pramod sawant
-
గోవా సీఎల్పీ విలీనానికి ఆమోదం
పణజి: గోవా కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ)ను అధికార బీజేపీలోకి విలీనం చేయాలన్న ప్రతిపాదనకు గోవా అసెంబ్లీ స్పీకర్ రమేశ్ ఆమోద ముద్రవేశారు. కాంగ్రెస్‌కు భారీ షాక్ ఇస్తూ బుధవారం ఎనిమిది మంది పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరిన విషయం తెల్సిందే. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం మూడుకు పడిపోయింది. బీజేపీలో కొత్తగా చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని వార్తలొచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ, ప్రమాణస్వీకార తేదీల ఖరారు కోసం చర్చించేందుకు గవర్నర్‌తో సీఎంసావంత్ భేటీ అయ్యారని మీడియాలో వార్తలు వినవచ్చాయి. ఈ వార్తలను సీఎం ఖండించారు. మోదీ పుట్టినరోజు వేడుకపై చర్చించానని చెప్పారు. (చదవండి: గోవా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాక్) -
బీజేపీ ప్లాన్ సక్సెస్.. గోవాలో కాంగ్రెస్ ఖాళీ!
గోవాలో రాజకీయం ఒక్కసారిగా ఊహించని ములుపు తిరిగింది. ప్రతిపక్షంలో ఉన్న 8 మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. కాగా, బీజేపీలో చేరిన వారీలో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ కూడా ఉండటం విశేషం. కాగా, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారి రాజీనామా లేఖలను స్పీకర్‌కు అందజేశారు. దీంతో, కాంగ్రెస్ శాసనసభాపక్షం బీజేపీలో విలీనమైంది. కాగా, ఇది కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ జోడో యాత్ర కాదు.. కాంగ్రెస్ చోడో యాత్ర కొనసాగుతోందంటూ ఎద్దేవా చేశారు. Goa | 8 Congress MLAs including Digambar Kamat, Michael Lobo, Delilah Lobo, Rajesh Phaldesai, Kedar Naik, Sankalp Amonkar, Aleixo Sequeira & Rudolf Fernandes join BJP in presence of CM Pramod Sawant pic.twitter.com/uxp7YaZAUN — ANI (@ANI) September 14, 2022 -
కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. బీజేపీలోకి ఎమ్మెల్యేలు!
దేశవ్యాప్తంగా పొలిటికల్‌గా కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా గోవాలో హస్తం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారు. దీంతో గోవా రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. వివరాల ప్రకారం.. గోవాలో కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈ మేరకు గోవా బీజేపీ చీఫ్ సదానందా సెట్ తనవాడే వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా.. 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో సైతం భేటీ అయ్యారు. ఇక, బీజేపీలో చేరుతున్న వారిలో మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో కూడా ఉన్నారు. కాగా, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు.. రెండు నెలలుగా కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతున్నారనే వార్తలు గోవా రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. Goa chief minister Pramod Sawant holds a meeting with Congress MLAs who will join BJP soon. pic.twitter.com/xvpnmvDRgK — TOI Goa (@TOIGoaNews) September 14, 2022 -
ఎట్టకేలకు.. సోనాలి ఫోగట్ కేసులో కీలక పరిణామం
పనాజి: సంచలనం సృష్టించిన హర్యానా నటి, బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని నిర్ణయించినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం ప్రకటించారు. ‘‘మా పోలీసుల(గోవా పోలీసులు) మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం’’ అని గోవా సీఎం సావంత్ ప్రకటించారు. ఈ మేరకు సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి లేఖ రాసినట్లు సావంత్ వెల్లడించారు. అంతకు ముందు.. హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ కూడా గోవా పోలీసుల దర్యాప్తుపై సోనాలీ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయకుంటే సీబీఐ విచారణకే అప్పగిస్తామంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ మరుసటిరోజే గోవా ప్రభుత్వం సీబీఐకు కేసును అప్పగించడం గమనార్హం. గోవా టూర్‌కు వెళ్లిన ఆమె.. గత నెలలో ఆమె హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుగా భావించినప్పటికీ.. కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అది హత్యనే విషయం నిర్ధారణ అయ్యింది. వ్యక్తిగత సిబ్బంది సుధీర్ సాంగ్వాన్, సుధీర్ అనుచరుడు సుఖ్విందర్‌లు ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా పోలీస్ కస్టడీలో ఉన్నారు. సోనాలి ఫోగట్ హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ఆమె కుటుంబం సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ వస్తోంది. ఆమెపై అత్యాచారం జరిగిందని, మత్తు పదార్థాలు ఇచ్చి మరీ అఘాయిత్యానికి పాల్పడి బ్లాక్ మెయిల్ చేశారంటూ కుటుంబ సభ్యులు.. ఆమె వ్యక్తిగత సిబ్బందిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి: తల నరికేసే ఊరిలో.. సరిహద్దు! -
ప్రజలు లాభపడటం టీఆర్ఎస్ సర్కారుకు ఇష్టంలేదు: ప్రమోద్ సావంత్
సాక్షి, హైదరాబాద్: మోదీ ప్రభుత్వ పథకాల అమలు ద్వారా తెలంగాణ ప్రజలకు లాభం చేకూరడం టీఆర్ఎస్ సర్కారుకు ఇష్టం లేదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. అందువల్లే కేంద్ర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యేలా వచ్చే ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకురాబోతున్నారన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో సావంత్ విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు. ఈ నెల 14న పాదయాత్ర ముగింపు సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రజలకు స్పష్టమైన సందేశం ఇస్తారని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు అంటే ఏమిటో గోవా వచ్చి చూడాలన్నారు. ‘తెలంగాణ కంటే ఎక్కువ పథకాలను ప్రజలకు అందజేస్తున్నాం. సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు చేరేలా కృషి చేస్తున్నాం. పంచాయతీ స్థాయిలో గెజిటెడ్ అధికారులు ప్రతివారం పర్యటిస్తున్నారు. వందశాతం కోవిడ్ వాక్సిన్లు ఇచ్చిన మొదటి రాష్ట్రం గోవా. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి. గోవాలో వితంతు పెన్షన్ ఇస్తున్నాం, కల్యాణ లక్ష్మి మా దగ్గర కూడా ఉంది. రూ.లక్ష ఇస్తున్నాం. రైతులకు, పాడి రైతులకు లక్షా ముప్పై వేల రుణం.. 40 శాతం బోనస్ కూడా ఇస్తున్నాం’అని సావంత్ వివరించారు. -
గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణం
పనాజి: గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు హాజరయ్యారు. గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ బాధ్యతలు స్వీకరించడం ఇది రెండోసారి. కాగా, ఇటీవల గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లను గెలుచుకుంది. 40 సీట్లున్న గోవాలో బీజేపీ 20 సీట్లు సాధించగా, మహరాష్ట్రవాదీ గోమాన్‌తక్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గరు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్దతుగా నిలిచారు. -
గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాజీనామా
-
ఆత్మపరిశీలన అవసరం ఎవరిది?
