ఢిల్లీలో నడ్డాతో చంద్రకాంత్ కవ్లేకర్
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ సహా పలు అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. బీజేపీ 17 స్థానాలను, కాంగ్రెస్ 15 స్థానాలను గెలుచుకున్నాయి. గోవా ఫార్వర్డ్ పార్టీ సహా పలు స్వతంత్రుల మద్దతుతో కూటమిగా ఏర్పడి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో కూటమి పార్టీల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుకుంది.
అభివృద్ధి కోసమే బీజేపీలోకి..
తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే బీజేపీలో చేరామని చంద్రకాంత్ కవ్లేకర్ వెల్లడించారు. మిగతా 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉంటే తమ ప్రాంతాల అభివృద్ధి అసాధ్యమని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment