Kasani Gnaneshwar
-
చంద్రబాబు భయం అదేనట..!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులో ఒక స్పెషాలిటీ ఉంది. తాను ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనకు అంతా పచ్చగా కనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే అంతా ఏడారిలా ఆయనకు అనిపిస్తుంది. తనకు గిట్టకపోతే ఎదుటివారు దెయ్యాలు, భూతాలుగా కనిపిస్తారు. తనకు ఉపయోగపడితే వారు గొప్పవారైపోతారు. ఆయనకు తరచు రెండు కళ్ల సిద్దాంతం గుర్తుకు వస్తుంటుంది. ఏపీతో పాటు తనకు తెలంగాణ కూడా ముఖ్యమేనని ఆయన చెబుతున్నారు. ఎప్పటికప్పుడు మాటలు మార్చడంలో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో ఎన్నడూ తెలంగాణలో పార్టీ గురించి పట్టించుకోలేదు. ఆ విషయాన్ని మాజీ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఎంత స్పష్టంగా చెప్పారో గుర్తుకు తెచ్చుకోవాలి. అసలు 2023 లో టీడీపీ తరపున తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలలో ఎవరిని నిలబెట్టలేదు. తన పార్టీవారు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని తిరుగుతున్నా ఆయనకు అభ్యంతరకరంగా తోచలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అనకుండా రేవంత్ పేరు చెప్పి మెచ్చుకోవడం గమనించవలసిన అంశమే. బహుశా తెలంగాణ బీజేపీవారికి ఇది ఇబ్బందే అయినా ఇప్పటికిప్పుడు చంద్రబాబుతో వారు తగవుకు సిద్దపడకపోవచ్చు. తెలంగాణ టీడీపీ సమావేశంలో కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆడిపోసుకోవడం మానలేదు. జగన్ మళ్లీ గెలిచే అవకాశం ఉందని భయపడుతున్నట్లుగా ఉంది. జగన్ భూతమట. పరిశ్రమలు పెట్టేవారికి మళ్లీ జగన్ వస్తే ఎలా అన్న సందేహం ఉందట. అందుకే ఆ భూతాన్ని రాకుండా చేస్తానని ఈయన చెప్పారట. ప్రతిపక్షంలో ఉన్నవారిని బూతాలతో పోల్చితే ,చంద్రబాబు కూడా మొన్నటివరకు విపక్షనేతగానే ఉన్నారు కదా! నిత్యం ఏపీ లో ఏదో ఒక లొల్లి చేశారు కదా! జగన్ ప్రభుత్వం ఏ అడుగు వేసినా కదలనివ్వకుండా న్యాయ వ్యవస్థ ద్వారా,ఇతరత్రా అడ్డుపడ్డారు కదా!ఎంత వీలైతే అశాంతి సృష్టించే ప్రయత్నం చేశారు కదా. అప్పుడు చంద్రబాబు కూడా బూతం మాదిరే వ్యవహరించారన్న విమర్శ వర్తించదా! ఆయనను అలా అనడం లేదు. కాని చంద్రబాబు మాత్రం జగన్ పై ఏది పడితే అది మాట్లాడుతుంటారు. అయినా ఆయన గెలిచారు కాబట్టి బూత మాంత్రికుడు అయిపోయారా! ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2019 లో ఓటమిపాలైంది కదా! ఆయనను ఓడిస్తే జనం తప్పు చేసినట్లు. జగన్ ను ఓడిస్తే జనం ఒప్పు చేసినట్లు అవుతుందా!ఏమి లాజిక్కు అండి. చంద్రబాబు 2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని ఎంతగా దూషించారు! ఉగ్రవాది,దేశంలోనే ఉండడానికి వీలులేని వ్యక్తి , అవినీతి పరుడు అని తీవ్ర స్థాయిలో చంద్రబాబు విరుచుకుపడ్డారు. మోదీ గెలవడంతోనే చంద్రబాబు మాట మార్చేశారు. 2024 ఎన్నికల సమయం వచ్చేసరికి కాళ్లావేళ్ల పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కాని ఇప్పుడు ఏమంటున్నారో చూడండి.. బీజేపీవారే పొత్తు పెట్టుకున్నారని చెబుతున్నారు. అంతేకాదు.మోడీని విశ్వగురు అని ,గొప్ప నాయకుడని ఇదే చంద్రబాబు కీర్తించారు. ఇదేమిటి ఈ రెండు మాటలు ఏమిటని ఎవరూ ప్రశ్నించకూడదు. చరిత్రను అందరూ చూసినా ,దానిని వక్రీకరించి చెప్పడానికి ఏ మాత్రం మొహమాటపడని గొప్పదనం ఆయనదని అనడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరమా?తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకటికి రెండుసార్లు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా లేఖలు ఇచ్చారు. తీరా కేంద్రం వాటి ఆధారంగా తెలంగాణ ఏర్పాటుకు సంకల్పించగానే దానిని ఏదో రకంగా అడ్డుకోవడానికి యత్నించారు. తెలంగాణలో మాత్రం తనవల్లే తెలంగాణ వచ్చిందని ప్రచారం చేసుకున్నారు.ఏపీ కి వెళ్లేసరికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దెయ్యం,బూతం అయిపోయింది. ఏపీ ని సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. అలాంటి కాంగ్రెస్ తో టీడీపీ కలుస్తుందని ఎవరూ ఊహించని టైమ్ లో చంద్రబాబు స్వయంగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో అలయ్ బలయ్ చేసుకుని 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పొత్తు పెట్టుకుని ఓటమిపాలయ్యారు.