మాట పొదుపుగా వాడాలి! చేత అదుపులో ఉండాలి!! అధికారంలో ఉన్నవాళ్ళకు అన్ని రకాలుగా వర్తించే మహావాక్యాలివి. గద్దె మీద ఉన్న పెద్దలు ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాల్సిందే! లేదంటే తర్వాతి పర్యవసానాలకు వారు తమను తాము తప్ప, వేరెవరినీ నిందించలేరు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు ఆ సంగతి ఇప్పుడు తెలిసొచ్చి ఉండాలి. వారం క్రితం జూలై ఆఖరు ఆదివారం రాత్రి గోవాలోని ఓ బీచ్‌లో పోలీసులమంటూ ఇద్దరు మైనర్ బాలికలపై నలుగురు దుండగులు చేసిన సామూహిక అత్యాచారం సంచలనం రేపింది. ఆ సామూహిక అత్యాచార ఘటనపై అనాలోచితంగా చేసిన ‘ఆత్మపరిశీలన’ వ్యాఖ్యలు సీఎంకు తలబొప్పి కట్టించాయి. హోమ్‌శాఖ పగ్గాలు కూడా తన చేతిలోనే ఉన్న ముఖ్య మంత్రి ‘పట్టుమని 14 ఏళ్ళ కన్నకూతుళ్ళు అంత రాత్రివేళ బీచ్‌లో ఎందుకున్నారో వాళ్ళ తల్లి తండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అంటూ అసెంబ్లీ సాక్షిగా నోరుజారారు. పనిలో పనిగా, ‘పిల్లలు తమ మాట వినరని, బాధ్యతంతా ప్రభుత్వం మీద, పోలీసుల మీద పెట్టకూడదు’ అని హితవు పలికారు. తీవ్రవిమర్శల పాలయ్యారు. గోవా సీఎం వ్యాఖ్యల దెబ్బతో ఇలాంటి సమయాల్లో పాలకుల బాధ్యత ఏమిటన్నది చర్చనీ యాంశమైంది. ఇది ఓటు రాజకీయాల్లో నష్టం తెస్తుందని గ్రహించగానే, సీఎం సర్దుబాటు మొదలు పెట్టారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఆయన నష్టనివారణలో ఉండగానే, సహచర సాంస్కృతిక మంత్రి ‘ప్రతి ఆడపిల్ల వెనుకా భద్రతకు ఓ పోలీసును పెట్టడం ఎంతవరకు సాధ్యం’ అంటూ ప్రజలనే ఎదురు ప్రశ్నించడం విచిత్రం. అలా మరిన్ని విమర్శలకు తావిచ్చారు. తప్పొప్పుల తరాజు ఎలా ఉన్నా, ముందుగా బాధితులకు అండగా నిలవాలి. ఆ పని చేయకుండా బాధితులనే తప్పుబట్టే సామాజిక, రాజకీయ దురలవాటుకు గోవా ఉదంతం మరో ఉదాహరణ. గమనిస్తే, గోవాలో వారం రోజుల వ్యవధిలో మూడు అత్యాచారాల సంఘటనలు జరిగాయి. ఒక ఘటనలో బీచ్‌లో మైనర్ బాలికల రేప్. మరో ఘటనలో ఉద్యోగమిస్తారని ఈశాన్యం నుంచి నమ్మి వచ్చిన పాతికేళ్ళ యువతిని ఇంట్లో బంధించి, రోజుల తరబడి అత్యాచారం. వేరొక ఘట నలో... 19 ఏళ్ళ ఆడపిల్లపై ట్రక్ డ్రైవర్ల అమానుషం. 2019తో పోలిస్తే 2020లో గోవాలో నేరాల రేటు 17 శాతం పెరిగిందనేది నిష్ఠురసత్యం. అలాంటి ఘటనల్ని అరికట్టి, ఆడవాళ్ళకు భద్రత, భరోసా కల్పించాల్సింది పాలకులేగా! కానీ దీన్ని ‘పురుషుల హింస’గా కాక ‘స్త్రీల భద్రత’ అంశంగా చిత్రిస్తూ, గోవా పెద్దలు మొద్దుబారిన మనసుతో వ్యాఖ్యలు చేయడమే విస్మయం కలిగిస్తోంది. పిల్లల పెంపకం, బాగోగుల విషయంలో తల్లితండ్రులదే ప్రథమ బాధ్యత అనేది ఎవరూ కాదనరు. కానీ ఆ వాదనను అడ్డం పెట్టి, ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కావాలనీ, చీకటి పడితే బయటకు రాకూడదనీ పాతకాలపు పితృస్వామ్య భావజాలంతో ప్రభుత్వాలు ప్రవర్తిస్తేనే అసలు చిక్కు. శాంతిభద్రతల్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు పిల్లల పెంపకం పాఠాలు చెబుతుంటే ఏమనాలి? పౌరుల భద్రతకు బాధ్యత వహించాల్సిన పాలకులే... పొద్దుపోయాక బయటకొస్తే తమ పూచీ లేదన్నట్టు మాట్లాడితే ఇంకెవరికి చెప్పుకోవాలి? పర్యాటకానికి మారుపేరైన గోవా, అక్కడి బీచ్‌లు వివాదాలతో వార్తల్లోకి ఎక్కడం ఆనవా యితీగా మారింది. అంతర్జాతీయ పర్యాటకులు కూడా పెద్దయెత్తున వచ్చే ఆ సముద్రతీరాలలో నిర్ణీత సమయం దాటాక ఎవరినీ అనుమతించకపోవడం ప్రభుత్వాలు తలుచుకుంటే అసాధ్యం కాదు. అలాగే, పెరిగిన సాంకేతికత, ఆధునిక డ్రోన్ టెక్నాలజీతో బీచ్‌ల వెంట గస్తీ కూడా కష్టమేమీ కాదు. డ్రోన్ పరిజ్ఞానంలో ఎంతో పురోగతి సాధించిన ఇజ్రాయెల్, అమెరికా, చైనా లాగా మనమూ శాంతి భద్రతల