దేశ రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరొందిన పరీకర్ మరణంతో గోవాలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిగా కాంగ్రెస్ నేతలు గవర్నర్ మృదులా సిన్హాకు విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అమిత్ షా, నితిన్ గడ్కరీ బీజేపీ సహా మిత్ర పక్షాల ఎమ్మెల్యేలతో సమావేశమైనట్లు సమాచారం. ఈ క్రమంలో గోవా కొత్త సీఎంగా శాసన సభాపతి ప్రమోద్ సావంత్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.