తదుపరి కాంగ్రెస్ ఊసెత్తలేదు. 2023 తెలంగాణ ఎన్నికలలో మాత్రం మళ్లీ కాంగ్రెస్ కు పరోక్షంగా సహకరించారు. అదే టైమ్ లో 2024 ఏపీ శాసనసభ ఎన్నికలలో బీజేపీతో సయోధ్య కుదుర్చుకున్నారు.ఇలా ప్రతి విషయంలోను రెండు కళ్ల సిద్దాంతం పాటించే చంద్రబాబు నాయుడు ,తెలంగాణలో కూడా టీడీపీ అభివృద్ది చెందుతుందని తాజాగా చెబుతున్నారు.మరి గత ఎన్నికలలో ఎందుకు పోటీచేయలేదో మాత్రం చెప్పరు.బహుశా తన శిష్యుడు ,కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో టీడీపీని తెలంగాణలో పనిచేయించారన్న ప్రచారం జరిగింది.ఈ సంగతి ఎలా ఉన్నా ఏపీ ప్రయోజనాల కన్నా తెలంగాణ మేలు కోసమే ఆయన ఎక్కువ ఆలోచన చేస్తున్నట్లు రాజకీయవర్గాలలో వ్యాఖ్యలు వస్తున్నాయి.అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ కి ఇవ్వవలసిన ఆస్తులను ఇవ్వడానికి నిరాకరించినా చంద్రబాబు నోరు విప్పడం లేదు. పైగా రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని సూక్తులు చెబుతున్నారు.అదే కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా, వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.వీరిద్దరూ కలిసి మాట్లాడినా కుమ్మక్కైపోయారని,ఏపీ కి జగన్ నష్టం చేస్తున్నారని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపించేవారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో పెట్టుబడి పెడతామని కెసిఆర్ ప్రతిపాదిస్తే, జగన్ పోర్టును కేసీఆర్‌కు అమ్మేస్తున్నారని గగ్గోలు పెట్టారు. కాని చిత్రంగా అంతకన్నా ఎక్కువగా రేవంత్ ఏకంగా కోస్తా తీరంలోను, తిరుమల తిరుపతి దేవస్థానంలోను వాటా అడిగితే, ఆయన బాగా పనిచేస్తున్నారని చంద్రబాబు సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఏపీలో కొత్త పరిశ్రమలు అనేకం రావడానికి వీలుగా జగన్ పలు చర్యలు తీసుకుంటే ఆయనను బూతం అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఇదేనా అభివృద్ది కొనసాగించడమంటే.ఈనాడు మీడియాలోనే మూడున్నర లక్షల కోట్ల రూపాయల రెన్యుబుల్ ఎనర్జీ ప్లాంట్లు ఏపీ లో వస్తున్నాయని అంగీకరిస్తూనే , వాటిని ఏడుగురు బడా పారిశ్రామికవేత్తలకే కట్టబెడుతున్నారంటూ ఒక తప్పుడు కధనాన్ని ప్రచారం చేసింది. ఏపీకి ఏ పరిశ్రమ వస్తున్నా ఆ రోజులలో ఎలా చెడగొట్టాలా అని చంద్రబాబుకు మద్దతు ఇచ్చే మీడియా విశ్వయత్నం చేసేది.బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ తెచ్చినందుకు జగన్ బూతం అవుతారా?అదాని ,అంబాని వంటి పెద్ద,పెద్ద పారిశ్రామికవేత్తలు గత ప్రభుత్వ టైమ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే జగన్ బూతం అవుతారా? శ్రీసిటీలో ఎసిలు తయారు చేసే పరిశ్రమ వచ్చింది. నక్కపల్లి వద్ద ఫార్మా హబ్ ఏర్పాటుకు రంగం సిద్దం అయింది. అచ్చుతాపురం పారిశ్రామికవాడలో పలు పరిశ్రమలు వచ్చాయి.అంతెందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరసగా మూడేళ్లపాటు దేశంలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలిపినందుకు జగన్ బూతం అవుతారా?మరి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రం అంతా జరుగుతున్న నెల రోజులకు పైగా విద్వంసాన్ని చూసి పరిశ్రమలవారు భయపడుతున్నారని వార్తలు వచ్చాయి. పుంగనూరులో విద్యుత్ బస్ ల ప్లాంట్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్న యాజమాన్యం టీడీపీవారి అరాచకాలను చూసి ఏమి చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారట.పుంగనూరులో ఏకంగా ఒక ఇండోర్ స్టేడియంనే కూల్చేసిన ఘన చరిత్ర టీడీపీదిగా ఉంది. విశాఖలో ఒక ప్రముఖ ఐటి సంస్థ కాప్ జెమినీ రాబోతుందన్న కొద్ది నెలల క్రితం వార్తలు వచ్చాయి. టీడీపీ అధికారంలోకి రావడంతోనే వారు చెన్నైకి వెళ్లిపోయారట. వీటన్నిటికి కారణబూతమైన టీడీపీవారు బూతాలు కాదట. విశాఖ వద్ద జగన్ మంచి భవనం కడితే తప్పు. అదే అమరావతిలో చంద్రబాబు భారీ వ్యయంతో భవనాలు నిర్మిస్తే గొప్ప విషయం. రాష్ట్రం ఆర్దిక సుడిగుండంలో ఉందని పదే,పదే ప్రచారం చేస్తున్నారు. అంటే తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు మంగళం పాడడానికే ఈ గాత్రం అందుకున్నారని జనం అంతా భావిస్తున్నారు. తాను ప్రభుత్వాన్ని నడిపితే తెల్లవార్లు కష్టపడుతున్నట్లు,ఎదుటివారు ప్రభుత్వాన్ని నిర్వహిస్తే అసలు పని చేయనట్లు ప్రొజెక్టు చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడు. దానికి తోడు ఆయనకు భజన చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఉండడం బాగా కలిసి వచ్చే పాయింట్ అని చెప్పక తప్పదు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా,ఏపీ గురించి చంద్రబాబు దృష్టి పెట్టి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తే ప్రజలు సంతోషిస్తారు. అలాకాకుండా బూతాలు,దెయ్యాలు అంటూ ఎంతగా మంత్రాలు చదివితే అంతగా ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని అంతా అర్ధం చేసుకుంటారు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఈటల కన్నా పెద్ద మనిషి కాసాని
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని, రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్‌లకు వస్తాయని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమక్షంలో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తన అనుయాయులతో కలసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ వంటి నాయకుడు బీఆర్ఎస్లో చేరడం శుభపరిణామమని అన్నారు. జ్ఞానేశ్వర్ ఏడాది కిందటే బీఆర్ఎస్లోకి రావాల్సిందని, ఆలస్యమైనా రాజకీయంగా ఎంతో అనుభవజు్ఞలైన ఆయన రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి జ్ఞానేశ్వర్ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల తరువాత ముదిరాజ్‌లతో సమావేశం అవుతానని, ఎవరెవరికి ఎక్కడ అవకాశం ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పారు. ముదిరాజ్‌ల నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు కావాలని, ఈసారి రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులతో పాటు ఇతర నామినేటెడ్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్, స్థానిక సంస్థల పదవుల్లో పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు. పారీ్టలో ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదని, ఈటలను మించిన నాయకులు ముదిరాజుల్లో ఉన్నారని అన్నారు. ముదిరాజ్ వర్గానికి చెందిన బండ ప్రకాశ్‌ని తీసుకొచ్చి ఎంపీ, ఎమ్మెల్సీ, కౌన్సిల్ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. ఎన్నికల తరువాత జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ముదిరాజ్ కులపెద్దలను కూర్చోబెట్టుకొని వారి ప్రధాన సమస్యల పరిష్కారంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా జ్ఞానేశ్వర్‌తోపాటు బీఆర్ఎస్లో చేరినవారిలో కాసాని వీరేశ్, బండారి వెంకటేశ్ ముదిరాజ్, ముప్పిడి గోపాల్, బియ్యని సురేశ్, ప్రకాశ్ ముదిరాజ్ తదితరులున్నారు. -
ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్ ముదిరాజుల్లో ఎవరిని ఎదగనివ్వలేదని అందుకే బండ ప్రకాష్‌ను తీసుకొచ్చి పదవులిచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం టీటీడీపీ మాజీ చీఫ్ కాసాని ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్‌లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పుడు ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారన్నారు. రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయని తెలిపారు. ముదిరాజ్ ల నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తరువాత ముదిరాజ్ లతో సమావేశం అవుతానన్నారు.బీఆర్ఎస్ హయాంలో వృత్తి పరంగా ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు. -