పరిరక్షణకూ, పోలీసు పహారాకూ డ్రోన్ల వినియోగాన్ని విస్తరించవచ్చు. నేరాలను అరికట్టవచ్చు. ప్రాణాలను కాపాడవచ్చు. ఇలా చేయదగినవి చేతిలో ఎన్నో ఉండగా, ‘లైంగిక హింస అనివార్యం... తప్పు మాది కాదు మీదే’ అన్నట్టు పాలకులు మాట్లాడడమే అసలు తప్పు. గోవా జనాభాలో నూటికి 35 మంది పర్యాటక రంగంపైనే ఆధారపడ్డారు. ఆ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 16.43 శాతం ఆదాయం (దాదాపు 200 కోట్ల డాలర్లు) పర్యాటకానిదే. కరోనా వల్ల వేల కోట్ల నష్టం, సగం మందికి పైగా ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో గోవా మళ్ళీ పుంజుకోవాలంటే సర్కారు చేయాల్సింది ఎంతో ఉంది. కానీ, తాజా ఉదంతాలతో ఆ రాష్ట్రం సురక్షితం కాదనే భావన పర్యాటకులకు కలిగితే ఆ తప్పు ఎవరిది? ఆ మాటకొస్తే అత్యాచారాల్లోనే కాదు... ఇంకా అనేక విషయాలలో గోవా సర్కారు అలక్ష్యం, అశ్రద్ధ దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. రెండున్నర నెలల క్రితం మే 16న విరుచుకుపడ్డ టౌక్టే తుపానులో గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లతో పాటు గోవా తీవ్రంగా నష్టపోయింది. కానీ, ఇప్పటి వరకు సరైన లెక్కలు చెప్పి, కేంద్ర ఇస్తానన్న సాయం అందుకోవడం కూడా గోవా సర్కారుకు కష్టంగా ఉన్నట్టుంది. సాయం కోరడంపై సర్కారు సరైన దృష్టి పెట్టనే లేదు. పైపెచ్చు, తుపాను నష్టం రూ. 146 కోట్ల దాకా ఉందని సీఎం అంటుంటే, రూ. 9 కోట్లని అదే రాష్ట్ర డిప్యూటీ సీఎం పేర్కొనడం మరీ ఆశ్చర్యకరం. మరి, రాష్ట్రంలో అత్యాచారాల మొదలు ఇలాంటి ఎన్నో అంశాలలో తక్షణం ఆత్మపరిశీలన అవసరమైంది ఎవరికి? అందరికీ అర్థమవుతున్న ఆ జవాబును గోవా సీఎంకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉందంటారా? -
అమ్మాయిలకు అర్ధరాత్రి బీచ్‌లో ఏం పని? గోవా సీఎం వ్యాఖ్యలు
పనాజీ: గోవాలో బాలికలపై అత్యాచారం సంఘటనపై అధికార పక్షంపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఇదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు ప్రస్తావించగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బాధితుల కుటుంబసభ్యుల తీరును తప్పుబట్టారు. అర్ధరాత్రి పిల్లలను బయటకు ఎందుకు పంపాలి? బీచ్‌లో వారికేం పని? సీఎం ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. జూలై 24వ తేదీన రాజధాని పనాజీకి 30 కిలో మీటర్ల దూరంలోని కోల్వా బీచ్‌లో ఓ పార్టీ జరిగింది. మొత్తం పది మంది బాలబాలికలు హాజరయ్యారు. పార్టీ అయిపోయాక వారిలో 6 మంది ఇళ్లకు వెళ్లారు. మిగతా నలుగురిలో ఇద్దరు చొప్పున అమ్మాయిఅబ్బాయిలు రాత్రంతా బీచ్‌లోనే ఉండిపోయారు. ఆ సమయంలో అటుగా వచ్చిన వారు కొందరు అమ్మాయిలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గోవాలో సంచలనంగా మారింది. తాజాగా బుధవారం (జూలై 28) జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు అత్యాచారం అంశంపై చర్చకు ప్రతిపాదించారు. ఈ చర్చలో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పై వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి పిల్లలు బయటకు వెళ్లారంటే.. తల్లిదండ్రులకు బాధ్యత లేదా? వారి బాధ్యతారాహిత్యంపై ప్రభుత్వం, పోలీసులను తప్పుబట్టడం సరికాదు’ అని సీఎం సావంత్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే అత్యాచారం ఘటనలో నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. -
ఘోరం: 4 గంటల్లో 26 మంది కరోనా రోగులు మృతి
