకొచ్చారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఒక్క మనోహర్ పారికర్‌ను తప్ప వేరెవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టినా వీలుకాని పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ లాంటివి గతంలోనే లక్ష్మీకాంత్ పర్సేకర్‌ను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ పార్టీ కూడా మనోహర్ పారికర్ సీఎంగా వస్తామంటే బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమని తెలిపింది. దాంతో.. ఏరికోరి రక్షణ శాఖకు తీసుకున్న పారికర్‌ను మళ్లీ సొంత రాష్ట్రానికి ప్రధాని పంపేశారు. చాలాకాలంగా గోవా ఆహారం తినకపోవడంతో తాను సన్నబడ్డానని ఎన్నికల ప్రచారం సమయంలో పారికర్ వ్యాఖ్యానించారు. దానికి అర్థం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చని కూడా ఆయన మీడియాతో అన్నారు. అప్పుడు చెప్పినట్లే ఇప్పుడు మళ్లీ సొంత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెళ్లిపోతున్నారు. కాగా, పారికర్‌ను అసెంబ్లీకి పంపేందుకు వీలుగా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా రాజీనామా చేశారు. ఆయన ఎన్నికైన మాపుసా స్థానం నుంచే పారికర్ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. డిసౌజాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఢిల్లీకి పంపుతారని అంటున్నారు. -
అమిత్ షాకు సీఎంల ఎంపిక బాధ్యత
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతోపాటు మణిపూర్లకు ముఖ్యమంత్రుల ఎంపిక బాధ్యతను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు అప్పగిస్తూ ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం నిర్ణయం తీసుకుంది. గోవా ముఖ్యంమంత్రిగా రక్షణ మంత్రి మనోహర్ పరీకర్‌ను ఇప్పటికే పార్టీ ఎంపిక చేసింది. ఆయా రాష్ట్రాల పరిశీలకులు ఎమ్మెల్యేలను సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లను అమిత్ షాకు చెబుతారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆదివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాని మోదీ, ఇతర సభ్యులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌లను పరిశీలకులుగా బీజేపీ నియమించింది. ఉత్తరాఖండ్‌కు పరిశీలకులుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ కార్యదర్శి సరోజ్ పాండేలు నియమితులయ్యారు. మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్, పార్టీ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్దేలు మణిపూర్ బాధ్యతలు చూసుకుంటారు. -
ప్రజాస్వామ్యానికి పాతరేసిన బీజేపీ
విమర్శించిన కాంగ్రెస్ పార్టీ పణజి/న్యూఢిల్లీ: గోవా, మణిపూర్లలో ప్రజాస్వామ్యానికి బీజేపీ పాతరేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గోవాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నామని, ప్రజలు తమకే అనుకూలంగా తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శాంతారామ్ నాయక్ పేర్కొన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే బీజేపీ అనైతిక పద్ధతుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన అన్నారు. పారికర్‌ను ‘విలన్’గా ఆయన అభివర్ణించారు. మేం శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటుండగానే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయని శాంతారామ్ పేర్కొన్నారు. తగినంత సంఖ్యాబలం లేనందున గోవాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ శనివారం చెప్పారని కూడా శాంతారామ్ గుర్తుచేశారు. మణిపూర్‌లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కిడ్నాప్ ఇంఫాల్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ బలగాల సాయంతో మణిపూర్‌కి చెందిన ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని బీజేపీ కిడ్నాప్ చేసిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. సీఐఎస్ఎఫ్ బలగాలను, విమానాశ్రయ అధికారులను దుర్వినియోగం చేసి అసబుద్దీన్ అనే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని బీజేపీ కిడ్నాప్ చేసిందని, ఆ ఎమ్మెల్యేని కలకత్తాకు తరలించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ మోడీ ప్రభుత్వం ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని, సమాఖ్య స్ఫూర్తిని మోడీ ప్రభుత్వం పట్టపగలు ఖూనీ చేస్తోందని సుర్జేవాలా విమర్శించారు. -
గోవా, మణిపూర్ బీజేపీవే..
గోవా ముఖ్యమంత్రిగా పరీకర్ ►బలనిరూపణకు 15 రోజుల గడువు ►మణిపూర్‌లోనూ చక్రం తిప్పిన కమలనాథులు ►బీజేపికి ఎన్పీపీ, ఎల్జేపీ మద్దతు ►గవర్నర్ నజ్మాహెప్తుల్లాను కలిసిన బీజేపీ మద్దతుదారులు ►రెండు రాష్ట్రాలలో కమలం కన్నా హస్తానికే ఎక్కువ సీట్లు పణజి/ఇంపాల్: మినీరణంగా పేరొందిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కమల నాథుల విజయపరంపరం ఇంకా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో స్పష్టమైన విజయాన్ని నమోదుచేసిన బీజేపీ.. తక్కువ సీట్లకే పరిమితమైన గోవా, మణిపూర్‌లలోనూ పీఠాలను కైవసం చేసుకోగలిగింది. దీంతో పంజాబ్ ఒక్కదానికే కాంగ్రెస్ పరిమితం కావలసి వచ్చింది. గోవా, మణిపూర్లలో ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం లేదు. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ కన్నా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. కానీ చిన్నపార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతును బీజేపీ సంపాదించగలిగింది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కోసమే.. తీర రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసమే తాము బీజేపీకి మద్దతిస్తున్నామని జీఎఫ్‌పీ నాయకుడు విజయ్ సర్దేశాయ్ తెలిపారు. అస్థిరత కారణంగా రాష్ట్రం అభివృద్ధికి దూరం కావడం తమకు ఇష్టం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి పరీకర్ నాయకత్వం వహిస్తున్నారన్న కారణంతోనే తాము బీజేపీకి మద్దతిస్తున్నామని ఎంజీపీ నాయకులు సుదిన్ ధావలికర్ తెలిపారు. పరీకర్‌ను చూసి తాము బీజేపీకి మద్దతు లేఖ ఇచ్చామని, ఆయన లేకుంటే మద్దతిచ్చేవారం కాదని సుదిన్ పేర్కొన్నారు. అంతకుముందు పణజిలో సమావేశమైన బీజేపీ శాసనసభ్యులు పారికర్‌ను శాసనసభాపక్షనేతగా ఎంపిక చేయాల్సిందిగా కోరుతూ ఒక తీర్మానం చేసి పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపించారు. తమ ప్రతిపాదనను అధిష్టానం అంగీకరించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను కలసినట్లు బీజేపీ గోవా అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ చెప్పారు. కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన బీజేపీ గోవాలో బీజేపీ 32.5శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ కన్నా ఇది 4.1శాతం ఎక్కువ అయినా అది ఎక్కువ సీట్లు సాధించలేకపోయింది. 28.4శాతం ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోగా 32.5శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీ 13 సీట్లను మాత్రమే గెలుచుకోగలగడం విశేషం. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఎంజీపీ 3, జీఎఫ్‌పీ 3, ఇండిపెండెంట్లు 3 స్థానాలలో గెలవగా ఎన్సీపీ ఒక స్థానంలో విజయం సాధించింది. గోవాలో 1.2 శాతం మంది నోటాను ఉపయోగించుకున్నారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో నోటా ఇంతశాతం మరెక్కడా నమోదు కాలేదు. పరీకర్ నాయకత్వంలో గోవాలో బీజేపీ ప్రభుత్వం గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమయ్యింది. ముఖ్యమంత్రి గా రక్షణ మంత్రి మనోహర్ పరీకర్‌ను బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసింది. గవర్నర్ మృదులా సిన్హాను ఆదివారం సాయంత్రం కలసిన పరీకర్ తన నాయకత్వంలో గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశమి వ్వాల్సిందిగా కోరారు. పరీకర్‌ను ముఖ్యమంత్రిగా నియమించిన గవర్నర్.. మెజారిటీ నిరూపించుకునేందుకు 15 రోజుల గడువిచ్చారు. అంతకుముందు, తమకు ఎన్సీపీ, స్థానిక పార్టీలు, కొందరు ఇండిపెండెంట్లు మద్దతిస్తున్నట్లు ఆయన గవర్నర్‌కు తెలిపారు. ముగ్గురేసి ఎమ్మెల్యేలున్న గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), ఒక ఎమ్మెల్యే ఉన్న ఎన్‌సిపి, ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతిస్తున్న లేఖలను పరీకర్ గవర్నర్‌కు సమర్పించారు. 13 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ బలం వీరి మద్దతుతో 22కు చేరుకుంది. 40 మంది ఎమ్మెల్యేలున్న గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 21 మంది ఎమ్మెల్యేలు సరిపోతారు. కాంగ్రెస్ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీకి అవసరమైన నలుగురు ఎమ్మెల్యేల మద్దతును సాధించలేకపోయింది. మణిపూర్ పీఠంపై కాషాయ జెండా రెపరెపలు కాంగ్రెస్ కన్నా బీజేపీకి 7 సీట్లు తక్కువ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 31 సీట్ల కన్నా 10 సీట్ల వెనుకబాటు అయితేనేం మణిపూర్ గద్దెపై కాషాయ జెండా రెపరెపలాడబోతోంది. బీజేపీకి మద్దతిస్తున్నట్లు నలుగురు ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఒక ఎమ్మెల్యే ఉన్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఆదివారం ప్రకటించాయి. ఎన్పీపీ, ఎల్జేపీలతో అవగాహన కుదిరిందని.. మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి (బీజేపీ మణిపూర్ వ్యవహారాల బాధ్యుడు) రామ్ మాధవ్ వెల్లడించారు. ఈ రెండు పార్టీలూ కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. వీటి చేరికతో బీజేపీ బలం 26కు చేరుకుంది. కాగా, ఎన్డీఏలో భాగస్వామ్యపక్షంగా ఉన్న నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) కూడా మణిపూర్‌లో బీజేపీకే మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. దీనికి తోడు ఓ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతుగా నిలిచారు. కాగా, బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రి గవర్నర్ నజ్మా హెప్తుల్లాను కలిశారు. ‘60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ బలం 32కు చేరింది. 11 మంది స్వతంత్ర సభ్యులు బీజేపీకి మద్దతు పలికారు’ అని గవర్నర్‌ను కలిసిన తర్వాత బీజేపీ నేత, అస్సాం మంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్‌పై పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీకి మద్దతిచ్చారని హిమంత తెలిపారు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం లేదని ఈ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. -
గోవా సీఎంగా మనోహర్ పారికర్ నియామకం
- రాత్రికిరాత్రే ఆహ్వానించిన గవర్నర్ మృదులా సిన్హా - 15 రోజుల్లోగా బలం నిరూపించుకోవాలని ఆదేశం పణాజి: బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కాషాయదళం గోవాలోనూ అధికారం చేపట్టింది. చిన్నపార్టీలు, స్వతంత్ర్యంగా ఎన్నికైన ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందన్న బీజేపీని గవర్నర్ మృదులా సిన్హా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. కొద్ది గంటలకిందటే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మనోహర్ పారికర్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేసింది. పారికర్ 15 రోజుల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ సూచించారు. ఆదివారం రాత్రి మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో కలసి పారికర్.. గోవా గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజార్టీ ఉందని, 22 ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారని పారికర్ చెప్పారు. కేంద్ర మంత్రి పదవికి పారికర్ రాజీనామా చేసినట్టు తొలుత వార్తలు వచ్చినా.. గడ్కరీ ఖండించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు పారికర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారని చెప్పారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తగిన మెజార్టీ సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సహా ఆరుగురు మంత్రులు ఓటమి చవిచూడటంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 13 సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇతరులు 10 సీట్లు గెల్చుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా గోవా ఫార్వర్డ్ పార్టీ (ముగ్గురు ఎమ్మెల్యేలు), ఏంజీపీ(ముగ్గురు ఎమ్మెల్యేలు)తో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతు ప్రకటించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలతో సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పారికర్ సీఎంగా రావాలని కోరారు. దీంతో బీజేపీ అధిష్టానం సూచన మేరకు పారికర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన గతంలో గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు 2014లో పారికర్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -
గోవా సీఎంగా మనోహర్ పారికర్ నియామకం
- రాత్రికిరాత్రే ఆహ్వానించిన గవర్నర్ మృదులా సిన్హా - 15 రోజుల్లోగా బలపరీక్ష నిరూపించుకోవాలని ఆదేశం పణాజి: బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కాషాయదళం గోవాలోనూ అధికారం చేపట్టింది. చిన్నపార్టీల నుంచే కాకుండా స్వతంత్ర్యంగా ఎన్నికైన ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందన్న బీజేపీని గవర్నర్ మృదులా సిన్హా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. కొద్ది గంటలకిందటే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మనోహర్ పారికర్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. 15 రోజుల్లోగా పారికన్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ సూచించారు. ఆదివారం రాత్రి మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో కలసి పారికర్.. గోవా గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజార్టీ ఉందని, 22 ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారని పారికర్ చెప్పారు. కేంద్ర మంత్రి పదవికి పారికర్ రాజీనామా చేసినట్టు తొలుత వార్తలు వచ్చినా.. గడ్కరీ ఖండించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు పారికర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారని చెప్పారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తగిన మెజార్టీ సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సహా ఆరుగురు మంత్రులు ఓటమి చవిచూడటంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 13 సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇతరులు 10 సీట్లు గెల్చుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా గోవా ఫార్వర్డ్ పార్టీ (ముగ్గురు ఎమ్మెల్యేలు), ఏంజీపీ(ముగ్గురు ఎమ్మెల్యేలు)తో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతు ప్రకటించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలతో సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పారికర్ సీఎంగా రావాలని కోరారు. దీంతో బీజేపీ అధిష్టానం సూచన మేరకు పారికర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన గతంలో గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు 2014లో పారికర్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -
‘మాకు పారికర్ కావాలంతే..’