నేడు బీఆర్ఎస్ గూటికి కాసాని జ్ఞానేశ్వర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న తెలుగుదే శం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శుక్రవారం బీఆర్ఎస్లో చేరనున్నారు. గజ్వేల్‌లోని ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన ఉదయం 11.30 గంటలకు గులాబీ తీర్థం తీసుకోనున్నా రు. యాగం జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయక్షేత్రం వద్ద నెలకొన్న భద్రతా కారణాల దృష్ట్యా పరిమిత సంఖ్యలో ఆయన అనుచ రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో టీటీడీపీ పోటీ చేయరాదని పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో విభేదిస్తూ జ్ఞానేశ్వర్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యరి్థగా లేదా రాజ్యసభ ఎంపీగా అవకాశమిస్తామని జ్ఞానేశ్వర్‌కు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హామీనిచి్చనట్లు సమాచారం. -
బీఆర్ఎస్లోకి కాసాని.. ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ మాజీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఉదయం 11.30 గంటలకు గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లోని సీఎం ఫాంహౌజ్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో కాసాని గులాబీ కండువా కప్పుకోనున్నారు.సీఎం ఫాంహౌజ్ కావడంతో భద్రతా పరమైన కారణాల దృష్ట్యా దృష్ట్యా పరిమిత సంఖ్యలో తన అనుచర నాయకులతో కలిసి కాసాని కారు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయదని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించడంతో నొచ్చుకున్న కాసాని పార్టీకి రిజైన్ చేసిన విషయం తెలిసిందే. తాను టీటీడీపీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, అంతా వృథా అయిందని మీడియా సమావేశంలో కాసాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముదిరాజులకు ప్రాధాన్యతనిస్తున్న బీఆర్ఎస్లోకి వెళ్తేనే బాగుంటుందన్న క్యాడర్ సలహా మేరకు బీఆర్ఎస్లోకి వెళ్లాలని కాసాని నిర్ణయించినట్లు సమాచారం. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లు ఇప్పటికే ప్రకటించినందున కాసానికి భవిష్యత్‌లో ఎమ్మెల్సీ లేదా ఇతర పదవి ఇచ్చి న్యాయం చేయాలని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కాసాని కూడా గతంలోలాగే ఎమ్మెల్సీ సీటే ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది: కేసీఆర్ మండిపాటు -
తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టిన చంద్రబాబు.. కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. బాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2018 లో కాంగ్రెస్‌తో కలిసి తెర ముందు ప్రచారం చేసిన చంద్రబాబు.. 2023లో కాంగ్రెస్ గెలుపుకు తెరవెనుక ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం లేదని, బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఈటల అన్నారు. కాగా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తోక ముడిచింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా కూడా చేశారు. చంద్రబాబు, లోకేష్ తీరుపై తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ‘టీడీపీ ఇక్కడ పోటీ చేయొద్దనడం వెనుక ఎవరున్నరో గానీ, మన చౌదరీలే కాంగ్రెస్‌కు ఓటేయమని క్లియర్‌గా చెబుతున్నరు. బాబును మొన్న కలిసినప్పుడు మన కమ్మ వాళ్లే పోటీ చేయడం లేదని ప్రచారం చేస్తున్నరని క్లియర్‌గా చెప్పిన. టీడీపీ వాళ్లే కాంగ్రెస్‌కు ఓటేయమని చెబితే ఎట్ల. వీళ్లు ప్రచారం చేసినా.. కొందరే కాంగ్రెస్ అంటున్నరు. మిగతా వాళ్లు బీఆర్ఎస్కు ఓటేయాలంటున్నరు’’ అంటూ కాసాని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఓ లెక్క. జనరల్ ఎన్నికల్లో చేయకపోతే ఎట్ల?’ అంటూ కాసాని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. చదవండి: బాబుకు కోపమొచ్చింది.. అచ్చెన్న పదవి ఊస్టింగేనా? -
కాంగ్రెస్ కు అమ్మేశారా ?
-
టీడీపీ కాసాని జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయింది..!
-
తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్.. కాంగ్రెస్ కోసమేనా?