పనాజి: పశ్చిమ తీర రాష్ట్రం గోవాలోని ప్రభుత్వ గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(జీఎంసిహెచ్)లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రిలో కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 26 మంది కరోనా రోగులు చనిపోయారు. మంగళవారం తెల్లవారుజామున 2 నుండి 6 గంటల మధ్యలో ఈ దుర్ఘటన జరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజీత్ రాణే తెలిపారు. అయితే, ఈ ఘటనకు గల కారణాలపై స్పష్టత లేదని అన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ ఆసుపత్రికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెళ్లారు. "మెడికల్ ఆక్సిజన్ లభ్యత, జీఎంసిహెచ్ లోని కోవిడ్-19 వార్డులకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో అవాంతరం ఏర్పడటం వల్ల రోగులకు కొన్ని సమస్యలను కలిగించి ఉండవచ్చు" అని ఆయన అన్నారు. రాష్ట్రంలో మాత్రం ఆక్సిజన్ సరఫరా కొరత లేదు అని అన్నారు. కొన్ని సార్లు సిలిండర్లు సమయానికి చేరుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. గోవా మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో వైద్య ఆక్సిజన్ సరఫరాలో కొరత ఉందని ఆరోగ్య మంత్రి విశ్వజీత్ రాణే సోమవారమే చెప్పారు. నిన్న ఆసుపత్రిలో 1,200 జంబో సిలిండర్లు అవసరం ఉండగా కేవలం 400 మాత్రమే సరఫరా చేయబడ్డాయి అని తెలిపారు. ఈ ఘటనపై హైకోర్టు లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. "మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో కొరత ఉంటే, ఆ అంతరాన్ని ఎలా తగ్గించాలో చర్చ జరగాలి" అని రాణే అన్నారు. గోవా మెడికల్ కాలేజీ& హాస్పిటల్లో కోవిడ్ -19 చికిత్సను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ అధికారుల ముగ్గురు సభ్యుల బృందం ఈ సమస్యల గురించి ముఖ్యమంత్రికి తెలియజేయాలని మిస్టర్ రాణే అన్నారు. గోవాలో సోమవారం నాటికి 1,21,650 మందికి కరోనా సోకగా.. ఇప్పటివరకు 1729 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. చదవండి: కోవిడ్-19 రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు అవసరం? -
Goa Lockdown: గోవాలో లాక్డౌన్
పణజీ/చండీగఢ్: కరోనా టెస్టు పాజిటివిటీ రేటు 50 శాతాన్ని మించడంతో గోవా ప్రభుత్వం నాలుగు రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజలెవరూ బయటకు రావద్దని సూచిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 16 లక్షల జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరుగుతుండంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం 5,910 శాంపిళ్లను పరీక్షించగా అందులో ఏకంగా 3,019 శాంపిళ్లకు పాజిటివ్‌గా తేలడంతో లాక్ డౌన్ మార్గాన్ని ఎంచుకుంది. గురువారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ లాక్డౌన్ కొనసాగుతుందని ప్రకటించింది. వీక్లీ మార్కెట్లు కూడా అందుబాటులో ఉండబోవని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. అత్యవసర విభాగాలన్నీ యథావిధిగా పని చేస్తాయని చెప్పింది. పలు ప్రముఖ బీచ్‌లు లాక్ డౌన్ కారణంగా బోసిపోయి కనిపించాయి. హరియాణాలో వీకెండ్ లాక్ డౌన్ కరోనాను కట్టడి చేసేందుకు హరియాణా ప్రభుత్వం కూడా లాక్ డౌన్ బాటను ఎంచుకుంది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని, సోమవారం ఉదయం 5 గంటల వరకూ అది కొనసాగుతుందని ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. కరోనా రెండో సారి పంజా విసురుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. లాక్ డౌన్ లో ప్రజలంతా ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. ఇక్కడ చదవండి: రెండోవేవ్: అక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు! ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రో సెగ -
నాలుగంటే నాలుగే రోజుల లాక్డౌన్: ఎక్కడంటే..
