ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదు: సీఎం కేసీఆర్‌ CM KCR Slams BJP MLA Etela Rajender | Sakshi
Sakshi News home page

ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదు: సీఎం కేసీఆర్‌

Published Fri, Nov 3 2023 2:46 PM

CM KCR Slams BJP MLA Etela Rajender - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈటల రాజేందర్‌ ముదిరాజుల్లో  ఎవరిని ఎదగనివ్వలేదని అందుకే  బండ ప్రకాష్‌ను తీసుకొచ్చి పదవులిచ్చామని సీఎం కేసీఆర్‌ అన్నారు. శుక్రవారం టీటీడీపీ మాజీ చీఫ్‌ కాసాని ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో బీఆర​్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ఇప్పుడు ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వచ్చారన్నారు.

రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయని తెలిపారు. ముదిరాజ్ ల నుంచి  ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తరువాత ముదిరాజ్ లతో సమావేశం అవుతానన్నారు.బీఆర్‌ఎస్‌ హయాంలో వృత్తి పరంగా ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు.  


 

Advertisement
 
Advertisement
 
Advertisement