పంజిమ్: గోవా ఎన్నికలు ముగిసి హంగ్ పరిస్థితి ఏర్పడింది. ఎవరికీ పూర్తి స్థాయి విజయం అందలేదు. అలాగే ఎవరికీ మేజిక్ ఫిగర్ కూడా సొంతం కాలేదు. దీంతో ప్రస్తుతం గోవాలో ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటుచేస్తుందనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే తమకు నాయకత్వం ఒక్క మనోహర్ పారికర్ మాత్రమే వహించాలని ప్రస్తుతం ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా సంకేతాలు పంపించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఆయనే తమకు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. మొత్తం 40 స్థానాలు ఉన్న గోవా ఎన్నికల్లో బీజేపీకి 13 స్థానాలు దక్కాయి. అధికారం చేపట్టాలంటే కనీసం 21 స్థానాలు ఉండాలి. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి 17 దక్కాయి. ఇతరులు పది స్థానాలు గెలుచుకున్నారు. అయితే, గోవాలో కూడా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పడంతోపాటు ఇతర స్థానాల్లో గెలుపొందినవారు కూడా బీజేపీకే మద్దతిచ్చే యోచనలో ఉన్నారంట. ఇదే జరిగితే.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే మరోసారి పారికర్‌నే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. గత ఎన్నికల్లో పార్టీని గెలిపించిన పారికర్‌ను 2014 కేంద్ర రక్షణశాఖలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన అక్కడికి వెళ్లిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు బలం చేకూరినట్లయిందని, మాజీ ముఖ్యమంత్రి పర్సేకర్ ఆయన స్థానాన్ని భర్తీ చేయలేకపోయారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. -
తిండిలేక.. బరువు తగ్గిపోయిన మంత్రి!
సాధారణంగా కేంద్ర మంత్రి స్థాయిలో.. అది కూడా రక్షణ శాఖ లాంటి అత్యంత కీలకమైన శాఖ చేతిలో ఉన్న మంత్రికి తిండి సరిగ్గా దొరక్కపోవడం అనే సమస్య ఉందంటే నమ్మగలరా? కానీ అది నిజం. రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. తగిన తిండి దొరక్కపోవడం వల్ల నాలుగు కిలోల బరువు తగ్గిపోయారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. గోవా రాజధాని పణజిలో ఓటు వేసేందుకు ఆయన ఇంకా పోలింగ్ బూత్ తెరవక ముందే వచ్చేశారు. ఉదయం 7.10 గంటలకల్లా ఓటు వేసి బయటకు వచ్చేశారు. ''నాకు గోవా ఆహారం అంటే ఇష్టం. దాన్ని మీరు ఎలా కావాలనుకుంటే అలా అన్వయించుకోవచ్చు'' అని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆహారం నచ్చకపోవడం వల్ల తాను నాలుగు కిలోల బరువు తగ్గిపోయానన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే పారికర్ మళ్లీ గోవా ముఖ్యమంత్రిగా వస్తారని అంచనాలున్నాయి. పారికర్ తిరిగొచ్చే అవకాశాలను పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రచార పర్వంలో ఉన్నప్పుడు కొట్టి పారేయలేదు. ఇంతకుముందు ఈ విషయంలో వచ్చిన ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు పారికర్ నిరాకరించారు గానీ, తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం మళ్లీ ఆయన సీఎం కావడం ఖాయమనిపిస్తోంది. గోవా చేపల కూర, బటర్ చికెన్.. ఇవన్నీ తనకు ఇష్టమని, అయితే తాను పార్టీకి కట్టుబడిన వ్యక్తిని కాబట్టి పార్టీ ఎలా ఆదేశిస్తే అలాగే చేస్తానని పారికర్ గతంలో కేంద్ర మంత్రి అయినప్పుడు అన్నారు. తన స్థానంలో తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన లక్ష్మీకాంత్ పర్సేకర్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు గానీ, పారికర్ స్థాయిని, ఆయన ఇమేజ్‌ని అందుకోలేక పర్సేకర్ ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గోవాలో చతుర్ముఖ పోటీ ఉన్నమాట వాస్తవమే గానీ, ఇందులో మూడు ముఖాలు చాలా బలహీనంగా ఉన్నాయని పారికర్ వ్యాఖ్యానించారు. బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఖాయమన్నారు. గోవాలో ఉన్న మొత్తం 40 అసెంబ్లీ సీట్లకు గాను ఇంతకుముందు బీజేపీ 21 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు 36 స్థానాల్లో నేరుగా పోటీ చేస్తుండగా, మరో నాలుగు చోట్ల పార్టీ మద్దతిచ్చిన స్వతంత్రులు పోటీలో ఉన్నారు. పోలింగ్ 85 శాతం వరకు ఉండొచ్చన్నది పారికర్ అంచనా. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికే 53 శాతం దాటింది. -
రక్షణ మంత్రికి ఈసీ నోటీసులు
పనాజీ: కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసులు పంపింది. ఇటీవల గోవాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరింది. ఎన్నికల్లో బహిరంగసభలో ప్రచారం చేస్తూ పారికర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ నేతల నుంచి ఓటర్లు డబ్బులు తీసుకోవాలని చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 3వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఆ వ్యాఖ్యలు చేసినందకు మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని ఈసీ కోరింది. గత జవనరి 29న చింబెల్లో ప్రచారం చేసిన మనోహర్ పారికర్.. ఇతర పార్టీల నేతలతో డబ్బులు తీసుకున్నా ఎలాంటి సమస్య లేదన్నారు. ఎవరి వద్ద డబ్బులు తీసుకున్నా చివరికి మీ ఓటు బీజేపీకే వేయాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో నేతలు మరిన్ని డబ్బులు పంచుతారని పారికర్ అన్నారని గోవా ఫార్వర్డ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
‘కలిసి పనిచేస్తారు.. సీఎం ఆయనకింద కాదు’
పనాజీ: గోవా ముఖ్యమంత్రి ప్రస్తుత రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌తో కలిసి పనిచేస్తారే తప్ప.. ఆయన కింద ఉండి పనిచేయరని ఉత్తర గోవాకు చెందిన ఎంపీ శ్రీపాద్ నాయుడు చెప్పారు. అయితే, ముఖ్యమంత్రిగా ఎవరొస్తారనే విషయం ఇంకా బీజేపీ నిర్ణయించలేదని అన్నారు. గోవా రాజకీయాల్లోకి తనకు వెళ్లాలని ఉందని పారికర్ చెప్పడంతోపాటు, ఎన్నికల తర్వాతే గోవాకు రాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని పార్టీ హైకమాండ్ చెబుతోందని తొలుత నితిన్ గడ్కరీ, అనంతరం అమిత్‌షా చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర మండలిలో సభ్యుడిగా ఉన్న శ్రీపాద్ యాదవ్ తాజాగా స్పందించారు. ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై నిర్ణయం ఇంకా జరగలేదు. దానిని ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. ఇందులో ఎలాంటి అయోమయం లేదు. పారికర్ ప్రభుత్వ పెద్దగా వస్తారు. ఆయన అనుభవాన్ని గోవా ప్రభుత్వానికి అందించి ప్రజలకు అనుకూలన పాలన అందించేందుకు సూచనలు ఇస్తారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆయనతో కలిసి పనిచేస్తారే తప్ప ఆయన కింద మాత్రం కాదు’ అని శ్రీపాద్ స్పష్టం చేశారు. -
ముఖ్యమంత్రిగా మళ్లీ వస్తున్నాడు!
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే గోవాలో బీజేపీ ముందుకెళ్లనుంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించి ఆ పార్టీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని నేరుగా చెప్పకుండా ఉండాలని అనుకుంటోంది. అయితే, ప్రస్తుతం రక్షణశాఖ నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గోవాకు కాబోయే ముఖ్యమంత్రి అని మరో కేంద్ర మంత్రి, బీజేపీలో కీలక నేత నితిన్ గడ్కరీ పరోక్షంగా చెప్పారు. 'ఢిల్లీలో ఉన్న ఒక నేత గోవా ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి అవుతారు. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలే వారి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారు. అయితే, వారిలో ఒకరినే ముఖ్యమంత్రిగా చేయాలనేం లేదు.. ఢిల్లీ నుంచి మేం ముఖ్యమంత్రి అభ్యర్థిని పంపిస్తాం' అని గడ్కరీ ఓ పత్రికా సమావేశంలో చెప్పారు. పారికర్ తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని, అందుకు కేంద్రం కూడా అనుకూలంగా ఉందని బీజేపీ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా చర్చిస్తున్నారంట. -
'ఆర్మీ చీఫ్'పై పారికర్ ఆసక్తికర వ్యాఖ్య
న్యూఢిల్లీ: కేవలం సీనియారిటీని మాత్రమే ప్రాతిపదిక తీసుకుంటే కంప్యూటర్ను కూడా ఆర్మీ చీఫ్‌గా ఎంపిక చేయవచ్చని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ వ్యంగ్యంగా అన్నారు. ప్రతి అంశానికి సీనియారిటీతోనే ముడిపెట్టడం సరికాదని తాము సరైన వ్యక్తినే ఆర్మీ చీఫ్‌గా ఎంపికచేశామని ఆయన చెప్పారు. ఆర్మీ చీఫ్‌ను ఎంచుకునే విషయంలో సీనియారిటీని, నిబంధనలు పక్కకు పెట్టారు కదా అని ఆయనను మీడియా ప్రశ్నించగా ఈ విధంగా బదులిచ్చారు. ఒక్క సీనియారిటిని మాత్రమే తీసుకుని నియామకాలు జరిగితే, ఒక ప్రత్యేక నియామక విధానాలు ఎందుకు, కేబినెట్ కమిటీలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. 'సీనియారిటీని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధన ఎక్కడ ఉందో నాకు తెలియదు. కమాండర్స్ పనితీరు ఎలా ఉందో పరిశీలించేందుకు ప్రత్యేక విధివిధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరినైతే ఆర్మీ చీఫ్‌గా ఎంపిక చేశామో వారు అన్ని విధాల తగినవారని మీకు హామీ ఇస్తున్నాను. అందుకే ఈ విషయంలో మేం తొందరపడి నిర్ణయం తీసుకోలేదు' అని పారికర్ అన్నారు. గత నెలలో ఆర్మీ చీఫ్‌గా కేంద్రం జనరల్ బిపిన్ రావత్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆయనకంటే సీనియారిటీ ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ భక్షి, మరో లెఫ్టినెంట్ జనరల్ పీఎం హారిజ్ని పక్కకు పెట్టి మరీ రావత్‌ను ఎంపిక చేశారు. -
సీఎంకు లేఖ ఎలా రాయాలో తెలీదా?
రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రికి లేఖ ఎలా రాయాలో కూడా తెలియదా అని ప్రశ్నించారు. సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం పట్ల తాను ఎంతో బాధపడ్డానని ఆయన లేఖ రాయడంతో ఆమె ఈ రకంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులను వినియోగించుకోవాలన్న తన ఉద్దేశం వల్ల సైనిక దళాల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని పారికర్ చెప్పడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని మమత ఆరోపించారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో.. సైన్యాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా రాజకీయ కక్షలు తీర్చుకోవడం ఎప్పుడూ చూడలేదని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పరువునష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాలకు ఆర్మీ రావడంపై మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, ఏకంగా 36 గంటల పాటు సచివాలయంలోనే ధర్నా చేసిన విషయం తెలిసిందే. కోల్‌కతా నగరం నుంచి సైన్యాన్ని ఉపసంహరించిన తర్వాత కూడా ఆమె అక్కడినుంచి కదల్లేదు. మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరిస్తే తప్ప తాను వెళ్లబోనని పట్టుబట్టారు. అయితే అదే సమయంలో పలు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా సైన్యం ఉందని కేంద్ర మంత్రులు పలువురు వివరణ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, ప్రజలలో భయాందోళనలు సృష్టిస్తోందని అప్పట్లో ఆమె అన్నారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి - మమతా బెనర్జీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. -
ఆమెది రాజకీయ ఫ్రస్ట్రేషన్
-
ఆమెది రాజకీయ ఫ్రస్ట్రేషన్: పారికర్
భారత సైన్యం గురించి పశ్చిమబెంగాల్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో తనకు చాలా బాధ కలిగిందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీది రాజకీయ ఫ్రస్ట్రేషన్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఆర్మీ చేస్తున్న రొటీన్ ఎక్సర్సైజ్ అని.. చాలా సంవత్సరాలుగా ఇది కొనసాగుతూనే ఉందని లోక్‌సభలో చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికీ సచివాలయంలోని తన చాంబర్లోనే ధర్నా చేస్తున్నారని, ముందుగా పోలీసులకు.. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చే వచ్చినట్లు సైన్యం చెబుతున్నా, నిజానికి అలా జరగలేదని టీఎంసీ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించగా, దానికి సమాధానంగా పారికర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 15 సంవత్సరాలుగా భారత సైన్యం ఇలా వెళ్తూనే ఉందని, ఇదేమీ కొత్త కాదని పారికర్ వివరించారు. గత సంవత్సరం కూడా నవంబర్ 19-21 తేదీల మధ్య ఇలా జరిగిందని అన్నారు. పశ్చిమబెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాలకు ఈస్ట్రన్ కమాండ్ వెళ్తుందని, అలాగే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇది జరుగుతుందని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చిందన్నారు. వాస్తవానికి నవంబర్ నెలాఖరులో 28, 29, 30 తేదీలలో ఈ ఎక్సర్సైజ్ చేద్దామని ఆర్మీ భావించి అక్కడి పోలీసు అధికారులను సంప్రదిస్తే.. ఆ సమయంలో భారత్ బంద్ ఉన్నందున వాళ్లు తేదీలు మార్చి చెప్పారని, అందుకే సైన్యం ఇప్పుడు వెళ్లిందని పారికర్ వివరించారు. పోలీసులతో కలిసే సైన్యం సంయుక్తంగానే ఎక్సర్సైజ్ చేసిందని అన్నారు. సైన్యం చేసే రొటీన్ ఎక్సర్‌సైజును వివాదం చేయడం మాత్రం తప్పని ఆయన అన్నారు. -
రక్షణ మంత్రిగా ఆ రోజు వణికిపోయాను: పారికర్
పనాజీ: ఆయనలో దేశభక్తి మెండు. ముక్కుసూటిగా పనిచేసే తత్వం అని చెప్తారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా అందులో ఓ నిబద్ధత కనబరుస్తారనే పేరు కూడా ఇప్పటికే ఉంది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయవంతంగా పనిచేశారు కూడా.. అలాంటి ఆయనకు దేశానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించినప్పుడు మాత్రం కాస్తంత వణుకుపుట్టిందట.. నేనా.. ఆ బాధ్యతలు నిర్వర్తించగలనా అని అనుమానపడ్డారంట. ఆయన మరెవరో కాదు.. ప్రస్తుతం భారత రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న మనోహర్ పారకర్.. గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు బీజేపీ అధికారంలోకి వచ్చాక రక్షణశాఖ బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో ఆ రోజు తనకు జరిగిన అనుభవాన్ని ఆయన సోమవారం పంచుకున్నారు. విజయ్ సంకల్ప్ ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించినప్పుడు తాను వణికిపోయానని, ఆ విషయం తెలియకుండా దాచేందుకు గంబీరంగా ముఖాన్ని చూపించడానికి ప్రయత్నించానని అన్నారు. ‘నేను ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆ రోజు ఆ నగర అనుభవం ఎదురైంది. మీ అందరి ఆశీస్సులతో రక్షణ మంత్రి అయ్యాను. వాస్తవానికి నాకు అప్పుడు ఏమీ తెలియదు. ఆర్మీలో ఉండే ర్యాంకులపై కూడా నాకు అవగాహన లేదు. బాధ్యతలు తీసుకుంటున్న వణికి పోయాను. కానీ, ముఖాన్ని గంభీరంగా చూపించేందుకు ప్రయత్నించాను. వాస్తవానికి ఆర్మీలో అధికారులకు ఉండే ర్యాంకుల విధానం కూడా నాకు తెలియదు. గోవాకు 1961లో పోర్చుగీసు వారి నుంచి భారత సేన విముక్తి కలిగించింది. అలాగే, 1965, 71లో యుద్ధాలు చూశాం. కార్గిల్ యుద్ధ సమయంలో నేను నినాదాలు ఇచ్చేవాడిని. కానీ, ఇప్పుడు నాముందుకు యుద్ధ క్షేత్రం వచ్చింది. యుద్ధం అంటే ఏమిటో కూడా తెలియదు.. దానికి ఎలా సన్నద్ధమవుతారో కూడా తెలియదు. నేను మాత్రం మన సైన్యానికి ఒకటే చెప్పాను. ఎవరైన దాడికి దిగితే వారిపై ప్రతి దాడి చేసేందుకు మీకు పూర్తి స్వేచ్ఛ ఉందని’ అని పారికర్ అన్నారు. భారత సైన్యం చాలా గొప్పగా శత్రు సేనలను వెంటాడుతోందని చెప్పారు. -
దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చిన పాక్!