పనాజీ: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణతో చాలా చోట్ల కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రాత్రికర్ఫ్యూ అన్ని చోట్ల అమల్లో ఉండగా కరోనా కట్టడి కావడం లేదు. దీంతో విధిలేక సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలో సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉండగా తాజాగా గోవాలో లాక్డౌన్ విధించింది. అయితే ఈ లాక్డౌన్ కేవలం నాలుగంటే నాలుగే రోజులు లాక్డౌన్ విధించడం గమనార్హం. నాలుగు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. రేపు రాత్రి (ఏప్రిల్ 29వ తేదీ) 7 గంటల నుంచి మే 3 వరకు గోవాలో లాక్డౌన్ విధిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజా రవాణా, హోటళ్లు, పబ్‌లు, మద్యం దుకాణాల మూసివేత కొనసాగుతుందని వివరించారు. అత్యవసర సేవలు, పరిశ్రమలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందని గుర్తుచేశారు. ప్రస్తుతం గోవాలో రోజుకు 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు లాక్డౌన్ ప్రకటించారు. చదవండి: ఏపీలో కరోనా కట్టడికి అన్ని చర్యలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ -
ప్రమోద్ జీ.. సీఎంగా మీకు బాధ్యత లేదా
పనాజీ : గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సెప్టెంబర్ 2న(బుధవారం) కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ప్రస్తుతం హోంఐసోలేషన్లో ఉంటూ ముఖ్యమంత్రిగా తన విధులు నిర్వర్తిస్తున్నారు. తనకు కరోనా సోకిందని.. అయినా రాష్ట్రానికి సీఎంగా సేవలు అందించాల్సిన బాధ్యత తన మీద ఉందని స్వయంగా చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రమోద్ సావంత్ తన విధులకు సంబంధించి కొన్ని ఫోటోలను శుక్రవారం విడుదల చేశారు. ఆ ఫోటోలో రాష్ట్రానికి సంబంధించిన కొన్నొ ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రమోద్ సావంత్ తీరును ప్రతిపక్షం కాంగ్రెస్ తప్పుబట్టింది. ముఖ్యమంత్రి తన చేతులకు గ్లౌజ్ వేసుకోకుండానే ఫైళ్లపై సంతకాలు ఎలా చేస్తారని విమర్శించింది. (చదవండి : దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది) ఇదే విషయమై గోవా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీష్ చోదంకర్ ట్విటర్లో స్పందిస్తూ..' కరోనా సోకినా ప్రమోద్ సావంత్ విధులు నిర్వర్తించడం బాగానే ఉంది.. కానీ చేతికి కనీసం గ్లౌజ్ వేసుకొని సంతకాలు చేస్తే బాగుండేది.. ఆయన సంతకం చేసిన ఫైళ్లను అధికారులు, ఇతర సిబ్బంది ముట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి కరోనా సోకదని గ్యారంటీ ఏంటి.. ప్రమోద్ సావంత్ ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది 'అంటూ చురకలంటించారు. -
కరోనా : గోవా సీఎం సంచలన వ్యాఖ్యలు
పనాజి : కరోనా తీవ్రతరం అయ్యిందని ఇప్పటికే రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి మొదలైందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సావంత్ మాట్లాడుతూ.. 'గోవా అంతటా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక రోగి నుంచి మరొకరికి వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ (సామాజికవ్యాప్తి) మొదలైందనే నిజాన్ని అంగీకరించక తప్పదు' అంటూ పేర్కొన్నారు. అయితే వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని కఠినమైన చర్యలు చేపడుతుందని అన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతున్న ఏకైక రాష్ట్రం గోవానే అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. (పంజాబ్ సీఎస్‌గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ ) రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కఠిన నిబంధనలు అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా దానికి ప్రజలు కూడా అదే స్థాయిలో స్పందించాలని లేదంటే అధికారులు పడే కష్టమంతా వృధానే అని అన్నారు. ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. మే చివరి నాటికి కోవిడ్ ఫ్రీగా ఉన్న గోవా రాష్ట్రంలో క్రమంగా కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్కోలోని మాంగోర్ హిల్, సత్తారి తాలూకాలోని మోర్లెం ప్రాంతాలను కంటైనేషన్ జోన్లగా ప్రకటించగా,మరికొన్ని ప్రాంతాలను మినీ కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఒక్కరోజే 44 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 1,039 కాగా ప్రస్తుతం 667 యాక్టివ్ కేసులున్నాయని ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు మరణించిన ఇద్దరు మరణించినట్లు పేర్కొంది. వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం సిద్ధం చేసిందని ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణె అన్నారు. అవసరమైతే కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఉత్తర గోవా జిల్లాల్లో ఈఎస్ఐ హాస్పిటల్ తరహాలో ప్రత్యేకంగా ఆసుపత్రి నిర్మాణం చేస్తామని తెలిపారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అవరమైన అన్ని రకాల సౌకర్యాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. (సోషల్ మీడియాలో టీచర్ల మార్ఫింగ్ ఫొటోలు ) -
కంటైన్మెంట్ జోన్లో 40 కొత్త కేసులు
పనాజి: దేశంలో కరోనా విజృంభణ తక్కువగా ఉన్న గోవాలో బుధవారం ఒక్కరోజే పెద్ద మొత్తంలో కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. వాస్కోలోని మ్యాంగోర్ హిల్ కంటైన్మెంట్ జోన్లో తాజాగా 40 కరోనా కేసులు వెలుగు చూశాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. లోకల్ ట్రాన్స్మిషన్ ద్వారానే ఇంత మొత్తంలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. కాగా ఈ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కోవిడ్ లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. (ఆ రైలు ఇకపై ఇక్కడ ఆగదు: సీఎం) అనంతరం వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు కుటుంబ సభ్యులకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో వారు నివసించే ప్రాంతాన్ని ప్రభుత్వం సోమవారం కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించింది. కోవిడ్ పరీక్షల నిమిత్తం ఆ ప్రాంతంలోని 200 మంది నమూనాలను సేకరించగా 40 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరోవైపు అధికారులు వీరితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలు ఆరా తీసే పనిలో పడ్డారు. కాగా గోవాలో మొత్తం 65 కేసులు నమోదవగా 57 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. (90 శాతం పేషెంట్లు వాళ్లే: గోవా సీఎం) -
