joining
-
ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ నియామక పత్రాలు
న్యూఢిల్లీ: క్యాంపస్ నియామకాల్లో భాగంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 1,000 మందికిపైగా అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేసినట్టు సమాచారం. అభ్యర్థుల ఆన్‌బోర్డింగ్ సెపె్టంబర్ చివర లేదా అక్టోబర్ నుండి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇన్ఫోసిస్ నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. 2022 బ్యాచ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వీరిలో ఉన్నారని ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) వెల్లడించింది. రెండేళ్లుగా వీరంతా నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని ఎన్ఐటీఈఎస్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. ‘మేము అప్రమత్తంగా ఉంటాం. ఇన్ఫోసిస్ ఈ నిబద్ధతను గౌరవించడంలో విఫలమైనా, చేరే తేదీని ఉల్లంఘించినా ఇన్ఫోసిస్ కార్యాలయం ముందు నిరసన చేపట్టడానికి వెనుకాడము’ అని హెచ్చరించారు. 2022–23 రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో సిస్టమ్ ఇంజనీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేసినందుకు ఇన్ఫోసిస్‌పై కార్మి క, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఎన్ఐటీఈఎస్ గతంలో ఫిర్యాదు చేసింది. ఫ్రెషర్లకు ఇచి్చన ఆఫర్ లెటర్లను కంపెనీ గౌరవిస్తుందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఇటీవలే స్పష్టం చేశా రు. ‘కొన్ని నియామక తేదీలను మార్చాం. అందరూ ఇన్ఫోసిస్‌లో చేరతారు. ఆ విధానంలో ఎటువంటి మార్పు లేదు’ అని వెల్లడించారు. -
ఎకరాకు రూ.14 వేల బోనస్ ఎందుకివ్వడం లేదు?
కరీంనగర్ టౌన్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాల్ వడ్లకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఈ లెక్కన ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల చొప్పున బోనస్ ఎందుకివ్వడం లేదని బీజేపీ జాతీయ ప్రధా న కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీల మేరకు తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్కు చెందిన తాజా, మాజీ సర్పంచులు పలువురు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సంజయ్ మాట్లాడు తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో సర్పంచుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. మోదీ ప్రభు త్వం పంచాయతీలకు నిధులివ్వడంతోనే సిబ్బందికి జీతాలిస్తున్నారని తెలిపారు. దేశమంతా మోదీ గాలి వీస్తుందని, తొలివిడతలోనే 102 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నట్లు జోస్యం చెప్పారు. -
బాబు, పవన్ కు ఊహించని షాక్..
-
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరింది వీరే..
సాక్షి,హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు గాంధీభవన్‌లో కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మున్షీ వీరికి హస్తం కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం నేతలంతా అసెంబ్లీకి వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఇదీ చదవండి.. ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి.. అక్బరుద్దీన్ -
చంద్రబాబుకి భారీ షాక్..వైఎస్సార్సీపీ లోకి టీడీపీ నేతలు
-
సీఎం జగన్ సమక్షంలో YSRCPలో చేరిన భాస్కర్ రెడ్డి
-
చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు
-
టీడీపి, జనసేనకు భారీ షాక్
-
టీడీపీకి బిగ్ షాక్...వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
-
చంద్రబాబుకి భారీ షాక్.. వైఎస్సార్ సీపీలోకి టీడీపీ నేతలు
-
నెల్లూరులో టీడీపీ మటాష్..వైఎస్ఆర్ సీపీలోకి భారీ చేరికలు
-
చంద్రబాబుకు బిగ్ షాక్ వైఎస్సార్ సీపీలోకి టీడీపీ కుటుంబాలు
-
ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్ ముదిరాజుల్లో ఎవరిని ఎదగనివ్వలేదని అందుకే బండ ప్రకాష్‌ను తీసుకొచ్చి పదవులిచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం టీటీడీపీ మాజీ చీఫ్ కాసాని ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్‌లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పుడు ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారన్నారు. రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయని తెలిపారు. ముదిరాజ్ ల నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తరువాత ముదిరాజ్ లతో సమావేశం అవుతానన్నారు.బీఆర్ఎస్ హయాంలో వృత్తి పరంగా ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు. -
చంద్రబాబుకు బిగ్ షాక్..వైఎస్సార్సీపీలోకి భారీగా టీడీపీ నేతలు
-
కాంగ్రెస్‌లోకి మళ్లీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి చేరనున్నట్లు సమాచారం. అయితే, కోమటిరెడ్డి పార్టీ మారతాడంటూ జరుగుతున్న ప్రచారంపై వివరణ కోరేందుకు రాజగోపాల్‌రెడ్డిని ‘సాక్షి’ ప్రతినిధులు సంప్రదించగా, పార్టీ మార్పు వార్తలు ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదన్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు ఆఫర్ ఉందని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా, రాజగోపాల్ రెడ్డి ఈ నెల 27న ఢిలీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ చేరే అవకాశం ఉందని, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. గతంలో మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా అంత యాక్టివ్‌గా లేరు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌తో మంతనాలు జరిపిన రాజగోపాల్‌రెడ్డికి ఆ పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. చదవండి: బీజేపీ తొలి జాబితాలో బీసీలకు 36% సీట్లు -
టీడీపీకి ఎదురుదెబ్బ..YSRCPలో చేరిన టీడీపీ నాయకులు
-
చంద్రబాబుకు భారీ షాక్
-
కర్నూల్ జిల్లాలో టీడీపీ కి బిగ్ షాక్
-
ఈ స్టూడెంట్ వయసు జస్ట్... 92
‘చదువుకు వయసుతో పనేమిటి’ అనేది పాత డైలాగే కావచ్చు గానీ 92 సంవత్సరాల సలీమాఖాన్‌కు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే బామ్మను 92 ఏళ్ల వయసులోనూ బడి బాట పట్టించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందర్‌షహర్‌కు చెందిన సలీమాకు బడి సౌకర్యం లేకపోవడం, రకరకాల పరిస్థితుల వల్ల చదువుకునే అవకాశం దొరకలేదు. ఆరు నెలల క్రితం బడిలో చేరిన సలీమా పిల్లలతో పాటు క్లాస్‌రూమ్‌లో కూర్చునేది. చదవడం, రాయడం నేర్చుకుంది. ‘నేను కూడా చదవగలుగుతున్నాను. రాయగలుగుతున్నాను అనే సంతోషాన్ని చెప్పడానికి మాటలు లేవు’ అంటుంది సలీమాఖాన్. ‘మొదట్లో ఆమెకు చదువు చెప్పడానికి టీచర్లు తటపటాయించారు. అయితే ఆమెను వద్దనడానికి మా దగ్గర ఏ కారణం కనిపించలేదు. ఆమె పట్టుదల చూసి టీచర్లకు ఉత్సాహం వచ్చింది. అక్షరాస్యురాలిని కావాలి అనే ఆమె పట్టుదల టీచర్లకు నచ్చింది’ అంటుంది స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ శర్మ. -
తాలిబాన్‌తో చెలిమి వెనుక చైనా ఎత్తుగడ ఏమిటి? భారత్‌పై ప్రభావమెంత?
ఇటీవల భారత రాజధాని న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు యావత్ ప్రపంచం దృష్టిని తనవైపు తప్పుకుంది. అయితే అదేసమయంలో చైనా పెద్ద రాజకీయ ఎత్తుగడ వేసింది. 55 దేశాలతో కూడిన ఆఫ్రికన్ యూనియన్ జి-20లో ప్రవేశించడం చైనా తనకు ఎదురుదెబ్బగా భావించింది. తాజాగా చైనా.. తాలిబాన్ ఆక్రమిత ఆఫ్ఘనిస్థాన్‌లో తన రాయబారిని నియమించింది. ప్రపంచంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్న మొదటి దేశంగా చైనా అవతరించింది. రాయబారి నియామకం అంటే ఆఫ్ఘనిస్థాన్‌తో చైనా అధికారికంగా దౌత్య సంబంధాలను నెలకొల్పబోతోందని అర్థం. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి తాలిబాన్ ప్రభుత్వం అంతర్జాతీయ గుర్తింపునకు నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో చైనాతో ఆఫ్ఘనిస్థాన్ దోస్తీ ఆ దేశానికి కలిసివచ్చేలా ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌తో చైనా మైత్రి భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగామారింది. అయితే చైనా.. ఆఫ్ఘనిస్థాన్‌తో చెలిమి చేయడంపై ప్రపంచవ్యాపంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనాగరిక పాలన సాగిస్తున్న తాలిబాన్ ప్రభుత్వంతో చైనా స్నేహం చేయడాన్ని ఏ దేశమూ ఇష్టపడటం లేదు. ఆఫ్ఘనిస్థాన్‌లో చైనా ఆధిపత్యం? వాస్తవానికి చైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలవాలని కోరుకుంటోంది. దీనిలో భాగంగానే ఆఫ్ఘనిస్థాన్‌లో అడుగు పెట్టింది. ఇది చైనా వ్యూహంలో ఒక భాగమని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకున్న ఆఫ్ఘనిస్థాన్‌లో చైనా కూడా అదే పనిచేసేందుకు సిద్ధం అవుతోంది. అలాగే చైనా తన వాణిజ్య లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఆఫ్ఘనిస్థాన్‌ను వాడుకోవాలనుకుంటోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో వైట్ గోల్డ్‌గా పిలిచే లిథియం నిల్వలపై చైనా దృష్టి సారించింది. చైనా.. ఆఫ్ఘనిస్తాన్‌లో ముడి చమురు కోసం వెతకడమే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్ ఖనిజ సంపదపై కూడా కన్నేసింది. కోటి ఆశలతో చైనాతో చెలిమి తాలిబాన్ అభిప్రాయం ప్రకారం చైనాతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఆఫ్ఘనిస్థాన్‌లో లక్షలాది ఉద్యోగాలు ఏర్పడతాయి. మరోవైపు చైనా తన ప్రతిష్టాత్మకమైన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే సీపీఈసీని ఆఫ్ఘనిస్థాన్ ద్వారా మధ్య ఆసియా దేశాలకు తీసుకెళ్లాలని భావిస్తోంది. చైనాతో స్నేహం దరిమిలా అంతర్జాతీయ సమాజంలో తమ పరిస్థితి కూడా మారుతుందని తాలిబాన్ భావిస్తోంది. కాగా చైనా- తాలిబాన్ స్నేహం భారతదేశానికి పలు సమస్యలను తెచ్చిపెట్టనున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత అంతర్జాతీయ ప్రాజెక్టులకు ఆటంకం ఆఫ్ఘనిస్థాన్ పొరుగు దేశమైన ఇరాన్‌లోని చబహార్ పోర్టు ద్వారా మధ్య ఆసియా దేశాలతో కనెక్టివిటీని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో చైనా ఉనికి కారణంగా అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ కారిడార్ వంటి భారతదేశ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రభావితం కావచ్చు. తాలిబాన్ అధికారంలోకి రాకముందే ఆఫ్ఘనిస్థాన్‌లో మిలియన్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులను భారతదేశం ప్రారంభించింది. ఆ ప్రాజెక్టులను భారత్ పూర్తి చేయాలని తాలిబాన్ ప్రభుత్వం కోరుకుంటోంది. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో చైనా ఉనికి భారతదేశ అసంపూర్ణ ప్రాజెక్టులను ప్రభావితం చేయనున్నదనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: వారి ‘నిప్పు కోడి పాదాల’ రహస్యం ఏమిటి? ఈ తెగ ఎక్కడుంది? -
చంద్రబాబుకు భారీ షాక్..వైసీపీలో టీడీపీ నేతలు
-
చంద్రబాబుకు షాక్..వైఎస్సార్సీపీలో భారీగా టీడీపీ నేతలు చేరిక
-
బోనస్ ఇస్తాంలే కాస్త ఆగండి.. జాయినింగ్ ఆలస్యం చేస్తున్న యాక్సెంచర్
ఇటీవల 19,000 మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన యాక్సెంచర్ కొత్త ఉద్యోగుల జాయినింగ్‌ను కూడా ఒక సంవత్సరం వరకు ఆలస్యం చేస్తోంది. కంపెనీ కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీని ఎప్పుటికప్పుడూ పొడిగిస్తూ వస్తున్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. (Vodafone Idea 5G: వోడాఫోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ముగిసిన నిరీక్షణ!) తమకు ప్రస్తుతం కొత్త ఉద్యోగుల అవసరం లేనందునే యాక్సెంచర్ కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీలను పొడిగిస్తూ వస్తున్నట్లు తెలిసింది. పరిస్థితి ఇలా ఉంటుందని ముందే తెలిస్తే తాము మరేదైనా కంపెనీలో చేరేవాళ్లమని, కానీ యాక్సెంచర్ జాయినింగ్‌ను నెలల తరబడి ఆలస్యం చేస్తూ వస్తోందని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. తమ క్లయింట్ల అవసరాలకు తగ్గట్టుగా కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీలను సర్దుబాటు చేస్తున్నట్లుగా యాక్సెంచర్ ప్రతినిధి రాచెల్ ఫ్రే ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. ఇలా ఎంతమంది అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ జాప్యం ఇలాగే కొనసాగుతుందా అనే విషయాలపై స్పష్టత