సరిహద్దుల్లో కాల్పులతో పేట్రేగుతున్న పాకిస్థాన్ సైన్యం.. తాజాగా చర్చలకు దిగివచ్చిన సంగతి తెలిసిందే. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద అనుమానిత ఉగ్రవాదులు ముగ్గురు భారతీయ సైనికులను పొట్టనబెట్టుకున్నారు. అంతేకాకుండా ఒక సైనికుడి శరీరాన్ని ముక్కలుగా నరికేశారు. దీంతో రగిలిపోయిన భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. మరింత దీటుగా పాక్ సైన్యానికి జవాబు చెప్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పాక్ అధికారులు భారత బలగాల షెల్లింగ్ దాడుల్లో 11మంది పౌరులు, ముగ్గురు సైనికులు బుధవారం చనిపోయినట్టు ప్రకటించారు. అంతేకాకుండా బుధవారం సాయంత్రం పాక్ విజ్ఞప్తి మేరకు మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరళ్లు హాట్లైన్లో చర్చించి.. కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి మనోహర్ పరీకర్ స్పందిస్తూ.. సరిహద్దుల్లో ‘పిరికిపంద’ దాడులను భారత్ దీటుగా తిప్పికొడుతుండటంతో దాయాది పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చిందని, దాడులను ఆపాలని భారత్‌ను విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవాలోని ఓ సభలో ప్రసంగించిన పరీకర్.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా దేశ నాయకత్వం బలమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నదని కొనియాడారు. ‘మన సైన్యం వీరోచితమైనదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తొలిసారి దేశ రాజకీయ నాయకత్వం కూడా బలమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. అంతేకాకుండా పరికిపందల దాడులకు మేం దీటుగా బదులిస్తున్నాం. కొన్నిరోజులుగా ఇలా బలంగా ప్రతిస్పందిస్తుండటంతో వాళ్లు దిగొచ్చి ‘దయచేసి ఆపండి. మేం మీకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ వేడుకుంటున్నారు. దీనిని ఆపడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు కూడా ఆపాలి. అప్పుడే సరిహద్దుల్లో కాల్పులు ఉండవు’ అని పరీకర్ వ్యాఖ్యానించారు. -
అణ్వస్త్రాలపై రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
భారతదేశం వద్ద అణ్వస్త్రాలు ఉన్నా.. వాటిని ముందుగా తాము ఎవరిపైనా ఉపయోగించబోమంటూ ఇన్నాళ్లూ ఒక స్వీయ నియంత్రణ పాటిస్తున్నాం. కానీ అసలు అలా ఎందుకు చేతులు కట్టుకుని కూర్చోవాలని ప్రశ్నించి.. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సంచలనం రేపారు. ఒకవైపు భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో రక్షణ మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ''మనం చేతులు కట్టుకుని ఎందుకు కూర్చోవాలి? బాధ్యాయుతమైన అణ్వస్త్ర దేశంగా ఉంటామని, దాన్ని బాధ్యతారహితంగా ఉపయోగించబోమని మాత్రమే చెప్పాలన్నది నా ఉద్దేశం. ఇది నా ఆలోచన'' అని పరిక్కర్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ అంశంపై ఇవన్నీ కేవలం తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, ప్రభుత్వ అభిప్రాయం కాదని ఆ తర్వాత ఆయన స్పష్టం చేశారు. రక్షణ శాఖ కూడా ఆ తర్వాత చేసిన ఒక ప్రకటనలో.. పారిక్కర్ చేసినవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రమే తప్ప అధికారికం కాదని తెలిపింది. ముందుగా అణ్వస్త్రాలు ఉపయోగించకూడదన్న విధానానికే భారతదేశం కట్టుబడిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. 1998లో నిర్వహించిన అణు పరీక్షల తర్వాత.. ముందుగా తాము అణ్వస్త్రాలను ఉపయోగించబోమన్నది తన విధానంగా భారతదేశం ప్రకటించింది. తాను చేసిన ఈ వ్యాఖ్యలపై తర్వాత ఎలా ప్రచారం జరుగుతుందో కూడా పరికర్ నవ్వుతూ చెప్పారు. భారతదేశం తన అణు విధానాన్ని మార్చేసుకుందని మీడియాలో వచ్చినా వస్తుందని ఆయన అన్నారు. ఇది ప్రభుత్వ విధానంలో మార్పు కాదని, ఒక వ్యక్తిగా తాను మాత్రమే అలా భావిస్తున్నానని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు ముందువరకు పాకిస్థానీ రక్షణ మంత్రి తరచు భారతదేశం మీద అవసరమైతే అణు దాడికి కూడా వెనుకాడేది లేదని బెదిరించేవారని, కానీ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు అలాంటి బెదిరింపు ఒక్కటి కూడా రాలేదని.. దాన్ని బట్టి చూస్తే మనం ఏమైనా చేయగలమని అర్థమవుతోందని కూడా పారికర్ అన్నారు. -
'జవాన్ల సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తాం'
బుద్గాం: కేవలం ఒక లక్ష మంది ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు మాత్రమే వన్ ర్యాంక్-వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) అమలులో సమస్యలు ఎదుర్కొంటున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ గురువారం తెలిపారు. పథకం అమలులో సమస్యలను రెండు నెలల్లోగా పరిష్కరిస్తామని చెప్పారు. పట్టణంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మొత్తం 20 లక్షల మంది ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగుల్లో లక్ష మంది ఉద్యోగుల పత్రాల్లో సాంకేతికంగా తేడాలు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. పరీకర్ తో పాటు భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇరువురు 1947లో పాక్ రైడర్ల నుంచి శ్రీనగర్ ఎయిర్ పోర్టును రక్షించిన భారత మొదటి పరమ వీర చక్ర అవార్డు గ్రహీత మేజర్ సోమనాథ్ శర్మ, జవానులకు నివాళులు అర్పించారు. గత 43ఏళ్లుగా అమలుకు నోచుకోని ఓఆర్ఓపీ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగివుందని అన్నారు. ప్రస్తుతం 23 నుంచి 24 శాతం పెరిగిన పెన్షన్ ను జవానులు అందుకుంటున్నట్లు చెప్పారు. జవానుల బాధలు విన్న పరీకర్ వాటన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాను విన్న సమస్యలకు తన తర్వాత పర్యటనలో పరిష్కారం అవుతాయని చెప్పారు. -
క్వెట్టా ఉగ్రదాడిపై స్పందించిన పారికర్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ క్వెట్టాలో జరిగిన ఉగ్రవాద దాడిపై భారత రక్షణమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పాక్ దళాలకు ఆయన సంతాపం తెలిపారు. తీవ్రవాదం ఎక్కడు, ఏ రూపంలో ఉన్నా అది ఆమోదయోగ్యం కాదని పారికర్ స్పష్టం చేశారు. గత నెలలో పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనపై ఆర్మీ దీటుగా సమాధానం ఇచ్చిందన్నారు. కాగా పాకిస్తాన్ క్వెట్టాలోని పోలీసుల శిక్షణా శిబిరంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాకెట్లతో శిక్షణా శిబిరంలోకి ప్రవేశించి దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 59 మంది పోలీసులు దుర్మరణం చెందగా... పలువురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. -
పాకిస్థాన్‌కు దీటైన సమాధానం: పారికర్
పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నా.. వాళ్లకు భారత సైన్యం దీటైన సమాధానం ఇస్తోందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. పాకిస్థానీ సైన్యం జరిపిన కాల్పుల్లో తాజాగా ఒక జవాను మరణించిన నేపథ్యంలో ఆయనిలా చెప్పారు. గత ఐదారేళ్లుగా వందల సంఖ్యలో కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అయితే.. ఇప్పుడు వాళ్లు ఎన్నిసర్లు వచ్చినా మళ్లీ అన్నిసార్లు మనం గట్టి జవాబు ఇస్తున్నామని ఆయన అన్నారు. కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరీ సెక్టార్లో పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాకు చెందిన సుదీష్ కుమార్ (24) అనే సిపాయి ప్రాణాలు కోల్పోయాడు. దానికి బదులుగా భారత దళాలు కూడా కాల్పులు జరిపాయని మనోహర్ పారికర్ తెలిపారు. సెప్టెంబర్ 29వ తేదీన భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత.. ఇప్పటివరకు 25 సార్లు పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ఆర్మీకి అవమానం: ఖర్గే
బెంగళూరు: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతం కావడానికి ప్రధాని నరేంద్రమోదీ కారణమని రక్షణ శాఖమంత్రి మనోహర్ పారికర్ పేర్కొనడం భారత సైనికులను అవమానించడమేనని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయన కర్ణాటకలోని కలబుర్గిలో మీడియాతో గురువారం మాట్లాడారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వినియోగించుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రిగానే భావిస్తున్నట్లున్నారని ఎద్దేవా చేశారు. ఆయన దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా కేవలం ఒకట్రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తుండటం సరికాదని ఖర్గే చెప్పారు. భారత ఆర్మీ పీఓకేలో గత నెల 28అర్ధరాత్రి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి 7 పాక్ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడంతో పాటు దాదాపు 38 మంది ఉగ్రవాదులను హతం చేసిన విషయం తెలిసిందే. -
'తీవ్రవాదాన్ని క్లీన్ చేస్తున్న పరీకర్'
పంజీ: తీవ్రవాదాన్ని క్లీన్ చేసే పనిలో కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పరీకర్ నిమగ్నమయ్యారని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. ఆదివారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పర్సేకర్ నివాళులు ఆర్పించారు. పర్సేకర్ మట్లాడుతూ క్లీన్ గోవా మిషన్‌ను ప్రస్తావించారు. 'మన మట్టిలో జన్మించిన బిడ్డను టెర్రరిజాన్ని క్లీన్ చేయడానికి మనం పంపించాము. ఆయన తన కర్తవ్యాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు' అని పర్సేకర్ అన్నారు. 'గాంధీజీ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమం గాంధీజీ సందేశానికి వాస్తవ రూపం ఇచ్చేలా ఉంది' అని పర్సేకర్ అన్నారు. -
ఇప్పటికీ కోమాలోనే పాకిస్థాన్!
భారత్‌కు హాని చేయాలని చూస్తే తగిన బుద్ధి చెప్తాం సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత తొలిసారి పరీకర్ స్పందన పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో నిర్దేశిత దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) నిర్వహించి.. ఎనిమిది ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన భద్రతా దళాల శౌర్యప్రతాపాలను కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పరీకర్ ప్రశంసించారు. పీవోకేలో దాడుల తర్వాత తొలిసారి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే వారికి తగిన బుద్ధి చెప్తామని ఆయన స్పష్టం చేశారు. ’ఏ దేశాన్ని కబళించాలని మేం కోరుకోవడం లేదు. శ్రీరాముడు లంకను గెలిచి.. దానిని విభిషణుడికి ఇచ్చాడు. బంగ్లాదేశ్ విషయంలోనే మేం అదే చేశాం. మేం ఎవరికీ హాని తలపెట్టాలని కోరుకోం. కానీ ఎవరైనా హాని చేస్తే మాత్రం ఊరుకోం. తగినరీతిలో బుద్ధి చెప్తాం’ అని పరీకర్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను పాకిస్థాన్ తోసిపుచ్చుతున్న అంశంపై స్పందిస్తూ పీవోకేలో భారత ప్రత్యేక బలగాలు ప్రవేశించి దాడులు నిర్వహించడాన్ని పాక్ ఇంకా నమ్మలేకపోతున్నదని ఆయన పేర్కొన్నారు. ’సర్జరీ చేయించుకున్నవారిలాగే పాకిస్థాన్ కూడా ఇంకా కోమాలోనే ఉంది’ అని పేర్కొన్నారు. భారత్ మౌనాన్ని బలహీనతగా పాకిస్థాన్ భావించకూడాదని ఆ దేశాన్ని ఘాటుగా హెచ్చరించారు. లంకకు వెళ్లేముందు తన శక్తి ఏమిటో హనుమంతుడికి తెలియదని, అదేవిధంగా ఆర్మీ శక్తి ఏమిటో తాను తెలియజేశానని, ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు సైన్యం తన కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించిందని ప్రశంసించారు. -
దాడికి సూత్రధారి ఎవరు?
ఉడీలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతీయుల గుండెలన్నీ ఒక్కసారిగా భగభగ మండిపోయాయి. ప్రతీకార జ్వాలలు రగులుకున్నాయి. పాకిస్థాన్ పీచమణచాల్సిన సమయం ఇదేనని మాజీ సైనికులు కూడా గర్జించారు. కానీ.. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఆశించిన స్పందన రాలేదు. జవాన్ల త్యాగాలు వృథాగా పోనివ్వబోమని మాత్రమే ప్రధానమంత్రి చెప్పారు. అయితే.. అప్పటికే తెరవెనక జరగాల్సింది అంతా జరిగిపోతోంది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ప్రధానమంత్రికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎక్కడా తెరమీద కనిపించలేదు. తెర వెనకనుంచే ఇద్దరూ వ్యూహరచనలో మునిగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పారికర్ - దోవల్.. వీళ్లిద్దరూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నమ్మిన బంట్లు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తాను తలపెట్టిన ఆర్థిక సంస్కరణలను సరిగ్గా అమలుచేయడానికి మన్మోహన్ సింగ్‌ను ఎలా ఎంచుకుని తీసుకొచ్చారో.. అలాగే నరేంద్రమోదీ ప్రధాని పదవి చేపట్టిన వెంటనే అప్పటివరకు గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌ను కూడా రక్షణ మంత్రిగా అలాగే తీసుకొచ్చారు. మరోవైపు అప్పటివరకు యూపీఏ హయాంలో పెద్దగా ప్రాధాన్యం లభించని అజిత్ దోవల్‌ను కూడా జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. 2014 మే 26న మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, 30వ తేదీన దోవల్ ఎన్ఎస్ఏ పదవిలో నియమితులయ్యారు. అప్పటి నుంచి ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆయన హస్తం ఉండని సందర్భం లేదు. ఎవరీ దోవల్.. ఏం చేశారు అజిత్ దోవల్.. 1968 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. కేరళ కేడర్‌లో చేరిన ఈయన, 2004-05 సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా వ్యవహరించారు. 1980లలో మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలో దోవల్ ఆ సంస్థలోకి చొరబడి, దాని అగ్రకమాండర్లు ఆరుగురిని మట్టుబెట్టారు. దాంతో ఎంఎన్ఎఫ్ ఉనికి దాదాపు నిర్వీర్యం అయిపోయింది. ఇక పాకిస్థాన్‌లో గూఢచారిగా ఏడు సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఒక భిక్షగాడి వేషంలో కూడా తిరిగేవారని అంటారు. పాకిస్థాన్‌లో భారత గూఢచారులు పట్టుబడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. చిత్రహింసలు పెట్టి మరీ చంపేస్తారు. అది తెలిసి కూడా ఏకంగా ఏడేళ్ల పాటు అక్కడే ఉండి వాళ్ల రహస్యాలను తెలుసుకున్న ఘనత దోవల్‌కు ఉంది. ఇక భారత సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించిన సమయంలో దోవల్ ముందుగానే స్వర్ణదేవాలయంలోకి వెళ్లిపోయారు. అక్కడ ఆయన పాకిస్థానీ గూఢచారిగా నటించి, ఉగ్రవాదుల ప్లాన్లు అన్నీ తెలుసుకుని, వాటిని సైన్యానికి అందించారు. కుక్కే పారే లాంటి కశ్మీరీ ఉగ్రవాదులను ఆయా ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా మార్చేశారు. ఇటీవలే ఎన్ఎస్ఏగా బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది కాలానికే ఇరాక్ నుంచి 45 మంది భారతీయ నర్సులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహీంద రాజపక్స ఓటమి వెనక ఉన్నది కూడా అజిత్ దోవలే! రాజపక్స భారతదేశానికి తలనొప్పిగా మారి, చైనాకు అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దాంతో తర్వాతి ఎన్నికల్లో ఆయన నెగ్గడానికి ఏమాత్రం వీల్లేదని భావించిన దోవల్.. అక్కడకు వెళ్లి ఏం మాయ చేశారో గానీ, మైత్రిపాల సిరిసేన తదుపరి అధ్యక్షుడయ్యారు. ఒకప్పుడు రాజపక్సకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే సిరిసేనను ఆయనపై రెచ్చగొట్టి పోటీకి నిలబెట్టింది కూడా దోవలే. అంతేకాదు.. మాజీ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను పోటీ చేయొద్దని కోరి.. ఒప్పించారు కూడా. దాంతో రాజపక్స ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసి.. సిరిసేనను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు! -
మెరుపుదాడి
-
మెరుపుదాడి
♦ పీవోకేలో భారత కమాండోల వ్యూహాత్మక పంజా ♦ బుధవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆపరేషన్ ♦ నియంత్రణరేఖకు ఆవల మూడు కిలోమీటర్ల వరకూ సైనిక చర్య ♦ ఉగ్రవాదులు పొంచివున్నారన్న ఖచ్చితమైన సమాచారంతోనే దాడి ♦ ఆపరేషన్ మొత్తం యూఏవీలతో సైనిక కేంద్రాలకు ప్రత్యక్ష ప్రసారం ♦ నార్త్‌బ్లాక్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రభుత్వ, సైనిక ముఖ్యులు ♦ 40 మంది ఉగ్రవాదులు హతం- ఉడీ దాడికి సైన్యం ప్రతీకారం ♦ బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆపరేషన్ ♦ నియంత్రణరేఖకు ఆవల మూడు కిలోమీటర్ల వరకూ సైనిక చర్య ♦ నార్త్‌బ్లాక్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రభుత్వ, సైనిక ముఖ్యులు ఉడీ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు బలంగా జవాబు ఇవ్వాలన్న ఒత్తిడి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు ఎదురైంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద స్థావరాలపై ముందస్తు దాడి చేయడానికి వారం రోజుల కిందటే ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. బుధవారం నాడు.. రక్షణమంత్రి మనోహర్ పారికర్‌తో పాటు, ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ సుహాగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌లు రాత్రి ఓ విందుకు హాజరుకావాల్సి ఉంది. కానీ వారెవరూ ఆ విందుకు హాజరుకాలేదు. వారు ముగ్గురూ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్‌సింగ్‌తో కలిసి సౌత్ బ్లాక్‌లోని సైనిక వార్ రూమ్‌లో రోజంతా చర్చించారు. రహస్య సైనిక చర్యకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంఛనంగా ఆమోదం తెలిపాక.. అర్థరాత్రి సైనిక చర్య మొదలయింది. పీఓకేలో భారత కమాండోల నిర్దిష్ట దాడులు న్యూఢిల్లీ: సీమాంతరఉగ్రభూతంపై భారత్ పంజా విసిరింది. నియంత్రణరేఖను దాటి మెరుపు దాడి చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పొంచివున్న ఉగ్రమూకలను అంతమొందించింది. భారత సైనిక కమాండోలు ఈ వీరోచిత ఆపరేషన్‌ను నిర్వహించారు. ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నారు. ముంచుకొస్తున్న ముప్పునూ నిలువరించారు. ముందుగా రచించిన వ్యూహం ప్రకారం భారత సైనిక కమాండోలు బుధవారం అర్థరాత్రి పీఓకేలోకి చొచ్చుకెళ్లారు. దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలో 7 ఉగ్రవాద ప్రయోగ స్థావరాలపై దాడులు నిర్వహించారు. నాలుగు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో.. 38 మంది ఉగ్రవాదులతో పాటు, వారికి మద్దతునిస్తున్న ఇద్దరు పాక్ సైనికులు కూడా చనిపోయినట్లు అంచనా. భారత్ ఈ సైనిక చర్య విషయాన్ని గురువారం పాకిస్తాన్‌కు తెలియజేసింది. ఉగ్రవాద రక్కసి నిర్మూలనలో సహకరిస్తారని గతంలో ఇచ్చిన హామీ మేరకు నడుచుకుంటారని ఆశిస్తున్నామనీ చెప్పింది. అయినా.. ఎటువంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని స్పష్టంచేసింది. ఈ అనూహ్య పరిణామంతో పాకిస్తాన్ నివ్వెరపోయింది. కానీ.. అలాంటి దాడి ఏమీ జరగలేదని, అది కేవలం సీమాంతర కాల్పుల ఘటనేనని గాంభీర్యం ప్రదర్శించింది. భారత సైన్యం కాల్పుల్లో తమ సైనికులు ఇద్దరు చనిపోయారని, తాము భారత జవాను ఒకరిని ప్రాణాలతో పట్టుకున్నామని, మరో 8 మంది భారత సైనికులు తమ కాల్పుల్లో చనిపోయారని ప్రకటనలు జారీ చేసింది. ఈ ప్రకటన పూర్తిగా తప్పని భారత సైన్యం తిరస్కరించింది. పీఓకేలో మెరుపు దాడుల విషయమై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబాముఫ్తీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తదితరులకు ప్రధాని మోదీ సమాచారం ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా రాజకీయ పార్టీలన్నీ తమ విభేదాలను పక్కనపెట్టి.. ఈ దాడి విషయంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించాయి. సైనికుల ఆపరేషన్‌ను ప్రస్తుతించాయి. విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ పి-5 శక్తులతో సహా 25 దేశాల రాయబారులకు ఈ దాడికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)కు ఆవల పాక్ ఆక్రమిత కశ్మీర్లో గల ఉగ్రవాద ప్రయోగ స్థావరాలపై భారత సైన్యం బుధవారం అర్థరాత్రి మెరుపు దాడి చేసింది. భారత్‌లోకి చొరబడేందుకు ఏడు లాంచ్ ప్యాడ్ (ప్రయోగ స్థావరాల)లలో సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులు, వారికి మద్దతిస్తున్న వారిని గణనీయమైన సంఖ్యలో అంతమొందించింది. సైనిక పరిభాషలో ఈ దాడిని ‘సర్జికల్ స్ట్రైక్ (లక్షిత దాడి)’ గా వ్యవహరిస్తారు. పాకిస్తాన్ నుంచి పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ.. కశ్మీర్‌లోని ఉడీలో భారత సైనిక స్థావరంపై దాడికి పాల్పడిన 11 రోజుల తర్వాత భారత్.. ఉగ్రవాద శిబిరాలపై ఈ మెరుపు దాడి చేసింది. ఉడీలో 18 మంది సైనికుల బలిదానం వృథా కాదని, ఆ దాడి కారకులను శిక్షించితీరతామని ప్రధాని మోదీ అప్పుడే ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున 4:30 గంటల వరకూ సైన్యం పీఓకేలో లక్షిత దాడి నిర్వహించింది.మోదీ గురువారం ఉదయం భద్రతపై మంత్రివర్గ సంఘం(సీసీఎస్) భేటీ నిర్వహించి తాజా పరిణామాలను సమీక్షించారు. అనంతరం.. మిలటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరల్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్‌సింగ్ విలేకరుల సమావేశం నిర్వహించి.. సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిన విషయాన్ని ప్రకటించారు. ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పాక్ వైపున పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని, భారత సైనికలందరూ క్షేమంగా తిరిగివచ్చారని చెప్పారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించటం పట్ల రక్షణమంత్రి పరీకర్ ట్వీటర్ ద్వారా సైనిక బలగాలకు అభినందనలు తెలిపారు. ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను త్వరలో విడుదల చేస్తామని సంబంధిత వర్గాలు చెప్పాయి. పాక్ సైనికుల దృష్టి మరల్చి... ♦ అర్థరాత్రి 12:30 గంటలు దాటిన తర్వాత ఎల్ఓసీలో ఉడీ సహా పలు ప్రాంతాల్లో.. పాక్ సైన్యం దృష్టిని మరల్చడానికి భారత సైన్యం ఆర్టిలరీ కాల్పులు ప్రారంభించడంతో ఆపరేషన్ మొదలయింది. భారత సైన్యం కాల్పులను తిప్పికొట్టడంపై పాక్ సైన్యం దృష్టి కేంద్రీకరించడంతో.. భారత కమాండోలు మూడు బృందాలుగా విడిపోయి, ముందుగా నిర్ణయించిన ప్రదేశాల నుండి నేల మీద పాకుతూ ఎల్ఓసీ దాటి పీఓకోలోకి ప్రవేశించారు. ♦ పీఓకేలో 200 కిలోమీటర్ల పరిధిలోని నిర్దిష్ట ప్రాంతాల్లో ఈ సైనిక చర్యను నిర్వహించారు ఆపరేషన్ చాలా వరకూ ఎల్ఓసీకి 2 కి.మీ దూరం లోపలే జరిగింది. అయితే.. ఒక కమాండోటీం హాట్‌వాటర్ స్ప్రింగ్స్‌లో దాదాపు 3 కి.మీ. దూరం లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ♦ లేపా లోయ, టట్టా పానీ, బీంబార్‌లలో ఈ బ లగాలు దాడులు నిర్వహించాయి. హాట్ స్ప్రిం గ్స్, కేల్, లిపాల్లోని ఉగ్రవాదుల లాం చింగ్ ప్యాడ్లపై సైన్యానికి చెందిన 15 కోర్, బీంబార్ గలీపై సైన్యపు 16వ కోర్ దాడి చేపట్టింది. కుప్వారాకు ఎదురుగా ఉన్న నాలుగు లాంచ్ ప్యాడ్లు ఎల్ఓసీ నుండి కేవలం 300 మీటర్ల దూరం లోపలే ఉన్నాయి. సైనిక బలగాలు భా రీ కాల్పులతో ఈ ప్యాడ్లను ధ్వంసం చేశాయి. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాం: డీజీఎంఓ ‘జమ్మూకశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో దాడులులక్ష్యంగా కొన్ని ఉగ్రవాద ముఠాలు భారత్‌లో చొరబడడం కోసం నియంత్రణ రేఖ వెంట లాంచ్ ప్యాడ్లలో వేచివున్నాయని మాకు అందిన విశ్వసనీయ, కచ్చితమైన సమాచారం ఆధారంగా ఆ ల్యాంచ్ ప్యాడ్లపై భారత ఆర్మీ లక్షిత దాడి నిర్వహించింది. ఉగ్రవాదులు చొరబడడం ద్వారా దేశ పౌరుల ప్రాణాలకు ప్రమాదం కలిగేలా విధ్వంసం సృష్టించే కుట్రలో సఫలం కాకుండా చూడడం కోసం ఈ చర్య చేపట్టాం. ఈ ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న వారు గణనీయమైన సంఖ్యలో మరణించారు. ఉగ్రవాదులను అంతమొందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ఆపరేషన్ అక్కడితో ముగిసింది. ఇంకా ఈ చర్యలు కొనసాగించే ప్రణాళికలేవీ మాకు లేవు. అయినప్పటికీ, ఎటువంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కోవడానికి భారత సైన్యం పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉంది. ఈ ప్రాంతంలో శాంతి, ప్రశాంతతలను కాపాడలన్నది భారత ఉద్దేశం. కానీ.. ఉగ్రవాదులు నియంత్రణ రేఖకు అవతలి నుండి పనిచేస్తూ దేశ పౌరులపై దాడులు చేయడాన్ని కచ్చితంగాఅనుమతించం. పాక్ మిలటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరల్‌తో నేను మాట్లాడాను. భారత ఆందోళనలను ఆయనకు తెలియజేశాను. ఈ సైనిక చర్య వివరాలనూ అందజేశాను. తన భూభాగాన్ని కానీ తన నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని కానీ భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకూ వినియోగించనివ్వబోమని పాకిస్తాన్ 2004 జనవరిలో ఇచ్చిన హామీకి అనుగుణంగా.. ఈ ఉగ్రవాద భూతాన్ని ఈప్రాంతం నుంచి తుడిచిపెట్టే దృష్టితో పాక్ సైన్యం మాకు సహకరిస్తుందని ఆశిస్తున్నాం.’ వారం ముందే గ్రీన్‌సిగ్నల్..! ఉడీ ఉగ్రదాడి తర్వాత పాక్‌కు బలంగా జవాబివ్వాలన్న ఒత్తిడి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు ఎదురైంది. ఉగ్రవాద స్థావరాలపై ముందస్తు దాడికి వారం రోజుల కిందటే ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. సరిగ్గా వారం కిందటే.. ఉడీ దాడికి తాము ఎంచుకున్న సమయంలో, ప్రదేశంలో జవాబు ఇస్తామని భారత ఆర్మీప్రకటించింది. బుధవారం రక్షణమంత్రి పరీకర్ ఢిల్లీలో ప్రారంభమైన కోస్ట్‌గార్డ్స్ కమాండర్ల సదస్సు ప్రారంభించారు. ఆ రోజు సాయంత్రం ఆయనతో పాటు, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్‌లు సదస్సులో రాత్రి విందుకెళ్లాల్సి ఉంది. కానీ ఆ విందుకు హాజరుకాలేదు. వారు ముగ్గురూ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్‌సింగ్‌తో కలిసి సౌత్ బ్లాక్‌లోని సైనికవార్ రూమ్‌లో రోజంతా చర్చించారు. రహస్య సైనిక చర్యకు ప్రధానిలాంఛనంగా ఆమోదం తెలిపాక.. అర్ధరాత్రి సైనికచర్య మొదలయింది. నలుగురు ముఖ్యులూ వార్ రూ నుంచి ఆ ఆపరేషన్‌ను ఆద్యంతం పర్యవేక్షించారు. ఆపరేషన్ యూఏవీ వీడియో ద్వారా ఉదంపూర్ సైన్యం నార్తరన్ కమాండ్ కేంద్రంతో పాటు బారాముల్లా, కుప్వారా, ఉడీ సైనిక స్థావరాలకు ప్రత్యక్ష ప్రసారం అయింది. ఆ కేంద్రాలతో పాటు.. సౌత్‌బ్లాక్‌లోని వార్‌రూంలో ప్రసారాలను వీక్షిస్తూ పర్యవేక్షించారు. మొత్తం 40 మంది హతం! మొత్తం 8 లాంచ్ ప్యాడ్లను లక్ష్యంగా ఎంచుకోగా.. ఆరింటిలో ఉగ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారు. రెండిటిలో అంతగా కదలికలు కనిపించలేదు. ప్రతి స్థావరం వద్దా బలగాలు వేగంగా వెళ్లి పేలుడు పదార్థాలు అమర్చి, వాటిని పేల్చి బయటకు వచ్చేశాయి. కొన్ని చోట్ల సైనిక బలగాలకు కాల్పులు ఎదురయినా ఎవరూ గాయపడలేదు. కమాండోలు ఎదురు కాల్పులతో తిప్పికొట్టారు. దాడి చేసిన లక్ష్యాల్లో మూడు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ లాంచ్ ప్యాడ్లకు మద్దతుగా ఉండే పాక్ సైన్యం వాటికి ఇంకొంత దూరంలో ఉంది. దీంతో లాంచ్ ప్యాడ్లలోని ఉగ్రవాదులపై భారత బలగాలు మెరుపు దాడి చేసి అంతమొందించాయి. యూఏవీ వీడియో దృశ్యాలను బట్టి ఈ ఆపరేషన్‌లో 40 మంది చనిపోయినట్లు సైన్యం అంచనాకు వచ్చింది. అందులో 38 మంది ఉగ్రవాదులు కాగా.. మరో ఇద్దరు పాక్ సైనికులుగా చెప్తున్నారు. ఈ సంఖ్యపై అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ఆద్యంతం వ్యూహాత్మకం... సైనిక, ప్రభుత్వ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మెరుపు దాడి తీరుతెన్నులివీ... పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లు ఎల్ఓసీకి ఆవల రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాటిపై వారం రోజులుగా భారత్ నిఘా పెట్టింది. భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు వీటివద్దకు చేరుకుని వేచివున్నారన్న పక్కా నిఘా సమాచారంతో ఎనిమిది లాంచ్ ప్యాడ్లపై దాడి చేయాలని నిర్ణయించారు. ♦ లాంచింగ్ ప్యాడ్లలో ముందుగా గుర్తించిన లక్ష్యాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను స్థానిక కమాండర్లకు ఇచ్చారు. బలగాలను ముందుగానే హెలికాప్టర్ల ద్వారా ఎల్ఓసీ సమీపానికి తరలించారు. అయితే భారత హెలికాప్టర్ ఏదీ ఎల్ఓసీ దాటి అవతలికి వెళ్లలేదు. ఎల్ఓసీకి సమీపంలోని ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లో సైనికులను హెలికాప్టర్ల ద్వారా దించారు. ఆపరేషన్ పూర్తయ్యేంతవరకూ హెలికాప్టర్లను సిద్ధంగానే ఉంచారు. ♦ పారా కమాండో దళాలు, స్థానిక యూనిట్లకు చెందిన ‘ఘాతక్’ ప్లాటూన్లు ఈ ఆపరేషన్లలో పాల్గొన్నాయి. ఉగ్రవాదుల స్థావరాలు ఎక్కడున్నాయో తెలిసిన గైడ్లు, మార్గదర్శకులు కూడా పాలుపంచుకున్నారు. డోంగ్రా, బిహార్ రెజిమెంట్ల సైనికులు ఈ ఆపరేషన్‌కు మద్దతుగా పాల్గొన్నారు. ♦ కమాండోలు థర్మల్ ఇమేజర్లు, హైమాస్క్డ్ లైట్లు, భారీ తుపాకులు, కార్ల్ గుస్తావ్ రైఫిళ్లు, గ్రెనేడ్లు తదితర ఆయుధాలు, సామగ్రిని ఉపయోగించారు. ‘షూట్ టు కిల్’ (చంపడానికి కాల్పులు) ఆదేశాలతో పాటు.. గాయపడిన సైనికుడెవరినీ వెనుక వదిలి రావద్దన్న ఆదేశాలు వారికి ఉన్నాయి. ♦ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని 7 ఉగ్రవాద శిబిరాలను (లాంచ్ ప్యాడ్స్) సైన్యం మెరుపు దాడి కోసం లక్ష్యంగా ఎంచుకుంది. ♦ లాంఛనంగా అనుమతి లభించాక బుధవారం మధ్యాహ్నమే దళాలను హెలికాప్టర్లతో తరలించడం ప్రారంభించింది. ♦ బుధవారం అర్ధరాత్రి దాటాక పాక్ సైన్యం దృష్టిని మరల్చి ఎల్వోసీనుంచి పర్వతశ్రేణులతో కూడిన పీవోకే భూభాగంలోకి పారా కమాండోలు మూడు కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లారు. ♦ 200 కి.మీ విస్తృతిలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఉగ్ర శిబిరాలపై దాడి చేసి 40 మందిని మట్టుబెట్టారు. ♦ మొత్తం ఆపరేషన్‌ను డ్రోన్ కెమెరాల ద్వారా సైనిక కేంద్రాలకు, నార్త్ బ్లాక్‌కు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ♦ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి తెల్లవారుజామున 4:30 గంటలకు తిరిగి మన భూభాగంలోకి చేరుకున్నారు. ♦ మెరుపు దాడి లక్ష్యం నెరవేరిందని, భద్రతా దళాలు పీవోకే లోపలకు ప్రవేశించి తెల్లవారేలోగా తిరిగి వచ్చేశాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ♦ ఈ ఆపరేషన్‌లో మనవారి మృతదేహాలను లేదా గాయపడిన సహచరులను వదిలి రావొద్దని జవాన్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ♦ జమ్మూకశ్మీర్‌తోపాటు మెట్రో నగరాల్లో దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న సైన్యం వారం రోజుల ముందు నుంచే పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై నిఘా పెట్టింది. ♦ ఈ నెల 18న జమ్మూకశ్మీర్‌లోని ఉడి సైనిక క్యాంపుపై ఉగ్రదాడి జరిగిన అనంతరం పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి ఆదేశాలు అందాయి. -
''ఎక్కడో తప్పు జరిగింది''..!
న్యూఢిల్లీః కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఉడీ ఉగ్రదాడిపై స్పందించారు. బుధవారం జరిగిన ప్రత్యేక ప్రశ్నలు సమాధానాల కార్యక్రమంలో ఉడీ ఘటనపై సంధించిన ప్రశ్నకు ఆయన.. ఈ దశలో మొత్తం సమాచారాన్ని బటయ పెట్టలేమన్నారు. అయితే ఎక్కడో తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ఉరి ఘటనపై పారికర్ ను ప్రశ్నించగా ఎక్కడో తప్పుజరిగిందన్నారు. నేను చర్చల కంటే విషయాన్ని అమలు పరచడానికే ఇష్టపడతానని, ఇటువంటి తప్పు మరోసారి జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని పారికర్ పేర్కొన్నారు. మేం ఎక్కడా లోపం జరగదన్న నమ్మకంతో ఉన్నామని, ఉడీ ఘటన ఎంతో సున్నితమైన విషయమని రక్షణమంత్రి చెప్పుకొచ్చారు. ఉడీ దాడి కారకులను దండించి తీరుతామన్న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన కేవలం ప్రకటమాత్రమే కాదని, దాని అమలు విషయంలో సీరియస్ గా ఉన్నట్లు పారికర్ తెలిపారు. నలుగరు జెయిషే మొహమ్మద్ త్రీవ్రవాదులు ఆదివారం సైనిక స్థావరంపై దాడికి దిగి 18 మంది సైనికుల మృతికి కారణమయ్యారని, ఈ కొత్త దాడి భారత్ పాకిస్థాన్ మధ్య సంబంధాలను మరింత పలుచబడేలా చేసిందని రక్షణమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పులు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని పారికర్ హామీ ఇచ్చారు. -
ఎక్కడో పొరపాటు జరిగింది: రక్షణ మంత్రి
-
ఎక్కడో పొరపాటు జరిగింది: రక్షణ మంత్రి
న్యూఢిల్లీ: ఉడీ తరహా దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు. మాటలు చెప్పడానికి కంటే చేతల్లో చేసి చూపించడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. ఏదో పొరపాటు కారణంగానే ఉడీ దాడికి అవకాశం ఏర్పడివుంటున్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. పొరపాటును సరిదిద్దుకుంటామని, భవిష్యత్ లో ఇలాంటి దాడులు జరగకుండా చూసుకుంటామన్నారు. ‘మొత్తానికి ఎక్కడో పొరపాటు జరిగింది. నేను వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదు. ఇది చాలా సున్నిత విషయం. జరిగిన పొరపాటును సరిదిద్దుకుని పునరావృతం కాకుండా చూసుకుంటాం. ఎక్కడ పొరపాటు జరిగిందనేది కచ్చితంగా కనుక్కుంటాం. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామ’ని పరీకర్ అన్నారు. తప్పులు చేయకుండా ఉండడం, వందశాతం కచ్చితత్వంతో పనిచేయడం తన జీవన విధానమని చెప్పారు. ఉడీ తరహా దాడులు మళ్లీమళ్లీ జరగబోవని దేశ ప్రజలకు హామీయిచ్చారు. జమ్మూకశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై ఆదివారం విదేశీ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది సైనికులు వీర మరణం పొందగా, 20 మంది వరకు గాయపడ్డారు. -
'పారీకర్ హిందూవులను మోసం చేశారు'
కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పరీకర్ హిందూవులను మోసం చేశారని గోవా ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింగ్కర్ గురువారం ఆరోపించారు. కాగా రాష్ట్ర ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవి నుంచి వెలింగ్కర్ ను తొలగించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్ర ఆర్ఎస్ఎస్ చీఫ్ గా పనిచేసిన ఆయనను తొలగించడంపై ఇప్పటికే రాష్ట్ర కేడర్ లో 400 మంది సభ్యులు రాజీనామాలు చేశారు. పదవిని కోల్పోవడంపై మాట్లాడిన వెలింగ్కర్ రానున్న ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడనున్నట్లు చెప్పారు. బీజేపీ, పరీకర్ లను నమ్మిన రాష్ట్ర ప్రజలను వారు మోసం చేశారని అన్నారు. కొంకణి, మరాఠి తదితర భాషలను కాపాడుకునేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పరీకర్.. క్రిస్టియన్ స్కూళ్లను మూసివేసేందుకు ఒప్పుకున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మైనారిటీల దేవుడిలా మారిపోయారని అన్నారు. మాతృభాషలో విద్యను బోధించని పాఠశాలలను మూసివేసేందుకు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రయత్నించగా.. పరీకర్ అడ్డగించారని ఆరోపించారు. బీజేపీతో బంధం తెగితే మహారాష్ట్రవాడి గోమంతక్ పార్టీకి మద్దతు ప్రకటిస్తామని లేదా స్వతంత్రంగా బరిలోకి దిగుతామని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకూ రాజీపడే ప్రసక్తే లేదని వెలింగ్కర్ అన్నారు. -
'స్కార్పిన్ లీకేజీపై ఆందోళన వద్దు'
న్యూఢిల్లీ: స్కార్పిన్ జలాంతర్గామి సమాచారం బహిర్గతం కావడంపై ఆందోళన పడొద్దని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ వ్యాఖ్యానించారు. లీకైన పత్రాల్లో ఆయుధ వ్యవస్థ వివరాలు లేనందున కంగారు పడొద్దన్నారు. రక్షణ శాఖ వెబ్సైట్ భారత్‌శక్తి.ఇన్ నిర్వహించిన సెమినార్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేవీ తనకిచ్చిన సమాచారంతోనే మాట్లాడుతున్నానని, అత్యంత దుర్భర పరిస్థితులున్నాయని రక్షణ శాఖ భావిస్తుండటం వల్లే ఆందోళనలు పెరిగాయన్నారు. జలాంతర్గామి సమాచారంతో పాటు ఆయుధ వ్యవస్థ వివరాలు కూడా బయటకు పొక్కాయని, వాటికి సంబంధించిన ప్రతులను సోమవారం బహిర్గతం చేస్తామని ‘ది ఆస్ట్రేలియన్’ ప్రకటించింది. -
పాకిస్థాన్‌ను ఏకి పారేస్తున్నారు!
సాక్షాత్తు ప్రధానమంత్రే తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పాకిస్థాన్‌ను ఎడాపెడా ఏకి పారేయడంతో మంత్రులు కూడా తమ మాటల యుద్ధాన్ని మరింత పదునెక్కించారు. పాకిస్థాన్‌కు వెళ్లడం అంటే నరకానికి వెళ్లడంతో సమానమని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా.. పాకిస్థాన్‌లో జరగనున్న సార్క్ ఆర్థికమంత్రుల సమావేశానికి తాను వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఆయనకు బదులుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఆ సమావేశానికి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ''మన సైనికులు నిన్ననే ఐదుగురు ఉగ్రవాదులను వెనక్కి పంపారు. పాకిస్థాన్‌కు వెళ్లడం అంటే నరకానికి వెళ్లడంతో సమానం'' అని పారికర్ అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, ఇప్పుడు వాళ్లు ఆ విధానం అవలంబించడం వల్ల తలెత్తుతున్న పరిణామాలను భరించాల్సి వస్తోందని ఆయన చెప్పారు. మొత్తమ్మీద ప్రధానమంత్రి నేతృత్వంలో ఎన్డీయే మంత్రివర్గం మాత్రం పాకిస్థాన్ మీద ఎదురుదాడి వ్యూహాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లూ పాక్ విషయంలోను, పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో కూడా భారత్ ఆచితూచి వ్యవహరించింది. కానీ ఇక మీదట అలా ఊరుకునేది లేదని, కశ్మీర్ సహా భారత భూభాగంలో అంగుళం కూడా ఎవరికీ వదిలేది లేదని స్పష్టం చేయడం ఇటీవలి కాలంలోనే చోటుచేసుకున్న పరిణామం. ప్రధానమంత్రి ఇచ్చిన ప్రోత్సాహంతో మంత్రులందరూ కూడా పాకిస్థాన్ మీద తమ వ్యాఖ్యల వేడిని పెంచారు. అయితే ఇది మాటల వరకే పరిమితం అవుతుందా, అంతర్జాతీయ వేదికల మీద చేతల వరకు కూడా వెళ్తుందా అన్నది వేచి చూడాలి. -
రాంచీలో 293 అడుగు ఎత్తులో జెండా
-
మంత్రి పరికర్ను కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు
ఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరికర్ను మంగళవారం న్యూఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు కలిశారు. ఏఎన్-32 విమాన ప్రమాద ఘటనపై కుటుంబ సభ్యుల ఆందోళనను కేంద్ర మంత్రి పరికర్కు వైఎస్ఆర్సీపీ ఎంపీలు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఏఎన్-32 విమానంపై నిబంధనల ప్రకారం 30 రోజుల తర్వాత.. అధికారిక ప్రకటన చేస్తామని పరికర్ చెప్పారని వైఎస్ఆర్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విమానం ఆచూకీ తెలిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరికర్ అన్నారని చెప్పారు. విమానంలోని పౌరులకు కూడా అధికారులలాగే పరిహారం ఇస్తామన్నారని వారు పేర్కొన్నారు. కాగా, గత నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, వీరిలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నట్టు అధికారులు వెల్లడించిన సంగతి విధితమే. -
ఆ నటుడికి బుద్ధి చెప్పారు
ఆమిర్‌పై పరీకర్ పరోక్ష వ్యాఖ్య న్యూఢిల్లీ: ‘దేశం విడిచి వెళ్లాలనుకున్నాం’ అన్న నటుడికి ప్రజలు బాగా బుద్ధి చెప్పారని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘దేశం గురించి చెడుగా చెప్పడానికి ఎవరైనా ఎలా సాహసిస్తారు? దేశం విడిచివెళ్లిపోవాలని భార్య కిరణ్‌రావు తనతో చర్చించినట్లు ఆమిర్ మీడియాతో చెప్పారు. ఆ తర్వాత ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఓ ఆన్లైన్ సంస్థకు ప్రజలు దూరంగా జరిగార’ని పరీకర్ వ్యాఖ్యానించారు. పరీకర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుబట్టింది. దళితులు, మైనారిటీలు, రచయితలు, నటులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై బీజేపీ, దాని అనుబంధ సంస్థ ఆరెస్సెస్‌లు దాడులు చేస్తున్నాయంది. ‘విద్వేషమనేది పిరికివాడి పని అని. ఇది ఎన్నటికీ విజయం సాధించదు. ఇది మీకు గుణపాఠం అవుతుంది’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విటర్లో పేర్కొన్నారు. దీనిపై పరీకర్ వివరణ ఇస్తూ తాను ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. -
'విమానం గల్లంతు విద్రోహచర్య కాదేమో'
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్-32 అదృశ్యం వెనుక విద్రోహుల హస్తం ఉండకపోవచ్చని, అలా జరిగే అవకాశాలు చాలాచాలా తక్కువని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. శుక్రవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన గల్లంతైన విమానం ఆచూకీ కోసం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలను సభ్యులకు తెలిపారు. (ఆపరేషన్ తలాష్) ''ఆపరేషన్ తలాష్'ను స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా. ఇది విద్రోహ చర్య అయ్యే అవకాశాలు చాలా తక్కువ. గల్లంతైన విమానంలో ప్రయాణించిన 29 మందికి చెందిన కుటుంబాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం' అని పరీకర్ తెలిపారు. ఈ నెల 22న గల్లంతైన ఐఏఎఫ్ ఏఎన్ 32 విమానం గల్లంతై ఎనిమిది రోజులు కావస్తున్నా ఇంతవరకు దాని జాడ తెలియక పోవడంతో అందులో ప్రయాణించిన నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. (భగవంతుడా మాకేంటీ కష్టం..!) విమానం గాలింపులో రోబోలు ఇప్పటికే వివిధ శాఖలు విమానం ఆచూకీ కోసం తలపెట్టిన 'ఆపరేషన్ తలాష్' లో నిమగ్నమయ్యాయి. జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు చెందిన చక్రనిధి అనే నౌక ద్వారా అత్యాధునిక రోబోలను గురువారం నుంచి గాలింపు పనుల్లో ప్రవేశపెట్టారు. అత్యాధునికమైన ఈ నౌకకు అమర్చే రోబోలు నడిసముద్రంలో ఎంతటి లోతులో ఉన్న వస్తువులనైనా గుర్తించగలవు. (చివరి ప్రయత్నంగా విదేశాల సాయం తీసుకుంటాం) బంగాళాఖాతంపై ఎగురుతున్నప్పుడే విమానం ప్రమాదానికి లోనై ఉంటుంది, విమాన వేగానికి సుమారు 13 వేల అడుగుల లోతుల్లోని ఇసుకలో కూరుకు పోయి ఉండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమానాన్ని కనుగొనడం అంత సులువు కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే రోబోల ప్రవేశం వల్ల కూలిపోయిన విమానం ఆచూకీ లభిస్తుందని నమ్ముతున్నామన్నారు. గత ఏడాది కూలిపోయిన కోస్ట్‌గార్డ్ విమానం శకలాలను సైతం ఈ రోబోల ద్వారానే గుర్తించినట్లు తెలిపారు. (విమానాలను నడుపుతున్న తీరు బాధాకరం) -
ఆ శకలాలు ఏఎన్-32 విమానంవేనా!
న్యూఢిల్లీ: గత శుక్రవారం గల్లంతైన ఏఎన్-32 విమానం ఆచూకీకి సంబంధించి కీలక పురోగతి లభించినట్టు భావిస్తున్నారు. తాజాగా బంగాళాఖాతం సముద్రంలో కొన్ని శకలాలు తేలుతూ కనిపించాయని, ఇవి ఏఎన్-32 విమానానివేనా అన్నది ఇంకా ధ్రువీకరించలేదని కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఆ శకలాలు గల్లంతైన విమానానివేనా అన్నది ధ్రువీకరించమని నేవీకి సూచించినట్టు చెప్పారు. భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఈ విమానం గాలింపు చర్యల విషయంలో ఏమాత్రం రాజీపడబోమని ఆయన స్పష్టం చేశారు. ఏఎన్-32 విమానం గల్లంతై ఆరురోజులు కావొస్తున్నది. ఈ విమానం జాడ కోసం ముమ్మరంగా భద్రతా దళాలు గాలిస్తున్న సంగతి తెలిసిందే. అయినా, 29మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఆ విమానికి ఏమైందన్న జాడ ఇప్పటికీ తెలియలేదు. నానాటికీ విమానంలో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బతికి బయటపడే ఆశలు అడుగంటిపోతున్నాయి. విమానం ఆచూకీ కోసం ఇప్పటివరకు నిర్వహించిన ఆపరేషన్‌లో అన్ని ప్రతికూల సంకేతాలు అందాయని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. 13 నావాలు, 2 కోస్ట్‌గార్డ్ షిప్పులు అండమాన్ నికోబార్ దీవుల సమీపంలోని సముద్రంలో ప్రస్తుతం విస్తృతంగా గాలింపులు నిర్వహిస్తున్నాయి. -
ఆ విమానానికి ఏమైనట్టు!
-
ఆ విమానానికి ఏమైనట్టు!
అన్ని సంకేతాలు చెడును సూచిస్తున్నాయన్న పారికర్ భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం గల్లంతై ఐదురోజులు కావొస్తున్నది. ఈ విమానం జాడ కోసం ముమ్మరంగా భద్రతా దళాలు గాలిస్తూనే ఉన్నాయి. అయినా, 29మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఆ విమానికి ఏమైందన్న జాడ ఇప్పటికీ తెలియలేదు. విమానంలో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బతికి బయటపడే ఆశలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి. విమానం ఆచూకీ కోసం ఇప్పటివరకు నిర్వహించిన ఆపరేషన్‌లో అన్ని ప్రతికూల సంకేతాలు అందాయని భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ విషయమై కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ మంగళవారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు చాలా సంకేతాలు అందాయి. అన్ని సంకేతాలు చెడునే సూచిస్తున్నాయి. ఓ ప్రాంతం నుంచి వచ్చిన సమాచారం, లింకులను ఆధారంగా సమగ్ర నిర్ధారణకు వచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.ఈ విషయంలో తప్పుడు సంకేతాలు కూడా కొన్ని అందుతున్నాయి. కాబట్టి అన్నింటినీ బేరిజువేసుకొని ఓ నిర్ధారణకు రావాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. జాతీయ సముద్ర టెక్నాలజీకి చెందిన సాగర్ నిధి క్లాసికల్ మంచు ఓడను మారిషస్ నుంచి రప్పిచామని, ఇది ఎంత లోతులోనైనా ప్రయాణించగలదని చెప్పారు. అయితే, ఏ ప్రాంతంలో దీనిద్వారా ఆపరేషన్ చేపట్టాలనేది నిర్ణయించాల్సి ఉందని ఆయన చెప్పారు. -
కార్గిల్ అమరవీరులకు ఘన నివాళి
న్యూఢిల్లీ : కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన అమర జవాన్లకు రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి వద్ద పుష్పమాల ఉంచి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాల అధిపతులు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రక్షణమంత్రి పారికర్...అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా జరుపుకొనే 'విజయ దివస్' సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. 'మాతృభూమి కోసం పోరాడి, యుద్ధంలో మరణించిన సైనికులకు తలవంచి సెల్యూట్ చేస్తున్నా. త్రివిధ దళాల శౌర్యానికి, త్యాగానికి ప్రతీక విజయ్ దివస్' అని ఆయన ఈరోజు ఉదయం ట్వీట్ చేశారు. On Kargil Vijay Diwas I bow to every valiant soldier who fought for India till the very last breath. Their heroic sacrifices inspire us. — Narendra Modi (@narendramodi) 26 July 2016 India will never forget the fearlessness with which our courageous soldiers gave a befitting & unforgettable reply to the intruders. — Narendra Modi (@narendramodi) 26 July 2016 కాగా కార్గిల్ యుద్ధం ముగిసి నేటికి 17 ఏళ్లు. 1999 మే నెలలో ప్రారంభమైన ఈ యుద్ధం జులై 26 వరకు కొనసాగింది. లడక్ ప్రాంతంలోని కార్గిల్ జిల్లా సహా సరిహద్దు వెంబడి మరికొన్నచోట్ల జరిగింది. యుద్ధప్రారంభ దశలో ఇది కేవలం కశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న ఆందోళనగా భావించినప్పటికీ మరణించిన భారత జవాన్ల దగ్గర లభించిన ఆధారాలను బట్టి ఇందులో పాకిస్థాన్ సైనిక దళాల హస్తం కూడా ఉందని రుజువైంది. -
ఆ శకలం గల్లంతైన విమానానిదేనా?
సాక్షి, చెన్నై : బంగాళాఖాతంపై అదృశ్యమైన ఏఎన్-32 ఎయిర్‌ఫోర్స్ విమానం కోసం అన్వేషణ తీవ్రతరమైంది. అయితే చెన్నైకి 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఓ వస్తువు లభించినట్లు సమాచారం. అది విమాన శకలమా లేక మరొకటా అనేది తెలియాల్సిఉంది. వస్తువు లభించిన ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్వయంగా సెర్చ్ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. ఏఎన్-32 ఎయిర్‌ఫోర్స్ విమానం ఆచూకీ కోసం భారత నౌకాదళం, కోస్టుగార్డు, వైమానిక దళం వర్గాలు జలాంతర్గామి, ఎనిమిది విమానాలు, 18 నౌకలతో ఆచూకీ కోసం అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. గల్లంతైన విమానంలో ప్రయాణించిన 29 మంది జాడ కోసం వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. రక్షణ మంత్రి పర్యవేక్షణ: ఏఎన్ -32 గల్లంతు సమాచారంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శనివారం ఉదయమే తమిళనాడుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అరక్కోణం వైమానిక దళానికి, అక్కడ అదృశ్యమైన విమానానికి సంబంధించి సిద్ధం చేసిన ఫొటోలను పరిశీలించారు. గాలింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాలింపులో సాంకేతిక పరిజ్ఞానం, ఆ విమానానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బంగాళాఖాతంలో ఏఎన్-32 విమానంతో సంబంధాలు తెగినట్టుగా భావిస్తున్న ప్రదేశం వరకు పర్యటించారు. గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. తదుపరి తాంబరం ఎయిర్‌బేస్‌కు చేరుకుని వైమానిక, నౌకాదళం వర్గాలతో చర్చించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి పర్యవేక్షణలో ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించినట్టు సమాచారం. ఈ కమిటీ ప్రాథమిక విచారణ ప్రారంభించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో వైమానిక, నౌకాదళం వర్గాలతో పాటు, సాంకేతిక నిపుణుల్ని నియమించినట్టు తెలిసింది. చెన్నై నుంచి బయలుదేరిన విమానంలో చెన్నైకు చెందిన ముత్తుకృష్ణన్ అనే వ్యక్తి ఉన్నట్టు సమాచారం. -
మిస్సింగ్ విమానంపై రక్షణమంత్రి సమీక్ష
-
రంగంలోకి దిగిన పి-8ఐ విమానం
-
అవినీతి ఆరోపణలపై సచిన్ స్పందించాడు!
డీఆర్డీవోకు చెందిన ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిషేధం ఉంది. అక్కడ రిసార్ట్ నిర్మించడంపై డీఆర్డీవో ఎస్టేట్ అధికారి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ డిపార్ట్ మెంట్లకు ఫిర్యాదుచేశారు. కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఆక్రమిత స్థలాలు, అక్రమ నిర్మాణాలను ఆదర్శ్ కుంభకోణం కంటే చాలా పెద్దదని ఎస్టేట్ ఆఫీసర్ ఆరోపించారు. ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో డీఆర్డీవో స్థలాన్ని ఆక్రమించి సచిన్ వ్యాపార భాగస్వామి రిసార్ట్ కట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంజయ్ నారంగ్ మీడియాతో మాట్లాడుతూ... మాకు సంబంధించిన నిర్మాణాలు, ఆస్తులలో అవినీతి లేదు. అన్నీ చట్టపరంగా నిర్మించినవేననీ, కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న పాత బిల్డింగ్ లకు మాత్రమే మరమ్మతులు చేశామని పేర్కొన్నాడు. కంప్లైంట్ గురించి తనకేం తెలియదని, తన దృష్టికి రాలేదని చెప్పాడు. సచిన్ మిత్రుడు నారంగ్ కు చెందిన దాలియా బ్యాంకు, ఇతర ఆస్తులపై జూలై 6న ఓ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. నారంగ్ నా పార్ట్నర్ కాదు: సచిన్ పారికర్ ను కలిసిన అనంతరం సచిన్ మీడియాతో మాట్లాడాడు. రక్షణశాఖకు రాతపూర్వక సమాధానం ఇవ్వడానికి వచ్చాను. నారంగ్‌కు చెందిన ముస్సోరిలోని ల్యాండర్ విషయాలపై వివరణ ఇచ్చినట్లు చెప్పాడు. ప్రస్తుతం నారంగ్ తో తనకెలాంటి వ్యాపార సంబంధాలు లేవని, ల్యాండర్ రెసిడెన్సీలో మాత్రమే బస చేసేవాడినని సచిన్ తెలిపాడు. ఆర్థిక లావాదేవిలకు సంబంధించి చర్చించలేదని సచిన్ వ్యక్తిగత కార్యదర్శి వెల్లడించాడు. -
మరో వివాదంలో క్రికెట్ దేవుడు!
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. భారతరత్న పురస్కారాన్ని దుర్వినియోగం చేశారనే అరోపణలతో వీకే నస్వా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. అయితే తాజాగా ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో డీఆర్డీవో స్థలాన్ని ఆక్రమించి సచిన్ వ్యాపార భాగస్వామి రిసార్ట్ కట్టారని ఆరోపణలొచ్చాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను రాజ్యసభ సభ్యుడైన సచిన్ కోరారు. సమ్మర్ క్యాంపు కోసం ఏర్పాటు చేసుకున్న రిసార్టులో 50 అడుగుల స్థలంపై వివాదం తలెత్తింది. డీఆర్డీవోకు చెందిన ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిషేధం ఉంది. అయినా అక్కడ ఓ రిసార్ట్ నిర్మించారు. వాస్తవానికి ఆ వేసవి విడిది (రిసార్ట్) ఓనర్ సచిన్ వ్యాపార భాగస్వామి సంజయ్ నారంగ్. అయితే ఈ వివాదంలో జోక్యం చేసుకునేందుకు మనోహర్ పారికర్ సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. రక్షణశాఖకు సంబంధించిన అంశం కావడంతో.. కేవలం పారికర్ మాత్రమే తనను ఈ వివాదం నుంచి బయట పడేయగలరని సచిన్ భావిస్తున్నారట. ఇప్పటివరకూ ఈ రిసార్ట్ కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ కథనం ప్రకారం.. తొలుత ఇక్కడ కేవలం ఓ టెన్నిస్ కోర్టును నిర్మించుకునేందుకు నారంగ్ అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత సకల సౌకర్యాలతో వసతులు ఏర్పాటుచేసుకున్నారని ఆరోపిస్తున్నారు. గతనెలలో ఈ విషయంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐలకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. మరోవైపు ఈ వివాదంపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నా సచిన్, సంజయ్ నారంగ్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
మోదీ ఆ మాట చెప్పగానే.. అక్కడ నుంచి జారుకున్నా
పనాజీ: కేంద్ర కేబినెట్లో చేరాలని ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి ఆఫర్ చేసినపుడు, కేంద్ర మంత్రి కావడం రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కు ఇష్టంలేదట. ఆ సమయంలో గోవా ముఖ్యమంత్రిగా ఉన్న పారికర్.. మోదీ ఆఫర్ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించారు. పనాజీలో జరిగిన గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ 60వ జన్మదిన వేడుకల్లో పారికర్ ఈ విషయాలను స్వయంగా చెప్పారు. ‘2014 అక్టోబర్ 26న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశాను. గోవా మైనింగ్ సమస్యలు ప్రస్తావించి, రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరగా మోదీని అంగీకరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కేంద్ర కేబినెట్లోకి మీరు ఎందుకు చేరరాదు? అన్ని నన్ను ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్ మంత్రి పదవి అంటే నాపై బాంబు వేయడం వంటిదనిపించింది. ఆలోచిస్తానని మోదీకి చెప్పి అక్కడ నుంచి జారుకున్నా. రెండు, మూడు నెలలు ఢిల్లీకి వెళ్లరాదని నిర్ణయించుకున్నా. అయితే ఐదారు రోజుల్లోనే మోదీ మళ్లీ గుర్తు చేశారు. కేంద్రానికి వెళ్లాలని నవంబర్ 6న నిర్ణయించుకున్నా. అదే నెల 8న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా’ అని గోవా ముఖ్యమంత్రి నుంచి కేంద్ర రక్షణ మంత్రి వరకు తన ప్రయాణం గురించి పారికర్ వెల్లడించారు. పారికర్ రక్షణ మంత్రిగా వెళ్లడంతో ఆయన స్థానంలో గోవా ముఖ్యమంత్రిగా పర్సేకర్‌ను నియమించారు. -
దోపిడీదొంగలు వస్తున్నారు.. జాగ్రత్త!
గోవా ఎన్నికల్లో తాము పోటీ చేస్తామంటూ చెబుతున్న ఆమ్ ఆద్మీ పార్టీపై రక్షణ మంత్రి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఘాటుగా విమర్శలు చేశారు. ఢిల్లీ నుంచి కొంతమంది దోపిడీదారులు గోవాకు వస్తున్నారని, గోవాను దోచుకోడానికే వాళ్లు వస్తున్నారని, వాళ్లతో గోవా వాసులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ‘‘కొంతమంది ఢిల్లీవాలాలు ఢిల్లీని దోచుకున్న తర్వాత గోవాను కూడా దోచుకోవాలని చూస్తున్నారు. ఓ అవకాశం కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. వాళ్లు కాకపోతే.. వాళ్ల ప్రైవేటు సెక్రటరీలు దోచుకుంటారు. ఆ ప్రైవేటు సెక్రటరీలు కమీషన్ల కోసమే చూస్తారు’’ అంటూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన ముఖ్యకార్యదర్శి రాజేంద్ర కుమార్‌పై కూడా విమర్శలు చేశారు. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ జన్మదినం సందర్భంగా జరిగిన సభలో పారికర్ మాట్లాడారు. గోవా సంపద మీద చాలా మంది కళ్లు ఉన్నాయని.. అందువల్ల గోవా వాసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాను ఇక్కడికొస్తే బీజేపీని ఓడించాలన్న వాళ్ల కుట్రలు భగ్నమవుతాయని.. అందుకే తాను వస్తున్నానంటే వాళ్లకు కడుపు మంట అని అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవాలో ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ రెండుసార్లు పర్యటించారు. -
అకౌంటింగ్ వ్యవస్ధ మెరుగుకు సలహాలివ్వండి
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో మనోహర్ పారికర్ సాక్షి, న్యూఢిల్లీ: ఏ వ్యాపారానికైనా ఛార్టడ్ అకౌంటెంట్లు ఉత్తమ సలహాదారులని, ఏ సంస్ధకైనా పటిస్ఠ ఆర్ధిక వ్యవస్తకు వారు వెన్నెముక్క లాంటివారని కేంద్ర రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా( ఐసిఎఐ) 67 సంవత్సరాల వృత్తి ప్రావీణ్యతను పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి మనోహర్ పారికర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి 1500 మంది నిపుణులు హాజరయ్యారు. రక్షణ మంత్రిత్వ శాఖలో అకౌంటింగ్ వ్యవస్ధ పనితీరును మరింత మెరుగు పర్చడానికి ఐసిఎఐ తగు సలహాలివ్వాలని రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ కోరారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐసిఎఐ అధ్యక్షుడు ఎం. దేవరాజా రెడ్డి మాట్లాడుతూ గత 67 సంవత్సరాలుగా ఐసిఎఐ ప్రామాణికతలను పెంచి పోషిస్తూ, తటస్ధ నియంత్రకంగా, అకౌంటెన్సీ వృత్తికి మార్గదర్శకంగా పని చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ మొదటి చొరవ అయిన ఆదాయపు డిక్లరేషన్ పధకం, 2016 విజయం సాధించడానికి అనువుగా ఐసిఎఐ పాల్గొంటుందని దేవరాజా రెడ్డి చెప్పారు. శనివారం నుంచి ఈ పధకం పై దేశ వ్యాప్తంగా ఉన్న ఐసిఎఐ 154 శాఖలలో అవగాహనా కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలిపారు. -
మాట తడబడిన రక్షణ మంత్రి
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి వచ్చిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట తడబడ్డారు. పొరపాటున కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన సంబోధించారు. దాంతో వేదికపై ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు ఇతర నేతలు కూడా ఖంగుతిన్నారు. తెలంగాణలో వాస్తుపాలన సాగుతోందని.. ఇక్కడ బీజేపీ ఎదిగేందుకు చాలా అవకాశం ఉందని పారికర్ అన్నారు. టీఆర్ఎస్ యథేచ్ఛగా ఫిరాయింపులకు పాల్పడుతోందని, ఇప్పుడు ఆ పార్టీలో చేరినవాళ్లంతా చివరి ఏడాదిలో మళ్లీ తిరుగుముఖం పట్టడం ఖాయమని పారికర్ చెప్పారు. రాష్ట్రపార్టీతో కొంత సమాచార లోపం జరిగిందని.. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గోవాలో 0.4 శాతం ఓటింగు ఉన్న పరిస్థితి నుంచి అధికారంలోకి వచ్చామని, తెలంగాణలో ఇప్పటికే 14 - 15 శాతం ఓటింగ్ ఉందని పారికర్ చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని, ఆ తర్వాతే ప్రజలు అధికారంలో కూర్చోబెడతారని సూచించారు. -
కంటోన్మెంట్ సమస్యలు పరిష్కరిస్తాం: పరీకర్
బొల్లారంలో కంటోన్మెంట్ ఆసుపత్రిని ప్రారంభించిన రక్షణ మంత్రి ఆర్మీ అధికారులు రోడ్లు మూసేస్తున్నారు.. ఇళ్లు కూలుస్తున్నారు: ఎంపీ మల్లారెడ్డి ఇక్కడి ప్రజలు తీవ్రవాదులా అంటూ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డులో ఆర్మీకి, సాధారణ ప్రజలకు మధ్య నెలకొన్న సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సైనికాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. బొల్లారంలో పునర్నిర్మించిన 30 పడకల కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మల్లారెడ్డి.. రోడ్ల మూసివేత, మిలిటరీ అధికారులు, కంటోన్మెంట్ బోర్డు సీఈవో వ్యవహార శైలి తదితర అంశాలను పరీకర్ దృష్టికి తెచ్చారు. ‘‘కంటోన్మెంట్‌లోని ప్రజలు కొంతకాలంగా భయాందోళనలకు గురవుతున్నారు. మిలిటరీ వాళ్లు రోడ్లను మూసేస్తున్నారు. ఇళ్లు కూల్చేస్తున్నారు. పాకిస్తాన్లో ఉన్నట్లుగా పరిస్థితి నెలకొంది. పన్నులు వసూలు చేస్తున్న సీఈవో ఇళ్లను కూడా కూల్చేస్తున్నారు. మసీదు, చర్చిలకు కూడా వెళ్లలేని విధంగా రోడ్లు బంద్ చేయడం ఎందుకు? ఇక్కడి ప్రజలు తీవ్రవాదులా? పన్ను చెల్లిస్తూ పరాయి వాళ్లలా బతకాలా’’ అని ప్రశ్నించారు. తర్వాత పరీకర్ మాట్లాడుతూ.. ‘‘కంటోన్మెంట్ బోర్డులో సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు మిలిటరీ దళాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నాకు తెలుసు. మిలిటరీ వ్యక్తులు శత్రువులు కాదు. దేశం కోసం పనిచేసే వారికి ప్రశాంత వాతావరణం అవసరం. అదే సమయంలో స్థానికంగా నివసించే ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మంత్రి కె. తారకరామారావుతో చర్చించా. త్వరలోనే సమస్యలకు పరిష్కారం కనుగొంటాం’’ అని చెప్పారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్ రెండో దశకు కంటోన్మెంట్‌లోని రక్షణ భూములు ఇవ్వాలని, అందుకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు వేరేచోట భూములు కేటాయించాలన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... కంటోన్మెంట్ బోర్డులోని రోడ్లు, ఇతర సమస్యలు పరిష్కరించాలని పరీకర్‌ను కోరారు. కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, కనకారెడ్డి, సీఈవో సుజాత గుప్తా, రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
'ప్రత్యేక హోదాకు న్యాయపరమైన చిక్కులు'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించి న్యాయం చేస్తున్నామని పారికర్ తెలిపారు. దేశ సరిహద్దుల్లో చొరబాట్లను విజయవంతంగా నిరోధిస్తున్నామని కూడా రక్షణ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తిరిగి భారతదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. -
పాక్ సద్వినియోగం చేసుకోలేకపోతోంది: పారికర్
న్యూఢిల్లీ: రక్షణమంత్రి మనోహర్ పారికర్..ఉగ్రవాదంపై పాకిస్థాన్ వైఖరిని తప్పుబట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్ పర్యటించి, ఆ దేశంతో చర్చలకు ద్వారాలు తెరిచినా పాక్ మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. సింగపూర్‌లో జరిగిన అంతర్ ప్రభుత్వాల భద్రతా సదస్సులో పారికర్ మాట్లాడుతూ పాకిస్తాన్...ఉగ్రవాదులను మంచివారు, చెడ్డవారుగా విభజిస్తోందని, దీనిపై అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశం తీరును ఎండగడతామన్నారు. మోదీ సుహృద్భావంతో చర్చల గవాక్షం తెరిచారని, అది మూసుకోకముందే పాక్ ఉగ్రవాదంపై నిజాయితీగా వ్యవహరించాలన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గుండె ఆపరేషన్ అనంతరం మోదీ షరీఫ్ తో ఫోన్లో మాట్లాడారాని ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారని గుర్తు చేశారు. గత డిసెంబరులో మోదీ అకస్మాత్తుగా లాహోర్‌ను సందర్శించి, పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళిన విషయాన్ని పారికర్ ప్రస్తావించారు. అయితే పాక్ పఠాన్ కోట్ దాడి విషయంలో సహకరించలేదని అన్నారు. -
ఎక్కడ వినాశనం జరిగినా కేంద్ర మంత్రి ఇక్కడే!
కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ పై గోవా ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఆప్ అధికార ప్రతినిధి అశుతోష్ మీడియాతో మాట్లాడారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ లో ఉగ్రదాడులు జరిగినప్పుడు, మహారాష్ట్ర పుల్గావ్ లోని ఆర్మీ డిపోలో పేలుడు సంభవించినప్పుడు రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ సొంత రాష్ట్రం గోవాలోనే ఉన్నారని మండిపడ్డారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండటం వల్ల దేశ రక్షణకే ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయని ఆరోపించారు. రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో తలదూర్చడం మాని దేశ రక్షణ వ్యవహారాలను చూసుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికైనా పారికర్ కు పుల్గావ్ కి వెళ్లి అక్కడ పరిస్థితులను చూడాలని చెప్పాలని పేర్కొన్నారు. గోవాను ఇద్దరు పరిపాలిస్తున్నారని చెప్పారు. ఒకరు ప్రస్తుత సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ కాగా, రెండో వ్యక్తి మనోహర్ పారికర్ అని పేర్కొన్నారు. గోవా ముఖ్యమంత్రి ఎవరన్నది తమకు అర్థం కావడం లేదని అశుతోష్ వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో ఫైళ్లను చక్కబెట్టేందుకు అధికారులు కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసేవారని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కాదు అని బీజేపీ విమర్శలు చేసేది. సీఎంగా పర్సేకర్ ఉన్నా, పారికర్ తన క్యాంపు ఆఫీసులో సెక్రటరీలు, ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. గతంలో యూపీఏ చేస్తే సహించలేదు.. ఇప్పుడు బీజేపీ అదే పని చేస్తోందంటూ ఆప్ ముఖ్యనేతలు విమర్శించారు. -
'ఆమె నిందితురాలని నేను చెప్పలేదు'
న్యూఢిల్లీ: అగస్టావెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో 101 శాతం రాజకీయ జోక్యం ఉందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే సాహసం చేయలేకపోయారని, ఆయనకు గట్స్ లేవని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిందితురాలని తాను ఎప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. ఆమె పేరును తానేప్పుడు ఈ చర్చలోకి లాగలేదన్నారు. ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పలేదన్నారు. అగస్టావెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఎవరు ఉన్నారనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. సీబీఐ దర్యాప్తులో తమ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడం లేదని, కేసు పురోగతి గురించి మాత్రమే అడిగామని పరీకర్ చెప్పారు. -
పరీకర్ పెట్టిన టార్గెట్.. 13 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: రాబోయే రెండేళ్లలో ఆయుధాల ఎగుమతులను రూ. 13.40 లక్షల కోట్లకు పెంచాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు. ఏరోస్పేస్ అండ్ ఏఎంపీ రక్షణ సదస్సులో మాట్లాడిన ఆయన ఈ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టం కూడా కాదని అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఫైటర్ విమానాలు, హెలికాప్టర్లను తయారుచేయనున్నట్లు వివరించారు. దేశీయంగా తయారుచేసే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల ఎగుమతి విషయంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులతో పలుమార్లు సమావేశమైనట్లు తెలిపారు. దాదాపు 120 తేజస్ విమానాలను తయారుచేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు అందించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. తయారీ విషయంలో ఒకటి లేదా రెండు మార్పులు ఉండే అవకాశం ఉందని వివరించారు. -
స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు కోపం వచ్చింది
న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్‌కు పట్టరాని కోపం వచ్చింది. బీజేపీ ఎంపీ, లోక్ సభ చీఫ్ విప్ అర్జున్ రామ్ మెఘ్వాల్ మహిళలను కించపరుస్తూ సభలో మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మాటలు మాట్లొద్దని గట్టిగా మందలించారు. భారత యుద్ధ విమానాలను నడిపేందుకు మహిళలు, భయపడుతున్నారని, మిగ్ 21ఎస్ విమానాల్లో పనిచేసేందుకు వారు వెనుకాడుతున్నారని, ఇంకా అంతతొందరగా ఎవరూ ముందుకు రావడం లేదని, ఎందుకంటే వీటిల్లో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ అంటూ సభలో వ్యాఖ్యానించారు. దీంతో స్పీకర్ మహాజన్ కలగజేసుకొని అలాంటి మాటలు చాలించమన్నారు. మీరైతే వెంటనే అంగీకరిస్తారా అంటూ ఆమె పారికర్ ను ప్రశ్నించారు. వెంటనే అందుకు ఆయన అంగీకరించను అని సమాధానం ఇచ్చారు. అయితే, తాను కేవలం మహిళల్లో అవగాహన కల్పించాలని,ఎన్సీసీ ద్వారా ఆ అవకాశం కల్పించాలని చెప్పాలన్నదే తన ఉద్దేశం తప్ప తక్కువ చేసి మాట్లాడటం కాదని వివరణ ఇచ్చారు. -
ఆ కోటరీని దూరం పెట్టకపోతే కష్టం!
కేంద్ర కేబినెట్లో ఒక సామాజికవర్గానికే పెద్దపీట వేసి, ఎక్కడలేని ప్రాధాన్యతను కల్పించడాన్ని జాతీయస్థాయిలోని బీజేపీ సీనియర్ నాయకులే జీర్ణించుకోలేకపోతున్నారట. ఇలాగైతే కష్టమని, త్వరలోనే ఈ పరిస్థితిలో మార్పు తీసుకురాకపోతే దేశంలోని ఆయా రాష్ట్రాల్లో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరికలు కూడా చేస్తున్నారట. ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కల్రాజ్మిశ్రా, ఎరువులు, రసాయనాల మంత్రి యు.అనంతకుమార్, ఓ.పి.శర్మ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, సహాయమంత్రులు నిర్మలాసీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్లకు ఇస్తున్న ప్రాముఖ్యతను తగ్గించాలనే సూచనలను ఆయా వేదికలపై చేస్తున్నారట. వీరంతా కోటరీగా ఏర్పడి ప్రధాని మోడీని ప్రభావితం చేసి పరిపాలనాపరంగా, రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నారనేది ఈ నాయకుల ముఖ్య ఆరోపణ. వీరి కారణంగానే గతంలో ఢిల్లీ, యూపీ, ఆ తర్వాత బిహార్, తదితర ఎన్నికల్లో తప్పులు చేసి బీజేపీ రాజకీయంగా నష్టపోవాల్సి వచ్చిందంటున్నారు. అంతే కాకుండా హరియాణాలో ఏర్పడిన పరిస్థితులకు, అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులకు వీరి సలహాలే కారణమని చెబుతున్నారు. ఈ కేంద్ర మంత్రులంతా ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఆయా రాష్ట్రాల్లో వారు చెప్పిందే చెల్లుబాటై, బలమైన జాట్, క్షత్రియ, మరాఠా, వక్కలిగ తదితర వర్గాలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారట. ప్రస్తుతం ముఖ్యమైన కేంద్రమంత్రి పదవులను నిర్వహిస్తున్న వారిలో కొందరికి ముఖ్య అధికారప్రతినిధి, తదితర పార్టీపదవులను కట్టబెట్టడం, అప్రధానమైన పోస్టులు ఇవ్వడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చునని కూడా పార్టీ, ప్రభుత్వ పెద్దలకు సలహాలు కూడా ఇస్తున్నారట. ఇదే విషయాన్ని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి కూడా తీసుకెళ్లారట. ఇందుకు త్వరలోనే మార్పులు మొదలవుతాయని, కొందరికి పార్టీ పదవులు అప్పగించడం ఖాయమని వారు గట్టిగా చెబుతుండడం కొసమెరుపు. -
మోదీ,పారికర్ ను చంపేస్తాం
-
మోదీ,పారికర్ ను చంపేస్తాం- ఐఎస్ఐఎస్
పనాజి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది, రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌లను చంపేస్తామంటూ ఐఎస్ఐఎస్ పేరుతో వచ్చిన ఓ లేఖ ఉద్రిక్తతను రాజేసింది. గత వారం గోవా రాష్ట్ర సెక్రటేరియట్‌కు ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ సంస్థ) పేరుతో ఈ లేఖ వచ్చినట్లు రాష్ట్ర నిఘా విభాగం చెబుతోంది. దాంతో పోలీస్ బలగాలను, భదతా దళాలను అప్రమత్తం చేసింది. ఐఎస్ఐఎస్ అని సంతకం చేసి పోస్ట్ చేసిన ఈ పోస్ట్ కార్డు కాపీని యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అన్ని పోలీస్ స్టేషన్లకు పంపింది. కాగా నరేంద్ర మోది, పారేకర్లను చంపేస్తామంటూ తమ కు ఒక లేఖ చేరిందని గోవా పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశామన్నారు. పోస్ట్ కార్డ్ పై సంతకం మాత్రమే ఉన్న ఈ లేఖలో గోవధ నిషేధంపై ఆగ్రహం వ్యక్తం చేశారని, అయితే ఎవరు రాశారనే వివరాలేవీ ఆ లేఖలో లేవని పేర్కొన్నారు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
క్షమ లేదిక.. ఏదో ఒకటి చేసేస్తాం
జైపూర్: 'మనది క్షమాగుణం కలిగిన దేశం. చాలామందిని చాలా విషయాల్లో క్షమిస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు కాలం మారింది. క్షమ లేదిక. ఏదో ఒక విధంగా తప్పుచేసినవాళ్ల భరతం పడతాం' అంటూ పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీచేశారు రక్షణ మంత్రి మనోహర్ పారికర్. శనివారం జైపూర్ లోని సీఐఎస్ఎఫ్ మైదానంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని ప్రారంభించిన ఆయన అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారతీయ యువకులు గొప్ప దేశభక్తులని, జాతీయవాద భావాలు నిండినవారని అందుకే సైన్యంలో చేరేందుకు ఉత్సాహం చూపుతారని కితాబిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రక్షణ రంగ ఉద్యోగులు ఉగ్రవాద సంస్థల ఉచ్చులో పడిపోకుండా అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడికి ఎయిర్ ఫోర్స్ లోని కొందరు ఉద్యోగులే సహకరించారనే ఆరోపణలు వెలుగుచేసిన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ 'హనీట్రాప్ కేసులు వెలుగులోకి రావటం వాస్తవమే అయినప్పటికీ ఉన్నతస్థాయి అధికారులెవ్వరూ ఆ ఉచ్చులో పడలేదు. ఒకరిద్దరు కిందిస్థాయి ఉద్యోగులే కుట్రకు పాల్పడ్డారు. నిజానికి వ్యవస్థ అత్యంత బలంగా ఉన్నప్పుడే శత్రువులు హనీట్రాప్ తరహా పాచికలువేస్తారు. ఏదిఏమైనప్పటికీ ఉద్యోగులు ఉగ్రవాదుల ఉచ్చులో పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం' అని పారికర్ పేర్కొన్నారు. -
'వారి మరణం బాధ కలిగిస్తోంది'
న్యూఢిల్లీ: సైనికుల త్యాగాన్ని ఎల్లప్పుడూ గుర్తిస్తామని రక్షణమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. సైనికుల మరణం తనకెంతో బాధ కలిగిస్తుందని చెప్పారు. 66వ సైనిక దినోత్సవంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించే శత్రువులను తుదముట్టించాల్సిన అవసరముందన్నారు. చెన్నై వరదలు సందర్భంగా సైనికులు చేపట్టిన సహాయక కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లోనూ గొప్ప సేవలందించారని మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారమంతా విశ్వసించలేమని చెప్పారు. తప్పుడు సమాచారం, అనవసర విషయాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయని పారికర్ ఆందోళన వ్యక్తం చేశారు.