90 శాతం పేషెంట్లు వాళ్లే: గోవా సీఎం
పనాజి: రాష్ట్రంలో కరోనా(కోవిడ్-19) కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలో ప్రవేశించే వారి కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘గోవాలోని కరోనా పేషెంట్లలో 90 శాతం మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వారే ఉన్నారు. కాబట్టి ఇకపై అక్కడి నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక నిబంధనలు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నాం’’ అని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామనే సంకేతాలు జారీ చేశారు. కాగా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ముంబై నుంచి గోవాకు వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 67కు చేరుకుంది. (చైనాతో వివాదం: కామెంట్ చేయదలచుకోలేదు) ఇక సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్నప్పటికీ గోవా ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ నిబంధనలు సడలించిన నాటి నుంచి అక్కడ రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గోవా మీదుగా వెళ్తున్న పలు రైళ్లను రాష్ట్రంలో ఆపకూడదని గోవా సీఎం ప్రమోద్ సావంత్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కాగా తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన గోవా ఆరోగ్య శాఖా మంత్రి విశ్వజిత్ రాణే... రైళ్లు, రోడ్డు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలో ప్రయాణిస్తున్న వారి వల్ల కేసులు పెరుగుతున్నాయని.. ఈ క్రమంలో సీఎంతో చర్చించి నిబంధనలు మరింత కఠినతరం చేయాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.(పరీక్షలు వాయిదా వేసే అవకాశమే లేదు: గోవా సీఎం) -
ఆ రైలు ఇకపై ఇక్కడ ఆగదు: సీఎం
పనాజి: రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికుల తరలింపు ప్రక్రియలో భాగంగా గోవా మీదుగా వెళ్తున్న ఢిల్లీ- తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్ ఇకపై రాష్ట్రంలో ఆగదని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం గోవాలో 18 మంది కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చే వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. వారు ఇతర ప్రజలతో మమేకం కాకముందే జాగ్రత్త చర్యలు పాటిస్తున్నాం. అయితే ఢిల్లీ రాజధాని రైలులో ప్రయాణించిన వాళ్లలోనే ఎక్కువ మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో సోమవారం నుంచి ఆ రైలును మడగావ్ స్టేషనులో ఆపవద్దని నిర్ణయించుకున్నాం’’ అని తెలిపారు.(ఎంజాయ్ చేసేందుకు ఇక్కడకు రావొద్దు: గోవా సీఎం) కాగా తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్లే నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ మాత్రం గోవాలో ఆపేందుకు సమ్మతంగా ఉన్నట్లు ప్రమోద్ సావంత్ తెలిపారు. సదరు రైలులో ప్రయాణించిన వారిలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని... అలాగే ఆ రైలు నుంచి అతికొద్ది మాత్రమే గోవాలో దిగారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రెడ్ జోన్ల నుంచి రాష్ట్రంలో ప్రవేశించే ట్రక్కు డ్రైవర్లకు తప్పనిసరిగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఇక మే 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి, హెచ్ఎస్సీ పరీక్షలను వాయిదా వేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.(స్వతంత్ర దర్యాప్తు: భారత్ సహా 62 దేశాల మద్దతు!) కాగా సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ మహమ్మారిని కట్టడి చేయడంలో గోవా ప్రభుత్వం విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు నెల రోజులుగా అక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో బయటి ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి రాకపోకలు సాగుతుండటంతో తాజాగా కేసుల సంఖ్య 18కి చేరింది. దీంతో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మరోసారి కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సమాయత్తవుతున్నారు. ఇక గోవాలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కేసులు నమోదు కాలేదు. (ఇది మోదీ చేసిన మూడో తప్పు : గగోయ్) -
ఎంజాయ్ చేసేందుకు ఇక్కడకు రావొద్దు: సీఎం
పనాజి: వలస కార్మికుల తరలింపు నేపథ్యంలో న్యూఢిల్లీ నుంచి తిరునవంతపురం వెళ్తున్న ప్రత్యేక రైలును తమ రాష్ట్రంలోని మడగావ్ స్టేషనులో ఆపవద్దని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వందే భారత్ మిషన్‌లో భాగంగా విమానాలు, రైళ్లలో రాష్ట్రానికి చేరిన గోవా ప్రజలు, గోవా నివాసేతరులు 14 రోజుల పాటు తప్పక హోం క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు. కాగా సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ మహమ్మారిని కట్టడి చేయడంలో గోవా ప్రభుత్వం సఫలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు నెల రోజులుగా అక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో బయటి ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి రాకపోకలు సాగుతుండటంతో గురువారం నాటికి ఎనిమిది మందికి కరోనా సోకింది.(పర్యాటకులను ఆహ్వానించేందుకు సిద్ధం) ఈ నేపథ్యంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మడగావ్‌లో రైలు దిగేందుకు దాదాపు 720 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం ఉంది. వారిలో గోవా వాళ్లు ఉన్నారా అన్న విషయంలో స్పష్టత లేదు. ఇక వాళ్లు ఆ స్టేషనులో దిగిన తర్వాత మేం వారికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. హోం క్వారంటైన్‌కు వెళ్లమని చెప్పాలి. అయినప్పటికీ వారు నిబంధనలు పాటిస్తారని కచ్చితంగా చెప్పలేం. అందుకే ఈ స్టేషన్లో రైలు ఆపవద్దని రైల్వే శాఖకు సూచించాం’’ అని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి వచ్చి హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు బీచ్‌లు ఇతరత్రా చోట్లకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. ఎంజాయ్ చేసేందుకు వాళ్లు గోవాకు రాలేదని గుర్తుపెట్టుకోవాలని అసహనం వ్యక్తం చేశారు. విమానాల్లో వస్తున్న వారికి ఎయిర్‌పోర్టులో .. అదే విధంగా షిప్పుల్లో రాష్ట్రానికి చేరుకుంటున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.(శాకాహారమే తీసుకోవాలి: అదంతా ఫేక్!) -
లాక్డౌన్ : గోవా కీలక నిర్ణయం
పనాజి: కరోనా సంక్షోభంతో తన ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటక ఆదాయం క్షీణించి ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిన గోవా ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. పర్యాటకులను ఆహ్వానించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తాజాగా ప్రకటించారు. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పర్యాటక రంగాన్ని రక్షించు కోవాలని, టూరిజం అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరిన నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని గోవా ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం గ్రీన్ జోన్‌గా వున్న గోవాలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అందుకే ప్రత్యేక నిబంధనలు, పరిమితులతో పర్యాటకుల్ని ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు రాష్ట్రం తన స్వంత మార్గదర్శకాలు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను రూపొందిస్తోందని సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. కోవిడ్-19, లాక్డౌన్ సంక్షోభంతరువాత పర్యాటకులను ఆకర్షించడానికి కేంద్రంతోపాటు రాష్ట్రం కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుందనీ అందుకు తాము సిద్ధమని ఆయన చెప్పారు. అయితే సరిహద్దుల్లో అటూ ఇటూ ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి మాత్రం పర్యాటకులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మే 17 తర్వాత కేంద్రం ప్రకటించే మార్గదర్శకాలకనుగుణంగా తమ ప్రభుత్వ విధివిధానాలతో పర్యాటకుల్ని అనుమతిస్తామని గోవా సీఎం తెలిపారు. లాక్డౌన్3.0 తరువాత కొన్ని పరిమితులతో బస్సు , రైలు , విమానాల ద్వారా అంతర్-రాష్ట్ర మార్గాల్లో ప్రయాణాలను అనుమతించాలన్నారు. రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా తిరిగి రూపొందించే పనిలో ఉంది. (లాక్డౌన్ : మూడు గంటల్లో రూ.10 కోట్లు) కరోనా వైరస్, లాక్డౌన్ పాతాళానికి పడిపోయిన పర్యాటక ఆదాయాన్ని తిరిగి సాధించేందుకు పరిమాణాత్మక విధానానికి బదులుగా గుణాత్మక ఆచరణపై దృష్టి సారించినట్టు సీఎం సావంత్ చెప్పారు. కాగా ప్రధానితో తన సంభాషణ సందర్భంగా, రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించాలని సావంత్ మోదీని కోరిన సంగతి విదితమే. (రాయితీ రైల్వే టికెట్లు వారికి మాత్రమే!) -
కరోనా: ‘మా రాష్ట్రంలో ఒక్క యాక్టివ్ కేసూ లేదు’
పనాజి: దేశవ్యాప్తంగా కరోనా అంతకంతకూ విస్తరిస్తున్న వేళ గోవా రాష్ట్రం మంచి వార్త చెప్పింది. రాష్ట్రంలో నమోదైన 7 పాజిటివ్ కేసుల బాధితులు కోలుకున్నారని, ఇప్పుడు యాక్టివ్ కేసులు ఒక్కటి కూడా లేదని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదివారం వెల్లడించారు. ఏడుగురిలో ఇప్పటికే ఆరుగురు కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారని, మరో వ్యక్తి కూడా ఆదివారం డిశ్చార్చ్ అయ్యారని సీఎం తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. బాధితులకు పలుమార్లు పరీక్షలు చేయగా.. నెగెటివ్‌గా రిపోర్టులు వచ్చాయని తెలిపారు. (చదవండి: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు) అయితే, మొత్తం ఏడుగురిని మరికొన్ని రోజులపాటు క్వారంటైన్లో ఉంచుతామని అన్నారు. బాధితులకు సేవలందించిన వైద్యులకు, లాక్డౌన్ పక్కాగా అమలు చేస్తున్న పోలీసులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. తమ రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు లేవని, గోవాను గ్రీన్ జోన్‌గా ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు ఆయన తెలిపారు. పాజిటివ్ కేసులు లేకపోయినప్పటికీ ప్రజలు లాక్డౌన్ పాటించి.. ఇళ్లకే పరిమితం కావాలని సీఎం కోరారు. కాగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 758 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. (చదవండి: ఒక్కసారి కూడా దగ్గు రాకపోతే?) A moment of satisfaction and relief for Goa as the last active Covid-19 case tests negative. Team of Doctors and entire support staff deserves applause for their relentless effort. No new positive case in Goa after 3rd April 2020.#GoaFightsCOVID19 @narendramodi — Dr. Pramod Sawant (@DrPramodPSawant) April 19, 2020 -
గోవా మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ
పణజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా కేబినెట్లో ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ)కి చెందిన ముగ్గురు, స్వతంత్ర అభ్యర్థి ఒకరికి ఉద్వాసన పలికారు. వీరి స్థానంలో ఇటీవల కాషాయ కండువా కప్పుకున్న కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేల్లో ముగ్గురికి పదవులు దక్కాయి. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మృదులా సిన్హా.. చంద్రకాంత్ కవ్లేకర్, జెన్నిఫర్ మొన్సర్రెట్, ఫిలిప్ నెరి రొడ్రిగ్స్‌తోపాటు బీజేపీకి చెందిన మైఖేల్ లోబోతో ప్రమాణం చేయించారు. 2017 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి లేని సమయంలో మనోహర్ పారికర్ ప్రభుత్వం ఏర్పాటులో జీఎఫ్‌పీ కీలకంగా నిలిచింది. బీజేపీపై జీఎఫ్‌పీ విమర్శలు కేబినెట్ నుంచి తమను తప్పించడం ద్వారా బీజేపీ మోసానికి పాల్పడిందని జీఎఫ్‌పీ అధ్యక్షుడు, మంత్రివర్గం నుంచి వైదొలగిన డిప్యూటీ సీఎం విజయ్ సర్దేశాయ్ ఆరోపించారు. ఆయన శనివారం దివగంత సీఎం మనోహర్ పారికర్ మెమోరియల్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘పారికర్ రెండుసార్లు చనిపోయారు. భౌతికంగా మార్చి 17వ తేదీన ఒకసారి, రాజకీయ సిద్ధాంతాలను చంపడం ద్వారా నేడు మరోసారి’ అని వ్యాఖ్యానించారు. కాగా, జీఎఫ్‌పీ విమర్శలను సీఎం తోసిపుచ్చారు. -