-
పోటీ చేయనప్పుడు పార్టీ ఎందుకు?: కాసాని జ్ఞానేశ్వర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ‘తెలంగాణలో ఫైట్ చేయాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పోటీ చేయకూడదనే నిర్ణయానికి ఎందుకు వచ్చిండో అర్థం కావట్లేదు. బాలకృష్ణ చిటికలేసి చెప్పిండు. తెలంగాణలో నేనుంట అన్నడు. తెలంగా ణ మొత్తం తిరుగుత అన్నడు. తడాఖా చూపిస్త అన్నడు. ఏమైందో తెలియదు’అని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాసాని మాట్లాడుతూ తాను టీడీపీని వదలిపెట్టడానికి గల కారణాలను వివరించారు. చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, ఇతర నాయకులు వ్యవహరించిన తీరును సోదాహరణంగా వివరించారు. ‘లోకేశ్ చిన్న పిల్లవాడో, పెద్దవాడో అర్థం కాని పరిస్థితి. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండడు. సూర్యచంద్రులకు కూడా దొర కడు. కలుద్దామని 20 సార్లు ఫోన్ చేసిన. కాని ఫోన్ లేపలేదు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడైనా నన్ను పిలిచి మాట్లాడొచ్చు కదా? నాకు తెలంగాణతో సంబంధం లేదు. ఆంధ్రాకే పరిమితం అన్నట్లుగా ఉన్నడు’అని వ్యాఖ్యానించారు. ‘నేను పార్టీ నుంచి నయా పైసా తీసుకోలేదు. నేనే పార్టీకి డబ్బులు ఇచ్చిన. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడికి నెలకు రూ.50వేలు ఇస్తున్న. నేను పార్టీలోకి వచ్చిన కొత్తలో రూ.11 లక్షలు రామ్మోహన్ రావుకు ఇచ్చిన. అందులో పార్లమెంటు అధ్యక్షులకు రూ. 50 వేల చొప్పున, మిగతా అటెండర్ల కోసం ఇవ్వమని చెప్పిన. కానీ రూ.లక్ష మాత్రమే అటెండర్లకు ఇచ్చిన్రు. మిగతా 10 లక్షలకు ఇప్పటికీ లెక్కలేదు’అని కాసాని చెప్పారు. గంగలో పోసిన పన్నీరు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు పడిన కష్టమంతా గంగలో పోసిన పన్నీరుగా మారిందని కాసాని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు ఆసక్తి చూపలేదని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా బాబు, లోకేశ్‌ని సంప్రదించినా ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోసం బాబు ఆహ్వానించడంతోనే తాను ఆ పార్టీలోకి వెళ్లానని, తనకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో టీడీపీని కాపాడాలని బాబు కోరారన్నారు. బాబు ఆదేశాల మేరకు ఖమ్మంలో భారీ బహిరంగసభ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో గ్రామాల్లోకి వెళ్లి జెండా ఎగరవేశామని, ఇంటింటికి టీటీపీ కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్లినట్లు వివరించారు. 17 పార్లమెంటు స్థానాల్లో కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. బీసీలకు హామీలు ఇచ్చాం బీసీలకు అధిక సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావించినప్పటికీ, అటువైపు అడుగులు వేయలేదని కాసాని చెప్పారు. బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తామని హామీ ఇచ్చామని, నాయీ బ్రాహ్మణులు, రజకులకు తొలి టికెట్ చంద్రబాబే ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు వారంతా ఎదురు చూస్తుంటే పోటీ చేయబోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించడం, తెలంగాణలో పోటీకి దూరంగా ఉండటంతో కొంతమంది నేతలు కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని చెప్పడంతో దూరం పెరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఎన్నికల కోసం బాలకృష్ణ, లోకేశ్‌ను సంప్రదించినా స్పందించలేదని, ఇప్పటికే పోటీ కోసం 30 మందిని ఫైనల్ చేసినా వారికీ బీ–ఫారం ఇవ్వలేదని అన్నారు. కేడర్‌కు అన్యాయం చేయడం తనను కలచివేసిందన్నారు. పోటీ చేయకపోతే పార్టీ ఎందుకు? ఈ శాసనసభ ఎన్నికల్లో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని పోటీ చేయాలనుకునే 67 మంది అభ్యర్థులను ఆయా నియోజకవర్గాల కోసం ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు కాసాని చెప్పారు. ఎన్నికల కోసం ఐదేళ్లుగా ఎదురుచూసిన పార్టీ నేతలకు అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబును శుక్రవారం రాజమహేంద్రవరం జైల్లో కలిసి టీటీడీపీ తరపున పోటీ చేసే అంశం గురించి మాట్లాడితే ‘మనం పోటీ చేయడం లేదు’అని చెప్పారని, దాంతో తనకేం మాట్లాడాలో అర్థం కాలేదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో ఆదివారం పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెడితే పార్టీ తెలంగాణ నాయకులు, కార్యకర్తలంతా పోటీ చేయాల్సిందేనని పట్టుపట్టారని అన్నారు. మీటింగ్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హాజరుకాలేదని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోతున్నందున ఇక టీడీపీలో కొనసాగలేనని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. చిన్న చిన్న పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపాలని తాపత్రయపడుతున్నాయని, రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం ఎన్నికల్లో పోటీ చేయడమేనని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దంటే పార్టీ ఎందుకని ప్రశ్నించారు. పోటీ చేయనప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదనే విషయాన్ని అయినా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. తన కేడర్‌తో మాట్లాడాక భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానన్న అయన.. కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు చెప్పారు. గతంలోనే బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సంప్రదించారని తెలిపారు. ఏపీలో ఒకలా.. ఇక్కడ ఇంకోలా.. ‘టీడీపీ ఇక్కడ పోటీ చేయొద్దనడం వెనుక ఎవరున్నరో గానీ, మన చౌదరీలే కాంగ్రెస్‌కు ఓటేయమని క్లియర్‌గా చెబుతున్నరు. బాబు ను మొన్న కలిసినప్పుడు మన కమ్మ వాళ్లే పోటీ చేయడం లేదని ప్రచారం చేస్తున్నరని క్లియర్‌గా చెప్పిన. టీడీపీ వాళ్లే కాంగ్రెస్‌కు ఓటేయమని చెబితే ఎట్ల. వీళ్లు ప్రచారం చేసినా.. కొందరే కాంగ్రెస్ అంటున్నరు. మిగతా వాళ్లు బీఆర్ఎస్కు ఓటేయాలంటున్నరు. ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఓ లెక్క. జనరల్ ఎన్నికల్లో చేయకపోతే ఎట్ల?’అని కాసాని ప్రశ్నించారు. ‘ఆంధ్రాలోబీజేపీ, జనసేనతో టీడీపీ పోటీ చేస్తదట. తెలంగాణలో బీజేపీ వద్దట. ఇదేం పద్ధతి. ఆంధ్రాలో బీజేపీ, జనసేనతో పోటీ చేసినప్పుడు ఇక్కడ కూడా చేయాలి కదా’అని వ్యాఖ్యానించారు. -
తెలంగాణ టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీకి నిరాకరించినందునే పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మనస్తాపంతోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, లేఖను చంద్రబాబుకు పంపించానని తెలిపారు. తెలంగాణలో పోటీ చేయాలని పార్టీ క్యాడర్ కోరుతున్నారని.. లోకేష్‌కు 20 సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ‘‘తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దని చంద్రబాబు చెప్పారు. కొన్నేళ్లుగా కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబు చెప్పిన మాట వినగానే ఏం అనాలో నాకు తెలియలేదు’’ అని కాసాని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ పై కాసాని జ్ఞానేశ్వర్ ఆగ్రహం ‘‘లోకేష్ ఎవరికి దొరకరు. హైదరాబాద్‌లోనే ఉన్నా లోకేష్ పట్టించుకోలేదు. లోకేష్ ఇక్కడ పెత్తనం ఎందుకు చేస్తున్నారు. పోటీ చేయవద్దని ఎలా చెబుతారు?’’ అంటూ కాసాని మండిపడ్డారు. ‘‘నేను రాకముందే తెలంగాణ టీడీపీ బలంగా లేదు. కార్యకర్తలు మాత్రం పోటీ చేయాలనే బలమైన ఆకాంక్ష వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నవారికి అన్యాయం చేయడం సరైంది కాదు. పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. చిన్నచిన్న పార్టీలు కూడా అభ్యర్థులను నిలబెడుతున్నాయి’’ అని కాసాని పేర్కొన్నారు. ‘‘లోకేష్ దగ్గరకు వెళ్తే కనీసం మాట్లాడలేదు. కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయాలని ఓ వర్గం వాదన తెచ్చారు. ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు చెప్పాలి. కార్యకర్తలకు అన్యాయం చేసి పార్టీలో కొనసాగదలుచుకోలేదు. ఐదేళ్లు పార్టీ కోసం పని చేసి ఎన్నికల్లో పోటీ చేయకుంటే ఇంకెందుకు?. గెలిచినా, ఓడినా ఎన్నికల్లో పోటీ చేయాలి. కాంగ్రెస్‌కు మద్దతు. ఇవ్వాలన్న ఒక వాదన వచ్చింది. కొంతమంది కమ్మవారు ఈ ప్రతిపాదన తెచ్చారు. ఏ విషయలోనైనా క్యాడర్‌కు సమాధానం చెప్పాలి కదా?. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తా’’ అని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. చదవండి: తెలంగాణలో టీడీపీ కనుమరుగు -
తెలంగాణలో జెండా పీకేసిన టిడిపి
-
తెలంగాణలో జెండా పీకేసిన టీడీపీ.. కాసాని జ్ఞానేశ్వర్ తాడోపేడో..!
సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ.. తెలంగాణలో జెండా పీకేసింది. ఎన్నికల్లో పోటీ చేయలేమంటూ టీడీపీ క్యాడర్‌కు చంద్రబాబు సంకేతాలు ఇచ్చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ సందర్భంగా తెలంగాణలో పోటీ చేయొద్దంటూ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు మేలు చేయడం కోసమే తెలంగాణలో పోటీకి దూరమంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందం మేరకే పోటీకి దూరం అంటూ చర్చ సాగుతోంది. ఇప్పటివరకు హైదరాబాద్ తానే అభివృద్ధి చేశానంటూ చెప్పుకున్న చంద్రబాబు.. తెలంగాణ, హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే ఎందుకు పోటీ చేయడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా, టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ తెలంగాణ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్.. నేడు నారా లోకేశ్‌తో కాసాని జ్ఞానేశ్వర్ భేటీ కానున్నారు. ఇన్నాళ్లు పార్టీ పోటీ చేస్తుందంటూ మభ్య పెట్టారన్న ఆవేదనలో ఉన్న జ్ఞానేశ్వర్ నారా లోకేష్‌తో తాడోపేడో తేల్చుకోనున్నట్లు సమాచారం. తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత మారిన పార్టీ స్టాండ్‌తో తల పట్టుకుంటున్న కాసాని జ్ఞానేశ్వర్.. పార్టీ కోసం బోలెడు ఖర్చు పెట్టాం అంటూ టీడీపీ పెద్దల దగ్గర వాపోయినట్లు తెలిసింది. తెలంగాణలో ఒంటరి పోరు వల్ల కాదని.. పోటీకి దూరంగా ఉండాలని నారా లోకేష్ సూచించడంతో, పోటీ చేయొద్దని ఇప్పుడు నిర్ణయిస్తే తన పరిస్థితి ఏంటని, ఇన్నాళ్లు తాను పడ్డ శ్రమ పెట్టిన ఖర్చు ఫలితం ఏంటని కాసాని ప్రశ్నిస్తున్నారు.. ఏపీ రాజకీయాలకు తెలంగాణను ముడి పెట్టడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం పార్టీకి మనుగడ అయినా ఉంటుందని అంటున్న కాసాని.. ఇంకా కూడా పార్టీ పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకోకపోతే తన దారి తాను చూసుకుంటానని కాసాని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను కాసాని అన్వేషిస్తున్నట్లు సమాచారం. చదవండి: పవన్ కల్యాణ్ రాయబారం సఫలం కాలేదా?! -
గతంలో కాసాని వల్ల తొమ్మిదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..!
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ వల్ల తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారు. ఆయన గతంలో ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీగా పోటీచేసినప్పుడు బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) ఎమ్మెల్యేలు తొమ్మిది మందిని ఆకర్షించగలిగారు. వారిని ఏ రకంగా ప్రలోభ పరిచారో కాని, వారంతా విప్‌ను ధిక్కరించి జ్ఞానేశ్వర్‌కు ఓటు వేసి గెలిపించారు. దాంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. దానిని విచారించిన సురేష్ రెడ్డి సుమారు మూడేళ్ల తర్వాత వారందరిపై అనర్హత వేటు వేశారు. అయితే వేటు వేయడానికి ఒక రోజు ముందు వీరంతా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనబోయి దొరికిపోయిన సంగతి తెలిసిందే. జ్ఞానేశ్వర్ పట్టుబడలేదు కాని , ఆయనకు ఓటు వేసిన వారు పదవులు వదలుకోవాల్సి వచ్చింది. ఇటీవలే జ్ఞానేశ్వర్‌ను తెలంగాణ అధ్యక్షుడుగా ఎంపిక చేసుకున్నారు. అప్పట్లో అనర్హత వేటుకు గురైనవారిలో ఎస్.బాపూరావు, నారాయణరావు పటేల్, ఎస్.సంతోష్‌రెడ్డి జి.ముకుందరెడ్డి, కాశీపేట లింగయ్య, జగ్గారెడ్డి, డి.శ్రీనివాసరావు, ఎమ్. సత్యనారాయణరెడ్డి, బి.శారారాణి ఉన్నారు. కాగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో ఏర్పడిన పరిణామాలలో ఆయన కుమారుడు వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన కొండా సురేఖ కూడా అనర్హత వేటుకు గురయ్యారు. మంత్రులకు అత్యంత భద్రత ఉంటుంది. అందులోను హోం శాఖను నిర్వహిస్తున్నవారికి మరింత సెక్యూరిటీ ఇస్తారు. కాని దురదృష్టవశాత్తు ఉమ్మడి ఏపీ లో హోం మంత్రిగా బాద్యతలు నిర్వహిస్తూ 2000 సంవత్సరంలో నక్సల్స్ మందుపాతరకు ఎ. మాధవరెడ్డి బలైపోయారు. అప్పట్లో వరంగల్ రోడ్డులో వెళుతుండగా, ఘటకేసర్ వద్ద వంతెన నిర్మాణం జరుగుతున్న చోట నక్సల్స్ మందుపాతర అమర్చారు. ఆయన వాహనం అక్కడికి రాగానే దానిని పేల్చడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. అప్పట్లో ఆయన చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి బాద్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన నాలుగుసార్లు భువనగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. మాధవరెడ్డి మరణం తర్వాత ఆయన భార్య ఉమా మాధవరెడ్డి మూడుసార్లు అక్కడ నుంచి గెలుపొంది మంత్రి పదవి కూడా నిర్వహించారు. ప్రముఖ తెలంగాణ నేత సి.మాధవరెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మాత్రమే ముప్పై స్థానాలను గెలుచుకుంది. ఇందిరాగాంధీ పై ఉన్న సానుభూతితో ఆమె కుమారుడైన రాజీవ్‌గాంధీకి దేశం అంతటా పట్టం కట్టింది. కాని ఏపీలో అప్పటికే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాంగ్రెస్ యత్నించిందన్న అసంతృప్తితో ఉన్న ప్రజలు తెలుగుదేశంకు అత్యధిక సీట్లు కట్టబెట్టారు. దేశంలో మరే రాజకీయ పార్టీకి అన్ని సీట్లు రాలేదు. దాంతో సి.మాధవరెడ్డి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఒక ప్రాంతీయ పార్టీ నేతకు ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంటుంది. సి.మాధవరెడ్డి ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అంతకుముందు 1952లో ఆయన సోషలిస్టు పార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. తదుపరి బోధ్ నియోజకవర్గం జనరల్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
‘తెలంగాణ’ ఏర్పాటులో టీడీపీది కీలకపాత్ర: కాసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరికొత్త చరిత్ర అని, అందులో తెలుగుదేశం పార్టీ పోషించిన పాత్ర కీలకమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. టీటీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించిన కాసాని మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ ఇవ్వడం వల్లనే కొత్త రాష్ట్రం కల నెరవేరిందన్నారు. -
అవును.. అప్పుడు పేదలు గట్కే తిన్నరు
సాక్షి, హైదరాబాద్: ‘నాడు ఆకలి రాజ్యమేలింది. తెలంగాణ, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో జొన్న గట్క, సజ్జలు, ఒట్టు వడ్లు, నల్లవడ్లు, మొక్కజొన్న గట్క తిని పేదలు బతికేవారు. మా ఊళ్లో మేం గట్క తిని, గంజి తాగేవాళ్లం. ఎన్టీఆర్ తీసుకొచ్చిన రెండు రూపాయలకు కిలోబియ్యం పథకం వల్లే ఆకలి రాజ్యంపోయింది’అని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తిన నేపథ్యంలో కాసాని సోమవారం ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తూ నిరంజన్‌రెడ్డి దొరలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మానేయాలని ఎద్దేవా చేశారు. 15 రోజులలోనే ఒట్టు వడ్ల పంట వచ్చేదని, ఆ 15 రోజులలోనే కొన్ని వేలమంది ప్రజలు తిండికి అలమటించేవారని గుర్తుచేశారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పేదలకు కడుపు నిండా తినే అవకాశం రూ.2 కిలో బియ్యం పథకం ద్వారా ఇచ్చారని పునరుద్ఘాటించారు. కారంతో ముద్ద తిని ఆకలి తీర్చుకున్న ఆ రోజుల్లో ధమ్ బిర్యానీ ఎక్కడ దొరికిందో నిరంజన్‌రెడ్డి చెప్పాలని, హైదరాబాద్‌లోని పాతబస్తీ హోటళ్లలో దొరికిన ధమ్ బిర్యానీ మహబూబ్‌నగర్‌లో దొరికిందా అని ప్రశ్నించారు. దొరలకు కూడా ఆనాడు సన్న బియ్యం దొరికేది కాదని, రాజహంస అనే బియ్యం అక్కడక్కడ లభించేవని పేర్కొన్నారు. పచ్చజొన్నలు తినడం కరెక్టు కాదా? ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యం ఇచ్చారా.. లేదా..? ఆహార భద్రత తెలుగుదేశం పార్టీ వచ్చాకే వచ్చిందనడం వాస్తవం కాదా? చర్చకు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తామని ఆయన సవాల్ విసిరారు. -
‘రాజకీయ స్వార్థం కోసమే బీఆర్ఎస్’
సాక్షి, హైదరాబాద్: రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుంది తప్ప.. ప్రజా ప్రయోజనాల కోసం కాదని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ చెప్పేదొకటి.. చేసేది ఒకటిగా ఉందని విమర్శించారు. -
అవన్నీ కాని పనులు కానీ.. మిగిలినోళ్లు వెళ్లకుండా కాపాడుకుందాం సార్!
అవన్నీ కాని పనులు కానీ.. మిగిలినోళ్లు వెళ్లకుండా కాపాడుకుందాం సార్!