లేదు. (Akshata Murthy: బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..) యాక్సెంచర్ తనకు యూకేలో కన్సల్టింగ్ ఉద్యోగం ఇచ్చిందని, వచ్చే జూన్‌లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా జాయినింగ్ తేదీని అక్టోబరు నెలకు మార్చిందని ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఓ అభ్యర్థి బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థకు తెలియజేసింది. జాయినింగ్ తేదీని మళ్లీ 2024 సంవత్సరం ప్రారంభానికి మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఆ ఉద్యోగం వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే జాయినింగ్ ఆలస్యానికి యాక్సెంచర్ రిక్రూటర్ ఆ ఈమెయిల్లో క్షమాపణలు కోరారు. ఇలా జాయినింగ్ ఆలస్యం అయిన వారికి కంపెనీ అదనపు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిసింది. యాక్సెంచర్‌లో జాయినింగ్ ఆలస్యం కావడం పట్ల విసుగు చెందిన కొందరు అభ్యర్థులు రెడ్డిట్ ఫోరమ్‌లలో కూడా తమ నిరాశను వ్యక్తం చేశారు. (Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...) -
కాంగ్రెస్‌లో చేరికల పోరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరికలు ఒకవైపు కేడర్‌లో నూతనోత్తేజం నింపుతుంటే మరోవైపు నేతల మధ్య వర్గపోరు పెరుగుతోంది. పార్టీలో చేరాలనుకున్న వారంతా గాంధీభవన్‌లో చేరాల్సి ఉండగా అందుకు భిన్నంగా కీలక నేతల ఇళ్లలో ఎవరికి వారుగా చేరడం గందరగోళానికి దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం జరిగిన చేరికలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. పీసీసీ, సీఎల్పీ, స్టార్ క్యాంపెయినర్... టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి చెందిన జూబ్లీహిల్స్ కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకర్గానికి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరగా మంచిర్యాల జిల్లాకు చెందిన మరికొందరు నేతలు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు నేతృత్వంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కార్యాలయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ అయిన తుంగతుర్తి రెబల్ నేత డాక్టర్ వడ్డెపల్లి రవి... కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో పార్టీలో చేరారు. గాంధీభవన్ చేరికల్లో కనిపించని కీలక నేతలు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నేతలు పార్టీలో చేరేందుకు గాంధీభవన్‌కు వచ్చారు. పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో మాజీ మంత్రి బోడ జనార్ధన్‌తోపాటు మెట్పల్లి జెడ్పీటీసీ రాధాశ్రీనివాస్‌రెడ్డి, సిర్పూర్ కాగజ్‌నగర్ బీజేపీ నేత రావి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమయంలో రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి మినహా సీనియర్ నేతలెవరూ అక్కడ లేరు. సస్పెన్షన్‌లో ఉన్న వారిని ఎలా..? గత ఎన్నికల సమయంలో రెబెల్ అభ్యర్థిగా ఉన్న తుంగతుర్తి నేత డాక్టర్ వడ్డెపల్లి రవిని పార్టీలోకి ఎలా ఆహ్వానించారని తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి అద్దంకి దయాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వడ్డెపల్లి రవిని పార్టీ ఆరేళ్లపాటు సస్పెండ్ చేసిందని గుర్తుచేసిన ఆయన... కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఎలా చేరారని ప్రశ్నించారు. దీనిపై రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. చేరికల కమిటీ చైర్మన్ జానారెడ్డి ఎక్కడ? పార్టీలోకి ఎవరిని తీసుకోవాలో ఎవరిని తీసుకోకూడదన్న వ్యవహారంపై మాజీ మంత్రి జానారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఓ కమిటీ వేసింది. ప్రస్తుతం జరుగుతున్న చేరికలకు జానారెడ్డి దగ్గర చర్చ జరిగిందా లేదా అనే దానిపై ఏ నాయకుడికీ స్పష్టత లేదు. ఏదో పేరుకే కమిటీ వేసి జానా రెడ్డిని బాధ్యుడిగా పెట్టారని, చేరికల అంశాలేవీ ఆయన దృష్టికి వెళ్లడంలేదని పార్టీలోని సీనియర్లు చెబుతున్నారు. -
టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి పెద్దిరెడ్డి