ఫిరాయింపు: మంత్రులుగా ప్రమాణ స్వీకారం
పనాజీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన కేబినెట్లోని నలుగురు మంత్రులపై వేటు వేశారు. వారి స్థానంలో ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, మరో కాంగ్రెస్ నాయకుడి భార్యకు మంత్రి పదవులు కేటాయించారు. పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురిని మంత్రులుగా నియమించారు. ఇక, కాంగ్రెస్ మాజీ నాయకుడు అటనాషియో మాన్సెరేట్కు కేటాయించిన మంత్రి పదవిని చివరి నిమిషంలో ఆయన భార్య జెన్నీఫర్‌కు కేటాయించారు. నిన్నటివరకు కాంగ్రెస్ నాయకుడిగా, రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రకాంత్ కవ్లేకర్ తాజా మంత్రివర్గ విస్తరణతో ఉప ముఖ్యమంత్రిగా మారారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులో కీలక పాత్ర పోషించిన కవ్లేకర్‌కు పట్టణాభివృద్ధి శాఖతోపాటు డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. మరో కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యే ఫిలిప్ నేరి రోడ్రిగ్స్‌తోపాటు నిన్నటి వరకు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న మైఖేల్ లోబ్‌కు కూడా మంత్రి పదవులు దక్కాయి. నలుగురు మంత్రుల తొలగింపు వెనుక చాలా కారణాల ఉన్నాయని, అన్ని విధాలుగా ఆలోచించే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని గోవా సీఎం సావంత్ తెలిపారు. 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనంచేయడంతో 40 మంది సభ్యులన్న గోవా అసెంబ్లీలో కమలం పార్టీ బలం 27కు పెరిగింది. కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఐదుకు పడిపోయింది. ఇక, బీజేపీ సభ్యులైన విజయ్ సర్దేశాయ్, వినోదా పాలియోన్కర్, బీజేపీ మిత్ర పక్షమైన గోవా ఫార్వర్ఢ్ పార్టీ ఎమ్మెల్యే జయేష్ సల్గాకోకర్, స్వతంత్ర ఎమ్మెల్యే రోహన్ ఖౌంటేలు తమ మంత్రి పదవులు కోల్పోయారు. -
ఫిరాయింపు నేతల్లో ముగ్గురికి మంత్రి పదవులు
పనాజీ: కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం లభించనుంది. వారితో పాటు డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబోను మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్టు అధికార బీజేపీ నాయకుడొకరు తెలిపారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ) మంత్రులు ముగ్గురినీ తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. గోవాలో ప్రమోద్ సావంత్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి జీఎఫ్‌పీ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ సరదేశి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. గోవా శాసన సభలోని 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పది మంది గత బుధవారం బీజేపీలో చేరారు. వారితో కలిసి లోబో శుక్రవారం ఢిల్లీలో అమిత్‌షాను కలిసి వచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో 40 మంది సభ్యులున్న శాసన సభలో బీజేపీ బలం 27కు పెరిగింది. ఇదిలా ఉండగా, తమ మంత్రివర్గంలోని జీఎఫ్‌పీకి చెందిన ముగ్గురు మంత్రులను రాజీనామా చేయాలని కోరినట్టు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. అలాగే, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల రోహన్ కాంటేను కూడా మంత్రి పదవికి రాజీనామా చేయాలని అడిగినట్టు చెప్పారు.మంత్రి వర్గంలోకి కొత్తగా నలుగురిని తీసుకుంటున్నందున వీరి రాజీనామాలను కోరినట్టు శుక్రవారం ఆయన తెలిపారు.అధిష్టానం చెప్పిన మేరకే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. -
అమిత్‌షాతో గోవా సీఎం భేటీ
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ సహా పలు అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. బీజేపీ 17 స్థానాలను, కాంగ్రెస్ 15 స్థానాలను గెలుచుకున్నాయి. గోవా ఫార్వర్డ్ పార్టీ సహా పలు స్వతంత్రుల మద్దతుతో కూటమిగా ఏర్పడి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో కూటమి పార్టీల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుకుంది. అభివృద్ధి కోసమే బీజేపీలోకి.. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే బీజేపీలో చేరామని చంద్రకాంత్ కవ్లేకర్ వెల్లడించారు. మిగతా 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉంటే తమ ప్రాంతాల అభివృద్ధి అసాధ్యమని ఆరోపించారు. -
గోవాలో మొదలైంది
పణజీ: కర్ణాటకలోని రాజకీయ అస్థిరత గోవానూ తాకింది. ఇప్పటివరకు గోవాలో కాంగ్రెస్‌కు మొత్తం 15 మంది ఎమ్మెల్యేలుండగా, బుధవారం 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. మూడింట రెండొంతుల మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో వారి చేరిక చట్టబద్ధమైంది. ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ నేతృత్వంలోని మొత్తం 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. గోవా అసెంబ్లీ స్పీకర్ రాజేశ్ పట్నేకర్‌ను సాయంత్రం పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి, తాము కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు ఓ లేఖను ఆయనకు అందిం చారు. నీలకంఠ హలార్న్‌కర్, అటనాసియో మాన్సెరట్ట్, జెన్నిఫర్ మాన్సెరట్ట్, ఫ్రాన్సిస్ సిల్వీరా, ఫిలిప్ నెరీ రోడ్రిగుస్ తదితరులు వారిలో ఉన్నారు. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ భవనానికి వచ్చినప్పుడు గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ ఇక నుంచి ఆ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ వారేనని అన్నారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలుండగా, ఇప్పటివరకు 17 సీట్లతో బీజేపీ పెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్‌కు 15 మంది సభ్యులున్నా, ఇప్పుడు 10 మంది బీజేపీలో చేరడంతో బీజేపీ బలం 27కి పెరిగింది. గోవా ఫార్వర్డ్ పార్టీకి ముగ్గురు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, ఎన్సీపీలకు చెరొక ఎమ్మెల్యే ఉన్నారు. మిగిలిన ముగ్గురూ స్వతంత్ర ఎమ్మెల్యేలు.